రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్‌, బాలినేని | Minister Adimulapu Suresh Visited Rapalle Victim in Ongole Rims | Sakshi

రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్‌, బాలినేని

Published Wed, May 4 2022 6:13 PM | Last Updated on Wed, May 4 2022 6:15 PM

Minister Adimulapu Suresh Visited Rapalle Victim in Ongole Rims - Sakshi

సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు.

ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌ యాదవ్‌, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఉన్నారు. 

చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement