న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 తుది ఫలితాల విడుదలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది.
విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, తాము త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్ పాతదని స్పష్టం చేసింది. కాగా నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంత మంది విద్యార్ధులకు కలిసిన గ్రేస్ మార్కులను తొలగించి.. తాజా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తుది ఫలితాలను విడుదల చేసింది. దీని ఆధారంగా 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు.
కాగా ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పాత సిలబస్ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్ధులకు ఎన్టీఏ అదనంగా మార్కులను కలిపింది. అయితే, కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకోవాలని తెలిపింది.
అయితే సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ సందర్బంగా ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్‌లు ఎంచుకున్న విద్యార్ధులకు ఎన్టీయే అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్ లేవనెత్తాురు.
దీనిపై స్పందించిన సుప్రీం దర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం ఐటీ ఢిల్లీ యొక్క నివేదిక ఆధారంగా ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. దీంతో ఆప్షన్ 4 ఎంపిక ేసిన విద్యార్ధులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇక ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment