
వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాకు ర్యాంకుల పంట పండింది. అగ్రికల్చర్, మెడిసిన్‌లో టాప్ 10లోపు రెండు ర్యాంకులను, ఇంజనీరింగ్ విభాగంలో ఒక ర్యాంక్‌ను జిల్లా కైవసం చేసుకుంది. కడపకు చెందిన ఎర్రగుడి లిఖితకు 7వ ర్యాంకు సాధించగా, వేంపల్లికి చెందిన జాగా వెంకట వినయ్ 8వ ర్యాంక్‌లో మెరిశారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి 3 వ ర్యాంక్ సాధించారు.
(చదవండి : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల)
కాగా, ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 14నుంచి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 1నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.comలో చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment