![AP EAMCET 2021 Results Released On 8th September - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/7/Eamcet-results.jpg.webp?itok=pgjTf89z)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ (ఈఏపీసెట్) ఫలితాలను సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. education.sakshi.comలో ఫలితాలను చూడవచ్చు. (చదవండి: విద్యాదీవెన, ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..)
ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను రేపు ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment