EAMCET
-
75,200 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపట్టారు. సాంకేతిక విద్య విభాగం ఇందుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించింది. మొత్తం 175 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. కనీ్వనర్ కోటా కింద 78,694 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిల్లో 75,200 సీట్లు భర్తీ చేశారు. 3,494 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 95.56 శాతం సీట్లు భర్తీ చేసినట్టు అధికారులు తెలిపారు. 95,735 మంది 62,60,149 ఆప్షన్లు ఇచ్చారు. 20,535 సరైన ఆప్షన్లు ఇవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,038 మందికి సీట్లు వచ్చాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్ రిపోరి్టంగ్ చేయాలని సూచించారు. ముందుకు రాని టాపర్స్ ఈఏపీ సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందడానికే ప్రాధాన్యమిచ్చారు. వందలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కేవలం ఒక్కరే తొలి కౌన్సెలింగ్‌లో సీటు కోసం పోటీ పడ్డారు. 201 నుంచి 500 ర్యాంకులు వచి్చన వాళ్ళు కూడా 10 మందే ఉన్నారు. ఆఖరుకు వెయ్యిలోపు ర్యాంకర్లు కూడా 74 మంది మాత్రమే కని్పంచారు. 5 వేలు పైబడిన ర్యాంకు వచ్చిన వాళ్ళే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నించారు. 53 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనేభర్తీ అయిన 75,200 సీట్లల్లో 53,517 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇతర కంప్యూటర్ సైన్స్ అనుబంధ గ్రూపుల్లోనే ఉన్నాయి. వివిధ విభాగాలుగా ఉన్న ఆరి్టఫిíÙయల్ ఇంటలిజెన్స్ బ్రాంచీలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈలో 99.80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సుల్లోనూ 97 శాతంపైగా సీట్లుకేటాయించారు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ ఇంజనీరింగ్‌ల్లో సీట్లు తక్కువగా ఉన్నా మిగిలిపోయాయి. -
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్నాక యోగ చేస్తూ బిజీగా ఉంటోంది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో అలరించిన భామ.. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ అభిమానిపై ప్రశంసలు కురిపించింది.ఇటీవల రిలీజైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సమంత అభిమాని మంచి ర్యాంకు సాధించింది. తన డైహార్డ్ ఫ్యాన్ అయిన అమ్మాయి ఎంసెట్ ర్యాంక్ సాధించడంతో సమంత ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమెతో దిగిన ఫోటోను పంచుకుంది. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ ఛాంపియన్ అంటూ సమంత రాసుకొచ్చింది. తన అభిమాని అయిన స్టూడెంట్ను స్టార్ హీరోయిన్ సమంత అభినందించడం చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
Watch Live: తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల..
-
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ) రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ) మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్లఇంజనీరింగ్ విభాగంలో టాట్టెన్లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ) రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ) మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్‌ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్‌కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు. -
ఒక్క క్లిక్‌తో ఈఏపీ సెట్ ఫలితాలు
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాను ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి... ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఇంకా ‘సెట్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పరీక్షల (సెట్ల)పై ఇంకా కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్ సహా పాలిసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్‌పై అయోమయం నెలకొంది. ఏ ప్రవేశపరీక్షను ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలి? ఏ పరీక్షకు కన్వీనర్ ఎవరనే సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళమే దీనికి కారణమని.. దీంతో ఈసారి ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా.. ఏటా జనవరిలో ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఆయా పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ఖరారు చేస్తారు. ఆ వెంటనే ఆయా కన్వీనర్లు, యూనివర్సిటీల ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించిన కసరత్తు, ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ ఈసారి జనవరి మూడోవారం ముగుస్తున్నా.. షెడ్యూల్ విడుదలకు సంబంధించిన ఎలాంటి కసరత్తు మొదలుకాలేదు. ఎంసెట్‌పై కసరత్తు ఏదీ? జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్‌ను ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ నుంచి జోసా కౌన్సెలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా జేఈఈ తేదీలకు అనుగుణంగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేస్తారు. షెడ్యూల్ ప్రకటన తర్వాత.. ఎంసెట్ జరిగి, ఫలితాలు వచ్చి, కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి విశ్వవిద్యాలయాలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేసి.. అర్హత ఉన్నవాటికి అనుబంధ గుర్తింపు ఇస్తాయి. సాధారణంగా మేలో ఎంసెట్ నిర్వహించి, అదే నెలలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈసారి గందరగోళంతో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని విద్యావేత్తలు చెప్తున్నారు. హడావుడిగా జరిగితే ఇబ్బందులే.. సాధారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షల ప్రక్రియ ఏటా నవంబర్ నుంచే మొదలవుతుంది. వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి సమావేశం ఏర్పాటు చేసి.. సెట్స్‌కు కన్వీనర్లను ఎంపిక చేయాలి. వారు ప్రశ్నపత్రాల తయారీపై దృష్టి పెడతారు. ప్రశ్నల రూపకల్పనకు సంబంధించి నిపుణులను పిలిపిస్తారు. కంప్యూటర్ బేస్డ్గా దాదాపు పది రకాల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులో కఠినమైనవి, తేలికైనవి అత్యంత గోప్యంగా తయారు చేయాలి. తర్వాత వాటన్నింటినీ కలిపి కంప్యూటర్ సాయంతో ఫైనల్ పేపర్‌ను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. తర్వాత పరీక్ష కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల సగటు పరిశీలన ఉంటాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల క్రోడీకరణకు ఎక్కువ సమయం పడుతుంది. పలు దఫాలుగా వీసీలు, ప్రొఫెసర్లు సమావేశాలు జరుపుతూ ఉంటే.. ఇవన్నీ సాఫీగా సాగుతాయి. ఈసారి ఇప్పటికీ విద్యా మండలి సమావేశమే జరగలేదు. ఆలస్యంగా ప్రక్రియ మొదలుపెట్టి హడావుడిగా చేస్తే.. ఎక్కడైనా లోపం జరిగితే.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సన్నద్ధతకూ ఇబ్బంది ఎంసెట్ ఆలస్యం వల్ల విద్యార్థుల సన్నద్ధతకు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇబ్బంది రావొచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ రాసే విద్యార్థుల్లో చాలా వరకు జేఈఈ మెయిన్స్‌కు కూడా సిద్ధమవుతారు. మెయిన్స్ రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతుంది. అది పూర్తయ్యాక మేలో ఎంసెట్ రాస్తుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటారు. ఎంసెట్ ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని, కోచింగ్ కేంద్రాల వారు అదనపు ఫీజులు వసూలు చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్ఐటీల్లో సీట్ల కౌన్సెలింగ్ నాటికి ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవకపోతే.. కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయా? రావా? అన్న ఆందోళన కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. ఉన్నత విద్యా మండలిలో గందరగోళం! రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సంబంధించి డిసెంబర్లోనే యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు. తేదీ కూడా ఖరారు చేశారు. సెట్ కన్వీనర్ల ఎంపికకూ రంగం సిద్ధమైంది. ఈలోగా కొత్త ప్రభుత్వం మండలి చైర్మన్‌తోపాటు, వైస్ చైర్మన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో.. వీసీలతో సమావేశం వాయిదా పడింది. అయితే ప్రభుత్వం కొత్తవారిని నియమించలేదు. తొలగిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఇంకా అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి సీఎం సమీక్షల్లో సరైన సమాచారం ఇవ్వడానికి మండలిలో ఎవరూ లేకపోవడంతో.. వారిని కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీరినే తిరిగి నియమించే అవకాశం ఉందనీ అంటున్నారు. సమావేశాలకు వీసీల విముఖత ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో.. అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు వీలుకావడం లేదని మండలి వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఉమ్మడి ప్రవేశపరీక్షలపై చర్చించేందుకు వెళ్లడానికి వర్సిటీల వీసీలూ సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నాయి. సెట్స్ కోసం కన్వీనర్లను సూచించాలని మండలి నుంచి లేఖలు వచ్చినా.. యూనివర్సిటీల వీసీలు నిర్లిప్తంగా ఉంటున్నారు. ‘‘ముందు చైర్మన్, వైస్ చైర్మన్లను కొనసాగిస్తారా? కొత్తవారిని తెస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేం సెట్స్ కన్వీనర్ల పేర్లు ఇచ్చినా.. కొత్త చైర్మన్ వస్తే మార్పులు ఉంటాయి..’’ అని ఓ వర్సిటీ వీసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదరణ పెరుగుతున్నా..! కొన్నేళ్లుగా ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రస్థాయిలో సీట్లు ఎక్కువగా ఉండటం, ఉపాధి కోసం, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లడానికి అవకాశం ఉండటంతో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. 2018లో 2.20 లక్షల మంది ఎంసెట్ రాస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 3 లక్షలు దాటింది. పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా 20శాతం దాకా పెరుగుతోంది. నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఎంసెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చర్) తప్పనిసరి చేయడంతోనూ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎంసెట్‌కు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇదీ.. ఏడాది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ 2018 1,47,912 73,078 2019 1,42,218 74,981 2020 1,43,326 78,981 2021 1,64,963 86,641 2022 1,61,552 88,156 2023 1,95,275 1,06,514 త్వరలో నిర్ణయం.. నా కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సకాలంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాం. ఆ దిశగా త్వరలో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
మేలో ఎంసెట్?
సాక్షి, హైదరాబాద్ః ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడవ్వడంతో ఎంసెట్‌పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి అధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సమీక్ష జరిపారు. సాధారణంగా ఎంసెట్ పరీక్షల తేదీలను ఇంటర్, జేఈఈ మెయిన్స్ తేదీలను బట్టి నిర్ణయిస్తారు. ఇంటర్ పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయి. జేఈఈ ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మే నెలలో ఎంసెట్ నిర్వహణ సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది జేఎన్టీయూహెచ్కు ఎంసెట్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది కూడా ఇదే యూనివర్సిటీకి ఇచ్చే వీలుంది. అయితే, ఎంసెట్ కన్వీనర్ ఎవరనేది ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సీజీజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర పరీక్షల తేదీలను గుర్తించి, ఎంసెట్ తేదీలను ఖరారు చేయడానికి ఇది తోడ్పడుతుంది. టెన్త్‌పై మరోసారి సమీక్ష గతేడాది ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎంసెట్ ప్రశ్న పత్రాం కూర్పుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్న తాధికారులు చర్చించారు. ఇదే క్రమంలో పదవ తరగతి పరీక్షలపైనా ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలు స్తోంది. మార్చితో ఇంటర్ పరీక్షలు ముగియడంతో ఇదే నెల ఆఖరు వారంలో లేదా ఏప్రిల్ మొదటి వా రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో మార్పులు, చేర్పులు చేయాలా అనే అంశంపై త్వరలో అధికారులు మరో దఫా సమీక్షించే వీలుంది. -
సెట్స్‌పై స్పష్టత దిశ గా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీ క్షల (సెట్స్)పై త్వరలోనే స్పష్ట త రానుంది. ఇప్పటికే విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు స మీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్‌కు కన్వీనర్లను నియమించే అంశాన్ని, ఏ పరీక్ష ఏ యూనివర్శిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికే ఉమ్మడి ప్రవేశ పరీ క్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మ న్ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్తవారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాల యాల అధికారులు సెట్స్‌పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి: ఉన్నత విద్య పరిధిలో ఎంసెట్ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇలా అనేక ప్రవేశ పరీక్షలుంటాయి. ఎంసెట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన తర్వాత యూనివర్శిటీలు కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడం వల్ల కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తోంది. జేఈఈ కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ మే మొదటి వారంలోనూ ఎంసెట్ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నారు. ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే... ఉన్నత విద్యా మండలి చైర్మన్, సభ్యుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఇతర సెట్స్‌పై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. పరీక్షల నాటికి నియామకాలు జరుగుతాయనీ, అప్పటి వరకూ నిర్ణయాలన్నీ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. కాగా, త్వరలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు శాఖాపరమైన పూర్తి సమాచారంతో సిద్ధమయ్యారు. సీఎం సమీక్షా సమావేశంలో సెట్స్‌పై స్పష్టత వస్తుందనీ, వచ్చే వారంలో సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మేలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2024)లో నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షల కన్వినర్ల ఎంపికకు సంబంధించిన అర్హులైన వారి జాబితాలను ఆయా వర్సిటీల వీసీలు ఉన్నత విద్యామండలికి పంపాల్సి ఉంటుంది. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చించి, పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తారు. మండలి పరిధిలో ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పాలిసెట్, పీజీ సెట్ ఉంటాయి. సాధారణంగా వీటిని మే నెల నుంచి మొదలు పెడతారు. వీటిల్లో ఎంసెట్ కీలకమైంది. కేంద్రస్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. జనవరి, ఏప్రిల్ నెలల్లో మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. దీని తర్వాత జాతీయ ఇంజనీరింగ్, ఐఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ చేపడుతుంది. దీన్ని పరిగణనలోనికి తీసుకునే ఎంసెట్ తేదీలు ఖరారు చేస్తారు. కోవిడ్ సమయం నుంచి జేఈఈతో పాటు, ఎంసెట్ కూడా ఆలస్యంగా జరిగాయి. గత ఏడాది మాత్రం సకాలంలో నిర్వహించారు. ఇప్పుడా ప్రతిబంధకం లేకపోవడంతో మే నెలలోనే ఎంసెట్ చేపట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎంసెట్ సిలబస్, ఇంటర్ మార్కుల వెయిటేజీపై మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోవిడ్ కాలంలో ఇంటర్ పరీక్షలు లేకపోవడంతో వెయిటేజీని ఎత్తివేశారు. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు జరిగిన వెయిటేజీ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా వెయిటేజీ లేకుండా చేయడమా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త విద్యాశాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా వారం రోజుల్లో అన్ని సెట్స్‌పైన స్పష్టమైన విధానం వెల్లడించే వీలుందని కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన ఎంసెట్–23 ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్–2023 ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో వివిధ కాలేజీల్లో 16,296 ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. ఇవి ఖాళీగా ఉన్నట్టే లెక్క. అడపాదడపా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే సీట్లు నింపుకునే అవకాశముంది. ఇలా నిండేవి స్పల్పంగానే ఉంటాయి. ♦ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కోర్సుల్లో 5,723 సీట్లు, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ల్లో 4,959, సివిల్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో 5,156, ఇతర బ్రాంచ్‌ల్లో మరో 458 సీట్లకు అడ్మిషన్లు జరగలేదు. ♦ రాష్ట్రంలో 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్ సీట్లుండగా, వీటిలో 69,375 సీట్లు (80.97శాతం) భర్తీ అయ్యాయి. ♦ యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు, 289 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 29లోగా ఫీజు చెల్లించాలి ఎంసెట్–23 స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. ఈ సీట్లు పొందిన వారు ఈనెల 29లోపు ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు టీసీతో పాటు ఒరిజినల్ సరి్టఫికెట్లు కాలేజీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. -
19 వేల సీట్లకు 17 నుంచి కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు ఇంకా 19,049 మిగిలాయి. ఆదివారం మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ లెక్క తేలినట్టు సాంకేతిక విద్య విభాగం వెల్లడించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు 3,034 వరకూ ఉన్నాయి. ఈసారి సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ సీట్లను అన్ని కాలేజీలు ముందే భారీగా తగ్గించుకున్నాయి. ఈ బ్రాంచీల్లో మొత్తం 7 వేల సీట్లకు కోత పడింది. ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు పెరిగాయి. ఇవి కాకుండా మరో 7 వేల వరకూ కొత్తగా కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీల్లో సీట్లు పెరిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులే 56,811 ఉన్నాయి. ఈ విధంగా కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెరగడంతో టాప్ 20 కాలేజీల్లో సీట్లు వంద శాతం భర్తీ అయ్యాయి. అంతగా పేరులేని, గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో మాత్రం కంప్యూటర్ కోర్సుల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రాకల్స్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువే (కాలేజీలు తగ్గించుకోవడం వల్ల) ఉన్నప్పటికీ, చివరకు వాటిల్లోనూ భారీగా సీట్లు మిగిలాయి. ఇలా మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. -
నేడు తుది దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరగనుంది. ఈ విడతలో వివిధ బ్రాంచీలకు చెందిన 19 వేల సీట్లను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు ఆ విడతలో సీట్లు లభించినా రిపోర్టు చేయకపోవడంతో మిగిలిపోయిన 18 వేల సీట్లను కలిపి రెండో దశలో 30 వేలకుపైగా సీట్లు కేటాయించారు. రెండో దశలోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఆ విడతలో సీట్లు లభించినా 7 వేల మంది చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌లో 19 వేల వరకూ సీట్లు కేటాయించనున్నారు. 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ తుది విడత సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. ఎన్ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ కూడా పూర్తవ్వడంతో వాటిల్లో సీట్లు పొందని వారికి ఇది ఉపయోగపడుతుంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వగానే ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేసి సీటు దక్కించుకోవాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పిడి చేసుకోవాలి. వేరొక కాలేజీలో సీటు వచి్చన పక్షంలో అంతకుముందు రిపోర్టు చేసిన కాలేజీలో టీసీ, ఇతర సరి్టఫికెట్లను ఈ నెల 25లోగా తీసుకొని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టు చేయాలి. యాజమాన్య కోటా సీట్ల పరిశీలన ఎంసెట్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ప్రత్యేక కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను పంపాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐ సిఫార్సులకు సీట్లు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. జేఈఈ, ఎంసెట్ ర్యాంకులను, ఇంటర్లో వచి్చన మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ రూల్స్ ఎంతమేర పాటించారనేది అధికారులు పరిశీలిస్తారు. -
టాపర్లంతా క్యాంపస్ కాలేజీలకే.. ఎక్కువ మంది మొగ్గు చూపింది ఈ కోర్సుకే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆప్షన్లు ఇచ్చే గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 16న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. తొలి దశలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సీట్లు పెరగడం, సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు వస్తాయని భావించడంతో ఎక్కువ మంది ఈ కోర్సును ఎంచుకున్నారు. విద్యార్థులు మొత్తం 49,42,005 ఆప్షన్లు ఇవ్వగా, వీటిలో 38 లక్షల వరకూ కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 3,777 సీట్లు ఉంటే, విద్యార్థుల నుంచి 10 లక్షలకు మించి ఆప్షన్లు రాలేదు. గడువు ముగిసే నాటికి మొత్తం 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఒకే విద్యార్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లు ఇచ్చారు. వాస్తవానికి 12వ తేదీన సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. దీంతో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గడువును పొడిగించారు. ర్యాంకర్ల నుంచి కన్పించని స్పందన తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ ర్యాంకులు పొందిన వారు తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లు అతి కొద్ది ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. విశ్వవిద్యాలయాల క్యాంపస్ పరిధిలో ఉండే సీట్లకు పోటీ పడ్డారు. 500 ర్యాంకు దాటిన వారు మాత్రం టాప్ టెన్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. ఎంసెట్‌లో వెయ్యి వరకూ ర్యాంకు సాధించిన విద్యార్థులు తొలి కౌన్సెలింగ్‌లో 500లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండేది. ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా ర్యాంకర్ల చేతే దరఖాస్తు చేయించి, సీటు వచ్చిన తర్వాత స్పాట్ అడ్మిషన్ సమయంలో రద్దు చేయించడం ఆనవాయితీగా సాగుతోంది. ఈ సంవత్సరం దీనిపై దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో వారు పొందిన సీట్ల వివరాలు తెప్పించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది. దీంతో సీట్లను బ్లాక్ చేసే యాజమా న్యాలకు సహరించేందుకు విద్యార్థులు వెనకడుగు వేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో ఉండే సీట్ల కోసమే ర్యాంకర్లు పోటీప డ్డారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో 630, జేఎన్టీయూహెచ్ పరిధిలో 2,580, కాకతీయ పరిధిలోని 1,080 సీట్లతో కలుపుకొని రాష్ట్రంలోని 9 వర్సిటీల పరిధిలో మొత్తం 4,773 సీట్లున్నాయి. వీటికే టాపర్లు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. తొలి విడతలో 76,359 సీట్లు ఈ ఏడాది సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో 14 వేల సీట్లు పెరిగాయి. 7 వేల వరకూ సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌లో తగ్గించుకున్న కాలేజీలు, ఆ మేర కంప్యూటర్ బ్రాంచీల్లో పెంచుకున్నాయి. దీంతోపాటు అదనంగా మరో 7 వేల వరకూ సీఎస్సీలో సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 42,087 సీట్లు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ బ్రాంచీల్లో ఉన్నాయి. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా టాపర్లు! కారణమిదే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలా మంది కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకపోవడమే కాదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. టాప్–200లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ జోలికి వెళ్లలేదు. 300లోపు ర్యాంకర్లలో కేవలం ఒక్కరు, 1000లోపు ర్యాంకర్లలో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50వేల నుంచి 2.5 లక్షల వరకు ర్యాంకులు వచ్చినవారే ఎక్కువగా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్ర ఎంసెట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 81,856 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. వారు ఈ నెల 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వడానికి సమయం ఉంది. సాధారణంగా ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తుంటారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. అందుకే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఈ నెల 12లోపు ఆప్షన్లు ఇవ్వకపోతే సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. 42వేల కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లను చేర్చారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్న సీట్లలో ఏకంగా 42,087 వరకు కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఇటీవలే.. సీఎస్సీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచారు. -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ►ఇంజనీరింగ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత ►అగ్రికల్చర్ 89.65 శాతం మంది ఉత్తీర్ణత ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ జాబితాలో ఈసారి అంతా బాలురే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు158 మార్కులతో ఉమేష్ వరుణ్ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణా ఎమ్ సెట్లో కూడా వరుణ్ మూడవ ర్యాంకు సాధించారు. విద్యార్థులకు అభినందనలు:బొత్స ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం విద్యార్దుల మంచి భవిష్యత్ కోసమేనని అన్నారు. దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఏపీని ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య కోసం వెచ్చించే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ధ పెరిగిందని అన్నారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు. డైరెక్ట్ లింక్ ఇదే.. ఇంజనీరింగ్ ఫలితాలు అగ్రికల్చర్ ఫలితాలు -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రి కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్(ఏపీ ఎంసెట్) ఆన్లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభయ్యాయి. ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 19 వరకు ఇంజనీరింగ్, 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 47 పట్టణాలలో 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు గంటన్నర ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి పంపించగా.. నిమిషం ఆలస్యమైనా అనుమతించడం లేదు. అభ్యర్థులు తమతోపాటు హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఏపీఈఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్‌ను వెంట తీసుకురావాలి. సెల్‌ఫోన్, వాచీలు, తదితర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించరు. బయో మెట్రిక్ హాజరు కోసం విద్యార్తినులెవరూ కూడా చేతులకి మెహందీ పెట్టుకు రాకూడదని సూచించారు ఒక్కో విభాగంలో అబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలు ఉండనున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో గణితానికి 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు.. బైపీసీలో బోటనీ 40, జువాలజీ 40 , ఫిజిక్స్ 40, కెమిస్డ్రీ 40 మార్కులకి ప్రశ్నలు ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకి తీసుకురాకూడదు. -
ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు
-
ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం నాటికి 3,38,407 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,037 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,370 మంది ఉన్నారు. ఈ మొత్తం దరఖాస్తులు గతేడాది ఆలస్య రుసుముతో చివరి గడువు నాటికి వచ్చిన వాటికంటే అధికంగా ఉండటం విశేషం. ఏపీ ఈఏపీసెట్‌కు రూ.5 వేల ఆలస్య రుసుముతో 12వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మంగళవారం నుంచి అభ్యర్థులకు cets.apsche.ap gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు అందించనున్నారు. మొత్తం 47 పరీక్ష కేంద్రాలు మన రాష్ట్రంలో 45, హైదరాబాద్‌లో రెండు కలిపి మొత్తం 47 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అనకాపల్లి, అనంతపురం, గుత్తి, తాడిపత్రి, మదనపల్లి, రాజంపేట, బాపట్ల, చీరాల, చిత్తూరు, పలమనేరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, మైలవరం, తిరువూరు, విజయవాడ, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీకాకుళం, టెక్కలి, గూడూరు, పుత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, బొబ్బిలి, రాజాం, విజయనగరం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కడప, ప్రొద్దుటూరుల్లోను, హైదరాబాద్‌లో ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం రోజుకు రెండు సెషన్లలో.. ఆన్లైన్లో.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జేఎన్టీయూ అనంతపురం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఒక్కో విభాగంలో ఆబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ఇలా ఇంజనీరింగ్ విభాగంలో గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయ, ఫార్మా విభాగంలో బయాలజీ 80 (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. హాల్టికెట్లలో తేడాలుంటే.. ఏపీ ఈఏపీసెట్ హాల్టికెట్లలో తేడాలుంటే 08554–23411, 232248 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలపవచ్చని, లేదా జ్ఛి pఛ్ఛీటజ్చుp్ఛ్చpఛ్ఛ్టి–2023ః జఝ్చజీ .ఛిౌఝకు మెయిల్ పంపవచ్చని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ శోభాబిందు తెలిపారు. హాల్‌టికెట్ల వెనుక వైపు బస్టాండు నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన మార్గాన్ని ముద్రించినట్లు చెప్పారు. ఉదయం సెషన్లో 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లో 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని వారు పేర్కొన్నారు. -
ఎంసెట్‌కు బయోమెట్రిక్ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, వైద్య, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఎంసెట్–2023 ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరుగుతుంది. 12 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ ఉంటుంది. రెండు సెషన్లుగా ఉండే ఈ పరీక్ష, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఒక విడత, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకూ రెండో విడత జరుగుతుంది. 2 రాష్ట్రాల పరిధిలో ఇంజనీరింగ్ ఎంసెట్ 2,05,405 మంది, అగ్రి, మెడికల్ ఎంసెట్ 1,15,361 మంది రాస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా 104, ఆంధ్రప్రదేశ్‌లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగే రోజుల్లో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. పరీక్ష రాసేవారికి జేఎన్టీయూహెచ్ కొన్ని సూచనలు చేసింది. బయోమెట్రిక్ తప్పనిసరి.. ► ఎంసెట్ రాసే విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి. ఈ కారణంగా చేతులకు గోరింటాకు, ఇతర డిజైన్లు వేసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కుంటే బయో మెట్రిక్ హాజరుకు ఇబ్బంది ఉండదు. ► ఉదయం పూట ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే వారు 7.30కే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యా హ్నం 3 గంటలకు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించరు. ► విద్యార్థులు బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ (రిజర్వేషన్ కేటగిరీ కుల ధ్రువీకరణ) పత్రాలతో మాత్రమే పరీక్ష హాలులోకి రావాల్సి ఉంటుంది. ► కాలుక్యులేటర్లు, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, పేజీలు, సెల్ఫోన్లు, రిస్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష హాలులోకి అనుమతించరు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సమస్యలొస్తే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి. అవసరమైన పక్షంలో వేరే కంప్యూటర్ అందిస్తారు. ► అభ్యర్థులు ఫొటో గుర్తింపు (జిరాక్స్ కాకుండా)తో పరీక్షకు హాజరవ్వాలి. కాలేజీ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌పై, ఆన్లైన్ ఫైల్ చేసిన అప్లికేషన్‌పై ఇన్విజిలేటర్ ఎదురుగా సంతకం చేయాలి. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
దరఖాస్తులు 3.20 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు ఈసారి భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లో నూ ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఇప్పటివరకూ రెండు విభాగాలకు కలిపి 3,20,310 అప్లికేషన్లు అందాయి. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరగడంతో ఆ మేరకు పరీ క్ష కేంద్రాల పెంపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దేశవ్యాప్తంగా 2019 చివరలో కోవిడ్ విజృంభించడం, రెండేళ్ళ పాటు విద్యా సంస్థలు సరిగా నడవకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021లో టెన్త్ వార్షిక పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేశారు. ఎప్పటిలాగే పరీక్షలు జరిగితే 20 శాతం వడపోత అక్కడే జరిగేది. కానీ పరీ క్షలు లేకపోవడంతో విద్యార్థులు చాలావరకు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు తీసుకున్నా రు. వీళ్ళే ఇంటర్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు. అంటే ఎంసెట్ దరఖాస్తులు పెరగడానికి ‘అంతా పాస్’దోహదపడిందన్న మాట. ‘కంప్యూటర్’ క్రేజ్ కూడా కారణమే.. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. ఎలాగైనా కంప్యూటర్ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం. మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ట్రెండ్ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజధాని చుట్టే ఎంసెట్ ఎంసెట్ కోసం మొత్తం 21 జోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 16 జోన్లు తెలంగాణలో, 5 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న జోన్లలో ఐదు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,48,146 ఎంసెట్ దరఖాస్తులొస్తే, హైదరాబాద్ కేంద్రంగానే 1,71,300 అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే జూనియర్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల దృష్టీ ఇక్కడే ఉంటోంది. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్ విద్యాభ్యాసానికి, ఎంసెట్ శిక్షణకు హైదరాబాదే సరైన కేంద్రమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిల్లల్ని హాస్టళ్ళలో ఉంచి మరీ చదివిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ కేంద్రంగానే ఎంసెట్ రాసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రెండు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాల పెంపు! ఎంసెట్ దరఖాస్తులు అనూహ్యంగా పెరగడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష నిర్వహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. తెలంగాణలో ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేయడంతో ఈసారి ఏపీ నుంచి దరఖాస్తులు పెరిగాయి. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్టీయూహెచ్) -
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను ఎత్తివేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్‌లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు ఇస్తారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటరీ్మడియేట్ పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది వరకూ 70% సిలబస్‌ను అమలు చేశారు. దీంతో ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేకుండానే ఎంసెట్ ర్యాంకులు ఇచ్చారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ మార్కులు ఎక్కువ రావడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అనేక కారణాల వల్ల తక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్ ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేసింది. -
ఇంజనీరింగ్ సీటు కోసం అన్వేషణ షురూ!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు వచ్చే నెల మొదటి వారంలో ముగుస్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ఎంసెట్ కూడా మే రెండో వారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ కాలేజీల కోసం వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఏ కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంసెట్ ర్యాంకు ఎంత వస్తే ఏ కాలేజీలో సీటు వస్తుంది? ఏయే కోర్సులకు డిమాండ్ ఉంది? నచ్చిన కోర్సు ఎక్కడ బాగుంటుంది? ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రలు వాకబు చేస్తున్నారు. వీళ్ళంతా ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలపైనే దృష్టి పెడుతున్నారు. వీటితో పాటు డీమ్డ్ యూనివర్శిటీల వివరాలూ సేకరిస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుపై ఆశల్లేని వాళ్ళు ముందే సీటు ఖాయం చేసుకోవాలనే ఆతృతలో ఉన్నారు. మేనేజ్మెంట్ కోటా సీటు గురించి వాకబు చేస్తున్నారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశించే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం గత కొన్నేళ్ళ కౌన్సిలింగ్ వివరాలను బట్టి అంచనాల్లో మునిగి తేలుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిడిక్టర్ కోసం ఇక్కడ చూడండి. కాలేజీల్లోనూ హడావిడి.. సీట్ల వివరాల కోసం వస్తున్న వారికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలాంటి సంప్రదింపులూ జరపకపోయినా, వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎంసెట్ పరీక్ష పూర్తయిన తర్వాత కాలేజీ నుంచి ఫోన్ కాల్ వస్తుందని, మేనేజ్మెంట్ సీటు విషయంలో అప్పుడు సంప్రదించవచ్చని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులను కావాలనుకునే వాళ్ళు ముందే వాకబు చేస్తున్నారని, వీరంతా మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆశిస్తున్నవారేనని నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన సంజయ్ తన కూతురుకు 20 వేల లోపు ఎంసెట్ ర్యాంకు వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చాడు. అయితే డేటా సైన్స్ ఆశిస్తున్నామని, టాప్ టెన్ కాలేజీల్లో సీటు వచ్చే పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే మేనేజ్మెంట్ కోటా సీటును ముందే మాట్లాడుకుంటే కొంతైనా తగ్గుతుందని ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఈ పరిస్థితిని గమనించిన కాలేజీలు ఎంసెట్ పూర్తవ్వగానే సంప్రదింపుల పేరుతో బేరసారాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో మొదలైన ప్రవేశాల ప్రక్రియ ప్రైవేటు డీమ్డ్ వర్సిటీలు ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియను మొదలు పెట్టాయి. వేర్వేరుగా సెట్స్ నిర్వహణ తేదీలను ప్రకటించాయి. మంచి ర్యాంకు వస్తే ఫీజు రాయితీ ఇస్తామని విద్యార్థులకు వల వేస్తున్నాయి. భారీ ఫీజులుండే ఈ వర్సిటీల్లో సీట్లు నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను, ఏజెంట్లను కూడా నియమించాయి. ఇంటర్ కాలేజీలకు వెళ్ళి తమ ప్రవేశ పరీక్ష, కోర్సుల వివరాలు, వాళ్ళిచ్చే సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. ముందస్తు ప్రవేశాలు అనుమతించబోమని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, తల్లిదండ్రుల ఆతృతను గుర్తించి, తెరచాటు బేరసారాలు చేసే విషయంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. -
TS: ఎంసెట్‌కు దరఖాస్తుల వరద.. 1.20 లక్షలు దాటిన అప్లికేషన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 1,23,780 దరఖాస్తులు అందినట్టు ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఇందులో 79,420 మంది ఇంజనీరింగ్ విభాగానికి, 44,230 మంది అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి జరిగే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఇంజనీరింగ్, మెడికల్ రెండు విభాగాలకూ 130 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది 1,61,552 మంది ఇంజనీరింగ్‌కు, 88,156 మంది మెడికల్, అగ్రికల్చర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఎంసెట్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 10 వరకూ గడువుండటంతో దరఖాస్తులు గత ఏడాది సంఖ్యను మించిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఎంసెట్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకూ జరుగుతాయి. చదవండి: ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు.. టీఎస్పీఎస్సీపై హైకోర్టు సీరియస్! -
ఎంసెట్ నోటిఫికేషన్‌పై ఎందుకు జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎంసెట్‌ను మే నెలలో నిర్వహిస్తామని తేదీలు ప్రకటించినా, ఇంతవరకూ వివరణాత్మక నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థుల్లో స్పష్టత కొరవడింది. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ ఉండబోదని కూడా అధికారులు చెబుతున్నా దీనిపై జీవో వెలువడలేదు. దీంతో ఎంసెట్‌ను నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్టు జేఎన్టీయూహెచ్ చెబుతోంది. మరోవైపు కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్టీయూహెచ్ వచ్చే వారంలో చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే కాలేజీల డేటా తెప్పించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేస్తే తప్ప, వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేసే వీలుండదని అంటున్నారు. వీలైనంత త్వరగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని యూనివర్సిటీల వీసీలు కూడా అంటున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలిదశ పూర్తయింది. రెండో విడత ఏప్రిల్‌లో జరగనుంది. కోవిడ్ మూలంగా గత రెండేళ్ళుగా విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోంది. ఈసారైనా సకాలంలో పూర్తి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్ని రాష్ట్రాలకూ సూచించింది. త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టే మార్పులు, చేర్పులతో మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది. కానీ మన రాష్ట్ర ఎంసెట్ విషయంలో మాత్రం అధికారులు నిర్లిప్తంగా ఉండటం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక వర్గాలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. స్పష్టత కోరుతున్న విద్యార్థులు ఎంసెట్ వివరణాత్మక నోటిఫికేషన్ వస్తేనే అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ ఏడాదికి 70 శాతం సిలబస్ ఉంటుందా? లేదా? వెయిటేజీ ఇస్తారా? ఇవ్వ రా? అనేది తెలిస్తే ఎంసెట్‌కు ఎలా సన్నద్ధమవ్వాలనే దానిపై స్పష్టత ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఎంసెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మే 7వ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12, 13, 14 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ ఎంసెట్ ఉంటా యని తెలిపారు. రెండురోజుల్లో వర్సిటీలు వివరణాత్మక నోటిఫికేషన్లు ఇస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు వెలువడకపోవడంతో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్ధం కాక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విడుదలకు ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయినా వీలైనంత త్వరలోనే జారీ చేస్తాం. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సకాలంలోనే క్లాసులు మొదలవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఎంసెట్ పరిధిలోకి నర్సింగ్ కోర్సులు
సాక్షి హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్ కోర్సు సీట్లను ఈ ఏడాది ఎంసెట్ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. ఈ విషయాన్ని ఎంసెట్ నోటిఫికేషన్లో పొందుపరచనుండగా, నర్సింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీచేయాలని 2021లో నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాలిచ్చింది. దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలు వచ్చేసరికే ప్రవేశాలు పూర్తికావడంతో ఆ ఒక్క ఏడాది మినహాయింపునిచ్చింది. 2022లో ఎంసెట్‌లో చేర్చినా.. సీట్లు నిండకపోవడంతో ఎంసెట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండానే మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీచేశారు. తాజాగా ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన తరుణంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఇటీవలే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రికి లేఖ రాశారు. ఎంసెట్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సును సైతం చేర్చాలని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 85 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680, ప్రైవేట్ కాలేజీల్లో సుమారు 5వేల సీట్లున్నాయి. ఈ సీట్లను ఎంసెట్ బైపీసీ ర్యాంకులతో భర్తీ చేస్తారు. -
Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ కింది విధంగా ఉంది. ► మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ► మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీలు. ► మే 18న టీఎస్ ఎడ్ సెట్ ►మే 20న టీఎస్ ఈసెట్ ► మే 25న లాసెట్(ఎల్ఎల్బీ), పీజీ లాసెట్ ► మే 26, 27న టీఎస్ పీజీ ఐసెట్ ►మే, 29 నుంచి జూన్ ఒకటి వరకు పీజీ ఈసెట్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా -
జనవరిలో ఎంసెట్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించడం... ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో తెలంగాణ ఎంసెట్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. సాధ్యమైనంత వరకు ఎంసెట్ పరీక్ష మే రెండు, మూడు వారాల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది. దీంతో జేఈఈ మెయిన్స్ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చినవారికి మేలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్ పరీక్షలు రాసేందుకు అర్హులే. ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటివారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలను ప్రారంభించాలని ఎస్సెస్సీబోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్ ఖరారుచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ
సాక్షి, హైదరాబాద్: రానురాను జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీలవైపు మొగ్గుచూపే విద్యార్థులు తగ్గిపోతున్నారు. ఏటా జేఈఈ రాసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, స్థానిక ఎంసెట్ రాసేవారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఇంటరీ్మడియెట్ నుంచే విద్యార్థులు ఎంసెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంటున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ (సంయుక్త ప్రవేశ పరీక్ష) రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. 2018లో రాష్ట్రంలో 1.47 లక్షల మంది ఎంసెట్ రాయగా, 2022 నాటికి ఇది 1.61 లక్షలకు పెరిగింది. ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందితే, జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. మార్పునకు కారణాలేంటి? సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సర్వే ప్రకారం గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఉపాధి వైపే మొగ్గుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుక్కునే వారి సంఖ్య అబ్బాయిల్లో పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వంటి సాంకేతిక పట్టాతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంఎస్ కోసం అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా వంటి దేశాలకు వెళ్లినా, చదువుకన్నా ఉపాధి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ వంటి విపరీతమైన పోటీ ఉండే పరీక్షలపై ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎంసెట్‌తో ఏదో ఒక కాలేజీలో సీటు తెచ్చుకోవడానికే ఇష్టపడుతున్నారు. కాలేజీల తీరులోనూ మార్పు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు సాధారణంగా ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఎంసెట్‌లో 30 వేల ర్యాంకు వచి్చనా ఏదో ఒక కాలేజీలో సీఎస్ఈలో సీటు దొరుకుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రైవేటు సంస్థలో చేరి ఉపాధి అవకాశాలున్న కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో సులువుగానే సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్తున్నారు. దీనికితోడు రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతున్నాయి. డిమాండ్ లేని సివిల్, మెకానికల్ సీట్లు తగ్గించుకుని, సీఎస్ఈ, దాని అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను కాలేజీలు పెంచుకున్నాయి. ఈ సీట్లే ఇప్పుడు 58 శాతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జేఈఈ కోసం పోటీ పడాలనే ఆలోచన విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఇలా.... -
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులపై స్తబ్దత కారణంగా ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 11 నుంచి చేపడతామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి అక్టోబర్ 16న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 6న తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేపట్టారు. మొత్తం 71,286 సీట్లుంటే.. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా 60,208 సీట్లను భర్తీ చేశారు. 11,078 సీట్లు మిగిలిపోయాయి. వీటికితోడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాల్సి ఉంది. అన్నీ కలిపి 25 వేలకుపైగా సీట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఫీజుల నిర్ధారణలో జాప్యం రెండో విడత కౌన్సెలింగ్ నాటికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారించాలనుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) కసరత్తు చేసింది. జూలైలోనే ఎఫ్ఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించి, ఫీజులను నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 2019–22 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయంపై 81 కాలేజీలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఎఫ్ఆర్సీ తిరిగి కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించింది. తొలిదశ ఆడిట్ నివేదికల పరిశీలనలో తప్పులు జరిగాయని, మళ్లీ పరిశీలించి వాటిని సరిచేశామని ప్రకటించింది. ఈ మేరకు చాలా కాలేజీల ఫీజులు తగ్గుతున్నట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రెండో విడత చర్చల్లో తమ వాదన వినిపించేందుకు సరైన సమయం ఇవ్వలేదని కొన్ని కాలేజీలు ఎఫ్ఆర్సీకి అప్పీలు చేశాయి. దీనితో ఆయా కాలేజీల ప్రతినిధులతో మరో దఫా చర్చించాలని నిర్ణయించారు. ఫీజుల వ్యవహారం తేలకుండా కౌన్సెలింగ్‌కు వెళ్లడం సరికాదని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు
సాక్షి, కరీంనగర్: లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డులేకపోతుంది. రోజురోజుకీ వీటి ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితం లోన్ యాప్స్ మోసాలకు అర్దాంతరంగా ముగిసిపోతోంది. తాజాగా లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణం తీశాయి. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్-పధ్మ దంపతుల కుమారుడు మని సాయి. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2వేల ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని స్నేహితుడి రూమ్‌కు వచ్చి కౌన్సిలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. అంతకుముందే డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్‌లో రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. గత ఆరు నెలలుగా రూ. 45 వేలు కట్టినా.. నిర్వహాకుల వేధింపులు మాత్రం ఆగడం లేదు. దీంతో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఈనెల 20న శంషాబాద్‌లోని తన రూమ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన స్నేహితులు ఆసుపత్రికి తరలించడగా.. చికిత్స పొందుతూ మణి సాయి శుక్రవారం మృతి చెందాడు. మునిసాయి వైద్యం కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణం దక్కలేదు. ఎంసెట్‌లో స్టేట్ ర్యాంక్ సాధించిన మనిసాయి వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్‌ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్.. కొట్టింది నిజమేనన్న ఇన్స్పెక్టర్ -
పదివేల లోపు నిబంధన బీసీ, ఈబీసీల ఆవేదన
విఘ్నేష్ కుమార్ గండిపేట సమీపంలోని పేరున్న కళాశాలలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 2019 సంవత్సరంలో ఎంసెట్‌లో 10025 ర్యాంకు రావడంతో ఆ కాలేజీలో సీటు వచ్చింది. మంచి ర్యాంకు రావడం, బీసీ–బీ కేటగిరీలోని రిజర్వేషన్‌తో పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని భావించిన విఘ్నేష్ ఫీజు ఎక్కువైనా అందులో చేరాలనుకున్నాడు. అయితే అడ్మిషన్ ఖరారు చేసే సమయంలో రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అధికారులు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులను ఆరా తీయగా పదివేలలోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు మాత్రమే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, ఈ లెక్కన కాలేజీలో వ్యక్తిగతంగా రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అప్పటికే పూర్తి ఫీజు రీయింబర్స్ చేయాలనే డిమాండ్ ఉండటంతో, తర్వాతైనా ప్రభుత్వం ఇవ్వకపోతుందా అనే ఆశతో తొలిఏడాది ఎలాగోలా ఫీజు మొత్తం సర్దుబాటు చేసుకుని అందులో చేరాడు. కానీ ఇప్పటికీ డిమాండ్ నెరవేరక పోవడంతో.. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఫీజు చెల్లించడానికి ఎన్నో ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. ఒక దశలో కోర్సు మానేద్దామనుకున్నా అష్టకష్టాలూ పడి ఫైనల్ ఇయర్ పూర్తిచేసి కొలువు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తుండటం..చాలామంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక ర్యాంకు ఎక్కువ వచ్చినా ఆ పథకం కింద విద్యార్థికి కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని టాప్–10 ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.80 వేలకు పైమాటే ఉంది. నాలుగైదు కాలేజీల్లో రూ.లక్ష కంటే ఎక్కువ ఉండగా.. మిగతా కాలేజీల్లో రూ.80 వేలకు అటుఇటుగా ఉంది. ఇక టాప్ 10 నుంచి 20 వరకు కాలేజీల్లో రూ.55 వేలకు మించి ఫీజు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా పదివేల ర్యాంకు సీలింగ్ దాటిన విద్యార్థులకు ప్రభుత్వం కనీస ఫీజు అయిన రూ.35 వేలు మాత్రమే ఇస్తుండగా.. చాలా కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.50 వేల కంటే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సీలింగ్ ర్యాంకు దాటిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన పక్షంలో అదనపు ఫీజును వ్యక్తిగతంగా చెల్లించాల్సి వస్తోంది. సీఎం సానుకూలంగా స్పందించినా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ర్యాంకు సీలింగ్‌ను కొన్నేళ్ల క్రితం విధించారు. అప్పట్నుంచీ విద్యార్థి సంఘాలతో పాటు బీసీ సంఘాలు, ఇతర సామాజిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు సమానంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పూర్తి ఫీజును రీయింబర్స్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు సందర్భాల్లో ర్యాంకు సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ ప్రతిపాదనల్లోనూ ఈ మేరకు సూచనలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మూడేళ్లు గడిచినా ఈ అంశం ఎటూ తేలలేదు. ర్యాంకు సీలింగ్ నిబంధనతో ఏటా వేలాది బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అరకొరగానే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుండగా.. ఆయా కాలేజీల్లో అదనపు ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారిలో సగం మందే బీసీలు ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో బీసీలు సగం మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మినహాయిస్తే బీసీలు సగటున 3 వేల నుంచి గరిష్టంగా 6 వేల మంది ఉంటున్నట్లు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏటా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులు 6 వేలకు మించడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా లక్ష మంది ఉండగా.. ఇందులో గరిష్టంగా 6వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ఫుల్ ఫీజు అందుతోంది. మొత్తం విద్యార్థుల్లో 10 శాతం మందికి పూర్తి ఫీజు మంజూరవుతుండగా.. అందులో బీసీల వాటా 6శాతం మాత్రమే. -
ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు.. ఆప్షన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో సాంకేతిక విద్య శాఖ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి తొలివిడత ఎంసెట్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ గడువు సోమవారం, ధ్రువపత్రాల పరిశీలన గడువు మంగళవారం ముగిసింది. అయితే, తాజాగా మంగళవారమే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు. -
కంప్యూటర్ కోర్సుల వైపే చూపు!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. బుధవారం రాత్రివరకు 58,807 మందికిపైగా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3 లక్షలకుపైగా ఆప్షన్లను ఎంపిక చేసుకున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం పేర్కొంది. ఒక విద్యార్థి గరిష్టంగా 1,013 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిపింది. సెప్టెంబర్ 2తో కౌన్సెలింగ్ గడువు ముగుస్తుంది. తొలిదశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 6న ఉంటుంది. మరోవైపు 8 వేల మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. చాలా మంది కుల, ఆదాయ ధ్రువపత్రాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్యత కంప్యూటర్ సైన్స్‌కే.. మొదటి విడత కౌన్సెలింగ్ మొదలయ్యే సమయానికి యూనివర్సిటీల నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా అందలేదు. దీంతో గతే డాది కౌన్సెలింగ్‌లో పెట్టిన 175 కాలేజీలనే ఈసారి అప్లోడ్ చేశారు. వాటిలో 65,633 సీట్లు ఉన్నట్టు చూపారు. ఈ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులుండే వీలుందని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టి ఫిషియల్ ఇంటెలి జెన్స్, సైబర్ సెక్యూ రిటీ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సులకే ఎక్కువగా ఆప్షన్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపా రు. 90% మంది తొలి ప్రాధాన్యతగా సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులనే ఎంచుకున్నారని.. తర్వాత ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ కోర్సులు ఉన్నాయని వివ రించారు. ఈసారి సీట్లు కూడా కంప్యూట ర్ కోర్సుల్లో పెరిగి, సివిల్, మెకానికల్ విభాగంలో తగ్గే అవకాశం ఉందని సమాచారం. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రక్రియ విద్యార్థులను అయోమయంలో పడేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం నుంచే ఆప్షన్ల ప్రక్రియ మొదలవ్వాలి. కడపటి వార్తలు అందే సమయం వరకూ ఇది ప్రారంభం కాలేదు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీల జాబితా అందకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వనందునే కాలేజీల జాబితా సకాలంలో ఇవ్వలేదని యూనివర్సిటీలు అంటున్నాయి. అఫిలియేషన్ ఇవ్వకపోయినా, గత ఏడాది ఏ కాలేజీలున్నాయో వాటినే కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని సాంకేతిక విద్య ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఫీజుల వ్యవహారంపైనా దోబూచులాట కొనసాగుతోంది. ఇన్ని అస్పష్టతల మధ్య ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి ఎలా ఉంటుందోనని విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలు? ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 1,26,140 మంది అర్హత పొందారు. వీరిలో ఇప్పటివరకు 40 వేల మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 వేల మంది సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తిచేశారు. మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రక్రియకు అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తవ్వలేదు. 145 కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించినా, గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వలేదు. ఉస్మానియా సహా మిగతా వర్సిటీలూ ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు గుర్తింపు విషయాన్ని పక్కనబెట్టి, గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 175 కాలేజీలను ఆప్షన్ల జాబితాలోకి తేవాలని నిర్ణయించారు. ఒకవేళ గుర్తింపు రాని పక్షంలో ఆ కాలేజీలను తొలగించి, ఆ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఫీజులపై పీటముడి ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలోనూ ఇంతవరకూ స్పష్టత రాలేదు. పాత ఫీజులే ఈ ఏడాది వర్తించేలా రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై ఇంకా జీవో విడుదల కాలేదు. ఈలోగానే ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కమిటీ తొలుత అనుమతించిన పెంపు ఫీజునే కాలేజీలు వసూలు చేసుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, తుది నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ధారిత ఫీజుకన్నా ఎక్కువ ఉంటే దాన్ని విద్యార్థులకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ లెక్కన ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది? రీఎంబర్స్‌మెంట్‌కు అనుమతించేది ఎంత? అనే గందరగోళం వెంటాడుతోంది. సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు వచ్చిన వాళ్లు అదే నెల 13కల్లా ఫీజులు చెల్లించి, కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా అనే సందేహాలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. ఏ కోర్సులు? ఎన్ని సీట్లు? వెబ్ ఆప్షన్ల వరకూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేరుకున్నా.. ఏ కాలేజీలో ఏ కోర్సులుంటాయో తెలియదు. గత ఏడాది లెక్క ప్రకారం ప్రస్తుతం 67 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ సంవత్సరం చాలా కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ సీట్ల వివరాలేంటో ఆప్షన్ల సమయంలో విద్యార్థులకు తెలిసే అవకాశం కల్పించడం లేదు. అఫిలియేషన్ తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ గత ఏడాది ఉన్న కోర్సుల లెక్కనే చూపించడం వల్ల నచ్చిన కోర్సులో సీటు పొందినా... ఆఖరులో అది ఉంటుందో? ఉండదో? తెలియక విద్యార్థులు అయోమయపడుతున్నారు. అధికారులు మాత్రం రెండో విడత కౌన్సెలింగ్‌కు సీట్లపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. -
TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది. చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వీటిని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు ఎక్కువ శాతం అర్హత సాధిస్తే, మెడికల్.. అగ్రికల్చర్ విభాగంలో బాలికలు ఎక్కువ మంది అర్హత పొందారు. ర్యాంకులు, మార్కులతో కూడిన ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌కు మొత్తం 1,72,238 మంది దరఖాస్తు చేశారు. 1,56,860 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది (80.41 శాతం) అర్హత సాధించారు. బాలురు 75,842 మంది అర్హత పొందితే, బాలికలు 50,298 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్..మెడికల్ ఎంసెట్‌కు 94,476 మంది దరఖాస్తు చేస్తే 80,575 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు. బాలురు 21,329 మంది, బాలికలు 49,851 మంది అర్హత పొందారు. ఏపీ విద్యార్థులకు అగ్రశ్రేణి ర్యాంకులు తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్, మెడికల్..అగ్రికల్చర్ విభాగాలు రెండిటిలోనూ నంబర్ వన్ ర్యాంకులు వారికే దక్కాయి. అంతేకాదు టాప్టెన్లోనూ ఎక్కువమంది ఏపీ విద్యార్థులే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎనిమిది మంది, అగ్రికల్చర్..మెడికల్ విభాగంలో ఏడుగురు ఉన్నారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఇద్దరు, మెడికల్..అగ్రికల్చర్ విభాగంలో ముగ్గురు మొదటి పది ర్యాంకుల్లో ఉన్నారు. ఫలితాలు విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాస్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు: సబిత వర్షాలు, వరదల్లోనూ ఎంసెట్ నిర్వహించిన పలు ప్రభుత్వ విభాగాలకు విద్యా మంత్రి సబితా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈసెట్ ఫలితాలు విడుదల పాలిటెక్నిక్ పూర్తిచేసి, ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షకు 24,055 మంది దరఖాస్తు చేస్తే, 22,001 మంది పరీక్ష రాశారు. వీరిలో 19,954 మంది (90.69 శాతం) అర్హత పొందారు. కుర్చా హేమంత్ (విశాఖ), జి సాయినాగరాజు (పశ్చిమగోదావరి), కె నర్సింహనాయుడు (విశాఖ), ఇండిగ ఆకాశ్ (విశాఖ), ఐతంశెట్టి జగన్ (అనకాపల్లి) మొదటి ఐదు ర్యాంకులు పొందారు. చదవండి: నెలనెలా కరెంట్ షాక్! -
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ➤ టీఎస్ ఎంసెట్-2022 (ఇంజనీరింగ్) ఫలితాల కోసం క్లిక్ చేయండి ➤ టీఎస్ ఎంసెట్-2022 (అగ్రికల్చర్) ఫలితాల కోసం క్లిక్ చేయండి ➤ టీఎస్ ఈసెట్-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి ఇంజనీరింగ్: ఫస్ట్ ర్యాంక్-లక్ష్మీసాయి లోహిత్ సెకండ్ ర్యాంక్- సాయిదీపిక థర్డ్ ర్యాంక్- కార్తికేయ అగ్రికల్చర్: ఫస్ట్ ర్యాంక్- నేహ సెకండ్ ర్యాంక్-రోహిత్ థర్డ్ ర్యాంక్-తరుణకుమార్ గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్ ఎంసెట్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది హాజరయ్యారు. ఎంసెట్, ఈసెట్ ఫలితాల కోసం www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు. -
ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ! పదివేలు దాటినా సీఎస్సీ పక్కా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసిన 1.56 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇంజనీరింగ్‌లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఏ ర్యాంకు వస్తుంది? ఏ ర్యాంకు వస్తే ఏ కాలేజీలో సీటు దొరుకుతుంది? కోరుకున్న బ్రాంచ్‌లో సీటు రావాలంటే ఎంత ర్యాంకు రావాలి? కన్వీనర్ కోటా కటాఫ్ ఎంత? వర్సిటీ క్యాంపస్‌లో సీటొచ్చే పరిస్థితి ఉందా? ఇలా ప్రతి విద్యార్థినీ ఎన్నో సందేహాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఈ సందేహాలతోనే చాలామంది మంచి ర్యాంకు వచ్చినా ప్రైవేటు కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. నిజానికి గత ఏడాది ర్యాంకులు, కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు, ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఏ బ్రాంచిలో సీటు వచ్చింది తదితరాలు క్షుణ్ణంగా తెలుసుకుని, కౌన్సెలింగ్‌పై కాస్త అవగాహన పెంచుకుంటే కచ్చితమైన అంచనా తేలికే అంటున్నారు నిపుణులు. విద్యార్థుల డిమాండ్, కాలేజీల ఒత్తిడి నేపథ్యంలో ఈసారి కంప్యూటర్ సైన్స్ (సీఎస్సీ) కోర్సుల్లో కొద్దిగా సీట్లు పెరిగే వీలుంది. ఇదే క్రమంలో సివిల్, మెకానికల్ సీట్లు తగ్గబోతున్నాయి. అయితే ఈ వివరాలను యూనివర్సిటీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. సీఎస్సీకి పెరిగిన డిమాండ్ గత కొన్నేళ్ళ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే రాజధాని పరిసరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్సీ సీటుకు డిమాండ్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సుల్లో సీటు రావాలంటే ఓపెన్ కేటగిరీలో అయితే 3 వేల లోపు ర్యాంకు మాత్రమే రావాలి. కానీ జేఎన్టీయూహెచ్ వర్సిటీ కాలేజీలున్న మంథనిలో 10 వేలు దాటినా, సుల్తాన్పూర్ క్యాంపస్‌లో 5 వేలు దాటినా సీఎస్సీ సీటు పక్కాగా వస్తోంది. ఇక టాప్‌టెన్ ప్రైవేటు కాలేజీల్లో 10 వేల ర్యాంకు వరకు కూడా సీఎస్సీ సీటు వచ్చే చాన్స్ ఉంది. ఒక కాలేజీలో మాత్రం గత ఏడాది 25 వేలు దాటిన ర్యాంకుకు కూడా ఆఖరి కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చింది. రిజర్వేషన్ కేటగిరీల్లో 20 వేలు దాటినా సీటు వచ్చే అవకాశం కన్పిస్తోంది. కసరత్తు తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి ఎంసెట్ ర్యాంకు వచ్చిన తర్వాత విద్యార్థులు ప్రధానంగా కౌన్సెలింగ్‌పై దృష్టి పెట్టాలి. వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందనేది గత కొన్నేళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించి అంచనాకు రావాలి. ఈ కసరత్తు చేసిన తర్వాతే ఆప్షన్లు ఇవ్వాలి. – ఎంఎన్ రావ్ (గణిత శాస్త్ర విశ్లేషకులు) -
వేధింపుల వల్లే పాప చనిపోయింది: కుటుంబ సభ్యులు
-
తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల కారణంగా గురువారం, శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎంసెట్ మెడికల్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
ఎటూ తేలని ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అయితే 14న జరగాల్సిన ఎంసెట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న వర్ష బీభత్స పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపామని చెప్పారు. వర్షాలు తగ్గని పక్షంలో ఎంసెట్ కూడా వాయిదా తప్పదని, దీనిపై మంగళవారం వరకూ వేచి చూస్తామని అన్నారు. అయితే దీనిపై బుధవారం నిర్ణయిద్దామని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉన్నత విద్యామండలికి తెలిపినట్లు సమాచారం. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎంసెట్ మెడికల్ విభాగం ప్రవేశ పరీక్షనైనా వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యా మండలి భావించింది. ఇదే విషయమై సోమవారం ఉన్నతాధికారులు చర్చించారు. అయితే, ఎంసెట్ విభాగానికి ఐటీ కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న సంస్థ వాయిదాపై సాంకేతిక పరమైన కారణాలు లేవనెత్తింది. తాము జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ తేదీలను ఖరారు చేశామని, ఇప్పుడీ పరీక్ష వాయిదా వేస్తే, మళ్లీ తేదీలను సెట్ చేయడం కష్టమని తెలిపింది. ఈ నేపథ్యంలో మండలి ఉన్నతాధికారులు తర్జనభర్జనలో పడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వర్షాలు ఇలాగే ఎడతెరిపి లేకుండా ఉంటే, ఎంసెట్ నిర్వహణ కష్టమేనని ప్రభుత్వ వర్గాలూ భావిస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పరీక్షలు నిర్వహిస్తే, వానల కారణంగా అనుకోని ఘటనలు జరిగితే ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ మాటలు నమ్మి ఈ పరిస్థితుల్లో ఎంసెట్ నిర్వహించడం సరికాదని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే, వర్షాలు ఇదే స్థాయిలో ఉంటే బుధవారం ఎంసెట్ పరీక్షపైనా నిర్ణయం తీసుకుందామని మండలి అధికారులకు సీఎంవో తెలిపినట్టు సమాచారం. -
అగ్రికల్చర్ టెస్టుకూ అదే ఉత్సాహం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు రెండో రోజూ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు శివారు వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆన్లైన్ మాక్ ఎంసెట్ అగ్రికల్చర్ కంప్యూటర్ పరీక్షను నిర్వహించారు. వివిధ జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ప్రశ్నల సరళి కూడా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా సిలబస్‌కు దగ్గరగా ఏపీఈఏపీ సెట్ తరహాలో ఇచ్చారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను పూరించడంతోపాటు తమలోని సబ్జెక్టు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏ స్థాయిలో ర్యాంకు సాధించగలమో తెలుసుకునేందుకు ఈ టెస్టు ఉపయోగపడిందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యే విధానాలపై అవగాహన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీఈఏపీసెట్ ఎలా జరుగుతుందోనన్న అనుమానాలు పటాపంచలయ్యాయని సంతోషంగా చెప్పారు. సాక్షి మీడియా గ్రూపునకు కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి మాక్ ఎంసెట్ అగ్రి కల్చర్ టెస్టులో బైపీసీ విభాగం నుంచి అధికంగా మేము చదివిన అంశాల నుంచి ప్రశ్నలు ఉన్నాయి. మాక్ టెస్టు కేవలం ప్రాక్టీసు కోసమే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏపీఈఏపీ సెట్‌కు హాజరయ్యేందుకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ‘సాక్షి’ కృషి ఎంతో బాగుంది. – పి.కావ్యశ్రీ, విద్యార్థిని ఆన్లైన్ టెస్ట్‌కు హాజరుకావడం ఇదే తొలిసారి ఆన్లైన్లో పరీక్షకు హాజరు కావడం ఇదే తొలిసారి. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్లైన్ నిర్వహణ ఎంతో బాగుంది. ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించడంలో మాక్టెస్టు ఒక ప్రాక్టీసులా ఉపయోగపడింది. ఈ సెట్‌తోపాటు నీట్ పరీక్షకు హాజరు కానున్నాను. – షేక్ షాయిస్తా, విద్యార్థిని ఆన్లైన్ టెస్టుపై ఆందోళన తొలగింది ఆన్లైన్ టెస్టుపై ఇప్పటి వరకు సరైన అవగాహన లేకపోవడంతో కొంచెం ఆందోళనగా ఉండేది. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్లైన్ టెస్టుతో ఆ టెన్షన్ మాయమైంది. ఈ పరీక్షతో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇది మంచి ప్రాక్టీసు పరీక్షలా ఉపయోగడుతుంది. థాంక్యూ ‘సాక్షి’ – పి.సరయు, విద్యార్థిని ప్రశ్నల సరళి భేష్ ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు చేసిన ఏర్పాట్లు ప్రభుత్వం జరిపే ఏపీ ఈఏపీ సెట్‌ను తలపించాయి. కచ్చితమైన సమయాన్ని కేటాయించడంతోపాటు సమయపాలన పాటించారు. ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కాలేజీలో లెక్చరర్లు చెప్పిన అంశాలు వీటిలో ఉన్నాయి. చాలా బాగుంది. – పి.గిరిజ, విద్యార్థిని -
ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది నమోదు చేసుకు న్నారని బోర్డ్ స్పష్టం చేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టీ–శాట్ ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇంజనీరింగ్ పీజీసెట్– 2022 గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఇంజనీరింగ్ పీజీసెట్ (టీఎస్ పీజీఈసీఈటీ– 2022) దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు గడువు పొడిగించి నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పీజీఈసెట్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15లోగా విద్యార్థులందరికీ యూనిఫాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జూలై 15లోగా యూనిఫాం అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్‌ను రూపొందించి జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యా యులకు పంపింది. మొత్తం 33 జిల్లాల్లో 22,78,569 మంది విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరికి 67,75,522 మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేసి, ఈమేరకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి దశలో 24,69,214 మంది విద్యార్థులకు జూలై 4వ తేదీలోగా యూనిఫాం అందించాలని, మిగతా విద్యార్థులకు జూలై 15లోగా ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్తగా ప్రవేశం పొందే వారికి కూడా యూని ఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకల్లా పూర్తయ్యే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (క్లిక్: గురుకులాల్లో మరో 1,000 కొలువులు!) -
ఇక ఎంసెట్ ద్వారా నర్సింగ్ కోర్సులో ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడినట్టు చెప్పారు. ఈ విధానం 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తుందని వెల్లడించారు. మండలి కార్యాలయంలో లింబాద్రి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)తో పనిలేదని పేర్కొంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గద ర్శకాలు విడుదల చేసిందని, రాష్ట్రాల ఇష్టానుసారం వివిధ పరీక్షల ద్వారా ప్రవేశాలు చేపట్టవచ్చని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ర్యాంకుల ద్వారా ఆయా సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో ఇప్పటివరకు ఇంటర్ (బైపీసీ) మార్కులను బట్టి ప్రవేశం కల్పించేవారని చైర్మన్ వివరించారు. మే 28 వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 28 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగానికి, బైపీసీ చేసిన వారు అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు అందరికీ ఒకే పరీక్ష ఉంటుందని, ర్యాంకులు ప్రకటించిన తర్వాత వారు నర్సింగ్ కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని లింబాద్రి తెలిపారు. ఎంసెట్ దరఖాస్తు గడువు మే 28 వరకూ ఉన్నందున ఇందుకోసం ప్రత్యేకంగా గడువు పొడిగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ర్యాంకులు ప్రకటించిన తర్వాత సంబంధిత కాలేజీలు ప్రవేశ ప్రక్రియ మొదలు పెడతాయని వివరించారు. నర్సింగ్‌లో 5,300 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా 81 నర్సింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 9 అయితే, 81 ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 4,620 సీట్లు కలిపి మొత్తం 5,300 ఉన్నాయని మండలి ప్రకటించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. నర్సింగ్ కోర్సుల్లో మాత్రం ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 60 శాతం కన్వీనర్, 40 శాతం మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా, ఇతర రిజర్వేషన్లన్నీ నిబంధనల ప్రకారమే అమలు చేస్తామని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలిస్తున్నామని లింబాద్రి తెలిపారు. -
జూలై 14 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసెట్‌ను ఇదే నెల 13న నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మంగళవారం ఈ మేరకు షెడ్యూల్ వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు ఉన్నతాధికారులతో ఆమె వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై చర్చించారు. వీటికి అవసరమైన నోటిఫికేషన్లను సంబంధిత విభాగాలు త్వరలో విడుదల చేస్తాయని ఆమె ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ జూలై 14, 15 తేదీల్లో, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు చేపట్టే ఎంసెట్ పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో ఉంటుందని చెప్పారు. మొత్తం 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్ష కేంద్రాలను ఈ సెట్స్ కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ వెయిటేజీ లేదు.. ఇంటర్మీడియెట్ మార్కులను ఎంసెట్‌లో వెయిటేజ్‌గా తీసుకోవడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్ రాసే ఇంటర్ సెకండియర్ విద్యార్థులు గత ఏడాది ఆఖరులో జరిగిన ఇంటర్ ఫస్టియర్‌లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ వాస్తవానికి ఎంసెట్‌ను జూన్‌లోనే నిర్వహించాలని తొలుత భావించారు. అనూహ్యంగా జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేయడంతో ఎంసెట్‌ను ఆలస్యంగా చేపట్టాల్సి వస్తోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టులో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ఎంసెట్ కౌన్సెలింగ్ చేపట్టడం సరైన నిర్ణయంగా భావించినట్టు చెప్పాయి. ఈ విధానం వల్ల సీట్ల లభ్యతపై స్పష్టత ఉంటుందని, గత ఏడాది కూడా ఇలాగే చేసినట్టు ఎంసెట్ నిర్వహణ విభాగం పేర్కొంది. -
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల
-
తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది. జూలై 14,15,18,19,20 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయ. జూలై 13న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 23 రిజినల్ సెంటర్లలో 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరగుతాయి. ఎంసెంట్లో అగ్రికల్చర్ పరీక్షలు జూలై 14,15 తేదీల్లో, ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 18,19,20 తేదీల్లో జరగనున్నాయి. -
కౌన్సెలింగ్‌కు ముందే కాలేజీల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూ యోచిస్తోంది. తనిఖీల కోసం ఈ ఏడాది కూడా అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు అవసరం. గుర్తింపు ఇవ్వాలంటే విశ్వవిద్యాలయం అధికారులు కాలేజీల్లోని వసతులను పరిశీలించాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు., మౌలిక వసతులు లేని కాలేజీలను గుర్తించినా, ఆఖరి నిమిషంలో అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. ఈసారి మాత్రం ఈ అవకాశం ఇవ్వబోమని జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌పై గురి గత కొన్నాళ్లుగా కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతేడాది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సుల్లో దాదాపు 5 వేల సీట్లు పెరిగాయి. మెకానికల్, సివిల్‌లో సీట్లు తగ్గించుకుని కొత్త కోర్సులకు అనుమతులు పొందాయి. అయితే, చాలా కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల బోధన ఆశించినస్థాయిలో లేదని జేఎన్టీయూహెచ్ గుర్తించింది అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీ లేదని, లోతుగా అధ్యయనం జరగడంలేదనే నిర్ణయానికి వచ్చింది. అధ్యాపకుల అటెండెన్స్ కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ కూడా సరిగా అమలవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా బోధించేది వేరొకరనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు అధ్యాపకుల పాన్ నంబర్ ఆధారంగానూ వాస్తవాలు తెలుసుకుంటామని జేఎన్టీయూహెచ్ తెలిపింది. కానీ ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ఇలాంటి సమస్యలన్నీ ఈసారి పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల్లో సరైన ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ముందుగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. కౌన్సెలింగ్‌కు ముందే.. జేఈఈ మెయిన్స్, ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పు కారణంగా ఈసారి ఎంసెట్ పరీక్ష కూడా ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ వరకూ కొనసాగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలేజీల తనిఖీలు కౌన్సెలింగ్‌కు ముందే చేపట్టి, వాస్తవ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీలనే కౌన్సెలింగ్‌కు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
Telangana: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఆ నిబంధన సడలింపు
TS EAMCET 2022 Eligibility Criteria: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. కనీస మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్‌కు అర్హత లభిస్తుంది. వాస్తవానికి ఇంటర్లో కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ నిబంధనను సడలించారు. టెన్త్ పరీక్షలు లేకుండానే గతేడాది ఇంటర్ ఫస్టియర్‌కు విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. వీరికి గత మార్చిలో కూడా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. అయితే, ఆ తర్వాత అక్టోబర్‌లో వీళ్లందరికీ పరీక్షలు పెట్టారు. కానీ, కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆన్లైన్ క్లాసులు అర్థం కాకపోవడంతో తాము పరీక్షలు సరిగా రాయలేకపోయామని నిస్సహాయత వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. ప్రస్తుతం వీళ్లు ఏప్రిల్‌లో సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. ఫస్టియర్ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 35 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. త్వరలో ఉన్నత విద్యామండలి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే వీ లుంది. ఇదే క్రమంలో జూన్ ఆఖరులోగా ఎంసెట్ తేదీలను ఖరారు చేయాలని భావిస్తోంది. -
జూన్ మొదటి వారంలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2022పై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలైంది. ఏ తేదీల్లో నిర్వహించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 7వ తేదీన జరిగే సమావేశంలో చర్చ అనంతరం పరీక్ష తేదీలపై ప్రాథమిక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. అనంతరం విషయం ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు మే నెలతో ముగుస్తాయి. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మే మొదటి వారంలో పూర్తవుతాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జూన్ మొదటి వారంలో ఎంసెట్ నిర్వహించే యోచనలో అధికారులున్నారు. నెల రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. తొలి విడతలో ఎంసెట్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులు ఆ తర్వాత ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందుతారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో కేటాయించిన సీట్లలో ఖాళీలు ఏర్పడతాయి. వీటన్నింటినీ జేఈఈ తుది రౌండ్ కౌన్సెలింగ్ తర్వాతే భర్తీ చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థులు పెరిగే అవకాశం ఈసారి ఎంసెట్ రాసే అభ్యర్థుల సంఖ్యపై అధికారులు దృష్టి పెడుతున్నారు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఇంటర్‌కు ప్రమోట్ చేశారు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కేవలం 49% విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వీళ్లంతా ఇంటర్ సెకండియర్‌లో ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఫలితాలతో సంబంధం లేకుండానే ఎంసెట్ రాసే వీలుంది. దీంతో గతం కన్నా ఈసారి ఎంసెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసే అంశంపైనా చర్చించనున్నారు. -
జూన్‌లో టీఎస్ ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎంసెట్) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించారు. ఈ వారం ఎంసెట్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కాలపట్టికను ప్రకటించే వీలుందని మండలి ఉన్నతాధికారులు తెలిపారు. ఫలితాలను కూడా నెలవ్యవధిలోనే ప్రకటించాలని నిర్ణయించారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ను ఏప్రిల్, మేలో పూర్తి చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్ ఆఖరు కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సీట్లపై స్పష్టత వస్తుందని, అప్పుడు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిమాండ్ ఉన్న కోర్సులకే సీట్లు అనుమతించాలని యోచిస్తున్నారు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 40 శాతానికి మించి అడ్మిషన్లు లేకపోవడంతో కొన్ని కాలేజీలు ఈ మేరకు సీట్లను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. మరోవైపు కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఫీజుల పెంపుపై కసరత్తు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై కసరత్తు చేస్తోంది. 2019లో పెంచిన ఫీజులు 2021 వరకూ అమలులో ఉన్నాయి. ఒకవేళ ఫీజులు పెంచితే 2022 నుంచి అమలులోకి వచ్చే వీలుంది. ఆదాయ, వ్యయాల నివేదికలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల నుంచి ఎఫ్ఆర్సీ కోరింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మార్చి చివరి నాటికి ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 15 శాతం వార్షిక ఫీజును పెంచేందుకు ఎఫ్ఆర్సీ çసుముఖంగా ఉన్నట్టు తెలిసింది. నోటిఫికేషన్ కోసం సన్నాహాలు ఈసారి ఆలస్యం లేకుండా ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. బహుశా జూన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించే వీలుంది. త్వరలో ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎంసెట్ షెడ్యూల్ ఇస్తాం. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
చూసి ‘టిక్’ పెట్టు కాలేజీ సీట్లపై గురి పెట్టు
సాక్షి, హైదరాబాద్: కొత్త సీట్లు వచ్చాయి.. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో కేటాయించిన సీట్లు ఖాళీ అవుతున్నాయి.. రెండో కౌన్సెలింగ్‌లో కోరుకున్న కాలేజీలో, కోరుకున్న సీటు గ్యారెంటీ అని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. అయితే ఈ కౌన్సెలింగ్‌ను అంత తేలికగా తీసుకోవద్దని సాంకేతిక విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మొదటి కౌన్సెలింగ్ కన్నా, ఈ సారి మరింత ఎక్సర్సైజ్ చేయాలని సూచిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెల 6 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలవుతుంది. 9వ తేదీ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోర్సుకు ప్రాధాన్యమా..? కాలేజీకా అన్న విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్ ట్రెండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. అంత కష్టమేం కాదు ‘రెండో కౌన్సెలింగ్‌పై కాస్త కసరత్తు చేస్తే మంచి కాలేజీలో సీటు పొందే వీలుంది. ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిరుచే కాదు.. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా బ్రాంచ్ ఎంచుకోవాలి. కోరుకున్న స్థాయిలో ర్యాంకు లేనప్పుడు మాత్రమే రెండో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. మొదటి కౌన్సెలింగ్ కన్నా రెండో కౌన్సెలింగే కీలకమని గుర్తించాలి. –తుమ్మల పాపిరెడ్డి,ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ వీటిని పరిశీలించాలి మొదటి కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చింది? ఈ వివరాలన్నీ ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మీకు 12 వేల ర్యాంకు వచ్చి ఉండొచ్చు. మీరు దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆ కాలేజీలో సీఎస్ఈ సీటు 13 వేల ర్యాంకు వచ్చిన వారికి రావొచ్చు. ఆ ర్యాంకు వచ్చిన వ్యక్తికి అంతకన్నా మంచి కాలేజీలో సీటు వస్తుందా? లేదా అనేది పరిశీలించాలి. ఆ వ్యక్తికి సీటు రాకపోతే కాలేజీ మారే అవకాశం లేదని గుర్తించాలి. మొదటి 5 వేల ర్యాంకుల వరకు చాలామేర మార్పుచేర్పులు ఉండొచ్చు. జాతీయ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారు ఈ ర్యాంకుల్లోనే ఉంటారు. కాబట్టి ఈ సీట్లు ఖాళీ అయితే మీకే వస్తాయని మొదటి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఎందు కంటే తర్వాత ర్యాంకులో వేరే బ్రాంచ్‌లో సీటు వచ్చిన వారు కూడా మీరు కోరుకునే బ్రాంచ్‌లోకి రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పడే వీలుంది. మీకు వచ్చే ర్యాంకును బట్టి అటు ఇటుగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. మంచి కాలేజీగా భావిస్తే మొదటి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అదికూడా మీ ర్యాంకుకు దగ్గర్లో ఉంటేనే.. బ్రాంచ్ విషయంలోనూ ముందుగా ఫస్ట్ కౌన్సెలింగ్ జాబితాతో పాటు, గత రెండేళ్లు కాలేజీ ర్యాంకును పరిశీలించి ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త సీట్ల విషయంలో జాగ్రత్త టాప్ టెన్ కాలేజీల్లోనే ఈసారి కంప్యూటర్, దాని అనుబంధ బ్రాంచీల సీట్లు పెరిగాయి. ఇతర కాలేజీల్లో ఉన్న వారు టాప్‌టెన్ కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల్లోకి ప్రయత్నించే వీలుంది. కాబట్టి మీ ర్యాంకు సమీపంలో ఉన్న కాలేజీలను ఎంచుకుంటే సీటు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కాలేజీల్లో పూర్తిగా పెద్ద మొత్తంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ సీట్లు పెరిగాయి. కాబట్టి ఏయే ర్యాంకుల వారికి ఆ కాలేజీ లో సీటు వచ్చే వీలుందనేది ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ల ఎంపిక ఆధారంగా గుర్తించాలి. -
Telangana: 6 నుంచి ఎంసెట్ రెండో విడత
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల ఆరో తేదీ నుంచి మొదలు కానుంది. ఉన్నత విద్యా మండలి మంగళవారం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సారి కౌన్సెలింగ్‌లో హైకోర్టు అనుమతి ద్వారా వచ్చిన 5,770 కొత్త సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. వీటిని అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెరిగే సీట్లలో 5,610 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ బ్రాంచుల్లో ఉన్నాయి. 160 ఫార్మసీ సీట్లను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి దశలో 78,270 సీట్లను భర్తీ చేశారు. ఇందులో 61,169 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 46,322 సీట్లు మిగిలిపోయాయి. గత నెలాఖరులో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో సీట్లు పొందే వీలుంది. ఫలితంగా మరికొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. మొదటి దశ కౌన్సెలింగ్‌లో పొందిన సీటును వదులుకోడానికి ఈ నెల 5వ తేదీ చివరి గడువు పెట్టారు. మిగిలిన సీట్లపై 6వ తేదీన స్పష్టత వస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు.. కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు కోసం రూ.73,50,92,604 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోపక్క జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తోంది. కాగా, డిమాండ్ లేని కోర్సుల్లో కొన్ని సీట్లను పలు కాలేజీలు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్ఈ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్ల పెంపునకు చేసుకున్న దరఖాస్తులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా వచ్చే కోర్సుల్లో 70 శాతం కన్వీనర్ కోటా ద్వారా, 30 శాతం యాజమాన్య కోటా ద్వారా భర్తీ చేస్తారు. రెండో దశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత వెంటనే ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు కౌన్సిల్ వెల్లడించింది. -
వచ్చే నెలలో ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నవంబర్ మొదటి వారంలో నిర్వహించే వీలుందని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు తుది గడువు ఈ నెల 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. హైకోర్టు తీర్పుతో కొత్తగా వచ్చే కంప్యూటర్ సైన్స్ గ్రూపు సీట్లను రెండో కౌన్సెలింగ్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు తొలి విడత సీట్లు పొందిన విద్యార్థుల్లో కొంతమంది జాతీయ విద్యాసంస్థల్లోకి వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే సీట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అన్ని సీట్లు కలిపి 50 వేల వరకూ ఉంటాయి. వీటిల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 30 వరకూ సెల్ఫ్ రిపోరి్టంగ్ చేస్తారు. జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ వెబ్ నోటిఫికేషన్ విడుదల కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్ ఫుల్‌టైమ్ పీహెచ్డీ వెబ్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి డాక్టోరియల్ ఫెలోషిప్ స్కీమ్‌లో భాగంగా అన్ని ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు గత ఐదేళ్ల కాలంలో నెట్, గేట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నిర్దేశిత ఫీజు, ధ్రువీకరణ పత్రాలు అడ్మిషన్ విభాగానికి పంపాలని అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట రమణారెడ్డి తెలిపారు. -
8వేల లోపు ర్యాంకొస్తే.. కంప్యూటర్స్ కోర్సుల్లో సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌పై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి కౌన్సెలింగ్ నుంచి ఎంత మంది తప్పుకొంటారు, ఎన్నిసీట్లు మిగులుతాయి, కోరుకున్న బ్రాంచ్‌లో సీటు వస్తుందా అన్న అంచనాలు వేసుకుంటున్నారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను రద్దు చేసుకునే గడువును ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈ నెల 15వ తేదీనే జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు వెలువడనున్నాయి. అందులో మంచి ర్యాంకు సాధించే విద్యార్థులు.. ఇప్పటికే ఎంసెట్ తొలి కౌన్సెలింగ్‌లో పొందిన సీట్లను వదులుకునే అవకాశం ఉంది. అలా ఖాళీ అయ్యే సీట్లు తమకు కలిసొస్తాయని రెండో కౌన్సెలింగ్ కోసం చూస్తున్న విద్యార్థులు ఆశిస్తున్నారు. గత ఏడాది సీట్ల కేటాయింపు, ఈ ఏడాది పరిస్థితి ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. 8 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు.. మంచి కాలేజీల్లోని కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో సీట్లు రావచ్చని నిపుణులు అంటున్నారు. 20 తర్వాతే రెండో విడత.. తొలిదశలో సీట్ల రద్దు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన నేపథ్యంలో.. ఆ తర్వాత వీలైనంత త్వరగా మలివిడత కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఆ తేదీనాటికల్లా కాలేజీల్లో సీట్ల ఖాళీలపై స్పష్టత రావచ్చని విద్యార్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో కలిపి లక్ష వరకు సీట్లు ఉన్నాయి. అందులో 71,853 కన్వీనర్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మిగతా సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీచేస్తారు. తొలి కౌన్సెలింగ్‌లో సీట్లుదక్కిన వారిలో 59,143 మంది కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు అధికారులు తెలిపారు. పోటీ అంతా కంప్యూటర్స్ గ్రూపులకే.. ఎంసెట్ అర్హుల్లో ఎక్కువ భాగం కంప్యూటర్, కంప్యూటర్ అనుబంధ గ్రూపులకే ప్రాధాన్యమిచ్చారు. ఆ బ్రాంచీల్లో ఎక్కువ శాతం సీట్లు భర్తీ అయ్యాయి. టాప్ కాలేజీల నుంచి సాధారణ కాలేజీల వరకు అన్నిచోట్లా ఈ సీట్లకే పోటీ నెలకొంది. కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో మిగిలిన కొద్దిసీట్లు కూడా మారుమూల ప్రాంతాల్లోని కాలేజీల్లోనే ఉండటం గమనార్హం. కొత్తగా వచ్చిన ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. సీఎస్సీలో 18,614 సీట్లకుగాను 53 సీట్లే మిగిలాయి. సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 5,884 సీట్లకు 455, ఐటీలో 5,262 సీట్లకు 39, సీఎస్సీ డేటా సైన్స్‌లో 3,528 సీట్లకు 299, సీఎస్సీ సైబర్ సెక్యూరిటీలో 583 సీట్లకు 43 సీట్లు మాత్రమే మిగిలాయి. జేఈఈ ఫలితాల తర్వాత.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు ఈ నెల 15న వెలువడతాయి. మరుసటి రోజు నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కటాఫ్‌ను బట్టి ఏయే ర్యాంకులకు ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కుతాయో ఓ అంచనాకు వచ్చే వీలుంది. ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్‌లో జనరల్ కేటగిరీలో టాప్ టెన్ కాలేజీల్లో 5 వేల ర్యాంకు వరకూ సాధించిన విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లో సీట్లు దక్కాయి. వారిలో సుమారు 1,500 మంది నిట్, ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందే అర్హత సంపాదించే అవకాశం ఉంది. వీరిలో కోరుకున్న బ్రాంచ్ రానివారు రాష్ట్రంలోనే కొనసాగినా.. మరో వెయ్యి మంది వరకు జాతీయ కాలేజీల్లో చేరుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు హైకోర్టు ఆదేశా ల మేరకు.. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచీల్లో మరో 4 వేల సీట్ల వరకూ వచ్చే వీలుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుంటే 8 వేలలోపు ర్యాంకు వరకు సాధించిన వి ద్యార్థులకు టాప్ కాలేజీల్లోని కంప్యూటర్ కోర్సు ల్లో సీట్లు లభించే వీలుందని పేర్కొంటున్నారు. -
ఇంజనీరింగ్ క్లాసులు ఇంకా ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 20 తర్వాత మొదలయ్యే అవకాశముందని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు మొదటి కౌన్సెలింగ్‌లో సీటు దక్కిన విద్యార్థులు దాన్ని రద్దు చేసుకునే గడువును పొడిగించాలని మండలి నిర్ణయించింది. వీటితోపాటే యాజమాన్య కోటా సీట్ల భర్తీ గడువునూ పెంచనున్నట్టు తెలిసింది. రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 15 నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించినప్పటికీ దసరా నేపథ్యంలో తేదీని మార్చాలని యోచిస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై స్పష్టత కూడా రాలేదు. జేఎన్టీయూహెచ్ దీనిపై నిర్ణయం వెలువరిస్తే రెండో దశ కౌన్సెలింగ్‌లో 70 శాతం సీట్లు చేరాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా ఈబీసీ కోటా సీట్లు ఖరారు చేయాలి. వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఈ ప్రక్రియ వల్ల మరికొంత జాప్యమయ్యే అవకాశముందని అధికారులు అంటున్నారు. జాతీయ సీట్లపైనా స్పష్టత తొలి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర గ్రూపులకు 61,169 సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయించారు. గడువు ముగిసే నాటికి 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఇంజనీరింగ్, సైన్స్ గ్రూపుల్లో 38,796 సీట్లుండగా.. 37,073 సీట్లు కేటాయించారు. కంప్యూటర్ సైన్స్ అనుబంధ గ్రూపుల్లో చాలామంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. జేఈఈ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా 1,500 మంది వరకూ ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వెళ్తున్నారు. అయితే రెండో దశ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం, నిట్, ఐఐటీ సీట్ల కేటాయింపులో స్పష్టత రావడంతో ఎన్ని సీట్లు ఖాళీ అవుతాయనేది తెలిసే వీలుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ ఎంఎల్ వంటి కొత్త కోర్సుల్లో జేఎన్టీయూహెచ్ అనుమతి లేకుండానే సీట్ల పెంపుపై హైకోర్టు ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక.. సర్కార్ అనుమతిస్తే మరో 4 వేల సీట్లు పెరిగే వీలుంది. ఇప్పటివరకైతే సీట్ల పెంపుపై జేఎన్టీయూహెచ్ విముఖంగా ఉంది. నవంబర్ చివరినాటికైనా కష్టమే.. మొదటి ఏడాది ఇంజనీరింగ్ తరగతులు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించాలనుకున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారుతోంది. యాజమాన్య కోటా భర్తీ వివరాలను ఈనెల 15లోగా పంపాలని ఆదేశించిన రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి.. ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. అదీగాక కోర్టు తీర్పు ద్వారా పెరిగే 30 శాతం సీట్ల వివరాలను నియంత్రణ మండలికి పంపాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికే నవంబర్ రెండో వారం పడుతుందని, ఈ ప్రకారం నవంబర్ చివరినాటికైనా క్లాసులు మొదలుకావడం కష్టమేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
15 నుంచి ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ఉన్నత విద్యా మండలి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. మొద టి దశలో మిగిలిపోయిన సీట్లన్నీ ర్యాంకు ఆధారంగా అర్హులకు కేటాయిస్తారు. ఇందులోనూ సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. మొదటి దశలో కన్వీనర్ కోటా ద్వారా సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు అక్టోబర్ 13లోగా అవసరమనుకుంటే సీటు రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకున్న సీట్లను కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు. అప్పటికీ భర్తీ కానివి, రెండో దశలోనూ సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఖాళీ అయ్యే సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తారు. 31 వేలకు పైగా సీట్లు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద మొత్తం 78,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా, 14,847 సీట్లు మిగిలిపోయాయి. తొలి కౌన్సెలింగ్‌లో అఫ్లియేషన్ పూర్తి చేసుకోలేని కాలేజీలు కూడా ఈసారి అర్హత సాధించాయి. కాబట్టి మొత్తం 31,948 సీట్లను భర్తీ చేయనున్నారు. కం ప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్లు ఎక్కువగా భర్తీ అయినట్లు సమాచారం. రెండో ప్రధాన బ్రాంచి గా భావిస్తున్న ఈసీఈలో దాదాపు 3 వేల సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. సివిల్, మెకానికల్ సీట్లతోపాటు ఐటీ కోర్సుల్లో కూడా ఒక్కో బ్రాంచ్‌లో దాదాపు వెయ్యి సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. క్లైమాక్స్‌లో ‘బి’కేటగిరీ ఇంజనీరింగ్ ‘బి’కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను అక్టోబర్ 5కల్లా పూర్తి చేయాలని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి గడువు విధించింది. ఆ తర్వాత 15లోగా ఉన్నత విద్యామండలికి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ర్యాంకు ప్రకారమే భర్తీ చేయాలని, ఇలా కాని పక్షంలో ఫిర్యాదు చేయాలని మండలి స్పష్టం చేసింది. అయితే, ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం ఈ సీట్ల కేటాయింపు జరగడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇదిలాఉంటే, ప్రైవేటు కాలేజీలు మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా ముందే మాట్లాడుకున్న వారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో మిగులు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 200 సీట్లు మిగిలిపోతున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. ఆ తర్వాతనే జాతీయ కాలేజీలైన ఐఐటీ, నిట్ వంటి వాటిల్లో సీట్లొచ్చి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీలు ఏర్పడుతున్నాయి. వీటిని భర్తీ చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కాలేజీలు ఇలా మిగిలిపోయిన సీట్లను కూడా సొమ్ము చేసుకుంటున్నా, ప్రభుత్వ కాలేజీలకు భర్తీ చేసే వెసులుబాటు ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
విద్యారంగంలో వ్యాపార ధోరణికి సీఎం జగన్ చెక్ పెట్టారు..
-
AP EAPCET ఫలితాలు విడుదల
-
ఏపీ ఈఏపీ సెట్: టాప్ టెన్.. అబ్బాయిలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్–2021 ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఫలితాల్లో 80.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకులను బాలురు కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం విజయవాడలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ర్యాంకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 26వ తేదీ నుంచి అభ్యర్థులకు రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,76,586 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 1,66,460 పరీక్షకు హాజరయ్యారని, వీరిలో 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఇందులో బాలురు 79,221 మంది కాగా.. బాలికలు 54,984 మంది ఉన్నారు. గత ఏదితో పోలిస్తే అదనంగా వెయ్యి మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు వివరించారు. ఈ నెల 14వ తేదీన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పూర్తి పారదర్శకంగా ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీలో 120, తెలంగాణలో 3 కేంద్రాల్లో 15 సెషన్లలో ‘ఏపీ ఈఏపీసెట్–2021’ పరీక్షలను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) 2021 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కోవిడ్ సోకడంతో పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించి ర్యాంకు కార్డులు అందజేస్తామని మంత్రి చెప్పారు. పరీక్షకు హాజరైన 18,547 మంది ఎస్సీ, 3,455 మంది ఎస్టీ విద్యార్థులు నూరు శాతం అర్హత సాధించినట్టు వివరించారు. రెండు నెలల రికార్డు సమయంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ఏపీ ఈఏపీసెట్–2021ను నిర్వహించిన కాకినాడ జేఎన్టీయూ వర్సిటీ అధికారులను మంత్రి అభినందించారు. ఎంసెట్ స్థానంలో ఈఏపీ సెట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్ పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. అయితే, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. ఈ క్రమంలో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పేరుతో కొనసాగిస్తున్నారు. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ స్ట్రీమ్‌కు పరీక్షలు (ఇంగ్లిషు, తెలుగు భాషల్లో) నిర్వహించారు. 160 మార్కులకు కంప్యూట్ బేస్ట్ టెస్ట్ నిర్వహించిన అనంతరం ఫైనల్ కీ విడుదల చేసి ప్రత్యేక వెబ్సైట్ ద్వారా విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణులతో వెరిఫికేషన్ కమిటీ నియమించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి, పారదర్శకంగా మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేశారు. విద్యను వ్యాపారం కానివ్వం గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా చేయడంతో చాలా మంది నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైందని మంత్రి ఆదిమూలపు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాంకేతిక విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అర్హత సాధించిన పేద పిల్లలకు కూడా ప్రైవేట్ వర్సిటీలు, కార్పొరేట్ కళాశాలల్లో 35 శాతం సీట్లు కేటాయించేలా కేబినెట్లో ఆమోదించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కళాశాలలు జవాబుదారీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద నేరుగా తల్లుల ఖాతాల్లోనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తోందన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.2 వేల కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించినట్టు వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయడంపై కోర్టు స్టే విధించిందని మంత్రి తెలిపారు. తల్లుల ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయడం వల్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, బోధనా సిబ్బంది తదితర అంశాలను తల్లిదండ్రులు తెలుసుకుని తమ పిల్లలను చేర్పించే అవకాశం ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పొందిన వారిలో ఒకరిద్దరు తల్లులు పొరపాటున లేదా మరే కారణం వల్ల కళాశాలలకు ఫీజులు చెల్లించి ఉండకపోవచ్చన్నారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేసుకోవాలనుకోరని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గతంలో ప్రైవేట్ వర్సిటీల్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల కేటాయింపు మెరిట్ చూడకుండా, పారదర్శకత పాటించకుండా పూర్తి వ్యాపార ధోరణితో కేటాయించే పరిస్థితి ఉండేదన్నారు. బీ–కేటగిరీ కింద ఈ ఏడాది నుంచి 70 శాతం ‘ఏపీ ఈఏపీసెట్’ ద్వారా, మిగిలిన 30 శాతంలో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, మిగిలిన 15 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం స్థానిక, స్థానికేతర కోటాలో భర్తీ చేస్తామన్నారు. ఇంటర్మీడియెట్‌లో గత ఏడాది నుంచి ఆన్లైన్లో ప్రవేశాలు తీసుకొచ్చామన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు తమకు కావలసిన కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం కలిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 79 శాతం కళాశాలల్లో ప్రవేశాలు పొందారని వివరించారు. ఆన్లైన్ ప్రవేశాలపై కోర్టు స్టే విధిస్తూ.. తల్లిదండ్రలకు అవగాహన కల్పించి విసృత ప్రచారం కల్పించాలని సూచిందన్నారు. పేదలకు సైతం కార్పొరేట్ విద్య ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మోనిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఫీజుల నియంత్రణకు కమిటీ లేకపోవడం వల్లే ప్రైవేట్ వర్సిటీలు ఇష్టానుసారంగా దండుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు సైతం కార్పొరేట్ విద్యను అందించే మహాయజ్ఞం చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సెట్స్ డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం: శ్రీనిఖిల్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించిన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన కోయి శ్రీనిఖిల్ 160 మార్కులకు గాను 158.3400 మార్కులు సాధించాడు. శ్రీనిఖిల్ తండ్రి వెంకటేశ్వరరావు కొడిగెనహళ్లిలోని ప్రభుత్వ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో, తల్లి సుజాత హిందూపురంలోని నేతాజీ మునిసిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీనిఖిల్ మాట్లాడుతూ.. ఐఐటీలో సీటు సంపాదించే లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నానని చెప్పాడు. ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే తన లక్ష్యమని వెల్లడించాడు. నా లక్ష్యం సివిల్స్: మహంత నాయుడు ఇంజనీరింగ్ విభాగంలో రెండో ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వారాడ మహంతనాయుడు 160 మార్కులకు గాను 156 మార్కులు సాధించాడు. అతడి తల్లిదండ్రులు త్రివేణి, రామారావు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. మహంత నాయుడు మాట్లాడుతూ.. తాను జేఈఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంక్ పొంది ఐఐటీ ముంబైలో చేరి సివిల్స్ సాధించడమే లక్ష్యమని తెలిపారు. చదవండి: దక్షిణ భారతదేశ ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్ -
రేపు ఏపీ ఎంసెట్(ఈఏపీసెట్) ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ (ఈఏపీసెట్) ఫలితాలను సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. education.sakshi.comలో ఫలితాలను చూడవచ్చు. (చదవండి: విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..) ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. చదవండి: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
ఇంజనీరింగ్‌లో అర్హులు.. 82.08%
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఎంసెట్ ఫలితాలను విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం.. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 92.48 శాతం అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో మొదటి పది మందిలో 9 మంది.. మెడికల్, అగ్రికల్చర్లో టాప్‌టెన్‌లో 8 మంది బాలురే. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలోనూ ఆ రాష్ట్రానికి టాప్ టెన్‌లో నాలుగు దక్కాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన విద్యార్థులే ఎంసెట్ మొదటి పది ర్యాంకుల్లో ఎక్కువగా ఉన్నారు. ఇంటర్మీడియేట్ మార్కులను ఈసారీ వెయిటేజ్‌గా తీసుకోలేదు. ఇంటర్ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను ఎత్తివేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా కటాఫ్ మార్క్ 40గా నిర్ణయించారు. అంతా ఆన్లైన్లోనే.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు.. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) సంయుక్త భాగస్వామ్యంతో ఎంసెట్ నిర్వహించారు. బీటెక్ కోర్సు ల్లో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 4, 5, 6 తేదీల్లో... వ్యవసాయ, నర్సింగ్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష 9, 10 తేదీల్లో ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. ఇంజనీరింగ్ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 89.71 శాతం, మెడికల్, అగ్రికల్చర్లో 91.19 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ‘సెట్’లో తెలంగాణనే ముందంజ: సబిత కోవిడ్ కష్టకాలంలోనే ఎంసెట్ నిర్వహించి, అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణనే ముందు వరుసలో ఉందని సబితా ఇంద్రారెడ్డి ఫలితాల వెల్లడి సందర్భంగా అన్నారు. గత మూడేళ్ల లెక్కను పరిశీలిస్తే.. ఈసారి ఎంసెట్‌కు 28 వేల మంది విద్యార్థులు అధికంగా హాజరయ్యారని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రతిభతో మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, మాజీ చైర్మన్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హత ఇలా... ఇంజనీరింగ్‌లో... ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారు : 1,64,963 పరీక్షకు హాజరైనవారు : 1,47,991 అర్హత పొందినవారు : 1,21,480 అగ్రికల్చర్, మెడికల్... దరఖాస్తులు చేసుకున్నవారు : 86,641 పరీక్షకు హాజరైనవారు : 79,009 అర్హత సాధించినవారు : 73,070 టాప్ 10 ర్యాంకర్లు వీరే... ఇంజనీరింగ్‌లో... విద్యార్థి జిల్లా మార్కులు సత్తి కార్తికేయ పాలకొల్లు(పశ్చిమగోదావరి) 158 దుగ్గినేని వెంకట ప్రణీత్ రాజంపేట(కడప) 156 మహ్మద్ అబ్దుల్ ముఖీత్ టోలిచౌకి, హైదరాబాద్ 156 రామస్వామి సంతోష్‌రెడ్డి పోచంపల్లి, నల్లగొండ 154 జోష్యుల వెంకట ఆదిత్య హైదర్‌నగర్, హైదరాబాద్ 154 పి. చేతన్ మనోజ్ఞసాయి పీలేరు, చిత్తూరు 154 ఎం. ప్రణయ్ విజయనగరం 153 దేశాయి సాయి ప్రణవ్ నెల్లూరు 152 ఎస్. దివాకర్‌సాయి విజయనగరం 152 ఎస్. సాత్విక రెడ్డి నల్లగొండ 152 అగ్రికల్చర్, మెడికల్... విద్యార్థి జిల్లా మార్కులు మండవ కార్తికేయ బాలానగర్, హైదరాబాద్ 151 ఈమని శ్రీనిజ పెద్దఅంబర్‌పేట, హైదరాబాద్ 150 టీ సాయి కౌశల్ రెడ్డి హైదరాబాద్ 150 రంగు శ్రీనివాస కార్తికేయ అనంతపురం, ఏపీ 150 చందం విష్ణు వివేక్ రాజమండ్రి, ఏపీ 149 కోలా పవన్ రాజు కాకినాడ, ఏపీ 149 కన్నెకంటి లాస్యా చౌదరి ఖమ్మం 149 పల్లి వెంకట కౌశిక్ రెడ్డి విజయవాడ, ఏపీ 148 రవి అభిరాం రంగారెడ్డి 148 బి రామకృష్ణ షాలిగౌరారం, నల్లగొండ 148 ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి అగ్రికల్చర్&మెడికల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి చదవండి : ప్లీజ్ వర్క్‌ఫ్రం హోం పెట్టండి! ఐటీ కంపెనీలకు ప్రభుత్వ విజ్ఞప్తి -
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 13 వరకు వెబ్ఆప్షన్స్ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని చెప్పింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది. (చదవండి: రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్ రెడ్డి) -
తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్ష
-
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఎంసెట్’ మాక్ టెస్టులు, రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ‘ఇంజనీరింగ్’..! ఇందు కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు ‘ఎంసెట్’ పరీక్ష కోసం ప్రిపేరవుతుంటారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ ప్రవేశ పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నారు. ఒక వైపు కరోనా ప్రభావం..మరో వైపు భవిష్యత్‌కు దారి చూపే ప్రవేశ పరీక్ష! ఇలాంటి కష్ట సమయంలో తెలుగు విద్యార్థులకు అండగా నిలిచేందుకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ముందుకు వచ్చింది. ఇంటి నుంచే ఆన్లైన్ మాక్ ఎంసెట్ పరీక్ష రాసి..తమ ప్రతిభను సమీక్షించుకొని..ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకునేందుకు ఇదో చక్కని సదావకాశం. ఈ మాక్ టెస్టులను ప్రముఖ sakshieducation.com, Xplore సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. https://special.sakshi.com/online-classes/eapcet-registration లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత...లాగిన్ ID, Password ను ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి పంపిస్తారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థి మూడు ఆన్లైన్ టెస్టులకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 17వ తేదీన విడుదల చేస్తారు. అలాగే www.sakshieducation.com లో మార్కులను తెలుసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డ్‌ను పొందవచ్చు. -
టీఎస్ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం
-
వెయిటేజీ రద్దుతో నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలతో ఎంసెట్ నిర్వహించేందుకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 4, 5, 6, 9, 10వ తేదీల్లో ప్రవేశ పరీక్ష జరగనుంది. కోవిడ్–19 వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం, సిలబస్ తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్‌ను నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. పరీక్ష జరగనున్న తీరు, చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్ధన్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఇంటర్ పరీక్షల రద్దుతో వెయిటేజీ రద్దు గతేడాది వరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉండేది. అయితే ఈసారి వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంతో, వెయిటేజీని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇలా వెయిటేజీ రద్దు చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి నష్టం జరగదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. పైగా సెకండ్ ఇయర్ పరీక్షలు లేకపోవడంతో చాలామంది వెయిటేజీ రద్దును ఆహ్వానించారు. ఎక్కువ ఆప్షన్లు ఉండవు కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. అందుకు అనుగుణంగానే ఎంసెట్‌లోనూ సిలబస్ తగ్గించి, ఆ ప్రకారమే ప్రశ్నలు ఇస్తున్నాం. మొదటి సంవత్సరానికి సంబంధించి 100 శాతం, రెండో ఏడాదికి 70 శాతం సిలబస్‌ను తీసుకున్నాం. ప్రశ్నలను మొదటి, రెండో ఏడాదికి సంబంధించిన సిలబస్‌ను బట్టి సాపేక్షికంగా ఇస్తాం. దీనివల్ల మొదటి ఏడాది ప్రశ్నలు సహజంగానే ఎక్కువ వస్తాయి. సిలబస్‌ను కుదించడం వల్ల జేఈఈ మాదిరిగా ఎక్కువ ఆప్షన్లను ఇవ్వడం లేదు. గతేడాది కంటే తక్కువగా సెషన్లు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్ విద్యార్థుల కోసం పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుంది. ఈసారి తక్కువ సెషన్లు పెట్టాం. గతేడాది ఇంజనీరింగ్‌కు 8 సెషన్లు పెడితే, ఈసారి 6 సెషన్లు పెడుతున్నాం. వ్యవసాయ, మెడికల్ కోర్సులకు గతేడాది నాలుగు సెషన్లు పెడితే, ఈసారి మూడు సెషన్లలోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణలో 82 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. గతేడాది కంటే 27 వేల మంది ఎక్కువగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ ఇంటర్ పాస్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. మాస్క్ ధరించాలి.. శానిటైజర్ తెచ్చుకోవాలి గతేడాది కంటే ఈసారి కరోనా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్, 500 ఎంఎల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్ డిక్లరేష¯Œన్ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు ఉందా లేదా అనేది డిక్లరేషన్‌లో స్పష్టం చేయాలి. జ్వర పరీక్ష చేస్తాం. ఒకవేళ జ్వరం, జలుబు వంటివి ఉంటే ప్రత్యేక ఏర్పాటు చేస్తాం. పరీక్ష సమయానికి కోవిడ్ నిర్ధారణ అయినవాళ్లు ముందుగా ఈ–మెయిల్ ద్వారా తెలియ జేయాలి. కరోనా పాజిటివ్ అని ఉన్న రిపోర్ట్‌ను జత చేయాలి. ఇలాంటి వారికి తర్వాత పరీక్షలు పెట్టే అవకాశముంది. ఇలా ఎవరైనా నిర్ధారించిన తేదీల్లో పరీక్షకు హాజరుకాలేకపోతే, వారు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వారిని కూడా తదుపరి తేదీన జరిగే పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తాం. మొత్తం 160 మార్కులకు పరీక్ష మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అర్హత సాధించాలంటే 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. వారికి సున్నా మార్కు వచ్చినా సీటు పొందొచ్చు. పరీక్ష పేపర్ ఇంగ్లీషు–తెలుగు, ఇంగ్లీషు–ఉర్దూ, ఇంగ్లీష్లలో ఉంటుంది. అత్యధికంగా 1,96,500 మంది ఇంగ్లీషు పేపర్ ఒక్కటే ఆప్షన్‌గా ఇచ్చారు. 2018 నుంచి జేఈఈ పరీక్ష మాదిరి నార్మలైజేష¯Œన్ ప్రాసెస్ అనే పద్ధతిని పాటిస్తున్నాం. ఇది శాస్త్రీయంగా జరుగుతుంది. పేపర్‌కు స్కేలింగ్ ఉంటుంది. స్టాటిస్టికల్ ఫార్ములా ఉంటుంది. ఆ ప్రకారం మార్కులను లెక్కగట్టి ర్యాంకులను ప్రకటిస్తాం. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు. రెండు గంటలు ముందు నుంచే అనుమతి ఈసారి హాల్ టికెట్‌తో పాటు పరీక్ష జరిగే కేంద్రం రూట్ మ్యాప్‌ను కూడా ఇస్తున్నాం. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తాం. 1.15 గంటల ముందు హాల్లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్‌లు అనుమతించరు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. దరఖాస్తుకు నేడే చివరి తేదీ ఫైన్‌తో కలిపి ఎంసెట్‌కు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీ నుంచి 50 వేల మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1,400 మంది ఉన్నారు. -
Telangana: ఎంసెట్, నీట్, జేఈఈ విద్యార్థులకు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల వారు కూడా వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్‌ను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. http://tscie.rankr.io లింక్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ పొందవచ్చని తెలిపారు. -
గుడ్ న్యూస్: విద్యార్థులు రీషెడ్యూల్ చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, బిట్సాట్ పరీక్షలు ఒకేరోజు ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించింది. ఎంసెట్ తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లోని వివిధ కోర్సులలో ప్రవేశానికి బిట్సాట్–2021 పరీక్షను వచ్చే నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్ష వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సు విద్యార్థులకు నిర్వహిస్తారు. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సులు కోరుకునే విద్యార్థులకు ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులకు ఒకే తేదీలో ఎంసెట్, బిట్సాట్ పరీక్షలు రెండూ ఉన్నాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులు ఎంసెట్ తేదీని మార్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. బిట్‌సాట్‌కు ఒకరోజు ముందు లేదా తరువాత రోజుకు ఎంసెట్ తేదీని మార్చుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు ఈ–మెయిల్ (convener.eamcet@tsche.ac.in) ద్వారా ఎంసెట్ కన్వీనర్‌కు తమ అభ్యర్థనను పంపవచ్చు. ఇలావుండగా.. గత సంవత్సరం మాదిరిగానే ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉంటే ఎంసెట్ కన్వీనర్‌కు తెలియజేయాలి. ఎంసెట్ జరిగిన పది రోజుల తర్వాత వారికోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. -
ఎంసెట్ ఇక ఈఏపీసెట్
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా పలు ప్రొఫెషనల్ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుం చి 25 వరకూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో ఇతర ప్రవేశ పరీక్షలు.. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ ఈఏపీసెట్–2021 షెడ్యూల్.. ►అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుంచి జూలై 25వ తేదీ వరకు ►రూ.500 ఫైన్‌తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు ►రూ.1,000 లేట్ ఫీజుతో ఆగస్టు 6 నుంచి 10 వరకు ►రూ.5,000 లేట్ ఫీజుతో ఆగస్టు 11 నుంచి 15 వరకు ►రూ.10 వేల అపరాధ రుసుముతో ఆగస్టు 16 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. -
ఆగస్టులో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షలు ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని తేదీలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను మరికొంత కాలం వాయిదా వేయాలని భావించారు. తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించే అంశంపై చర్చించి ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమా చారం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈసెట్, పీజీఈసెట్ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. -
Telangana: ఎంసెట్ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ప్రస్తుతం ఇంటరీ్మడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు ఇక ఎంసెట్‌పై దృష్టి సారించనున్నారు. ఇన్నాళ్లూ సెకండియర్ పరీక్షలు ఉంటాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ఇప్పటికిప్పుడు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. పైగా కరోనా కూడా అదుపులోకి రాలేదు. ఈనేపథ్యంలో విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు కనీసం 6 వారాల గడువు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చే నెల 5 నుంచి 9 వరకు (5, 6 తేదీల్లో అగ్రికల్చర్, 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్) నిర్వహించాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేయాలన్న భావనకు వచి్చంది. త్వరలోనే సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసే అవకాశం ఉంది. వీటిపై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యా మండలికి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నారు. ఇతర ప్రవేశ పరీక్షలు సైతం.. మరోవైపు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ ఏప్రిల్, మే నెలల సెషన్లను ఇంకా నిర్వహించలేదు. కరోనా కారణంగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాటిని వాయిదా వేసింది. జూలై 3న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షనూ వాయిదా వేసింది. ఈ పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. ఆయా పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేదీ టీసీఎస్సే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎంసెట్, ఇతర సెట్స్‌తో ఆయా పరీక్షల తేదీలు క్లాష్ కాకుండా టీసీఎస్ ఖాళీ స్లాట్స్‌ను బట్టి తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. మొత్తానికి ఆగస్టు ఆఖరులోగా సెట్స్ అన్నింటినీ పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. అయితే ఎంసెట్‌ను మాత్రం సరీ్వసు ప్రొవైడర్‌తో స్లాట్ల లభ్యతను బట్టి, జూలై 25 నుంచి ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 15 తరువాత చేపట్టి, సెపె్టంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రచిస్తోంది. పీజీఈసెట్, ఈసెట్ వాయిదానే.. ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించాల్సిన పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (పీజీఈసెట్), జూలై 1న నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఈసెట్)ను వాయిదావేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచి్చంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించాల్సిన ఐసెట్, అదే నెల 23న నిర్వహించాల్సిన లాసెట్, 24, 25 తేదీల్లో నిర్వహించాల్సిన ఎడ్‌సెట్ పరీక్షలు కూడా వాయిదాపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. అవి పూర్తయ్యాకే లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. -
‘ఎంసెట్’ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2021 దరఖాస్తుల గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. షెడ్యూలు ప్రకారం ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గడువును పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. -
Engineering Academic Calendar: ఈ షెడ్యూలు అమలయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 2021–22 విద్యా సంవత్సరానికి అకడమిక్ కేలండర్‌ను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసింది. కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతుల జారీ తేదీలు, ప్రవేశాలు పూర్తి చేయాల్సిన గడువు, తరగతుల ప్రారంభం వంటి అన్ని అంశాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 9 నాటికి ప్రవేశాలను పూర్తి చేసి, 15వ తేదీ నాటికల్లా ప్రథమ సంవత్సర విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రథమ సంవత్సరం మినహా ఇతర సంవత్సరాల వారికి మాత్రం సెప్టెంబర్ 1 నుంచే తరగతులను ప్రారంభించాలని వెల్లడించింది. మరోవైపు పీజీడీఎం/పీజీసీఎం కోర్సుల్లో జూలై 1 నుంచే తరగతులను ప్రారంభించాలని, జూలై 10లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది. షెడ్యూలు ప్రకారం జరిగేనా? దేశవ్యాప్తంగా కరోనా కారణంగా గతేడాది అక్టోబర్ లో తరగతుల బోధనను ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ఓవైపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లోనూ నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను, ఈనెలలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా అదుపులోకి వస్తే తప్ప వాటిని నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రాల వారీ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సెట్స్‌ను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఐసీటీఈ జారీ చేసిన అకడమిక్ కేలండర్ అమలు అవుతుందా లేదా? అన్నది అనుమానమే. గతేడాది కూడా సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా అకడమిక్ కేలండర్‌ను జారీ చేసినా తరువాత దాన్ని పలుమార్లు మార్పు చేయాల్సి వచ్చింది. కరోనా వల్ల చివరకు అక్టోబర్‌లో ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. ఈసారి కూడా కరోనా కేసులు అదుపులోకి రాకపోతే అదే పరిస్థితి ఉంటుందని అధ్యాపక సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంకా పూర్తికాని బోధన.. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ విద్యే కొనసాగుతోంది. ఇంకా తరగతులు పూర్తి కాలేదు. వచ్చే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా వారికి పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 1 నుంచే ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి సెప్టెంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ పేర్కొంది. అయితే వారికి ఏఐసీటీఈ నిర్దేశిత సమయంలో బోధనను ప్రారంభించడం సాధ్యం కాదని పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ జారీ చేసిన ఉత్తర్వులు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని అధ్యాపక సంఘాల నేతలు అయినేని సంతోష్‌కుమార్, బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండానే అకడమిక్ కేలండర్‌ను జారీ చేసిందని ఆరోపించారు. ఈనెలలో పరీక్షలు వద్దు: యూజీసీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలలో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రస్తుతానికి నిలిపివేయాలని యూజీసీ పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ పరీక్షల విషయంలో కేంద్రం, తాము జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానమని, ఈ పరిస్థితుల్లో మే నెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను నిలిపేయాలని స్పష్టం చేసింది. ఇదీ ఇంజనీరింగ్, ఫార్మసీ అకడమిక్ కేలండర్.. 30–6–2021: సాంకేతిక విద్యా సంస్థలకు అనుమతులకు చివరి గడువు 15–7–2021: యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు పూర్తికి చివరి తేదీ 31–8–2021: మొదటి దశ కౌన్సెలింగ్, సీట్లు కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 1–9–2021: ప్రథమ సంవత్సరం మినహా మిగతా వారికి తరగతులు ప్రారంభం. 9–9–2021: రెండో విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 10–9–2021నాటికి: సీట్లు రద్దు చేసుకున్న వారికి పూర్తి ఫీజు తిరిగి ఇచ్చేయాలి 15–9–2021: ప్రథమ సంవత్సరంలో మిగిలిన ఖాళీల్లో విద్యార్థుల చేరికలు పూర్తి 15–9–2021: ప్రథమ సంవత్సరంలో చేరిన వారికి తరగతుల ప్రారంభానికి చివరి గడువు 20–9–2021: ద్వితీయ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు పూర్తి -
కరోనా ఎఫెక్ట్: ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేయడం, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో ఎంసెట్ వెయిటేజీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్షనే కీలకం కానుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించనుంది. వాటి ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టనుంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన 1,99,019 విద్యార్థుల్లో ఎంసెట్ రాసేవారు ఉంటారు. అయితే ఇపుడు వారిని ప్రథమ సంవత్సర సబ్జెక్టుల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలంటే ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కు లు ఉండాలి. మొదటి సంవత్సరంలో కొందరు విద్యార్థులను ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కనీస మార్కులతో పాస్ చేస్తున్నందున ఎంసెట్‌లో ఇంటర్‌మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఉండదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సర విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నందున... వచ్చే ఏడాది వారు ద్వితీయ సంవత్సరానికి వస్తారు. దీంతో అప్పుడు కూడా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ( చదవండి: వాయిదా వేద్దామా! ) -
పాత విధానంలోనే ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలను గతంలో మాదిరిగానే యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పాత విధానంలోనే ఏపీ ఎంసెట్–2021ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త నిబంధనలను పేర్కొంటూ 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టులు చదవని ఇతర గ్రూపుల ఇంటర్ విద్యార్థులకూ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పించేలా ఏఐసీటీఈ ఇటీవల నిబంధనలను విడుదల చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు అవసరమయ్యే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులకు ఆ సబ్జెక్టులను తప్పనిసరి చేస్తూనే ఇతర కోర్సులకు ఇతర గ్రూపుల విద్యార్థులను అనుమతించాలని సూచించింది. ఇందుకు 14 ఆప్షనల్ సబ్జెక్టులను పేర్కొంటూ వీటిలో ఏ మూడింటి కాంబినేషన్‌తో ఇంటర్ చదివినా ఇంజనీరింగ్ కోర్సుల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. అయితే అంతిమంగా ఈ నిబంధనలను అనుసరించడంపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల ఇష్టానికే వదిలేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోనే ఎంసెట్–2021 ఈ నేపథ్యంలో గతంలోని నిబంధనల ప్రకారమే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 2021–22 అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో ఏఐసీటీఈ పొందుపరిచిన వివిధ సబ్జెక్టుల కాంబినేషన్లు రాష్ట్రంలో లేకపోవడంతో పాత పద్ధతిలోనే అంటే.. ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)తోనే ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇవ్వనుంది. ఏపీ ఎంసెట్–2021లో కూడా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. అయితే విద్యార్థులు ఇంటర్లో 45 శాతం (రిజర్వుడ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి. కరోనా నేపథ్యంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎంసెట్‌లో కూడా సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించనున్నారు. ఏయే అంశాలపై బోధన జరిగిందో అవే అంశాల పరిధిలో ప్రశ్నలుండేలా ఉన్నత విద్యామండలి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎంసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ–కాకినాడకే.. ఏపీ ఎంసెట్–2021 నిర్వహణ బాధ్యతను ఈసారి కూడా కాకినాడ జేఎన్టీయూకే అప్పగిస్తున్నారు. ఇప్పటికే వివిధ సెట్ల నిర్వహణ సంస్థలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్–2021 నిర్వహణ కమిటీ చైర్మన్‌గా జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా ప్రొఫెసర్ వి.రవీంద్ర ఉంటారు. ఎంసెట్‌ను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఐటీ సంస్థ ఎంపికపై ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఎంసెట్ సహా ఇతర సెట్ల షెడ్యూళ్లపై తదుపరి చర్యలు ప్రారంభించనుంది. కరోనా వల్ల గతేడాది ప్రవేశాలు ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి కొంతముందుగానే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. పాత విధానంలోనే ఎంసెట్ – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఇంజనీరింగ్ కోర్సులపై ఏఐసీటీఈ.. 2021–22 విద్యా సంవత్సరపు అప్రూవల్ హ్యాండ్‌బుక్‌లో కొన్ని కొత్త నిబంధనలు చేర్చినా వాటి అమలుపై రాష్ట్రాలకు వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. కాబట్టి ఏపీ ఎంసెట్‌ను పాత విధానంలోనే నిర్వహిస్తాం. ఏఐసీటీఈ 14 సబ్జెక్టులతో ఆప్షన్లు పెట్టినా ఆ సబ్జెక్టులతో స్పెషల్ బ్రాంచ్‌ల కాంబినేషన్లు మన రాష్ట్రంలో లేవు. బీటెక్ బయోటెక్నాలజీలోకి ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థులను అనుమతిస్తున్నాం. ఆ విద్యార్థులకు మ్యాథ్స్‌లో బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెట్టాం. కోవిడ్‌తో ఇంటర్ సిలబస్‌ను తగ్గించినందున ఎంసెట్‌ను కుదించిన సిలబస్ మేరకే నిర్వహిస్తాం. -
ఎంసెట్‌లో ముందుగా ఏ పరీక్ష?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించాలా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించాలా? అన్న విషయంలో ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. సాధారణంగా అందులో ముందు 3 రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఆరు సెషన్లలో (రోజుకు రెండు సెషన్లు) నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే 8న కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు, ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒక రోజు గడువే ఉంటోంది. దీంతో మ్యాథమెటిక్స్ విద్యార్థుల వెసులుబాటు కోసం ముందుగా ఇంజనీరింగ్ ఎంసెట్ కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌ను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది ఉన్నత విద్యామండలి. అయితే నీట్ తేదీలను ప్రకటించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పుడే అగ్రికల్చర్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో ఎంసెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్‌లో పాలీసెట్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ను ఈసారి జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ చివరలో పాలీసెట్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మే 17 నుంచి 26వ తేదీ వరకు ఉండటంతో పాలీసెట్‌ను జూన్‌లో నిర్వహించేలా ఎస్బీటీఈటీ కసరత్తు చేస్తోంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్... -
తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలు ఖరార య్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఆయా తేదీలను శుక్రవారం ప్రకటించారు. ప్రధానమైన ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ బీఈ/బీటెక్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాల కోసం ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు తెలి పారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీఈ/బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను జూలై 1వ తేదీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి జూన్ 14వ తేదీ తరువాత ఎప్పుడైనా సెట్స్‌ను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మం డలి సిద్ధంగా ఉన్నా, ఆన్లైన్ పరీక్షలను నిర్వ హించే సాంకేతిక సంస్థ అయిన టీసీఎస్ ఖాళీ స్లాట్స్ జూన్ లో ఎక్కువగా లేకపోవడం, పైగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరమ్యే ఎంసెట్ పరీక్ష లను నిర్వహించేందుకు టీసీఎస్‌కు జూన్ లో సిబ్బంది కొరత ఉంటుందనే కారణంతో జూలై లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడిం చారు. అయితే తక్కువ మంది విద్యార్థులు హాజ రయ్యే పీజీఈసెట్‌ను జూన్ 20 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఫార్మ్–డి(పీబీ), మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో దీని ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా అనేక ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్న టీసీఎస్ ప్రతినిధులతో చర్చించి, ఖాళీగా ఉన్న స్లాట్స్‌లో సెట్స్ తేదీలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. అలాగే అన్ని సెట్స్‌కు నిర్వహణ యూనివర్సిటీలను, కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. 70 శాతం సిలబస్‌తో ఎంసెట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70% సిలబస్, ‘ప్రథమ’లో పూర్తి సిలబస్‌తో ఎంసెట్‌ను నిర్వహి స్తామన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం జరిగినందున ఇంటర్‌బోర్డు కూడా సిలబస్‌ను, మోడల్ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచిందన్నారు. ఎంసెట్ పేపరు సెట్టింగ్ సమయంలో ఆ సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. సిలబస్ వివరాలను కూడా ఎంసెట్ నోటిఫికేషన్ సమయంలో వెబ్సైట్లో ఎంసెట్ కమిటీ అందుబాటులో ఉంచుతుందని వివరించారు. ఎంసెట్ నోటిఫికేషన్ వారం, పదిరోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. జూలై చివర్లో లేదా ఆగస్టులో... మరో నాలుగు సెట్స్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదని పాపిరెడ్డి తెలిపారు. వాటిని జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్, 3 ఏళ్లు, 5 ఏళ్ల న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు లాసెట్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ తేదీలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. సాధారణ పరిస్థితుల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్‌లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు జరిగేవన్నారు. వాటి ప్రకారం మే నెలలో ఎంసెట్, ఇతర సెట్స్ నిర్వహించే వారిమన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆ పరీక్షలన్నీ రెండు నెలలు ఆల స్యంగా నిర్వహించాల్సి వస్తోంద న్నారు. యూనివర్సిటీల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ప్రస్తుతం ప్రత్యక్ష బోధన మొదలైనందున త్వరలోనే ఆయా పరీక్షల తేదీలు ఖరారు అవుతాయన్నారు. వాటిని బట్టి ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని వివరించారు. చదవండి: బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు?