సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్–2022 బాధ్యతలను అనంతపురం జేఎన్టీయూకి అప్పగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహించేందుకు చైర్మన్లు, కన్వీనర్లను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు.
సెట్లు.. చైర్మన్, కన్వీనర్లు ఇలా
ఈఏపీ సెట్‌కు చైర్మన్, కన్వీనర్లుగా అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జి.రంగజనార్దన , ప్రొఫెసర్ ఎమ్.విజయకుమార్, ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ కృష్ణమోహన్, ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిశోర్‌బాబు, పీజీ ఈసెట్‌కు ఎస్వీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ, రీసెర్చ్ సెట్‌కు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్ డి.అప్పలనాయుడు (ఏయూ), ఎడ్‌సెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున, ప్రొఫెసర్ టీజీ అమృతవల్లి, పీజీ సెట్‌కు యోగివేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎమ్.సూర్యకళావతి, ప్రొఫెసర్ ఎన్.నజీర్ అహ్మద్, లాసెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున, ప్రొఫెసర్ టి.సీతాకుమారిలను నియమించారు.
జేఎన్టీయూఏకి ఈఏపీ సెట్ బాధ్యతలు
Published Thu, Feb 10 2022 4:35 AM | Last Updated on Thu, Feb 10 2022 4:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment