భిక్కనూరు, న్యూస్‌లైన్ : నిజామాబాద్ జిల్లా సరి హ ద్దు గ్రామమైన బస్వాపూరు సమీపంలో ఏర్పాటు చేసి న చెక్‌పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురి నుంచి రూ. 14 లక్షల 60 వేలను స్వాధీ నం చేసుకున్నారు. హెదరాబాద్‌కు చెందిన బాలకారి నర్సింహారావు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు వెళ్తుండగా ఆయన వాహనాన్ని తనిఖీ చేసి రూ. 3 లక్షల 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్ జిల్లా సిద్దిపేట కు చెందిన కూర వెంకటేశం తన కుటుంబంతో కలిసి వాహనంలో నిజామాబాద్ వెళ్తుండగా తనిఖీ చేసి పోలీ సులు రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన చంద్ర రంగరావు బాల్కొండ కు వాహనంలో వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేసి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మెల్యే ఫోన్..
ఇదిలా ఉండగా డబ్బులు తీసుకెళ్తూ పట్టుబడిన వారి లో జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన వారు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే డబ్బులను సీజు చేయవద్దని పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే తనిఖీలు చేస్తున్నామని, డబ్బులను నిబంధనల ప్రకారమే సీజు చేశామని, తామేమీ చేయలేమని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిసింది.
రూ. 2 లక్షల 50 వేలు స్వాధీనం
జాన్కంపేట(ఎడపల్లి): మండలంలోని జాన్కంపేట చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన తనిఖీలో పోలీసు లు రూ. 2. 50 వేలు పట్టుకున్నారు. మద్నూర్ నుంచి ఆర్ముర్‌కు వెళ్తున్న కారును తనిఖీ చేయగా డబ్బు కనిపించిందని, డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
రూ.17 లక్షలు సీజ్..
Published Sat, Mar 8 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement