Karnataka Election Results 2023: Congress Leading In Postal Ballot Votes Karnataka Assembly Elections Over BJP - Sakshi
Sakshi News home page

Karnataka Election Results 2023: కాంగ్రెస్‌కు లీడ్‌.. బీజేపీకి ఫస్ట్‌ టైమ్‌ ఇలా..

Published Sat, May 13 2023 9:00 AM | Last Updated on Sat, May 13 2023 10:18 AM

Congress Leading In Postal Ballot Votes Karnataka Assembly Elections - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరి ఫైట్‌ నడిచింది. కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ పైచేయి సాధించింది.

ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీకి 82, కాంగ్రెస్‌కు 114, జేడీఎస్‌కు 23, ఇతరులకు 5 ఓట్లు లభించాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీకి భారీగా ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ దూసుకుపోయేది. కానీ అనుహ్యంగా కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్‌ దూసుకెళ్లింది. తాజాగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు లీడింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 


ఇక, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందు నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై జేడీఎస్‌ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్‌ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023)

అంతకుముందు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మ హుబ్లీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు.. కాంగ్రెస్‌ నేతలు కూడా గెలుపు తమదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ ఆఫీసు వద్ద సంబురాలు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement