Time: 9:03 PM
►రేపు సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం
►సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య
Time: 7:50 PM
►సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం సాధ్యమైందని, కాంగ్రెస్‌ని గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది అని 'ఖర్గే' వ్యాఖ్యానించారు.
Time: 6:38PM
►కర్ణాటకలో 43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్
►2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5% ఓట్లు ఎక్కువ
►36 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ
►2018 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన జేడీఎస్ ఓట్లు
Time: 6:10 PM
►బెంగళూరు సిటీ(28): కాంగ్రెస్ 13, బీజేపీ 15, జేడీఎస్ 0
►సెంట్రల్ కర్ణాటక(25): కాంగ్రెస్ 19, బీజేపీ 5, జేడీఎస్ 1
►కోస్టల్ కర్ణాటక(19): కాంగ్రెస్ 6, బీజేపీ 13, జేడీఎస్ 0
►హైదరాబాద్ కర్ణాటక(41): కాంగ్రెస్ 26, బీజేపీ 10, జేడీఎస్ 3
►నార్త్ కర్ణాటక(50): కాంగ్రెస్ 33, బీజేపీ 16, జేడీఎస్ 1
►ఓల్డ్ మైసూర్(61): కాంగ్రెస్ 39, బీజేపీ 6, జేడీఎస్ 14
Time: 5:50 PM
►కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
Time: 5:35 PM
►కర్ణాటక ప్రజలకు ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఘన విజయం సాధించామని, భారత్‌లో జోడో యాత్ర ప్రజల్లో జోష్ నింపిందన్నారు. దుష్టపరిపాలనను కర్ణాటక ప్రజలు అంతమొందించారని, ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని ప్రియాంక గాంధీ ప్రస్తావించారు.
Time: 5:05 PM
►కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం
►ఐదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్
►136 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
►65 స్థానాలకు పరిమితమైన బీజేపీ
►19 స్థానాల్లో సరిపెట్టుకున్న జేడీఎస్
Time: 4:55 PM
►సోనియా, రాహుల్‌కి ఫోన్ చేసి అభినంధనలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్
►ప్రజలకిచ్చిన హామీలను మొదటి రోజు నుంచే అమలు చేస్తాం - రాహుల్
Time: 4:35 PM
►ప్రజల తీర్పుని గౌరవిస్తాం, కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన పనిలేదు, అభివృద్ధి చేసినా ఓటమిపాలయ్యాం - యడియూరప్ప
►ప్రజా తీర్పుని గౌరవిస్తాం, ఓటమిని విశ్లేషించుకుని ముందుకెళ్తాం - కుమార స్వామి
Time: 4:15 PM
►కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డీకే.శివకుమార్
►ప్రజాస్వామ్యానిదే విజయం, బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టింది - ఖర్గే
►రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్న బొమ్మై
Time: 3:05 PM
► కర్ణాటకలో ఏ ఎగ్జిట్‌పోల్ ఊహించని మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం 137 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేడీఎస్ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు.
Time: 2:28 PM
► అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అంచనాలకు మించి దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం 136 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉన్నాయి.
#KarnatakaElectionResults | Congress at 136 including 10 seats that the party has won so far and 126 seats where it is leading. BJP continues to lead in 60 seats.
— ANI (@ANI) May 13, 2023
(Source: ECI) pic.twitter.com/GxwL8HgfpP
Time: 1:18 PM
► రెండు చోట్ల ఓడిపోయిన బిజెపి మంత్రి సోమన్న
వరుణ: కాంగ్రెస్ అగ్రనేత సిద్ధ రామయ్య చేతిలో ఓటమి
చామరాజ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టి చేతిలో ఓటమి
Time: 1:15 PM
► కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr
— ANI (@ANI) May 13, 2023
Time: 12:50 PM
► కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయోత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Time: 12:45 PM
► చల్లకేరే నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం కాంగ్రెస్ ప్రస్తుతం 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ 67 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ కేవలం 22 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
Congress wins in Challakere constituency, leads in 128 seats in Karnataka
— ANI (@ANI) May 13, 2023
BJP ahead in 67 seats and Janata Dal (Secular) leading in 22 constituencies pic.twitter.com/mPOjg3mKOY
Time: 12:40 PM
► బీదర్ జిల్లా ఓవరాల్
1. ఔరాద్లో బీజేపీ ముందంజ
కాంగ్రెస్ అభ్యర్థి భీం సేన్ షిండేపై 9126 ఓట్ల ఆధిక్యంలో మంత్రి ప్రభు చౌహన్
2. బీదర్ సిటీలో కాంగ్రెస్ ముందంజ
12 రౌండ్లు ముగిసే సరికి JDS అభ్యర్థి సూర్యకాంత్ పై 9184 ఓట్ల ఆధిక్యంలో రహీం ఖాన్
3. బీదర్ సౌత్ లో కాంగ్రెస్ ముందంజ
12 రౌండ్లు ముగిసేసారికి బిజెపి అభ్యర్థి శైలేంద్రపై 1756 ఓట్ల ఆధిక్యంలో అశోక్ ఖేని
4. బాల్కిలో కాంగ్రెస్ ముందంజ
బిజెపి అభ్యర్థి ప్రకాష్ ఖండ్రేపై 14054 ఓట్ల ఆధిక్యంలో ఈశ్వర్ ఖండ్రే
5. హుమ్నా బాద్ లో కాంగ్రెస్- బిజెపి మధ్య తీవ్ర పోటీ
15 రౌండ్లు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి సిద్దు పాటిల్ పై 484 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాజశేఖర్ పాటిల్
6. బసవ కళ్యాణ్ లో బిజెపి ముందంజ
మాజీ సీఎం కొడుకు విజయ్ సింగ్ పై 4418 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి శరణు తల్గర్ ఆధిక్యం
Time: 12:31 PM
►బళ్లారి రూరల్‌లో శ్రీరాములు(బీజేపీ) ఓటమి
►శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర గెలుపు
►వరుణ నుంచి సిద్ధరామయ్య విజయం
►చిత్తాపూర్ నుంచి ప్రియాంక్ ఖర్గే విజయం
►కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జగదీష్ శెట్టర్ ఓటమి
Time: 12:15 PM
► రామనగరలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ వెనుకంజ
► చిక్కమగళూరులో బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి వెనుకంజ
► హుబ్లీ ధార్వాడ్‌లో మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ వెనుకంజ
Time: 12:10 PM
► సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో ముందంజ
► మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణలో ముందంజ
► చెన్నపట్నంలో జేడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి ముందంజ
Time: 11:53 AM
►హసన్‌లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ గౌడ ఓటమి
Time: 11:53 AM
►కనకపుర స్థానంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ విజయం. కనకపురా నుంచి నాలుగో సారి గెలుపొందిన శివకుమార్
Time: 11:42 AM
►ఎల్లాపురాలో బీజేపీ అభ్యర్ధి శివరామ్ విజయం
►హసన్‌లో స్వరూప్(జేడీఎస్) విజయం
►చల్లకెరలో రఘుమూర్తి( కాంగ్రెస్) విజయం
►హిరియూర్‌లో సుధాకర్(కాంగ్రెస్) విజయం
►'నందిని మిల్క్ గెలిచింది ...అమూల్ ఓడింది' అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు... కెపీసీసీ ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్.
Time: 11:37 AM
►కాంగ్రెస్ కి ఫుల్ మెజార్టీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.140 సీట్లు వస్తాయన్న ధీమా మాకు ఉంది. రిసార్ట్ పాలిటిక్స్ జరిగేటటువంటి అవకాశం లేదు. బీజేపీ అవినీతే వాళ్లను ఓడిస్తోంది: డీకే.శివకుమార్
Time: 11:24 AM:
►వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య ఆధిక్యం, బీజేపీ మంత్రి సోమన్నపై 2710 ఓట్ల ఆధిక్యం.
►చెన్నపట్టణంలో జేడీఎస్ ఛీఫ్ కుమారస్వామి ఆధిక్యం
Time: 11:23 AM:
►బీజేపీ మంత్రి మురుగేష్ నిరానీ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యం.
Time: 11:21 AM:
► కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సవాదీ విజయం సాధించారు. 9వేల మెజార్టీతో లక్ష్మణ్ సవాదీ గెలుపొందారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన లక్ష్మణ్ సవాదీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?
డి కె శివకుమార్
సిద్ధ రామయ్య
మీ అభిప్రాయాన్ని పంచుకోవడానికి లింక్‌పై క్లిక్ చేయండి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?
Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates
— Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023
Time: 11:16 AM
►గంగావతి నియోజకవర్గంలో 6000 ఓట్ల ఆధిక్యత తో కొనసాగుతున్న గాలి జనార్ధన్ రెడ్డి
Time: 11:07 AM
►గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
►పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం
►కోస్టల్ కర్ణాటక, బెంగుళూరులో బీజేపీ ఆధిక్యం
►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం
►ఓల్డ్ మైసూర్లో జేడీఎస్‌కు గండికొట్టిన కాంగ్రెస్
►ఓల్డ్ మైసూర్‌లో మూడో స్థానంలో బీజేపీ
►ఉత్తర కార్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యం
►చిత్తాపూర్‌లో ప్రియాంక్ ఖర్గే(కాంగ్రెస్) ఆధిక్యం
►గంగావతిలో గాలి జనార్థన్‌రెడ్డి ఆధిక్యం
►బళ్లారి సిటీలో గాలి అరుణ లక్ష్మి వెనుకంజ
Time: 10:57 AM
కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ షిమ్లాలోని జాకూ ఆలయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు చేశారు.
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra offers prayers at Shimla's Jakhu temple pic.twitter.com/PRH47u36Zm
— ANI (@ANI) May 13, 2023
Time: 10:45 AM
మరోసారి జేడీఎస్ పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే 30 స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో ఉండగా.. మరోసారి చక్రం తిప్పేందుకు కుమారస్వామి సిద్ధమవుతున్నారు. ఆయనతో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారు.
Time: 10:38 AM
►షిగ్గావ్ స్థానంలో బస్వరాజ్ బొమ్మె (భాజపా) ఆధిక్యం
►వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్) ఆధిక్యం
►రామనగరలో నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) ఆధిక్యం
►ఆధిక్యంలోకి వచ్చిన జేడీఎస్ నేత కుమారస్వామి
►హోళెనర్సీపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యం
Time: 10:32 AM
►కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్(113) దాటింది.140 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు బెంగుళూరు రావాలని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
దూసుకుపోతున్న కాంగ్రెస్..
► కాంగ్రెస్ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు.
Karnataka elections | Congress inches towards the halfway mark of 112, leads in 110 constituencies while BJP leads in 71 seats and JD(S) in 23, as per trends for 209 of 224 Assembly constituencies.#KarnatakaElectionResults pic.twitter.com/9tApdBlMzd
— ANI (@ANI) May 13, 2023
► గంగావతి నియోజకవర్గంలో 2700 ఓట్ల ఆధిక్యతలో గాలి జనార్ధన్ రెడ్డి
► మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ
► రెండో రౌండ్‌లో కాంగ్రెస్ మరింత దూకుడు.
► అనేక ప్రాంతాల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు
► బసవ కళ్యాణ్లో మాజీ సీఎం ధరమ్ సింగ్ కొడుకు విజయ్ సింగ్ కి షాక్
► బసవ కళ్యాణ్లో ముందంజలో బీజేపీ అభ్యర్థి శరణు తల్గర్.
► 4 రౌండ్లు ముగిసే సరికి 12980 ఓట్ల ఆధిక్యంలో బిజెపి
► బాగేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి ఆధిక్యత.
► పావగడ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి తిమ్మరాయప్ప ముందంజ
►బీదర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో జేడీఎస్ అభ్యర్థి సూర్యకాంత్ ఆధిక్యం
► ఔరద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మంత్రి ప్రభు చవాన్ ముందంజ
► హుమనబాద్ లో బీజేపీ అభ్యర్థి సిద్దూ పాటిల్ ఆధిక్యంలో
► బీదర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థి శైలేంద్ర బెల్దాలే ముందంజ.
► బాల్కి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రే ముందంజ
Time: 09:57 AM
►హైదరాబాద్‌లో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్
►ప్రముఖ హోటల్స్‌లో రూమ్‌లు బల్క్ బుకింగ్
►కర్ణాటక, హైదరాబాద్ వ్యక్తుల పేర్లతో రూమ్స్ బుకింగ్
►ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించే అవకాశం
Time: 09:44 AM
►కాంగ్రెస్ 82, బీజేపీ 52, జేడీఎస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి
►6 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో డీకే శికుమార్
►షిగ్గావ్‌లో బస్వరాజు బొమ్మై(బీజేపీ) ముందంజ
►వరుణలో సిద్ధరామయ్య(కాంగ్రెస్) ముందంజ
►చెన్నపట్టణలో కుమారస్వామి(జేడీఎస్) స్వల్ప ఆధిక్యం
►రామనగర్‌లో నిఖిల్ కుమారస్వామి(జేడీఎస్) ముందంజ
►బెంగుళూరులో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
#KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 82 seats, BJP in 52 seats while the JDS is leading in 16 seats. #KarnatakaPolls pic.twitter.com/sL4RFJUYJ6
— ANI (@ANI) May 13, 2023
Time: 09:32 AM
గాలి జనార్దన్ రెడ్డి దంపతులు ఆధిక్యం
గంగావతి స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యం - బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం - బళ్లారి (ఎస్ టీ) స్థానంలో శ్రీరాములు (భాజపా) ఆధిక్యం - చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్ (భాజపా) వెనుకంజ - హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) ఆధిక్యం - చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (భాజపా) ఆధిక్యం
Time: 09:29 AM
►హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటక, మైసూరులో కాంగ్రెస్ హవా
►కోస్టల్ కర్ణాటకలో బీజేపీకి ఆధిక్యం
►బెంగుళూరు, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
►షిగ్గావ్‌లో బస్వరాజ్ బొమ్మై ముందంజ
Time: 09:24 AM
8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజలో ఉన్నారు. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్(113)ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 44 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో, జేడీఎస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Karnataka Election Results: As per ECI, Congress takes the lead in 44 seats, BJP in 23 seats while JDS leads in 07 seats.#KarnatakaElectionResults2023 pic.twitter.com/bFP4AfpZjN
— ANI (@ANI) May 13, 2023
Time: 09:20 AM
113 మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ దాటింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో, బీజేపీ 12 స్థానాల్లో, జేడీఎస్ 02 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి
#KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 25 seats, BJP in 12 seats while the JDS is leading in 02 seats. #KarnatakaPolls pic.twitter.com/ReFREHP7Wt
— ANI (@ANI) May 13, 2023
Time: 09:12 AM
►8 మంది కర్ణాటక మంత్రుల వెనుకంజ
►చిక్ మంగుళూరులో సీటీ రవి వెనుకంజ
►గంగావతిలో గాలి జనార్థన్‌రెడ్డి ముందంజ
►బళ్లారి సిటీలో గాలి అరుణలక్ష్మి ముందంజ
Time: 09:05 AM
►ఏడుగురు కర్ణాటక మంత్రుల వెనుకంజ
►మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
►రామనగరలో నిఖిల్ కుమారస్వామి వెనుకంజ
►వరుణాలో సిద్ధరామయ్య ముందంజ
#KarnatakaElectionResults2023 | As per ECI, Congress leads in 12 seats, BJP in 8 seats while the JDS leads in one seat.#KarnatakaPolls pic.twitter.com/hnkhpjfXqv
— ANI (@ANI) May 13, 2023
Time: 09:02 AM
►బసవరాజు బొమ్మై ముందంజ
►బీజేపీ రెబల్ నేత జగదీష్ శెట్టర్ ముందంజ
Time: 08:59 AM
►ముంబై కర్ణాటకలో హోరాహోరీ
►ఇప్పటివరకు చెరో 23 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఆధిక్యం
►బెంగుళూరు నగరంలో కాంగ్రెస్ 17, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యం
►హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ 23, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం
Time: 08:49 AM
►100 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
►చిత్తాపూర్‌లో ప్రియాంక్ ఖర్గే వెనుకంజ
►బీజేపీ రెబల్ నేత జగదీష్‌శెట్టర్ వెనుకంజ
►గాంధీనగర్‌లో దినేష్ గుండూరావు ముందంజ
Time: 08:46 AM
►కనకపురంలో డీకే శివకుమార్ ముందంజ
►బళ్లారి రూరల్‌లో శ్రీరాములు ముందంజ
►వరుణలో సిద్ధరామయ్య ముందంజ
Time: 08:39 AM
ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చెన్న పట్టణంలో కుమారస్వామి, బళ్లారిలో గాలి అరుణలక్ష్మి వెనుకంజలో ఉన్నారు.
Time: 08:36 AM
పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో తొలుత ఆధిక్యంలో బీజేపీ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్‌లో జేడీఎస్ పుంజుకుంటోంది.
Time: 08:31 AM
కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే హుబ్బళ్లిలోని హనుమాన్ ఆలయాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై దర్శించుకున్నారు.
#WATCH | As counting of votes begins for #KarnatakaPolls, CM Basavaraj Bommai visits Hanuman temple in Hubballi. pic.twitter.com/isXkxoa79D
— ANI (@ANI) May 13, 2023
Time: 08:18 AM
పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ
కర్ణాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్ ఫిగర్ 113, కాంగ్రెస్ అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ సాగుతోంది.
Time: 08:14 AM
పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం
Time: 08:11 AM
బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది:బొమ్మై
మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయి.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని బొమ్మై అన్నారు.
#WATCH | Today is a big day for Karnataka as the people's verdict for the state will be out. I am confident that BJP will win with absolute majority and give a stable government, says Karnataka CM Basavaraj Bommai, in Hubballi. pic.twitter.com/8r9mKGiTIe
— ANI (@ANI) May 13, 2023
Time: 08:02 AM
కౌంటింగ్ ప్రారంభం
కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.
Time: 07:44 AM
ప్రభుత్వం ఏర్పాటు చేసేది నేనే: కుమారస్వామి
►ఎగ్జిట్ పోల్స్‌పై జేడీఎస్ అధినేత కుమారస్వామి సెటైర్లు వేశారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదన్న కుమారస్వామి.. మరో రెండు, మూడు గంటలు వేచి చూద్దామన్నారు. తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తానేనంటూ కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | "No one has contacted me till now. There is no demand for me, I am a small party" says JD(S) leader HD Kumaraswamy, ahead of Karnataka election results. pic.twitter.com/0Mkbqdd7Tr
— ANI (@ANI) May 13, 2023
►ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు.
►ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలపై స్పష్టత రానుంది. మొత్తం 2,615 మంది అభ్యర్థుల తలరాత ఏమిటో తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నా యి. ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) తెరపై ఎన్నికల ఫలితం కనిపించడం ప్రారంభం కానుంది.
►కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుది ఫలితాలపై మధ్యాహ్నం కల్లా ఒక స్పష్టమైన చిత్రం ఆవిష్కృతం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీ
►ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సర్వేలు బీజేపీ మళ్లీ గెలుస్తుందని తెలియజేశాయి. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉన్నట్లు మరికొన్ని సర్వేల్లో వెల్లడయ్యింది. జేడీ(ఎస్) కింగ్‌మేకర్ మారే అవకాశాలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.
►ఆ ఆనవాయితీని బద్ధలు కొట్టాలన్న లక్ష్యంతో అధికార బీజేపీ శ్రమించింది. మరోవైపు ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు భారీ ఆశలే ఉన్నాయి. వీటిలో గెలిస్తే పార్టీల్లో కొత్త ఉత్సాహం వస్తుందని, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తామే అతిపెద్ద పార్టీగా అవతరిస్తామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వం మాదే: బొమ్మై
►ఎన్నికల్లో తమకే సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సహచర నాయకులతో కలిసి మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ సొంతంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని పరిశీలించిందని మేజిక్ ఫిగర్ దాటుతామన్న విశ్వాసం తమకి ఉందన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఊహాగానాలను తాను విశ్వసించనని చెప్పారు. తమకి మెజార్టీ ఖాయమని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా 73.19% పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్‌కే స్వల్ప మొగ్గు వస్తుందని వెల్లడించాయి.
సంప్రదింపులు.. బేరసారాలు
►కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేతలు వరుసగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. గెలుపోటముల లెక్కలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 224 సీట్లను గాను 113 సీట్లు సాధించాలి. కనీసం సాధారణ మెజార్టీ సాధిస్తామని బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చి ఆగిపోతే హంగ్ పరిస్థితులు రానున్నాయి. అందుకే కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులపై పార్టీలు కన్నేశాయి. స్వతంత్ర అభ్యర్థులపైనా దృష్టి పెట్టాయి.
►వారితో సంప్రదింపులు, బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది. హంగ్ ఏర్పడితే చేపట్టాల్సిన కార్యాచరణపై కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఇక బీజేపీ నేతలు కూడా సమాలోచనాల్లో మునిగిపోయారు. శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి మాట్లాడారు. జేడీ(ఎస్)లో ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు.
►ప్రస్తుతం రాష్ట్రంలో అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో హంగ్ వస్తే తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యేగా నెగ్గినవారంతా శనివారం సాయంత్రంలోగా బెంగళూరుకు చేరుకోవాలని ప్రధాన పార్టీల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment