సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రి కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్(ఏపీ ఎంసెట్) ఆన్‌లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభయ్యాయి. ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 19 వరకు ఇంజనీరింగ్, 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 47 పట్టణాలలో 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్షకు గంటన్నర ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి పంపించగా.. నిమిషం ఆలస్యమైనా అనుమతించడం లేదు. అభ్యర్థులు తమతోపాటు హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఏపీఈఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్‌ను వెంట తీసుకురావాలి. సెల్‌ఫోన్, వాచీలు, తదితర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించరు. బయో మెట్రిక్ హాజరు కోసం విద్యార్తినులెవరూ కూడా చేతులకి మెహందీ పెట్టుకు రాకూడదని సూచించారు
ఒక్కో విభాగంలో అబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలు ఉండనున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో గణితానికి 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు.. బైపీసీలో బోటనీ 40, జువాలజీ 40 , ఫిజిక్స్ 40, కెమిస్డ్రీ 40 మార్కులకి ప్రశ్నలు ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకి తీసుకురాకూడదు.
Comments
Please login to add a commentAdd a comment