లంక సిస్టర్స్‌.. ఇద్దరూ డాక్టర్స్‌..!  | West Godavari: Sisters From Same Family Have Best Ranks In NEET | Sakshi
Sakshi News home page

లంక సిస్టర్స్‌.. ఇద్దరూ డాక్టర్స్‌..! 

Published Mon, Oct 10 2022 7:35 PM | Last Updated on Tue, Oct 11 2022 7:23 AM

West Godavari: Sisters From Same Family Have Best Ranks In NEET - Sakshi

ఐశ్వర్య-సాయి తేజస్వి

పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్‌ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్‌ (ఎండీఎస్‌)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది.
చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?

అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్‌లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement