బస్సులో రిసార్టుకు బయల్దేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సమాయత్తమయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుధవారం సాయంత్రం నగర శివారులోని అత్యంత ఖరీదైన ఈగల్‌టన్ రిసార్టుకు తరలించారు. అక్కడ మొత్తం 120 గదులను బుక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులోనే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు. గత ఏడాది గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ వలసలు నివారించేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఈ రిసార్టులోనే ఉంచింది. అప్పుడు ఎమ్మెల్యేల తరలింపులో ప్రధాన పాత్ర పోషించిన శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పుడు బీజేపీ 90, కాంగ్రెస్ 65, జేడీఎస్ 58 సీట్లు గెలిచాయి. తమ పార్టీని కాంగ్రెస్, బీజేపీలు చీల్చకుండా జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించింది. అలాగే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీతో వెళ్లాలని 2006లో కుమారస్వామి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా క్యాంపు రాజకీయాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment