Best ranks
-
లంక సిస్టర్స్.. ఇద్దరూ డాక్టర్స్..!
పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్ (ఎండీఎస్)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్
కొంతకాలంగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తోన్న భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అధిరోహించాడు. ఆదివారం చైనాలో ముగిసిన కున్మింగ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్నేశ్... సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 75వ ర్యాంక్‌ను అందుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ ఐదు స్థానాలు... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి వరుసగా 151వ ర్యాంక్‌లో, 247వ ర్యాంక్‌లో ఉన్నారు. -
ఎంసెట్–3లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్‌అర్బన్ : ఎంసెట్–3 ఫలితా ల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. గత ఆదివారం పరీక్ష జరగగా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 1,702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,150 మంది పరీక్షకు హాజరయ్యారు. 552 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మాక్లూర్ మండలం వల్లభపూర్కు చెందిన న్యాలకంటి సాయిచరణ్రావు 82వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు లత, రాజేశ్వర్రావులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన డి.ఈశ్వర్ 150వ ర్యాంకు, నిజామాబాద్ నగరానికి చెందిన డి.సహన 259వ ర్యాంకు, మేఘ శ్రావణ్ 268వ ర్యాంకు , ఎ.నిహారిక 538వ ర్యాంకు సాధించారు. అలాగే ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సంతోష్–2,500, అంజలి–2,839, నమిరా–3,331, రిధ–3,862 ర్యాంకులు సాధించారు. కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన శ్రీకాంత్–1,925 ర్యాంకు సాధించారు. శ్రీకాంత్‌ను కళాశాల చైర్పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్‌లు అభినందించారు. భీమ్‌గల్ విద్యార్థినికి 542వ ర్యాంకు భీమ్‌గల్ : మండల కేంద్రానికి చెందిన ముప్పిడి సుస్మిత గురువారం విడుదలైన ఎంసెట్–3 ఫలితాల్లో సత్తా చాటాంది. 160 మార్కులకు గాను 139 మార్కులతో 542 ర్యాంకు సాధించింది. ఎంసెట్–2లో కూడా సుస్మిత 884 ర్యాంకు సాధించగా ఈసారి మరింత మెరుగైన ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ముప్పిడి ఝాన్సీలక్ష్మి, ముప్పిడి లింబాద్రి స్వామిలు ఆనందం వ్యక్తం చేశారు. 969 ర్యాంక్ సాధించిన సుదీప్తిరెడ్డి తాడ్వాయి : మండలంలోని ఎర్రాపహడ్ గ్రామానికి చెందిన సుదీప్తిరెడ్డి ఎంసెట్–3 ఫలితాల్లో 969వ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు సునీత, రాజిరెడ్డిలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు విద్యార్థిని సుదీప్తి రెడ్డిని అభినందించారు. కాచాపూర్ విద్యార్థికి 732 ర్యాంక్ భిక్కనూరు : మండలంలోని కాచాపూర్ విద్యార్థి గోగుల నవ్యకు ఎంసెట్–3లో 732 ర్యాంక్ వచ్చింది. గురువారం వెలువడిన ఫలితాల్లో నవ్య 136 మార్కులు సాధించింది. గత ఎంసెట్–2లో గోగుల నవ్య 136 మార్కులు సాధించి 418 ర్యాంక్ సాధించింది. ప్రభుత్వం ఎమ్సెట్–2ను రద్దుచేసి ఎంసెట్–3ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్‌లో దోమకొండ విద్యార్థుల ప్రతిభ దోమకొండ : రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఎంసెట్–3 ఫలితాల్లో దోమకొండ విద్యార్థులు ప్రతిభ చూపారు. దోమకొండకు చెందిన పన్యాల సంకీర్తన 143 మార్కులతో 223వ ర్యాంకును సాధించింది. అదే విధంగా దోమకొండకు చెందిన సబ్బని వంశీ 138 మార్కులతో 568వ ర్యాంకును సాధించాడు. వీరు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండ విద్యార్థికి 124వ ర్యాంకు బాల్కొండ : ఎంసెట్–3 ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన కేఆర్ నిశ్విత్రెడ్డి 124వ ర్యాంకు సాధించాడు. 160 మార్కులకు గాను 147 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. ర్యాంకు సాధించడంలో తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నితీశ్‌కు 571 ర్యాంకు నిజామాబాద్‌అర్బన్ : ఎంసెట్–3 ఫలితాల్లో నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మాడవేడి నితీశ్ 571 ర్యాంకు సాధించాడు. దీంతో విద్యార్థి తండ్రి శ్యాం ఆనందం వ్యక్తం చేశారు. -
భారీగా పెరిగిన కటాఫ్
ఇంజనీరింగ్, ఫార్మసీ తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల్లో ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. ఉత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకే మంచి కాలేజీల్లో సీట్లు లభించాయి. టాప్ కాలేజీల్లోని అన్ని బ్రాంచీల్లో కలిపి పరిశీలిస్తే... గతేడాదికంటే ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల సగటు ర్యాంకు సగానికిపైగా పెరిగింది. ఉదాహరణకు సీబీఐటీ వంటి కాలేజీలోని అన్ని బ్రాంచీల్లో గతేడాది 6వేల ర్యాంకు వరకు ఓసీ అభ్యర్థులకు సీట్లు వస్తే... ఈసారి 3వేల ర్యాంకులోపే సీట్లన్నీ నిండిపోయాయి. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు తగ్గిపోవడం, కోర్టు ఆదేశాల వల్ల వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టిన కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో కటాఫ్ భారీగా పెరిగిపోయింది. సీఎస్ఈ, ఈసీఈ వంటి బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గిపోవడం కూడా దీనికి కారణమైంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు సీట్లు కేటాయించారు. విద్యార్థులు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి తమ ర్యాంకు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. గత నెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా.. ఈనెల 17నుంచి 24వ రకు వెబ్ ఆప్షన్లు నిర్వహించారు. 34 కాలేజీలు మూతే! ఈసారి 5 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 29 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు చేరారు. ఈ 34 కాలేజీలు ఈసారి మూతపడే అవకాశముంది. ఇక 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య కూడా మరో 60 నుంచి 70 వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఈసారి వంద కాలే జీల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదన్నది అర్థం అవుతోంది. ఇక 100 శాతం ప్రవేశాలు జరిగిన కాలేజీలు 79 ఉన్నాయి. 9 వేల మందికి లభించని సీట్లు.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 86,313 సీట్లు ఉండగా.. 53,347 సీట్లు (61.81 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 32,966 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 9,321 మంది విద్యార్థులకు సీట్లు రాలేదు. వారి ర్యాంకును బట్టి కాలేజీని ఎంచుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫార్మసీకి దెబ్బ: రాష్ట్రంలో 133 ఫార్మసీ కాలేజీల్లో 3,778 ఎంపీసీ స్ట్రీమ్ సీట్లు ఉండగా.. అందులో 125 సీట్లే భర్తీ అయ్యాయి. కాలేజీల సంఖ్య మేర కూడా విద్యార్థులు చేరలేదు. ఇదీ చివరి దశ ప్రవేశాల షెడ్యూల్ * 29న మొదటి దశలో పాల్గొనని వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * 29 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులు * 31న సీట్ల కేటాయింపు * ఆగస్టు 1న కాలేజీల్లో చేరేందుకు అవకాశం, అదే రోజునుంచి తరగతులు