
బెంగళూరు: ప్రధాని మోదీని విషసర్పమంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై గొడవ కొనసాగుతుండగానే ఆయన కొడుకు ప్రియాంక్ ఖర్గే మరో వివాదానికి తెర తీశారు. కలబురగి జిల్లా చిట్టాపూర్ స్థానం నుంచి మళ్లీ ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్న ఖర్గే తనయుడు ప్రియాంక్ సోమవారం మోదీని అసమర్థుడైన కొడుకుగా అభివర్ణించారు. బంజారా కులంలో పుట్టానంటున్న మోదీ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు.
‘‘మీరేం భయపడకండి, మీ కొడుకు ఢిల్లీలో ఉన్నాడని కలబురగి బంజారా ప్రజలకు హామీ ఇచ్చారు. అసమర్థుడైన కొడుకు ఢిల్లీలో ఉంటే ఆ కుటుంబం ఎలా ముందుకెళుతుంది?’’ అని ప్రశ్నించారు. కోలి, కబ్బలిగ, కురుబ వర్గానికి చెందినవాడినని గతంలో చెప్పిన మోదీ, తాజాగా బంజారా వర్గం వాడినని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment