
కర్ణాటక: కర్ణాటకలో రిసార్ట్’పాలిటిక్స్ మొదలయ్యాయి. బెంగుళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయినట్లు తెలిసింది. కర్ణాటక బీజేపీ నేతలతో అమిత్‌షా కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మరో వైపు, ఆధిక్యంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లోకి వచ్చింది. అందరినీ బెంగుళూరు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కీలక నేతలకు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది.
బీజేపీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులతో డీకే శివకుమార్ టచ్‌లో ఉన్నారు. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులను హుటాహుటిన బెంగుళూరుకు కాంగ్రెస్ తరలిస్తోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. కాగా, అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలన్న సంప్రదాయాన్ని కన్నడిగులు కొనసాగిస్తున్నారు.
చదవండి: సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: సిద్ధరామయ్య
Comments
Please login to add a commentAdd a comment