Karnataka Assembly Election 2023
-
5 గ్యారంటీలకు ఏటా రూ.60 వేల కోట్లు
బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. -
ఒవైసీ విమర్శలపై కేటీఆర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా అధికార పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం, హోంమంత్రి అమిత్ షా టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. కాగా, మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 90-100 సీట్లు గెలుస్తాం. తెలంగాణలో బీజేపీ ఉనికి కోల్పోతుంది. దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీనే కారణం. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓ వైపు ఒవైసీ మాపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ విధానాలు బాగున్నాయంటున్నారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాలి. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ఇది కూడా చదవండి: తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కీలక నిర్ణయం -
బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్.అశోక్ ఆరోపించారు. ఎవరూ కరెంటు బిల్లులు చెల్లించరాదని, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఎన్నికల సమయంలో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ ప్రచారం చేశారన్నారు. ఎవరైనా కరెంటు బిల్లులు చెల్లిస్తే సిద్దూ, డీకే శివకుమార్‌ను అవమానించినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గ్యారంటీ పథకాల అమలుపై షరతులు విధిస్తే ప్రజలను మోసిగించిట్లేనన్నారు. కాంగ్రెస్‌కు సత్తా ఉంటే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన సవాల్ విసిరారు. -
పేలిన కుక్కర్.. బాలికకు తీవ్ర గాయాలు
దొడ్డబళ్లాపురం: ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచిన ఉచిత కుక్కర్ పేలి బాలిక తీవ్రంగా గాయపడ్డ సంఘటన రామనగర తాలూకా కూనముద్దనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. మహాలక్ష్మి (17) కుక్కర్ పేలి గాయపడ్డ బాలిక. శుక్రవారం ఉదయం మహాలక్ష్మి అన్నం వండాలని బియ్యం కడిగి కుక్కర్‌ను స్టౌమీద పెట్టింది. అయితే కాసేపటికే పెద్ద శబ్దంతో కుక్కర్ పేలింది. దీంతో సమీపంలోనే ఉన్న మహాలక్ష్మి ముఖం, శరీరంపై కాలిన గాయాలయ్యాయి. తక్షణం బాధితురాలిని రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎలెక్షన్ సమయంలో అభ్యర్థి ఒకరు ఈ కుక్కర్లను ఇంటింటికీ వచ్చి ఉచితంగా పంపిణీ చేశారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బోసురాజుకు మంత్రి పదవి?
రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజుకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి కల్పించనున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజు అసెంబ్లీ, విధాన పరిషత్ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అసంతృప్తి నెలకొంది. జిల్లాలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, సింధనూరు ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఎన్నికై న ప్రజాప్రతినిధులను కాదని, ఎమ్మెల్యే(ల్సీ) కాని వారిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోసురాజుకు అమాత్య పదవిని కేటాయించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. నాగేంద్రకు అమాత్యగిరి? బళ్లారిఅర్బన్: వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలతో మమేకమై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన యువనేత, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర శనివారం బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. సిద్దరామయ్య కేబినెట్లో సభ్యునిగా నాగేంద్ర పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో సంబరాలు నిండాయి. తాజా ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ కీలక నేత బీ.శ్రీరాములుపై అఖండ మెజార్టీతో జయభేరి మోగించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి వరించిందని తెలుస్తోంది. -
అప్పుడు ఉచితమని.. ఇప్పుడు షరతులా?
కర్ణాటక: అధికారంలోకి వచ్చిన తక్షణమే 5 గ్యారంటీ పథకాలు జారీ చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ కూడా విద్యుత్ బిల్లు చెల్లించవద్దని, మహిళలు టికెట్ లేకుండా బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం ఆయన జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు గ్యారంటీ పథకాలు ఉచితమని ఎన్నికల సమయంలో చెప్పిన సిద్దూ..ఇప్పుడు ఆ పథకాలకు షరతులు పెట్టాలనడం ప్రజలను మోసగించడమేనన్నారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ వ్యతిరేకించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఏ భవనం ప్రారంభోత్సవం సందర్భంలో కూడా రాష్ట్రపతి గాని, గవర్నర్‌ను గాని ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. చత్తీస్ఘడ్ విధానసభ శంకుస్థాపనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించారు గాని, గవర్నర్‌ను ఆహ్వానించ లేదన్నారు. పార్లమెంట్ నూతన భవనం ఉద్ఘాటన కార్యక్రమానికి జేడీఎస్ మద్దతు ఇస్తోందని, కార్యక్రమానికి దేవెగౌడ హాజరవుతారన్నారు. కాగా రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడిగా సీఎం ఇబ్రహీం, రాష్ట్ర జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్లుగా ఇద్దరూ కొనసాగుతారని, వారి రాజీనామాలు అంగీకరించేదిలేదన్నారు. -
మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్
సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్‌కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్‌భవన్‌లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్వీ దేశ్‌పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది. -
దశాబ్దాల కులవోటు సాంప్రదాయం తారుమారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయ ఓటింగ్ ధోరణి ఈసారి రూటు మార్చుకుంది. ముఖ్యంగా కులాల వారీ ఓటు బ్యాంకు తారుమారైంది. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీకి అండదండగా నిలుస్తూ వచ్చిన లింగాయత్‌లు మనసు మార్చుకున్నారు. ఓట్లపరంగా అత్యంత ప్రాబల్యమున్న సామాజిక వర్గమైన లింగాయత్‌లలో బాహుబలి నేత యడియూరప్పను పక్కన పెట్టినందుకు బీజేపీ భారీ మూల్యమే చెల్లించింది. ఆ పార్టీకి దశాబ్దాలుగా పెట్టని కోటలా ఉంటూ వచ్చిన లింగాయత్‌లు ఆగ్రహించి దూరమయ్యారు. 1990లో లింగాయత్ నాయకుడైన నాటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ లింగాయత్‌ల ఆగ్రహ జ్వాలలకు గురైంది. నెమ్మదిగా లింగాయత్ ఓటుబ్యాంకు బీజేపీకి మళ్లింది. 30 ఏళ్ల తర్వాత సరిగ్గా మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఈసారి బీజేపీ వంతు వచ్చింది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడమే గాక అభ్యర్థల ఎంపిక మొదలుకుని ప్రచారం దాకా పెద్దగా ప్రాధాన్యమివ్వని ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. లింగాయత్‌లు, వొక్కలిగలు, ఎస్సీల్లో ఐదేసి శాతం మంది కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించగలిగింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీ –ఓటరు వెల్లడించిన పార్టీలవారీ ఓట్లు, సీట్ల సరళిని పరిశీలిస్తే కులాల ఓటుబ్యాంకుల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది... వొక్కలిగలు: జేడీ(ఎస్)కు షాక్ జేడీ(ఎస్)కు అండగా ఉంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను తమ పితగా కొలిచే వొక్కలిగలు కూడా షాకిచ్చే నిర్ణయాలే తీసుకున్నారు. దేవెగౌడ కుటుంబ పెత్తనంపై ఓటర్లలో ఓ రకమైన కసి కనిపించింది. 2018 ఎన్నికల్లో వొక్కలిగ ప్రాబల్యమున్న మొత్తం 51 స్థానాల్లో జేడీ(ఎస్) 23 గెలుచుకుంటే ఈసారి కేవలం 12 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది. పీసీసీ డీకే శివకుమార్ వొక్కలిగ నేత కావడంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించింది. కాంగ్రెస్ ఓల్డ్ మైసూర్ గ్రామీణ ప్రాంతంలో ఏకంగా 36 స్థానాల్లో విజయం సాధించింది. శివకుమార్ కనకపురలో లక్షా 20 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారంటేనే దేవెగౌడ గుప్పిట్లోంచి వొక్కలిగలు జారిపోతున్నట్టేనని భావిస్తున్నారు. లింగాయత్‌లు: బీజేపీకి షాక్ లింగాయత్‌లు బీజేపీకి దూరం కావడం ఇది తొలిసారేం కాదు. బీజేపీ యడియూరప్పను దూరం పెట్టినప్పుడు ఆయన బీజేపీకి గుడ్‌బై కొట్టి 2012లో కర్ణాటక జనతా పక్ష పేరుతో వేరు కుంపటి పెట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేతుల కాలాయి. అప్పుడే ఆ పార్టీకి యడియూ రప్ప, లింగాయత్‌ల ఓట్ల ప్రాధాన్యం ఏమిటో తెలిసింది. ఆ తర్వాత యడియూరప్పను అక్కున చేర్చుకున్నప్పటికీ, మళ్లీ తాజాగా ఎన్నికల ముందు యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించి అదే తప్పు చేసింది. 2018 ఎన్నికల్లో లింగాయత్ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 41.8% ఓటు షేర్ బీజేపీకి వస్తే, ఈసారి కాస్త స్వల్పంగా 39.5 శాతానికి తగ్గింది. కానీ సీట్లు మాత్రం ఏకంగా 20 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జేడీ(ఎస్)కు వచ్చిన ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు 5 శాతమే పెరిగినా సీట్లు మాత్రం రెట్టింపు పెరిగాయి. చెయ్యెత్తి జై కొట్టిన ఎస్సీలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎస్సీలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎస్సీ ప్రాబల్య అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గత ఎన్నికలతో పోల్చి చూస్తే అదనంగా 5.5శాతం ఓట్లు, 10 సీట్లు సంపాదించింది. దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. సాధారణంగా దళితులు ఏ ఒక్క పార్టీ వైపు ఉండరు. కానీ ఈసారి ఖర్గే దళిత బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించి 40 ర్యాలీల్లో పాల్గొనడంతో ఎస్సీ ప్రాబల్య స్థానాల్లో సగానికి పైగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతోనే ఫలితాల్లో భారీగా మార్పులు కనిపించడమే మన ప్రజాస్వామ్యంలో వైచిత్రిగా ఎన్నికల విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటకలో సినిమా అట్టర్ ఫ్లాప్, తెలంగాణలో కాషాయ పార్టీ పరిస్థితేంటి?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపుతాయా? తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న కమలనాథుల ఆశలపై కర్ణాటక నీళ్ళు చల్లిందా? కర్ణాటక షాక్ నుంచి తెలంగాణ కాషాయసేన ఇప్పట్లో కోలుకుంటుందా? బీజేపీలోకి వలసలు కొనసాగుతాయా? ఆగుతాయా? అసలు తెలంగాణ కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటి? కర్ణాటకలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేయడమేనని తెలంగాణ కాషాయ సేన భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ, కన్నడ ప్రజలు వారి ఆశలు అడియాశలు చేసేశారు. భారీ అంచనాలతో విడుదలైన సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్లుగా కర్ణాటక బీజేపీ పరిస్థితి తయారైంది. అస్థిర రాజకీయాలకు తెర దించుతూ కాంగ్రెస్ విజయ దుంధుభి మోగించింది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపగా.. బీజేపీ నేతల్లో నిరాశ మిగిల్చింది. ఫలితాలు వెల్లడయ్యాక బీజేపీ ఆఫీస్‌లో ఒక్కసారిగా సందడి తగ్గిపోయింది. స్తబ్తత ఆవరించింది. (ఓఆర్ఆర్ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారు: రేవంత్ రెడ్డి) చేరికలేవీ? మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీజేపీ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి మినహా.. చెప్పుకోదగ్గ స్థాయిలో చేరికలు జరగలేదు. కన్నడ నాట ఫలితాల ఎఫెక్ట్ తో చేరిన నేతలు కూడా డైలమాలో పడ్డారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ఈటల రాజేందర్ వెళ్లిన సందర్భంలో పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఇప్పట్లో కాషాయ కండువా కప్పుకునేది ఎవరు? కొత్తగా బీజేపీలో చేరే వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు బీజేపీ వైపు చూడటం కష్టమేనని వాళ్ల వర్గీయులు చెబుతున్నారు. వాళ్లు కాంగ్రెస్ వైపు అడుగేస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. గ్రూపు తగాదాలతో రగిలిపోతున్న తెలంగాణ కమలదళం... కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తో బలహీనపడుతుందా? నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతాయా? అనే చర్చ జరుగుతోంది. అయితే కర్ణాటకలో ఓడినంత మాత్రాన తెలంగాణలో పార్టీ దూకుడు ఏమాత్రం తగ్గదని.. రెట్టించిన ఉత్సాహంతో కమలదళం కార్యరంగంలోకి దూకుతుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. (బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్ఫ్యూజన్.. రంగంలోకి హైకమాండ్) -
బీజేపీ ఎల్పీ సారథ్యం ఎవరికి?
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ సర్కారును విధానసభలో ఎదుర్కొనేందుకు గట్టి నేత కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. సోమవారం నుంచి కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేలతో విధానసభ ప్రారంభమైంది. కాంగ్రెస్ పక్ష నేతగా, సీఎంగా సిద్ధరామయ్య ఉండగా, బీజేపీ ఎల్పీ నేతగా ఎవరు లేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అయితే ఈ మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల తరువాత ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి గురించి ఆదివారం బీజేపీ ఆత్మావలోకనం జరిపినప్పటికీ ఇందులో ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై చర్చ జరగలేదు. ఆ రెండు వర్గాల నుంచి.. మాజీ సీఎం బసవరాజ బొమ్మైని ప్రతిపక్ష నేత చేయాలని కొందరు, దూకుడుగా ఉండే బసవనగౌడ పాటిల్ యత్నాల్ని చేయాలని మరికొందరు పట్టుబట్టినట్లు సమాచారం. లింగాయత, ఒక్కలిగ ముఖం కలిగిన హిందూత్వ ఎజెండాను ఎత్తుకుని నడిపించే నాయకుడి కోసం బీజేపీ నాయకత్వం అన్వేషిస్తోంది. నిరాణి, సుధాకర్, సీటీ రవి వంటివారు జాబితాలో ఉన్నప్పటికీ వారు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో బీఎస్ యడియూరప్ప ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొగలిగే సీనియర్ల కొరత బీజేపీ వేధిస్తోంది. సీనియర్లు చాలా మంది ఓటమి పాలవ్వడం, గెలిచిన వారిలో చాలా మంది కొత్తవారు కావడం ఇలాంటి తరుణంలో ఎవరిని ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలనే అంశంపై హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై.. లింగాయత్ వర్గానికి చెందిన మాజీ సీఎం బసవరాజు బొమ్మై, ఒక్కలిగ వర్గానికి చెందిన శోభ కరంద్లాజే, సీఎన్ అశ్వత్థ నారాయణ, సీటీ రవిలో ఒకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే విషయంపై కూడా బీజేపీ చర్చ జరుగుతోందని తెలిసింది. జేడీఎస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఒక్కలిగలను ఇప్పటినుంచే తమ వైపునకు తిప్పుకునేందుకు ఆ సామాజికవర్గ నేతనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. -
భవిష్యత్‌లో మెజార్టీతో వస్తా
శివాజీనగర: ప్రజల ఆశీర్వాదంతో 12 సంవత్సరాల తరువాత విధానసౌధలోకి కాలుపెడుతున్నాను. ఇప్పుడు ప్రజలు తనను ఒక్కడిని మాత్రమే గెలిపించి పంపారు. భవిష్యత్‌లో అధిక మెజార్టీతో విధాన సౌధకు వస్తానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్నేళ్ల తరువాత మళ్లీ విధానసౌధలోకి ప్రవేశిస్తున్నాను. తమ పార్టీకి అనేక మంది ప్రజలు ఓటు వేశారు. వారి ఆశీర్వాదంతో విధానసౌధలోకి ప్రవేశించాను. ప్రజోపయోగ పనులకు తన మద్దతు ఉంటుంది. అసెంబ్లీలో ప్రజలకు అనుకూలమైన బిల్లు ప్రవేశపెట్టడంలో తన మద్దతు తప్పకుండా ఉంటుంది. ఎవరికి తన అవసరం ఉంటుందో వారికి తన మద్దతు ఇస్తానన్నారు. -
ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలి
చిక్కబళ్లాపురం: చింతామణి ఎమ్మెల్యే ఎంసీ సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని తాను ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాసినట్లు చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ తెలిపారు. సోమవారం ఆయన నగరంలో నమస్తే చిక్కబళ్లాపురం కార్యక్రమంలో భాగంగా శిడ్లఘట్ట రోడ్డులో దళిత కాలనీలోని సమస్యలను ఆలకించడానికి వచ్చారు. అక్కడే అల్పాహారం తీసుకుని వారి సమస్యలను విన్నారు. ఈ కాలనీలో ఆరుగురు హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని, వారిని జయదేవ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తానని ప్రదీప్ తెలిపారు. ఇక్కడ తాగునీటి సమస్య ఉందని, త్వరలో పరిష్కరిస్తానన్నారు. మునపటి ఎమ్మెల్యేలు కనీసం ఓట్లు అడగటానికి కూడా దళిత కాలనీలో అడుగు పెట్టలేదని అన్నారు. అంతకు ముందు ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం మునియప్ప, నగరసభ సభ్యుడు వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధం-కాంగ్రెస్
ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధం-కాంగ్రెస్ -
సింగిల్‌గా పోటీ చేసి గెలుస్తాం!: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. ఈ ప్రభావంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు కూడా. అయితే ఆ ప్రభావం ఏమి తెలంగాణ ఎన్నికల్లో ఉండదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంబంధమే లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌కి ఫండింగ్ ఇచ్చారని ఆరోపించారు అక్కడ జేడీఎస్ నేతల ఫోన్లు కూడా ఎత్తలేదన్నారు. కేసీఆర్ ఒక విశ్వాస ఘాతుకుడని ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ఓటు శాతం కూడా ఏమి తగ్గలేదని, అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఢీ కొట్టడంతోనే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందన్నారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించి కేసీఆర్ కాంగ్రెస్‌ని లేపే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. అయినా తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలించిందో చెప్పండని ప్రశ్నించారు. అలాగే దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ రాలేదన్నారు. ఆ టైంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిందని చెప్పారు. అలాగే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి తరుఫున బీఆర్ఎస్ డబ్బులు పంచిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని చెప్పారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు తమదేనని, ఎన్నికల్లో తాము సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా చెప్పారు బండి సంజయ్. (చదవండి: కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే!) -
కేఆర్పీపీతోనే రాష్ట్రంలో బీజేపీ ఓటమి
గంగావతి రూరల్: రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కారణమని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు, ఆదివారం ఆయన నగరంలోని కేఆర్పీపీ కార్యాలయంలో బళ్లారి విధానసభ క్షేత్రం బూత్‌స్థాయి పదాధికారులు, పార్టీ నాయకులతో ఆత్మావలోకన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పార్టీ ఏర్పాటుకు ముందు తనను తిరిగి బీజేపీలోకి తీసుకోవాలని చూశారని, తాను మాత్రం ఏ బీజేపీ నేత ఇంటికి కూడా వెళ్లలేదని, అమిత్, నరేంద్ర మోదీల వద్ద అసలు వెళ్లలేదని బీజేపీ నేతల గురించి వ్యంగ్యంగా అన్నారు. అమిత్‌షా పలుమార్లు తనను కలవాలని చూశారని, అయితే తానే వారిని దూరంగా ఉంచానని, రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కేఆర్పీపీ కారణమన్నారు. బళ్లారి విధానసభ క్షేత్రం ఎన్నికలో కేఆర్పీపీ పరాజిత అభ్యర్థి లక్ష్మీ అరుణ రెండో స్థానంలో నిలిచారని, ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు. ఇప్పటి బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలో నేను పెంచి పెద్ద చేసిన పిరికిపందలు, అన్నదమ్ములతో సహా అందరూ ఇళ్లల్లో ఉండే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను ఒంటరిగానే విధాన సౌధకు వెళ్తున్నానని, తన మంచితనం కొంత మంది ఉపయోగించుకున్నారని అలాంటి వ్యక్తులకు రాబోవు రోజులో కాలమే శిక్షిస్తుందన్నారు. బళ్లారిలో పాలికెలో సత్తా చాటుతాం బళ్లారి మునిసిపల్ కార్పొషన్ ఎన్నికలతో పాటు వచ్చే జిల్లా పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో కేఆర్పీపీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలందరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. బళ్లారి మహాపాలికె ఈసారి అన్ని వార్డుల్లో కేఆర్పీపీ అభ్యర్థులు సత్తా చాటాలన్నారు. పరాజిత అభ్యర్థి లక్ష్మీ అరుణ మాట్లాడుతూ...ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటామని, నా ఓటమికి కాంగ్రెస్ హామీలే కారణమని అన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కొప్పళ జిల్లా అధ్యక్షుడు మనోహర గౌడ హేరూరు, బళ్లారి జిల్లా అధ్యక్షుడు గోనాళ రాజశేఖర గౌడతోపాటు ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా కల్యాణ రాజ్యా ప్రగతి పార్టీ యువ ఘటక అధ్యక్షుడు భీమశంకర పాటిల్, మహిళా ఘటక అధ్యక్షురాలు హేమలత, శ్రీనివాస్ రెడ్డి, హంపి రమణ పాల్గొన్నారు. -
మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్..ఆయనో సంచలనం
కర్ణాటక కాంగ్రెస్‌లో ఆయనో సంచలనం. పార్టీలో ఎక్కడ సంక్షోభం వచ్చినా పరిష్కరించగల నేర్పరి. నవయువకుడిగా రాజకీయ రంగంలోకి వచ్చారు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్‌గా కర్ణాటకలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్.. ఆయనే డీకే. శివకుమార్. దొడ్డనహళ్ళి కెంపెగౌడ శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక సంచలనం. 61 ఏళ్ళ శివకుమార్ కర్ణాటక పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, ట్రబుల్ షూటర్‌గా కాంగ్రెస్‌లో పేరు తెచ్చుకున్నారు. 2002లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్‌ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడటంలో, 2017లో గుజరాత్లో అహ్మద్‌పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించారు. తనకున్న చాతుర్యంతో, పార్టీలో ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరనే ప్రశంసలందుకున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక జనతాదళ్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా, సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వహించారు. కనకపుర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ 1980లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో 27 ఏళ్ళ వయసులో తొలిసారి మైసూరు జిల్లాలోని సాతనూరు నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు అక్కడి నుంచే గెలిచారు. 2008 నుంచి వరుసగా నాలుగుసార్లు కనకపుర నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారో మంత్రిగా పనిచేసినపుడు అవినీతి ఆరోపణల్ని కూడా అదే రేంజ్లో ఎదుర్కొన్నారు. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు, అక్రమ సంపద కేసులతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శివకుమార్‌ను టార్గెట్ చేసింది. బీజేపీలో చేరమని చేసిన ఒత్తిడి ఫలించకపోవడంతో సీబీఐ, ఈడీ కేసులతో శివకుమార్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. జైలులో పెట్టినప్పటికీ చలించకుండా కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా కొనసాగారు. బెంగళూరు శివార్లలోని తన ఫామ్ హౌజ్ కాంగ్రెస్ పార్టీలోని పలు రాజకీయ సంక్షోభాలను నివారించింది. విలాసరావ్ దేశ్‌ముఖ్ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు అక్కడి ఎమ్మెల్యేల కోసం శివకుమార్ ఫామ్‌హౌజ్‌లోనే క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా గుజరాత్లో కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించే క్రమంలో అక్కడి ఎమ్మెల్యేలను కూడా ఫామ్ హౌజ్‌కు తీసుకువచ్చారు. తనకున్న రాజకీయ చాతుర్యంతో, ట్రబుల్ షూటర్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సన్నిహితుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో ధనిక రాజకీయ నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్..తనకున్న ఆస్తులు 840 కోట్ల రూపాయలుగా 2018 ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్‌లో తెలియచేశారు. తాజా ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆస్తుల విలువను 1139 కోట్లుగా వెల్లడించారు. శివకుమార్ మీద మనీ లాండరింగ్ కేసులు, ఆదాయపన్ను ఎగవేత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే
Updates: ►కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత ప్రమాణ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొఫైల్ ►ఓబీసీ నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం ►తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే, ►2013 నుంచి 18 వరకు సీఎం, ►13సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్. ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక ►కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫైల్ ► వక్కళిగ నేత, తల్లిదండ్రులు కెంపేగౌడ, గౌరమ్మ ►చదవు: మైసూరు యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ►27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు ►సాతనౌర్ నుంచి మూడుసార్లు ఎమ్మల్యెఏ ►2008లో కనకపుర నుంచి గెలుపు ►2008, 2013, 2018లో హ్యాట్రిక్ విక్టరీ ►2014 నుంచి 18 వరకు విద్యుత్‌శాఖ మంత్రి ►2017 రాజ్యసభ ఎన్నికల్లోనూ కీలక పాత్ర ►దేశంలోనే ధనిక రాజకీయనేత ►కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్షూటర్ ►కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నేతలు వీళ్లే కేజీ జార్జ్ ప్రొఫైల్ ►సర్వగ్న నగర్ నియోజకవర్గం, క్రిస్టియన్ నేత, 5 సార్లు ఎమ్మెల్యే ►1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక ►హోం, పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు కేహెచ్ మునియప్ప ప్రొఫైల్ ► తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు, దేవనహళ్లి అసెంబ్లీ ► చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజస్ ► రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖల నిర్వహణ ► ఏడుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నిక ► కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం జీ పరమేశ్వర ప్రొఫైల్ ►జననం 1951 ఆగస్టు 6, కొరటగెరె నియోజకవర్గం ►దళిత నేత, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే ►హోంశాఖ, సమాచారం, పౌర సంబంధాలు ►ఉన్నత విద్యాశాఖ మంత్రిగా విధులు 2010-18 వరకు కేపీసీసీ అధ్యక్షుడు ►వీరప్పమొయిలీ, ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య, కుమారస్వామి కేబినెట్లో మంత్రిగా విధులు మాజీ డిప్యూటీ సీఎం, ఎంబీ పాటిల్ ప్రొఫైల్ ►లింగాయత్ నేత, బబలేశ్వర్ నియోజకవర్గం. ►అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ► కర్ణాటక మాజీ హోం, జలవనరుల మంత్రి. సతీశ్ జర్కిహోళి ప్రొఫైల్ ►ఎస్టీ నేత(వాల్మికీ నాయక) ► గోకక్ నియోజకవర్గం. ►నాలుగుసార్లు ఎమ్మెల్యే, ►రెండుసార్లు ఎమ్మెల్సీ, ►కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రియాంక్ ఖర్గే ప్రొఫైల్ ►దళిత నేత, ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ►చిత్తాపూర్ నియోజకవర్గం. ►మూడుసార్లు ఎమ్మెల్యే. ►ఐటీ, సాంఘీక సంక్షేమశాఖ మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ►చామరజ్పేట్ నియోజకవర్గం ►మైనార్టీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిక ► మాజీ హజ్, వక్ఫ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి ►ఓబీసీ నేత ►బీటీఎమ్ లేఔట్ నియోజవకర్గం ►8సార్లు ఎమ్మెల్యే, ►మూడు సార్లు మంత్రిగా సేవలు. ►కర్ణాటక మాజీ హోంమంత్రి #WATCH | Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi in Bengaluru. pic.twitter.com/KxdvpWims1 — ANI (@ANI) May 20, 2023 Karnataka swearing-in ceremony | Karnataka Deputy CM-designate DK Shivakumar welcomes Tamil Nadu CM MK Stalin and other DMK leaders at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/TS3uVNcydI — ANI (@ANI) May 20, 2023 ►బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కమల్‌హాసన్, శవరాజ్ కుమార్ హాజరయ్యారు. Actor and Makkal Needhi Maiam chief Kamal Haasan attends the swearing-in ceremony of the newly-elected Karnataka Government at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/mrTmOo7vU4 — ANI (@ANI) May 20, 2023 ►అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు కేబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రత్యేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. #WATCH | Karnataka Deputy CM-designate DK Shivakumar arrives at Sree Kanteerava Stadium in Bengaluru where the swearing-in ceremony of the newly-elected Karnataka Government will begin shortly. pic.twitter.com/sQHEch9Rd8 — ANI (@ANI) May 20, 2023 శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేస్తారంటూ అధిష్టానం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాలతో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వీరి చర్చల్లో శివకుమార్ పాలుపంచుకున్నారు. నలుగురూ కలిసి జన్‌పథ్– 10లో ఉంటున్న రాహుల్ గాంధీని వెళ్లి కలిశారు. కేబినెట్లోకి 20 మంది? గంటన్నరకుపైగా వారి మధ్య చర్చలు నడిచాయి. ఆపై రాహుల్ గాంధీ, సూర్జేవాలా, వేణుగోపాల్‌లు పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్లోకి ఎందరిని తీసుకోవాలనే విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. కేబినెట్లోకి తీసుకునే 20 మంది పేర్లను ఖారారు చేసినట్లు అనంతరం పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం దక్కేలా కేబినెట్ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల సీఎంల రాక ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా. విస్తృతంగా బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం డీకే శివకుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్ చెప్పారు. శనివారమే జరిగే కేబినెట్ మొదటి భేటీలో కాంగ్రెస్ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్ బన్సల్ భేటీ -
ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటా
దొడ్డబళ్లాపురం:ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తాను ఇంట్లో కూర్చునే రకం కాదని, ప్రజలకు అందుబాటులో ఉంటానని నిఖిల్ కుమారస్వామి అన్నారు. గురువారం చెన్నపట్టణలో మాట్లాడిన నిఖిల్ ఎన్నికలు అన్నాక ఎవరో ఒకరు గెలవాలన్నారు. ఈరోజు తాను ఓటమిపాలైనా ఏదో ఒకరోజు గెలిచితీరుతానని, అప్పటి వరకూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అయినా చెన్నపట్టణలో కుమారస్వామిని గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. రామనగరలో తనకు 76 వేల ఓట్లు వచ్చాయని, తాను టెక్నికల్‌గా ఓడిపోయినా అంతమంది జనం తనతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు రాత్రికి రాత్రి అమాయక ప్రజలకు కూపన్ ఓచర్లు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారన్నారు. తన కుటుంబం అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజలకు సేవలందిస్తాం అన్నారు. -
ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడమంటే..
బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్.నిజలింగప్ప, దేవరాజ అరస్లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు. మైసూరు సీఎం.. ఎస్.నిజలింగప్ప కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్ 1962 వరకు సీఎంగా ఎస్ఆర్ కంఠి ఎన్నికయ్యారు. జూన్ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు. పథకాల్లో దేవరాజ్ అరస్ ముద్ర మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరాజ అరస్ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు. -
నాగేంద్రకు మంత్రి పదవి?
బళ్లారి అర్బన్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారీటీని సాధించిన నేపధ్యంలో బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీ.నాగేంద్రకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచి సిద్దరామయ్యతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఐదు మందిలో తుకారాం కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొదారు. అయితే గతంలో తుకారాం మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తొలిసారిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని నాగేంద్ర కోరినట్లు సమాచారం. -
‘కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్.. మూడు నెలల్లో అనేక మార్పులుంటాయ్’
కర్ణాటక: రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఉంటాయని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. గురువారంనాడు రామనగరలో మాట్లాడిన ఆయన కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండదని, మూడు నెలల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. త్వరలో తాలూకా,జిల్లా పంచాయతీల ఎన్నికలు వస్తాయని, అప్పుడు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అనుకున్న స్థానాల్లో గెలవకపోవడానికి అనేక కారణాలున్నాయని, ఈ ఓటమి వల్ల పార్టీకి ఢోకా ఏమీ లేదని, ఇలాంటి పరాజయాలు తమకు కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదన్నారు. ప్రకటించిన పథకాలకు ఏడాదికి కనీసం రూ. 70 వేల కోట్లు అవసరమని, అన్ని నిధులను ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. -
అత్యధిక మెజార్టీతో గెలిచాను.. నాకే మంత్రి పదవి ఇవ్వాలి
కర్ణాటక: ఈసారి అత్యధిక మెజార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే గణేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కంప్లి బ్లాక్ యూత్ కాంగ్రెస్ సమితి అధ్యక్షులు ఆర్పీ శశికుమార్ మనవి చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి కూడా రూ.కోట్లాది నిధులు తెచ్చి క్షేత్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారన్నారు. మస్కి అసెంబ్లీ క్షేత్ర ఉప ఎన్నికల్లో ఇన్చార్జిగా ఉండి అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్నారు. అందువల్ల సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డీకే.శివకుమార్ ఎమ్మెల్యే గణేష్‌కు అమాత్య పదవి కట్టబెట్టాలన్నారు. ఉపాధ్యక్షులు రాజాబక్షి, కోటెహాల్ వీరేష్, శాంతి, ప్రధాన కార్యదర్శి లేబల్ వీరేష్, కార్యదర్శి, సభ్యులు గోపినాథ్, రాము, మారుతి, చేతన్, యల్లప్ప, బాష, ఫయాజ్, ఫారూక్ పాల్గొన్నారు. -
న్యాయవాది నుంచి ముఖ్యమంత్రి వరకు..
కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ఈరోజు(శనివారం) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠం కోసం చివరి వరకు పోరాడిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంతోపాటు నూతన కేబినేట్ శనివారం కొలువుదీరింది. కాగా 75 ఏళ్ల సిద్ధరామయ్య కర్ణాటక 24వ సీఎంగా బాధ్యతలు ప్వీకరించారు. రాజకీయాల్లో 45 ఏళ్ల సుధీర్ఘ అనుభవం అన్న ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పూర్తికాలం పదవిలో ఉన్న మూడో వ్యక్తి కూడా. గతంలో దేవరాజ్ అర్స్, ఎస్. నిజలింగప్ప మాత్రమే అయిదేళ్ళు పూర్తి చేశారు. 1956 నుంచి తీసుకుంటే.. ఇప్పటి వరకు కేవలం ముగ్గురు వ్యక్తుల మాత్రమే పూర్తికాలం పదవిలో కొనసాగారు. వారంతా కాంగ్రెస్‌కు చెందినవారే కావడం విశేషం. చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ! చదువు, కుటుంబం నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న సిద్ధరామయ్య జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న ఆయన తరువాత అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు 1947 ఆగస్టు 3న సిద్దరామే గౌడ, బోరమ్మసిద్ధరామయ్య మైసూరు జిల్లాలోని సిద్దరమణహుండి అనే చిన్న గ్రామంలో జన్మించారు. వ్యవసాయం నేపథ్యం గల కుటుంబానికి చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు సిద్దరామే గౌడ, బోరమ్మ. సిద్ధరామయ్య అయిదుగురు తోబుట్టువులలో రెండవవాడు. వీరు కురుబ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. సిద్ధరామయ్య పదేళ్ల వయస్సు వరకు పాఠశాలకు వెళ్లి ఎలాంటి విద్యను అభ్యసించలేదు. మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎల్ఎల్బీ డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. సిద్ధరామయ్యకు పార్వతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. రాజకీయ వారసుడిగా భావించిన పెద్ద కుమారుడు రాకేష్(38) మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో 2016లో మరణించాడు. రెండవ కుమారుడు యతీంద్ర మైసూరులోని వరుణ జిల్లా నుండి 2018 శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికలో పోటీ చేయలేదు. చదవండి: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్ రాజకీయ నేపథ్యం సిద్ధరామయ్య తన కాలేజీ రోజుల్లోనే వాక్చాతుర్యంతో మంచి వక్తగా పేరుగాంచారు.మైసూరు జిల్లా కోర్టులో చిక్కబోరయ్య అనే న్యాయవాది దగ్గర జూనియర్‌గా పనిచేస్తన్న సమయంలో నుంజుడ స్వామి పరిచయమయ్యారు. అతనే సిద్దారమయ్యను రాజకీయాల్లోకి రమ్మని, మైసూరు తాలుకా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన సిద్ధరామయ్య ఎన్నికల బరిలో దిగి తొలిసారి విజయం సాధించాడు. 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగు తరువాత 1983లో భారతీయ లోక్‌దళ్ పార్టీ టికెట్‌పై చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టాడు. వ్యవసాయం, నిరాడంబర నేపథ్యం నుంచి వచ్చిన సిద్ధరామయ్య తన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచి, పాత మైసూరు ప్రాంతంలో సంచలనంగా మారారు. అనంతరం జనతా పార్టీలో చేరి కన్నడ అధికార భాషగా అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కన్నడ నిఘా కమిటీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. తిరిగి 1985లో మరోసారి చాముండేశ్వరీ నుంచి కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఏకంగా రామకృష్ణ హెగ్డే కేబినెట్లో పశువైద్య సేవల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఆర్థిక మంత్రిగా 1992లో జనతాదళ్ సెక్రటరీ జనరల్‌గా ఎంపికయ్యారు. తిరిగి 1994లో హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. పార్టీ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. 1996లో జేహెచ్ పటేల్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయినప్పటికీ1999లో మంత్రివర్గం నుంచి తొలగించారు. మొత్తం తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చదవండి: ఈ నిర్ణయం కోర్టు తీర్పులాంటిది: డీకేఎస్ Former CM and leader of Opposition @siddaramaiah dancing with his childhood friends at his native village Siddaramayyana hundi in Mysuru on Thursday night. It can be noted he has learnt Veera Makkala Kunitha, folk dance form when he was young.@santwana99 @NewIndianXpress pic.twitter.com/XtI59uapV5 — Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್🇮🇳 (@AshwiniMS_TNIE) March 25, 2022 జేడీఎస్‌లో సిద్ధరామయ్య 1999లో జనతాదల్ నుంచి విడిపోయి హెచ్డీ దేవెగౌడ తన వర్గం వారితో జనతాదళ్(సెక్యులర్) పార్టీని స్థాపించారు. సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు. కానీ అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో సిద్ధరామయ్య ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 2005లో దేవెగౌడతో విభేదాల కారణంగా జేడీఎస్‌ను వీడి.. ఏడాది తర్వాత సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2006లో జరిగిన ఉపఎన్నికల్లో చాముండేశ్వరీ నుంచి కేవలం 257 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత నియోజకవర్గం మార్చుకుని 2008, 2013 ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2013 నుంచి 2018 వరకు సీఎంగా ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు. 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ అంతేగాక కర్నాటక ఆర్థిక మంత్రిగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.ఇక తనకు ఇదే చివరి ఎన్నిక అని సిద్ధూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ద్ధరామయ్య 2018 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయగా మైసూరులోని చాముండేశ్వరిలో జేడీ(ఎస్) అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. కానీ బాదామి నియోజవర్గంలో విజయం సాధించారు. I thank everyone present here for attending the swearing-in ceremony. We are going to implement all five of our promises in the first cabinet meeting. Jai Hind! Jai Karnataka! Jai Congress! : Karnataka CM Shri @siddaramaiah pic.twitter.com/KAC3N0pBhu — Congress (@INCIndia) May 20, 2023 -
అన్ని పార్టీల్లోనూ డిపాజిట్లు దక్కని అభ్యర్థులు
కర్ణాటక : 2023 అసెంబ్లీ ఎన్నికలు కొందరు అభ్యర్థులకు భారీ విజయాన్ని కట్టబెట్టగా మరికొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అత్యల్ప మెజార్టీతో గెలిచినవారు కొందరైతే..మరికొందరికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ పరిస్థితులు అన్ని పార్టీల్లోనూ కనిపించాయి. ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,613మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నుంచి 224 మంది, కాంగ్రెస్ నుంచి 223 మంది, జేడీఎస్ నుంచి 207మంది పోటీ చేశారు. 918మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. వీరిలో 389మంది ఓటమిపాలవ్వగా 210 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. జేడీఎస్ నుంచి పోటీ చేసిన 207మందిపైకి కేవలం 19మంది మాత్రమే గెలిచారు.136 మంది జేడీఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. కడూరులో పోటీ చేసిన వైవీఎస్ దత్త కేవలం 26,837 ఓట్లు రాబట్టారు. శివమొగ్గలో జేడీఎస్ అభ్యర్థి ఆయనూరు మంజునాథ్ కూడా డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ నుంచి 224 మంది పోటీ చేయగా 66 మంది మాత్రమే గెలిచారు. ఓటమిపాలైన వారిలో 31మందికి డిపాజిట్లు రాలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 12మంది అభ్యర్థులు కూడా డిపాజిట్లు కోల్పోయారు. కనకపురలో డీకే శివకుమార్‌పై పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఈయన పద్మనాభనగర్‌లో విజయం సాధించారు. -
గెలుపు అంచు వరకు వచ్చి ఓడిపోవడంతో..
మాలూరు: శాసనసభ ఎన్నికలలో గెలుపు అంచు వరకు వచ్చి తాను ఓడిపోవడం సాంకేతిక కారణాల వల్లనే జరిగిందని స్వతంత్య్ర అభ్యర్థి హూడి విజయకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో తన నివాసంలో మాట్లాడారు. తాను బీజేపీలో ఉన్నప్పుడు తన శ్రమను పార్టీ గుర్తించకపోవడం వల్ల తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. బీజేపీలోని కొంతమంది మంత్రులు, ఎంపీ ఎస్ మునిస్వామి వల్లనే తనకు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ టికెట్ తప్పిపోయిందన్నారు. తనకు బీజేపీటికెట్ రాకుండా చేసిన ఎంపీ ఎస్ మునిస్వామికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన అభిమానులు, కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. -
కర్ణాటక ఫలితాన్ని ఎలా చూడాలి?
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అనడం కన్నా బీజేపీ ఓడింది అనడం కరెక్టు. ఎందుకంటే కాంగ్రెస్‌ది సంపూర్ణ విజయం అనుకోలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ వైపు వచ్చారంతే! ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలకూ, బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. దేశంలో నెలకొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రకటించాలి. ఇది ప్రజా విజయం. అధికార భారతీయ జనతా పార్టీ ఓటమి. ఇదే ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం. అంతేగానీ, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయమనుకుంటే పొరపాటు. ఇది దేశ వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతమవుతుందనుకుంటే అంతకన్నా పొరపాటు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల వల్ల అంచనాలు తారుమారయ్యే అవకాశం మాత్రం ఉంది. మొదటిగా, ప్రజల విజయం విషయానికి వస్తే– గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాదనుకున్నవాళ్ళు జనతాదళ్ (ఎస్)కు, కాంగ్రెస్‌కు మధ్యలో నిలిచిపోయారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు తెలివిగా చాలా చోట్ల జనతాదళ్(ఎస్)ను పక్కన పెట్టి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా జేడీ(ఎస్),కాంగ్రెస్ పోటీలో ఉంటే, బీజేపీని కాదనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్) 37 సీట్లలో విజయం సాధిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో అది 19కి పడిపోయింది. అంటే సగానికి దిగజారిందని అర్థం. దీనికి కారణం, ప్రజల చతురత తప్ప మరొకటి కాదు. మూడు, నాలుగు పార్టీలు పోటీలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు అనుసరించడానికి ఇది ఒక నమూనా. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చాలా బలంగా ఉన్నట్టు మనం భావిస్తున్నాం. ఎందుకంటే, పార్లమెంటు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని రెండుసార్లు నిలబెట్టుకుంది. అది కూడా అత్యంత అధిక సంఖ్యలో. అక్కడ నాలుగు పార్టీలు పోటీ పడుతు న్నాయి. అందులో గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ చాలా బలహీనపడింది. కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే తన ఉనికిని చాటగలగింది. అయితే అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోగా, 2022లో దాని బలం 255కు పడిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 47 స్థానాలకు పరిమితం కాగా, 2022లో 111 స్థానాలకు తన బలాన్ని పెంచుకున్నది. అంటే క్రమంగా సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతోంది. మిగతా రెండు పార్టీల పరిస్థితిని చూస్తే, ఇది మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 2017 ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలిచి, 6.25 శాతం ఓట్లను సాధించుకుంటే, 2022 ఎన్నికల్లో రెండు సీట్లకు పరిమితమై పోయి, 2.33 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. బహుజన్ సమాజ్ పార్టీ 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లను సంపాదించి, 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2022 ఎన్నికల్లో ఓట్ల శాతం 12.88కి పడిపోగా, కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఎస్పీ క్రమంగా తమ రాజకీయ బలాలను కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ఒకవేళ అక్కడ బీజేపీని ఓడించాలనుకునే ప్రజలు సమాజ్ వాదీ పార్టీవైపే మొగ్గితే భారతీయ జనతాపార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ప్రాధా న్యతను కోల్పోవాల్సి వస్తుంది. అంటే జాతీయస్థాయి ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదు. దానికి ఉదాహరణగా సీట్లు మాత్రమే కాదు, ఓట్ల శాతాన్ని కూడా చూడాలి. సమాజ్‌వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 21.82 శాతం ఓట్లను పొందితే, 2022 ఎన్నికల్లో అది 32.06 శాతానికి పెరిగింది. అంటే దాదాపు పది శాతానికి పెరిగింది. కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ప్రజాదరణ కోల్పోతున్నట్లు, సమాజ్‌వాది పార్టీ వైపు ప్రజలు వెళుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయం, బీజేపీ ఓటమి: నిజానికి కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ ఒకే పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేదు. 1985 నుంచి ఇదే చరిత్ర పునరావృతమవుతూ ఉంది. 1985 వరకు కర్ణాటకలో కాంగ్రెస్ పాలన కొనసాగింది. 1985లో మొదటి సారిగా జనతాపార్టీ నాయకత్వంలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఏర్పా టయ్యింది. ఇదే మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం.1994లో జనతాదళ్ 227 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1999లో కాంగ్రెస్, 2004లో జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం, 2008లో బీజేపీ ప్రభుత్వం, 2013లో మళ్ళీ కాంగ్రెస్, 2018లో మళ్ళీ బీజేపీ అధికారాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇది కర్ణాటక అసెంబ్లీ చరిత్ర. కర్ణాటక ప్రజలు 1985 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి రెండవసారి అధికారం కట్టబెట్టలేదు. అయితే బీజేపీ ఈ చరిత్రను తిరగరాయాలని ఉవ్విళ్ళూ రింది. అది ప్రజల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. సూటిగా చెప్పాలంటే ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చ గొట్టి, మిగతా ప్రజలందరినీ తమవైపు తిప్పుకోవాలని చూసింది. అందులో భాగంగానే హిజాబ్, అజాన్, ఉమ్మడి సివిల్ కోడ్, పశుసంరక్షణ పేరుతో దాడులు, ఒక రకంగా, ఉత్తర ప్రదేశ్‌లో అనుసరించిన అన్ని విధానాలను ఇక్కడ అమలు చేయాలని శతవిధాలుగా ప్రయ త్నించింది. కానీ ఆ విషయాలేవీ కర్ణాటక ప్రజలు పట్టించుకోలేద నడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఇది మతాల మధ్య విభజన అయితే – ఇక కులాల మధ్య ముఖ్యంగా ఎస్సీలలో ఉన్న వ్యత్యాసాలను ఉపయోగించుకొని మాదిగల ఓట్లను పొందడం కోసం రిజర్వేషన్ల విభజనను తెరపైకి తీసుకొచ్చింది. అదికూడా ఫలించలేదు. తన ఆర్థిక, సామాజిక కార్య క్రమాలు, అభివృద్ధి పనులను చూపించుకోవడం కాకుండా, ఇటువంటి విభజనతో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నది. ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. మూడో విషయం, కాంగ్రెస్ గెలుపు: ఇది బీజేపీ ఓడిపోయి,అందించిన గెలుపు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులైన శివకుమార్, సిద్ధరామయ్య ఐక్య కృషి తోడైనప్పటికీ తనకు తాను గెలిచిన గెలుపు కాదిది. ఎందుకంటే, పదేళ్ళ కిందట దేశంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలకూ, ఇప్పడు బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. అయితే ఇటీవల ఆ పార్టీ నాయ కుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు గత కాంగ్రెస్ విధా నాలకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అదే విధంగా కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద రాహుల్ చేస్తున్న విమర్శల్లో ఆ మార్పును చూడవచ్చు. కానీ అవి పార్టీ విధానంగా ప్రకటించాలి. అదే విధంగా గతంలో తాము అనుసరించిన ఆర్థిక, రాజకీయ విధానాల పైన ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అంబానీలను ఆకాశానికెత్తిన విషయాన్ని గుర్తు చేసుకొని సవరించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అదే విషయంపై కొన్ని విషయాల్లో వ్యతిరేకించిన జైపాల్‌రెడ్డి లాంటి నాయ కులు పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే సంవత్సరంలో రాజీవ్ గాంధీ లాంటి నాయకులు అనుసరించిన హిందూత్వ అనుకూల విధానాలను సమీక్షించుకోవాలి. అయితే బీజేపీని కేవలం అధికారం కోసం మాత్రమే వ్యతిరేకించాలనే భావన ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఆశించలేం. దేశంలో నెల కొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రక టించాలి. కేవలం ఎన్నికల సమయంలో, లేదా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని, ఆ తర్వాత దాని ఊసుఎత్తక పోతే, కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి గెలుపులు కష్టమనే చెప్పాలి.అందుకే ఇకనైనా కాంగ్రెస్ చేసిన తప్పులకు లెంపలేసుకొని, సరికొత్త ప్రజా మార్గాన్ని ఎంచుకోక తప్పదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
పిల్లలకు ఏమివ్వాలో తల్లికి తెలుసు: డీకే.శివకుమార్
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిది. పిల్లలకు ఏమి ఇవ్వాలనేది తల్లికి తెలుసని కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ అన్నారు. నూతన సీఎం ఎంపికపై చర్చించేందుకు హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన బెంగళూరులోని సదాశివనగర తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... తాను తన దేవుడిని కలిసేందుకు దేవాలయానికి వెళ్తున్నానని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తనను ఒక్కడినే ఢిల్లీకి రావాలని తెలిపారని, తన ఆరోగ్యం కుదుటపడిందని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధించామని, వారు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామన్నారు. హైకమాండ్‌ను ముఖ్యమంత్రి స్థానం కోరుతారా అన్న ప్రశ్నకు తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించాను. 135 స్థానాలను గెలిపించి ఇచ్చాను అంతే అని ఆయన సమాధానమిచ్చారు. తాను వెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయనని డీకేశి అన్నారు. తమది ఐకమత్యం కలిగిన ఇల్లు అని, తమ సంఖ్య 135 ఏ ఒక్కరిని విడగొట్టే పని చేయనని చెప్పారు. -
మునియప్పను సీఎంని చేయాలని ధర్నా
కోలారు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుడికి అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా అపార అనుభవం కలిగిన కెహెచ్ మునియప్పను ఈసారి ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం నగరంలోని మెక్కె సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఊరుబాగిలు శ్రీనివాస్, నాయకులు జయదేవ్, ఉదయకుమార్, మల్లప్ప పాల్గొన్నారు. -
8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేయాలి
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో రెడ్డి సముదాయానికి చెందిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఏర్పాటులో ప్రాధాన్యత కల్పించాలని రెడ్డి సముదాయ గురువు శ్రీ వేమనానంద స్వామీజీ అన్నారు. మంగళవారం నగరంలోని కోరమంగలలో ఉన్న మహా యోగి వేమన విద్యా సంస్థల ఆవరణంలో కర్ణాటక రెడ్డి సముదాయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ... బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలో సుమారు 12 మందికిపైగా రెడ్డి సముదాయానికి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు ఎన్నికయ్యారని, వారికి ప్రభుత్వ ఏర్పాటులో ప్రాధాన్యత ఇవ్వాలని స్వామీజీ అన్నారు. గతంలో మాజీ సీఎం యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సముదాయానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చారని, బసవరాజ బొమ్మై హయాంలో రెడ్లకు అవకాశం కల్పించలేని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్డి జనసంఘం అధ్యక్షుడు జయరామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, కార్యదర్శి సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి, కోశాధికారి చంద్రారెడ్డితో పాటు పలువురు రెడ్డి సముదాయం సభ్యులు పాల్గొన్నారు. -
లక్ అంటే బీజేపీ అభ్యర్థి రామ్మూర్తిదే..! 16 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపు..
ఎన్నికల్లో ఓట్లే ప్రధానం. ఒక్క ఓటు విజయాన్ని నిర్ణయిస్తుంది. రెండు ఓట్ల మెజారిటీ వచ్చినా, రెండు లక్షలు వచ్చినా విజేతలందరూ వెళ్లేది అసెంబ్లీకే. కానీ మెజారిటీ అనేది నియోజకవర్గంలో ఆ నాయకునికి ఉన్న పట్టుకు పలుకుబడికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో కొందరు భారీ మెజారిటీతో గెలిస్తే, కొందరు మాత్రం ఏదో గెలిచామన్నట్లు ఎన్నికయ్యారు. బనశంకరి: ఈ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో జెండా ఎగరేయగా, బీజేపీ ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో 10 మంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాగా, 8 మంది బొటాబొటీ ఆధిక్యంతో గెలిచినట్లయింది. మెజారిటీ వీరులు వీరే ► కనకపుర నియోజకవర్గంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే అత్యధికం. ► చిక్కోడి సదలగా క్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 77,749 ఓట్ల మెజారిటీతో విజయం. ► అథణిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ సవది 75,673 ఓట్లతో గెలుపు. ► బెంగళూరు పులకేశినగరలో కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ శ్రీనివాస్‌కు 62,062 ఓట్ల మెజారిటీ ► కొళ్లేగాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తికి 59,519 ఓట్ల ఆధిక్యం. యమకనమరడిలో కాంగ్రేస్ అభ్యర్థి సతీశ్ జార్కిహొళికి 57,046 ఓట్లు, బెంగళూరు సర్వజ్ఞనగరలో కాంగ్రెస్ అభ్యర్థి కేజే.జార్జ్ 55,768 మెజారిటీ దక్కింది. ► బెళగావి రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కి 55,546 ఓట్ల మెజారిటీ. బెంగళూరులో పద్మనాభనగరలో బీజేపీ అభ్యర్థి ఆర్.అశోక్ 55175 ఓట్ల మెజారిటీ. బసవనగుడిలో బీజేపీ అభ్యర్థి రవి సుబ్రమణ్యకు 54978 ఓట్ల ఆధిక్యం. అత్యల్ప ఆధిక్యంతో ఎన్నిక ≈ బెంగళూరు జయనగర నుంచి బీజేపీ అభ్యర్థి సీకే.రామ్మూర్తి 16 ఓట్ల అత్యంత స్వల్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. అలాగే గాంధీనగరలో కాంగ్రెస్ అభ్యర్థి దినేశ్ గుండూరావ్‌కు వచ్చిన మెజారిటీ 105 ఓట్లు ≈ శృంగేరిలో కాంగ్రెస్ అభ్యర్థి టీడీ రాజేగౌడ ఆధిక్యం 201 ఓట్లు ≈ మాలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేవై నంజేగౌడ ఆధిక్యం 218 ఓట్లు ≈ కుమటాలో బీజేపీ అభ్యర్థి దినకరశెట్టి ఆధిక్యం 673 ఓట్లు ≈ మూడిగెరెలో కాంగ్రెస్ అభ్యర్థిని నయన మోటమ్మ 772 ఓట్ల మెజారిటీతో గెలుపు ≈ చించోళిలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ జాదవ్ మెజారిటీ 858 ఓట్లు కాగా, జగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్రప్ప 874 ఓట్లతో గెలిచారు. -
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు
గౌరిబిదనూరు: నియోజక వర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన కెహెచ్ పుట్టస్వామిగౌడ తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సౌలభ్యాలు అందేలా చూస్తానని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజలను అనవసరంగా తిప్పుకోకూడదని, ఈ విషయంపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. నియోజక వర్గంలో పరిశ్రమలు, విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తానన్నారు. తాలూకాలో అవినీతి పెచ్చు పెరిగింది, దానిని నియంత్రించడానికి కఠిన చర్యలు చేబడతానన్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతిరెడ్డి మాట్లాడుతూ... నియోజక వర్గంలో రెండు దశాబ్దాలుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ అధ్యక్షుడు హోసూరు మంజునాథ్, జీకే సతీశ్, కాంతరాజు, రాఘవేంద్ర హనుమాన్, లక్ష్మణరావ్, అనంతరాజు, శ్రీనివాసగౌడ, నాగార్జున, ఢిల్లీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ఖరారు కాని కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి
ఇంకా ఖరారు కాని కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి -
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఢిల్లీలో ఈటల!
కర్ణాటక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. దక్షిణాదిపై పట్టు కోసం కాషాయ పార్టీ గత కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటకలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడంతో పాటు తెలంగాణపై పట్టు కోసం ప్రణాళికలు రచించింది. కర్ణాటక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే.. తెలంగాణలో మారుతున్న రాజకీయ వాతావరణం తమకు మరింత కలిసొస్తుందని కేంద్రం భావించింది. అయితే, అనూహ్యంగా కర్ణాటక చేజారడంతో కమలనాథులు ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. ఫోకస్ అక్కడే.. బీజేపీ హైకమాండ్ దక్షిణాదిలో తెలంగాణను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే ప్రస్తుత ఫోకస్ తెలంగాణపై పెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆపరేషన్ ఆకర్ష్‌పై నేరుగా రంగంలోకి దిగింది. ఇదిలా ఉండగా హస్తినలో ఈటెల రాజేందర్ తిష్ట వేయగా, అగ్రనాయకులను నేరుగా పొంగులేటితో మాట్లాడించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పార్టీలో కీలకమార్పులు ఉంటాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కర్ణాటక ఫలితాల దెబ్బతో తెలంగాణ బీజేపీలో సమీకరణాలు మారునున్నాయని తెలుస్తోంది. ఇకపై ఆ తప్పులు చేయకూడదు కర్ణాటక ఎన్నికల ఓటమి నుంచి బీజేపీ పెద్దలు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. తమ లోపాల గురించి ఆలోచించడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీ వ్యూహాన్ని పునరాలోచిస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్థులను, ప్రాంతీయ నాయకత్వాన్ని నిర్ణయించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆచితూచి వ్యవహరించాలని అగ్ర నాయకత్వం నిర్ణయించుకుంది. కర్ణాటకలో బీఎస్ యడియూరప్పను తొలగించడం, లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సదవి వంటి సీనియర్ నాయకులకు టిక్కెట్లు నిరాకరించడం వల్ల అక్కడ భారీగా నష్టపోయిందని పార్టీ గ్రహించింది. అందుకే ఈ సారి అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కూడా బీజేపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మహారాష్ట్ర సర్కార్‌కు ముప్పు లేదు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు -
స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ.. ఒకప్పుడు 41 మంది, ఇప్పుడు నలుగురే
రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, మందీ మార్బలం, ప్రచారార్భాటంతో ఎన్నికల్లో హల్చల్ చేస్తారు. ఇవేమీ లేని అభ్యుదయవాదులు, ఔత్సాహికులు కూడా ఏ పార్టీ గుర్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ గెలిచేది మాత్రం తక్కువమంది. ఒకప్పుడు 40 మందికిపైగా ఉన్న స్వతంత్ర శాసనసభ్యులు ఇప్పుడు నలుగురికి మించడం లేదు. పెద్ద పారీ్టల ధాటికి స్వతంత్రులు నిలవడం లేదు. కర్ణాటక: కన్నడనాట ప్రతి ఎన్నికల సమయంలో సత్తా చాటుతున్న స్వతంత్ర అభ్యర్థులు ఈసారి నామమాత్రమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ప్రతిసారి నంబర్ గేమ్‌కు అవసరమయ్యేది స్వతంత్రులే. కానీ 16 వ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో స్వతంత్ర ఎమ్మెల్యేల అవసరం లేకుండా పోయింది. 2018లో ఒక్కరు ► 1985 నుంచి ఇప్పటివరకు వేలాది మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీచేశారు. కానీ గెలుపొందిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ► 2018 ఎన్నికల్లో 1,142 మంది స్వతంత్రులు పోటీచేయగా 3.96 శాతం ఓట్లు పొందారు, గెలిచింది మాత్రం ఒక్కరే. ► తాజా ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులు, చిన్నపార్టీల నుంచి 693 మంది అభ్యర్థులతో కలిపి 1,611 మంది బరిలో నిలిచారు, గెలిచింది నలుగురు మాత్రమే. 1967లో 41 మంది విజయం ► 1957 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 251 మంది స్వతంత్రులు పోటీచేయగా వారిలో 35 మంది గెలుపొందారు. ► 1962 లో 179 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేసి 27 మంది గెలిచారు. ► 1967 లో 331 మంది స్వతంత్రులు పోటీచేయగా ఏకంగా 41 మంది విజయకేతనం ఎగురవేశారు. ఇది ఇప్పటివరకు చారిత్రక రికార్డు. ఆ తరువాత నుంచి స్వతంత్రుల హవాకు బ్రేక్ పడింది. ప్రతిసారీ 25 లక్షల దాకా ఓట్లు ► 1978లో అతి తక్కువ అంటే 9,40,677 ఓటర్లు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులకు ఓటేశారు. ► 1967లో 21,29,786 ఓట్లు, 1999లో 26,66,444 ఓట్లు, 2013లో 23,13,386 ఓట్లు స్వతంత్రులకు వచ్చాయి. ► ఇప్పటి ఎన్నికల్లో 22,54,882 (5.81) ఓట్లు స్వతంత్రులకు పడ్డాయి. -
బీజేపీ ర్యాలీల్లో జన ప్రభంజనం.. ఎన్నికల్లో మాత్రం పరాజయం
బనశంకరి: శాసనసభ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో హైకమాండ్ ప్రక్షాళన చేసే అవకాశముంది. బీజేపీ రాష్ట్రాద్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌ను సాగనంపవచ్చు. 135 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీని శాసనసభలో ఎదుర్కోవడానికి బలమైన నేతను బీజేపీఎల్పీ నాయకునిగా ఎంపిక చేయనుంది. గెలుపు తప్పిపోయి బోర్లా రాష్ట్రంలో 224 నియోజకవర్గాల్లో సగానికిపైగా గెలిచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని కాషాయ పెద్దలు ఘంటాపథంగా చెప్పారు. కానీ 66 సీట్లకు పరిమితమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే బీజేపీలోకి కొత్త రక్తం ఎక్కించాలని భావిస్తోంది. అంతేగాక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ మీద కూడా నాయకత్వం సంతృప్తిగా లేదు. ఢిల్లీ నేతలు ఆయనను మార్చాలని నిర్ణయించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. నిజానికి ఆయన పదవీకాలం 2022 తోనే ముగిసింది. కానీ శాసనసభ ఎన్నికలు ఉన్నాయనే కారణంతో కొనసాగించారు. బొమ్మైకి ఒక పదవి? బసవరాజ బొమ్మైకి పార్టీ అధ్యక్ష పదవి, లేదా బీజేపీ పక్ష నేత పదవిలో ఏదైనా ఒకటి దక్కవచ్చనే ప్రచారముంది. అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వంపై పోరాడే బలమైన నేత అవసరం బీజేపీకి ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. కనీసం 20 సీట్లలో గెలవాలని కాషాయం పట్టుదలతో ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్లేషణ చేయాలని నిర్ణయించినట్లు బొమ్మై సహా సీనియర్లు చెప్పారు. ఓటమిని సవాల్‌గా స్వీకరించి సమస్యలను పరిష్కరించుకుంటామని పార్టీ నేత ఒకరు తెలిపారు. శాసనసభ ఎన్నికల ఓటమిని నరేంద్రమోదీ ఓటమిగా భావించరాదని, మోదీ దేశానికి చెందిన నేత, కర్ణాటక ప్రచారం కోసం వచ్చారని బసవరాజ బొమ్మై అన్నారు. -
డీకే శివకుమార్‌ను సీఎం చేయాలి
కృష్ణరాజపురం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను ఎంపిక చేయాలని ఒక్కలిగ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని కేఆర్‌పురం ఉత్తర విభాగం తాలూకాలో జరిగిన కార్యక్రమంలో జై భువనేశ్వరి ఒక్కలిగ సంఘం సభ్యులు మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడానికి సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా కృషి చేశారని, కేపీసీసీ చీఫ్‌గా కూడా ఆయన పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారని, శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. ఓటమిపై జేడీఎస్ సమాలోచన యశవంతపుర: రాష్ట్ర విధానసభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన జేడీఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. ఓడిన అభ్యర్థులతో పార్టీ సీనియర్ నాయకులు చర్చించి ధైర్యం నింపారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ ఫోన్ ద్వారా చర్చించారు. మాజీ సీఎం కుమారస్వామి గెలిచిన, ఓడిన అభ్యర్థులతో చర్చించి విశ్వాసం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఓడిన అభ్యర్థులకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
సీఎం కుర్చీ.. తేలని పంచాయితీ
శివాజీనగర: నూతన ముఖ్యమంత్రి ఎంపిక బంతి ప్రస్తుతం హైకమాండ్ ఆవరణలో ఉండటంతో ఎవరిని కరుణిస్తుందోనన్న కుతూహలం ఏర్పడింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు సూచించారు. సిద్దరామయ్య మధ్యాహ్నమే వెళ్లిపోగా, డీకే శివకుమార్ పుట్టిన రోజు కార్యక్రమాలు, అనారోగ్యం వల్ల హస్తినకు వెళ్లలేదు. సీఎం ఎవరనేది హైకమాండ్ సోమవారం గాని మంగళవారం గానీ ప్రకటించనుంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చర్చించి ఖరారు చేస్తారు. బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు ఆదివారం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పార్టీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు బ్యాలెట్ ద్వారా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనేది ముఖ్యమైన సంగతి కానుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం, పరిశీలకుల నివేదిక, సిద్దు, డీకేలతో చర్చించి కాబోయే ముఖ్యమంత్రిని ఫైనల్ చేస్తారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇంటికి తరలి సమాలోచనలు జరిపారు. ఇద్దరి ఇళ్లకు ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం నుండే నిరంతరం భేటీ చేస్తుండగా, వారి ఇళ్ల వద్ద జాతర సందోహం నెలకొంది. -
సీఎం ఎంపికకు మఠాధిపతుల లాబీ ?
శివాజీనగర: ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మఠాధిపతుల జోక్యం పెరుగుతోంది. పలువురు మఠాధిపతులు తమ సముదాయం నాయకులకు అధికారం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. మఠాధిపతుల రాజకీయ జోక్యంపై కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. ఇదిలా ఉంటే ఆయా సముదాయానికి చెందిన మఠాధిపతులు బహిరంగ ప్రకటనలు చేసి గందరగోళం సృష్టిస్తుండటంపై అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నికై న ఎమ్మెల్యేల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వినపడుతోంది. అయితే ప్రారంభంలోనే కుల రాజకీయాలు తగదనే వాదన వినిపిస్తోంది. -
మంత్రి పదవి దక్కేదెవరికో?
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వంలో ఎవరికి మంత్రిగిరి దక్కనుందోననే ఊహగానాలు జోరందుకున్నాయి. 7 క్షేత్రాల్లో 4 స్థానాలు సాధించిన హుబ్లీ ధార్వాడ తూర్పు, ధార్వాడ గ్రామీణ, కలఘటిగి, నవలగుంద క్షేత్రాల్లో కాంగ్రెస్ జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో సంతోష్‌లాడ్ 2008, 2013, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వినయ్ కులకర్ణి 2004, 2013, 2023ల్లో జయభేరి మోగించారు. ఇక హుబ్లీ ధార్వాడ తూర్పు నియోజకవర్గంలో ఎస్టీ రిజర్వ్డు అభ్యర్థి ప్రసాద్ అబ్బయ్య ఏకంగా హ్యాట్రిక్ సాధించారు. వీరిలో సంతోష్‌లాడ్, వినయ్ కులకర్ణి 2013లో సిద్దరామయ్య సర్కారులో కేబినెట్ మంత్రులుగా పని చేశారు. ఆ సమయంలో ప్రసాద్ అబ్బయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిగిరి దక్కలేదు. దీంతో అప్పట్లో ఆయన తీవ్ర అసంతృప్తి చెందగా చివరికి కొద్ది కాలం పాటు జగ్జీవన్‌రామ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షగిరితో సరిపెట్టారు. ఇక నవలగుంద నుంచి సీనియర్ నేత ఎన్‌హెచ్ కోనరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరి ఘనవిజయం సాధించారు. అందువల్ల ఈ నలుగురిలో ఎవరికి మంత్రిగిరి దక్కనుందో వేచి చూడాల్సిందే. -
కర్ణాటక ఎఫెక్ట్.. కాంగ్రెస్‌తోనే ఫైట్! మారిన బీఆర్ఎస్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీని అనూహ్యంగా మట్టికరిపించడంతో ఇక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో మతతత్వ రాజకీయాలు పనిచేయవనే నమ్మకంతో ఉంది. దీంతో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక భేటీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మే 17న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లెజిస్లేటరీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త భేటీ కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేలా.. జాతీయ, రాష్ట్ర రాజకీయాల స్థితిగతులను చర్చించడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే దిశగా ఈ సమావేశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశాన్ని సీఎం ఈ భేటీలో వివరించనున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించిన తీరుపైనా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్నీ వెల్లడించనున్నారు. ఎన్నికల సమయానికి ప్రత్యర్థి పార్టీలను దిమ్మదిరిగేలా చేయడానికి పలు పథకాలను తమ వద్ద ఉన్నాయని సీఎం స్వయంగా ఒక సందర్భంలో ప్రకటించారు. సమావేశంలో ఎన్నికలను ఎదుర్కొనడానికి ఎలా సంసిద్ధం కావాలన్న అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు పార్టీ వర్గాల కథనం. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడి నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు నెలలపాటు పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముంది. రాష్ట్ర రాజకీయాలపై వివిధ సర్వే సంస్థలతోపాటు ప్రభుత్వ నిఘా విభాగాల నివేదికలు కూడా అందిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. వరుస కార్యక్రమాలతో బిజీబిజీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన అన్ని స్థాయిలకు చెందిన నేతలు చురుగ్గా పనిచేసేలా కేసీఆర్ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే రెండు నెలలుగా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు ఈ నెలాఖరులోగా మిగతా సమ్మేళనాలను కూడా పూర్తి చేయాలని ఇదివరకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. జూన్ 1న అమరుల స్మారకం ఆవిష్కరణ, జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’ వైభవంగా నిర్వహించేలా ఇప్పటికే కేసీఆర్ షెడ్యూల్‌ను ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనాల తరహాలో నియోజకవర్గ స్థాయిలో యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బుధవారం జరిగే భేటీలో యువజన, విద్యార్థి సమ్మేళనాల నిర్వహణకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశముంది. వీటితోపాటు క్షేత్రస్థాయిలో వివిధ వర్గాలతో మమేకమయ్యేందుకు కేసీఆర్ వినూత్న కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగి, అక్టోబర్ 10న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల సమర శంఖారావం పూరించేలా కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మళ్లీ బిల్లులు? ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో వైద్య విద్య సంచాలకులు, అదనపు సంచాలకులు, బోధనాసుపత్రుల ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్/డైరెక్టర్ బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో మరోమారు పంపేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లులపై మరింత సమాచారం కావాలంటూ గవర్నర్ ప్రభుత్వానికి తిప్పిపంపిన సంగతి తెలిసిందే. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు, అటవీ విశ్వవిద్యాలయం బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. బుధవారం జరిగే భేటీలో వీటిని కూడా కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఉన్న ఫారూక్ హుస్సేన్, డి.రాజేశ్వర్‌రావు ఈ నెల 27న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు. వీరి స్థానంలో కొత్తగా మండలికి ఎవరిని పంపాలనే అంశంపై గతంలోనే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సిఫారసు చేసేందుకు ఈ వారాంతంలో కేబినెట్ భేటీ కూడా జరిగే అవకాశముందని పార్టీ చెప్పాయి. -
Karnataka CM Post: డీకే విషయంలో కాంగ్రెస్ తటపటాయింపు!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పంచాయితీ ఎటు తేలడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ అందుకున్న హస్తం పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం కష్టతరంగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కేసుల గండం చుట్టుముడుతోంది. డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసులు.. కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. డీకేను సీఎంగా నియమిస్తే సీబీఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్న ఆలోచనలో పడింది హైకమాండ్. దీనికి తోడు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ బాస్‌గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కాగా 2020-23 మధ్య ఆయనపై 13 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ శివకుమార్ పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013-18లో మంత్రిగా డీకే అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 30న డీకే అక్రమాస్తుల కేసు విచారణ కూడా ఉంది. అంతేగాక అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఓసారి అరెస్టై విడుదలయ్యారు శివకుమార్. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగే సూర్జేవాలాతో డీకే సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు సుర్జేవాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘కాంగ్రెస్ కోసం నేను ఎంతో పనిచేశాను. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేదంటే అసుల కేబినెట్లో స్థానం కూడా వద్దు’ సూర్జేవాలాకు డీకే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సిద్ధరామయ్య కాగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ బృందం సమావేశం కానుంది. కేబీనెట్ కూర్పుపై కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేళ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిని సిద్దరామయ్యా అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం నో చెప్పినట్టు సమాచారం. ఇక నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగనుంది. ఇదీ చదవండి: మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు -
కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక సీఎం ఎవర్నరది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశానని తెలిపారు. తాను చేయాల్సినదంతా చేశానని పేర్కొన్నారు. ఈరోజు(మే 15) తన పుట్టినరోజు అని, అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్నారు. నేడు ఢిల్లీ పర్యటన విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్తానో లేదో తెలీదని చెప్పారు. సోనియా గాంధీ తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తుందో లేదో తెలియదని శివకుమార్ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ విధేయుడనని తెలిపారు. తనపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి ఇరికించినప్పుడు సోనియా నాతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తన మీద నమ్మకంతో సోనియా గాంధీ పీసీసీ చీఫ్ చేశారని అన్నారు. జనం తనను నమ్మి 130 సీట్లు ఇచ్చారని, ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుంది? అని పేర్కొన్నారు. చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. కాగా 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు ఏఐసీసీ పరిశీలకులు. బెంగుళూరు నుంచి ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ అధ్యక్షుడికి సుశీల్ కుమార్ షిండే బృందం తెలియజేయనుంది. రాహుల్, సోనియా గాంధీలను సంప్రదించిన తర్వాత హై కమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు హై కమాండ్ సీఎం సీటు షేరింగ్ ఫార్ములా సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ 135 స్థానాలను గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా సీఎం విషయంపై సస్పెన్స్నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరూ సీఎం అవుతారనే విషయం కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. చదవండి: 16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి -
కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్..
ప్రజాస్వామ్యం గొప్పదనం ఇదే. తమకు నచ్చని ప్రభుత్వాన్ని తీసివేయడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. దేశ ప్రధాని స్వయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రోజుల తరబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, మతపరమైన సెంటిమెంట్‌ను రాజకీయంగా వాడుకోవడానికి యత్నించినా ప్రజలు మద్దతు ఇవ్వకపోవడం కూడా విశేషమే. కర్నాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఆ పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లయింది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో ఓటమి చెందడమే కాకుండా డిపాజిట్లు సైతం కోల్పోయింది. అనూహ్యంగా బిజెపి పుంజుకుని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచింది.గెలిచిన ఇద్దరూ ఒరిజినల్ గా బిజెపివారేమీకాదు. వారి వ్యక్తిగత పలుకుబడే వారి గెలుపులో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పాలి. అయినా బిజెపిలో ఉత్సాహం ఉరకలేసింది. ఆ ఊపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి తీసుకువచ్చి రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీచేయించినా, అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓడించింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితమై డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. దాంతో కాంగ్రెస్ పని అయిపోయిందన్న భావన ఏర్పడింది. పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పార్టీని నడుతుండడం పార్టీ సీనియర్ లకు అసంతృప్తిగా మారింది. ఉప ఎన్నికలలో ఓడిపోవడం ఆయనకు మైనస్ అయింది. కాని రేవంత్ పట్టువీడకుండా రకరకాల కార్యక్రమాలు,పాదయాత్రలు చేపట్టారు. శాసనసభ పక్ష నేత మల్లు భట్టి కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయినా కాంగ్రెస్ ఎంతవరకు పుంజుకుంటుందన్న భావన ఏర్పడింది. అలాంటి తరుణంలో కాంగ్రెస్ కు ప్రియాంక గాంధీ సభ కాస్త ఆశ కల్పించింది. తదుపరి కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కూడా తాము పుంజుకోగలుగుతామని కాంగ్రెస్ నేతలకు ఒక విశ్వాసం కలిగింది. అది అంత తేలికకాదని అందరికి తెలుసు. దానికి ముందుగా తెలంగాణలోని నియోజకవర్గాలలో తన క్యాడర్ ను యాక్టివ్ చేసుకోవలసి ఉంది. తన పార్టీ స్థానిక నేతలు బిజెపి లేదా బిఆర్ఎస్ పార్టీలలోకి వెళ్లకుండా చూసుకోవాలి.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పజాలం కాని, కర్నాటక ఎన్నికల ఫలితాలతో మళ్లీ రేసులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇంతవరకు బిజెపినే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందా అన్న చర్చ నుంచి కాంగ్రెస్ కూడా రంగంలో ఉందన్న అబిప్రాయం కలుగుతుంది.ఇంతవరకు వామపక్షాలు బిఆర్ఎస్ వైపే చూస్తుండగా, ఇప్పుడు తమకు మరో ఆప్షన్ కాంగ్రెస్ ఉందని చెబుతున్నారు. అధికార బిఆర్ఎస్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఎలాంటి సంకేతం ఇచ్చాయన్నది పరిశీలించాలి. జాతీయ పార్టీ పెట్టామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలో మార్కెట్ కమిటీ ఎన్నికలలో పోటీచేసి, కర్నాటక శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జెడిఎస్ పార్టీ తో స్నేహం ఉన్నందున పోటీకి దిగలేదని అంటున్నా, కర్నాటకలో పోటీచేసినా ప్రయోజనం లేదనుకునే కామ్ అయిపోయి ఉండవచ్చు. బీఆర్ఎస్ కు కొన్ని సీట్లు కేటాయించడానికి జెడిఎస్ ముందుకు రాలేదు. మరో వైపు జెడిఎస్ కు కెసిఆర్ ఆర్దిక వనరులు సమకూర్చారని బిజెపి ఆరోపిస్తున్నా,వాస్తవానికి తమకు తగు మేర సాయం చేయలేదని జెడిఎస్ నేత కుమారస్వామి వాపోతున్నారని చెబుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల ఆ పార్టీకి జోష్ రావడం బిఆర్ఎస్ కు అంత మంచి విషయమేమి కాదు. కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ కాడర్ యాక్టివ్ అయితే తమకు పోటీ అవుతుందని తెలుసు. అదే బిజెపి గెలిస్తే ఆ పార్టీ జోరు పెంచినా , తమకు పెద్ద నష్టం ఉండదని బిఆర్ఎస్ భావిస్తుండవచ్చు. కాంగ్రెస్‌కు పోటీగా బిజెపి ఎదిగితే, రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక ఏర్పడి తమకు ఇబ్బంది లేకుండా విజయం వరిస్తుందన్న అంచనా బిఆర్ఎస్ లో ఉంది. . బిజెపి గెలిచి ఉంటే ఆయా నియోజకవర్గాలలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడంలో బిజీ అయ్యేది. కాని కర్నాటక ఓటమితో ఆ పార్టీలో చేరడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు అంతగా సుముఖత చూపకపోవచ్చు. హిందూ వ్యతిరేక శక్తులన్నీ కలిసి బిజెపిని కర్నాటకలో ఓడించాయని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనడాన్ని బట్టి , తెలంగాణ ఎన్నికలలో మతపరమైన అంశాలనే తమ రాజకీయానికి వాడుకుంటామని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. దానికి తోడు హిందూ ఏక్తా యాత్ర కూడా చేపట్టారు. హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలలో మతం ఆదారంగా ఓట్లు వేసే పరిస్థితి పరిమితమేనని చెప్పాలి. ఆ విషయం గమనించకుండా కర్నాటకలో మాదిరి ముస్లిం రిజర్వేషన్ ల తొలగింపు, తదితర మతాంశాలపై బిజెపి ఆధారపడితే ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటే, బిజెపి నేతలు నిరాశకు గురయ్యారు. పైకి ఏవో ప్రకటనలు చేసినా వారిలో గుబులు పట్టుకుని ఉంటుంది. ఇక బిఆర్ఎస్ వారు ఈ ఎన్నికల ఫలితాలపై పెద్దగా స్పందించలేదు. తెలంగాణలో ప్రభావం ఉండదని మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటిఆర్ అన్నారు. చదవండి: ఆ ఐదు శాతమే! రాత మార్చింది ఓడిపోయిన బీజేపీపై బిఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యానించారు తప్ప, గెలిచిన కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎలాంటి మాట మాట్లాడలేదు. కర్నాటకలో హంగ్ వచ్చినట్లయితే , మళ్లీ జెడిఎస్ గేమ్ ఆడి ఉండేది. ఆ గేమ్ లో బిఆర్ఎస్ కూడా ఒక పాత్ర పోషించేది. ఎవరికి మెజార్టీ రాక, ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహించవలసి వస్తే హైదరాబాద్ లో సదుపాయం కల్పించి ఉండేది. కాని ఆ అవసరం లేకుండా పోయింది. జెడిఎస్ బాగా దెబ్బతినడంతో కర్నాటకలో బీఆర్ఎస్కు రోల్ లేకుండా పోయింది. ఈ విషయంలో బిఆర్ఎస్ అంచనాలు సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఏది ఏమైనా బీజేపపీ గెలిచి ఉంటే తెలంగాణలో బిఆర్ఎస్కు ఒకరకమైన సమస్య ఎదురయ్యేది. అది తన పార్టీ నేతలు ఎవరూ అటువైపు వెళ్లకుండా చూసుకోవలసి వచ్చేది. అంతకు మించి పెద్ద ప్రమాదం ఉండకపోయి ఉండవచ్చు. అదే కాంగ్రెస్ గెలవడం వల్ల ఆ పార్టీ యాక్టివ్ అయితే కార్యకర్తలు జోష్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎంతకాదన్నా తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్‌కు అత్యధిక నియోజకవర్గాలలో గట్టి కాడరే ఉందని అంటారు. బిజెపి వెనుకంజ వేసి , కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. కాంగ్రెస్, బిజెపిలు లేని రాజకీయ కూటమి కి నాయకత్వం వహించాలని కెసిఆర్ ఉవ్విళ్ళూరుతున్నా, ఈ ఫలితాలతో కాంగ్రెస్ ప్రాదాన్యత మళ్లీ పెరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి కాకపోతే కేసీఆర్ రాజకీయం మరో రకంగా ఉండేది. ఈ పరిస్థితులలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం పెరగకుండా కేసీఆర్ వ్యూహాలు తయారు చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రత్యేకించి గ్రామాలలో ఇప్పటికైతే అంత అనుకూల వాతావరణం బీఆర్ఎస్కు లేదన్న అభిప్రాయం ఉంది. చదవండి: పవన్ లొంగిపోయింది ఇందుకేనా?.. అర్థం అదేనా?.. పాపం వారి పరిస్థితేంటో! దానిని కాంగ్రెస్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందన్నది చర్చనీయాంశమే అయినా కర్నాటక ఫలితాలతో వారిలో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ జోరుకు ఈ ఫలితాలతో కొంత బ్రేక్ పడే అవకాశం ఉండగా, కాంగ్రెస్ మాత్రం స్పీడ్ పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ రెండు పార్టీలు సమంగా ఉంటే తన పని సులువు అవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంటుంది. తెలంగాణ బీజేపీకి ఇది చేదు సంకేతాన్ని ఇస్తే, బీఆర్ఎస్కు ఏమి అర్దం కాని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌కు మాత్రం తీపి కబురే అయినా, దానిని తెలంగాణలో ఎలా ఫలప్రదం చేసుకోవాలో అన్నదానిపై మల్లగుల్లాలు పడే దశలోనే ఈ పార్టీ ఉందని చెప్పాలి.! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
Karnataka: తనయుని కోసం త్యాగం
దొడ్డబళ్లాపురం: మాజీ ప్రధాని మనవనిగా, మాజీ సీఎం కుమారునిగా, సినీ హీరోగా ఉన్న నిఖిల్ కుమారస్వామి వరుసగా అపజయాలు చవిచూస్తున్నాడు. గత ఎంపీ ఎన్నికల్లో మండ్య నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి నిలబడి మరోసారి మట్టి కరిచాడు. దీంతో దేవెగౌడ కుటుంబం మూడోతరం రాజకీయ అరంగేట్రానికి కాలం కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది. తనయుని కోసం త్యాగం తాత, తండ్రి, తల్లిని గెలిపించిన రామనగర ప్రజలు నిఖిల్‌ను అసెంబ్లీకి పంపించలేకపోయారు. తల్లి అనిత కుమారస్వామి తన నియోజకవర్గాన్ని కుమారుని కోసం త్యాగం చేస్తున్నానని బహిరంగంగా ప్రకటించి అతన్ని గెలిపించాలని కోరినా ఓటర్లు పట్టించుకోలేదు. 10,715ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ గెలవడంతో జేడీఎస్ పెద్దలు నిశ్చేషు్టలయ్యారు. ఇక్కడ సునాయాస విజయం సాధ్యమని వారు అనుకున్నారు. రామనగరను పట్టించుకోలేదనా? నిఖిల్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామనగర తాలూకాను ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇక్కడి నుంచి దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరు గెలిచినా, ప్రజల చేతికి అందరని, సమస్యలు చెప్పుకోవాలంటే స్థానిక జేడీఎస్ నేతల కాళ్లు పట్టుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. స్థానిక జేడీఎస్ నేతలను గుర్తించకపోవడం, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజల్లో నిరసన భావం ఏర్పడింది. కోవిడ్ సమయంలో అనితాకుమారస్వామి నియోజకవర్గంలో పర్యటించింది లేదు. టీపీ, జీపీ, జడ్పీ తదితర ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పోటీచేస్తే కనీసం వారిని పెద్దలెవరూ పట్టించుకుని సాయం చేసింది లేదని, అందుకే ఈ పరాజయం అని స్థానికులు పేర్కొన్నారు. -
16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి
30 వేలు, 40 వేల ఓట్లతో ఓడిపోవడం వేరు. రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినప్పుడు అందరితో పాటు ఓటమి పాలైతే పెద్ద బాధ ఉండదు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్రమంతా హస్తం పవనాలు వీచాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి 160 ఓట్లతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. కానీ బీజేపీ డిమాండ్‌తో పదే పదే రీకౌంటింగ్ జరిపి చివరకు 16 ఓట్లతో ప్రత్యర్తిని గెలుపు వరించింది. బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అతి స్వల్ప ఓట్లు అభ్యర్థుల రాతను తారుమారు చేశాయి. బెంగళూరు: ఐటీ సిటీలో జయనగర నియోజకవర్గంలో నాటకీయ పరిణామాల మధ్య విజేత మారిపోయారు. తొలుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో సంబరాలు మిన్నంటాయి. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్ చేయించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ ఏకధాటిగా హైడ్రామా టెన్షన్ పుట్టించింది. పోటాపోటీగా రౌండ్లు జయనగర ఎస్‌ఎస్‌ఎంఆర్‌వీ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ఆరంభమైంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్ ప్రారంభించారు. చదవండి: ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ? గెలుపు ప్రకటన జిల్లా ఎన్నికల అధికారి తుషార్ గిరినాథ్ రీకౌంటింగ్ చేసిన విధానం గురించి నేతలకు వివరించి, సీకే రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. బీజేపీకి 57,797 ఓట్లు, కాంగ్రెస్‌కు 57,781 ఓట్లు వచ్చాయని తెలిపారు. కార్యకర్తల ధర్నా దీంతో కాంగ్రెస్ నేతలు గత్యంతరం లేక ఇంటి ముఖం పట్టారు. గెలుపు దక్కి మళ్లీ ఓటమి పాలు కావడంతో సౌమ్యారెడ్డి విలపించారు. 16 ఓట్ల మెజారిటీతో సీకే రామూర్తి గెలుపు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్‌లో గోల్మాల్ జరిగిందంటూ అర్దగంటకు పైగా ధర్నాకు దిగారు. కాగా, ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సౌమ్యారెడ్డి నిర్ణయించారు. పదేపదే ఓట్ల లెక్కింపు మొదటిసారి నిర్వహించిన రీకౌంటింగ్‌ను ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకోలేదు. దీంతో వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్, ఇక బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి తనకే దక్కేలా సీఎల్పీ నేత సిద్దరామయ్య రహస్య సమావేశాలకు నాంది పలికారు. బెంగళూరులోని ఓ భవనంలో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించనున్నారని సమాచారం. ఎం.బీ.పాటిల్, జమీర్ అహమ్మద్‌ఖాన్, ఉత్తర కర్ణాటకకు ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు కొత్త సీఎంకు శుభాభినందనలు అని సిద్దు ఇంటి ముందు కొందరు అభిమానులు పోస్టర్లు కట్టారు. సిద్దును కలిసిన లత హరపనహళ్లి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన లతా మల్లికార్జున, సిద్దరామయ్యను భేటీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఫోటోను ట్వీట్ చేసిన సిద్దరామయ్య, విజయం సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపానని చెప్పారు. చదవండి: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు.. దొడ్డ కాంగ్రెస్‌లో విచారం దొడ్డ కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలముకొన్నాయి. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరమణయ్య ఓడిపోవడం ఏమిటని కార్యకర్తలు దిగులు చెందారు. గెలుపు కచ్చితమని మెజారిటీనే తేలాల్సి ఉందని, ఆయన మంత్రి కావడమే ఆలస్యమని కార్యకర్తలు, అభిమానులు ప్రచారం చేసుకుంటే తీరా ఫలితాల్లో ఓడిపోయారు. మొదటిసారి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ధీరజ్ మునిరాజు రాష్ట్రంలో ఆ పార్టీకి వ్యతిరేకత ఉన్నా 31 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ కంగుతింది. రాష్ట్రంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టబోతున్నా విజయోత్సవం చేసుకోలేని పరిస్థితిలో దొడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో నెలమంగల, దేవనహళ్లి, హొసకోట తాలూకాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికై సత్తా చాటారు. ఒక్క దొడ్డలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీ ఆఫీసు వెలవెలబోతోంది. కాంగ్రెస్ హవా ఉన్నా ఓడిపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. -
Karnataka: నేడూ సీఎల్పీ భేటీ?
బనశంకరి: ఆదివారం నాటి సీఎల్పీ సమావేశానికి చాలామంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దాంతో నూతన సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు భేటీ సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. సిద్దరామయ్యకు 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 40 మంది డీకే శివకుమార్ వెంట ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా సూత్రంపైనా ఆదివారం భేటీలో చర్చించారు. సిద్ధరామయ్య, డీకే సోమవారం ఢిల్లీ వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్ సమక్షంలో సీఎం అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. -
క్లైమాక్స్ ఏంటి?.. సీఎం ఎవరు?.. నేడు ఢిల్లీకి సిద్దూ, డీకే?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక అంత తేలికగా ముగిసేలా కనిపించడంలేదు. సీఎం అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే నూతన ఎమ్మెల్యేలు కట్టబెట్టారు. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి కారకులైన నాయకులు, కార్యకర్తలు, కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తొలుత పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అనంతరం సీఎం ఎంపిక అధికాన్ని ఖర్గేకు అప్పగిస్తూ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన ఏక వాక్య తీర్మానాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అధిష్టానం తరఫున ఖర్గే నియమించిన ముగ్గురు పరిశీలకులు సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారని చెప్పారు. ఆదివారం ఈ తతంగం పూర్తి చేసి సోమవారానికల్లా ఖర్గేకు వారు నివేదిక అందజేస్తారన్నారు. ఖర్గే నియమించిన పరిశీలకుల కమిటీలో మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి దీపక్ బబారియా ఉన్నారు. వీరు, వేణుగోపాల్ అంతకుముందు సీఎం రేసులో ఉన్న సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చదవండి: ఓవర్ టు రాజస్తాన్ కార్యకర్తల హడావుడి సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ బయట కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి కనిపించింది. సిద్దరామయ్య, శివకుమార్ వర్గీయులు బ్యానర్లు, జెండాలు చేతబూని తమ నేతే సీఎం అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు తమకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీలు జరిపారు. రెండు వర్గాలు పోటాపోటీగా పోస్టర్లు వేశాయి. ఇద్దరు నేతల నివాసాల వద్ద కూడా పోస్టర్లు కనిపించాయి. ఎన్నికలకు ముందు పార్టీ నేతలను ఒకే తాటిపైకి తేవడంలో సఫలీకృతమైన కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత అదే ఐక్యతను కొనసాగించడానికి ఇబ్బందులు పడుతోంది. కర్ణాటక అసెంబ్లీ గడువు ఈ నెల 24తో ముగియనుంది. తాజా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. -
ఆ ఐదు శాతమే! రాత మార్చింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం విలక్షణమైనదనే చెప్పాలి. రాష్ట్రంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీలవారీ ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి ట్రెండునే మార్చేసిన గెలుపది. చారిత్రకంగా బీజేపీ, జేడీ(ఎస్)ల కంచుకోటలైన కీలక ప్రాంతాల్లో ఈసారి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అది కూడా రెండు పార్టీలనూ ఒకే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బ తీయడం విశేషం. బీజేపీ ఓడినా మొత్తమ్మీద ఆ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉండటం మరో విశేషం. బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36.2 శాతం ఓట్లు రాగా ఈసారీ 36 శాతం దక్కాయి. కాకపోతే ఈసారి జేడీ(ఎస్) రాష్ట్రవ్యాప్తంగా కోల్పోయిన 7 శాతం ఓట్లలో 5 శాతం ఓట్లను బీజేపీ దక్కించుకుంది. అదే సమయంలో అంతిమ ఫలితాన్ని తేల్చడంలో కీలకంగా మారిన పలు అసెంబ్లీ స్థానాల్లో కలిపి మొత్తమ్మీద 5 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో మెజారిటీకి బీజేపీ సుదూరంలో ఆగిపోగా ఆ ఓట్ల ఊపుతో కాంగ్రెస్ గెలుపు బావుటా ఎగరేసింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ, ఈసారి 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 66 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి గట్టి పట్టున్న ముంబై కర్ణాటక, జేడీ(ఎస్) దుర్గమైన పాత మైసూరు ప్రాంతాలు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టాయి. కర్ణాటక ఫలితాల ప్రాంతాలవారీ విశ్లేషణలో ఇలాంటి పలు ఆసక్తికరమైన విశేషాలు తెరపైకి వస్తున్నాయి... కోస్తా కర్ణాటక బీజేపీ కంచుకోటల్లో ఈ ప్రాంతమూ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ బీజేపీదే పై చేయి. ఈసారి కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ రెట్టింపు సీట్లు నెగ్గిన, ఆ పార్టీకి ఊరటగా నిలిచిన ఏకైక ప్రాంతం కోస్తానే. ఇక్కడి 19 స్థానాల్లో బీజేపీ 13, కాంగ్రెస్ 6 నెగ్గాయి. అయినా 2018తో పోలిస్తే బీజేపీకి 3 సీట్లు తగ్గగా ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరిగాయి. బీజేపీకి దాదాపుగా 3 శాతం ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరగడమే ఇందుకు కారణం. బెంగళూరు సిటీ రాజధాని కావడంతో పూర్తిగా నగర ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ప్రాంతమిది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రతి ఎన్నికల్లోనూ నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. గత నాలుగు ఎన్నికల్లోనూ రెండు పార్టీలకూ దాదాపుగా చెరో 40 శాతం ఓట్లొచ్చాయి. ఈసారి కూడా బీజేపీ 46 శాతం, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు సాధించాయి. అయితే బీజేపీ 2018 కంటే 4 సీట్లు ఎక్కువగా గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలు కోల్పోయింది. ఇక జేడీ(ఎస్) ఇక్కడ 2018లో గెలిచిన 2 సీట్లనూ కోల్పోయింది. ముంబై కర్ణాటక లింగాయత్‌ల ప్రాబల్యమున్న ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. 1990లో రాజీవ్‌గాంధీ చేతిలో తమ సామాజిక వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్‌కు జరిగిన ఘోర అవమానం నేపథ్యంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను దూరం పెట్టిన లింగాయత్‌లు ఈసారి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. దాంతో దాదాపు 45 శాతం ఓట్లతో మొత్తం 50 స్థానాల్లో ఏకంగా 33 సీట్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. గత 3 దశాబ్దాల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ల శాతం 40 శాతం దాటడం ఇదే తొలిసారి! ఇక బీజేపీ ఈసారి దాదాపు 3 శాతం ఓట్లను కాంగ్రెస్‌కు కోల్పోయింది. దాంతో 2018తో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయి 16 సీట్లకు పరిమితమైంది. లింగాయత్‌ల జనాభా 20 శాతానికి పైగా ఉండి వారి ఓట్లు నిర్ణాయకంగా మారే మొత్తం 69 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీటిలో కాంగ్రెస్ ఏకంగా 45 సీట్లు కొల్లగట్టగా బీజేపీకి కేవలం 20 స్థానాలు దక్కాయి. పాత మైసూరు 64 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో అతి పెద్ద ప్రాంతమిది. జేడీ(ఎస్)కు ఆవిర్భావం నుంచీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఇక్కడ ఏకంగా 42 శాతం ఓట్లు సాధించింది. 2018 కంటే ఇది ఏకంగా 7 శాతం ఎక్కువ! దాంతో కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యధికంగా ఇక్కడ 43 సీట్లు కొల్లగొట్టింది. మరోవైపు జేడీ(ఎస్) 2018తో పోలిస్తే ఏకంగా 9 శాతం ఓట్లు కోల్పోయింది. అప్పుడు 26 సీట్లు నెగ్గగా ఈసారి 14కు పరిమితమైంది. ఇక బీజేపీకి ఓట్లు 2.8 శాతం పెరిగినా ఏకంగా 11 సీట్లు తగ్గాయి! సెంట్రల్ కర్ణాటక ఇది స్వింగ్ ప్రాంతంగా పేరుబడింది. ఒక్కోసారి ఒక్కో పార్టీని ఆదరిస్తూ వస్తోంది. 2008లో బీజేపీని, 2013లో కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకుంది. మళ్లీ 2018లో ఇక్కడి 23 సీట్లలో బీజేపీ 16 గెలవగా ఈసారి కాంగ్రెస్ 15 నెగ్గింది! హైదరాబాద్ కర్ణాటక తన కంచుకోటైన ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఈసారి స్వీప్ చేసేసింది. ఎస్సీల ఆదరణకు తోడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం కావడం ఈసారి ఆ పార్టీకి మరింత కలిసొచ్చింది. దాంతో 46 శాతం ఓట్లతో మొత్తం 40 సీట్లకు గాను ఏకంగా 26 స్థానాలను ఒడిసిపట్టింది. బీజేపీ 10 సీట్లకు పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు..
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. కాగా కర్ణాటకలో హంగ్ తప్పదనుకున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఏకంగా 136 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. 43 శాతం ఓట్ షేర్ రాబట్టింది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. ఇక జేడీఎస్ కేవలం 19 సీట్లతో కుదేలైంది. చదవండి: కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు సీఎల్పీ భేటీ బెంగుళూరులో సీఎల్పీ సమావేశమైంది. షంగ్రిల్లా హోటల్‌కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పార్టీ హైకమాండ్ దూతలను పంపింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్‌లను కర్ణాటక సీఎల్పీ సమావేశ పరిశీలకులుగా నియమించింది. సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్న షిండే బృందం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. అధిష్టానమే సీఎంను ప్రకటించాలని తీర్మానంలో నిర్ణయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా బెంగళూరులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ఇంటి ముందు ‘కర్ణాటక తదుపరి సీఎం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇటు డీకే శివకుమార్ ఇంటి ముందు ‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఆయన మద్దతుదారులు పోస్టర్లు అంటించారు. ఇరు నేతల మద్దతుదారుల తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 137కు చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ -
కర్ణాటకలో బీజేపీపై వ్యతిరేకత రావడానికి కారణం అదేనా?
కర్నాటకలో శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక పెద్ద గుణపాఠం అని చెప్పాలి. తాము ఏమి చేసినా ప్రజలు అంగీకరిస్తారన్న అహంకారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో పాటు, మత రాజకీయాలకు ప్రాదాన్యత ఇచ్చిన బీజేపీకి గట్టి షాక్‌నే ప్రజలు ఇచ్చారు. తొలుత ఏర్పడిన జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన వైనం ప్రజలలో వ్యతిరేకత తెచ్చిందని అనుకోవచ్చు. తదుపరి సీనియర్ నేత యడియూరప్పను తప్పించి బసవరాజ్ బొమ్మైని కొత్త సీఎంగా చేసినా, అప్పటికే బీజేపీ ప్రజల దృష్టిలో పలచన అయిపోయింది. ఉప ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించిన బీజేపీ సాదారణ ఎన్నికలలో చతికిలపడడం కూడా గమనించాలి. అంతర్గత గొడవలు, నలభై శాతం కమిషన్ అంటూ అవినీతి ఆరోపణలు రావడం బీజేపీకి చాలా నష్టం చేసింది. ముఖ్యంగా ప్రభుత్వంలో అవినీతి నలభై శాతం అని కాంట్రాక్టర్లు కొందరు ప్రకటించడం ఆ పార్టీ కొంప ముంచింది. కాంగ్రెస్ పార్టీ దానిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లింది. గత నాలుగు దశాబ్దాలుగా కర్నాటకలో ఒకసారి గెలిచిన పార్టీ ఆ తర్వాత టరమ్ లో ఓటమి చెందే సంప్రదాయం కూడా కాంగ్రెస్ కు పనికి వచ్చిందని చెబుతున్నారు. ముస్లిం రిజర్వేషన్ లు తొలగించి లింగాయత్ , వక్కలిగలకు చెరో రెండుశాతం ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం చేసిన యత్నం ఫలితం ఇవ్వలేదు. ఎస్సి,ఎస్టిలకు రిజర్వేషన్ లు పెంచినా ఆ వర్గాలు కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు.ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పేదలకు నంది పాలు అరలీటర్ చొప్పున సరఫరా చేస్తామని, నిరుద్యోగ భృతి నాలుగువేలు ఇస్తామని చెప్పినా ఓటర్లు బీజేపీని కరుణించలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని జనం పట్టించుకోలేదు. కాంగ్రెస్ మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న హామీని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ప్రధానిమోదీతో సహా బీజేపీ నేతలంతా కృషి చేశారు. మోదీ అయితే తన సభలలో జై భజరంగబళి అంటూ నినాదాలు చేశారు. హనుమంతుడిని కూడా రంగంలోకి తీసుకువచ్చారు. దేశ ప్రధాని అయి ఉండి ఆయన ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. కాంగ్రెస్ నేతలు ఈ దశలో కొంత ఆత్మరక్షణలో పడ్డారు. దానివల్ల నష్టం జరుగుతుందని భయపడ్డారు. అయినా ఓటర్లు చాలాకాలం తర్వాత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పేకాటలో జోకర్ మాదిరి ఎప్పటికప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య గేమ్ ఆడుతూ వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా ఈ ఎన్నిక ఒక లెస్సన్ చెప్పినట్లయింది. స్పష్టైమైన మెజార్టీ ఇవ్వడంతో ఆయన బేరసారాలకు అవకాశం లేకుండాపోయింది. గతసారి బీజేపీకి 104 సీట్లు వచ్చినా ,పూర్తి మెజార్టీ 113 సీట్లు సాధించడంలో విఫలం అవడంతో కాంగ్రెస్ , జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కాని ఆ ప్రభుత్వాన్ని బీజేపీ స్థిరంగా నిలవనివ్వలేదు. అనైతిక రాజకీయాలకు పాల్పడిందన్న విమర్శను బీజేపీ ఎదుర్కోంది. ఇవన్ని ప్రభావితం చేసి ఆ పార్టీ ప్రభుత్వం ఓటమికి దారి తీసిందని అనుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోతో పాటు ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను నమ్ముకుంది. మహిళలకు నెలకు రెండువేల చొప్పున ఇస్తామని, 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని, నిరుద్యోగ బృతి, విద్యార్ధినులకు స్కూటీలు మొదలైన ఐదు హామీలను బాగా ప్రచారం చేసింది. ప్రాంతీయ పార్టీలు ఇలాంటి హామీలు ఇస్తే ఓటర్లను ఆకర్షించడానికి అనుత్పాదక హామీలు ఇస్తున్నాయని విమర్శించే కాంగ్రెస్,బీజేపీలు ఎన్నికలు వచ్చేసరికి అదే బాట పడుతున్నాయి. ఈ హామీలను అమలు చేయడం కాంగ్రెస్ కు ఒకరకంగా సవాలే అని చెప్పాలి. పిసిసి అద్యక్షుడు డి.కె.శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితర నేతలు సవాల్ గా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఈ రాష్ట్రానికే చెందినవారు కావడం కూడా కలిసి వచ్చింది. ఈ మొత్తం విజయాన్ని రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తున్నా, ఆయన జోడో యాత్ర వల్లే విజయం అని చెబుతున్నా, వాస్తవానికి ఆ ప్రభావం అంత ఉందా అన్నది అనుమానమే. రాష్ట్ర సమస్యలే ప్రధానం గా పనిచేసినట్లు అనిపిస్తుంది. అయితే రాజధాని బెంగుళూరు నగరంలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకోవడం గమనించదగ్గ విషయమే.పాత మైసూరు ప్రాంతంలో బీజేపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ, జేడీఎస్ ల మధ్య ఓట్ల చీలిక కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగించిందని విశ్లేషణలు చెబుతున్నాయి. అక్కడ బలంగా ఉండే జేడీఎస్‌కు ఈసారి పెద్ద దెబ్బే తగిలింది. యథా ప్రకారం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని అంచనా వేసుకున్న కుమారస్వామి బేరసారాల నిమిత్తం సింగపూర్ వెళ్లి కూర్చున్నారు. కాని కర్నాటక ప్రజలు ఒకే పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి ఈ రాజకీయ వ్యాపారలావాదేవీలకు స్వస్థి పలికారు. కాంగ్రెస్ నేత డి.కె.శివకుమార్ నుంచి ప్రమాదం ఎక్కువని బీజేపీ అంచనా వేయకపోలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి పలుమార్లు ఆయనపై దాడులు చేసింది. జైలులో కూడా పెట్టింది. వాటన్నిటిని తట్టుకుని ఆయన విశేషమైన ప్రజాదరణ పొందారు. ఏది ఏమైనా దక్షిణాది రాజకీయాలలో మతానికి అంత ప్రాధాన్యత ఉండదన్న విషయం మరోసారి రుజువు అయింది. బీజేపీ దీనిని ఒక గుణపాఠంగా తీసుకుని జాతీయ రాజకీయాలను నడిపితే మంచిది. కాని వారి మౌలిక స్వభావం మారుతుందా అన్నది సందేహమే. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ స్థాయిలో పుంజుకుంటుందా అంటే అప్పుడే చెప్పలేం. ప్రధానిమోదీకి రాహుల్ ధీటైన పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఆయన జోడో యాత్రతో కొంత సీరియస్ నెస్ వచ్చినా, రాజకీయంగా కాంగ్రెస్ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అది సరిపోయేలా లేదు. కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చి 136 సీట్లు సాధించగా, బీజేపీ గతంలో మాదిరి 36 శాతం ఓట్లు తెచ్చుకున్నా 65 సీట్లకే పరిమితం అయి అధికారాన్ని కోల్పోయింది. జేడీఎస్ 13 శాతం ఓట్లతో 19 సీట్లు మాత్రమే తెచ్చుకుని వెనుకబడిపోయింది. దానికి కారణం ముఖ్యంగా ఓటర్ల సమీకరణలో, పునరేకీకరణలో వచ్చిన మార్పులే అని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో ఏకంగా 136 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకుంది. 1989 తర్వాత కాంగ్రెస్ 43 శాతం ఓట్ షేర్‌ను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు బీజీపీ 65 స్థానాలకే పరిమితం కాగా జీడీఎస్ 19, ఇతరులు 4 చోట్ల విజయం సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పుంజుకోవడానికి ముఖ్యంగా భావిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీలో ఉత్సాహం నింపింది. అయితే కర్ణాటక సీఎం ఎవరనేదానిపై తాజాగా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీనియర్ నేత సిద్ధరామయ్య ఆదివారం కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ సీఎల్పీ సమావేశంలో నిర్ణయం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు (ఆదివారం) సాయంత్రం 5.30 నిమిషాలకు బెంగుళూరులో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎన్నికపై ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అయితే మరో రెండు రోజులపాటు కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం పేరును పార్టీ హైకమాండ్ నిర్ణయించాలని సీఎల్పీ భేఈటీలో నేతలు తీర్మానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అధిష్టానం ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనుంది. అయితే సీఎం పదవికి సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారని, ఆయన్నే ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా డీకే శివకుమార్‌కు డీప్యూటీ సీఎం పదవి లేదా మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఎల్పీ నేతను ఎంపిక చేసేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలకులుగా నియమించింది. సిద్ధరామయ్యకు అండగా నిలిచా ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తుమకూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాకు సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ మా మధ్య అలాంటివి ఏం లేవు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశానని తెలిపారు. ఎన్నోసార్లు సిద్ధరామయ్యకు అండగా నిలిచానని, ఆయనకు సహకారం అందించానని చెప్పారు. మొదట్లో మంత్రిని చేయనప్పుడు ఓపిక పట్టలేదా అని అన్నారు. చదవండి: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్.. -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
నెక్స్ట్ ప్రధాని రాహుల్! దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు: ప్రియాంక గాంధీ
కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ అని జోస్యం చెబుతున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. దాన్ని నిర్ణయించేది ప్రజలేనని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మా బాధ్యతను మరింత పెంచింది. మేము కొన్ని హామీలతో ప్రజల వద్దకు వెళ్లాం, ముందు వాటిని నెరవేర్చాలన్నారు. ముందుగా ప్రజల కోసం పనిచేయాలి..ఆ తర్వాత ఏం జరుగుతుందో వారే చెబుతారని అన్నారు. అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేలా ప్రతిపక్షాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడని వాళ్లను, ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించే రాజకీయాలు ఇకపై దేశంలో పనిచేయవన్నారు. అలాంటిదే హిమాచల్‌లో కూడా చూశామని అన్నారు. కన్నడ ప్రజలు తమ సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారాన్ని కనుగొనే వారినే కావాలనుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి వ్యతిరేకమని చెప్పేందుకు సంకేతమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ఇది మైలురాయి అవుతుందన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించేలా చూస్తామని, రాహుల్ గాంధీనే నెక్స్ట్ ప్రధాని అవుతారని భావిస్తున్నా అని సిద్ధరామయ్య అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్నారు. కర్ణాటకలో పేదలు క్రోనీ క్యాపిటలిస్టులను ఓడించారు. ఈ ఎన్నికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, మనం ద్వేషంతో యుద్ధం చేయలేదు. ప్రేమతో ఎన్నికల్లో పోరాడామని అన్నారు. కాగా, కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, ఉండగా, బీజేపీ 66 స్థానాల్లో గెలుచుకుంది. (చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ) -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం -
కర్ణాటకీయంలో మనోళ్ల పాత్ర అదుర్స్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి చరిత్ర సృష్టించింది. శనివారం విడుదలై ఫలితాలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. పొరుగు రాష్ట్రం కావడం, మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉండటంతో ఈ ఎన్నికల ప్రభావం మన రాష్ట్రంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆ మేరకు సంబంధాలు ఉన్నాయి కాబట్టే.. అక్కడ మన రాష్ట్రం నుంచి అందులోనూ ఉమ్మడి జిల్లాల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పలువురు నాయకులు వెళ్లి ప్రచారం నిర్వహించి వచ్చారు. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేశారో ఒకసారి పరిశీలిద్దాం.! ► కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, యాదగిరి నియోజకవర్గాల్లో జగిత్యాల జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ► మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు కళ్యాణ కర్ణాటకకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఏఐసీసీ కార్యదర్శి మల్లికార్జున కార్గే ఏరియాలోని ఏడు జిల్లాలో 41 అసెంబ్లీ నియోజకవర్గాలకు శ్రీధర్ బాబు ఇన్చార్జిగా ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు ముందు నుంచి ఇక్కడి రాష్ట్రంలో శ్రీధర్ బాబు పార్టీ వ్యవహారాల్లో సమన్వయం చేస్తున్నారు. ► నిజాంబాద్ మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. ► పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రచారం నిర్వహించిన కళ్యాణ్ గుల్బర్గాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కమలనాథులకు ప్రతికూలమే..! హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కల్బూర్గి రూరల్ జిల్లా సేడం, చించోలి నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. చించోలిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, సేడంలో కాంగ్రెస్ గెలిచింది. మధుగిరి జిల్లాలోని సిర, మధుగిరి, పవగడ నియోజకవర్గాల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ మూడింట్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ► కర్ణాటకలో బండి సంజయ్.. చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న కోలార్, చింతామణి, ముల్బగల్ నియోజకవర్గాల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. ఇక గౌరీబిదనూర్‌లో అయితే ఏకంగా ఐదో స్థానానికి.. బాగేపల్లి, చిక్కబల్లాపూర్లో భారీ వ్యత్యాసంతో ఓటమి చవిచూసింది. -
లక్ష ఓట్ల మెజారిటీతో డీకే శివకుమార్ గెలుపు
దొడ్డబళ్లాపురం: కనకపురలో హిస్టరీ రిపీట్ అయ్యింది. ప్రజలు బీజేపీ దిమ్మతిరిగేలా ఫలితాలు ఇచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లక్ష ఓట్ల మెజారిటీతో ఆర్ అశోక్‌పై విజయం సాధించారు. కనకపురలో డీకే శివకుమార్‌కు చెక్ పెట్టాలని భావించిన బీజేపీ ఆర్ అశోక్‌ను పోటీలో దించింది. అయితే ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. డీకే శివకుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. కనకపుర డీకే బ్రదర్స్‌కు కంచుకోట అని మరోసారి రుజువు చేసారు. -
‘కింగ్‌మేకర్’ కలలు భగ్నం.. జేడీఎస్‌ను ఆ తప్పులే దెబ్బ తీశాయా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్‌మేకర్’ అవ్వాలన్న జేడీ(ఎస్) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్) అధికారంలోకి వచి్చంది. హంగ్ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్‌మేకర్ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్‌తో జతకట్టింది. కంచుకోటలో ప్రభావం అంతంతే 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం, ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి. నిఖిల్ గౌడ పరాజయం దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్)ను దెబ్బతీశాయి. దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్‌లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి హెచ్‌పీ స్వరూప్‌ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్డీ రేవణ్ణ గెలుపొందారు. చదవండి: శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్.. కమల్ ప్రశంసల వర్షం.. -
Karnataka Results: ఏ జిల్లాలో ఎవరు కింగ్?
బనశంకరి: అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్, కొన్ని జిల్లాల్లో బీజేపీ పట్టు కనబరిచాయి. మెజారిటీ జిల్లాల్లో హస్తం హవా కనిపించింది. తానూ ఉన్నానంటూ జేడీఎస్ కొన్ని చోట్ల సీట్లను సాధించింది. వివరాలు... -
మా తప్పులను సమీక్షిస్తాం: బొమ్మై
శివాజీనగర: మా తప్పులను విశ్లేషించుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని ఆపద్ధర్మ సీఎం బసవరాజ బొమ్మై అన్నారు. శనివారం హావేరిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, తాము అన్ని విధాలా ప్రయత్నాలు చేశామని, అయినా మెజారిటీ దక్కలేదని వాపోయారు. మా కార్యకర్తలు, నాయకులు, ప్రధానమంత్రితో పాటుగా శ్రమించి పని చేశారు, కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభిస్తోంది. మా తప్పులను విశ్లేషించి, దాని గురించి సమీక్ష జరుపుతామని చెప్పారు. జాతీయ పార్టీగా మా సమస్యలను సరిచేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు మళ్లీ సిద్ధమవుతామని చెప్పారు. పార్టీని పునః సంఘటితపరచి తాము మళ్లీ అఽధికారంలోకి వస్తామన్నారు. ప్రజా తీర్పే అంతిమం: కుమార శివాజీనగర: ప్రజా తీర్పును స్వాగతిస్తున్నట్లు జేడీఎస్ మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి తెలిపారు. ఎన్నికల ఫలితాల గురించి ఆయన ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని స్వాగతిస్తానని, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమం. ఓటమి, గెలుపును సరి సమానంగా స్వీకరిస్తాను. అయితే ఈ ఓటమి ఫైనల్ కాదు. నా పోరాటం ఆగదని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. తమ పార్టీకి ఓటువేసిన అందరికీ కృతజ్ఞతలన్నారు. నాకు, నా కుటుంబానికి గెలుపు ఓటములు కొత్త కాదని, ఇంతకు ముందు హెచ్.డీ.దేవేగౌడ, హెచ్.డీ.రేవణ్ణ, తాను ఓటమిపాలయ్యామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి శ్రమిస్తానని, రానున్న కొత్త ప్రభుత్వానికి మంచి జరగాలని తెలిపారు. శివాజీనగరలో రిజ్వాన్ హర్షద్ భారీ విజయం శివాజీనగర: రాజధానిలో కేంద్ర బిందువుగా ఉన్న శివాజీనగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రిజ్వాన్ హర్షద్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అధికార బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్.చంద్రుపై సుమారు 30 వేల మెజారిటీని సాధించారు. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత నియోజకవర్గంలో ఈ మూడున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే తన విజయానికి కారణమని, తన గెలుపునకు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అదే విధంగా తనపై విశ్వాసముంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లందరికి రుణపడి సదా మీ సేవలో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా రెండోసారి అధిక మెజారిటీతో గెలుపొందిన రిజ్వాన్ హర్షద్‌ను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. డీకే ఆనందభాష్పాలు శివాజీనగర: విధానసభా ఎన్నికల్లో పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చినందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ కన్నీరు కార్చారు. శనివారం నగరంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నాయకులు సమైక్యంగా బీజేపీపై పోరాటం చేశారని, అందుకు గెలుపు లభించిందని చెప్పారు. సిద్దరామయ్యతో పాటుగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని చెప్పారు. తాను ఢిల్లీలో తిహార్ జైలులో ఉన్న సమయంలో పార్టీ నాయకురాలు సోనియాగాంధీ జైలుకు వచ్చి ధైర్యం చెప్పారని తలుచుకుని కన్నీరు కార్చారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహకారం ఎన్నటికీ మరువమన్నారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలన్నారు. పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచి: సిద్దు మైసూరు: ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచి అని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల గురించి కాంట్రాక్టర్లు, రుప్సా సంస్థవారు ప్రధాని మోదీకి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. తినను, తిననివ్వనని చెప్పే ప్రధాని కర్ణాటక బీజేపీ సర్కారును పట్టించుకోలేదన్నారు. బీజెపి పతనానికి ఇది ఆరంభమని, లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. -
Karnataka Results: స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట
శివాజీనగర: ఈ ఎన్నికల్లో బీజేపీలో 12 మందికిపైగా మంత్రులు ఇంటిముఖం పట్టారు. మంత్రులు కే సుధాకర్, బీ శ్రీరాములు, వీ సోమణ్ణ, మురుగేశ్ నిరాణి, బీసీ పాటిల్ వంటి సీనియర్లు ఇందులో ఉన్నారు. స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి కూడా ఓటమిపాలయ్యారు. సుధాకర్.. శ్రీరాములు.. ► చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో మంత్రి కే.సుధాకర్ ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ గెలుపొందారు. ► బళ్లారి రూరల్‌లో సీనియర్ బీజేపీ నేత బీ.శ్రీరాములు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ► చామరాజనగర, వరుణ రెండు సీట్లలో పోటీ చేసిన మంత్రి వీ.సోమణ్ణకు ఎక్కడా గెలుపు దక్కలేదు. చామరాజనగరలో కాంగ్రెస్ నుంచి పుట్టరంగశెట్టి, వరుణలో మాజీ సీఎం సిద్దరామయ్య గెలుపొందారు. అశోక్ రెండింట ఒకటి కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌పై కనకపుర, పద్మనాభనగరలో రెండుచోట్ల పోటీ చేసిన మంత్రి ఆర్ అశోక్ డీకేశిని ఓడించలేకపోయారు. అయితే పద్మనాభనగరలో గట్టెక్కి హమ్మయ్య అనుకున్నారు. శెట్టర్ ఓటమి, సవది ఎన్నిక బీజేపీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ హుబ్లీ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. ఆయన బాటలోనే వెళ్లిన లక్ష్మణ సవది అథణిలో ఎన్నికయ్యారు. పాపం సభాపతి కాగేరి ఆరుసార్లు విధానసభకు ఎన్నికై న స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఉత్తర కన్నడ శిరసిలో పరాభవం చెందారు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందింది. మంత్రులు గోవింద కారజోళ ముధోళ్‌లో ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి ఆర్.బీ.తిమ్మాపుర ఎననికయ్యారు. హిరేకరూరులో మంత్రి బీ.సీ.పాటిల్‌ను కాంగ్రెస్ నేత యు.బీ.బణకార్ ఓడించారు. మంత్రులు నారాయణగౌడ, మురుగేశ్ నిరాణి, శశికలా జొల్లె, హాలప్ప ఆచార్ కూడా తమ క్షేత్రాల్లో మట్టికరిచారు. గుండెపోటు అభిమాని మృతి యశవంతపుర: చిత్రదుర్గ జిల్లా హిరియూరు బీజేపీ అభ్యర్థి కె పూర్ణిమ ఓటమి విషయం తెలుసుకున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందారు. హిరియూరు తాలూకా అలమరదహట్టి గ్రామానికి చెందిన ఈరణ్ణ గుండెపోటుతో మృతి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి డీ సుధాకర్, బీజేపీ అభ్యర్థి పూర్ణిమల మధ్య గట్టి పోటీ నడిచింది. సుధాకర్ ఐదు వేల ఓట్ల తేడాతో అధిక్యత సాధించిన విషయం తెలియగానే ఈరణ్ణ గుండెపోటుతో మృతి చెందారు. -
చిక్కబళ్లాపురంలో కాంగ్రెస్ జయభేరి
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ గెలిచారు. ఈయన తన ప్రత్యర్థి, మాజీ మంత్రి సుధాకర్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఈశ్వర్ మాట్లాడుతూ...తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో అభివృద్ధిపై దృషిసారిస్తానన్నారు. ప్రదీప్ ఈశ్వర్‌కు 86,224 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు 75,582 ఓట్లు వచ్చాయి. -
నాలుగు సార్లు మంత్రిగా.. మామా అల్లుళ్లకు ఓటమి
సాక్షి,బళ్లారి: జిల్లాలోని బళ్లారి రూరల్, కంప్లి నియోజకవర్గాల నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన మామా అల్లుళ్లు, మంత్రి శ్రీరాములు, టీహెచ్ సురేష్‌బాబు శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇద్దరు ఓటమి చెందారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకపారి లోక్‌సభ సభ్యుడిగా, నాలుగు సార్లు మంత్రిగా పని చేసిన శ్రీరాములు, 2008, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సురేష్‌బాబు 2018, 2023లో వరుసగా రెండుసార్లు ఓటమి చెందడం గమనార్హం. -
ఈ విజయం ప్రజలదే
గంగావతి రూరల్: కేఆర్పీపీ వ్యవస్థాపకులు, గంగావతి అసెంబ్లీ అభ్యర్థి గాలి జనార్ధన్ రెడ్డికి 65,791 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారికి 57,674 ఓట్లు లభించడంతో 8,368 ఓట్ల మెజార్టీతో గాలి జనార్ధనరెడ్డి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి పరణ్ణ మునవళ్లి 28,918 ఓట్లు మాత్రమే పొంది మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఫలితాల అనంతరం జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం సమస్త నియోజకవర్గ ప్రజలదన్నారు. అసెంబ్లీలో తమ గళం వినిపిస్తామన్నారు. ప్రజలకు ఉత్తమ పాలన అందించి వారి రుణం తీర్చుకుంటానన్నారు. -
Karnataka Results: హంగ్ అడ్డుగోడ బద్ధలు
మార్చి 29 నుంచి ఎన్నికల కోడ్, ఏప్రిల్ 10 నుంచి నామినేషన్ల పర్వం, మే 10వ తేదీన పోలింగ్, ఈ తేదీల మధ్యలో దేశంలో హేమాహేమీల ప్రచార యుద్ధం. ఇక అందరూ ఎదురుచూసిన మే 13న విస్ఫోటనం వంటి ప్రజా తీర్పు వెలువడింది. ఎవరూ ఊహించనంతగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ దరిదాపులకు రావడం, మధ్యలో జేడీఎస్ దయతో సంకీర్ణ సర్కారు ఏర్పడడం తరచూ చూసినదే. సంకీర్ణ సర్కార్లలో నిత్యం ఎమ్మెల్యేల బేరసారాల గొడవలతో విసిగిపోయిన ఓటరు ఈసారి ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినట్లు భావించాలి. బనశంకరి: రాష్ట్ర విధానసభ ఎన్నికల ఫలితాలలో ఓటర్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు. అధికార బీజేపీ, అలాగే మరో విపక్షం జేడీఎస్‌లకు తిరస్కారమే ఎదురైంది. ఈ ఎన్నికల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, బీజేపీ 65 సీట్లతో సరిపెట్టుకుంది. జేడీఎస్‌కు 19 స్థానాలు దక్కాయి ఇతరులు నాలుగుచోట్ల ఎన్నికయ్యారు. హంగ్ వస్తుందనుకున్న అంచనాలు బద్ధలయ్యాయి. బీజేపీ పరివారం రాక డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేతలు ఎంతగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు విశ్వసించినట్లు లేదు. ప్రధాని మోదీ రికార్డుస్థాయిలో 10 రోజులపాటు రాష్ట్రంలో మూలమూలలా చెమటోడ్చి ప్రచారం చేశారు. ఎన్నికల చాణక్యునిగా పేరుపొందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్నడనాటే మకాం వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, యోగి ఆదిత్యనాథ్, మరెంతోమంది కాషాయవాదులు కాలికి బలపం కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు. నటులు సుదీప్, దర్శన్ తో పాటు అనేకమంది బీజేపీకి మద్దతుగా ప్రచారంలోకి దిగారు. కానీ ఫలితం మాత్రం తిరగబడింది. ప్రతిపక్షాల పోరు కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ముమ్మరంగా సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. సోనియాగాందీ సైతం ఒక బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు సరేసరి. జేడీయస్ పార్టీలో కుమారస్వామి, హెచ్డీ దేవేగౌడ తదితరులు ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ధరలు పెంపు, బీజేపీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం విజయాలపై ప్రచారం చేసింది. జేడీయస్ పంచరత్న పథకాలను ప్రచారం చేసింది. ప్రముఖుల గెలుపు చివరకు శనివారం సాగిన ఓట్ల లెక్కింపులో అనుకోని ఫలితం వెలువడింది. బెంగళూరుతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద జాతరను మించిన జనసందోహం కనిపించింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీఎం బసవరాజ బొమ్మై, పద్మనాభనగరలో మంత్రి ఆర్.అశోక్, మల్లేశ్వరంలో మంత్రి అశ్వత్నారాయణ, శికారిపురలో యడియూరప్ప తనయుడు, బీజేపీ అభ్యర్థి బీవై.విజయేంద్ర, చెన్నపట్టణలో హెచ్డీ.కుమారస్వామి గెలుపొందారు. అనేకచోట్ల ఊహించని రీతిలో ఓటర్ల తీర్పు వెలువడడం విశేషం. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం బొమ్మై సర్కారు అన్ని కాంట్రాక్టులు, ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్లు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇదే సమయంలో మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఆరోపణలు చేస్తూ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు ఎమ్మెల్యే మాడాల్ విరూపాక్ష కుమారుడిపై లోకాయుక్తా దాడిలో కట్టల కొద్ది నగదు పట్టుబడడంతో బీజేపీ మరింత ఇరకాటంలో పడింది. ఐదు ప్రధాన హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతి నెల బీపీఎల్ కుటుంబానికి 10 కేజీల ఉచిత బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు రూ. 30 వేల భృతి, ప్రతి గృహిణికి రూ. 2 వేల ఆర్థిక సాయం, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రతో పాటు రాష్ట్ర నాయకులు చేసిన మేకెదాటు పాదయాత్ర, ఫ్రీడమ్ మార్చ్ వంటి యాత్రలు కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. సీఎం ఎంపిక అంశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ ఉంది. అయినా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో పార్టీ విజయమే పరమావధిగా ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా శ్రమించారు. -
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్‌లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్‌లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్‌కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్‌ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్‌సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కాంగ్రెస్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ.. సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో!
సాక్షి బెంగళూరు: విభేదాలు పక్కన పెట్టి ఒక్కతాటిపై నిలిచి కాంగ్రెస్‌ను గెలుపు బాటన నడిపిన మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు సీనియర్లు కూడా రేసులో ఉండటంతో ఎంపిక అధిష్టానానికి సవాలుగా మారింది. సీఎం అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం కీలకమైన కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరం. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధూ సొంతం. చదవండి: హంగ్ అడ్డుగోడ బద్ధలు వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్టానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధూకు సీఎం, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్టానం మొగ్గితే పరమేశ్వరకు చాన్సుంటుంది. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయతులు ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచినందున ఆ వర్గానికి చెందిన పాటిల్‌కు అవకాశమివ్వాలన్న డిమాండ్లూ విన్పిస్తున్నాయి. -
Karnataka election results 2023: ప్రేమ విపణి తెరుచుకుంది: రాహుల్
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. విద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఫలితమే పునరావృతం కావడం ఖాయమన్నారు. ‘‘కర్ణాటకలో విద్వేష బజార్ మూతపడింది. ప్రేమ బజార్ తెరుచుకుంది. కాంగ్రెస్‌కు అద్భుత విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు. మేం ద్వేషం, చెడు భాష వాడకుండా ప్రజలపై ప్రేమాభిమానాలే అండగా పోటీ చేసిన తీరుకు చాలా ఆనందంగా ఉంది. ఆశ్రిత పెట్టుబడిదారుల బలంపై పేదల బలమే గెలిచింది. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఐదు హామీలను తొలి మంత్రివర్గ భేటీలోనే నెరువేరుస్తాం’’ అని ప్రకటించారు. -
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్‌సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అవినీతిపై ప్రచారం రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్‌తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్‌ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది. సిద్దూ, డీకే కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఖర్గే అనుభవం ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. సానుభూతే ఆయుధం బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం. లింగాయత్ ఓట్లు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లారు. ‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’ – కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య లోకల్ వోకల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు. గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి. మైనార్టీల అండదండ.. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు. జోడో యాత్ర జోష్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది. -
స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం
గౌరిబిదనూరు: గౌరిబిదనూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌హెచ్ శివశంకర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్టస్వామి ఘన విజయం సాధించారు. పుట్టస్వామి గౌడ నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పుట్టస్వామి గౌడకు 83,336 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్‌రెడ్డికి 46,552, మరో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ కెంపరాజుకు 24,202, జేడీఎస్ అభ్యర్థి నరసింహమూర్తికి 11,125 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శశిధర్‌కు 8,131 ఓట్లు వచ్చాయి. పుట్టస్వామి గౌడ శివశంకర్‌రెడ్డిపై 36,784 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. -
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్‌కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్‌కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
Karnataka election results 2023: కాంగ్రెస్ ప్రభంజనం
సాక్షి, బెంగళూరు: కన్నడ ఓటరు కాంగ్రెస్‌కే జై కొట్టాడు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించే నాలుగు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును ఇంటికి సాగనంపాడు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ ఉచిత హామీల ముందు మోదీ మేజిక్ ఏమాత్రం పని చేయలేదు. కార్యకర్త స్థాయి నుంచి అగ్ర నాయకత్వం దాకా సమష్టిగా చేసిన కృషి ఫలించి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హంగ్ ఊహాగానాలకు, హోరాహోరీ తప్పదన్న విశ్లేషణలకు చెక్ పెడుతూ తిరుగులేని మెజారిటీ సాధించింది. 224 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 133 సీట్లు కావాల్సి ఉండగా ఏకంగా 136 స్థానాలను హస్తగతం చేసుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. ఇండియాటుడే వంటి ఒకట్రెండు సంస్థలు తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏవీ కాంగ్రెస్‌కు ఇంతటి విజయాన్ని ఊహించలేకపోయాయి. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీపై విపక్షాల ఉమ్మడి పోరుకు నేతృత్వం వహించేందుకు అత్యవసరమైన నైతిక బలాన్ని ఈ విజయం ద్వారా కాంగ్రెస్ కూడగట్టుకుంది. అంతేగాక వరుస ఎన్నికల్లో బీజేపీ చేతిలో కోలుకోలేని దెబ్బలు తింటూ ఓ పెద్ద రాష్ట్రంలో నికార్సైన గెలుపు కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పార్టీకి ఈ ఘనవిజయం ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు కర్ణాటక వంటి కీలక రాష్ట్రంలో ఇంతటి పరాభవం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్ట్రం కూడా కమలం పార్టీ చేజారింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి 39 స్థానాలు కోల్పోయింది. 78 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఏకంగా మరో 58 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జేడీ(ఎస్) ఇంటి గోలతో చిర్రెత్తిన ఓటరు ఈసారి ఆ పార్టీకి గట్టిగానే వాత పెట్టాడు. హంగ్ వస్తే ఎప్పట్లా కింగ్‌మేకర్ కావాలని ఆశపడ్డ ఆ పార్టీ దారుణంగా చతికిలపడింది. 2018లో గెలిచిన 37 సీట్లలో ఏకంగా 18 స్థానాలు కోల్పోయి చిక్కి ‘సగ’మైంది. 2018లో కాంగ్రెస్, జేడీ(ఎస్) ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని 14 నెలలకే బీజేపీ పడగొట్టింది. ఆ రెండు పార్టీల్లోని 17 మంది ఎమ్మెల్యేలను లాగేసింది. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి మెజారిటీ సాధించి గద్దెనెక్కింది. ఈ గోడ దూకుళ్లతో విసిగిన కన్నడ జనం ఈసారి సుస్థిర ప్రభుత్వానికి జై కొట్టారు. ఫలితాల సరళి స్పష్టమవుతూనే బెంగళూరు నుంచి హస్తిన దాకా కాంగ్రెస్ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యాలయాలు కళ తప్పి కన్పించాయి. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది విద్వేష రాజకీయాలపై ప్రేమ సాధించిన విజయమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తృణమూల్, ఎన్సీపీ సహా దేశవ్యాప్తంగా పలు విపక్ష పార్టీలు కాంగ్రెస్ విజయం పట్ల హర్షం వెలిబుచ్చాయి. బీజేపీ నియంతృత్వ పోకడలకు, కక్షసాధింపు రాజకీయాలకు ఇదో గుణపాఠమన్నాయి. ఆద్యంతం హస్తం హవా... కర్ణాటక అసెంబ్లీకి బుధవారం ఒకే దశలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 73.19 శాతం పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఏ దశలోనూ వెనక్కు తగ్గకుండా దూసుకుపోయింది. ఆద్యంతం వెనుకంజలోనే కొనసాగిన బీజేపీ ఎక్కడా కోలుకోలేకపోయింది. 6 ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెసే కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెస్ హవాయే కొనసాగింది. జేడీ(ఎస్) కంచుకోట పాత మైసూరుతో పాటు ముంబై కర్ణాటక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం హైదరాబాద్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీజేపీ కేవలం కోస్తా కర్ణాటకలోనే పై చేయి సాధించగా బెంగళూరులో కాంగ్రెస్‌కు సమవుజ్జీగా నిలిచింది. రాహుల్ గాంధీ ఇటీవలి భారత్ జోడో పాదయాత్రలో భాగంగా కర్ణాటకలో నిడిచిన 20 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 15 చోట్ల కాంగ్రెస్ నెగ్గడం విశేషం. బీజేపీకి తగ్గింది 0.2 శాతం ఓట్లే... పోయిందేమో 39 సీట్లు! బీజేపీకి మొత్తమ్మీద ఓట్ల శాతం తగ్గకపోయినా ఏకంగా 39 సీట్లు చేజారడం విశేషం. ఆ పార్టీకి 2018లో 36.22 శాతం రాగా ఈసారి కూడా 36 శాతం సాధించింది. అప్పుడు 38 శాతం సాధించిన కాంగ్రెస్ ఈసారి ఏకంగా 43 శాతం ఒడిసిపట్టింది. 5 శాతం అదనపు ఓట్లతో అదనంగా 58 సీట్లు కొల్లగొట్టింది. 1999లో కాంగ్రెస్ 132 సీట్లు గెలిచింది. ఆ తర్వాత దాదాపు పాతికేళ్లకు అంతకంటే మెరుగైన విజయం సాధించింది. జేడీ(ఎస్) ఓట్ల శాతం 18.36 నుంచి 13.2కు తగ్గింది. రద్దవనున్న అసెంబ్లీలో బీజేపీకి 117 సీట్లు, కాంగ్రెస్‌కు 69, జేడీ(ఎస్)కు 29, బీఎస్పీకి 1, స్వతంత్రులకు 2 సీట్లున్నాయి. 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు అభినందనలు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ పార్టీ కృషి చేస్తుందని ఆశిస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అహర్నిశలు శ్రమించిన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు. రానున్న రోజుల్లో మరింత దీక్షతో కర్ణాటక ప్రజలకు సేవలందిస్తాం’’ – ప్రధాని నరేంద్ర మోదీ ఇది ప్రజల విజయం ‘‘ఇది ప్రజా గెలుపు. సమష్టి కృషి. బీజేపీ నాయకుల అహంకారమే వారిని ఓడించింది. కాంగ్రెస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ గెలుపుతో దక్షిణ భారతదేశం బీజేపీరహితంగా మారింది. రాజ్యాంగ రక్షణకు ప్రజలిచ్చిన విజయమిది. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలుకు తొలి కేబినెట్ భేటీలోనే చర్యలు తీసుకుంటాం. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేసిన 99 శాతం ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గెలుపోటములను సమానంగా చూస్తా ‘‘రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తా ను. నాకు, మా పార్టీకి ఇవేమీ కొత్తకాదు. ఈ ఓటమి నాకు గానీ, మా పార్టీకి గానీ అంతిమం కాదు. మా పోరాటం ఆగదు. ప్రజలకు తోడుగా నిలుస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ఈ ఫలితాలతో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మా కార్యకర్తలను కోరుతున్నా. మా పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ – జేడీ(ఎస్) నేత కుమారస్వామి -
కన్నడ నాట తిరుగులేని విజయం: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ట్వీట్ వైరల్
సాక్షి,న్యూఢిల్లీ: కన్నడ నాట కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా కీలకవ్యాఖ్యలు చేశారు. లాస్ ఎంజెల్స్‌లో ఉన్న తాను కాంగ్రెస్ అఖండ విజయం గురించి విన్నానంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు,సామాజిక సామరస్యం లాంటివే కొలమానాలని పేర్కొన్నారు. Just woke up to the news in Los Angeles that @INCIndia got a resounding mandate from the people of Karnataka. Infrastructure development, economic prosperity & social harmony are the metrics that people will measure to elect its representatives. — Kiran Mazumdar-Shaw (@kiranshaw) May 13, 2023 మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగులేని మద్దతు, విశ్వాసం ప్రకటించిన ప్రజలకు డీకే శివకుమార్ ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు, హామీలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. Immensely grateful to our people in Karnataka for their unwavering support and faith in Congress Party. I dedicate this victory to all of you and I promise that we shall implement our guarantees immediately to safeguard the future of our beloved Karnataka. Once again, thank… pic.twitter.com/6ZVfvwyLFw — DK Shivakumar (@DKShivakumar) May 13, 2023 కాగా అధికార బీజేపీకి భారీ షాకిస్తూ శనివారం వెలువడిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడిగులందించిన స్పష్టమైన మెజార్టీని ప్రశంసిస్తూ పలువురు రాజకీయపార్టీల నేతలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రక విజయంపై ప్రియాంక గాంధీ రియాక్షన్..
కాంగ్రెస్‌కు చారిత్రక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని కొనియాడారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేందుకు ఈ తీర్పు నిదర్శమన్నారు. ఈ ఫలితం దేశాన్ని ఏకం చేసే రాజకీయాలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు. कांग्रेस पार्टी को ऐतिहासिक जनादेश देने के लिए कर्नाटका की जनता को तहे दिल से धन्यवाद। ये आपके मुद्दों की जीत है। ये कर्नाटका की प्रगति के विचार को प्राथमिकता देने की जीत है। ये देश को जोड़ने वाली राजनीति की जीत है। कर्नाटका कांग्रेस के तमाम मेहनती कार्यकर्ताओं व नेताओं को मेरी… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 13, 2023 కాంగ్రెస్ విజయంపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే స్పందించారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. బలవంతులకు, పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలే గెలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
శభాష్ రాహుల్.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్. ట్విట్టర్లో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మహాత్మా గాంధీలా నడుచుకుంటూ వెళ్లి ప్రజల మనసులు గెలుచుకున్నావని కొనియాడారు. 'మీ సౌమ్యమైన మార్గంలో ప్రేమ, వినయంతో ప్రపంచంలో ఏ శక్తినైనా కదలించవచ్చనని నిరూపించారు. ప్రగల్భాలకు పోకుండా, రొమ్ముచరుచుకోకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరిస్తారని మీరు నమ్మారు. ఇప్పుడు వారంతా ఐకమత్యంగా స్పందించి మీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. విజయానికే కాదు.. ఆ విజయం సాధించిన తీరుకు కూడా మీకు వందనం..' అని కమల్ ట్వీట్ చేశారు. Shri @RahulGandhi ji, Heartiest Congratulations for this significant victory! Just as Gandhiji, you walked your way into peoples hearts and as he did you demonstrated that in your gentle way you can shake the powers of the world -with love and humility. Your credible and… pic.twitter.com/0LnC5g4nOm — Kamal Haasan (@ikamalhaasan) May 13, 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 136 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. బీజేపీ కేవలం 64 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 20 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన 6 మంత్రాలివే.. -
ఒక్క రాష్ట్రంలో గెలవగానే రెచ్చిపోతున్నారు.. బండి సంజయ్ సెటైర్లు..
సాక్షి, కరీంనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కన్నడనాట హిందూ వ్యతిరేక శక్తులన్నీ కలిసి బీజేపీ విజయాన్ని అడ్డుకున్నాయని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో గెలవగానే తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క రాష్ట్రంలో గెలిస్తే రెచ్చిపోతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారని, జేడీఎస్ కామ్ అవ్వడానికి కారణం కూడా ఆయనే అని ఆరోపించారు. 'కర్నాటక ఎన్నికలకు ఇక్కడి బీఆర్ఎస్ డబ్బులు పంపింది. ఒక వర్గం కోసం పనిచేసే పార్టీలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణాలో మైనారిటీ సంతుష్ఠ రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ ఉపఎన్నికల్లో ఏ విజయాలైతే బీజేపీని వరించాయో.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయి. తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ ఏకమవుతాయి. మళ్ళీ దేశంలో మోదీ సర్కారే వస్తుంది. తెలంగాణాలో ఆర్థికంగా, అన్ని రంగల్లోనూ ముందుకు వెళ్లాలంటే మోదీ నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ అవసరం.' అని బండి సంజయ్ పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్
కన్నడ నాట కాంగ్రెస్ అత్యథిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ..ఈ ఘన విజయానికి సంతృప్తి చెందాల్సిన సమయం కాదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తగిన ఫలితం అందించాల్సిన తరుణం అని నాయకులుకు గుర్తు చేశారు. అలాగే కన్నడ నాట గెలిచిన తన కాంగ్రెస్ సహచరులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఇది వేడుకలకు సమయమే కానీ ఆత్మసంతృప్తికి మాత్రం కాదని అన్నారు. ఎందుకంటే మనం గెలిచేందుకు చేసిన కృషికి తగిన ఫలితం పొందాం. అంతకంటే ముందు మన గెలుపుకి కారణమైన కర్ణాట ప్రజలకు తగిన ఫలితాలను అందించాల్సిన సమయం కూడా ఇది అని ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా వరకు నిజం చేస్తూ.. అనూహ్యంగా 224 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిపోంది, విజయ డుండిభి మోగించడమే గాక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీ కే శివకుమార్ ఇద్దరూ ఉన్నందున అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన కీలక నిర్ణయంపైనే ఉంది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినేట్ సమావేశంలో హామీలను నెరవేర్చడంపైనే కర్ణాటక కాంగ్రెస్ దృష్టిసారిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి) -
కర్ణాటక ఫలితంపై ప్రధాని మోదీ స్పందన
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారాయన. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. అలాగే.. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం అని ట్వీట్ చేశారాయన. I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come. — Narendra Modi (@narendramodi) May 13, 2023 Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations. — Narendra Modi (@narendramodi) May 13, 2023 బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారు మోదీ. దాదాపు మూడు వేల మందితో ఇంటరాక్ట్ అయినట్టు తెలుస్తోంది. పైగా కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ నిర్వహించడమూ తెలిసిందే. -
కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 224 స్థానాలకు గానూ మెజార్టీకి 113 సీట్లు అవసరం కాగా.. కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది. హస్తం పార్టీ దెబ్బకు 14 మంది బీజేపీ మంత్రులు పరాభవం చవిచూశారు. ఎన్నికల్లో విజయదుందుభి మోగించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. ఆ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాగా.. కింగ్ మేకర్ అవుతుందని భావించిన జేడీఎస్ 19 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. ఓటింగ్ శాతం ఎంతంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 36 శాతం, జేడీఎస్‌కు 13.3 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఏ పార్టీలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. సీఎం అభర్థిని ఖరారు చేసిన అనంతరం సాయంత్రం వెళ్లి గవర్నర్‌ను కలవనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ఉందని లేఖ అందించనుంది. కాగా.. కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రేసులో సీనియర్ లీడర్ సిద్ధ రామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వీరిలో ఒక్కరిని ఖరారు చేయనుంది. సీఎం ఎవరనే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే నిర్ణయిస్తారని ఇద్దరు నేతలు చెబుతున్నారు. కొన్ని గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కలిసొచ్చిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. ఆయన యాత్ర సాగిన నియోజకవర్గాల్లో 73 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. దక్షిణాదిలో వాడిపోయిన కమలం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయినట్లైంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఏ ప్రభుత్వంలోనూ భాగంగా లేదు. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో తెంలగాణలోనూ అధికారంపై కాంగ్రెస్ గురిపెట్టింది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. గత ఎన్నికల్లో గెల్చిన 37 సీట్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రజల తీర్పుని గౌరవిస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. చెన్నపటణ నుంచి పోటీ చేసిన హెచ్డీ కుమారస్వామి ఘన విజయం సాధించారు. హోలెనరసీపుర్ నుంచి బరిలోకి దిగిన ఈయన సోదురుడ హెచ్.డీ రేవన్న కూడా గెలుపొందారు. కానీ రామనగరం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం ఓటమిపాలయ్యారు. తన తాత హెచ్డీ దేవెగౌడకు కంచుకోటగా చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో నిఖిల్ ఓడిపోవడం జేడీఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 137 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతంది. బీజేపీ 64 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలవనుంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..