Burra Madhusudan Yadav
-
జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటాను: కనిగిరి ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. నేను జీవితాంతం జగన్‌తోనే ఉంటానని తెలిపారు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. కనిగిరిలో కొత్త ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్‌కు పూర్తిగా సహకరిస్తానని మధుసూదన్‌యాదవ్ పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పిన వారి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. అందరం కలిసి వైఎస్సార్సీపీ విజయం కోసం పనిచేస్తామని చెప్పారు. కనిగిరి కొండమీద వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండనని అన్నారు. సీఎం జగన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. ‘టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు. నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి. నా రాజకీయ దేవుడు వైఎస్ జగన్ ఏం చెబితే అది చేస్తా. నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు. కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం’ అని తెలిపారు. చదవండి: చంద్రబాబుకు భవిష్యద్దర్శనం -
జగనన్న ఫోటో ఒకటి చాలు: మధుసూదన్ యాదవ్
-
మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే బుర్రా
వెలిగండ్ల: రాష్ట్రంలో మూడేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. మండలంలోని హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, పద్మాపురం, బొంతగుంట్లపల్లి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హుస్సేన్‌పురం గ్రామ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ బుక్‌లెట్‌ను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికీ చేకూరిన లబ్ధి వివరించారు. హుస్సేన్‌పురంలో మంచంలో నడవలేని స్థితిలో ఉన్న యాదమ్మతో సీఎం జగనన్న మీ కుటుంబానికి మూడేళ్లలో వైఎస్సార్ పింఛన్ కానుక కింద రూ.82 వేలు ఇచ్చారన్నారు. సీఎం వైఎస్ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సారికూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే వస్తుందని యాదమ్మ బదులిచ్చారు. పద్మాపురంలో అక్కి యోగమ్మకి సుగర్ కారణంగా రెండు కాళ్లూ తీసివేయడం చూసి ఎమ్మెల్యే బుర్రా చలించిపోయారు. మూడు వేల పింఛన్ తీసుకుంటున్న యోగమ్మకు ఐదు వేల పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే బుర్రా ఆదేశించారు. తమ్మినేనిపల్లిలో తమ్మినేని పెద్దిరెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఎమ్మెల్యే ఆయన్ను పరామర్శించారు. మెరుగైన వైద్యం సేవలు అందించాలని రిమ్స్ వైద్యులను కోరారు. (క్లిక్: 24 గంటల్లోనే ఆ బాలుడికి పింఛన్..) ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ రామన మహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు గుంటక తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ సుకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు డి.జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘ అధ్యక్షుడు తమ్మినేని శివరామయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు యెలికె రమణయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు టి.దేవసహాయం, వై.నాగూర్‌యదవ్ , పీఏసీఎస్ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, పొల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకులు ఉండేల చిన వెంకటరెడ్డి, కర్నాటి చిన వెంకటరెడ్డి, రామకృష్ణ, వెంకటరెడ్డి, కె. వెంకట్రామయ్య, కె.అంకిరెడ్డి పాల్గొన్నారు. (క్లిక్: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్) -
మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు
కనిగిరి పట్టణ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదాతో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు మరింత చేరువ కాగా.. మూడేళ్లుగా నగర పంచాయతీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరగడంతో తాజాగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఫలితంగా మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో అభివృద్ధి నిధుల లభ్యత పెరగనుంది. కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా) : కనకగిరి.. పేరు సార్ధకం చేసుకునేలా కనిగిరి అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిన్న రెవెన్యూ డివిజన్ సాధించగా.. తాజాగా కనిగిరిని నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రెవెన్యూ డివిజన్‌తో అభివృద్ధికి ఊపు: కనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అనేక ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజల చెంతకు చేరాయి.. చేరుతున్నాయి. సుమారు 4 నుంచి 5 కి.మీల దూరం వరకు విస్తరించి ఉన్న కనిగిరిలో కనుచూపు మేరలో భూముల ధరలు పెరిగాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిగతా మండలాల ప్రజల రాకపోకలు సాగుతుండటంతో వ్యాపారాలు, పెరిగి ఆయా వర్గాల వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులకు కందుకూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కనిగిరిలోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గాయి. రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, మండల పరిషత్ తదితర అంశాల సమస్యలను ఇక్కడే త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నగర పంచాయతీ–నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీ కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ శాఖ నుంచి జీఓ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టుబట్టి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రాష్ట్రంలో కనిగిరి నగర పంచాయతీ ఒక్కటి మాత్రమే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనిగిరి పట్టణం అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుంది. ఈమేరకు మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో పాటు, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలున్నాయి. మారనున్న కనిగిరి రూపు రేఖలు: గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో కనిగిరి రూపు రేఖలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. చాలా కాలం పంచాయతీగా ఉన్న కనిగిరి.. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. అనంతరం కనిగిరి, శంఖవరం, కాశీపురం, మాచవరం పంచాయతీలను కలిపి కనిగిరి నగర పంచాయతీగా చేశారు. నగర పంచాయతీగా హోదా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి గ్రేడ్ 2 మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. మూడేళ్లుగా మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరిగినట్లు నగర పంచాయతీ కౌన్సిల్ మున్సిపల్ శాఖకు వెల్లడించడంతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పెరిగిన కౌన్సిల్ హోదా... ఇప్పటి వరకు నగర పంచాయతీ చైర్మన్..మున్సిపల్ చైర్మన్‌గా, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా హోదా పొందుతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న పోస్టులు పెరుగుతాయి. అమృత్ సరోవర్ వంటి భారీ నిధుల ప్రాజెక్టులు, ఆర్థిక సంఘ నిధులు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 25 వార్డులుగా మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. (క్లిక్: నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్) సీఎం సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, సీఎం వద్దకు వెళ్లి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నా. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, సీడీఎంఏ, సీఎస్ల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా హోదా సాధించుకున్నా. పేదలకు మంచి ఆరోగ్యం, విద్య, సాగు, తాగునీరు అందించడమే నాధ్యేయం. – బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కనిగిరి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారడంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేసిన కృషి ప్రశంసనీయం. ఎమ్మెల్యే ఆదేశానుసారం కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేస్తా. చైర్మన్‌గా తాను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – అబ్దుల్ గఫార్, చైర్మన్, కనిగిరి మున్సిపాలిటీ -
రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్, బాలినేని
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) -
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
కనిగిరి రూరల్: వైఎస్సార్ టీఎఫ్ నాయకుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి కుమారుడి వివాహ వేడుకలు శనివారం కనిగిరిలో వైభవంగా జరిగాయి. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో జరిగిన వివాహ రిసప్షన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరై నూతన వధువరులు విష్ణువర్ధన్‌రెడ్డి, హారితలను ఆశీర్వదించచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్‌గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, జెడ్పీటీసీలు కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, ఒకే రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జి.బొర్రారెడ్డి, ఎస్కే రహీం, ముల్లంగి శ్రీహరిరెడ్డి, పల్లా మాల కొండ్రాయుడు, మండాది కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
'బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీకి లేదు'
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ అన్నారు. ఏడాది పాలనపై ఆరోపించడానికి ఏమీ లేక మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో కారులో నగదు దొరికితే దానిని మంత్రి బాలినేనికి అంటగట్టడం సిగ్గుచేటు. (ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ) ఆ డబ్బుకు సంబంధించిన సదురు వ్యాపారి అది తమదేనని ప్రకటించినా ఆరోపణలు కొనసాగించడం పచ్చనేతల దిగజారుడు తనానికి నిదర్శనం. తన తప్పు నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటానన్న బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు లేదు. లోకేష్‌లాగా బాలినేని దొడ్డిదారిలో మంత్రి కాలేదు. అయిదు సార్లు ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారని బుర్రా మధుసూధన్ యాదవ్ పేర్కొన్నారు. (చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు ఆపాలి) -
‘చంద్రబాబు విమర్శలు అర్థరహితం’
సాక్షి, ప్రకాశం : కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకి అండగా వుంటున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. కరోనాపై పోరుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎమ్మెల్యే మధుసూధన్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుదూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలన చేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లాక్డౌన్ నెల వ్యవధిలో మూడుసార్లు రేషన్ సరుకులు, వెయ్యి రూపాయలు సాయం చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ఒక పక్క కరోనాను కట్టడి చేస్తూనే డ్వాక్రా మహిళలుకు సున్నా వడ్డీ రుణాలు, జగనన్న విద్యా దీవెన, ఫించన్లు వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. (గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు) అనంతపురం : కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. కరోనా పరీక్షల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు. కరోనా బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోందన్నారు. పేద కుటుంబాలకు ఉచిత రేషన్, వెయ్యి నగదు అందిస్తున్న సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ ) ఆ హీరో అంటే చాలా ఇష్టం: విజయ్ దేవరకొండ -
అవన్నీ తప్పుడు వార్తలు : ఎమ్మెల్యే మధుసూదన్
సాక్షి, ప్రకాశం : మదనపల్లి చెక్‌పోస్ట్ వద్ద తాను బంధువులతో హల్చల్ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. తాను ప్రయాణించిన కారు వెనుక నా అనుచరుల కారు ఒక్కటే ఉందని తెలిపారు. చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అభ్యంతరం తెలపడంతో తన వెంట వచ్చిన కారును కూడా వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. తాను బంధువులతో కలిసి హల్చల్ చేశానంటూ తనపై దుష్ప్రచారం చేశారన్నారు. చెక్‌పోస్ట్ వద్ద ఆగి ఉన్న కారులన్ని తనవే అంటూ అసత్య ప్రచారం చేశారని తెలిపారు. పోలీసుల మాటను గౌరవించి నియోజకవర్గంలో తాను ఒక్కడినే వచ్చానని, లాక్డౌన్ నిబంధనలను సంపూర్ణంగా పాటించాలని మధుసూదన్ యాదవ్ వెల్లడించారు. -
కరోనా: గంగవరం పోర్టు యాజమాన్యం విరాళం
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు తరపున రూ.3 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోర్టు చైర్మన్ డివిఎస్ రాజు, సీఈఓ,మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావులు కలిసి అందజేశారు. దీంతోపాటు గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్ డివిడెండ్ చెక్‌ను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. (చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ) కర్నూలు : ►ముఖ్యమంత్రి సహాయనిధి కింద రిటైర్డ్ డీఆర్వో సుబ్బారెడ్డి రూ. లక్ష చెక్కును నంద్యాల ఆర్డీవో రామకృష్ణరెడ్డికి అందజేశారు. ►ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. లక్షా యాబై వేల చెక్కును ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డికి నంద్యాల మెడిసేవ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి అందించారు. ►ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రజలకు కరుణ వ్యాధిపై నియంత్రణ చర్యలపై ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అవగాహన కలిగించారు. తర్వాత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. గుంటూరు : ►వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ►ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో తెనాలిలోని తూర్పు కాల్వకట్టపై ఉన్న పేదలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ►ఎమ్మెల్యే విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో 350 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. ►ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 2వేల మాస్కులు అందజేశారు. ప్రకాశం జిల్లా : ►ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తన సొంత నిధులతో కనిగిరి కాశి రెడ్డి నగర్ ఎస్టీ కాలనీలో 1000 కుటుంబాలకు ఉచిత బియ్యం, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ►కరోన వైరస్ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో దర్శి ఆటోనగర్‌లో పేదలకు నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేశారు. హైదరాబాద్ : కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్. భరత్ కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలని, ప్రజలు అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
దీర్ఘకాలిక సమస్యలకు చెక్!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): గత సార్వత్రిక ఎన్నికల నుంచి కనిగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఆరు మండలాల్లోని ప్రతి గ్రామంలో పర్యటించా. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవాహిత కార్యక్రమాలూ చేశా. ఎందరో పేదలను ఆదుకున్నా. అనాథ పిల్లలను దత్తత తీసుకున్నా. నేను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు తాగు, వాడుక నీటి సమస్య అధికంగా ఉందని గుర్తించా. ప్రధానంగా ఫ్లోరైడ్ నీటి సమస్య ఉంది. నేను పీసీపల్లి మండంలో పర్యటించినప్పుడు ఎక్కువ గ్రామాల్లో ఫ్లోరైడ్, కిడ్నీ, క్యాన్సర్ బాధితులు కన్పించారు. ఆయా గ్రామాలపై పూర్తిగా అధ్యాయనం చేశా. ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేక, డయాలసిస్ కేంద్రాలు లేక అనేక మంది యువకులు కిడ్నీ, ఫ్లోరైడ్ వ్యాధితో మరణిస్తున్నట్లు గుర్తించా. సమస్యను మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్ది దృష్టికి తీసుకెళ్లి.. సమస్య తీవ్రతను వివరించా. ఈ మేరకు సమస్యపై ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. విషయాన్ని మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్గొండ తర్వాత ఫ్లోరైడ్ సమస్య అత్యధికంగా కనిగిరిలోనే ఉందని, అనేక మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ లేక చిన్న వయసులోనే చనిపోతున్నారని, సురక్షిత నీటి జలాలు లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు జగన్మోహన్రెడ్డికి వివరించడంతో ఆయన వెంటనే స్పందించారు. 2017 జనవరి 20న పీసీపల్లి మండలంలో భారీ ధర్నా చేశారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ధర్నాతో అధికార పార్టీ వెన్నుల్లో వణుకు పుట్టింది. వెంటనే కనిగిరితో పాటు మరో మూడు నియోజకవర్గాలకు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశారు. కనిగిరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమే. వైద్యుల కొరతపై దృష్టి కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో సుమారు 9 ఏళ్ల నుంచి మత్తు డాక్టర్ లేడు. గత పాలకులు కనీసం పట్టించుకోలేదు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆస్పత్రిలో ఆపరేషన్లు జరగడం లేదు. మత్తు డాక్టర్ లేక చిన్న ఆపరేషన్లకు కూడా ఒంగోలు రిఫర్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు డెలివరీ ఆపరేషన్(సీజిరియన్) జరగడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక పేదలు బంగారు అభరణాలు, పుస్తెలు తాకట్టు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మత్తు డాక్టర్‌తో పాటు ఇతర డాక్టర్లను నియమించాలని నిరసనలు, ధర్నాలు చేశాం. నేతలు మాటలు వల్లించి తప్పించుకున్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆస్పత్రిలో మత్తు డాక్డర్ నియామకానికి చర్యలు తీసుకుంటా. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తా. పన్నుల భారం నేను పట్టణంలో, నియోజకవర్గంలో ఏ పనిచేసినా ప్రజామోదం, ప్రజాభిష్టం మేరకే పనిచేస్తా. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే పనిచేయను. టీడీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచింది. ఇంటి, కుళాయి పన్నులను ఒక్క సారిగా రూపాయికి 100 రెట్లు పెంచింది. ప్రజలు నడ్డి విరిచింది. ఇంటి పన్నుల తగ్గించాలని నేను కూడా ప్రజలతో కలిసి పోరాటం చేశా. నేను ఎమ్మెల్యే అయితే ఇంటి పన్నులను క్రమ బద్ధీకరణ చేస్తా. సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిపరిష్కరిస్తా. వ్యాపారం చేసుకునే కొద్దిపాటి స్థలం వరకే ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకుంటా. పెంచిన ఇంటి పన్నులు తగ్గిస్తా. ఉచితంగా సాగర్ నల్లా.. గ్రామాలతో పాటు, పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం అనేకసార్లు ప్రజలు రోడ్డెక్కారు. ప్రత్యేక్షంగా నేను కూడా ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రజల కోసం పోరాటం చేశా. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకున్నా. అందుకే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సాగర్ నల్లా అందించే కార్యక్రమం చేపడతా. కనిగిరిలోని నాగుల చెరువు, పెద చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మారుస్తా. ప్రతి ఒక్కరికి సురక్షిత నీరు అందిస్తా. నిమ్జ్ కోసం ప్రయత్నం కనిగిరి ప్రాంతానికి నిమ్జ్ ఎంతో అవసరం. నిమ్జ్తోనే పరిశ్రమల స్థాపన జరిగి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. గత పాలకులు నిమ్జ్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కనీసం ముందడగు వేయలేదు. మేము అధికారంలోకి వస్తే నిమ్జ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటా. నిమ్జ్‌కు నిధులు సాధిస్తా. కనిగిరి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతా. ప్రధానంగా నీటి సమస్య, డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించి తొలి ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటా. శివారు కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లస్థలాలిచ్చి, పక్కా ఇళ్లను కట్టిస్తా. అర్హుడైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటా. అవినీతి లేని పాలన అందిస్తా కనిగిరి నియోజకవర్గంలో అవినీతి లేని పాలన అందిస్తా. తాగు, సాగు నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఏ గ్రామాంలోనూ గొలుసు దుకాణాలు లేకుండా పూర్తిగా నివారిస్తా. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పీసీపల్లి మండలాన్ని చేర్చడం, మోపాడు రిజార్వయర్‌ను వెలిగొండ జలాలతో నింపేందుకు చర్యలు తీసుకుంటా. నాగార్జున సాగర్ కుడి కాలువను పొడగించి, కనిగిరికి శాశ్వతంగా తాగు, సాగు నీటిని అందిస్తా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తా. - ఎంఎల్ నారాయణ, సీపీఐ అభ్యర్థి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తా. వెలిగొండ, పాలేటిపల్లి, నిమ్జ్ కింద భూముల కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తా. అర్హులైన పేద లందరికి నూర శాతం సంక్షేమ పథకాలు అందచేస్తా. వెనుకబడిన కనిగిరి ప్రాంతం అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన కృషి చేస్తా. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలుతీసుకుంటా. - పాశం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి -
బుర్రాది సాయం చేసే మనసు.. ఉగ్రది జిమ్మిక్కుల రాజకీయం
సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిలు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 10 మంది వరకు పోటీలో ఉన్నారు. మనసున్న నేత ♦ బుర్రా మధుసూదన్ యాదవ్‌కు తొలి నుంచి సౌమ్యుడిగా పేరుంది. ♦ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించేతత్వం ఆయన సొంతం. ♦ భోళా శంకరుడు. కల్మషం లేని వ్యక్తి ♦ ఐదేళ్ల నుంచి కనిగిరిలో ఉంటూ అందరి మనిషిగా పేరొందారు. ♦ పేద, ధనిక తేడా లేదు. గర్వం అనేది ఉండదు. ♦ అడిగిన వారికి ఎంతో కొంత సాయం చేయాలనే నైజం. ♦ ముందు ఎదుటి వారి మాట పూర్తిగా విన్న తర్వాత చిరునవ్యుతో స్పందిస్తూ అతనికి సమాధానం చెప్పడం బుర్రా గొప్పతనం. ♦ ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టడం బుర్రా నైజం. ♦ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యవుతారు. ♦ దివ్యాంగ, అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూస్తూ మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ♦ రాజకీయ జిమ్మిక్కులు తెలియవు ఉగ్రకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం .. ♦ గిట్టని వ్యక్తిపై కక్ష సాధిస్తాడన్న పేరు ♦ మంచితనంగా ఉంటూనే ఇబ్బంది పెడతాడు ♦ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాడు ♦ మాటల్లో ఆప్యాయత, పలకరింపు తక్కువ ♦ బెదిరింపు ధోరణి ఎక్కువగా కన్పిస్తుంది. ♦ కుల రాజకీయాలు చేస్తాడని పేరు ♦ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించడం ♦ ఎంతటి వారినైనా సమయానుగుణంగా తనవైపు తిప్పు కోవడం ♦ రాజకీయ రంగులు మరుస్తాడన్న పేరు ఉగ్ర నరసింహారెడ్డికి ఉంది. -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నేత
సాక్షి, పులివెందుల: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్ గఫూర్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పులివెందులలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గఫూర్, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి.. పార్టీలోకి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో అబ్దుల్ గఫూర్‌తోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు దాదాపు 500మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జైలుకెళ్లడానికైనా సిద్ధం
కనిగిరి: అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడనని.. ప్రజలకోసం జైలుకెళ్లాడానికైనా సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. పీసీపల్లి మండల అధ్యక్షుడు జి. బొర్రారెడ్డి, మరో పదిమందిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. గురువారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్ష, అధికారం, డబ్బుతో ప్రతిపక్షపార్టీకి చెందిన పీసీపల్లి సర్పంచ్‌ను లొంగబర్చుకున్నారన్నారు. తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడంపై తీవ్రంగా మండిపడ్డారు. శ్మశాన వాటికకు ఏవిధమైనా నిధులు మంజూరు లేక పోయినా నిర్మాణం చేపట్టి వారే పగల కొట్టుకుని అన్యాయంగా తమ నాయకులపై కేసులు బనాయించాడాన్ని తప్పుబట్టారు. పీసీపల్లి చెరువులోని సుమారు రూ. 50 లక్షల విలువ చేసే కర్రను అక్రమంగా కొట్టుకోవడాన్ని అడ్డుకున్నందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతా కలిసి దోచుకుంటున్నారు ఎమ్మెల్యే సహా అధికారపార్టీ నాయకులు, అధికారులు కలిసి లక్షలు విలువ చేసే కర్రను దోచుకుంటున్నారని బుర్రా ఆరోపించారు. బ్రాంది షాపుల వద్ద నెలవారీ మామూళ్లు, రోడ్లు, నీళ్లు ఇలా ప్రతిపనిలో పర్సంటేజీలు.. కమిషన్లు తీసుకుంటూ.. ఎమ్మెల్యే నెలకు ఒక సారి కనిగిరికి వచ్చి మూడు సూట్ కేసులు నింపుకుని వెళ్తున్నారని విమర్శించారు. పట్టణంలో చిన్న రోడ్లల్లో మూడంతస్తుల భవనాలు కడుతున్నారని.. వాటిని పగుల కొట్టాలని.. పూర్వీకుల కాలం నుంచి పేదవర్గాల వద్ద ఉన్న ఎకరా, రెండెకరాలు ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకోవాలంటూ ఎమ్మెల్యే.. మంత్రిని కోరడం దుర్మార్గమైన చర్యంటూ మండి పడ్డారు. కమీషన్ల బాబూరావు ఎమ్మెల్యే కదిరిబాబురావు ఇప్పటికి తనపై 6 అక్రమకేసులు పెట్టించారని.. అయినా భయపడనని బుర్రా అన్నారు. ప్రజల్లో విశ్వాసం కొల్పోయిన కమీషన్ల బాబూరావు.. అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే అనైతిక రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పోలీసు అధికారులు న్యాయబద్ధంగా విచారణ నిర్వహించాలని బుర్రా కోరారు. అక్రమ అరెస్ట్‌లు కొనసాగిస్తే.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీపల్లి వైస్ ఎంపీపీ మహేష్‌నాగ్, సర్పంచ్‌లు శీలం సుదర్శన్, జపన్య, మోహన్‌రెడ్డి, రమేష్, గోపాల్‌రెడ్డి, కృష్ణా, ఓకే రెడ్డి, మూలె కొండారెడ్డి, పరిమి వెంకట్రావ్, వి. సుబ్బారావు, దత్తాత్రేయ, ఎన్. వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి వేల్పుల వెంకటేశ్వర్లు, గుండ్లతోటి మధు, రామన శ్రీను, బాలకృష్ణా పాల్గొన్నారు. -
రైతులను మోసగిస్తున్నారు
కనిగిరి: సీమాంధ్ర పీఠంపై ఎక్కిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు ప్రకటనలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు క నిగిరిలోని చర్చి సెంటర్లో రాస్తోరోకో నిర్వహించారు. రుణమాఫీ కోసం ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అయితే ఆందోళ చేస్తున్న వారిలో 20 మంది కార్యకర్తలు, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగనాయకులరెడ్డి, తమ్మినేని శ్రీను, యూత్ విభాగం మండల కన్వీనర్ ఎస్కే రహీం పాల్గొన్నారు.