నీట్–యూజీలో పడిపోయిన టాప్ ర్యాంకర్ల సంఖ్య
రీ–రివైజ్డ్ జాబితా విడుదల
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్–యూజీ ప్రవేశపరీక్ష ఫలితాల రీ–రివైజ్డ్ తుది జాబితాను ఎన్‌టీఏ శుక్రవారం విడుదలచేసింది. ఐదు మార్కులు తీసేయడంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కు పడిపోయింది. ఫిజిక్స్‌లో ప్రశ్నకు నాలుగో ఆప్షన్ సరైనదని ఐఐటీ ఢిల్లీ నిపుణుల బృందం తేలి్చంది. దాంతో అందరి ర్యాంకులు మారిపోయాయి. గతంలో 67 మంది 720కి 720 మార్కులు సాధించారని ప్రకటించారు. ఆరుగురికి గ్రేస్ మార్కులను తీసేయడంతో టాపర్లు 61కి తగ్గారు. తాజాగా వారి సంఖ్య 17కు తగ్గింది.
టాప్ 100 జాబితా..
రీ–రివైజ్డ్ జాబితా ప్రకారం టాప్–100 జాబితాలో 17 మంది 720కి 720 మార్కులు సాధించారు. ఆరుగురు 716 మార్కులు సాధించారు. 77 మంది 715 మార్కులు సాధించారు. కేరళ, చండీగఢ్, తమిళనాడు, పంజాబ్, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి తలొకరు, రాజస్థాన్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి చెరొకరు.. 17 మంది టాపర్లుగా నిలిచారు. వీరిలో నలుగురు అమ్మాయిలు! టాప్–100లో అమ్మాయిలు 22 మంది ఉన్నారు. స్కోర్‌కార్డులు, కౌన్సిలింగ్‌కు తాజా సమాచారం కోసం ్ఛ్ఠ్చఝట.n్ట్చ.్చఛి.జీnను చూడాలని ఎన్‌టీఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment