Paper leak
-
Year Ender 2024: లీకుల నామ సంవత్సరం
2024లో దేశంలో భారీ రిక్రూట్మెంట్లు జరిగాయి. అలాగే వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో పలు పేపర్ల లీకుల కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో జరుగుతున్న పరీక్షలపై లెక్కకుమించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసు 2024 ఫిబ్రవరిలో వెలుగు చూసింది. ఆ తర్వాత నీట్ యూజీ, సీయూఈటీ, బీహార్ సీహెచ్ఓ, ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షా పత్రాలు లీకయ్యాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024 ఫిబ్రవరిలో జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 18న పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లను రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని తేలింది. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు.సీఎస్ఐఆర్ ఎస్ఓ ఎఎస్‌ఓ రిక్రూట్మెంట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో 444 ఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులకు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష పేపర్‌ను లీక్ చేసిన ఉదంతంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, సాల్వర్ ముఠాలు పోలీసులకు చిక్కారు. వీరు ఎనీడెస్క్ యాప్ ద్వారా కాపీయింగ్‌కు సహకరించారని తేలింది.యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పేపర్ లీక్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024, ఫిబ్రవరి 11న ఆర్ఓ, ఏఆర్ఓ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి రావడంతో యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హర్యానాలోని మనేసర్, మధ్యప్రదేశ్‌లోని రేవాలో రిసార్ట్లు బుక్ చేశారు. అక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ నీట్ యూజీ పేపర్ లీక్ వార్త చాలాకాలం వార్తల్లో నిలిచింది. ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. నీట్ యూజీ పేపర్ లీక్ దరిమిలా 1,563 మంది అభ్యర్థులు లబ్ధిపొందినట్లు తేలింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నీట్ యూజీ నిర్వహణ అధికారులు రివైజ్డ్ రిజల్ట్‌లో టాపర్ల సంఖ్య 61 నుండి 17కి తగ్గించారు.యూజీసీ నెట్ పేపర్ లీక్ 2024 జూన్ 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షను విద్యా మంత్రిత్వ శాఖ జూన్ 19న రద్దు చేసింది. డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందని, టెలిగ్రామ్ ద్వారా అభ్యర్థులకు అందించారని తేలిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.జెఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పేపర్ లీక్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సీ) సీజీఎల్ పరీక్ష 2024 సెప్టెంబర్ 21,22 తేదీలలో జరిగింది. అభ్యర్థులు ఎస్ఎస్సీ సీజీఎల్ సర్కారీ రిజల్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇంతలో ఎస్ఎస్సీ సీజీఎల్ పేపర్ లీక్ అయినట్లు వెల్లడయ్యింది.రాజస్థాన్ ఎస్ఐ పరీక్ష రాజస్థాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ కేసులో 37 మందిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) విచారణలో దీని వెనుక రెండు ముఠాలు ఉన్నట్లు తేలింది . 859 పోస్టుల కోసం జరిగిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 7.97 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 2021 సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షా పత్రాల లీకుతో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌సీఎస్‌సీ) పనితీరుపై పలు అనుమానాలు తలెత్తాయి.ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఫలితాలు బీహార్‌లోని పట్నాలో గల పూర్నియా డిజిటల్ పరీక్షా కేంద్రంలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తేలింది. నకిలీ అభ్యర్థుల ద్వారా ఎస్ఎస్సీ ఎంటిఎస్ పరీక్షను రాయిస్తున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన నేపధ్యంలో పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి, ఏడుగురు ఉద్యోగులు, 14 మంది నకిలీ అభ్యర్థులతో పాటు 14 మంది అసలు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ బీహార్ సీహెచ్ఓ పరీక్ష 2024, డిసెంబరు 1, 2, 3 తేదీలలో జరగాల్సి ఉంది. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 37 మంది నిందితులను అరెస్టు చేశారు.పేపర్ లీక్‌లను నిరోధించడానికి రూపొందిన చట్టాన్ని 2024 జూన్ నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో పేపర్ లీక్ లాంటి అక్రమ చర్యలకు పాల్పడేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృత పేపర్ లీకేజీకి కోటి రూపాయల వరకూ జరిమానా విధించనున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
NEET paper leak case: ‘మాస్టర్‌మైండ్’ అరెస్ట్
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది. తాజాగా ఈ కేసులో ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ మొహంతిని దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదంతంలో సుశాంత్ ప్రధాన సూత్రధారి అని సమాచారం. ప్రస్తుతం అతనిని సీబీఐ ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది.ఈ కేసులో ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 4న నీట్ పేపర్ లీక్ కేసులో సాల్వర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సాల్వర్ సందీప్ రాజస్థాన్‌లోని భిల్వారాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సందీప్‌ను పట్నాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల రిమాండ్‌కు తరలించారు.నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆగస్టు ఒకటిన చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 13 మంది పేర్లను నమోదు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు, ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కింగ్పిన్ల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. -
నీట్ యూజీ-2024పై సుప్రీం సమగ్ర తీర్పు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నీట్ పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ హజారీబాగ్, పాట్నాలకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది.అయితే పరీక్ష వ్యవస్థలో ఉన్న లోపాలను నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజ్సెన్సీతోపాటు కేంద్రానికి సుప్రీం సూచించింది. పేపర్ లీకేజ్ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని, కమిటీ నివేదిక అమలుపై రెండు వారాల్లో సుప్రీంకోర్టుకు కేంద్ర విద్యాశాఖ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)-యుజి మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పులో వివరించింది. సుప్రీం చేసిన సూచనలు..1. ఎవల్యూషన్ కమిటీ ఏర్పాటు చేయాలి2. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలి 3. పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను సమీక్షించాలి 4. గుర్తింపు, తనిఖీ ప్రక్రియలను మరింత మెరుగుపరచాలి 5. అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ లను ఏర్పాటు చేయాలి 6. పేపర్ టాంపరింగ్ జరగకుండా భద్రతను పెంచాలి 7. ఫిర్యాదుల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి 8. సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మే 5న జరిగిన ఈ పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని ప్రభావం స్వల్పమేనని అభిప్రాయపడింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని పేర్కొంది. ఈ పిటిషన్లపై నేడు సర్వోన్నతన్యాయస్థానం సమగ్ర తీర్పు వెలువరించింది.మరోవైపు నీట్ పేపర్ లీకేజ్‌పై విచారణ చేస్తో న్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది. -
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వెందు, అశుతోష్ కుమార్-1, రోషన్ కుమార్, మనీష్ ప్రకాష్, అశుతోష్ కుమార్-2, అఖిలేష్ కుమార్, అవదేశ్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, ఆయుష్ రాజ్ వంటి నిందితుల పేర్లను చార్జిషీట్లో జత చేసింది. నీట్ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేసింది. ఇందులో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ అధికారులు 58 ప్రాంతాల్లో దర్యాప్తు సోదాలు నిర్వహించారు. CBI FILES FIRST CHARGESHEET IN THE NEET PAPER LEAK CASE pic.twitter.com/JIg8YG1CSi— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) August 1, 2024 -
ఆగస్ట్ 14 నుంచి .. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్ట్ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌పై అప్డేట్స్ను ఎంసీసీ వెబ్సైట్లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది. -
‘నీట్’రద్దుపై మరో రాష్ట్రం కీలక నిర్ణయం
కోల్‌కతా: నీట్ పరీక్షను రద్దు చేయబోమని, పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు పరిణామల అనంతరం నీట్ పరీక్ష కోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.తాజాగా, తమిళనాడు బాటలో పశ్చిమ బెంగాల్ చేరింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ..తాము అఖిల భారత పరీక్షలకు (నీట్) ఎప్పుడూ అనుకూలంగా లేమని, అయితే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఒప్పించారని అన్నారు.#Breaking | West Bengal govt passes anti-NEET Resolution after the 'No Re-Test' Verdict of SC The anti-NEET resolution was passed after two days of discussion...: @pooja_news shares more details with @Swatij14 #NEETExam pic.twitter.com/R7vT0ATkv9— TIMES NOW (@TimesNow) July 24, 2024 నీట్‌లాంటి పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం తీసుకునే సమయంలో మేం వ్యతిరేకించాం. నీట్ పరీక్షలను కేంద్రం నిర్వహించకూడదని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఆయన అన్నారు. అయినప్పటికీ నీట్ లాంటి పరీక్షలను కేంద్రమే నిర్వహిస్తోందికానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థలోని లోపాలు విద్యా వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాబట్టే మేం పాత నీట్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. -
నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
నీట్ విచారణ.. న్యాయవాదిపై సీజేఐ తీవ్ర ఆగ్రహం
నీట్ పేపర్ లీకేజీపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (సీజేఐ డీవై చంద్రచూడ్) నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది.అయితే నీట్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్.. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషనర్ తరుపు సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోర్టు నుంచి బయటకు వెళ్లిపోవాలి. లేదంటే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఇలా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహానికి న్యాయవాది మాథ్యూస్ నెడుంపర వ్యవహారశైలే కారణం. మాథ్యూస్ నెడుంపర ఏమన్నారు?అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు చేస్తే విద్యార్ధుల భవిష్యత్ పరిణామాలపై సీజేఐ మాట్లాడుతున్నారు. దాఖలైన పిటిషన్లపై పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో మాథ్యూస్ నెడుంపర మధ్యలో కలగజేసుకున్నారు. కోర్టు హాలులో ఉన్న లాయర్లు అందరికంటే నేనే సీనియర్. బెంచ్ వేసిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. కోర్టులో నేనే అమికస్ (అమికస్ క్యూరీ)అని మాట్లాడగా..ఇక్కడ నేను ఎవర్ని అమికస్ గా నియమించలేదు అంటూ సీజేఐ స్పందించారు. అందుకు ప్రతిస్పందనగా.. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ సీజేఐ చంద్రుచూడ్ మాటలకు అడ్డు చెప్పారు నెండుపర .నెడుంపర మాటలకు వెంటనే చంద్రుచూడ్ మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు కోర్టు గ్యాలరీలో మాట్లాడకూదు. సెక్యూరిటీని పిలవండి. నెడుంపరను బయటకు తీసుకెళ్లండి అంటూ గట్టిగా హెచ్చరించారు.చంద్రుచూడ్ వ్యాఖ్యలకు.. నేను వెళ్తున్నాను.. నేను వెళ్తున్నాను. అంటూ నెడుంపర అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేశారు.మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్లిపోవచ్చు. నేను గత 24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నాను. ఈ కోర్టులో న్యాయవాదులు విధి విధానాలను నిర్దేశించడాన్ని నేను అనుమతించలేను అని అన్నారు.కోర్టు నుంచి హాలు నుంచి బయటకు వెళ్తున్న నెడుంపర ఒక్కసారిగా చంద్రచూడ్ వ్యాఖ్యలకు మరోసారి తిరిగి సమాధానం ఇచ్చారు. నేను 1979 నుండి చూస్తున్నాను అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన సీజేఐ చంద్రుచూడ్.. మీ వ్యవహార శైలిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. మీరు ఇతర లాయర్లకు ఆటంకం కలిగించకూడదు అని అన్నారు.దీంతో నెడుంపర అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి మళ్లీ తిరిగి వచ్చారు. నన్ను క్షమించండి. నేనేమీ తప్పు చేయలేదు. నాకు అన్యాయం జరిగింది అని వ్యాఖ్యానించారు. మీ పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమించండి అని అన్నారు.సుప్రీం కోర్టులో నాటకీయ పరిణామాల నడుమ నీట్ పరీక్షను రద్దు చేసేందుకు వీలు లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పును వెలువరించింది. అంతేకాదు నీట్ పరీక్ష వ్యవస్థ లోపభూయుష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని స్పష్టం చేసింది. లబ్ధిపొందిన 155 మందిపైనే చర్యలు తీసుకోవాలని నీట్‌పై సుప్రీం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అమికస్ అంటేచట్టపరమైన సందర్భాలలో అమికస్ లేదా అమికస్ క్యూరీ అని సంబోధిస్తారు. సందర్భాన్ని బట్టి కోర్టులో పలు కేసులు విచారణ జరిగే సమయంలో ఒకే కేసుపై పదుల సంఖ్యలో పిటిషన్ దాఖలైనప్పుడు..పిటిషనర్ల అందరి తరుఫున సీనియర్ లాయర్ కోర్టుకు సమాధానం ఇస్తారు. అలా కోర్టుకు రిప్లయి ఇచ్చే లాయర్లను అమికస్ లేదా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తారు. -
‘నీట్’ పరీక్ష రద్దు లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 23) తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుకాపీని చదివి వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.‘నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయి. పేపర్‌లీక్ వల్ల 155 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధిపొందారు. పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు. నీట్‌కు మళ్లీ పరీక్ష అక్కర్లేదు. నీట్‌పై అభ్యంతరాలను ఆగస్టు 24న వింటాం’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 14న వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) భావించినప్పటికీ.. ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్ 4నే ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది. నీట్-యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది. -
పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య: రాహుల్ గాంధీ
-
లోక్ సభలో నీట్ పేపర్ లీకేజీపై విపక్షాల నిరసన
-
నీట్ పేపర్ లీక్ కేసు.. పాట్నా ఎయిమ్స్ వైద్యుల అరెస్ట్
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నీట్ వ్యవహారాన్ని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా బిహార్‌లోని ఎయిమ్స్ పాట్నాకు చెందిన ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేసింది.ఈ ముగ్గురిపైనా పేపర్ లీక్, ప్రవేశ పరీక్షలో అవకతవకలు తదితర ఆరోపణలు ఉన్నాయి. నిందితుల గదులకు సీల్ వేసిన సీబీఐ.. ల్యాప్‌టాప్, మొబైల్‌ను సీజ్ చేసింది. ముగ్గురూ 2021 బ్యాచ్‌కు చెందిన వైద్యులుగా గుర్తించారు. నేడు వీరిని అధికారులు విచారించనున్నారు.కాగా రెండు రోజుల క్రితమే నీట్ పేపర్ దొంగతనం ఆరోపణలపై సీబీఐ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. బిహార్‌లో పంకజ్ కుమార్, జార్ఖండ్‌లో రాజు సింగ్‌ను అరెస్ట్ చేసింది. పాట్నా ప్రత్యేక కోర్టు వీరిద్దరికీ 14, 10 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో కింగ్‌పిన్ రాకేష్ రంజన్ అలియాస్ రాకీ కూడా కస్టడీలో ఉన్నాడు.ఇదిలా ఉండగా నేడు(గురువారం) నీట్ పేపర్ లీక్ సహా అక్రమాలకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జూలై 11న జరిగిన విచారణలో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి స్పందన లేకపోవడంతో.. పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు జూలై 18కి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి -
నీట్ పిటిషన్లపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పేపర్ లీకేజీ రద్దు చేయాలంటూ పదుల సంఖ్యలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ /జరిగింది. అయితే నీట్ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని, అందుకు బలం చేకూరేలా ఆధారాలతో కేంద్రం, నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (నీట్)లు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. అదే సమయంలో కేసులో దర్యాప్తు స్టేటస్‌ను సీబీఐ కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ అఫిడవిట్లను, సీబీఐ రిపోర్టును పూర్తి స్థాయిలో పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరిగే సమయంలో.. పరిమిత సంఖ్యలో లీకేజీ జరిగిందని, పేపర్ లీక్ అనే పదాన్ని వినియోగించేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. నీట్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్రం పేర్కొంది. ఈ లీకేజీ బీహార్‌లోని ఓ కేంద్రానికి పరిమితమైందని, పేపర్ సోషల్ మీడియాలో లీకవ్వలేదని చెప్పింది. రీ నీట్ టెస్ట్ అవసరం లేదని వెల్లడించింది. అదే సమయంలో సీబీఐ సైతం సోషల్ మీడియాలో పేపర్ లీక్ కాలేదని.. కేవలం స్థానికంగానే పేపర్ లీక్ అయ్యిందని తన దర్యాప్తు నివేదికను సమర్పించింది.నీట్ పరీక్ష కోసం 24 లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే దాఖలైన అఫిడవిట్లను పరిశీలించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావించిన సుప్రీం కోర్టు విచారణను జులై 18 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
నీట్ పేపర్ లీక్ అయ్యింది, కానీ.. : NTA
ఢిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని.. కానీ, లీకేజీ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొంది. పాట్నా(బీహార్) సెంటర్లలో, గోద్రా(గుజరాత్) కొందరి ద్వారా మాత్రమే నీట్ పేపర్ లీక్ అయ్యింది. కానీ, పేపర్ లీక్ వ్యవహారం దేశం మొత్తం మీద పరీక్ష నిర్వహణ, ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని ఎన్టీఏ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రేపు నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. నీట్ పరీక్ష రద్దు చేసి చేసి తిరిగి నిర్వహించాలన్న 38 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే రీ ఎగ్జామ్ నిర్వహణ చివరి ఆప్షన్‌గానే ఉండాలని.. పేపర్ లీకేజీతో నష్టం విస్తృత స్థాయిలో జరిగిందని విచారణలో తేలితే కచ్చితంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశిస్తామని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది.National Testing Agency (NTA) files affidavit in the Supreme Court in relation to the NEET-UG 2024 exam. The NTA, having come to know about the malpractice by individuals at Godhra and few centers at Patna, has made an assessment of the performance of all the appeared… pic.twitter.com/PyHfzzC0Ih— ANI (@ANI) July 10, 2024 -
Video: కుర్చీ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించి
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలి కుర్చీపై తీవ్ర దుమారం రేగింది. పాత హెడ్ మాస్టర్‌ను కుర్చీ నుంచి బలవంతంగా తొలగించి, కొత్త ప్రధానోపాధ్యాయురాలిని కూర్చోబెట్టారు మిగతా ఉపాధ్యాయురాలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇందులో పాఠశాల సిబ్బంది బృందం ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను వెంటనే తన కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రిన్సిపాల్ పరుల్ సోలమన్ నిరాకరించడంతో బలవంతంగా ఆమెను కుర్చీ నుంచి బయటకు తీసేశారు. ప్రిన్సిపల్ ఫోన్ కూడా లాక్కున్నారు.అనంతరం కొత్తగా నియమితులైన ప్రిన్సిపాల్‌ను ఆమె స్థానంలో కూర్చున్నారు, అక్కడ ఉన్న వారు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ నాటకీయ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ప్రిన్సిపాల్ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. అయితే గతంలో పాఠశాలలో జరిగిన యూపీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమె స్థానంలో మరొకరిని కూర్చొబెట్టారు. పేపర్ లీక్ ముఠా సభ్యుడు కమలేష్ కుమార్ పాల్ అలియాస్ కేకేకు ప్రిన్సిపల్ పరుల్ సోలోమన్‌కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. దాంతో ఆమెను తొలగించారు. అయితే ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ షిర్లీ మాస్సీని నియమించిన తర్వాత కూడా సోలమన్ ఆమె సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ గందరగోళం నెలకొంది.Video: UP Principal Forcibly Removed From Office, Her Replacement WatchesFacts apart, y shld no action b taken agast d lawyer who with his band on acts extra judicially.Assuming he is for clg, yet,his role wud be limited to court @myogioffice https://t.co/CesaPaMbzl— Nawaz Haindaday مھمد نواز ہئنرارے (@nawazhaindaday) July 6, 2024 -
‘నీట్’పై నోరు మెదపరేమి?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్ పేపర్‌లీక్ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్ వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
దేశానికి నీట్ అవసరం లేదు.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నిర్వహణపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయినట్లు విద్యార్ధులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటు విపక్షాలు సైతం నీట్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నీట్ వివాదంపై స్పందించారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేపర్ లీక్ కారణంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వివాదాస్పద నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.ఇటీవల జరిగిన పదోతరగతి, పన్నెండవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడైన విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు.‘నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశానికి నీట్ అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. రాష్ట్ర అసెంబ్లీలో నీట్కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి.నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’.అని తెలిపారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలన్నారు.Chennai, Tamil Nadu | Speaking at a party event, TVK chief and actor, Vijay says, "People have lost faith in NEET examination. The nation doesn't need NEET. Exemption from NEET is the only solution. I wholeheartedly welcome resolution against NEET which was passed in the State… pic.twitter.com/PatKO7MSWU— ANI (@ANI) July 3, 2024 ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. -
రాజ్యసభలోనూ నీట్ రగడ
న్యూఢిల్లీ: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరొకటి ఇండియన్ పేపర్ లీక్. ఒక ఐపీఎల్ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.నీట్–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్(ఎన్టీఏ)గా పలకాలి’ అని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్ నేత దిగి్వజయ్‌సింగ్ సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్ లీకేజీల్లో కోచింగ్ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్ సుమన్ అనుమానం వ్యక్తంచేశారు. -
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు
-
నీట్ పేపర్ లీక్: జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
రాంచీ: నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలే దేశంవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని విక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ప్రశ్న లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీబీఐ తాజాగా శనివారం ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసింది. ఓ హింది న్యూస్ పేపర్లో పనిచేసే.. జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు సాయం చేసినట్లు అభియోగాలతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంకు శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.అదేవిధంగా గుజరాత్‌లోని 7 వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గోద్రా, ఖేడా, అహ్మాదాబాద్, అనంద్ సోదాలు నిర్వహించింది. ఈకేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్‌గా గుర్తించారు. -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు
నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్ కుమార్, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది.ఇప్పటికే పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతోపాటు బిహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదుచేసిన అభియోగాలను కూడా తమకు బదలాయించాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్‌లోని గోద్రా తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. సీబీఐ మొత్తం ఈ వ్యవహారంలో ఆరు కేసులను దర్యాప్తు చేస్తోంది.సీబీఐ వర్గాల ప్రకారం, మనీశ్ కుమార్ కొందరు విద్యార్థులను తన కారులో ఓ స్కూలుకు తరలించి అక్కడ వారికి పేపర్ అందజేసీ బట్టీ కొట్టించాడు. మరోవైపు ఆశుతోశ్ ఆ విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. గురువారం సీబీఐ తొలుత నిందితులిద్దరనీ ప్రశ్నించి అనంతరం అరెస్టు చేసింది.నీట్-యూజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించింది. దీనికి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్ బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో లీకైనట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యలోనే జూన్ 4న ఎన్టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్రం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. కేంద్ర విద్యాశాఖ ప్రకటన అనంతరం కేసు బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఇప్పటివరకూ ఆరు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసింది. -
పరారీలో నీట్ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్.. ఎవరీ సంజీవ్ ముఖియా
పాట్నా: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్ర దారి బీహార్‌లోని షాపూర్‌కు చెందిన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్ష నిర్వహణకు ముందు పేపర్ లీకేజీ కావడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.అయితే ఈ పేపర్ లీకేజీ అంతా బీహార్‌లోని పాట్నా ఓ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. మే 5న నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 4న లీకేజీలో మాస్టర్ మైండ్ బీహార్ నూర్సరాయ్లోని నలంద కాలేజీ ఆఫ్ హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ సంజీవ్ ముఖియా బాయ్స్ హాస్టల్లో నీట్ పరీక్ష రాసే 25మంది విద్యార్ధులకు వసతి కల్పించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంజీవ్ ముఖియా నీట్ క్వశ్చన్ పేపర్, జవాబుల పత్రాన్ని అదే హాస్టల్లో విద్యార్ధులకు అందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ హాస్టల్‌ను ప్రభాత్ రంజన్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్రొఫెసర్పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ప్రభాత్ రంజన్‌కు సైతం ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీలో హస్తం ఉందని గుర్తించారు. రంజన్ నీట్ పేపర్లను ప్రొఫెసర్ నుంచి తీసుకొని సంజీవ్ ముఖియాకు ఇచ్చినట్లు తేలింది. పరీక్షకు ముందు రోజే పేపర్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చినా సమయం లేకపోవడం వల్ల పూర్తిగా చదవలేదని సమాచారం. ఇక, పోలీసులు దర్యాప్తు చేస్తున్న పేపర్ లీక్ కేసులో ముఖియాతో సంబంధం ఉన్న రవి అత్రి పేరు కూడా బయటపడింది.చదవండి : 👉 నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం చర్యలుముఖియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరం చేశారు. నీట్ పేపర్ లీక్‌తో ముఖియా ప్రమేయం ఉన్నట్లు సూచించే వివరాలు వెలుగులోకి రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం( ఈఓయూ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఈఓయూ నలంద, గయా, నవాడా జిల్లాల్లోని పోలీసు బృందాలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, లీకైన పేపర్లు ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్ మీదుగా బీహార్‌కు చేరుకున్నాయని పోలీసులు అనుమానించడంతో జార్ఖండ్‌కు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ ముఖియా ఎవరు2010లో పరీక్ష పేపర్ లీకేజీ వార్తల సమయంలో సంజీవ్ ముఖియా పేరు మారు మ్రోగింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌ఈ) సహా అనేక పరీక్షల పేపర్ లీక్‌లకు సూత్రధారి. ఆ తర్వాత పేపర్ లీకేజీల కోసం ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సంజీవ్ కుమారుడు శివ కుమార్ గతంలో బీపీఎస్‌ఈ పరీక్ష లీక్ వ్యవహారంలో అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి గతంలో రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి టికెట్‌పై పోటీ చేశారు. నిందితులపై కఠిన చర్యలుకాగా, వరుస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. -
పేపర్ లీక్ కట్టడికి యూపీ సర్కారు సరికొత్త ప్రణాళిక
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు పలు చర్యలు ప్రారంభించాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి.ఉత్తరప్రదేశ్ జనాభాలో 56 శాతం మంది యువతే ఉన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టాలని ఇక్కడి యువత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటుంది. తాజాగా యూపీలోని యోగి సర్కారు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జరిగే ఏ పరీక్షకైనా వాటి నిర్వహణ బాధ్యతను నాలుగు ఏజెన్సీలకు అప్పగిస్తారు.ప్రింటింగ్ ప్రెస్ ఎంపికలో గోప్యత ఉండటంతోపాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ప్రింటింగ్ ప్రెస్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తారు. బయటి వ్యక్తులెవరూ ప్రెస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్‌లోనికి స్మార్ట్ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తారు.రాష్ట్రంలో జరిగే ఏదైనా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య నాలుగు లక్షలు దాటితే, ఆ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి షిఫ్ట్‌లో తప్పనిసరిగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పేపర్ సెట్లు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సెట్ ప్రశ్నాపత్రాల ముద్రణ వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. అలాగే ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు చేపట్టనున్నారు. -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్‌నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్‌థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్‌లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.