adimulapu suresh
-
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్‌కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
ప్రజలను చంద్రబాబు నిలువునా ముంచారు: ఆదిమూలపు సురేష్
-
కూటమి ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోంది: Adimulapu Suresh
-
వైఎస్ జగన్ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్
సాక్షి,తాడేపల్లి:వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం(నవంబర్ 18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడారు.‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్ జగన్‌ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.కొమ్మూరి కనకారావు కామెంట్స్...మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడువర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారుముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదేమాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారురెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడుపెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదుమరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్‌ను దూషించడంంకరెక్టు కాదువైఎస్ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారుఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్ జగన్ ఇచ్చారుచంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారుచర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్ జగన్ పెన్షన్లు ఇచ్చారుచంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు -
Adimulapu Suresh: ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు
-
ఇది మోసం కాదా?.. కూటమి సర్కార్‌పై ఆదిమూలపు ఫైర్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒనగూరేదేమీ లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్‌తో తగిన కేటాయింపులు జరపలేదు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆక్షేపించారు.‘‘ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. పేదలకు ఇచ్చిన హామీలకు తగట్టుగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ప్రతి పేద విద్యార్థిని సూపర్ స్టూడెంట్‌గా తీర్చిదిద్దాలని జగన్ తప్పించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు.’’ అని ఆదిమూలపు ధ్వజమెత్తారు...బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. సూపర్ సిక్స్ హామీల అమలును తుంగలో తొక్కారు. నిధుల కేటాయింపులు చేయకుండా జనాన్ని మోసం చేశారు. తల్లికి వందనం కింద 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు ఇవ్వాలి. కానీ అందులో సగం కూడా ప్రభుత్వం బడ్జెట్లో పెట్టలేదు. ఇది జనాన్ని మోసం చేయటం కాదా?..వైఎస్ జగన్ నాడు-నేడు పథకం కింద 45 వేల ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయించారు. పిల్లలకు ట్యాబ్‌లు, బైజూజ్ కంటెంట్, మౌలిక సదుపాయాలను కల్పించారు. పిల్లలను గ్లోబల్ లెవల్లో అభివృద్ధి చేయాలనుకున్నారు. అందుకోసం తెచ్చిన పథకాలన్నిటినీ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. విద్యా వ్యవస్థను చంద్రబాబు సర్వ నాశనం చేస్తున్నారు. దీని వలన భావితరాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేయాలి. నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి. మేనిఫెస్టోని అమలు చేయలేకపోవటం సిగ్గుచేటు...2014లో కూడా చంద్రబాబు మేనిఫెస్టోని అమలు చేయలేదు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తున్నామని అప్పట్లో ఇంటర్ నెట్ నుంచి మేనిఫెస్టోని తొలగించారు. కానీ జగన్ తన మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసి దాని విలువ పెంచారు. డీఎస్సీ కోసం ఏడు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆర్నెళ్లలో అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడేమో వచ్చే సంవత్సరం నుంచి అంటూ మళ్లీ మాట మార్చారు. జగన్ హయాంలో మొత్తం 21,108 టీచర్ పోస్టులను భర్తీ చేశాం. చంద్రబాబు మాత్రం విద్యావ్యవస్థను పాడు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.37 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్ లో దాని ఊసేలేదు..రైతులకు పెట్టబడి సాయంగా పదివేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా నిధుల కేటాయింపులు లేవు. వాస్తవాలకు దూరంగా ఉన్న డాబుసరి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు, త్రిపుల్ ఐటీలలో కూడా మంచి భోజనం పెట్టటం లేదు. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అతిసారతో విద్యార్థులకు అవస్థలు పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. రూ.73 వేల కోట్లను జగన్ విద్యారంగానికి ఖర్చు చేశారు. మరి చంద్రబాబు ఎందుకు ఈ రంగాన్ని పక్కన పెట్టారు?. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఈ ఐదు నెలల్లోనే విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయలేక చతికిలపడ్డారు. 3,758 స్కూళ్లలో టీచర్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి లోకేష్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. మేనిఫెస్టోని అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆదిమూలపు సురేష్ ఫైర్
-
ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం, సాక్షి: ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించేందుకు మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ , పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ వెంకయ్య , వరికూటి అశోక్ బాబు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.ఈ క్రమంలో వారిని రిమ్స్ ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఆదిమూలపు సురేష్, వెంకయ్య, అశోక్ బాబు అక్కడే నేలపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులుతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో నాలుగో తరగతి విద్యార్థినిపై స్కూల్ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘ టంగుటూరు మండలం కారుమంచి మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన చాలా దారుణం. రాష్ట్రంలో పిల్లలు, మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి. ‘దిశ’ను ఎందుకు నీరు గార్చారు. పోలీసులు ఎందుకు నిర్లప్తంగా తయారయ్యారు. ...కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ఎందుకు వదిలేశారు. బాధితురాలు.. తనపై హత్యాచారం చేశారని చెబుతుంటే. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు. ఏ మంత్రి చెబితే కేసుని తొక్కిపట్టారు?. మేం వచ్చే వరకు పిర్యాదు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ అరచకాలపై సోషల్ మీడియా ద్వారా ఎండగడుతాం?. అలాగే సోషల్ మీడియాపై నిర్బంధాన్ని ఎదుర్కుంటాం. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వుంటాం’’ అని అన్నారు. -
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో ప్రభుత్వానికి నష్టమా?
నరసరావుపేట/నగరి/రాజంపేట/ప్రొద్దుటూరు క్రైం/పిడుగురాళ్ల: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల సాకారం చేయడం కోసం.. సామాన్యులకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు మోకాలొడ్డుతోంది. తమది పెత్తందారుల ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.ఏకంగా రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. 2023–24లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండింది. దాదాపుగా పూర్తయిన ఈ కళాశాలల్లో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. పులివెందుల, పాడేరు కళాశాలలకు సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.దీనికి సంతోషించాల్సింది పోయి పులివెందుల కళాశాలకు సీట్లు కేటాయించొద్దంటూ ఆగమేఘాలపై గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసింది. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం ఇలా పేద విద్యార్థులకు, పేద రోగులకు అన్యాయం చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఆదివారం పలువురు వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బాబు వైఖరిని కడిగిపారేశారు.మీకు నష్టమేంటి బాబూ?ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే సీఎం చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి. వైఎస్ జగన్ తీసుకొచ్చాడనే దుగ్ధతో, కోపంతో, పగతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టావా చంద్రబాబూ? మీకు ప్రైవేట్‌పైనే మోజు. ఒక పేద విద్యార్థి ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదవాలంటే సుమారుగా రూ.1.5 కోట్ల డొనేషన్ చెల్లించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది 5 కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కావాల్సి ఉండింది. బాబు పుణ్యమా అని వాటికి మోక్షం లభించలేదు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్షమించరాని నేరంజగనన్నపై ఉన్న ఈర్ష, ద్వేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలపై చూపుతున్నారు. కేటాయించిన సీట్లను ప్రభుత్వం రద్దు చేయమని కోరడం దుర్మార్గం. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేకపోగా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయంటే కొంచెం ర్యాంకు తక్కువగా వచ్చినా, సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంవైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి పెత్తందారులకు అమ్ముకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మెడికల్ కాలేజీలు పూర్తి కాకుండా ప్రారంభించారని.. వసతులు, సిబ్బంది లేరని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేయటం సిగ్గుచేటు. వైద్య కళాశాలలు ప్రారంభించటం అనేది మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించాకే కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ఇది కూడా మంత్రికి తెలియదా? – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
మీరు చెరిపిస్తే చెరిగిపోయే పేరు కాదు..ఆదిమూలపు సురేష్ ఫైర్
-
బాబు విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నారు: ఆదిమూలపు సురేష్
-
‘హామీలపై చేతులెత్తేసి.. మాపై నిందలా చంద్రబాబూ’
సాక్షి, గుంటూరు: ఏపీలో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై నిందలు వేయడానికి టీడీపీ ప్రయతిస్తోందన్నారు.విద్యారంగాన్ని మార్చేస్తామని కూటమి చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసేయాలని భావిస్తోంది. నాడు-నేడు ద్వారా సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. అన్ని స్కూళ్లలో మేనేజ్మెంట్ కమిటీలు వేశాం. జాతీయ విద్యా విధానానికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా?. జగన్‌పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోంది’’ అని ఆదిమూలపు ధ్వజమెత్తారు.‘‘జాతీయ విద్యారంగంలో మేము ఎన్నో సంస్కరణలను తెచ్చాం. అవి అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. ఇది పేద విద్యార్థులకు అపార నష్టం తెస్తోంది. గత ఐదేళ్లలో మేము విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు పెట్టాం. నాడు-నేడు కింద వేలాది స్కూళ్లని బాగు చేశాం. జాతీయ విద్యావిధానంలో భాగంగా NEP 2020ని అమలు చేశాం. అసలు చంద్రబాబు ప్రభుత్వం జాతీయ విద్యావిధానానికి అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలి’’ అంటూ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.‘‘జగన్ తెచ్చిన పథకాలపై వ్యతిరేకంగా ముందుగా ఎల్లోమీడియాలో రాయిస్తారు. తర్వాత ఆ పథకాలన్ని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారు. తల్లికివందనం అమలు చేయకుండా మోసం చేశారు. దీనిపై ఎల్లోమీడియా ఎందుకు వార్తలు రాయటం లేదు?’’ అని ఆదిమూలపు ప్రశ్నించారు.‘‘జగన్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను కేంద్రమే మెచ్చుకుంది. పీపీపీని విద్యారంగానికి పులమొద్దు. పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయవద్దు’’ అని ఆదిమూలపు చెప్పారు. -
మీరు చేసిన పనికి మహిళలు స్కూళ్ళు మానేస్తున్నారు
-
తల్లికి వందనంపై లోకేష్ వ్యాఖ్యలు.. ఆదిమూలపు సురేష్ రియాక్షన్
-
విద్యావ్యవస్థను నీరుగారిస్తే ఉద్యమిస్తాం.. చంద్రబాబుకు ఆదిమూలపు వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను చూస్తే.. ముఖ్యంగా విద్యా రంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారేలా, సంస్కరణలు తీసుకొస్తే వాటిని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి పిల్లలు, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోందని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారని, వాటిలో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే.. కూటమి పార్టీలు ముందు నుంచి కూడా అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయన్న ఆయన, ఆనాడు కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడూ వారు అదే ధోరణిలో ఉన్నారని చెప్పారు.పేద విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీద పట్టు సాధించాలని, వారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్ నేర్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆలోచించిన వైఎస్ జగన్ , టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల.. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తిగా మెరుగుపరిచి, కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా వాటిని అభివృద్ధి చేశామని మాజీ మంత్రి తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఆ పనులు చేయడమే కాకుండా, మెటేరియల్ సేకరణ కూడా రాష్ట్ర స్థాయిలో, రివర్స్ టెండరింగ్ విధానంలో చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పనులు కూడా ఆపాలన్న దురుద్ధేశంతో.. పనుల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.నాడు–నేడు మనబడి కార్యక్రమంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంతో సహా అన్ని నియోజకవర్గాల్లోని 44,512 ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఆధునీకరించామని మాజీ మంత్రి చెప్పారు. స్కూల్ బిల్డింగ్‌లకు అవసరమైన మరమ్మత్తులు, పెయింటింగ్స్, ప్రహరీ, ఫర్నీచర్, లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్‌చాక్ బోర్డులు, రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, ఇంగ్లీష్ ల్యాబ్, కిచెన్స్ ఇలా మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూల్స్‌లో సమూల మార్పులు చేశామని, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్ళలో చేపట్టిన పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన, కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాసేలా ఉందని, ఇది గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు చాలా నష్టం చేస్తుందని స్పష్టం చేశారు.గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం జగన్ అమ్మ ఒడి పథకం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం, దానికి తల్లికి వందనం అని పేరు మార్చిందని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామంటూ ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేసి, ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా రకరకాల కారణాలు చెబుతున్నారని మాజీ మంత్రి ఆక్షేపించారు.పథకం అమలు కాకపోతే, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్కు నిధులు లేకపోతే రిపేర్లు కష్టం అవుతాయని, దీని వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పారు. బాత్రూమ్స్లో రన్నింగ్ వాటర్ ఆగిపోతే అనేకమంది విద్యార్ధులు స్కూల్స్‌కు దూరమవుతారన్న ఆయన, తాము స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ తగ్గించి అడ్మిషన్లు పెంచితే, ఈ ప్రభుత్వ వైఖరి వల్ల.. మళ్ళీ విద్యార్ధులంతా ప్రేవేట్ స్కూల్స్‌కు వెళ్ళే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.తల్లికి వందనం అమలు చేయకుండా.. ‘మా ప్రభుత్వంపై బురద చల్లడానికి సైంటిఫిక్ డేటా అవసరం లేదు. గణాంకాలు అవసరం లేదు. అదే వారు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రం డేటా అవసరమా?. అని ఆదిమూలపు సురేష్ సూటిగా ప్రశ్నించారు.ప్రస్తుత విద్యా శాఖ మంత్రి కూడా విదేశాల్లో చదువుకున్నారు కదా.. ఇంగ్లిష్ ప్రాధాన్యం ఆయనకూ తెలుసు కదా?. మరి అలాంటప్పుడు టోఫెల్ శిక్షణ రద్దు చేయడమే కాకుండా.. ఇంగ్లిష్ మీడియమ్ స్కూళ్ల రద్దు పైనా ఆలోచన ఎలా చేస్తున్నారని నిలదీశారు. ‘పేద విద్యార్ధులు ఆత్మ విశ్వాసం, ఆత్మస్ధైర్యం పెంపొందేలా మేం కార్యక్రమం చేస్తే దాన్ని నిర్వీర్యం చేయడమే మీ లక్ష్యమా?’. అని గట్టిగా ప్రశ్నించిన ఆదిమూలపు సురేష్, కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎప్పుడూ తెలుగు బాషకు వ్యతిరేకం కాదన్న మాజీ మంత్రి, ఇంగ్లిష్తో పాటు, తెలుగుకూ ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించాలని, రెండిటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్సీ, ఐబీ సిలబస్ అమలు చేయాలని కోరారు. గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేయడమే టీడీపీ లక్ష్యమన్న ఆయన, 2014–19 మధ్య వారు ఏకంగా 1785 స్కూళ్లు మూసివేశారని గుర్తు చేశారు.విద్యా రంగాన్ని, విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరిన ఆదిమూలపు సురేష్, తమ హయాంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దామని వెల్లడించారు. కార్పొరేట్ యూనివర్శిటీలలో కూడా పేద విద్యార్థులకు 30 సీట్లు ఉచితంగా ఇవ్వాలని చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. ‘విద్యా రంగంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మేం ప్రజల పక్షాన నిలదీస్తాం. ఈ వ్యవస్ధను కాపాడుకుంటాం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రతిఘటన తప్పదు’.. అని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..‘మ్యానిఫెస్టోని మరిచిపోతే జనం కచ్చితంగా నిలదీస్తారు. కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టో అమలు చేయక తప్పదు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మేం నూటికి నూరు శాతం అమలు చేశాం. మేం ప్రజల పక్షాన నిలబడతాం. మేం అధికారంలో ఉంటే ఈపాటికి అమ్మ ఒడి వచ్చేది కదా అని అందరూ అనుకుంటున్నారు. మా పార్టీ పేదల పక్షమే, ప్రజలే అంతిమ నిర్ణేతలు’.. అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. -
చంద్రబాబు శ్వేత పత్రంకు ఆదిమూలపు సురేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం: ఆదిమూలపు సురేష్
సాక్షి, తాడేపల్లి: అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. పచ్చ పత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టాం. రోడ్లు, భవనాల నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాం. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణాలు చేపట్టాం.’’ అని ఆదిమూలపు చెప్పారు.అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదు?‘‘తనది విజన్ అని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలపు ప్రశ్నించారు. ‘‘సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలి. అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలి. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి.’’ అని ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు.అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?‘‘ వైఎస్ జగన్ పాలనపై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ కేపిటల్ అభివృద్ధి వంటివన్నీ ముందుకు తీసుకెళ్లాం. చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చాం. అసలు అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?. చేసిన అప్పులు ఎన్నో కూడా చంద్రబాబు తన శ్వేతపత్రంలో చెప్తే బాగుండేది. సంపద సృష్టిస్తానని పదేపదే చంద్రబాబు ఆ సంపద ఎవరి కోసం సృష్టిస్తారో చెప్పాలి. తన వారికే సంపద సృష్టిస్తారా? ప్రజలందరికీ చేస్తారా?. రాజధాని ప్రాంతంలో భూమిలేని కూలీలకు కూడా జగనే పెన్షన్ పెంచారు. 9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం’’ అని ఆదిమూలపు పేర్కొన్నారు.వేలాది ఎకరాలు చేతులు మారాయి..‘‘రాజధాని కడతానన్న చంద్రబాబు కనీసం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఎందుకు ఇవ్వలేదు?. రాజధాని ప్రకటన జరిగే లోపు అమరావతిలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగింది. 2014 జూన్ నుండి డిసెంబర్ మధ్యలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. ఇది ఎలా జరిగిందో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. రాజధానిలో ఇవ్వాల్టి పరిస్థితికి టీడీపీదే బాధ్యత. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఎందుకు పూర్తి చేయలేదు?. ఆ రోడ్ మీద వెలుగుతున్న లైట్లు కూడా మా హయాంలో వేసినవే. దాన్ని కూడా తామే వేసినట్టు చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదం. రాజధానిలో 14 వందల ఎకరాలను 52 వేల మందికి పట్టాలు ఇచ్చాం. దానిపై చంద్రబాబు తన శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు?’’ అంటూ ఆదిమూలపు ప్రశ్నించారు.దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?‘‘అమరావతిలో 17 అంగన్ వాడీ సెంటర్లు, 14 స్కూళ్ల నిర్మాణం చేశాం. చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చేయలేదు, నిర్మాణాలు పూర్తి చేసి చూపించాం. అమరావతి మీదుగా వేసిన వెస్ట్ బైపాస్ నిర్మాణం మా హయాంలోనే చేశాం. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?. చంద్రబాబు ఐకానిక్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌లో చూపిస్తే.. జగన్ వాస్తవరూపంలో నిర్మించి చూపారు. రూ.841 కోట్లు రైతులకు కౌలు కింద అందించాం. కూలీలకు పెన్షన్ కింద రూ.580 కోట్లు అందించాం. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కేంద్రం నుండి మట్టి, నీళ్లు తప్ప ఏం సాధించారు?. ఇప్పుడైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి. ప్రజలకు చేస్తామన్న సంక్షేమ మేలును పూర్తి చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా ఇవ్వాలి’’ అని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. -
టీడీపీ కక్ష సాధింపుపై ఆదిమూలపు సురేష్ కౌంటర్
-
మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమోషనల్
-
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం సీఎం జగన్
-
ఓటమి భయంతో పిరికిపందలు చేసే పని...
-
లక్షల మంది అవ్వాతాతల కూడును అడ్డుకున్న చంద్రబాబు..
-
Veligonda: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్
-
అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ ట్రోల్స్ కు దిమ్మతిరిగే కౌంటర్
-
చంద్రబాబు, ఈనాడుకి అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదు: ఆదిమూలపు
-
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
జల్లెడ పట్టి మరీ పథకాలు ఇవ్వండి అని చెప్పిన ఏకైక సీఎం మీరే సార్
-
మున్సిపల్ సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికుల సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకొనేందుకు అంగీకారం తెలిపాయి. మంగళవారం మంత్రుల బృందంతో చర్చల అనంతరం సీఐటీయూ మినహా మిగతా కార్మిక సంఘాలు బుధవారం నుంచి చేపట్టనున్న సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయంలో కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయం, పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధికరించడం తదితర అంశాలపై చర్చించారు. అవుట్ సోర్సింగ్‌పై పనిచేసే పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరానికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఘన వ్యర్థాల తరలింపునకు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న వాహనాల పనితీరును మెరగుపరచాలని, పారిశుద్ద్య కార్మికులు, ఇంజినీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు పనుల ఆధారంగా వారికి బేసిక్ పే పైనా సమావేశంలో చర్చించారు. కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు చెప్పారు. సంక్రాంతి ముందు లేదా తర్వాత ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు సమ్మెను వాయిదా వేయాలని మంత్రులు కోరారు. ప్రస్తుతం సీఐటీయూ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. మిగిలిన సంఘాలు బుధవారం నుంచి సమ్మెకు దిగాలని మొదట నిర్ణయించాయి. మంత్రుల విజ్ఞప్తి మేరకు సీఐటీయూ మినహా మిగిలిన సంఘాల నేతలు సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. ఈ చర్చల్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండీ వాసుదేవరావు తదితర అధికారులు, రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నేతలు ఆనందరావు, రమణ (వైఎస్సార్టీయూసీ), రంగనాయకులు, పి.సుబ్బారాయుడు (ఏఐటీయూసీ), అబ్రహం లింకన్ (ఐఎఫ్టీయూ), జి.ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు, శ్యామ్ (టీఎన్టీయూసీ), మధుబాబు, ఆంజనేయులు (ఏపీ ఎంఈడబ్లు్యయూ), వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ) పాల్గొన్నారు. చాలా సమస్యలు పరిష్కరించాం: మంత్రి సురేష్ అనంతరం మంత్రి సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. కార్మికుల డిమాండ్లలో చాలా పరిష్కరించామని, మిగతా వాటిపైనా సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లకు నెలకు రూ.6 వేలు చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మరికొన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్ల కేటగిరీల్లో కొన్ని తప్పులు జరిగాయని, వాటినీ పరిష్కరిస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లింపుపైనా సానుకూలనిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు
గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘కార్మికుల డిమాండ్ మేరకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్‌గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్), వై.వి.రమణ (YSRTUC ప్రధాన కార్యదర్శి), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్), అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న ఇచ్చిన ఈ బాధ్యతను చిత్త శుద్దితో పనిచేస్తా
-
సిగ్గు తెచ్చుకో పవన్..నీ కంటే నోటా బెటర్
-
రైతులను ఆదుకుంటాం
వెంకటాచలం/పామర్రు/నరసాపురం రూరల్/తొండంగి/త్రిపురాంతకం: ‘ఎవరూ అధైర్య పడొద్దు... ఈ కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. రైతులకు అన్ని విధాలా సాయం చేస్తుంది...’ అని పలువురు రాష్ట్ర మంత్రులు చెప్పారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేశ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతోపాటు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కారుమూరి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పామర్రులో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట పొలాలను, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాశులను పరిశీలించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి రూ.1,300కోట్లకు గాను, బుధవారం వరకు రైతుల ఖాతాల్లో రూ.1,089 కోట్లు జమ చేశామని, మిగిలిన మొత్తం కూడా ఒకటి, రెండు రోజుల్లో చెల్లిస్తామని వివరించారు. కౌలు కార్డులు లేని కౌలురైతుల ధాన్యాన్ని కూడా స్థానిక సొసైటీల ద్వారా కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని స్పష్టంచేశారు. కృష్ణాజిల్లా రైతులు తమ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డ్రయర్స్ ఉన్న మిల్లులకు అమ్ముకునే విధంగా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పొలంలో చల్లిన మినుము విత్తనాలు పాడైపోయిన వారికి మళ్లీ సబ్సిడీపై విత్తనాలు అందించేలా చూస్తామన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్వే: దాడిశెట్టి కాకినాడ జిల్లా ఏ.కొత్తపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా పరిశీలించారు. బాధిత రైతులు, అధికారులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. మంత్రి రాజా మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పంట నష్టం అంచనాలు అందినవెంటనే సాయం: ఆదిమూలపు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద దెబ్బతిన్న వరి పొలాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరిశీలించారు. తహశీల్దార్ వి.కిరణ్, వ్యవసాయ శాఖ అధికారులను అడగి పంటనష్టం గురించి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టం అంచనాలు అందిన వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ రైతు పక్షపాతి అని ప్రతి ఒక్క రైతుకూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ : కాకాణి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన తిక్కవరప్పాడు, ఇస్కపాళెం, పుంజులూరుపాడు, గుడ్లూరువారిపాళెం, తిరుమలమ్మపాళెం గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. తిరుమలమ్మపాళెం, ఇతర వరద ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. కొంతమేరకు వరినాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు ఆర్బీకేల ద్వారా 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి పరిహారాన్ని అందిస్తామని వివరించారు. ఏర్పాట్లు బాగున్నాయి రాత్రి కురిసిన వర్షానికి ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా నీరు ఎక్కువగా వస్తే ఎలా ఉండాలో తెలియక అయోమయంలో పడ్డాం. వెంటనే సకాలంలో అధికారులు వచ్చి చర్యలు తీసుకున్నారు. శిబిరానికి తీసుకొచ్చారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, టీ కూడా అందజేశారు. అధికారులు మా బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. – రాచూరి ముత్యాలరావు, చెరుకూరి రత్నం, తాళ్లపూడి, తూర్పు గోదావరి జిల్లా పరీక్షలు చేసి మందులిచ్చారు నేను, మా ముసలావిడ ఇద్దరమే ప్రకాశపురంలోని గుడిసెలో నివసిస్తున్నాం. తుపాను రాగానే జోరువానలో మమ్మల్ని ఇద్దర్నీ మా వలంటీర్ వచ్చి వ్యానులో తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో అన్నం పెట్టించారు. వయసు మీద పడటంతో ఈ వలంటీరే దిక్కయింది. శిబిరంలో డాక్టర్లు మందులిచ్చారు. – మురాల ప్రభుదాసు, ప్రకాశపురం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సురక్షితంగా బయట పడ్డాను నా ఇల్లు బాగోలేదు. తుపాన్ వేళ ఎలా చేయాలని దిగులు పడుతున్న సమయంలో గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు భోజనాలు, టిఫిన్లు పెట్టారు. నిద్రపోవడానికి వసతి కూడా కల్పించారు. విపత్తులు వచ్చినప్పుడు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు. అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శింగోతు నాంచార్లు, కె.పల్లెపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను నేను చాలా తుపాన్లు చూశాను. శిబిరానికి వెళ్లేందుకు నిరాకరిస్తే మా వలంటీర్ అమ్మాయి వచ్చి మామ్మా.. నేను తీసుకెళ్తాను అంటూ పట్టుబట్టింది. సిబ్బందితో వచ్చి వ్యానులో తీసుకెళ్లారు. రెండు రోజులు వేములదీవి ఈస్ట్ గ్రామంలోని తుపాను షెల్టర్‌లో ఉన్నాను. నేను శిబిరానికి వెళ్లిన తర్వాత నా గుడిసె కూలిపోయింది. వలంటీర్ మాట విని ఉండకపోతే నా ప్రాణాలు పోయేవి. వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను. – మైలాబత్తుల కమలమ్మ, వేములదీవి ఈస్ట్, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సకాలంలో ఆదుకున్నారు వర్షం నీటితో ఇల్లు మొత్తం నీరు చేరింది. అధికారులు, పంచాయతీ సిబ్బంది సకాలంలో వచ్చి మమ్మల్ని ఉన్నత పాఠశాల వద్దకు చేర్చారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. భోజనం, అల్పాహారం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. – గోపిరెడ్డి రమ్య, వేగేశ్వరపురం, తూర్పు గోదావరి జిల్లా -
కడపలో ప్రజా చైతన్యం
సాక్షి ప్రతినిధి, కడప/ కడప కార్పొరేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత కడప నగరంలో పాటలై పొంగింది. గురువారం నగరంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర వేలాది ప్రజలతో జైత్రయాత్రలా సాగింది. గురువారం ఉదయం నుంచే కడప నగరంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. నృత్యాలు, పాటలు, జై జగన్ నినాదాలతో యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 3.25 గంటలకు యూఎస్ మహల్ నుంచి బస్సు యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజలు, మహిళలు పూలు, గజమాలలు, మంగళ హారతులు, బాణసంచాతో అడుగడుగునా యాత్రకు బ్రహ్మరథం పట్టారు. పాత బస్టాండులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో మంత్రులు, పలువురు మంత్రులు సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతను వివరించారు. ప్రసంగాల్లో జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ ప్రజల హర్షాతిరేకాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించిన సభలో పాల్గొన్న జనవాహినిలో ఓ భాగం సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి సురేష్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే ఆలోచనలు కలగలిపిన పాలనతో సీఎం వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా నిలిచారని మంత్రి ఆదిమూలపు సురేష్ అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని ఉప కులాలను కూడా సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థితికి తెస్తున్నారని తెలిపారు. ఆగ్రకులాల సరసన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. మన ఆత్మగౌరవం నిలిపిన జగనన్నకు అండగా నిలవాలని కోరారు. జగనన్న ఆలోచనకు అండగా నిలుద్దాం: ఎమ్మెల్సీ రవిబాబు అణచివేతకు గురైన బిడ్డలను సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కోరారు. 40 ఏళ్లుగా పేదల శ్రమశక్తి, ఆలోచన విధానాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు రూ.6 లక్షల కోట్లకు ఎదిగారన్నారు. చంద్రబాబు వళ్లంతా అవినీతి మచ్చే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం వీసమెత్తు కూడా పనిచేయలేదని తెలిపారు. బాబు వళ్లంతా అవినీతి మచ్చే ఉందని ఎద్దేవా చేశారు. మూడు తరాల క్రితమే వైఎస్ కుటుంబం సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. జగనన్న సర్కార్‌లో స్కావెంజర్ బిడ్డకు కూడా కార్పొరేట్ విద్య అందుతోందన్నారు. పేదల ఉన్నతికి అనుక్షణం తపించే సీఎం వైఎస్ జగన్‌ను మన జాతి కోసం మరోమారు గెలిపించుకోవాలని కోరారు. సామాజిక న్యాయం నినాదం కాదు..విధానం: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం నినాదంగానే ఉండేదని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అది ఓ విధానమైందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారితను ఆచరణలో చూపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. కడప ప్రజలు తనను రెండు సార్లు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపితే, సీఎం వైఎస్ జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన సరసన కూర్చోబెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమం, సామాజిక న్యాయం సమపాళ్లలో..: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సామాజిక న్యాయానికీ అంతే ప్రాధాన్యత ఇచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. కేబినెట్లో 70 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఈ వర్గాలకే సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, ఎంవీ రామచంద్రారెడ్డి, పోతుల సునీత, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో స్కీములు పక్క రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు.. అది సీఎం జగన్ గొప్పతనం..
-
ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ చెప్పారు. సామాన్యుల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయమని, సామాజిక సాధికారత మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించి దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పెద్దన్నలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారని, దేశంలో ఇప్పటివరకు మరే ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు, వారి బాధలు స్వయంగా తెలుసుకుని సీఎం జగన్ న్యాయం చేశారని కొనియాడారు. అనేక పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.53 లక్షల కోట్లు ప్రజలకు సంక్షేమం అందించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రూ.1.76 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. కనిగిరిలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం బడుగుల ఆత్మ బంధువు సీఎం జగన్: మంత్రి సురేష్ బడుగు, బలహీనవర్గాల ఆత్మ బంధువు సీఎం జగన్ అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పేదరికం పిల్లలకు విద్యను దూరం చేయకూడదనే సంకల్పంతో సీఎం జగన్ నిరుపేదలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దళితుడినైన తనను విద్యా శాఖ మంత్రిని చేయడం సాధికారత కాదా అని ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియంపై గొడవ పెట్టిన టీడీపీ, జనసేన నేతలకు పేద బిడ్డలు మంచి చదువులు చదవడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని సవాల్ చేశారు. ఇంత మేలు మరే రాష్ట్రంలో జరగలేదు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. మొట్టమొదటిసారి దేశంలో మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నియమించడం, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నాలుగు పదవులు ఇవే సామాజిక వర్గాల వారికివ్వడం సీఎం జగన్‌కే సాధ్యమైందన్నారు. నాలుగు ఎమ్మెల్సీ, 12 రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులు ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు. ఏకంగా ముస్లిం మహిళను మండలి డిప్యూటీ చైర్మన్‌గా నియమించి చరిత్ర సృష్టించారన్నారు. బీసీలను అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతం: ఎంపీ బీద మస్తాన్‌రావు బీసీలను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని, అధికారంలోకి వచ్చాక అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతమని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చెప్పారు. 30 ఏళ్లు టీడీపీలో పనిచేసిన తనకు అనేకమార్లు రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారని, దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయమని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తాను, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు వంటి తామే సీఎం జగన్ సామాజిక సాధికారత తెచ్చారనడానికి ఉదాహరణ అని చెప్పారు. కనిగిరిలో రూ.3,471 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు సామాన్యుడినైన తనను శాసన సభ్యుడిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అండతో కనిగిరిలో రూ. 3,471 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా చేసి వెనుకబడిన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. 18 వేల ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇచ్చేందుకు రూ. 125 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ. 150 కోట్లతో జేజేఎం ద్వారా పనులు చేపడుతున్నామని తెలిపారు. కనిగిరిలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కనిగిరి ప్రజలకు మంచి నీటిని అందించేందుకు రూ.1,250 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉందని చెప్పారు. -
ఆరు నూరైనా మళ్లీ జగనే సీఎం: వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వివరించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎంతో చేశాడు. ఇవాళ ఆయా వర్గాలకు చెందినవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కారణం. వినుకొండలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు. కానీ, అధికారం ఇస్తే మాత్రం బెంజ్ కారు ఇస్తానంటారు.. రైతు రుణ మాఫీ చేస్తానంటారు. వినుకొండలో ఒక్క అభివృద్ధి పని చేశామని టీడీపీ నేతలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సామాజిక విప్లవం రావాలని విప్లవకారులు కోరుకున్నారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు దళిత హక్కులను కాలరాశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి ముళ్ళపొదల్లో చంద్రబాబు కడితే.. విజయవాడ నడిబొడ్డున జగన్ అంబేద్కర్‌కు భారీ విగ్రహం పెట్టారు. వైఎస్ జగన్ మరో అంబేద్కర్.. పూలే. చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. మోసకారి. ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాలు సాధికారితకు నిదర్శనం. జాషువా పుట్టి పెరిగిన గడ్డ వినుకొండ. జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడా?. బ్రహ్మన్నకు(ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడును ఉద్దేశించి..) మరోసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. మంచి చేయకపోతే ఎవరినైనా ఏట్లో వేస్తామని వినుకొండ ప్రజలు గత ఎన్నికల్లో చెప్పారు. ఈ ప్రాంతం వెనుకబడిన ఉండటానికి ప్రధాన కారణం నీళ్ళు లేకపోవడమే. వరికిపూడిసెల తీసుకొచ్చి బొల్లాపల్లి మండలానికి సాగు త్రాగు నీరు ఇస్తామని చెప్పాం. ఇందులో భాగంగానే అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 17న మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభిస్తాం. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. జగన్ అన్న కటౌట్ చూపించి సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తాం. జగన్ లేకుండానే ఇంతమంది వస్తే.. జగనన్న వస్తే జనసునామీ వచ్చేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. పదవుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు. వార్డు మెంబర్ నుండి రాజ్యసభ ఎంపీ వరకూ అవకాశం ఇచ్చారు. రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే) ద్వారా పేదలకు పంచారు. ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసి.. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తోకను బీసీలు కత్తిరించబోతున్నారు. చంద్రబాబును దళితులు ఓడించి.. ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా చేయబోతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ మాట్లాడుతూ.. బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. వైఎస్ తోనూ ఆయన కుమారుడు జగన్ తోనూ నా ప్రయాణం సాగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఎక్కడికైనా వెళ్తాను. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు. -
‘అనారోగ్యం పేరుతో బయటకొచ్చి బాబు ర్యాలీ చేయడం దారుణం’
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఏపీకి భవిష్యత్తని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసమే వెనుకబడిన వర్గాలను వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించిన గొప్పనాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రకశం జిల్లా మార్కాపురంలో సోమవారం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బస్సుయాత్ర నిర్వహించారు. 3 గంటలకు కార్యకర్తలతో కలసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కాగా.. పిల్లల పార్కు మీదుగా కంభం సెంటర్ వరకు కొనసాగింది, సాయంత్రం 4:30కి వైఎస్సార్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. అంతకముందు మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు భారీగా ప్రజా స్పందన వస్తుందన్నారు. వెనకబడిన వర్గాల నష్టాన్ని, ఇబ్బందలును గుర్తుంచి సీఎం వైఎస్ జగన్ అందుకుంటున్నారని తెలిపారు. గ్రామాలలో గొప్ప సంస్కరణలు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అనారోగ్యం పేరు చెప్పి, జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం దారుణమని అన్నారు. జగనన్న పాలనలో రాష్ట్రంలో భారీగా మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయని తెలిపారు. ‘గతంలో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి ఏదీ నెరవేర్చలేదు. మోసం చేసేందుకు మళ్లీ వస్తున్న దొంగల ముఠాకు ప్రజలు బుద్ధి చెబుతారు. పేదలకు అండగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం జగన్.అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజలను చంద్రబాబు ఏ రోజూ పట్టించుకోలేదు. అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్ తెచ్చకున్నారు. తీరా బయటకొచ్చాక ఆయనకు ఆరోగ్యం బాగానే ఉంది. అనార్యోగ్యంగా ఉందని చెప్పి చంద్రబాబు ర్యాలీ చేశారు.’ అని మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు. -
సామాజిక ప్రభంజనం
సీఎం వైఎస్ జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో 19 నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగాయి. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు, జగనే కావాలి – జగనే రావాలి’ అంటూ నినదిస్తున్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కారు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తోన్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదలివస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవానికి తెరతీశారని రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున చెప్పారు. దేశంలో గరీబీ హటావో వంటి నినాదాలు ఎన్ని వచ్చినా పేదవాడి తలరాతని మార్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. దళితులు, బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పాలనకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనకు తేడా గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజారు సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కుల, మత, ప్రాంత, పార్టీల వివక్ష చూపకుండా సామాజిక న్యాయం పాటించి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని మంత్రి సురేష్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే కలగలిపితే అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. డాక్టర్ వైఎస్సార్ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ప్రతి అంశంలోనూ వారికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కనీసం మైనార్టీలను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేవన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2019లో 22వ స్థానంలో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి వైఎస్ జగన్ పాలనలో మొదటి స్థానానికి రావడం అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భావజాలమే ప్రజలను మోసం చేయడమన్నారు. చంద్రబాబు ఆఖరికి న్యాయమూర్తికి కూడా అబద్ధాలు చెప్పి ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండి, రెండో రోజే ఇంటికి వచ్చి కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జన సందోహంలో ఓ భాగం చంద్రబాబు అంటే అబద్ధం.. వైఎస్ జగన్ అంటే నిజం రాష్ట్రంలో అధిక భాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులానే చూశాయని, సీఎం వైఎస్ జగన్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, బలహీన వర్గాల పక్షమని చాటి చెప్పారని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు అంటేనే అబద్ధమని, సీఎం జగన్ అంటే నిజమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ పునాది వేశారన్నారు. సమ సమాజ స్థాపన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాలను అవమానించి, అణచివేశారని, సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రూ. 2.35 లక్షల కోట్లు నేరుగా అందజేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో పేదరిక నిర్మూలనకు, పేదలకు ఆస్తుల కల్పనకు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. సీఎం జగన్ పాలన దేశంలోనే ఓ చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. వైఎస్ జగన్ చేసిన మేలును చూశారు కాబట్టే ఆయన కటౌట్ చూసి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన వైద్యం, విద్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరిఫాతిమా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీని నిరూపించుకున్న బాలినేని
సాక్షి, అమరావతి/ఒంగోలు: నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణల మీద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదో ఒక విషయం వెలుగులోకి రాగానే దానిని అధికార పార్టీకి అంటగట్టి రాజకీయాలు చేయాలని చూడటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అందులో భాగంగానే నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వివాదంలోకి బాలినేనిని లాగాలని టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించి అభాసుపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న బాలినేని ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ స్వయంగా పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మలికాగర్గ్, కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ విచారణ చేసి వాస్తవాలను మీడియాకు వివరించి, ఇందులో బాలినేని, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర లేదని చెప్పారని వివరించారు. దీంతో బాలినేని నిజాయితి నిరూపితమైందని, తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ అభాసుపాలైందని పేర్కొన్నారు. కంచికచర్ల ఘటనపైనా దుష్ప్రచారం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడిపై దాడి ఘటనలో నిందితుల తరఫున తాను జోక్యం చేసుకున్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. యువకుడిపై దాడి చాలా బాధాకరమని, తక్షణమే పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కంచికచర్ల పోలీసులతో తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ చేశారు. -
‘సీఎం జగన్ మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు’
సాక్షి, గుంటూరు: జగనన్న పాలనలో సామాజిక సాధికారిత యాత్ర ద్వారా రాష్ట్రానికి జరిగిన మేలును ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీసీ సిద్ధమైంది. గురువారం సాయంత్రం తెనాలి రూరల్ కొలకలూరులోని బాపయ్యపేట నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, హఫీజ్ ఖాన్,మాజీ ఎంపీ బుట్టా రేణుక , గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. బస్సుయాత్ర ప్రారంభించిన అనంతరం కొలకలూరులో కుమ్మర,శాలివాహనులతో మంత్రులు మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. ►కోస్తాంధ్రలో మొట్టమొదటి సామాజిక యాత్ర భేరి మోగించబోతున్నాం. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సామాజిక ధర్మాన్ని జగన్ మోహన్ రెడ్డి పాటించారు. నాలుగున్నరేళ్లలో దమ్ముగా మేం తల ఎత్తుకునేలా చేశారు. మాకు జగన్ మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క నాయకుడున్నాడు. సామాజిక సాధికారిత ద్వారా 175 నియోజకవర్గాల్లో మాకు జరిగిన మేలును వివరిస్తాం. చంద్రబాబు పాపం పండింది. 40 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడింది. నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ రోడ్డెక్కారు. నిజం గెలిచింది...నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు బొక్కలో ఉన్నాడు. 40 ఏళ్లలో చంద్రబాబు వెన్నంటే ఉన్న మీరే చంద్రబాబు పాపాలు చెప్పాలి. వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో మీరు చెప్పాలి. రెండు ఎకరాలతో రెండు లక్షలు ఎలా దోచుకున్నారో మీరు చెప్పాలి. పేదల కోసం జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో మేం చెప్తాం రెఢీనా? :::మంత్రి జోగిరమేష్ ►అనునిత్యం ప్రజల వద్దకే పాలన అనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన వర్గాల స్థితి గతులు ఎలా మారాయో ఈ యాత్రలో చెబుతాం. పేదలకు జరిగిన మేలును చెప్పేందుకు మేం యాత్ర చేస్తున్నాం. ఓ రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కారు. తమ వ్యాపారాల కోసం.. గుట్టు బయటపడకుండా ఉండాలనేదే వారి తాపత్రయం. కుంభకోణాలతో చంద్రబాబు అవినీతి పాలన అందించారు. అవినీతి లేకుండా జవాబుదారీగా పాలనను జగనన్న అందించారు. జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరిస్తాం. పేదలకు ఇంగ్లీష్ మీడియం అవసరమా అని ఒకరంటారు. యూ ట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చికోవచ్చని మరొకరంటారు. పవన్ కళ్యాణ్ కు ఇదే నా సవాల్. పవన్ కు దమ్ముంటే మా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలతో పోటీగా ఇంగ్లీష్ మాట్లాడాలి. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్క ఉపకులాలను కూడా విస్మరించకుండా న్యాయం చేశారు. మీకు మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నాం :::మంత్రి ఆదిమూలపు సురేష్ -
ఇంటర్ ఫెయిల్ పవన్ చదువు గురించి మాట్లాడమా?:మంత్రి సురేష్
-
ఇంటర్ ఫెయిల్ పవన్ చదువు గురించి మాట్లాడమా?:మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ: ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కల్యాణ్ చదువు గురించి మాట్లాడుతున్నారంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలన్నారు. ఐరాస వేదికపై పేద విద్యార్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంపై పవన్ ఆరోపణలు అజ్ఞానానికి నిదర్శనం’’ అంటూ మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు. టీడీపీ, నారా లోకేష్‌లకు ఇక భవిష్యత్ లేదు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటే 48 గంటల్లో విడిపిస్తానన్న లోకేష్ మాటలను గుర్తుచేస్తూ.. వాళ్ల నాన్న జైలుకి వెళ్లి ఇన్ని రోజులైనా ఎందుకు బెయిలు తేలేకపోయాడు అంటూ మంత్రి ప్రశ్నించారు. పాపం పండిపోయి చంద్రబాబు జైలుకి వెళ్లారు. యువగళం యాత్ర ఎందుకు లోకేష్ ఆపేశాడు. ఏ యాత్ర చేసిన టీడీపీ, లోకేష్‌లకు భవిష్యత్ లేదని తేలిపోయింది. లోకేష్, పవన్‌లకే గ్యారంటీ లేదు. వాళ్లిద్దరూ ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారు’’ అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? -
రాజధాని పేరుతో ఇన్ని ఘోరాలా ?
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కారు పాల్పడిన ఘోరాలు విస్తుగొల్పుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అధికార రహస్యాలను బయట పెట్టబోమని ప్రమాణం చేసిన నాటి మంత్రులు ప్రజలకు ఇంత అన్యాయం చేయడం దారుణమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ధర్మాన మాట్లాడారు. టీడీపీ సర్కారు రాజధానిపై ఏనాడూ ఒక పద్ధతిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వినియోగించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబు తప్పు చేసి దొరికిపోవడంతో మూటాముల్లె సర్దుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లో చేసినట్లుగానే అమరావతిలోనూ భూముల దోపిడీకి పాల్పడ్డారన్నారు. రాజధానిపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా వ్యవహరించారని మండిపడ్డారు. 2013 చట్టంలోనే భూసమీకరణకు అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టారని, ప్రభుత్వాలు ఇంత అధర్మంగా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. మిగతావారిని దారి మళ్లించి తాము ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో భూములు కొన్నారని తెలిపారు. తొలుత అతి చౌకగా జిరాయితీ భూములు కొన్నారని, ఆ తర్వాత జీవో 1 విడుదల చేసి అన్ని కేటగిరీల భూములకు భూ సమీకరణ ప్యాకేజీని పేర్కొంటూ అసైన్డ్ భూముల దగ్గర మాత్రం ఖాళీగా వదిలేశారని తెలిపారు. వాటికి రిజిస్ట్రేషన్ జరగదని తెలిసి కూడా వారిని కార్యాలయాలకు రప్పించి రిజిస్ట్రేషన్లను తిరస్కరించేలా చేశారని చెప్పారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ రాదంటూ మూడు మండలాల్లోని అసైన్డ్ రైతులను భయపెట్టి బాబు బృందం దక్కించుకుందన్నారు. ఆ భూములకు లభించే కౌలు, వన్‌టైమ్ బెనిఫిట్‌ను తమకు అందేలా చంద్రబాబు మనుషులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి నారాయణ కాలేజీకి సైతం డబ్బులు జమ అయ్యాయని, పేద రైతులను మాయచేసి దోపిడీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు తమ చేతికి వచ్చిన తర్వాత వాటికి జీవో 1 వర్తించదు కాబట్టి ఏడాది తరువాత తాపీగా జీఓ 41 తీసుకువచ్చారని చెప్పారు. అసైన్డ్ రైతులను భయపెట్టేందుకే ఆ జీఓను ఒక సంవత్సరం పాటు ఆపారని తెలిపారు. రెవెన్యూ శాఖ ఇవ్వాల్సిన జీవోను మున్సిపల్ శాఖ ఇచ్చేసింది అసైన్డ్ భూములకు సంబంధించిన జీవోను రెవెన్యూ శాఖ ఇవ్వాల్సి ఉండగా మున్సిపల్ పరిపాలన శాఖ ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. పేదల భూములను బోగస్ వ్యక్తుల పరం చేయటాన్ని అధికారులంతా వ్యతిరేకించినా గత సర్కారు లెక్కచేయలేదన్నారు. మూడు మండలాల్లో అసైన్డ్ రికార్డులను సైతం మాయం చేశారని తెలిపారు. ప్రస్తుతం భూములు ఎవరి వద్ద ఉన్నాయో వారికే హక్కులు ఇద్దామంటూ తహశీల్దార్ల ద్వారా ప్రతిపాదించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు తమ మనుషులను ప్రవేశపెట్టారని చెప్పారు. పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా, రెవెన్యూ శాఖకు తెలియకుండా మాజీ మంత్రి నారాయణ ఇవన్నీ చేశారన్నారు. జీవో వచ్చిన 22 రోజుల తర్వాత నాటి సీఎం దీన్ని అంగీకరించారని, చట్టానికి వ్యతిరేకంగా ఈ జీవో జారీ అయిందన్నారు. ప్రజల క్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున దోపిడీ చేస్తుంటే దాని పట్ల విశ్వాసం ఏముంటుందని ప్రశ్నించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అనుకూలంగా ఇవ్వలేదని ఆయన్ను తీసేశారని, న్యాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ అందరూ వ్యతిరేకించినా దోపిడీని కొనసాగించారని తెలిపారు. ఇంత అడ్డగోలుగా వచ్చిన భూమి ప్లాట్లను కోర్ క్యాపిటల్‌లోని సచివాలయం, గవర్నర్ బంగ్లా, అసెంబ్లీ ఉన్నచోట ఇచ్చారని, ఇది ఎంత ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పొట్టగొట్టి గొడవలా? అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు తెలిశాయని, ఇన్ని ఘోరాలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు తాను అవినీతిపరుడిని కాదని ఎలా చెప్పుకుంటారని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయేలా ఇవన్నీ చేశారన్నారు. పోయిన విశ్వాసాన్ని మళ్లీ కల్పించేందుకు ఇప్పుడు సీఎం జగన్ 50 వేల మందికి అక్కడే ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. రాజధాని రైతుల పొట్ట గొట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తాము రైతులమంటూ గొడవలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ సరి చేయడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని, ఒక ప్రభుత్వం తప్పు చేసి వ్యవస్థపై విశ్వాసాన్ని పోగొడితే మళ్లీ ఆ విశ్వాసాన్ని నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. హెరిటేజ్, నారాయణ కోసం ఇన్నర్ ప్లాన్ మార్చారు: ఎమ్మెల్యే పేర్ని నాని రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో తనకు సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టాలో ఇన్నర్ రింగు రోడ్డు ఒకటి. దోపిడీ దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగింది. మొదట ఇది మంత్రివర్గ నిర్ణయమని చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేలా, హెరిటేజ్ సంస్థ, నారాయణ కాలేజీల కోసం అలైన్మెంట్ ప్లాన్ మార్చారు. ఐఆర్ఆర్తో తనకేం సంబంధం అంటున్న ఏ–14 నారా లోకే‹శ్ 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు. ఆ తీర్మానంపై లోకేష్ సంతకం చేశారు. దళితులు, పేదల నుంచి చంద్రబాబు, నారాయణ అసైన్డ్ భూములను లాక్కున్నారు. కేసులు ఎక్కువ నమోదైన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారు? యువతను రెచ్చగొట్టి ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371 కోట్లు టిప్ అని అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు? ఇన్నర్ రింగ్ రోడ్డును అటూ ఇటూ తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే తన కరకట్ట ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని హైకోర్టులో చెప్పారు. బాబుకు సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేనికి అద్దె కింద రూ.27 లక్షలు ఇచ్చామని భువనేశ్వరి చెబుతున్నారు. నిజంగానే అధికారికంగా ఇచ్చి ఉంటే అద్దె ఎందుకు చెల్లించారు? ఐటీ రిటరŠన్స్లో ఈ వివరాలను వెల్లడించారా? రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు ఎందుకు మాట్లాడడం లేదు? రాజధానిపై నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. భూసమీకరణకు ఒప్పుకోని వారిని ఏ–2 నారాయణ, ఏ–14 లోకేష్ బెదిరించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టారు. ఎకరం భూమిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే రాయించుకున్నారు. అసైన్డ్ రైతులను దగా చేసిన ఇలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. సమగ్ర విచారణ జరగాలి: వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలి. రాజధానిని ప్రకటించకముందే లింగమనేని రమేష్ 355 ఎకరాలను కొనేశారు. పేదలను మోసం చేసి కంతేరు వద్ద భూముల్ని హెరిటేజ్ కొనడం ఏమిటి? ఢిల్లీ కోటను ఢీకొన్న జగన్ కళ్లల్లో భయం చూపిస్తానని లోకే‹శ్ అంటున్నారు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జగన్ ఎక్కడ? ఆయనకు ఉన్న 175 మంది సైనికుల్లో ఒకరి చేతుల్లో ఓడిపోయిన లోకే‹శ్ఎక్కడ? మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు: ఆదిమూలపు సురేష్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజధాని పేరుతో ప్రజలను మోసం చేసిన మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు. ఇన్నర్ రింగు రోడ్డు అనకొండలా మలుపులు తిరుగుతూ కొందరు వ్యక్తుల పొలాల దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో చేయని మోసం అంటూ ఏదీ లేదు. టెండర్లు పిలవకుండా నచ్చిన వాళ్లకు నామినేషన్ల విధానంలో పనులు అప్పగించారు. ముగ్గురు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ను మార్చారు. గ్రాఫిక్స్‌తో అమరావతిని అంతర్జాతీయ నగరం అని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది అంతర్జాతీయ స్కామ్ అయింది. ఈ స్కామ్‌కి డైరెక్షన్ చంద్రబాబుది అయితే పర్యవేక్షణ లోకేశ్, నాటి మంత్రులు, ఇతరులది. అమరావతిలో దళిత, పేద రైతుల్ని నిలువునా ముంచారు. నవ నగరాలు, ఐకానిక్ బ్రిడ్జి లాంటివన్నీ బూటకం. ఇన్నర్ రింగురోడ్డు గురించి కాగ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ల విధానంలో సుర్బానా, జురాంగ్ కంపెనీలకు ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించి రూ. 28 కోట్లు రూల్స్‌కి విరుద్ధంగా చెల్లించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఇన్నర్ రింగు రోడ్డులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న వారు ఈ డబ్బు గురించి సమాధానం చెప్పాలి. ఎస్టీయూపీ అనే కంపెనీకి మాస్టర్‌ప్లాన్ తయారీకి రూ.5 కోట్లు ఇచ్చారు. ఇవి డబ్బులు కాదా? రింగురోడ్డు తుది అలైన్‌మెంట్‌ను లింగమనేని, హెరిటేజ్ భూముల గుండా మార్చారు. హెరిటేజ్ భూములు కాజ, కంతేరు, చినకాకాని వద్ద ఉండడంతో రింగురోడ్డు అటు వెళ్లింది. అలైన్మెంట్ మార్పు చేసి తనకు సహాయం చేసినందుకే లింగమనేని రమేష్ ప్రతిఫలంగా చంద్రబాబుకి కరకట్ట నివాసాన్ని ఇచ్చారు. క్విడ్ప్రోకు ఇది తిరుగులేని ఉదాహరణ. నారాయణ తన వద్ద పనిచేసిన ఉద్యోగి పేరు మీద భూమిని కొని తర్వాత తన పేరిట మార్చుకున్నారు. అడ్డంగా దొరికిన అవినీతిపరులను వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో చట్టం ముందు నిలబెడుతున్నాం. చంద్రబాబు, లోకే‹శ్ను చట్ట ప్రకారం శిక్షించాలి. -
అమరావతి భూములను నొక్కేసిన టక్కరిదొంగ చంద్రబాబు: మంత్రి సురేష్
-
అమరావతిలోని అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు: మంత్రి సురేష్
-
అమరావతి భూములను నొక్కేసిన టక్కరిదొంగ చంద్రబాబు: మంత్రి సురేష్
-
పవన్, లోకేష్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్
-
‘ఆ ముసుగు తొలగింది.. పవన్ అసలు స్వరూపం ఇదే’
సాక్షి, ప్రకాశం జిల్లా: టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఈ రోజు పొడిచింది కాదని, మేము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడని సీఎం జగన్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారని, టీడీపీ ముసుగు కప్పుకొన్న పవన్... ముసుగు తొలగించాడన్నారు. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న పవన్ కల్యాణ్ అసలు స్వరూపం ఏమిటనేది మేము ముందు నుంచే చెబుతున్నాం’’ అని మంత్రి అన్నారు. ‘‘టీడీపీ, జనసేన ఇంకా ఏ పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ నాయకత్వంలో మేము సింగల్ గానే పోటీ చేస్తాం. ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా ఏ శక్తి కూడా ఆపలేదు. పవన్ కళ్యాణ్‌కు ఒక జెండా, అజెండా ఏమి లేదు... ఇప్పుడు అతని అజెండా టీడీపీని గట్టేక్కించటమే’’ అని మంత్రి దుయ్యబట్టారు. ‘‘అవినీతి పరుడని చంద్రబాబును కోర్టు జైలుకు పంపితే అటువంటి వ్యక్తికి నేను మద్దతు పలుకుతున్నానని పవన్ చెప్పటం హాస్యాస్పదం. మునిగిపోతున్న టీడీపీ పడవను నేను గట్టెక్కిస్తానని టీడీపీతో పాటు తాను మునిగిపోతూ.. తనను నమ్ముకున్న జనసైనికులను కూడా నిలువునా ముంచుతున్నాడు. పవన్ అసలు స్వరూపం ప్రజలకు ఎప్పటినుంచో తెలుసు. కాకపోతే నిన్ను నమ్ముకుని భ్రమలో ఉన్న నీ జన సైనికులకే నీ అజెండా ఏమిటో చెప్పుకో. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో.. కనీసం ఎమ్మెల్యేగా ముందు నువ్వు గెలుస్తావో లేదో చెప్పగలవా? పవన్’’ అంటూ మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు. చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా? -
నిరుద్యోగుల నోటి కుడు లాక్కున్నాడు..
-
పురంధేశ్వరి బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా?: తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు నాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ దుర్ధేశం, కుట్రలు లేవని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పినా బాబు మాట వినలేదని అన్నారు. ఆయన ఎందుకు నిరాకరించారో అందరకీ ఇప్పుడు అర్థం అవుతుందన్నారు. ‘స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో జరిగిన స్కామ్‌ను మొదట గుర్తించింది 2017లో అంటే గత ప్రభుత్వంలోనే. ప్రతిపక్షాలుఅనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల వల్ల జరిగింది. రాజకీయ కుట్రలు చేసేది టీడీపీనే అందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని ఆయనకు తెaiసు కాబట్టే గత మూడు రోజులుగా సానుభూతి కోసం పాకులాడారు. పురందేశ్వరి అరెస్ట్‌లను ఏ విధంగా ఖండిస్తారో సమాధానం చెప్పాలి. పురందేశ్వరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? అమిత్ షా పై రాళ్లు వేయించిన.. మోదీని తిట్టించిన వారిని ఆమె సమర్థిస్తుందా..? పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా..? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా..? ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా..? సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లు మాట్లాడని పవన్ .. ఈ రోజు ముందుకొచ్చారు.. అంటే ఈ స్కాంలో పవన్‌కు అందుతున్న ప్యాకేజీ ఎంత?’ అని మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదు.. అనివార్యం: మంత్రి అంబటి అధికారం చేపట్టిన రెండు నెలలకే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఆర్థిక నేరం చేయడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారం విస్మయం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, మొత్తం కేబినెట్‌ను తప్పుదోవ పెట్టి 3 వందల కోట్లు కాజేశారని అభియోగాలు రుజువు కావడంతో అరెస్టు జరిగిందన్నారు. అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో కేబినెట్‌ను పక్కదోవ పట్టించారని తెలిపారు. పాలన అంటే పారదర్శకంగా ఉండాలని.. అన్ని అధికారాలను ఓవరూల్డ్ చేసి ఈ సెల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని స్పీకర్ తెలిపారు. సీమెన్స్ నుంచి ఒక్క పైసా కూడా రాకుండా 371 కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. ఆర్థిక అధికారులు కొర్రి పెడితే చంద్రబాబు స్వయంగా వెంటనే విడుదల చేయాలని అప్పట్లో ఆదేశించారని గుర్తు చేశారు. చదవండి: ‘చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా కనిపించడం దౌర్భాగ్యం’ లూటీ చేయటంలో నైపుణ్యం: ఆదిమూలపు సురేష్ చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడని విమర్శించారు. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్లనిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేయటంలో నైపుణ్యం చూపించాడని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే అన్ని ఆధారాలు బయటపెట్టి ఇందులో ప్రమేయం ఉన్న కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 18 కేసుల్లో స్టే చంద్రబాబు తప్పుడు దారిలో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కోట్లు దోచుకున్నారు. తప్పు చేశారు కనుకే తలదించుకుని సీఐడీ వెంట వెళ్ళారు. ఇప్పటి కే చంద్రబాబు 18కేసులకు స్టే తెచ్చుకున్నారు. రాష్ట్రాని కాపాడుకుంటానని యాత్రలు చేసే చంద్రబాబు రాష్ట్రాని దోచ్చుకున్నారు. ఇప్పుటికే చేలా కేసులు చంద్రబాబు పై సిద్దంగా ఉన్నాయి. ఆయన అనేక సార్లు అరెస్టు చేయాల్సి ఉంటుంది. యువగళంలో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది. రాజధాని భూముల కేసులో కూడ చంద్రబాబు అరెస్టు అవుతారు. -ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్ ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం చంద్రబాబు నాయుడు 2014 అధికారం చేపట్టిన వెంటనే అక్రమాలకు, అవినీతికి శ్రీకారం చుట్టారు. అన్ని రకాలుగా అవినీతి అక్రమాలలో దొరికిపోయాడు. సిల్క్ డెవలప్మెంట్ సంబందించి 371 కోట్ల రూపాయలకు స్కామ్ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ జరుగుతుండగా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు ఎటువంటి తప్పుచేసినా పవన్ ప్రశ్నించడు. ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేస్తారా అని వింత ప్రశ్న వేస్తున్నాడు. అవినీతి, అక్రమాలలో పవన్‌కు భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడుని ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసినందుకు విచారిస్తున్నాం. -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్కాం చేయలేదని బాబు చెప్పడం లేదు చంద్రబాబు అరెస్టులో ఎలాంటి కక్షసాధింపు లేదు. చంద్రబాబు అరెస్టుతో వైసీపికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువతకు నమ్మబలికి స్కాం చేశారు. ఒక కంపెనీతో ఒప్పందం, మరో కంపెనీకి నిధులు నిచ్చారు. రూ.371 కోట్లను కొల్లగొట్టారు. ఈ కేసులో ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురూ తామువతీసుకున్న డబ్బంతా చంద్రబాబుకు పంపామని చెప్పారు. అంటే స్కాంలో అసలు సూత్రధారి చంద్రబాబే. తాను స్కాం చేయలేదని చంద్రబాబు కూడా చెప్పటంలేదు. అంటే భారీగా కుంభకోణం జరిగినట్టు ఆయన కూడా నిర్ధారించారు. ఈ స్కాంలో డబ్బంతా చంద్రబాబుకు వచ్చేసింది. నిజంగా చంద్రబాబు నిప్పు ఐతే ఇన్ని స్కాంలు ఎలా చేశారు? ఎల్లోమీడియాని అడ్డం పెట్టుకుని నిజాలను అబద్దాలుగా మార్చలేరు. కక్షసాధింపు ఐతే ఎన్నికలకు ముందు ఎందుకు అరెస్టు చేస్తాం?. ఇప్పుడు అరెస్టు చేయగానే టీడీపీ తెగ హడావుడి చేస్తోంది. కోర్టులో బెయిల్ వస్తే ఒకరకంగా, రాకపోతే ఇంకోరకంగా డ్రామాలు చేయటానికి చంద్రబాబు ప్లాన్ వేశారు. అమరావతి కేసులు, టిట్కో ఇళ్లు, రింగురోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులు కూడా విచారణ జరుగుతాయి. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి ఇంతకాలం చంద్రబాబు కథ నడిపించారు. ఇకమీదట అలా నడవదు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు - ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ -
ఎల్లో మీడియా నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: గురువులు కన్నా గూగుల్ మేలని తాను అనలేదని, తాను అలా అన్నట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా దానిని వక్రీకరించి ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఉపాధ్యాయుడిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడింది వినిపించలేదా.. అని ప్రశ్నించారు. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అనే ఉద్దేశంలో తాను మాట్లాడినట్టు తెలిపారు. టెక్నాలజీ పెరిగిపోయి మారిన కాలానికి అనువుగా సమాచారాన్ని గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నానన్నారు. గూగుల్‌ను సృష్టించింది కూడా గురువులే కదా.. అని ఆయన ప్రశ్నించారు. తాను గురువులను కించపరిచేలా మాట్లాడలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం పైన, తనపైన.. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా తనపై ఎల్లో మీడియా బురద జల్లుతోందని, దీనిని నమ్మొద్దని ఉపాధ్యాయులను కోరారు. అనని మాటలను వక్రీకరించి పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదని మంత్రి సురేష్ హితవు పలికారు. చదవండి: ఐటీ నోటీసులు: అరెస్టు.. పదేళ్ల జైలు! -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
దళితుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు : ఆదిమూలపు, పిన్నెల్లి
-
ఆ కేసులు మాఫీ చేసేందుకు సీఎం జగన్ అంగీకారం: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ: స్వరాజ్య మైదానంలో డా. బిఆర్.అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అతి త్వరలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు ఏర్పాటయ్యే స్మృతి వనంలో అనేక వసతులు కల్పిస్తున్నామని, 100 సీట్లతో ఏసీ థియేటర్, మ్యూజియం, లైబ్రరీ, నీటి కొలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దళితులకు సీఎం జగన్ పాలనపై ఎంతో నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన సమయంలో కేసులు పెట్టించాడు. ఎస్సీలపై కేసులు పెట్టించిన చంద్రబాబును ఎలా నమ్మాలి అంటూ మంత్రి సురేష్ దుయ్యబట్టారు. చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’ ‘‘వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరాం. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చాం. గరగపర్రు, లక్ష్మీపురం వంటి ఘటనల్లో ఎస్సీల పై పెట్టిన కేసులను ఎత్తేయాలని కోరాం. కేసులు మాఫీ చేసేందుకు సీఎం అంగీకరించారు. మాదిగలంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు’’ అని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు. -
విశాఖలో మోడరన్ ట్రామ్ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ప్రతిపాదించిన మెట్రో లైట్ (మోడరన్ ట్రామ్) ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మంత్రి బుధవారం మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు డీపీఆర్‌ను మరింత మెరుగ్గా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ అధునాతన ట్రామ్ ప్రాజెక్టును మెట్రో రైలు సిస్టంకు అనుసంధానంగా నగరం నలు దిక్కులా నాలుగు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 60.05 కిలోమీటర్ల పరిధిలో 58 స్టేషన్లతో రూ.5,332 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి వివరించారు. ప్రజా అవసరాలు, డిమాండ్ తదితర ప్రాధాన్యతలకు అనుగుణంగా ఒక్కొక్క కారిడార్‌కు తగిన ఆర్థిక నమూనా (ఫైనాన్షియల్ మోడల్)లో అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పురపాలక, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్‌లు వై.శ్రీలక్ష్మి , ఎస్ఎస్ రావత్, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ నెలాఖరుకు వెలిగొండ పూర్తి
పెద్దదోర్నాల /శ్రీశైలం టెంపుల్: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ నెలాఖరుకి నిర్మాణం పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి కొల్లంవాగు వద్ద, మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న సొరంగం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు పుష్కలంగా జలాలు వస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లోని 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగు నీరు అందుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో స్టేజ్–1 కింద 1.20 లక్షల ఎకరాలకు, స్టేజ్–2 కింద 2.55 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. సుంకేశుల నుంచి తీగలేరు కెనాల్‌కు నీరు తరలించడం ద్వారా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మరో కిలోమీటరు మేర పనులు జరగాల్సి ఉందన్నారు. ఈ పనులన్నీ మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించిన తర్వాతే నల్లమల సాగర్‌లో దశల వారీగా నీటిని నింపుతామని చెప్పారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన పూర్తి చేస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత త్వరలో నల్లమల సాగర్‌ను నింపి ప్రజలకు నీరందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోప్రయాణించిన మంత్రులు మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్ వెలిగొండ సొరంగంలో సాహస యాత్ర చేశారు. కొల్లంవాగు నుంచి మండల పరిధిలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పనులు జరుగుతున్న కొత్తూరు వరకు దాదాపు 19 కిలోమీటర్లు సొరంగ మార్గంలోనే ప్రయాణించారు. మంగళవారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రులు రోప్‌వే ద్వారా పాతాళగంగకు చేరుకున్నారు. అనంతరం బోట్లో కృష్ణా నదిలో ప్రయాణించి కొల్లంవాగుకు చేరుకున్నారు. అక్కడ హెడ్ రెగ్యులేటర్, ఇతర పనులను పరిశీలించారు. అక్కడి నుంచి బొలెరో వాహనాల్లో మొదటి సొరంగం గుండా 13 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం 6 కిలోమీటర్లు రెండో సొరంగం గుండా ప్రయాణించి కొత్తూరు చేరుకున్నారు. గాలి కూడా ఉండని ఇరుకు సొరంగ మార్గాల గుండా మంత్రులు ప్రయాణించటం సాహసమేనని పలువురు అధికారులు పేర్కొన్నారు. మంత్రుల వెంట మంత్రి సురేష్ తనయుడు విశాల్, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ మురళీనాథ్‌రెడ్డి ఉన్నారు. -
టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారు
-
Fact Check: టిడ్కో ఇళ్లపై పచ్చ పైత్యం!
సాక్షి, అమరావతి: పట్టణ నిరుపేదలు ఇళ్లు పొందాలంటే నిర్ణీత మొత్తం చెల్లించాలని షరతు విధించి టిడ్కో లబ్ధిదారులపై బ్యాంకు రుణాల భారాన్ని మోపిన చంద్రబాబు ఏ ఒక్కరికీ సొంత గూడు కల్పించిన దాఖలాలు లేవు. ప్రచార ఆర్భాటం మినహా ఏ ఒక్కటీ పూర్తి చేయలేదు. పేదల కనీస అవసరాల పట్ల అంత దారుణంగా వ్యవహరించినా ఎల్లో మీడియా నాడు ప్రశ్నించిన పాపాన పోలేదు! ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లను తీర్చిదిద్ది పేదలకు అప్పగిస్తుంటే బరి తెగింపు రాతలకు తెగబడుతోంది! నాడు గత ప్రభుత్వంలో లబ్ధిదారుల పేరిట బ్యాంకు రుణాలను తీసుకున్నారు. ఇందులో 300 చ.అ. విస్తీర్ణం లబ్ధిదారులు 7,510 మందికి రూ.95 కోట్లు, 365, 430 చ.అ. యూనిట్ల లబ్ధిదారులు 5,058 మందికి మరో రూ.87 కోట్లు చొప్పున మొత్తం రూ.182 కోట్లు తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎన్పీఏగా మారింది చంద్రబాబు సర్కారు హయాంలోనే కావడం గమనార్హం. నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,43,600 మంది 300 చ.అ. లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే అందిస్తోంది. మరో 65,671 మంది (365, 430 చ.అ.) లబ్ధిదారులకు రూ.1,778 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. టీడీపీ సర్కారు ఎన్పీఏగా మార్చిన 300 చ.అ లబ్ధిదారుల రుణాలు రూ.110 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021, 2022లో చెల్లించింది. 365, 430 చ.అ. లబ్ధిదారుల పేరిట గత ప్రభుత్వం తీసుకున్న బ్యాంకు రుణాలపై రూ.40 కోట్ల వడ్డీని లబ్ధిదారుల తరఫున ఏపీ టిడ్కో చెల్లించింది. దీంతో పాటు చంద్రబాబు జమానాలో రుణాలు తీసుకున్న 5,058 మంది 365, 430 చ.అ. లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇళ్లను ఇచ్చారు. దీంతో గత ప్రభుత్వంలో ఎన్పీఏగా మారినవారి సంఖ్య 3,058కి తగ్గింది. నాడు గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరికీ ఇళ్లను కేటాయించలేదు. నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 65,671 మంది 365, 430 చ.అ. యూనిట్ల లబ్ధిదారుల్లో 31,558 మందికి ఇళ్లను అప్పగించడంతో వారెవరూ ఎన్పీఏలుగా మారలేదు. బ్యాంకు రుణాలు తీసుకున్న మరో 33,752 మందికి ఇళ్లను ఆగస్టు నాటికి అందజేయాలని నిర్ణయించారు. అంటే వారు కూడా ఎన్పీఏ పరిధిలో లేరు. ఫేజ్–2 టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో 361 మంది మాత్రమే నవంబర్ నాటికి రూ.12.65 కోట్ల మేర ఎన్పీఏగా మారనున్నట్లు అంచనా. వీరికి డిసెంబర్లో ఇళ్లను ఇవ్వనున్నారు. అంటే కేవలం ఒక్క నెల మాత్రమే ఎన్పీఏగా మారే అవకాశం ఉంది. అయితే ఆ భారం లబ్ధిదారులపై పడకుండా ప్రభుత్వమే చెల్లించనుంది. తప్పుడు కథనాలు.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను పట్టణ పేదలకు అందిస్తోంది. ఇందులో 300 చ.అడుగుల్లో నిర్మించిన 1.43 లక్షల ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే ఇస్తున్నాం. వీటిపై ఎలాంటి రుణం తీసుకోలేదు. మిగిలిన 1.19 లక్షల ఇళ్లల్లో 60 వేల యూనిట్ల నిర్మాణం పూర్తైంది. వీటిని త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం. మిగిలిన ఇళ్ల విషయంలో కూడా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏ కేటగిరిలోనూ ఇళ్ల లబ్ధిదారులపై భారం ఉండదు. ఎల్లో మీడియా పనిగట్టుకొని తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల్లో అయోమయం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ నిర్లక్ష్యం, తప్పిదాలను కూడా ప్రచురించాలి. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మంత్రి -
దళితుల సంక్షేమం, సాధికారతపై చర్చకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి, రాజకీయ సాధికారతకు నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో.., అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వేదిక, సమయం మీరే చెప్పండి. మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు’ అని తేల్చిచెప్పారు. దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రావాలని సూచించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవహేళన చేసిన చంద్రబాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నాయుడిని చెప్పుతో కొట్టి మాట్లాడాలని హితవు పలి కారు. దళితులను చంద్రబాబు అడగడుగునా అవమానిస్తే.. సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి సురేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే అసలు దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే. ఇప్పటికిప్పుడు కులాల సమావేశాలను చంద్రబాబు నిర్వహించడానికి ప్రధాన కారణం ఎన్నికలే. వాడుకొని వదిలేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దళిత ద్రోహులంతా నేడు సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: Instagram Reels: రీల్స్ మోజులో బావిపైకి ఎక్కి... వైఎస్ జగన్ వచ్చాకే డప్పు కళాకారులు, చర్మకారులకు న్యాయం 2019 జనవరి.. అంటే.. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నెలకు రూ.1500 చొప్పున డప్పు కళాకారులకు పింఛన్ ఇచ్చారు. అది కూడా 6,600 మందికి మాత్రమే మూడు నెలలే ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను సీఎం జగన్ రూ.3000కు పెంచారు. 2019–20లో 31 వేల మంది ,2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి పింఛన్ అందిస్తున్నాం. టీడీపీ హయాంలో మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే.. మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు డప్పు కళాకారులకు పింఛన్‌గా ఇస్తున్నాం. చర్మకారులకు పింఛన్‌ను చంద్రబాబు 2018 నవంబర్‌లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6 వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్ 191 ఇచ్చారు. ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు ముందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్ రూ. 2 వేలు చేశాం. 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మందికి, 2021–22లో 35 వేల మందికి, 2022–23లో 40 వేల మందికి, 2023–24లో 41 వేల మందికి ఇస్తున్నాం. ప్రస్తుతం చర్మకారులు రూ. 2,750 పింఛన్ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3 వేలు అవుతుంది. ఇప్పటి వరకు డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్ కోసం ఇచ్చాం. అంటే.. టీడీపీ ఇచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువ ఇచ్చాం. దళితులకు రాజకీయ సాధికారత వైఎస్ జగన్‌తోనే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని ఎస్పీ కమిషన్ మెంబర్లుగా నియమించారు. నాలుగు మున్సిపాలిటీలకు చైర్పర్సన్లుగా మాదిగలకు అవకాశవిుచ్చారు. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ పదవి క్రిస్టినాకు ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్పర్సన్లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇచ్చారు. మరో ఇద్దరు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జెడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్ వైస్ చైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే. హెచ్ఆర్సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించారు. మంత్రివర్గంలో నాతో పాటు తానేటి వనితను ఎంపిక చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, బొమ్మి ఇజ్రాయేల్‌లను నియామకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్‌గారిదే. అవకాశం ఉన్న ప్రతి చోటా దళితులకు ఇవ్వాలనే తపన వైఎస్ జగన్‌ది. దామాషాకు మించి.. దళితులకు వాటా 28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా నేరుగా పేదల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. వీటిలో దళితుల వాటా పెద్దది. ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని అనుకుంటుంటే చంద్రబాబుకి నచ్చడంలేదు. ఆయన మాటలను మాదిగలెవరూ నమ్మరు. ఈ పచ్చ తోడేళ్ల గుంపులో దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దని మంత్రి సురేష్ చెప్పారు. చదవండి: డిగ్రీ చేస్తే జాక్‌పాట్.. ఐటీ కంపెనీల క్యూ.. -
పేదల సొంతింటి కలను కలగానే మిగిల్చిన చంద్రబాబు
-
ఈ-ఆటోలతో ఆర్థిక భారం తగ్గుతుంది: ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఈ-ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశాం. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టాం. కోటి 20 లక్షల డస్ట్బిన్లను అందించాం. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. మురుగు నీటిని శుద్ది చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సాకారం అవుతుంది. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాం.. కానీ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. పేదలకు ఇళ్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యం’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చదవండి: CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు -
అంకెల గారడీతో అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో వేల కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ఎల్లో మీడియా అంకెలను వక్రీకరిస్తూ, అసత్య కథనాలతో ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీఎఫ్ఎంఎస్కు వచ్చిన బిల్లును విడుదల చేస్తున్నామని చెప్పారు. పురపాలక సంస్థల్లో చేపట్టిన 2,760 పనులకు రూ.510.46 కోట్లు చెల్లించామన్నారు. పలాస – కాశీబుగ్గ, తాడిగడప, సాలూరు, గుంటూరు, జంగారెడ్డిగూడెం, పిడుగురాళ్ల, ఎర్రగుంట్లలో మొత్తం 269 పనులకు రూ.32.55 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. తాడేపల్లి–మంగళగిరి మున్సిపల్ కార్పొషన్‌లో ఫేజ్ 1, ఫేజ్–2 జనరల్ ఫండ్స్ బిల్లులు, 14, 15 ఆరి్థక సంఘం నిధులుతో చేపట్టిన పనులకు రూ. 37.06 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేదన్నారు. బిల్లుల జాప్యంతో అభివృద్ధి నిలిచిపోతోందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 123 పట్టణాలకుగాను ఏడింటిలో పనులు, బిల్లులనే ప్రస్తావించారని, అంటే మిగిలిన వాటిలో అభివృద్ధి జరుగుతోందనే అర్థమని చెప్పారు. పనులు చేసేందుకు చిన్న కాంట్రాక్టర్లు ముందుకు రానందునే చిన్న పనులను ఒక ప్యాకేజీగా మార్చి పెద్ద కాంట్రాక్టరుకు ఇచ్చేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సాలూరులో 12 పనులకు రూ.15 లక్షల బిల్లులు ఉన్నాయని, అంటే ఒక పనికి రూ.లక్ష వరకు ఉంటుందని, దీనిని కూడా భూతద్దంలో చూపించడం దుర్మార్గమని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమృత్ 1.0లో ఇప్పటికే రూ.3,500 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, అమృత్ 2.0లో రూ. 5 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్టు వివరించారు. పన్నులు సకాలంలో చెల్లించని వారిపై వడ్డీల భారం పెరుగుతోందని, దానిని కూడా ప్రభుత్వం మినహాయించిందని, ఇందుకోసం రూ.3 వేల కోట్లు వడ్డీ భారాన్ని మోస్తోందని తెలిపారు. కాంట్రాక్టర్లు సంతృప్తితో ఉన్నారు బిల్లుల చెల్లింపుపై కాంట్రాక్టర్లు సంతృప్తితో ఉన్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి చెప్పారు. పట్టణాల్లో సాధారణ పనులకే కాకుండా.. 528 అర్బన్ హెల్త్ సెంటర్ల పనులకు కూడా రూ.187 కోట్లు చెల్లించామన్నారు. యూజర్ చార్జీలు ఇవ్వడానికి ప్రజలు ముందుకొస్తుంటే మీడియాకు ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. చదవండి: Fact Check : పేదల ఇళ్లపై పిచ్చి రాతలు.. బాబు కొంప కొల్లేరవుతుందనే! -
‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’
సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. CFMS ప్రకారం చెల్లించడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందన్నారు మంత్రి. టీడీపీ ప్రభుత్వ హయాంలో CFMS విధానం తీసుకొచ్చారన్నారు. ‘స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ద్వారా 2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. పన్నుల విధానంలో సంస్కరణలతో మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగింది. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం పనులు చేపడుతోంది. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో గత సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పై చర్చ జరిగింది. జీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలకి పవర్ పాయింట్ ద్వారా వివరించాం. పాత పెన్షన్ వల్ల కలిగే నష్టాలు...జిపిఎస్ ఉపయోగాలు వివరించాం. ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ సమావేశంలో కూడా కీలక అంశాలపై చర్చ జరగనుంది’ అని పేర్కొన్నారు. -
పేదవాడి సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు : మంత్రి సురేష్
-
అట్టహాసంగా టిడ్కో గృహ ప్రవేశాలు
పొన్నూరు(చేబ్రోలు)/నరసరావుపేట : పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో బుధవారం టిడ్కో గృహ సముదాయాల ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 21 ఎకరాల్లో నిర్మించిన 2,368 టిడ్కో గృహాల్లో మొదటి విడతగా 1,660 గృహాలను మంత్రి ప్రారంభించారు. అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో మొదటి దశలో భాగంగా నిర్మించిన 500 టిడ్కో గృహాలనూ మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడుబ్రోలులో జరిగిన సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ పొన్నూరులో రూ.177 కోట్లతో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయంతో ఇక్కడ సుమారు 12 నుంచి 15 వేల జనాభాతో జగనన్న టౌన్ షిప్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ పేదలకు లక్షల విలువ చేసే సొంతింటిని అందించిన సీఎం జగన్.. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి లబ్దిదారులు క్షీరాభిõÙకం చేశారు. టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో టిడ్కో గృహాల మీద ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు మహిళలు పాలాభిషేకం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం చేపట్టామని.. అందులో ఈ రోజు 500 గృహ ప్రవేశాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు గతంలో డిపాజిట్ చేసిన నగదులో రూ.25 వేలు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
పార్కు, హెల్త్ సెంటర్, రోడ్లు, లైట్లను ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు
-
తాడేపల్లిలో వైఎస్ఆర్ సీపీ ఎస్సీ ముఖ్య నేతల సమావేశం
-
బాబు కుట్ర బట్టబయలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు చేసిన కుట్రలు, అకృత్యాలు బట్టబయలయ్యాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న దళితులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల దాడిచేసి అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టడంతో నియోజకవర్గంలోని సీనియర్ నాయకుడు, చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన డాక్టర్ మన్నే రవీంద్ర, అతని అనుచరులే రోడ్డుపక్కన నక్కి, దాక్కొని దళితులపై రాళ్లతో దాడిచేశారు. అదికూడా యర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిపక్కనే నక్కి మరీ రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఫొటోలు, వీడియోలు శనివారం బయటపడ్డాయి. ఆధారాలతో సహా వెలుగుచూడడంతో టీడీపీ నేతలతోపాటు ఆ పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. వారితో రాళ్ల దాడి చేయించడమే కాక.. ఆ పని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలదేనని స్వయానా చంద్రబాబు ప్రకటించడంతో వారి పరిస్థితి నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఇక పచ్చ మీడియా అయితే రెచ్చిపోయి ఇదంతా అధికార వైఎస్సార్సీపీ వాళ్ల పనేనని ప్రముఖంగా ప్రచురించాయి. దొంగే దొంగ.. దొంగ అన్నట్లు.. కుట్రలు పన్నడం.. వాటిని పక్క పార్టీ వాళ్ల మీదకు నెట్టడం ఇదీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. యర్రగొండపాలెంలో జరిగింది ఇదే. చంద్రబాబు మూడోరోజు పర్యటన సందర్భంగా శుక్రవారం యర్రగొండపాలెం వచ్చారు. ఈ సందర్భంగా.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆ వర్గం వారు పెద్దఎత్తున శాంతియుత నిరసనకు దిగారు. రోడ్డు పక్కన నిలబడి నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలు, ప్లకార్డులు, నల్ల బెలూన్లతో ప్రశాంతంగా నిరసన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని మంత్రి సురేష్ ఒకరోజు ముందే మీడియా సమక్షంలో కూడా వెల్లడించారు. చెప్పినట్లుగానే మంత్రి సురేష్ నిరసనలో పాల్గొని దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి దళిత రిజర్వు నియోజకవర్గంలోకి ఏ విధంగా వస్తావు అంటూ చంద్రబాబును నిలదీశారు. దీంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే.. తన కారులోంచి బయటకు వచ్చి నిరసనకారుల వైపు వేలు చూపించి మరీ భయపెడుతూ రెచ్చగొట్టారు. అలాగే, టీడీపీ కార్యకర్తలను, నేతలను దళితులపై దాడికి ఉసిగొల్పారు. చంద్రబాబే రెచ్చగొట్టటంతో ఆయన సామాజికవర్గానికి చెందిన మన్నే రవీంద్ర, ఆయన ప్రధాన అనుచరులు కొందరు రెచ్చిపోయి రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు దళితులు, వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులు గాయపడ్డారు. పోలీసులకు ఫిర్యాదులు.. మరోవైపు.. వాస్తవాలను మరుగుపరిచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారంటూ ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ నాగేశ్వరరావుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తోపాటు పలువురు శనివారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మరోపక్క.. టీడీపీ పెద్దలు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే, టీడీపీ నేతలు దాడికి పాల్పడిన వీడియోలు బయటకొచ్చాయి. దీనికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. టీడీపీ వారే దాడికి పాల్పడ్డారన్న కుట్ర కోణం బయటపడటంతో ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. మరోవైపు.. టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్సీపీ నేతలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు కేసులు నమోదు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించడంతో మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ కె. కిషోర్‌కుమార్ శనివారం మీడియాకు తెలిపారు. యర్రగొండపాలెంలో శుక్రవారం రోడ్‌షో సందర్భంగా బహిరంగ సభకు అనుమతిచ్చిన ప్రాంతంలో కాకుండా ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతంలో సభను పెట్టారని, దీనిపై ఆ పార్టీ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రోడ్‌షో సందర్భంగా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్లు రువ్విన సంఘటనలో కొంతమంది గాయాలయ్యాయని, ఆ రాళ్లు రువ్విన వారిని గుర్తించినట్లు చెప్పారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడని ఆయన తెలిపారు. ఈ దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్ బాష, టీడీపీకి చెందిన ఎం.హరిబాబు తమకు గాయాలైనట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ రెండు కేసులను నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారు
-
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత
-
చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్
సాక్షి, ప్రకాశం: చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. బాబు సభకు జనం రాకపోవడంతనే గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ కంచుకోట.. దమ్ముంటే టీడీపీ గెలవాలని సవాల్ విసిరారు. యర్రగొండపాలెంలో టీడీపీ గెలిస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. చంద్రబాబే దగ్గరుండి తమ కార్యకర్తలపై దాడి చేయించారని మండిపడ్డారు. యర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల అక్రమాలు, గంజాయి ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు. చదవండి: ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ కాగా, అధికారంలో ఉన్న ఐదేళ్లూ వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసిన చంద్రబాబు.. వెలిగొండను తానే పూర్తి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి దుయ్యబట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోమారు మోసం చేసేందుకు వెలిగొండ పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అసలు వెలిగొండపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. -
ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దళిత శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయంపై టీడీపీ మూకలు రాళ్ల దాడికి దిగాయి. రాళ్ల దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పదేపదే కవ్వింపు చర్యలకు దిగారు టీడీపీ కార్యకర్తలు. ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం’ అని అన్నారు. -
‘దళితులను అవమానించిన మీకు అక్కడ తిరిగే అర్హత ఉందా?’
సాక్షి, ప్రకాశం జిల్లా: దళితులను అవహేళన చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు ఏమీ పీకలేరు అన్న మీరు ఏ ముఖం పెట్టుకుని అక్కడ పర్యటిస్తారని ఆదిమూలపు నిలదీశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మండిపడ్డ ఆదిమూలపు.. పలు ప్రశ్నలు సంధించారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?.. దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా? యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా?, ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరీక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా?, అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?, జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు. ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి?, నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడితేనే ఒప్పుకోని నీవు... సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. నీది రెండు నాల్కల ధోరణి’ అని ధ్వజమెత్తారు మంత్రి ఆదిమూలపు సురేష్. -
గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నాం
-
జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు
సాక్షి, తాడేపల్లి: గత చంద్రబాబు పాలనకు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకూ ఉన్న తేడాను ప్రజలు గమనించారని, అందుకే ప్రజలంతా మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏడు లక్షల మంది సైన్యం అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వెళ్లగా.. వారంతా ఎంతో అభిమానంతో మెగా సర్వేకు సహకరిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా.. సీఎంకు మద్దతు తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకమని, ఇదొక చారిత్రాత్మక ప్రజామద్దతుగా పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో పెట్టడంతో పాటు అవన్నీ పరిష్కరిస్తున్నారని కొనియాడారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గణాంకాలతో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నామన్నారు. మాకు ఓటు వేయని వారికి కూడా సాయం చేశామని, అందరికీ మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. టీడీపీ కోటలు బద్దలు అవుతున్నాయి.. ఏడు లక్షల మంది సైనికులు చేస్తున్న సర్వేలో అదే తేలుతోందని స్పష్టం చేశారు. కరోనా వలన ఆర్ధిక సమస్యలు వచ్చినా ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని.. సీఎం జగన్ సువర్ష పాలనలోనే ఇది సాధ్యం అయిందని చెప్పారు. -
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
చంద్రబాబు, లోకేష్ పై మంత్రి ఆదిమూలపు ఫైర్
-
‘తండ్రి,కొడుకులు తాజ్‌మహల్ ముందు సెల్ఫీ తీసుకొని..మేమే కట్టాం అంటారేమో’
సాక్షి, ప్రకాశం: లోకేష్ కార్ల ముందు సెల్ఫీ దిగి ఎస్సీలను ఉద్ధరించినట్టు పోజులు కొడుతున్నాడని మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు టీడీపీ హయంలో ఇచ్చిన ఇన్నోవాలు నిజంగానే ఎస్సీలకే ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆ కార్ల వ్యవహారం పై చర్చకు వచ్చే దమ్ము లోకేష్‌కు ఉందా అని సవాల్ విసిరారు. తండ్రి ,కొడుకులు తాజ్ మహల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని .. అది కూడా మేమే కట్టాం అనేలా ఉన్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. ఎస్సీలకు కార్ల పేరుతో మధ్యవర్తిలకు దోచిపెట్టింది వాస్తవం కాదా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో నేరుగా పేదవాడికే లబ్ది చేకూరుతోందని, పేదలు వైఎస్సార్సీపీకి అండగా వున్నారని అక్కసుతో తండ్రి కొడుకులు సెల్ఫీల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానిదే
-
చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘టిడ్కో ఇళ్లపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా.. సెల్ఫీలతో అబద్ధాలను ప్రచారం చేస్తూ.. తండ్రీ కొడుకులు కాలం గడుపుతున్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేశామని చెప్తున్న టీడీపీ నేతలు.. ఎన్ని పూర్తి చేశారో చెప్పగలరా?’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘2.20 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తవుతున్నాయి. డిసెంబర్‌లోగా ప్రజలకు ఇచ్చి ఎన్నికలకు వెళ్తాం. టిడ్కో ఇంటిని రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తూ.. మహిళలకు ఇస్తున్న ఘనత సీఎం జగన్‌ది. ఇవ్వన్నీ పచ్చమీడియాకు కనబడవు.. వినపడవు’’ అని మంత్రి సురేష్ మండిపడ్డారు. చదవండి: రామోజీరావు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తోడల్లుడు అప్పారావు -
అభ్యర్థులు లేకపోవడంతోనే పొత్తులకు వెంపర్లాట
ఒంగోలు: ‘పవన్‌కళ్యాణ్ నిలకడలేని మనిషి. ఆయనకు ఒక సిద్ధాంతం, భావజాలం లేవు. ఆయన చేస్తున్నది రాజకీయంలా అనిపించడం లేదు. రాజకీయ వ్యభిచారంలా ఉంది’ అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ అన్నారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ ఒకవైపు బీజేపీతో అంటకాగుతూ.. మరోవైపు టీడీపీతో ఒప్పందంలో ఉంటారని విమర్శించారు. ఆయన ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో కనీసం ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలన్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్లే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి వారు గుంపులు గుంపులుగా వచ్చినా.. వైఎస్ జగన్ నేతృత్వంలో 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామన్నారు. తాము చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకంతోనే గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నామని.. ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధిని వివరిస్తున్నామని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే.. వాటిని తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి.. యువతను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు అండ్ కో.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రూ.300 కోట్లకు పైగా సొమ్మును కాజేసిందని మండిపడ్డారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం
-
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. మంత్రి వ్యక్తిగత సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది. చదవండి: జి–20 సదస్సుతో విశాఖకు ప్రపంచ గుర్తింపు -
‘విశాఖలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’
విశాఖ: విశాఖ నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి విడడల రజినీ స్పష్టం చేశారు. కేవలం జీ20 సదస్సు కోసం కాకుండా విశాఖ శాశ్వత అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి రజినీ. సీఎం జగన్ హయాంలో విశాఖ విశ్వఖ్యాతి గడిస్తోందని తెలిపారు. ఈ 28వ తేదీన జీ20 సదస్సుకు సీఎం జగన్ హాజరవుతారని మంత్రి రజినీ పేర్కొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. విశాఖలో జీ20 సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. ‘రూ. 130 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 600 కి.మీ మేర కొత్త రోడ్లు, మరమ్మత్తు పనులు. పరిపాలన రాజధానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులు జరిగాయి.రాబోయే రోజుల్లో విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది.కొత్తగా 5 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం’ అని తెలిపారు. -
వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్
-
ఉద్యోగరీత్యా ఎదురయ్యే ఒత్తిడికి స్పోర్ట్స్‌తో ఉపశమనం: మంత్రి ఆదిమూలపు సురేష్
-
‘అందుకే కోటంరెడ్డిని అడ్డం పెట్టుకుని డైవర్ట్ పాలిటిక్స్’
సాక్షి, పల్నాడు జిల్లా: ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మాచర్లలో రూ.480 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సురేష్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఆదిమూలపు మీడియాతో మాట్లాడుతూ, ‘‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబును కలవలేదా?. కోటంరెడ్డి అడ్డంగా దొరికిపోయి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని కోటంరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అతను చూపించే విశ్వాసం ఇదేనా?’’ అంటూ దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్: ఎమ్మెల్యే పిన్నెల్లి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయింది. అందుకే చంద్రబాబు.. శ్రీధర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు. శ్రీధర్ రెడ్డి దమ్ముంటే 51 సెకండ్ల ఆడియోను బయట పెట్టాలి. చంద్రబాబుతో కుమ్మక్కై అడ్డంగా దొరికిపోయి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి ఇలా ఎంతమంది పోయిన పార్టీకి నష్టం లేదు. పార్టీలో ఇలాంటి కోవర్టులు ఉంటే సీఎం జగన్ కచ్చితంగా బయటికి పంపుతారు’’ అని పిన్నెల్లి అన్నారు. చదవండి: కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ -
పవన్.. నిజాలు తెలుసుకో
సాక్షి, అమరావతి: చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారని పురపాలక, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున మండిపడ్డారు. సబ్ ప్లాన్‌పై ఈనాడు పత్రిక తప్పుడు రాతలతో ఎక్కాలు అప్పజెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఎస్సీ, ఎస్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని పథకాలు అమలు చేస్తున్నారనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. పవన్‌కు లెక్కలు, నిజాలు తెలియకపోతే తాము చెబుతామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఎస్సీ, ఎస్టీలకు అధిక లబ్ధి చేకూరిందన్నారు. రామోజీ తన స్వగ్రామంలో ఏ వర్గానికి ఎంత లబ్ధి జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఐదేళ్లలో ఎస్సీలకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.33,635 కోట్లేనన్నారు. అదే తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఎస్సీల సంక్షేమం కోసం రూ.48,909 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎస్టీల కోసం కేవలం రూ.12,487 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే రూ.15,589 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇవాళే పవన్‌కు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. చంద్రబాబు సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించినప్పుడు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్‌ను గతంలో ఎలా వినియోగించారో పవన్ తెలుసుకోవాలన్నారు. దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబును పవన్ ఎలా సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వర్చువల్‌గా పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై కుళ్లుతో రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు మా ప్రభుత్వంలోనే అధిక లబ్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు హయాంలో కంటే 45 శాతం అధికంగా ఎస్సీలకు ఖర్చు అధికంగా ఎస్సీలకు ఖర్చు చేశాం. సమాజంలోని అసమానతలు తొలగించేలా ప్రభుత్వం పని చేస్తోంది. మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ.49 వేల కోట్లు ఖర్చు చేశాం. దళిత, గిరిజన పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం. చంద్రబాబు డైరెక్షన్లోనే సబ్‌ప్లాన్‌పై పవన్ మీటింగ్ జరిగింది. పవన్‌కు నిజాలు, లెక్కలు తెలియకపోతే నేను చెప్తాను’’ అని ఆదిమూలపు అన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాల పరిమితిని పదేళ్లు పొడిగించడం అభినందనీయం. దళిత, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం జగన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అన్ని రంగాల్లో దళితులు రాణించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. కొన్ని పత్రికలు టీడీపీకి కొమ్ము కాస్తూ వార్తలు రాస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే లబ్ధి పొందాలన్నది వాళ్ల దురాశ. ఈనాడు రాతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. కడుపునిండా కుళ్లు, కుతంత్రాలున్నాయి కాబట్టే రామోజీరావు రాక్షసానందం పొందుతున్నాడు’’ అని మంత్రి దుయ్యబట్టారు. చదవండి: తెలంగాణలో బలమెంత?.. పవన్ ప్రకటనలు వింటే ఏమనిపిస్తుందంటే.. ‘‘దళితులుగా పుట్టకూడదని చంద్రబాబు అవమానించాడు. అలాంటి చంద్రబాబు దళితులకు న్యాయం ఎలా చేస్తాడు. అధికారంలో ఉండగా దళితులను అణగదొక్కేశారు. జగన్ సీఎం అయ్యాక దళితులకు న్యాయం జరుగుతుంది. ప్రతీ పథకంలోనూ 25 శాతం నిధులు దళితులకు ఖర్చు చేస్తున్నారు. టీడీపీ హయాంలో దళితులకు ఎన్ని నిధులు ఇచ్చారు. మేము ఎన్ని ఇచ్చామో చర్చకు సిద్ధం దమ్ముంటే రండి’’ అంటూ మంత్రి సురేష్ సవాల్ విసిరారు. -
జగన్ తో పోరాడటం చేతకాదని పవన్ ముందే ఒప్పుకున్నాడు: మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఇంటికో ఉద్యోగమని చెప్పి మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?
తాడేపల్లి: చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అని తేలిపోయిందని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని, అంటే బాబు కోసమే పవన్ కల్యాణ్ అనే విషయం అర్థమైపోయిందని ఆదిమూలపు పేర్కొన్నారు. ‘ ప్యాకేజీ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరు.వైఎస్సార్సీపీతో పోటీ చేసేంత సీన్ పవన్‌కు లేదు. మహిళా మంత్రులపై అసభ్యంగా మాట్లాడటం దారుణం. జగన్‌తో పోరాడటం చేతకాదని పవన్ ముందే ఒప్పుకున్నాడు. పవన్ రాజకీయాలకు పనికిరాడు పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.పవన్ ఒక ప్యాకేజీ స్టార్ మాత్రమేనని, చంద్రబాబును కలిసి సంక్రాంతి ప్యాకేజీ మాట్లాడుకున్నారన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదని పవన్ ముందే తేల్చిచెప్పాడని, పవన్, చంద్రబాబు, లోకేష్ ఎన్నిసాన్లు దండాలు పెట్టినా 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవడం ఖాయమన్నారు మంత్రి జోగి రమేష్. కుప్పంలోనూ చంద్రబాబును ఓడిస్తామన్నారు మంత్రి. అర్హులందరికీ సంక్షేమం అందించిన ఘనత తమదని జోగి రమేష్ మరోసారి పేర్కొన్నారు. -
ఏప్రిల్ 14కు అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులు ఏప్రిల్ 14కు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఈ విగ్రహ నిర్మాణ పనుల్ని గురువారం మంత్రులు నాగార్జున, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. చేతల మనిషిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి చూపిస్తున్నారన్నారు. దేశచరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన బూట్లు వచ్చాయని, మిగిలిన భాగాలు దశలవారీగా వస్తాయని ఆయన తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో కాకుండా ఇరుకుసందుల్లోను, ఇబ్బందికరమైన రోడ్లపైన ఇష్టానుసారం సభలు జరపడంతో నిండుప్రాణాలు బలిగొన్న ఘటనలు ఆందోళన కలిగించాయని చెప్పారు. ప్రతిపక్షంలోను ప్రచారయావను ఆపుకోలేక 11 నిండుప్రాణాలు పోవడానికి చంద్రబాబు నిర్వహించిన సభలే కారణమని చెప్పారు. -
జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దు: మంత్రులు
సాక్షి, విజయవాడ: డా.బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, జీవో నెం.1ను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసం జీవో తీసుకొచ్చాం. సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది బలి తీసుకున్నారని మంత్రి సురేష్ అన్నారు. జీవోకు కట్టుబడి ఉన్నాం: మేరుగ నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, పేద ప్రజల ప్రాణాల రక్షణకే ప్రభుత్వం జీవో నెం.1 తెచ్చిందని, జీవోకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు ఆలోచించారా? అంటూ మంత్రి నాగార్జున దుయ్యబట్టారు. అడగకుండానే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదు. విగ్రహం కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తామని నాగార్జున వెల్లడించారు. చదవండి: టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702 -
సీఎం జగన్ సింహంలా సింగల్ గా పోటీచేస్తాడు: ఆదిమూలపు సురేష్
-
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి రోజా ట్వీట్
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు జనసేన పవన్ కల్యాణ్ మధ్య ముసుగు తొలగిపోయింది. జీ హుజుర్ అంటూ చంద్రబాబుతో మరోసారి పవన్ భేటీ అయ్యారు. ఆదివారం పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీపై మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ.. ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘విశాఖలో మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడు. చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోతే పవన్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా!’’ అంటూ రోజా ట్వీట్ చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే..@ncbn వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడు.. చంద్రబాబు 11 మందిని చంపితే @PawanKalyan వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు. వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!! — Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2023 పవన్ వెళ్లింది.. అందుకే..: మంత్రి సురేష్ ప్రకాశం జిల్లా: చంద్రబాబు, పవన్ కలయిక పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళింది.. బాబూ జీ హుజూర్ అని అనడానికేనని మంత్రి సురేష్ విమర్శించారు. ‘‘నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేయమంటే.. అన్ని సీట్లలో పోటీ చేస్తాను.. నువ్వు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పడానికే’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే జీవో నంబర్ 1 ప్రభుత్వం జారీ చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కానీ ఎల్ల్లో మీడియా జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి వాస్తవాలను వక్రీకరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎంత మంది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. జగన్ సింహలా సింగిల్ గానే పోటీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. -
ప్రత్యామ్నాయ స్థలాలు చూసి నిర్మాణాలు ప్రారంభించాలి: సీఎం జగన్
-
ఏపీ గృహ నిర్మాణశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
గృహ నిర్మాణంపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ ప్రగతిని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణంకోసం రూ.6,435 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని అధికారులు పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆయా లే అవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్ నెలలో 4 సార్లు లే అవుట్లను పరిశీలించామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని లే అవుట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి అవసరమైన ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...: ♦ ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ♦ అలాగే ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిర్ణీత దశకు రాగానే వాటికి కరెంటు కనెక్షన్లు ఇవ్వాలి. ♦ వివిధ కోర్టు వివాదాల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన చోట్ల ప్రత్యామ్నాయాలను వెంటనే చూడాలని సీఎం ఆదేశం ♦ కోర్టు కేసులు పరిష్కారం కాని చోట వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇళ్లనిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశం ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి లక్ష్మీ షా, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దీవాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం పరామర్శ
-
మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి/మార్కాపురం(ప్రకాశం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఎర్రగొండపాలెంలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ (85) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. థెరీసమ్మ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చారు. సాయంత్రం స్థానిక జార్జి గ్రీన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు సురేష్ మంత్రికాగా.. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శి. ఆమె అల్లుడు తిప్పేస్వామి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన థెరీసమ్మ ప్రస్తుతం ఆమె భర్త డాక్టర్ శామ్యూల్ జార్జి నెలకొల్పిన విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు. చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి ఆదిమూలపు థెరీసమ్మ (85) సోమవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున 1:30 నిముషాలకు (తెల్లవారితే సోమవారం) తుదిశ్వాస విడిచారు. థెరీసమ్మకు 5 మంది సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులైన డాక్టర్ ఆదిమూలపు సురేష్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శిగా ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తితో వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆమెతో పాటు భర్త స్వర్గీయ డాక్టర్ శామ్యూల్ జార్జిలు అంచలంచెలుగా విద్యాసంస్థల అధినేతల వరకు ఎదిగి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలను మార్కాపురంలో నెలకొల్పారు. స్వర్గీయ డాక్టర్ శామ్యూల్ జార్జి పశ్చిమ ప్రాంత విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. థెరీసమ్మ మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పని చేశారు. ఈ పాఠశాల అభివృద్ధికి థెరీసమ్మ ఎనలేని కృషి చేశారు. ఉపాధ్యాయ వృత్తితో విశేష సేవలు అందించారు. అటు కర్నూలు జిల్లాలో, ఇటు ప్రకాశం జిల్లాలో విద్యాసంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి జిల్లాలో ఆదర్శంగా నిలిచారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నర్సింగ్, బీఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది విద్యార్థుల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. డాక్టర్ శ్యామ్యూల్ జార్జి మృతి తర్వాత విద్యాసంస్థల చైర్పర్సన్ గా థెరీసమ్మ ఇప్పటివరకు వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన ఆమె సోమవారం మృతి చెందారు. థెరీసమ్మ మృతితో అటు కర్నూలు ఇటు ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: (సచివాలయ సిబ్బంది, అధికారుల హాజరు సంతృప్తికరంగా లేదు) -
'రామోజీరావు ఈ వ్యవస్థను చూసి దేశం ఏమంటుందో తెలుసుకోవాలి'
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ వ్యవస్థపై పచ్చపత్రికల్లో అబద్దాలు, అవాస్తవాలు రాస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్యన వాలంటీర్లు వారధిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాంటి వ్యవస్థపై రామోజీరావు తన పత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా వాలంటీర్ల ద్వారా అందిస్తున్నాం. కులం, ప్రాంతం, పార్టీ చూడకుండా వాలంటీర్ వ్యవస్థ తెచ్చాము. వాలంటీర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేశాము. ఏ పార్టీ వారైనా అర్హత ఉంటే అవకాశం ఇచ్చాం. ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, మహిళ రిజర్వేషన్లు అమలు చేశాము. రామోజీరావు ఈ వ్యవస్థ కోసం దేశం ఏమంటుందో తెలుసుకోవాలి. లబ్ధిదారులకు ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. టీడీపీ హయాంలో ఏ పథకమైన లంచం లేకుండా ఇచ్చారా?. జన్మభూమి కమిటీలు ఎలా లంచాలు తిన్నారో ప్రజలకు తెలియదా?. వాలంటీర్ వ్యవస్థను మా పార్టీకి వాడుకోవడం లేదు. మా పార్టీకి గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రభుత్వ యంత్రగాన్ని పార్టీ కోసం వాడుకున్న చరిత్ర చంద్రబాబుదే. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు ఎవ్వరు మరువలేరు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చదవండి: (ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!) -
వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్
-
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, ప్రకాశం(యర్రగొండపాలెం): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సచివాలయం–2 పరిధిలో శనివారం వీల్‌చైర్‌లో లబ్ధిదారుల గృహాలకు వెళ్లి మాట్లాడారు. కార్యక్రమం పూర్తిచేసుకున్న ఆయన.. ఆ వీధిలో ఉన్న ఒక నాయకుడి ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ బలహీనంగా ఉండటంతో ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. మంత్రి కిందపడే సమయంలో పక్కనే ఉన్న కొంత మంది నాయకులు పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మంత్రి ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో.. ఈ సంఘటన జరగడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కుర్చీ నుంచి వరగడం వలన తనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని మంత్రి తెలిపారు. చదవండి: (నేను విఫలమైన రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు) -
అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ సంకల్పం
-
‘వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తాం’
విజయవాడ: అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్ సంకల్పమన్నారు. వికేంద్రీకరణ దిశగా ముందుకెళ్తామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయి రాజధాని అంశానికి సంబంధించి సుప్రీం వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమరావతిపై తమ ప్రభుత్వం ఎప్పుడూ యూటర్న్ తీసుకోలేదన్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు బొత్స. -
వీల్ చైర్ మీద గడప గడప కి వెళ్తున్న మంత్రి సురేష్
-
ఇళ్లపై కుళ్లు రాజకీయం ఆపండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా రాజకీయం చేయాలని చూసే ప్రతిపక్ష పార్టీలు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తిరగబడి తరుముతారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. టిడ్కో ఇళ్లపై రాద్ధాంతం చేస్తూ జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమంపై ఆదివారం ఓ ప్రకటనలో మంత్రి మండిపడ్డారు. మంగళగిరిలో టిడ్కో లబ్ధిదారులు జనసేన నేతలను నిలదీసి వెళ్లిపోవాలని చెప్పడమే అక్కడ అన్ని వసతులు సమకూరాయనడానికి నిదర్శనమన్నారు. టిడ్కో ఇళ్లపై రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆ పార్టీ నేతలను తరిమికొడతారన్నారు. అన్ని వసతులతో రాష్ట్రంలో ఇప్పటికే 40,576 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించామని, డిసెంబర్ నాటికి మరో 1,10,672 ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. ఇంటిని కేవలం రూపాయికే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తోందని తెలిపారు. సకల వసతులతో సుందరంగా ఇళ్లను తీర్చిదిద్ది లబ్ధిదారులకు అందజేస్తుంటే, జనసేన తమ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ఇప్పటికైనా కుళ్లు రాజకీయాలు ఆపాలని హితవుపలికారు. -
జూన్ నాటికి పట్టణ సర్వే పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింట పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల పరిధిలో సర్వే పనుల్ని జూన్ నాటికి పూర్తిచేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 123 పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన ఈ సర్వేని పటిష్టంగా చేయాలని సూచించారు. రూ.120 కోట్లతో చేపట్టిన ఈ సర్వే వల్ల కోటిన్నరమంది ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో తలపెట్టిన సర్వే పనుల ప్రగతిపై ఆయన బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరే విధంగా వారి భూములు, స్థలాలు, ఆస్తులను పటిష్టంగా సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేసి భూహక్కు పత్రాలు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పథకాన్ని చేపట్టలేదని, గత వందేళ్లలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని సీఎం తలపెట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే వార్డు సచివాలయాల నుంచి అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, డ్రోన్ సర్వేని కూడా ప్రారంభించాలని చెప్పారు. ఈ పథకం సమగ్ర సమాచారంతో ఎస్వోపీ తయారు చేయాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన సాంకేతిక పరికరాలైన రోవర్స్, ట్యాబ్, ప్రింటర్స్ వంటివాటిని తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. తద్వారా పథకం పురోగతిని సమీక్షించడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి యూఎల్బీల్లో డ్రోన్లతో మ్యాపింగ్ సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సర్వే పనులు చేపడుతున్నామని మంత్రికి చెప్పారు. రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం రీజియన్లుగా డ్రోన్ ఫ్లయింగ్ షెడ్యూల్ రూపొందించుకున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, అనంతపురం, గుంటూరు రీజియన్లలో గురువారం మ్యాపింగ్ పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. అర్బన్ సర్వేపై ఇప్పటికే 20 వేలమంది వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, అన్ని యూఎల్బీల్లో సర్వేకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇప్పటికే సీడీఎంఏలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. దాదాపు 40 లక్షల ఆస్తులను సర్వేచేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించారు. ఈ సమావేశంలో అర్బన్ సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు, డీటీసీపీ విద్యుల్లత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మంత్రి సురేష్‌కు హోం మంత్రి పరామర్శ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌ను హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆదివారం పరామర్శించారు. ఇటీవల మంత్రి సురేష్‌కు మోకాలు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో ఉన్న సురేష్‌ను హోం మంత్రి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
జోరుగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. కోనసీమ జిల్లా మండపేట పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన ఇళ్లలో 2,720 యూనిట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 15న మంగళగిరి పరిధిలో, 21న జీవీఎంసీలో కూడా ఇళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేశారు. వీటితోపాటు తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట నంద్యాలతోపాటు మొత్తం తొమ్మిది పట్టణాల్లో 20,176 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 23న విజయనగరంలో ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆగస్టు నాటికి 39,820 యూనిట్లను టిడ్కో అధికారులు అందజేశారు. అలాగే, సెప్టెంబర్‌లో ఆదోనిలో 2,500, ఎమ్మిగనూరులో రెండువేల యూనిట్లను పంపిణీ చేశారు. నిజానికి వర్షాల కారణంగా పంపిణీ ఆలస్యమైనా ఆ తర్వాత నిర్మాణాలు పూర్తిచేసుకున్న చోట అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మౌలిక వసతులు కల్పించి నెలన్నర వ్యవధిలో 39,820 యూనిట్లను పంపిణీ చేశారు. మొత్తం రెండు నెలల వ్యవధిలో 44,320 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ నెలలో మరో 20,176 యూనిట్లను అందించనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది నిర్మాణం మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంచేసిన టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు పునరుద్ధరించి 88 పట్టణ స్థానిక సంస్థల్లో 2,62,216 ఇళ్లను జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణం చేపట్టింది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంగల 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే అందించడంతో పాటు వీటికయ్యే ఆర్థిక భారం రూ.3,805 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇక 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణం కలిగిన 1,18,616 ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేస్తోంది. అంతేకాక, లబ్ధిదారులు అందరికీ ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు దాదాపు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తోంది. టిడ్కో ఇళ్ల పత్రాలు, తాళాలు గృహ సముదాయ ప్రాంగణాల్లోనే అందజేస్తున్నామని, ఇకపైనా అదే విధానం కొనసాగుతుందని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అక్టోబర్ నెల పంపిణీ ప్రక్రియ మండపేట నుంచి ప్రారంభించామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ చెప్పారు. ఇళ్ల పంపిణీ ప్రాంగణంలోనే ఇంటి తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పేదలకు అండగా ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసింది. మా ప్రభుత్వం 2.62 లక్షల ఇళ్లల్లో 1.43 లక్షల యూనిట్లు నిరుపేదలకు చెందినవే. వీటికి గత పాలకులు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి, బ్యాంకు రుణాలు మంజూరు చేశాక, ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని చెప్పింది. అలా చెల్లిస్తే ఒక్కొక్కరు మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 1.43 లక్షల మందిపైనా సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారం పడుతుంది. కానీ, సీఎం వైఎస్ జగన్ 300 చ.అ. ఇళ్లను ఒక్క రూపాయికే ఇచ్చారు. అంతేకాక.. రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. డిసెంబర్ నాటికి మొత్తం 2.62లక్షల యూనిట్లను అందజేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్(ఐఈటీఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఐఆర్‌వో) గుర్తింపుతో 1953లో ఏర్పడిన ఈ సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాలకు చెందిన నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. చదవండి: ఆ అగ్రిమెంట్లో తప్పేముంది? ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ తరఫున 1.25 లక్షల మందికి పైగా నిపుణులు దేశ, విదేశాల్లో 63 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మంత్రి డాక్టర్ సురేష్‌ను ఐఈటీఈ సొసైటీ విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరింది. డాక్టర్ సురేష్ కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ అందుకున్నారు. -
జంబలకిడిపంబ పార్టీగా టీడీపీ
యర్రగొండపాలెం: తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగాళ్లు ఏడుస్తారని.. అది జంబలకిడిపంబ పార్టీలా తయారైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించటానికే రైతుల పేరుతో టీడీపీ పాదయాత్ర చేయిస్తోందని.. రైతులు ఎక్కడైనా వాకీటాకీలు, ఐఫోన్లు పెట్టుకుని తొడలు కొట్టడం చూశారా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.2కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి షేక్ అంజాద్‌బాషా, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను సీఎం జగన్ నిజాయితీగా నెరవేరుస్తుంటే దుష్టచతుష్టయం జగనన్నపై విషం చిమ్ముతోందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నీచరాజకీయాలు మాని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆమె హితవు పలికారు. పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు చంద్రబాబుకు, లోకేశ్‌కు వత్తాసు పలుకుతూ, ప్రజలకు మేలుచేస్తున్న జగన్మోహన్రెడ్డిని ఇంటికి పంపించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు. వారి కలలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే చంద్రబాబుకు అక్కాచెల్లెళ్లు కొట్టే దెబ్బ వారికి అబ్బా అనిపించేలాగా ఉండాలన్నారు. ఈసారి కుప్పంలో కూడా టీడీపీ గెలిచే పరిస్థితిలేదని రోజా అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానేనని ఆమె అన్నారు. బాబు చేయలేనిది జగన్ చేశారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సుపరిపాలన చేశారు కాబట్టే తాము కాలర్ ఎగరేసి వెళ్తున్నామని రోజా ధీమాగా చెప్పారు. ‘రాబోయే ఎన్నికల్లో నీవు నెగ్గేదిలేదు, జగనన్న తగ్గేదిలేదని’’ ఆమె చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది మూడేళ్లలో జగన్ చేసిచూపించి దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారన్నారు. ఇక 29 గ్రామాల కోసం 26 జిల్లాలకు అన్యాయం చేయటానికి జగనన్న ఒప్పుకోరని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని రోజా స్పష్టంచేశారు. సభలో కలెక్టర్ దినేష్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడు’
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడని మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు తమవేనని స్పష్టం చేశారు. ‘చంద్రబాబుకి ఇక శాశ్వతంగా అసెంబ్లీ కి రాలేడు.రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మాకు పూర్తి తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాకు బ్బ్రహ్మరథం పట్టారు. ఇక మేము ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. వాళ్ళు చేసే యాత్ర రాజకీయపరమైనది. మేము మొదటి నుంచీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. ఎప్పుడూ మేము వెనుకడుగు వేసేది లేదు. అమరావతి రైతులకు చంద్రబాబు కంటే మేమే ఎక్కువ కౌలుకు ఇచ్చాం. కేవలం 26 గ్రామాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాలా?, రాయలసీమ తాగునీటి సంగతి ఏమిటి...ఉత్తరాంధ్ర అభివృద్ది మాటేంటి..?, అన్ని ప్రాంతాల అభివృద్ధి మాకు ముఖ్యం..అదే న్యాయం’ అని తేల్చిచెప్పారు. మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం అమరావతి యాత్ర ఎవరికోసం...మా ప్రాంతం అబివృద్దికి అది వ్యతిరేకం. సభలో స్పష్టంగా చర్చిస్తాం...అన్ని ప్రాంతాల అభివృద్దే మా లక్ష్యం. ఈ రోజు సభలో కీలకమైన అంశాలు చర్చిస్తాం. ఎవరి మీద దండయాత్ర చేయడానికి వాళ్ళు యాత్ర చేస్తున్నారు. మేము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు ప్రయోజిత ఉద్యమం అది. ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం మాకు ఏముంది?, చంద్రబాబు చెప్పగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?, ప్రజలు మాకు ఐదేళ్ల కోసం తీర్పు ఇచ్చారు. మేము ప్రజల కోసం పని చేస్తాం’ అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
2023 సెప్టెంబర్‌కు వెలుగొండ పూర్తి
పెద్దదోర్నాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్‌నాటికి పూర్తి చేసి మూడు జిల్లాల ప్రజలకు నీరందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సోమవారం కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న 7,200 కుటుంబాలకు పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును ఆయన కుమారుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. పనులు చేపట్టిన సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులకు చెప్పారు. ఇది ప్రకాశం నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగు నీరు, 4,50,000 ఎకరాలకు సాగు నీరు అందించే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని అన్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 8 వేల కోట్లు అయితే ఇప్పటివరకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ప్రతి ఒక్కరి న్యాయమైన కోరికను నెరవేరుస్తామని తెలిపారు. ప్రాజెక్టు పనులపై ప్రతి నెలా సమీక్షిస్తామన్నారు. సుమారు 1,500 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 11.5 ఎకరాలకు సంబంధించి టీ5 పోర్షన్‌కు రూ.85 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇచ్చారన్నారు. -
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటే చరిత్రహీనులవుతారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగుతున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకోవడం ద్రోహమన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీ 5 చానల్ చంద్రబాబుతో కలిసి విషప్రచారానికి తెరతీశాయని విమర్శించారు. ‘దొడ్డి దారిన సీఆర్డీఏ చట్టం, రాజధానికి ద్రోహం’ అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన కథనాలను ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. తాము రాజధానికి ఏవిధంగా ద్రోహం చేస్తున్నామో చర్చకురావాలని మంత్రి సవాలు విసిరారు. అధికారం కోల్పోయామన్న అక్కసుతో టీడీపీ ముఖ్య నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని, వారు తల్లకిందులుగా తపస్సు చేసినా తమ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు ప్రజలు బుద్ధిచెప్పినా పద్ధతి మార్చుకోకుండా దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అబద్ధాలను వండివార్చి ఎల్లో మీడియాలో ప్రచురించినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని గుర్తుంచుకోవాలని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ‘మీరు పెట్టిన ల్యాండ్ లిటిగేషన్స్ వల్ల అభివృద్ధి నిలిచిపోయిందన్నది వాస్తవం కాదా..’ అని ఎల్లో మీడియాను, టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ సృష్టిస్తున్న అభివృద్ధి ఆటంకాలను అధిగమిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధతతో కృషిచేస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం కౌలు చెల్లిస్తున్నామని, తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా దాదాపు రూ.750 కోట్లు చెల్లించామని వివరించారు. భూములిచ్చిన రైతులకు క్రమం తప్పకుండా కౌలు ఇవ్వడం కూడా ద్రోహమేనా అని నిలదీశారు. ఇవన్నీ దాస్తే దాగేవికాదని, టీడీపీ అబద్ధాలను సృష్టించి ఎల్లో మీడియాలో ఎంతగా ప్రచారం చేసినా అవి వాస్తవాలు కాలేవని ఆయన పేర్కొన్నారు. -
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పీచ్@ మెగా బీచ్ క్లీనింగ్ విశాఖ
-
విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాన్ని 2027 నాటికి ప్లాస్టిక్ రహితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం సీఎం కార్యక్రమం అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రాష్ట్రంలో దశలవారీగా ప్లాస్టిక్ నిషేధించడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారన్నారు. శుక్రవారం భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 22 వేలమందికిపైగా బీచ్‌క్లీనింగ్ చేసినట్లు తెలిపారు. త్వరలో 2.5 లక్షలమందితో బీచ్ క్లీన్‌చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పుతామని వారు పేర్కొన్నారు. 20 వేలమందికి ఉపాధి కల్పన పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సీఈవో సెరిల్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.16 వేల జీతంతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొదటిదశలో 1,100 మెట్రిక్ టన్నులు, రెండోదశలో 2,200 మెట్రిక్ టన్నులు, మూడోదశలో 3,300 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి సన్‌గ్లాసెస్, షూస్, బ్యాగ్స్, టీ–షర్టులు తయారుచేస్తామని వివరించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ మాజీ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ శ్రీసత్యత్రిపాఠి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్ విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచే భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు 28 కిలోమీటర్ల మేర రికార్డు స్థాయిలో మెగా బీచ్‌క్లీనింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పార్లే సంస్థ సంయుక్తంగా 40 ప్రాంతాల్లో దాదాపు 22 వేలమందికిపైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జీవిఎంసీ కమిషనర్ లక్ష్మీశ, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి రైతులకు కౌలు చెల్లింపు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన కౌలు ఏటా 10 శాతం పెంచుతున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రస్తుత (2022–23) ఆర్థిక సంవత్సరానికి గాను 24,739 మంది రైతుల ఖాతాల్లో రూ.184,99,37,974 నగదును జూన్, జూలై నెలల్లో జమచేయగా, మరో 1,304 మంది రైతుల ఖాతాల్లో సోమవారం రూ.7,84,14,562 జమచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన కౌలును వివాదాల్లో ఉన్న భూములకు మినహా, మిగతావాటికి ఏటా ఎలాంటి ఆలస్యం లేకుండా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కౌలు చెల్లింపులకు రూ.208.10 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు 26,043 మంది రైతులకు రూ.192,83,52,536 చెల్లించినట్లు తెలిపారు. రాజధాని భూ సమీకరణలో తీసుకున్న 34,400.15 ఎకరాల్లో 2,689.15 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూముల్లో 380.79 (కేటగిరీ–4, 6) ఎకరాలకు కౌలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. ఈ విభాగంలో మిగిలిన 2,308.36 ఎకరాలపై సీఐడీ విచారణ పూర్తయిన తర్వాత కౌలు మొత్తం చెల్లిస్తామని చెప్పారు. సివిల్ వివాదాల్లో ఉన్న మరో 455.04 ఎకరాలకు కూడా కేసులు ముగిశాక కౌలు చెల్లించనున్నట్టు తెలిపారు. 2015–16 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు రూపంలో రూ.1,344.93 కోట్లు చెల్లించినట్టు ఆయన చెప్పారు. -
‘దొంగే.. దొంగా, దొంగా అన్నట్టుగా పవన్ తీరు ’
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): దొంగే.. దొంగా.. దొంగా.. అన్న చందంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తీరు ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిండికేట్ బ్యాంక్ కాలనీలోని కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్‌ను మంగళవారం మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కులాల మీద నడుస్తుందా?.. అసలు ఓ భావజాలం మీద నడుస్తుందో లేదో పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. కుల నాయకుడు అయ్యాడు కాబట్టే పవన్ కులాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ వైపు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల వేడుకలు జరుపుకొంటున్నామని, అయితే టీడీపీ నుంచి జనసేన పార్టీకి ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో తెలియడం లేదన్నారు. తన పార్టీని పవన్ ఎలా నడిపిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు. ఆ పార్టీ ఎక్కడ అయితే మనుగడ సాగిస్తుందో.. అక్కడ ఎవరెవరు ఉన్నారనే దానిపై పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కు రాజకీయంగా అవగాహన, ఓ ఆలోచనా విధానం లేదని విమర్శించారు. పండక్కి పిలిస్తే వచ్చినట్టుగా పార్ట్ టైమ్, పబ్లిసిటీ కోసం తాపత్రయమే తప్ప ప్రజలకు ఏదన్నా మంచి చేయాలనుకోవడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఇది కూడా చదవండి: మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు ఏపీ సర్కార్ పెద్దపీట -
దమ్ముంటే ఆ వీడియో మాధవ్‌దని నిరూపించండి
సాక్షి, అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, దమ్ముంటే ఆ వీడియో నిజమైనదేనని నిరూపించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో మార్ఫింగ్ చేసినదేనని ఆయన చెప్పారు. దమ్ముంటే అది మాధవ్‌దే అని నిరూపించాలి తప్ప రోజూ అదే పనిగా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ వీడియోపై పూర్తిస్థాయి విచారణ చేసి దీన్ని సృష్టించిన ఐటీడీపీ వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీకి పెరుగుతున్న జనాదరణ చూసి టీడీపీ నాయకులకు దిక్కుతోచటంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీని తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావటంలేదని, ప్రజాక్షేత్రంలో వారు మరోసారి అభాసుపాలు కాక తప్పదని మంత్రి చెప్పారు. -
సమర్థంగా పట్టణ భూ రీ సర్వే
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యుత్తమ పరిపాలనా సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టారని, అందులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం ఒకటని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వందేళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ బృహత్తర సర్వేను అధికారులు సమర్థంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, ఇతర సిబ్బందికి పట్టణ భూ రీ సర్వే, శాశ్వత హక్కుపై అవగాహన సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించారు. డీటీసీపీ విద్యుల్లత, సీసీఎల్ఏ అదనపు కమిషనర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఈ సర్వే ద్వారా ఎంతో కాలంగా ఉన్న భూ, ఆస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఎవరి ఆస్తులు ఏ సర్వే నంబర్లో ఉన్నాయో పక్కాగా తెలుసుకోవడంతోపాటు హక్కుపత్రం కూడా పొందుతారని తెలిపారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్‌లో ఒకటి ఉంటే.. వాస్తవంగా మరొకటి ఉంటుందని, ఒకరి స్థలం మరొకరి పేరుతో ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయన్నారు. రీ సర్వే తర్వాత ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లతో పట్టణ భూ సర్వే ప్రాజెక్టు చేపట్టిందని, ఈ చారిత్రక ఘట్టంలో మున్సిపల్ అధికారులు భాగమవ్వాలని పిలుపునిచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆరు నెలలపాటు పట్టణ భూ సర్వేకు పనిచేయాలన్నారు. మొదట సమర్థులైన వారిని మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని, వారికి సామర్లకోటలోని ఏపీ సర్వే అకాడమీలో శిక్షణనిస్తామని చెప్పారు. వీరి ద్వారా యూఎల్బీల్లో అవసరమైనంత మంది సిబ్బందికి శిక్షణనిచ్చి పని ప్రారంభించాలని సూచించారు. సచివాలయాల సిబ్బంది, ప్రజలను భాగస్వాములను చేయాలి నగర, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, ఆ ఆస్తుల యాజమాన్యాలపై దృష్టి పెట్టలేదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. టాక్స్ అసెస్మెంట్ నంబర్లున్న ఆస్తులు ఏ సర్వే నంబర్లో ఉన్నాయో అధికారులకు కూడా అవగాహన లేదన్నారు. తొలుత స్థానికంగా సమావేశాలు నిర్వహించాలని, ఇందులో వార్డు సచివాలయాల సిబ్బందిని, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆస్తికి సంబంధించి అన్ని అంశాలపై సర్వే చేయాలని తెలిపారు. అనంతరం డ్రోన్ ఆధారంగా ఆస్తులను సర్వే చేయడంపై అవగాహన కల్పించారు. -
కోలాహలంగా టిడ్కో గృహప్రవేశాలు
కర్నూలు (సెంట్రల్): వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పట్టణ పేదలకు రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి కానుకగా ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల గృహాలకు రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.10,400 కోట్ల భారం పడిందన్నారు. అయినా వైఎస్ జగన్ సర్కారు పేదల కోసం ఈ భారాన్ని భరిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 30 వేల గృహాలను అందజేసినట్లు చెప్పారు. సోమవారం కర్నూలులో వైఎస్సార్ జగనన్న నగర్లో టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి జయరాం ముఖ్యఅతిథులుగా హాజరై దాదాపు 5 వేల మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో 300 చదరపు అడుగులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదట రూ.500 కడితేనే రిజిస్ట్రేషన్ చేసే వారని తెలిపారు. తరువాత ఆ ఇంటికి రూ.2.62 లక్షలు అప్పు ఇప్పించే వారన్నారు. దీనిని 20 ఏళ్లపాటు లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలపై మోపిన ఈ భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుందని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాన్ని పేద మహిళలకు ఆస్తిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం చంద్రబాబు 2018లో టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభించగా ఎక్కడా పూర్తి కాలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. గ్యాస్, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెరగడానికి, తమ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ బాదుడే బాదుడుకు బదులుగా ఏడుపే ఏడుపు కార్యక్రమాన్ని చేపడితే మంచిదని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ రామయ్య, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, వై.సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: గుడ్‌న్యూస్.. OHA ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూ. 6 వేలు చెల్లింపులపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను చెల్లించనునుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్లు అయ్యింది. తాజా ఉత్తర్వులతో 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. పలు డిమాండ్లతో పాటు ఆరోగ్య భృతిని ప్రస్తావిస్తూ.. సమ్మెకు దిఆరు పట్టణ పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులు. ఈ తరుణంలో సీఎం జగన్ సమస్యలను తెల్చుకుని వెంటనే పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పరిష్కారం అయ్యాయి. అంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్. చదవండి: టీడీపీ హయాంలో తక్కువ.. సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం -
ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదు: ఆదిమూలపు సురేష్
-
పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రూ.6 వేలు ఓహెచ్ఏ
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు (ఆరోగ్య భృతి–ఓహెచ్ఏ) రూ.6 వేలు చెల్లిస్తామని, రూ.15 వేల వేతనంతో కలిపి మొత్తం రూ.21 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. కార్మికుల ప్రధాన డిమాండ్ పరిష్కారమైనందున సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్‌తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించింది. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్సు రూ.6 వేలు చెల్లించాలని సీఎం నిర్ణయించినట్టు చెప్పారు. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేస్తామన్నారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. కార్మికులు సమ్మె విరమించాలని ఆయన కోరారు. 43,233 మంది కార్మికులకు మేలు రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో మొత్తం 51,306 మంది కార్మికులు ప్రజారోగ్య శాఖ, ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. వీరిలో 8,073 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. 43,233 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేలు వేతనంగా చెల్లించేది, అయితే, వారి కష్టాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మేలు చేయాలని ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు కింద రూ.6 వేలు కలిపి మొత్తం రూ.18 వేలకు పెంచింది. అనంతరం పీఆర్సీ అమలు చేయడంతో వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఓహెచ్‌ఏను సవరించి రూ.3 వేలు కలిపి వేతనం రూ.18 వేలుగా ఇస్తున్నారు. అయితే, తొలుత ప్రకటించిన ఓహెచ్ఏ మొత్తం చెల్లించాలని సోమవారం నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల వినతి మేరకు ఆరోగ్య భృతి రూ.6 వేలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.21 వేలకు చేరింది. ఓహెచే పూర్తిస్థాయిలో రూ.6 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. తమ డిమాండ్లు పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విధుల్లో చేరండి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినందున పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో చేరాలి. ప్రస్తుత వర్షాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలి. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. – ప్రవీణ్‌కుమార్, సీడీఎంఏ -
మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించాం: మంత్రి ఆదిమూలపు
-
ఏపీ: మున్సిపల్ కార్మికుల డిమాండ్‌కు సానుకూల స్పందన
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ కార్మికుల డిమాండ్ల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ సమ్యలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యాం. సమస్యలపై చర్చించాం. ఓహెచ్వో ఇచ్చేందుకు 6 వేలు అలానే ఉంచాలనే డిమాండ్‌కు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6వేల రూపాయలు యథాతధంగా ఉంటుంది. జీతంతో పాటు, 6 వేలు OHA కలిపి రూ. 21 వేలు వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆక్యుపేషనల్ అలవెన్స్ కొనసాగిస్తాం. మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నాం అని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. -
సమ్మె విరమించండి.. మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు. పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రెగ్యులర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, కొందరు కాంట్రాక్ట్ సిబ్బంది సైతం సేవలు అందిస్తున్నారని వివరించారు. అవసరమైన యూఎల్బీల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. యూఎల్బీల్లో సేవలకు వాహనాలు అవసరమైన చోట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, మార్కెట్ల వద్ద చెత్త ఉండిపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రులు ఆదిమూలపు, బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. సమ్మెను ఉధృతం చేస్తాం: కార్మిక జేఏసీ మునిసిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీ, సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి మునిసిపల్ ఒప్పంద కార్మికులు విద్యుత్ నిర్వహణ సేవలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ నెల 17 నుంచి అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న మునిసిపల్ కార్మికులు విధుల్లో పాల్గొనరాదని కోరారు. గురువారం అన్ని పట్టణాల్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారని, శుక్రవారం మునిసిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. -
సమ్మె విరమిస్తేనే చర్చలు
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించి, విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు పారిశుధ్య కార్మిక ఐక్య కార్యాచరణ సమితికి (జేఏసీ) సమాచారం ఇచ్చినట్లు మంగళవారం ఆయన చెప్పారు. మంత్రుల ముందుంచిన డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా మిగిలిన అన్నింటినీ పరిష్కరిస్తామని సోమవారం మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కార్మిక జేఏసీకి చెప్పినప్పటికీ కార్మికులు సమ్మెకే మొగ్గు చూపారని, దీంతో పట్టణ పారిశుధ్య నిర్వహణ, ఇతర విధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరైతేనే వారితో చర్చిస్తామని ఆయన ప్రకటించారు. సచివాలయంలో సోమవారం రాత్రి జరిగిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో మంత్రులు సురేష్, బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్మిక జేఏసీతో చర్చించారు. ఇందులో కార్మికులు వెల్లడించిన మొత్తం 23 డిమాండ్లలో ఓహెచ్ఏ మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఓహెచ్‌ఏను గతంలో మాదిరిగా రూ.6 వేలు చెల్లించాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబట్టారు. గత ప్రభుత్వంలో పట్టణ పారిశుధ్య విభాగంలోని ఒప్పంద కార్మికుల వేతనం రూ.12 వేలుగా ఉండేదని, వేతనాలు తక్కువగా ఉన్నందున వారికి అదనంగా ఓహెచ్ఏ రూపంలో రూ.6 వేలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందన్నారు. పీఆర్సీ పెరిగినందున వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఆ మేరకు ఆరోగ్య భత్యాన్ని సవరించి రూ.3 వేలు కలిపి రూ.18 వేలు చెల్లిస్తున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. అయినప్పటికీ కార్మిక సంఘం నేతలు మిగిలిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.21 వేలు వేతనంగా ఇవ్వాలంటున్నారన్నారు. కానీ, కార్మికులు విధుల్లో చేరితేనే వారితో చర్చించాలని, అంతవరకు చర్చలు ఉండబోవని మంత్రి ఆదిమూలపు తేల్చిచెప్పారు. విధుల్లో సగం మందికి పైగా కార్మికులు సమ్మెకు మద్దతుగా సగంమంది కార్మికులు విధులకు దూరంగా ఉండగా, మిగిలిన సగం మంది విధుల్లో ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండ్రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ మొత్తం ఒప్పంద కార్మికుల్లో సగం మంది సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తించారు. ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని కోరారు పట్టణ ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇక వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్రంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని తెలిపారు. -
రైతుల్ని నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: వ్యవసాయం దండగ అని చెప్పి రాష్ట్రంలోని రైతుల్ని నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పచ్చటి పొలాలతో కళకళలాడే వేలాది ఎకరాల అమరావతి ప్రాంత పొలాలను ఎడారిగా మార్చిన ఘనత కూడా ఆయనదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు 2022–23 సంవత్సరానికి సంబంధించిన కౌలు నగదు రూ.208.10 కోట్లను మంగళవారం విడుదల చేశారు. 24,739 మంది ఖాతాల్లో రూ.184.99 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ రైతులను పట్టించుకోలేదని, వారి సంక్షేమం కనీసం ఆలోచన కూడా చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రైతుల ఆత్మహత్యలే అందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రైతు పక్షాన నిలబడి అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, అమరావతి రైతులకు రావాల్సిన అన్ని రాయితీలు అందజేస్తున్నామని తెలిపారు. అమరావతి ప్రాంతానికి, అక్కడి రైతులకు ఏమీ చేయలేకపోయిన చంద్రబాబుకు అక్కడి భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 24,739 మంది రైతుల ఖాతాల్లో కౌలు జమ అమరావతి రైతులకు వరుసగా మూడో ఏడాది కౌలు నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో నం. 277 జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మంగళవారం రూ.208.10 కోట్లు విడుదల చేశారు. అంతకుముందు 2020–21లో రూ.182.26 కోట్లు, 20 21–22 సంవత్సంలో రూ.187.75 కోట్లు చెల్లించా రు. ఈ ఏడాది విడుదల చేసిన కౌలు నిధుల్లో రూ.184,99,37,974 మొత్తాన్ని 24,739 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తం అసైన్మెంట్ భూములకు, సివిల్ వివాదాలు ఉన్న భూ ములకు సంబంధించిందని మంత్రి సురేష్ తెలిపా రు. వివాదాలు తేలిన తర్వాత ఆ మొత్తం వారి ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున చెల్లించడంతో పాటు ఏటా 10 శాతం కౌలు పెంచి రైతులకు చెల్లిస్తున్నట్టు వివరించారు. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. -
గత ప్రభుత్వ జీవోల ప్రకారమే స్థలాల వేలం
సాక్షి, అమరావతి: రాజధాని భూముల అమ్మకంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను చట్టబద్ధంగా అమ్మకానికి ఉంచామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం తెలిపారు. ఇవే స్థలాలను గత ప్రభుత్వం 2017లో అమ్మకానికి పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థలాలను రాజధాని అభివృద్ధి కోసం ఈ–వేలం వేస్తున్నట్టు చెప్పారు. భూములను ఆదాయ వనరుగా చూడాలని గత ప్రభుత్వమే ప్రకటించిందని.. అమ్మడం, కొనడం అందులో భాగమేనన్నారు. 2017 జూన్ 15న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో–228 ప్రకారమే ఆ స్థలాలకు ఈ–వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వం 500 ఎకరాల రాజధాని భూములు అమ్మకానికి ఉంచినట్టు ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. జీవో 389, 390ల్లో పేర్కొన్న స్థలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయన్న విషయాన్ని ఆ పత్రిక గుర్తించాలని, ఇవేమీ రహస్య ఉత్తర్వులు కాదని, అంతా బహిరంగమేనన్నారు. ఏ స్థలం ఎక్కడ ఉందో సదరు జీవోల్లో వివరంగా ఉన్నప్పటికీ ‘500 ఎకరాల రాజధాని భూముల అమ్మకం’ అంటూ తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన చర్యగా మంత్రి సురేష్ పేర్కొన్నారు. దీంతోపాటు అమరావతి అభివృద్ధిలో భాగంగా వివిధ కంపెనీల స్థాపన కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం వందల ఎకరాలు కట్టబెట్టిందని, వాటిలో చాలా సంస్థలు గడువులోగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఆ భూములను తిరిగి ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విధంగా 2016లో భూములు తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టని కారణంగా ఆయా సంస్థల ఒప్పందాన్ని 2019లోనే ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిలో స్వల్ప స్థలాలను కూడా ఈ–వేలానికి ఉంచినట్టు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ఈనాడు పత్రిక తెగ ఆరాటపడుతోందని, ఈ విష ప్రచారం కూడా అందులో భాగమేనని విమర్శించారు. -
పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల చదువుకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుందన్నారు. ఇది విద్యలో ఒక గేమ్ చేంజర్ అని.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఒక్కో విద్యార్థి బైజూస్ కంటెంట్‌ను కొనాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అలాంటిది సీఎం జగన్ చొరవ వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా తమ కంటెంట్ అందించేందుకు బైజూస్ సీఈవో రవీంద్రన్ ముందుకు వచ్చారన్నారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా బైజూస్‌కు మంచి పేరుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్ పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ‘జూస్’ అంటూ అవహేళన చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. -
మంత్రి సురేష్‌కు అస్వస్థత.. ఫోన్లో సీఎం పరామర్శ
సాక్షి, అమరావతి/యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన పలు సభల్లో మాట్లాడారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. గత నెల 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించి బుధవారం స్టెంట్ వేశారు. విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. మంత్రి సురేష్‌ను ఫోన్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోలుకున్న ఆయన్ను శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్‌కు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: మున్సిపల్ , అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సురేష్‌తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రికి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసి యాంజియోప్లాస్టి చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’ -
‘చంద్రబాబును ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారు’
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం.. కర్నూల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల కోసం బీసీ, ఎస్సీ ఎస్టీల వర్గాలను చంద్రబాబు వాడుకొని వదిలేశారని, కానీ బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం సామాజిక న్యాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. టీడీపీ పనైపోయింది: మంత్రి బొత్స మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మహానాడులో పార్టీ విధానాలు చెప్పకుండా అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రులుగా పనిచేసినవాళ్లను అంత నీచంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుని ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని, టీడీపీ పనైపోయిందని, ఆ విషయం మహానాడుతో స్పష్టమైందని తెలిపారు. ‘మా అవినీతిని బయటపెట్టడానికి మూడేళ్లు పట్టిందా, అవినీతిపై చర్చకు సిద్ధం.. వాళ్ల అవినీతి చిట్టా అంతా విప్పుతామంటూ’ ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు ఎందుకు బీజేపీని ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: ఆదిమూలపు
-
‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’
సాక్షి, విశాఖపట్నం: మహానాడులో చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విమర్శించేందుకు ఏమీ లేక చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ’టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడిని మించిన దొంగలెవరున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నాడు’’ అని మంత్రి సురేష్ ఎద్దేవా చేశారు. చదవండి: ‘వంచన, వెన్నుపోటుకు పుట్టిన బిడ్డే ఉన్మాది చంద్రబాబు’ -
కరకట్ట రోడ్డు విస్తరణను వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుకున్న సమయం కంటే ముందే పూర్తిచేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీఆర్డీఏ అధికారులను అదేశించారు. సచివాలయంలో సోమవారం ఏపీ సీఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేస్తున్న పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల నిర్మాణ ప్రగతిపైనా మంత్రి ఆరా తీశారు. పట్టణాభివృద్ధి విభాగంపై నిర్వహించిన సమీక్షలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. 124 యూఎల్బీల్లో చెత్త సేకరణ కోసం ఇప్పటివరకు 1.13 కోట్ల మూడు రంగుల డబ్బాలు పంపిణీ చేశామని, మరో 10 లక్షల డబ్బాల పంపిణీ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు. -
రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం.. అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్.. ఆ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంకా.. ► లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ► లే అవుట్స్ చూసి ఇతరులు స్ఫూర్తిని పొందాలి. ► న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తింపు. ► శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో.. 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు.. మే చివరినాటికి సిద్ధం చేస్తామని వెల్లడించిన అధికారులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ : ► తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అనే విషమయంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ► ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అనే విషయంపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచాలి. ► ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు వివరించారు. ► మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికల్లా పంపిణీ చేస్తామన్నారు. ► 2,426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్న అధికారులు. ► 1,123 ఈ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ► గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు: ► ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. ► దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ► ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. తద్వారా దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. టిడ్కో ఇళ్లపై సమీక్ష: ► గత ప్రభుత్వం రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. ► పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ► మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు. ► టిడ్కో ఇళ్ల మీద సుమారుగా.. రూ.5, 500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసింది ప్రభుత్వం. రోడ్లపై దృష్టి: ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. ► ఎక్కడ చూసినా గుంతలులేని రోడ్లు కనిపించాలి. ► నాడు – నేడు కింద బాగు చేసిన రోడ్లను హైలెట్ చేయాలి. ► జూన్‌నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష: ► కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సమీక్షలో పేర్కొన్నారు. ► ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించడంతో పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ► సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష: ► విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై చర్చ. ► సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు. ► మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ► ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం జగన్ ఆదేశం. ► పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచన. జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష: ► మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్లు. ► ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్లను వివరించిన అధికారులు. ► విజయవంతంగా నడుస్తున్నాయన్న అధికారులు.. వీలైనన్ని మహిళా మార్ట్లను నెలకొల్పాలని సూచించిన సీఎం జగన్. చదవండి: వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే -
రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్, బాలినేని
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) -
సత్వరమే స్పందించినా రాజకీయమా?
ఒంగోలు అర్బన్/ఒంగోలు/రేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో వివాహితపై జరిగిన లైంగిక దాడి దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచిందని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నా టీడీపీ, ఇతర పార్టీలు రాజకీయం చేయడం దారుణమన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబులతో కలసి వనిత పరామర్శించారు. రూ.4.12 లక్షలను బాధిత కుటుంబానికి అందజేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా వ్యక్తిగతంగా కొంత మొత్తాన్ని అందించారు. అనంతరం తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. బాధితురాలి భర్త అర్ధరాత్రి స్థానిక పోలీసులను సంప్రదిస్తే.. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారని, తెల్లవారేసరికల్లా నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసుతోపాటు లైంగికదాడి, హత్యాయత్నం, దొంగతనం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ద్వారా బాధితులకు రూ.2 లక్షల పరిహారం అందజేశామని గుర్తు చేశారు. మహిళా, శిశు సంక్షేమం కింద మరో రూ.50 వేలు అందజేస్తున్నామన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచారాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నా ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బాధితులకు సాయమందించేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ మలికాగర్గ్ తదితరులు పాల్గొన్నారు. హోం మంత్రి తానేటి వనిత కారును అడ్డుకుంటున్న టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు హోం మంత్రి కాన్వాయ్‌పై దాడి కాగా హోం మంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఒంగోలు ఎన్ఎస్పీ గెస్ట్‌హౌస్ నుంచి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలసి బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బయలుదేరిన మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. వనిత కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా ప్రజాప్రతినిధులను దూషించారు. ఈ ఘటన ఒంగోలు రాంనగర్ ఒకటో లైను వద్ద చోటు చేసుకుంది. దీనిపై సంతనూతలపాడు నియోజకవర్గ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొమ్మూరి సుధాకర్ మాదిగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకురాలు రావుల పద్మజ, ట్రాన్స్‌జెండర్ గోను దుర్గ, శేషమ్మ, రావిపాటి సీత, ఆళ్ల వెంకటరత్నం తదితరులు దాడికి కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార ఘటనలో నిందితులకు 15 రోజులు రిమాండ్ కాగా అత్యాచారానికి పాల్పడిన ఇరువురు నిందితులను రేపల్లె అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారని సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో బాల నేరస్తుడిని గుంటూరు బాల నేరస్తుల న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్
సాక్షి, విశాఖపట్నం: అర్హులైన పేదలకు కేవలం ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్‌తో మే నెలాఖరు నాటికి 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టిడ్కో ఇళ్ల పనుల పురోగతిపై విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా అసత్యాల్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం హేయమన్నారు. గత ప్రభుత్వం 5 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తామని చెప్పి టెండర్ల దశలో 4,54,706కి కుదించి.. గ్రౌండింగ్ సమయానికి 3,13,832కు తగ్గించిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో 90 శాతం ఇళ్లు పూర్తయిపోయాయంటూ అబద్ధపు ప్రచారాలు చేశారనీ, తాము అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 1.22 లక్షల ఇళ్లు బేస్మెంట్, దానికంటే కింద స్థాయిలో ఉన్నాయనీ, 81 వేల ఇళ్లు 90 శాతం పూర్తయినా అందులో కేవలం 10 శాతం ఇళ్లకు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో ఒక్క టిడ్కో ఇల్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు అందించారా అని ప్రశ్నించారు. డిమాండ్ లేని ప్రాంతాల్లో నిర్మించదలచిన 51,616 ఇళ్లని రద్దు చేశామని, మొత్తంగా 2,62,216 టిడ్కో ఇళ్లని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డిసెంబర్ నాటికల్లా అన్ని ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమీక్షలో టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, టిడ్కో ఎండీ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, టిడ్కో చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జూన్‌లో 1.34 లక్షల టిడ్కో ఇళ్లు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పురపాలక, పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బుధవారం సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులపై ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సర్కారు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఎన్నికల సమయంలో హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టి కనీసం పది శాతం పనులు కూడా చేయలేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరుతో రూ.3,082 కోట్ల అప్పులు మిగిల్చిందన్నా రు. ఆ అప్పులను తీరుస్తూనే రూ.4, 287 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ పూర్తి సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు. భారం పడినా మాట ప్రకారం.. సబ్సిడీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల దాదాపు రూ.10 వేల కోట్లకుపైగా భారం పడుతున్నా మాట ప్రకా రం అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 1.34 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, డిసెంబర్ ఆఖరుకు 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 30 వేల ఇళ్ల చొ ప్పున పూర్తి చేసి అందిస్తామన్నారు. వచ్చే నె లలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇళ్లు్ల కేటాయిస్తామని మంత్రి తెలిపారు. -
మే చివరికి పట్టణ ఆరోగ్యకేంద్రాలు సిద్ధం
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మిస్తున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్సెంటర్లు (పట్టణ ఆరోగ్యకేంద్రాలు) మే నెల చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వైఎస్సార్ అర్బన్ హెల్త్‌సెంటర్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా భవనాలు సమకూర్చే పనులు చేపట్టింది. అధికారులు ఇప్పటికే రూ.18.40 కోట్లతో 184 పాత భవనాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.340 కోట్లతో చేపట్టిన 344 భవానాల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఎనిమిది భవనాల నిర్మాణం పూర్తయింది. 150 భవనాల నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినట్టు పనులు చేపట్టిన పబ్లిక్‌హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. నేల స్వభావాన్ని బట్టి కొన్నిచోట్ల భవన నిర్మాణానికి అంచనా కన్నా ఎక్కువ వ్యయం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆదిమూలపు సురేష్ సైతం తొలి ప్రాధాన్యంగా పట్టణ ఆరోగ్యకేంద్రాలపై ఆరా తీశారు. -
ఆయనకెలా తెలుసు.. చంద్రబాబు ఏమైనా కేబినెట్లో ఉన్నారా..?
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణపై ఇంకా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేబినెట్ కూర్పుపై స్పందించారు. ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. ‘పాత మంత్రి వర్గంలో తామంతా రాజీనామా చేసిన తరువాతే తనకు అవసరమైన మంత్రి వర్గానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి అవకాశం కల్పించారు. అంతే తప్ప ఇతర కారణాలేవీ లేవు. వైఎస్సార్సీపీ తామంతా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్లమే. బాలినేనితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన వారికి భావోద్వేగాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి నిదానంగా సర్ధుకుంటాయి’ అని ఆదిమూలపు పేర్కొన్నారు. ‘సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మేము నడుచుకుంటాం. అవినీతికి తావుండకూడదు అనేది సీఎం జగన్ నినాదం. కేబినేట్ మొత్తాన్ని మారుస్తామని సీఎం ఎప్పుడూ చెప్పలేదు. మొత్తం కేబినేట్‌ను మారుస్తానని ఆయన చెప్పినట్టు చంద్రబాబు అంటున్నారు.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు..? చంద్రబాబు ఏమైనా కేబినెట్లో ఉన్నారా..?. వైఎస్సార్సీపీ కేబినేట్ మంత్రులమంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. చంద్రబాబులో అభద్రతాభావం ఏర్పడింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఒక జెండా.. అజెండా అంటూ ఏమీలేదు. పల్లకి మోయడమే ఆయన అజెండా. అందుకే ఆయన వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా వాటిన్నింటిని గుంపగుత్తగా వేరేవారికి అప్పచెబుతామనే సిద్దాంత ధోరణిని అవలంభిస్తున్నారు. దీనిని ఎవరైనా పార్టీ సిధ్దాంతం అంటారా?’ అని మంత్రి ఆది మూలపు సురేష్ ప్రశ్నించారు. ఇది చదవండి: ఏపీలో మరో టూరిస్ట్ స్పాట్.. తప్పక చూడాల్సిందే.. -
అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరించండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరిని కోరారు. ఏపీలోని పలు పట్టణాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు చక్కటి అవకాశాలున్నాయని, రెండో విడత ప్రాజెక్టులో వీలైనన్ని స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో మూడు రోజుల పాటు జరిగే స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ అర్బనైజేషన్ జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి సోమవారం కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతికి పలు ర్యాంకులు తిరుపతిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలు, అనుసరిస్తున్న విధానాలకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో 2020 సంవత్సరానికి గాను అవార్డులు వరించాయి. వివిధ అభివృద్ధి అంశాల ప్రాతిపదికగా నిర్వహించిన పోటీలో శానిటేషన్, సోషల్ యాస్పెక్టస్ విభాగంలో మొదటి ర్యాంకు, ఎకానమీ విభాగంలో రెండో ర్యాంకు, అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో ర్యాంకుతో పాటు రౌండ్ వైజ్ సిటీస్ పోటీలో రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ నుంచి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అవార్డులను అందుకున్నారు. -
Jagananna Amma Vodi: అమ్మ ఒడిపై ‘ఎల్లో’ విషం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకంపై టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతూ లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఈ పథకానికి మార్పులు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారనేది టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం మాత్రమేనని, నిజంగా ఆ సర్క్యులర్ ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం కింద రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు ఈ పథకంలో అర్హతలకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతం కంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు గతేడాది అర్హత నియమాలు సవరించినట్లు చెప్పారు. మరింత ఎక్కువ మందికి అందేలా.. ఈ పథకంలో అర్హత కోసం కుటుంబ నెలవారీ ఆదాయం 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఉంటే.. దాన్ని 2020–21లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలకు ప్రభుత్వం పెంచిందని మంత్రి తెలిపారు. ఆ కుటుంబాల భూకమతాలకు సంబంధించి 2019–20లో 2.5 ఎకరాల పొలం మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి కూడా వర్తింపచేసినట్టు తెలిపారు. ఇంకా 2019–20లో నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారినే అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 300 యూనిట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారని, అయితే కొత్తగా శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింపజేశామన్నారు. ఫోర్‌వీలర్ రూల్‌ను సవరించి ట్యా క్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా ఇస్తున్నామన్నారు. పట్టణాల్లో గతంలో 700 చదరపు అడుగుల ఇల్లున్న వారు మాత్రమే అర్హులు కాగా.. ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా వర్తింప చేస్తున్నామని వివరించారు. 2 లక్షలకు పైగా పెరిగిన లబ్ధిదారులు 2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. 2020–21లో ఆ సంఖ్య 44,48,865కు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంటే 2,15,767 మంది తల్లులకు అదనంగా పథకంలో ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదని, 75 శాతం హాజరు ఉండాలని తొలి జీవో 63లో నిర్దేశించినట్లు తెలిపారు. హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధన అమలు చేస్తూ ఈ ఏడాది పథకాన్ని జనవరి నుంచి జూన్‌కు మార్చామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే నారా లోకేశ్‌తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. -
పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు