వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు మెరిశారు.
అత్యుత్తమ ర్యాంకులతో ‘అనంత’ విద్యార్థుల సత్తా..
జాతీయస్థాయిలో మనోజ్ పవన్‌కుమార్‌రెడ్డి 59వ ర్యాంకు
నీరజ్‌పవన్‌రెడ్డికి 70, శ్రీనివాస కల్యాణ్‌కు 851వ ర్యాంకు
అనంతపురం ఎడ్యుకేషన్, హిందూపురం రూరల్ / తాడిపత్రి టౌన్ / కదిరి : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు మెరిశారు. శుక్రవారం వెలువడిన ఈ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకుని సత్తా చాటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. హిందూపురంలోని డాక్టర్ భాస్కర్‌రెడ్డి, అరుణకుమారి దంపతుల కుమారుడు గాలివీడు మనోజ్ పవన్‌కుమార్‌రెడ్డి జాతీయస్థాయిలో 59వ ర్యాంకు సాధించాడు. మనోజ్ పవన్‌కుమార్‌రెడ్డి విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ చదివాడు.
ఏపీ ఎంసెట్‌లో 6వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్‌లో 4వర్యాంకు, జిప్‌మర్‌లో 42వర్యాంకు, ప్రతిష్టాత్మాక ఎయిమ్స్ పరీక్షలో 38వ ర్యాంకు సాధించి ఆగ్రస్థానంలో నిలిచాడు. భవిష్యత్తులో న్యూరోసర్జన్ కావాలన్నదే లక్ష్యమని చెప్పాడు. తాడిపత్రిలోని యల్లనూర్ రోడ్డుకు చెందిన నీరజ్‌పవన్‌రెడ్డి నీట్‌లో జాతీయస్థాయిలో 70వ ర్యాకు కైవసం చేసుకున్నాడు. ఈయన తండ్రి ఈయన తండ్రి సూర్య ప్రకాష్‌రెడ్డి చిన్నపిల్లల డాక్టర్, తల్లి శ్రీదేవి గృహిణి. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో బైపీసీ చదవి 989 మార్కులు సాధించాడు. - హిందూపురం పట్టణం ముద్దిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసకల్యాణ్ 851వ ర్యాంకు సాధించారు. శ్రీనివాస్ కల్యాణ్ తల్లిదండ్రులు నాగరాజు, అరుణ చేనేత కార్మికులు.
- కదిరి పట్టణం అడపాల వీధికి చెందిన అబీద్ అనే విద్యార్థి జాతీయస్థాయిలో 2,212వ ర్యాంకు సాధించాడు. ఇంటర్ విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. తండ్రి ఖాదర్‌బాషా ఎన్‌పీకుంట మండలం గూటిబైలు ఉన్నతపాఠశాల ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. ఎటువంటి కోచింగ్ లేకుండానే అబీద్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవ«ధులు లేవు. మంచి న్యూరాలజిస్ట్ కావాలనేది తన కోరిక అని అబీద్ తెలిపాడు.
- కదిరి పట్టణం ఎన్‌జీఓ కాలనీలో ఉంటున్న రాజు శంకర్ దీక్షిత్ జాతీయ స్థాయిలో 2,914వ ర్యాంకు సాధించాడు. విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. దీక్షిత్ తండ్రి శంకర్‌రెడ్డి నల్లచెరువు మండలం రాట్నాలపల్లి ఎంపీయూపి స్కూల్‌లో సైన్స్ అసిస్టెంట్, తల్లి ఉషారాణి ఎన్‌పీకుంట మండలం గూటిబైలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్స్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లా ప్రజలు ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే తాను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌గా సేవలందించాలన్నది తన కోరిక అని దీక్షిత్ తెలిపాడు.
- కొత్తచెరువు మండలం తలమర్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులైన ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎ.శశికళల కుమార్తె నారపరెడ్డిగారి శ్రీలేఖ్యరెడ్డి జాతీయస్థాయిలో 3,687 ర్యాంకు సాధించింది. అనంతపురం నగరంలో నివాసం ఉంటున్ర శ్రీలేఖ్యరెడ్డి ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చదివి 978 మార్కులు సాధించింది. భవిష్యత్తులో మంచి కార్డియాలజిస్ట్ (గుండె చికిత్స నిపుణులు) అయ్యి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తానని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర కార్యదర్శి కె.శంకర్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు రామసుబ్బారెడ్డి, అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తచెరువు లైబ్రరీ అధికారి బుల్లే శంకర్ తదితరులు శ్రీలేఖ్యరెడ్డిని అభినందించారు.
- తాడిపత్రి పట్టణానికి చెందిన అభిషేక్‌రెడ్డి జాతీయ స్థాయిలో 13,650వ ర్యాంకు సాధించాడు. ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చదివాడు. ఈయన తండ్రి శ్రీనివాసరెడ్డి చుక్కలూరు క్రాస్ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తల్లి ఇందిర గృహణి.
- అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో గల చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు హరిచందన జాతీయస్థాయిలో 4,047 ర్యాంకు, అనూషా 7,175, శ్రీకృష్ణదేవరాయలు 11,422, సాయి నిఖిల్‌రెడ్డి 25, 092, చరణ్య 26,754, అప్సనజ్నిన్ 34,498, మానస 42,438, పవన్‌కుమార్ 48,704 ర్యాంకులు సాధించారు.