
గాయాపాలైన బాలిక
దొడ్డబళ్లాపురం: ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచిన ఉచిత కుక్కర్ పేలి బాలిక తీవ్రంగా గాయపడ్డ సంఘటన రామనగర తాలూకా కూనముద్దనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మహాలక్ష్మి (17) కుక్కర్ పేలి గాయపడ్డ బాలిక. శుక్రవారం ఉదయం మహాలక్ష్మి అన్నం వండాలని బియ్యం కడిగి కుక్కర్‌ను స్టౌమీద పెట్టింది. అయితే కాసేపటికే పెద్ద శబ్దంతో కుక్కర్ పేలింది. దీంతో సమీపంలోనే ఉన్న మహాలక్ష్మి ముఖం, శరీరంపై కాలిన గాయాలయ్యాయి. తక్షణం బాధితురాలిని రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎలెక్షన్ సమయంలో అభ్యర్థి ఒకరు ఈ కుక్కర్లను ఇంటింటికీ వచ్చి ఉచితంగా పంపిణీ చేశారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.