PM Modi Reacts On Karnataka Assembly Election Results, Congratulated The Congress Victory - Sakshi
Sakshi News home page

PM Modi On Karnataka Results: కర్ణాటక ఎన్నికల ఫలితంపై ప్రధాని మోదీ స్పందన ఇదే..

Published Sat, May 13 2023 5:37 PM | Last Updated on Sat, May 13 2023 5:48 PM

PM Modi Reacts On Karnataka Assembly Election Results - Sakshi

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 

సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారాయన. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. అలాగే.. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం అని ట్వీట్‌ చేశారాయన. 

బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు వారం రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారు మోదీ. దాదాపు మూడు వేల మందితో ఇంటరాక్ట్ అయినట్టు తెలుస్తోంది. పైగా కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ నిర్వహించడమూ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement