సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాదాపు క్రాస్ చేసే అవకాశం ఉంది. దీంతో, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదు. కర్ణాటక ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయి. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో మేమే గెలిచాం. కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. తొలుత మాకు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, అంతకంటే ఎక్కు సీట్లు మాకు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 111 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 73 స్థానాల్లో, జేడీఎస్ 30 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇక, కాంగ్రెస్‌కు ఫలితాలు ఫేవర్‌గా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.
Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd
— ANI (@ANI) May 13, 2023
ఇది కూడా చదవండి: రిసార్ట్ పాలిటిక్స్.. తెలంగాణను తాకిన కర్ణాటక రాజకీయం!
Comments
Please login to add a commentAdd a comment