సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
అగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.
EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)
- మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ)
- రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ)
- మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్ల
- ఇంజనీరింగ్ విభాగంలో టాట్‌టెన్‌లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.
EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)
- మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ)
- రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ)
- మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)
ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్‌ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్‌కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment