న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు.
నీట్‌లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment