పేపర్‌ లీక్‌ అయినా నీట్‌ పరీక్ష రద్దు చేయరా? | Union Minister Explains Why NEET Exam Is Not Cancelled Despite Paper Leak, More Details Inside | Sakshi
Sakshi News home page

NEET Row 2024: పేపర్‌ లీక్‌ అయినా నీట్‌ పరీక్ష రద్దు చేయరా?

Published Sat, Jun 22 2024 12:40 PM | Last Updated on Sat, Jun 22 2024 1:21 PM

Union Minister Explains Why NEET Exam Is Not Cancelled Despite Paper Leak

న్యూఢిల్లీ: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-యూజీ 2024  పరీక్షపై వివాదంం రోజురోజుకీ ముదురుతోంది. ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ,  పేప‌ర్ లీక్ అయ్యిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  నీట్ ప‌రీక్ష‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే కౌన్సింగ్ ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేసి కొత్త‌గా ఎగ్జామ్‌ నిర్వ‌హించాలనే డిమాండ్ వెల్లువెత్తోంది.

అయితే గతంలో నీట్‌ పేపర్‌ లీక్‌ అయినప్పుడు పరీక్షను రద్దు చేశారు. మరి ఈ దఫా అందుకు ఒకవైపు కేంద్రం.. మరోవైపు  ఈ పరీక్షను నిర్వ‌హించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ స‌సేమిరా అంటోంది. అందుకు కారణం ఏంటో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేద్ర ప్ర‌ధాన్ వివరణ ఇచ్చారు. 

‘‘పేప‌ర్ లీక్ పరిమిత సంఖ్యలో విద్యార్థులను మాత్రమే ప్రభావితం చేసిందని చెప్పారు. పరీక్షను రద్దు చేయడం వల్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది’’ అని అన్నారాయన. అలాగే ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తోందని, కోర్టే తీసుకునే నిర్ణ‌య‌మ‌ని, తుది నిర్ణయమ‌ని చెప్పారు. అయితే 2004, 2015లో విస్తృతమైన లీక్‌లు జ‌రగ‌డం వ‌ల్ల అప్ప‌టి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేయడానికి దారితీసిన‌ట్లు చెప్పారు.

కాగా నీట్ యూజీ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించ‌డంతో  వివాదం చెల‌రేగింది.   ప్రశ్నపత్రం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు, తప్పుడు ప్రశ్నలు రావ‌డం కార‌ణంగా  కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చిన‌ట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది.

మే 5న నిర్వ‌హించిన నీట్ యూజీ పరీక్షను దాదాపు 24 ల‌క్ష‌ల మంది విద్యార్ధులు రాశారు. జూన్ న4న విడుద‌ల ఫ‌లితాల్లో 67 మంది అభ్య‌ర్ధుల‌కు 720 మార్కులు సాధించారు. దీంతో ప్ర‌శ్న ప‌త్రం లీక్ అయ్యిందంటూ, 1500 మంది విద్యార్ధుల‌కు గ్రేస్ మార్కులు క‌ల‌ప‌డంపై వివాదం చెల‌రేగింది.  ప‌రీక్ష‌కు ఒక రోజు ముందు పేప‌ర్ లీక‌వ‌డంపై ప‌లువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది.  అయితే పరీక్షను రద్దు చేయడానికి కేంద్రం నిరాకరించింది. ఈ వివాదాల న‌డుమ‌నే జులై మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఎన్టీఏ సన్నాహకాలు చేస్తుండగా.. సుప్రీం కోర్టు సైతం కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలన్న అభ్యర్థలను తోసిపుచ్చుతూ వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement