Karnataka Election Effect, Political Leaders Book Rooms In Hyderabad Star Hotels - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు కర్ణాటక ఖాయం!.. హైదరాబాద్‌ స్టార్‌ హోటల్స్‌ ఫుల్‌!

Published Sat, May 13 2023 10:12 AM | Last Updated on Sat, May 13 2023 10:37 AM

Karnataka Election Effect Political Leaders Room Bookings In Star Hotels At Hyderabad - Sakshi

సాక్షి హైదరాబాద్‌/ బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక, ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోయింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ముందంజలో దూసుకెళ్తున్నారు. దీంతో.. కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. ప్రస్తుత ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్‌ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. 

మరోవైపు.. కర్ణాటక ఎన్నికల ఫ‌లితాలు వెలువడనున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ షిమ్లాలోని హ‌నుమాన్ ఆల‌యంలో పూజ‌లు చేశారు. క‌ర్నాట‌క‌లో కౌంటింగ్ సంద‌ర్భంగా ఆమె హ‌నుమాన్ గుడిలో ప్రార్థ‌న‌లు చేశారు. దేశం, క‌ర్నాట‌క ప్ర‌జ‌ల శాంతి, సామ‌ర‌స్యం కోసం ప్రియాంకా గాంధీ ప్రార్థిస్తున్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు తెలిపారు. షిమ్లాలోని జాకూ ఆల‌యంలో ఆమె పూజ‌లు చేశారు. 

ఇదిలా ఉండగా.. కర్టాటక అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్‌ హైదరాబాద్‌పై పడింది. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో కాంగ్రెస్‌ నేతలు రూమ్స్‌ బుక్‌ చేసుకున్నారు. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20 రూములు, నోవేటల్ హోటల్‌లో 20 రూములను కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేతలు బుక్‌ చేసినట్టు సమాచారం. ఇవే కాకుండా మరికొన్ని హోటల్స్‌లో కూడా రూమ్స్‌ బుక్‌ చేసినట్టు సమాచారం. అయితే, కర్ణాటక, హైదరాబాద్‌కు సంబంధించిన వివిధ వ్యక్తుల పేర్లతో రూమ్స్‌ నిన్న బుక్ అయ్యాయి. కాగా, ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను ఈ హోటళ్లకు తీసుకొస్తారని సమాచారం. మరోవైపు.. ఏ పార్టీ నుంచి రూమ్స్‌ బుక్ చేశారో తమకు సమాచారం లేదని హోటల్ యజమాన్యాలు చెబుతున్నా​యి. 

ఇది కూడా చదవండి: కర్నాటకలో బీజేపీకి ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement