సాక్షి, కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది. ఏ ఎగ్జిట్‌పోల్ ఊహించని మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బీజేపీ, జేడీఎస్ కలిసినా వంద స్థానాలకు చేరే అవకాశం లేదు. ఫలితాల్లో జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాలకు నుంచి ఈ సారికి 21కి జేడీఎస్ పడిపోయింది. కుమారస్వామి కొడుకు నిఖిల్ సైతం ఓటమి చెందారు.
కాగా, ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు(ఆదివారం) బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానిదే విజయం అని ఖర్గే అన్నారు. అధికారం,డబ్బు ప్రభావం పనిచేయలేదన్నారు. సీఎం అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాగా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: అంచనాలకు మించి.. కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలు ఇవే..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?
— Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023
Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates
Comments
Please login to add a commentAdd a comment