final list release
-
NEET-UG 2024 revised result: 61 నుంచి 17కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్–యూజీ ప్రవేశపరీక్ష ఫలితాల రీ–రివైజ్డ్ తుది జాబితాను ఎన్టీఏ శుక్రవారం విడుదలచేసింది. ఐదు మార్కులు తీసేయడంతో టాప్ ర్యాంకర్ల సంఖ్య 61 నుంచి 17కు పడిపోయింది. ఫిజిక్స్‌లో ప్రశ్నకు నాలుగో ఆప్షన్ సరైనదని ఐఐటీ ఢిల్లీ నిపుణుల బృందం తేలి్చంది. దాంతో అందరి ర్యాంకులు మారిపోయాయి. గతంలో 67 మంది 720కి 720 మార్కులు సాధించారని ప్రకటించారు. ఆరుగురికి గ్రేస్ మార్కులను తీసేయడంతో టాపర్లు 61కి తగ్గారు. తాజాగా వారి సంఖ్య 17కు తగ్గింది.టాప్ 100 జాబితా.. రీ–రివైజ్డ్ జాబితా ప్రకారం టాప్–100 జాబితాలో 17 మంది 720కి 720 మార్కులు సాధించారు. ఆరుగురు 716 మార్కులు సాధించారు. 77 మంది 715 మార్కులు సాధించారు. కేరళ, చండీగఢ్, తమిళనాడు, పంజాబ్, బిహార్, పశి్చమబెంగాల్ నుంచి తలొకరు, రాజస్థాన్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి చెరొకరు.. 17 మంది టాపర్లుగా నిలిచారు. వీరిలో నలుగురు అమ్మాయిలు! టాప్–100లో అమ్మాయిలు 22 మంది ఉన్నారు. స్కోర్‌కార్డులు, కౌన్సిలింగ్‌కు తాజా సమాచారం కోసం ్ఛ్ఠ్చఝట.n్ట్చ.్చఛి.జీnను చూడాలని ఎన్టీఏ పేర్కొంది. -
కాంగ్రెస్: ఎంపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్
సాక్షి,ఢిల్లీ: నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది. గురువారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి, కరీంగనర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లాఖాన్‌ను ప్రకటించారు. అయితే వీరంతా ఇప్పటికే నామినేషన్లు వేయడం గమనార్హం. అటు ఏపీలోనూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. -
రేపు బీజేపీ తుది జాబితా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడినట్టు సమాచారం. తెలంగాణ విషయాని కొస్తే..వరంగల్, ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్ ఖరారు కాగా, ఇక అది ప్రకటించడమే తరువాయి అని సమాచారం. ఖమ్మం నుంచి ఎవరిని బరిలో దింపాలనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నా... పోటీకి ఓ బీఆర్ఎస్ ఎంపీ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఖరారైన నల్లగొండ ఎంపీ సీటుతో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగొచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుండడంతో, ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థి కంటే సదరునేత మెరుగైన వాడిగా భావిస్తే నల్లగొండ అభ్యర్థి మార్పు కూడా ఉంటుందంటున్నారు. తుది జాబితా ప్రకటన ఒకరోజు వాయిదా పడడంతో ఎన్నికల వ్యూహాల ఖరారుకు శనివారం నిర్వహించాల్సిన సమావేశం ఆదివా రానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వికేంద్రీకరణ వ్యూహం... బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో దాదాపు 30వేల మంది పోలింగ్‌బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లాస్థాయి అధ్యక్షులతో అమిత్‌షా సమావేశమైన సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా ఎన్నికల కార్యకలా పాలపై పార్టీ ప్రత్యేకదృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్‌బూత్ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది. ప్రధాన పార్టీల కంటే ముందుగానే లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మిగతా పార్టీలకన్నా బీజేపీనే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తిచేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ మే 13న ఉన్నందున, ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
అభ్యర్థుల జాబితా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఘట్టం: సీఎం జగన్
-
అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్
-
మొత్తం ఓటర్లు 3.26 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. గతనెల 5న ప్రకటించిన జాబితాతో పోలిస్తే.. ఐదో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు కొత్తగా 8,70,072 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన జాబితా ప్రకారం అందులో 3,26,02,799 ఓటర్లు ఉన్నారు. వయసు వారీగా కూడా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్తగా చేరిన ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో ప్రకటించిన ఓటర్ల జాబితాకు అనుబంధంగా జత చేయనున్నారు. 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య కోటీ 67 లక్షల 394 మంది ఉండగా, 40 ఏళ్ల పైబడిన వారు 1,58,73,405 మంది ఉన్నట్లు తేలింది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘం కూడా ఓటు విలువను తెలియ చెప్పేలా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. -
ఫ్యూచర్ రిటైల్: అంబానీ, అదానీకి పోటీగా కంపెనీలు నువ్వా? నేనా?
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు రేసులో మొత్తం 13 కంపెనీలు నిల్చాయి. దీనికి సంబంధించి రూపొందించిన తుది జాబితాలో ముఖేశ్ అంబానీ రిలయన్స్ రిటైల్, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థ ఏప్రిల్ మూన్ రిటైల్‌తో పాటు మరో 11 కంపెనీలు ఉన్నాయి. నవంబర్ 10న విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టుపై రుణ దాతల నుండి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ఆయా కంపెనీలను తుది జాబితాలోనూ చేర్చినట్లు ఎఫ్ఆర్ఎల్ పరిష్కార నిపుణుడు (ఆర్పీ) వెల్లడించారు. (బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు) ఎఫ్ఆర్ఎల్ రుణ భారం రూ. 24,713 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సినది రూ. 21,433 కోట్లు కాగా, ఆపరేషనల్ క్రెడిటర్లకు రూ. 2,464 కోట్ల మేర కట్టాలి. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై దివాలా పిటీషన్ వేసింది. ఎఫ్ఆర్ఎల్ సహా 19 ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల టేకోవర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నించినా.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యపడలేదు. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) -
19 లక్షల పేర్లు గల్లంతు
గువాహటి: వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుదిజాబితా శనివారం విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్ఆర్సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు. అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్ఆర్సీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్ ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది. ఎన్నార్సీకి వ్యతిరేకంగా గువాహటిలో హిందూయువ చాత్ర పరిషత్ సభ్యుల ఆందోళన ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. శనివారం ఉదయం పది గంటలకు ఎన్ఆర్సీ తుదిజాబితాను ఆన్లైన్లో ప్రచురించగా ప్రజల సందర్శనార్థం అన్ని ప్రతులను ఎన్ఆర్సీ సేవా కేంద్రాలు, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచారు. తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు శనివారం వందలాది మంది ఈ కార్యాలయాల్లో క్యూ కట్టారు. పేర్లు ఉన్న వాళ్లు విరిసిన ముఖాలతో బయటకు రాగా.. కొందరు నిరాశగా వెనుదిరగడం కనిపించింది. అందరిలోనూ అసంతృప్తి... ఎన్ఆర్సీ తుది జాబితాపై అటు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం వలసదారులకు జాబితాలో చోటు దక్కిందని, స్థానికులను మాత్రం వదిలేశారని మంగల్దోయి మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేన్ డేకా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ రూపకల్పన జరిగినప్పటికీ అంత నాణ్యంగా ఏమీ జరగలేదని పెదవి విరిచారు. అర్హులైన వారు చాలామందిని జాబితాలోకి చేర్చలేదంటూ బార్పేట కాంగ్రెస్ నేత అబ్దుల్ ఖాలీక్ విమర్శించారు. ఎన్నార్సీపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటున్న ప్రజలు అక్రమ వలసదారుల బహిష్కరణకు ఆది నుంచి ఉద్యమాలు నడిపిన, ఎన్ఆర్సీ జాబితా సవరణకు సుప్రీంకోర్టుకెక్కిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మేము ఏమాత్రం సంతోషంగా లేము. జాబితాను సవరించే క్రమంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇది అసంపూర్తి జాబితా మాత్రమే. జరిగిన తప్పులన్నింటినీ సరిచేసేందుకు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతాం’’అని సంస్థ జనరల్ సెక్రటరీ లురిన్జ్యోతి గగోయ్ స్పష్టం చేశారు. గతంలో వేర్వేరు సందర్భాల్లో అక్రమ వలసదారులుగా ప్రకటించిన సంఖ్యకు, అధికారికంగా ప్రకటించిన అంకెకు ఏమాత్రం పొంతన లేదని గగోయ్ శనివారం ఒక విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 20 శాతం జాబితానైనా సమీక్షించాలి: హిమంతా ఎన్ఆర్సీ తుది జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అసోం మంత్రి, నారŠ?త్తస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంతా బిశ్వాస్ శర్మ... జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ఉన్న జిల్లాల నుంచి ఎన్ఆర్సీలో చోటు దక్కించుకున్న వారిలో కనీసం 20 శాతం మందినైనా మరోసారి పునః పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వాలని ఆయన కోరారు. మిగిలిన జిల్లాల్లో 10 శాతం పునః పరిశీలన ద్వారా కచ్చితమైన జాబితా రూపొందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘1971 కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. శరణార్థిగా ధ్రువీకరించే పత్రాలను అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పాత జాబితాల్లో అవకతవకల కారణంగా కొంతమంది ఎన్ఆర్సీలో చోటు దక్కించుకోగలిగారు’’అని హిమంత ఓ ట్వీట్ కూడా చేశారు. ఎన్ఆర్సీ సవరణకు ముందుగా సుప్రీంకోర్టు తలుపుతట్టిన ‘ద అసోం పబ్లిక్ వర్క్స్’’కూడా తుదిజాబితా లోపభూయిష్టమైందని వ్యాఖ్యానించారు. పునః పరిశీలన చేయాలన్న తమ డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన కారణంగా తుదిజాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయని సంస్థ అధ్యక్షుడు అభిజీత్ శర్మ వ్యాఖ్యానించారు. ఎన్నార్సీ అస్సాంకేనా? అస్సాంలో మాదిరిగానే బంగ్లాదేశీయుల వలసలు ఎక్కువగా ఉన్న ఢిల్లీతోపాటు శ్రీనగర్‌లోనూ ఇలాంటి వివరాలు సేకరించాలని విశ్లేషకులు అంటున్నారు. అంతకంటే ముందుగా ఎన్నార్సీ ప్రక్రియను పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లోనూ మొదలుపెట్టాలని, ఈ ప్రక్రియ ఏ ఒక్క మతానికో లేక వర్గానికో పరిమితం కారాదని అంటున్నారు. అసోంతోపాటు చాలా రాష్ట్రాల్లో అక్రమ వలసదారులున్నందున ఇలాంటి ప్రక్రియను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. ఎన్నార్సీ ప్రక్రియలో నిర్దేశిత విధానాలను పాటించాలని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా ఎన్నార్సీ సమీక్షలో ఆయా రాష్ట్రాలు సహకరించాలి. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు తమ అనుకూల వలసవాదులను ఎన్నార్సీ జరగని రాష్ట్రాలకు పారిపోయేలా సహకరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. జాతి హితం దృష్ట్యా ఈ వివాదంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లను లాగకుండా పార్టీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అక్రమ వలసదారులు, కాందిశీకులు కానటువంటి నిజమైన భారతీయులను గుర్తించడమే ఎన్నార్సీ లక్ష్యం కావాలంటున్నారు. రొహింగ్యాలను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తుండగా కోట్లాది బంగ్లాదేశీయుల్లో పట్టుమని 50 మందిని ప్రభుత్వం వెనక్కి పంపించలేక పోవడం ఏమిటంటున్నారు. ఎన్నార్సీ పూర్వాపరాలివీ.. ► 1951: స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) తయారైంది ► 1955: భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు. ► 1951 1966: తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ► 1965: భారత పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు. ► 1971: మరోసారి వెల్లువలా చొరబాట్లు. ► 1979: అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు ► 1983: నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు. ► 1985 భారత ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్ తేదీగా నిర్ణయం. ► 1997 అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో ‘డీ’అక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం ► 2003 పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు. ► 2005 1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్ఆర్సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం. ► 2010 బార్పేటలోని ఛాయాగావ్‌లో ఎన్ఆర్సీ జాబితా సవరణ తాలూకూ పైలట్ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత. ► 2016 ఎన్ఆర్సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు ► 2017 డిసెంబరు 31న ఎన్ఆర్సీ తొలి ముసాయిదా జాబితా విడుదల ► 2019 జూలై 31న ఎన్ఆర్సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు ► 2019 ఆగస్టు 31. ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు. -
జనసేన అభ్యర్థుల తుది జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయం దగ్గర పడటంతో జనసేన పార్టీ తరుపున పోటీ చేయనున్న శాసనసభ, లోక్ సభ అభ్యర్ధుల తుది జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ జాబితాతో మూడు లోక్ సభ, 19 శాసససభ స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. శాసనసభ అభ్యర్ధుల పేర్లు నరసన్నపేట - మెట్ట వైకుంఠం విజయనగరం - పాలవలస యశస్వి గజపతినగరం - రాజీవ్ కుమార్ తలచుట్ల నర్సీపట్నం - వేగి దివాకర్ వినుకొండ - చెన్నా శ్రీనివాస రావు అద్దంకి - కంచెర్ల శ్రీకృష్ణ యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్. గౌతమ్ కందుకూరు - పులి మల్లికార్జున రావు ఆత్మకూరు - జి. చిన్నారెడ్డి బనగానపల్లి - సజ్జల అరవింద్ రాణి శ్రీశైలం - సజ్జల సుజల ఆలూరు - ఎస్. వెంకప్ప పెనుకొండ - పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ పత్తికొండ - కె. ఎల్ . మూర్తి ఉరవకొండ -సాకే రవికుమార్ శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ పుట్టపర్తి - పత్తి చలపతి చిత్తూరు - ఎన్. దయారామ్ కుప్పం - డాక్టర్ వెంకటరమణ లోక్ సభ అభ్యర్ధులు పేర్లు విజయవాడ - ముత్తంశెట్టి సుధాకర్ నరసరావుపేట - నయూబ్ కమాల్ హిందుపురం - కరిముల్లా ఖాన్ -
16వ తేదీన తుది జాబితా: కుంతియా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న ప్రకటిస్తామని రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ ఆర్సీ కుంతియా వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాల ద్వారా కాంగ్రెస్ పోటీ చేసే 94 స్థానాల్లో 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, ఇప్పటివరకూ ప్రకటించిన జాబితాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామని పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో బీసీలకు ఇప్పటికే 15 స్థానాలు ఇచ్చామని, తుది జాబితాలో ఇంకా 6 నుంచి 7 మంది బీసీలకు స్థానం కల్పిస్తామని కుంతియా తెలిపారు. -
మెడికల్ ఆఫీసర్ ఎంపిక జాబితా విడుదల
అనంతపురం మెడికల్: జిల్లాలో 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 37 మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ శనివారం రాత్రి విడుదల చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జాబితాను www.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి పోస్ట్, ఈ మెయిల్, సెల్ఫోన్లకు మెసేజ్ పంపినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఎంపికైన వారిలో ఎవరైనా గైర్హాజరైతే మెరిట్ ప్రకారం తరువాతి స్థానంలో ఉన్న వారికి అదే రోస్టర్ మేరకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.