AP EAPCET
-
1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2024 కౌన్సెలింగ్‌లో తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ నెల 22 లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. అయితే ఈ నెల 19 నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఏపీఈ ఏపీసెట్‌లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సెలింగ్ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ధ్రువపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా, 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి మెరిట్ జాబితా రానందున ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని వివరించారు. -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్ నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
-
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
-
AP: ప్రారంభమైన ఈఏపీ సెట్ పరీక్షలు
విజయవాడ: ఏపీ ఈఏపీ సెట్(ఎంసెట్) పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష ప్రారంభం అయింది. అనంతరం మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌గా పరీక్షలు జరగనుంది. రేపు( శుక్రవార) బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయి. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి.రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఎప్‌సెట్‌కి హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య 3,61,640. ఇందులో మహిళలు1,81,536 మంది. పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 22 వేలకి పైగా విద్యార్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక.. ఒక నిమిషం నిబందన పక్కాగా అమలు చేయనున్న ఉన్నత విద్యా మండలి పేర్కొంది. విద్యార్ధులను పరీక్షా కేంద్రం లోపలికి గంటన్నర ముందుగానే అనుమతి ఉంటుంది. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. విద్యార్ధులు చేతులకి మెహందీ పెట్డుకోకూడదు. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంపైనా నిషేదం ఉన్నట్లు ఉన్నతి విద్యామండలి తెలిపింది. -
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
-
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
గుంటూరు: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు. ‘‘రేపటి(గురువారం) నుంచి ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు, ఎల్లుండి బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్. మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్‌సెట్‌కు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని తెలిపారు.ముఖ్యమైన సూచనలు..‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం..ఏపీ ఈఏపీసెట్ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్‌సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు. -
ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2024కి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం వరకు 3,46,324 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 2,62,981 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 82,258 మంది ఉన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్–ఫార్మా విభాగాలకు కలిపి మరో 1,085 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ దరఖాస్తులు రాలేదు. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు దాదాపు 8 వేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో సుమారు 24 వేలకు పైగా అధికంగా దరఖాస్తులు అందాయి. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు, రూ.1,000తో మే 5 వరకు, రూ.5 వేలతో మే 10 వరకు, రూ.10 వేలతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు మే 4 నుంచి 6 వరకు గ్రీవెన్స్‌ను నిర్వహించనున్నారు. మే 16 నుంచి ఈఏపీసెట్ ఏపీ ఈఏపీసెట్‌ను మే 16 నుంచి నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మే 16, 17 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగంలో మే 18 నుంచి 22 వరకు ప్రవేశపరీక్షలు నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. సంబంధిత తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలను నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను మే 7 నాటికి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ చర్యలతోనే దరఖాస్తుల పెరుగుదల.. ఉన్నత విద్యారంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచి్చన విప్లవాత్మక సంస్కరణలు, అనేక సంక్షేమ పథకాల వల్లే ఈఏపీసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.35 వేల వరకు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్ ఉండేది. అది కూడా అరకొరగా కొంతమందికే అందేది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా కళాశాల ఫీజు ఎంత ఉన్నా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.20 వేల వరకు సహాయాన్ని అందిస్తోంది. మరోవైపు విద్యార్థులు అత్యున్నత నైపుణ్యాలు సంతరించుకునేలా పరిశ్రమల అనుసంధానంతో వారికి ఇంటర్న్‌షిప్, శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. వీటన్నిటి ఫలితంగా గత విద్యా సంవత్సరంలో ఒక్క సాంకేతిక విద్యా రంగంలోనే 1.20 లక్షలకు పైగా విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వూ్యల్లో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రైవేట్ వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు.. గత రెండేళ్లుగా ఈఏపీసెట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఓవైపు కళాశాలల ఫీజులు ఎంత ఉన్నా పూర్తిగా ప్రభుత్వమే ఫీజురీయింబర్స్‌మెంట్ కింద భరిస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోనే కాకుండా విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రైవేట్ వర్సిటీల్లోని సీట్లను కూడా ఈఏపీసెట్‌లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తోంది. విట్, ఎస్‌ఆర్‌ఎంల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వం తన కోటాలో భర్తీ చేస్తోంది. ఈ వర్సిటీల్లో చేరాలంటే ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించాలి్సందే. అలాంటిది పేద విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ప్రభుత్వమే ఈ సంస్థల్లోనూ ఫీజులు భరిస్తోంది. దీంతో ఈఏపీసెట్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. -
మే 13న పోలింగ్.. ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు
సాక్షి, విజయవాడ: మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మే 16కి వాయిదా పడ్డాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీ సెట్ జూన్ 10కి వాయిదా వేశారు. జూన్ 10 నుంచి 14 ఏపీ పీజీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఏపీ ఆర్ సెట్ జరగనుంది. -
ఏపీ ఈఏపీ సెట్–2024 షెడ్యూల్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్–2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు చెప్పారు. దరఖాస్తులకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్‌తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్‌తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్‌తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మే 13–16 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17–19 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో 47, హైదరాబాద్‌లో 1, సికింద్రాబాద్‌లో 1 చొప్పున ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
‘20లోపు ఇంటర్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి’
అనంతపురం: ఏపీ ఈఏపీసెట్–2023 పరీక్ష రాసినవారు ఈ నెల 20లోపు తమ ఇంటర్ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్ స్టూడెంట్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ సి.శోభాబిందు శుక్రవారం తెలిపారు. ఏపీ ఈఏపీసెట్–2023లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఈఏపీసెట్‌లో మొత్తం 2,52,717 మంది అర్హత సాధించారు. వీరిలో ఇంకా 42వేల మంది విద్యార్థులకు ఇంటర్ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ మార్కుల జాబితాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు -
ఏపీ ఈఏపీసెట్.. అబ్బాయిలదే హవా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఫార్మసీ, బీవీఎస్సీ, ఫార్మ్‌డీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ ఈఏపీసెట్)–2023 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులు మొత్తం అబ్బాయిలే కొల్లగొట్టారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలోనూ వారిదే ఆధిపత్యం. టాప్ టెన్ ర్యాంకుల్లో 8 మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,15,297 మంది పరీక్షకు హాజరు కాగా 2,52,717 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,38,180 మంది దరఖాస్తు చేసుకోగా 2,24,724 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,71,514 (76.32 శాతం) మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో 1,00,559 మంది దరఖాస్తు చేయగా 90,573 మంది పరీక్ష రాశారు. వీరిలో 81,203 (89.65 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది మాదిరిగానే ఇంజనీరింగ్ వైపు అత్యధికంగా అబ్బాయిలు, అగ్రికల్చర్ వైపు అమ్మాయిలు మొగ్గు చూపారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన చల్లా ఉమేష్ వరుణ్ 158.03 మార్కులతో (తెలంగాణ ఎంసెట్‌లో 3వ ర్యాంకు), అగ్రికల్చర్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా కాతేరుకు చెందిన బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ 153.88 మార్కులతో (తెలంగాణ ఎంసెట్ టాపర్) ప్రథమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. తొలి పది ర్యాంకులు బాలురకే.. ఇంజనీరింగ్ విభాగంలో తొలి పది ర్యాంకులు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో టాప్ టెన్‌లో ఎనిమిది ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. అయితే రెండు విభాగాల్లో కలిపి బాలుర కంటే బాలికలు 3.99 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. తెలంగాణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగంలో 2, 10 ర్యాంకులు, అగ్రికల్చర్ విభాగంలో 3, 6 ర్యాంకులు వచ్చాయి. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చు నైపుణ్య మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడిగా పరిగణిస్తోందని చెప్పారు. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు, నూతన విద్యా విధానం, ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరిక, ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని తెలిపారు. త్వరలోనే దేశ విద్యా వ్యవస్థలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు రాగానే జూలై 15న కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్నారు. వీరికి మార్కులు అప్లోడ్ చేశాక ర్యాంకులు రాష్ట్రంలో రెగ్యులర్ ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటించారు. అయితే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఏపీవోఎస్ఎస్, తదితర సిలబస్‌తో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు, ఇటీవల సప్లిమెంటరీలో ఇంటర్ పాసైన ఏపీ విద్యార్థుల మార్కుల డేటా రాకపోవడంతో కొంత మందికి ర్యాంకులను కేటాయించాల్సి ఉందని ఈఏపీసెట్ చైర్మన్ జి.రంగ జనార్దన తెలిపారు. అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌తోపాటు మార్కులను అప్లోడ్ చేశాక వీరికి వెయిటేజీ కలిపి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ రామ్మోహనరావు, కార్యదర్శి నజీర్ అహ్మద్, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ సుధీర్‌రెడ్డి, ఈఏపీ సెట్ కన్వీనర్ శోభాబిందు తదితరులు పాల్గొన్నారు. ర్యాంకర్ల వాయిస్ కార్డియాలజిస్ట్‌నవుతా.. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు. మా నాన్న సాయిరామకృష్ణ రైతు, అమ్మ రజిని గృహిణి. నాకు ఇంటర్ బైపీసీలో 985 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో అగ్రి అండ్ ఫార్మసీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు సాధించాను. నీట్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 65వ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో ఎంబీబీఎస్ చదివి కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేస్తా. – బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్, ఫస్ట్ ర్యాంకర్, అగ్రి అండ్ ఫార్మసీ విభాగం అమ్మానాన్న ప్రోత్సాహంతోనే అగ్రస్థానం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. నాన్న చల్లా విశ్వేశ్వరరావు బిజినెస్ రంగంలో ఉన్నారు. నాకు ఇంటర్లో 983 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ సాధించాను. క్లాసులో ఫస్ట్ రావాలని కష్టపడి చదివాను. అమ్మానాన్న ప్రోత్సాహంతోనే ఫస్ట్ ర్యాంకు సాధించగలిగాను. – చల్లా ఉమేష్ వరుణ్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇంజనీరింగ్ విభాగం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తా.. మాది శ్రీకాకుళం జిల్లా తోటాడ. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు నీట్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంక్ సాధించాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే నా లక్ష్యం. –బోర వరుణ్ చక్రవర్తి, రెండో ర్యాంక్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం ఎంఐటీలో ఎంఎస్ చేస్తా.. మా స్వస్థలం.. చిలకలూరిపేట. నాన్న హనుమంతరావు రైతు. అమ్మ కళావతి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉద్యోగం చేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నా. బీటెక్ తర్వాత ఎంఐటీలో ఎంఎస్ చేస్తా. – అడ్డగడ వెంకట శివరామ్, 6వ ర్యాంకు, ఇంజనీరింగ్ విభాగం, చిలకలూరిపేట ఐఐటీలో సీటు సాధించడమే నా లక్ష్యం.. మా స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాం. నాన్న శ్రీనివాసరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ అనురాధ గృహిణి. నాకు ఇంటర్లో 971 మార్కులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ ఎంసెట్‌లో 2వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణీందర్‌రెడ్డి, 7వ ర్యాంకు, ఇంజనీరింగ్ విభాగం -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ►ఇంజనీరింగ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత ►అగ్రికల్చర్ 89.65 శాతం మంది ఉత్తీర్ణత ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ జాబితాలో ఈసారి అంతా బాలురే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు158 మార్కులతో ఉమేష్ వరుణ్ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణా ఎమ్ సెట్లో కూడా వరుణ్ మూడవ ర్యాంకు సాధించారు. విద్యార్థులకు అభినందనలు:బొత్స ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం విద్యార్దుల మంచి భవిష్యత్ కోసమేనని అన్నారు. దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఏపీని ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య కోసం వెచ్చించే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ధ పెరిగిందని అన్నారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు. డైరెక్ట్ లింక్ ఇదే.. ఇంజనీరింగ్ ఫలితాలు అగ్రికల్చర్ ఫలితాలు -
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రి కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్(ఏపీ ఎంసెట్) ఆన్లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభయ్యాయి. ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 19 వరకు ఇంజనీరింగ్, 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 47 పట్టణాలలో 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు గంటన్నర ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి పంపించగా.. నిమిషం ఆలస్యమైనా అనుమతించడం లేదు. అభ్యర్థులు తమతోపాటు హాల్ టికెట్, ఫొటో గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఏపీఈఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్‌ను వెంట తీసుకురావాలి. సెల్‌ఫోన్, వాచీలు, తదితర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించరు. బయో మెట్రిక్ హాజరు కోసం విద్యార్తినులెవరూ కూడా చేతులకి మెహందీ పెట్టుకు రాకూడదని సూచించారు ఒక్కో విభాగంలో అబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలు ఉండనున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో గణితానికి 80 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు.. బైపీసీలో బోటనీ 40, జువాలజీ 40 , ఫిజిక్స్ 40, కెమిస్డ్రీ 40 మార్కులకి ప్రశ్నలు ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలకి తీసుకురాకూడదు. -
ఏపీ వ్యాప్తంగా మొదలైన ఏపీఈఏపీసెట్
-
ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీఈఏపీసెట్
-
ఏపీ ఈఏపీసెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2023కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం నాటికి 3,38,407 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,037 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,370 మంది ఉన్నారు. ఈ మొత్తం దరఖాస్తులు గతేడాది ఆలస్య రుసుముతో చివరి గడువు నాటికి వచ్చిన వాటికంటే అధికంగా ఉండటం విశేషం. ఏపీ ఈఏపీసెట్‌కు రూ.5 వేల ఆలస్య రుసుముతో 12వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మంగళవారం నుంచి అభ్యర్థులకు cets.apsche.ap gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు అందించనున్నారు. మొత్తం 47 పరీక్ష కేంద్రాలు మన రాష్ట్రంలో 45, హైదరాబాద్‌లో రెండు కలిపి మొత్తం 47 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో అనకాపల్లి, అనంతపురం, గుత్తి, తాడిపత్రి, మదనపల్లి, రాజంపేట, బాపట్ల, చీరాల, చిత్తూరు, పలమనేరు, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, అమలాపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, మైలవరం, తిరువూరు, విజయవాడ, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, పుట్టపర్తి, శ్రీకాకుళం, టెక్కలి, గూడూరు, పుత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, బొబ్బిలి, రాజాం, విజయనగరం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కడప, ప్రొద్దుటూరుల్లోను, హైదరాబాద్‌లో ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం రోజుకు రెండు సెషన్లలో.. ఆన్లైన్లో.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జేఎన్టీయూ అనంతపురం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఒక్కో విభాగంలో ఆబ్జెక్టివ్ తరహాలో 160 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ఇలా ఇంజనీరింగ్ విభాగంలో గణితం 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయ, ఫార్మా విభాగంలో బయాలజీ 80 (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. హాల్టికెట్లలో తేడాలుంటే.. ఏపీ ఈఏపీసెట్ హాల్టికెట్లలో తేడాలుంటే 08554–23411, 232248 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం తెలపవచ్చని, లేదా జ్ఛి pఛ్ఛీటజ్చుp్ఛ్చpఛ్ఛ్టి–2023ః జఝ్చజీ .ఛిౌఝకు మెయిల్ పంపవచ్చని సెట్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, కన్వీనర్ ప్రొఫెసర్ శోభాబిందు తెలిపారు. హాల్‌టికెట్ల వెనుక వైపు బస్టాండు నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సిన మార్గాన్ని ముద్రించినట్లు చెప్పారు. ఉదయం సెషన్లో 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లో 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని వారు పేర్కొన్నారు. -
మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్.. షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీ సెట్)ను మే 15 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈఏపీసెట్‌లో భాగంగా మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఇక మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం ప్రవేశపరీక్షలు ఉంటాయి. ఈసారి ముందుగానే.. రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఇతర ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీసెట్, ఆర్‌సెట్లను గతంలో కన్నా ముందుగా నిర్వహించి.. త్వరగా ప్రవేశాలు పూర్తి చేసేలా షెడ్యూళ్లను రూపొందించింది. గాడిన పడనున్న విద్యా సంవత్సరం.. గతంలో కరోనాతో ప్రవేశపరీక్షల నిర్వహణ ఆలస్యం కావడంతో విద్యాసంవత్సరం గాడితప్పింది. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి 2023–24 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్షలను గతంతో పోలిస్తే చాలా ముందుగానే పూర్తి చేసేలా వివిధ సెట్ల షెడ్యూళ్లను రూపొందించింది. ఫలితంగా ఈసారి విద్యా సంవత్సరం గాడిలో పడటానికి ఆస్కారమేర్పడింది. ఈసారి ఈఏపీసెట్ పరీక్షలను గతేడాది కంటే రెండు నెలలు ముందుగా అంటే మే 15 నుంచే ప్రారంభించనుండడం విశేషం. దీనివల్ల జూన్ ఆఖరుకల్లా అడ్మిషన్లతో సహా మొత్తం పక్రియ పూర్తవుతుంది. దీంతో జూలై నుంచే తరగతులు ప్రారంభించవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి -
ఫార్మసీ అడ్మిషన్లపై సందిగ్ధం
సాక్షి, అమరావతి: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కాలేజీలకు గుర్తింపు ఆమోదించే ప్రక్రియను ఆలస్యం చేయడంతో ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడి నెలలు గడిచిపోతున్నా ఫార్మసీ కాలేజీలకు అనుమతులు ఆలస్యం కావడంతో ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీకి ఆటంకంగా మారింది. రెండు నెలలుగా విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తుండగా.. పీసీఐ అనుమతులు లేకపోవడంతో ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ముందుకు వెళ్లలేకపోయాయి. దీనిపై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పలుమార్లు సంప్రదింపులు చేశారు. గత నెలాఖరుకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తామని.. అనంతరం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని సూచించింది. గడువు దాటినా పూర్తి స్థాయిలో అనుమతులు ఇంకా రాలేదు. దీంతో ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా శాఖ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను కేవలం ఇంజనీరింగ్ కోర్సులకే పరిమితం చేశాయి. మూడు విడతల్లో కౌన్సెలింగ్ చేపట్టి ఇంజనీరింగ్ కాలేజీలలోని 80 శాతం సీట్లు భర్తీ చేశారు. ప్రత్యామ్నాయాల వైపు విద్యార్థుల చూపు రాష్ట్రంలో బి.ఫార్మసీ కాలేజీలు 121 వరకు ఉన్నాయి. ఫార్మా–డి కోర్సులు నిర్వహించే కాలేజీలు 60 ఉన్నాయి. కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీ కాలేజీలలో 4,386 సీట్లు, ఫార్మా–డిలో 682 సీట్లు ఉన్నాయి. సకాలంలో కౌన్సెలింగ్ చేపట్టిన రోజుల్లోనే ఈ కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యేవి కావు. పీసీఐ తీరు కారణంగా ఈసారి చాలా ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోతున్నారని పలు కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వానికి నివేదిక ఫార్మసీ కాలేజీలకు పీసీఐ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాకపోవడంతో సాంకేతిక విద్యాశాఖ ఈ కోర్సు ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో కొన్నింటికి సరైన నిబంధనలు పాటించనందున పూర్తి సీట్లకు అనుమతివ్వలేదు. దీనిపై పలు కాలేజీలు పీసీఐని చాలెంజ్ చేశాయి. నిబంధనల ప్రకారం వసతులు, అధ్యాపకులు ఇతర అంశాలపై ఆధారాలు సమర్పణకు పీసీఐ కాలేజీలకు నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. ఈ తరుణంలో కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో అధికారులు పీసీఐని సంప్రదించగా.. కొన్ని షరతులతో సీట్ల భర్తీకి అనుమతించింది. గత ఏడాది ఇన్ టేక్ ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టవచ్చని, అయితే అవి తమ చివరి అనుమతుల మేరకు కొనసాగుతాయని పీసీఐ పేర్కొందని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సాంకేతిక విద్యా శాఖ పేర్కొన్న మేరకు కాలేజీలకు ప్రభుత్వం అనుమతిస్తే ఒకటి రెండు రోజుల్లోనే కౌన్సెలింగ్ ను చేపట్టే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘సెట్’ అడ్మిషన్లన్నీ ఈ నెలలోనే
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్–2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు. ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్ సెట్ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ–బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు. నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్లను సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు. డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్లైన్లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చామని, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ నజీర్ అహమ్మద్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
AP: బీటెక్ సీటు హాట్ కేకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు హాట్‌కేకుల్లా భర్తీ అవుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రాష్ట్రంలోని కాలేజీల్లో చదవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఏపీ ఈఏపీ సెట్–2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)లో గురువారం తొలి విడత సీట్ల కేటాయింపులో 82% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఇదో రికార్డు. గత ఏడాదిలో కూడా తొలి విడతలోనే 75 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. ఇప్పుడు మరిన్ని ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. జగన్ సీఎం అయిన తర్వాత కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రభుత్వమే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. దీంతోపాటు జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరుస్తోంది. ఏడాది ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది. ప్రముఖ పరిశ్రలతో కాలేజీలను అనుసంధానిస్తోంది. ఈ చర్యలన్నిటి ఫలితంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లు హాట్ కేకులే అయ్యాయి. రాష్ట్రంలోని 248 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,11,864 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతలోనే 91,249 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 20,615 సీట్లు మిగిలి ఉన్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణి చెప్పారు. ఏపీ ఈఏపీ సెట్లో 1,73,572 మంది అర్హత సాధించగా ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 1,01,318 మంది వెబ్ ఆప్షన్లకు అర్హత సాధించారు. వీరిలో 99,025 మంది ఆప్షన్లను నమోదుచేశారు. తొలివిడతలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను కేటాయించారు. స్పోర్ట్సులో 492, ఎన్సీసీలో 984 సీట్ల కేటాయింపును పెండింగ్‌లో పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి మెరిట్ జాబితా అందిన అనంతరం ఆ సీట్లు కేటాయిస్తారు. భారీగా కంప్యూటర్ సైన్సు సీట్లు ఇంజనీరింగ్ సీట్లలో కంప్యూటర్ సైన్సు, తత్సంబంధిత సీట్లు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్సు కోర్సుల్లోనే అత్యధిక శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకున్నాయి. గతంలోకన్నా ఈసారి ఎక్కువ సీట్లు ఈ విభాగంలోనే ఉన్నాయి. సీఎస్ఈ, తత్సంబంధిత సీట్లు 41,991 భర్తీ కాగా అందులో సీఎస్ఈ సీట్లు 27,261 ఉన్నాయి. ఆ తరువాత ఈసీఈ, ఈఈఈలో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. తొలివిడతలోనే ఈ సీట్లు దాదాపు పూర్తిగా భర్తీ అయ్యాయి. బాబు హయాంలో సీట్ల భర్తీ అంతంతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి విద్యార్ధుల నుంచి స్పందన పెద్దగా ఉండేది కాదు. విద్యార్థుల్లో చాలా మంది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపేవారు. జేఈఈ మెరిట్ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులో నిలిచి మంచి కాలేజీలో సీటు వచ్చినా, దానిని వదులుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వారు. అప్పట్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు కాకుండా కాలేజీ ఫీజు లక్షల్లో ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. చంద్రబాబు హయాంలో చివరి దశ కేటాయింపులు పూర్తయ్యాక కూడా కాలేజీల్లో దాదాపు 40 శాతం సీట్లు ఖాళీగా ఉండేవి. 2016లో 58 శాతం, 2017లో 60 శాతం, 2018లో 61 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలోని కాలేజీల్లోనే చదవడానికి విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు. నేడు బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ కాలేజీల్లోని యాజమాన్య కోటా అయిన బీ కేటగిరీ సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సీట్ల భర్తీని కాలేజీలో ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడతాయి. విద్యార్థులు కాలేజీలకు నేరుగా దరఖాస్తు చేయడానికి లేదా ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు. ఫార్మసీ సీట్ల భర్తీకి బ్రేకు ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లోనే ఫార్మసీ సీట్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్నా వాటికి బ్రేకు పడింది. ఫార్మసీ కాలేజీల సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో వీటి భర్తీని నిలిపివేశారు. అనుమతుల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో పూర్తవుతుందని ఫార్మసీ కౌన్సిల్ ఉన్నత విద్యాశాఖకు తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని ఉన్నత విద్యా మండలి ఫార్మసీ కౌన్సిల్‌కు మరోసారి లేఖ రాసింది. -
‘బీ’ కేటగిరీ భర్తీ బాధ్యత యాజమాన్యాలదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకోనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 32, 33 విడుదల చేసింది. ఈ సీట్ల భర్తీ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మెరిట్ ప్రాతిపదికన జరిగేలా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ సీట్ల భర్తీ కోసం ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్లను నిర్వహించే సాంకేతిక విద్యాశాఖ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరించనుంది. ఈ సీట్ల భర్తీకి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా విద్యార్థులు నేరుగా లేదా ఆయా కాలేజీలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించవచ్చు. కాలేజీలకు అందిన దరఖాస్తుల్లో మెరిట్ విద్యార్థులను ఆయా సీట్లకు ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అంతా అందరికీ తెలిసేలా ఎప్పటికప్పుడు నిర్దేశిత పోర్టల్‌లో వివరాలు పొందుపరుస్తారు. మొత్తం సీట్లలో 70 శాతం ‘ఏ’ కేటగిరీ కింద కన్వీనర్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మిగతా 30 శాతంలో సగం సీట్లను ఎన్నారై కోటాలో ఆయా కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు. వాటిలో మిగిలిన సీట్లను, నాన్ ఎన్నారై సీట్లను ఈ ప్రత్యేక పోర్టల్ ద్వారా భర్తీ చేస్తారు. ఎన్నారై సీట్లకు 5 వేల డాలర్లను, నాన్ ఎన్నారై సీట్లకు ‘ఏ’ కేటగిరీకి నిర్ణయించిన ఫీజులకు మూడు రెట్ల వరకు ఆయా కాలేజీలు వసూలు చేయవచ్చు. బీ కేటగిరీ భర్తీ మార్గదర్శకాలు ఇలా: ► ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసే వరకు బీ కేటగిరీ సీట్లను భర్తీ చేయడానికి వీల్లేదు. కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలి. ► ఏఐసీటీఈ అనుమతి ఉన్న సంస్థలు ఆయా కోర్సులకు మంజూరైన ఇన్‌టేక్‌లో 15 శాతం మించకుండా ఎన్ఆర్ఐ సీట్లను సొంతంగా భర్తీ చేయవచ్చు. గ్రూప్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులకు తగ్గకుండా లేదా అర్హత పరీక్షలో 50 శాతం మార్కులతో లేదా 10 స్కేల్లో 5కి సమానమైన క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. ► మిగిలిన సీట్లను మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్, నీట్లో ర్యాంక్ సాధించిన వారు, అర్హత పరీక్షలో నిర్దేశిత గ్రూప్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులకు తక్కువ కాకుండా సాధించిన వారు, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారితో సహా అందరు అభ్యర్ధులను ఎంపిక చేయవచ్చు. ► జేఈఈ, నీట్ ర్యాంకర్లు లేని పక్షంలో మెరిట్ ప్రాతిపదికన ఈఏపీ సెట్ పరీక్షలో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ► ఆ తర్వాత ఏవైనా సీట్లు ఇంకా మిగిలిపోతే, నిర్దేశించిన గ్రూప్ సబ్జెక్టులలో 45 శాతం (రిజర్వుడు) కేటగిరీలకు చెందిన అభ్యర్థులైతే 40 శాతం) మార్కులను లేదా మొత్తం మార్కులలో ఆ మేరకు మార్కులు పొందిన అభ్యర్థులతో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలి. ► వెబ్ పోర్టల్ ద్వారా కేటగిరీ ‘బీ’ సీట్ల కోసం విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలకు వెళ్లి అందచేసే దరఖాస్తులను యాజమాన్యాలు వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ’బీ’ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకునే విధంగా కాంపిటెంట్ అథారిటీ షెడ్యూల్ ప్రకటిస్తుంది. ► ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సంబంధిత కళాశాల యాజమాన్యం ఆ జాబితాను లాగిన్ ద్వారా వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఎంపికలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జాబితాను తిరస్కరిస్తారు. -
ఇంజనీరింగ్‌లో 1.42 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల సంఖ్య దాదాపు ఖరారైంది. రాష్ట్రంలో 375 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని 1,50,837 సీట్లు కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను తనిఖీలు చేసి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాక ఆయా యూనివర్సిటీలు వాటికి అఫ్లియేషన్ ఇవ్వనున్నాయి. ఏపీ ఈఏపీసెట్–2022 తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 30 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగనుంది. 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌కు హాజరుకాగా 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరు https://sche.ap.gov.in/ APSCHEHome.aspx ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. ఈ నెల 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఆలోగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 17 వర్సిటీ కాలేజీల్లో 5 వేల ఇంజనీరింగ్ సీట్లు.. కాగా, 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ప్రకారం.. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 261 కాలేజీల్లో 1,42,877 సీట్లు ఉన్నాయి. వీటిలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 5 వేల సీట్లు ఉండగా.. 244 ప్రైవేటు కాలేజీల్లో 1,37,877 సీట్లున్నాయి. ► ఫార్మసీలో 71 కాలేజీల్లో 6,670 సీట్లున్నాయి. వీటిలో ఆరు యూనివర్సిటీ కాలేజీల్లో 400 సీట్లు, 65 ప్రైవేటు కాలేజీల్లో 6,270 సీట్లు ఉన్నాయి. ► 43 ప్రైవేటు ఫార్మ్‌డీ కాలేజీల్లో 1,290 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ఈసారీ 35% కోటా గతేడాది మాదిరిగానే 2022–23 విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ఈఏపీసెట్‌లో మెరిట్ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ 35 శాతం కోటా కింద గతేడాది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ విట్)లో 1,509 సీట్లు, ఎస్ఆర్ఎం వర్సిటీలో 527 సీట్లు, బెస్ట్ వర్సిటీలో 1,074 సీట్లు, సెంచూరియన్ వర్సిటీలో 504 సీట్లు, క్రియా వర్సిటీలో 146 సీట్లు, సవితా వర్సిటీలో 81 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన దాదాపు 3 వేల మంది ఈ వర్సిటీల్లో చేరారు. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థల్లో ఏ భారమూ లేకుండా విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీ కేటగిరీ సీట్ల భర్తీపై వెలువడని తుది నిర్ణయం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లయిన బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జనలు పడుతోంది. గతంలో ఈ సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కేలా గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో 48ని జారీ చేసింది. గతంలో బీ కేటగిరీ సీట్ల భర్తీని యాజమాన్యాలే చేపట్టేవి. అయితే ఈ జీవోతో మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) సీట్ల భర్తీతో పాటు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బీ కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టారు. అయితే ఏ కేటగిరీ సీట్ల భర్తీ ముందుగా అయిపోతున్నందున బీ కేటగిరీ సీట్లు భర్తీ కావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందువల్ల తామే ఆ సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై అనుసరించాల్సిన విధానం గురించి ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి ఇంకా దీనిపై తుది నిర్ణయం రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లనుంది. -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2022 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం విజయవాడలో విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో మొత్తం 3,00,111 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,56,983 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,94,752 మంది పరీక్ష రాయగా 1,73,572 మంది (89.12 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్ష రాయగా 83,411 (95.06 శాతం) మంది అర్హత సాధించారు. ఏపీ ఈఏపీసెట్‌లో ఇంజనీరింగ్ విభాగానికి బాలురు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, అగ్రికల్చర్ విభాగానికి బాలికలు మొగ్గు చూపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలో, ఇటు అగ్రికల్చర్ విభాగం రెండింటిలోనూ అబ్బాయిలే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన హరేన్ సాత్విక్ మొదటి ర్యాంక్ (158.6248 మార్కులు) సాధించి సత్తా చాటాడు. అగ్రికల్చర్ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన వజ్రాల దినేష్ కార్తీక్ రెడ్డి మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. దుమ్ములేపేసిన అబ్బాయిలు.. ఏపీ ఈఏపీసెట్–2022 ఫలితాల్లో బాలురే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం టాప్–10 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. వీరిలో నలుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులు 5, 6, 7, 9 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. అగ్రికల్చర్ విభాగంలో రెండు ర్యాంకులు మినహా మిగిలిన 8 ర్యాంకులు బాలురకే దక్కాయి. వీటిలో 7, 8, 9 ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకు లభించాయి. ర్యాంకర్ల వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పరీక్షల అనంతరం తుది ‘కీ’ని ప్రకటించామని గుర్తు చేశారు. అభ్యంతరాలను స్వీకరించాక కేవలం పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని తెలిపారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాయడంతోపాటు అత్యధికులు అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలో 160 మార్కులకు గాను 25 శాతం సాధించినవారిని అర్హులుగా పరిగణించామని వివరించారు. ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ రద్దు చేశామన్నారు. కౌన్సెలింగ్‌కు ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకునే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసారి పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అందరినీ అర్హులుగా పరిగణిస్తామన్నారు. ఫార్మసీ విభాగంలో 16,700 సీట్లు, ఇంజనీరింగ్‌లో 1,48,283 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈసారి కోర్సుల డిమాండ్‌ను బట్టి ఆయా విభాగాల్లో సీట్లను పెంచే ఆలోచన ఉందన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల కౌన్సెలింగ్ తర్వాతే చేరికలు.. రాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలను ఎంచుకుంటున్నందున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిలో ప్రవేశాలు పూర్తయ్యాకే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే 70 శాతం సీట్లకు జగనన్న విద్యా దీవెన అందిస్తామని చెప్పారు. యాజమాన్య కోటాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా పరీక్షలను సమర్థంగా నిర్వహించిన అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్సలర్, సెట్ కన్వీనర్‌ను మంత్రి బొత్స, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు. టాపర్ల మనోగతాలు.. ఐఐటీ బాంబే నా లక్ష్యం.. మాది.. హిందూపురం. అమ్మ పద్మజ బయాలజీ టీచర్‌గా, నాన్న లోక్‌నాథ్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నేను బెంగళూరులో ఇంటర్ చదివాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లోనూ మంచి ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఎంసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాను. ఆగస్టు 28న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ కోసం సిద్ధమవుతున్నాను. అందులో సీటు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతా. – బోయ హరేన్ సాత్విక్, ఫస్ట్ ర్యాంకర్, (ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. మాది ఒంగోలు. అమ్మానాన్న లక్ష్మీకాంత, మాల్యాద్రిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నేను గుడివాడలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కాలేజీలో అభ్యసించాను. అన్నయ్య లోకేష్‌రెడ్డి గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. అన్నయ్యలానే నేను కూడా ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతాను. మంచి కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి, రెండో ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా.. మాది శ్రీకాకుళం. అమ్మానాన్న మెండ రవిశంకర్, స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. అన్నయ్య జయదీప్ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. జేఈఈ మెయిన్‌లో 99.96 పర్సంటైల్ స్కోర్ చేశాను. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ కోసం సన్నద్ధమవుతున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలన్నదే నా లక్ష్యం. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతా. – మెండా హిమవంశీ, మూడో ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం) ఎయిమ్స్ లేదా జిప్మర్లో ఎంబీబీఎస్ చేయడమే నా లక్ష్యం మాది.. గుంటూరు జిల్లా పెదకూరపాడు. నాన్న శ్రీనివాసరెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్‌లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అమ్మ శివకుమారి గృహిణి. అన్నయ్య చంద్రశేఖరరెడ్డి విలేజ్ సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎంసెట్ కోసం తరగతి గదిలో అధ్యాపకులు చెప్పినదాన్ని అవగతం చేసుకుని సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని.. ముఖ్యమైన పాఠ్యాంశాలను చదివాను. నీట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. ఎయిమ్స్ లేదా జిప్మర్లో ఎంబీబీఎస్ చేయడమే నా లక్ష్యం. – వజ్రాల దినేష్ కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగం) న్యూరాలజీ చేస్తా.. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం. అమ్మ అంబిక.. డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా, నాన్న.. పరాత్పరరావు వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అన్నయ్య ఎయిమ్స్ రాయ్‌పూర్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఎంసెట్‌లో విజయం సాధించడం వెనుక కుటుంబ సభ్యులు, ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఎంతో ఉంది. డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. అందులో న్యూరాలజీ స్పెషలైజేషన్ చేస్తా. – మట్టా దుర్గ సాయి కీర్తితేజ, రెండో ర్యాంకర్ (ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగం) రోజుకు 12 గంటలు చదివా.. మాది.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ. అక్క ఆసు సత్య ఎయిమ్స్ మంగళగిరిలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. నేను గుంటూరులో ఇంటర్ చదివాను. ఎంసెట్‌లో ర్యాంకు కోసం అధ్యాపకులు చెప్పిన విషయాలతోపాటు స్నేహితులతోనూ చర్చించాను. అక్క సత్య సలహాలు కూడా తీసుకున్నాను. రోజుకు 12 గంటలకు పైగా చదివాను. నీట్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి కార్డియాలజీ స్పెషలైజేషన్ చేయాలన్నదే నా లక్ష్యం. –ఆసు హిందు, మూడో ర్యాంకర్, (ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగం) -
ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స
-
ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి AP EAMCET (ప్రస్తుతం AP EAPCET అని పిలుస్తారు) APSCHE తరపున JNTU అనంతపురం ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 87,744మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్ నిర్వహించారు. ఫలితాల కోసం AP EAPCET - 2022 Results క్లిక్ చేయండి. -
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్–2022 పరీక్షలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు, 11, 12 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు ఉంటాయి. రోజుకు రెండు సెషన్లుగా ఉ.9 గంటల నుంచి మ.12 వరకు, మ.3 నుంచి 6 వరకు ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. వీటిని సజావుగా పూర్తిచేయించేందుకు ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. మూడు లక్షల మంది దరఖాస్తు ఇక రాష్ట్రవ్యాప్తంగా 3,00,084 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్టర్ అయి దరఖాస్తులు సమర్పించారు. ఉ.7.30 నుంచి 9 గంటల వరకు, మ.1.30 నుంచి 3 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► నిర్ణీత సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా ప్రవేశానికి అనుమతించరు. ► విద్యార్థులు మాస్కులు ధరించి రావాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్పెన్ను, చిన్న బాటిల్‌తో పాటు శానిటైజర్‌ను మాత్రమే అనుమతిస్తారు. ► రఫ్‌వర్కు పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే సమకూరుస్తారు. ► ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ► బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలిస్తారు. కాబట్టి ఎవరూ చేతివేళ్లకు మెహిందీ, లేదా సిరా లేకుండా చూసుకోవాలి. ► విద్యార్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు అధికారిక ఫొటో గుర్తింపు కార్డు, ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి. ► పరీక్ష కేంద్రంలో అప్లికేషన్ నింపి ఫొటోను అతికించి దాన్ని ఇన్విజిలేటర్లకు అప్పగించాలి. అలా అప్పగించని వారి ఫలితాలు విత్‌హెల్డ్‌లో పెడతారు. పరీక్షా విధానం ఇలా.. ఏపీ ఈఏపీ సెట్లో ప్రతి సెషన్ మూడుగంటల పాటు జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 80 ప్రశ్నలు మేథమెటిక్స్‌లో, 40 ప్రశ్నలు ఫిజిక్స్, 40 ప్రశ్నలు కెమిస్ట్రీలో ఉంటాయి. అన్నింటికీ ఒకే వెయిటేజీ ఉంటుంది. అలాగే, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మార్కులలో 80 ప్రశ్నలు బయాలజీలో, (40 బోటనీ, 40 జువాలజీ), 40 ప్రశ్నలు ఫిజిక్స్, 40 ప్రశ్నలు కెమిస్ట్రీలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సమాధానామివ్వని ప్రశ్నలపై మూల్యాంకనం ఉండదు. 25 శాతం మార్కులొస్తేనే అర్హత ఈ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులకు 25 శాతం మార్కులు వస్తే ర్యాంకులకు, కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కుల్లేవు. వారికి కేటాయించిన సీట్లను ఆ కేటగిరీ వారితోనే భర్తీచేస్తారు. పరీక్షలు ఆన్లైన్లో పలు సెషన్లలో జరగనున్నందున నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను ప్రకటించనున్నారు. అవాంతరాల్లేకుండా నిర్వహణకు ఏర్పాట్లు పరీక్ష సమయంలో సాంకేతిక సమస్యలకు ఆస్కారంలేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆ మేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. హాల్ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్‌ఈఎల్‌పీడీఈఎస్‌కె ఃజీమెయిల్.కామ్‌కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నెంబర్లలో సంప్రదించవలసి ఉంటుంది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2022 పరీక్షలను ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు. శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేఈఈ వంటి జాతీయ పరీక్షలకు అమలు చేస్తున్న మాదిరిగానే ఒక్క నిమిషం నిబంధనను ఈఏపీసెట్‌కు కూడా అమలు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకు రావాలని సూచించారు. బాల్‌పాయింట్ పెన్నులు, రఫ్ వర్క్ చేసుకోవడానికి అవసరమైన కాగితాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారన్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థులకు అనువుగా ఉండేలా బస్సులు నడపాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. 3 లక్షలకు పైగా అభ్యర్థుల దరఖాస్తు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేశారని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తెలిపారు. ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉండదని, సెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ► ఈఏపీసెట్‌లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ► 11, 12 తేదీల్లో 4 సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ► అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్ వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పు ఉంటే ఈఏపీసెట్ హెల్ప్‌లైన్ కేంద్రానికి తెలియజేసి సరిచేయించుకోవాలి. ► హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు ► ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా మ్యాప్‌ల ద్వారా మార్గాన్ని చూపించే సదుపాయం కల్పించారు. ► విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ► చెక్ఇన్ ప్రొసీజర్‌లో భాగంగా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కేప్చర్ చేస్తారు. ఎడమ వేలి ముద్ర ద్వారా వీటిని నమోదు చేయనున్నందున అభ్యర్థులు మెహిందీ వంటివి పెట్టుకోకూడదు. ► బాల్‌పెన్నుతో అప్లికేషన్ ఫారాన్ని నింపి దానికి ఫొటోను అతికించి ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి అందించాలి. అలా అప్లికేషన్‌ను సమర్పించని వారి ఫలితాలను ప్రకటించరు. ► పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడి వెంటనే పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆమేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. ► హాల్ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. ► ఇతర వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.జీఓవీ.ఐఎన్/ఈఏపీ సీఈటీ’ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ► సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్‌ఈఎల్‌పీడీఈఎస్‌కెఃజీమెయిల్.కామ్‌కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఈఏపీ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2022కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా మూడు లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గరిష్ట ఆలస్య రుసుము గడువులో సైతం దరఖాస్తులు సమర్పిస్తుండడం విశేషం. గురువారం వరకు 3,01,113 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. వీరిలో 2,99,951 మంది ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించారు. రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు ఇంకా గడువు ఉన్నందున ఈసారి దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. వీరిలో 1,91,370 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు.. 78,381 మంది అగ్రి, ఫార్మా స్ట్రీమ్ అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆలస్య రుసుముతో ఇంకా దరఖాస్తులు ఏప్రిల్ 11న సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా ఎ లాంటి ఆలస్య రుసుము లేకుండా మే 10 వరకు ద రఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చారు. ఆ తరువా త ఆలస్య రుసుము రూ.500తో జూన్ 20 వరకు, రూ.1,000తో జూన్ 25 వరకు, రూ.5,000తో జూ లై 1వరకు, రూ.10,000తో జూలె 3వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు గడువుగా నిర్ణయించారు. ఇక ఆలస్య రుసుము లేకుండా నిర్ణయించిన గడువు మే 10 నాటికి 2,74,260 దరఖాస్తులు దాఖలయ్యాయి. గడువు ముగిసినా ఇంకా ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పిస్తూనే ఉన్నారు. రూ.5,000 ఆలస్య రుసుముతో కూడా ఇంకా పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడం విశేషం. ఇక గురువారం కొత్తగా 37 మంది రూ.5వేల ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు. జులై 3 వరకు గడువు ఉన్నందున ఈ దరఖాస్తులు ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అత్యధికుల్లో ఆసక్తి ఇక రాష్ట్రంలో విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు తేవడంతో పాటు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు చేరికలు పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఇంజనీరింగ్ తదితర ఉన్నత సాంకేతిక విద్యా కోర్సులకు ఆయా కాలేజీల్లో ఫీజులు లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం కేవలం రూ.35వేలు మాత్రమే చెల్లించేది. మిగతా మొత్తాన్ని విద్యార్థి చెల్లించాల్సి వచ్చేది. దీంతో తల్లిదండ్రులు అప్పులపాలయ్యేవారు. ఫలితంగా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత చదువులకయ్యే ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే రీయింబర్స్ చేసేలా జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే, విద్యార్థుల వసతి భోజనాల కోసం ఏటా రూ.20వేల వరకు అందిస్తున్నారు. దీంతోపాటు గత ఏడాది నుంచి రాష్ట్రంలోని వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల సీట్లను కూడా మెరిట్లో ఉన్న పేద విద్యార్ధులకు 35శాతం సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరికయ్యే పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా గత ఏడాదిలో 4వేల మంది వరకు వివిధ ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో చేరారు. జూలై 4 నుంచి ఈఏపీసెట్ మరోవైపు.. ఈఏపీసెట్ పరీక్షలు జూలై 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ 4 నుంచి 8 వరకు.. అగ్రి, ఫార్మా స్ట్రీమ్ జూలై 11, 12 తేదీల్లో జరుగుతాయి. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో ఈఏపీ సెట్లో మెరిట్ ర్యాంకులు పూర్తిగా సెట్ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు. -
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్ 2022–23లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దుచేశారు. ఈఏపీ సెట్లో వచ్చిన మార్కులనే పూర్తిగా వందశాతం వెయిటేజీ కింద తీసుకోనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్‌ప్రేమ్‌కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఈఏపీసెట్‌లో ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు 25 శాతం.. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించేవారు. అయితే.. కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ తరగతుల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడడం, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా మారడం తెలిసిందే. దీంతో ఇంటర్ బోర్డు ‘ఆల్‌పాస్’ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. 2021–22 ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు గతేడాది పరీక్షల నిర్వహణలేక వారిని ఆల్‌పాస్‌గా ప్రకటించింది. మార్కుల బెటర్మెంట్ కోసం వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం (2022–23)లో కూడా ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా అనే అంశంపై ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ ఈసారి కూడా ఈఏపీసెట్‌లో సెట్లో వచ్చిన మార్కులకే వందశాతం వెయిటేజీ ఇచ్చి వాటి మెరిట్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించాలని ఉన్నత విద్యామండలికి సూచించింది. దీంతో మండలి తాజాగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 2.60 లక్షల మందికి పైగా విద్యార్థుల దరఖాస్తు ఇక ఏపీ ఈఏపీసెట్‌కు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 2.60 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,88,417 మంది, బైపీసీ స్ట్రీమ్‌కు 86వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. జూలై 4 నుంచి 8 వరకు పది సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు.. అలాగే, జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. -
ఈఏపీసెట్‌కు 36వేలకు పైగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీఈఏపీ సెట్–2022కు పది రోజుల్లో 36 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి గడువిచ్చింది. బుధవారం నాటికి 36,977 మంది ప్రవేశ పరీక్షకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 34,716 మంది ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. బుధవారం 5,719 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా 5,521 మంది దరఖాస్తులు సమర్పించారు. కాగా, ఏపీ ఈఏపీసెట్ అభ్యర్థుల ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. 2020 వర కు ఇంటర్ మార్కులకు వెయిటేజీ విధానాన్ని అమలు చేశారు. ఇంటర్లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి సెట్లో వచ్చిన మార్కులతో కలిపి ర్యాంకులు ప్రకటించేవారు. కరోనా వల్ల తరగతులు, పరీక్షల నిర్వహణ సరిగ్గా లేకపోవడం తదితర కారణాలతో 2021లో ఇంటర్ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. నెలాఖరుకు ఈసెట్ నోటిఫికేషన్ డిప్లొమో పూర్తిచేసిన అభ్యర్థులు లేటరల్ ఎంట్రీగా ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశించేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ ఈ నెలాఖరున వెలువడనుంది. ఆ తదుపరి వరుసగా ఇతర సెట్ల నోటిఫికేషన్లు కూడా విడుదల కానున్నాయి. -
విద్యార్థులకు ‘మెయిన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ పరీక్షల వాయిదాతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఆగస్టులో పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలుత భావించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం బుధవారం నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని సైతం వెల్లడించారు. జేఈఈ అడ్మిషన్లు ఆటంకం కాకుండా ఉంటే ఆగస్టులో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తిచేసి తరగతులు చేపడతామని ఆయనన్నారు. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏపీఈఏపీసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించేలా షెడ్యూళ్లను విడుదల చేసింది. నిజానికి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో విడుదల చేసిన షెడ్యూళ్ల ప్రకారం జేఈఈ మెయిన్ రెండు సెషన్లు మే నెలాఖరుకు పూర్తవుతాయని, తదనంతరం రాష్ట్రంలోని సెట్లన్నీ పూర్తయి సకాలంలో అడ్మిషన్లు పూర్తవుతాయని అధికారులు అంచనావేశారు. కానీ, జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షల తేదీలను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ ఎన్టీఏ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. మెయిన్ తొలిసెషన్ జూన్ 20 నుంచి 29 వరకు.. రెండో సెషన్ పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. దీనివల్ల జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్సు కూడా వాయిదాపడనుంది. దీంతో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల అనంతరం ఆరు విడతల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లోకి జరిగే అడ్మిషన్లను పూర్తిచేయడానికి నెలరోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలంటే అక్టోబర్ వరకు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్టీఏ తీరుతో ఈసారీ నష్టమే జేఈఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తీరు కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు నష్టపోవలసి వస్తోందని అధ్యాపకులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఒకపక్క జాతీయస్థాయి అడ్మిషన్లు లేటు కావడంతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యం కావడంవల్ల దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చేరిపోతున్నారని వివిధ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. త్వరగా అడ్మిషన్లు చేపడితే వారంతా రాష్ట్ర కాలేజీల్లోనే చేరుతారని వారు తొలినుంచి కోరుతున్నారు. కానీ, జేఈఈ అడ్మిషన్ల ఆలస్యంతో గత ఏడాది రాష్ట్ర ఇంజనీరింగ్ ప్రవేశాలనూ ఆలస్యంగా చేపట్టారు. ఇక జేఈఈలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. జేఈఈ అడ్మిషన్ల కన్నా ముందే ఇక్కడ ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందే ఆ విద్యార్థులు ఆ తరువాత జేఈఈ అడ్మిషన్లలో అవకాశం వస్తే ఇక్కడి సీట్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా ఏటా 15వేల మంది వరకు జేఈఈ సీట్లలో చేరుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెరిట్లో ఉన్న ఇతర విద్యార్థులకూ నష్టం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేఈఈ అడ్మిషన్ల తరువాత రాష్ట్ర ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతూ వస్తున్నారు. జేఈఈ అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నందున అప్పటివరకు రాష్ట్రంలోని కాలేజీల్లో చేరుదామని చూసే విద్యార్థులు కౌన్సెలింగ్ జాప్యం అయితే ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లోకి వెళ్లిపోతున్నారు. -
జూలైలోనే అన్ని ప్రవేశ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో పూర్తి చేసేలా ఉన్నత విద్యామండలి షెడ్యూళ్లను ఖరారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, లా, బీఈడీ, పీజీ తదితర అన్ని ఉన్నత విద్యాకోర్సులకు జూలైలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు సెప్టెంబర్ నుంచి తరగతుల నిర్వహణకు వీలుగా ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండేళ్లుగా కరోనాతో విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో 2022–23 విద్యాసంవత్సరానికి పకడ్బందీ కార్యాచరణతో మండలి ముందుకు వెళ్తోంది. వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలను సకాలంలో పూర్తి చేయించి తరగతులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తోంది. ప్రవేశ పరీక్షలకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యామండలి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు ఏటా 3 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ ఒక్కదాన్నే 2 లక్షల మంది వరకు రాస్తున్నారు. 2020–21లో ఈఏపీసెట్ రెండు విభాగాల (ఇంజనీరింగ్/అగ్రి)కు 2,73,588 మంది దరఖాస్తు చేయగా 2,32,811 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,02,693 మంది క్వాలిఫై అయ్యారు. 2021–22లో 2,60,406 మంది దరఖాస్తు చేయగా 2,44,526 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,06,693 మంది అర్హత సాధించారు. ఈసారి అంతకన్నా ఎక్కువ మంది హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
జూలై 4 నుంచి ఏపీ ఈఏపీసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ ఈఏపీసెట్)–2022–23 పరీక్షలు జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఈఏసీసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డితో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ వెయిటేజి యథాతథంగా ఉంటుందని చెప్పారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఉంటుంది. రోజుకు రెండు సెషన్లలో మొత్తం 10 సెషన్లతో ఈ పరీక్ష జరుగుతుంది. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్ష జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో జరుగుతుంది. పరీక్షల నోటిఫికేషన్ ఏప్రిల్ 11న విడుదల అవుతుందని మంత్రి చెప్పారు. ఇందులో పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఈఏపీసెట్ తుది ఫలితాలు ఆగస్టు 15 నాటికి విడుదల చేస్తామన్నారు. ఆలోగా ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై, మార్కులు కూడా వెల్లడవుతాయి కనుక ఇంటర్మీడియెట్ వెయిటేజీకి, తద్వారా ర్యాంకుల ప్రకటనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ రెండో వారానికల్లా తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎగ్జామినేషన్ ప్యాట్రన్, ర్యాంకుల విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఇతర పరీక్షలకు అడ్డంకి లేకుండా.. ఇతర ఏ పరీక్షలకూ అడ్డంకి కాకుండా ఈఏపీసెట్ తేదీలను ఖరారు చేశామని మంత్రి చెప్పారు. ‘ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24 తో ముగుస్తాయి. సీబీఎస్ఈ పరీక్షలు జూన్ 13న ముగుస్తాయి. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జూలై 3న జరుగుతుంది. అందుకే ఈఏపీసెట్ జూలై 4 నుంచి నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. టీసీఎస్ అయాన్ సెంటర్లలో ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. గత ఏడాది 136 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని, ఈసారి అవసరాన్ని బట్టి కేంద్రాలను పెంచుతామని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో 4 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. డిప్లొమా పరీక్షల తేదీలను అనుసరించి ఈసెట్ షెడ్యూల్ ఇలా ఉండగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశానికి (లేటరల్ ఎంట్రీ) ఏపీఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ను డిప్లొమా పరీక్షల తేదీలను అనుసరించి నిర్ణయించనున్నారు. డిప్లొమా పరీక్షల షెడ్యూల్‌పై సాంకేతిక విద్యా మండలికి ఉన్నత విద్యా మండలి లేఖ రాసింది. ఆ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈసెట్ తేదీలు నిర్ణయిస్తారు. -
ఏపీ EAP సెట్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
EAP సెట్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఏపీ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 11న ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఆగష్టులో EAP సెట్ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు. చదవండి: ఆ నీచ ఘనత చంద్రబాబు నాయుడిదే: కొడాలి నాని -
జేఎన్టీయూఏకి ఈఏపీ సెట్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్–2022 బాధ్యతలను అనంతపురం జేఎన్టీయూకి అప్పగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహించేందుకు చైర్మన్లు, కన్వీనర్లను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. సెట్లు.. చైర్మన్, కన్వీనర్లు ఇలా ఈఏపీ సెట్‌కు చైర్మన్, కన్వీనర్లుగా అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జి.రంగజనార్దన , ప్రొఫెసర్ ఎమ్.విజయకుమార్, ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ కృష్ణమోహన్, ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిశోర్‌బాబు, పీజీ ఈసెట్‌కు ఎస్వీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ, రీసెర్చ్ సెట్‌కు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్ డి.అప్పలనాయుడు (ఏయూ), ఎడ్‌సెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున, ప్రొఫెసర్ టీజీ అమృతవల్లి, పీజీ సెట్‌కు యోగివేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎమ్.సూర్యకళావతి, ప్రొఫెసర్ ఎన్.నజీర్ అహ్మద్, లాసెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున, ప్రొఫెసర్ టి.సీతాకుమారిలను నియమించారు. -
23 నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 3న సీట్లు కేటాయించనున్నారు. అదే నెల 6లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నీట్ కౌన్సెలింగ్ జరగనందున బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ), అగ్రికల్చర్ బీఎస్సీకి కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ► అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: డిసెంబర్ 23 నుంచి 25 వరకు ► ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్, ఆఫ్‌లైన్ (హెల్ప్‌లైన్ సెంటర్స్): డిసెంబర్ 27 నుంచి 29 వరకు ► ఆప్షన్ల నమోదు: డిసెంబర్ 28 నుంచి 30 వరకు ► ఆప్షన్ల సవరణ: డిసెంబర్ 31 ► సీట్ల కేటాయింపు: జనవరి 3, 2022 ► సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్: జనవరి 4 నుంచి 6 వరకు. -
కంప్యూటర్ సైన్స్‌కే.. సై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో భర్తీకి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కే జై కొట్టారు. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మూడో స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), నాలుగో స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ నిలిచాయి. కొత్తగా ప్రవేశపెట్టిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల్లోనూ చేరికలు గతంలో కంటే పెరిగాయి. అయితే ఇంకా భర్తీ కాని సీట్లు కొన్ని విభాగాల్లో ఎక్కువగానే ఉన్నాయి. తొలిసారి ‘బీ’ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్లు, మెరిట్‌తో సంబంధం లేకుండా తాము నిర్దేశించిన ఫీజును చెల్లించిన వారికి ఈ సీట్లను కేటాయించేవి. తద్వారా ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు వచ్చిన వారికి మొండిచేయి చూపేవి. పైగా రిజర్వేషన్లను కూడా అమలు చేసేవి కావు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేటగిరీల్లో ఆయా వర్గాలకు దక్కాల్సిన సీట్లు బయట విద్యార్థులకు దక్కేవి. ఫలితంగా నిరుపేద మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘బీ’ కేటగిరీ సీట్లను సైతం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేయించింది. ‘బీ’ కేటగిరీలోని ఎన్ఆర్ఐ కోటాలో మిగులు సీట్లు, నాన్ ఎన్ఆర్ఐ కోటాలో సీట్లకు కలిపి కన్వీనరే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఈసారి ఆయా కళాశాలల్లో రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు అవకా>శం దక్కింది. ‘బీ’ కేటగిరీలో 13,564 మందికి సీట్లను కేటాయించారు. మొత్తం 1,12,699 సీట్లు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం ఇన్‌టేక్ 1,12,699 సీట్లుండగా 80,935 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఈ సీట్లలో అత్యధికం కంప్యూటర్ సైన్స్‌లోనే ఉండగా భర్తీలోనూ ఇదే అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్ఈలో మొత్తం 24,904 సీట్లుండగా తొలి విడతలోనే 23,835 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా కేవలం 1,069 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈసీఈలో 23,977 సీట్లుండగా 20,275 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,702 సీట్లు మిగిలాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొత్తం 12,678 సీట్లకు 4,760 భర్తీ కాగా 7,918 మిగిలిపోయాయి. అదేవిధంగా ఈఈఈలో 10,931లో 6,410 సీట్లు భర్తీ కాగా 4,521 సీట్లు మిగిలాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో 9,904 సీట్లకు 4,455 సీట్లు భర్తీ కాగా 5,449 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
ఈఏపీసెట్‌లో 80,935 సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2021లో 80,935 మంది విద్యార్థులకు తొలివిడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు 1,11,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 488, ఎన్సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది ఏపీ ఈఏపీసెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 1,34,205 మందిలో 90,606 మంది తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులుకాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలివిడతలో సీట్లు కేటాయించారు. సీట్లు కేటాయించని కాలేజీ లేదు 254 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,06,236 సీట్లకుగాను 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,034 సీట్లున్నాయి. 62 ఫార్మా–డీ కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేకపోవడం విశేషం. గతంలో ఒక్కసీటు కూడా భర్తీకానివి 10 వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. తొలిసారి ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా తొలిసారిగా ప్రైవేటు వర్సిటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతి, ఎస్ఆర్ఎం, బెస్ట్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2,012 సీట్లను పేద మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధి చేకూరనుంది. -
ఏపీఈఏపీ సెట్లో 89వేల మంది ఆప్షన్ల నమోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల నమోదు శుక్రవారం రాత్రితో ముగిసింది. శనివారం ఆప్షన్లను సవరించుకోవచ్చు. ఈ ఏడాది ఈఏపీసెట్‌లో 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కౌన్సెలింగ్‌కు 90,606 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 89,232 మంది వెబ్ ఆప్షన్లలో పాల్గొన్నారు. గత ఏడాదికన్నా ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్‌లో 83,014 మంది ఆప్షన్లు నమోదు చేసుకోగా, ఈసారి అంతకంటే ఎక్కువే పాల్గొన్నారు. ఈసారి ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల, కౌన్సెలింగ్ ప్రారంభం ఆలస్యం కావడంపై కొన్ని పత్రికల్లో వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఈ ఆలస్యం వల్ల రాష్ట్రంలోని విద్యార్థులు నష్టపోతున్నారని, ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలకు వెళ్లిపోతున్నారంటూ ప్రచురించాయి. ఈ కథనాలు తప్పని నిరూపిస్తూ గత ఏడాదికంటే ఈసారి వెబ్ ఆప్షన్లలో ఎక్కువమంది పాల్గొనడం విశేషం. సీట్లు ఖాళీ కాకుండా మెరిట్ విద్యార్థులకు అవకాశం ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్‌డ్‌లలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా ఉంటుందని అంచనా. వీరు ఏపీ ఈఏపీసెట్‌లోనూ మెరిట్లో ఉన్నారు. వీరంతా జాతీయ సంస్థల్లో చేరేందుకే ప్రాధాన్యమిస్తారు. జేఈఈ ప్రవేశాలకన్నా ముందే రాష్ట్ర కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించడం వల్ల ఈ విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందేవారు. తరువాత వారు జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అ«థారిటీ) కౌన్సెలింగ్‌లో జాతీయ సంస్థల్లో సీట్లు పొందితే రాష్ట్ర కాలేజీల్లోని సీట్లను వదులుకోవడం ద్వారా అవి ఖాళీ అయ్యేవి. దీనివల్ల ఈఏపీసెట్‌లో వారి తరువాత మెరిట్లో ఉండే విద్యార్థులకు మొదటి కౌన్సెలింగ్‌లో నష్టం వాటిల్లేది. ఇçప్పుడు జోసా కౌన్సెలింగ్ అనంతరం ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల వారికి తొలి కౌన్సెలింగ్‌లో మేలు జరుగుతుంది. జేఈఈలో ర్యాంకులు పొందిన వారు జాతీయ విద్యా సంస్థలకు వెళ్లిపోవడంతో వారి తర్వాత మెరిట్లో ఉన్న వారికి అవకాశం కలుగుతోంది. ప్రైవేటు వర్సిటీల్లోనూ కన్వీనర్ కోటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఈ ఏడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీల్లోని కోర్సుల్లో 35 శాతం సీట్లు పేద మెరిట్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వర్సిటీలతో సంప్రదింపులు జరిపి, కన్వీనర్ కోటా సీట్లకు ఒప్పించడంతో పాటు అది తక్షణమే కార్యాచరణలోకి వచ్చేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయించారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతిలో 1,264 సీట్లు, ఎస్ఆర్ఎం– విజయవాడలో 413 సీట్లు, బెస్ట్ యూనివర్సిటీ– అనంతపురంలో 168 సీట్లు, సెంచూరియన్ యూనివర్సిటీ – టెక్కలిలో 273 సీట్లు మొత్తం 2,118 సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటివరకు ఈ వర్సిటీల్లో కోర్సులకు వారు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించడంతోపాటు లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు వంటి కోర్సులకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలి. వీటిలో చదివిన వారిలో అధికశాతం విద్యార్థులకు అత్యుత్తమ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ చొరవ కారణంగా పేద మెరిట్ విద్యార్థులు తొలిసారిగా ప్రైవేటు వర్సిటీల్లో అడుగిడబోతున్నారు. రాష్ట్రంలో చేరడానికి ఎక్కువ మంది ఆసక్తి రాష్ట్రంలోని కాలేజీల్లో చేరడానికి ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణలతో ఉన్నత విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన అందుతోంది. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయంబర్స్మెంటు, వసతి, భోజనాల ఖర్చు కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేస్తుండడంతో ప్రవేశాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. – ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 1.45 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సెలింగ్‌కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్‌కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. నేటినుంచి వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో ఈనెల 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
25లోగా కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల అఫిలియేషన్(గుర్తింపు) ప్రక్రియను ఈనెల 25కల్లా పూర్తి చేయాలని కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులను ఏపీ ఈఏపీ సెట్ కమిటీ ఆదేశించింది. ఈఏపీ సెట్ అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించేందుకు కమిటీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైంది. ఏపీ ఈఏపీ సెట్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎమ్.సుధీర్‌రెడ్డి, వర్సిటీల అధికారులు, కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. కానీ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియను యూనివర్సిటీలు ఇంకా పూర్తి చేయకపోవడంతో షెడ్యూల్ ఖరారు చేయలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న 272 ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీల్లోని 1,39,862 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు మంజూరు చేసి చాలా రోజులయ్యింది. ఈ కాలేజీల్లో ఏఐసీటీఈ నిబంధనల మేరకు నిర్ణీత సదుపాయాలు, సిబ్బంది ఉన్నారో, లేదో తనిఖీ చేసిన తర్వాత వర్సిటీలు వాటికి గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాకినాడ, అనంతపురం జేఎన్టీయూ అధికారులు రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఏఐసీటీఈ క్యాలెండర్ ప్రకారం ఇంజినీరింగ్ ప్రవేశాలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి తరగతులను ఆరంభించాలి. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేసింది. అయినా కాలేజీల అఫిలియేషన్‌ను జేఎన్టీయూలు పూర్తి చేయకపోవడంతో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుపెట్టలేకపోతున్నారు. వేగంగా పూర్తి చేయండి.. తాత్సారం వద్దు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసి చాలా రోజులైందని, అక్టోబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నందున కాలేజీల అఫిలియేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని.. తాత్సారం చేయొద్దని సెట్ కమిటీ సమావేశంలో కన్వీనర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రానికల్లా జేఎన్టీయూ అధికారులు తమ పరిధిలోని కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం కాలేజీలకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. -
రికార్డు ‘సెట్’ చేసిన అబ్బాయిలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ సెట్–2021) ఫలితాల్లో అబ్బాయిల హవా కొనసాగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఫలితాలు వెలువడగా.. తాజాగా అగ్రికల్చర్, ఫా ర్మసీ ఫలితాల్లోనూ టాప్ టెన్ ర్యాంకుల్లో 8 అబ్బాయిల సొంతమయ్యాయి. 3, 4, 5, 8, 9 ర్యాంకుల్ని తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. బైపీసీ స్ట్రీమ్‌కు 83,820 మంది దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షకు హాజరయ్యారు. 72,488 మంది (92.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 48,710 మంది అమ్మాయిలు కాగా.. 23,778 మంది అబ్బాయిలు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణువివేక్ మొదటి ర్యాంకు సాధిం చాడు. అనంతపురం నగరానికి రంగు శ్రీనివాస కార్తికేయ రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన విద్యార్థులకు 6, 7, 10 ర్యాంకులు దక్కాయి. ఫలితాల విడుదల అనంతరం మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బుధవారం నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఎంపీసీ స్ట్రీమ్‌తో పోలిస్తే బైపీసీ స్ట్రీమ్‌లోనే అధిక శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. రికార్డు సమయంలో ఫలితాల విడుదల అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో 84 కేంద్రాల్లో ఐదు సెషన్లలో నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడు రోజుల రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేసినట్టు వివరించారు. సెషన్‌కు ఒకటి చొప్పున మొత్తం ఐదు రకాల ప్రశ్నపత్రాలను రూపొందించామని, ప్రతి దానిలో సమతుల్యం పాటిస్తూ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా సమాంతరంగా ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరీక్షల అనంతరం ‘కీ’ని విడుదల చేసి విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రత్యేక కమిటీ ద్వారా నివృత్తి చేసి తుది ఫలితాలను రూపొందించామన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఏపీ ఈఏపీసెట్‌ను నిర్వహించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మోనిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు లక్ష్మమ్మ, రామ్మోహనరావు, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం: విష్ణువివేక్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు సాధించిన చందం విష్ణువివేక్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామం. వివేక్ తండ్రి వెల్డింగ్ షాపు నిర్వహిస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. వివేక్ తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు సాధించిన విషయం విదితమే. వివేక్ మాట్లాడుతూ.. ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నీట్లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్ పూర్తి చేస్తానని చెప్పాడు. న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి న్యూరాలజిస్ట్‌గా సేవలందించాలన్నది తన లక్ష్యమని తెలిపాడు. ఆబ్జెక్టివ్ ఎలిమినేషన్ విధానమే విజయ రహస్యం: కార్తికేయ రెండో ర్యాంకు సాధించిన శ్రీనివాస కార్తికేయ స్వస్థలం అనంతపురం. తెలంగాణ ఎంసెట్‌లోనూ ఇతడికి రెండో ర్యాంకు వచ్చింది. ఇతని తల్లిదండ్రులు పద్మజ, సుధీంద్ర ఇద్దరూ డాక్టర్లే. శ్రీనివాస కార్తికేయ మాట్లాడుతూ.. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా చదవడం, అబ్జెక్టివ్ ఎలిమినేషన్ విధానాన్ని అనుసరించడమే తన విజయ రహస్యమని తెలిపాడు. నీట్ కూడా బాగా రాశానని, అందులోనూ మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే లక్ష్యమని తెలిపాడు. -
ఏపీఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సురేష్ తెలిపారు. మొదటి ర్యాంకు- చందం విష్ణు వివేక్(తూర్పుగోదావరి- కోరుకొండ) రెండో ర్యాంకు- శ్రీనివాస కార్తికేయ(అనంతపురం) మూడో ర్యాంకు- బొల్లినేని విశ్వాస్‌రావు(హన్మకొండ) (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ‘స్కిల్’ఫుల్ కోర్సులు ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ -
రేపు ఏపీ ఎంసెట్(ఈఏపీసెట్) ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ (ఈఏపీసెట్) ఫలితాలను సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. education.sakshi.comలో ఫలితాలను చూడవచ్చు. (చదవండి: విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..) ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. చదవండి: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం -
ఏపీఈఏపీ సెట్లో 95% హాజరు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్ గురువారం ప్రశాంతంగా ప్రారంభమైంది. కంప్యూటరాధారితం (సీబీటీ)గా జరిగే ఈ పరీక్షల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఈనెల 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. తొలిరోజు పరీక్షకు 95 శాతం మంది హాజరైనట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్‌ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం సెషన్లో 18,229 మందికి గాను 17,186 మంది, మధ్యాహ్నం సెషన్లో 17,924 మందికి గాను 17,064 మంది హాజరయ్యారు. మొత్తంగా 36,153 మందికి గాను 34,250 మంది (94.73) శాతం హాజరయ్యారు. అగ్రి, ఫార్మా స్ట్రీమ్ పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 7వ తేదీల్లో జరుగుతాయి. పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని, ఎక్కడా సాంకేతిక సమస్యలు ఏర్పడలేదని ఉన్నత విద్యామండలి ఓఎస్డీ (సెట్స్) కె.సుధీర్‌రెడ్డి వివరించారు. -
రేపటి ఏపీ ఈఏపీ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి
-
ఏపీఈఏపీసెట్- 2021 షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్) షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష, సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్టీయూకు అప్పగించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 2,59,156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, కరోనా పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.