NEET results
-
డాక్టర్ సీటొచ్చినా.. కూలి పనికి
తుంగతుర్తి: డాక్టర్ కావాలన్నది ఆ అనాథ బిడ్డ తపన. అందుకోసం కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్ పరీక్షలో 507 మార్కులు సాధించింది మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. కానీ కనీసం పుస్తకాలు, దుస్తులు, ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఎప్పటిలాగే తాత, నానమ్మతో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి తన మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో గౌతమిని తాత శిగ రాములు, నాయనమ్మ వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషించారు. గ్రామంలోని సర్కారు బడిలో ఐదో తరగతి వరకు, పసునూర్ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివించారు. గౌతమి పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 992/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో నీట్‌కు హాజరై మొదటి ప్రయత్నంలోనే దంత వైద్య కళాశాలలో సీటు సాధించింది. దంత వైద్యురాలు కావడం ఇష్టం లేక మళ్లీ నీట్ రాయాలనుకున్న ఆమెకు ఆర్థిక సమస్యలు గుదిబండగా మారాయి. అయినప్పటికీ నానమ్మ పుస్తెలతాడు తాకట్టుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌కు పంపారు. గౌతమి డాక్టర్ కావాలనే లక్ష్యంతో తాత, నానమ్మతో కలిసి కూలి పనులకు వెళ్తూనే రెండోసారి నీట్‌కు సిద్ధమైంది. ఈసారి నీట్లో 507 మార్కులు సాధించి ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాధించింది. కానీ ఎంబీబీఎస్ చదవడానికి ఏడాదికి రూ.1,50,000 ఖర్చు అవుతుందని, అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చేసేది లేక కూలి పనులకు వెళ్లున్నట్లు శిగ రాములు తెలిపారు. ఫీజుకోసం అమ్మటానికి కూడా వారికి ఎలాంటిఆ ఆస్తులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశ నెరవేరుతుందని గౌతమి తాత, నానమ్మ వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకున్న దాతలు ఫోన్ పే నంబర్ 93989 19127కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్–యూజీ 2024)కు సంబంధించి తాజాగా విడుదలైన రెండోసారి సవరించిన (రీరివైజ్డ్) ఫలితాలు తెలంగాణ విద్యార్థులకు కాస్త నిరాశ మిగిల్చాయి. తొలిసారి ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన మన విద్యార్థులు.. తాజా ఫలితాల్లో మాత్రం ఆ జాబితాలోనే లేరు. గత ఫలితాల్లో జాతీయ స్థాయిలో 77వ ర్యాంకుతో రాష్ట్ర టాపర్‌గా నిలిచిన అనురాన్ ఘోష్ తాజా ఫలితాల్లో ఏకంగా 137వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.అలాగే ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాప్ ర్యాంకర్ తెలంగాణకు చెందిన గుగులోత్ వెంకట నృపేష్ సవరించిన ఫలితాల్లోనూ టాపర్‌గానే ఉన్నారు. కానీ అతని జాతీయ ర్యాంకు అప్పుడు 167 ఉండగా తాజా ఫలితాల్లో 219కు పడిపోయింది. అలాగే ఎస్టీ జాతీయ రెండో ర్యాంకర్‌గా నిలిచిన లావుడ్య శ్రీరామ్ నాయక్ ఇప్పుడు నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యాడు. నీట్–యూజీ ఎంట్రన్స్‌లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుమారు 1,500 మందికి మళ్లీ ‘నీట్’నిర్వహించి సవరించిన ఫలితాలను కూడా ప్రకటించింది.కానీ ఫిజిక్స్ విభాగంలో అడిగిన ఓ ప్రశ్నకు గతంలో రెండు ఆప్షన్లను సరైన సమాధానంగా పరిగణించిన ఎన్టీఏ ఆ మేరకు రెండు రకాల సమాధానాలు ఇచ్చిన విద్యార్థులందరికీ ఐదు మార్కులు ఇచి్చంది. అయితే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు నియమిత నిపుణుల బృందం ఆ రెండింటిలో ఒక దాన్నే సరైన సమాధానంగా గుర్తించడంతో ఆ ప్రశ్నకు రెండో సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థులకు 5 మార్కుల కోత పెట్టింది. దీంతో విద్యార్థుల ర్యాంకుల్లో తేడా వచి్చంది. తెలంగాణ నుంచి మొదటిసారి విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా తాజాగా సవరించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత సాధించారు. త్వరలో రాష్ట్రస్థాయి ర్యాంకులు... ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన ఎన్టీఏ... త్వరలో రాష్ట్రాలవారీగా అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేయనుంది. తగ్గిన కటాఫ్ మార్కు... సవరించిన ఫలితాల్లో కటాఫ్ మార్కు తగ్గింది. జనరల్ కేటగిరీ/ఈడబ్ల్యూఎస్ కింద తొలిసారి ఫలితాల్లో కటాఫ్ 164గా ఉండగా ఇప్పుడు 162కు తగ్గింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీహెచ్, ఎస్సీ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కులు కూడా 129 నుంచి 127కు తగ్గాయి. అన్ రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్ అండ్ పీహెచ్‌ల అర్హత మార్కు సైతం 146 నుంచి 144కు తగ్గింది. ఎస్టీ అండ్ పీహెచ్‌లోనూ 129 నుంచి 127కు తగ్గింది. గతేడాది రాష్ట్రంలో 459 మార్కులు వచ్చిన వారికి జనరల్ కేటగిరీలో కనీ్వనర్ కోటాలో సీటు రాగా ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కనీ్వనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది. -
నీట్ యూజీ తుది ఫలితాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 తుది ఫలితాల విడుదలో గందరగోళం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలను ప్రకటించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించగా.. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ మాత్రం సవరించిన మర్కులకు సంబంధించిన ఫలితాలను తాము ఇంకా విడుదల చేయలేదని పేర్కొంది.విద్యార్ధులు ఫలితాలను ఇప్పుడే చూసుకోలేరని, తాము త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్ పాతదని స్పష్టం చేసింది. కాగా నీట్ యూజీ-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఎంచుకున్న కొంత మంది విద్యార్ధులకు కలిసిన గ్రేస్ మార్కులను తొలగించి.. తాజా ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తుది ఫలితాలను విడుదల చేసింది. దీని ఆధారంగా 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. కాగా ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు 12వ తరగతి ఎన్సీఈఆర్టీ పాత సిలబస్ ప్రకారం తప్పుగా సమాధానం ఇచ్చిన కొంతమంది విద్యార్ధులకు ఎన్టీఏ అదనంగా మార్కులను కలిపింది. అయితే, కచ్చితమైన ఒక సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన మార్కులను ఉపసంహరించుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ సందర్బంగా ఫిజిక్స్ విభాగంలో 29వ ప్రశ్నకు ఒకటి మాత్రమే సరైన సమాధానం అయినప్పుడు.. రెండు ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్ధులకు ఎన్టీయే అదనపు మార్కులు కలిపిందని ఓ పిటిషనర్ లేవనెత్తాురు.దీనిపై స్పందించిన సుప్రీం దర్మాసనం.. ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి మరుసటి రోజు మధ్యాహ్నానికి ఫిజిక్స్ ప్రశ్నకు సరైన సమాధానానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. అనంతరం ఐటీ ఢిల్లీ యొక్క నివేదిక ఆధారంగా ఆప్షన్ 4 మాత్రమే సరైన సమాధానం అని తెలిపింది. దీంతో ఆప్షన్ 4 ఎంపిక ేసిన విద్యార్ధులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిష్లున్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పరీక్ష సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో కూడా గందరగోళం ఉందన్న పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి బెల్గావి వెళ్లి పరీక్ష రాస్తే.. 700పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఎన్టీఏ నుంచి బ్యాంక్ లాకర్లకు పేపర్లు చేరడానికి మధ్యలో ఏదో జరిగిందని తెలిపారు.విచారణ సందర్భంగా.. ఫిజిక్స్ పేపర్లోని 19వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా ఎన్సీఈఆర్టీ పేర్కొందని, కొత్త ఎన్సీఈఆర్టీ ఎడిషన్ ప్రకారం, ఆప్షన్ 4 సరైన సమాధానం అని ఉంటే, మునుపటి ఎడిషన్ల ప్రకారం ఆప్షన్ 2 సరైనదిగా పేర్కొన్న విద్యార్థులకు కూడా షనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు కలిపిందని పిటిషనర్ తన న్యాయవాది ద్వారాకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనికిసీజేఐ బదులిస్తూ.. తాజా ఎన్సీఈఆర్టీ ఎడిషన్‌లోని సూచనలే పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆప్షన్‌కు సమాధానం ఇచ్చిన వారికి పూర్తి మార్కులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎందుకు ఎన్టీయే అలా చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అయితే రెండూ సాధ్యమయ్యే సమాధానాలేనని ఎస్జీ బదులిచ్చారు.అయితే ఇది సరైనది కాదని, ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంపిక చేయాలని, రెండూ సరైన సమాధానాలు కాలేవని సీజేఐ పేర్కొన్నారుఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని డీవై చంద్రచూడ్ తెలిపారు. "సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఐఐటీT ఢిల్లీ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిపుణుల బృందం సరైన ఆప్షన్‌పై అభిప్రాయాన్ని రూపొందించి, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజిస్ట్రార్‌కు తెలియజేయవలసిందిగా ఆదేశించారు. మరోవైపు.. నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పేర్కొంది. ఇరు వర్గాల సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రేపటికి(మంగళావారం) వాయిదా వేసింది.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపుతోంది. -
Supreme Court: సెంటర్లవారీగా ఫలితాలు
సాక్షి, న్యూఢిల్లీ: పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్–యూజీ, 2024 ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సమగ్ర ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. నీట్–యూజీ పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం విచారించింది. పరీక్షను రద్దుచేసి కొత్తగా నిర్వహించాలని, కోర్టు పర్యవేక్షణలో లీకేజీ ఉదంతంపై దర్యాప్తు జరగాలని వేర్వేరు పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ‘‘ పరీక్షలో సెంటర్లవారీగా విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను బహిర్గతంచేయండిగానీ అభ్యర్థుల ఐడెంటిటీ కనిపించకూడదు. గోప్యత పాటించండి. డమ్మీ రోల్ నంబర్లు వేసి అభ్యర్థుల మార్కుల వివరాలు ఇవ్వండి. ప్రశ్నాపత్రం సోషల్‌మీడియా ద్వారా ఎక్కువ మందికి షేర్ అయి, విస్తృతస్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతింటేనే పరీక్షను మరోమారు నిర్వహించేందుకు అనుమతిస్తాం. అంతేగానీ ఒకటి రెండు కేంద్రాలకు మాత్రమే లీకేజీ పరిమితమైతే రీటెస్ట్‌కు ఒప్పుకోం. కేసు సీబీఐ చేతికి వెళ్లకముందు బిహార్ పోలీసులు సేకరించిన ఆధారాలు, సమర్పించిన ఆర్థికనేరాల విభాగ నివేదికను రేపు సాయంత్రం ఐదింటికల్లా మాకు అందజేయండి’ అని కోర్టు ఆదేశించింది. తర్వాత కొందరు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌హూడా వాదించారు. ‘‘ పరీక్షను రద్దుచేయాల్సిందే. ఎందుకంటే లీకేజీ వ్యవస్థీకృతంగా జరిగింది. హజారీబాగ్‌లో ప్రశ్నపత్రాలు ఆరురోజులపాటు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీ అ«దీనంలో ఉండిపోయాయి. ఎగ్జామ్ సెంటర్‌కు ఒక సాధారణ ఈ–రిక్షాలో తరలించారు. ఈ ఉదంతంలో ఆ సెంటర్ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే అరెస్ట్‌చేశారు’ అని అన్నారు. అయితే ప్రశ్నపత్రం లీక్ కాలేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘ కేవలం 1.08 లక్షల మంది అడ్మిషన్ పొందే ఈ పరీక్ష కోసం 23.33 లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టలేం. పటా్న, హజారీబాగ్ సెంటర్లలో మాత్రమే లీకేజీ అయినట్లు ప్రాథమిక సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. గుజరాత్‌లోని గోధ్రాలోనూ ఇది జరిగి ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ అయిందనే బలమైన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే రీ టెస్ట్‌కు ఆదేశాలిస్తాం. అయినా పేపర్ లీకేజీకి, పరీక్ష ప్రారంభానికి మధ్య ఎంత సమయం ఉంది? ఎంత మందికి పేపర్ చేరవేశారు? అనేవి కీలక అంశాలపై స్పష్టత రావాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేసింది. -
‘సెంటర్లవారీగా ఫలితాలు వెల్లడించండి’.. సుప్రీంకోర్టులో నీట్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ సోమవారానికి(జులై 22కి) వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ ముగించే ముందు.. సెంటర్ల వారీగా ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. శనివారం మధ్యాహ్నాం కల్లా ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచాలన్న ధర్మాసనం.. విద్యార్థుల పేర్లు మాత్రం బయటపెట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి విచారణలో ఇరుపక్షాలు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఇవాళ్టి విచారణ టైంలోనూ సీజేఐ త్రిసభ్య న్యాయమూర్తుల బెంచ్.. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని మరోసారి స్పష్టం చేసింది. ‘‘సామాజిక పరిణామాల దృష్ట్యా నీట్ పరీక్షకు సంబంధించిన పిటిషన్ల విచారణకు మేం ప్రాముఖ్యత ఇస్తాం. ఈ వ్యవహారంలో కోర్టు నుంచి చివరకు ఎలాంటి తీర్పు వస్తుందోనని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే పిటిషనర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరింత సమాచారాన్ని అడిగారు. అలాగే.. మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? పిటిషన్లు వేసిన విద్యార్థులు పొందిన కనీస మార్కులు ఎన్ని? అసలు ఎంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు?అని న్యాయవాదుల్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.‘‘పరీక్ష రాసిన 23 లక్షల మందిలో లక్ష మంది మాత్రమే వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందుతారు. విస్తృతస్థాయిలో పేపర్ లీక్ జరిగిందని తేలితే.. రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోంది. మాకు దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాలు బయటపెడితే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక.. నీట్ ప్రశ్నపత్రం లీకైనమాట వాస్తవమని తేలడంతో ఇందులో అవకతవకలు జరిగాయనడంలో ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్న తెలిసిందే.ల -
నీట్ రీఎగ్జామ్ అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్ లీక్‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్ లీక్‌తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ నివేదిక మాకు సమర్పించాలి అని కేంద్రాన్ని, ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. అలాగే పేపర్ లీక్‌లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మూడు అంశాలపై ఎన్టీఏ నుంచి మాకు స్పష్టత కావాలిలీక్ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది?పేపర్ లీక్‌కు, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉందిపేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి?.. ఇది తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాల కలకు సంబంధించిన వ్యవహారాన్ని మేం విచారణ జరుపుతున్నాం. సుమారు 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్ ఆరా తీసింది.. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐదీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నరు. అంటే నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐపరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: కేంద్రంతో సీజేఐఅక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐపేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లుఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వంపరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్టీఏ NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx— ANI (@ANI) July 8, 2024నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో గత నెల రోజుల వ్యవధిలో వేర్వేరు రోజుల్లో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆయా సందర్భాల్లో కేంద్రానికి, ఎన్టీఏకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్లను మొత్తంగా కలిపి ఇవాళ(జులై 8వ) విచారణ చేపట్టింది కోర్టు. సుప్రీం విచారణతోనే.. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. జులై6వ తేదీన కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్‌ను కోర్టు వాయిదా వేయకపోయినప్పటికీ.. నీట్ ఆందోళనల పరిణామాల నేపథ్యంలో ఎన్టీఏనే వాయిదా వేసింది. -
దేశానికి నీట్ అవసరం లేదు.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నిర్వహణపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయినట్లు విద్యార్ధులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటు విపక్షాలు సైతం నీట్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నీట్ వివాదంపై స్పందించారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేపర్ లీక్ కారణంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వివాదాస్పద నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.ఇటీవల జరిగిన పదోతరగతి, పన్నెండవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడైన విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు.‘నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశానికి నీట్ అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. రాష్ట్ర అసెంబ్లీలో నీట్కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి.నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’.అని తెలిపారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలన్నారు.Chennai, Tamil Nadu | Speaking at a party event, TVK chief and actor, Vijay says, "People have lost faith in NEET examination. The nation doesn't need NEET. Exemption from NEET is the only solution. I wholeheartedly welcome resolution against NEET which was passed in the State… pic.twitter.com/PatKO7MSWU— ANI (@ANI) July 3, 2024 ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
నీట్ పేపర్ లీక్.. బిహార్, మహారాష్ట్ర.. బయటపడిన ఢిల్లీ కనెక్షన్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు మహారాష్ట్ర స్కూల్ టీచర్లపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు టీచర్లను సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గుర్తించింది.వీరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచింగ్ చేసేవారని, లాతూర్‌లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కూడా నడుపుతున్నట్లు తేలింది. అనేక గంటలు విచారణ అనంతరం జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, సంజయ్ తుకారాం జాదవ్ పరారీలో ఉన్నారు.వీరి ఫోన్లలో పలువురు విద్యార్థుల అడ్మిట్ కార్డులు, వాట్సాప్ చాట్లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తితో రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన గంగాధర్... విద్యార్ధులు సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్ఖాన్ పఠాన్లను సంప్రదించడానికి సహాయం చేసినట్లు తేలింది.మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో గంగాధర్, నాందేడ్‌లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఈరన్న కొంగళ్వార్ల పేర్లు కూడా ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలపై వీరిపై కేసు నమోదు చేశారు.విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. డార్క్ నెట్లో పేపర్లు లీక్ కావడం, విక్రయించడం వంటి అక్రమాలపై కూడా ఇది విచారణ చేస్తోంది.అదే విధంగా పోటీ పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా అమలు చేసింది. నేరస్తులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా విధించడం వంటి కఠిన చర్యలు విధిస్తుంది. కాగా నీట్ యూజీ పరీక్షకు ఒక రాత్రి ముందు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు అంగీకరించిన నలుగురిని బీహార్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారిస్తున్నారు.. -
పేపర్ లీక్ అయినా నీట్ పరీక్ష రద్దు చేయరా?
న్యూఢిల్లీ: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షపై వివాదంం రోజురోజుకీ ముదురుతోంది. పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయ్యిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే కౌన్సింగ్ ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలనే డిమాండ్ వెల్లువెత్తోంది.అయితే గతంలో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పరీక్షను రద్దు చేశారు. మరి ఈ దఫా అందుకు ఒకవైపు కేంద్రం.. మరోవైపు ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ససేమిరా అంటోంది. అందుకు కారణం ఏంటో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ‘‘పేపర్ లీక్ పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందని చెప్పారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది’’ అని అన్నారాయన. అలాగే ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోందని, కోర్టే తీసుకునే నిర్ణయమని, తుది నిర్ణయమని చెప్పారు. అయితే 2004, 2015లో విస్తృతమైన లీక్‌లు జరగడం వల్ల అప్పటి పరీక్షలను రద్దు చేయడానికి దారితీసినట్లు చెప్పారు.కాగా నీట్ యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడంతో వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు, తప్పుడు ప్రశ్నలు రావడం కారణంగా కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది.మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్ధులు రాశారు. జూన్ న4న విడుదల ఫలితాల్లో 67 మంది అభ్యర్ధులకు 720 మార్కులు సాధించారు. దీంతో ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ, 1500 మంది విద్యార్ధులకు గ్రేస్ మార్కులు కలపడంపై వివాదం చెలరేగింది. పరీక్షకు ఒక రోజు ముందు పేపర్ లీకవడంపై పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే పరీక్షను రద్దు చేయడానికి కేంద్రం నిరాకరించింది. ఈ వివాదాల నడుమనే జులై మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఏ సన్నాహకాలు చేస్తుండగా.. సుప్రీం కోర్టు సైతం కౌన్సెలింగ్ వాయిదా వేయాలన్న అభ్యర్థలను తోసిపుచ్చుతూ వస్తోంది. -
నీట్ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్‌పై పూర్తి స్థాయి రిపోర్టు అడిగామని తెలిపారు. దోషులెవరైనా వదిలి పెట్టమని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై ఉన్నస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. దీంతోపాటు అనేకమంది పూర్తి స్థాయి మార్కులు రావడంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు, పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
'నీట్ పేపర్ లీక్‌తో.. తేజస్వి అనుచరుడికి సంబంధం'
పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..
కూతురు అటెన్షన్‌తో చదవాలని ఏకంగా 50 ఏళ్ల వయసులో ఆమె తోపాటు నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు ఓ తండ్రి. అతడిది ఇంజీనరింగ్ బ్యాగ్రౌండ్ అయినా సరే కూతురితో పోటీపడి మరీ చదివాడు. తన కూతరిని ఇన్స్పేర్ చేసేలా ప్రిపేరయ్యి మరీ విజయం సాధించాడు. అతడి కూతురు కూడా మంచి మార్కులతో ఈ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తండ్రి కూతుళ్లు విజయగాథ ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుంమా..!ఆ తండ్రి పేరు వికాస్ మంగ్రోత్రా. ఆయన ఢిల్లీలో కార్పొరేట్ ఉద్యోగిగా పనిచేన్నారు. అతడికి 18 ఏళ్ల మిమాన్సా అనే కూతురు ఉంది. ఆయన తన కూతురు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేలా చేసేందుకు ఓ తండ్రిగా ఈ ఏజ్‌లో చేసిన సాహసంగా చెప్పొచ్చు. వికాస్ తన కూతరికి నీట్ ఎగ్జామ్‌లో పలు సందేహాలు తీర్చేవాడు. ఆమె కూతురు పడుతున్న టెన్షన్, ఇబ్బందులు చూసి..ఆమెకు తానే స్పూర్తి కలిగించేలా చేద్దామన్న ఉద్దేశ్యంతో ఆమెతో కలిసి ఈ నీట్ ఎగ్జామ్‌కి అప్లై చేశాడు. ఇద్దరు కలిసి పోటీపడి మరీ ప్రిపేరయ్యేవారు. నిజానికి వికాస్ 90లలో డాక్టర్ కావాలనుకుని ప్రీ మెడికల్ టెస్ట్‌లకు అప్లై చేశాడు. అయితే మార్కులు తక్కువ రావడం తోపాటు కొన్నీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం తన కూతురు కోసమే గాక తన సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇలా ఈ నీట్ ఎగ్జామ్ రాసినట్లు వికాస్ చెప్పుకొచ్చారు. తన కూతురు ప్రిపరేషన్లో ఎదురయ్యే సందేహాలను తీరుస్తున్నప్పుడు వాళ్లు ఫీల్ అవుతున్న ఇబ్బందులును గ్రహించి..ఎలా ఈ ఎగ్జామ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలో చెప్పాలనే ఉద్దేశ్యంతో కూతురి తోపాటు ప్రిపేర్ అయ్యానని అన్నారు. చివరికి ఇద్దరూ ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆయన తన కూతురుని ఎగ్జామ్‌లో బాగా ప్రిపేర్ చేసేందుకు ఒక ఏడాది పాటు సెలవులు పెట్టిమరీ ప్రిపేర్ చేయించారు. ఇక ఆయన కూడా ఆఫీస్ పనివేళ్లలు పూర్తి అయిన తర్వాత కొద్ది గంటలు ఈ ఎగ్జామ్‌కి కేటాయించి మరీ ప్రీపేర్ అయ్యినట్లు తెలిపారు. అయితే వికాస్ నీట్ ఎగ్జామ్‌ని 2022లో కూడా అటెంప్ట్ చేశానని అలాగే యూపీఎస్సీ, జేకేసెట్, సీఎస్ఈ వంటి ఇతర పరీక్షలు కూడా సరదాగా రాసేవాడినని చెప్పుకొచ్చారు. అంతేగాదు మన పిల్లలు పాఠ్యాంశాలు బాగా చదివేలా తల్లిదండ్రులుగా మనమే ముందుకొచ్చి సహకరించాలని అన్నారు. (చదవండి: లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!) -
నీట్ పరీక్షలో అక్రమాలు.. ఎన్డీయే సర్కార్‌ను ప్రశ్నించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నీట్ పరీక్ష విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నలు సంధించారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన, అతి ముఖ్యమైన విషయం నీట్ పరీక్ష. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?. స్పష్టంగా పరిష్కరించాల్సిన పెద్ద సమస్య ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారు’ అంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ జత చేసి ప్రశ్నలు సంధించారు.అలాగే, నీట్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలన్నారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోంది. నీట్లో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Why is the NDA Govt so callous on a such a sensitive & important matter that affects lakhs of students and their families who have taken the NEET examination Why the stringent denial by the Education Minister when clearly there is a huge problem which needs to be addressed?… https://t.co/LYWjOUkkmz pic.twitter.com/7mRojL3uxG— KTR (@KTRBRS) June 17, 2024 -
ఆందోళన వద్దు.. నీట్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024 వివాదంపై కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ వివాదంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని తెలిపారు.పేపర్ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై అధికారులు వాటిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అంశంలో సంబంధిత అధికారుల విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం జూలై 8 వరకు వేచి చూద్దాం. దాచడానికి ఏమీ లేదు అని ఆయన అన్నారు.భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా 4,700 కేంద్రాలలో 14 విదేశాలలో 13 భాషలలో 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రధాన్ తెలిపారు. రెండు కేంద్రాలపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. నీట్లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. -
నీట్ రద్దుకు సుప్రీం నిరాకరణ.. ఎన్టీఏకు నోటీసులు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షను రద్దు చేయాటలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషన్లు కోరుతున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.విచారణ సందర్బంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. ఇది పవిత్రమైనది. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటుంది. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని ఎన్టీఏ న్యాయవాదిని ఉద్ధేశించి జస్టిస్ అమానుల్లా పేర్కొన్నారు. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు.ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆలోగా ఎన్టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.దీనికి ఎన్ టీఏ తరఫు అడ్వొకేట్ స్పందిస్తూ ఇప్పటికే దాఖలైన మరో కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారిస్తోందని.. మే 17న తమకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ కేసు విచారణ జులై 8కి వాయిదా పడినందున ఈ కేసును కూడా అదే కేసుకు జత చేయాలని కోరారు. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.కాగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ - 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. జూన్ 4న వెలువడిన ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.దీంతో పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నందున పరీక్షను రద్దు చేసి తిరిగి కొత్తగా నిర్వహించేలా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి -
‘నీట్’పై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అసలు నీట్ ఫలితాలు ఇవే ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు. ఎన్టీఏపై విమర్శల వెల్లువ మే 5న నీట్ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్ 14న ప్రకటిస్తామని ఎన్టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచి్చందనే విమర్శలు వస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కలి్పంచారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోనూ ఆలస్యం ఇక పలువురు విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఇచి్చన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్‌గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్టీఏ సమీక్షించి వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.హైదరాబాద్ మాదాపూర్‌లోని మెరీడియన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్ మార్కులు కలపలేదని ప్రశి్నస్తున్నారు. -
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్- యూజీ పరీక్ష- 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్‌గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్ పేపర్ లీక్ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్‌గా మారుతా. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్‌కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
NEET Row: గ్రేస్ మార్కులపై ఎన్డీఏ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ 2024 ఫలితాలపై రగడ కొనసాగుతున్న వేళ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. విద్యార్థులకు అదనంగా కలిపామని చెబుతున్న గ్రేస్ మార్క్‌లను సమీక్షించడానికి అంగీకరించింది. ఇందుకోసం విద్యాశాఖ ఓ కమిటీ వేసిందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు.నీట్ యూజీ పరీక్ష నిర్వహణ.. ఫలితాల వెల్లడిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘‘సుమారు 1,500 మందికి ఇచ్చిన గ్రేస్మార్క్ల్ని సమీక్షించేందుకు విద్యాశాఖ నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం తర్వాతఘ ఆ 1,500 మంది ఫలితాలను సవరించే అవకాశం ఉంటుంది. అయితే.. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హత ప్రమాణాలపై ప్రభావం పడబోదు. ప్రభావిత అభ్యర్థుల ఫలితాల సమీక్ష అడ్మిషన్ ప్రక్రియపై ప్రభావం చూపించదు’’ అని అన్నారాయన. అలాగే.. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. పేపర్ లీక్ కాలేదని, అవకతవకలేమీ జరగలేదన్న ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టంచేశారు.ఇక.. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే ఆ విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అయితే, సమీక్ష అనంతరం ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించే నిర్ణయం కూడా కమిటీ సిఫారసులను బట్టి ఉంటుందన్నారు.‘‘ప్రతి విషయాన్ని పారదర్శకంగా విశ్లేషించి నీట్ యూజీ 2024 ఫలితాలను ప్రకటించాం. మొత్తం 4,750 కేంద్రాల్లో 6 కేంద్రాలకే ఈ సమస్య పరిమితం అయింది. అలాగే, 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, అందులో 1,600 మంది విషయంలోనే సమస్య ఉంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రతకు భంగం వాటిల్లలేదు. ఏ పరీక్ష కేంద్రంలో కూడా పేపర్ లీకేజీ జరగలేదు’’ అని ఎన్ టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.విమర్శలు ఇలా.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షల్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం అనుమానాలకు తావిచ్చింది. దీనితో తోడు ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యమయ్యే పని కాదన్నది చాలామంది వాదన. దీని గురించి ఎన్ఈటీని ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని చెబుతోంది. కొంతమంది విద్యార్థులకైతే 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చామని అంటోంది. ఇప్పుడు విమర్శల నేపథ్యంలో ఆ మార్కులనే సమీక్షించబోతోంది. ఇక పరీక్ష నాడు ప్రశ్నాపత్రాలు సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తాము తక్కువ టైంలో పరీక్ష రాయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. అయితే కేవలం ఆరు సెంటర్లలో మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైందని ఎన్ఈటీ ఇప్పుడు అంటోంది. మరోవైపు గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది NTA చెప్పకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే.. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చింది. -
ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..!
‘నీట్’ ఎగ్జామ్‌లో ఆలిండియా టాప్ ర్యాంకర్‌గా నిలవడం సామాన్యం కాదు. ముంబైలో ఓ బేకరి వర్కర్ కుమార్తె అయిన అమీనా ఆరిఫ్ పది వరకూ ఉర్దూ మీడియంలో చదివింది. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంతో ఇబ్బంది పడింది. అయినా నీట్ 2024లో 720 కి 720 తెచ్చుకుని టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ఆమె స్ఫూర్తిదాయక కథనం...‘మెహనత్ కర్నా హై... మోటివేట్ రెహనా హై (కష్టపడాలి... ప్రేరణతో ఉండాలి) అని చెప్పింది అమీనా ఆరిఫ్ తన విజయం గురించి. వైద్యవిద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’లో 2024 సంవత్సరానికి 720 మార్కులకు 720 మార్కులతో టాప్ 1 ర్యాంకు సాధించింది అమీనా. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాస్తే వారిలో 67 మందికి టాప్ 1 ర్యాంకు వచ్చింది. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో మిగిలిన వారితో పోల్చితే అమీనా గెలుపు కాస్త భిన్నమైనది. ఎందుకంటే 10వ తరగతి వరకూ ఆమె ఉర్దూ మీడియంలో చదివింది.బేకరి వర్కర్ కుమార్తె..ముంబై పశ్చిమ శివార్లలో ఉండే జోగేశ్వరి ప్రాంతం అమీనాది. తండ్రి బేకరీలో పని చేస్తాడు. అక్కడ ఉన్న మద్నీ హైస్కూల్ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పేరు గడించింది. ఉర్దూ మీడియంలో బోధన సాగే ఆ స్కూల్లోనే అమీనా పది వరకు చదివింది. ఆ తర్వాత పార్లెలోని మితిబాయి కాలేజీలో బైపీసీలో చేరింది. ‘అంతవరకూ ఉర్దూ మీడియంలో చదవడం వల్ల బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదవడం కష్టమైంది. ఇంగ్లిష్‌లో నా వెనుకంజ నా చదువునే వెనక్కు నెట్టకూడదని గట్టిగా కష్టపడ్డాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి.మళ్లీ ప్రయత్నించి..‘అమ్మా నాన్నా నన్ను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. లాక్డౌన్ వల్ల మొదటిసారి నీట్ రాసినప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేంత ర్యాంక్ రాలేదు. నిస్పృహ చెందకుండా ప్రయత్నించాను. ఈసారి కోచింగ్ తీసుకున్నాను. ఆరు గంటలు కోచింగ్, ఇంట్లో మరో నాలుగైదు గంటలు సెల్ఫ్ స్టడీ... ఇలా సాగింది నా కృషి.కోచింగ్ సెంటర్లో మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు 700 మార్కులకు తరచూ 620 వచ్చేవి. అప్పుడే అనుకున్నాను... కచ్చితంగా 700 దాటుతానని ముందే అనుకున్నాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు వచ్చిన ర్యాంక్‌కు దేశంలోని ఏ మెడికల్ కాలేజీలో అయినా సీట్ వస్తుంది కానీ అమీనా మాత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. -
ఏ ర్యాంక్‌కు ఎక్కడ మెడికల్ సీటొస్తుంది?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్‌తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్‌లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్‌లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్‌లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్‌లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్‌ల వరకూ సీట్లు లభించాయి. -
నీట్లో మెరిసిన రైతుబిడ్డలు
కర్నూలు: నీట్ పీజీ ఫలితాల్లో రైతు బిడ్డలు ప్రతిభ చూపారు. మంగళవారం సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నూరు హుసేని, చెన్నూరు హుసేనమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమార్తె రజియా అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేయాలన్న సంకల్పంతో నీట్ పరీక్షలు రాయగా 571 మార్కులు వచ్చాయి. ఆలిండియా స్థాయిలో 5248వ ర్యాంకు వచ్చింది. చిన్నపిల్లల వైద్యనిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని పేదలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు. -
లంక సిస్టర్స్.. ఇద్దరూ డాక్టర్స్..!
పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్ (ఎండీఎస్)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
TS: రాష్ట్రంలో నీట్ అర్హులు 36,795 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రం నుంచి 36,795 మంది నీట్ పరీక్షలో అర్హత సాధించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. నీట్ జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు.. తెలంగాణ రాష్ట్రంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించిన చప్పిడి లక్ష్మీచరిత రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయి 41వ ర్యాంకర్ జీవన్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. తొలి 50 స్థానాల్లో.. 28 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. అర్హత కటాఫ్ మార్కులను ఓపెన్ కేటగిరీలో 117, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు 93 మార్కులు, పీడబ్ల్యూడీ జనరల్‌కు 105 మార్కులుగా నిర్ణయించారు. ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎవరైనా విద్యార్థుల పేర్లులేకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, తర్వాత కౌన్సెలింగ్ సందర్భంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పొరపాటున కొందరు ర్యాంకర్ల పేర్లు ఇతర రాష్ట్రాల పరిధిలోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో టాప్ వెయ్యి ర్యాంకర్లు ఆలిండియా సీట్లలో చేరే అవకాశం ఉందని.. మిగతావారు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో చేరుతారని కాళోజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఎంబీబీఎస్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 215 రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 215 సీట్లు కేటాయించినట్లు కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, మిగతావి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే ఇందులో సగం సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులైన వారితో భర్తీ చేస్తామని.. మిగతా సీట్లను ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 5,965 సీట్లు ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి 5,965 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15శాతం సీట్లను ఆలిండియా కోటా కింద జాతీయస్థాయిలో భర్తీ చేస్తారు. వాటిలో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు ఏవైనా మిగిలితే.. వాటిని రాష్ట్రానికి అప్పగిస్తారు. వచ్చేనెల రెండో వారంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ప్రకటన జారీచేసే అవకాశం ఉందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. -
Tamil Nadu: ‘నీట్’లో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఈ ఏడాది నీట్ ఉత్తీర్ణత తగ్గింది. కేవలం 51.3 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. టాప్ 50 జాబితాలో ఇద్దరు తమిళనాడు విద్యార్థులకు చోటు దక్కింది. వివరాలు.. వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం గత నెల నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు రాష్ట్రం నుంచి 1,32,167 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 67,787 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 51.3 శాతానికి పరిమితమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల ఉత్తీర్ణత మరీ తక్కువగా ఉంది. అయితే, దేశవ్యాప్తంగా టాప్ 50లో తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులకు చోటు దక్కించుకోవడం గమనార్హం. మదురైకు చెందిన త్రిదేవ్ వినాయక(ఓబీసీ కేటగిరిలో –705 మార్కులతో) 30వ స్థానం, హరిణి అనే విద్యార్ధిని జనరల్ కేటగిరిలో 702 మార్కులతో 43వ స్థానం దక్కించుకోవడం విశేషం. కాగా నీట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆవడి సమీపంలో ఓ విద్యార్థిని మరణించగా, తిరుత్తణిలో మరో విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నీట్ తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని, వారితోనే ఉండాలని, అవసరం అయితే, ప్రభుత్వం 104, 1100 నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ తీసుకోవాలని అధికారులు సూచించారు. యువతి బలవన్మరణం తిరువళ్లూరు: నీట్ పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ఇంది రా నగర్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అముద కుమార్తె లక్ష్మీ శ్వేత(19) ప్లస్–2 పూర్తి చేసి రెండేళ్లుగా నీట్‌కు ఆన్లైన్ క్లాసుల ద్వారా కోచింగ్ తీసుకుంటోంది. గత నెలలో రాసిన నీట్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల్లో అర్హత మార్కులు సాధించకపోవడంతో ఆవేదనకు గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నీట్ ఫలితాలు విడుదల 9.93 లక్షల మంది ఉత్తీర్ణత
-
NEET UG 2022: నీట్లో తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు మెరుపులు మెరిపించారు. బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధార్థరావు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. రాష్ట్రానికి చెందిన చప్పిడి లక్ష్మీచరిత 37వ ర్యాంకు, కె.జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, వరం అదితి 50వ ర్యాంకు, యశస్వినిశ్రీ 52వ ర్యాంకు సాధించారు. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి బాలికల కేటగిరీలో చూస్తే.. చప్పిడి లక్ష్మీచరిత జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో నిలిచారు. ఇక ఎస్టీ కేటగిరీలో జాతీయ టాపర్‌గా తెలంగాణకు చెందిన ముదావత్ లితేష్ చౌహాన్, రెండో ర్యాంకును గుగులోతు శివాని సాధించారు. లవోడ్య బృంద ఐదో, బూక్యా అనుమేహ ఆరో ర్యాంకులు సాధించారు. ఓబీసీ కేటగిరీలో చూస్తే.. యశస్వినీశ్రీ ఎనిమిదో ర్యాంకు పొందారు. తెలంగాణ నుంచి నీట్ కోసం 61,207 మంది రిజి్రస్టేషన్ చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. ఇందులో 35,148 మంది నీట్‌కు అర్హత సాధించారు. గతేడాది అర్హుల సంఖ్య 28,093 మందే కావడం గమనార్హం. ఐదో ర్యాంకు సాధించిన విద్యార్థి తమ కాలేజీలో చదువుకున్నాడని శ్రీచైతన్య కూకట్పల్లి బ్రాంచి డీన్ శంకర్రావు తెలిపారు. ఏపీకి చెందిన దుర్గ సాయి కీర్తితేజ 12వ, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ జాతీయ ర్యాంకులు సాధించారు. -
‘నీట్’లో ఏపీ విద్యార్థులు 61.77% ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. నీట్ యూజీ పరీక్షలను దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 17.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,93,069 మంది (56.27 శాతం) అర్హత సాధించారు. ఏపీ నుంచి 61.77 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 65,305 మంది పరీక్షకు హాజరు కాగా, 40,344 మంది అర్హత సాధించారు. రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని తనిష్క 715 స్కోర్ సాధించి, 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీకి చెందిన వి. ఆశిష్‌బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేష్ నాగభూషణ్ మూడో ర్యాంకు, రూచ పవాషే నాలుగో ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన ఇ.సిద్దార్థ్ రావు ఐదో ర్యాంక్ సాధించారు. ఏపీకి చెందిన ఎం. దుర్గ సాయి కీర్తి తేజ 12వ ర్యాంక్, ఎన్.వెంకటసాయి వైష్ణవి 15వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. జి.హర్షవర్ధన్ నాయుడు 25వ ర్యాంకు సాధించాడు. చదవండి: (‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల) ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ ఇలా కోటాలు కలిపి 5,060 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 సీట్లు (ఈడబ్ల్యూఎస్ అదనపు సీట్లు కలిపి) ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల, రంగరాయ (కాకినాడ) కళాశాలల్లో 250 చొప్పున సీట్లున్నాయి. అత్యల్పంగా ఒంగోలు రిమ్స్‌లో 120 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో ఆల్ ఇండియా కోటా 325 సీట్లు, రాష్ట్ర కోటాలో 1,890 సీట్లు భర్తీ చేస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. కాగా 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1400కు పైగా బీడీఎస్ సీట్లు ఉన్నాయి. -
ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. వారంలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నీట్ ర్యాంకులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో చాలామంది జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారని, కానీ రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకులు తక్కువగానే ఉంటాయని నీట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: ‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’ వారి అంచనా ప్రకారం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అటువంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదని వివరించాయి. కొత్తగా 6 ప్రభుత్వ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,600 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల మూడు ప్రైవేటు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిల్లోని 450 ఎంబీబీఎస్ సీట్లను తీసేస్తే 3,150 సీట్లు ఉంటాయి. అయితే ఎంఎన్ఆర్ కాలేజీకి దాదాపు అనుమతి వచ్చినట్లేనని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి అవి 150 కలిపితే 3,300 సీట్లు అవుతాయి. మరోవైపు ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. దీంతో వాటిల్లో 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలల్లో 2,665 సీట్లు ఉండనున్నాయి. ఇక రామగుండం, మంచిర్యాల కాలేజీలకు కూడా అనుమతులు వస్తే వాటి ద్వారా మరో 300 సీట్లు పెరుగుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
‘నీట్–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: నీట్–అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు. ఈ ఏడాది నీట్–యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు 17.64 లక్షల మంది హాజరయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.17 లక్షల మంది, మహారాష్ట్ర నుంచి 1.13 లక్షల మంది, రాజస్తాన్ నుంచి 82,548 మంది అర్హత పొందారు. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఓయో బంపరాఫర్..విద్యార్థినులకు మాత్రమే!
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్ అందిస్తుంది. అందులో వైఫై, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జ్యూమర్) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు. విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్ పొందాలంటే! ♦ఓయో యాప్‌ను డౌన్లోడ్ చేయాలి ♦ఆ యాప్‌లో నియర్ బై ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ♦ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేస్తే ఎగ్జామ్ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఓయో రూమ్స్ లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఓయో రూమ్స్ హోటల్‌ను సెలక్ట్ చేసుకొని 'నీట్ జేఎఫ్' కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి ♦ఆ తర్వాత బుక్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి 40శాతం పేమెంట్ చేసి ఓయో రూంను వినియోగించుకోవచ్చు. -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్‌లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్‌లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
అలాంటప్పుడు విదేశాల్లో ఎందుకు చదువుతున్నారు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జోషి మాట్లాడుతూ.. విదేశాల్లో మెడిసిన్ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60 శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్లకు వెళ్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనాలో విద్యను అభ్యసించేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, విదేశాల్లో మెడిసిన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలు పాస్ అయితేనే వారికి భారత్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉండగా మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. దేశంలో మెడికల్ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. నీట్లో తాము అర్హత సాధించినప్పటికీ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో తామకు నష్టం జరుగుతోందన్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్ చదివిన డాక్డర్లు మాత్రం ఉండి ఉంటే దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పత్రిపక్ష నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. -
ఏపీ నీట్ ర్యాంక్‌లు విడుదల
సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్ యూజీ–2021 రాష్ట్రస్థాయి ర్యాంకులను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో జాబితాను ఉంచింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వీసీ డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ చేపడతారు. ఈ ప్రక్రియ జరగడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 11 మందికి 100లోపు ర్యాంక్‌లు రాష్ట్రం నుంచి నీట్‌కు హాజరైన వారిలో 39,388 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో తొలి వందలోపు ఆల్ ఇండియా ర్యాంక్‌లను 11 మంది సాధించారు. వీరిలో ఎనిమిది మంది జనరల్ అభ్యర్థులు, ముగ్గురు ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. ఆలిండియా ర్యాంకులు 100లోపు సాధించిన వారు.. విద్యార్థి ర్యాంకు చందం విష్ణు వివేక్ 13 గొర్రిపాటి రుషిల్ 15 పి. వెంకట కౌశిక్ రెడ్డి 27 కేతంరెడ్డి గోíపీచంద్ రెడ్డి 36 టి. సత్యకేశవ్ 41 పరుచూరి వెంకటసాయి అమిత్ 47 పి. కార్తీక్ 53 ఎస్. వెంకటకల్పజ్ 58 కె. చైతన్య కృష్ణ 71 పి. సాకేత్ 84 వి. నిఖిత 89 కటాఫ్ మార్కులు ఇలా.. జనరల్ కేటగిరీ 138 జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ 122 బీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూడీతో కలిపి) 108 -
నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్–2021 యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులను శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ర్యాంకుల జాబితా సమాచారం నిమిత్తమేనని, వర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితా విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వివరించింది. నీట్–21 యూజీ అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అడ్మిషన్ల షెడ్యూల్ ఖరారైన తర్వాత కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్ చేపట్టనుంది. నీట్ కటాఫ్ స్కోర్ వివరాలు: జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 138 మార్కులు ♦ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 108 మార్కులు ♦పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్ ఆఫ్ స్కోర్ 122 మార్కులు -
పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది.. కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..
న్యూఢిల్లీ: 2021లో నీట్లో ఉత్తీర్ణత సాధించిన చాలా మంది విద్యార్థులలో మోలార్‌బండ్‌లోని సర్వోద్య కన్యా విద్యాలయానికి చెందిన రితిక కూడా ఒకటి. కాకపోతే తను ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సొంతంగానే పేపర్ అయ్యి మెరిట్ ర్యాంకును సాధించింది. రితిక తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి బదర్పూర్లో ఒక చిన్న ఇంట్లో నివసిస్తోంది. తన తండ్రి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పని చేస్తూ వారు జీవనాన్ని సాగించేవాళ్ళు. కోవిడ్ లాక్డౌన్ మూలాన రితిక తండ్రి ఉపాధిని కోల్పోయాడు.దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో రితిక ఇంట్లో మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కూడా లేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమెకు ఆండ్రాయిడ్ ఫోన్, పుస్తకాలు అవసరమైన తరుణంలో వాటిని కొనడానికి కూడా డబ్బులు లేవని ఆ పరిస్థితుల్లో తన పెళ్లి కోసం ఇంట్లో దాచిన నగలు అమ్మి అవి కొన్నట్లు చెప్పింది. చివరకు అన్ని కష్టాలను దాటుకొని ఆమె 500 మార్కులు సాధించి ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా 3,032 ర్యాంక్‌ను సాధించింది. నీట్లో మంచి స్కోర్ (93%) సాధించడంతో తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది. తను ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేని కారణంగా యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాల నుంచి సొంతంగా పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చాలా సహాయం చేసినట్లు చెప్పింది రితిక. ఈ ఏడాది ఢిల్లీ పాఠశాలల నుంచి మొత్తం 436 మంది విద్యార్థులు నీట్లో ఉత్తీర్ణత సాధించారు. చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు -
‘జై భీమ్’ సినిమా సీన్‌ను రీపిట్ చేసిన తమిళనాడు యువతి..!
దేశంలోని చాలా అట్టడుగు వర్గాల గిరిజనుల నుంచి ఆడపిల్లలు ‘నీట్’ రాసి క్వాలిఫై కావడం గురించి విన్నామా? కాని తమిళనాడులో సంగవి చరిత్ర సృష్టించింది. కేవలం 10 వేల మంది ఉండే గిరిజన తెగ ‘మలసార్’ నుంచి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకుంది. ఆమె రేపో మాపో డాక్టర్ కోర్సులో చేరనుంది. అది ఒక్కటే కాదు... ఆమె తన ‘ఎస్.టి సర్టిఫికెట్’ కోసం ప్రభుత్వం కదిలే స్థాయిలో పోరాడింది. ఆమె చదువు గురించిన పట్టుదల ఇప్పుడు మొత్తం ఆ తెగకు మేలు చేసేలా కదలిక తీసుకువచ్చింది. ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అనేవారుగాని మన దేశంలో నేటికీ అలాంటి చీకటి ఖండాల వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు కోయంబత్తూరుకు ఆనుకునే ఉన్న ఎం.నంజప్పనూర్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ప్రభుత్వానికి తెలియదు. నగర వాసులకూ తెలియదు. ఎందుకంటే అక్కడ తరాలుగా జీవిస్తున్నది మలసార్ అనే తెగకు చెందిన గిరిజనులు కాబట్టి. కేరళ, తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ తెగ మొత్తం కలిపి 10 వేల మంది ఉండరు. వీళ్లది లిపి లేని భాష. నాలుగు ఆకులు, ప్లాస్టిక్ పట్టలు కట్టి పైకప్పుగా వేసుకుని జీవించే వీరి గురించి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆ తెగలో ఇంటర్ పాసైన సంగవి అనే అమ్మాయి. ‘నీట్ – 2021’లో ఆ అమ్మాయి 202 మార్కులు సంపాదించింది. ఎస్.టి కేటగిరిలో అర్హత మార్కులు 108– 121 కాగా వాటిని దాటి 202 మార్కులు తెచ్చుకోవడం విశేషమే. ఇలా మలసార్ తెగ నుంచి ఈ ఎగ్జామ్ రాసి ఈ స్థాయిలో క్వాలిఫై అయిన మొదటి అమ్మాయి సంగవే. అందుకే ఇప్పుడు తమిళనాడు గిరిజన శాఖ మంత్రితో మొదలు అధికారులు ఆమెను కలిసి అభినందిస్తున్నారు. సర్టిఫికెట్ కోసం పోరాటం ఇప్పుడు ఓ.టి.టిలో ప్లే అవుతున్న ‘జైభీమ్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో పాములు పట్టుకుని బతికే గిరిజన తెగ వాసులు తమకు ఎస్.టి సర్టిఫికెట్ ఇమ్మని, చదువుకుంటామని అధికారి దగ్గరకు వస్తారు. దానికి అధికారి ‘మీరు ఎక్కడ ఉంటారు.. మీ అమ్మా నాన్నలకు అలాంటి సర్టిఫికెట్ ఉందా... మీ కులం పేరుతో మీకు పట్టాలు ఉన్నాయా.. రేషన్ కార్డులు ఉన్నాయా.. అవి లేకుండా కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వము’ అంటాడు. ఇప్పుడు సంగవి గురించి అధికారులు అదే అన్నారు. టెన్త్ వరకూ ఏ కుల సర్టిఫికెట్ లేకుండానే చదువుకున్న సంగవి ఇంటర్ కూడా అలాగే చదివి 2018లో నీట్ రాసి క్వాలిఫై కాలేదు. దాంతో పాలిటెక్నిక్‌లో చేరింది. ఎస్టి కోటాలో సీట్ ఇచ్చి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 రోజులు టైమ్ ఇచ్చారు సంగవికి. 10 రోజుల్లో ఆ సర్టిఫికెట్‌ను ఇవ్వడానికి అధికారులు అంగీకరించకపోవడంతో సంగవి చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపు సంవత్సరం పాటు సంగవి తన కేస్ట్ సర్టిఫికెట్ కోసం పోరాటం చేసింది. చివరకు 2020 కరోనా సమయంలో కొందరు ఎన్జివో కార్యకర్తలు వారి బస్తీకి వెళ్లినప్పుడు సంగవి గురించి విని ఆమె పోరాటాన్ని పత్రికలకు తెలియచేశారు. దాంతో ఏకంగా మంత్రే ఆమెను కలిసి సర్టిఫికెట్ అందజేశాడు. ఆ తర్వాత ఆమెకు నీట్ రాయాలని ఉందని తెలుసుకున్న ఆ ఎన్జివో కార్యకర్తలు కోచింగ్ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ మార్కులు. తండ్రి కోరిక మలసార్ తెగలో తరతరాలుగా ఎవరూ చదువుకోలేదు. పది వరకు చదవడం గొప్ప. కాని సంగవి తండ్రి మునియప్ప ‘నువ్వు డాక్టర్వి కావాలమ్మా’ అని అనేవాడు. సంగవి ఇంటర్ చదువు ముగిశాక గత సంవత్సరం అతడు మరణించాడు. తల్లి వసంతమణికి చూపు సరిగా కనిపించదు. వాళ్లు ఉంటున్న ఇల్లు వానకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి ఇంట్లో ఉంటూ తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని పంతం పట్టింది సంగవి. ‘నా కోరిక విని నన్ను కోచింగ్‌లో చేర్చారు ఎన్జివో వాళ్లు. కోచింగ్ సెంటర్ వాళ్లు మెటీరియల్ ఇస్తే నేను దానిని ప్లాస్టిక్ కవర్లలో దాచి కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాన పడితే నా పుస్తకాలు తడిచిపోవడం ఆనవాయితీ’ అంది సంగవి. ఎస్టి సర్టిఫికెట్ కోసం సంగవి చేసిన పోరాటం వల్ల తమిళనాడులోని సంచార గిరిజనులకు ఒకటి రెండు రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు సంగవికి మార్కులు రావడం వల్ల వారి పేటను సందర్శిస్తున్న అధికారులు ఆ పేటకు ఇళ్ల పట్టాలు ఇస్తామని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వెళుతున్నారు. తీరని కష్టాలు నీట్లో సంగవికి వచ్చిన మార్కులకు ఎస్.టి కోటా వల్ల కాని తమిళనాడు ప్రభుత్వం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్ల వల్లగాని తప్పక సీట్ వస్తుందని భావిస్తున్నారు. ‘అయితే ఆ చదువు నేను చదవాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది కదా. స్టాలిన్ సార్ నన్ను ఆదుకుంటారని భావిస్తున్నా’ అని సంగవి అంది. చదువు ఇంకా అందని వర్గాలు చదువే గెలుపు అని తెలుసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయం గ్రహించారు. వారి చదువే వారిని గెలిపిస్తుంది. అలాంటి చదువు వల్లే అట్టడుగు వర్గాలు తప్పక వికాసంలోకి వస్తాయి. ‘మావాళ్లంతా ఇప్పుడు నన్ను చూసి చదువుకోవాలనుకుంటున్నారు’ అంటున్న సంగవి మాట ఆ ఆశనే కల్పిస్తోంది. -
నిట్ 2021 ఫలితాల్లో సత్తాచాటిన నారాయణ విద్యాసంస్ధలు
-
Telangana: నీట్ టాప్ ర్యాంకర్ మనోడే...
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్–2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించాడు. ఇతనితో పాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ కూడా 720 మార్కులకు గాను, 720 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. తెలంగాణ విద్యార్థికి నీట్లో టాప్ ర్యాంక్ దక్కడం ఇదే మొదటిసారి. కాగా తెలంగాణకే చెందిన ఖండవల్లి శశాంక్ ఐదో ర్యాంకు సాధించాడు. ఇతనికి 715 మార్కులు వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా టాప్ 20 ర్యాంకుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన బాలురు ఉండగా.. బాలికల టాప్ 20లో రాష్ట్రానికి చెందిన కాస లహరి (దేశవ్యాప్త ర్యాంకు 30), ఈమణి శ్రీనిజ (38), దాసిక శ్రీ నీహారిక (56), పసుపునూరి శరణ్య (60) ఉన్నారు. తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో నిలిచింది. ఈమె 143వ ఆల్ ఇండియా ర్యాంకు సా«ధించారు. ఎస్సీ కేటగిరీలో టాప్ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన మీస రోహిణ్ ప్రభు (451 ర్యాంకు) చోటు సంపాదించాడు. ఎస్టీ కేటగిరీలోని టాప్ 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన కేతవంత్ విజయ్‌చందర్ ఉన్నాడు. అతనికి జాతీయంగా 3,965 ర్యాంకు వచ్చింది. టాప్ ర్యాంక్ సాధించిన ముగ్గురికి కౌన్సిలింగ్ సమయంలో టై–బ్రేకింగ్ ఫార్ములాను అనుసరిస్తామని ఎన్టీఏ పేర్కొంది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in/ntaresults.nic.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు గతేడాది నీట్ కట్ ఆఫ్ 147 మార్కులుగా ఉంది. ఇప్పుడు అది 138కు తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కట్ ఆఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే, ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు ఆపై వచ్చినవారు గతేడాది ఈసారి కూడా ఒకేరకంగా ఉన్నారు. ఆ విధంగా మార్కులు సాధించినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాయాలి. ఇలా ఛాయిస్‌తో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ ఏడాది రెండు నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఈ కారణంగా చాలామంది నష్టపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 8,70,074 మందికి అర్హత సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో పలు నగరాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేల మంది దరఖాస్తు చేయగా, 97 శాతం మంది హాజరయ్యారు. చాలా రోజులకుగానీ ఫలితాలు విడుదల చేయలేదు. – దేశవ్యాప్తంగా 16,14,777 మంది నీట్ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 15,44,275 మంది హాజరయ్యారు. – అందులో బాలురు 7,10,979... బాలికలు 9,03,782 మంది ఉన్నారు. – మొత్తం పరీక్ష రాసినవారిలో ఓబీసీ కేటగిరీ వారు 42.97 శాతం మంది ఉన్నారు. – 202 పట్టణాలు, నగరాల్లో 3,858 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. – 8,70,074 మంది అర్హత సాధించారు. అందులో 4,94,806 మంది బాలికలు, 3,75,260 మంది బాలురు ఉన్నారు. 8 మంది ఇతరులు ఉన్నారు. అర్హత సాధించినవారిలో ఎక్కువగా ఓబీసీ కేటగిరీలో 3,96,772 మంది ఉన్నారు. ముందుగా విద్యార్థుల ఈ మెయిల్స్‌కు ఫలితాల సమాచారం పంపించారు. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్ నీట్ పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. – నీట్ ద్వారా అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేలోని జిప్మర్ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్ సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. – దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. – నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్ఐసీ.ఇన్’ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. – ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. – నీట్ స్కోర్ కార్డ్‌లో వ్యక్తిగత వివరాలు, సబ్జెక్ట్ వారీగా మొత్తం మార్కులు, పర్సంటైల్ స్కోర్లు, ఆలిండియా ర్యాంక్, అర్హత స్థితి ఉంటాయి. దాంతోపాటు నీట్ కట్–ఆఫ్ స్కోర్లు కూడా ప్రకటిస్తారు. మెడికల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడానికి తప్పనిసరిగా కనీస నీట్ కట్–ఆఫ్ మార్కులను పొందాలి. – నీట్ ఫలితాలను ప్రకటించిన తర్వాత, కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తరపున డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) ఆలిండియా కోటా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), డీమ్డ్/సెంట్రల్ యూనివర్శిటీల సీట్ల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. – కటాఫ్, అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఆలిండియా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. కట్–ఆఫ్ కంటే ఎక్కువ స్కోర్ చేసిన వారు ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌లో 15 శాతం సీట్లకు అర్హులు అవుతారు. 15 శాతాన్ని ఆలిండియా కోటా నీట్ ర్యాంక్ ఆధారంగా మాత్రమే భర్తీ చేస్తారు. 85 శాతానికి ప్రవేశం కోసం, రాష్ట్రాలు వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. – దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు– 83,075 బీడీఎస్ సీట్లు – 26,949 ఆయుష్ సీట్లు– 52,720 నీట్ పరీక్షలో పర్సంటైల్, కట్ ఆఫ్ మార్కు ప్రకారం అర్హులైనవారు కేటగిరీ పర్సంటైల్ కట్ ఆఫ్ మార్కు అర్హులైన విద్యార్థులు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జనరల్/ఈడబ్ల్యూఎస్ 50 720–138 7,70,857 ఓబీసీ 40 137–108 66,978 ఎస్సీ 40 137–108 22,384 ఎస్టీ 40 137–108 9,312 -
నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్/చిలకలపూడి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్లకు ర్యాంక్ కార్డులను పంపింది. 720కి 720 మార్కులు సాధించింది వీరే.. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in,http://taresults.nic.in/NTARESULTS&CMS/ వెబ్సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు.. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచ్చినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ ► నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ► అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ► దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ► నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. ► ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. కౌషిక్‌రెడ్డికి పలువురి అభినందన నీట్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. కౌషిక్‌రెడ్డి తిరుపతి భారతీయ విద్యాభవన్‌లో పదో తరగతి చదివి 500కు గానూ 488 మార్కులు సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 985 మార్కులు పొందాడు. సమాజ సేవ చేస్తా.. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్‌ను ఎంచుకున్నా. వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, నాన్న హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు. – మృణాల్ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ న్యూరాలిజిస్ట్గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి,Ðð వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్లో ప్రథమ ర్యాంకు సాధించాను. – చందం విష్ణువివేక్, నీట్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు న్యూరో ఫిజీషియన్ అవుతా మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్లో ఐదో ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతాను. న్యూరో ఫిజీషియన్ అవుతా. అమ్మ.. సీనియర్ లెక్చరర్‌గా, నాన్న.. బిజినెస్ మెడిక్యూర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. – ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్ చదవండి: మన పరీక్షలు ఎంత ‘నీట్’? -
నీట్ ఫలితాల ఆలస్యంపై విద్యార్థుల్లో ఆగ్రహం
సాక్షి, అమరావతి: నీట్–2021 ఫలితాలను వెల్లడించడంలో జరుగుతున్న జాప్యంపై అభ్యర్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మెడికల్, డెంటల్, ఆయుష్ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12వ తేదీన దేశ వ్యాప్తంగా ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఏటా ఈ పరీక్ష నిర్వహించాక నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. క్వశ్చన్ పేపర్ తారుమారు అయిందన్న కారణంతో ఇద్దరు విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ముంబయి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏన్టీఏ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ‘16 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం ఇది. ఆ ఇద్దరికి పరీక్ష నిర్వహించాక మొత్తంగా ఫలితాలు విడుదల చేసేందుకు ఆలస్యం అవుతుంది. ముంబయి హైకోర్టు తీర్పు పై స్టే విధిస్తే వెంటనే ఫలితాలు విడుదల చేస్తాం. నీట్ పరీక్ష ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి’ అని ఐదు రోజుల క్రితం సుప్రీంకోర్టుకు నివేదించింది. ‘వారిద్దరి సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఫలితాలు విడుదల చేయండి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో అదే రోజో.. మరుసటి రోజో ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు ఆశించారు. కనీసం ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఎన్టీఏ ప్రకటించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెద్ద ఎత్తున విద్యార్థులు విమర్శిస్తూ ట్విటర్లో ఎన్టీఏను ట్యాగ్ చేశారు. నీట్ ఫలితాల కోసం పలు రాష్ట్రాల్లో ఇతరత్రా అడ్మిషన్లు సైతం నిలిచిపోవడం గమనార్హం. -
నీట్ యూజీ ఫలితాల ప్రకటనకు సుప్రీం కోర్టు అనుమతి
-
నీట్ యూజీ ఫలితాల ప్రకటనకు సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ: నీట్ యూజీ ఫలితాలు ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఫలితాలు ప్రకటించొద్దన్న బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. తాజాగా.. నీట్ యూజీ ఫలితాలు ప్రకటించాలని ఎన్టీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: (నిట్‌లోని 750 సీట్లు ఫుల్) -
NEET UG 2021: నీట్ కటాఫ్ 460!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి గత నెలలో జరిగిన నీట్–21 పరీక్ష ఓఎంఆర్ ఆధారిత ప్రాథమిక కీ శుక్రవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ వెబ్సైట్లో కీని అందుబాటులో పెట్టింది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం తుది కీని విడుదల చేస్తారు. కాగా ఈనెల 20 నుంచి 22వ తేదీల మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాథమిక కీలో ఫిజికల్ సైన్స్ కేటగిరీలో ఒకట్రెండు మినహా మిగతావాటికి సమాధానాలు దాదాపు సరిగ్గానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కటాఫ్ తగ్గొచ్చు.. ఈ సారి ఎంబీబీస్ ప్రవేశాల్లో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతేడాది కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్న చివరి అభ్యర్థి మార్కులు 493కాగా, ఈ సారి పేపర్ తీరుతో కటాఫ్ మార్కులు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రాథమిక కీ ఆధారంగా ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కటాఫ్ మార్కులపై అంచనా వేశాయి. ఈ ఏడాది 460 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్: 40 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి, 4 దశాబ్దాల పాటు సంసార సాగరాన్ని ఈది, పిల్లలను పెంచి పెద్దచేసి, ప్రయోజకులను చేశాక ఎవరైనా సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ, ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ మాత్రం అలా అనుకోలేదు. డాక్టర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్సుని పక్కనబెట్టి కృషి చేశారు. ఎట్టకేలకు నీట్లో 175 మార్కులు పొంది, 5,94,380 స్కోరుని సాధించి, ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు. ప్రధాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. 1970లో ఇంటర్మీడియట్ అయిన తరువాత ఒకసారి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు. సీటు రాకపోవడంతో బీఎస్సీలో చేరారు. అయితే అప్పటి నుంచి తన కోరిక అసంపూర్ణంగానే ఉండిపోయింది. 15 ఏళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఇదే ప్రయత్నం చేయాలను కున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమని భావించారు. కూతుళ్ళిద్దరూ నీట్కి ప్రిపేర్ అవుతుండడంతో వారిని చదివిస్తూ తాను కూడా కృషిని కొనసాగించారు ప్రధాన్. 2019లో సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు వయోపరిమితిని తాత్కాలికంగా ఎత్తివేయ డంతో ఇది సాధ్యమైందంటారు ప్రధాన్. అయితే తన కూతుళ్ళలో ఒకరు ఇటీవల మృతి చెందడంతో ప్రధాన్ కుటుంబాన్ని విషాదం వీడలేదు. తన కూతురుకు గుర్తుగా ఈ చదువుని కొనసాగిస్తానంటున్నారు ప్రధాన్. -
నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల
సాక్షి, అమరావతి: నీట్లో రాష్ట్రస్థాయి ర్యాంకుల్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. టాప్ టెన్‌లో నలుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. మొదటి ర్యాంకు అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన గుత్తి చైతన్య సింధు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకర్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించిన కోటా వెంకట్ ఇక్కడ రెండో ర్యాంకు సాధించారు. రాష్ట్రం నుంచి సుమారు 62 వేల మంది నీట్‌కు హాజరయ్యారు. వీరిలో అన్ని కేటగిరీలు కలిపి 35,270 మంది అర్హత సాధించారు. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మాత్రమే అని, త్వరలోనే ఒరిజినల్ మెరిట్ లిస్టును ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీకి 147 కటాఫ్ మార్కులుగా నిర్ధారించారు. జనరల్ పీహెచ్ కేటగిరీకి 129, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు 113 కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. మెరిట్ జాబితా మేరకు త్వరలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలి ఐదు స్టేట్ ర్యాంకులు జనరల్ కేటగిరీ అభ్యర్థులే కాగా.. 6వ ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థికి దక్కింది. ఎస్సీ కేటగిరీకి చెందిన చక్రధర్ జాతీయ స్థాయిలో 39వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. టాప్ 100 ర్యాంకుల్లో 45 మంది అమ్మాయిలుండగా, 55 మంది అబ్బాయిలు ఉన్నారు. జీవోలు రాగానే అడ్మిషన్లు ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. కానీ ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. జీవోలు రాగానే ఆన్లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. – డాక్టర్ శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి పేర్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. రెండు వారాల కింద జాతీయస్థాయిలో నీట్ ర్యాంకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన తుమ్మల స్నికిత రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిచింది. రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో ముగ్గురు బాలికలు ఉండగా, మొదటి 50 స్థానాల్లో 29 మంది బాలురు ఉన్నారు. బాలికలు మాత్రం 21 మంది ఉన్నారు. రేపే నోటిఫికేషన్..: సాధారణంగా రాష్ట్ర స్థాయి ప్రాథమిక ర్యాంకులు వెల్లడించిన అనంతరం దరఖాస్తులు ఆహా్వనించి, అందులో నుంచి తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఈసారి ఇప్పటికే నీట్ నిర్వహణలో జాప్యం వల్ల వేగంగా ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ర్యాంకులతో పాటు ప్రవేశ ప్రకటన కూడా ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. వచ్చే నెల 1న ఆన్లైన్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ ప్రవేశాలకు ప్రకటన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈసారి ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టే అవకాశముంది. ఒకవేళ నేరుగా సరి్టఫికెట్లు పరిశీలించాల్సి వస్తే పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉండటంతో వచ్చే నెల 20న తొలి విడత మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. -
'నీట్' గందరగోళం.. మరో విద్యార్థిని బలి!
భోపాల్: వైద్యవిద్య ప్రవేశానికి నిర్వహిస్తున్న నీట్ పరీక్ష పలువురు విద్యార్థులను నిలువునా ముంచేసింది. పబ్లిక్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన వారికి నీట్లో సున్నా మార్కులు రావడంతో హతాశులయ్యారు. ఇదే కోవలోనే డాక్టర్ కావాలనుకున్న ఓ అమ్మాయికి నీట్ ఫలితాలు జీవితాన్ని ముగించేలా చేశాయి. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన విధి సూర్యవంశీ అనే అమ్మాయి నీట్లో మంచి మార్కులు వస్తాయని ఊహిస్తే ఫలితాల్లో కేవలం 6 మార్కులే రావడంతో షాక్‌కు గురైంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో విధి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే తమ కుమార్తెకు ఇంత తక్కువ మార్కులు వస్తాయని తల్లిదండ్రులు కూడా నమ్మలేకపోయారు. దీంతో వారు ఓఎమ్ఆర్ సీటును తెప్పించి చూడగా విధి 720కి గానూ 590 మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైనట్లు తేలింది. విధి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. (నీట్ గందరగోళం.. టాపర్‌ని ఫెయిల్ చేశారు) కాగా.. నీట్ 2020 ఫలితాలను అక్టోబర్ 16న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన సోయెబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్షసింగ్ నీట్ ఎంట్రన్స్ 2020లో 720 మార్కులకు గానూ 720 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు. ఆలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.57 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. (సున్నా మార్కులు.. కోర్టులో పిటిషన్) -
జ్ఞానదుర్గమ్మలు
దుర్గాశక్తికి ప్రతిరూపం సరస్వతీదేవి. సరస్వతీదేవి స్వరూపాలు.. ఈ తొమ్మిదిమంది ‘నీట్’ టాపర్లు. ఆకాంక్ష.. స్నికిత.. అమ్రిష చైతన్య.. ఆయేష.. సాయి త్రిష మానస.. లులు.. ఇషిత.. ప్రతికూలతలను జయించి.. విజయం సాధించిన జ్ఞానదుర్గమ్మలు. ఈ ఏడాది సెప్టెంబరు 13, 14 తేదీలలో ‘నీట్’ పరీక్ష రాసిన 13 లక్షల 60 వేల మంది అభ్యర్థుల అందరి లక్ష్యం ఒక్కటే. మంచి కాలేజ్‌లో మెడిసిన్‌లో సీటు సాధించడం. లక్ష్యం ఒక్కటే కానీ, లక్ష్యాన్ని చేరుకునేందుకు చేసిన సాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం. ఎవరి పరిస్థితులు వారివి. అననుకూలతలు, అవరోధాలు, అవాంతరాలను దాటుకుని పరీక్ష రాసే తేదీ వరకు వచ్చినవారే అంతా. చివరి నిముషంలో పరీక్ష హాలును చేరలేక ఒక ఏడాదిని కోల్పోయిన వారూ ఉన్నారు. ఈసారి పరీక్ష రాసినవాళ్లలో సగానికన్నా ఎక్కువ సంఖ్యలోనే అమ్మాయిలు ఉన్నారు. 8 లక్షల 80 వేల మంది! సాధారణంగా అబ్బాయిలతో పోల్చి చూస్తే ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెస్ట్ టెస్ట్) ప్రిపరేషన్‌కు అమ్మాయిలే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. వాళ్లకున్నన్ని అనుకూలతలు వీళ్లకు ఉండవు. నీట్లో టాపర్ నే చూడండి, ఢిల్లీ అమ్మాయి ఆకాంక్ష రోజుకు నూట నలభై కి.మీ. దూరం కోచింగ్‌కి వెళ్లొచ్చింది! ఆమె తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే కూతురి మెడిసిన్ కోచింగ్ కోసం భారత సైన్యంలోని తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, గ్రామం నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని మార్చారు ఆమె తండ్రి. ఆకాంక్షతో పాటు బాలికల్లో తొమ్మిది తొలి స్థానాల్లో ర్యాంకు సాధించిన స్నికిత, అమ్రిష, చైతన్య, ఆయేష, సాయి త్రిష, మానస, లులు, ఇషిత కూడా ప్రిపరేషన్లో ఏదో ఒక ప్రతికూలతను ఎదుర్కొని విజయం సాధించిన జ్ఞాన దుర్గమ్మలే. ఆకాంక్షా సింగ్ తర్వాతి స్థానం తుమ్మల స్నికితది. ఆమె ఆలిండియా ర్యాంకు 3. వీళ్లది వరంగల్. ఆకాంక్ష పేరెంట్స్లానే స్నికిత పేరెంట్స్ కూడా కూతురి కాలేజ్‌కి దగ్గరగా ఇల్లు చూసుకున్నారు. స్నికితకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంత చదివినా గుర్తుండేవి కావు. ఒత్తిడి పెరిగేది. ఆ ఒత్తిడిని తట్టుకోడానికి పాటలు వినేది. అమ్మమ్మకు ఫోన్ చేసి మాట్లాడేది. అమ్మాయిల్లో మూడో స్థానంలో నిలిచిన అమ్రిష ఖైతాన్ ర్యాంకు 5. తండ్రి, తల్లి, తాతయ్య, అన్నయ్య ఇంట్లో అంతా డాక్టర్లే. ‘నువ్వూ డాక్టర్ కావాలి’ అని బంధువుల నుంచి ఆమ్రిషకు ఒత్తిడి ఉండేది. వాళ్ల ఒత్తిడి ‘ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేయాలి అమ్మాయ్’ అని! అయితే ఆ మాటను తను ఒత్తిడిగా కాక, ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను అంటుంది అమ్రిష. ఆలిండియా 6వ ర్యాంకు పొంది, అమ్మాయిల్లో నాలుగో స్థానం పొందిన ఏపీ విద్యార్థిని చైతన్య సింధు ఇంట్లో కూడా అంతా డాక్టర్లే. బయాలజీ కోసం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది తను. ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటి మీద బెంగ ఉండేది. అంతా ఉండేది విజయవాడే అయినా, తను ఉండటం హాస్టల్లో. ఆ బెంగ పోగొట్టడానికి పేరెంట్స్ వచ్చిపోతుండేవారు. సింధు తర్వాత ఐదో స్థానం ఆయేషాది. 12వ ర్యాంకు. కేరళ అమ్మాయి. తండ్రి యు.ఎ.ఇ.లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. గత ఏడాది ఫస్ట్ అటెంప్ట్‌లో ఆయేషా సీటు సంపాదించ లేకపోయింది. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుతో ఒత్తిడికి లోనయింది. 14వ ర్యాంకు సాధించిన సాయి త్రిషకు అమ్మాయిల్లో ఆరో స్థానం. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి, న్యూరోసర్జన్ అవాలని ఆమె లక్ష్యం. ఎయిమ్స్‌లో సీటు వచ్చేంత ర్యాంకును తెచ్చుకోగలనా అని కొంత ఆందోళనకు గురైంది. టీచర్స్, పేరెంట్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అమ్మాయిల్లో త్రిష తర్వాత ఏడో స్థానం మానసది. ఆమె ర్యాంకు 16. రోజుకు 12 గంటలు ప్రిపేర్ అయినా, అది సరిపోదేమోనని ఆమె సందేహం. 8, 9 స్థానాల్లో లులు (కేరళ), ఇషిత (పంజాబ్) ఉన్నారు. లులు కు 22వ ర్యాంకు, ఇషితకు 24 ర్యాంకు. ఆయేషాలానే లులుకు కూడా ఇది సెకండ్ అటెంప్ట్. ఇంకో అటెంప్ట్ చేయకూడదన్న పట్టుతో కూర్చొని చదివింది. ఇషితకు ఫస్ట్ అంటెప్ట్లోనే కొట్టేయాలనే పట్టు. ‘సీటు వస్తుందంటావా.. వస్తుందంటావా’ అని తల్లిని సతాయిస్తుండేది. ‘అమ్మ నా గైడింగ్ ఏంజెల్’ అంటుంది ఇషిత. -
సున్నా మార్కులు.. కోర్టులో పిటిషన్
ముంబై: నీట్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం గురించి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టూడెంట్‌ని ఫెయిల్ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో విద్యార్థిని తనకు సున్నా మార్కులు వచ్చాయి.. మాన్యువల్‌గా పేపర్ కరెక్షన్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. వివరాలు..మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని వసుంధర భోజనే నీట్లో 720 మార్కులకు గాను సున్నా(0) మార్కులు సాధించినట్లు రిజల్ట్‌లో చూపించింది. కనీసం 650 మార్కులు వస్తాయని భావించిన ఆమె సున్నా మార్కులు రావడంతో షాక్‌కు గురయ్యింది. దాంతో తన పేపర్ని రీ వాల్యూయేషన్ చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (చదవండి: సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్ కాలేదు, ఎందుకు?) బొంబాయి హైకోర్టు సోమవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించి నోటీసులు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఇక విద్యార్థి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ‘వసుంధర మెరిట్ స్టూడెంట్. బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. ఈ పరీక్షలో కనీసం 650 మార్కులు వస్తాయని భావించింది. కానీ సున్నా మార్కులు వచ్చాయి. ఆన్లైన్ టెస్టింగ్ విధానంలోని లోపాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. అందుకే మాన్యువల్‌గా రీవాల్యూయేషన్ చేయాలని కోరుతున్నాం’ అన్నారు. అయితే నీట్ పరీక్షలో రీవాల్యూయేషన్ చేసే విధానం లేదు. అందుకే పరీక్షకు హాజరయిన విద్యార్థులు సమర్పించిన ఓఎంఆర్ షీట్‌ను ఎన్టీఏ అప్లోడ్ చేస్తుంది, ఆన్సర్ కీ కూడా ఇస్తుంది. తమిళనాడులోని ఇద్దరు విద్యార్థులు కూదా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. -
నీట్ గందరగోళం.. టాపర్‌ని ఫెయిల్ చేశారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇప్పటికే ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో విమర్శలు వస్తుండగా.. తాజాగా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ప్రకటించినట్లు తెలిసింది. వివరాలు.. 17 ఏళ్ల రావత్ రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16 న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏటీఏ) జారీ చేసిన మొదటి మార్క్‌షీట్ ప్రకారం అతడు ఫెయిల్ అయినట్లు వచ్చింది. 720 మార్కులకు గాను మృదుల్‌కు 329 పాయింట్లు ఇచ్చింది. దాంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేశాడు. ఈ క్రమంలో అతడి ఓఎంఆర్ షీట్, ఆన్సర్ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్ అని తేలింది. జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. (చదవండి: ఎన్నదగిన తీర్పు) అయితే, ఎన్టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా మరో పొరపాటును గుర్తించారు. దానిలో, అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు. అలానే ఫస్ట్ ర్యాంకు విషయంలో కూడా విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ ఇద్దరు ఆవుట్ ఆఫ్ మార్కులు సాధించారు. కానీ ఎన్టీఏ టై బ్రేకింగ్ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది. -
నీట్లో మెరిసిన తెలుగుతేజం
సాక్షి, నరసాపురం: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్హత ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో నరసాపురం చినమామిడిపల్లికి చెందిన జొన్నల బాల శివరామకృష్ణ ద్వితియ ర్యాంక్ సాధించాడు. ఈడబ్ల్యూఎస్ కేటగిరి జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన శివరామకృష్ణ ఓపెన్ కేటగిరిలో 26వ ర్యాంకును కైవసం చేసుకుని ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్‌లో సిటును దక్కించుకున్నాడు. నీట్ మొత్తం 720 మార్కులకు గాను శివరామకృష్ణ 705 మార్కులు సాధించాడు. నర్సాపురంలోని మత్స్యపురి గ్రామానికి చెందిన శివరామకృష్ణకు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: నీట్లో తెలుగుతేజం) -
సమాన మార్క్‌లు కానీ ఆమె టాపర్ కాలేదు, ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్ నీట్-2020 పరీక్షలలో టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతనికి నీట్లో 720 కి 720 మార్క్‌లు వచ్చాయి. అయితే అతనితో సమానంగా ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ కూడా ఫుల్ మార్క్ తెచ్చుకుంది. ఇద్దరికి సరిసమానమైన మార్క్‌లు వచ్చినప్పటికి సోయబ్ టాపర్‌గా నిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే నీట్ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారికి ర్యాంక్ కేటాయించేటప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదటగా పరిశీలించేది వారి బయాలజీ మార్క్‌లు, అక్కడ కూడా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వస్తే రసాయన శాస్త్రంలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూస్తారు. ఆ తరువాత ఎవరికి ఎక్కువ నెగిటివ్ మార్క్‌లు వచ్చాయో పోలుస్తారు. అప్పటకి ఇద్దరు సమానంగా ఉంటే వయసును లెక్కిస్తారు. ఈ ఏడాది నీట్ టాపర్స్ ఇద్దరు అన్నింటిలో సమానంగా మార్క్‌లు తెచ్చకున్నప్పటికి ఆకాంక్ష సింగ్ సోయబ్ కంటే చిన్నది. అందుకే పెద్ద వాడు అయిన సోయబ్‌నే ఆల్ ఇండియా నీట్ ర్యాంకర్ 1 గా ప్రకటించారు. ఇలా ఇద్దరికి సమానమైన మార్క్‌లు వచ్చినప్పుడు వారి వయసులను పరిశీలించి ఎవరు పెద్దవారైతే వారికే మొదటి ర్యాంక్‌ను కేటాయిస్తారు. ఈ కారణంగానే సోయబ్ టాపర్‌గా నిలిచాడు. చదవండి: నీట్ ఫలితాల వెల్లడి -
నీట్లో తెలుగుతేజం
సాక్షి, అమరావతి/తెనాలి: తెనాలికి చెందిక గుత్తి చైతన్య సింధు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్లో సత్తా చాటింది. శుక్రవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో సింధు జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించగా, ఉమెన్ కేటగిరీలో 4వ ర్యాంకు సొంతం చేసుకుంది. అదేవిధంగా ఏపీలో మొదటి ర్యాంకర్‌గా నిలిచింది. నీట్లో 720 మార్కులకుగాను సింధూకు 715 మార్కులు వచ్చాయి. అలాగే కొట్టా వెంకట్ జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించగా, భవం మానస 16వ ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో టాప్ 50లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 8 మంది ఉన్నారు. 62,051 నీట్‌కు నమోదు చేసుకోగా 57,721 మంది పరీక్ష రాశారు. ఇందులో 33,841 (58.63 శాతం) మంది అర్హత సాధించారు. టాప్–10లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు నీట్లో హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు, తెలంగాణలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. టాప్ 10 జాతీయ ర్యాంకుల్లో ఆ రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు. డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకుని.. ఎంసెట్ (మెడికల్/అగ్రికల్చర్)లో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో మెరిసిన తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు నీట్లో జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. తన తల్లిదండ్రుల్లాగే డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకునే అవకాశం దక్కించుకుంది. తెనాలికి చెందిన ప్రముఖ వైద్యుడు, స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం మనుమరాలైన చైతన్య సింధు తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తండ్రి.. డాక్టర్ కోటేశ్వరప్రసాద్ ఈఎన్టీ, ఎనస్థీషియా నిపుణుడు కాగా తల్లి డాక్టర్ సుధారాణి గైనకాలజిస్ట్. సింధు.. టెన్త్‌లో ఏ1 గ్రేడ్‌తో, ఇంటర్లో 98 శాతంతో ఉత్తీర్ణురాలైంది. -
తెలంగాణ బిడ్డకు మూడో ర్యాంకు..
సాక్షి, హైదరాబాద్: జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–2020) ఫలితాలు శుక్రవారం విడుదల య్యాయి. హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. కాగా, నీట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. టాప్ 15 జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు. ఆలిండియా ర్యాంకుల్లో బాలురు అగ్రస్థానంలో నిలిచారు. తొలి 50 ర్యాంకుల్లో 31 ర్యాంకులను బాలురే దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి నీట్లో అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు ), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు. బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటాకు 467 సీట్లు.. తెలంగాణ నుంచి ఆలిండియా కోటాకు 467 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తారు. ఆలిండియా కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు ఇస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. గతేడాది కంటే పెరిగిన మార్కులు.. గతేడాది కంటే మార్కులు పెరిగాయి. గతేడాది 500 మార్కులు వస్తే ఆలిండియా స్థాయిలో 35 వేల నుంచి 40 వేల ర్యాంకులు వచ్చాయి. ఈసారి అదే మార్కులకు 90 వేల వరకు ర్యాంకు వెళ్లింది. గతేడాది ఆలిండియా స్థాయిలో 40 వేలు ఉన్నవారికి కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చాయి. ఈసారి 70 వేలకు పైగా ఆలిండియా ర్యాంకు ఉన్నవారికి కూడా కన్వీనర్ కోటా సీటు వస్తుంది. ఆలిండియా స్థాయిలో 70 వేల ర్యాంకు అయితే, రాష్ట్ర స్థాయిలో 2 వేల లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది జనరల్‌లో కటాఫ్ మార్క్ 134 ఉంటే, ఈసారి 147 కటాఫ్ అర్హత మార్కు వచ్చింది. రిజర్వేషన్లో గతేడాది 107.. ఈసారి 113 కటాఫ్ మార్క్ ఉంది. గతేడాది టాప్ ర్యాంకు మార్కు 701 ఉండగా, ఇప్పుడు 700పైన 100 మంది ర్యాంకులు సాధించిన వారున్నారు. మూడు నెలలు సమయం దొరకడం వల్ల చదువుకోవడానికి వీలు కలిగింది. అయితే పరీక్ష జరగదన్న భావనతో కొందరు విద్యార్థులు ఉండటమే తక్కువ మంది అర్హత సాధించడానికి ప్రధాన కారణమని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు అభిప్రాయపడ్డారు. ♦ఆలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.57 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ♦మొత్తం 11 భాషల్లో నిర్వహించిన పరీక్షకు ఇంగ్లిష్‌లో 12,63,273 (79.08 శాతం) మంది రాయగా, తెలుగులో 1,624 (0.10 శాతం) మంది రాశారు. ♦తెలంగాణలో 54,872 మంది నమోదు చేసుకోగా, 50,392 మంది హాజరయ్యా రు. వీరిలో 24,767 (49.15 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 67.44 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ♦అత్యధికంగా చండీగఢ్‌లో 75.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా నాగాలాండ్‌లో 40.50 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రజలకు సేవ చేస్తా.. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతాను. నాన్న డాక్టర్ సదానందరెడ్డి, కార్డియాలజిస్ట్, అమ్మ డాక్టర్ లక్ష్మి, గైనకాలజిస్టు. మా సొంతూరు నిజామాబాద్ జిల్లా పోచంపాడు దగ్గర వెల్కలూరు గ్రామం. మూడో ర్యాంకు రావడంపై చాలా సంతోషంగా ఉంది. మెడికల్ కోర్సు చేశాక ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని తెలిపారు. – తుమ్మల స్నిఖిత (3వ ర్యాంకు) ఎయిమ్స్‌లో చదువుతా.. నాన్న డాక్టర్ నారాయణ, అమ్మ ఆర్యా నారాయణ. వీరిద్దరే నాకు ఆదర్శం. జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతాను. న్యూరాలజీలో స్పెషాలిటీ చేయాలనుకుంటున్నా. – బి.అనంతపరాక్రమ(11వ ర్యాంకు), బోడుప్పల్ న్యూరోసర్జన్ అవుతా.. అమ్మానాన్న బీఆర్‌ఎన్‌రెడ్డి, అనంతలక్ష్మి. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరుతాను. న్యూరోసర్జన్‌గా సేవలు అందించాలనేదే నా లక్ష్యం. – బి.సాయి త్రిషారెడ్డి (14వ ర్యాంక్), బీరంగూడ పేదలకు సేవలందిస్తా.. నాన్న ఆవుల తేజోవర్ధన్, అమ్మ సంగీత, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పేదలకు వైద్య సేవలు అందించాలన్నదే నా ధ్యేయం. – సుభాంగ్ యాదవ్ (38వ ర్యాంకు) -
నేడే ‘నీట్’
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షాకేం ద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఎప్పుడు పరీక్షాకేంద్రానికి రావాలో ముందేవారికి మెసేజ్‌లు పంపించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకేసారి రాకుండా నివారించాలనేది ఉద్దే శం. జ్వరం ఉందో లేదో ప్రవేశద్వారం వద్ద ఒక్కో అభ్యర్థిని పరిశీలించి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమ వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, నీళ్ల బాటిళ్లనుఅనుమతిస్తారు. తెలంగాణ నుంచి ఈ ఏడాది 55,800 మంది నీట్‌కు హాజరు కానున్నారు. ఒక్కో గదిలో కేవలం 12 మంది ఉండేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్ రాసే విద్యార్థులకు డ్రెస్‌కోడ్ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు(బురఖా వంటివి) ఓ గంట ముందే పరీక్షా కేంద్రా లకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల హాల్ టికెట్లో మూడు పేజీలుంచి, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా ఉంచారు. నీట్ ఫలితాలు వచ్చే నెల రెండోవారంలో వస్తాయని ఎన్టీఏ ప్రకటించింది. -
25 మార్కులకే పరీక్ష
తాడేపల్లిగూడెం: మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 25 మార్కులకు పరీక్షలు రాస్తే చాలు.. పై తరగతికి ప్రమోట్ కావచ్చు.. సరళంగా ప్రశ్నలు ఉంటాయి.. గంట సమయం ఇస్తారు.. ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.. ఇది ఏపీ నిట్ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో ఇస్తున్న బంపరాఫర్. ఏదైనా కారణాల వల్ల ఆన్లైన్ పరీక్షలు రాయకపోతే, కళాశాల ప్రారంభమయ్యాక 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా పరీక్షలను పూర్తిగా రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 29 నుంచి పరీక్షలు ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్‌ను నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు సోమవారం ప్రకటించారు. ఈనెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. పేపర్‌కు 100 మార్కులకు గాను ఇంటర్నల్స్‌కు 35 మార్కులు, మిడ్ సెమిస్టర్ పరీక్షలకు 40 మార్కులు ఇస్తారని, మిగిలిన 25 మార్కులకు మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో గంటపాటు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆఖరి ఏడాది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, దీంతో మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక పద్ధతిలో అవకాశం కల్పించామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞాన విధానంలో పరీక్షల ఫార్ములాను తయారు చేయడం వల్ల అవకతవకలకు అవకాశం లేదన్నారు. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో ప్రత్యేక ఫార్ములాతో పరీక్షలు నిర్వహించేది ఏపీ నిట్ మాత్రమే అని డైరెక్టర్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షలు రాసే అవకాశం వినియోగించుకోలేని విద్యార్థులకు కళాశాల తెరిచిన తర్వాత 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్షలు వద్దు: విద్యార్ధులు కరోనా నేపథ్యంలో పలు జాతీయ విద్యాసంస్థలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయని.. ఇదే విధానాన్ని ఏపీ నిట్ కూడా అనుసరించాలని విద్యార్థులు కోరుతున్నారు. 40 శాతం మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సమస్యలు కారణంగా ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు లేదన్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు నిట్ డైరెక్టర్‌కు వినతుల రూపంలో తెలియజేశారు. మానసిక ఒత్తిడి, ఆవేదనలో ఉన్నామని, ఈ తరుణంలో పరీక్షలకు సన్నద్ధం కాలేమని చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో పరీక్షలు రద్దు కోవిడ్–19 నేపథ్యంలో జాతీయ విద్యాసంస్థలు సెమిస్టర్ పరీక్షలను రద్దు చేశాయి. ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వరంగల్ నిట్, నిట్ కురుక్షేత్ర, రూర్కెలా, షిబ్పూర్, నిట్ సిల్చర్, నిట్ అగర్తలా వంటివి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి. -
పీజీ నీట్ పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ–2020 ఫలితాలను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) శుక్రవారం విడుదల చేసింది. పరీక్ష రాసిన వారిలో 55% మంది ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా 1,67,102 మంది నీట్ పీజీ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,60,888 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 89,549 మంది ఉత్తీర్ణులైనట్లు ఎన్బీఈ ప్రకటించింది. రాష్ట్రం నుంచి దాదాపు 10 వేల మంది వరకు పరీక్ష రాసి ఉంటారని కాళోజీ హెల్త్ వర్సిటీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారన్న విషయం తమకు ఇంకా సమాచారం రాలేదని వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ నెల 3వ తేదీ నాటికి ప్రతీ విద్యార్థి స్కోర్ కార్డును ఎన్బీఈ అప్లోడ్ చేస్తుంది. ఈ నెలలోనే ఆలిండియా స్థాయిలో పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే, రాష్ట్రంలో మార్చి 15 నుంచి మొదలవుతుందని వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 1,200 మార్కులకు నీట్ పీజీ పరీక్ష నిర్వహించారు. అందులో జనరల్ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్–ఆఫ్ 366, జనరల్ పీహెచ్ అభ్యర్థులకు 342, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ 319గా నిర్ధారించారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,624 వరకు పీజీ వైద్య విద్య సీట్లున్నాయి. ఒక్క ప్రభుత్వ వైద్య విద్య కాలేజీల్లోనే 760 సీట్ల వరకు ఉన్నాయి. ఇటీవలే నిజామాబాద్ మెడికల్ కాలేజీకి 54 పీజీ సీట్లు వచ్చాయి. వాటిలో కూడా ఈ సంవత్సరం నుంచే ప్రవేశాలుంటాయని అధికారులు చెప్పారు. కాగా, గత జనవరి 5వ తేదీన జరిగిన ఈ నీట్ పీజీ పరీక్షలో తమిళనాడు నుంచి ఎక్కువ మంది అర్హత సాధించారు. అయితే పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తప్పు అని తేలడంతో అభ్యర్థులందరికీ ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు లభించాయి. ఆ ప్రశ్నకు సమాధానం రాసినా, రాయకపోయినా అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు ఇచ్చినట్లు ఎన్బీఈ ప్రకటించింది. -
నాలాగ ఎంతోమంది ఉన్నారు: ఉదిత్ సూర్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్‌గా పరీక్ష రాసి వైద్య విద్యను అభ్యసించాల్సిన విద్యార్దులు వక్రమార్గాన్ని ఎన్నుకుని ఎట్టకేలకు దొరిపోతున్నారు. తప్పుటడుగులు వేస్తున్న తమ పిల్లలను సరిదిద్దాల్సిన తండ్రులే తప్పిదాలకు పోయి పోలీసులకు చిక్కిపోతున్నారు. నీట్ పరీక్ష మోసంలో తాజాగా ఒక విద్యార్ది, ఇద్దరు విద్యార్దులు తమ తండ్రులతో సహా మొత్తం ఆరుగురు జైలుపాలయ్యారు. దీంతో నీట్ మోసం వ్యవహారంలో అరెస్ట్‌ల సంఖ్య తొమ్మిదికి చేరింది. కష్టపడి చదివి నీట్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యం పక్కదోవపట్టగా చెన్నైకి చెందిన ఉదిత్ సూర్య అనే విద్యార్దిని, అతడి తండ్రి డాక్టర్ వెంకటేశన్‌ను సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, పోలీసుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ఉదిత్ సూర్య తనలాగ ఎందరో అని చెప్పడం అధికారులను కలవరానికి గురిచేసింది. మరి కొందరు విద్యార్దులు సైతం నకిలీ విద్యార్ది చేత నీట్ పరీక్ష రాయించి వైద్యసీటు సంపాదించారని సీబీసీఐడీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వారు ఎవరెవరో కూడా చెప్పడంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. చెన్నైకి చెందిన విద్యార్దిని అభిరామి, విద్యార్దులు ప్రవీణ్, రాహుల్ సైతం ఉదిత్ సూర్య తరహాలో మరోవ్యక్తి చేత పరీక్ష రాయించి సీటు సంపాదించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. విద్యార్దిని అభిరామి తిరుప్పోరూరు సమీపం అమ్మాపేటలోని సత్యసాయి వైద్య కళాశాలలో, విద్యార్దులు ప్రవీణ్ క్రోంపేటలోని బాలాజీ వైద్య కళాశాలలో, రాహుల్ కాంట్రాకొళత్తూరులోని ఎస్ఆర్ఎమ్ వైద్యకళాశాలలో చదువుతున్నారు. ఉదిత్ సూర్య తండ్రి డాక్టర్ వెంకటేశన్ లాగానే ఈ ముగ్గురు విద్యార్దులు తండ్రులు సైతం తమ పిల్లల కోసం మోసానికి పాల్పడ్డారు. ప్రవీణ్ తండ్రి రూ.23 లక్షలు చెల్లించాడు. మిగిలిన ఇద్దరు రూ.20 లక్షలు చొప్పున ఇచ్చుకున్నారు. ఈ ముగ్గురు విద్యార్దుల తండ్రులు బ్రోకర్‌కే డబ్బులు ఇచ్చుకున్నారు. అభిరామి తండ్రి మాధవన్, ప్రవీణ్ తండ్రి శరవణన్, రాహుల్ తండ్రి డేవిస్‌లను సైతం సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురినీ తేనీ సీబీసీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించగా మోసానికి పాల్పడినట్లు అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఆరుగురినీ శనివారం ఉదయం 11 గంటలకు తేనీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. నీట్ మోసం కేసులో ఇప్పటి వరకు నలుగురు విద్యార్దులు, నలుగురు తండ్రులు లెక్కన మొత్తం ఎనిమిది మందిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఉదిత్ సూర్యకు సహకరించిన నీట్ బ్రోకర్ జార్జ్జోసెఫ్ను కేరళలో రెండురోజుల క్రితం అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన రబీ, తమిళనాడు వానియంబాడికి చెందిన మహమ్మద్ షఫీ అనే మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేసేందుకు సీబీసీఐడీ సిద్దం అవుతోంది. కాగా ఇర్ఫాన్ అనే మరో విద్యార్ది సైతం ఇదే తరహా మోసంతో వైద్యసీటు సంపాదించినట్లు అధికారులకు సమాచారం అందండంతో విచారణ జరుపుతున్నారు. -
నీట్లో సత్తా చాటిన సందీప్
సాక్షి, పాతగుంటూరు: గుంటూరు అరండల్‌పేటకు చెందిన డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ నీట్ సూపర్ స్పెషాలిటీ విభాగం ఎండోక్రెనాలజీ కోర్సులో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈ పరీక్ష ఫలితాలు జూలై16న విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 1,513 మంది వైద్యులు పరీక్షలు రాయగా, 340 మార్కులతో సందీప్ మూడో ర్యాంకు సాధించారు. 2007లో ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు. ఆప్తమాలజీ, సర్జరీ విభాగాలలో మెరిట్ సర్టిఫికెట్లు పొందారు. 2014లో పీజీ ఎంట్రన్స్‌లో తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి ఎండీ జనరల్ మెడిసిన్‌ను ఎంచుకున్నారు. పీజీ అనంతరం 2017, 2018లో జరిగిన నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ తాను కోరుకున్న ఎండోక్రెనాలజీ అంశంలో కశ్మీర్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అదే లక్ష్యంతో పరీక్ష రాసిన సందీప్ ఈసారి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. -
‘నీట్’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాష్ట్ర స్థాయి ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33,936 మంది రాష్ట్రం నుంచి నీట్–2019లో అర్హత సాధించారు. ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న జాతీయ స్థాయిలో నీట్ అర్హత పరీక్షను నిర్వహించగా, జూన్ 5న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు, మహిళ విభాగంలో ఒకటో ర్యాంకు సాధించిన జి.మాధురిరెడ్డి.. 720 మార్కులకు గాను 695 మార్కులతో తెలంగాణ టాపర్‌గా నిలిచింది. తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మొదటి వేయి ర్యాంకుల్లో 43 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు. కాగా శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలను అభ్యర్థుల వారీగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పెట్టినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అన్‌రిజర్వుడు కోటా కింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అర్హులని.. ప్రస్తుత ర్యాంకుల జాబితాలో వారు కూడా చేరితే.. ర్యాంకుల్లో మార్పు ఉంటుందని తెలిపింది. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించింది. ర్యాంకులిలా.. శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో.. మొదటి వేయి ర్యాంకుల లోపు తెలంగాణకు చెందిన 43 మంది విద్యార్థులు ఉన్నారు. 2 వేల ర్యాంకుల్లోపు 69, 5 వేల ర్యాంకుల్లోపు 149, 10 వేల ర్యాంకుల్లోపు 289, 20 వేల ర్యాంకుల్లోపు 600, 25 వేల ర్యాంకుల్లోపు 793, 30 వేల ర్యాంకుల్లోపు 967, 35 వేల ర్యాంకుల్లోపు 4,148 మంది అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే 720 మార్కులకు గాను 107 మార్కులను ఈ ఏడాది నీట్ కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో 134 మార్కులు, దివ్యాంగులకు 120, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు. -
నీట్ 2019 ఫలితాలు విడుదల
-
నీట్ టాపర్ నళిన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)– 2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నెల 5వ, 20వ తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్తాన్‌కు చెందిన నళిన్ ఖండేల్వాల్ తొలి ర్యాంకును సొంతం చేసుకున్నారు. మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా, నళిన్ 701 మార్కులు సాధించారు. అలాగే ఢిల్లీకి చెందిన భవిక్ బన్సల్ రెండో ర్యాంకు, ఉత్తర ప్రదేశ్ విద్యార్థి అక్షత్ కౌశిక్ మూడో ర్యాంకు పొందారు. పరీక్షలో అన్ని సబ్జెక్ట్‌లను కలిపి చూసినప్పుడు వీరిద్దరికీ సమానంగా 700 మార్కులే వచ్చినప్పటికీ, జీవశాస్త్రంలో కౌశిక్ కన్నా భవిక్‌కు ఎక్కువ మార్కులు రావడంతో రెండో ర్యాంకును భవిక్‌కు కేటాయించారు. ఇక అమ్మాయిల వరకు చూస్తే తెలం గాణకు చెందిన జి.మాధురీ రెడ్డి టాపర్‌గా నిలిచారు. 695 మార్కు లతో అఖిల భారత స్థాయిలో ఆమె ఏడవ ర్యాంకు సాధించారు. వికలాంగుల కేటగిరీలో రాజస్తాన్‌కు చెందిన భేరారాం 604 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. నీట్లో టాప్–10లో నాలుగు ర్యాంకులు రాజస్తాన్ వాళ్లకు, టాప్–50లో 9 ర్యాంకులు ఢిల్లీ వాళ్లకు దక్కాయి. ఢిల్లీ నుంచి పరీక్షకు హాజరైన వారిలో 74.9 శాతం మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా చూస్తే అర్హత సాధించిన వారి శాతం 56.5 మాత్రమే కావడం గమనార్హం. భవిక్‌కు రెండో ర్యాంకు రాగా, 695 మార్కులు సాధించిన మిహిర్ రాయ్‌కి 9వ ర్యాంకు దక్కింది. 685 మార్కులు తెచ్చుకున్న విశ్వ రాకేశ్ 38వ ర్యాంకును పొందారు. కామెడీ వీడియోలు చూసేవాణ్ని: భవిక్ దీర్ఘకాలంపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం తాను యుట్యూబ్లో స్టాండప్ కామెడీ వీడియోలు చూసే వాడినని నీట్ ద్వితీయ ర్యాంకర్ భవిక్ బన్సల్ చెప్పాడు. ఫలితాల్లో టాప్–10లో ఏదో ర్యాంకు వస్తుందని తాను అనుకున్నాననీ, కానీ రెండో ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదని భవిక్ ఆశ్చర్యంతో అన్నాడు. తాను ఇంట్లోనే కూర్చొని నీట్‌కు చదువుకున్నాననీ, తన తల్లిదండ్రులు తనను బాగా ప్రోత్సహించి, మద్దతుగా నిలిచారని తెలిపాడు. భవిక్ తల్లిదండ్రులిద్దరూ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి అకౌంట్స్ ఆఫీసర్ కాగా, తల్లి భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు. ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు భవిక్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఈ పోటీలో టాప్–35లో నిలిస్తే హంగేరీలో జరిగే పోటీకి భారత్ నుంచి భవిక్ వెళ్తాడు. అభినందనలు తెలిపిన హెచ్ఆర్డీ మంత్రి నీట్లో అగ్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందనలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత టాప్ ర్యాంకర్లకు పోఖ్రియాల్ ఫోన్ చేసి మాట్లాడారు. ర్యాంకుల కోసం కృషి చేసిన ఆ విద్యార్థులను ప్రశంసించి, వారికి పోఖ్రియాల్ అభినందనలు తెలిపారు. ఢిల్లీ టాప్.. నాగాలాండ్ లాస్ట్ నీట్–2019లో మెరుగ్గా రాణించిన తొలి పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకులు ఇవీ.. 1. ఢిల్లీ (74.9 శాతం) 2. హరియాణా (73.4 శాతం) 3. చండీగఢ్ (73.2 శాతం) 4. ఆంధ్రప్రదేశ్ (70.7 శాతం) 5. రాజస్తాన్ (69.6 శాతం) 6. పంజాబ్ 7. తెలంగాణ 8. కేరళ 9. మణిపూర్ 10. హిమాచల్‌ప్రదేశ్ కుటుంబ సహకారంతోనే ఈ ర్యాంకు: నళిన్ నీట్లో తొలి ర్యాంకు సాధించిన నళిన్ ఖండేల్వాల్ రాజస్తాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన విద్యార్థి. ఫలితాల ప్రకటన అనంతరం అతను మాట్లాడుతూ పూర్తిగా తన కుటుంబ సహకారంతోనే తాను నీట్లో తొలి ర్యాంకును సొంతం చేసుకోగలిగానని నళిన్ ఖండేల్వాల్ చెప్పాడు. ‘మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్లే. మా అన్న కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ పరీక్ష కోసం రెండేళ్లపాటు జైపూర్‌లో ఉండి పూర్తి శ్రద్ధతో కష్టపడి చదివాను. ఆ రెండేళ్ల కాలంలో సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉన్నాను. నా కుటుంబం నుంచి, మా టీచర్ల నుంచి నాకు పూర్తిస్థాయిలో సహకారం లభించింది. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు చదివే వాణ్ని’ అని నళిన్ చెప్పారు. జైపూర్‌లోని అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో అతను నీట్ కోచింగ్ తీసుకున్నాడు. కోట పట్టణంలోని ఇదే ఇన్స్టిట్యూట్కు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు సైతం ఐదవ, పదవ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నీట్–2019 విశేషాలు.. ► మొత్తం 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ► 11 భాషల్లోని ఏదో ఒక భాషలో పరీక్ష రా సేలా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ► నీట్ పరీక్షకు మొత్తంగా 14,10,755 మంది హాజరయ్యారు. 1,08,015 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 7,97,042 మంది (దాదాపు 56.5 శాతం మంది) అర్హత సాధించారు. ► పరీక్ష రాసిన అమ్మాయిల్లో 57.1 శాతం మంది, అబ్బాయిల్లో 55.7 శాతం మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. ఐదుగురు హిజ్రాలు కూడా పరీక్ష రాయగా, వారిలో ముగ్గురు ప్రవేశాలకు అర్హత పొందారు. ► 315 మంది విదేశీయులు, 1,209 మంది ఎన్ఆర్ఐలు, 441 మంది ఓసీఐ (ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా) హోదా కలిగినవారు, 46 మంది పీఐవో (పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్)లు నీట్లో అర్హత సాధించిన వారిలో ఉన్నారు. ► 79.3 శాతం మంది నీట్‌ను ఇంగ్లిష్‌లో, 11.8% మంది హిందీలో, 8.9 శాతం మంది ఇతర ప్రాంతీయ భాషల్లో నీట్ రాశారు. రెండో ర్యాంకర్ భవిక్ బన్సల్ -
‘నీట్’ టాపర్స్‌లో మనవాళ్లు నలుగురు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు బుధవారం విడుదలైన నీట్ ఫలితాల్లో టాప్–50లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మన రాష్ట్రానికి చెందిన ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. 685 మార్కులతో పిల్లి భాను శివతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. మరో విద్యార్థి సొదం శ్రీనందన్‌రెడ్డి 685 మార్కులే సాధించి 42వ ర్యాంక్ పొందాడు. తెలంగాణకు చెందిన మాధురిరెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మన రాష్ట్రం నుంచి 57,798 మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా 55,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,039 మంది అర్హత సాధించారు. తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది తగ్గిన ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 70.72 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్–2018లో 72.55 శాతం మంది క్వాలిఫై అయ్యారు. నీట్లో ఉత్తీర్ణతా శాతం ఆధారంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా ఈసారి 134కు పెరిగింది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో ఎక్కువ మంది 500 మార్కులకు పైగానే సాధించారు. అయితే గతేడాది కంటే ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు తగ్గాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లీనాకు గతేడాది 464 మార్కులు రాగా జాతీయ స్థాయిలో 37,050వ ర్యాంక్ వచ్చింది. లీనా ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించినా ర్యాంకు 49,261కి చేరింది. ఇలా చాలామంది 500 మార్కులు దాటినా సీటు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భారీగా మార్కులు సాధించినా అంచనాకు తగ్గట్టు ర్యాంకులు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఒక్కో సీటుకు 16.98 మంది పోటీలో ఉన్నారు. గతేడాది కంటే ఈసారి పోటీ మరింత పెరిగింది. తుది ‘కీ’ తో అన్యాయం మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జూన్ 1 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని ప్రకటించింది. దీనిపై విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు చెబుతున్నారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని అంటున్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో మన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయంటున్నారు. ఇలా 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు విద్యార్థులు కోల్పోయారని వివరించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందంటున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వీటన్నింటినీ అలిండియా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. నిపుణుల అంచనా ప్రకారం.. నీట్లో జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నీట్లో 470 నుంచి 480 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కార్డియాలజిస్టునవుతా నీట్ ఏడో ర్యాంకర్ జి.మాధురీరెడ్డి శిరివెళ్ల: నీట్–2019 ఫలితాల్లో కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన గంగదాసరి మాధురీరెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఏపీ ఎంసెట్‌లోనూ 5వ ర్యాంకుతో సత్తా చాటింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ అకాడమీలో చదువుతూ నీట్ రాసిన మాధురి 720 మార్కులకు గాను 695 మార్కులు సాధించి సత్తా చాటింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని, కార్డియాలజిస్టు కావడమే తన లక్ష్యమని తెలిపింది. మాధురి తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. రేడియాలజిస్టునవుతా నీట్ 40వ ర్యాంకర్ భానుతేజ సాక్షి, విశాఖపట్నం: నీట్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన భానుతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించాడు. విశాఖ చైతన్య కళాశాలలో ఇతను ఇంటర్మీడియట్ చదివాడు. ర్యాంకు వచ్చిన సందర్భంగా భానుతేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ర్యాంకు సాధించడానికి రెండు నెలల పాటు రోజుకు 15 గంటలు కష్టపడి చదివాను. నీట్ రాశాక 500 లోపు ర్యాంకు వస్తుందని భావించాను. 40వ ర్యాంకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మ సూర్యమణి విశాఖ కేజీహెచ్‌లో డాక్టర్. నాన్న శ్రీకాకుళంలో ఎంవీ ఇన్స్పెక్టర్. అక్కలు ఇద్దరూ వైద్యులే. నాకు చిన్నప్పట్నుంచి రేడియాలజీ అంటే ఇష్టం. అందుకే భవిష్యత్తులో రేడియాలజిస్టునవుతాను. నాకు ఉత్తమ ర్యాంకు రావడంలో నా తల్లిదండ్రులు, చైతన్య కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం ఉంది.’ అని వివరించాడు. శ్రీనందన్రెడ్డికి ఫిజిక్స్‌లో 180కి 180 కడప ఎడ్యుకేషన్: నీట్లో కడపకు చెందిన శ్రీనందన్‌రెడ్డి 42వ ర్యాంకు సాధించాడు. అంతేకాకుండా ఫిజిక్స్ సబ్జెక్టులో ఇతను 180కి 180 మార్కులు సాధించాడు. శ్రీనందన్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇతను కడపలోని సంకల్ప కోచింగ్ సెంటర్లో ఫౌండేషన్ కోర్సులో శిక్షణ తీసుకున్నాడు. శ్రీనందన్‌రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు రామిరెడ్డి, ప్రసూన, సంకల్ప్ డైరెక్టర్ వంశీ హర్షం వ్యక్తం చేశారు. -
వారంలో ‘నీట్’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా ‘నీట్’రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ‘నీట్’ర్యాంకుల ప్రకటన అనంతరం రాష్ట్ర స్థాయిలో తమకెంత ర్యాంకు వస్తుందోనన్న ఆసక్తి, ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించారు. వారిలో చాలామంది జాతీయస్థాయిలో వచ్చిన వేలాది ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారు. కానీ రాష్ట్రస్థాయిలో ర్యాంకులు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. నీట్ నిపుణుల అంచనా ప్రకారం జాతీయస్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లోనూ ఎంబీబీఎస్ సీటు వస్తుందంటున్నారు. నీట్లో 460 నుంచి 470 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉందని శ్రీచైతన్య కూకట్పల్లి జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం ఈ నెల 20 నాటికి మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. జూలై చివరి నాటికి కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేసి ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తామని ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో 4,600 ఎంబీబీఎస్ సీట్లు.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019–20 వైద్య విద్యా సంవత్సరానికి 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవికాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 1,106 డెంటల్ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 1,000 పెరిగాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న 1,500 సీట్లల్లో 15 శాతం అంటే 225 సీట్లు అఖిల భారత కోటా కింద కేంద్రం భర్తీ చేస్తుంది. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రిజర్వేషన్ అమలు చేయాలంటే ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండా ఉంచాలి. అలాగైతే 25 శాతం సీట్లు పెంచాలి. ఆ మేరకు ప్రస్తుత సీట్లకు అదనంగా 375 సీట్లు పెరగాల్సి ఉంటుంది. అవే పెరిగితే మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,875 సీట్లు అవుతాయి. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల పెంపుపై ప్రతిపాదనలు పంపాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపే పనిలో వైద్య విద్య డైరెక్టరేట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే నోటిఫికేషన్ విడుదల లోపు దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ సీట్లు అందుబాటులోకి వస్తాయి. లేదంటే అంతే సంగతులు. అందుకోసమే నోటిఫికేషన్‌ను కొద్దిగా ఆలస్యంగా జారీచేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తోంది. -
‘నీట్’ అమ్మాయిల్లో టాపర్ మాధురీ
అమ్మాయిలే టాప్... 7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికం అమ్మాయిలే. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 134. టాప్ 50లో నాలుగు... తెలుగు విద్యార్థుల్లో మాధురీరెడ్డి తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40వ ర్యాంకు, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42 ర్యాంకు సాధించారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ బిడ్డ మాధురీరెడ్డి దేశవ్యాప్తంగా ఏడో ర్యాంకు సాధించగా, అమ్మాయిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయస్థాయి టాపర్‌గా రాజస్తాన్‌కు చెందిన నలిన్ ఖండేల్వాల్ 720 మార్కులకుగాను... 701 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, 695 మార్కులు సాధించి తెలంగాణ విద్యార్థిని జి.మాధురీరెడ్డి ఏడో ర్యాంకులో మెరిసింది. టాప్ 50 ర్యాంకులు సాధించిన విద్యార్థుల మధ్య మార్కుల తేడా 16 మాత్రమే ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42వ ర్యాంకు సాధించారు. గతేడాది కంటే పేపర్ సులువుగా రావడంతో కటాఫ్ మార్కు కూడా పెరిగింది. గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా, ఈసారి 134కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్–2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 5న దేశవ్యాప్తంగా 154 నగరాల్లో 2,546 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒడిశాలో ఫొని తుపాను, కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా అక్కడి అభ్యర్థుల కోసం గత నెల 20న మరోసారి పరీక్ష నిర్వహించారు. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సందేహాలు నెలకొన్నప్పటికీ... ముందుగా పేర్కొన్నట్లుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారు. 4,45,761 మంది అమ్మాయిలు, 3,51,278 మంది అబ్బాయిలు అర్హత సాధించారు. ఇక ఏపీలో 70.72 శాతంతో 39,039 మంది, తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తెలుగు భాషలో రాయడానికి 1796 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ఫలితాలను వెల్లడించింది. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్... నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. నీట్–2019 ద్వారా అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేరిలోని జిప్మర్ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్ఐసీ.ఇన్’వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. తుది ‘కీ’తో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం! మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని విడుదల చేసింది. దీనిపై తెలంగాణకు చెందిన విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు శ్రీచైతన్య కూకట్పల్లి జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు చెప్పారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని ఆయన అన్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయన్నారు. అలా రెండు ప్రశ్నలకు కలిపి 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు కోల్పోయినట్లు ఆయన విశ్లేషించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందన్నారు. ఉత్తరాది వారు రాసిన దానికి అనుగుణంగా ఇలా జరిగిందన్న భావన విద్యార్థుల్లో నెలకొందన్నారు. దీంతో గతేడాది జాతీయస్థాయి 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందినవారు నలుగురుంటే, ఈసారి ఒకరే ఉన్నారన్నారు. అలాగే వందలోపు ర్యాంకులు వచ్చినవారు గతేడాది 16 మంది ఉంటే, ఈసారి పదిలోపే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. అలాగే గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. –––––––––––––––––––––––– దేశవ్యాప్తంగా ‘నీట్’పరీక్షలో అర్హులైనవారు.. –––––––––––––––––––––––– కేటగిరీ పర్సంటైల్ కటాఫ్ మార్కు అర్హులు –––––––––––––––––––––––– జనరల్ 50 701–134 7,04,335 ఓబీసీ 40 133–107 63,789 ఎస్సీ 40 133–107 20,009 ఎస్టీ 40 133–107 8,455 ––––––––––––––––––––––––– కార్డియాలజిస్టును అవుతా – మాధురీరెడ్డి నీట్–2019 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు, అమ్మాయిల్లో తొలి ర్యాంకు సాధించిన గంగదాసరి మాధురీరెడ్డి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని చెప్పారు. కార్డియాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు. మాదాపూర్ నారాయణ కాలేజీలో చదివానని, ప్రతీ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల దాకా నీట్ పరీక్ష కోసం చదివానన్నారు. తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. తన విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. డీన్ సాయి లక్ష్మి, టీచర్ల ప్రోత్సాహం మరవలేనిదని చెప్పారు. -
రోజుకు 8 గంటలు చదివా: టాపర్
జైపూర్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించడం పట్ల రాజస్థాన్ విద్యార్థి నలిన్ ఖండేల్వాల్ సంతోషం వ్యక్తం చేశాడు. రోజుకు ఎనిమిది గంటలు చదివానని చెప్పాడు. తన విజయానికి కారణమైన టీచర్లకు ధన్యవాదాలు తెలిపాడు. 720 గానూ 701 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. బుధవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన భవిక్ భన్సాల్ రెండో ర్యాంక్, ఉత్తరప్రదేశ్ విద్యార్థి అక్షత్ కౌశిక్ మూడో ర్యాంక్ దక్కించుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన నీట్లో సుమారు 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా ఓబీసీకి చెందిన 3.75 లక్షల విద్యార్థులు అర్హత సాధించారు. అన్‌రిజర్వుడు కేటగిరీ నుంచి 2.8 లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎస్సీ విభాగం నుంచి దాదాపు లక్షమంది, ఎస్టీ కేటగిరి నుంచి 35 వేల మంది విద్యార్థులు అర్హత పొందారు. అక్రమాలకు పాల్పడిన నలుగురు విద్యార్థుల ఫలితాలను రద్దు చేశారు. మెరుగుపడిన తమిళనాడు గతేడాది నీట్ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన తమిళనాడు ఈసారి మెరుగుపడింది. 48.57 శాతం ఉత్తీర్ణత సాధించింది. గతేడాది 39.56 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదు చేసింది. (చదవండి: నీట్ ఫలితాలు విడుదల) -
నీట్లో మెరిసిన మాధురి రెడ్డి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసి వెబ్సైట్లో పెట్టింది. రాజస్తాన్‌కు చెందిన నలిన్ ఖండేల్వాల్ 701 మార్కులు సాధించి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించగా, తెలంగాణకు చెందిన మాధురి రెడ్డి 695 మార్కులతో 7వ ర్యాంక్ సాధించింది. అలాగే ఫలితాల్లోనూ రాజస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రం నుంచి మొత్తం 7,91,042మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 14,10,754 మంది హాజరు అయ్యారు. కాగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2019–20 వైద్య విద్య సంవత్సరంలో ప్రవేశాలకు గత నెల 5న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 40 శాతం పర్సంటైల్, దివ్యాంగులకు 45 శాతం పర్సంటైల్‌ను అర్హత మార్కులుగా నిర్ణయించారు. నీట్ అర్హత అనంతరం కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. గతేడాది మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ మూడో తేదీ వరకు నిర్వహించారు. నీట్లో అర్హత సాధించిన వారిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. అర్హత మార్కులు పెరిగే అవకాశం.. ఈసారి నీట్ ప్రవేశ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్ మార్కులకు గాను, గతేడాది జనరల్ కేటగిరీలో అర్హత మార్కు 105గా ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అది కూడా ఈసారి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. -
నేడు విడుదల కానున్న నీట్ ఫలితాలు
-
నేడే ‘నీట్’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. ఫలితాలు https://ntaneet.nic.in/,https://www.mcc.nic.in/లో పొందవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2019–20 విద్య సంవత్సరంలో ప్రవేశాలకు మే 5న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనరల్ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ 40% పర్సంటైల్, దివ్యాంగులకు 45% పర్సంటైల్‌ను అర్హత మార్కులుగా నిర్ణయించామని తెలిపింది. నీట్ అర్హత అనంతరం కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు. నీట్లో అర్హత సాధించిన వారి లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలో 1,550 ఎంబీబీఎస్ సీట్లు.. అఖిల భారత స్థాయిలో ఫలితాల వెల్లడి అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రాలకు పంపిస్తారు. జాతీయ ర్యాంకుల ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థులకు అఖిల భారత ఉమ్మడి కోటాలో ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలో సీట్ల భర్తీ జరుగుతుంది. విద్యార్థులు అఖిల భారత ఉమ్మడి కోటాకు, రాష్ట్ర స్థాయి ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లకూ నీట్ ర్యాంకులే ఆధారం. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లుండగా.. వీటిల్లో 15 శాతం సీట్లను ఉమ్మడి కోటాకు కేటాయించాలి. అఖిల భారత ఉమ్మడి కోటా ప్రవేశాల ప్రక్రియ ఈ నెల రెండో వారం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ప్రవేశాలను నిర్వహిస్తారు. ఈసారి నీట్ ప్రవేశ పరీక్ష సులువుగా ఉండటంతో అర్హత మార్కులు కూడా పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే 20 నుంచి 25 వరకు అర్హత మార్కులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 720 నీట్ మార్కులకు గాను, గతేడాది జనరల్ కేటగిరీలో అర్హత మార్కు 105గా ఉంది. ఈసారి 125 నుంచి 130 మార్కుల వరకు పెరిగే అవకాశముందని అంటున్నారు. అలాగే ఆలిండియా టాప్ వెయ్యి ర్యాంకులు సాధించిన విద్యార్థుల మార్కులు 650పైనే ఉండేది. అదీ ఈసారి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. -
నీట్ 2018 : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తీర్ణత కాకపోవడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ)ను ఆదేశించింది. ఈ మేరకు నీట్ 2018 ర్యాంకు లిస్టును రెండు వారాల్లోగా పునః పరిశీలించాలని పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్సీ తీరును తప్పు పట్టింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ పెండింగ్‌లో ఉండగానే ర్యాంకు లిస్టు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంకుశంగా వ్యవహరించారు.. తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లలేదని సీబీఎస్సీ ఏ ప్రాతిపదికన చెబుతుందో వివరించాలని కోర్టు ఆదేశించింది. మెజారిటీ ప్రజలు సమర్థించినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు కదా అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్ విచారణ కొనసాగుతుండగానే ర్యాంకు లిస్టు విడుదల చేయడం ద్వారా సీబీఎస్సీ నిరంకుశంగా వ్యవహరించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనువాద తప్పిదాల వల్ల విద్యార్థులు మార్కులు కోల్పోయారన్న వాదనను సీబీఎస్సీ తేలికగా తీసుకోవడం బాధ్యత రాహిత్యమేనని మండిపడింది. సైన్సు విభాగంలో ఆంగ్ల పదాలతో సరిపోయే తమిళ పదాలను రూపొందించడానికి ఎటువంటి ప్రమాణాలు పాటించిందో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఎస్సీని ఆదేశించింది. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
అనిరుధ్‌బాబు మళ్లీ మెరిశాడు
పాతపట్నం : నీట్ ఫలితాల్లో మెరిసిన పాతపట్నం కుర్రోడు అంకడాల అనిరుధ్‌బాబు మరోసారి మెరిశాడు. జవహార్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)–2018 ఫలితాల్లో పాతపట్నం మేజర్ పంచా యతీ శాంతినగర్–3వలైన్‌కు చెందిన అంకడాల తేజేశ్వరరావు తనయుడు అనిరు«ధ్‌బాబు ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదల అయ్యాయి. ఇటీవల నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ (నీట్) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో కూడా మొదటి ర్యాంకు, ఆలిండియాలో స్థాయిలో అనిరుధ్ 8వ ర్యాంకు సాధించాడు. నీట్లో 720కి 680 మార్కులు సాధించిన అనిరుధ్‌బాబు.. ఏపీ ఎంసెట్‌లో 14వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంటర్‌ను విజయవాడలోని శ్రీ చైతన్యలో చదివి 983 మార్కులు సంపాదించాడు. పాతపట్నం సెంటెన్స్‌లో 7వ తరగతి వరకు, 8 నుంచి పదో తరగతి వరకు విశాఖపట్నంలోని బోయపాలెంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో అభ్యసించాడు. తండ్రి అంకడాల తేజేశ్వరరావు మెళియాపుట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లెక్కలు ఉపాధ్యాయుడుగా పని చేస్తుండగా.. తల్లి రమాదేవి గృహిణి. స్వగ్రామం మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామం కాగా.. ఆరు సంవత్సరాల క్రితం పాతపట్నం వచ్చేసి స్థిరపడ్డారు. ఆలిండియా స్థాయిలో ప్రథముడిగా నిలిచిన అనిరుధ్‌బాబుకు తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి ఆనందం పంచుకున్నారు. -
ఫ్చ్.. రెండు రెక్కలుండుంటే..!
చదువు దోషి కాదు.మార్కులు బోన్లో నిలబడక్కర్లేదు.ర్యాంకులు క్రైమ్ కాదు.లక్ష్యాలు శిక్షలు కావు. ఓటమి అపరాధం కాదు.లుపు చట్టం కాదు. పిల్లలు ఎగరాలనుకునే అమ్మానాన్న..వాళ్లకు రెక్కలు లేవని తెలుసుకోవాలి.ఉంటే.. ర్యాంకులు తెగిన పక్షుల్లాఇలా నేల రాలిపోతారా?! ‘‘అమ్మా.. అఖిల వాళ్లింటికెళుతున్నా! అఖిల చెల్లి హరిప్రియ రిజల్ట్స్ చూసుకొని బిల్డింగ్ పైనుంచి దూకేసిందటమ్మా! ఈ విషయం వాళ్లమ్మకింకా తెలియదట. అదొక్కతే వాళ్ల నాన్నతో పాటు వెళ్లి, ఆసుపత్రి నుంచి ఫోన్ చేసింది. హరిప్రియకు 20 పర్సంటే ఛాన్సెస్ అన్నారట’’.. అక్షిత గొంతు బొంగురుపోయింది. మరో అరగంటలో మళ్లీ ఫోనొచ్చింది... హరిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయనీ, తను చనిపోయిందనీ! అక్షిత తల్లి అచేతనంగా నిలబడిపోయింది. (ఇటీవలే హైదరాబాద్‌లో జరిగి, మీడియా దృష్టికి రాని ఒక దుర్ఘటన ఇది. గోప్యత కోసం పేర్లు మార్చాం). ఎంత పని చేశావే.. నా తల్లీ! అల్లరల్లరిగా ముద్దులొలికిస్తూ ఆడిపాడే హరిప్రియ చనిపోయిందా? నమ్మలేకపోయింది అక్షిత తల్లి. ఏ తల్లి బిడ్డయితేనేం పద్దెనిమిదేళ్లు కడుపులో పెట్టుకొని పెంచుకున్న బంగారు తల్లి బలవంతంగా చావుని కోరి తెచ్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత త్వరగా వెళ్లినా ఆ అమ్మాయింటికి చేరేసరికి గంటన్నర పట్టింది. అదురుతున్న గుండెలతో వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టింది అక్షిత తల్లి. ఇంకా హరిప్రియను ఇంటికి తీసుకురాలేదేమో! హాల్లో నేలమీద పడి హరిప్రియ తల్లి తలబాదుకుంటోంది. ఆమె చేతిలో హరిప్రియ బర్త్‌డే కేక్ ఇవ్వడానికొచ్చినప్పుడు వేసుకొచ్చిన కొత్తబెల్ స్లీవ్స్ టాప్! దానిని గుండెలకి హత్తుకొని హత్తుకొని ఏడుస్తోంది. ఇంట్లో ఉన్నంతసేపూ అమ్మ చుట్టూ తిరిగే తన బిడ్డ చనిపోలేదనీ, ఎక్కడికో వెళ్లుంటుందనీ, తనకి ఒంటరిగా నిద్ర పట్టదు కాబట్టి ఎక్కడున్నా వచ్చేస్తుందనీ, తనను హత్తుకుని పడుకుంటుందనీ ఇలా ఏదో కలలోలా మాట్లాడుతోంది హరి తల్లి. మధ్య మధ్యలో నమ్మక తప్పని వాస్తవం ఆమె నవనాడుల్నీ మెలిపెట్టేస్తోంది కాబోలు గట్టిగా ఏడుపు. చూసే వాళ్ల కళ్లూ ధారాపాతంగా వర్షిస్తున్నాయి. నిన్న మళ్లీ.. హైద్రాబాద్‌లో నిన్నటికి నిన్న ముద్దులొలికే జస్లీన్ కౌర్ ఆత్మహత్య పిల్లల తల్లిదండ్రుల్లో భయోత్పాతాన్ని సృష్టించింది. నీట్ (జాతీయ వైద్య విద్య)కు అర్హత సాధించలేకపోయానన్న కారణంతో.. పది అంతస్తుల మెట్లెక్కి మరీ దూకేసింది. తక్కువ ఎత్తులో నుంచయితే బతుకుతానేమోననే భయం కూడా ఉన్నట్లుంది! అన్ని మెట్లెక్కుతున్నప్పుడు ఒక్క మెట్టుదగ్గరైనా ఒక్క క్షణం ఆగి ఉంటే ఆ చిన్నారి ఆవేదన చల్లారేదేమో. కానీ ఏకబిగిన అన్నీ ఎక్కేసి అంతా దూకొద్దని కిందనించి అరుస్తున్నా వినిపించుకోకుండా దూకేసింది. అంతకన్నా విషాదం.. ఆమె తల్లి టీవీ విజువల్స్‌లో ఎవరి బిడ్డో దూకేస్తోందని చూస్తూ చివరికి అది తన కూతురేనని గుర్తించడం. ఏ రోజూ మార్కులు తక్కువొచ్చినందుకు ఆ తల్లి ఒక్కమాటా అనలేదు. అయినా జస్లీన్ తన నిండు నూరేళ్ల జీవితాన్ని బలవంతంగా ముగించుకుంది. తమిళనాడులో.. ఢిల్లీలో నీట్ పరీక్షలో సరైన ర్యాంకు రాలేదన్న బెంగతో నిరుపేద కుటుంబం తనపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశానన్న న్యూనతతో తమిళనాడులోని విలుపురం జిల్లా చెంజి పెరవలూరుకు చెందిన 19 ఏళ్ల ప్రతిభ పురుగుల మందు తాగేసి ఆత్మహత్య చేసుకొంది. నీట్లో అతి తక్కువ మార్కులు రావడమే ఆమె బలవన్మరణానికి కారణం. ఇది తమిళనాడులో నీట్నే రద్దుచేయాలనే డిమాండ్‌ని ముందుకుతెచ్చింది. ఇదే తమిళనాడు అసెంబ్లీని ఓ కుదుపు కుదిపేసింది. నిన్ననే ఢిల్లీలో ప్రవర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులే మింగేశాయా? దీనిని క్షణికావేదన అందామా? ఒత్తిడి అందామా? కేవలం మార్కులే వీళ్లందర్నీ మింగేసాయందామా? అప్పటి వరకూ వాళ్లు ఇల్లూ, స్కూలూ తప్ప లోకం తెలియని పిల్లలు. బాగా చదివే పిల్లలు కూడా ఎందుకిలా ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఒక్క వైఫల్యానికే మరణం దిశగా పయనించే పిరికితనం ఏమిటి? సరిగ్గా ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందనిపిస్తుంది. లోకం తెలియకుండా పెంచడం కూడా పిల్లల్లో సవాళ్ల నెదుర్కొనే మానసిక స్థైర్యాన్ని మాయం చేస్తోంది. ఎప్పుడూ.. మార్కులెక్కువొచ్చిన పిల్లలతోనే పోలిక, తక్కువొచ్చినా ఫరవాలేదు అనే భరోసా ఇవ్వకపోవడం, విజయం సాధించేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నించే అవకాశం మనచేతిలోనే ఉందంటూ లాలించే సున్నితత్వం ఇటు తల్లిదండ్రుల్లోనూ, అటు ఉపాధ్యాయుల్లోనూ కొరవడడం వల్లనే చిన్నారుల మరణాలు సంభవిస్తాయా? మార్కుల మాయాజాలంతో పాటు పిల్లల్లో స్పోర్టివ్‌నెస్ క్షీణించడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. మెడిసిను, ఇంజినీరింగేనా?! పెద్దలు పిల్లల గురించి పెద్దపెద్ద కలలకు కనడం కాదు. పిల్లలకు కలలు కనడం నేర్పాలి. ఆ కలలు సాకారమయ్యే అవకాశాలు ఒక్కటి కాదు, వందలు వేలున్నాయని చెప్పాలి. తన జీవితానికి ఒక్క మెడిసిన్, లేదంటే ఇంజనీరింగ్ ఒక్కటే కాదనీ ఇంకా మన ముందున్న ప్రత్యమ్నాయాలెన్నింటినో వారికి ప్రత్యక్షంగా చూపించాలి. బంధువుల్లోనే పడిలేచిన కెరటాలను వాళ్లకు పరిచయం చేస్తుండాలి. పదిసార్లు ఫెయిలయినా పదకొండోసారి 99 శాతం తెచ్చుకోవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని అందించాలి. ఇది కాకపోతే ఇంకొకటి. అమ్మనాన్నలని బాధించేది తక్కువ మార్కులు కాదనీ, తమ బిడ్డల మరణమే వారిని చిత్రవధ చేస్తుందనీ వారికి తెలపాలి. ప్రేమగా, లాలనగా.. గుండెలకు చేర్చుకుంటే.. మన ప్రేమలోని ప్రతి స్పర్శా వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది. వాళ్లని నిండు నూరేళ్లూ బతకనిస్తుంది. దోషులు ఎవరు? విజయాలనే కాదు అపజయాలనూ స్వీకరించాలనే మనస్తత్వం పిల్లలకు తల్లిదండ్రుల నుంచే రావాలి. గెలుపుఓటములు నాణేనికి చేరోవైపేననీ, ఈ రోజు అపజయం కూడా రేపటి విజయానికి బలాన్నిస్తుందనీ నేర్పగలిగే చైతన్యం పిల్లల్లో నే కాదు, తల్లిదండ్రుల్లోనూ రావాలి. ప్రతి ఓటమి నుంచి నేర్చుకునేదెంతో ఉంటుందని అధ్యాపకులు బోధించ గలిగే ఆరోగ్యకరమైన తరగతి గదులు కావాలి. పక్కింటి పిల్లాడికో, అమ్మాయికో తక్కువ మార్కులొచ్చాయని తెలిసీ ఫోన్‌చేసి గుచ్చి గుచ్చి అడిగే బంధువులో, ఇంకొకరో.. ఈ మరణాలకి కారణం కావొచ్చు. హరిప్రియ అయినా, జస్లీన్ కౌర్ అయినా, ప్రతిభ అయినా ఇలాంటి ఏదో ఒక కారణం వాళ్లని మనస్తాపానికి గురిచేసి ఉండొచ్చు. కేవలం ఉపాధ్యాయులో, తల్లిదండ్రులో, స్నేహితులో మారడం కాదు. చదువుల అర్థం కూడా మారాలి. విద్య పట్ల అవగాహన మారాలి. హరిప్రియ అక్క ఇదే అంటోంది. ‘‘నా చెల్లి మరణానికి మా ఇంటి పరిస్థితులో, లేక పాఠశాల పరిస్థితులో కారణం కాదు. సొసైటీయే కారణం. మేమేమీ అనకపోయినా మా బంధువులో, ఎక్కడో ఉన్న మా పరిచయస్తులో ఏదైనా అంటారేమోనని, నాన్న ప్రతినిత్యం జపించే పరువు పోతుందేమోనని హరి తనువు చాలించింది. అందుకే సొసైటీలో మార్పు రావాలి’ అంటోంది తను. - అత్తలూరి అరుణ ఆత్మహత్యల నివారణకు..! తమ పిల్లల చదువుకంటే తమ పిల్లల నిండు జీవితమే చాలా ప్రధానమని తమ తల్లిదండ్రులు భావిస్తున్నారనే ఆలోచననను పిల్లలకు కలిగేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. పిల్లలు ఈ అభిప్రాయానికి వచ్చేలా తల్లిదండ్రుల మాటలు, చేష్టలు ఉండాలి. ఈ మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదనే ఆలోచనను పిల్లలో ఎప్పుడూ కలిగిస్తుండాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు మొదట్నుంచీ చదువు గొప్పదనాన్ని నిత్యం నూరిపోస్తూ... పరీక్షకు ముందెప్పుడో మార్కులు తక్కువచ్చినా పర్లేదులే అని మొక్కుబడిగా అంటారు. అది సరికాదు. ఈ మాటను మనస్పూర్తిగా పిల్లలకు చెప్పాలి. పిల్లల అపజయాలకు ఎప్పుడూ వారిని అవమానించకూడదు. కించపరచకూడదు. పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చనే కూడదు. పిల్లల్లో ఎవరికి వారే ప్రత్యేకం. చదువుతోపాటు పిల్లలు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి కావాల్సినవీ చేయాలి. అలా ఉండే పిల్లలే ఎలాంటి విజయాలైనా సాధిస్తారు. - డాక్టర్ పద్మ పాల్వాయి సీనియర్ ఛైల్డ్ సైక్రియాట్రిస్ట్ -
హైదరాబాద్‌లో అందరూ చూస్తుండగానే..
సాక్షి, హైదరాబాద్: మెడికల్ ఎంట్రన్స్ ‘నీట్’లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అందరూ చూస్తుండగానే పదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. జిమ్‌కు వెళ్తున్నానని చెప్పి అంతలోనే విగతజీవిగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీ చానల్స్‌లో చూసి.. కాచిగూడ బర్కత్‌పురాలోని కైబాన్ అపార్ట్మెంట్లో నివసించే బట్టల వ్యాపారి రణ్వీర్ సింగ్, లవ్లీన్ కౌర్‌లకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె జస్లిన్ కౌర్(18) నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. చదువుల్లో చురుగ్గా ఉండే జస్లిన్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సోమవారం వెలువడిన ‘నీట్’ ఫలితాల్లో ఈమెకు అనుకున్నంత ర్యాంక్ రాలేదు. లక్ష వరకు ర్యాంకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో కాస్త కుదుటపడినట్టే కనిపించింది. ప్రతిరోజూ మాదిరే మంగళవారం ఉదయం కూడా జిమ్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. చాలాసేపయినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు మధ్యాహ్నం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్న సమయంలోనే టీవీ ఛానల్స్‌లో ఓ యువతి అబిడ్స్‌లోని బహుళ అంతస్థుల భవనం నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు ప్రసారమయ్యాయి. వాటిని చూసిన తల్లి లవ్లీన్ కౌర్ ఆమె మా బిడ్డే అంటూ కుప్పకూలింది. జనం చూస్తుండగానే.. జిమ్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయల్దేరిన జస్లిన్ కౌర్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అబిడ్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్‌కు చేరుకుంది. మెట్లు ఎక్కుతూ పదో అంతస్తుకు వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సరిగ్గా 10.21 గంటల ప్రాంతంలో కిందకు దూకేందుకు సిద్ధమైంది. కింద నుంచి ఆమెను గమనించిన జనం వద్దు వద్దు అంటూ అరుపులు కేకలు పెట్టారు. ఆ తర్వాత 4 నిమిషాలకే జస్లిన్ కిందకు దూకి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు క్షోభ మిగల్చకండి: తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్తానని వెళ్లిన తమ కుమార్తె ఇలా ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదంటూ జస్లిన్ తల్లిదండ్రులు బోరున విలపించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు గంపెడు ఆశలు పెట్టుకుంటారని, ర్యాంకులు వచ్చినా, రాకపోయినా ధైర్యంగా ఉండాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకోని క్షోభ మిగల్చవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ప్రాణం తీస్తున్న పోటీ!
ప్రచండమైన పోటీ... పరిమితమైన అవకాశాలు... మార్కుల్ని తప్ప మరిదేన్నీ పరిగణించని విధా నాలు లేలేత హృదయాలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతున్నాయో హైదరాబాద్ నడిబొడ్డున మంగళవారం ఉదయం తనువు చాలించిన జస్లిన్ కౌర్ ఉదంతం తేటతెల్లం చేసింది. ఆబిడ్స్‌లో పదంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డ కౌర్ వయసు కేవలం పద్దెనిమిదేళ్లు. ఒకప్పుడు ఆ వయసు పిల్లలకు బాధ్యతలు పెద్దగా పట్టేవి కాదు. సవాళ్ల బాదరబందీ ఉండేది కాదు. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చేది. కష్టమంటే పెద్దగా తెలియకపోయేది. దేన్నయినా సునాయాసంగా గెలవగలమన్న ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉండేది. నిజానికి ఆ ఆత్మవిశ్వాసమే వారికి సగం విజయాన్ని అందించేది. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. బాల్యం నుంచే మన విద్యావ్యవస్థ పిల్లల్లో పోటీ తత్వాన్ని నూరిపోస్తోంది. తమపై ఆశలు పెట్టుకున్నవారి కోసం, తమ గెలుపు ఖచ్చితమని నమ్ముతున్నవారికోసం, తాము దేన్నయినా అవలీలగా జయించ గలమని విశ్వసిస్తున్నవారికోసం బడికెళ్లే వయసులోనే పిల్లలు లక్ష్య నిర్దేశం చేసుకుంటున్నారు. జీవి తాలను పరుగు పందెంగా మార్చేసుకుంటున్నారు. ఈ పందెంలో ఎక్కడ నిర్లక్ష్యం ప్రదర్శించినా... ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా నలుగురిలో నగుబాటు పాలవుతామని బెంగ పెట్టుకుంటున్నారు. ఇంట్లోనూ, బయటా తమపై ఆశలు పెట్టుకున్నవారి కోసం, అంచనాలను పెంచుకుంటున్నవారి కోసం మర మనుషులుగా మారిపోతున్నారు. సమూహంలో ఒంటరిగా మారుతున్నారు. శర సంధానం చేసిన అర్జునుడి దృష్టంతా చిటారు కొమ్మనున్న పక్షిపై నిలిచినట్టు లక్ష్యం తప్ప మరిదేన్నీ వారు పరిగణించలేకపోతున్నారు. ఒత్తిళ్ల ఊబిలో కూరుకుపోయి దాన్నే సర్వస్వమనుకుంటున్నారు. ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోవడం వారివల్ల కావడం లేదు. ఈ తరగతి దాటితే పోటీ ముగు స్తుందనిగానీ, ఈ పరీక్ష పూర్తయితే పీడ విరగడవుతుందనిగానీ గ్యారెంటీ లేదు. మళ్లీ కొత్త తర గతిలో కొత్త పోటీలు, కొత్త లక్ష్యాలు తప్పవు. ఈ అమానుషమైన పరుగుపందెంలోనే జస్లిన్ కౌర్ ఓడిపోయింది. జీవితం వృథా అనుకుంది. కన్నవారికి, తోడబుట్టినవారికి శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచింది. ఈ విషయంలో జస్లిన్ కౌర్ ఒంటరి కాదు. నీట్ ఫలితాలు వెల్లడైన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా దాదాపు నలుగురైదుగురు ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. అసలు నీట్ కోచింగ్ సమయంలోనే విద్యార్థులు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ర్యాంకు సాధించలేమోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. సోమవారం వెల్లడైన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో మంచి ర్యాంకు రాలేదన్న మనో వ్యథతో జస్లిన్ కౌర్ ప్రాణాలు తీసుకుంది. ఈసారికి ర్యాంకు సాధించలేకపోయినా మళ్లీ ప్రయ త్నించి విజయం సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం ఆమెలో కొరవడటానికి కారణముంది. నీట్ పరీక్ష సాధారణమైనది కాదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలన్నిటిలో ఉన్న 54,000 సీట్లను భర్తీ చేయడం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈసారి 13,26,725 మంది ఆ పరీక్షకు హాజరయ్యారు. ఈ సంఖ్య నిరుటితో పోలిస్తే 2 లక్షలకన్నా ఎక్కువ. ఇలా ఏటికేడాదీ పెరిగే అభ్యర్థుల సంఖ్య వల్ల పోటీ రాను రాను మరింత జటిలంగా మారుతుందని, ఎంబీబీఎస్ సీటు రావడం దుర్లభమని జస్లిన్ కౌర్ బెంగ పెట్టుకుని ఉండొచ్చు. పర్సంటైల్ ఆధారంగా విజే తలను నిర్ణయిస్తారు గనుక నీట్లో అర్హత సాధించినంత మాత్రాన సీటు గ్యారంటీ లేదు. అలా అర్హు లైనవారి జాబితాలో అగ్రభాగాన ఉండాలి. ఈసారి ఫలితాలను విశ్లేషిస్తే ఈ సంగతి తేటతెల్లమవు తుంది. ఉన్నవి 54,000 సీట్లయితే 7.14 లక్షలమంది అర్హత సాధించారు. అంటే సగటున ఒక సీటుకు 13మంది పోటీ పడుతున్నట్టు లెక్క. కనుక గెల్చినవారు సైతం చివరివరకూ నిస్స హాయంగా ఎదురుచూస్తూ కూర్చోవాలి. గుండెలు చిక్కబట్టుకుని ఉండాలి. నిరుడు కాస్త నయం. అప్పుడు 6.11 లక్షలమంది విద్యార్థులు అర్హత సాధించగా 64,000 సీట్లున్నాయి. అంటే సగటున ఒక సీటుకు 10మంది పోటీ పడ్డారు. కానీ తగిన మౌలిక సదుపాయాలు సరిగా లేవన్న కారణంతో కేంద్రం 82 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లను నిషేధించింది. పర్యవసానంగా ఈ ఏడాది 10,000 సీట్లు తగ్గిపోయాయి. పైగా అర్హుల సంఖ్య బాగా పెరిగింది. అసలు సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నప్పుడు అంతమందిని ‘అర్హులు’గా ప్రకటించడంలోని సహేతుకత ఏమిటో ఎవరికీ బోధç³డని విషయం. ఈ విధానం వల్ల ఎవరికి వారు చివరివరకూ తమకు సీటొస్తుందన్న భ్రమలో ఉండిపోతారు. ఆ భ్రమ బద్దలైనప్పుడు ఎంతటి తీవ్రమైన నిర్ణయానికైనా వెనుకాడని స్థితికి చేరుకుంటారు. ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న దశలో విద్యార్థుల్లో ఒత్తిళ్ల స్థాయి అత్యధికంగా ఉంటున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్మీడియెట్‌లోకి వచ్చినప్పుడే భవిష్యత్తులో ఫలానా డిగ్రీలో చేరి జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన స్థూలంగా ఉంటుంది కనుక అందుకోసం తపన మొదలవు తుంది. ఏమాత్రం విఫలమైనా భవిష్యత్తు శూన్యమవుతుందన్న భయం, పోటీలో తోటివారు తనని మించిపోతున్నారన్న ఆందోళన, కన్నవారు తనపై పెట్టుకున్న ఆశల్ని అందుకోలేకపోతున్నానన్న చింత నానాటికీ అధికమవుతుంటుంది. దానికితోడు కార్పొరేట్ కళాశాలల్లో బట్టీకొట్టించే విధానం, వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉండే పద్ధతులు వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పర్యవసానంగా మానసికంగా బలహీనపడి తీవ్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఆ వయసు పిల్లల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంటున్నదన్న ఆరా అటు తల్లిదండ్రులకూ, ఇటు అధ్యాపకులకూ లేకుండా పోతోంది. నిండైన ఆత్మవిశ్వాసంతో మెలగాల్సిన వయసులో పిల్లల్లో బేలతనం ఎందుకు ముసురుకుంటున్నదో ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అర్ధంలేని పోటీని పెంచు తున్న ప్రస్తుత విద్యా విధానాన్ని సమూలంగా ప్రక్షాన చేయాలి.