Resort Politics
-
ప్రలోభాలే అజెండా.. టీడీపీ రిసార్ట్ పాలి‘ట్రిక్స్’
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ రాజకీయాలు రిసార్టుకు చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమకు అలవాటైన కొనుగోళ్ల ఎరతో కార్పొరేటర్లను మభ్యపెట్టింది. తమకు మద్దతునిచ్చిన కార్పొరేటర్లు ఎక్కడ చేజారిపోతారోనన్న భయంతో క్యాంపు రాజకీయాలు చేస్తోంది. అందరిని భీమిలిలోని ఓ రిసార్టుకి తరలించేసింది. పోలింగ్ సమయానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు విజయమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. ఉదయం 10 గంటలకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించి విజేతలను ప్రకటించనున్నారు.ఇవీ బలాబలాలు..గ్రేటర్లో 98 మంది వార్డులుండగా ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లున్నారు. 21 వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన వారిలో కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు.. డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీ, జనసేనలో చేరారు. వాస్తవానికి 97 మందిలో వైఎస్సార్ సీపీ నుంచి 58 మంది, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్స్ నలుగురు, సీపీఐ, సీపీఎం, బీజేపీలో చెరో కార్పొరేటర్ విజయం సాధించారు. పార్టీలు మారిన తర్వాత ప్రస్తుత బలాబలాలు చూస్తే.. వైఎస్సార్ సీపీలో 46 మంది, టీడీపీలో 37, జనసేనలో 8, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కరుండగా స్వతంత్రులు ముగ్గురున్నారు. మొత్తంగా ప్రస్తుతం చూస్తే.. ఒక ఇండిపెండెంట్‌తో కలిపి వైఎస్సార్ సీపీకి 47, కూటమికి 47తో పాటు ఇద్దరు ఇండిపెండెంట్స్ మద్దతుతో కలిపి మొత్తం 49 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఈ లెక్కన వైఎస్సార్సీపీ కంటే కూటమికే బలం ఉన్నా భయంతో బిక్కుబిక్కుమంటుండటం గమనార్హం.ఓటమి భయంతో..అధికార టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకొని రిసార్టు రాజకీయాలకు తెరతీసింది. తమకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు చేజారిపోతారేమోనన్న భయంతో కార్పొరేటర్లను భీమిలిలోని ఓ రిసార్టుకి తరలించారు. తమతో వచ్చిన కార్పొరేటర్లకు రూ.3 లక్షలు చొప్పున అందించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం తమ మద్దతు కార్పొరేటర్లను రిసార్టుకు చేర్చగా.. వీరిలో కొందరు కార్పొరేటర్లు మనసు మార్చుకొని ఇంటికి వెళ్లిపోతామని చెప్పడంతో టీడీపీలో మళ్లీ భయం పట్టుకుంది. వారిని బుజ్జగించే పనిని కీలక కార్పొరేటర్లకు అప్పగించారు. రిసార్టు దగ్గర జామర్లు కూడా అమర్చినట్లు సమాచారం.ఇండిపెండెంట్ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు లాబీయింగ్ నడుపుతున్నారు. చివరి వరకు ఎవరు దొరికితే వారికి రూ.3 నుంచి రూ.5 లక్షలైనా ఇచ్చి ఓటు వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంట్ ఎన్నికల ముందు రిసార్ట్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. జార్ఖండ్‌కుచెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం వరకు హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో క్యాంపు వేసిన విషయం తెలిసిందే. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన చంపయ్ సోరెన్ బల పరీక్షలో వారు పాల్గొని సర్కారును విజయవంతంగా గట్టెక్కించారు. జార్ఖండ్ సంక్షోభం ఇలా తెరపడగానే బీహార్‌లో నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ,బీజేపీ సర్కారు బలనిరూపణ అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 12న జరిగే నితీశ్ సర్కారు బలపరీక్షకు ముందు పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడ లాక్కుంటారో అన్న భయంతో కాంగ్రెస్ తమ 16 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించింది. రిసార్ట్‌లలో క్యాంపు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలు సకల లగ్జరీ సౌకర్యాలు, వసతులు కల్పిస్తాయి. అదే సమయంలో వారిపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. దేశ్యాప్తంగా రిసార్ట్ పాలిటిక్స్ పాపులర్‌గా మారాయి. అసలు దేశంలోనే తొలిసారిగా 1982లో రిసార్ట్ పాలిటిక్స్ హర్యానాలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ,బీజేపీ కూటమికి 37 సీట్లు రాగా, దేశంలోనే శక్తివంతమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు 36 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా అప్పటి గవర్నర్ కాంగ్రెస్‌ను ఆహ్వానించడంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఐఎన్ఎల్డీ హైకమాండ్ ఎమ్మెల్యేలందరినీ హిమాచల్ ప్రదేశ్‌లోని సొలాన్‌లోని ఓ రిసార్టుకు తరలించి దేశంలోనే తొలిసారిగా రిసార్టు రాజకీయాలకు నాంది పలికింది. ఇదీచదవండి.. విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు -
కర్ణాటకలో మొదలైన ‘రిసార్ట్’ పాలిటిక్స్.. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లు!
కర్ణాటక: కర్ణాటకలో రిసార్ట్’పాలిటిక్స్ మొదలయ్యాయి. బెంగుళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో కుమారస్వామితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయినట్లు తెలిసింది. కర్ణాటక బీజేపీ నేతలతో అమిత్‌షా కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మరో వైపు, ఆధిక్యంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంగ్రెస్ హైకమాండ్ టచ్‌లోకి వచ్చింది. అందరినీ బెంగుళూరు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ కీలక నేతలకు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులతో డీకే శివకుమార్ టచ్‌లో ఉన్నారు. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులను హుటాహుటిన బెంగుళూరుకు కాంగ్రెస్ తరలిస్తోంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు 12 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. కాగా, అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలన్న సంప్రదాయాన్ని కన్నడిగులు కొనసాగిస్తున్నారు. చదవండి: సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: సిద్ధరామయ్య -
జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయం
-
రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్
రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఈలోగా రిసార్టు రాజకీయాలకు తెర లేచింది. ఎమ్మెల్యేలు గోడ దూకుతారేమోనన్న భయంతో వారిని సోరెన్ క్యాంపుకు తరలించారు. శనివారం ఉదయం పాలక యూపీఏ భాగస్వామ్య పక్షాలైన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సీఎం నివాసంలో మూడో దఫా సుదీర్ఘ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా నేరుగా లగేజీలతో పాటుగా భేటీకి రావడం విశేషం. ఆ వెంటనే వారందరినీ మూడు బస్సుల్లో గుర్తు తెలియని చోటుకి తరలించారు. వారిని పశ్చిమబెంగాల్‌కో, ఛత్తీస్‌గఢ్‌కో తీసుకెళ్లి ఉంటారంటూ వార్తలొచ్చాయి. కానీ ఎమ్మెల్యేలంతా కుంతీ జిల్లాలోని మూమెంట్స్ రిసార్ట్‌కు పిక్నిక్కు వెళ్తున్నారంటూ మంత్రులు ఆలంఘీర్ ఆలం, బన్నా గుప్తా చెప్పారు. సాయంత్రానికల్లా వారంతా రాంచీ తిరిగొచ్చినట్టు సమాచారం. సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫార్సుపై గవర్నర్ రమేశ్ బైస్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్‌లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్‌లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్‌కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్‌కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు -
రిసార్టు రాజకీయాలకు కేరాఫ్ కర్ణాటక
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభమా, ప్రభుత్వాన్ని కూల్చెలా.. అయితే ఎమ్మెల్యేలతో కర్ణాటకలో మకాం వేసేద్దాం అంటున్నాయి పార్టీలు. రిసార్టు రాజకీయాలకు కర్ణాటక రాష్ట్రం కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ప్రస్తుతం మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు గత వారంరోజుల నుంచి బెంగళూరు రిసార్టులో మకాం వేశారు. ఇలా ప్రభుత్వాలను కూల్చేందుకు రాజకీయ నాయకులు కర్ణాటకలో ఆశ్రయం పొందడం ఇదేమీ తొలిసారి కాదు. దశాబ్దాలుగా రిసార్టు రాజకీయాలకు రాష్ట్రం పేరుగాంచింది. చదవండి: బలపరీక్షపై వైఖరేంటి? రిసార్టు రాజకీయాలకు నెలవుగా మారిన కన్నడ రాజధాని ఎంత ఖర్చయినా సరే : ఎన్నికల సమయంలో, అసమ్మతి రాజకీయాలప్పుడు ప్రధాన నాయకులు తమ అనుచర ఎమ్మెల్యేలు, మంత్రులను తీసుకుని రిసార్టుల్లో మకాం వేస్తున్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే ఎమ్మెల్యేలకు ఈ రిసార్టు రాజకీయ క్రీడలో మంచి ఫలితమే దక్కుతోంది. ఎంత ఖర్చయినా సరే రిసార్టు, ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో వారాల పాటు రెబెల్ ఎమ్మెల్యేలను ఉంచి కాపాడుకుంటుంటారు. ప్రతినిత్యం వారికి భోజనాలు, గదుల దగ్గరి నుంచి అన్ని వ్యవహారాలకు చాలా భారీగా ఖర్చు అవుతుంది. కొత్త అల్లుళ్ల తరహాలో ఆతిథ్యం ఉంటుంది. కర్ణాటకలో చాలా అత్యున్నత హైఫై సౌకర్యాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన రిసార్టులు ఉన్నాయి. కొన్నిరోజుల విడిది ఖర్చు కోట్ల రూపాయల్లోనే, అయినా పార్టీలు వెనుకంజ వేయవు. అంతేకాకుండా అన్ని జాతీయ పార్టీల రిసార్టు రాజకీయాలకు బెంగళూరు భద్రం అనుకుంటారు. యడియూరప్ప, కుమారస్వామి, సిద్ధరామయ్య ఇలా అన్ని ప్రధాన పార్టీల నాయకులు రిసార్టు రాజకీయాలు నడిపినవారే కావడం గమనార్హం. కొన్నిసార్లు తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా, మరికొన్నిసార్లు ప్రత్యర్థి సంఖ్యాబలాన్ని తగ్గించేందుకు రిసార్టులను ఆశ్రయించారు. చదవండి: నా ప్రమాణం తర్వాత మాట్లాడతా 1984లో ఏపీతో నాంది: సుమారు 36 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రిసార్టు రాజకీయం ప్రారంభమైంది. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించారు. ఆ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డే ఎన్టీఆర్‌కు ఎంతో సహకారం అందించారు. సుమారు ఒక నెల పాటు బెంగళూరులోని దాస్ ప్రకాశ్ హోటల్లో టీడీపీ ఎమ్మెల్యేలు మకాం వేశారు. 2002లో మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ విశ్వాస పరీక్ష ఎదుర్కొనే సమయంలో తమ పార్టీకి చెందిన సుమారు 71 మంది ఎమ్మెల్యేలను మైసూరు రిసార్టులకు తరలించారు. 2004లో జేడీఎస్ పార్టీకి చెందిన 58 ఎమ్మెల్యేలను కూడా అప్పట్లో రిసార్టుకు తరలించారు. గత 16 ఏళ్లలో రిసార్టు రాజకీయాల వల్ల మూడు ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. -
కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు
భోపాల్/సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కీలకనేత జ్యోతిరాదిత్య సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరుకు మకాం మార్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను వలలో వేసుకుంటోందంటూ ఇటీవల కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగివచ్చి సర్కారుకు మద్దతు పలకడం తెలిసిందే. అసెంబ్లీలో బొటాబొటీ మెజారిటీ ఉన్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. రిసార్టులో మకాం కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. ఆరోగ్య, కార్మిక, రవాణా, మహిళా శిశు సంక్షేమ, ఆహార, పౌర సరఫరాలు, విద్యా శాఖలకు చెందిన ఆరుగురు మంత్రులు తులసి సిలావత్, మహేంద్ర సింగ్ సిసోడియా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇమార్తీ దేవి, ప్రద్యుమ్నసింగ్ తోమర్, ప్రభురా చౌధరితోపాటు ఎమ్మెల్యేలు సింథియా వెంట ఉన్నారు. వీరి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, సింథియా మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం లేదని పీటీఐ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో జ్యోతిరాదిత్య సింధియా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కర్ణాటక సీఎల్పీ నేత సిద్ధరామయ్యతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు వచ్చిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో లేరని సిద్ధరామయ్య చెప్పినట్లు సమాచారం. అనంతరం మాజీ మంత్రి జి.పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావుకు భోపాల్ రావాల్సిందిగా నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. ఏమిటీ సమస్య? సీఎం కమల్‌నాథ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఈ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం మూడు రాజ్యసభ (కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా) సీట్ల కోసం ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాబలాల ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ చెరో సీటు గెలుచుకోవడం ఖాయం. తాజా పరిణామంతో కాంగ్రెస్‌కు మూడో సీటు దక్కడం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందనే అనుమానాలు ఉన్నాయి. పరిస్థితిని పార్టీ చీఫ్ సోనియాకు వివరించేందుకు కమల్‌నాథ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. ఆయన 12న తిరిగి రావాల్సి ఉంది. నేడు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ 16న రాష్ట్ర బడ్జెట్, 26న రాజ్యసభ ఎన్నికలపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కోల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన జరిగిన బీజేపీ సమావేశానికి సైతం వీరు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతల్లోనూ ఉత్కంఠ పెరిగింది. రెండు రాజ్యసభ సీట్ల కోసం పార్టీ నేతలు రాంమాధవ్, కైలావ్ విజయ్‌వర్గీయ సహా 22 మంది పేర్లను సోమవారం రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది. -
‘కోట్ల’ కర్నాటకం
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, అటు బీజేపీ అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. ఓవైపు సొంత కూటమి నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు అన్నిప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఈ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలను చీల్చడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాజకీయ వ్యవహారాలను సునిశితంగా పరిశీలిస్తున్నవారి అంచనా ప్రకారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున నగదును ముట్టజెప్పినట్లు సమాచారం. కేవలం నగదు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా హోటళ్లు, రిసార్టుల్లో గదులు బుక్‌చేయడంతో పాటు వారి డిమాండ్లన్నింటిని తీరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోటల్/ రిసార్టుల్లో ఒక్కో గదికి రోజుకు రూ.4000 నుంచి రూ.11,000 వరకూ ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని ఆయా రాజకీయ పార్టీలే భరిస్తున్నాయి. ఒక్కో ట్రిప్‌కు రూ.4 లక్షల ఖర్చు.. ఇక ముంబైలో క్యాంప్ ఏర్పాటుచేసిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో ముంబై–బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో ఒక్కో ట్రిప్‌కు రూ.4 లక్షల వరకూ ఖర్చవుతోంది. కర్ణాటక సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పలుమార్లు ఇలా రాకపోకలు సాగించారు. మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించుకుంటున్నారు. అలాగే సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదిని కూడా నియమించుకున్నారు. కొద్ది రోజులుగా ఇలా ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, హోటళ్లలో బస కోసం రాజకీయ పార్టీలు రూ.50 లక్షల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే సొంత డబ్బుతోనే తాము హోటళ్లలో ఉంటున్నామని రెబెల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాత్రం బీజేపీవైపు వేలెత్తి చూపిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక బీజేపీ లేకుంటే, రాజీనామాలు చేసినవెంటనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక విమానాలు, హోటళ్లలో గదులు ఎలా సమకూరాయని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో రిసార్టుల రాజకీయం మొదలైంది. తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు 14 నెలల్లో శాసనసభ్యులను మూడుసార్లు రిసార్టులకు తరలించాయి. -
రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో సారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. ‘ఆపరేషన్ కమల’ వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రలోభాల నుంచి తప్పించుకునేందుకు శుక్రవారం తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరు దగ్గర్లోని ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. గత మేలో అసెంబ్లీ ఎన్నికలయ్యాక తమ సభ్యుల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఇదే రిసార్టులో ఉంచింది. తాజాగా శుక్రవారం బెంగళూరులో సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే విధానసౌధ నుంచి రెండు బస్సుల్లో వారిని మళ్లీ అదే రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నంత కాలం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని కాంగ్రెస్ పక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తాయేమోనన్న భయంతోనే మోదీ, అమిత్ షా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్–జేడీఎస్‌ల ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని పునరుద్ఘాటించారు. తమ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నుంచి రూ .70 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోల్‌కతాలో ప్రధాని మోదీని ప్రశ్నించారు. మరోవైపు, వారం రోజులుగా గురుగ్రామ్‌లోని రిసార్టులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం బెంగళూరు రానున్నారు. సీఎల్పీ భేటీకి నలుగురు డుమ్మా.. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి నలుగురు సభ్యులు రాలేదు. 80 మంది ఎమ్మెల్యేల్లో 76 మంది వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వ్యక్తిగత కారణాల రీత్యా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ముందస్తుగానే పార్టీ పెద్దలకు సమాచారమిచ్చారు. అనారోగ్య కారణాలతో గైర్హాజరవుతున్నట్లు చించోలి ఎమ్మెల్యే ఉమేశ్‌జాధవ్..సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫ్యాక్స్ చేశారు. కోర్టు పని వల్ల సీఎల్పీ భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు బళ్లారి(గ్రామీణ) ఎమ్మెల్యే నాగేంద్ర.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌కు తెలియజేశారు. అయితే గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జారకిహోళి, అథని ఎమ్మెల్యే మహేశ్ కుమటెళ్లి గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. రమేశ్ జారకిహోళి తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రస్తుతం బీజేపీకి 106 సభ్యుల మద్దతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నాక కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 116కు తగ్గిపోయింది. -
హైదరాబాద్‌లో కర్ణాటకం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటకం హైదరాబాద్‌కు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను శుక్రవారం ఉదయం భాగ్యనగరానికి తరలించాయి. తొలుత కేరళలోని కొచ్చికి వెళ్లాలని భావించినా చివరికి హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇరుపార్టీల ఎమ్మెల్యేలంతా రాజధానిలోని తాజ్‌కృష్ణ, నోవాటెల్ హోటళ్లకు ప్రత్యేక బస్సుల్లో చేరిపోయారు. జేడీఎస్ పేరిట మాదాపూర్ నోవాటెల్‌లో 36 గదులను, కాంగ్రెస్ పేరిట తాజ్‌కృష్ణలో 120 గదులు బుక్ చేశారు. ఒక్కో గదిలో ఒక్కో ఎమ్మెల్యేను ఉంచారు. మిగతా గదులను ఇరుపార్టీల కీలక నేతలు, వ్యూహకర్తలు, సీనియర్ లీడర్లకు అప్పగించారు. ఓ ఇండిపెండెంట్‌తో కలిపి కాంగ్రెస్ నుంచి 77 మంది, జేడీఎస్ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. హుటాహుటిన రాష్ట్ర నేతలు.. ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాలని కాంగ్రెస్–జేడీఎస్ గురువారం అర్ధరాత్రి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ కర్ణాటక ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా ఈ రెండు హోటళ్ల వద్దకు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుంచే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హోటల్‌కు చేరుకొని కర్ణాటక ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి సమయంలోనే కర్ణాటక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌కు చేరుకుంటారని భావించారు. కానీ తర్వాత తాజ్, నోవాటెల్ హోటళ్లను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల క్యాంపులో ఎక్కడా ఎవరూ సెల్‌ఫోన్ వాడకుండా ఇరు పార్టీలు జాగ్రత్తలు వహించాయి. బస చేస్తున్న హోటళ్లలోని ల్యాండ్‌లైన్ నుంచి కూడా ఫోన్‌కాల్ బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేసినట్టు తెలిసింది. తాజ్‌కు చేరుకున్న ఎమ్మెల్యేల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాయంత్రం సిద్దరామయ్య రాక.. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఆహ్వానించి తాజ్ హోటల్‌కు తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో హోటల్ చేరుకున్న సిద్దరామయ్య.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, వీహెచ్, కన్నడ పార్టీ కీలక నేత డీకే శివకుమార్, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్, వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. 5.30 గంటల సమయంలో కన్నడ కాంగ్రెస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శనివారం బలనిరూపణ సమయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగియనుండగా 5.50 గంటల సమయంలో జేడీఎస్ నేత కుమారస్వామి తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కన్నడ పీసీసీ నేతలతో భేటీ అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఆయన నోవాటెల్‌కు వెళ్లారు. కాగా తాజ్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్దరామయ్యను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నోవాటెల్‌లో కుమారస్వామి, రేవణ్ణ ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా.. అంతకుముందే జేడీఎస్ నేత కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ నోవాటెల్‌లో వారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. జేడీఎస్ నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న వ్యూహాలను కుమారస్వామి వారికి వివరించారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో దేవెగౌడ రేవణ్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ నుంచి పొత్తు ప్రతిపాదన రావడం, సున్నితంగా తిరస్కరించిన అంశాలను కుమారస్వామి, రేవణ్ణకు ఆయన వివరించినట్టు తెలిసింది. గొడవ చేయొద్దు.. సస్పెండ్ చేస్తారు.. తమ ఎమ్మెల్యేలకు జేడీఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక సూచనలు చేశారు. శనివారం అసెంబ్లీలో జరగబోయే బలనిరూపణ సమయంలో బీజేపీ... ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగి సస్పెన్షన్ ప్లాన్ వేసిందని వివరించారు. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేను నియమించడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదేనని, దీనిపైనా శుక్రవారం రాత్రి సుప్రీంకు వెళ్తున్నట్టు సిద్ద రామయ్య, కుమారస్వామి తమ పార్టీల ఎమ్మెల్యేలకు సూచించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉండాలని, సహనం పాటించాలని పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ? కాంగ్రెస్, జేడీఎస్ క్యాంపులో ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారన్న ప్రచారంతో ఇరుపార్టీల నేతలు కలవరానికి గురయ్యారు. గెలిచినప్పట్నుంచే ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్ ఇద్దరూ పార్టీకి దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. అయితే వీరిలో ఆనంద్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని, ప్రతాపగౌడ పాటిల్ బీజేపీ అధీనంలో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ముగ్గురిలో బీఎస్పీకి చెందిన శేఖర్ సైతం హైదరాబాద్ చేరుకున్నారని, మరో ఇద్దరు బెంగళూరులోనే ఉన్నారని సమావేశంలో ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మద్దతు తెలుపుతారని సిద్దరామయ్య ఎమ్మెల్యేలకు వివరించారు. బీజేపీ నెగ్గే అవకాశం లేదు: కుమారస్వామి బలపరీక్షలో బీజేపీ నెగ్గే అవకాశం లేదని కుమారస్వామి ధీమాగా చెప్పారు. శుక్రవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి సంఖ్యాబలం లేదన్నారు. ‘ఆపరేషన్ కమల’కు చిక్కకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారనీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఏకతాటిపై నిలబడ్డారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఒకవేళ బీజేపీ ‘ఆపరేషన్ కమల’ చేపడితే, ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తాము లాక్కుంటామని హెచ్చరించారు. సంఖ్యాబలం లేకపోయినా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నతాధికారులను బదిలీ చేశారని కుమారస్వామి ఆరోపించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ వద్ద మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం దారుణం. మా కూటమి ఎమ్మెల్యేలంతా ఒక్క తాటిపై ఉన్నారు’ అని చెప్పారు. బస ఖర్చు భారీగానే.. హైదరాబాద్‌లో కాంగ్రెస్–జేడీఎస్ క్యాంపు ఖర్చు భారీగానే ఉంది. తాజ్‌లో అప్పటికప్పుడు రూం బుక్ చేయాలంటే కనీసం రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖర్చవుతుంది. భోజనం, ఇతర ఖర్చులన్నీ కలిపి 24 గంటలకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అంటే 120 గదులకు ఒక్కరోజుకే రూ.36 లక్షలు అవుతుంది. అలాగే నోవాటెల్‌లో ఒక్కో గదికి రూ.9 వేల చొప్పున కాగా.. భోజనం, తదితర ఖర్చులు మరో రూ.6 వేలకు పైగా అయినట్టు తెలిసింది. ఇలా ఆ పార్టీ ఎమ్మెల్యేల బసకు రూ.5.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఖర్చయినట్టు తెలిసింది. ఇవి కాకుండా ప్రయాణం, మధ్యలో భోజనం, ఇతర ఖర్చులకు కూడా భారీగానే వెచ్చించినట్టు సమాచారం. ఒక్క రోజు క్యాంపు మొత్తం ఖర్చు రెండు పార్టీలకు కలిపి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా అవుతుందని టీపీసీసీ, కేపీసీసీ నేతలు చర్చించుకున్నారు. అర్ధరాత్రి బెంగళూరుకు.. తాజ్‌లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాత్రి 8.40 గంటల ప్రాంతంలో డిన్నర్ చేశారు. అర్ధరాత్రి సమయంలో హోటల్ నుంచి మూడు బస్సుల్లో బెంగళూరు శివారులోని ఈగల్ రిసార్ట్‌కు వెళ్లారు. నోవాటెల్‌లో 9.30 గంటలకు భోజనం చేసి జేడీఎస్ ఎమ్మెల్యేలు రాత్రి 10 గంటలకు రెండు బస్సులో ఈగల్ రిసార్ట్‌కు బయల్దేరారు. కుమారస్వామి కారులో.. సిద్దరామయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. మొరాయించిన బస్సు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాజ్‌కృష్ణ వద్దకు వచ్చిన ఓ బస్సు హోటల్ లోపలికి వెళ్లేందుకు మొరాయించింది. 22 మంది ఎమ్మెల్యేలు లోపల ఉండగా బస్సు దిగేందుకు తలుపులు కూడా తెరుచుకోలేదు. దీంతో తాజ్‌కృష్ణ హోటల్ ముందు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎలాగోలా ఎమ్మెల్యేలను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చి భారీ బందోబస్తు మధ్య హోటల్ లోపలికి చేర్చారు. చెడిపోయిన బస్సు రోడ్డుపై రెండు గంటలు అలాగే ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాత్రూంలో ఎమ్మెల్యేలు.. హైరానా! సిద్దరామయ్య, కుమారస్వామి ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించలేదు. అదే సమయంలో కర్ణాటక నుంచి ఓ బీజేపీ ఎమ్మెల్యే హోటల్లోకి వచ్చాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో మధుయాష్కీని కుమారస్వామి అప్రమత్తం చేశారు. 200 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్‌ను జల్లెడ పట్టారు. మరో 200 మంది కార్యకర్తలను హోటల్ చుట్టూ మోహరించారు. చివరికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. బాత్రూంకు వెళ్లారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిందకు రాకపోవడంతో హైడ్రామా నడిచింది. గదుల్లోనూ లేకపోవడం, భోజనానికి రాకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. 20 నిమిషాల తర్వాత వారు ప్రత్యక్షం కావడంతో శాంతించారు. తాజ్‌కృష్ణలో సిద్దరామయ్య, కుమారస్వామితో జానారెడ్డి తదితరులు తాజ్‌కృష్ణ వద్ద రోడ్డుపై నిలిచిపోయిన బస్సు -
అధికారం కోసం రిసార్టు రాజకీయాలు
యశవంతపుర : రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బాహుభాష నటుడు ప్రకాశ్ రాజ్ అక్రోశం వెళ్లగక్కారు. హాలిడే రిసార్ట్ మేనేజర్ అందరకంటే ముందు ఉన్నట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై నిప్పులు కక్కారు. వారి వద్ద 116 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజమైన రాజకీయ గేమ్ ఇప్పుడు ప్రారంభమైన్నట్లు గురువారం ఉదయం నుండి ట్విట్టర్లో విమర్శలు చేస్తున్నారు. అన్నీ పార్టీల నాయకులు అధికారం కోసం ఆశ్రయిస్తున్నట్లు ఆరోపించారు. -
రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సమాయత్తమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుధవారం సాయంత్రం నగర శివారులోని అత్యంత ఖరీదైన ఈగల్టన్ రిసార్టుకు తరలించారు. అక్కడ మొత్తం 120 గదులను బుక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులోనే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు. గత ఏడాది గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ వలసలు నివారించేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఈ రిసార్టులోనే ఉంచింది. అప్పుడు ఎమ్మెల్యేల తరలింపులో ప్రధాన పాత్ర పోషించిన శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పుడు బీజేపీ 90, కాంగ్రెస్ 65, జేడీఎస్ 58 సీట్లు గెలిచాయి. తమ పార్టీని కాంగ్రెస్, బీజేపీలు చీల్చకుండా జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించింది. అలాగే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీతో వెళ్లాలని 2006లో కుమారస్వామి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా క్యాంపు రాజకీయాలు జరిగాయి. -
మరో రాష్ట్రంలో 'తమిళ' డ్రామా
-
మరో రాష్ట్రంలో 'తమిళ' డ్రామా
కోహిమా: తమిళనాడు రిసార్టు రాజకీయాలు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ కు పాకాయి. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ పై అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు చెందిన 40 ఎమ్మెల్యేలు బుధవారం తిరుగుబాటు చేశారు. వీరిని అసోంలోని కాజీరంగా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన రిసార్టుకు తరలించారు. దీంతో నాగాలాండ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎన్పీఎఫ్ పార్టీ అధ్యక్షుడు షుర్ హోజెలీ లీజీట్సు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. గవర్నర్ ఆచార్యతో కలిసి సీఎం జెలియాంగ్ గురువారం ఢిల్లీ వెళ్లారు. వీరిద్దరూ శుక్రవారం పీఎంఓ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ నేత రాంమాధవ్, ఎంపీ, మాజీ సీఎం నైపూ రియోతో సమావేశమయ్యారు. గవర్నర్ ఢిల్లీ నుంచి రాగానే పరిస్థితులు లీజీట్సు కు ప్రతికూలంగా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని నైపూ రియోకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. జెలియాంగ్ కంటే ముందు నాగాలాండ్ సీఎంగా నైపూ రియో పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎం పదవిని వదులుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు మధ్య వివాదం నడుస్తుండడంతో గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలతో నాగాలండ్ అట్టుడుకుతోంది. జెలియాంగ్ రాజీనామా చేయాలని నాగాలాండ్ ట్రైబల్ యాక్షన్ కమిటీ(ఎన్ టీఏసీ) గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభం తలెత్తింది. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్పీఎఫ్ కు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.