Grace marks
-
NEET-UG 2024 revised result: 61 నుంచి 17కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్–యూజీ ప్రవేశపరీక్ష ఫలితాల రీ–రివైజ్డ్ తుది జాబితాను ఎన్టీఏ శుక్రవారం విడుదలచేసింది. ఐదు మార్కులు తీసేయడంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కు పడిపోయింది. ఫిజిక్స్‌లో ప్రశ్నకు నాలుగో ఆప్షన్ సరైనదని ఐఐటీ ఢిల్లీ నిపుణుల బృందం తేలి్చంది. దాంతో అందరి ర్యాంకులు మారిపోయాయి. గతంలో 67 మంది 720కి 720 మార్కులు సాధించారని ప్రకటించారు. ఆరుగురికి గ్రేస్ మార్కులను తీసేయడంతో టాపర్లు 61కి తగ్గారు. తాజాగా వారి సంఖ్య 17కు తగ్గింది.టాప్ 100 జాబితా.. రీ–రివైజ్డ్ జాబితా ప్రకారం టాప్–100 జాబితాలో 17 మంది 720కి 720 మార్కులు సాధించారు. ఆరుగురు 716 మార్కులు సాధించారు. 77 మంది 715 మార్కులు సాధించారు. కేరళ, చండీగఢ్, తమిళనాడు, పంజాబ్, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి తలొకరు, రాజస్థాన్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి చెరొకరు.. 17 మంది టాపర్లుగా నిలిచారు. వీరిలో నలుగురు అమ్మాయిలు! టాప్–100లో అమ్మాయిలు 22 మంది ఉన్నారు. స్కోర్‌కార్డులు, కౌన్సిలింగ్‌కు తాజా సమాచారం కోసం ్ఛ్ఠ్చఝట.n్ట్చ.్చఛి.జీnను చూడాలని ఎన్టీఏ పేర్కొంది. -
Supreme Court: ‘నీట్’ కౌన్సెలింగ్ రద్దు కుదరదు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ కౌన్సెలింగ్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ, పేపర్ లీక్, మూల్యాంకనంలో వ్యత్యాసాలపై దాఖలైన పలు పిటిషన్లను గురువారం ధర్మాసనం విచారించింది. నీట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ పిటిషన్లపై తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కోరారు. గ్రేసు మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించనున్న పరీక్షపై స్టే ఇవ్వాలని మరో న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. గ్రేసు మార్కులు పొందిన అభ్యర్థులకు ఈ నెల 23న నిర్వహించే పరీక్షతోపాటు వచ్చే నెల 6న జరిగే కౌన్సెలింగ్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. అడ్మిషన్ల ప్రక్రియ తుది తీర్పునకు లోబడే ఉంటుందని వ్యాఖ్యానించింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు ఈ పిటిషన్లను జత చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. వేర్వేరు హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్టీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీం నోటీసులిచ్చింది. హైకోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్నపిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఆయా హైకోర్టుల్లో విచారణలపై స్టే విధించింది. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. నీట్లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. -
NEET UG 2024: ‘నీట్’ గ్రేసు మార్కులు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్‌తోపాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)–2024లో 1,563 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నియమించిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఆయా అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం చెప్పిన విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 1,563 మంది అభ్యర్థుల ప్రస్తుత స్కోరు కార్డు రద్దుచేసి, వాస్తవ మార్కులు కేటాయించి, జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ఎన్టీఏ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయమైనవి, సహేతుకమైనవి, సమర్థనీయమైనవి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మే 5న నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో వివిధ కారణాలతో 1,563 మందికి గ్రేసు మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేయడంతోపాటు నీట్–యూజీ–2024ను మొత్తంగా రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కనూ అగర్వాల్ వాదనలు వినిపించారు. 1,563 మందికి ఇచ్చిన గ్రేసు మార్కులు రద్దుచేసి, వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నీట్‌కు హాజరైన అభ్యర్థుల్లో భయాందోళన తొలగించడానికి ఎన్టీఏ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 1,563 మంది అభ్యర్థుల స్కోరు కార్డును రద్దు చేయాలంటూ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. గ్రేసు మార్కులు రద్దయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి, జూన్ 30లోగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ తరఫు సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జూలై 6 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. గ్రేసు మార్కులు రద్దయినవారికి రెండు ఐచి్ఛకాలు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు మరోసారి పరీక్ష రాయవచ్చు లేదా గ్రేసు మార్కులు రద్దయిన తర్వాత వచ్చిన వాస్తవ మార్కులతో కౌన్సిలింగ్‌కు హాజరు కావొచ్చని వెల్లడించింది. జూలై 6న ప్రారంభం కానున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం.. ‘‘కోర్టు ముందుంచిన అన్ని అంశాలనూ పరిశీలించాం. జూన్ 12న ఎన్టీఏ కమిటీ చేసిన సిఫార్సులు న్యాయబద్ధంగా, సహేతుకంగా, సమర్థనీయంగా ఉన్నాయి. 1,563 మందికి మళ్లీ నీట్ నిర్వహించడానికి ఎన్టీఏకు అనుమతిస్తున్నాం. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తున్నాం. పరిహార మార్కులకు సంబంధించి అన్ని అంశాలను మూసివేసినట్లే. ఇతర సమస్యలకు సంబంధించి ప్రతివాదుల స్పందనకు రెండు వారాల గడువు ఇస్తున్నాం. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు వెలువరించింది. అసలు ఏమిటీ వివాదం? ఈ ఏడాది నీట్–యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్ సెంటర్లలో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించారు. వీరందరికీ 720కి 720 మార్కులు రావడం గమనార్హం. ఇలా జరగడం ఎన్టీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కేవలం ఇద్దరికే ఫస్టు ర్యాంకు వచ్చింది. ఈసారి ఫస్ట్ట్ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ఫస్టు ర్యాంకు కొట్టినవారు 50 మంది ఉన్నారు. ఫిజిక్స్ ఆన్సర్ కీలో మార్పుల వల్ల 44 మంది, ఎగ్జామ్‌లో సమయం కోల్పోవడం వల్ల ఆరుగురు గ్రేసు మార్కులు పొందారు. కొందరికి ఇచ్చిన గ్రేసు మార్కుల వల్ల తాము నష్టపోతున్నామని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మార్కుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని విమర్శించారు. కోర్టును ఆశ్రయించారు. అలాగే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని, ఎగ్జామ్‌లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చివరకు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన ఫార్ములా ప్రకారమే అభ్యర్థులకు గ్రేసు మార్కులు ఇచ్చామని, ఇందులో తమ సొంత నిర్ణయం ఏమీ లేదని నీట్‌ను నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. అభ్యర్థుల్లో పోటీతత్వం పెరగడం వల్లే ఈసారి ఎక్కువ మందికి ఫస్టు ర్యాంకు వచ్చిందని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొంటోంది. మరోవైపు, అభ్యర్థులకు ఇచ్చిన గ్రేసు మార్కులను పునఃసమీక్షించడానికి కేంద్ర విద్యా శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. -
ఇంటర్లో గ్రేస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులను (గ్రేస్ మార్కులు) ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలు పంపించినా... కనీస పాస్ మార్కులు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఇబ్బందికరమన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మూడు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించింది. అందులో ప్రభుత్వం ఏ ప్రతిపాదనకు ఓకే అంటే దానిని అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,29,340 మంది విద్యార్థులు అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను పక్కన పెట్టి... 1,61,710 మంది ద్వితీయ సం వత్సర విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించా లని మరో ప్రతిపాదన చేశారు. ఇక ఈ రెండూ వద్దనుకుంటే విద్యార్థులకు కనీస పాస్ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేసే ప్రతిపాద నను పంపించారు. ఆ మూడు ప్రతిపాదన లతో కూడిన ఫైలు ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం పంపించారు. అయితే గతంలో ఉన్నత స్థాయిలో జరిగిన భేటీలో ప్రస్తుత కరోనా పరి స్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయానికే అధికారులు వచ్చారు. 10 నుంచి 20 వరకు గ్రేస్ మార్కులు కలపాలనే ఆలోచన చేసినా... అప్పటికీ పాస్ కాని వారు కోర్టులకు వెళితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అందరికీ పాస్ మార్కులు వేయాలనే ప్రతిపాదన వైపే మొగ్గారు. మొత్తం మూడు ప్రతిపాదనలతో సీఎం ఆమోదానికి ఫైలును పంపించారు. సీఎం ఓకే చెప్పాక ఇంటర్ బోర్డు తదుపరి కార్యాచరణను చేపట్టనుంది. ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులకు 100 మార్కులకుగాను 35 మార్కులు వేసి పాస్ చేయనున్నారు. మ్యాథమెటిక్స్‌లో గరిష్ట మార్కులు 75కు గాను 27 మార్కులను వేసి పాస్ చేస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 60 మార్కులకు 21 మార్కులు వస్తే పాస్ కాబట్టి ఆ మార్కులను వేసి విద్యార్థులందరిని పాస్ చేయనున్నారు. మరోవైపు ఇపుడు విద్యార్థులు మార్చిలో పాస్ అయినట్లు ఇవ్వాలా? జూన్/జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కింద పాస్ అయినట్లు ఇవ్వాలా? అన్న విషయంలోనూ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. -
కానిస్టేబుల్ రాతపరీక్షలో 30 గ్రేస్ మార్కులు కలపాలి
హైదరాబాద్: ఇటీవల జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 30 గ్రేస్ మార్కులు కలపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఔటాఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారని , కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల సం«ఘం గురువారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రశ్నలు తప్పుగా రావటం వల్ల పరీక్షకు హాజరైన అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఎక్కువ మార్కులు సాధించలేక మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డా్డరని తెలిపారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ రాత పరీక్ష మరింత భారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు కృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామలింగం, ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’ తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లినందుకు గాను విద్యార్థులకు గ్రేస్‌మార్కులు కలపాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ తమిళం ప్రశ్నపత్రంలో 49 ప్రశ్నలు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇంగ్లిష్ నుంచి తమిళంలోకి అనువదించే క్రమంలో జరిగిన పొరపాటు కారణంగా తప్పుగా ప్రచురితమైన 49 ప్రశ్నలకుగాను పరిహారంగా నాలుగేసి మార్కుల చొప్పున మొత్తం 196 మార్కులు కలపాలని తీర్పిచ్చింది. ఫలితాల జాబితాను మళ్లీ విడుదల చేయాలని నీట్‌ను నిర్వహించిన సీబీఎస్‌ఈను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎస్ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం సుప్రీంబెంచ్ విచారించింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తే.. తమిళ మాధ్యమంలో పరీక్ష రాసిన విద్యార్థులు మిగతా భాషల్లో రాసిన వారి కంటే మెరుగైన మార్కులు సాధించినట్లవుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ రకమైన పద్ధతిలో మార్కులు కలపలేమని వ్యాఖ్యానించిన తదుపరి వాదనలను రెండు వారాలకు వాయిదా వేసింది. వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) మే 6వ తేదీన దేశవ్యాప్తంగా 136 నగరాల్లో జరిగింది. పరీక్షలో 180 ప్రశ్నలకు గాను 720 మార్కులుంటాయి. తమిళనాడులో తమిళ మాధ్యమంలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. -
గ్రేస్ మార్కుల విధానానికి స్వస్తి
- ఏ రాష్ట్రంలోనూ అమలు చేయొద్దన్న సీబీఎస్ఈ - టెన్త్, ఇంటర్లో అదనపు మార్కులు ఇవ్వొద్దని నిర్ణయం - ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేస్, యాడ్‌స్కోర్, మోడరేషన్ బంద్ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మోడరేషన్, యాడ్ స్కోర్, గ్రేస్ మార్కుల పేరుతో ఇస్తున్న అదనపు మార్కులను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికా రులతో సీబీఎస్ఈ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రం నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణాధికారి సుశీల్‌కుమార్, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు మార్కుల విధానం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని సమావేశంలో దృష్టికి వచ్చింది. ఇంటర్‌తోపాటు ఢిల్లీ, సెంట్రల్ వర్సిటీలకు చెందిన కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్లో మార్కుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, కేరళలో కల్చరల్ స్పోర్ట్స్‌లో ఉన్న విద్యార్థులకు 10 మార్కుల చొప్పున కలుపుతున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి క్రీడలు ఆడితే, నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటే కొన్ని మార్కులు కలు పుతున్నారు. మన రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రా ల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయిన, ప్రశ్నలు కఠినంగా వచ్చిన సందర్భాల్లో ఒకటి, రెండు మార్కులతో పాస్ అయ్యే విద్యార్థులకు మార్కులను యాడ్ స్కోర్‌గా ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో 3 సెట్ల ప్రశ్నపత్రాలను ఇస్తుండటంతో మార్కుల్లో తేడాలొస్తున్నాయి. ఈ సందర్భాల్లోనూ మోడరేషన్ పేరుతో మార్కులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రకంగానూ మార్కులను అదనంగా ఇవ్వొద్దని అన్ని రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. -
గ్రేస్ మార్కులు కలిపేది లేదు : కామినేని
చేతులు తడవకుండానే పదోన్నతులు కల్పించాం సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇక కలపబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రం విడిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో గ్రేస్ మార్కులు కలిపామని, ఇకపై అలాంటిదేమీ ఉండదన్నారు. తాజాగా వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు చేతులు తడవకుండా కల్పించామని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్‌ను తానెప్పుడూ కలవలేదని, వాళ్ల పనితీరును బట్టే చెల్లింపులు చేస్తున్నామన్నారు. మిగతా పథకాలకు నిధులు ఆపేసి మెడాల్‌కు మాత్రమే ఏడాదిలో రూ.102 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించగా.. మెడాల్ సంస్థ పనితీరు అద్భుతంగా ఉందని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలకు అవార్డు కూడా వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌కు అవార్డు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ గురువారం హరియాణా హిస్సార్‌లోని చౌదరీ చరణ్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారత వ్యవసాయ ఇంజనీర్ల సమాఖ్య మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయనకు నేషనల్ ఫెలోషి‹ప్ అవార్డును అందజేయనున్నట్టు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇంద్రమణి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తకు గత 20 ఏళ్లలో ఇటువంటి పురస్కారం లభించడం ఇదే తొలిసారి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసించిన డాక్టర్ సత్యనారాయణ నీటి యాజమాన్య సంస్థ, ఉప్పునీటి పరిశోధన కేంద్రం, భూగర్భ మురుగు నీటి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఈ అవార్డు రావడంపై వర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో సెంచూరియన్ యూనివర్సిటీ: వీసీ సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా ఒడిశాలోని పర్లాకిమిడి, భువనేశ్వర్లలో ఉన్న తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరిస్తున్నట్టు సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎస్ఎన్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం వద్ద ఉన్న తాత్కాలిక క్యాంపస్‌ను విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని విశాఖలో బుధవారం విలేకరులకు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ తరగతులను నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చాన్సలర్ పి.పట్నాయక్ మాట్లాడుతూ ఏపీలో తమ విశ్వవిద్యాలయం ప్రత్యేకత పొందుతుందన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీకి రూ.130 కోట్లు వెచ్చించబోతున్నామని చెప్పారు. తమ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ–రిక్షాల అమ్మకానికి అనుమతి లభించిందని తెలిపారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారం
-
గ్రేస్ మార్కుల గోల్మాల్!
- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారం - నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎంసీఐ - పీజీలో గ్రేస్ మార్కులకు అవకాశమే లేదంటూ లేఖ - ఎంసీఐ ఆదేశాలను అమలు చేస్తారా? అధికార పార్టీకి ఊడిగం చేస్తారా? సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ సారి ఆస్పత్రికి వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి..! స్పెషాలిటీ కోర్సులో పీజీ చేసిన వైద్యుడు గ్రేస్ మార్కులతో పాసయ్యారా? లేక నిజంగానే కష్టపడి చదివి పాసయ్యారా? అనే విషయాన్ని తెలుసుకోండి. పీజీ పరీక్షలు పాస్ కాలేక.. అధికార పార్టీ అండదండలు, పలుకుబడితో వర్సిటీ అధికార యంత్రాంగాన్ని ప్రభావి తం చేసి.. దొడ్డిదారిలో గ్రేస్ మార్కులు సంపాదించి పాసైన డాక్టర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి. గత ఏడాది జరిగిన వివిధ స్పెషాలిటీ పీజీ కోర్సుల పరీక్షలో గట్టెక్కలేక పెద్ద సంఖ్యలో డాక్టర్లు ఫెయిల్ అయ్యారు. అందులో ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన నాయకుల, అధికార పార్టీ అండదండలున్న పిల్లలు చాలామందే ఉన్నారు. వారంతా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పీజీలోనూ గ్రేస్ మార్కులు కలపాలనే వివాదాస్పద నిర్ణయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తీసుకున్నారు. ఎంబీబీ ఎస్‌లో గ్రేస్ మార్కులు కలపడం అప్పుడప్పుడు జరిగేదే అయినా పీజీలో అలా చేయడం ఎన్నడూ జరగలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికార యంత్రాంగం తీసుకున్న వివాదాస్పద గ్రేస్ మార్కుల నిర్ణయంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేస్ మార్కులు కలిపే విధానం.. పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఇటీవల యూనివర్సిటీకి ఎంసీఐ లేఖ రాసింది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు దేశంలోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేయాలని నవంబర్ 22న జరిగిన మెడికల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ‘ఎంసీఐ ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులను రద్దు చేసి.. ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారా? అయిందేదో అయిందని, ఇక మీదట గ్రేస్ మార్కుల ప్రస్తావన తీసుకురాబోమని సరిపెడతారా? యూనివర్సిటీ పరువు నిలబెడతారో? అధికార పార్టీ నేతల ప్రాపకానికి తాకట్టు పెడతారో? చూడాలి’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.