
(ఫైల్ ఫోటో)
సాక్షి, ప్రకాశం : మదనపల్లి చెక్‌పోస్ట్ వద్ద తాను బంధువులతో హల్‌చల్ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. తాను ప్రయాణించిన కారు వెనుక నా అనుచరుల కారు ఒక్కటే ఉందని తెలిపారు. చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అభ్యంతరం తెలపడంతో తన వెంట వచ్చిన కారును కూడా వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. తాను బంధువులతో కలిసి హల్‌చల్ చేశానంటూ తనపై దుష్ప్రచారం చేశారన్నారు. చెక్‌పోస్ట్ వద్ద ఆగి ఉన్న కారులన్ని తనవే అంటూ అసత్య ప్రచారం చేశారని తెలిపారు. పోలీసుల మాటను గౌరవించి నియోజకవర్గంలో తాను ఒక్కడినే వచ్చానని, లాక్‌డౌన్ నిబంధనలను సంపూర్ణంగా పాటించాలని మధుసూదన్ యాదవ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment