Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో ఎన్నికల వేళ తనిఖీలు.. | Karnataka Assembly Elections 2023: Rs 4. 75 Crore Cash Seized at checkpost | Sakshi
Sakshi News home page

Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో ఎన్నికల వేళ తనిఖీలు..

Published Sun, Apr 9 2023 3:49 AM | Last Updated on Thu, Apr 20 2023 5:24 PM

Karnataka Assembly Elections 2023: Rs 4. 75 Crore Cash Seized at checkpost - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు

బొమ్మనహళ్లి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో విస్తృతంగా సాగుతున్న తనిఖీల్లో ఒకేసారి భారీఎత్తున నగదు పట్టుబడింది. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ నియోజకవర్గం వీరసంద్ర చెక్‌పోస్ట్‌ వద్ద శనివారం సాయంత్రం ఎన్నికల స్క్వాడ్‌ తనిఖీలలో రూ.4 కోట్ల 75 లక్షల నగదు లభించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన మూడు వాహనాలను తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నగదును తరలిస్తున్నవారి వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఐటీ అధికారులకు సమాచారమిచ్చామన్నారు.  దావణగెరె తాలూకా హెబ్బాల చెక్‌పోస్టు వద్ద ఎన్నికల సిబ్బంది తనిఖీల్లో బీఎండబ్ల్యూ కారులో తరలిస్తున్న రూ.39 లక్షల విలువైన 66 కేజీల వెండి పాత్రలు లభించాయి. చెన్నై నుంచి ముంబైకి వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కారు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి భర్త, బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌కి చెందినదిగా భావిస్తున్నారు. కారును, వస్తువులను సీజ్‌ చేసి విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement