ఎంసెట్–3లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ఎంసెట్–3లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
Published Fri, Sep 16 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
నిజామాబాద్‌అర్బన్ : ఎంసెట్–3 ఫలితా ల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. గత ఆదివారం పరీక్ష జరగగా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 1,702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,150 మంది పరీక్షకు హాజరయ్యారు. 552 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మాక్లూర్ మండలం వల్లభపూర్‌కు చెందిన న్యాలకంటి సాయిచరణ్‌రావు 82వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు లత, రాజేశ్వర్‌రావులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన డి.ఈశ్వర్ 150వ ర్యాంకు, నిజామాబాద్ నగరానికి చెందిన డి.సహన 259వ ర్యాంకు, మేఘ శ్రావణ్ 268వ ర్యాంకు , ఎ.నిహారిక 538వ ర్యాంకు సాధించారు. అలాగే ఎస్‌ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సంతోష్–2,500, అంజలి–2,839, నమిరా–3,331, రిధ–3,862 ర్యాంకులు సాధించారు. కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన శ్రీకాంత్–1,925 ర్యాంకు సాధించారు. శ్రీకాంత్‌ను కళాశాల చైర్‌పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్‌లు అభినందించారు.
భీమ్‌గల్ విద్యార్థినికి 542వ ర్యాంకు
భీమ్‌గల్ : మండల కేంద్రానికి చెందిన ముప్పిడి సుస్మిత గురువారం విడుదలైన ఎంసెట్–3 ఫలితాల్లో సత్తా చాటాంది. 160 మార్కులకు గాను 139 మార్కులతో 542 ర్యాంకు సాధించింది. ఎంసెట్–2లో కూడా సుస్మిత 884 ర్యాంకు సాధించగా ఈసారి మరింత మెరుగైన ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ముప్పిడి ఝాన్సీలక్ష్మి, ముప్పిడి లింబాద్రి స్వామిలు ఆనందం వ్యక్తం చేశారు.
969 ర్యాంక్ సాధించిన సుదీప్తిరెడ్డి
తాడ్వాయి : మండలంలోని ఎర్రాపహడ్ గ్రామానికి చెందిన సుదీప్తిరెడ్డి ఎంసెట్–3 ఫలితాల్లో 969వ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు సునీత, రాజిరెడ్డిలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు విద్యార్థిని సుదీప్తి రెడ్డిని అభినందించారు.
కాచాపూర్ విద్యార్థికి 732 ర్యాంక్
భిక్కనూరు : మండలంలోని కాచాపూర్ విద్యార్థి గోగుల నవ్యకు ఎంసెట్–3లో 732 ర్యాంక్ వచ్చింది. గురువారం వెలువడిన ఫలితాల్లో నవ్య 136 మార్కులు సాధించింది. గత ఎంసెట్–2లో గోగుల నవ్య 136 మార్కులు సాధించి 418 ర్యాంక్ సాధించింది. ప్రభుత్వం ఎమ్‌సెట్–2ను రద్దుచేసి ఎంసెట్–3ని నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎంసెట్‌లో దోమకొండ విద్యార్థుల
ప్రతిభ
దోమకొండ : రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఎంసెట్–3 ఫలితాల్లో దోమకొండ విద్యార్థులు ప్రతిభ చూపారు. దోమకొండకు చెందిన పన్యాల సంకీర్తన 143 మార్కులతో 223వ ర్యాంకును సాధించింది. అదే విధంగా దోమకొండకు చెందిన సబ్బని వంశీ 138 మార్కులతో 568వ ర్యాంకును సాధించాడు. వీరు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
బాల్కొండ విద్యార్థికి 124వ ర్యాంకు
బాల్కొండ : ఎంసెట్–3 ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన కేఆర్ నిశ్విత్‌రెడ్డి 124వ ర్యాంకు సాధించాడు. 160 మార్కులకు గాను 147 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చాడు. ర్యాంకు సాధించడంలో తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
నితీశ్‌కు 571 ర్యాంకు
నిజామాబాద్‌అర్బన్ : ఎంసెట్–3 ఫలితాల్లో నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మాడవేడి నితీశ్ 571 ర్యాంకు సాధించాడు. దీంతో విద్యార్థి తండ్రి శ్యాం ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement