Check post
-
భారీగా నగదు సీజ్
గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా గురువారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.3,22,500 నగదును గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్పీ రితిరాజ్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలికూడదని తెలిపారు. వనపర్తి: జిల్లావ్యాప్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.4 లక్షల నగదు, 9 లీటర్ల మద్యం, 51 కేజీల నల్లబెల్లం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్పీ రక్షితా కె.మూర్తి వెల్లడించారు. పెద్దమందడి మండలం వెల్టూరు చెక్‌పోస్టు వద్ద రూ. 4లక్షల నగదు, ఖిల్లాఘనపురంలో 9 లీటర్ల మద్యం, వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 51 కేజీల నల్లబెల్లం పట్టుబడినట్లు తెలిపారు. జడ్చర్ల: పట్టణంలోని క్లబ్ రోడ్డులో తరలిస్తున్న రూ.9లక్షల నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. బ్యాంకులో డ్రా చేసిన నగదును బాదేపల్లికి చెందిన వంశీధర్‌రెడ్డి తన వాహనంలో తరలిస్తుండగా, పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కృష్ణా: మండలంలోని చేగుంట చెక్‌పోస్టు వద్ద రూ.2,47,479 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. రాయచూర్ నుంచి గుర్మిట్కల్కు నీలకంఠ పాటిల్ అనే వ్యక్తి నగదును తరలిస్తుండగా, పట్టుకుని నారాయణపేట్ గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. మాగనూర్: మరికల్ మండలం మాదారం గ్రామానికి చెందిన ఉప్పు రాము తన వాహనంలో రూ.లక్ష 40వేలు తరలిస్తుండగా, మాగనూర్‌లో పట్టుకున్నట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. ఊట్కూర్: పగిడిమారికి చెందిన వెంకటేష్ తన వాహనంలో రూ.లక్ష నగదు తరలిస్తుండగా, మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ గోకారి తెలిపారు. -
సరిహద్దులపై పోలీస్ ఫోకస్
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తం 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అవి హైదరాబాద్ రూట్లో రేణికుంట టోల్‌ప్లాజా, పెద్దపల్లి మార్గంలో మొగ్దుంపూర్, జమ్మికుంట వైపు సిరిసే డు, వరంగల్ రూట్లో పరకాల ఎక్స్‌రోడ్ వద్ద, మంచిర్యాల రూట్లో చొప్పదండి ఆర్నకొండ వద్ద ఉన్నాయి. ఒక్కో చెక్‌పోస్టులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఎకై ్సజ్ శాఖ నుంచి ఒకరు, అటవీశాఖ నుంచి ఒకరు, రవాణా శాఖ నుంచి ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేల డబ్బులు, మద్యం, ఇతరత్రాలను కట్టడి చేసేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించాలి ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం హుజూరాబాద్శివారులోని కేసీక్యాంపు, ఇల్లందకుంట మండలం సరిసేడు, తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్నకొండ చెక్‌పోస్టును రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు తనిఖీ చేశారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యం నగదు, బంగారం తీసుకెళ్లేవారు రశీదులు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి, ఎలాంటి ఆధా రాలు లేని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన ఆయుధాలపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. గన్స్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రూ.1.50 లక్షలు సీజ్ కరీంనగర్ టూటౌన్ పరిధిలోని తెలంగాణచౌక్ వద్ద మంగళవారం బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.1.5 లక్షలు సీజ్ చేశారు. 10మంది పాతనేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. త్రీటౌన్ పరిధిలోని కాపువాడలో ఓ బెల్ట్‌షాపులో 23 మద్యం బాటిళ్లు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లిలో ఓ బెల్టుషాపు నుంచి రూ.3,800 విలువ చేసే మద్యం సీజ్ చేశారు. వీణవంక మండలంలో 13మందిని తహసీల్దార్ తిరుమల్‌రావు ఎదుట భైండోవర్ చేసినట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మండలంలోని మామిడాలపల్లి గ్రామంలోని ఓ బెల్టుషాపులో మద్యంబాటిళ్లను సీజ్ చేశారు. -
ఆవులు, దూడలను తరలించొద్దు
అనంతగిరి: బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. ఈమేరకు తన కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆవులు, లేగ దూడలను తరలించొద్దన్నారు. ఇతర పశువులను తీసుకెళ్లే వారు ఫిట్ ఫర్ స్లాటర్ పత్రాలు, పశువును తరలిస్తున్న వాహనాల పత్రాలు తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని తెలిపారు. వాహనంలో ఒక్కో పశువు మధ్య రెండు స్క్వేర్ మీటర్ల స్థలం ఉండాలన్నారు. వాహనాల్లో పరిమితికి మించి, ఎక్కువ సంఖ్యలో తరలించకూడదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే అక్రమ రవాణాగా పరిగణించి పశువులను గోశాలలకు తరలిస్తామని తెలిపారు. పది చెక్ పోస్టులు పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పశువులు కలిగిన వాహనాలను అనధికారికంగా అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా వెటర్నరీ అధికారి అనిల్ కుమార్ జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వికారాబాద్, పరిగి, తాండూరు అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. -
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో ఎన్నికల వేళ తనిఖీలు..
బొమ్మనహళ్లి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో విస్తృతంగా సాగుతున్న తనిఖీల్లో ఒకేసారి భారీఎత్తున నగదు పట్టుబడింది. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ నియోజకవర్గం వీరసంద్ర చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం ఎన్నికల స్క్వాడ్ తనిఖీలలో రూ.4 కోట్ల 75 లక్షల నగదు లభించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన మూడు వాహనాలను తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నగదును తరలిస్తున్నవారి వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ అధికారులకు సమాచారమిచ్చామన్నారు. దావణగెరె తాలూకా హెబ్బాల చెక్‌పోస్టు వద్ద ఎన్నికల సిబ్బంది తనిఖీల్లో బీఎండబ్ల్యూ కారులో తరలిస్తున్న రూ.39 లక్షల విలువైన 66 కేజీల వెండి పాత్రలు లభించాయి. చెన్నై నుంచి ముంబైకి వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కారు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందినదిగా భావిస్తున్నారు. కారును, వస్తువులను సీజ్ చేసి విచారణ చేపట్టారు. -
చెక్‌పోస్టు గార్డును ఢీకొట్టి చంపిన లారీడ్రైవర్
నవీపేట: ఆపేందుకు ప్రయత్నించిన చెక్‌పోస్టు గార్డును లారీతో ఢీ కొట్టి వెళ్లిపోయాడు ఓ డ్రైవర్. తీవ్ర గాయాలతో గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పరిధి నవీపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నవీపేటలోని బాసర రహదారి పక్కన ఉన్న చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం చెక్‌పోస్టులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఈర్నాల మందగోల్ల శ్రీనివాస్ (47) అటుగా వస్తున్న లారీని ఆపాలని సిగ్నల్ ఇచ్చాడు. అయితే లారీ డ్రైవర్ లారీని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో శ్రీనివాస్ తన బైక్‌పై వాహనాన్ని వెంబడించి అభంగపట్నం శివారులో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీడ్రైవర్ శ్రీనివాస్‌ను వేగంగా ఢీకొ ట్టగా...అతడు రోడ్డు మీదే ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
Photo Feature: కరోనా వ్యాక్సిన్ చెక్‌పోస్ట్ చూశారా!
ఎన్నికలు జరిగేటప్పుడు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామ శివార్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం మనకు తెలిసిందే. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి రాజాపురం గ్రామంలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలనే లక్ష్యంతో ఎర్రగుంట పీహెచ్సీ సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోకి ప్రవేశించే చోట తాళ్లు కట్టి.. వచ్చివెళ్లే ప్రతీ ఒక్కరినీ వ్యాక్సినేషన్‌పై ఆరా తీశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే ఆ దారి ద్వారా అనుమతించి.. లేని వారికి అక్కడికక్కడే వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఇరవై మందికి పైగా టీకా పంపిణీ చేశారు. – అన్నపురెడ్డిపల్లి పురి విప్పిన నెమలి కాదు గుస్సాడీ కిరీటం దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేకంగా నిర్వహించుకునే దండారి ఉత్సవాలకు గిరిజనులు సన్నద్ధమవుతున్నారు. తరతరాలుగా వస్తున్న తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు దండారీలో కీలకమైన గుస్సాడీ కిరీటాలను తయారు చేయిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిట్టగూడలో నెమలి పింఛాలతో గుస్సాడీ కిరీటాలను తయారు చేశారు. వాటిని ఆదివాసులు ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నర్సాపూర్‌కు తీసుకొచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ రామా... కనవేమిరా... అయితే మార్కెట్.. లేదంటే ప్రకృతి.. రైతునెప్పుడూ కన్నీరు పెట్టిస్తూనే ఉంది. ఈసారి పత్తికి ధర బాగుంది అని సంతోషించేలోపే ప్రకృతి కన్నెర్రజేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో చెట్టుమీదే పత్తి తడిచి పచ్చిముద్దయ్యింది. తడిసిన పత్తిని ఏరి కల్లాల్లోనో, ఇళ్ల ముందో ఆరబెడుతున్నారు రైతులు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో మంగళవారం ఓ రైతు పత్తి పంటను రామాలయం ముందు ఇలా ఆరబెడుతూ కన్పించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
‘ఏక్‌రూపాయ్‌వాలా కోడ్’.. రూ.కోట్ల దందా!
సాక్షి, కరీంనగర్: వాస్తవానికి ‘ఏక్‌రూపాయ్‌వాలా’ అనేది ఓ కోడ్. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న బియ్యాన్ని తరలించే వ్యక్తులు చెక్‌పోస్టుల వద్ద వాడే పేరు ఏక్‌రూపాయ్‌వాలా.! అంటే రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా సేకరించి, కొంచెం ప్రాసెస్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే దందాకు అక్రమార్కులు పెట్టుకున్న ముద్దుపేరు. ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గోండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్లింది. అక్రమార్గంలో మహారాష్ట్రకు చేరిన తెలంగాణ సర్కారు బియ్యం అటు తిరిగి.. ఇటు తిరిగి.. మన రాష్ట్రంలోని కొన్ని రైస్‌మిల్లులకు చేరుకుంటున్న వైనం ఇది. దళారుల ద్వారా స్మగ్లర్ల ద్వారా చేతులు మారుతూ రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గొండియా మిల్లులకు చేరుకున్న పీడీఎస్ బియ్యం అక్కడ రాష్ట్ర సర్కారుకు లెవీ కింద కొంత బియ్యం పెట్టి మిగతా బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లులుకు అప్పగి స్తుంది. వారు ఆ ధాన్యాన్ని మర ఆడించి ప్రతీ క్వింటాకు రా రైస్ అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్‌సీఐకి పంపుతారు. ఇక్కడే కొందరు రైస్‌మిల్లర్లు తమ చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో కొంతభాగం ఇతర రాష్ట్రాలకు అంటే కనీస మద్దతు ధర అధికంగా ఉన్న రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తారు. ఈలోపు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంలో అక్రమమార్గంలో సేకరించిన పీడీఎస్ బి య్యాన్ని కలుపుతున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. కానీ.. ఈ బియ్యాన్ని తొలుత మహారాష్ట్రకు తరలించి అక్కడ సీజ్ చేసిన బియ్యంగా రశీదులు సృష్టించి తిరిగి తెలంగాణకే తరలిస్తున్నారు. ఇది ఈ దందాలో పూర్తిగా కొత్తకోణం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. నిబంధనల ప్రకారం చేయాల్సిన మిల్లులో ధాన్యాన్ని ఆడించాలి. కానీ.. రెడీమేడ్‌గా అక్రమ మార్గంలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని అందులో కలుపుతున్నారు. తద్వారా మిల్లులపై ఒత్తిడి లేకుండా కరెంటు, మ్యాన్ పవర్, రవాణా చార్జీలను ఆదా చేసుకుంటున్నారు. ఇందుకోసం దళారులను పెట్టి రూపాయి కిలో బియ్యం సేకరిస్తున్నారు. వీరు కొందరు యాచకులను చేరదీ స్తారు. వారితో ఇంటింటికీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.7 నుంచి రూ.9 చొప్పున సేకరిస్తారు. వాటిని మధ్యవర్తులు, దళారుల నుంచి రూ.15లకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని సిరోంచా, గోండియా రైస్‌మిల్లర్లకు రూ.25 విక్రయిస్తారు. మహారాష్ట్రలో దొడ్డుబియ్యానికి డిమాండ్ ఉండడంతో.. అక్కడి మిల్లర్లు ఈ బియ్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కిలో రూ.32 లేదా కొత్తగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ.40కిపైగా విక్రయిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో ఏక్‌రూపాయ్‌వాలా దందాను నడిపించేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. ఉమ్మడి ఆదిలా బాద్‌లోని అర్జునగుట్ట, ప్రాణహిత నదుల మీదుగా మహారాష్ట్రకు, లేదా మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీదుగా మహారాష్ట్రకు మరోరూటులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న చెక్‌పోస్టులు, రెవెన్యూ, పోలీస్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, పౌరసరఫరా ల శాఖలకు లక్షలాది చేతులు మారుతున్నాయి. కరోనా విజృంభించడం, చెక్‌పోస్టుల వద్ద నిఘా తీవ్రం కావడంతో స్థానిక రైస్ స్మగ్లర్లు రూటుమార్చారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిపోయిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో సీజ్ చేసిన బియ్యంగా చూపించేందుకు నకిలీ రశీదులు సృష్టిస్తున్నారు. సోమవారం రాత్రి మంథని మండలంలో పోలీసులు పట్టుకున్న పీడీఎస్ రైస్ వాహనాలే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలోని సిరోంచా, సరిహద్దు నుంచి వచ్చిన వీరి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించాయి. ఈ మధ్యలో వారిని ఎవరూ అడ్డుకోకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో యాచకుల నుంచి ఉన్నతా ధికారుల వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్‌కు కేంద్రం కరీంనగర్ కావడం గమనార్హం. కోట్లాది రూపాయల అక్రమ దందా చేస్తున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ ఆటకట్టించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మా దృష్టికి రాలేదు ‘ఏక్‌రూపాయ్‌వాలా’కు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి దాడులు చేస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేశ్‌రెడ్డి, డీఎస్వో, కరీంనగర్ ఎవరినీ వదలం.. రేషన్ బియ్యం సమాచారం వస్తే ఎవరినైనా ఎక్కడైనా పట్టుకుంటాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టుకొని అదనపు కలెక్టర్ పేసిలో కేసులు నడుస్తున్నాయి. పట్టుకున్న బియ్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వేలం వేస్తాం. – వెంకటేశ్, డీఎస్వో, పెద్దపల్లి చదవండి: Ranga Reddy: బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నాడు -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి
బాగ్దాద్: ఐసిస్ ఉగ్రదాడులు రెచ్చిపోయారు. తమ ఆట కట్టించేందుకు పని చేస్తున్న పోలీసులను మట్టుబెట్టారు. పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పోలీసులు కన్నుమూశారు. దీంతో ఇరాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ దేశంలోని కిర్కుక్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోని అల్ రషద్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్టుపై ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలకు చెందిన 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారని ఆ దేశ భద్రత అధికారి వెల్లడించారు. వారి దాడుల నేపథ్యంలో ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి -
హైదరాబాద్‌లో మరో 2 ఫ్లై ఓవర్లు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిల మీదుగా ఐటీ కారిడార్లలోకి ఈజీగా వెళ్తున్నవారికి.. తిరిగి వచ్చే సమయంలో రోడ్‌నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ల వద్ద వేగానికి కళ్లెం పడుతోంది. సిగ్నల్స్ వద్ద ఆగాల్సి వస్తోంది. అక్కడి వరకు రయ్యిమని ఎక్కడా ఆగకుండా దూసుకువచ్చిన వారికి.. రోడ్డు ఇరుకుగా మారడం, సిగ్నల్స్ పడటంతో ఎక్కువ సేపు ఆగాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నివారించేందుకు రోడ్ నెంబర్ 45 జంక్షన్ వద్ద, జూబ్లీచెక్‌పోస్ట్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఎస్పార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం) లో భాగంగా వీటిని నిర్మించనున్నారు. ఇవీ ఫ్లై ఓవర్లు.. రోడ్‌నెంబర్ 45 జంక్షన్‌వద్ద 400 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్, అనంతరం కొంత దూరం వెళ్లాక మరో ఫ్లై ఓవర్ జూబ్లీచెక్‌పోస్ట్ సమీపంలో ప్రారంభం అవుతుంది. దాదాపు కిలోమీటరు పొడవుండే ఆ ఫ్లైఓవర్ మీదుగా ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి జంక్షన్ వరకు సాఫీగా సాగిపోవచ్చు. ఒకే మార్గంలో, రెండు లేన్లుగా నిర్మించనున్న ఈ రెండు ఫ్లై ఓవర్ల అంచనా వ్యయం దాదాపు రూ.72 కోట్లు. వీటిల్లో రోడ్‌నెంబర్ 45 జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్‌ను మొదటి వరుసలో నిర్మించనుండగా, జూబ్లీచెక్‌పోస్ట్ వద్ద ప్లై ఓవర్‌ను రెండో వరుసలో నిర్మించనున్నారు. -
నిర్లక్ష్యం ఎవరిది? చూస్తుండగానే గాల్లో కలిసిన ప్రాణాలు..
సాక్షి, జన్నారం(ఖానాపూర్): అతివేగం ప్రమాదానికి దారి తీస్తుంది. ఒక్కోసారి మృత్యువూ కబళిస్తుంది. అతివేగంగా దూసుకువస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద అధికారులు సూచించినా ఆగకుండా వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించి వెనుక కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన తెలిసిందే. లక్సెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సుదగోని వెంకటేశ్‌గౌడ్(32) శనివారం తపాలపూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద చెక్‌పోస్టు గేట్‌కు ఢీకొని మృతిచెందిన వీడియో వైరల్‌గా మారింది. వేగంగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఆపాలని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్ అధికారి చేతితో సూచించినా ఆగలేదు. అతివేగంగా వస్తుండడాన్ని గమనించి గేట్‌ను ఎత్తే ప్రయత్నం చేస్తుండగా వాహన చోదకుడు క్షణాల్లో గేట్‌ను దాటి పోవాలని ప్రయత్నించాడు. వాహనం నడిపే వ్యక్తి ముందుకు వంగడంతో వెనుక కూర్చన్న వెంకటేశ్‌గౌడ్ గేట్‌కు ఢీకొని తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వీడియో ఆదివారం వైరల్ అయింది. అతివేగంగా నడిపిన చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రావు తెలిపారు. -
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. లాక్డౌన్ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివస్తున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా వాహనాలను నిలిపివేస్తున్నాki. ఈ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరిన అని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతోరా.9 నుంచి ఉ. 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 తర్వాత గూడ్స్ వాహనాలకు అనుమతి నిరారించింది. అయితే జొమాటో, స్విగ్గిలాంటి ఆన్లైన్ డెలివరీకి అనుమతి ఉంది. చదవండి: లాక్డౌన్.. లాఠీలకు పని చెబుతున్న పోలీసులు -
రాష్ట్రేతర వాహనాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కండిషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమగ్రంగా పరిశీలించిన తరువాతే వాటిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో అలక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. అన్ని చెక్‌పోస్టుల్లో అంతర్ రాష్ట్ర పర్మిట్లపై కఠిన ఆంక్షలు జారీ అయ్యాయి. అక్రమంగా ప్రవేశిస్తే ఐదు రెట్ల జరిమానా ఏపీలోకి ప్రవేశించే పొరుగు రాష్ట్రాల వాహనాలకు సంబంధించిన పన్నులను ఆన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించారు. ఈ పన్నులు వారానికి, నెలకు చొప్పున చెల్లిస్తారు. ఆఫ్లైన్లోనూ ఈ పన్నులు కట్టించుకుంటున్నారు. పన్ను చెల్లించకుండా ఏదైనా వాహనం రాష్ట్రంలో తిరుగుతూ పట్టుబడితే ఐదు రెట్ల జరిమానా విధించాలని రవాణా అధికారులు ప్రతిపాదించారు. రెండో డ్రైవర్ ఉండాల్సిందే టూరిస్ట్, కాంట్రాక్ట్ క్యారియర్ బస్సుల్లో రెండో డ్రైవర్ నిబంధనను కచ్చితంగా పాటించేలా చూడాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పరిధిలోని ప్రజా రవాణా వాహనాలకు సైతం రెండో డ్రైవర్ ఉండాలని పేర్కొంది. డముకు మలుపు వద్ద బస్సు లోయలో పడిపోవడానికి దాని డ్రైవర్‌కు విశ్రాంతి లేకపోవడమే కారణమని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ అలసటకు గురి కావడం, నిద్ర లేమి వల్ల ఆ ప్రమాదం జరిగిన దృష్ట్యా డ్రైవర్లు విధిగా 8 గంటల డ్యూటీపై నిబంధన పాటించాలని, ఆ దిశగా తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. చెక్‌పోస్టుల్లో తనిఖీల సందర్భంగా అశ్రద్ధ వహిస్తే అక్కడ పనిచేసే ఎంవీఐ, ఏఎంవీఐలపై వేటు తప్పదని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
ఇక మరింత కఠినంగా లాక్డౌన్..
సాక్షి, చెన్నై: లాక్ అమలు కఠినం కానుంది. ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కట్టడి లక్ష్యంగా నాలుగు జిల్లాలో అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ మళ్లీ అమల్లోకి వచ్చింది. ఇక ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారి వాహనాలు సీజ్ చేయడమే కాదు, జరిమానాల్ని వడ్డించడమే కాదు, తీసుకెళ్లి శివార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్లలోకి నెట్టేందుకు తగ్గట్టుగా దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇక, గురువారం చెన్నై శివార్లలోని రహదారులన్నీ కిక్కిరిశాయి. నగరం ఖాళీ చేసి స్వస్థలాలకు పయనమైన వాళ్లు వేలల్లో ఉన్నారు. చెన్నై కమిషనరేట్ పరిధి, పక్కనే ఉన్న మూడు జిల్లాల్లో కరోనా స్వైరవిహారంతో పాలకులు కలవరంలో పడ్డ విషయం తెలిసిందే. ఇక్కడ కరోనాపై సమర భేరి మోగించేందుకు మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో కూడిన వారియర్స్ రంగంలోకి దిగారు. ఈపరిస్థితుల్లో కేసుల కట్టడి లాక్ ద్వారానే సాధ్యమన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నుంచి ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఈ ప్రకటనతో చెన్నై, శివార్లలో ఉండడం కన్నా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ గ్రామాలు, స్వస్థలాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి జనం వచ్చేశారు. చదవండి: వ్యాపారం గాడిలో పడింది శివార్లు కిటకిట.. చెన్నై నుంచి ఇతర జిల్లాల వైపుగా వేలాది మంది కదలడంతో శివార్లలోని అన్ని మార్గాలు గురువారం కిట కిటలాడాయి. దక్షిణ తమిళానాడు వైపు సాగే బైపాస్, పెరుంగళత్తూరు, వండలూరు మార్గం కిక్కిరిసింది. చెంగల్పట్టు టోల్గేట్లో కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి. పోలీసులు తనిఖీలకు కూడా శ్రమ తప్పదన్నట్టుగా వాహనాలు చొచ్చుకొచ్చాయి. ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాల్లో దక్షిణ తమిళనాడు వైపు కదిలిన జనం ఎక్కువే. దీంతో ఆయా జిల్లాల సరిహద్దుల్లో చెన్నై వైపు నుంచి వచ్చే వారిని తనిఖీల అనంతరం క్వారంటైన్లకు తరలించే పనిలో పడ్డారు. ఇక, కాంచీపురం జిల్లా వైపు, తిరువళ్లూరు జిల్లా వైపుగా, ఈసీఆర్, ఓఎంఆర్ మార్గాల వైపుగా వాహనాలు పరుగులు తీశాయి. కొందరు అయితే, ఇళ్లను ఖాళీ చేసి వెళ్లడం, బ్యాచిలర్స్ తమ తమ గదుల్ని ఖాళీ చేసి, టీవీలు, ఇతర సామన్లు బైక్‌పై పెట్టుకుని రయ్యి మంటూ దూసుకెళ్లారు. కొన్ని చోట్ల పోలీసులు తనఖీలు కఠినం చేసినా, వాహనాలు బారులు తీరడంతో చేతులెత్తేయక తప్పలేదు. అతి కష్టం మీద వాహనాలకు జరిమానాల వడ్డన విధించారు. ఇప్పటి వరకు ఈ జరిమానాల రూపంలో రూ. 13.5 కోట్లు వసూళ్లు చేసి ఉండడం గమనార్హం. ఆరు లక్షల మందికి పైగా కేసులు, ఐదు లక్షల వాహనాలను సీజ్ చేసి ఉన్నారు. కాగా ఇప్పటి వరకు పది లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్‌లు పొంది ఉండడం, మరో 25 లక్షల మంది ఈ పాస్‌ల కోసం దరఖాస్తులు చేసుకుని ఉండడం గమనించ దగ్గ విషయం. రోడ్డెక్కితే సీజ్.. చెన్నై కమిషనరేట్ పరిధిలో నాలుగు వందలు, మిగిలిన మూడు జిల్లాల పరిధిలో మరో రెండు వందలు చొప్పున చెక్ పోస్టులు వెలిశాయి. ఇక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు. రోడ్డెక్కితే చాలు వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. ఈ పాస్‌లు కల్గిన వారిని మాత్రం పరిశీలించి అనుమతించాలని, ఇతర వాహనాలను సీజ్ చేయాల్సిందేని, వాహనదారులపై కేసులు, ఆయా ప్రాంతాల శివార్లలో ఏర్పాటుచేసిన క్వారంటైన్లకు తరలించేందుకు తగ్గ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇక, అంబులెన్స్ , వైద్య సేవలు పొందే వారి కోసం ప్రైవేటు, ట్యాక్సీ ఆటోకు అనుమతి కల్పించారు. విమాన, రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయితే, అందులో ప్రయాణించే వారి చేతిలో విమానం, రైలు టికెట్ తప్పనిసరి . లేదా క్వారంటైన్లోకి నెట్టడం ఖాయం. ప్రజలు తమ పరిసరాల్లోని 2 కిమీ దూరంలో ఉన్న దుకాణాల్లోకి వెళ్లి సామన్లు తెచ్చుకోవాలని, అది కూడా నడిచి వెళ్తే మంచిదని హెచ్చరించారు. వాహనాల్లో వెళ్లి తమకు పట్టుబడితే సీజ్ చేయడం ఖాయం అని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, ఆన్లైన్ ఫుడ్ సరఫరా సంస్థలు సిబ్బంది తమ గుర్తింపు కార్డులు , ఆయా సంస్థల అనుమతి పత్రాలను తప్పనిసరిగా చేతిలో ఉంచుకోవాలని సూచించారు. నీళ్లు, పాలు, పెట్రోల్, గ్యాస్ సంస్థలు తమ తమ వాహనాల ముందు ఏ5 షీట్‌తో కూడిన అనుమతి పొందిన పేపర్‌ను తనిఖీ సిబ్బందికి కనిపించే విధంగా ఉంచాలని ఆదేశించారు. 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంక్‌లు పనిచేస్తాయి. చదవండి: లాక్డౌన్ ప్రకటనతో.. కిక్కు కోసం క్యూ బ్యాంక్ సిబ్బంది తమ వాహనాల్లో తప్పనిసరిగా ఆయా ఉన్నతాధికారులు అనుమతితో కూడిన లెటర్ ప్యాడ్స్ ఉంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. 21,28 తేదీల్లో పాలు, నీళ్లు, వైద్య సేవల మినహా తక్కిన అన్ని సేవలు పూర్తిగా బంద్ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఎలాంటి అను మతి లేకుండా రోడ్డెక్కే వాహనాలు సీజ్ చేయాలని, ఒక ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి వచ్చి కూరగాయలు , ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసే వారితో మరింత కఠినంగానే వ్యవహరించాలని ఆదేశించడం, నకిలీ పాస్‌లు కల్గిన వారిపై కేసులు నమోదు అంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన దృష్ట్యా, ఇక, కఠినంగానే దరువు మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం కోసం బారులు.. ఇప్పటికే చెన్నైలో మద్యం దుకాణాలు అన్నది తెరచుకోలేదు. అయితే, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో తెరిచారు. అది కూడా శుక్రవారం నుంచి మూసివేయనున్నారు. దీంతో చెన్నై శివార్లలోని ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్న టాస్మాక్ దుకాణాల వద్ద కిలోమీటర్ల కొద్ది మందు బాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల తోపులాటలు, ఘర్షణలు తప్పలేదు. సామాజిక బాధ్యతలు, భౌతిక దూరాల్ని మరిచి మద్యం కోసం ఎగబడ్డ బాబులు ఎక్కువే. దీంతో పోలీసులు లాఠీలు జుళిపించక తప్పలేదు. నంబర్లు.. ఇక, 22 నుంచి 26వ తేదీ వరకు రేషన్ దుకాణాలను మూసి వేస్తూ, ఇంటింటా రూ. వెయ్యి నగదు పంపిణీ చేసే వారికి మాత్రం ప్రత్యేక అనుమతి ఇవ్వనున్నారు. అలాగే, వృద్ధులు, వికలాంగులు, ఆదరణ లేని వాళ్లు, పేదలకు సేవ చేయదలచిన, స్వచ్ఛంద సంస్థలు అనుమతి తప్పనిసరిగా పొందాల్సిందేనని, అందరూ మాస్క్‌లు ధరించాల్సిందేని, ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాల్సిందేనని పిలుపునిస్తూ డీజీపీ త్రిపాఠి ఈ లాక్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఏదేని అనుమానాలు ఉంటే, ప్రత్యేక కంట్రోల్ రూమ్ 044–23452330, 044–23452362 లేదా 9003130103 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. -
చెక్‌పోస్టు కష్టాలు..!
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని నర్సింగాపూర్ గ్రామ పరిసరాల్లో కరీంనగర్– సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎండలో.. వానలో వాహనాల రాకపోకలు నియంత్రిస్తూ ఇంట్లో ఉండాలని ప్రజలకు చెబుతున్నారు. ఏదో ఓ వంకతో వాహనాలపై వస్తున్న వారిని బయటకు రావద్దని వేడకుంటున్నారు. పొద్దంతా విపరీతంగా ఎండ దంచుతోంది.. అదే ఒక్కసారిగా సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కరుస్తోంది. రోడ్డు పక్కకు చిన్న గుడారం వేసుకుంటే అది మూడు రోజుల క్రితం ఈదురు గాలులకు లేచిపోగా మళ్లీ వేసుకున్నారు. అక్కడే భోజనం..అక్కడే నిద్ర ఇలా ప్రజల కోసం కష్ట పడుతున్నారు. -
అవన్నీ తప్పుడు వార్తలు : ఎమ్మెల్యే మధుసూదన్
సాక్షి, ప్రకాశం : మదనపల్లి చెక్‌పోస్ట్ వద్ద తాను బంధువులతో హల్చల్ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. తాను ప్రయాణించిన కారు వెనుక నా అనుచరుల కారు ఒక్కటే ఉందని తెలిపారు. చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అభ్యంతరం తెలపడంతో తన వెంట వచ్చిన కారును కూడా వెనక్కి పంపినట్లు పేర్కొన్నారు. తాను బంధువులతో కలిసి హల్చల్ చేశానంటూ తనపై దుష్ప్రచారం చేశారన్నారు. చెక్‌పోస్ట్ వద్ద ఆగి ఉన్న కారులన్ని తనవే అంటూ అసత్య ప్రచారం చేశారని తెలిపారు. పోలీసుల మాటను గౌరవించి నియోజకవర్గంలో తాను ఒక్కడినే వచ్చానని, లాక్డౌన్ నిబంధనలను సంపూర్ణంగా పాటించాలని మధుసూదన్ యాదవ్ వెల్లడించారు. -
రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
సాక్షి, చిత్తూరు: రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై శనివారం తెల్లవారు జాము నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ డ్రైవర్ల నుంచి చెక్‌పోస్ట్ సిబ్బంది డబ్బులు తీసుకొంటుండగా పట్టుకున్నారు. చెక్‌పోస్టులో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. చెక్‌పోస్టు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఎంత డబ్బు పట్టుబడింది పూర్తి వివరాలు తెలియరాలేదు. రేణిగుంట చెక్‌పోస్టు సిబ్బందిపై చాలా కాలంగా అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. -
చెక్‌పోస్టుల అక్రమాలకు చెక్
సాక్షి, జన్నారం: సార్ ఈరోజు చెక్‌పోస్టు వద్ద ఎవరున్నారు... మీరే ఉన్నారా... రాత్రికి నా బండి వస్తది, జర విడిచిపెట్టండి...ఏదన్న ఉంటే చూసుకుంటా... అని ఓ స్మగ్లర్ చెక్‌పోస్టు డ్యూటీ చేసే సిబ్బందితో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని కలప తరలిస్తారు. సార్ ఈ రోజు ఉన్నారా మీరు... లేదు... రేపు నాకు డ్యూటీ ఉంటుంది.. రేపు రా అని ఓ అధికారి తన డ్యూటీని ముందుగానే స్మగ్లర్‌కు సమాచారం ఇస్తాడు. ఇలా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అక్రమంగా కలప తరలిపోవడానికి సహకరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టెందుకు అధికారులు సమూల మార్పులు తీసుకొస్తున్నారు. చెక్‌పోస్టులను దాటించిన సంఘటనలు అనేకం: కలమడుగు అటవి చెక్‌పోస్టు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్లో టైగర్‌జోన్ లో నుంచి కలప తరలిపోకుండా రాత్రి పూట వాహనాల రాకపోకలను జరుపకుండా ముత్యంపేట్, తపాలపూర్, పాడ్వాపూర్, కొత్తగూడం, కలమడుగు లలో అటవి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పగలంతా కలప తరలిపోకుండా చూడటమె కాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ వాహానాలను టైగర్‌జోన్ లో పర్యటన నిషేదించారు. చెక్‌పోస్టు డ్యూటీ దినం, తప్పించి దినం ఇద్దరే చేసే వారు. ఇద్దరే ఉండటం వల్ల రాత్రి పూట ఇసుక తరలించే వారి వాహానాల వద్ద ఎంతో కొంత తీసుకుని వాటిని వదిలివేయడం, ముందుగానే కలప తరలించే వ్యక్తులు డ్యూటీ చేసే వారితో మాట్లాడి కలప దాటించడం జరిగేది. ఇటివల అనేక వాహనాలను చెక్‌పోస్టులు దాటి లక్షేట్టిపేట్ వెళ్తుండగా పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటివల మామిడిపెల్లి నుంచి వ్యాన్‌లో కలప చెక్‌పోస్టులు దాటి వెళుతుండగా లక్షేట్టిపేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా చెక్‌పోస్టు దాటించెందుకు వెళ్తుండగా జన్నారం అటవి అధికారులు ఒక కారును పట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మార్పులు తీసుకువచ్చారు. ఎవరికి డ్యూటీ ఉంటుందో వారికే తెలియదు డ్యూటీ ఇద్దరికే ఇవ్వడం వల్ల వారితో స్మగ్లర్లు మచ్చిక చేసుకుని కలప తరలిస్తున్నారనే విషయాన్ని గమనించిన అటవిశాఖ ఎఫ్‌డీవో మాధవరావు నూతన డ్యూటీ విధానానికి తెరదించాడు. చెక్‌పోస్టు డ్యూటీ ఇద్దరికే కాకుండా డివిజన్ పరిధిలోని బీట్ అధికారులకు అందరికి వేయాలని యోచించాడు. డివిజన్లోని బీట్ అధికారికి ఒక గంట ముందే సమాచారం ఇచ్చి డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఇస్తున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద ఎవ్వరు డ్యూటీ చేస్తారో అనే విషయం స్మగ్లర్లకు తెలియకుండా ఉంటుంది. తనకు డ్యూటీ ఉంటుందనే విషయం ఆ బీట్ అధికారికే తెలియని పరిస్థితి ఉంటున్నందున అక్రమాలు జరిగే అవకాశం లేదు. అదే విధంగా గతంలో చెక్‌పోస్టు డ్యుటీలు చేసిన వారు కూడ తిరిగి బీట్లలో వెళ్లాల్సి ఉంటుంది. ఒకే రోజు డ్యూటి ఉంటున్నందున తన ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి ఎలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండదనేది అధికారుల ఆలొచన. సీసీ కెమెరాలతో నిఘా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెట్టారు. గతంలో సీసీ కెమరాలను అమర్చిన వాటి ప్రసారం కేవలం చెక్‌పోస్టు వద్దనే ఉండేది. అయితే ఎఫ్‌డీవో మాధవరావు చెక్‌పోస్టు వద్ద అమర్చిన సీసీ పుటేజీలు తన కార్యాలయంలో, తన మోబైల్లో కనిపించేలా తగు ఏర్పాట్లను చేసుకున్నారు. దీంతో చెక్‌పోస్టుల నిర్వహణపై ప్రతి రోజు, ఖాళీ సమయంలో మోబైల్ లో లేదా, తన కార్యాలయంలోని కంప్యూటర్లో పరిశీలిస్తున్నారు. గతంలో ఏదైన అవకతవకలు జరిగే క్రమంలో సదరు సిబ్బంది చెక్‌పోస్టు వద్ద కెమరాను బందు చేసి వాహనం వెళ్లాక తిరిగి ఆన్ చేసే అవకాశం ఉండేది ఎందుకంటే కెమరాలోని వివరాలు అక్కడే అమర్చిన కంప్యూటర్లో రికార్డు అయ్యేది. వాటిని అధికారులు ఎప్పుడో ఒక్కసారి పరిశీలించేవారు. కాని ఇప్పుడు ఇక కెమరాలను ఆపి వేసే వీలు కూడ ఉండదు. కొన్ని సమయాల్లో వాహానాలను వదిలిపెడితే అప్పుడే ఫోన్ చేసి అడిగి అనుమానం నివృత్తి చేసుకునే వీలుంటుంది. దీంతో భయానికి చెక్‌పోస్టు వద్ద ఉండే సిబ్బంది అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. చెక్‌పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల తనిఖీలలో అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమూల మార్పుల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాను చెక్‌పోస్టులలో కలప తరలిపొవడమ గమనించాను. సిబ్బందిని పలుమార్లు హెచ్చరించిన అప్పుడప్పుడు ఒకటి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశాము. కొత్త విధానం వల్ల సిబ్బందికి భయం ఉంటుంది. అదే విధంగా డ్యూటీ ఎవ్వరు చేస్తున్నారో తెలియకుండా ఉంటుంది. కేవలం గంట ముందే డ్యూటీ చేసే సిబ్బంది గురించి సంబంధిత రేంజ్ అధికారి వారికి తెలియజేస్తారు. దీంతో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదని ఆశిస్తున్నాం. – మాధవరావు, ఎఫ్‌డీవో -
ఇసుక అక్రమాల అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుపై సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, పోలీస్ తదితర శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఎంపిక చేసిన ముఖ్య ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద వాహనాలను నిరంతరం తనిఖీలు చేయడంతో పాటు సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక రాష్ట్రందాటి వెళ్లకుండా చర్యలు తీసుకోవా లన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్య దర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సురేంద్రబాబు, గనులశాఖ కార్యదర్శి రాంగోపాల్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. సచివాలయాల్లో ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయండి గ్రామ, వార్డు సచివాలయాల్లో క్రీడా కోటా, ఇతర కేటగిరీల్లో భర్తీ కావాల్సిన పలు ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని అధికారు లను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియపై ఆమె సమీక్షించారు. -
పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
సాక్షి, పెనుకొండ(అనంతపురం) : పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న రూ.53,410 స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన సమాచారం మేరకు... ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో వసూలు చేసిన మొత్తంతో ఏఎంవీఐ ప్రసాద్ తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించగా.. ఏఎంవీఐ కేఎల్‌వీఎన్ ప్రసాద్ నుంచి లెక్కల్లో లేని రూ.30,510, అక్కడే ఉన్న ప్రైవేట్ వ్యక్తి శివారెడ్డి నుంచి రూ.22,900 స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తంగా రూ.53,410 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని రవాణాశాఖ అధికారి వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖకు నివేదిక పంపుతామన్నారు. దాడుల్లో సిబ్బంది చక్రవర్తి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పాత ఇనుమే బంగారమాయెగా..
పార్వతీపుం: ‘‘పాత ఇనప సామాన్లు కొంటాం, పాత ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, మీకు పనికిరాని ఏ వస్తువునైనా కొంటాం’’ అంటూ వీధుల్లోకి వచ్చే వ్యాపారులను తరచూ చూస్తుంటాం. అలాంటివారిని చూసినప్పుడు మన ఇంటిలో ఉండే పాత వస్తువులు వారికి ఇచ్చి వారిచ్చే శనగలో, కొబ్బరి మిఠాయో లేక ఉల్లిపాయలో తీసుకుంటాం. వీడికి ఈ పాత సామాన్ల వల్ల ఏమొస్తుందా అనుకుంటాం కాని దీని వెనక జరుగుతున్న కథ వేరే ఉంది. పగటి పూట వీధుల్లో తిరుగే వ్యాపారులు ప్రతి వీధినీ, ప్రతి ఇంటినీ క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఆ తరువాత వారు ఇంటికి వెళ్లాక ఎక్కడ, ఏ ప్రాంతంలో ఏ వస్తువు చూశారో వారి అనుచరులకు చెబుతారు. వారు రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇలా దొంగిలించిన వస్తువులను పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తికి విక్రయిస్తుంటారు. పాత ఇసుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారులు దొంగిలించి తెచ్చిన వస్తువులు కాబట్టి సగానికి సగం రేటు తగ్గించి మరీ ఇస్తాడు. దీంతో ఇచ్చింది తీసుకుని వెళ్లిపోవడం దొంగల వంతౌతుంది. ఇది పాత ఇనుపసామానుల వ్యాపారం వెనుక జరుగుతున్న తంతు. ప్రభుత్వ వాహనాలు, పరిశ్రమల పరికరాలు కొనుగోలు.. పాత సామానుల వ్యాపారులు ప్రభుత్వ కార్యాలయాల్లో పాతబడి మూలకు చేరిన వాహనాలను ఆయా శాఖల్లో పనిచేసే అధికారులతో కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో మూలకు చేరిన వాహనాన్ని విక్రయించాలంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ముందుగా వేలం ప్రకటన ప్రకటించాల్సి ఉంటుంది. వేలంలో ఎవరు ఎవరు ఎక్కువ ధర ఇస్తామని పాట పాడితే వారికి ఆ వాహనాన్ని అప్పగించాలి. కాని పాత ఇనుప సామానుల వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై పాత వాహనాలను టెండర్ పిలవకుండా టోకున కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో పాతబడి మూలకు చేరిన జీపును పట్టణంలోని ఓ పాత ఇనుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారి కొనుగోలు చేసిన సంఘటన ఉంది. ఇలా ప్రభుత్వ వాహనాలు, విద్యుత్‌శాఖకు సంబంధించిన ఇనుప విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేసిన సందర్భంలో వ్యాపారులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి. దొంగ వస్తువులు కొనుగోలు.. వివిధ ప్రాంతాల్లో దొంగంలించిన వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.గ్రామాల్లో దొంగిలించిన సైకిళ్లు, పొలాల్లో రాత్రి వేళల్లో దొంగిలించిన విద్యుత్ మోటార్లు, ఐరన్ గేట్లు, ద్విచక్ర వాహనాలను వ్యాపారులు కొనుగోలు చేసి వెనువెంటనే వాటిని నుజ్జునుజ్జు చేస్తారు. ద్విచక్ర వాహనాల విడిభాగాలను విప్పేసి విక్రయిస్తుంటారు. ఇనుప రేకులు, ప్లాస్టిక్కుర్చీలు, విద్యుత్ తీగలు, పొల్లాల్లో ఉండే మోటార్లు ఇలా అనేక రాకాల ఇనుప వస్తువులను, దొంగ సరుకును కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ... జీఎస్టీ అమలు జరిగిన తరువాత ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఎత్తివేశారు. ఈ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో పాత ఇనుప సామాన్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ఒడిశా నుంచి లారీల్లో ఇనుప వస్తువులు దొంగతనంగా తెస్తే ఆంధ్రా ఒడిశా చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో దొరికిపోయేవారు. మరికొందరు చెక్‌పోస్టు అధికారులతో చేయి కలిపి దొంగతనంగా రవాణా చేసేవారు. ప్రస్తుతం చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో నేరుగా వ్యాపారుల చెంతకు దొంగ సరుకు చేరుతోంది. ఒడిశాలోని అనేక పరిశ్రమల నుంచి దొంగ ఇనుప సామాన్లు ఎప్పటికప్పుడు వ్యాపారుల అక్రమంగా వాహనాల్లో పార్వతీపురం తీసుకు వస్తుంటారు. కొరవడిన తనిఖీలు పార్వతీపురం పట్టణంలో పాత ఇనుప సామాన్లు వ్యాపారం చేసేవారు పది మంది వరకు ఉంటారు. ఇందులో చిన్నా చితకా వ్యాపారులు ఆరుగురు వరకు ఉండగా ప్రతి నెలా లక్షల్లో వ్యాపారం చేసేవారు నలుగురు ఉన్నారు. వారానికి రెండు లారీల్లో ఒక్కో వ్యాపారి పాత ఇనుప సామన్లును విజయవాడకు తరలిస్తున్నారంటే పాత ఇనుప సామన్లు ఎక్కడినుంచి పుట్టికొస్తున్నాయో అర్థమౌతోంది. వీరి వద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన మోటర్లు, యంత్రాలు, మెషిన్లు, పెద్దపెద్ద ఇనుప కమ్మెలు, సిలెండర్లు ఉన్నా అవి ఏవిధంగా వస్తున్నాయి.ఎలా కొనుగోలు చేస్తున్నారో పోలీసులు ప్రశ్నించిన సందర్భాలు లేవు. -
పెద్దఎత్తున బంగారం పట్టివేత
సాక్షి, చిత్తూరు : రేణిగుంట అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మీదుగా రాజంపేటకు బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. అటుగా వస్తున్న టాటా సుమోను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారు బిస్కెట్లను గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కడప వాసులుగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కువైట్‌లో పనిచేస్తూ సొంత ఊరికి వెళ్తామని చెప్పి సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం స్మగ్లింగ్ చేశారన్నారు. వాహనంతో పాటు ఆరుగురిని రేణికుంట అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
అవినీతికి లేదా‘చెక్’
అక్రమార్జనకు ఆనవాళ్లు.. చెక్‌పోస్టులు ఏసీబీ దాడులనూ లెక్కచేయని అధికారులు ప్రైవేటు వ్యక్తులతో వసూళ్ల పర్వం తాజా దాడుల్లోనూ నగదు స్వాధీనం జిల్లాలో చెక్‌పోస్టులు అవినీతికి కేరాఫ్‌గా మారుతున్నాయి. సరుకు రవాణాలో అవకతవక లను గుర్తించి పన్ను విధించాల్సిన అధికారులే అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. చెక్‌పోస్టుల్లోనే అవినీతి దుకాణం తెరుస్తున్నారు. చేయి తడపందే వాహనం కదిలేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. అడిగినంత ఇస్తే చాలు.. వే బిల్లులో పేర్కొన్న సరుకు కంటే ఎక్కువ ఉన్నా పట్టింపులేదు. దీంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది. జిల్లా ఉన్నతాధికారులకే రోజువారీ ముడుపులందుతుండటంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా జంకకపోవడమే వీరి బరి తెగింపునకు నిదర్శనం. ప్రైవేటు వ్యక్తులను నియ మించుకుని మరీ వసూళ్లకు తెగబడుతున్నారు. సోమవారం కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. చిత్తూరు(కార్పొరేషన్): ఇటీవల నాగులాపురం చెక్‌పోస్టు ఉద్యోగి ఓ వ్యాపారి వద్ద లంచం డిమాండ్ చేస్తూ వీడియోతో సహా పట్టుబడిన సంఘటన జరిగి నెల కూడా గడవక ముందే.. సోమవారం నరహరి పేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు, పలమనేరు చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడి చేసింది. ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని మరీ దందాకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఉండరాదని నిబంధనలున్నా అధికారులు ఖాతరు చేయడం లేదు. దీంతో సరుకు రవాణా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా అమ్యామ్యాలు ఆశిస్తుండటంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో డీజిల్, ఇతర పన్నులు భారీగా పెరగడంతో ఏమీ మిగటం లేదని వాపోతున్నారు. మారని తీరు–వ్యాపారుల బేజారు జిల్లా రెండు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉం డటం.. వాణిజ్యపరంగా వేగంగా అభివృ ద్ధి చెందుతుండటం... ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు జిల్లాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే ఎక్కువ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నరహరిపేట, జోడిచింతల, నాగలాపురం, పలమనేరు, ఠాణా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేశారు. పక్క రాష్టాలనుంచి జిల్లా మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను చెక్‌పోస్టుల్లో ధ్రువీకరణపత్రాల తనిఖీలు నిర్వహిస్తుంటారు. వే–బిల్లు, ట్రాన్సి స్టు పాస్, గూడ్స్ బిల్లు తనిఖీలు చేసుకుని రాకపోకలు సాగిస్తారు. అన్ని çపత్రాలు సక్రమంగా ఉన్నా చేతిలో పచ్చనోటు పెట్టనిదే బండికి అనుమతి లభించడం లేదు. ఇటీవల సీటీశాఖ చట్టాలు మరింత కఠినతరంగా మార్చింది. బిల్లులు సక్రమంగా లేకపోతే విలువ కంటే ఎక్కువగా జరిమానా విధించే విధంగా చట్టాలు మార్చింది. ఈ నిబంధనలే చెక్‌పోస్టుల్లో బాధ్యతలు నిర్వహించే అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో వ్యాపారులు చేసే చిన్న పొరపాట్లు, డ్రైవర్ల అవగాహన లేమిని సాకుగా చూపి సిబ్బంది నుంచి∙ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవిగో సాక్ష్యాలు గడిచిన సంవత్సరంలోనే ఆరు సార్లు చెక్పోస్టులపై ఏసీబీ దాడులు జరిగినా సిబ్బంది తీరులో మార్పురాలేదు. క్షేత్రస్థాయిలో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడం లేదని ఉన్నతధికారులు చెబుతున్నా నిత్యం చెక్‌పోస్టుల్లో ప్రైవేటు సిబ్బంది ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. ⇒గత సంవత్సరం న రహరిపేట చెక్‌పోస్టులో నిర్వహించిన తనిఖీల్లో అధికారికంగా వసూలు చేసిన బిల్లులు మొత్తం రూ.70వేలు కాగా అక్కడ అనధికారికంగా రూ.30 వేలు లభించింది. ⇒తిరుపతి సీటీవోగా ఉన్న శ్రీనివాసులు నాయుడు వేధింపులకు నిరసనగా వ్యాపారస్తులు మూడు రోజులు ధర్నా నిర్వహిం చారు. అయినా అధికారుల నుంచి వ్యాపారులకు వేధింపులు తప్పడం లేదు. ⇒సెప్టెంబరులో నాగలాపురం చెక్‌పోస్టులో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఏసీటీవోను డీసీ సస్పెండ్ చేశారు. డిసెంబర్లో నాగలాపురం చెక్‌పోస్టు డీసీటీవో లంచం తీసుకొని సస్పెండ్‌కు గురికావడం తెలిసిందే. గడిచిన ఐదు నెలల్లో చెక్‌పోస్టుల్లో దాటుకొని రూ.1.10 కోట్లు విలువైన గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు. ⇒పలమనేరు, నరహరిపేట చెక్‌పోస్టుల్లో సోమవారం జరిగిన దాడుల్లో అధికారులకు దాదాపు రూ.90 వేలు లెక్కల్లో లేని సొమ్ము తేలింది. -
గుప్త నిధుల తవ్వకం అనుమానంతో అరెస్ట్
సంబేపల్లె: గుప్త నిధులను తవ్వకం చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు వ్యక్తులతో పాటు కారును సంబేపల్లె ఎస్ఐ సయ్యద్ హాసం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నారు. ఆయన కథనం మేరకు.. మండల పరిధిలోని దుద్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు గస్తీ వెళుతుండగా రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పరుగులు పెట్టారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొన్నారు. కర్నాటకకు చెందిన మునిరాజు, చంద్రశేఖర్, విశ్వనాథ్, కరీముల్లా, నాగరాజులను పట్టుకొని విచారించగా గుప్తనిధులకోసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తెలుగు తమ్ముళ్ల వసూళ్ల దందా
- చెక్‌పోస్టు వద్ద అనధికారిక అంగళ్లు - ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహణ - వారు చెప్పిందే రేటు! - దోపిడీకి గురువుతున్న వాహనదారులు కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఒక పేపర్ జిరాక్స్ తీయించుకోవాలంటే రూ.1 నుంచి రూ.2లు తీసుకుంటారు. కానీ అక్కడ మాత్రం రూ.10లు వసూలు చేస్తారు. నెట్ సెంటర్లలో నాలుగు పేపర్లున్న పత్రాలను డౌన్లోడ్ చేయాలంటే రూ.10ల నుంచి రూ.15లు తీసుకుంటారు. అక్కడ మాత్రం రూ.50లు ఇవ్వాల్సిందే. ఇదేదో కాకులు దూరని కారడవి కాదు..నీళ్లు దొరకని ఎడారి ప్రాంతమూ కాదు. కర్నూలు నగర శివారులోని పంచలింగాల గ్రామంలోని వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద ప్రైవేటు ఆపరేటర్లు కొనసాగిస్తున్న దందా. అధికార పార్టీ నాయకుల సహకారంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి వాహనమూ స్థానిక పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాణిజ్యపన్నుల శాఖ అధికారులచే తనిఖీ చేయించుకుని వెళ్లాలి. ప్రతిరోజూ ఇక్కడ 1400 నుంచి 1600 వరకు వాహనాలు తనిఖీ చేయించుకుని వెళ్తాయి. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు వెళ్లి ట్రాన్సిస్ట్ పాస్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేయించుకుని వెళ్లాలి. ఈ పనిని వాణిజ్యశాఖ అధికారులే చేయించాలి. కానీ ఆ పని తమకు భారం అవుతుందని చెప్పి ప్రైవేటు ఆపరేటర్లకు ఆహ్వానం పలికి దందాకు తెరతీశారు. అధికారుల కనుసన్నల్లో ఈ చెక్‌పోస్టు వద్ద 20కి పైగా ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రత్యక్షమయ్యారు. ఒక గొడుగు, దాని కింద కంప్యూటర్, ప్రింటర్/జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసుకుని కూర్చుంటారు. ఒక్కొక్కరు రోజుకు 50 నుంచి 80 దాకా ట్రాన్సిస్ట్ పాస్‌లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసి ఇస్తుంటారు. ఇలా నాలుగు పేజీల ఒక పాస్ డౌన్లోడ్ చేసి ఇవ్వడానికి రూ.50లు వసూలు చేస్తారు. అంతేకాదు ఒక పేజిని జిరాక్స్ చేసి ఇవ్వడానికి రూ.10లు ఛార్జి చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఆపరేటర్ రోజుకు రూ.3వేల నుంచి రూ.4వేల దాకా ఆర్జిస్తున్నట్లు సమాచారం. తెలుగు తమ్ముళ్లదే హవా తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వాణిజ్యపన్నుల శాఖకు ప్రతి నెలా లక్ష్యాలు విధించారు. తెలంగాణా రాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేసి పంపించాలి. ఈ మేరకు ప్రతి ఒక్క వాహనమూ ట్రాన్సిస్ట్ పాస్ చూపించాలి. ఇక్కడే కొంతమంది తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. వెంటనే రహదారి పక్కన గుడిసెలు, బంకులు వేయించారు. ఒక్కో గుడిసె, బంకులను నెలకు రూ.5వేల చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. ఇలా అద్దెలు తీసుకున్న వారు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకున్నారు. ఆ గుడిసె, బంకుల ఎదురుగా రహదారిపై చిన్న గొడుగు ఏర్పాటు చేసి, దాని కింద కంప్యూటర్, ప్రింటర్‌ను ఉంచి దందా చేయిస్తున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద 20కి పైగా ఆపరేటర్లు 24 గంటలూ పనిచేస్తారు. ఎండా, వాన, చలిని లెక్క చేయకుండా కంప్యూటర్ ఆపరేటర్లు నెల, రోజు చొప్పున జీతానికి ఇక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ వీటిని ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు మాత్రం నెలకు ఎలాంటి పని చేయకుండానే రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల చేస్తున్న దందాను అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
వాడపల్లి(దామరచర్ల) తెలంగాణా రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని దామరచర్ల మండలం వాడపల్లి చెక్ పోస్టులపై శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ,రవాణా శాఖ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో కొంత మేర నగదు దొరికనట్లు సమాచారం.అయితే దీనిపై పూర్తివివరాలు తెలిపేందుకు సంబంధిత శాఖల అధికారులు నిరాకరించారు. -
పశుసంవర్ధక శాఖకు పనేదీ?
బీవీపాళెం(తడ): బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఉన్న ఏడు శాఖల్లో మిగిలిన ఆరు శాఖలకు అంతో ఇంతో పని ఉన్నా పశుసంవర్ధక శాఖకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి పనులూ లేక నిరుపయోగంగా మారింది. ఇక్కడ ప్రధానంగా వాణిజ్య, రవాణా శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా మైనింగ్, అటవీ శాఖల సేవలు కొంత వరకు అవసరం అవుతున్నాయి. ఎక్సైజ్, మార్కెటింగ్ శాఖలకు అప్పుడప్పుడు పనులు ఉంటుండగా పశుసంవర్ధక శాఖ మాత్రం తామూ ఉన్నామనేందుకు మినహా ఎలాంటి పనులకూ పనికిరావడం లేదు. గతంలో అవసరం గతంలో రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు పశువులను తరలించే వాహనంలో దాణా, నీరు, గాలి వంటి సరైన వసతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించేవారు. పెద్ద లారీలో 10, 12 పశువులు మాత్రమే తరలించాల్సి ఉంటుంది. కానీ 25 నుంచి 30 వరకు పశువులను తీసుకువెళ్లడం జరుగుతుంది. దీనిని నివారించేందుకు కూడా తనిఖీలు అవసరమయ్యేవి. ఇక్కడి నుంచి వెళుతున్న పశువులకు వ్యాధులు ఉండి అవి ఇతర రాష్ట్రాల పశువులకు సోకకుండా ఉండేలా వ్యాక్సిన్ వేశారా? లేదా? అనే వివరాలను నమోదు చేశారు. తగ్గిన రవాణా ప్రస్తుతం పశువుల రవాణా తగ్గింది. గతంలో రోజుకు 70 నుంచి 80 లారీలు వస్తుండగా ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే కేరళ వెళుతున్నాయి. అవి కూడా నాయుడుపేట మీదుగా వెళుతుండటంతో ఒకటి, రెండు మాత్రమే చెక్‌పోస్టు మీదుగా వెళుతున్నాయి. ఏ వ్యాపారీ తగిన పత్రాలతో రాకపోవడంతో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు, చిల్లర సమర్పణతోపాటు తమిళనాడులోనూ పోలీసులతో, ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది నెలకొంటోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు రూటు మార్చి నాయుడపేట మీదుగా కేరళ చేరుకుంటున్నారు. పాయింట్ మార్చితే ప్రయోజనం చెక్‌పోస్టు మీదుగా రవాణా ఆగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న పాయింట్‌ను నాయుడుపేట సమీపంలోని పండ్లూరు గేటు వద్ద లేదా మనుబోలు వద్ద ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
అక్రమంగా తరలిస్తున్న బియ్యం సీజ్
రామసముద్రం: అనుమతిలేకుండా కర్ణాటకకు టెంపోలో తరలిస్తున్న బియ్యాన్ని బుధవారం కమ్మవారిపల్లె చెక్‌పోస్టులో ఏఎస్ఐ గోపాల్ సీజ్ చేశారు. ఆయన కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన 120 బస్తాల బియ్యాన్ని తిరుపతి నుంచి టెంపోలో వేసుకుని కర్ణాటకకు తరలిస్తున్నారు. కమ్మవారిపల్లె చెక్‌పోస్టు వద్ద ఏఎస్ఐ తనిఖీలు చేయగా బియ్యానికి సంబంధించిన అనుమతులు లేవు. దీంతో బియ్యం, టెంపోను స్వాధీనం చేసుకున్నారు. అందులో 115 బస్తాల ఉప్పుడు బియ్యం, ఐదు బస్తాల సోనామసూరు బియ్యం ఉండడంతో రాయచోటికి చెందిన డ్రైవర్ వినయ్‌తుల్లా, ఓనర్ జమీల్బాషాపై కేసు నమోదు చేశారు. వారిని రిమాండ్ నిమిత్తం పుంగనూరుకు తరలించారు. -
హోలీకా ఇనామ్..!
► భైంసా చెక్‌పోస్టులో వ్యాపారుల నజరానాలు.. ► ఆర్థిక సంవత్సరం ముగింపులోనూ మారనితీరు ► వాణిజ్యపన్నుల శాఖలో అవినీతి బాగోతం భైంసా : హోలీ పండుగ అందరినీ రంగుల్లో ముంచెత్తితే.. భైంసా పట్టణ సమీపంలోని వాణిజ్యపన్నుల శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సిబ్బందిని మాత్రం నజరానాలతో తడిపేస్తోంది. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. దీంతో పట్టణసమీపంలో ఉమ్మడి రాష్ట్రంలోనే వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టు ఏర్పాటైంది. భైంసా పట్టణం మీదుగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వరకు పన్నులు చెల్లించకుండా అధికారులతో ముందస్తుగా సమాచారం ఇచ్చి వాహనాలను దాటించడం ఇక్కడ ‘మామూలు’ వ్యవహారంగా మారింది. అందుకే ఈ చెక్‌పోస్టులో పని చేసేందుకు అధికారులు, సిబ్బంది ఎక్కువ మక్కువ చూపుతుంటారు. గతంలో ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించినా అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇక్కడి అధికారులంతా బడా వ్యాపారుల కనుసన్నల్లోనే పని చేస్తుంటారనే ఆరోపణలున్నారుు. అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు వ్యాపారులు కూడా వారికి నజరానాలు ప్రకటిస్తుంటారు. ప్రతియేటా దీపావళి, దసరా, హోలీ పర్వదినాలు వచ్చాయంటే వ్యాపారులే ముందుకు వస్తారు. ఇనామ్‌ల పేరిట చెక్‌పోస్టుల్లో పనిచేసే అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఈ హోలీ వేడుక కూడా కలిసి రావడంతో వ్యాపారులు అధికారులను మెప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగింపు నెల అయినప్పటికీ... మార్చి నెల అంటేనే ఆర్థిక సంవత్సరానికి ముగింపు. అలాంటి ఈ నెలలోనూ భైంసా వాణిజ్యపన్నుల కేంద్రంలో తనిఖీలు అంతగా జరగడంలేదని విమర్శలు ఉన్నాయి. ముగింపు నెలలోనూ హోలీ పండుగ కలిసి రావడంతో ఈ చెక్‌పోస్టు గుండా వాహనాలు దాటించే బడా వ్యాపారులంతా ఇనామ్‌లు పంపిస్తున్నారన్న విషయం బాహాటంగా చర్చకు వస్తోంది. ఇక్కడి పరిస్థితిపై, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల తీరుపై తెలిసిన చర్యలు మాత్రంలేవు. పైగా పై అధికారులు కూడా ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. అధికారుల తీరు కాస్త ప్రభుత్వ ఖజానాకు గండి పడేలా చేస్తోంది. ఏళ్లుగా ఇదేతంతు.. భైంసా పట్టణం మీదుగా ప్రతిరోజు వేల సంఖ్యలోనే వాహనాలు సరిహద్దు దాటి వస్తుంటాయి. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పక్కాగా తనిఖీ చేస్తే అక్రమ వ్యాపారుల గుట్టు బట్టబయలవుతుంది. ఏళ్లుగా జాతీయ రహదారిపై భైంసా నుంచి వెళ్లేందుకు ప్రతి ఒక్కరికీ సులభమని తెలియడంతో వ్యాపారులంతా ఇటువైపే దృష్టి సారిస్తున్నారు. ముందస్తుగా స్థానిక చెక్‌పోస్టులో సమాచారం అందించి వాహనాలను యథేచ్ఛగా దాటిస్తున్నారు. వ్యాపారులు విశ్వప్రయత్నాలు చేసి ఇక్కడ విధులు నిర్వహించే అధికారులను మచ్చిక చేసుకుని తమ పని కానిస్తున్నారు. పోలీసుల తనిఖీలతో.. వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులను దాటి భైంసా వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పట్టణ సీఐ రఘు ఇప్పటికే తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన గు ట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. పట్టణ సీఐగా బాధ్యతలు తీసుకున్న వారం రో జుల్లోనే తనిఖీలు ముమ్మరం చేయడంతో వ్యాపారుల అక్రమదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసులు మరింత దృష్టి సారిస్తే కల్తీ నూనె, అనుమతి పత్రాలు లేకుండా వచ్చే చక్కెర లారీలు చిక్కే అవకాశం ఉంది. పోలీసు అధికారి తనిఖీలతో ఈ విషయం బయటపడుతుంటే ఇక్కడ తనిఖీల్లో షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించే వాణిజ్యపన్నుల అధికారులు, సిబ్బందికి ఇలాంటివి కనిపించకపోవడం గమన్హారం. -
రిజర్వు బ్యాంక్‌కు షాక్
సాక్షి, చెన్నై : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ర్టంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ప్రత్యేక స్క్వాడ్లు ఓ వైపు, ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లను అను సంధానిస్తూ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. చేతికి నగదు చిక్కితే చాలు, సీజ్ చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనిఖీల బృందాలపై విమర్శలు బయలు దేరుతున్నాయి. లెక్కలోకి రాని నగదు అంటూ ముందుగా పట్టుకుని సీజ్ చేయడం, వాటికి లెక్కలు చూపించిన తరువాయి అప్పగించడం సాగుతూ వస్తోంది. విధి నిర్వహణలో తాము ఏ మేరకు నిక్కచ్చితనంగా వ్యవహరిస్తున్నామో అని చాటుకునేందుకు ఏకంగా రిజర్వు బ్యాంక్‌కే ప్రత్యేక బృందాలు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ నుంచి అధికారుల్ని పరుగులు తీయించాయి. రిజర్వు బ్యాంక్‌కు షాక్: నామక్కల్‌జిల్లా పరమత్తి సమీపంలో ప్రత్యేక బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యాయి. ప్రత్యేక అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఈ తనిఖీలు సాగుతుండగా, టోల్గేట్ వైపుగా నాలుగు కంటైనర్లు ఒకదాని తర్వాత మరొకటి రావడంతో అనుమానం నెలకొంది. ఆ కంటైనర్లను నిలిపి తనిఖీ చేశారు. అందులో చిల్లర నాణేలు ఉండడం, అందుకు తగ్గ లెక్కలు లేని దృష్ట్యా, ఆ నాలుగు లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. ఆ కంటైనర్లలో ఉన్న చిల్లర నాణేలు రిజర్వు బ్యాంక్‌కు చెందినట్టు డ్రైవర్లు చెప్పుకున్నా, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాటిని లెక్కించగా కోటి రూపాయల వరకు రూ. పది నాణేలు, 75 లక్షల వరకు రూ. ఐదు నాణేలు, 37 లక్షల వరకు రూ. రెండు నాణేలు, 23 లక్షల వరకు రూ. 1 నాణెం ఉన్నట్టు గుర్తించారు. ఆ నాణెలు హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్తున్నట్టు తేలింది. అయితే, ఆ నాణేలు రిజర్వు బ్యాంక్ నుంచి వెళ్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేని దృష్ట్యా, సీజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఆ కంటైనర్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిలో నాణేలు ఉన్న సమాచారంతో ఆ పరిసర వాసులు కంటైనర్లు చూడడానికి ఎగబడ్డారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో షాక్‌కు గురైన హైద రాబాద్లోని రిజర్వు బ్యాంక్ అధికారులు హుటా హుటిన ఆధారాలకు తగ్గ సమాచారాలు, ఆ నగదు బట్వాడాకు చెందిన వివరాల్ని నామక్కల్ పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫ్యాక్స్ రూపంలో పంపాల్సి వచ్చింది. వాటిని పరిశీలించినానంతరం మూడు గంటల సమయంలో కంటైనర్లను వదలి పెట్టారు. ఇక, గుడియాత్తం సమీపంలో వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు మోటార్ సైకిల్‌పై వచ్చిన శరవణన్ అనే వ్యక్తి వద్ద రూ. నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సొంత పని మీద ఇంటి నుంచి నగదు తీసుకుని వెళ్తున్నట్టు వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. ఇక, కళ్లకురిచ్చి సమీపంలో ఓ కారులో రూ. 60 వేలు తీసుకొస్తున్న మణి అనే వ్యక్తిని తనిఖీ చేసి, ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అయితే, తన కుమారుడికి ఫీజులు చెల్లించడం కోసం బంధువుల వద్ద నుంచి రూ. 60 వేలు అప్పు తీసుకుని, వస్తుంటే, దానిని కూడా స్వాధీనం చేసుకోవడం ఏమిటో అంటూ మణి గగ్గోలు పెడుతున్నాడు. కొన్ని చోట్ల తనిఖీల పేరిట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు బయలుదేరాయి. -
గోనెల మాటున గోల్మాల్!
ధాన్యం వ్యాపారులు కాసులు దండుకోవడమే లక్ష్యంగా రోజురోజుకూ కొత్త మోసాలతో బరితెగిస్తున్నారు. నిన్నటి వరకు సాధారణ గోనెసంచుల్లో పక్క జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్న వీరు.. ఇప్పుడు ఏకంగా కొనుగోలు కేంద్రాల అనుమతులు పొందిన మిల్లులు ముద్రించిన గోనెసంచులతో అడ్డుగోలు వ్యాపారానికి తెరతీస్తున్నారు. వీరఘట్టం: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను అధికారుల ఆధ్వర్యంలో ధాన్యం అమ్మే రైతులకు ఇవ్వాన్నది ప్రభుత్వ నిబంధన. అయితే కొనుగోలు కేంద్రాల సిబ్బందితో దళారులు, వ్యాపారులు చీకటి ఒప్పందం కుదుర్చుకోవడంతో గోనె సంచులు అడ్డుగోలుగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు చూపించాలంటే సాధారణ గోనెసంచులలో ఉన్న ధాన్యాన్ని మిల్లర్ల ముద్రించిన గోనె సంచుల్లోకి మార్చేందుకు కలాసీ కూలీ అదనంగా బస్తాకు రూ.3.50 అవుతుంది. దీంతో ఈ కూలీ ఎగ్గొట్టేందుకు నేరుగా అనుమతి ఉన్న గోనె సంచుల్లోనే ధాన్యం తరలిస్తున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలసలో ఉన్న మిల్లర్లు, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో పలువురు దళారులతో ఒప్పందాలు కుదుర్చుకుని యథేచ్ఛగా అక్రమం వ్యాపారానికి తెగబడ్డారు. జోరుగా జీరో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో గోనె సంచుల కొరతమన జిల్లాలో గోనెసంచులు కొరత ఉండడంతో ఇదే అదునుగా వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. 45 రోజుల నుంచి విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ కొనుగోలు కేంద్రాలతో కుమ్మక్కైన అయిన మిల్లర్ల వద్ద ప్రస్తుతం ఖాళీ గోనెసంచులు ఉన్నాయి. దీంతో అక్కడ కొందరు దళారులు ఆ గోనె సంచులను నేరుగా వీరఘట్టానికి ఆటోల ద్వారా, ఇతర వాహనాల ద్వారా తెప్పిస్తూ బహిరంగ వ్యాపారాన్ని చేస్తున్నారు. గోనెసంచులపైముద్రలు చిన్నవిగా ఉండడంతో ఇవి వీరఘట్టానికి చెందినవే అని అందరూ పొరబడుతున్నారు. పట్టించుకోని అధికారులు అధికారుల కళ్లముందే రోజూ మండలం నుంచి 25 లారీల వరకు ధాన్యం లోడులు తరలిపోతున్నా ఏ ఒక్క అధికారీ ఈ లారీలను అడ్డుకోవడం లేదు. వాస్తవంగా అనుమతులు ఉన్న వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్క శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. అలాగే రూట్ అనుమతులు పొంది ఉండాలి. ఈ ప్రాంతంలో చెక్ పోస్టులు లేకపోవడం వీరికి బాగా కలిసి వచ్చింది. విజయనగరం జిల్లా రాయవలస వద్ద వ్యవసాయ చెక్ పోస్టు ఉన్నప్పటికి ఇక్కడ పూర్తిస్థాయిలో వాహనాలను సోదా చేయకపోవడంతో ధాన్యం అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.చర్యలు తప్పవువిజయనగరం జిల్లాకు చెందిన గోనె సంచులతో అడ్డుగోలు వ్యాపారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ ఎం.వి. రమణ సాక్షికి తెలిపారు. తమ సిబ్బందితో నిఘా వేసి ధాన్యం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటామన్నారు. -
రిపబ్లిక్ డే టెన్షన్: ఘజియాబాద్‌లో ఎన్కౌంటర్!
ఘజియాబాద్: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ భద్రత చర్యలు తీసుకుంటున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి ఘజియాబాద్‌లో ఎన్కౌంటర్ జరుగడం కలకలం రేపింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగతా నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు సమాచారం. ఘటనా స్థలంలో పోలీసులు ఓ పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అరెస్టైన అంకిత్ అనే వ్యక్తి ఓ పేరు మెసిన దొంగ. ఘజియాబాద్ రాజ్‌నగర్‌లో చోరీకేసులో అతనిపై పోలీసులు రూ. 25వేల రివార్డ్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోనూ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోనూ హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని మెట్రో నగరాలు లక్ష్యంగా దాడులు చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడుల నిరోధానికి అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. -
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా గంజాయి!
-
చెక్‌పోస్టుపై దాడులు.. ముగ్గురి అరెస్ట్
నగరి: చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. తడుకుపేట చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వసూళ్లకు పాల్పడున్నట్లు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న ఏసీబీ అధికారులు వారి వద్ద నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద రూ. 10 లక్షలు స్వాధీనం
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో పోలీసులు శనివారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద రూ. 10 లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేసి.... కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే శుక్రవారం పోలీసుల తనిఖీల్లో భాగంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగర్ వద్ద కారులో తరలిస్తున్న రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
50 కిలోమీటర్లకో చెక్‌పోస్టు
జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకూ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. జాతీయ రహదారులకు దగ్గరగా ఉన్న గ్రామాల వద్ద రోడ్డు దాటుతూ ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడుతున్నారని.. ప్రజలు ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా ఇరువైపులా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, రద్దీ ఎక్కువగా ఉన్నచోట అండర్ టన్నెల్స్ నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికులను రవాణా చేసే వాణిజ్య వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అలాంటి డ్రైవర్ల లెసైన్సులు రద్దు చేస్తామని చెప్పారు. ఏకాభ్రిపాయంతోనే విద్యపై నిర్ణయం.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలుచేస్తున్న నాన్ డిటెన్షన్ విధానాన్ని డిటెన్షన్ విధానంగా మార్చాలా వద్దా అన్నదానిపై ఏకాభ్రిపాయంతోనే నిర్ణయం తీసుకుంటామని రాజప్ప చెప్పారు. దీనిపై జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించే సమావేశాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలను బట్టి ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. సిలబస్‌ను కూడా మార్చే విషయమై మంత్రి వర్గం చర్చించనుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
లేటరైట్ దోచేస్తుంటే మీరేం చేస్తున్నారు?
కాకినాడ క్రైం/ప్రత్తిపాడు : ‘ఓ కంపెనీ లక్షల టన్నుల లేటరైట్ దోచుకుపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇలాగైతే ఎలా? అక్రమ మైనింగ్‌ను అడ్డుకోలేరా? సామాన్యులు ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తుంటే సవాలక్ష నిబంధనలు విధించి అడ్డుకుంటారే! మరి దేశ సంపదను దోచుకుపోతుంటే అనుమతులు ఎలా ఇచ్చారు? గనులవద్ద చెక్‌పోస్టు, వేయింగ్ మిషన్ ఎక్కడ ఉన్నాయి?’ అంటూ రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్తిపాడు మండలం వంతాడ, చింతలూరు గ్రామాల్లో మహేశ్వరి మినరల్స్ చేపట్టిన మైనింగ్ కార్యకలాపాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. పలుమార్లు తనిఖీలు, సర్వేలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు (రామచంద్రపురం), బొండా ఉమా మహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), ఎ.సురేష్ కుమార్ (సంతనూతలపాడు) ఆయా మైనింగ్ ప్రదేశాల్లో మంగళవారం విచారణ చేపట్టారు. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మాస్టర్ ప్లాన్, మైనింగ్ ప్లాన్, ట్రాన్స్‌పోర్టు ప్లాన్ కూడా లేకపోవడాన్ని భూమా గుర్తించారు. డంపింగ్ యార్డును కూడా ప్లాన్‌లో చూపించాలని చెప్పారు. ఎటువంటి ప్లాన్లూ లేకుండా కనీసం లీజుకిచ్చిన మైనింగ్ ప్రాంతం బౌండరీలను కూడా గుర్తించకుండా అనుమతులు ఎలా ఇచ్చారని మైన్స ఏడీ సీహెచ్ సూర్యచంద్రరావును నిలదీశారు. ‘సంవత్సరానికి ఎన్ని టన్నుల మెటీరియల్ ఎగుమతి అవుతుంది? ఎంత ట్యాక్స్ కడుతున్నారు’ అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా కావడానికి ప్రభుత్వాధికారులే తలుపులు బార్లా తెరిచారనడానికి ఇది నిదర్శనమన్నారు. లీజుదారు ఇచ్చిన సమాచారాన్నే మైనింగ్ అధికారులు తమకు ఇస్తున్నారని, వారివద్ద సమాచారం లేకపోవడం ప్రతిచోటా జరుగుతోందని అన్నారు. చింతలూరులో మూడుసార్లు సర్వే చేసిన అధికారులు 500 ఎకరాలు మాత్రమే చూపించారని, తాజాగా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సర్వేలో 739 ఎకరాల్లో గనులు తవ్వుతున్నట్లు వెల్లడైందని భూమా అన్నారు. అధికారులంతా కంపెనీకి అమ్ముడు పోయారని విమర్శించారు. రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల జాయింట్ ఇన్స్పెక్షన్ జరగకుండానే గనులు లీజుకివ్వడాన్ని తప్పుబట్టారు. ‘గనుల తవ్వకం ప్రారంభమయ్యాక ఒక్కో పత్రం, అనుమతి పత్రం తయారు చేయడం మొదలుపెట్టారా?’ అని ప్రశ్నించారు. వంతాడలో అటవీ అనుమతులు లేకుండా రహదారి ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండుకట్టెలు పట్టుకువెళ్లేవారిపై కేసులు పెట్టి వేధించడం మాత్రం తెలుసంటూ ఎద్దేవా చేశారు. అవకతవకల నేపథ్యంలో వంతాడ క్వారినీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు సందర్శించారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు. మైనింగ్‌వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని, ధ్వని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, గున్నాబత్తుల రాజబాబు కమిటీకి ఫిర్యాదు చేశారు. వంతాడలో 11 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని లింగపల్లి సత్యనారాయణ తదితరులు కమిటీకి వివరించారు. చింతలూరు క్వారీలో ముగ్గురు 200 ఎకరాల లీజులు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రి మురళి, మైలపల్లి సత్యనారాయణ చెప్పారు. లీజులో లేని 30 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో ఎమ్మార్వో ఒక్కో రకంగా ఇచ్చిన ఎన్ఓసీలను కూడా కమిటీ తప్పు పట్టింది. వీటన్నిటిపై సమగ్ర సమాచారంతో కాకినాడలో బుధవారం కమిటీ ముందు హాజరు కావాలని మైన్స్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను భూమా ఆదేశించారు. అక్రమ తవ్వకాలవల్ల దుర్వినియోగమైన ప్రజాధనం రికవరీపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, డీఎఫ్ఓ టీవీ సుబ్బారెడ్డి, సబ్ డివిజన్ ఫారెస్టు ఆఫీసర్ వీవీ సుభద్రాదేవి, మైన్స్ జేడీ కేవీఎల్ నరసింహరెడ్డి, డీడీ పి.కోటేశ్వరరాజు, మైన్స్ విజిలెన్స ఎ.డి. కె.సుబ్బారావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహశీల్దార్ గిడుతూరి సత్య వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
ఓ రేంజ్లో అవినీతి!
రెవెన్యూ, పోలీస్ శాఖల్లోనే కాదు అటవీశాఖలో కూడా అవినీతికి అంతుండడం లేదు. జిల్లాలో ఉన్న విజయనగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు రేంజ్‌ల్లో కొంతమంది అధికారులు చేతివాటానికి అలవాటుపడ్డారు. నెలకు రూ.వేలల్లో అక్రమార్జనే లక్ష్యంగా పెట్టుకుని అటవీ సంపదను ధారాదత్తం చేస్తున్నారు. అంతా సక్రమంగా ఉన్నా కలప రవాణా పర్మిట్‌కు లంచం గుంజుతున్నారు. సాలూరు అటవీ రేంజ్ అధికారి....ఏసీబీ అధికారులకు గురువారం దొరికిపోయారు. పదేళ్ల క్రితం ఇదే రేంజ్ పరిధిలో తోణాం ఫారెస్ట్ గార్డు రామనాథం రూ.రెండు వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కోర్టు ఆదేశం మేరకు ఆయనను రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే దొరకనివారెందరో ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - చేయి తడిపితేనే పర్మిట్లు మంజూరు - కలప లారీకి రూ.5 వేలు లంచం సాధారణమన్న వాదనలు - మూలబొడ్డవర చెక్‌పోస్టుపై లెక్కకు మించి ఆరోపణలు - కర్రల మిల్లుల యజమానులతో లోపాయికారీ ఒప్పందాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: అటవీశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దొరికితే... లేదంటే దొరగా కొనసాగిపోతున్నారు. చాలా మంది అధికారులు ముడుపులు తీసుకున్నాకే పనులు పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్జన కోసం కర్రల మిల్లుల యజమానులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలిసింది. చెక్‌పోస్టులు చేతివాటానికి చిరునామాగా మారిపోయనే విమర్శలు వినిపిస్తున్నాయి. - ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన ఓ వ్యక్తి ఒడిశాలో కొనుగోలు చేసిన గుగ్గిలం విత్తనాన్ని పర్మిట్ తీసుకోకుండా రవాణా చేస్తూ పి.కోనవలస చెక్ పోస్టు వద్ద పట్టుబడ్డారని, ఆ సరుకును సీజ్ చేయకుండా ముడుపులు తీసుకుని, ఆ తర్వాత హుటాహుటిన పర్మిట్ కోసం దరఖాస్తు చేయించారన్న ఆరోపణలు అటవీ శాఖాధికారులపై వచ్చాయి. - హుద్‌హుద్ తుపాను ధాటికి రిజర్వుడు ఫారెస్టులో చాలా చెట్లు కూలిపోయాయి. అయితే కొందరు అటవీశాఖ అధికారులు కూలిపోని చెట్లను కూడా నరికించి, వాటిని కూడా హుద్‌హుద్ ధాటికి కూలిన చెట్ల లెక్కలో కలిపేశారన్న ఆరోపణలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా అక్రమాలు జరిగినట్టు బాహాటంగా విమర్శలొచ్చాయి. - నీరు- చెట్టు కింద రిజర్వుడు ఫారెస్టుల్లోని చెరువుల్లో తీసిన పూడికలు, మొక్కలు నాటేందుకు తీసిన గుంతల్లో కూడా అవినీతి జరిగిందన్న వాదనలు ఉన్నాయి. చేపట్టిన పనులకు, రికార్డుల్లో పేర్కొన్న అంకెలకు తేడా ఉందని, పర్యవేక్షణ లేక పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. - ఇదంతా ఒక ఎత్తు అయితే ఎస్.కోట పరిధిలోకి వచ్చే మూల బొడ్డవర చెక్‌పోస్టులో లంచం ఇవ్వనిదే బొగ్గుల సంచి కూడా కదలదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడొక అనధికార వ్యక్తి దందా నడుపుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. సాధారణంగా సొంత హక్కు దారుడు తమ భూమిలో ఉన్న చెట్లను నరకాలంటే ముందుగా రెవెన్యూ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత అటవీ శాఖాధికారుల నుంచి కట్టింగ్ ఆర్డర్ తీసుకోవాలి. ఈ రెండూ ఉన్న వారికి తరలింపునకు పర్మిట్ ఇవ్వాలి. ఇక్కడి వాటన్నింటికీ తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టు మీదుగానే అరకు, అనంతగిరి ప్రాంతాల నుంచి జోరుగా గంజాయి రవాణా జరుగుతోంది. ఇప్పటికే సాధారణ పోలీసులు నిఘా పెట్టారు. నాలుగైదు వాహనాల్ని గుర్తించినట్టు సమాచారం. ఏదో ఒక రోజు దాడులు చేసి పట్టుకునే అవకాశం ఉంది. చెక్‌పోస్టులో పెద్దగా నిఘా లేకపోవడమో, చేతివాటమో తెలియదు గాని గంజాయి రవాణాకు రాచమార్గమైపోయిందన్న వాదనలు ఉన్నాయి. - ఎస్.కోట పరిధిలో కర్రల మిల్లులకు పెద్ద ఎత్తున అటవీ కలప వస్తున్నట్టు సమాచారం. అధికారులతో ఉన్న లోపాయికారీ ఒప్పందాలతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కర్రల మిల్లుల వ్యాపారం నడిచిపోతున్నట్టు భోగట్టా. ఫిర్యాదులొస్తే తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నట్టు విమర్శలు కూడా ఉన్నాయి. ఇక, సీజ్ చేసిన కలప, వాహనాల విషయంలో కూడా బేరసారాలు జరుగుతున్నాయి. వేసిన అపరాధ రుసుముకు, వసూలు చేసిన మొత్తానికి పెద్ద ఎత్తున తేడా ఉంటోంది. -
చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు
అనధికారికంగా ఉన్న రూ.31వేలు స్వాధీనం దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రవాణాశాఖ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడుకు సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. చెక్‌పోస్ట్‌లో ఏఎంవీఐ గోపాల్‌తో పాటు మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ తనిఖీల్లో రూ. 31వేలు అనధికారికంగా ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ రాజారావు విలేకరులకు తెలిపారు. చెక్‌పోస్ట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ద్వారా రవాణాశాఖ కమిషనర్‌కు నివేదికను పంపి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరతామని వెల్లడించారు. ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌కు సమీపంలోనిఉన్న వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తమయ్యారు. దాడుల్లో ఏసీబీ రేంజ్ఇన్స్పెక్టర్ కె.సీతారాం, ఇన్స్పెక్టర్ పి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెయ్యేరులో ఇసుకదందా!
రాజంపేట: చెయ్యేరులో ఇసుకదందా అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలుగా చెలామణి అవుతున్న కొందరి కనుసన్నల్లో భారీగా ఇసుకను తోడేస్తున్నారు. దాడి చేసే అధికారులకు దొరకకుండా ఉండేందుకు సొంతంగా నిఘా ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వాహనాల్లో వేగంగా చేరుకోకుండా సొంతంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ దందా ఏ స్థారుులో జరుగుతోందో అర్థమవుతుంది. రెవిన్యూ డివిజన్ పరిధిలోని రాజంపేట, నందలూరు, పెనగలూరులో ఇసుకమాఫియా పెట్రేగిపోతోంది. ఈ మాఫీయాకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు అధికారులు సైతం వారితో మిలాఖత్ అయ్యారన్న విమర్శలున్నాయి. చెయ్యేరు నది రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలకు అనుకూలంగా ఉండటంతో అడ్డదారులు ఏర్పాటుచేసుకుని ఇసుకను అడ్డూఅదుపూ లేకుండా తోడేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో వందలాది ట్రాక్టర్లలో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రాజంపేట సబ్‌డివిజన్ పరిధిలోని రెండు పోలీస్స్టేషన్లకు మాముళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మందరం వయా రాజంపేట మీదుగా... చెయ్యేరు నది పరిధిలోని మందరం(రాజంపేట) కేంద్రంగా ఇసుక అక్రమరవాణా సాగిస్తున్నారు. అనధికారిక క్వారీలను ఏర్పాటుచేసుకొని ఏటికి వెళ్లే రహదారిలో గేట్ పెట్టుకున్నారు. దానికి తాళాలు కూడా వేస్తారు. చెయ్యేరులోకి దారులు ఏర్పాటుచేసుకొని వందలాది ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసుకుంటున్నారు. అక్రమరవాణాకు పటిష్టమైన నిఘా వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. బెస్తపల్లె, మందరం, ఇసుకపల్లె, తాళ్లపాక(ఆర్చి) మర్రిపల్లెతోపాటు యేటి పరిసరాల్లో బృందాలుగాా ఉంటూ రవాణా విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికారులో, విజిలెన్స్ వస్తున్నారంటే వెంటనే ట్రాక్టర్లు, ఇసుక నింపే కూలీలు చెయ్యేటిలో నుంచి సురిక్షిత ప్రాంతానికి చేరుకుంటారు. మందరం నుంచి పుల్లంపేట, రైల్వేకోడూరు, చిట్వేలితోపాటు తదితర ప్రాంతాలకు ఇసుక రవాణా జరుగుతోంది. భారీగా ఫైన్ వేస్తున్నా.. పోలీసు, రెవిన్యూ అధికారుల కన్నా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించిన తరుణంలో పట్టుబడిన డంప్, రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి భారీగా పైన్ వేస్తున్నా వీరు వెనుకంజ వేయడంలేదు. నందలూరు మండలంలోని కుమరనిపల్లెలో అధికారిక క్వారీ ఉంది. దాని ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అనధికారిక క్వారీ ఇసుకకే డిమాండ్ సర్కారు మహిళా సంఘాల ద్వారా ఇసుక అమ్మకం చేపట్టినా వాటి కంటే అనధికార క్వారీల ఇసుకకే డిమాండ్ ఉంది. మహిళా సంఘాల ద్వారా ఇసుకతవ్వకంతోపాటు ఇంటికి సరఫరా చేసేందుకు కిలోమీటర్‌కు రూ.30చొప్పున, క్యూబిక్‌మీటరు రూ650 లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి. మీసేవ, బిల్లుల సమస్య లాంటివి లేకుండా అనధికారిక క్వారీ నుంచి రిస్క్ లేకుండా ఇంటికి ఇసుకను చేర్చుతుండడమే కారణం. -
చెక్‌పోస్టులకు చెక్
గ్రానైట్ ఓవర్‌లోడ్‌కు రైట్.. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్‌పై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో సరిగ్గా నెలరోజుల క్రితం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను అధికారులు రాత్రికి రాత్రే ఎత్తివేశారు. ఈ విషయంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు తమ పంతం నెగ్గించుకున్నారు. జిల్లా కీలక నేతలతో సంబంధం లేకుండానే చెక్‌పోస్టులను ఎత్తివేయించుకున్నారు. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేల సాయంతో రాష్ట్ర రాజధానిలో చక్రం తిప్పారు. ‘ముఖ్య’నేతను కలిసి డీల్ కుదుర్చుకున్నారు. సదరు ‘ముఖ్య’నేత సానుకూలంగా స్పందించడం, అక్కడినుంచి రవాణా శాఖకు సంకేతాలు వెళ్లడం, ఆ వెంటనే జిల్లా అధికారులు చెక్‌పోస్టులను ఎత్తివేయడం చకచకా జరిగిపోయాయి. చెక్‌పోస్టుల ఎత్తివేతపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. తమకేమీ సంబంధం లేదంటూ జవాబు దాటవేస్తున్నారు. పంతం నెగ్గించుకున్న గ్రానైట్ యాజమాన్యాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 427 గ్రానైట్ క్వారీలున్నాయి. వీటి ద్వారా సగటున ప్రతినెలా దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్‌పై అనేక విమర్శలు రావడంతో గతనెల 30న ఎస్పీ శివకుమార్, మైనింగ్ ఏడీ కష్ణప్రతాప్, డీటీసీ మీరాప్రసాద్ హడావుడిగా సమావేశమయ్యారు. గతంలో నాలుగు చెక్పోస్టులుండగా, అదనంగా మరో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతోపాటు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేశారు. గ్రానైట్‌తోపాటు ఇసుక, ఇతరత్రా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన తొలి వారంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. లక్షలాది రూపాయల మొత్తంలో జరిమానా విధించారు. అధికారుల లెక్కల ప్రకారం పక్షం రోజుల్లోనే 322 కేసులు నమోదు చేసి రూ.33.86 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గంలో ఓవర్‌లోడ్‌ను తీసుకెళ్లే సదుపాయం లేకపోవడంతో చేసేదేమీలేక గ్రానైట్ యాజమాన్యాలు రైల్వేలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా రైల్వే ఆదాయం అమాంతం పెరిగిపోయింది. గతంతో పోలిస్తే సరిగ్గా నెలరోజుల్లోనే రూ.10 కోట్ల మేరకు రైల్వే అదాయం పెరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అకస్మాత్తుగా చెక్‌పోస్టుల ఎత్తివేత గ్రానైట్ ఓవర్‌లోడ్‌తో పాటు ఇతరత్రా జరుగుతున్న అక్రమ రవాణాను అడ్డుకుంటున్న సమయంలో సరిగ్గా మూడు రోజుల క్రితం రాత్రికి రాత్రే చెక్‌పోస్టులను ఎత్తివేయడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా గత నెలలో ఏర్పాటు చేసిన ఎనిమిది చెక్‌పోస్టులను పూర్తిగా ఎత్తివేయగా, మిగిలిన చోట్ల నామమాత్రంగా కొనసాగిస్తున్నారు. చెక్‌పోస్టులను ఎందుకు ఎత్తివేశారనే అంశంపై సమాధానం చెప్పడానికి ఇటు మైనింగ్, అటు రవాణా, పోలీసు అధికారులెవరూ ముందుకు రావడం లేదు. ఓవర్ లోడింగ్ వ్యవహారంతో తమకు సంబంధమే లేదని మైనింగ్ అధికారులు చెబుతుండగా, చెక్‌పోస్టుల నిర్వహణ వ్యయాన్ని మైనింగ్ శాఖ అధికారులే భరించాలని కలెక్టర్ ఆదేశాలున్నందున చెక్‌పోస్టుల ఎత్తివేతపై ఆ శాఖ అధికారులనే అడగాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా అదాయం వస్తున్న మార్గాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేనప్పటికీ... అలాంటిది ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని రాత్రికి రాత్రే చెక్‌పోస్టులను ఎత్తివేయడం పెద్ద చర్చనీయాంశమైంది. దీనివెనుక పెద్ద మతలబే జరిగిందని గ్రానైట్, అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కీలక నేతలు, మంత్రులతో సంబంధం లేకుండానే పెద్ద డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, గ్రానైట్ అసోసియేషన్ నాయకుడు రాష్ట్ర రాజధానిలో ‘ముఖ్య’నేతను కలవడం, ఆ వెంటనే చెక్‌పోస్టుల ఎత్తివేయడం చకచకా జరిగిందని తెలుస్తోంది. ‘ముఖ్య’నేత స్థాయిలో జరిగిన వ్యవహారం కావడంతో దీనివెనుక ఎంత ‘డీల్’ జరిగిందనే అంశంపై పెదవి విప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించకపోవడం గమనార్హం. పట్టపగలే ఇష్టారాజ్యంగా... హైదరాబాద్ నుంచి చెక్‌పోస్టుల ఎత్తవేతపై ఆదేశాలు రావడంతో గ్రానైట్ లారీలకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. నిబంధనల ప్రకారం అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7గంటల మధ్యలోనే నగరం నుంచి గ్రానైట్ రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ గత రెండ్రోజులుగా అందుకు భిన్నంగా పట్టపగలు కూడా గ్రానైట్ లారీలు కరీంనగర్ మీదుగా వెళుతున్నాయి. అయితే అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేకుండా మిన్నకుండిపోవడం విశేషం. -
పత్తి ‘పక్క’దారి..
ఏఎంఎఫ్, వ్యాట్ ఎగవేస్తూ ఏపీ, మహారాష్ట్రలకు ఎగుమతి రైతుల ముసుగులో ట్రేడర్ల నిర్వాకం గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సరిహద్దు జిల్లాల చెక్పోస్టులపై నిఘా పెంపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండిన పత్తి అక్రమ మార్గాల్లో పక్క రాష్ట్రాలకు మళ్లుతోంది. ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన కోట్ల రూపాయల పన్నులను ఎగవేస్తూ వేల క్వింటాళ్ల పత్తిని వ్యాపారులు రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా సరిహద్దుల నుంచే ప్రతి రోజూ సుమారు 40 నుంచి 50 లారీల పత్తిని ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి పన్నులు కట్టకుండా తరలిస్తున్నారని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. దీనిద్వారా ఈ పదిహేను రోజుల్లోనే సుమారు రూ.2.40 కోట్ల పన్నును వ్యాపారులు ఎగవేశారని అధికారులు తేల్చారు. దీంతోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఇలాంటిదందానే ప్రతినిత్యం జరుగుతోందని తన తనిఖీల్లో తేల్చింది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు కోట్లల్లో గండిపడుతున్న దృష్ట్యా రంగంలోకి దిగిన విజిలెన్స్ సరిహద్దు చెక్పోస్టులపై నిఘాను మరింత పెంచింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పత్తి అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన సుమారు 80 కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టిన ప్రభుత్వం కనీస మద్దతు ధరను రూ.4,050గా నిర్ధారించింది. అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికీ పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, నాణ్యతను సాకుగా చూపి ధరను తగ్గించి చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో లాభసాటి ధర కోసం రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్తు చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన పక్క రాష్ట్ర వ్యాపారులు మన రాష్ట్ర రైతుల వద్ద కొనుగోళ్లకు బారులు తీరుతున్నారు. బయటి రాష్ట్రాల వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తే దాన్ని తరలించేందుకు అగ్రికల్చర్ మార్కెట్ ఫీజు (ఎఎంఎఫ్) 1శాతం, వ్యాట్ 5శాతం రాష్ట్రానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ తన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటున్న రైతు ముసుగులో వ్యాపారులే పత్తిని పక్క రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. దీంతోపాటే చట్టపరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరికొంత మంది వ్యాపారులు ఏపీ ఇస్తున్న వే బిల్లులతో ఇక్కడికి వచ్చి సరుకు తీసుకెళుతూ పన్నులు మాత్రం కట్టడం లేదు. పన్నులేవీ చెల్లించకుండా నల్లగొండ జిల్లా కోదాడ, నాగార్జునసాగర్ మీదుగా గుంటూరు జిల్లా మాచర్లకు పెద్దఎత్తున పత్తిని తరలిస్తున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించింది. ఇలా ఒక్క నల్లగొండ జిల్లా నుంచే రోజుకు 40 నుంచి 50 లారీలు తరలివెళుతున్నాయని, దీని ద్వారా ఒక్కో లారీపై రావాల్సిన పన్ను సుమారు రూ.40 వేలు ప్రభుత్వం నష్టపోతోందని అధికారులు లెక్కలుకట్టారు. గడిచిన పది, పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ తంతు ద్వారా ఇప్పటికే వ్యాపారులు రోజుకు రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ. 2.40 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుంచి మహారాష్ట్రకి, నిజామాబాద్ జిల్లా మద్నూర్ సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు, మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మీదుగా కర్ణాటకకు ఈ రీతిలోనే వ్యాపారులు పత్తిని తరలించుకుపోతున్నారని ఈ నష్టం కోట్లలోనే ఉందని విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత నిఘాను పెంచేందుకు వీలుగా రాష్ట్రంలోని ఏడు యూనిట్లను విజిలెన్స్ శాఖ అప్రమత్తం చేసింది. సరిహద్దు చెక్పోస్టులపై నిఘాను పెంచాలని ఆదేశించింది. అధికారులను అప్రమత్తం చేశాం ఈ విషయం మా దృష్టికి వచ్చింది. విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశాం. దీనిపై వాస్తవ నివేదికను ఇవ్వాలని, సమస్య పరిష్కార సూచనలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించాం. ఈ నివేదికలు రాగానే దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తాం. - టి.వివేక్, ఓఎస్డీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ -
బ్లాంక్ చెక్.. పోస్టులు
అక్రమ రవాణాకు అడ్డాగా మారిన చెక్‌పోస్టులు మామూళ్ల మత్తులో జోగుతున్న సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు జిల్లాలో ఇదీ పరిస్థితి చెక్‌పోస్టులో ఉద్యోగమంటే బ్లాంక్ చెక్కుచేతికిచ్చినట్టే. జిల్లాల్లో ఎన్నో చెక్ పోస్టులు న్నా అక్రమ రవాణా ఎలా జరుగుతోందంటారు. బండి వచ్చిందంటే జేబుపైనే ధ్యాస.. చేయి తడిపితే చాలు.. ఏ సరుకైనా ఎస్కార్ట్‌గా వచ్చి సాగనంపేస్తారు.. నిఘా నీడలో ఉండాల్సిన తనిఖీ కేంద్రాలు బ్లాంక్ చెక్పోస్టులుగా మారిపోతున్నాయి. ఇక్కడ ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేస్తారు. ఆ ఉద్యోగం కోసం రాజకీయ నాయకుల్ని మొదలు... దేవుళ్ల వరకు చుట్టేస్తారు. లంచాలకూ పాలుమాలరు. ఆ ఒక్క ఉద్యోగముంటే చాలని లక్షలు కుమ్మరించేస్తారు.. ఉద్యోగమొస్తే బడా స్మగ్లర్లకు దాసోహమైపోతారు. తిరుపతి(మంగళం): జిల్లాలోని చెక్ పోస్టులు అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. మామూళ్లిస్తే చాలు చెక్‌పోస్టు సిబ్బందే బడాస్మగ్లర్లకు రెడ్‌కార్పెట్ పరిచేస్తారు. బీట్ ఆఫీసర్లే ఎస్కార్టగా వచ్చి ఎర్రచందనాన్నీ సాగనంపేస్తారు. ఇంటిదొంగలే సహకరిస్తున్నప్పుడు ఇక తమను పట్టుకునేవారెవరంటూ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ పనికానిచ్చేస్తున్నారు. కలగా ఆధునికీకరణ పద్ధతులు చెక్‌పోస్టుల్లో లంచగొండితనాన్ని అరికట్టేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు నడుం బిగించారు. చెక్‌పోస్టులను ఆధునికీకరించి సిబ్బంది పని తీరును మెరుగుపరచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2010 జనవరిలో తిరుపతిలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో అప్పటి పీసీసీఎఫ్ మధుకర్‌రాజ్ నేతృత్వంలో చెక్‌పోస్టుల ఆధునికీకరణపై చర్చించారు. జిల్లాలోని 27 చెక్‌పోస్టుల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయించారు. రహదారుల్లో నిర్వహిస్తున్న టోల్గేట్లు తరహాలో ఎలక్ట్రానిక్ చెక్‌పోస్ట్ విధానాన్ని అమలుపరిచి, తనిఖీ చేసే ప్రతి వాహనం వివరాలనూ కంప్యూటర్ ద్వారా పొందుపరచాలని భావించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాన్ని వీడియో కెమెరాల ద్వారా రికార్డ్‌చేసి, సిబ్బంది అవినీతికి పాల్పడే వీలులేకుండా చేయాలని భావించారు. అయితే ఏళ్లు గడిచినా ఇంతవరకు ఈ భావనలు అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులు అవినీతి కేంద్రాలుగా, వసూళ్లకు అడ్డాగా మారిపోయాయి. స్మగ్లర్లకు రాచమార్గం శేషాచల అడవుల్లో నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు చెక్‌పోస్టులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. ఇక్కడ డ్యూటీ చేసేవారితో స్మగ్లర్లు ఒప్పందం కుదుర్చుకుంటారు. చేయి తడపగానే ఎర్రచందనం లోడు చేసుకునేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఆ బీట్ ఆఫీసర్లే ఎస్కార్ట్‌గా వచ్చి సాగనంపేస్తారు. ఇంటి దొంగలే సహకరిస్తున్నప్పుడు తమను పట్టుకునేదెవ్వరని స్మగ్లర్లు కాలరెగరేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అటవీ శాఖ చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు కన్ను కప్పి ఎర్రచందనాన్ని చెక్‌పోస్టులు దాటిస్తే ఆ వాహనాలు మరోచోట పట్టుపడితే మొదటి చెక్‌పోస్టులో డ్యూటీ చేస్తున్న అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తాం. ఎర్రచందనం స్మగ్లర్లకు అటవీ శాఖలో ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. - జీ.శ్రీనివాసులు, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో -
ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్’
ప్రధానంగా నర్సింగ్‌భట్ల వాగు నుంచి రోజు సుమారు 70 లారీలు ఈ గ్రామం మీదుగా ఇసుకను రవాణా చేస్తున్నాయి. దీంతో రూ.3.50 కోట్లతో దోనకల్లు - రాములబండ గ్రామాల మధ్య గత ఏడాది నిర్మించిన బీటీ రోడ్డుకు అక్కడడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. బీటీ రోడ్డు నిర్మించక ముందు కంకర తెలడంతో రెండేళ్లు గ్రామస్తులు నరకయాతన అనుభవించారు. ఇకపై బీటీ రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు గ్రామస్తులంతా సమష్టిగా కలిసి సర్పంచ్ కృష్ణవేణి, ఎంపీటీసీ మల్లేష్‌ల సహకారంతో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. రెండు నెలల క్రితం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ జిల్లా ఎస్పీని కలిసి గ్రామం నుంచి ఇసుక లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరంతరాయంగా ఇసుక లారీలు వెళ్లడంతో రోడ్డు ధ్వంసమవుతుందని ఫిర్యాదు చేశారు. గ్రామస్తులే చైతన్యవంతులై ఇసుక లారీలు వెళ్లకుండా అడ్డుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు. నిరంతరం కాపలా.. చెక్‌పోస్టు వద్ద నిరంతరం సర్పంచ్ కుటుం బ సభ్యులు కాపలా ఉంటున్నారు. కేవలం ట్రాక్టర్లు వెళ్లే ఎత్తులోనే చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. లారీలు వస్తే అక్కడే ఆగిపోవాల్సిందే. ఇతర ధాన్యం లారీలు, గడ్డి ట్రాక్టర్లు వస్తే వెంటనే చెక్‌పోస్టుపై ఉన్న ఇనుప రాడ్డును పైకి లెపేస్తారు. చెక్‌పోస్టుపై సెల్ నంబర్ వేశారు. అత్యవసర పరిస్థితిలో సర్పంచ్ కుటుంబ సభ్యులు చెక్‌పోస్టు వద్ద లేకపోతే ఫోన్లో సమాచారం అందిస్తారు. ఆ సమాచారంతో రోడ్డు క్లియరెన్స్ చేస్తారు. -
కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం
పి.కోన వలస(పాచిపెంట): ఆ గిరిజన దంపతులకు ఒక్కడే కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఐదో తరగతి చదువుకుంటున్న ఆ విద్యార్థి పాఠశాలలో జెండా పండగకి వెళ్తొస్తానని చెప్పి ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి తల్లి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని చాపరాయివలస గిరిజన గ్రామానికి చోడిపల్లి లింగు, సింగారమ్మ దంపతులకు లక్ష్మణ రావు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. లింగు రోజుకూలీ కాగా సింగారమ్మ పి.కోనవలస చెక్‌పోస్టులో పాచిపని చేస్తుంటుంది. అమ్మవలస ఎంపీపీ పాఠశాలలో లక్ష్మణరావు 5వతరగతి చదువుతున్నాడు. చాపరాయివలస గ్రామంనుంచి అమ్మవలస గ్రామానికి 4 కిలోమీ టర్ల దూరం. లక్ష్మణరావు ప్రతిరోజూ పాఠశాలకు నడుచుకుని వెళ్లి వస్తుంటాడు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పాఠశాలలో నిర్వహించే జెండా పండగకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ వస్తుండగా పి.కోనవలస చెక్‌పోస్ట్ దగ్గర సాలూరు నుంచి ఒడిశావైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చెక్‌పోస్టు దగ్గరే పనిచేస్తున్న తల్లికి విషయం తెలిసి ఒక్కసారిగా హతాశురాలైంది. విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన గిరిజనులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదనను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విద్యార్థి మరణ వార్త తెలుసుకున్న అమ్మవలస పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.జయ సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు అందరికంటే ముందు వచ్చేవాడని, మంచి డ్రాయింగ్స్ వేస్తూ చలాకీగా ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. లక్ష్మణరావు కుటుంబానికి ప్రధానోపాధ్యాయురాలు, పాచిపెంట మండల విద్యాశాఖాధికారి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పాచిపెంట హెడ్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి, విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారవడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. -
గుండెల్లో ACB పరుగులు
-
పలమనేరు, నరహరిపేట చెక్‌పోస్టుల్లో ఏసీబీ దాడులు
రూ.1.12 లక్షలు స్వాధీనం ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు పలమనేరు/గుడిపాల: పలమనేరు, గుడిపాల సమీపంలో టని ఆర్టీవో, ఏసీటీవో చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. లెక్కకు మించి డబ్బులున్నట్టు గుర్తిం చారు. ఓ ప్రైవేటు ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నా రు. నాలుగు నెలల క్రితం పలమనేరు చెక్‌పోస్టులో ఏసీ బీ అధికారులు దాడులు జరిపి రూ.లక్ష వరకు లెక్కకు మించిన డబ్బును సీజ్ చేయడంతో పాటు కొందరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో పలమనేరులోని ఏసీటీవో, పక్కనే ఉన్న ఆర్టీవో చెక్‌పోస్టులలో రెండు బృందాలుగా సోదాలు నిర్వహించారు. అక్కడున్న రికార్డులను పూర్తిగా పరిశీలించారు. ఈ రెండు చెక్‌పోస్టులలోనూ లెక్కకు మించి రూ.70 వేలు అధికంగా ఉన్నట్టు గుర్తిం చారు. దీనిపై సంబంధిత చెక్‌పోస్టు అధికారులు ఏసీటీవో గుర్రప్ప, ఆర్టీవో సుధాకర్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. లారీ డ్రైవర్లు, వాహన యజమానుల నుం చి అధిక మొత్తంలో వసూలు చేయడంతోనే అదనంగా నగదు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రైవే ట్ ఏజెంట్ మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు. రికార్డుల పరిశీలన పూర్తిస్థాయిలో జరిగాక బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్‌రావ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా గుడిపాలలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ విజయపాల్, సీఐలు రామ్‌కిషోర్, సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్ ఆదివారం తెల్లవారుజామున దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ.42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చెక్‌పోస్టులో రవాణా, కమర్షియల్, సివిల్ సప్లరుు, ఫారెస్ట్, ఎక్సైజ్, మార్కెట్ శాఖలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం లో ఉన్న ఏసీటీవో గెస్ట్‌హౌస్‌లో అనధికారికంగా ఉన్న రూ.19,190లను అధికారులు పట్టుకున్నారు. అలాగే వాహనదారులు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో రూ. 8,580 మామూళ్లు ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు కూర్చొగా రూ.14,110 వచ్చింది. మొత్తం రూ.42 వేలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. అవినీతిపై సమాచారం ఇవ్వండి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చేవారు 9440446190, 9440446120, 9440446191, 9440446138 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. -
6 గంటలు.. రూ.1.48 లక్షలు!
ఇచ్ఛాపురం: శనివారం అర్ధరాత్రి.. సమయం 1.30 గంటలు దాటింది..అది ఇచ్ఛాపురం సమీపంలోని పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర ఉమ్మడి చెక్‌పోస్టు ప్రాంగణం..వాహనాలు వస్తున్నాయి.. ఆగుతున్నాయి.. కొందరు కౌంటర్ల వద్దకు వెళ్లి ముడుపులు ముట్టజెబుతున్నారు.. పత్రాలపై ఆమోద ముద్రలు వేయించుకుంటున్నారు. వాహనాలు ముందుకు కదులుతున్నాయి. షరా మాములే అన్నట్లు ఈ వ్యవహారం సాఫీగా సాగిపోతోంది..ఇంతలో నాలుగు వాహనాలు వచ్చి అక్కడ ఆగాయి.. వాటిలోంచి దిగిన వ్యక్తులు.. వెనువెంటనే చెక్‌పోస్టు ప్రాంగణంలోకి చొచ్చుకుపోయారు. వీరిని గమనించిన కొందరు పరుగులు తీశారు. మరికొందరు దొరికిపోయారు. వచ్చినవారు ఏసీబీ అధికారులని కొన్ని క్షణాల్లోనే అందరికీ తెలిసిపోయింది. దాంతో ఒకటే కలకలం. సిబ్బందిగా మారి పరిశీలన విశాఖపట్నం, విజయనగరం ఏసీబీ డీఎస్పీలు నర్సింహారావు, సి.హెచ్.లక్షీపతిల ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, సుమారు 25 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు నాలుగు ప్రత్యేక వాహనాల్లో నేరుగా చెక్‌పోస్టు ఆవరణకు చేరుకున్నారు. ఎప్పుడూ పట్టణంలోని రహదారి గుండా వచ్చే అధికారులు.. ఈసారి జాతీయ రహదారి మీదుగా వచ్చారు. వారి రాకను గమనించిన దళారులు, ప్రైవేటు వ్యక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆవరణ బయటే ఉన్న మార్కెట్ కమిటీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కౌంటర్ల సిబ్బంది కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. కాగా అదే ఆవరణలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అధికారులు అదపులోకి తీసుకున్నారు. అనంతరం చెక్‌పోస్టు లోపల ఉన్న వివిధ విభాగాల కౌంటర్ల వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో కలిసిపోయారు. తాము సిబ్బందిలాగే అక్కడ ఉండి పరిశీలన మొదలుపెట్టారు. ఇదేమీ తెలియని వాహనాల సిబ్బంది కౌంటర్ల వద్దకు వచ్చి ఎప్పటి మాదిరిగానే మామూళ్లు చెల్లించుకొని.. తమ పత్రాలపై రాజముద్రలు వేయించుకొని వెళ్లిపోవడాన్ని గమనించారు. ఇలా ఉదయం ఆదివారం ఉదయం 7.30 గంటల వరకు పరిశీలించగా రూ.1.48 లక్షలు వసూలయ్యాయి. తనిఖీల జాప్యంతో లారీల సిబ్బంది అసంతృప్తి ఏసీబీ దాడుల కారణంగా పత్రాల తనిఖీ ఆలస్యంగా సాగుతుండటంతో వాహనాల సిబ్బంది పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. వారంతా అసంతృప్తితో కేకలు వేయడంతో కౌంటర్ల వద్ద గందరగోళం ఏర్పడింది. అయితే ఏసీబీ దాడుల విషయం తెలుసుకొని మౌనం వహించారు. కాగా మార్కెట్ కమిటీ, ఎక్సైజ్ కౌంటర్ల సిబ్బంది పరారు కావడంతో తనిఖీలకు ఎవరూ లేకుండాపోయారు. దాంతో కొందరు వాహనాల డ్రైవర్లే పత్రాలపై స్టాంపులు కొట్టుకొని వెళ్లిపోయారు. అక్రమ వసూళ్లు పునరావృతం:ఏసీబీ డీఎస్పీ ఈ సందర్భంగా విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ గతంలో మూడుసార్లు వరుసగా దాడులు నిర్వహించడంతో అక్రమ వసూలు తగ్గినా.. మళ్లీ కొద్దికాలానికే పెరిగిపోయాయన్నారు. తాజా దాడుల్లో రూ.1.48 లక్షలు దొరకడం దీన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఈ దాడుల్లో ఐదుగురు అనధికార సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వి.రమణమూర్తి, రమేష్, రామకృష్ణ, లక్ష్మోజీ, గణేశ్, అజాద్‌లు పాల్గొన్నారు. దాడులు దాడులే.. దందా దందాయే అక్రమ వసూళ్లు.. దళారుల దందా చెక్‌పోస్టుకు షరా మామూలే. ఏసీబీ దాడులు జరిగినప్పుడు కొద్దిరోజులు తోకముడవడం.. తర్వాత యథాప్రకారం దందా సాగించడం ఇక్కడ నిత్యకృత్యం. ఏడు నెలల క్రితం వరుసగా మూడుసార్లు దాడులు చేసి చెక్‌పోస్టు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తించినా వారిలో మార్పు రాలేదని ప్రస్తుత వసూళ్లు స్పష్టం చేశాయి. గత ఏడాది డిసెంబర్ 21న జరిపిన దాడుల్లో రూ.2.15 లక్షలు, అదే నెల 29 నాటి దాడుల్లో రూ.1.25 లక్షలు లభించగా.. ఈ ఏడాది జనవరి 18న జరిపిన దాడుల్లో కేవలం రూ.6వేలు మాత్రమే పట్టుబడ్డాయి. అలాగే మొదటి దాడిలో 5గురు చెక్‌పోస్టు సిబ్బంది, పదిమంది అనధికార వ్యక్తులపై కేసులు నమోదు చేయగా, రెండో దాడిలో 6గురు చెక్‌పోస్టు సిబ్బంది, 7గురు అనధికార వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. దీంతో వసూళ్ల దందా తగ్గిందనుకున్నారు. కానీ అది తప్పని తాజా దాడుల్లో వెల్లడైంది. దీంతో మళ్లీ వరుస దాడులు తప్పవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ దాడులు నిర్వహిస్తే తప్ప మామూళ్ల సంస్కృతికి అడ్డుకట్ట పడదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. -
పోలీసుల ఓవర్ యాక్షన్
నెల్లూరు(క్రైమ్): జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు గుప్పుమన్నాయి. అధికారపార్టీ నేతల సంకేతాల మేరకు విధులు నిర్వర్తించారన్న ఆరోపణలు వినిపించాయి. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆదివారం పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. జిల్లాతో పాటు గుంటూరు జిల్లా పోలీసులను బందోబస్తుకు రప్పించారు. ఈనెల 5న చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా సుమారు 1000 మంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. సాయుధ బలగాలను భారీగా మోహరించారు. జెడ్పీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నగరంలోకి ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయనాయకులు, కార్యకర్తలు రాకుండా బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం, పాతచెక్‌పోస్టు, పొదలకూరరోడ్డులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జెడ్పీ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో టీడీపీ, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. చుట్టూ మఫ్టీలో పోలీసులను ఉంచారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఉదయం నుంచి జెడ్పీ కార్యాలయంలోనే ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మీడియా, ఎన్నికల విధులు నిర్వర్తించే వ్యక్తులు మినహా ఇతరులెవ్వరికీ లోనికి అనుమతి లేదని, సెల్ఫోన్లు నిషేధమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సెల్ఫోన్లు లోనికి తీసుకెళ్లనివ్వలేదు. అధికారపార్టీ నేతలు సమావేశ మందిరంలో యథేచ్ఛగా పోన్లల్లో మాట్లాడుకున్నారు. టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి వేనాటి రామచంద్రారెడ్డి ఏకంగా మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుళ్లపై నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులను జెడ్పీ కార్యాలయం బయట కూడా ఉండనివ్వలేదు. అధికారపార్టీకి చెందిన నేతలు బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక రమేష్‌రెడ్డి జెడ్పీ కార్యాలయం బయట సమాలోచనలు జరుపుతున్నా పట్టించుకోలేదు. వేమిరెడ్డి పట్టాభిరెడ్డి జెడ్పీ కార్యాలయం లోపల, బయట హల్చల్ చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసు అధికారుల ఏకపక్ష విధానాలపై వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ఆగ్రహం.... మీడియా ప్రతినిధులకు పాస్‌లు, అక్రిడిటేషన్ ఉంటేనే లోనికి అనుమతిస్తామని ఓఎస్డీ శిల్పవల్లి చెప్పడంతో పాస్‌లు ఎందుకిచ్చారంటూ ఆమెను నిలదీశారు. కొందరు మీడియా సిబ్బందికి పాస్‌లు లేకపోవడంతో వారిని లోనికి అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ విషయంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు జోక్యం చేసుకుని మీడియా ప్రతినిధులను లోనికి పంపడంతో వివాదం సద్దుమణిగింది. ఐజీ పర్యవేక్షణ.. గుంటూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఆదివారం నెల్లూరుకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎన్నిక వాయిదా అనంతరం జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలకు సూచించారు. -
‘ఇసుక మాఫియా’కు రాజకీయ అండ
నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పరిషత్‌లో సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : ఇసుక అక్రమ రవాణా వెనుక కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీ నాయకుల పాత్ర ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండలిలో గురువారం పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ భానప్రకాశ్, విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా ఇసుక సేకరణ, రవాణా, క్రయవిక్రయాలను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ‘ఇసుక మాఫియా’ పై గట్టి నిఘా ఉంచిందన్నారు. అందులో భాగంగా మొబైల్ స్క్వాడ్, ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నూతన ఇసుక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ వందల కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయలను అపరాద రుసుంగా వసూలు చేశామని వివరించారు. అయితే ఇసుక మాఫియా వెనక ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రాజకీయ నాయకుల పాత్ర ఉందన్నారు. అలాగని ఆరోపణలు వచ్చినవారందరూ తప్పు చేసినట్లు కాదన్నారు. తన కుమారుడి పైనా అక్రమ ఇసుక తరలింపు విషయమై ఆరోపణలు వచ్చాయన్నారు. ఇలాంటి వెనుక మాఫియా హస్తం ఉంటుందని తెలిపారు. ఒక్కొక్కసారి ప్రభుత్వ ఉన్నతాధికారులూ అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారన్నారు. అందువల్లే ఈ సమస్యను పూర్తిగా అరికట్టలేక పోతున్నామని సిద్ధరామయ్య తెలిపారు. అయితే ఇక ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ వేశాం మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న హత్యాచారాలను నియంత్రించడానికి అనుసరించాల్సిన విధివిధానాల పట్ల ప్రత్యేక కమిటీ వేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిషత్‌లో తెలిపారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ఎమ్మెల్సీ మోటమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో మహిళలలు, పిల్లలపై దౌర్జన్యాలు పెరుగుతున్న మాట వాస్తవమన్నారు. దేశం మొత్తంలో ఈ సమస్య ఉందన్నారు. తమ ప్రభుత్వం ఈ సమస్యకు తక్షణ, శాశ్వత పరిష్కారం అలోచిస్తోందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసిందని, నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడుతామన్నారు. ఐదునెలల్లో శాశ్వత పరిష్కారం... దాదాపు ఐదు నెలల్లో బెంగళూరును పట్టి పీడుస్తున్న చెత్తకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిషత్‌లో విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తారా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... నగరంలో ప్రతి రోజు నాలుగువేల టన్నుల చెత్త పోగవుతోందన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు రీ సైక్లింగ్ చేయక పోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నవుతున్నాయన్నారు. 2006 నుంచి నగరంలో ఈ సమస్య ఉందన్నారు. సమస్య పరిష్కారంలో భాగంగా బెంగళూరు శివారులో నాలుగు చెత్త రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇక మండూరు చెత్త సమస్యకు పరిష్కారం కనుగొనడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి దర్పణ్జైన్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఏది ఏమైనా మరో ఐదు నెలల్లోపు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం తెలిపారు. ఇంకా పరిశీలన దశలోనే... ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందన పాడి రైతులకు అదనంగా రూ.2 ప్రోత్సాహక ధనం ఇవ్వాలనే విషయం ఇంకా పరిశీలన దశలోనే ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర పరిషత్‌కు తెలిపారు. ఎమ్మెల్సీ మరితిబ్బేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్లో అదనంగా రూ.144 కోట్లు కేటాయించిందన్నారు. అందువల్లే ఆయా వర్గాల పాడి రైతులకు అదనంగా ప్రోత్సాహకధనం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. దీని వల్ల 65 వేల మంది ఎస్సీ, 40 వేల మంది ఎస్టీ పాడిరైతులకు ప్రయోజం కలుగుతుందన్నారు. ప్రభుత్వం పాడి రైతుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందనడం తగదన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని టీ.బీ జయచంద్ర పరిషత్‌కు తెలిపారు. ఏ విషయమైన ఈ వారంలో జరగనున్న ఉన్నత స్థాయి కమిటీలో చర్చించే ఈ రెండు వర్గాల పాడిరైతులకు అదనపు ప్రోత్సాహకం ఇచ్చే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామని ఆయన వివరించారు. బెంగళూరులో బంగ్లాదేశీయులు బెంగళూరు నగరంలో 97 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎమ్మెల్సీ అరుణా శహపుర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... అక్రమంగా నివశిస్తున్న వారిని బంగ్లాదేశ్ చేర్చేంత వరకూ వారి సంక్షేమం, భద్రత ఇక్కడి ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అందువల్ల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా సాంఘిక సంక్షేమశాఖకు సూచించామన్నారు. అక్రమంగా నివశిస్తున్న వారందరిని ఒకే చోట ఉంచడం వల్ల విదేశీ శక్తుల వల్ల ఎదురవుతున్న శాంతి భద్రతల సమస్యలను సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చునని కే.జే జార్జ్ తెలిపారు. మీ వల్లే పరమేశ్వర్‌ను మండలికి పంపించాం... శాసనమండలిలో మిమ్మలను నియంత్రించడానికే పరమేశ్వర్‌ను శాసనమండలి సభ్యులుగా చేయాల్సి వచ్చిందని పరిషత్‌లో సీఎం సిద్ధారమయ్య విపక్ష నాయకుడు ఈశ్వరప్పతో సరదాగా పేర్కొన్నారు. మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పరమేశ్వర్... ఈశ్వరప్పకు షేక్‌హాండ్ ఇస్తుండగా బీజేపీ ఈశ్వరప్పను మండలికి తీసుకు వచ్చిన తర్వాతనే తాము పరమేశ్వర్‌ను పరిషత్ సభ్యుడిగా ఎంపిక చేశాం.’ అని అన్నారు. ఇందుకు ఈశ్వరప్ప ప్రతి స్పందిస్తూ... మా పార్టీ న న్ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసింది. మీరు కూడా పరమేశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి స్థానం కల్పిస్తారా?’ అని ప్రశ్నించారు. సిద్ధు ప్రతిస్పందిస్తూ... ‘మీకు ఒక్కరికే కాదు. ఆర్.అశోక్‌కు కూడా ఆ పదవి దక్కింది కదా?’ అన్నారు. ‘దాందేముంది ఎమ్మెల్సీ ఉగ్రప్పకు కూడా డీసీఎం పదవి ఇవ్వండి అని సూచించారు. ఉగ్రప్ప మాట్లాడుతూ... విపక్ష నాయకుడికి మాపై ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. ఇంతలో సభాపతి శంకరమూర్తి కలుగజేసుకోవడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. -
అక్రమ రవాణాకు చెక్
ఇక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఇసుక.. రేషన్ సరుకులు.. ఇలా పలు రకాల వస్తువులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటి వెళుతున్నాయి. వీటికి ‘చెక్’ పెట్టడంలో ఇంతకాలం ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులు ఇకపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సాయుధులైన పోలీసులతో పహారాను పెంచాలని భావిస్తున్నారు. దీనిపై పలు శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. చెక్‌పోస్టుల్లో ఇక ‘సాయుధ’ పహారా - రాత్రి సమయాల్లో ప్రత్యేక నిఘా - ‘రేషన్’ పక్కదారి పట్టకుండా చర్యలు - అవసరమైన చోట ఎస్ఐ స్థాయి అధికారితో బందోబస్తు - త్వరలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం కానుంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖకు చెందిన ఓ అధికారి, నలుగురైదుగురు సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించిన చెక్‌పోస్టులు త్వరలోనే సాయుధ పోలీసుల పహారాలోకి వెళ్లనున్నాయి. జిల్లా నుంచి అక్రమంగా తరలుతున్న కోట్ల రూపాయల రేషన్ సరుకులు, ఇసుకకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఈ చర్యలకు పూనుకుంటోంది. దీనిపై త్వరలోనే జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఆర్టీఏ, ఇతర భాగస్వామ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం అన్ని చెక్‌పోస్టుల్లో నిఘా పెంచనున్నారు. ఉపయోగం లేని ‘చెక్’.. జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా ప్రస్తుతం మొక్కుబడి తనిఖీలే నడుస్తున్నాయి. చెక్‌పోస్ట్ గుండా వెళుతున్న వాహనాలపై అనుమానం వచ్చినప్పుడో, అధిక లోడుతో వెళుతోందని గుర్తించినప్పుడో సిబ్బంది ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప.. అక్రమ రవాణాను అడ్డుకునే దిశలో కృషి చేయడం లేదు. కాగా, సక్రమంగా వెళుతున్న వాహనాలను ఆపి తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక, రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం చెక్‌పోస్టు సిబ్బందికి కత్తిమీద సాములా తయారైంది. కొందరు అక్రమ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడడం, మరికొన్ని సందర్భాలో సరుకు తీసుకు వెళుతున్న వారే చెక్‌పోస్టు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ఇసుక రవాణా... ఆంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున సరిహద్దులున్న జిల్లా నుంచి లక్షల టన్నుల నిత్యావసరాలు, వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలి వెళుతున్నాయి. ఇసుక అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడా తరలివెళుతోంది. అయినా వీటిని నియంత్రించేందుకు చెక్‌పోస్టుల సామర్థ్యం సరిపోవడం లేదు. ఇటీవలి కాలంలో చెక్‌పోస్టుల సంఖ్య పెంచినా ఫలితం లేకుండా పోయింది. ఈ అక్రమ రవాణాలో కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు భాగస్వాములేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు చెక్‌పోస్టు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడంతో ఈ దిశలో యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. చెక్పోస్టుకో కానిస్టేబుల్... అవసరమైతే ఎస్ఐ కూడా నిఘాను పటిష్టం చేసేందుకు ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసు బలగాలను కాపలా ఉంచాలని కలెక్టర్ భావిస్తున్నారు. ఇందుకోసం పోలీసు శాఖ సహకారంతో ప్రతి చెక్‌పోస్టు దగ్గర కనీసం సాయుధుడైన కానిస్టేబుల్‌ను ఉంచాలని, తద్వారా చెకింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి మానసిక స్థైర్యం కల్పించాలనే యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఎస్పీ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖ సిబ్బంది నేతృత్వంలోనే నడిచిన చెక్‌పోస్టుల్లో సిబ్బందిని పెంచడంతో పాటు పోలీసు కాపలా కూడా పెట్టడం ద్వారా రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలన్నది జిల్లా యంత్రాంగం ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు సరుకులు అక్రమంగా జిల్లా దాటివెళుతున్నాయని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే ఎస్ఐ స్థాయి అధికారిని కాపలా ఉంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్వహించబోయే సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇసుకపైప్రత్యేక దృష్టి... జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను బంగారు బాతులుగా చేసుకుని కొందరు అక్రమార్కులు లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. పట్టాదారు స్థలాల్లో తవ్వకాల పేరుతో ఇసుక నిల్వలను హరించివేస్తున్నారు. గోదావరి తీరంలో గిరిజన సొసైటీల ద్వారా ఇప్పటికే సేకరించిన దాదాపు 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నాయి. వీటి విలువ రూ. కోటి పైమాటే. ఇప్పుడు ఈ నిల్వలు అక్రమంగా తరలివెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఇసుకను ఎలా వినియోగించాలన్న దానిపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పట్టాదారు స్థలాల్లో తవ్వకాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించి, సర్వే చేసి, ఆ స్థలాలను మార్కింగ్ చేయడంతో పాటు రెడ్ఫ్లాగ్లు ఏర్పాటు చేయడం ద్వారా పట్టాదారులు తమ స్థలాలకు మించి ఇసుక తవ్వకాలు చేపట్టకుండా నియంత్రించే దిశలో కృషి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి కోట్లాది రూపాయల విలువైన అక్రమ సరుకు రవాణా ఏ మేరకు నియంత్రించగలరో, పోలీసు పహారా ఏ మేరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే. -
మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా...
డోన్: డోన్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. దీనిని అడ్డు కట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అక్కడక్కడ చెక్‌పోస్టులున్నా పేరుకుమాత్రమే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఏడాది క్రిందట కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి డోన్పట్టణ సమీపంలోని కోట్లవారిపల్లెవద్ద, వెల్దుర్తి మండలం రామళ్లకోటవద్ద, బేతంచర్ల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టులలో ఏడీఎంజీ అధికారులతో పాటు, పారెస్టు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలి. అయితే, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు కానీ, అక్కడ ఏడీఎంజీ కార్యాలయ సిబ్బంది తప్ప ఎవరూ ఉండటంలేదు. ఒక వేళ వీరు పట్టుకుంటే మామూళ్లు ఇచ్చి అక్రమార్కులు యథేచ్ఛగా మైనింగ్‌ను తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డోన్, బేతంచర్ల ప్రాంతం నుంచి ఐరన్‌ఓర్ ముడి ఖనిజం ప్రతిరోజు లారీల్లో బళ్లారి, తాడిపత్రి, కర్నూలు ప్రాంతాలకు తరలివెల్లుతోంది. ఈ దందా జీరో వ్యాపారంతో సాగుతోంది. బేతంచర్ల మండలంలోని ముసలాయిచెరువు, ఎన్.రంగాపురం, గూటుపల్లి, తవిసికొండ, ఉసేనాపురం, నాగమల్లకుంట, ముద్దవరం, డోన్ మండలంలోని చిన్నమల్కాపురం, కన్నపుకుంట, కమలాపురం ప్రాంతాలనుంచి అక్రమంగా వెలికి తీసిన ఐరన్‌ఓర్‌ను తరలిస్తున్నారు. చిన్నమల్కాపురం, గూటుపల్లి ప్రాంతాల్లో అటవీ ప్రాంతం, పట్టాభుమూల్లో వెలికి తీసిన ఇనుపఖనిజాన్ని రాత్రికి రాత్రి డోన్‌మీదుగా హద్దులు దాటిస్తున్నా రు. ఈ అక్రమార్కులకు డోన్, బేతంచర్ల, ప్యాపిలి పోలీసుల సహకాారం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూతూ మంత్రంగా తనిఖీలు: కోట్లవారిపల్లె వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు తూతూ మంత్రంగా కొనసాగుతోంది. బేతంచర్ల, కొచ్చెర్వు, జలదుర్గం ప్రాంతం నుంచి వచ్చే లారీలను తనిఖీలు చేస్తూ పర్మిట్లను పరిశీలించాలి. అయితే, ఈ తనిఖీలు ఏడీఎంజీ కార్యాలయం నుంచి వచ్చిన ఇద్దరు సాధారణ సిబ్బంది, తలారీ మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరు ఉదయం, సాయంత్రం మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రాత్రిపూట యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది కొరత ఉంది మైనింగ్‌ను అక్రమంగా తరలించకుండా పలుచోట్ల చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే, సిబ్బంది కొరత కారణంగా వాటిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేని పరిస్థితి. చెక్‌పోస్టుల వద్ద పర్మనెంట్‌గా గేట్లు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. రెవెన్యూ, సేల్‌ట్యాక్స్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తే మరింత కట్టుదిట్టం చేయవచ్చు. - చారీ, ఏడీ మైన్స్ -
భలే చౌకబేరము..!
దాచేపల్లి, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయిన చెక్‌పోస్టులు ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అనుమతి ఉన్నా లేకపోయినా వ్యాపారులు ఇసుకను యథేచ్ఛగా హైదరాబాద్‌కు తరలించేవారు. అమరావతి, వైకుంఠపురంలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లారీలకు పరిమితికి మించి లోడ్ చేసి వ్యాపారులు సొమ్ము చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో దాచేపల్లి మండలం గామాలపాడు పంచాయతీ పరిధిలోని జేపీ సిమెంట్స్ వద్ద రవాణాశాఖ అధికారులు సోమవారం చెక్‌పోస్ట్ ప్రారంభించారు. ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్రం సరిహద్దులోకిలోడ్తో ఉన్న లారీలు ప్రవేశించాలంటే తప్పనిసరిగా రవాణాశాఖకు చెందిన తనిఖీ కేంద్రంలో ఇచ్చే పాస్ అవసరం. అమరావతి, వైకుంఠపురం ఇసుకరీచ్‌లలో ఇసుకను నింపుకుని సుమారు 30 లారీలు మంగళవారం తెల్లవారుజామున దాచేపల్లికి చేరుకున్నాయి. జేపీ సిమెంట్స్ వద్ద రవాణాశాఖ అధికారులు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారన్న విషయం తెలుసుకుని లారీ డ్రైవర్లు లారీలను దాచేపల్లి, ఇరికేపల్లి, గామాలపాడు గ్రామాల్లో నిలిపివేశారు. పరిమితికి మించిన లోడ్‌తో వస్తుండడంతో రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారనే భయంతో అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై లారీలను నిలిపివేశారు. అందినకాడికి ఇసుక విక్రయం.. రవాణాశాఖ తనిఖీ కేంద్రం వద్ద నుంచి లారీ వెళ్లాలంటే నిబంధనల ప్రకారం లారీల్లో లోడ్ ఉండాల్సిందే. లారీలో భారీగా ఇసుక ఉండడంతో చెక్‌పోస్ట్ వద్దకు వెళ్తే ఇబ్బందులు వస్తాయని గమనించిన లారీ డ్రైవర్లు పరిస్థితిని లారీ యజమానులకు ఫోన్‌ద్వారా వివరించారు. యజమానుల ఆదేశాల మేరకు గత్యంతరం లేక పరిసర గ్రామాల్లోనే ఇసుకను అమ్మేందుకు డ్రైవర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల్లో నామమాత్రపు ధరను చెల్లించి లారీల ద్వారా ఇసుకను హైదరాబాద్ తరలించి అక్కడ టన్ను రూ.1,200 నుంచి రూ.1500కు వ్యాపారులు అమ్ముకునేవారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణాలకు ఎక్కువగా ఇక్కడి నుంచే ఇసుకను తీసుకెళ్తుంటారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగి స్థానికంగా ఇసుక వ్యాపారులు ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు విక్రయిస్తుండేవారు. ప్రస్తుతం చెక్‌పోస్ట్ పుణ్యమా అని మూడు టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.1,200 కే ఇచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు ఇళ్లు నిర్మించుకునే సామాన్య ప్రజలు కూడా ఇసుకను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. సొంత ట్రాక్టర్లు ఉన్న వారు డబ్బు చెల్లించి ఎక్కువగా ఇసుకను తరలించారు. కొన్ని లారీల్లో ఇసుకను పూర్తిగా విక్రయించగా, మరికొన్ని లారీల్లో మాత్రం నిబంధనల ప్రకారం లోడ్‌ను ఉంచుకుని మిగతా ఇసుకను విక్రయించారు. ఇరికేపల్లి గ్రామానికి చెందిన ఒకరు లారీ ఇసుకను రూ.12 వేలకు కొనుగోలు చేశారు. లారీని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అధికలోడ్ ఉండడంతో లారీ ముందు చక్రానికి ఉన్న కమాన్ కట్టలు విరిగాయి. దీంతో లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు అమరావతి, వైకుంఠపురం ఇసుకరీచ్‌ల నుంచి పరిమితికి మించి ఇసుకను లోడ్ చేసుకుని వచ్చిన కొన్ని లారీలను చెక్‌పోస్ట్ వద్ద ఆపి అనుమతులు పరిశీలించాం. లారీల్లో సామర్థ్యానికి మించి ఇసుక ఉండడంతో ఇతర రాష్ర్టంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం లోడ్ ఉన్న లారీలను మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిచ్చాం. నిబంధలనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. - రాంబాబు, చెక్‌పోస్ట్ ఇన్చార్జి -
ఎంతటివారైనా వదిలిపెట్టం
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎంత పలుకుబడి ఉన్నవారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు తెలిపారు. మంగళవారం అర్బన్ ఎస్పీ తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో క్రైం మీటింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు యువ ఎస్ఐలతో 10 టీమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడున్న చెక్‌పోస్టులతో పాటు మరికొన్ని చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరెవరి ప్రమేయం ఉందో దర్యాప్తు చేయాలని, వారిందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా అదుపులోకి తీసుకోవాలని అన్నారు. సార్వత్రిక, మున్సిపల్, స్థానికసంస్థల ఎన్నికల బందోబస్తులో సమర్థవంతంగా విధులు నిర్వహించడం పట్ల అధికారులందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు. ఇక పాత కేసులపై దృష్టి సారించాలని, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఓఎస్డీలు రాజశేఖరరావు, చాందేనాయక్, సిద్ధారెడ్డి, డీఎస్పీలు రవిశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, టంగుటూరి సుబ్బన్న, ఎంవీయస్ స్వామి, విమలాకుమారి, అభిషేకం, శ్రీనివాస్ రాజేంద్రప్రసాద్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జిల్లాకు రెండు బోర్డర్ చెక్‌పోస్టులు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ కొత్తగా బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆ శాఖ ఇప్పటికే పంపిన ప్రతిపాదనలకు విభజన కమిటీ ఆమోదం తెలిపింది. జిల్లాకు సంబంధించి రెండు బోర్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం గరికపాడు వద్ద ఉన్న ఇంటర్నల్ చెక్‌పోస్టును బోర్డర్ చెక్‌పోస్టుగా మార్చనున్నారు. నల్గొండ జిల్లాకు సరిహద్దుగా కోదాడకు వెళ్లే వాహనాల తనిఖీకి గరికపాడు వద్ద బోర్డర్ చెక్‌పోస్టును ప్రతిపాదించారు. తిరువూరు శివార్లలో ఖమ్మం జిల్లా సరిహద్దున మరో బోర్డర్ చెక్ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ రెండు చెక్‌పోస్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి మన జిల్లాలోకి వచ్చే వాహనాలు ఈ రెండు చెక్‌పోస్టుల వద్ద ట్యాక్స్ చెల్లించి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రాంతంలో వాహనాల నంబర్లకు సంబంధించి ఎటువంటి కొత్త సిరీస్ ప్రారంభించేది లేదని జిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సీహెచ్ శివలింగయ్య ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కొత్త సిరీస్‌లో నంబర్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి, మన జిల్లాకు కొత్తగా నంబర్ల సిరీస్ జారీచేసే ఉత్తర్వులు రాలేదని, అటువంటి ప్రతిపాదన కూడా లేదని వివరించారు. -
సీమాంధ్ర-తెలంగాణ మధ్య ఎనిమిది అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు
హైదరాబాద్: తెలంగాణ - సీమాంధ్రల మధ్య 8 ప్రాంతాల్లో సరిహద్దులను నిర్ధారిస్తూ చెక్‌పోస్టుల ఏర్పాటుకు రవాణా శాఖ సిద్ధమైంది. వీటిని అంతర్రాష్ట్ర సరిహద్దులుగా పేర్కొంటూ వాహనాల తనిఖీ కోసం మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఈ చెక్‌పోస్టుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో గుర్తించిన ప్రాంతాల్లో ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాలకు చెందిన సిబ్బందిని వీటిల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ - ఇతర రాష్ట్రాల మధ్య వాహనాల తనిఖీ ఎలా కొనసాగుతోందో ఇక నుంచి (విభజన అమల్లోకి వచ్చాక) తెలంగాణ - సీమాంధ్ర మధ్య కొత్తగా ఏర్పాటు చేయనున్న చెక్‌పోస్టుల వద్ద కూడా అలాగే కొనసాగనుంది. మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లింపు, పర్మిట్ల గడువు, వాహనాల ఫిట్నెస్, వాహనాల లెసైన్స్.. తదితరాలను ఈ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తారు. తదనుగుణంగా వారు చర్యలు తీసుకుంటారు. అయితే .. ఈ పన్నులకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇప్పటికే పర్మిట్లు తీసుకున్న వాహనాలకు ఆ గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి పద్ధతిని కొనసాగిస్తారు? పన్నుల చెల్లింపు ఎప్పటినుంచి మొదలవుతుంది? ఇతరత్రా ఫీజుల విధానం ఎలా ఉంటుంది? తదితరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులు, చెక్‌పోస్టులు ఇవీ.. రహదారి, ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1. హైదరాబాద్ - కర్నూలు హైవే కర్నూలు సమీపంలో.. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ 2. కల్వకుర్తి - శ్రీశైలం కర్నూలు జిల్లా సున్నిపెంట మహబూబ్‌నగర్ జిల్లా ఈగలపెంట 3. దేవరకొండ - మాచర్ల గుంటూరు జిల్లా మాచర్ల నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ 4. మిర్యాలగూడ - ఒంగోలు గుంటూరు జిల్లా దాచేపల్లి నల్లగొండ జిల్లా విష్ణుపురం 5. విజయవాడ - హైదరాబాద్ కృష్ణా జిల్లా గరికపాడు నల్లగొండ జిల్లా కోదాడ 6. ఖమ్మం - తిరువూరు కృష్ణా జిల్లా తిరువూరు ఖమ్మం జిల్లా కల్లూరు 7. ఖమ్మం - రాజమండ్రి ప.గో. జిల్లా జీలుగుమిల్లి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట 8. కొత్తగూడెం - జగదల్పూర్ హైవే తూ.గో.జిల్లా మారేడుమిల్లి ఖమ్మం జిల్లా పాల్వంచ -
జిల్లాలోనే సరిహద్దులు
సాక్షి, గుంటూరు :రాష్ట్ర విభజన జరిగిపోయింది. అధికారులు, సిబ్బంది పంపకాల్లో ఉన్నతాధికారులు తలమునకలై ఉన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుపై పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భౌగోళికంగా రాష్ట్రాన్ని ఎలా విభజించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. జూన్ రెండో తేదీనుంచే అధికారికంగా కొత్త రాష్ట్రంలోనే కార్యకలాపాలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సరిహద్దులు కూడా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది బోర్డర్ చెక్‌పోస్టులను అధికారికంగా ఏర్పాటు చేయగా అందులో రెండు గుంటూరు జిల్లా సరిహద్దుల్లోనే ఏర్పాటు చేయాలని భావించడం గమనించదగ్గ విషయం. దేవరకొండ నుంచి మాచర్ల వైపునకు వెళ్ళే రహదారిలో నాగార్జున సాగర్ వద్ద ఒక బోర్డర్ చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మిర్యాలగూడెం నుంచి ఒంగోలు వెళ్ళే రహదారిలో దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద మరో బోర్డర్ చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం అధికారికి ప్రకటన వెలువడింది. ఈ చెక్‌పోస్టుల ఏర్పాటు ద్వారా ఇక రెండు రాష్ట్రాలకూ పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లేననే వాదన వినవస్తోంది. గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ తీరంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి తెలంగాణా ప్రాంతంలోని నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు నిత్యం భారీఎత్తున ఇసుక రవాణా అవుతుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెం పట్టణంలో ఉన్న రైస్‌మిల్లులకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు ట్రాక్టర్ల ద్వారా తాము పండించిన ధాన్యాన్ని నేరుగా వెళ్లి అమ్ముకుంటుంటారు. ఈ బోర్డర్ చెక్‌పోస్టుల ఏర్పాటు వల్ల ఇరుప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు తీవ్ర కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
రెండు రాష్ట్రాల మధ్య 9 అంతర్రాష్ర్ట చెక్‌పోస్టులు
పన్ను వసూలు చేయాలా వద్దా అనేది ఇద్దరు సీఎంల నిర్ణయానికే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తొమ్మిది సమీకృత అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల ఏర్పాటునకు అధికారులు ప్రతిపాదించారు. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆ రోజు నుంచి ఈ తొమ్మిది అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో రవాణా, వ్యాట్, ఎక్సైజ్ శాఖల పన్నులను వసూలు చేయనున్నారు. అయితే వెంటనే పన్నులు వసూలు చేయాలా లేక ఆరు నెలలు లేదా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు పన్నులు వసూలు చేయకుండా ఉండాలా అనే దానిపై ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. గవర్నర్ నర్సింహన్ నిర్ణయం తీసుకోని పక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి వదిలేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, కేంద్ర నిర్ణయం మేరకు నడుచుకోవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జూన్ 20 వరకు వచ్చే వ్యాట్ ఆదాయం ఇరు రాష్ట్రాలకు పంపిణీ ప్రస్తుత మే నెలకు సంబంధించి వ్యాట్ ఆదాయం జూన్ 20వ తేదీ వరకు వ్యాపారస్తులు చెల్లించనున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఉమ్మడి రాష్ట్రంలో మే నెలలో వచ్చిన వ్యాట్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను అకౌంటెంట్ జనరల్‌కు అప్పగించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 20వ తేదీ వరకు వచ్చిన ఉమ్మడి రాష్ట్రం వ్యాట్ ఆదాయాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, సీమాంధ్రకు 52 శాతం అకౌంటెంట్ జనరల్ పంపిణీ చేయనున్నారు. -
ప్రలోభాల ఎర
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. మిగతా పార్టీలకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలు జిల్లాలో ఇప్పటికే ప్రచారం పూర్తిచేశారు. వారికి జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు. జగన్ ప్రసంగాలు వారిని ఆలోచింపజేశాయి. పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే 2019లో ప్రజల ముందుకు వస్తామని ఆయన చేసిన ప్రకటన ప్రజల్లో విశ్వాసం నింపింది. అలాగే గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, డాక్టర్ అమృతపాణిలు ప్రచారంలో ముందున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. టీడీపీ ప్రలోభాలతో ముందుకు... వైఎస్సార్సీపీకి ప్రజల్లో వస్తున్న స్పందన చూసిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులు గ్రామాల్లోని ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులను తమవైపుకు తిప్పుకోవడం, వారి ద్వారా ప్రజల్లోకి వెళ్లడం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా మాకు ఓటువేయకున్నా సరే ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు ఏం కావాలో చెప్పాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మద్యం పంపిణీ జోరుగా సాగుతుండగా డబ్బు, మహిళలకు చీరలు, యువతకు క్రికెట్ కిట్లు వంటి తాయిలాలు చూపుతున్నట్లు సమాచారం. నరసరావుపేట, సత్తెనపల్లి, నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రలోభాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుపుకోసం ఆరాటపడుతున్న ఓ నేత తన సామాజిక వర్గాల నాయకులను రంగంలోకి దింపారు. వారి ద్వారా ఓట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్‌లో తమకు అనుకూలంగా ఉన్న వారితో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. రంగంలోకి దిగిన పచ్చ ఎన్ఆర్ఐలు... ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపుఖాయం కావడంతో తెలుగుదేశం పార్టీ చివరి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఏదో ఒక విధంగా తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించిన నాయకులు ఇప్పుడు గెలుపు కోసం తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు అర్థబలం కోసం ఎన్ఆర్ఐలను ఆశ్రయిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాలను, గ్రామాలను దత్తత తీసుకోవాలని, అక్కడ గెలిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇద్దరు, ముగ్గురు ఎన్ఆర్ఐలు ఒక మండలాన్ని దత్తత తీసుకొనేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం నిఘా ఎక్కువగా ఉండటం, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండటంతో అవసరమైన నిధులను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
అడ్డంగా దొరికిన ఖాకీలు
పరిగి, న్యూస్‌లైన్: చెక్‌పోస్టులో తనిఖీలు చేయాల్సిన కానిస్టేబుళ్లు మద్యం మత్తులో మునిగిపోయారు. మమ్మల్నెవరు ‘తనిఖీ’ చేస్తారనుకున్నారో ఏమో మరి.. చెక్‌పోస్టును గాలికొదిలేసి వెళ్లిపోయారు. డీఎస్పీ ‘తనిఖీ’తో కానిస్టేబుళ్ల బాగోతం బయటపడింది. ఆస్పత్రిలో పరీక్షలు చేయించిన డీఎస్పీ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చన్గొముల్ ఠాణాకు చెందిన కానిస్టేబుళ్లు దయానంద్ (పీసీ నంబర్ 2256), వెంకటేష్(2902), తుక్యానాయక్(2748), చంద్రశేఖర్‌లు బుధవారం రాత్రి మన్నెగూడ చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది రాత్రి 10-12 గంటల వరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సి ఉంది. సిబ్బంది డ్యూటీ ఎలా చేస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు రాత్రి 11 గంటల సమయంలో చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ మన్నెగూడకు వచ్చారు. ఆ సమయంలో చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ఎవరూ లేరు. దీంతో డీఎస్పీ వెంటనే సంబంధిత ఎస్ఐ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మందలించారు. విధుల్లో ఉన్న నలుగురు కానిస్టేబుళ్లను అక్కడికి రప్పించారు. వారు మద్యం మత్తులో ఉన్నారని అనుమానించిన ఆయన వారిని పరిగి ఠాణాకు తీసుకొచ్చారు. పరిగి ఎస్ఐ లింగయ్యను ఇచ్చి పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. డ్యూటీలో ఉన్న వైద్యుడు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుళ్లు దయానంద్, వెంకటేష్, తుక్యానాయక్లు మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించి ‘డ్రంకెన్ కండిషన్’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో కానిస్టేబుళ్ల వివరాలు రాయించకుండానే పోలీసులు వారిని తీసుకొని వెళ్లిపోయారు. అనంతరం కంగుతిన్న డాక్టర్ తనకు తెలిసిన వారితో వివరాలు సేకరించి రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ విషయమై చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. కానిస్టేబుళ్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
భద్రత కట్టుదిట్టం
కర్నూలు, న్యూస్‌లైన్: పురపాలక ఎన్నికలను పోలీసు శాఖ సవాల్‌గా తీసుకుంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ స్థాయి అధికారులు, స్థానిక పోలీసు అధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అందుబాటులోని సిబ్బందితో పాటు పారా మిలటరీ బలగాలతో నిఘాను తీవ్రతరం చేశారు. ఇప్పటికే పారా మిలటరీ బలగాలన్నీ మున్సిపల్ పట్టణాలకు చేరుకోగా.. సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ సిబ్బంది సేవలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 79 మంది ఎస్ఐలు, 294 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1074 మంది కానిస్టేబుళ్లు, 64 మంది హోంగార్డులు, ఏఆర్ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 470 మంది, 1421 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 17 ప్లటూన్ల ఏపీఎస్పీ, సీఎపిఎఫ్ సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. స్పెషల్ స్ట్రయికింగ్, స్ట్రయికింగ్ ఫోర్సులతో పాటు షాడో పార్టీలను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఎన్నికలు జరిగే మునిసిపల్ పట్టణాల్లోకి కొత్త వ్యక్తులు, ఎన్నికలతో సంబంధం లేని వారు రాకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టడి చేశారు. అక్రమ మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడంతో పాటు బెల్టు షాపులపై దాడులు కొనాసాగించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1183 మంది లెసైన్స్ ఆయుధాలు ఉండగా, ఇప్పటి వరకు 1104 ఆయుధాలను జిల్లా ఆర్మ్డ్ హెడ్‌క్వార్టర్‌తో పాటు ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఎన్నికల్లో గొడవలకు ఆస్కారం కలిగిస్తారనే అనుమానం ఉన్న వారందరిపైనా షాడో పార్టీలు ఏర్పాటయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు అవకాశం లేకుండా వీడియో చిత్రీకరించేందుకు ఈ సారి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సీఆర్పీసీ అమలులో ఉన్నందున కర్నూలు నగరంతో పాటు జిల్లా మొత్తం మీద సభలు, సమావేశాలు విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు అలాంటి వారిని జిల్లా బహిష్కరణకు గురి చేసేలా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని 8 మునిసిపాలిటీల్లో ఈనెల 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజు శాంతియుత ప్రజా జీవనానికి అవరోధం కలిగించేలా హింసాత్మక ఘటనలకు పాల్పడితే అల్లరి మూకలపై కాల్పులు జరిపేందుకూ వెనుకాడవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి: ఎస్పీ మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో మునిసిపల్ ఎన్నికలు జరిగేలా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కాల్పులకూ వెనుకాడబోమన్నారు. -
చెక్‌పోస్టుల్లో భారీగా నగదు పట్టివేత
కొవ్వాడ వద్ద రూ.20 లక్షలు స్వాధీనం పోలేకుర్రు జంక్షన్ వద్ద రూ.15 లక్షలు.. బ్యాంకు అధికారులు ఆధారాలు చూపడంతో అప్పగింత కొవ్వాడ (కాకినాడ రూరల్), న్యూస్‌లైన్ : ఎన్నికల నిఘా నేపథ్యంలో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు పట్టుబడ్డాయి. బ్యాంకుల నుంచి తమ బ్రాంచిలకు తరలిస్తున్న రెండు బ్యాంకులకు చెందిన రూ.35 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాంకు అధికారులు వాటి రికార్డులు చూపడంతో అప్పగించారు. ఆటోలో తరలిస్తున్న రూ.20 లక్షల నగదును కొవ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఎన్నికల సిబ్బంది పట్టుకున్నారు. అయితే నగదుకు సంబంధించి బ్యాంకు అధికారులు ఆధారాలు చూపడంతో వాటిని తిరిగి అప్పగించారు. కొవ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ, పోలీసు సిబ్బంది శుక్రవారం ఓ ఆటోను తనిఖీ చేశారు. అందులో రూ.20 లక్షల నగదు లభ్యమైంది. దీనిని ఎస్బీహెచ్ గొల్లల మామిడాడ బ్రాంచి నుంచి కాకినాడ బ్రాంచికి తరలిస్తున్నట్టు నగదుతో పాటు ఉన్న సిబ్బంది తెలిపారు. అయితే సరైన ఆధారాలు చూపాలని అధికారులు చెప్పడంతో, గొల్లల మామిడాడ నుంచి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన కొవ్వాడ చెక్‌పోస్టు ప్రాంతానికి చేరుకున్నారు. రూ.20 లక్షలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించారు. వాటిని పరిశీలించిన అధికారులు సొమ్మును తీసుకువెళ్లేందుకు అంగీకరించారు. తహశీల్దార్ వైకేవీ అప్పారావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ ముఖర్జీ, వీఆర్వో జి.సూరిబాబు తనిఖీల్లో పాల్గొన్నారు. పోలేకుర్రు వద్ద... తాళ్లరేవు : జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు జంక్షన్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద రూ.15 లక్షల నగదును కోరంగి ెహ చ్‌సీ ఎం.రవణమ్మ, సిబ్బంది పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా, కారులో తరలిస్తున్న ఈ నగదును స్వాధీనం చేసుకుని డీఎస్పీకి సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఎస్టీ టీమ్ హెడ్ జీబీవీ రమేష్ పరిశీలించి, నగదు కాట్రేనికోన ఆంధ్రాబ్యాంకుకు చెందినదిగా గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాలను బ్యాంకు ప్రతినిధి పి.రామ్‌కుమార్ చూపినప్పటికీ ఆర్ఓ అనుమతి లేకుండా నగదును తరలించడం నేరమని పోలీసులు వదిలి పెట్టలేదు. ఈ విషయాన్ని తాళ్లరేవు తహశీల్దార్, రిటర్నింగ్ అధికారి జి.శేషగిరిరావుకు తెలియజేయడంతో, ఆయన ఈ నగదును పరిశీలించారు. ఇంత నగదును అనుమతి లేకుండా ఎలా తరలిస్తున్నారని బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ దినకరణ్ నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను ఫోన్లో తహశీల్దార్‌కు తెలిపారు. ఈ ఆధారాలను పరిశీలించాక, సిబ్బందితో లేఖ రాయించి నగదును అప్పగించారు. -
తనిఖీల్లో రూ.12 లక్షలు స్వాధీనం
లంకలకోడేరు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తూ భారీ మొత్తంలో నగదు, మద్యంను స్వాధీనం చేసుకుంటున్నారు. మంగళవారం జిల్లాలో సుమారు రూ.12 లక్షలు వరకు నగదు పట్టుకున్నారు. రాత్రి పాలకొల్లు-భీమవరం జాతీయ రహదారిపై లంకలకోడేరు వద్ద మోటార్ బైక్‌పై వెళుతున్న యువకుడి నుంచి సుమారు రూ.5.96 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ మేజిస్టీరియల్ ఆఫీసర్ కె.జయరాజు లంకలకోడేరు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి వాసు మణికంఠ మోటార్ బైక్‌పై బ్యాగ్‌తో వెళుతుండగా అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అతని వద్ద రూ.5,96,900లు(500నోట్లు) లభించాయి. సొమ్ముకు సంబంధించి లెక్కలు ఆరా తీయగా వాసు మణికంఠ సరైన సమాధానం చెప్పకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.సూర్యనారాయణ, తహసిల్దార్ మహ్మద్ యూసఫ్ జిలానీ, రూరల్ సీఐ ఎ.చంద్రశేఖర్ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నగదును ఆదాయపన్ను అధికారుల ద్వారా వివరాలు సేకరించి ట్రెజరీలో డిపాజిట్ చేస్తామన్నారు. నగదుకు సంబంధించి రుజువులు చూపిస్తే తిరిగి ఆ నగదును సంబంధిత వ్యక్తికి అందజేస్తామన్నారు. ఎస్సై ఐ.వీర్రాజు, ఆర్ఐ కె.సుబ్బారావు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బీఎస్ఎల్ మంగకుమారి పాల్గొన్నారు. సమిశ్రగూడెంలో రూ.4.12 లక్షలు.. సమిశ్రగూడెం(నిడదవోలు రూరల్) : సమిశ్రగూడెం చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహానాలను తనిఖీ చేస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ.4.12 లక్షల నగదును గుర్తించి పట్టుకున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి కాళ్ల మండలం కలవపల్లికి వెళుతున్న కారును తనిఖీ చేయగా నగదును గుర్తించినట్లు ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని మండల మేజిస్ట్రేట్ ,త హసిల్దార్ ప్రసన్నలక్ష్మికి అప్పగించినట్లు చెప్పారు. ఏలూరులో రూ.2 లక్షలు.. ఏలూరు(టూటౌన్) : ఏలూరులో సెయింట్ ఆన్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసి చెక్‌పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న రూ.2 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన సూర్యదేవర శ్రీనివాసరావు ఏలూరు నుంచి నూజివీడుకు రూ.2 లక్షల నగదును తీసుకెళ్తుండగా మంగళవారం సాయంత్రం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారును ఆపి తనిఖీ చే శారు. నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను శ్రీనివాసరావు చూపకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు అప్పగించారు. సీఐ ఏలూరు తహసిల్దార్‌కు స్వాధీనపరిచారు. -
క్యాష్తో వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త!
వ్యాపార నిమిత్తమో.. శుభకార్యం కోసమో..మరేదైనా అవసరార్థమో.. పెద్ద మొత్తంలో డబ్బు వెంట తీసుకెళ్తున్నారా.. అయితే మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నగదు రవాణాలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎంతటి వారైనా ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తలనొప్పి తప్పదు. ఎట్టిపరిస్థితుల్లోనైనా రూ. 50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వచ్చినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ధ్రువీకరణ పత్రాలను దగ్గరే ఉంచుకోవాలి. సరైన డాక్యుమెంట్లు లేని డబ్బును సీజ్ చేస్తామని, సొత్తుకు సంబంధించి పూర్తి ధ్రువపత్రాలను అందజేస్తే తప్ప నగదు తిరిగి ఇవ్వబోమని అధికారులు ఖరాకండిగా చెప్తున్నారు. ఎన్నికల వేళ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు పార్టీలు చేస్తున్న పన్నాగాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఈ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిఘా వేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మొబైల్ టీంలు కూడా సంచరిస్తూ ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో రూ. 1.90 కోట్లకు పైగా సరైన ధృవపత్రాలు లేని నగదును పోలీసులు సీజ్ చేశారు. శనివారం ఒక్కరోజే సుమారు రూ. 70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సొత్తుపై విచారణ జరిపేందుకు ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారిని కూడా నియమించారు. నగదు తోపాటు బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాల తరలింపులో తగుజాగ్రత్తలు పాటించాలి. బ్యాంకు లావాదేవీలపైనా రిటర్నింగ్ అధికారులు నిఘావేశారు. రూ. లక్షకు మించి ఎలాంటి లావాదేవీ జరిగినా తమ దృష్టికి తేవాల్సిందిగా అన్ని బ్యాంకుల యాజమాన్యానికి కలెక్టర్ శనివారం ఆదేశాలు జారీచేశారు. అయితే నిత్యం వ్యాపార నిమిత్తం అధిక మొత్తంలో నగదుతో సంచరించే వ్యాపారులు పోలీసుల తనిఖీల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తుంటే రెండు, మూడు చోట్ల పోలీసులు ఆపుతున్నారని, వారడిగిన డాక్యుమెంట్లు చూపాలంటే రెండు,మూడు సార్లు ఇంటికి వెళ్లి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలే ఆర్థిక సంవత్సరం ముగింపు రోజులు.. ఆపై ఎన్నికల అధికారుల నిబంధనలతో పని ఒత్తిడి పెరిగిపోయిందని బ్యాంకర్లు వాపోతున్నారు. నగదు రవాణా నిబంధనల వల్ల కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. సొంత డబ్బే అంటే కుదరదు సొంత డబ్బే కదా.. ఏమవుతుందని పెద్ద మొత్తంలో వెంట తీసుకెళ్తే చిక్కుల్లో పడక తప్పదు. బ్యాంకులో జమ చేసేందుకు రూ.50వేలు మించి డబ్బు తీసుకువెళ్లే వారు బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు వంటివి తీసుకెళ్లాలి. ఇక లక్షల్లో తీసుకెళ్లాల్సి వస్తే ఆదాయపు పన్ను చెల్లింపు వివరాల పత్రాలు విధిగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు, వివాహాలకు దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లే వారు ఇతరత్రా అవసరాలకు నగదు వెంట తీసుకెళ్లేవారు జాగ్రత్త వహించాలి. నగదుపైనే కాదు.. పోలీసులు నగదు రవాణాపైనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువులపైనా నిఘా పెట్టారు. నగదుతోపాటే ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు రకరకాల నజరానాలు ప్రకటిస్తుంటారు. మహిళా ఓటర్లు అయితే చీరెలు, పెద్దలకు మద్యం సీసాలు, యువకులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, ఫుట్‌బాల్, క్యారమ్ బోర్డులు గంపగుత్తగా నజరానాగా ఇవ్వడం ఆనవాయితీ. పోలీసులు వీటిపైనా దృష్టి కేంద్రీకరించారు. పైన పేర్కొన్నవి పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్న సమయంలో పోలీసుల తనిఖీల్లో దొరికితే అంతే సంగతులు. వాటిని ఎక్కడ కొన్నారు? ఎందుకు కొన్నారు? వ్యాపారం కోసమా? అనే పోలీసుల ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబులివ్వాల్సి ఉంటుంది. జవాబు రాని పక్షంలో వాటిని జప్తు చేయడమే కాకుండా కేసు కూడా నమోదు చేస్తారు. అలాగే ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారకుండా పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. విస్కీ, బ్రాందీ నిల్వలు లేకుండా నిఘా పెంచారు. -
‘కట్టలు’ తెగుతున్న కరెన్సీ!
చండూరు, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెద్దమొత్తంలో డబ్బు పట్టుకున్నారు. మర్రి గూడ మండలం లెంకలపల్లికి చెందిన అబ్బరబోయిన వెంకటేశం (వెంకన్న) శుక్రవారం ఉదయం తన సొంతకారులో చం డూరుకు వెళ్తుండగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బంగారిగడ్డ చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు. కారులో * 3.60లక్షల నగదు తీసుకెళ్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే విచారణ చేసి పరిశీలి స్తామని సీఐ సుబ్బరాంరెడ్డి తెలిపారు. *50 వేలకు మించి నగదు తీసుకెళ్తే ఆధారాలు చూపిం చాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఐ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరిలో.. రూ.11.38లక్షలు తిరుమలగరి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి * 11.38లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా జనగాం నుంచి వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. ఈ డబ్బును ఎన్నికల రిట ర్నింగ్ అధికారి పేర బ్యాంకులో డిపాజిట్ చేశామన్నారు. జనగాం సాయి శ్రీనివాస్ జి న్నింగ్ మిల్లు నిర్వాహకులు రైతులకు చెల్లిం చడానికి డబ్బులు తీసుకెళ్తున్నట్లు తెలిపా రు. తనిఖీల్లో వెంకన్న, జానిమియా, రమే ష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా నగదు పట్టివేత
ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రినుంచి నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు రూ. 29,98,450 ల నగదును సీజ్ చేశారు. కమ్మర్‌పల్లిలో రూ.10.83లక్షలు కమ్మర్పల్లి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో తరలిస్తున్న రూ. 10.82 లక్షలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నా యి. కమ్మర్పల్లి పోలీసు చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. కరీం నగర్ జిల్లా జగిత్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డాక్టర్ విజయ్ కుమార్ కారును తనిఖీ చేయగా.. రూ. 10 లక్షలు లభించాయి. హైదరాబాద్‌లో కన్స్ట్రక్షన్ పనుల నిమిత్తం డబ్బులు తీసుకువెళ్తున్నట్లు విజయ్‌కుమార్ తెలిపారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను తెలియజేయకపోవడంతో పోలీసులు సొమ్మును సీజ్ చేశారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న యాళ్ల అంజిరెడ్డి కారును తనిఖీ చేయగా రూ. 81,900 లభించాయి. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బును తీసుకు వెళ్తున్నట్లు అంజిరెడ్డి తెలిపారు. డబ్బులకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. నగరంలో 11.74 లక్షలు.. నిజామాబాద్క్రైం : బోర్గాం(పి) బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో వాహనాల ను తనిఖీ చేస్తుండగా రూ. 7.74 లక్షలు లభిం చాయని నాలుగో టౌన్ ఎస్ఐ నరేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తున్న ఇంద్ర బస్సును పోలీసులు బోర్గాం (పి) చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బాసరకు చెందిన హరణికుమార్ బ్యాగ్ లో రూ. 7 లక్షల 74 వేలు లభించాయి. డబ్బులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. సారంగాపూర్‌లో.. సారంగాపూర్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ. 4 లక్షలు లభించాయి. ఒకటో టౌన్ ఎస్హెచ్ఓ నర్సింగ్‌యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం సారంగాపూర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ డీసీఎం వ్యాన్ వచ్చింది. ఈ వ్యాన్ మహారాష్ర్ట నుంచి నల్గొం డ జిల్లా నార్కట్‌పల్లికి వెళ్తోంది. వ్యాన్ డ్రైవర్ అంజయ్య వద్ద రూ. 4 లక్షలు లభించాయి. డబ్బులకు సంబంధించి ఎలాంటి రిసిప్ట్లు చూపకపోవడంతో నగదును సీజ్ చేశామని ఎస్హెచ్ఓ తెలిపారు. లచ్చాపేట్ చెక్‌పోస్టు వద్ద.. మాచారెడ్డి : జిల్లా సరిహద్దుల్లోని లచ్చాపేట్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించి లక్షా 80 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ప్రసాద్‌రావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాధకు చెందిన రాజు బైక్‌పై లక్ష రూపాయలు తీసుకొని కామారెడ్డివైపు వస్తున్నాడు. చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని తీసుకోవడానికి డబ్బులు తీసుకువెళ్తున్నానని రాజు తెలిపారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలను చూపకపోవడంతో సీజ్ చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం కమ్మర్‌పల్లికి చెందిన మల్లేశం వద్ద నుంచి రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నారు. గొర్రెలను అమ్మగా వచ్చిన డబ్బులను తీసుకుని వెళ్తున్నానని మల్లేశం తెలిపినా.. వాటికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. బస్వాపూర్ వద్ద రూ.94,450.. భిక్కనూరు : జిల్లా సరిహద్దులోని బస్వాపూర్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మేడపాటి శివ్వారెడ్డి తన వాహనంలో ఎలాంటి వివరాలు లేకుండా తరలిస్తున్న 94,450 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. చాకిర్యాల్‌లో రూ. లక్షా78వేలు.. బాల్కొండ : చాకీర్యాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి నిర్వహిం చిన తనిఖీల్లో భారీగా నగదు లభ్యమైంది. ఆదిలాబాద్ వైపు నంచి వస్తున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా రూ. లక్షా 78 వేలు లభించాయని ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించామని పేర్కొన్నారు. భీమ్‌గల్‌లో రూ.2.90లక్షలు.. భీమ్‌గల్ : మండలంలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 2.90 లక్షల నగదు లభించిందని తహశీల్దార్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నగదును స్టాటిస్టికల్, సర్వేలెన్స్ బృందానికి అప్పగించామన్నారు. రేంజ్ పరిధిలో రూ. కోటీ 38 లక్షలు స్వాధీనం నిజామాబాద్క్రైం : ఎన్నికల నియమావళి అమలులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును సీజ్ చేస్తున్నామని రేంజ్ డీఐజీ సూర్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా రు. రేంజ్ పరిధిలో నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఈనెల 3వ తేదీనుంచి ఇప్పటివరకు కోటీ 38 లక్షల 11 వేల 240 రూపాయలు, 24 కిలోల వెండి అభరణాలు, కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 142 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం 259 కేసులు నమోదు చేశామని, 1,627 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
రూ.17 లక్షలు సీజ్..
భిక్కనూరు, న్యూస్‌లైన్ : నిజామాబాద్ జిల్లా సరి హ ద్దు గ్రామమైన బస్వాపూరు సమీపంలో ఏర్పాటు చేసి న చెక్‌పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురి నుంచి రూ. 14 లక్షల 60 వేలను స్వాధీ నం చేసుకున్నారు. హెదరాబాద్కు చెందిన బాలకారి నర్సింహారావు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు వెళ్తుండగా ఆయన వాహనాన్ని తనిఖీ చేసి రూ. 3 లక్షల 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్ జిల్లా సిద్దిపేట కు చెందిన కూర వెంకటేశం తన కుటుంబంతో కలిసి వాహనంలో నిజామాబాద్ వెళ్తుండగా తనిఖీ చేసి పోలీ సులు రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన చంద్ర రంగరావు బాల్కొండ కు వాహనంలో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేసి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్.. ఇదిలా ఉండగా డబ్బులు తీసుకెళ్తూ పట్టుబడిన వారి లో జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన వారు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే డబ్బులను సీజు చేయవద్దని పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే తనిఖీలు చేస్తున్నామని, డబ్బులను నిబంధనల ప్రకారమే సీజు చేశామని, తామేమీ చేయలేమని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది. రూ. 2 లక్షల 50 వేలు స్వాధీనం జాన్కంపేట(ఎడపల్లి): మండలంలోని జాన్కంపేట చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన తనిఖీలో పోలీసు లు రూ. 2. 50 వేలు పట్టుకున్నారు. మద్నూర్ నుంచి ఆర్ముర్కు వెళ్తున్న కారును తనిఖీ చేయగా డబ్బు కనిపించిందని, డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. -
దుర్గం పోలీసుల మాయాజాలం
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: పేలుడు పదార్థాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన బొలెరో వాహనం అదృశ్యమైందని, ఈ విషయంలో పోలీసులే మాయాజాలం ప్రదర్శిస్తున్నారని పట్టణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున అనంతపురం నుంచి పేలుడు పదార్థాలతో రాయదుర్గం వెళుతున్న ఏపీ 02 టీఏ 1105 నెంబరు గల బొలెరో వాహనాన్ని అనంతపురం బైపాస్‌లోని చెక్‌పోస్టు వద్ద కళ్యాణదుర్గం పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అందులో 250 కిలోల పేలుడు పదార్థాలున్నట్లు గుర్తించి, వాహనాన్ని టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటలకే ఈ వాహనం స్టేషన్లో కనిపించకుండా పోవడంతో ముడుపులు తీసుకుని దానిని వదలివేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై టౌన్ ఎస్రూ. జయా నాయక్‌ను వివరణ కోరగా వాహనంలో పట్టుబడిన పేలుడు పదార్థాలకు బిల్లులతోపాటు, వాటిని తరలించేందుకు అవసరమైన లెసైన్స్ కూడా ఉండడంతో వాహనాన్ని వదలివేసినట్లు తెలిపారు. నకిలీ బిల్లులతో పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు తెలిస్తే సంబంధిత వ్యక్తులను తిరిగి రప్పించి విచారణ చేస్తామన్నారు. -
ముచ్చటగా మూడోసారి
బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్: రాష్ట్ర సరిహద్దులోని భీములవారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అక్రమాలను సమూలంగా నిరోధించేందుకు ఏసీబీ అధికారులు నడుం బిగించారు. ఈ క్రమంలో నెలరోజుల్లో ముచ్చటగా మూడోసారి చెక్‌పోస్ట్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. వివిధ విభాగాల్లో అక్రమంగా ఉన్న రూ.46,180 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరుస దాడుల నేపథ్యంలో చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది హడలిపోతున్నారు. ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు ఆధ్వర్యంలో 22 మంది సభ్యుల బృందం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భీములవారిపాళెం చెక్‌పోస్టులోకి ప్రవేశించింది. ఆ సమయంలో రవాణాశాఖ కౌంటర్ బయట స్టాంపింగ్ వేసే చోట బ్యాగు కింద రూ.1,200, సమీపంలోని బైక్ ట్యాంక్ కవర్లో రూ.1,300, వాణిజ్యపన్నుల శాఖ ఇన్కమింగ్ కార్యాలయం వద్ద రూ.2,400, అవుట్ గోయింగ్ వద్ద రూ.2,880 స్వాధీనం చేసుకున్నారు. ఆయా కౌంటర్ల వద్ద కాసేపు ఏసీబీ అధికారులు నిలుచోగా డ్రైవర్లు వచ్చి భారీగా నగదు ఇచ్చి వెళ్లారు. ఇలా రవాణా శాఖ కౌంటర్ వద్ద రూ. 18,100, అవుట్ గోయింగ్ వద్ద రూ. 7,500, ఇన్ కమింగ్ వద్ద రూ.12,800 వసూలయ్యాయి. పరిస్థితి మెరుగుపడుతోంది చెక్‌పోస్టులో పరిస్థితి క్రమేణా మెరుగుపడుతోందని డీఎస్పీ భాస్కర్‌రావు అన్నారు. గత దాడులతో పోలిస్తే అక్రమంగా వసూలు చేసిన నగదు తక్కువ మొత్తంలో ఉందన్నారు. అక్టోబర్ 10న నిర్వహించిన దాడిలో రూ.1.16 లక్షలు, డిసెంబర్ 21న రూ.1.10 లక్షలు, 29న రూ.60 వేలుతో పాటు ప్రతిసారీ ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ చిక్కారని వివరించారు. ఈ సారి మాత్రం ప్రైవేటు వ్యక్తులెవరూ తారసపడలేదన్నారు. అయితే దాడుల సందర్భంలో విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు పరిపానాధికారి, ఎంవీఐలను బాధ్యులు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, టీబీ శ్రీనివాసరావు, కృపానందం, ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సుబ్బారావుతో కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. భిన్నమైన వాతావరణం దాడులకు వచ్చిన ప్రతిసారి ఏసీబీ అధికారులు మూడు కౌంటర్ల వద్ద నిలబడి డ్రైవర్లు ఇచ్చివెళ్లే నగదును సిబ్బందిలా వసూలు చేసేవారు. ఇలా వసూలైన మొత్తాన్ని చివరలో అక్రమ సంపాదన కింద లెక్కిస్తారు. వరుస దాడుల నేపథ్యంలో పది రోజులుగా చెక్‌పోస్టులో అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా అధికంగా డబ్బులు ఇవ్వొద్దంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. బలవంతపు వసూళ్లకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తనిఖీలకు వచ్చిన ఏసీబీ అధికారులకు భిన్నమైన వాతావరణం కనిపించింది. డబ్బులు ఎక్కడా..అని డ్రైవర్లను ఏసీబీ సిబ్బంది ప్రశ్నించగా కొందరు మారు మాట్లాడకుండా ఇచ్చేశారు. కొందరు మాత్రం మొన్న వద్దన్నారుగా అంటూ అనుమానంగా చూస్తూ ఇచ్చారు. మరికొందరు మాత్రం ఎందుకివ్వాలంటూ ప్రశ్నించారు. పత్రాలన్నీ సరిగా ఉన్నాయి కదా..డబ్బు ఎందుకిస్తున్నావంటూ తునికి చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ వర్మను ఓ ఏసీబీ అధికారి ప్రశ్నించారు. ఏదో ఫార్మాలిటీగా ఇస్తున్నామంటూ ఆయన సమాధానమివ్వడం గమనార్హం. -
చేయి తడిపితే.... ఛలో.. ఛలో...!
ఖమ్మం, న్యూస్‌లైన్: అక్రమాలకు ‘చెక్’ పెట్టాల్సిన చెక్‌పోస్టులు అవినీతి నిలయాలుగా మారాయి. ఉద్యోగుల చెయ్యి తడిపితే చాలు..ఛలో అంటుండడంతో జిల్లా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ సంపద, కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం, పాలేరు, అశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు నామ మాత్రంగా ఉండటంతో విలువైన కలప, వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 43 వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టులు, అటవీశాఖ పరిధిలో 12 చెక్‌పోస్టులు ఉండగా పలుచోట్ల అధికారులు బినామీ ఉద్యోగులను పెట్టి నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలప్రభుత్వ ఆదాయానికి గండి చెక్‌పోస్టుల్లో పనిచేసే పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శించి వాహనాల తనిఖీల్లో ఉదాసీనంగా వ్యవహరించడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను రైతులే ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్లి అమ్ముకోవచ్చు. దీనిని ఆసరాగా తీసుకొని పలువురు వ్యాపారులు రైతుల పేరున స్లిప్స్ రాయించుకొని.. తామే రైతులమని చెబుతూ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు తరలిస్తున్నారు. రైతులు ఉత్పత్తి హక్కు రసీదును రెవెన్యూశాఖ అధికారుల నుంచి తీసుకోవాలి. అక్కడ అధికారులు కూడా మామూళ్లకు ఆశపడి ఖాళీ రసీదులు వ్యాపారుల చేతికి ఇవ్వడంతో వారు తమకు నచ్చిన రైతుల పేర్లు రాసుకుంటూ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సమృద్ధిగా సాగునీటి వనరులు, సారవంతమైన భూములు ఉండటంతో ఇతర జిల్లాలతో పోటీపడి రైతులు పంటలు పండిస్తున్నారు. 43 చెక్ పోస్టుల ద్వారా సగటున నెలకు రూ.40లక్షల మేరకు సెస్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. చెక్‌పోస్టు అధికారులు సక్రమంగా ఉంటే ఈ ఆదాయం కోటికి చేరే అవకాశం ఉందని మార్కెట్ కమిటీల అధికారులు పలువురు చెబుతున్నారు. దీంతోపాటు పేదలకు సరఫరా చేసే బియ్యం సైతం దారిమళ్లుతున్నా పట్టింపులేదనే విమర్శలున్నాయి. అలాగే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే మిల్లులు జిల్లాలో ఉన్నాయి. నల్గొండ, వరంగల్, కృష్ణా జిల్లాల నుంచి బియ్యం జిల్లాకు తరలి వస్తున్నా చెక్‌పోస్టుల వద్ద పట్టించుకున్న వారే కరువయ్యారు. గతంలో పలుచోట్ల విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో అక్రమమార్గంలో తరలుతున్న బియ్యం పట్టుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. దొడ్డిదారిన తరలుతున్న అటవీ సంపద చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలోని విలువైన అటవీ సంపద దొడ్డిదారిన తరలుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అశ్వారావుపేట మండలకేంద్రంలోని ఫారెస్టు చెక్‌పోస్టులో పలువురు ఉద్యోగులు బినామీలను నియమించడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. హైవేపై వెళ్లే ప్రతి కలప లారీ నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వే లేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఫారెస్టు చెక్‌పోస్టు లేనందున అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేసే నాధుడే లేడని విమర్శలు వస్తున్నాయి. సత్తుపల్లి, తల్లాడలోని కొత్తగూడెంరోడ్లో ఉన్న అటవీశాఖ చెక్‌పోస్టు మీదుగా కలప యథేచ్ఛగా రవాణా అవుతోంది. భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన అటవీశాఖ చెక్ పోస్టు మీదుగానే డివిజన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి వివిధ లోడ్లలతో వచ్చే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. కలప, బీడీ ఆకులు, బీపీఎల్ కర్మాగారానికి వెళ్లే జామాయిల్ లోడ్లతో వెళ్లే వాహన దారుల నుంచి ఇక్కడి సిబ్బంది ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కో రేటును నిర్ణయించి దర్జాగానే వసూళ్లకు పాల్పడుతున్నారని, పైగా పెద్ద సార్లు చెబితేనే డబ్బులు వసూలు చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి, మిర్చి వాహనాల్లో విలువైన కలపను ఉంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు అనునిత్యం రవాణా కొనసాగిస్తున్నారని, అయితే ఈ వాహనాలు, వాటి నెంబర్లు అటవీ ప్రాంతంలో ఉన్న పలు చెక్‌పోస్టు అధికారులకు ముందుగానే చెప్పి వారి మామూళ్లు వారికి పంపడంతో ఆయా వాహనాల తనిఖీ జరగదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెక్పోస్టులపై దృష్టి సారించాలని, అక్రమార్కుల ఆటలు కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. -
భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ దాడులు
జైనథ్, న్యూస్‌లైన్ : జైనథ్ మండలం భోరజ్ చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు కరీంనగర్ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో కమర్షియల్ ట్యాక్సెస్, రవాణ, ఎక్సైజ్, ఫారెస్ట్, సివిల్ సప్లై శాఖల్లో సుమారు ఆరుగంటలపాటు సోదాలు చేశారు. సోదాలు నిర్వహించిన అనంతరం డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. కాగ ఏసిబి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగానే ఇక్కడ కూడ దాడులనిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు ఆరు గంటలపాటు జరిపిన సోదాల్లో రూ.61 వేలు అధికంగా ఉండటంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సోదాల్లో తేల్చిన పూర్తి వివరాలతో కూడిన నివేదికల ప్రతులను సంబంధిత శాఖల ఉన్నతస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. ఆయన వెంట ఇన్చార్జి సీఐ రమణమూర్తి, సీఐ శ్రీనివాస్ రాజు ఉన్నారు. -
కలెక్షన్ కింగ్స్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని తడ మండలం భీములవారిపాళెం ఉ మ్మడి తనిఖీ కేంద్రంలో అవినీతి కలెక్షన్ కింగ్స్ మరిం త రెచ్చిపోతున్నారు. ఎన్నిసార్లు అవినీతి నిరోధకశాఖ దాడులు చేసినా.. వారిపై చర్యలు తీసుకోక పోవడం తో ఇక్కడ అవినీతి కార్యకలాపాలు యథాతధంగా కొనసాగుతున్నాయి. ఏసీబీ దాడుల్లో చిన్న చేపలు మాత్రమే వలలో పడుతున్నాయి. పది రోజుల క్రమం లో రెండు సార్లు ఏసీబీ దాడులు చేసింది. రెండోసారి దాడుల్లోనూ సూమారు రూ.60 వేల అక్రమ సం పాదన దొరికింది. ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత చెక్‌పోస్టు పై ఏసీబీ దాడులు నిర్వహించారు. వారం రోజుల గడువులో శనివారం అర్ధరాత్రి దాటాక మళీ అదే తరహాలో ఏసీబీ అధిక ారులు దాడులు చేశారు. ప్రణాళికా ప్రకారం వేషాలు మార్చి నా లుగైదు బృందాలుగా విడిపోయి ఏసీబీ దాడులు నిర్వహించినా పెద్ద తిమింగలాలు మాత్రం తప్పిం చుకున్నాయి. ఏసీబీ దాడుల్లో ప్రైవేట్ వ్యక్తులు, ఎక్సై జ్‌శాఖ కానిస్టేబుళ్లు మాత్రమే పట్టుబడ్డారు. అధికారులు, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులను నియమిం చుకుని చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లో అక్రమ సంపాదన దాస్తు న్నారని తెలుస్తోంది. ఇక్కడ వెలసిన దుకాణాలను చూస్తే ఇదో మాయాబజార్‌లా కనిపిస్తోంది. ఏ దుకాణంలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై- కోల్కత్తా ఏషియన్ హైవే- 45 నాలుగులేన్ల రోడ్డుగా విస్తరిం చడంతో రెండు వైపులా చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం, చెక్‌పోస్టు నుంచి కిలో మీటరు దూరం మేర దుకాణాలు ఏర్పాటు చేయడంతో అంతా అయో మయంగా తయారైంది. చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో దుకాణాలు ఉండటంతో ఎవరు చెక్‌పోస్టు సిబ్బందో.. ఎవరు ప్రైవేట్ వ్యక్తులో.. ఎవరు అధికారులో తెలుసు కోలేని పరిస్థితి దాపురించింది. ఇక్కడ పనిచేసే అధి కారులు, సిబ్బంది బయటకు వచ్చే పరిస్థితి లేకపో వడంతో రోడ్డుమీద ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం విప రీతంగా పెరిగి పోయింది. ఇక్కడ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని అక్రమ వసూళ్లకు, అక్రమంగా వచ్చిన సంపాదన దాచి పెట్టేందుకు ఉపయోగించు కుంటున్నారు. ఇలా అక్రమ సంపా దనను దాచిపెట్టి అప్పగించేందుకు దుకాణదారులకు, ప్రైవేట్ వ్యక్తులకు పర్సంటేజీలు ఇవ్వడంతో రోజుకోక కొత్త దుకాణం వెలుస్తోంది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు చెక్‌పోస్టు అధికారులకు రహస్య ఏజెంట్లుగా పని చేస్తుండగా, మరికొందరు స్థానిక బలంతో వాహ నాలను సరిహద్దులు దాటించి రెండు చేతులా సంపా దించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ దాదాగిరి ఏ స్థాయిలో ఉందంటే.. చెక్‌పోస్టు అధికారులను సైతం శాసిస్తున్నారు. చెక్‌పోస్టు ఆదాయానికి మించి ప్రైవేట్ వ్యక్తులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ నెల 20 తేదీ వేకువ జామున జరిపిన ఏసీబీ దాడుల్లో ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను, ఇద్దరు ఎక్సైజ్ కాని స్టేబుళ్లును పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 1.07 లక్ష అక్రమ సంపాదనను స్వాధీనం చే సుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన మరోసారి దాడిలో సుమారు రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగి న ఏసీబీ దాడుల్లో కూడా రూ.1.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలల కాలంలో రెండు సార్లు దాడులు చేయగా లక్ష రూపాయలకు పైగానే పటు ్టబడింది. గడిచిన ఐదేళ్లుగా జరిగిన ఏసీబీ దాడులను పరిశీలిస్తే 2009లో రూ. 50 వేలు, 2010లో రూ.26 వేలు, 2011లో రూ. 33 వేలు, 2012 జూలైలో రూ. 55 వేలు, ఆగస్టులో రూ. 56 వేలు, 2013 అక్టోబర్ లో రూ.1.16 లక్షలు అక్రమ వసూళ్లను పట్టుకున్నారు. అయినా ఎవరిమీద చర్యలు తీసుకున్న దాఖాల్లేవు. చెక్‌పోస్టు నుంచి వస్తున్న అక్రమ వసూళ్లు జిల్లా అధికారుల నుంచి రాష్ర్ట స్థాయిలో అధికారులకు, రాజకీయ నాయకులకు నెల మామూళ్లు చేరు తుం డటంతో ఎవరి మీద చర్యలు లేకుండా పోయాయనేది బహిరంగ రహస్యమే. అక్రమ సంపాదన కోసమే ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులో అక్రమ సంపాదన కోసమే ఎక్సైజ్ శాఖను ఏర్పాటు చేశారు. వీరికి ఎలాంటి విధులు లేవు. చెక్‌పోస్టు దూరంగా చిన్నపాటి పాక వేసుకుని ప్రత్యేకంగా వసూళ్లు చేస్తున్నారు. వాస్తవంగా అయితే తమిళనాడు నుంచి మద్యం అక్రమ రవాణా చేసినా, రెక్టిఫైడ్ స్పిరిట్ అక్రమ రవాణాను నిరోధించడం కోసం ఈ శాఖను ఏర్పాటు చేశారు. కాని ఇక్కడ విధులు నిర్వహించే వారికి పనే లేకపోవడంతో చెక్‌పోస్టుకు ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద కూర్చు ని పన్నులు చెల్లించని వాహనాలపై దృష్టి సారించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్ని సార్లు ఏసీబీ దాడులు జరిగినా.. వీరిపై దృష్టి సారించే వారు కాదు. వీరిపై కూడా కన్ను వేసి ఇటీవల దాడులు చేయడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వద్ద రూ.3,700 అక్రమ సంపాదన లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. -
చెక్‌పోస్టుపై మళ్లీ పంజా
బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్ : ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు చెక్పోస్టులపై వెంట వెంటనే దాడులు చేసి అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ, ఈ నెల 20వ తేదీన ఏసీబీ డీఎస్పీ జే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు తాజాగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు వ్యక్తితో సహా పలు విభాగాల్లో రూ.59,610 పట్టుబడింది. ఇన్కమింగ్ చెక్‌పోస్టులో రూ.31,390, వివిధ శాఖలు ఉన్న అవుట్ గోయింగ్‌లో రూ.6,910, రవాణా శాఖ వద్ద రూ.21, 310 లభ్యమయింది. వారం క్రితం జరిపిన దాడిలో రూ.1,10,990 పట్టుబడగా ఈ సారి మాత్రం అందులో సగం లభించింది. ఇప్పటికే ఏసీబీ దాడులు, చార్జ్ మెమోలతో భయాందోళనలతో ఉన్న సిబ్బంది కొంత జాగ్రత్తగానే వ్యవహరించడంతో ఏసీబీ అధికారులకు పెద్దగా పట్టుబడలేదు. డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో దాడులు ఈ నెల 20వ తేదీ జరిగిన దాడుల తరహాలోనే ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో చెక్‌పోస్టుపై దాడులు చేశారు. ఈ దఫా ఇరిగేషన్‌శాఖ అధికారులను మధ్యవర్తులుగా పెట్టుకుని దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు నేతృత్వంలో ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు ఈ దాడిలో పాలుపంచుకున్నారు. శనివారం రాత్రి 12.30 ప్రాం తంలో లుంగీలు, బనియన్లు ధరించి తలపాగాలు చుట్టకుని లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో కొందరు, చెక్‌పోస్టు సిబ్బందిగా మరికొంత మంది చెక్‌పోస్టులో అడుగుపెట్టారు. వీరు చెక్‌పోస్టులో వచ్చిపోయే మార్గంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, ఇతర శాఖల సముదాయ కార్యాలయం వద్ద, రవాణాశాఖ, ఎక్సైజ్ శాఖల వద్దకు చేరి పరిస్థితులు గమనించారు. కొంత పరిశీలన అనంతరం అధికారులందరూ మూకుమ్మడిగా రంగంలోకి దిగారు. దాడిని గుర్తించిన చెక్‌పోస్టు సిబ్బంది తమ వద్ద ఉన్న అక్రమ సంపాదనను విసిరి పారేశారు. ఇలా పారేసిన నగదు రవాణా శాఖ వద్ద రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2,300, రూ.1,900 లభిం చగా, వాణిజ్యపన్నుల శాఖ ఇన్కమింగ్ కార్యాలయం వద్ద రూ.13 వేల వరకు లభించింది. నెల్లూరుకు చెందిన నాగిశెట్టి పెంచలయ్య అనే ఓ ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ వద్ద స్టాంపు డ్యూటీ నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌తో పాటు మరో కానిస్టేబుల్‌ను, ఇన్కమింగ్ సిటీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏసీటీఓ వద్ద సొంత సొమ్ముగా చూపిన రూ.500 కన్నా అధికంగా రూ.610 లభించింది. ఔట్‌గోయింగ్‌లో అటెండర్‌గా ఉన్న వ్యక్తి వద్ద రూ.70 దొరకడంతో వారిపై కేసులు నమోదు చేశారు. గత దాడుల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలో మాత్రం ఈ దఫా సిబ్బంది అందరూ విధులకు హాజరైనట్టు డీఎస్పీ తెలిపారు. 2012లో జరిపిన దాడులకు సంబంధించి విచారణలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. చెక్‌పోస్టుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేస్తున్నామని, చెక్‌పోస్టు నుంచి లారీల వారి వద్ద నుంచి ఫోనుల్లో ఫిర్యాదులే తప్ప ప్రత్యక్షంగా ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో తాము సుమోటోగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో సీఐలు కే వెంకటేశ్వరావు, కృపానందం, టీవీ శ్రీనివాస్(ఒంగోలు), ఇన్స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
చెక్‌పోస్టుపై మళ్లీ ఏసీబీ పంజా
బీవీపాళెం (తడ), న్యూస్‌లైన్ : ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు నేతృత్వంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత భీములవారిపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు చేశారు. నాలుగు బృందాలు గా విడిపోయి నిర్వహించిన దాడుల్లో చెక్‌పోస్టు పరిసరాల్లో సంచరిస్తున్న ఆరుగురు ప్రైవేటు వ్యక్తులతో పాటు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తించే ము గ్గురు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 1,10,990 స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ భాస్కర్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా బీవీపాళెం లో నాలుగు బృందాలుగా దాడులు చేశామన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ముగ్గురు రోడ్డుపై లారీలు ఆపి డబ్బులు వసూ లు చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ విభాగంపై తొలిసారిగా చేపట్టిన దాడుల్లో కానిస్టేబుళ్లు బల్లి శ్రీనివాసరావు నుంచి రూ. 1,750, షేక్ రిజ్వాన్ ఆహమ్మద్ నుంచి రూ.1,860, కే సుబ్బ య్య నుంచి రూ. 1,880 లభించినట్లు తెలిపారు. ఇక్కడ విధుల్లో ఉండాల్సిన ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులకు హాజరైనట్టు రికార్డుల్లో ఉన్నా అక్కడ లేకపోవడంపై కేసు నమోదు చేస్తున్నట్టు వివరించారు. రవాణా శాఖ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తు ల వద్ద రూ.14,440, ఏసీబీ అధికారు లు స్వాధీనం చేసుకున్న తరువాత వచ్చిన కలెక్షన్ రూ.20 వేలు, వాణిజ్య పన్నుల శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఇన్కమింగ్ కార్యాలయం వద్ద బయట పడవేసిన సొమ్ముతో పా టు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులనుంచి రూ. 55, 675, ఔట్ గోయింగ్ కార్యాల యంలో మరో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.12,385తో పాటు కార్యాలయంలో వసూలు చేసిన సొమ్ముకు సంబంధించి లెక్కలో తేలిని మరో రూ.3 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ దాడుల్లో నెల్లూరు సీఐలు కే వెంకటేశ్వర్లు, ఎం కృపానందం, ఒం గోలు సీఐ, ఎస్ఐలు టీవీ శ్రీనివాసరా వు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, మధ్యవర్తులుగా ఇరిగేషన్, పీఆర్‌కు చెందిన మరో నలుగురు ఉద్యోగులు, ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. డ్రైవర్ల వేషాల్లో సోదాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చెక్‌పోస్టుపై దాడి చేసిన ఏసీబీ అధికారులు లుంగీలు కట్టుకుని బనియన్లతో లారీడ్రైవర్ల అవతారంలో చెక్‌పోస్టులో పరిస్థితులను గమనించారు. ఇదే వేషధారణలో ఎక్సైజ్ పోలీసులను పట్టుకున్నారు. కార్యాలయాల పరిసరాల్లో సం చరిస్తూ పరిస్థితిని పరిశీలించడంతో ఎ క్కువ మంది నిందితులు పట్టుబడ్డారు. ప్రైవేటు వ్యక్తిగా భావించి వ్యాపారి అరెస్ట్, ఉద్రిక్తత చెక్‌పోస్టు సమీపంలో ఫ్రైడ్‌రైస్ వ్యాపా రం చేసుకునే సమీపం గ్రామానికి చెం దిన ఓ వ్యాపారిని ప్రైవేటు వ్యక్తిగా భా వించి ఏసీబీ పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న నగదును స్వా ధీనం చేసుకున్నారు. తనకు అక్రమ వసూళ్లకు సంబంధం లేదని, తనకు అనారోగ్యంగా ఉందని ప్రాధేయపడ్డా డు. శనివా రం ఉదయం ఈ విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు చెక్‌పోస్టు కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని విడిచి పెట్టినట్టు తెలి పినా తనకు సంబంధించిన సొమ్మును ఇవ్వాల్సిందిగా పట్టుబట్టడంతో ఏసీబీ అధికారులు చేయి చేసుకున్నారు. విష యం తెలుసుకున్న గ్రామస్తులు ప్రశ్నిచడంతో వారిపై కూడా ఏసీబీ అధికారులు తరిమేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరి స్థితి నెలకొంది. ఇంతలో తడ ఎస్ఐ నాగేశ్వరరావు తన సిబ్బందితో చెక్‌పోస్టుకు చేరుకుని సర్దుబాటు చేసి పంపించేశారు. -
తేటగుంటలో..కాసులపంట
తుని రూరల్ / తుని, న్యూస్‌లైన్ :పదహారో నంబరు జాతీయ రహదారిపై తుని మండలం తేటగుంట వద్దనున్న రవాణా శాఖ చెక్‌పోస్టు అవినీతిపరులకు ఏడాది పొడవునా ఫలాలనిచ్చే కల్పవృక్షం లాంటిది. రాష్ట్రం లో ఒకచోటి నుంచి ఒకచోటికి వెళ్లే వాహనాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు నిత్యం వేలాదిగా ఈ రహదారిలో ప్రయాణిస్తుంటాయి. వాటిని తనిఖీ చేసి వాహనాలు కండిషన్లో లేకపోయినా, నిబంధనలకు అనుగుణంగా రికార్డులు లేకపోయినా, మితిమీరిన లోడు వేసినా జరిమానా విధించాల్సిన చెక్‌పోస్టు సిబ్బంది తమ చేతులు తడిపితే చాలు.. ఏ వాహనానికైనా ‘రైట్’ చెప్పేస్తారు. వాహనం కెపాసిటీకి మించి లోడు వేస్తే అదనపు టన్నుకు రూ.వేలల్లో అపరాధ రుసుము విధించాలి. వాహనాల రికార్డులు సక్రమంగా లేకపోయినా కేసులు నమోదు చేయాలి. ఇక ప్రైవేటు బస్సుల సంఖ్య వందల్లో ఉన్నా చూసీచూడనట్టు వదిలివేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓల్వో బస్సు ప్రమాదం తర్వాత తనిఖీ చేసి కేసులు నమోదు చేసి, హడావిడి చేసినా.. ఇప్పుడు ఆ బస్సులు నిబంధనల ప్రకారం లేకపోయినా యథాతథంగా నడుస్తున్నాయి. వాటి యజమానులు రవాణా శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడమే ఇందుకు కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇక చెక్‌పోస్టులో పగలు, రాత్రీ తేడా లేకుండా ప్రైవేటు వ్యక్తులనే వాహనదారుల నుంచి మామూళ్లు దండుకోవడానికి నియోగిస్తున్నారు. ఏసీబీ దాడులు చేసినా తప్పించుకోవడానికే ఈ ఎత్తుగడ. ఈ రకంగా వేలాది వాహనాల నుంచి దండుకునే సొమ్మును ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు పంచుకుంటుంటారు. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం మొక్కుబడిగా మాత్రమే కేసులు రాస్తుంటారు. ఈ చెక్‌పోస్టులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)పోస్టుకు రూ.25 లక్షలు ముడుపుగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారంటేనే.. ఇక్కడి దొడ్డిదారి రాబడి ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఈ బండారం బయటపడుతున్నా రవాణాశాఖ సిబ్బంది తీరు మారడం లేదు. శనివారం జరిగిన తాజా దాడే అందుకు నిదర్శనం. ఏసీబీ అదుపులో ఇద్దరు ఎంవీఐలు, నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్లు శనివారం తెల్లవారుజామున ఈ చెక్‌పోస్టుపై దాడి చేశారు. ఉదయం తొమ్మిది గంటల వరకు చెక్‌పోస్టు సిబ్బందిని, అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించారు. ఎంవీఐలు సిద్ధిక్, శేఖర్ల నుంచి రూ.73 వేలు, ప్రైవేట్ వ్యక్తులైన సుర్ల నారాయణస్వామి(వి.కొత్తూరు), తేటగుంటకు చెందిన ఆకుల బాబ్జి, గజ్జి వరహాలు, కె.పాదాలుల నుంచి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆరుగురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఇక్కడ అక్రమ వసూళ్లు భారీగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాడి చేసినట్టు తెలిపారు. దాడుల్లో ఏలూరుకి చెందిన ఇన్స్పెక్టర్లు కొమరయ్య, విల్సన్, రాజమండ్రికి చెందిన రాజశేఖర్, సంజీవరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు ఇదే చెక్‌పోస్టుపై 2011 నవంబరులో దాడి చేసి రూ.1.20 లక్షలు, 2012 అక్టోబరులో దాడి చేసి రూ.నాలుగు లక్షలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. కొందరు ఏసీబీ కేసుల్లో చిక్కుకుని జైలుకి వెళ్లినా ఇక్కడ అక్రమ వసూళ్లకు ‘చెక్’ పడడం లేదు. వీరికి కొందరు ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో నిర్భయంగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఏటా సుమారు రూ.తొమ్మిది కోట్ల అపరాధ రుసుమును వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చెక్‌పోస్టులో 12 మంది ఎంవీఐలను నియమించింది. అయితే ఆ మొత్తం కన్నా.. సిబ్బంది దండుకునే మామూళ్లు అనేకరెట్లు ఉంటాయంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సుమారు రెండు నెలలు చెక్‌పోస్టు మూతపడింది. తిరిగి తెరుచుకున్న అనంతరం ఆవురావురుమంటున్న చెక్‌పోస్టు సిబ్బంది ‘స్వామికార్యం’గా అటు సర్కారు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికీ, ‘స్వకార్యం’గా ఇటు ‘రెండునెలలు కోల్పోయిన స్వార్జితం’ భర్తీకి మామూళ్ల దందాను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ దాడి జరగడం గమనార్హం. -
అన్నదాతకు అండగా మార్కెటింగ్ శాఖ
సంగం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్నదాతకు అండగా మార్కెటింగ్ శాఖ పనిచేస్తోందని ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఇఫ్తిహర్ నజీబ్ తెలిపారు. సంగంలోని మార్కెటింగ్ శాఖ చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పంటకు మద్దతు ధరలేకపోతే తమ శాఖ గోదాములో దాచుకుని, మంచి ధర వచ్చిన తరువాత అమ్మి లాభాలు పొందాలని రైతులకు సూచించారు. ఇలా దాచుకున్న పంటకు రైతుబంధు పథకం కింద 90 రోజుల వరకు వడ్డీ లేకుండా రుణం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది రైతులకు రూ.2 కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. ఆత్మకూరు, కావలి, కోవూరు, నాయుడుపేట, వాకాడు, సూళ్లూరుపేటలో ఉన్న మార్కెటింగ్ గోదాములను రైతులు వినియోగించుకోవాలని కోరారు. మార్కెటింగ్ శాఖ పన్నులు వసూలు కోసం రీజియన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 146 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరులో 24 చెక్‌పోస్టులు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రీజియన్ వ్యాప్తంగా రూ.100 కోట్ల పన్ను వసూలుచేయాలని ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో రూ.17 కోట్ల వసూలవుతుందని భావించగా, ఇప్పటివరకు రూ.8 కోట్లు వసూలయిందని వివరించారు. గుంటూరులో 80వేల మెట్రిక్ టన్నులు, నెల్లూరులో 15వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఏప్రిల్ 1 నుంచి సంగం చెక్‌పోస్టులో ఆత్మకూరుకు సంబంధించి రూ.13.70 లక్షలు, కోవూరు మార్కెటింగ్‌కు సంబంధించి రూ.14.84 లక్షలు వసూలయ్యాయని వెల్లడించారు. మార్కెట్ పన్నులు కట్టకుండా వెళ్లిన వ్యాపారులు ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకుడు గౌస్‌బాషా, కావలి మార్కెటింగ్ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు. -
చెక్‌పోస్టుల్లో ఈ పోస్టు మరీ ఖరీదు!
ఎంవీఐగా బదిలీకి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణ రవాణా మంత్రి, ఉన్నతాధికారుల పేరిట వసూళ్లు ఆరోపణలున్నా సీఎం ఆమోదముద్ర సాక్షి, హైదరాబాద్: రవాణా చెక్‌పోస్టుల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), అసిస్టెంట్ ఎంవీఐ పోస్టింగ్‌ల కోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోలేదు. 8 మంది ఎంవీఐ, 20 మంది ఏఎంవీఐలను చెక్‌పోస్టుల్లో నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బదిలీకి రూ. 20 లక్షలు ఉద్యోగుల నుంచి వసూలు చేశారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయన్న సంగతి విదితమే. పదోన్నతులతో,.. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులు దాదాపు 28ఖాళీలు ఏర్పడ్డాయి. ఆదాయం ఆర్జనకూ అవకాశం ఉన్నందున ఈ పోస్టులకు భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా రవాణా శాఖలోని కొంత మంది దళారుల అవతారం ఎత్తారు. రాష్ట్ర రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, కొంతమంది ఉన్నతాధికారుల పేరిట పోస్టింగ్‌లు కోరేవారినుంచి భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రమోషన్లు జరిగిన వెంటనే అధికారులు రూపొందించిన బదిలీల జాబితాను రద్దు చేసి, సొమ్ము ఇచ్చిన ఆశావహులతో బదిలీల జాబితా రూపొందించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కూడా, ఇదే జాబితాకు ఆమోదం తెలిపినట్లు రవాణా శాఖ కమిషనరేట్‌లో చెప్పుకొంటున్నారు. -
కూంబింగ్ ఆపండి
= మావోయిస్టుల హెచ్చరిక = అటవీ శాఖ చెక్‌పోస్టుపై దాడి = సిబ్బంది సురక్షితం = కార్యాలయం ధ్వంసం = గాలిలోకి కాల్పులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మలెనాడులో మావోయిస్టులు మళ్లీ ఉనికి చాటుకున్నారు. చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా తనికోడు గ్రామంలోని అటవీ శాఖ చెక్‌పోస్టుపై సోమవారం వేకువ జామున దాడి చేశారు. చెక్‌పోస్టులో ఇద్దరు సిబ్బంది ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి హాని తలపెట్ట లేదు. అక్కడున్న సీసీ కెమెరాలు, వైర్‌లైస్ సెట్లు, టెలిఫోన్ ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. రసీదు పుస్తకాలను చేతబట్టుకుని వెళుతూ వెళుతూ గాలిలో కాల్పులు జరిపారు. నలుగురితో కూడిన బృందం అకస్మాత్తుగా ప్రవేశించిందని అక్కడి ఉద్యోగి నాగరాజ్ తెలిపారు. బయట మరో ఇద్దరు నిలుచుని ఉన్నారని చెప్పారు. తక్షణమే కూంబింగ్‌ను నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు. కుద్రేముఖ్ జాతీయ ఉద్యాన వనంలో నివాసం ఉంటున్న గిరిజనులను ఖాళీ చేయించరాదని కూడా పేర్కొంటూ అక్కడ పోస్టర్లను అంటించడంతో పాటు కరపత్రాలను వెదజల్లి నిష్ర్కమించారు. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడారు. మళ్లీ మావోయిస్టుల సంచారం ప్రారంభం కావడంతో ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ అభిషేక్ గోయెల్ హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. శృంగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని చెక్‌పోస్టులతో పాటు పొరుగున ఉన్న శివమొగ్గ, ఉడిపి జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీని ప్రారంభించారు. కూంబింగ్‌ను తీవ్రతరం చేశారు. పది రోజుల కిందట మావోయిస్టులు దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా నారావి గ్రామ పంచాయతీ సభ్యుడు రామచంద్ర భట్ ఇంటికి నిప్పు పెట్టారు. అప్పట్లో ఎనిమిది నుంచి పది మంది మావోయిస్టులు దాడి జరిపారు. పోలీసులకు సమాచారం ఇస్తానని అతను చెప్పడంతో ఆగ్రహించి ఇంటి ముందు నిలిపి ఉన్న వ్యాను, బైక్‌లకు నిప్పు పెట్టి పారిపోయారు. కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు మళ్లీ పంజా విప్పారు. దీంతో కోస్తా, మలెనాడు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎక్కడివక్కడే
గుత్తి సమీపంలోని కరిడికొండ మొదలు కొడికొండ చెక్‌పోస్టు వరకు దాదాపు 150 కిలోమీటర్లు.. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాల నిలిపివేత.. జై సమైక్యాంధ్ర.. జై జగన్ నినాదాలు.. వాహనదారులు ఇబ్బందులు పడకుండా భోజన ఏర్పాట్లు.. మొత్తానికి అపూర్వ రీతిలో 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. సాక్షి, అనంతపురం : సమైక్య రాష్ర్ట పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు చేపట్టిన 48 గంటల రహదారుల దిగ్బంధాన్ని రెండో రోజు గురువారం హోరెత్తించాయి. జిల్లాలోని జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపై టెంట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బైఠాయించారు. దర్నాలు.. వంటా-వార్పులు, సహపంక్తి భోజనాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా పలు విధాలా నిరసన కార్యక్రమాలతో వాహనాల రాకపోకలకు అడ్డుకట్ట వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు చండ్రనిప్పులు కక్కుతున్నా.. పార్టీ శ్రేణులు ఏమాత్రం లెక్క చేయలేదు. దిగ్బంధం కారణంగా ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా నడిచాయి. రోడ్లపై నిలిచిపోయిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు తదితరులకు పార్టీ నాయకులు టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం సరఫరా చేశారు. దీంతో లారీలు, ట్రాక్టర్ల యజమానులు కూడా ఈ దిగ్బంధానికి మద్దతు తెలిపారు. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బలవంతంగా గుంతకల్లు, కళ్యాణదుర్గం, హిందూపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో 63 మంది నాయకులను అరెస్టు చేశారు. రహదారుల దిగ్బంధం విజయవంత ం కావడంతో ప్రజల్లో సమైక్య రాష్ట్రంపై ఆశలు చిగురించాయి. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకే తపోవనం వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక దశలో వాహనాల యజమానులు సైతం ఉద్యమంలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు రహదారులను దిగ్బంధించారు. ధర్మవరం-కుర్లపల్లి రహదారిపై వంటా-వార్పు నిర్వహించి.. సహపంక్తి భోజనం చేశారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త ఇనయతుల్లా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టి.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇదిలా ఉండగా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా హిందూపురంలో సమన్వయకర్తలు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, చౌళూరు రామక్రిష్ణారెడ్డి, ఇనయతుల్లాను తెల్లవారుజామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నేత నవీన్ నిశ్చల్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు వెళ్లిపోయిన అనంతరం వారిని విడుదల చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రధాన రహదారులను దిగ్బంధించారు. అనంతపురం బైపాస్‌లో నియోజకవర్గ సమన్వయకర్త ఎల్ఎం మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటా-వార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మరో సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో కంబదూరు, శెట్టూరు రహదారులను దిగ్బంధించి, వంటా-వార్పు చేపట్టారు. ఈ సందర్బంగా ఎల్ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామి, బోయ తిరుపాలుతో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేపట్టారు. గుత్తి సమీపంలోని కరిడికొండ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన 20 మంది నాయకులు, కార్యకర్తలను ఇన్చార్జ సీఐ మహబూబ్‌బాషా బలవంతంగా అరెస్టు చేసి.. గుత్తి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వజ్రకరూరు రహదారిపై వంటా-వార్పు చేపట్టారు. విడపనకల్లులో పార్టీ కిసాన్ సెల్ కర్నూలు, అనంతపురం జిల్లాల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రహదారిపైనే వంటా-వార్పు నిర్వహించారు. కూడేరులో విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేశారు. కదిరిలో సమన్వయకర్తలు ఎస్ఎండీ ఇస్మాయిల్, మహమ్మద్ షాకీర్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం దిగ్విజయంగా జరిగింది. అంబేద్కర్ కూడలిలో రోడ్డుపైనే వంటా వార్పు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. పెనుకొండలో సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ ఆధ్వర్యంలో పాత జాతీయ రహదారిని దిగ్బంధించారు. మానవహారంగా ఏర్పడి మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్బంధం రెండవ రోజూ విజయవంతమైంది. డీ హీరేహాళ్‌లో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు మరో 24 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి..స్టేషన్‌కు త రలించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రె డ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జాతీయరహదారిపై వంటా-వార్పు నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గంలో సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. శింగనమల మరువకొమ్మ వద్ద పార్టీ నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి, నార్పల రహదారిపై నాయకులు చేపట్టిన దిగ్బంధాన్ని పోలీసులు అడ్డుకున్నారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
కడప అర్బన్/సిద్దవటం, న్యూస్‌లైన్ : పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున భాకరాపేట చెక్‌పోస్టు వద్ద లారీలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా సిబ్బందితో వెంటపడి పట్టుకున్నారు. రేణిగుంటకు చెందిన ఏపీ03 ఎక్స్ 4763 నెంబరుగల వాహనంలో వందకు పైగా ఎర్రచందనం దుంగలను కడప వైపు తీసుకొచ్చారు. ఎర్రచందనం దుంగలపై టార్ఫలిన్ పట్టలను కప్పుకుని కడప వైపు బయలుదేరారు. పూజలు నిర్వహించిన వాహ నం కావడంతో ఎవరికీ అనుమానం కలగదని స్మగ్లర్లు భావించారు. సదరు వాహనంలో కడప వైపు తీసుకు వస్తుండగా భాకరాపేట చెక్‌పోస్టు వచ్చేసరికి అప్పటికే కడప డీఎఫ్ఓ శివానీడోగ్రా, సబ్ డీఎఫ్ఓ గురు ప్రభాకర్లకు అందిన పక్కా సమాచారం మేరకు నిఘా ఉంచారు. వాహనాన్ని తనిఖీ చేసేందుకు అటవీ సిబ్బంది ఆపుతుండగా వేగంగా దూసుకెళ్లింది. దీంతో అటవీశాఖ అధికారులు తమ వాహనాలతో వెంబడించి కిలోమీటరు దూరంలోనే లారీని పట్టుకున్నారు. వాహనాన్ని నడుపుతున్న రేణిగుంటకు చెందిన బాబ్జి అనే డ్రైవర్ పట్టుబడ్డాడు. మరో వ్యక్తి పరారయ్యా డు. ఈ సంఘటనలో రేంజ్ ఆఫీసర్ బాల నర్సయ్య, ఎఫ్ఎస్ఓ క ృష్ణమూర్తినాయక్, ఏబీఓ రామచంద్రారెడ్డి, ఎఫ్బీఓ వెంకట రమణ, సిబ్బందితో పాల్గొని వాహనాన్ని పట్టుకున్నారు. ఈ సందర్బంగా కడప డీఎఫ్ఓ శివానిడోగ్రా విలేకరులతో మాట్లాడుతూ పక్కా సమాచారంతో వాహనంతోసహా ఎర్రచందనాన్ని పట్టుకున్నామన్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు. ఎర్రచందనం విలువ దాదాపు రూ.5నుంచిరూ.7లక్షలు ఉంటుందని అంచనా వేయగలిగామన్నారు. వీటి బరువు సుమారు 3 టన్నులు ఉంటుందన్నారు. లారీ విలువ రూ.3 లక్షలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఆమె కోరారు. -
నిషేధించినా... ఆగని అక్రమం
కొత్తగూడెం, న్యూస్‌లైన్ : నాటుసారాను అరికట్టాలంటే దాని తయారీకి అవసరమైన నల్లబెల్లాన్ని నిషేధించాలని యోచించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పల్లెల్లో ఇప్పటి వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించిన నాటుసారా వ్యాపారానికి ప్రభుత్వ నిర్ణయంతో నల్లబెల్లం కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారులు అక్రమ రవాణాకు తెరలేపారు. నిషేధం మాటున అధిక ధరకు విక్రయిస్తున్నారు. బెల్లం రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచడంతో కొత్త దారులను వెదుకుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ట్రాన్స్పోర్ట్ లారీలలో తరలిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన దాడులలో ఈ విషయం వెలుగుచూసింది. ట్రాన్స్పోర్ట్ లారీల్లో రవాణ..రైస్‌మిల్లుల్లో నిల్వ.. బెల్లం అక్రమ రవాణాకు మామూలు లారీలను ఉపయోగిస్తే మధ్యలో చెక్‌పోస్టుల బెడదతో పాటు పోలీస్ నిఘా ఎక్కువవుతుండడంతో వ్యాపారులు ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఎంచుకుంటున్నారు. గురువారం రాత్రి కొత్తగూడెం త్రీ టౌన్ పరిధిలో ఓ ట్రాన్స్‌పోర్టు వాహనంలో 300 క్వింటాళ్ల నల్లబెల్లం తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అక్రమ బెల్లాన్ని నిల్వ చేసేందుకు కూడా రైస్ మిల్లులను ఎంపిక చేసుకుంటున్నారు. పాల్వంచలోని ఓ రైస్‌మిల్లులో బియ్యం బ స్తాల మధ్యన 20 క్వింటాళ్ల బెల్లాన్ని ఈనెల 5న పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఇలా రకరకాల ఎత్తుగడలతో అక్రమార్కులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమాలకు ఆజ్యం పోస్తున్న ఎక్సైజ్ అధికారులు... నల్లబెల్లం తరలింపును అడ్డుకోవడంతోపాటు నాటుసారా తయారీని అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే ఈ బెల్లం విక్రయానికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాల్వంచ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్తోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్రమ నల్లబెల్లం వ్యాపారంలో బాధ్యులుగా తేలడంతో వారిపై కేసులు నమోదుయ్యాయి. అక్రమ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారుల అండదండలు ఏ మేరకు ఉన్నాయో దీన్నిబట్టి తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నల్లబెల్లం అక్రమ రవాణాను అడ్డుకోవాలని, సారా తయారీని అరికట్టాలని పలువురు కోరుతున్నారు