
గౌరిబిదనూరు: గౌరిబిదనూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌హెచ్ శివశంకర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్టస్వామి ఘన విజయం సాధించారు. పుట్టస్వామి గౌడ నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
పుట్టస్వామి గౌడకు 83,336 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్‌రెడ్డికి 46,552, మరో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ కెంపరాజుకు 24,202, జేడీఎస్ అభ్యర్థి నరసింహమూర్తికి 11,125 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శశిధర్‌కు 8,131 ఓట్లు వచ్చాయి. పుట్టస్వామి గౌడ శివశంకర్‌రెడ్డిపై 36,784 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment