Karnataka Assembly Elections
-
బీజేపీ డబుల్ ఇంజిన్ పై ఏపీ కాంగ్రెస్ పీసీసీ రుద్రరాజు కీలక వ్యాఖ్యలు
-
గెలిచే వరకు పోరాడత.. కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న స్వతంత్ర అభ్యర్థి
-
కర్ణాటకలో వచ్చినట్టే తెలంగాణాలో కూడా అధికారంలోకి వస్తాం
-
మేము తగ్గాము అంతే... ఓడిపోలేదు 28 ఎంపీ సీట్లు మావే
-
BJP ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి కారణం అదే... నరేంద్ర మోదీ డూప్లికేట్ హిందూ
-
సొంతబలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం...
-
మాట్లాడుతూ ఏడ్చేసిన DK శివకుమార్
-
ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధం-కాంగ్రెస్
ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధం-కాంగ్రెస్ -
కన్నడ ఫలితాలపై కేఎస్ఆర్ కామెంట్
-
కన్నడ ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్, బీజేపీలో నిరాశ
-
లక్ అంటే బీజేపీ అభ్యర్థి రామ్మూర్తిదే..! 16 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపు..
ఎన్నికల్లో ఓట్లే ప్రధానం. ఒక్క ఓటు విజయాన్ని నిర్ణయిస్తుంది. రెండు ఓట్ల మెజారిటీ వచ్చినా, రెండు లక్షలు వచ్చినా విజేతలందరూ వెళ్లేది అసెంబ్లీకే. కానీ మెజారిటీ అనేది నియోజకవర్గంలో ఆ నాయకునికి ఉన్న పట్టుకు పలుకుబడికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో కొందరు భారీ మెజారిటీతో గెలిస్తే, కొందరు మాత్రం ఏదో గెలిచామన్నట్లు ఎన్నికయ్యారు. బనశంకరి: ఈ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో జెండా ఎగరేయగా, బీజేపీ ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో 10 మంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాగా, 8 మంది బొటాబొటీ ఆధిక్యంతో గెలిచినట్లయింది. మెజారిటీ వీరులు వీరే ► కనకపుర నియోజకవర్గంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే అత్యధికం. ► చిక్కోడి సదలగా క్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 77,749 ఓట్ల మెజారిటీతో విజయం. ► అథణిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ సవది 75,673 ఓట్లతో గెలుపు. ► బెంగళూరు పులకేశినగరలో కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ శ్రీనివాస్‌కు 62,062 ఓట్ల మెజారిటీ ► కొళ్లేగాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తికి 59,519 ఓట్ల ఆధిక్యం. యమకనమరడిలో కాంగ్రేస్ అభ్యర్థి సతీశ్ జార్కిహొళికి 57,046 ఓట్లు, బెంగళూరు సర్వజ్ఞనగరలో కాంగ్రెస్ అభ్యర్థి కేజే.జార్జ్ 55,768 మెజారిటీ దక్కింది. ► బెళగావి రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కి 55,546 ఓట్ల మెజారిటీ. బెంగళూరులో పద్మనాభనగరలో బీజేపీ అభ్యర్థి ఆర్.అశోక్ 55175 ఓట్ల మెజారిటీ. బసవనగుడిలో బీజేపీ అభ్యర్థి రవి సుబ్రమణ్యకు 54978 ఓట్ల ఆధిక్యం. అత్యల్ప ఆధిక్యంతో ఎన్నిక ≈ బెంగళూరు జయనగర నుంచి బీజేపీ అభ్యర్థి సీకే.రామ్మూర్తి 16 ఓట్ల అత్యంత స్వల్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. అలాగే గాంధీనగరలో కాంగ్రెస్ అభ్యర్థి దినేశ్ గుండూరావ్‌కు వచ్చిన మెజారిటీ 105 ఓట్లు ≈ శృంగేరిలో కాంగ్రెస్ అభ్యర్థి టీడీ రాజేగౌడ ఆధిక్యం 201 ఓట్లు ≈ మాలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేవై నంజేగౌడ ఆధిక్యం 218 ఓట్లు ≈ కుమటాలో బీజేపీ అభ్యర్థి దినకరశెట్టి ఆధిక్యం 673 ఓట్లు ≈ మూడిగెరెలో కాంగ్రెస్ అభ్యర్థిని నయన మోటమ్మ 772 ఓట్ల మెజారిటీతో గెలుపు ≈ చించోళిలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ జాదవ్ మెజారిటీ 858 ఓట్లు కాగా, జగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్రప్ప 874 ఓట్లతో గెలిచారు. -
అదే తీరు.. అదే తకరారు!
దక్షిణాదిన కీలక రాష్ట్రం కర్ణాటక బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతిలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మాత్రం ఇక్కట్లు ఎదుర్కొంటోంది. సీఎం కుర్చీ కోసం ఇద్దరు హేమాహేమీలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఈ పరిణామం చివరకు ఎటు దారి తీస్తుందో తెలియక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో నెగ్గడం కంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే పెద్ద సవాలుగా మారడం గమనార్హం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో ఇలాంటి విపత్కర పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. సుదీర్ఘ కసరత్తు తర్వాత సీఎంను నియమించినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో లుకలుకలు కొనసాగడం, అసంతృప్త సెగలు రగలడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రత్యేకత. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటే కాంగ్రెస్‌కు గ్రహపాటుగా మారుతోంది. సీఎంలను ఎంపిక చేయడంలో తప్పటడుగులు వేయడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరి కావడం ఆ పార్టీలో ఒక ఆనవాయితీగా మారింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అని సరిపెట్టుకోవాలేమో! అశోక్ గహ్లోత్ వర్సెస్ పైలట్ రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. పీసీసీ చీఫ్, యువ నాయకుడు సచిన్ పైలట్ సీఎం పోస్టు ఆశించారు. తన నాయకత్వంలోనే పార్టీ గెలిచినందున పదవి తనకే దక్కుతుందని భావించారు. కానీ సోనియా కుటుంబం మరోలా ఆలోచించింది. కారణాలేమైనా సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌ను సీఎం చేసింది. దాంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. 2021లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం ప్రయత్నించారు. సమస్య పరిష్కారానికి 2022లో గహ్లోత్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా, పైలట్‌ను సీఎంగా నియమించేందుకు పార్టీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ కుర్చీ వీడేందుకు గహ్లోత్ అంగీకరించలేదు. ఈ విషయమై పెద్ద హైడ్రామానే నడిచింది. చివరికి అధిష్టానమే దిగిరాక తప్పలేదు. పైలట్‌కు సీఎం కుర్చీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రాజస్తాన్‌లో గహ్లోత్ సర్కారుపై పైలట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు. అధిష్టానం కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. పంజాబ్‌లో పరాభవం పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు కాంగ్రెస్ కొంప ముంచాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సిద్ధూ సీఎం పదవిని కోరుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్టానం దళిత కార్డు ప్రయోగించింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా గద్దెనెక్కించింది. అమరీందర్ సింగ్ సొంత దారి చూసుకున్నారు. ఎన్నికల్లో సిద్ధూ వర్గం సహాయ నిరాకరణ చేసింది. ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం దక్కింది. ఎందుకు ఈ పరిస్థితి? అధికార బీజేపీలో మోదీయే ఏకైక పవర్ సెంటర్. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ఎవరిని సీఎంగా నియమించాలన్నా మోదీదే తుది నిర్ణయం. కాంగ్రెస్‌లో అలా కాదు. సోనియా, రాహుల్, ప్రియాంక రూపంలో మూడు పవర్ సెంటర్లున్నాయంటారు. డీకే శివకుమార్‌కు సోనియా అండదండలుంటే ప్రియాంక మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గుతుంటే రాహుల్ సైతం ఆమెను సమర్దిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ‘‘రాష్ట్రాల్లో ఎవరో ఒక్కరే శక్తివంతులుగా పెత్తనం చెలాయించడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టముండదు. అభద్రతాభావమే ఇందుకు కారణం. అందుకే పలు పవర్ సెంటర్లను ప్రోత్సహిస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అస్సాం చేజారింది ఈశాన్య భారతదేశంలో కీలక రాష్ట్రం అస్సాం. ఈ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల విసుగెత్తిపోయిన హిమంత బిశ్వ శర్మ 2015లో బీజేపీలో చేరారు. తర్వాత ఎన్నికల్లో నెగ్గి ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అస్సాం బీజేపీ ఖాతాలో చేరింది. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం గాలిలో దీపమే. ఛత్తీస్‌గఢ్‌లోనూ... ఛత్తీస్‌గఢ్‌లో సైతం కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా లేదు. పార్టీలో గ్రూప్‌లు భగ్గుమంటున్నాయి. తనను ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలపై, సీఎం భూపేష్ భగేల్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మధ్యప్రదేశ్‌ను వదిలేసుకున్నారు మధ్యప్రదేశ్‌లోనూ చేతికందిన అధికారం కాంగ్రెస్ తప్పిదంతో చేజారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవి డిమాండ్ చేశారు. సోనియా కుటుంబం కమల్‌నాథ్ వైపు మొగ్గింది. దాంతో సింధియా 2020లో తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. మెజార్టీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒప్పందంలో భాగంగా జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మిగిలింది గుండు సున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అభివృద్ధి, అభ్యర్థులకే కన్నడ ఓటరు పట్టం
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ గా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ శనివారం వెలువడిన ఫలితాలను లోతుగా విశ్లేషిస్తోంది. బీజేపీ ఘోర పరాజయం, కాంగ్రెస్ గెలుపు, భావసారూప్య పార్టీ జేడీఎస్ కొన్ని సీట్లకే పరిమితం కావడం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు, పార్టీలు, అభ్యర్థుల పనితీరు, ఓటర్ల స్పందన వంటి అంశాలపై అధ్యయనం చేస్తోంది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో అనుసరించే ఎన్నికల వ్యూహం, వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ప్రతివ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ లు, ఎజెండాల కంటే అవినీతి, అభివృద్ధి, అభ్యర్థుల గుణగణాలకే కర్ణాటక ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మసకబారిన మోదీ, షా ప్రాభవం... జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉందని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్... కర్ణాటక ఎన్నికలను కూడా అదే కోణంలో విశ్లేషిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాభవం తగ్గిందనేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిదర్శనమని భావిస్తోంది. కేంద్రంతోపాటు బీజేపీపాలిత రాష్ట్రాల్లో పాలనా వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా పనిచేసినట్లు బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. బీజేపీ అమలు చేస్తున్న విద్వేష ఎజెండాను కర్ణాటక ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే ఎజెండాను తెరపైకి తెచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. బీజేపీ ఎజెండాను గట్టిగా ఎదుర్కొనేందుకు కర్ణాటక ఎన్నికలను ఉదాహరణగా చూపడం ద్వారా దీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలకు కర్ణాటక ఫలితాలు కొంతమేర అడ్డుకట్ట వేయగలుగుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే బీజేపీ ప్రభావం కొంత ఉందని అంచనా వేస్తున్న బీఆర్ఎస్... ప్రతిదాడిని పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహం కర్ణాటక ఫలితాల ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ దూకుడు పెంచుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారిస్తే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ ఇప్పటికే ఓ కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను అనువుగా మలుచుకున్న కాంగ్రెస్... తెలంగాణలోనూ అదే తరహా వ్యూహాలను అమలు చేసే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ కాంగ్రెస్ దూకుడు పెంచే అవకాశాలున్నందున పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో మరింత వేడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అలాగే భావసారూప్య పార్టీ జేడీఎస్ కర్ణాటక ఎన్నికల్లో సాధించిన ఫలితాలను కూడా బీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. కర్నాటకలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఓటర్లు కోరుకోవడం కూడా జేడీఎస్‌పై ప్రభావం చూపినట్లు లెక్కలు వేస్తోంది. -
డిసెంబర్లోనే అసెంబ్లీ పోరు.. కర్ణాటక ఫలితాలపై బీఆర్ఎస్లో ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్ఎస్ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ.. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్చార్జులుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సాధించే ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్ తరహాలో గ్రేటర్ పరిధిలో కాంగ్రె స్ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్ పెట్టి.. బీఆర్ఎస్ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్.. కోటి ఆశల్లో కాంగ్రెస్! అక్కడ గెలిస్తే.. ఇక్కడ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో నాలుగైదు నెలలే ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త బలం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్లలోకి పార్టీ నుంచి వలసలు తగ్గుతాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది’’.. రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చనే రాజకీయ అంచనాల నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో ఆ పార్టీలో హుషారు కన్పిస్తోంది. బీజేపీని నిలువరించడం సులువు! రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ నేతలు అంటున్నా.. బీజేపీ పుంజుకుంటున్న తీరు వారిని కలవరపెడుతూనే ఉంది. బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ నుంచి అడపాదడపా బీజేపీలోకి వలసలు జరుగుతుండటం, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించనుందనే సంకేతాలు వస్తుండటం.. కాంగ్రెస్‌లో ఆందోళన పెంచుతోంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. ఈ ఆందోళనకు చెక్‌పడుతుందని, ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితులు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తుందని, అది తెలంగాణలోనూ టానిక్‌లా పనిచేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి బ్రేక్ పడుతుందని, వలసలు ఆగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్కు దీటుగా నిలిచేలా.. కర్ణాటకలో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరాజయాలు, రోజురోజుకూ క్షీణించిపోతున్న పార్టీగా ముద్ర పడుతున్న నేపథ్యంలో.. కర్ణాటక గెలుపు ఆ అభిప్రాయాన్ని తొలగిస్తుందని అంటున్నారు. ఈ ఊపుతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎన్నికలను ఎదుర్కొనే ధీమా వస్తుందని వివరిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంచుకున్నట్టే.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తారని అంటున్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా కర్ణాటకలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు గడ్డుకాలమేనని, మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అంటున్నారు. ‘‘కర్ణాటకలో మేం గెలిస్తే ధైర్యంగా తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొంటాం. అలా కాకుండా కర్ణాటకలో ఓటమి ఎదురయితే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దూకుడుగా ఎన్నికలకు వెళ్లకపోతే ఇక్కడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. అయినా కర్ణాటకలో గెలుస్తామని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకుంది’’అని టీపీసీసీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
అక్కడా, ఇక్కడా మాదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయంటున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కన్నడ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై బీజేపీలో ఉత్కంఠ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గద్దెనెక్కని సాంప్రదాయం, ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గడం వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయినా కర్ణాటకలో బీజేపీ విజయఢంకా మోగించడం తథ్యమని కమల నాథులు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని అంటున్నారు. కర్ణాటకలో గెలిస్తే.. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు, తెలంగాణలో కాషాయజెండా ఎగురవేసేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో అంతర్మథనం.. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్ అంచనాల్లో ఒకట్రెండు మినహా దాదాపు అన్నీ కాంగ్రెస్‌కు ఆధిక్యం వస్తుందనే పేర్కొన్నాయి. ఇది బీజేపీ వర్గాల్లో కొంత అంతర్మథనానికి దారితీసినా.. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్ర నేతలు మాత్రం పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పుతాయని, బీజేపీయే అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. ఇక కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలతోపాటు ఇతర చోట్ల కూడా తెలంగాణ ముఖ్యనేతలు పలువురు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఇతర నేతలు దాదాపు నెలరోజుల పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు మూడు, నాలుగు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయ, ప్రచార బాధ్యతలు నిర్వహించిన చోట్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. మేం పీపుల్ పోల్స్ నమ్ముకున్నాం: కె.లక్ష్మణ్ తాము ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టడం లేదని, అవి ఎలా ఉన్నా తాము పీపుల్ పోల్స్‌ను నమ్ముకున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్‌పోల్స్ అధికశాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది కదా అన్న మీడియా ప్రశ్నలపై స్పందించారు. కర్ణాటకలో తాను నెలరోజుల పాటు ఉన్నానని, బళ్లారి జిల్లా ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. యడ్యూరప్ప, బసవరాజు బొమ్మై ప్రభుత్వాలు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్ణాటకకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ‘మోదీ ఫాక్టర్’అనేది కచ్చి తంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. సామాజిక న్యాయ సాధన దిశలో ఎస్సీ, ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ల పెంపు, అదనంగా లింగాయత్‌లు, ఒక్కలిగలకు రెండేసి శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు వంటివి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కచ్చి తంగా తిరిగి అధికారానికి రావడం ఖాయమన్నారు. -
స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు...
-
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత
-
వీడియో: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
-
ఓటు హక్కును వినియోగించుకున్న హెచ్ డీ కుమార స్వామి
-
వీడియో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లైవ్
-
ఫస్ట్ సెమీఫైనల్ గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
-
ఇక నుంచి మీ కలే నా కల
బెంగళూరు: తమ ఓటు ద్వారా భవిష్యత్తు ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు సమాయత్తమవుతున్న కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న తన పట్ల ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు అనుపమానమైనవని ఆయన అభివర్ణించారు. లేఖలోని విషయాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్చేస్తూ ట్వీట్లు చేశారు. ‘ కర్ణాటకలోని సోదరసోదరీమణులకు నమస్కారం. రాష్ట్రంలో ప్రచారం వేళ నాపై మీరు చూపిన ఆదరాభిమానాలు సాటిలేనివి. అన్ని రంగాల్లో కర్ణాటకను అగ్రస్థానంలో నిలపాలన్న నా సంకల్పానికి మీ ప్రేమానురాగాలు మరింత శక్తిని అందించాయి. దేశంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చే యజ్ఞంలో మీ ఆశీస్సులు నాకు కావాలి. రాష్ట్ర ఉజ్వల భవిత గురించే నా విజ్ఞప్తి. మీ కుటుంబాలు, ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించే నా విన్నపం. కన్నడనాట ఈసారి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రావాలి అనే నినాదాలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. నేడు 90 వేల కోట్లు.. నాడు 30 వేల కోట్లే.. ‘‘నేడు మనం అమృతకాలంలో పయనిస్తున్నాం. ‘ఆజాదీ కా అమృత్ కాల్’లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమాన్ని కర్ణాటక ముందుండి నడిపించి ఈ కలకు నిజం చేయాలి. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇకపై మూడో స్థానమే మన లక్ష్యం. ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా కర్ణాటక ఎదిగినప్పుడే ఇది సాధ్యం. ఇక్కడ బీజేపీ హయంలో ఏటా రూ.99వేల కోట్ల విదేశీ పెట్టుబడులొచ్చాయి. గత సర్కార్ల కాలంలో ఇవి కేవలం రూ.30వేల కోట్లే. అత్యంత అనువైన జీవనం, వ్యాపార అనువైన రాష్ట్రంగా కర్ణాటక నంబర్‌వన్ స్థానంలో నిలిచేలా డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. జగత్జ్యోతి బసవేశ్వర, కెంపెగౌడ, శ్రీ కనకదాస వంటి మహానుభావులు చూపిన మార్గంలో నడుస్తూ అభినవ కర్ణాటకను నిర్మించే మహాక్రతువులో బీజేపీ నిమగ్నమైంది. ఇకపై మీ కల నా కల. మీ సంకల్పాన్ని నాదిగా భావిస్తున్నా. ఆలోచనలు కలిసి నిర్దేశించుకున్న మన ఉమ్మడి లక్ష్య సాధనను ప్రపంచంలో మరెవరూ ఆపలేరు’’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు. -
నువ్వా-నేనా! రాహుల్ అలా.. మోదీ ఇలా.. ప్రచారంలో ఎవరికి వారే భిన్న శైలి
ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాని మోదీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోస్టర్ బోయ్స్‌గా మారారు. ఇతర నేతలూ రంగంలో నిలిచి ముమ్మరంగా కలియదిరిగినా మొత్తం భారాన్ని దాదాపుగా వారిద్దరే తమ భుజస్కంధాలపైనే మోశారు. తమ పార్టీల జయాపజయాలకు ప్రధానంగా వారే బాధ్యులు కానున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ మోదీ ఇలా... కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం భిన్న శైలిలో సాగింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఓటర్లను ఆకర్షించడానికి వారు చెరో మార్గం అనుసరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు చావోరేవోగా మారిన ఈ ఎన్నికల్లో ప్రచార గడువు ముగియడానికి మూడు రోజుల ముందు నుంచి వారిద్దరూ రాజధానిపై ప్రధానంగా దృష్టి సారించారు. శని, ఆదివారాల్లో అట్టహాసంగా మోదీ 30 కిలోమీటర్లకు పైగా భారీ రోడ్ షోలు నిర్వహిస్తే, రాహుల్ మాత్రం సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోతూ ప్రచారం చేశారు. మోదీ జేపీ నగర్ నుంచి మల్లేశ్వరం వరకు 26 కి.మీ. పొడవునా, న్యూ తిప్పసంద్ర రోడ్డు నుంచి ట్రినిటి సర్కిల్ దాకా 6.5 కి.మీ. మే చేసిన రోడ్ షోలకు జనం పోటెత్తారు. దారి పొడవునా ఆయనపై పూల వర్షం కురిపించారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రయోజనాలు, బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎండగడుతూ బెంగళూరులో మోదీ ప్రసంగాలు సాగాయి. రాహుల్ అలా... రాహుల్ మాత్రం ఆది, సోమవారాల్లో రాజధాని జనంలో కలిసిపోయి ప్రచారం చేశారు. ఫుడ్ డెలివరీ బోయ్తో పాటు అతని మోటార్ సైకిల్‌పై ప్రయాణించారు. డెలివరీ యాప్‌ల బాయ్స్‌తో మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దారిన పోయేవారిని పలకరిస్తూ సాగారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి వాటిపై చర్చించారు. సోమవారం కాఫీ డేలో కాఫీ తాగుతూ సందడి చేశారు. బస్టాప్‌లో ఉన్న వారితో మాట్లాడారు. బస్సెక్కి ప్రయాణికులతో మాటలు కలిపారు. బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇమేజ్‌నే పెట్టుబడిగా పెట్టి ఎన్నికల్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. రాహులేమో పెరిగిపోతున్న ధరలనే అస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. కర్ణాటకలో బీజేపీ ప్రచారం 6 రోడ్ షోలు 19 బహిరంగ సభలు, ర్యాలీలు అమిత్ షా 15 రోడ్ షోలు 16 సభలు జేపీ నడ్డా 16 రోడ్ షోలు 10 సభలు కర్ణాటక విజయం బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎందుకు కీలకమంటే... బీజేపీ ♦ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజయం బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ ఎంతో కీలకం. ♦ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా దక్షిణాదిన తమ చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారకుండా చూసుకోవడం బీజేపీకి చాలా ముఖ్యం. ♦ కర్ణాటక గెలుపు అజేయుడైన నాయకునిగా మోదీ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. ఆయన కరిష్మాను మరింతగా పెంచుతుంది. ♦ అంతేగాక కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక వంటి ప్రధాన రాష్ట్రంలో ఓటమి చవిచూస్తే విపక్షాలు దూకుడు పెంచుతాయి. ♦ గత 38 ఏళ్లలో ఏ పార్టీనీ వరుసగా రెండోసారి గెలిపించని కర్ణాటక ఆనవాయితీని తిరగరాయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ♦ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ హామీ, ముస్లిం కోటా రద్దుపై ఆ పార్టీ వైఖరి సహా ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారాంశంగా మలచుకుంది. కాంగ్రెస్ ♦ కొన్నేళ్లుగా వరుసగా ఎన్నికల ఓటములతో బాగా డీలా పడి ఉన్న కాంగ్రెస్‌కు కర్ణాటక గెలుపు ప్రాణావసరమనే చెప్పాలి. ♦ లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ప్రయత్నాలకు ఊపు తెచ్చేందుకు కూడా ఇది టానిక్‌లా ఉపయోగపడుతుంది. ♦ జనాకర్షక నేతగా ప్రధాని మోదీకి దీటుగా రాహుల్ ఎదగాలంటే ఈ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం ఓట్లు రాల్చి పార్టీని గెలిపించడం తప్పనిసరి అవసరం. ♦ ఇక కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయనకూ ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ♦ ప్రచారంలో కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా కలియదిరిగారు. ప్రచారం చివరి దశలో సోనియా కూడా ఒక సభలో పాల్గొన్నారు. ♦ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నెన్నో హామీలు గుప్పించింది. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లను ఏకంగా 75 శాతానికి పెంచుతామని కూడా చెప్పింది. ♦ అయితే పోలింగ్ మరో వారం ఉందనగా వేళ మే 2న ఉన్నట్టుండి బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న హామీతో బీజేపీకి చేజేతులా అ్రస్తాన్ని అందించింది. కానీ కోస్తా కర్ణాటక మినహా మిగతా రాష్ట్రమంతటా ఈ హామీ తమకు తప్పకుండా ఓట్లు రాలుస్తుందని కాంగ్రెస్ ఆశపడుతోంది. -
సర్వేలు ఓకే.. ఇక జనం ఓటు వేస్తారో లేదో తెలియాలి..!
సర్వేలు అనుకూలంగా ఓటేశార్సార్.. ఇక జనం వేస్తారో లేదో తెలియాలి..! -
ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల ఎన్నికలపైనా కన్నడ ఫలితాల ప్రభావం
-
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్
-
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్న సౌమ్యారెడ్డి
-
Karnataka assembly elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి. ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది. 2013 ఎన్నికలు ప్రత్యేకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది. ఎందుకీ పరిస్థితి..? కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్‌కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్‌లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. -
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం
-
దక్షిణ కన్నడలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
-
Karnataka assembly elections 2023: 40 శాతం కమీషన్లు కన్పించడం లేదా?
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలు క్రితం అడ్డదారిలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కర్ణాటకలో విజయపుర జిల్లాలోని ఇండి నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని అందరూ కొనియాడుతూ ఉంటారని అలాంటప్పుడు ఆయనకు కర్ణాటకలో ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతీ పనికి 40% కమీషన్లు తీసుకుంటూ ఉంటే కర్ణాకటను అభివృద్ధికే నమూనాగా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంట్రాక్టర్లు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతితో కంపెనీలు హైదరాబాద్, చైన్నై వైపు వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఓట్ల కోసం తాను రాలేదని, వారి భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసమే వచ్చానంటూ ప్రియాంక భావోద్వేగంతో మాట్లాడారు. -
కన్నడనాట తెలుగువాడి వేడి.. వలస ఏ పార్టీకో! ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు
సాక్షి బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే..! దశాబ్దాలుగా కన్నడ నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రానికి లేని విదంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఏకంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఎక్కువే. బెంగుళూరు వంటి మహానగరంలో వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో ఉన్నారు. రాష్ట్రంలో 65.45 లక్షల మందివరకు వలసదారులు ఉన్నారు. వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల బరిలో కూడా ఎందరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు మూలాలున్న వారు 100 మంది, మరాఠా మూలాలున్న వారు 50 మందికి పైగా, తమిళులు 10 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో ఎవరి జనాభా ఎంత? ► రాజధానిలో 44 శాతం కన్నడిగులు ఉంటే 56 శాతం ఇతర భాషా ప్రజలు ఉన్నారు. తెలుగు వారు అత్యధికంగా 25–30 లక్షల మంది ఉన్నారు. ► తమిళులు 16–17 లక్షల మంది ఉంటే మళయాలీలు 4–5 లక్షలు ఉన్నారు ► ఇక ఉత్తరాది రాష్ట్రాల జనాభా 11–12% ఉన్నారు.రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో జార్ఖండ్, త్రిపుర నుంచి కూడా వలసలు పెరిగాయి. ► రాజస్తాన్‌కు చెందిన జైన సామాజికవర్గం ప్రజలు బెంగళూరులో చాలా చోట్ల నివసిస్తూ ఎన్నికల్లో నిర్ణయాకత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు వాడి వేడి కర్ణాటకలో దాదాపుగా 40–50 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో సుమారు కోటి మంది వరకు తెలుగు ప్రజలు కర్ణాటకలో నివసిస్తున్నట్లు అనధికారిక సమాచారం. పలు దశాబ్దాలుగా వివిధ కారణాలతో కర్ణాటకకు వచ్చి ఇక్కడి కన్నడిగులతో మిళితమై తెలుగు వారు జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వహిస్తున్న వారిలో అధిక భాగం తెలుగు ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. ఒక్క బెంగళూరులోనే సుమారు 25 లక్షలకు పైగా తెలుగు వారు ఉన్నారు. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. బెంగళూరులోని కేఆర్ పురం, రామ్మూర్తినగర, హెబ్బాళ, మారతహళ్లి, మహదేవపుర, యలహంకా, దేవనహళ్లితో పాటు ఏపీ, తెలంగాణ సరిహద్దు కలిగిన బళ్లారి జిల్లా, బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, బసవకల్యాణ, కోలార, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. 1947లో ఏర్పడిన మైసూరు రాష్ట్రానికి తెలుగు వ్యక్తి క్యాసంబల్లి చెంగరాయరెడ్డి ఎన్నికయ్యారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఎందరో తెలుగువారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఓట్ల కోసం వ్యూహాలు కర్ణాటకకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలసదారులు గుర్తింపు సమస్యని అధికంగా ఎదుర్కొంటున్నారు. 65 లక్షల మంది వలసదారుల్లో ఎంత మందికి కర్ణాటకలో ఓటు హక్కు ఉందో అన్న దానిపై స్పష్టమైన గణాంకాలేవీ లేవు. కార్మికులుగా పని చేస్తున్న వారికి తాగు నీరు, ఉండడానికి ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటివన్నీ సమస్యలుగానే ఉన్నాయి. టీ, కాఫీ తోటల్లో పని చేస్తున్న కూలీలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార బీజేపీ వీరిని సంప్రదిస్తూ రేషన్ కార్డులు ఇప్పించడం, ప్రభుత్వం పథకాలు వారికి అందేలా చూస్తామని హామీలు ఇస్తోంది. వలసదారుల ఓట్లను రాబట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన హార్దిక్ పటేల్ సహా వివిధ రాష్ట్రాల యువ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ భాషలకు చెందిన వారి ఓట్లను రాబట్టేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల్ని ప్రచార పర్వంలోకి తీసుకువచ్చింది. -
మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
-
సంయమనం పాటించండి
న్యూఢిల్లీ: విషసర్పం, విషకన్య, పనికిమాలిన కుమారుడు. ఇలా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు శ్రుతి మించుతున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహించింది. పార్టీలు, స్టార్ ప్రచారకులు సంయమనం పాటించాలంటూ హితవు పలికింది. ఆమోదనీయం కాని పదజాలంతో ఎన్నికల వాతావరణాన్ని పాడుచేయొద్దని సూచించింది. కోడ్‌కు అనుగుణంగా హుందాగా నడచుకోవడం పార్టీ ల విధి అని స్పష్టం చేసింది. మరోవైపు, బీజేపీ స్టార్ ప్రచారకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విద్వేష ప్రసంగాలతో కర్ణాటక ప్రజలను రెచ్చగొట్టజూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రచారం చేయకుండా వారిపై తక్షణం నిషేధం విధించాలని ఈసీని కోరింది. -
బీజేపీ అడ్డాపై కాంగ్రెస్ కన్ను
ఏడు జిల్లాలు, 50 అసెంబ్లీ స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజేతను తేల్చడంలో కీలకంగా ఉంటోంది. బీజేపీకి ప్రధాన ఓటుబ్యాంకైన లింగాయత్‌లు అధికంగా ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జేడీ(ఎస్) ఉనికి ఇక్కడ కూడా నామమాత్రమే.. సాక్షి, బెంగళూరు: బ్రిటిషర్లతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ పేరిట 2021లో ముంబై కర్ణాటక పేరును కిత్తూరు కర్ణాటకగా మార్చారు. ఇక్కడ ఉత్తర కన్నడ మినహాయించి మిగతా ఆరు జిల్లాల్లోనూ లింగాయత్‌లదే ప్రాబల్యం. దశాబ్దాలుగా వారు బీజేపీకి దన్నుగా నిలుస్తున్నారు. ఆధిక్యం అటూ ఇటూ ♦ ముంబై కర్ణాటక తొలినాళ్లల్లో కాంగ్రెస్ కంచుకోట. 1990 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్ పక్షవాతం బారిన పడటంతో ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ను తొలగించారు. దాంతో కాంగ్రెస్‌పై లింగాయత్‌లు భగ్గుమన్నారు. తర్వాత బీజేపీ లింగాయత్ నేత బీఎస్ యడియూరప్ప వెనక నడిచారు. ♦ క్రమంగా ఈ ప్రాంతం బీజేపీ కంచుకోటగా మారింది. అలా సాగిన బీజేపీ హవాకు యడియూరప్ప తిరుగుబావుట ఎగరేసి సొంత కుంపటి పెట్టుకోవడంతో 2013లో అడ్డుకట్ట పడింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 30 సీట్లు గెలిచింది. ♦ 2014 లోకసభ ఎన్నికల అనంతరం యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ముంబై కర్ణాటక మళ్లీ బీజేపీ పట్టులోకి వెళ్లింది. దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30, కాంగ్రెస్ 17 సీట్లు గెలిచాయి. ♦ యడియూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అంతటి లింగాయత్ నేతను బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ♦ అధికార బీజేపీ కూడా సరిగ్గా ఎన్నికలకు నెల ముందు లింగాయత్‌ల ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు వారి రిజర్వేషన్లను 2 నుంచి 4 శాతానికి పెంచింది. ఇది బాగా కలిసొస్తుందని ఆశిస్తోంది. ♦ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెళగావి, ధారవాడల్లో భారీ సభలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ బెళగావిలో యువ క్రాంతి, యువ సమావేశాలు నిర్వహించారు. బెళగావిలో కీలక పోరు ♦ బెంగళూరు నగరం (28 సీట్లు) తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లు (18)న్న బెళగావి జిల్లా ముంబై కర్ణాటక ప్రాంతంలోనే ఉంది. ఈ జిల్లా రాజకీయంగానూ చాలా కీలకం. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 10, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. ♦ రెండు పార్టీల్లోనూ గట్టి రాజకీయ కుటుంబాలున్నాయి. జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు చక్కెర సహకార సంఘాలున్నాయి. నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బెళగావి నుంచే ప్రజాధ్వని యాత్ర పేరిట ఎన్నికల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ♦ ఉమేశ్ కత్తి, సవదత్తి మామని వంటి కీలక నేతల హఠాన్మరణంతో బీజేపీ ఇక్కడ కాస్త బలహీనపడింది. దీనికి తోడు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది వంటి సీనియర్లు పార్టీని వీడటంతో మరింత డీలా పడింది. శెట్టర్ హుబ్లీ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున బీజేపీకి సవాలు విసురుతున్నారు. ♦ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్న శిగ్గావ్ స్థానం ముంబై కర్ణాటక కిందకే వస్తుంది. 2018 నుంచీ ఇక్కడ పలు జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సిద్ధరామయ్య బాగలకోటె జిల్లా బాదామి నుంచి గెలుపొందారు. ♦ విజయపుర జిల్లాలో బీజేపీ సీనియర్ నేత బసవనగౌడ పాటిల్ నోటి దురుసు పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో యడియూరప్పపై బహిరంగంగా విమర్శలతో పార్టీకి నష్టం చేసిన చరిత్ర ఆయనది. ఈసారీ సీఎం అభ్యర్థి తానేనంటూ హల్చల్ చేస్తున్నారు. ♦ ఇక 7 సీట్లున్న ధారవాడ జిల్లా కూడా బీజేపీకి కీలకమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Karnataka assembly elections 2023: కర్ణాటక ఎన్నికలు మీ కోసం కాదు
తుమకూరు: కాంగ్రెస్ నేతలు తనను 91 పర్యాయాలు దూషించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటక ఎన్నికలు ఆయన కోసం కాదన్న విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. రాహుల్ సోమవారం తురువెకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల ప్రచారం కోసం మీరు కర్ణాటకకు వచ్చారు. గత మూడేళ్లలో మీరు కర్ణాటకకు ఏం చేశారో చెప్పాలి. అలాగే, వచ్చే అయిదేళ్లలో యువత, విద్య, ఆరోగ్యం, అవినీతిపై పోరు వంటి అంశాల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. అయితే, మీరు కర్ణాటక గురించి మాట్లాడటం లేదు. ఇక్కడి నేతలు బొమ్మై, యడ్యూరప్ప గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు. నరేంద్ర మోదీ గురించి మాత్రం చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికలు ఏ ఒక్కరి కోసమో కాదు. మోదీ గురించి కాదని గ్రహించాలి’ అన్నారు. ‘‘కర్ణాటకలో పర్యటనలప్పుడు సిద్దరామయ్య, శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రజల కోసం ఏం చేశారో నేను చెబుతుంటా. మోదీ కూడా సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప పేర్లను ఒకట్రెండుసార్లు ప్రస్తావిస్తే వారు కూడా సంతోషపడతారు కదా!’’ అని రాహుల్ అన్నారు. బీజేపీకి 40 సీట్లు చాలు కర్ణాటకలో బీజేపీ సర్కారు 40 శాతం పర్సంటేజీలు తీసుకుంటోందని కాబట్టి ఈ ఎన్నికల్లో 40 సీట్లు ఇస్తే చాలని రాహుల్ అన్నారు. ప్రతి పనికీ కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్న బీజేపీని ఈసారి 40 సీట్లకే పరిమితం చేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో 150 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లయితే తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోలేదని అన్నారు. బీజేపీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మఠాధిపతుల నుంచీ వసూళ్లు చేసిందన్నారు. -
Karnataka assembly elections 2023: మోదీ ‘అసమర్థుడైన కొడుకు’
బెంగళూరు: ప్రధాని మోదీని విషసర్పమంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై గొడవ కొనసాగుతుండగానే ఆయన కొడుకు ప్రియాంక్ ఖర్గే మరో వివాదానికి తెర తీశారు. కలబురగి జిల్లా చిట్టాపూర్ స్థానం నుంచి మళ్లీ ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్న ఖర్గే తనయుడు ప్రియాంక్ సోమవారం మోదీని అసమర్థుడైన కొడుకుగా అభివర్ణించారు. బంజారా కులంలో పుట్టానంటున్న మోదీ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ‘‘మీరేం భయపడకండి, మీ కొడుకు ఢిల్లీలో ఉన్నాడని కలబురగి బంజారా ప్రజలకు హామీ ఇచ్చారు. అసమర్థుడైన కొడుకు ఢిల్లీలో ఉంటే ఆ కుటుంబం ఎలా ముందుకెళుతుంది?’’ అని ప్రశ్నించారు. కోలి, కబ్బలిగ, కురుబ వర్గానికి చెందినవాడినని గతంలో చెప్పిన మోదీ, తాజాగా బంజారా వర్గం వాడినని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. -
Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు
శివాజీనగర: పోలింగ్‌కు పది రోజులే గడువు ఉందనగా కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే ఏకీకృత పౌర స్మృతి, జాతీయ పౌర పట్టీ అమలుచేస్తామని బీజేపీ ప్రకటించింది. ‘ఏకీకృత పౌరస్మృతి దిశగా మేం నడిచేలా రాజ్యాంగం మాకు దారి చూపింది. ‘అందరికీ న్యాయం. బుజ్జగింపులు లేవిక’ అనేదే మా నినాదం’’ అంటూ ఎన్నికల హామీల చిట్టాను సోమవారం బెంగళూరులో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. ‘ఆరు ‘ఏ’లు అంటే ఏ–అన్న(ఆహార భద్రత), ఏ–అక్షర(నాణ్యమైన విద్య), ఏ–ఆరోగ్య(అందుబాటులో ఆరోగ్యం), ఏ–ఆదాయ(ఆదాయ హామీ), ఏ–అభయ(అందరికీ సామాజిక న్యాయం), ఏ–అభివృద్ధి(డెవలప్మెంట్) ఉండేలా బీజేపీ ప్రజా ప్రణాళికను రూపొందించింది’ అని నడ్డా అన్నారు. మేనిఫెస్టోలో మొత్తంగా 103 వాగ్దానాలు ఉన్నాయి. అభివృద్ధికేంద్రంగా మేనిఫెఫ్టో ఉందంటూ మోదీ కొనియాడారు. మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అమలు ► దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు. ► ఈ కుటుంబాలకు ‘పోషణి’ పథకం ద్వారా ఉచితంగా రోజుకు అర లీటరు నందిని పాలు. నెలకు ఐదు కేజీల ‘శ్రీ అన్న– సిరి ధాన్య’. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ వార్డులో ‘అటల్ ఆహార కేంద్రం’ను నెలకొల్పుతాం. అత్యంత కనిష్ట ధరకే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ► మత ప్రాతిపదికన, ఉగ్రవాద వ్యతిరేక కర్ణాటక విభాగం(కే–ఎస్డబ్ల్యూఐఎఫ్టీ) ఏర్పాటు. ► రెవిన్యూ శాఖ గుర్తించిన సొంతిల్లులేని వారికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల స్థలాలు. ► సామాజిక న్యాయ నిధి పేరిట ఎస్సీ/ఎస్టీ వర్గాల గృహిణులకు గరిష్టంగా రూ.10,000 దాకా ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల అవకాశం. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రముఖ విద్యావేత్తలు, సంస్థల సౌజన్యంలో విశ్వేశ్వర విద్యా యోజన పథకం ► మిషన్ స్వాస్థ్య కర్ణాటక కింద ప్రతీ వార్డులో నమ్మ క్లినిక్(మన క్లినిక్). ► ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకాల ద్వారా మరో 10 లక్షల ఉద్యోగాల కల్పన. ► సివిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం. ► కర్ణాటకను ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చేందుకు చార్జింగ్ స్టేషన్ల స్థాపన, వేయి అంకుర సంస్థలకు ప్రోత్సాహం. ► అన్ని గ్రామ పంచాయతీల్లో చిన్న ఎయిర్ కండిషన్ సదుపాయాలు. వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాల స్థాపన. ఇందుకోసం రూ.30 వేల కోట్ల అగ్రిఫండ్ ఏర్పాటు. యడియూరప్ప అసంతృప్తి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రసంగించాలని మాజీ సీఎం యడియూరప్పను నేతలు కోరగా.. ప్రణాళికను పూర్తిగా చదవ కుండా ప్రసంగం చేయమంటే ఎలాగని ఆయ న అసంతృప్తిని వ్యక్తంచేశారు. ముందుగానే మేనిఫెస్టో కాపీని ఇవ్వాల్సిందని అనడంతో ఆయనలోని అసంతృప్తి బయటపడింది. అంతా బోగస్: కాంగ్రెస్ విమర్శ ‘అబద్ధపు, లూటీల బీజేపీ మేనిఫెస్టో ఇది. అంతా బోగస్’ అని బీజేపీ హామీల చిట్టాపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ‘ మేనిఫెస్టోలో ఉన్న వాటిల్లో 90 శాతం హామీలు 2018లోనే ఇచ్చింది. వీటిని ఇంతవరకు అమలుచేయలేదు. ఇప్పుడు మరో దఫా బోగస్ హామీలిస్తోంది’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్‌చేశారు. ‘ నందిని బ్రాండ్‌ను అమూల్‌లో కలిపేసి కర్ణాటక ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసింది. పెను విమర్శలతో ముఖం చెల్లని బీజేపీ ఇప్పుడు అర లీటర్ ఉచితమంటూ ముందుకొచ్చింది. ఇందిర క్యాంటీన్లను మూసేసిన ఇదే సర్కార్ ఇప్పుడు పేరుమార్చి మళ్లీ తెరుస్తానంటోంది. బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి ఇప్పుడు ‘స్టేట్ కేపిటల్ రీజియన్’ అంటూ కొత్తరకం ఫ్యాన్సీ పేర్లతో మభ్యపెడుతోంది. యూపీలో రెండు ఉచిత సిలిండర్లు అన్నారు. ఇంతవరకు దిక్కులేదు. కర్ణాటకలో ఏకంగా మూడు ఇస్తామంటున్నారు’ అని మరో నేత జైరాం రమేశ్ ఎద్దేవాచేశారు. 2013–18 కాలంలో కర్ణాటకలో కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ 95 శాతం హామీలను నెరవేర్చిందని గుర్తుచేశారు. -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్‌లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్‌ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
Karnataka assembly elections 2023: అవును, శివుని కంఠంలో సర్పాన్నే!
కోలారు: కాంగ్రెస్, జేడీ(ఎస్) కుటుంబ పాలనే కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు కారణమంటూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అవి అవినీతిని పెంచి పోషించాయని, అస్థిరతను అవకాశంగా తీసుకుని రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చాయని మండిపడ్డారు. లూటీపైనే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. ‘కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు కర్ణాటకలో ప్రత్యర్థులుగా నటిస్తారు. ఢిల్లీలో మాత్రం కలిసే ఉంటారు. పార్లమెంటులో పరస్పరం సహాయం చేసుకుంటారు’’ అన్నారు. మోదీ ఆదివారం రామనగర జిల్లాలో జేడీ(ఎస్) కంచుకోట అయిన చెన్నపట్నలో బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘జేడీ(ఎస్)కు పడే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చి రాష్ట్రాన్ని అస్థిరపరుస్తుంది. ఇక కాంగ్రెస్‌ది 85 శాతం కమిషన్ సర్కారు. ద్రోహానికి మరోపేరు. 2008లో తప్పుడు రుణమాఫీ తెచ్చింది. కాంగ్రెస్ నేతల సంబంధీకుల, అవినీతిపరుల రుణాలే మాఫీ అయ్యాయి. ఇదీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనను విషసర్పంతో పోల్చినందుకు తనకేమీ బాధ లేదని మోదీ అన్నారు. ‘‘పాము శివుని మెడలో హారం. అవును. నేను ప్రజల మెడలో పామునే. వారిని రక్షిస్తూ ఉంటా’’ అన్నారు. -
కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరు
-
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం ► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి ► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది ► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం. ► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు ► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే. -
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి... సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం ► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. ► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం. ► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు. ► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది. ► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు. ► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్‌పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీ... ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది. ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...? దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
కర్నాటక ప్రచారంలో విషాలు చిమ్ముకుంటోన్న కాంగ్రెస్-బీజేపీలు
-
Karnataka assembly election 2023: రాజకీయాల్లో నటీనటులు
సాక్షి, ఎన్నికల డెస్క్: దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలకు– సినీ తారలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఏది చూసినా సినిమాలు– రాజకీయాలు పెనవేసుకుని కనిపిస్తాయి. కొంతకాలంగా కన్నడ చిత్రసీమ శాండల్‌వుడ్ నుంచి సినీనటులు రాజకీయ రంగంపై చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో ఎందుకనో ఎక్కువమంది తారలు చురుగ్గా పాల్గొనడం లేదు. ఒకరో ఇద్దరో బరిలో ఉండగా, తక్కువమంది మాత్రమే నేతలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రముఖులు కొందరే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సినీ నటీనటులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఎన్నికల బరిలో ప్రముఖ నటులు కూడా లేకపోవడం విశేషం. రాజకీయ నేతలు ఎవరూ కూడా సినీ తారలకు రెడ్ కార్పెడ్ పరిచినట్లు లేదు. జేడీఎస్ తరఫున రామనగర నుంచి వర్ధమాన నటుడు నిఖిల్ పోటీలో ఉన్నారు. బీజేపీకి, సీఎం బొమ్మైకి మద్దతుగా నటుడు కిచ్చా సుదీప్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి పరిమితం అయ్యారు. మరో ప్రముఖ నటుడు దర్శన్దీ అదే తీరు. కేజీఎఫ్ హీరో యశ్ ఎన్నికల ఛాయలకే రాలేదు. గతంలో ప్రజాకీయ పార్టీని పెట్టిన ఉపేంద్ర మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ లీడర్ రమ్య ఎక్కడ? అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యస్పందన తారాజువ్వలా ఎగిశారు. ఆమె తల్లి రజిత కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేశారు. నటి రమ్య 2012లో కాంగ్రెస్‌లో చేరి మండ్య ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో ఉన్నప్పటికీ కన్నడనాట ప్రచారానికి దూరంగానే ఉండడం చర్చనీయాంశమైంది. అంబరీశ్దే అగ్రస్థానం కన్నడ రెబల్‌స్టార్ 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత జనతాదళ్‌లో (1996 – 99) చేరి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. తిరిగి సొంతగూటికి చేరుకుని మరోసారి పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంతి అయ్యారు. అంబరీశ్ సతీమణి సుమలత 2019లో మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె తరఫున నటులు దర్శన్, యశ్ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. రాజకీయాల్లో నటీనటులు ► పోలీసు అధికారిగా పని చేసిన బీసీ పాటిల్ తర్వాత సినీ రంగం వైపు దృష్టి సారించారు. వెండితెరపై రాణిస్తూనే రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు. ► తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సాయికుమార్ చిక్కబళ్లాపుర బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా అదృష్టం కలిసిరాలేదు. ఆపై రాజకీయాల వైపు చూడలేదు. ► జస్ట్ ఆస్కింగ్ అంటూ 2018 ఎన్నికల్లో కన్నడనాట ఆకర్షించిన వైవిధ్య నటుడు ప్రకాష్‌రాజ్ ఈ ఎన్నికల్లో కనిపించనేలేదు. ఏ పార్టీకి మద్దతుగా గళమెత్తలేదు. గతంలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ► రెండు దశాబ్దాల పాటు వెండితెరపై వెలిగిన తార శృతి. బీజేపీలో మహిళా విభాగం నేతగా కొనసాగుతున్నారు. ► సుమారు 300 చిత్రాల్లో నటించిన అనంత్‌నాగ్ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ చురుకై న పాత్ర పోషించలేదు. ► కన్నడ చిత్రాల్లో సహాయక నటిగా రాణించిన ఉమాశ్రీ హాస్యం పండించి ఆకట్టుకునేది. 2013లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు. ► సినిమాల్లో సహాయక నటిగా రాణించిన తార అనురాధ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్‌గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
Karnataka assembly election 2023: వారికి మతి పోయింది
సాక్షి, బళ్లారి: ప్రధాని మోదీ విషసర్పమన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి, వారి నేతలకు మతి భ్రమించిందనేందుకు రుజువని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. శుక్రవారం కర్ణాటకలో గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఆయన పలు సభలో మాట్లాడారు. ‘‘మోదీని విషసర్పంతో పోల్చడం ఆ పార్టీ ఎంతగా దిగజారిందనేందుకు రుజువు. వారెంతగా విమర్శిస్తే అంతగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది’’ అన్నారు. ‘తీవ్రవాద భావజాల పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించినందుకు నాపై కేసు పెట్టారు. పీఎఫ్ఐను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది. దానిపై నిషేధం తర్వాత కర్ణాటక సురక్షితంగా ఉంది’’ అన్నారు. ‘‘సీఎం తానంటే తానని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాదులాడుకుంటున్నారు. అవసరం లేదు. సీఎం బీజేపీ వ్యక్తే అవుతారు. కన్నడ ఓటర్లు బీజేపీనే గెలిపిస్తారు. ఓటర్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు విశ్వసిస్తారు?. కొన్ని విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి.. అబద్దాలు, అవినీతి, కులతత్వం, వంశపాలన, బుజ్జగింపు రాజకీయాలు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. -
రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే అర్బన్ ఓటర్లు కీలకం
-
karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు
శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా. మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్‌పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్‌కట్‌లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్‌ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్‌కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
మధ్య కర్ణాటకలో ఆసక్తికర రాజకీయం
-
సిద్ధరామయ్య మా దేవుడు అంటున్న వరుణ ప్రజలు
-
Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు. సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్‌పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు. -
Karnataka Assembly Election 2023: జేడీ(ఎస్)కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లే
సక్లేశ్పుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్) కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఓటు వేస్తే చివరకు కాంగ్రెస్‌తో జత కట్టిందని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సక్లేశ్పుర సెగ్మెంట్లోని ఆలూరులో సోమవారం భారీ రోడ్డు షోలో అమిత్ షా ప్రసంగించారు.మీ ఓటు వృథా కావొద్దంటే బీజేపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. హసన్ జిల్లాలో ఈసారి మరిన్ని సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కలిగలు, లింగాయత్‌లకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్‌మేకర్‌గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
25 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తాం : గాలి జనార్ధన్
-
Karnataka: నేత మారితే ఓటు నష్టం!
బనశంకరి: సిద్ధాంతాలు, విశ్వాసాలు తరువాతి సంగతి. మనకు టికెట్ రాకపోతే పార్టీ మారిపోదాం అనే ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో సీనియర్లు సైతం ఇట్టే పార్టీలను మార్చడం ఈ ఎన్నికల్లో ద్యోతకమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపుల్లో అసమ్మతి చెలరేగి సీనియర్ నాయకులు అనూహ్యంగా పార్టీలు మారడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రతి ఎన్నికల సమయంలో వలసలు మామూలే. కానీ మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోని జగదీశ్ షెట్టర్ వంటి నాయకులు జెండాలను మార్చుకోవడం సంచలనం రేపింది. కాంగ్రెస్, బీజేపీలో ప్రయోగాలకు పూనుకోవడంతో అనేకమందికి టికెట్లు దక్కకపోగా కొత్తముఖాలకు టిక్కెట్లు కేటాయించారు. ఫలితంగా సాగిన వలసల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయోనన్నది పార్టీలతో పాటు సామాన్యులకూ ఉత్కంఠ కలిగిస్తోంది. ఓటుబ్యాంకు చీలే అవకాశం వలసల వల్ల ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీయస్లలో ఓటుబ్యాంక్ చీలుతుందనే భయం నెలకొంది. టికెట్లు దక్కని నేతలు నియోజకవర్గాల్లో వారి ప్రభావంతో ఓట్లను చీల్చవచ్చనే భయం అభ్యర్థుల్లో ఉంది. అసమ్మతితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలను అగ్రనేతలు ముమ్మరం చేశారు. అధికార బీజేపీలో అసమ్మతీయులు పెద్దసంఖ్యలో ఉన్నారు. గతంలోనే కొందరు నేతలు ప్రతిపక్షాలలోకి చేరారు. బీజేపీలో లింగాయతులకు అన్యాయం జరుగుతోందని షెట్టర్ ఆరోపించడం, ఎలాంటి అన్యాయం జరగలేదని వేదికలపై సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి బీజేపీకి రావడం గమనార్హం. వలసల వల్ల జేడీఎస్ లాభపడితే, కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నష్టమైతే జరగలేదని అంచనా. బలమైన నాయకులు వెళ్లిపోవడం వల్ల ఎంతమాత్రం ఓట్లు నష్టపోవచ్చనే లెక్కలు తేల్చడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. పార్టీలు మారిన నేతలు ఎందరో జగదీశ్ షెట్టర్, లక్ష్మణసవది, పుట్టణ్ణ, బాబూరావ్ చించినసూర్, వీఎస్.పాటిల్, యుబీ.బణకార్, ఎన్వై.గోపాలకృష్ణ నేతలు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఎస్.యడియూరప్ప అనుచరుడు ఎన్ఆర్.సంతోష్ జేడీయస్ పార్టీలోకి వెళ్లారు. ఎస్ఆర్.శ్రీనివాస్, కేఎం.శివలింగేగౌడ అనే ఇద్దరు జేడీయస్ ఎమ్మెల్యేలు కాంగ్రేస్ పార్టీలోకి దూకారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగరాజచబ్బి, బీవీ.నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీలోని ఆయనూరు మంజునాథ్, ఎంపీ కుమారస్వామి, సూర్యకాంతనాగమారపల్లి జేడీయస్ పార్టీలో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలామంది నాయకులు చేరుతారు. -
బళ్లారి కోటపై విజయకేతనం ఎవరిదో?
సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం చోటు చేసుకున్నా దాని మూలాలు బళ్లారిలోనే ఉంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలందరూ బళ్లారిపైనే దృష్టి పెడుతుంటారు. ఈసారి బళ్లారి నగర అసెంబ్లీ ఎన్నికల పోరులో చతుర్ముఖపోటీ నెలకొంది. అయితే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, కేఆర్‌పీపీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బళ్లారి కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ తరఫున నారాభరత్‌రెడ్డి, కేఆర్పీపీ తరఫున గాలి లక్ష్మీ అరుణ బరిలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడి భంగపడిన అనిల్‌లాడ్ జేడీఎస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువ బళ్లారి సిటీ నియోజకవర్గంలో 2,58,588 ఓటర్లు ఉండగా 1,32,780 మంది మహిళలు, 1,25,779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో విజేతలు ఎవరనేది మహిళలే నిర్ణయించనున్నారు. బళ్లారి సిటీలో 39 వార్డులు ఉండగా, సిటీ నియోజకవర్గం పరిధిలోకి 26 వార్డులు వస్తాయి. తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ బళ్లారిలో తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఇక్కడే స్థిరపడి వ్యవసాయం, సివిల్ కాంట్రాక్టు పనులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. బళ్లారి అసెంబ్లీ పోరులో తలపడుతున్న అభ్యర్థులు బళ్లారిలోనే పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ వీరి పూర్వికులు ఏపీవారే. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, కేఆర్పీపీ తరఫున బరిలో ఉన్నది ఒకే సామాజికవర్గానికి చెందినవారే. వీరంతా ఆర్థికంగా స్థితిమంతులు. పైగా బీజేపీ తరఫున బరిలో ఉన్న గాలి సోమశేఖరరెడ్డి, కేఆర్పీపీ తరఫున పోటీలో ఉన్న గాలి లక్ష్మీ అరుణలు స్వయానా బావ,మరదులు కావడం విశేషం. దీంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎవరి ధీమా వారిదే కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి, గాలి జనార్దనరెడ్డి సతీమణీ గాలి లక్ష్మీ అరుణ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టి బళ్లారి ప్రజల వాణి వినిపించేందుకు హోరా–హోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి మూడో పర్యాయం విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బళ్లారి నగరంలో తాను చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి కారణమవుతాయని గాలిసోమశేఖరరెడ్డి ధీమాతో ఉన్నారు. ఈమేరకు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందువల్ల ప్రజలు బీజేపీని వీడి తమను గెలిపిస్తారని, కాంగ్రెస్, కేఆర్పీపీ అభ్యర్థులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. జేడీఎస్ అభ్యర్థి అనిల్ లాడ్ విషయానికొస్తే 2008లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గాలి సోమశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం యత్నించి విఫలమై జేడీఎస్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలో తలపడుతున్నారు. -
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో మాదే విజయం
సాక్షి, బళ్లారి/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని, 224 స్థానాలకు గాను 150 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని విజయపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శివాజీ సర్కిల్ నుంచి కనకదాస సర్కిల్ వరకూ జరిగిన భారీ రోడ్డు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘40 పర్సెంట్ బీజేపీ సర్కారు’కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నాయకులు 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవణ్ణ బోధనల గురించి మాట్లాడుతున్నారు గానీ వాటిని ఏమాత్రం ఆచరించడం లేదని రాహుల్ ఆక్షేపించారు. బసవేశ్వరుడికి రాహుల్ నివాళులు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లాలోని కూడల సంగమంలోని బసవణ్ణ సమాధిని దర్శించుకున్నారు. నివాళులర్పించారు. కూడల సంగమంలో సంగమనాథ దేవాలయాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. నుదుటిన విభూతి ధరించారు. విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి పడ్డారని, ఆనాడే చట్టసభ ద్వారా అన్ని వర్గాల ప్రజలను అందలమెక్కించాలని తపనపడ్డారని రాహుల్ కొనియాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి బసవణ్ణ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి కాంగ్రెస్ నేతలతో రాహుల్ చర్చించారు. హుబ్లీకి వెళ్లి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌తో మాట్లాడారు. -
పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హీటెక్కుతున్న రాజకీయం
-
మోడీ తడిసాడు..అభిమాని తుడిచాడు
-
Karnataka Assembly election 2023: కర్నాటకలో మెజార్టీకి మించి...
బెంగళూరు: కర్ణాటకలో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ‘‘మెజార్టీ కంటే 15 నుంచి 20 సీట్లు ఎక్కువే గెలుస్తాం. కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో మద్దతు ఏమాత్రం తగ్గలేదు. చరిత్ర చూసినా బీజేపీ రెబెల్స్ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారీ అదే నిరూపితమవనుంది’’ అని శనివారం ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటుపడటంపై బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ దేశంలో ఏ కుటుంబం కూడా చట్టం కంటే గొప్పదికాదు. అన్నింటికంటే చట్టమే అత్యున్నతమైంది’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ బంగ్లా ఖాళీచేస్తూ ఈ ఉదంతంలో బాధితుడినయ్యానని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందించారు. ‘ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడాలని రాహుల్‌ను మేం అడగలేదు. ఇప్పుడు క్షమాపణ చెప్పకూడదని నిర్ణయించుకుంది కూడా ఆయనే. ఏ చట్టం కింద అయితే ఆయన దోషిగా తేలారో ఆ చట్టం కాంగ్రెస్ హయాంలో రూపొందిందే. ఆ చట్టాన్ని ఉపసంహరించేందుకు నాటి ప్రధాని మన్మోహన్ ప్రయత్నిస్తే ఆర్డినెన్స్ పత్రాలు చించి రాహులే అడ్డుకున్నారు. ఇప్పుడు ‘బాధితుడిని’ అంటూ నాటకాలు ఆడొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ మోదీని విమర్శించారనే జమ్మూకశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీచేసిందనేది అబద్ధం. గతంలోనూ ప్రశ్నించేందుకు ఆయనను సీబీఐ పిలిచింది’ అని గుర్తుచేశారు. ఏటీఎంలా వాడుకున్న కాంగ్రెస్ ‘‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇంతవరకూ ఏ కోర్టులోనూ నిరూపణకాలేదు. ఇవన్నీ కాంగ్రెస్ కట్టుకథలు’’ అని అమిత్ షా అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెసే రాష్ట్రాన్ని ‘ఏటీఎం’లా వాడుకుందని ఆరోపించారు. ‘‘యూపీఏ హయాంలో 2009–19లో కర్ణాటకకు కేవలం రూ.94 వేల కోట్ల నిధులొచ్చాయి. మా హయాంలో 2014–19లో ఏకంగా రూ.2.26 లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నాం. వాళ్లు పన్నులు, గ్రాంట్–ఎయిడ్ కింద రూ.22 వేల కోట్లు ఇస్తే మేం రూ.75 వేల కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
ఆ 84 సీట్లు కీలకం.. గతంలో 56 బీజేపీకే.. మరి ఇప్పుడు.. స్వింగ్ ఎటో?
కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు. 2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ ► లింగాయత్‌లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది ► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది. ► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం. ► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు లింగాయత్‌లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్‌గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది. అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారింది. ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్‌కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ గెలుపు సంకేతాలు చాలా ఉన్నాయి : భరత్ రెడ్డి
-
కర్నాటకలో హోరెత్తిన ప్రచార పర్వం
-
రసకందాయంలో కర్నాటకం.. పార్టీలు చిన్నవి.. ప్రభావం పెద్దది
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్‌ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది. అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్! కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి. పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు. 50 స్థానాల్లో ప్రభావం కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్నాటక ఎన్నికలు: బీజేపీ బిగ్ ప్లాన్
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, పార్టీలు తమకు సీటు ఇవ్వకపోవడంతో పలువురు సీనియర్లు, నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇక, నేటితో(ఏప్రిల్ 20)తో కర్నాటకలో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, ఎన్నికల ప్రచారంలో ఓటర్లును ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీజేపీ పార్టీ బిగ్ ప్లాన్స్ చేస్తోంది. మళ్లీ అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అందుకు తగిన ప్రణాళిక అమలు చేస్తుంది. ఇక, బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకకు రానున్నారు. ఏకంగా 10 రోజుల పాటు మోదీ కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో దాదాపు 20 ర్యాలీల్లో, భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెనర్ల జాబితాను సైతం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా వివధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, సెలబ్రెటీల పేర్లు ఉన్నాయి. ఇక, కర్నాటక బీజేపీ.. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్ని ఆరు రిజియన్లుగా విభజించింది. కాగా, బెలగావి, హుబ్బల్లి నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక, జేపీ నడ్డా దాదాపు 25 ర్యాల్లీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
కర్ణాటకలో మళ్లీ బీజేపీదే విజయం: యడియూరప్ప
-
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్నాటక: బీజేపీకి ఊహించని షాక్.. మరో సీనియర్ నేత గుడ్‌బై
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జేడీఎస్‌లో చేరారు. దీంతో, బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆధ్వర్యంతో జేడీఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే తాను శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 20న ఒక పార్టీ తరఫున తాను నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే తాను బీజేపీని వీడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, తన నియోజకవర్గ ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. In another setback to ruling BJP, party MLC from Shivamogga #AyanurManjunath quit the party and joined JD(S)#KarnatakaElection2023 pic.twitter.com/BoJ69ySKBN — TOI Bengaluru (@TOIBengaluru) April 19, 2023 కాగా, బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అయనూర్ మంజునాథ్ పేరు లేదు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే శివమొగ్గ, మాన్వి స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సమయం నుంచి బీజేపీకి వరుసగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కమలం పార్టీకి ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు లక్ష్మణ్ సవదితోపాటు పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరి ప్రభావం బీజేపీపై ఎంతమేర పడనుందో ఎన్నికల ఫలితాల అనంతరం తెలుస్తుంది. I will resign from both, the Legislative Council membership and the primary membership of the BJP. I will file my nomination papers today to contest the elections from the Shivamogga Assembly constituency: Ayanur Manjunath, Member of the Legislative Council pic.twitter.com/eGT8FAsYT7 — ANI (@ANI) April 19, 2023 ఇది కూడా చదవండి: మమతా బెనర్జీకి మరో షాక్ -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీకి రాజీనామా.. బీఎల్ సంతోషే కారణం: జగదీష్ శెట్టర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి రగడ తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. ఈ పార్టీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరారు. బెంగుళూరు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ శెట్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు రావడం వెనక బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్యే కారణమని ధ్వజమెత్తారు. బీఎల్ సంతోష్‌కు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని శెట్టర్ విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ రాకుండా చేసి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బొమ్మై కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. తన స్థానంలో మహేష్ తెంగినాకైకు టికెట్ ఇవ్వడం కోసం బీఎల్ సంతోష్ తన మీద కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలా చేశారని ధ్వజమెత్తారు. చదవండి: Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..? అదే విధంగా మైసూరు జిల్లా కృష్ణరాజ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ఎ రామదాస్‌ను కాదని కొత్త ముఖమైన శ్రీవాత్సకు బీజేపీ టికెట్ ఇచ్చారు. దీనిపై కూడా శెట్టర్ ఘాటుగా స్పందించారు. ‘రామదాస్ పరిస్థితి ఏమైందో చూడండి.. బీఎల్ సంతోష్ విధేయుడు కాదనే కారణంతో ఆయన్ను పక్కకు పెట్టేశారు. తన మాట వినే శ్రీవాస్తకు టిక్కెట్ ఇచ్చారు’ అని దుయ్యబట్టారు. బీఎల్ సంతోష్ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా నిమమించిన విఫలమయ్యారని శెట్టర్ విమర్శించారు. అయినా బీజేపీ అగ్ర నాయకులు ఆయన్ను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. సంతోష్‌కు పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యమని, ఇది బీజేపీ పరువును దిగజార్చుతుందని అన్నారు. ‘బీఎల్ సంతోష్‌ను కేరళ ఇన్‌ఛార్జ్‌గా నియమించినా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా చేసినా కొన్ని సీట్లు మాత్రమే గెలిచింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన వ్యక్తి పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ(ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా) స్థానంలో ఉన్న వారికి సలహాలు ఇస్తున్నాడు.’ అని శెట్టర్ దుయ్యబట్టారు. కాగా గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ నుంచి టిక్కెట్ దక్కలేదు. ఈసారి శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినాకైను హుబ్లి-ధార్వాడ్ స్థానం నుంచి బరిలో దింపింది. దీంతో బీజేపీకి గుడ్‌బై చెప్పి.. అదే హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిద్దరిలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే. చదవండి: బీజేపీ మూడో జాబితా విడుదల.. -
Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్‌లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. చదవండి: లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు. -
కులగణన వివరాలేవి?
సాక్షి, బళ్లారి: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా అవకాశాలు దక్కేందుకు వీలుగా నైష్పత్తిక రిజర్వేషన్ల పద్ధతి తేవాలన్నారు. 2011లో మోదీ సర్కారు చేపట్టిన కులగణన వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా బీసీలకు మెరుగైన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాల్కీ, హుమ్నాబాద్ల్లో ఆయన ప్రచార సభల్లో మాట్లాడారు. ఓబీసీలపై మోదీ కేవలం మాటల్లోనే ప్రమ ఒలకబోస్తారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన వివరాలు బయట పెడతామని చెప్పారు. ప్రతి పనికి 40 కమీషన్ తీసుకుంటున్న బీజేపీ సర్కారుకు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి 40 సీట్లు కూడా రావు. ఉద్యోగ నియామకాల్లోనూ భారీ అవినీతి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలను, మోదీ, అదానీ బంధాన్ని గురించి లోక్‌సభలో ప్రశ్నిస్తే నా సభ్యత్వం తొలగించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పతనానికి నాంది అవుతుంది’’ అన్నారు. రాహుల్ కులగణన డిమాండ్‌కు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ్ట, ఆప్, బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఇందుకు మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా తాజాగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తాజాగా ట్వీట్ చేశారు. -
లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు..
కర్ణాటక రాజకీయాలతో లింగాయత్‌లది విడదీయ లేని బంధం. వారు ఎన్నికల్లో గెలుపోటముల్ని శాసించే శక్తిసామర్థ్యాలున్న సామాజిక వర్గం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులైన లింగాయత్‌లు కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి అండగా నిలుస్తున్నారు. అయితే ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు యడియూరప్పను సీఎం పదవి నుంచి బీజేపీ తప్పించడంతో లింగాయత్ మఠాధిపతుల్లో అసహనం మొదలైంది. అది ఎలా పరిణమిస్తుంది? లింగాయత్‌ల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి...? ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 17% ఉన్న వీరు కీలక ఓటుబ్యాంకు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పెట్టని కోట అయిన లింగాయత్‌లు 1990 తర్వాత బీజేపీ వైపు మళ్లారు. వీరి ఓటుబ్యాంకునే నమ్ముకున్న బీజేపీ ఇతర సామాజిక వర్గాల కోసం పెద్దగా చేస్తున్నదేమీ లేదు. తాజాగా ముస్లింల 4% రిజర్వేషన్లను తొలగించి లింగాయత్, వక్కలిగలకు చెరో 2% కట్టబెట్టింది కూడా. అయితే బలమైన లింగాయత్ నాయకుడు యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించినప్పటి నుంచీ ఆ వర్గంలో నెలకొన్న అసంతృప్తి అంతా ఇంతా కాదు. సీఎం బసవరాజ్ బొమ్మై లింగాయతే అయినా తమ అభిమాన నాయ కున్ని అవమానకరంగా తొలగించారన్నది వారి ఆగ్రహం. కాంగ్రెస్ వ్యూహరచన ఒకప్పుడు తమ కీలక ఓటుబ్యాంకు అయిన లింగాయత్‌లను మరోసారి అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యడియూరప్ప విషయమై వారిలో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. లింగాయత్‌లకు అత్యధిక టికెట్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా ప్రకటించిన 166 మంది అభ్యర్థుల్లో 43 మంది లింగాయత్ సమాజికవర్గానికి చెందినవారే! 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య ప్రభుత్వ కార్యాలయాల్లో లింగాయత్‌ల గురువు బసవేశ్వర చిత్రపటాన్ని ఉంచాలని ఆదేశించారు. తమను మతపరమైన మైనారిటీలుగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండ్‌ను కూడా కాంగ్రెస్ తలకెత్తుకుంది. తాను రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు కూడా చేసింది. దీనిపై కేంద్రం మౌనాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. అలా బీజేపీ ఓటుబ్యాంకుగా... లింగాయత్‌లు కాంగ్రెస్ వెన్నంటి ఉన్న రోజుల్లో ఆ పార్టీ బంపర్ మెజారిటీలు కళ్లజూసింది. 1990లో లింగాయత్ నేత వీరేంద్ర పాటిల్ నేతృత్వంలో కాంగ్రెస్ 224 స్థానాలకు గాను ఏకంగా 179 చోట్ల గెలిచింది! కానీ తర్వాత కాంగ్రెస్‌లో చీలికలు, బీజేపీ ఎదుగుదల తదితర కారణాలతో లింగాయత్‌లు బీజేపీ వైపు మళ్లారు. ముఖ్యంగా కర్ణాటకలో మత ఘర్షణల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ రాష్ట్ర సీఎం వీరేంద్ర పాటిల్‌ను తప్పించడాన్ని చారిత్రక తప్పిదంగా చెబుతారు. అప్పట్నుంచి లింగాయత్‌లు కాంగ్రెస్‌కు బాగా దూరమయ్యారు. ఆ దెబ్బకు 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 36 స్థానాలకు పరిమితమైంది! లింగాయత్‌ల రాజకీయ ప్రాబల్యానికి ఇది తార్కాణమంటారు. ఇక బీజేపీలో యడియూరప్ప ఎదుగుదలతో లింగాయత్‌లు పూర్తిగా ఆ పార్టీవైపు మళ్లారు. అయితే అవినీతి ఆరోపణలతో యడ్డీని బీజేపీ బహిష్కరించడంతో ఆయన కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నారు. దాంతో 2013 ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు భారీగా చీలి బీజేపీ 40 సీట్లకు పరిమితమైంది. కేజీపీ కూడా పెద్దగా సత్తా చాటలేదు. తర్వాత యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా కూడా కలిసొచ్చి 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ 17 గెలుపొందింది. స్వాతంత్య్రోద్యమంలోనూ... 12వ శతాబ్దంలో సంఘ సంస్కర్త బసవేశ్వర లింగాయత్‌లకు నిర్దిష్ట జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. వీరు వీరశైవుల నుంచి దూరమై వేదాలను, కుల వ్యవస్థను వ్యతిరేకించేవారు. దేవాలయాలకు వెళ్లడం, బహుదేవతారాధన మాని ప్రగతిశీల భావాలు అలవర్చుకున్నారు. స్త్రీ పురుషులు సమానమని నమ్ముతారు. లింగాయత్‌లలో మహిళలకు ప్రత్యేక హక్కులున్నాయి. వారికి పెళ్లి చేసుకోకున్నా, భర్తను కోల్పోయినా పిల్లల్ని దత్తత చేసుకునే స్వేచ్ఛ ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ లింగాయత్‌లది చురుకైన పాత్ర. ప్రస్తుతం వీరశైవులు, లింగాయత్‌లు దాదాపుగా కలిసిపోయారు. లింగాయత్ మఠాల ప్రాధాన్యం... కర్ణాటకలో 500కు పైగా లింగాయత్ మఠాలున్నాయి. వీటి చుట్టూనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. లింగాయత్ ఉపకులాలూ కీలకమే. వీరు మఠాధిపతులు గీచిన గీత దాటరు. లింగాయత్‌లు అత్యధికంగా ఉన్న ఉత్తర కర్ణాటకలోని 22 జిల్లాల్లో బాగా పట్టున్న అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉంది. బొమ్మై కూడా లింగాయతే అయినా ఈ మఠాల మద్దతు యడియూరప్పకే! ఆయన్ను సీఎంగా తప్పించినప్పటి నుంచీ మఠాధిపతులు గుర్రుగా ఉన్నారు. పర్యవసానం అనుభవిస్తారంటూ బీజేపీకి వారు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యతను బీజేపీ యడ్డీ భుజస్కంధాలపైనే ఉంచింది. దాంతో ఆయన మఠాధిపతుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. లింగాయత్‌ల జనాభా: 1.5 కోట్లు రాష్ట్ర జనాభాలో శాతం: 17% ప్రభావం చూపించే స్థానాలు: 100-120 ప్రస్తుత అసెంబ్లీలో లింగాయత్ ఎమ్మెల్యేలు: 54 (బీజేపీ 37) 1952 నుంచి లింగాయత్ సీఎంలు: 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ స్థానం ఆయనకే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చోటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్‌లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 212 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది. చివరి విడతలో భాగంగా పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగ్థాన్, సేదన్, కొప్పల్, రోణ్, హుబ్లీ ధర్వాడ్ సెంట్రల్, హగరిబొమ్మనహళ్లి, హెబ్బాల్, గోవిందరాజ్ నగర్, మహదేవపుర, కృష్ణరాజ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పోటీ చేయాలనుకున్న హుబ్బళి సెంట్రల్ నియోజవర్గం నుంచి బీజేపీ జనరల్ సెక్రటరీ మహేష్ తెంగినాకైకి చోటు కల్పించింది. కాగా హుబ్బలి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ శెట్టర్.. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాషాయ దళాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మహదేవపుర సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ లింబావలికి బీజేపీ హ్యండిచ్చింది. ఈ స్థానంలో ఆయన సతీమణి మంజులా పోటీలోకి దింపింది.. కొప్పల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని బెదిరిస్తున్న కారడి సంగన్న అమరప్పకు కూడా పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమార్తె మంజుల అమరేష్‌కు కొప్పల్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా..రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చివరి విడత విడుదల చేసింది. ఇక మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. -
కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ రాజీనామా
-
బీజేపీ హైకమాండ్ ఆయనకు బిగ్ ఆఫర్ ఇచ్చింది: సీఎం బొమ్మై
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల వేళ కర్నాటక రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీ సీనియర్లు, సిట్టింగులను కాదని కొత్త ముఖాలకు బరిలోకి దింపింది. ఈ క్రమంలో సీనియర్లు కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. ఆ పార్టీకి గుడ్ బై చెపారు. ఇక, ఆయన రాజీనామా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మాట్లాడుతూ.. మా పార్టీ హైకమాండ్ జగదీష్ షెట్టర్‌కు ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. షెట్టర్ కర్నాటకలో సీనియర్ నాయకుడు, కీలక నేత. అందుకే ఆయనకు పెద్ద పదవి ఇస్తామని జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం మేము మూడో జాబితాపై చర్చించాము. మా సిఫార్సులను పార్లమెంటరీ బోర్డుకు పంపించాము. అభ్యర్థులను వారే ఖరారు చేస్తారు. ఈ సందర్బంగా జగదీష్ షెట్టర్‌కు సీటుపై చర్చించలేదని స్పష్టం చేశారు. ఇక, అంతకు ముందు.. బీజేపీ పెద్దలు మాజీ సీఎం షెట్టర్‌ను కలిసి గవర్నర్ లేదా కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, ఈ ఆఫర్‌ను షెట్టర్ తిరస్కరించారు. తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నానని, పెద్ద పదవిపై ఆశ లేదని అన్నారు. ఇక, నాటకీయ పరిణామాల మధ్య జగదీష్ షెట్టర్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షెట్టర్.. కర్నాటకలోని కొందరు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంత మంది తమ స్వలాభం కోసం పార్టీని తప్పుగా నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై తప్పుగా నివేదికలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇక, తాను కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. #KarnatakaElections2023| "We have discussed the third list, shortly it is going to come out. We've sent our recommendations to Parliamentary board & they will take a call...we've not discussed about Jagadish Shettar", says Karnataka CM Basavaraj Bommai after the BJP meeting over… pic.twitter.com/1GSjZnRFob — ANI (@ANI) April 16, 2023 -
అవినీతికి ప్రతీక అదానీ.. రాహుల్ విమర్శల వర్షం
కోలారు: అదానీపై చూపిస్తున్న ప్రేమను ప్రధాని మోదీ పేద ప్రజలపై ఇసుమంతైనా చూపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆదివారం కర్ణాటకలోని కోలారు పట్టణంలో నిర్వహించిన జై భారత్ సభలో ప్రధాని మోదీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. గతంలో కోలారులోనే మోదీపై ఆరోపణలు చేసిన కేసులో రాహుల్‌కు జైలుశిక్ష పడి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, జైలుపాలు చేసినా ప్రభుత్వాన్ని చూసి భయపడేది లేదని స్పష్టం చేశారు. అదానీ అవినీతికి మారుపేరని పేర్కొన్నారు. ‘అదానీ విమానంలో ప్రధాని మోదీ అత్యంత రిలాక్స్ మూడ్‌లో ఎందుకు కూర్చుంటారు? అదానీ కంపెనీలో చైనా డైరెక్టర్ ఎందుకు ఉన్నారు?’అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ, అదానీ సంబంధాలపై ప్రశ్నించినప్పుడల్లా బీసీ వర్గాన్ని అవమానించానంటూ తనవైపు వేలెత్తి చూపుతున్నారని విమర్శించారు. -
కర్నాటక: రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు.. షెట్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా షెట్టర్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా షెట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీష్ షెట్టర్ మాట్లాడుతూ.. బీజేపీని వీడకుండా ఉండేందుకు తనకు పార్టీ పెద్దలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే, రాజ్యసభ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్టు తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. సీట్లు అడిగినా ఇవ్వలేదని ఫైరయ్యారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ హైకమాండ్ పలువురు సీనియర్లకు హ్యాండిచ్చింది. పార్టీ టికెట్లు లభించకపోవడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. జగదీష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. -
Karnataka assembly elections 2023: టికెటివ్వకుంటే పాతిక సీట్లు గోవిందా
హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టార్ ధిక్కారస్వరం వినిపించారు. ‘హూబ్లీ–ధార్వాద్ సెంట్రల్ టికెట్ నాకివ్వాల్సిందే. లేదంటే ఈసారి ఎన్నికల్లో పార్టీ 20 నుంచి 25 స్థానాల్లో ఓటమిని చవిచూస్తుంది’ అని షెట్టార్ శనివారం వ్యాఖ్యానించారు. నవ తరం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీచేయొద్దని సూచించింది. అలా షెట్టార్‌కు ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీనిని బేభాతరు చేస్తూ ధిక్కార స్వరం వినిపించారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లికి వచ్చి షెట్టార్తో మంతనాలు జరిపారు. అయినా సరే వినని షెట్టార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ సిట్టింగ్‌లను పక్కనబెడితే ఆ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడకూడదు. ఒకవేళ పడితే అది ఆ ఒక్క స్థానానికే పరిమితం కాదు. ఉత్తర కర్ణాటకలో కనీసం 20–25 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదముంది. ఈ మాట గతంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా చెప్పారు. వేచి చూస్తా. నాకు టికెట్ ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తా’ అని అన్నారు. -
కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
-
కర్ణాటకలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ
-
కర్ణాటకంలో కథానాయకుడెవరు..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రోజుల క్రితం మొదలైన టికెట్ల పంపిణీ పర్వం ఎప్పటిలాగే ప్రధాన పక్షాల్లో ముసలం పుట్టిస్తోంది. సహజంగానే కాంగ్రెస్, జేడీ(ఎస్)ల కన్నా అధికార బీజేపీకే అసంతృప్తి తాకిడి ఎక్కువుంది. నాలుగేళ్లనాడు గోడదూకుళ్లతో అధికారంలోకొచ్చినందుకు ఇది ఆ పార్టీకి అనివార్యం. రాష్ట్రంలో తనవల్లే బీజేపీకి అధికారం సాధ్యమైందనుకునే పార్టీ నేతలు, ఫిరాయింపు నేతలు చాలామందే ఉండటం ఇందుకు కారణం. నాయకత్వం ఎంతో ఊగిసలాడి, ఎన్నికల్లో ఏమవుతుందోనన్న లెక్కలేసుకుని చివరకు 17 మంది ఫిరాయింపుదారుల్లో 14 మందికి టిక్కెట్లు ఇవ్వక తప్పలేదు. 224 అసెంబ్లీ స్థానాలుంటే బీజేపీ ఇంతవరకూ రెండు జాబితాల్లో 212 మందికి టిక్కెట్లిచ్చింది. ఈ రెండు జాబితాలతోనే దాదాపు 30 స్థానాల్లో తిరుగుబాటు జెండాలు పైకిలేచాయి. 18 మంది సిట్టింగ్‌లకూ, డజను మందికి మించి మాజీ ఎమ్మెల్యేలకూ ఈ జాబితాల్లో చోటు దక్కలేదు. మాజీ సీఎం జగదీశ్ షెట్టార్‌కు టికెట్ వస్తుందో రాదో ఇంకా తేలలేదు. సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆగ్రహంతో ఉన్నారని తొలుత వార్తలొచ్చినా బెంగళూరులో అడుగుపెట్టి అంతా బాగుందని ఆయన కితాబునివ్వటం బీజేపీకి ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. ‘ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారంటే 50 స్థానాల్లో బీజేపీ కనుమరుగు కావటం ఖాయం’ అని యడ్యూరప్ప శిబిరంలోని ఎమ్మెల్యే ఒకరు అంతక్రితం హెచ్చరించారు. యడ్యూరప్ప 1983 మొదలుకొని ఏడు దఫాలు ప్రాతినిధ్యంవహించిన శివమొగ్గ జిల్లాలోని షికారిపురా స్థానంలో ఈసారి ఆయన కుమారుడు విజయేంద్రకు చోటు దొరికింది. యడ్యూరప్ప సామాజిక వర్గమైన లింగాయత్‌లకు 51 స్థానాలు కేటాయించారు. మాజీ ఉపముఖ్యమంత్రి, యడ్యూరప్ప అనుచరుడు, లింగాయత్ నేతల్లో ముఖ్యుడైన లక్ష్మణ్ సవాది టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్‌లో చేరటం పార్టీకి నష్టమే. ఇతర పార్టీలను కుటుంబ పార్టీలంటూ, కుల పార్టీలంటూ నిందించే బీజేపీ కుల సమీకర ణాలూ, కుటుంబ సమీకరణాలూ చూసుకుని టిక్కెట్లు ఇవ్వక తప్పలేదు. దక్షిణాదిలో బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా ఈ దఫా ఏలుబడిలో హిందూత్వ కార్డును బీజేపీ బలంగా ఉపయోగించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధం, ముస్లింలకున్న 4 శాతం కోటా రద్దు అందులో భాగమే. ముస్లింలకు రద్దుచేసిన కోటాను ప్రధాన కులాలైన లింగాయత్లకూ, వొక్కళిగలకూ చెరిసగం పంచారు. అందువల్ల ఆ రెండు ప్రధాన కులాల ఓట్లూ తనకే పడగలవని బీజేపీ విశ్వసిస్తోంది. కర్ణాటకలో యడ్యూరప్ప నుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకుండా టిక్కెట్ల వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించగలగటం అధిష్టానానికి ఇదే మొదటిసారి. అయితే పార్టీలో ఇన్నేళ్లుగా ప్రత్యామ్నాయ నాయకుడిని రూపొందించటంలో అధిష్టానం విఫలమైంది. బలమైన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడటం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితే. ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై యడ్యూరప్పతో సరితూగే నేత కాదన్నది పార్టీలో అందరికీ తెలుసు. సమస్యలు వచ్చిపడినప్పుడు ఉద్యమించటానికి బదులు ఎన్నికలప్పుడు అధికార పక్షంపై విమర్శలు గుప్పించటం కర్ణాటకలోని పార్టీలకూ అంటింది. ముఖ్యంగా హిజాబ్ నిషేధం, ముస్లింల కోటా రద్దు అంశంలో కాంగ్రెస్, జేడీ(ఎస్)లు బలంగా తమ వాణి వినిపించలేకపోయాయి. ముస్లింలు అధికంగా ఉండే కోస్తా కర్ణాటకలోని 21 స్థానాల్లో కాంగ్రెస్, జేడీ(ఎస్)లపై దీని ప్రభావం ఎలావుంటుందో వేచిచూడాలి. గత నెలాఖరులో విడుదలైన సీ–ఓటర్ సర్వే అయితే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పింది. కానీ కాంగ్రెస్ దాన్ని నిజం చేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య ఎప్పుడూ పొసగదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం చేస్తే తనకు అభ్యంతరం లేదని శివకుమార్ ఇటీవల చెప్పటం సిద్ధరామయ్య శిబిరానికి ఆగ్రహం తెప్పించింది. జేడీ(ఎస్)ది మరో వ్యథ. సమస్యలపై పోరాడాల్సిన సమయంలో ఆ పార్టీ వారసత్వ పోరుతో కొట్టుమిట్టాడింది. వొక్కళిగలు అధికంగా ఉన్న మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్) బలంగానే ఉండేది. ఈసారి బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేనాటికైనా జేడీ(ఎస్) ఇంటిని చక్కదిద్దుకుంటుందో లేదో చూడాల్సివుంది. తాము ఓట్లేసి గెలిపించిన పక్షమే అధికారంలోకొస్తుందన్న గ్యారెంటీ లేని స్థితిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక ఈ జాడ్యం చాలా రాష్ట్రాలకు అంటినా కర్ణాటకది ప్రత్యేకమైన పరిస్థితి. అక్కడ స్వప్రయోజనాలు తప్ప సిద్ధాంత జంజాటం లేని నేతల సంఖ్య ఎక్కువే. కనుక అస్థిర రాజకీయాలు రివాజుగా మారాయి. ప్రజా భీష్టాన్ని తెలుసు కోవటమనే ప్రక్రియను విడనాడి, ప్రజాభీష్టాన్ని తయారు చేయటం కోసం ఎడతెగ కుండా శ్రమించే పార్టీల హవాయే ప్రస్తుతం ఎక్కువగా నడుస్తోంది. ఎన్నికలు నిర్వహించటంతోనే ప్రజాస్వామ్య కర్తవ్యం పరిపూర్తయిందని భావించటంకాక, ప్రజానీకం ఆశలు ప్రతిఫలించేలా... వారిలో ప్రజా స్వామ్య స్ఫూర్తి ఇనుమడించేలా ఏలుబడి సాగించటం ముఖ్యమని అన్ని పార్టీలూ గ్రహించటం అవసరం. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉంటుంది. -
కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్‌కు భారీ ఝలక్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. విపక్షాల ఐక్యత పేరిట కాంగ్రెస్‌తో దోస్తీలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP).. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కీలక నేతలతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ, తామంతా ఒక్కటేనంటూ ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన ఎన్సీపీ.. 40 నుంచి 45 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అక్కడ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ తరుణంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఆశ్చర్యకర రీతిలో ఎన్సీపీ పోటీలోకి దిగుతోంది. ఈ పోటీ మిత్రపక్షం కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం చూపించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన ఎన్సీపీకి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ క్లాక్ సింబల్‌నే కేటాయించడం విశేషం. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో మరాఠా జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి భాగస్వామ్యంతో ఎన్సీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ డిమాండ్ విషయంలో పవార్, విపక్షాల(కాంగ్రెస్ నేతృత్వంలోని) నుంచి విభేదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం పవార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. బీజేపీపై పోరుకు విపక్షాల ఐక్యత పేరిట ఒక్కటిగా ముందుకు సాగాలని ఈ భేటీలో తీర్మానించుకున్నారు కూడా. ఈలోపే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టే నిర్ణయం ఎన్సీపీ తీసుకోవడం గమనార్హం. -
కర్నాటకలో ట్విస్ట్.. ఎన్నికల బరిలో కేజీఎఫ్ బాబు భార్య
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు సీనియర్లకు, కీలక నేతలకు సీటు ఇవ్వకపోవడంతో వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ కోటీశ్వరుడు ఇప్పుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని ధనవంతుల లిస్టులో కేజీఎఫ్వాసి యూసుఫ్ షరీఫ్ కూడా ఒకరు. యూసుఫ్‌ను అలియాస్ కేజీఎఫ్ బాబుగా పిలుస్తారు. అయితే, కేజీఎఫ్ బాబు రెండేండ్ల క్రితం కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను చిక్కపేట నుంచి పోటీచేయాలని భావించి ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కాంగ్రెస్ కేజీఎఫ్ బాబుకు అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో సస్పెండ్‌ను సీరియస్‌గా తీసుకున్న కేజీఎఫ్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి ఆయన తన భార్య షాజియాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక, కేజీఎఫ్ బాబు కర్నాటకలో గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదించారు. కేజీఎఫ్ బాబు అంతుకుముందు ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తిని రూ.1,743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో, దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగింది. ఇక, తాజాగా ఆయన భార్య కూడా ఎన్నికల బరిలో నిలవడంతో మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. -
కర్నాటక: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత.. ఎన్నికలపై ఎఫెక్ట్?
బెంగళూరు: కర్నాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ సీనియర్ నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను టార్గెట్ చేస్తూ వారికే టికెట్స్ ఇస్తున్నాయి. ఇక, బీజేపీ ఇప్పటికే పలువురు సీనియర్లను కాదని కొత్తగా 52 మందిని బరిలోకి దింపింది. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. దీంతో, బీజేపీ సీనియర్లు.. ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీ.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా సమక్షంలో సవాదీ.. హస్తం పార్టీలో చేరారు. ఇక, కాంగ్రెస్‌లో చేరిక అనంతరం.. కాంగ్రెస్ అతడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపనున్నట్టు తెలిపింది. దీంతో, ఆయన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ సవాదీ అథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. Former BJP leader & former Karnataka Deputy CM Laxman Savadi has joined Congress today, says State Congress president DK Shivakumar, in Bengaluru Laxman Savadi on April 12 resigned as Legislative Council member & from the primary membership of the BJP after losing the Athani… pic.twitter.com/B9feGbSFb9 — ANI (@ANI) April 14, 2023 మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రఘు అచర్.. జేడీఎస్‌లో చేరారు. జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆధర్యంలో ఆయన జేడీఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, కర్నాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. Karnataka | Former MLC and Congress leader Raghu Achar joins JD(S), in the presence of party leader HD Kumaraswamy. pic.twitter.com/rTgVTslJMf — ANI (@ANI) April 14, 2023 -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల సవాల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య సవాల్ ఆసక్తిని రేపుతోంది. కర్ణాటక దివంగత ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారులిద్దరూ మరోసారి పోటీపడుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం నుంచి కుమార్ బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బంగారప్ప 1967 నుంచి 1994 వరకు సొరబ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. చిట్టచివరి సారిగా ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సొరబ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కుమార్ బంగారప్ప మరోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టేసి బీజేపీలో చేరిన కుమార్, అప్పటికే జేడీ(ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మధుపై 3,286 ఓట్ల తేడాతో నెగ్గారు. 2021లో కాంగ్రెస్‌లో చేరిన మధు బంగారప్ప మరోసారి అదే నియోజకవర్గం బరిలో దిగడంతో అన్నదమ్ముల మధ్య పోరు ఉత్కంఠకు దారి తీస్తోంది. -
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా నియామకం అయ్యారు. -
కర్నాటకలో బిగ్ ట్విస్ట్.. జేడీఎస్‌కు బూస్ట్!
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు రోజుల క్రితం అధికార బీజేపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్టును రిలీజ్ చేసింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో, వారందరూ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి బిగ్ బాంబ్ పేల్చారు. చాలా మంది నేతలు జేడీఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్బంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. రేపు తమ పార్టీలోకి చాలా మంది నేతలు రాబోతున్నారని ప్రకటించారు. బీజేపీ నేత దొడ్డప్ప గౌడ పాటిల్ నరిబోల్ చేరిక దాదాపు ఖాయమైపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర కర్ణాటక నుంచే తాము 30 నుంచి 40 స్థానాల్లో గెలువబోతున్నామని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే, కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జేడీఎస్ ఇప్పటికే తొలి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసిందన్నారు. రేపు(శుక్రవారం) రెండో జాబితాను విడుదల చేయనున్నట్టు కుమారస్వామి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు స్థానం కల్పించకపోవడంతో సీనియర్ నేత, లింగాయత్ వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న లక్ష్మణ్ సవాది.. బీజేపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం.. దొడ్డప్ప గౌడ పాటిల్ కూడా తాను పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కాగా, వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. Many leaders will join JD(S) tomorrow. (BJP leader) Doddappa Gowda Patil Naribol's name is final. We are keen to win 30 to 40 seats in Uttara Karnataka. I will release the second list of candidates tomorrow: Former CM & JDS leader HD Kumaraswamy#KarnatakaElections2023 pic.twitter.com/omsKNzILel — ANI (@ANI) April 13, 2023 -
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
Karnataka: 23 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కాషాయదళంలో అసంతృప్తి రగడ మొదలైంది. బుధవారం విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ లభిస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు ఎదురవ్వడంతో రాత్రికి రాత్రి పార్టీకి రాజీనామా చేయడం, రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం, వంటివి చేస్తున్నారు. తాజాగా 23 మంది అభ్యర్థులతో బీజేపీ తన రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో ఏడుగురికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు. 23 మందిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నుంచి అశ్విని సంపంగి పోటీ చేయనున్నారు. అభ్యర్థుల జాబితాను రెండు ఫేజ్‌లలో విడుదల చేస్తామని ఇప్పటికే సీఎం బసవరాజ్ బొమ్మె పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 189 అభ్యర్థులతో బుధవారం మొదటి జాబితాను విడుదల చేయగా ప్రస్తుతం 23 మందిని ప్రకటించింది. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో మూడో జాబితా కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. నో ఛాన్స్ కాగా రెండో జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ పెట్టర్ పేరు లేదు. హుబ్బలి నుంచి ఆరుసఆర్లు గెలుపొందిన జగదీష్..ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆయన పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు. షెట్టర్‌కు చివరి జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఒవేళ తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వారికి నిరాశ వరుణలో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న వి సోమన్న.. గుబ్బి స్థానం తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. అయితే బీజేపీ అందుకు అంగీకరించలేదు. గుబ్బి నియోజకవర్గం నుంచి ఎస్డి దిలీప్‌కుమార్‌ను పార్టీ బరిలోకి దింపింది. బైందూరు ఎమ్మెల్యే సుకుమార్ శెట్టికి ఈసారి నిరాశే ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గురురాజ్ గంటిహోళీకి అవకాశం ఇచ్చింది. అదే విధంగా అవినీతి ఆరోపణలపై అరెస్టైన బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను పార్టీ పక్కకు పెట్టింది. చన్నగిరి నుంచి ఆయనను తప్పిస్తూ.. శివకుమార్‌కు సీటు ఇచ్చింది. ఇక దావణగెరె నార్త్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్, హావేరి ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్కు పార్టీ మొండిచేయి చూపింది. వీరి స్థానాల్లో లోకికెరె నాగరాజ్, గవిసిద్దప్ప ద్యామన్నవర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల దాఖలు నేటి నుంచి (ఏప్రిల్ 13) ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి. ఒక్కొక్కరిగా దూరం.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేయగా.. ఇందులో 52 మంది కొత్తవారికి ఈ సారి అవకాశం కల్పించింది. దీంతో టికెట్ కోసం అడుక్కుతినని చెబుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి లక్ష్మణ సవది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళూరు సుళ్య టికెట్ చేజారడంతో మంత్రి ఎస్.అంగార రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప కూడా రాజకీయ విరమణ ప్రకటించడం తెలిసిందే.మరోవైపు అసమ్మతి చల్లార్చేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. . టికెట్ దక్కని నేతలు అసంతృప్తితో పార్టీకి దూరమవుతున్నారు. -
52 కొత్త ముఖాలకు టిక్కెట్లు.. కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52 కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇస్తూ విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని అసంతృప్త నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై కొడుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ బెదిరింపులకి దిగుతున్నారు. ఆశావహుల మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలకు కూడా దిగారు. సీనియర్ నేత లక్ష్మణ్ సావాది, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్ నారిబోల్లు పార్టీకి బుధవారం గుడ్‌బై కొట్టేశారు. సలియా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎస్. అంగారా టికెట్ రాకపోవడంతో ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మణ్ సావాది మాజీ సీఎం బీఎస్ యడ్డీయూరప్పకి అత్యంత విధేయుడు, శక్తిమంతమైన లింగాయత్ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారుల్ని ఆకర్షించడంలో పకడ్బందీగా వ్యూహాలు పన్నారు. ఈసారి టికెట్ రాకపోవడంతో సావాది తాను ఎవరినీ బిచ్చమడగనని, తనకి ఆత్మ గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళతారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డప్ప గౌడ కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ పేరు తొలిజాబితాలో లేకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక మంత్రి అంగారా పార్టీ తనను తీవ్రంగా అవమానించిందంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. -
కన్నడనాట వారసుల పోరు.. తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని..
కర్ణాటక ఎన్నికలంటే వంశపారంపర్య రాజకీయాలే కళ్లముందు కదలాడుతాయి. జేడీ(ఎస్) కుటుంబానికి కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసి పదవులు దక్కించుకోవడం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా వారసులకి టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రెండో తరం, మూడో తరం కూడా తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగాలు, తల్లిపైనున్న అసంతృప్తిని మోయడానికి సిద్ధమైన కొడుకు, భార్య టికెట్ కోసం ఏకంగా కుటుంబంపైనే తిరుగుబాటు సిద్ధమైన వారితో రాజకీయం రసకందాయంలో పడింది. తండ్రి కోసం యతీంద్ర త్యాగం ► మహాభారతంలో భీముడు, ఘటోత్కచుడు బంధం ఎలాగుంటుందో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర మధ్య సంబంధం అలాగే ఉంటుందని చెప్పుకుంటారు. యతీంద్ర తండ్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తన భవి ష్యత్‌ను కూడా పణంగా పెట్టారు. ఈ సారి ఎన్నికల్లో వరుణ అసెంబ్లీ సీటుని తన తండ్రి కోసం త్యాగం చేశారు. గత ఎన్నికల్లో 45 వేల ఓట్ల భారీ మెజార్టీతో వరుణ నుంచి నెగ్గిన యతీంద్ర కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సిద్దరామయ్య సీఎం అవడం కోసం ఈ సీటుని వదులుకున్నారు. కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డికె. శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి ఆశిస్తూ ఉండడంతో సిద్దరామయ్యని ఓడిస్తారన్న ప్రచారం జరుగుతోంది..వరుణ నియోజక వర్గం నుంచి పోటీపడితే సిద్దరామయ్యకి తిరుగుండదని యుతీంద్ర పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రియాంక్ ఖర్గే.. లిట్మస్ టెస్ట్ ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తండ్రి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక సొంత రాష్ట్రంలో జరుగు తున్న తొలి ఎన్నికల కావడంతో ఈ స్థానం నుంచి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో ప్రియాంక్ 4 వేల కంటే తక్కువ ఓట్లతో నెగ్గారు. పోలీసు రిక్రూట్మెంట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చి బసవరాజ్ బొమ్మై ప్రభు త్వాన్ని ఇరకాటం పెట్టడంలో విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌కు 140 సీట్లు ఖాయమని ప్రియాంక్ అంటుంటే, ‘ప్రియాంక్ ఖర్గే కనబడుట లేదు’ అంటూ ఆయన నియోజకవర్గంలో బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది! కుమారునికి యడ్డీ అండ ► వంశ పారంపర్య రాజకీయాలపై కాంగ్రెస్‌ను మొదట్నుంచి చీల్చి చెండాడుతున్న బీజేపీ కూడా కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. యడ్డీ 1983 నుంచి రికార్డు స్థాయిలో ఏడుసార్లు నెగ్గిన శివమొగ్గలో షికారిపుర నుంచి ఈ సారి విజయేంద్ర పోటీ పడుతున్నారు. ఎన్నికల వ్యవహారాలను తన భుజస్కంధాలపై మోస్తున్న యడియూరప్ప తన కుమారుడు విజయేంద్ర కోసం తాను స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో విజయేంద్రకు టికెట్ దక్కింది. బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ విజయేంద్రకి గతంలో రెండు సార్లు టికెట్ రాక నిరాశ చెందారు. ముచ్చటగా మూడో సారి ప్రయత్నం ఫలించడంతో ఇక ఎన్నికల్లో గెలుపుపై ఆయన దృష్టి సారించారు. జేడీ(ఎస్)లో హాసన్ ప్రకంపనలు ► కుటుంబ పార్టీగా ముద్ర పడిన జేడీ(ఎస్)లో ఈ సారి ఎన్నికలు కుటుంబంలో చీలికకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్.డీ. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన భార్య భవానీ రాజకీయ ఎంట్రీకి ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. హాసన్ నియోజకవర్గం నుంచి ఆమెకి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు హెచ్.డి. కుమారస్వామి హాసన్ స్థానాన్ని తన వదినకు ఇవ్వలేమని హెచ్‌పి. స్వరూప్కే ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్డి రేవణ్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారులు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి ఎంపీగా ఉంటే, మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు భవానీకి కూడా టిక్కెట్ ఇస్తే వారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎనిమిదో వ్యక్తి అవుతారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే తాను, తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్డి రేవణ్ణ బెదిరింపులకు దిగడం పార్టీలో కలకలానికి దారి తీస్తోంది. అమ్మ కొడుకు ► హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీపడుతున్న రామనగర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇన్నాళ్లూ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తన కొడుకు కోసం ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఇటీవల నిఖిల్ రామనగర్‌లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో తల్లి వైఫల్యాలు ఇప్పుడు కుమారుడి భవిష్యత్‌ను ఎటు తీసుకువెళతాయా అన్న సందేహాలున్నాయి. మౌలిక సదు పాయాలు, తాగు నీటి సౌకర్యం కూడా లేకపోవ డంతో స్థానికులు నిఖిల్‌ను నిలదీస్తున్నారు. మరి ఈ స్థానం నుంచి నిఖిల్ నెగ్గుతారా లేదా అన్నది సందేహంగానే మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ వెళ్లిన కర్ణాటక మాజీ CM జగదీష్ షెట్టర్
-
కర్ణాటక బీజేపీలో ముసలం
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసంతృప్త జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 189 మందితో కూడిన తొలి జాబితాలో 52 కొత్త ముఖాలకు చోటు ఇవ్వడం, సిట్టింగ్లతో సహా ఆశావహులకు మొండిచేయి చూపించడంతో తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదీ బుధవారం తన రాజీనామా ప్రకటించారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఆత్మగౌవరం ఉన్న రాజకీయ నేతను. టికెట్ కోసం గిన్నె పట్టుకుని పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి అడుక్కోలేను. ఎవరి ప్రభావం నా మీద లేదు. నా నిర్ణయం నేనే తీసుకున్నా అంటూ లక్ష్మణ్ సవాదీ బీజేపీకి రాజీనామా ప్రకటించారు. ఇక ఆయన కాంగ్రెస్‌లోకి మారతారనే ప్రచారం ఊపందుకోగా.. కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ స్పందించారు. ఆయన(లక్ష్మణ్) మాతో టచ్‌లో లేడు. ఆయనతో మేం మాట్లాడనూ లేదు అని శివకుమార్ తెలిపారు. లక్ష్మణ్ సవాదీ.. మాజీ ముఖ్యమంత్రి యాడియూరప్పకు వీరవిధేయుడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో పవర్ఫుల్ లీడర్‌గా లక్ష్మణ్‌కు పేరుంది. 2019లో జేడీఎస్-కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికల పర్వంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. 2012లో అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడి.. వివాదంలో చిక్కుకున్నారాయన. మరోవైపు బీజేపీ అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. టికెట్లు రావనే పార్టీ అధిష్టానం స్పష్టత నడుమ.. మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత ఈశ్వరప్ప ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించుకున్నారు. అలాగే.. మాజీ సీఎం జగదీస్ షెట్టర్‌కు ఊహించినట్లుగానే మొదటి లిస్ట్‌లో చోటు దక్కకపోగా.. ఆయన సైతం వ్యతిరేక గళం వినిపించారు. రెండో లిస్ట్‌లో చోటు దక్కకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్తానంటూ ప్రకటించారాయన. ఇదే బాటలో మరో 30 మంది నేతలు ఉన్నట్లు సమాచారం. -
కర్ణాటక బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
-
కర్ణాటకలో ఆసక్తికరంగా పాత మైసూరు పోరు
-
కొంచెం తేడా వచ్చినా సీట్లు గల్లంతే.. ఆ మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోరులో మెజార్టీ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ చిన్న పార్టీల జోరు పెరిగిపోతూ ఉండడంతో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కడం పరిపాటిగా మారింది. దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటునూ ఒడిసిపట్టడం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు కీలకంగా మారింది... అధికార వ్యతిరేకత, చిన్న పార్టీల జోరు ఈ రెండూ కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని శాసిస్తున్నాయి. వరసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం లేని కన్నడ నేలపై అత్యంత తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలవడం సాధారణంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాల్లో విజేతలు 3 వేల కంటే తక్కువ మార్జిన్‌తో గట్టెక్కారు. గత ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 36% ఓట్లతో 104 స్థానాల్లో విజయం సాధిస్తే, 38% ఓట్లు సాధించిన కాంగ్రెస్ మాత్రం 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! మన ప్రజాస్వామ్యంలోని ఈ వైచిత్రి కారణంగా అత్యధిక ఓట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే సవాల్‌గా మారింది. అందుకే ఈసారి పార్టీలన్నీ ఒక్క ఓటు కూడా పోకుండా క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తూ బూత్ మేనేజ్మెంట్కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మూడు ఎన్నికల ముచ్చట గత మూడు ఎన్నికల్లోనూ అన్ని పార్టీలకు స్వల్ప మార్జిన్ పెద్ద తలనొప్పిగా మారింది. 2008 ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు 5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో గెలుపొందారు. అంటే 31% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొన్నట్టయింది. 2013 ఎన్నికల దగ్గరకి వస్తే 5 శాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల శాతం 30గా ఉంది. గత ఎన్నికల్లో 28% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొంది. గత మూడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ, జేడీ(ఎస్) పార్టీల సగటు గెలుపు ఆధిక్యం 12 శాతం ఉండగా, కాంగ్రెస్‌కు 11 శాతం ఉంది. 1980ల వరకు ఏ రాష్ట్రంలోనైనా గెలుపు ఆధిక్యాలు చాలా ఎక్కువగా దాదాపుగా 30% అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండేవి. తర్వాత ప్రాంతీయ పార్టీలు పెరగడం, పార్టీల సామాజిక సమీకరణలు వంటివి ప్రధానంగా మారి ఓట్ల ఆధిక్యానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. పార్టీల్లో టెన్షన్ టెన్షన్ ఈసారి ఎవరి ఓటు బ్యాంకుకి గండిపడుతుందా అని మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. మొత్తం 224 స్థానాలకు గాను అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 100 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. వీటితో కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు నష్టమనే అంచనాలున్నాయి. బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. ఆప్ అన్ని స్థానాల్లోనూ పోటీ పడుతోంది. ఈ పార్టీల ప్రభావం గత ఎన్నికల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీ నమోదైన 30 సీట్లపై ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ఏదైనా నియోజకవర్గంలో హోరాహోరి పోరు నెలకొన్నప్పుడు చిన్న పార్టీలు రెండు నుంచి మూడు వేలు ఓట్లు సంపాదించినా అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎన్నికల్లో గెలవలేకపోయినా ఫలితాలను మార్చే సత్తా కలిగి ఉంటారు’’అని బెంగుళూరుకి చెందిన రాజకీయ విశ్లేషకుడు నరేంద్రపాణి అభిప్రాయపడ్డారు. నోటాకే ఎక్కువ ఓట్లు! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వాటిలో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెసే నెగ్గింది. అలంద్, బాదామి, గడగ్, హిరెకెరూర్, కంగ్డోల్, మాస్‌కి, పావగడలో అభ్యర్థుల గెలుపులో ఓట్ల కంటే నోటాకే ఎక్కువ పడ్డాయి. ► 1985 నుంచి ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాల్లో బొటాబొటి మెజార్టీతోనే నేతలు గట్టెక్కారు. ► 25 శాతానికి పైగా స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. విజేతలకు, పరాజితులకు మధ్య తేడా 5, అంతకంటే తక్కువ శాతమే ఉంది. ► గత మూడు దశాబ్దాల్లో కేవలం 5 శాతం స్థానాల్లో మాత్రమే భారీ మెజార్టీ నమోదైంది. ► విజేతలు, పరాజితులకు వచ్చిన ఓట్లు, వాటి మధ్య తేడాలను విశ్లేషిస్తే ఓటరు గాలివాటంగా పోకుండా ఎంతో మేధోమథనం చేసి ఓటేస్తున్నాడని తేటతెల్లమవుతుంది. ► మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులిద్దరికీ ఓట్లు 5 శాతం తేడా వస్తే హోరాహోరీగా పోరు సాగిందని, 20 శాతం కంటే ఎక్కువ ఉంటే ఓటరు నిర్ణయాత్మకంగా స్పందించారని అంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
బెంగళూరు/ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 189 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. "52 out of 189 are fresh candidates," says BJP's National General Secretary, Arun Singh#KarnatakaElections2023 pic.twitter.com/72I0DZdkqs — ANI (@ANI) April 11, 2023 #KarnatakaElections2023 | CM Basavaraj Bommai to contest from Shiggaon constituency: BJP's National General Secretary, Arun Singh pic.twitter.com/3kPMemsQyd — ANI (@ANI) April 11, 2023 -
కర్ణాటక బీజేపీకి వ్యతిరేకంగా.. రెబల్ స్వరం!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల ఉందనగా.. కర్ణాటక బీజేపీలో రెబల్ సెగ తాకే సూచనలు అందుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగదీష్ షెట్లర్.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంకేతాలు అందించారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారాయన. హుబ్బళ్లి(హుబ్లీ-ధార్వాడ్) నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన షెట్టర్‌కు ఈసారి టికెట్ విషయంలో బీజేపీ ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ అధిష్టానం నుంచి పిలుపు అందుకున్న ఆయన.. ఇవాళ మీడియా ముందు తన అసహనం ప్రదర్శించారు. నేను బీజేపీ అధిష్టానాన్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను.. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ప్రతీసారి 21 వేల ఓట్లకు పైచిలుకు ఆధిక్యంతో నెగ్గాను. నా కెరీర్లో ఎటువంటి మచ్చ లేదు. ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటప్పుడు నన్ను తప్పుకోమని, వేరే వాళ్లకు అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతారు?. అందుకే నన్ను పోటీకి అనుమతించాలని, లేకుంటే పార్టీకి మేలు జరగదు అని ఆయన మీడియా ఎదుట అసంతృప్తిగా మాట్లాడుతూ వెళ్లిపోయారు. ఒకవేళ పోటీకి అనుమతించకుంటే మాత్రం.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా? అనే ప్రశ్నకు.. దానికి సమాధానం బీజేపీ అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీజేపీ పట్ల విధేయతతో కొనసాగుతున్నా. తాజా సర్వేలు కూడా నా విజయావకాశాలను ధృవీకరించాయి. కానీ, అధిష్టానం నుంచి నాకు అందిన పిలుపు నన్ను నిరాశకు గురి చేసింది. టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడెట్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తా అని తెలిపారాయన. జగదీష్ శివప్ప షెట్టర్.. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు. కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. పార్టీ ఎన్నికల సంఘం ఈ వారంతంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈశ్వరప్ప ఇక పోటీ చేయరట! -
కర్ణాటక రాజకీయాల్లో మఠాల ప్రభావం
-
రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో?
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో 1985 నుంచి అధికార పార్టీ వరుసగా రెండోసారి నెగ్గిన దాఖలాలు లేవు. 38 ఏళ్ల ఆ సంప్రదాయాన్ని బద్ధలుకొట్టి, మళ్లీ జెండా ఎగురవేయాలన్న కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సొంతంగానే సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది. తగిన మెజార్టీ లేక దెబ్బతిన్న అనుభవాలు ఆ పార్టీ కి ఉన్నాయి. కర్ణాటకలో గెలుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గి, సొంతంగా మెజార్టీ సాధిస్తే రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నట్లే. బొమ్మై లక్ ఎలా ఉందో! కర్ణాటకలో జనతా పార్టీ నేత రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా 1983 నుంచి 1985 వరకూ మైనార్టీ ప్రభుత్వం కొనసాగింది. రాష్ట్రంలో అదే తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ కి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో రామకృష్ణ హెగ్డే తన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 224 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 139 సీట్లు గెలుచుకుంది. 1985లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జనతా పార్టీ లో విభేదాలు తలెత్తాయి. జనతా పార్టీ మూడు పార్టీలుగా విడిపోయింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వీరేంద్ర పాటిల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ వచ్చింది. 1989 నుంచి ఇప్పటివరకూ ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రులకు మళ్లీ అదే పదవి వరుసగా రెండోసారి దక్కలేదు. మూడున్నరేళ్ల క్రితం సీఎంగా కుర్చీనెక్కిన బసవరాజ బొమ్మై తన పార్టీని గెలిపించి, మళ్లీ సీఎం అవుతారా! అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన భవితవ్యం తేలిపోనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆశలు కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలో కోట్లాది మంది లబ్ధి పొందారని, వారంతా తమకు అనుకూలంగా ఓటు వేయడం ఖాయమని బీజేపీ నాయకత్వం ఆశలు పెంచుకుంది. కర్ణాటక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రధానమంత్రి జన సురక్ష యోజన కింద రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున బదిలీ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అన్ని బీపీఎల్ కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేశారు. జన్ ఆవాస్ యోజన కింద 30 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.10 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేశారు. మరోవైపు సర్కారీ కాంట్రాక్టుల్లో ‘40 శాతం కమీషన్లు’ అనే ఆరోపణలు బొమ్మై ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోవడం, రాజధాని బెంగళూరులో కనీస మౌలిక సదుపాయాలు కొరవడడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోదీ–షాకు ప్రతిష్టాత్మకం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై నరేంద్ర మోదీ, అమిత్ షా ఎంతో శక్తిని, సమయాన్ని, కేంద్ర ప్రభుత్వ వనరులను వెచ్చిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మళ్లీ బీజేపీని గెలిపించి, ట్రెండ్‌ను రివర్స్ చేయాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. గత ఏడు నెలలుగా కర్ణాటకలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బెంగళూరు–మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే, ధార్వాడలో ఐఐటీ క్యాంపస్, శివమొగ్గలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్‌ఫామ్ వంటి కీలకమైన పాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోండి, డబుల్ ఇంజిన్ ప్రయోజనాలు అందుకోండి’ అని పిలుపునిస్తున్నారు. సంపూర్ణ మెజార్టీ యే లక్ష్యం రాష్ట్రంలో 2008, 2018లో బీజేపీ విజయం సాధించింది. రెండుసార్లూ 100 సీట్ల మార్కును దాటింది. కానీ, సంపూర్ణ మెజార్టీ అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఇతర పార్టీ ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కానీ, అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పూర్తి మెజార్టీ దక్కించుకునేందుకు మోదీ–షా నేరుగా రంగంలోకి దిగారు. కులాలు లెక్కలు, ప్రాంతీయ సమీకరణాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ తరపున పోటీకి దిగే అభ్యర్థులను స్వయంగా ఎంపిక చేస్తున్నారు. గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. ‘కోటా’ కార్డు పనిచేస్తుందా? వేర్వేరు సామాజిక వర్గాలను ఆకట్టుకొనేందుకు బసవరాజ బొమ్మై రిజర్వేషన్ కార్డును ప్రయోగిస్తోంది. ఎన్నికల ప్రకటనకు కేవలం నాలుగు రోజుల ముందు రిజర్వేషన్ ఫార్ములాను సవరించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఓబీసీ కేటగిరీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించి, వాటిని లింగాయత్‌లు, వొక్కళిగలకు సమానంగా వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో రిజర్వేషన్లు కల్పి స్తామని హామీ ఇచ్చింది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచింది. కోటా కార్డు తమకు కచ్చితంగా లాభిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, రిజర్వేషన్ల విషయంలో బొమ్మై సర్కారు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. అందుకే వాటి ప్రభావం ఓటర్లపై పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్ల పేరిట బీజేపీ డ్రామాలు ఆడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కర్ణాటకలో ఓట్ల శాతం పెంచుకుంటేనే కాంగ్రెస్ గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 38 శాతం ఓట్లతో 80 సీట్లు సాధించింది. బీజేపీ కేవలం 36.2 శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గింది. జేడీ(ఎస్) బలం పాత మైసూర్ కిత్తూర్ కర్ణాటక(పాత ముంబై ప్రాంతం), కల్యాణ కర్ణాటక(హైదరాబాద్ కర్ణాటక), సెంట్రల్ కర్ణాటకతోపాటు కోస్తా ప్రాంతంలో బీజేపీ బలంగానే ఉంది. పాత మైసూర్ ప్రాంతం, బెంగళూరు సిటీలో మాత్రం వెనుకబడి ఉండడం ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ఈ రెండుచోట్ల మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పాత మైసూర్లో వొక్కళిగ సామాజికవర్గం ప్రాబల్యం అధికం. 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) ఇక్కడ 37 స్థానాలకు గాను 30 స్థానాలు గెలుచుకుంది. కింగ్‌మేకర్‌గా మారింది. ఆ పార్టీ నేత, వొక్కళిక సామాజికవర్గం ప్రముఖుడు హెచ్డీ కుమారస్వామి 14 నెలలపాటు సీఎంగా కొనసాగారు. పాత మైసూర్లో ఈసారి కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి, ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాలని జేడీ(ఎస్) భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ కర్ణాటక అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం
-
ఎన్నికల వేళ రాయచూర్ రైతులు కీలక డిమాండ్లు
-
కర్ణాటక ఎన్నికల్లో ఆప్ పోటీ..
-
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో ఎన్నికల వేళ తనిఖీలు..
బొమ్మనహళ్లి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో విస్తృతంగా సాగుతున్న తనిఖీల్లో ఒకేసారి భారీఎత్తున నగదు పట్టుబడింది. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ నియోజకవర్గం వీరసంద్ర చెక్‌పోస్ట్ వద్ద శనివారం సాయంత్రం ఎన్నికల స్క్వాడ్ తనిఖీలలో రూ.4 కోట్ల 75 లక్షల నగదు లభించింది. ప్రైవేటు కంపెనీలకు చెందిన మూడు వాహనాలను తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నగదును తరలిస్తున్నవారి వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ అధికారులకు సమాచారమిచ్చామన్నారు. దావణగెరె తాలూకా హెబ్బాల చెక్‌పోస్టు వద్ద ఎన్నికల సిబ్బంది తనిఖీల్లో బీఎండబ్ల్యూ కారులో తరలిస్తున్న రూ.39 లక్షల విలువైన 66 కేజీల వెండి పాత్రలు లభించాయి. చెన్నై నుంచి ముంబైకి వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కారు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందినదిగా భావిస్తున్నారు. కారును, వస్తువులను సీజ్ చేసి విచారణ చేపట్టారు. -
Karnataka Assembly Elections 2023: పాత మైసూరు.. కొత్తపోరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..? ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం. ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్‌టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్‌పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్‌లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్) రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్‌చైర్‌లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వొక్కలిగ సంఘ్ మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్‌ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018 ఎన్నికలు జేడీ(ఎస్) 30 కాంగ్రెస్ 20 బీజేపీ 15 బీఎస్పీ 1 2013 ఎన్నికలు జేడీ (ఎస్) 26 కాంగ్రెస్ 26 బీజేపీ 8 ఇతరులు 6 పాత మైసూర్ రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాబల్య కులం: వొక్కలిగ (రాష్ట్ర జనాభాలో 15%) అసెంబ్లీ సీట్లు – 66 – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం
సాక్షి, చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీచేస్తున్నట్టు ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం ప్రకటించింది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో ఆ శిబిరం ముఖ్యనేత పుహలేంది శుక్రవారం భేటీ అయ్యారు. మెజారిటీ శాతం నేతలు, సభ్యుల మద్దతుతో అన్నాడీఎంకేను పళనిస్వామి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పగ్గాలు కూడా చేపట్టారు. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో గెలుపు తమదే ధీమాను ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి కన్నా ముందుగా బీజేపీకి దగ్గరయ్యే విధంగా పన్నీరుసెల్వం ఓ అడుగు ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పయనించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. అలాగే, తన మద్దతు నేత పుహలేందిని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో భేటీకి పంపించారు. ఆయన్ను కలిసిన పుహలేంది పోటీ విషయంగా చర్చించి రావడం గమనార్హం. పోటీ తథ్యం.. మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో తమ శిబిరం తరఫున అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీలో ఉండడం తథ్యమని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్నామని ఇందులో మార్పులేదన్నారు. కోర్టు తుది తీర్పు అన్నాడీఎంకేకు గట్టి సమాధానంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నోట్ల కట్టలతో ప్రధాన కార్యదర్శి పగ్గాల చేపట్టిన పళణిస్వామికి మున్ముందు ఆ శిబిరం నేతలు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయన్నారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం కోరినట్టు, పిలుపువస్తే కలిసేందుకు సిద్ధమని పన్నీరుసెల్వం తెలిపారు. -
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
-
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
బెంగళూరు: ఎన్నికలొస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానారకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. అక్కడి అన్ని పార్టీలకు కీలకమే. జాతీయ పార్టీలైతే.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రచారం జోరందుకోగా.. అదే సమయంలో ఓటర్లపై విపరీతమైన ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కన్నడనాట ప్రస్తుతం క్యాష్, మద్యం, డ్రగ్స్ జోరు కనిపిస్తోంది. కేంద్రం ఎన్నికల సంఘం మార్చి 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలుకాగా.. ఉచిత హామీలతో పాటు ప్రచారంలో ప్రలోభాల పర్వం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా నగదు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుండ్ ఏరియాల్లో మొత్తంగా రూ.4.45 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. 62వేల లీటర్ల మద్యం( రూ.కోటి 89 లక్షల విలువ) సైతం ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇది స్టాటిక్ సర్వేలెన్స్ టీం.. ధార్వాడ్ నియోజకవర్గంలో 45 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే.. బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో 34 లక్షల విలువ చేసే ఉచిత కానుకలను ఓటర్లకు పంచుతుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు.. బెలగావి ఖానాపూర్ తాలుకాలో ఏకంగా రూ.4.61 కోట్ల క్యాష్, 21 లక్షల విలువ చేసే బంగారం, మరోచోట 19 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 12 కోట్లు విలువ చేసే కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.27.38 కోట్ల నగదును రూ. 26.38 కోట్ల విలువైన మద్యాన్ని రూ.88 లక్షల డ్రగ్స్‌ను, రూ.9.87 కోట్లు విలువ చేసే బంగారం రూ.12.49 లక్షల ఇతర వస్తువులను అధికారులు గత 24 గంటల్లో స్వాధీనం చేసుకున్నారు. న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. వాళ్ల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో ప్రశ్నించారు. తనిఖీలు చేస్తే.. నడుముకు దండలాగా ఏడున్నర లక్షల రూపాయల 500 నోట్ల కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఎన్నికలొచ్చినయ్.. ఎటు చూసినా లిక్కర్, నోట్ల కట్టలే!నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో స్వాధీనం చేసుకున్నారు. -
ఊగిసలాడే ఓటర్లే కీలకం
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మే 10న ఎన్నికలు జరిగి, 13న ఫలితాలు వెలువడుతాయి. నాలుగు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలుపొందలేదు. దీన్ని తిరగరాయాలని బీజేపీ అనుకుంటోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని ఆశిస్తోంది. మూడవ స్థానంలో ఉన్న జేడీఎస్, మళ్లీ కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే, వీలైతే కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత సర్వేలు సూచిస్తున్నాయి. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. సుమారు నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయ సంక్లిష్టత విషయంలో ఒక స్పష్టత వస్తుంది. కర్ణాటక ఓటర్లు కొత్త ఎన్నికల ట్రెండును మొదలు పెడతారా, లేక పాత రాజకీయ సంప్రదాయాన్నే పాటిస్తారా అనేది ప్రశ్న. ‘రెండో’ గెలుపు ఒక్కసారే... దాదాపు నాలుగు దశాబ్దాలుగా కర్ణాటక ఎన్నడూ అధి కారంలో ఉన్న పార్టీకి తిరిగి గట్టి మెజారిటీని కట్టబెట్టలేదు. చివరిసారిగా రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ 1985లో రెండోసారి కూడా స్పష్టమైన మెజారిటీని సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ మెజారిటీతో గెలుపొందలేదు. 2008లో, 2018లో అది మెజారిటీకి సమీ పంలోకి వచ్చింది. 2008లో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో అది మెజారిటీని సాధించగలిగింది. 2018లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా వల్ల బీజేపీ మెజారిటీ సాధించుకుంది. ఈ రెండు ధోరణులను ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తిరగరాయా లని ఆశ పడుతోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని అనుకుంటోంది. మూడవ స్థానంలో దూరంగా ఉన్న జేడీఎస్, ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించని స్థితిలో అసెంబ్లీలో అధికారంపై ఆశలు పెట్టుకుంటోంది. మళ్లీ ఒకసారి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే అవకాశం కోసం, వీలైతే మరో సారి కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపున కర్ణాటకలో నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి రాష్ట్రాన్ని నిలుపుకొనేందుకు సకల ప్రయ త్నాలూ చేస్తోంది. చతుర్ముఖ వ్యూహంతో అది పనిచేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే... మొదటిది: కేంద్రప్రభుత్వం, దాని నాయకత్వానికి స్పష్టంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గత మూడు నెలలుగా జరుగుతున్నది ఒక సూచిక అనుకుంటే, కేంద్ర నాయకత్వమే నేరుగా ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రదర్శించు కోవడంపై దృష్టి పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏదైనా ప్రస్తా వించడం, కొంత ఆలస్యమైన రెండో ఆలోచనగానే కనబడుతోంది. రెండు: తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటు న్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. రాష్ట్ర నాయకులలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పష్టంగానే పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. రాష్ట్రంలో పార్టీని నిర్మించి ఘనత ఆయ నదే. ఆయన కరిష్మా ఆధారంగానే నిలబడాలని బీజేపీ ఆశలు పెట్టు కుంటోంది. అయితే ఈసారి కాస్త తేడా ఉంది. తాను ఈ దఫా ఎన్ని కల్లో పోటీ చేయనని యడ్యూరప్ప ప్రకటించారు. ఇంతకుముందటి ఎన్నికల్లో పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు కొచ్చారు. ఇదేమైనా వ్యత్యాసం తేగలదేమో చూడటం ఆసక్తికరం. మూడు: ఉత్తర, కోస్తా కర్ణాటకలో తనకున్న సాంప్రదాయిక మద్దతును నిలబెట్టుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. అలాగే పాత మైసూర్ ప్రాంతంలోకి చొచ్చుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మైసూరు ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే పోటీ ఉంటోంది. అవసరమైన మెజారిటీని సాధించాలంటే ఉత్తర కర్ణా టకలో తన బలమైన ఉనికిని నిలబెట్టుకుంటూనే, పాత మైసూరులో బీజేపీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో బీజేపీ జాతీయ నాయకులు పదేపదే పర్యటనలు చేస్తుండటం దీన్నే తేటతెల్లం చేస్తోంది. చివరగా, కర్ణాటకలో విస్తృతమైన సామాజిక ఏకీభావాన్ని నిర్మించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. పార్టీకి లింగాయతులు తమ మద్దతును ఎప్పటిలా కొనసాగిస్తారని నమ్ముతూనే వక్కళిగలు, ఓబీసీలు, దళితుల మద్దతును కూడగట్టుకోవాలని బీజేపీ ప్రయత్ని స్తోంది. రిజర్వేషన్ కోటాను తిరగరాయడం ఈ కులాల్లోకి వ్యాప్తి చెందే లక్ష్యంలో భాగమేనని చెప్పాలి. ఐక్యత లేమి పార్టీకి నష్టం కర్ణాటకలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రధాన పక్షంగానే ఉంటూ వచ్చింది. కానీ ముఠాతత్వం, కీలక సమయాల్లో ఐక్యతా లేమి కారణంగా పార్టీ మట్టికొట్టుకుపోతోంది. అయితే, ఐక్యత లేకుండా ఈ దఫా ఎన్నికల్లో మెజారిటీ వచ్చే అవకాశం కలగానే మిగిలిపోతుందని పార్టీ, ప్రత్యేకించి దాని రాష్ట్ర నాయకత్వం గుర్తిస్తోంది. ఇద్దరు కీలక నేతలు సిద్ధ రామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై తమ ఆకాంక్షలను ఇప్పటికే ప్రకటించారు. అయితే తమ లక్ష్మణ రేఖను మాత్రం వారు దాటలేదు. ఎన్నికల అనంతరమే ముఖ్య మంత్రి అభ్యర్థి నిర్ణయం జరుగుతుందని వీరు ప్రకటించారు. పార్టీలో ఐక్యత కొన సాగుతుందో లేదో తేల్చడానికి అభ్యర్థలకు టికెట్ల పంపిణీ సమయమే లిట్మస్ పరీక్ష అవుతుంది (అయితే ఇప్పటికి రెండు జాబితాలను కాంగ్రెస్ వెలువరించింది). ఇంతవరకు పార్టీ స్థానిక సమ స్యలపై, బీజేపీ పాలనపై దృష్టి పెట్టింది. అయితే, లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణను కూడా తమ ప్రచా రంలో అదనపు అంశంగా జోడించింది. సాంప్రదాయకంగా మద్దతు పొందుతున్న పలు వర్గాల పొత్తును కాంగ్రెస్ పట్టుదలతో సాధించిందని గుర్తుంచుకోవాలి. స్పష్టమైన ఫలితమే... జేడీఎస్ పార్టీ సుదూరంలోని మూడవ శక్తిగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయంగా పెను నష్టాన్ని చవిచూసింది. దాంతో పాత మైసూరు రీజియన్‌లోని జేడీఎస్ సాంప్రదాయిక పునాదిలోకి బీజేపీ చొచ్చుకు వెళ్లడానికి ఇది అనుమతించింది. అయితే కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ పార్టీతో టచ్‌లో ఉంటున్నాయని చెప్పడం ద్వారా జేడీఎస్ నేత కుమారస్వామి రాజకీయంగా సంచలనం సృష్టించారు. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత కొన్నేళ్లలో లోక్‌నీతి–సీఎస్డీఎస్ జరిపిన పోల్ అనంతర సర్వేలు సూచిస్తున్నాయి. క్రితంసారి కర్ణాటక ఎన్నికల విషయంలో ఇదే నిజమైంది. కొంతమేరకు ఇది రాజకీయ పోలరైజేషన్‌ను ప్రతిఫలించింది. ఈ పార్టీలకు ఉన్న నిబద్ధ ఓటర్ల రీత్యా, ఇది అంత ఆశ్చర్యం కలిగించదు. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు తీవ్రమవుతాయి. చాలామంది ఎన్నికల వ్యాఖ్యాతలు ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఊహిస్తున్నారు. కానీ ఈ అసెంబ్లీ ఫలితాలు మరింత స్పష్టతతో వెలువడతాయి. సందీప్ శాస్త్రి వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు;జాతీయ సమన్వయకర్త, లోక్‌నీతి నెట్వర్క్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
దిగ్భ్రాంతికి లోనయ్యా.. బాధగా ఉంది: ప్రకాష్ రాజ్
బెంగళూరు: సినీ నటుడు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రకాష్ రాజ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోటి నటుడు, కన్నడ స్టార్‌గా పేరున్న సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాష్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారాయన. అంతకు ముందు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్ రాజ్ ఖండించారు. అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగింది. అలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్ అమాయకుడేం కాదంటూ ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, ఆ అంచనాని తలకిందులు చేస్తూ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు సుదీప్. తాను రాజకీయాల్లో చేరబోనంటూనే.. రాబోయే ఎన్నికల్లో కేవలం బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు. సీఎం బసవరాజ్ బొమ్మై తనకు గాడ్‌ఫాదర్ లాంటి వాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడినంటూ సుదీప్ నిన్న ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్! ఎన్నికల్లో పోటీపై నటుడి క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపే, జేడీఎస్ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు. పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు. ‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ.. -
అధిష్టానం ఆ పని చేయబోదు: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న వేళ.. మరోవైపు జాతీయ పార్టీలు రెండూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వేచిచూసే ధోరణినే అవలంభిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల పేర్లు ప్రధానంగా తెర మీద వినిపిస్తున్నాయి. అయితే.. సీఎం ఎవరనే నిర్ణయం పార్టీ అధిష్టానం చేతులో కూడా ఉండదని అంటున్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య. కాంగ్రెస్‌కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అధికార రాష్ట్రాలను ఒక్కొక్కటిగా చేజార్చుకుంటూ పోతున్న హస్తానికి.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక బూస్ట్‌గా పని చేయడానికైనా కన్నడనాట విజయం రుచిచూడాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. సీఎం అభ్యర్థి విషయంలో అక్కడ సిద్ధరామయ్యకు, పార్టీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పైగా ఈ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాల కారణంగా.. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు? ఆపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సైతం నెలకొంది. ఈ క్రమంలో.. సీఎం అభ్యర్థిత్వంపై ఉన్న పోటీపై సిద్ధరామయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నేను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాడినే. అలాగే.. డీకే శివకుమార్ కూడా. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టదు.. బెట్టలేదు కూడా అని సిద్ధరామయ్య తేల్చారు. ఎందుకంటే.. ‘‘కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్టానం జోక్యం చేసుకోదు. అది ఏనాడూ జరగబోదు కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ సీఎం ఎంపిక ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేల ఎంపిక చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు’’ అంటూ తెలిపారు. ఇక.. సీఎం పదవికి యువనాయకత్వాన్ని ఎందుకు అంగీకరించబోరన్న ప్రశ్నకూ.. ఆయన భిన్నంగా స్పందించారు. నాకిప్పుడు 75 ఏళ్లు. ఒకరకంగా ఇదే నా చివరి ఎన్నిక అంటూ దాటవేత సమాధానం ఇచ్చారు. 2020 జులైలో.. సిద్ధరామయ్య నమ్మకస్తుడిగా ఉన్న దినేష్ గుండును తప్పించి మరీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న శివకుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి సిద్ధరామయ్య-శివకుమార్‌ల వైరం మరింతగా ముదిరింది. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఒక్కటిగా కనిపించిన ఈ నేతలు.. అటుపై ఫిబ్రవరిలో విడివిడిగా బస్సు యాత్రలో నిర్వహించి ఎవరిదారి వారిదేనని చాటిచెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ వీళ్ల విభేధాల ప్రభావం పడుతోంది. అయితే ఈ ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే.. కర్ణాటక అసెంబ్లీలో హంగ్ ఫలితం, జేడీఎస్‌తో పొత్తూ ఈ రెండు ప్రచారాలను తోసిపుచ్చడం.. కాంగ్రెస్ ఘన విజయంతో తిరిగి కన్నడనాట అధికారంలో వస్తుందనే ధీమా వ్యక్తం చేయడం మాత్రమే. -
హాసన్ విషయంలో నా వైఖరి మారదు
దొడ్డబళ్లాపురం: హాసన్ విషయంలో తన నిర్ణయం మార్చుకునేది లేదని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం రామనగరలో మీడియాతో హాసన్ టికెట్ కేటాయింపుపై మాట్లాడారు. దేవేగౌడ ఇప్పటికే హాసన్ ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారన్నారు. హాసన్ టికెట్‌పై చాలా చర్చ జరుగుతోందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రస్తుతం దేవేగౌడ ఢిల్లీ వెళ్లారని, రాగానే టికెట్లపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. టికెట్ లభించకపోతే భవాని రేవణ్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే విషయం తనకు తెలీదన్నారు. ఈ విషయం ఆమెనే అడగాలన్నారు. త్వరలో రెండవ, నాలుగైదు రోజుల్లో మూడవ లిస్టు విడుదల చేస్తామన్నారు. -
ప్రైమరీలో నెగ్గితేనే పార్టీ అభ్యర్థి
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు తెరలేచింది. మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాయి. ప్రచారంలో దూసుకు పోతున్నాయి. బీజేపీ మాత్రం అభ్యర్థులపై ఇంకా ప్రకటన చేయలేదు. పైగా ఈ ఎన్నికల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి కలిగిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీలు అమలు చేసే ‘ప్రైమరీ’లను బీజేపీ అందిపుచ్చుకుంది. ఒకరకంగా ఇవి అంతర్గత ఎన్నికలని చెప్పుకోవచ్చు. బీజేపీ టికెట్లపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ నేతలు, కార్యకర్తలే ఎంపిక చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఇలాంటి విధానాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి. సగటున 150 మంది ఓటర్లు ► కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ నాయకత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో ప్రైమరీలు నిర్వహించింది. ఈ ఎన్నికల ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో సగటున 150 మంది ఓటు వేశారు. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ ఆఫీసు–బేరర్లు, మండల కమిటీల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాలైన మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, యూత్ మోర్చా, రైతు మోర్చా, మైనార్టీ మోర్చా సభ్యులు ఓటర్లుగా నమోదయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్గత ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించడానికి ఇద్దరు బీజేపీ సీనియర్ నాయ కులను అధిష్టానం నియమించింది. రాష్ట్రమంతటా ప్రైమరీలు సజావుగా ముగిశాయి. అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. పార్టీ ఆశిస్తున్నదేమిటి? ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే. గ్రూప్‌లు, అంతర్గత కుమ్ములాటల నడుమ అందరినీ సంతృప్తిపరుస్తూ సమర్థున్ని ఎంపిక చేయాలి. రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేసినట్లు అవుతుందని, ఎక్కువ మందికి నచ్చిన అభ్యర్థే ఎన్నికల్లో పోటీకి దిగుతాడని, దాంతో విజయావకాశాలు రెట్టింపవుతాయని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు నిర్మల్‌కుమార్ సురానా చెప్పారు. అసమ్మతిని చల్లార్చడానికి, అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రావడానికి ప్రైమరీలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కార్యకర్తల చేతుల్లోనే పెట్టామని అన్నారు. 10న తుది జాబితా ప్రకటన.. ► బీజేపీ ‘ప్రైమరీ’కసరత్తు బాగానే ఉన్నప్పటికీ ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మాత్రం గుబులు మొదలైంది. ఈసారి తమ టికెట్ గల్లంతు అవుతుందని, తమ స్థానాల్లోకి కొత్త అభ్యర్థులు వస్తారని బెంబేలెత్తిపోతున్నారు. అయితే, గెలిచే సామర్థ్యం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మల్‌కుమార్ సురానా చెప్పారు. అంతర్గత ఎన్నికల ఫలితాలతోపాటు గెలిచే సత్తా, సామాజిక న్యాయం తదితర సమీకరణాల ఆధారంగా అభ్యర్థులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రైమరీల్లో మూడు పేర్లను ఎంపిక చేశారు. జిల్లా కోర్ కమిటీలు ఆయా పేర్లను క్షుణ్నంగా పరిశీలించాయి. సదరు ఔత్సాహిక నేతలతో స్వయంగా మాట్లాడాయి. జిల్లా కోర్ కమిటీల సూక్ష్మ పరిశీలన దాదాపు పూర్తయ్యింది. ఇందులో వెల్లడైన ఫలితాల ఆధారంగా అభ్యర్థులను రాష్ట్ర కోర్ కమిటీ ఖరారు చేయనుంది. తుది జాబితాను బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తారు. ఈ జాబితాలోని పేర్లను ఈ నెల 10వ తేదీన కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అంటే ఎన్నికలకు సరిగ్గా ఒక నెల ముందు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ప్రజాస్వామిక విధానం.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రైమరీల లాంటి ప్రయోగమే చేసింది. దీనికి ‘ఎంచుకో, ఎన్నుకో’అని పేరు పెట్టింది. ఇప్పుడు జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు రుసుము కింద ఆశావహులు రూ.2 లక్షల చొప్పున పార్టీకి చెల్లించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ నాయకత్వం వసూళ్ల ప్రక్రియగా మార్చేసిందని బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు చలవాది నారాయణస్వామి విమర్శించారు. తాము డబ్బుతో సంబంధం లేకుండా కార్యకర్తలను భాగస్వాములను చేస్తూ పూర్తి ప్రజాస్వామిక విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ప్రైమరీ ఎన్నికలు అంటే? ► అమెరికాలో పార్టీల తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులను ప్రజలు, పార్టీల్లో రిజిస్టర్ అయిన కార్యకర్తలు ఎంపిక చేస్తారు. ఈ ఎన్నికలనే ప్రైమరీ ఎన్నికలు అంటారు. ► అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఏ పార్టీ తరపున ఎవరు బరిలో ఉండాలన్నది మాత్రమే నిర్ణయిస్తారు. ► సాధారణ ప్రజలు ఓటు వేసే ఎన్నికను ఓపెన్ ప్రైమరీ, పార్టీ కార్యకర్తలు ఓటు వేసే ఎన్నికను క్లోజ్డ్ ప్రైమరీగా వ్యవహరిస్తారు. ► అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగే పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను బడా నేతలు, ప్రముఖుల కు కాకుండా ప్రజలకు, పార్టీల కార్యకర్తలకు అప్పగించాలన్నదే ఈ ప్రైమరీల ఉద్దేశం. ► అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయా లనుకునేవారు ప్రైమరీలతో పనిలేకుండా నేరుగా నామినేషన్ దాఖలు చేయొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటకలో బీజేపీ గెలువకుంటే పరిస్థితి మారుతుందా ?
-
షికారిపుర నుంచి విజయేంద్ర పోటీ
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్యపై పోటీ పడడానికి బీజేపీ నేత బి.ఎస్. యడియూరప్ప కుమారుడు వెనకడుగు వేశారు. వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న సిద్దరామయ్యపై తన కుమారుడు విజయేంద్ర పోటీపడే అవకాశాలున్నాయని నిన్నటికి నిన్న చెప్పిన యడియూరప్ప ఒక రోజు గడిచిందో లేదో మాట మార్చారు. తన కుమారుడు వరుణ నుంచి పోటీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. శివమొగ్గ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన షికారిపురి నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని శుక్రవారం విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు కూడా చెప్పానని వెల్లడించారు. అయితే వరుణ నుంచి విజయేంద్ర పోటీ చేయాలన్న ఒత్తిడి ఉందని అంగీకరించారు. -
Video: సీఎం బొమ్మై కారును అడ్డగించిన అధికారులు.. ఆకస్మిక తనిఖీలు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆలయానికి వెళ్తుండగా బొమ్మై వాహనాన్ని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆపింది. సీఎం కారులో కారులో తనిఖీలు చేపట్టింది. బొమ్మై కారును అధికారులు తనిఖీ చేస్తన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలవ్వడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ క్రమంలో బొమ్మై తన అధికారిక వాహనాన్ని అధికారులకు సరెండర్ చేశారు. శుక్రవారం ఓ ప్రైవేటు కారులో ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్తుండగా హోసహుద్య చెక్‌పోస్టు వద్ద అధికారులు ఆపారు. అయితే బొమ్మై కారులో అభ్యంతరకరమైనవేవి గుర్తించలేదని అధికారులు తెలిపారు. సాధారణ తనిఖీ అనంతరం ఆయన వాహనం వెళ్ళడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. #WATCH | Karnataka CM Basavaraj Bommai's car checked by the Flying Squad team of the Election Commission as he was on his way to Sri Ghati Subramanya Temple in Doddaballapur Model Code of Conduct is enforced in the State in view of the May 10 Assembly elections. pic.twitter.com/esBkFcIMAL — ANI (@ANI) March 31, 2023 కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బుధవారం ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 10న ఎన్నికలు జరుగనుండగా.. మే 13న కౌంటింగ్ ఉండనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. -
సిద్దరామయ్యపై యడ్డీ కుమారుడు పోటీ?
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు సిద్దరామయ్య మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్న వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బి.ఎస్. యడియూరప్ప కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు బి.వై. విజయేంద్ర వరుణ నియోజకవర్గం నుంచి పోటీ పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యడియూరప్ప చెప్పడంతో రాజకీయంగా ఈ స్థానంపై ఆసక్తి పెరిగింది. మైసూరు జిల్లాలో ముఖ్య నియోజకవర్గాల్లో ఒకటైన వరుణకి ప్రస్తుతం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వరుణ నుంచి సిద్ధరామయ్య పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సిద్దరామయ్యపై మీ కుమారుడు విజయేంద్ర పోటీ పడతారా అని గురువారం యడియూరప్పని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై చర్చలైతే సాగుతున్నాయి. వరుణలో నెగ్గడం సిద్దరామయ్యకు అంత సులభం కాదు. మేము మంచి అభ్యర్థినే నిలబెట్టి గట్టి పోటీ ఇస్తాం. చూద్దాం ఏమవుతుందో’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ తనపై ఎవరు పోటీకి దిగినా పట్టించుకోనని అన్నారు. యడియూరప్ప పోటీకి దిగినా స్వా గతిస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ పేర్కొనడం విశేషం. -
ఖర్గే ఇంట గెలిచేనా?: అగ్నిపరీక్షగా అసెంబ్లీ ఎన్నికలు!
ఎస్.రాజమహేంద్రారెడ్డి : మల్లికార్జున ఖర్గే.. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కొత్త బాస్. గాంధీల ఇంటి పార్టీలాంటి కాంగ్రెస్‌కు గాంధీయేతరులు అధ్యక్షుడు కావడం విశేషం. ఆ పదవికి ఎంపిక కావడమే ఆయన సమర్థతకు నిదర్శనం. అంతగా పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే తన ప్రభావాన్ని అంతగా చూపెట్టలేకపోయినప్పటికీ పార్టీని ఏకతాటిపై నడపడంలో తన సమర్థతను చాటాడనే చెప్పుకోవాలి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో నిరసన గళాన్ని వినిపించడంలోనూ ఖర్గే తన నాయకత్వ గరిమను రుజువు చేసుకున్నారు. అనర్హత వేటుకు నిరసనగా విపక్షాలన్నింటినీ ఒకే వేదికపై మోహరించడంలోనూ విజయం సాధించారు. పార్లమెంట్లో అదానీ వ్యవహారంపైనా, పార్లమెంట్ బయట అనర్హత వేటు పైనా సామూహిక నిరసనలకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే సారథ్యంలోనే నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ పోరుకు నగారా మోగింది. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖర్గేకు ఇది అసలు సిసలైన పరీక్ష. ఒకరకంగా అగ్నిపరీక్ష. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన, ఏకైక లక్ష్యం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంటి పోరులో గెలుస్తారో లేదో మే 13న(కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) తేలనుంది. ఖర్గే హీరోనో లేక జీరోనో అదే రోజు కర్ణాటకతోపాటు దేశానికీ తెలుస్తుంది. ఇప్పటికే తొలి విజయం నిజానికి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరుకు పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఓ వారం రోజుల ముందే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. నిత్యం అంతర్గత పోరుతో తలమునకలై ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ పరిణామం. తొలి జాబితాను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటించడం కచ్చితంగా ఖర్గే వ్యవహార శైలికి అద్దం పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉన్న చిరకాల భేదాభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే వీరిద్దరి సంఘర్షణపై ఓ కన్నేసి ఉంచారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకటించే సమయానికి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. మే 10న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగిస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనదే అవుతుంది. జేడీ(ఎస్)తో పొత్తుకు విముఖత ఒకే గొడుగు కింద వైరి వర్గాల ఘర్షణ ఏ స్థాయిలో ఉంటుందో ఖర్గేకు అనుభవపూర్వకంగా తెలుసు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖర్గే ఒక్కసారి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అవకాశాలు రాక కాదు, అవకాశాలు తలుపుతట్టినా అంతర్గత పోరును తట్టుకొని నిలబడలేకపోయారు. ఒక్కసారి కాదు, ఏకంగా మూడుసార్లు ఆయన నుంచి ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారిపోయింది. 1999లో ఎస్.ఎం.కృష్ణ, 2004లో ఎన్.ధరమ్ సింగ్, 2013లో సిద్ధరామయ్య నుంచి ఎదురైన గట్టి పోటీని ఎదుర్కోలేకపోయారు. 2004లో మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. దాదాపు ఖాయమైపోయిందనుకున్న తరుణంలో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ అభ్యంతరం చెప్పడంతో తన సహచరుడైన మరో సీనియర్ నాయకుడు ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు. ఈ అనుభవం వల్లే జేడీ(ఎస్)తో ఎన్నికల పొత్తుకు ఖర్గే విముఖంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత సంకీర్ణం తప్పని పరిస్థితి ఎదురైనా జేడీ(ఎస్)తో దోస్తీ కలలోని మాట అని ఖర్గే ఈపాటికే సుస్పష్టంగా చెప్పేశారు. ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని సైతం ఒప్పించినట్లు వినికిడి. మది దోచిన సర్వేలు కింగ్ అయ్యే అవకాశం మూడుసార్లు చేజారిన ఖర్గే ఈసారి కింగ్‌మేకర్ కావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంటి గెలిచి చూపించి, రచ్చ గెలుపు మీద ఇనుమడించిన ఉత్సాహంతో దృష్టి సారించాలని ఆశిస్తున్నారు. ఇటీవలి కొన్ని సర్వేల ఫలితాలు ఖర్గే మనసు దోచాయి. ఇండియాటుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో కర్ణాటకలో జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగి ఉంటే 28 సీట్లకు కాంగ్రెస్ 17 సీట్లను దక్కించుకొనేది అని ఆ సర్వే సారాంశం. కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే∙ఏబీపీ–సీ ఓటర్ సర్వే కాంగ్రెస్‌కే విజయాన్ని కట్టబెట్టింది. ఆ పార్టీకి 115–127 సీట్లు వస్తాయంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 117 స్థానాలంటే సంకీర్ణం జోలికెళ్లకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ సర్వే ఖర్గే మనసు దోచి ఉంటుంది. ఇక కర్ణాటక ప్రజల మనసులు దోచడానికి ఖర్గే వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. -
ఎన్నికల కర్ణాటకం
రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్రం ఎలా ఉండనుంది? దానికి ట్రైలర్ లాంటి ఈ ఏటి తొలి భారీ ఎన్నికల పోరు కర్ణాటక చూస్తే సరి. అందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. కీలక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో రానున్న మే 10న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించేసరికి వేడి మరింత పెరిగింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వివిధ కారణాల రీత్యా ప్రతి పార్టీకీ కీలకమే. దక్షిణాదికి ముఖద్వారం లాంటి కన్నడ కోటపై పట్టు బిగించడం బీజేపీకి ముఖ్యం. జీఎస్డీపీలో 8వ ర్యాంక్‌లో ఉన్న ఈ పెద్ద ధనిక రాష్ట్రంలో గెలవడం ద్వారా పుంజుకోవడం కాంగ్రెస్‌కు కీలకం. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా కాంగ్రెస్‌తో జట్టు కట్టి, ఏడాది పాటు సీఎం పీఠంపై తమవాణ్ణి కూర్చోబెట్టుకున్న జేడీ–ఎస్ తన ప్రాసంగికతను నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలు ప్రధానం. వెరసి, ఈసారి మతం, కులం, అవినీతి ప్రధానాంశాలు కానున్న కర్ణాటక ఎన్నికల సమరం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్, జనతాదళ్– సెక్యులర్ (జేడీ–ఎస్) పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోతుంటే, బీజేపీ ఏప్రిల్ మొదటి వారానికి జాబితాతో సిద్ధమవు తుందట. నిజానికి కర్ణాటకలో బీజేపీ తొలి విజయం ఈనాటిది కాదు. 2008లోనే స్వతంత్ర ఎమ్మెల్యే లతో కలసి, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ పీఠంపై కూర్చుంది. దక్షిణాదిన అదే తొలి బీజేపీ సర్కార్. అప్పట్లో ఒకరికి ముగ్గురు ముఖ్యమంత్రులు (యెడియూరప్ప, సదానంద్ గౌడ, జగదీశ్ షెట్టర్) మారారు. ఇక, 2018లో ప్రజాతీర్పు విస్పష్టంగా లేక, హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో ఎన్నికల అనంతర విన్యాసాలు మరింత రంజుగా సాగాయి. ఆ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దేవెగౌడ సారథ్యంలోని జేడీ(ఎస్)– కాంగ్రెస్ పార్టీల ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకున్నాయి. అతి పెద్ద పార్టీగా బీజేపీ పక్షాన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన యెడియూరప్ప గద్దెనెక్కారు కానీ, తగినంత మెజారిటీ లేక విశ్వాస పరీక్షకు పది నిమిషాల ముందు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆపైన దేవెగౌడ కుమారుడు కుమారస్వామి సీఎంగా జేడీ (ఎస్)– కాంగ్రెస్‌ల ప్రభుత్వం ఏర్పా టైంది. తీరా ‘ఆపరేషన్ కమలం–2’ ద్వారా 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు తిప్పుకుంది. అలా ఆ సంకీర్ణ సర్కార్ 14 నెలలకే కుప్పకూలింది. మళ్ళీ యెడియూరప్ప అధికారంలోకి వచ్చారు. తీరా రెండేళ్ళకే ఊహించని పరిణామాలతో యెడియూరప్ప ఆ పీఠం బసవరాజ్ బొమ్మైకి కట్టబె ట్టారు. అలా 2018 నుంచి అయిదేళ్ళలో నాలుగు విడతల్లో ముగ్గురు సీఎంలుగా వచ్చారు. అసమర్థ పాలన, 40 శాతం కమిషన్ అవినీతి ముద్ర పడేసరికి కాషాయపార్టీ సతమతమవుతోంది. కర్ణాటకలో 7 శాతం ఎస్టీలు, 17 శాతం ఎస్సీలు, 14 శాతం లింగాయత్‌లు, 11 శాతం ఒక్కళిగలని లెక్క. అందుకే, కాంగ్రెస్ ‘అహింద’ (మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల) ఓటుబ్యాంక్‌పై ఆధారపడు తుంటే, దాన్ని ఢీ కొనడానికి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్‌కు దిగింది. ఓబీసీ కింద ముస్లిమ్లకిస్తున్న 4 శాతం కోటాను తొలగించి, రాష్ట్రంలో బలమైన ఓటుబ్యాంకైన లింగాయత్‌లు, ఒక్కళిగలకు పంచింది. ఎస్సీలకు 15 నుంచి 17 శాతానికీ, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికీ రిజర్వేషన్‌ను పెంచింది. రిజర్వేషన్లలో తాజా మార్పు తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తుంటే, కోటా తొలగింపుపై ముస్లిముల్లో, ఎస్సీల్లో అంతర్గత కోటాపై బంజారాల్లో వెల్లువెత్తుతున్న నిరసన ఆ పార్టీకి తలనొప్పే. తాజా ఎన్నికల సర్వేల్లో సీ–ఓటర్ లాంటివి కాంగ్రెస్ ఘనవిజయం ఖరారంటే, ‘జీ’ లాంటివి కాంగ్రెస్, బీజీపీల మధ్య పోరు నువ్వా, నేనా అన్నట్టు ఉంటుందంటున్నాయి. అంచనాలెలా ఉన్నా బీజేపీ ఈ ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవట్లేదు. గత 3 నెలల్లో 7సార్లు మోదీ కన్నడసీమలో పర్యటించడమే అందుకు ఉదాహరణ. మోదీతో పాటు అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, గత ఎన్నికల్లో ‘టిప్పు సుల్తాన్ వర్సెస్ హనుమాన్’ అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు దిగ్గజాలు తాజా ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు. మొత్తం 5.24 కోట్ల ఓటర్లున్న కర్ణాటకలో తొలిసారి ఓటుహక్కు వచ్చినవారు నిరుటితో పోలిస్తే 9.17 లక్షలు పెరిగారు. అలాగే, 80 ఏళ్ళు పైబడిన దాదాపు 1.5 లక్షల మందికీ, దివ్యాంగులు 5.6 లక్షల మందికీ తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకొనే వీలు కల్పిస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచడానికీ, పట్టణ ఓటర్లలో నిరాసక్తతను తగ్గించడానికీ ఇలాంటి చర్యలని అధి కారిక కథనం. అయితే, ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలు తొలగని అనేక పార్టీలు... ఇక ఇంటి నుంచే ఓటింగ్ అనేది అధికారిక యంత్రాంగ దుర్వినియోగానికి దారి తీస్తుందని ఆందోళన చెందుతున్నాయి. ఆ భయాందోళనల్ని బాపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎవరి బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి చాలా ముందు నుంచే ప్రతి పార్టీ యాత్రలు, ప్రచారం మొదలెట్టేసింది. ఓటర్లకు డిజిటల్ వాచీలు, రైస్ కుక్కర్ల లాంటి కానుకల పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడానికి ముందే రూ. 80 కోట్ల పైగా నగదు చిక్కింది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు ప్రజలు తిరుగులేని తీర్పు ఇస్తే తప్ప ఎన్నికల అనంతరం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఓట్ల కోసం కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు... ఎన్నికలయ్యాక ఎమ్మెల్యేల బేరసారాలకూ అదే పంథా అనుసరిస్తే ఆశ్చర్యం లేదు. అలా జరిగితే మరోసారి ప్రజాస్వామ్యం పరిహాసం పాలవుతుంది. ఇటీవలి అనేక ఎన్నికల లాగే కర్ణాటకలోనూ ఫలితాల అనంతరమే అసలు నాటకం మొదలుకావచ్చు. దాని కోసం మే 13 దాకా ఆగాల్సిందే! -
కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: మరో రెండు నెలల్లో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని పేర్కొంది. అయితే కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎన్నికల్లో అక్కడి ఏయే పా ర్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయి? పొత్తులు, ఇతర అంశాల ప్రభావం ఏమిటి? అన్న అంశాలను బీఆర్ఎస్ క్షుణ్నంగా పరిశీలించనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కర్ణాటకకు పంపనుంది. మొదట్లో హడావుడి చేసినా.. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు టీఆర్ఎస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించగా.. మొదట్లో పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో అడుగు పెట్టేందుకు హడావుడి చేసింది. అయితే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు ఇతర రాష్ట్రాల్లో జరిగే అన్ని ఎన్నికలకు దూరంగా ఉంటామని తర్వాత ప్రకటించింది. కానీ ఈ నిర్ణయాన్ని పాక్షికంగా సడలిస్తూ.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ను రిజిస్టర్ చేయడంతోపాటు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ తదితర పా ర్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, కాంధార్–లోహలో బహిరంగ సభలు నిర్వహించారు. మరిన్ని సభలు, సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. పోటీ చేయకున్నా.. చురుగ్గా.. కర్ణాటకలో శాసనసభ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. అక్కడ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉంటూనే.. చురుకైన పాత్ర పోషించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి కర్ణాటకలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక కమిటీని ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో ప్రధాన రాజకీయపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ) ఎన్నికల ఎత్తుగడలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపాయి. సరిహద్దు జిల్లాలపై స్పెషల్ నజర్ గతంలో హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా ఉండి ప్రస్తుతం కల్యాణ కర్ణాటకగా పిలుస్తున్న బీదర్, రాయచూర్, యాద్గిర్, కొప్పల్, కలబుర్గి జిల్లాల్లో బీఆర్ఎస్ బలోపేతం లక్ష్యంగా కొంత హడావుడి జరిగింది. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పర్యటించి వివిధ పా ర్టీల నేతలతో భేటీ అయ్యారు. కానీ తర్వాత కర్ణాటకపై ఫోకస్ తగ్గించి మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీతోపాటు విపక్ష కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకులో చీలికను నివారించడం, భావసారూప్య పార్టీ జనతాదళ్ (సెక్యులర్)కు మేలు చేసేందుకే కన్నడ రాజకీయాలపై ఫోకస్ తగ్గించినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీ (ఎస్) కర్ణాటక ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేపక్షంలో.. ఆ పార్టీ తరఫున కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల అవగాహన కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్‌ను సంప్రదించాయని ఇటీవల కుమారస్వామి ప్రకటించారు. ఒకవేళ జేడీఎస్ ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటే కర్ణాటక ఎన్నికల్లో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జేడీ(ఎస్)తో మైత్రి కొనసాగుతున్నట్టేనా? కుమారస్వామిని మరోమారు కర్ణాటక సీఎంగా చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ, డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాలకు కుమారస్వామి హాజరయ్యారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు కేసీఆర్‌తోపాటు మరో ముగ్గురు సీఎంలు హాజరైనా కుమారస్వామి రాలేదు. ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించేందుకు పలువురు సీఎంలు, విపక్ష నేతలను ఆహ్వానించగా.. అందులో కుమారస్వామి పేరు కనిపించలేదు. దీనితో జేడీ(ఎస్)తో బీఆర్ఎస్ మైత్రి బీటలు వారిందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో తలమునకలైన కుమారస్వామికి తీరిక లేనందునే బీఆర్ఎస్ సమావేశాలకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
కర్ణాటకలో మూడు ముక్కలాట!
అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి 40 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని తహతహలాడుతూ బీజేపీ.. కన్నడ నాట పార్టీ జెండా ఎగురవేసి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలని కాంగ్రెస్.. కన్నడ ఆత్మగౌరవ నినాదాన్ని మరింత రాజేసి కింగ్‌మేకర్ స్థాయి నుంచి కింగ్‌గా మారాలని జేడీ(ఎస్).. పార్టీ ల వ్యూహ ప్రతివ్యూహాలతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి సాక్షి, నేషనల్ డెస్క్ : కర్ణాటక ఓటర్లు ప్రతీసారి ఒకే తీర్పు ఇవ్వడం లేదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1985 నుంచి ఏ పార్టీ కూడా వరసగా రెండోసారి గెలవలేదు. ఈసారీ అదే సంప్రదాయం కొనసాగుతుందా, అధికార బీజేపీకి మళ్లీ పట్టం కడతారా అన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై అధికార వ్యతిరేకతను ప్రధాని మోదీ ఇమేజీతో ఎదుర్కొనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 150 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుంది. బలహీనంగా ఉన్న పాత మైసూరు (ఉత్తర కర్ణాటక)లో బలపడటంపై దృష్టి పెట్టింది. 89 స్థానాలున్నా ప్రాంతంలో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచూ పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అంతగా బలంగా లేకపోవడం, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్నే వారు నమ్ముకున్నారు. 100 సీట్లలో కీలకమైన లింగాయత్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. బీజేపీ ఇలా కేంద్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే, కాంగ్రెస్‌కు స్థానిక నాయకత్వమే బలంగా ఉంది. పీసీసీ చీఫ్ డి.కె శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల రద్దు, ధరల పెరుగుదల, హిజాబ్ వంటివాటిపై పార్టీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకుంటోంది. జేడీ(ఎస్) కన్నడ ఆత్మగౌరవ నినాదంతో ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి అంతా తానై నడుపుతున్నారు. ముక్కోణ పోరులో విజయం ఎవరిదోనన్న ఉత్కంఠ నెలకొంది.... బీజేపీ.. అనుకూలం.. ♦ ప్రధాని మోదీ ఇమేజ్. కేంద్ర నేతలు చేస్తున్న పర్యటనలు. డబుల్ ఇంజిన్ నినాదం. ♦ సంఘ పరివార్ సంస్థాగత బలం. ♦లింగాయత్ సామాజిక వర్గం మద్దతు, వక్కలిగ అనుకూల వైఖరితో మైసూర్ ప్రాంతంలో పెరుగుతున్న పట్టు. ♦ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు. ♦ డిజిటల్ మీడియా ప్రచారంలో పార్టీ కున్న పట్టు. వ్యతిరేకం.. ♦ ప్రభుత్వ వ్యతిరేకత, బొమ్మై ♦ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు. ♦ 40% కమీషన్ల ప్రభుత్వమన్న విపక్షాల ఉధృత ప్రచారం. ♦ ఎన్నికలకు ముందు మైనార్టీ ల ఓబీసీ కోటా రద్దుతో ముస్లింలు పార్టీకి మరింత దూరం. ♦ టికెట్ దక్కే అవకాశం లేని ఆశావహుల అసమ్మతి. జేడీ(ఎస్) అనుకూలం.. ♦ వక్కలిగ సామాజిక వర్గం మద్దతు. ♦ కన్నడ ఆత్మగౌరవం నినాదం మిన్నంటుతున్న వేళ ప్రాంతీయ పార్టీ గా ఉన్న ఇమేజ్. ♦ రైతు అనుకూల విధానాలతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు. ♦ హంగ్ వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరికైనా మద్దతివ్వగల వైఖరి. వ్యతిరేకం.. ♦ కుటుంబ పార్టీ ముద్ర. ♦ వక్కలిగ మినహా మిగతా సామాజిక వర్గాల ఆధిపత్యమున్న ప్రాంతాల్లో ఎదగకపోవడం. ♦ సొంత బలంపై పార్టీ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోవడం.. చాలాచోట్ల గెలుపు గుర్రాలు లేకపోవడం. ♦ 2018 నుంచి పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు. కాంగ్రెస్ అనుకూలం ♦ బలమైన స్థానిక నాయకత్వం. ♦ బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న అహిండా (మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితుల) సోషల్ ఇంజనీరింగ్ విధానంతో. తద్వారా వర్గాల ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం. ♦ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై పేసీఎం, 40% కమీషన్ అంటూ చేస్తున్న ప్రచారం. ♦ కర్నాటకకు చెందిన దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడయ్యాక వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం. ♦ గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు రూ.3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,000 ఆర్థిక సాయం వంటి హామీలు. వ్యతిరేకం ♦ శివకుమార్, సిద్దరామయ్య వర్గాల మధ్య పోరు. ♦ జి.పరమేశ్వర, హెచ్.కె.పాటిల్, కె.హెచ్.మునియప్ప వంటి నేతల్ని పక్కన పెట్టడంతో అసమ్మతి. కీలకమైన లింగాయత్ సామాజిక వర్గంలో ఓటు బ్యాంకును పెంచుకోలేకపోవడం. ♦ ప్రధాని మోదీ ఇమేజ్‌కి దీటైన కేంద్ర నాయకత్వం లేకపోవడం. ♦ ఆశావహులు ఎక్కువవటంతో అసమ్మతి భగ్గుమనే ఆస్కారం. కాంగ్రెస్‌దే అధికారం..! కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే విడుదలైన ఏబీపీ–సీఓటర్ ఎన్నికల సర్వే కాంగ్రెస్ పార్టీ యే అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు వస్తాయని, బీజేపీ 68–80 సీట్లు గెలుచుకుంటే జేడీ (ఎస్) 23–25 సీట్లతో సరిపెట్టుకుంటుందని సీ ఓటర్ సర్వేలో తేలింది. బసవరాజ్ బొమ్మై పరిపాలన అసలు బాగోలేదని సర్వేలో పాల్గొన్న ఏకంగా 50.5%మంది తేల్చి చెప్పారు. 57శాతం మంది ప్రస్తుత ప్రభుత్వం మారిపోవాలని అభిప్రాయపడినట్టు ఆ సర్వే వెల్లడించింది. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు... 80 మందితో ఆప్ జాబితా
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం విడుదల చేసింది. మేలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఆప్ రాష్ట్ర చీఫ్ పృథ్వీ రెడ్డి చెప్పారు. మొదటి జాబితాలోని అందరూ ఉన్నత విద్యావంతులే. వీరిలో 13 మంది లాయర్లు, ముగ్గురు డాక్టర్లు, నలుగురు ఐటీ నిపుణులు ఉన్నారు. అభ్యర్థుల్లో సగం కంటే ఎక్కువ మంది 45 ఏళ్లలోపు వారేనని, వీరందరినీ సర్వే ద్వారా ఎంపిక చేసినట్లు పృథ్వీ రెడ్డి వెల్లడించారు. మొదటి జాబితాలో సుప్రీంకోర్టు లాయర్ బ్రిజేశ్ కాలప్ప, బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)మాజీ అధికారి కె.మత్తయి, బీటీ నాగన్న, మోహన్ దాసరి, శంతల దామ్లే, అజయ్ గౌడ తదితరులున్నారని పృథ్వీ రెడ్డి చెప్పారు. -
80 ఏళ్లు పైబడ్డ వారికి ‘ఇంటి నుంచే ఓటు’
బెంగళూరు: 80 ఏళ్లు పై బడ్డ వారికి ఇంటినుంచే ఓటేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘80 ఏళ్లు దాటిన వారు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయడాన్నే మేమూ ప్రోత్సహిస్తాం. అలా వెళ్లలేని వారికోసం తొలిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇందుకోసం ‘సక్షమ్’ పేరిట మొబైల్యాప్ రూపొందించాం. అందులోకి వెళ్లి ఇంటి నుంచి ఓటేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఎన్నికల సిబ్బంది వారింటికి వెళ్తారు. వారిచ్చే ఫామ్ 12డి ద్వారా ఓటేయవచ్చు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తాం. గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం’’ అని వివరించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు ఆన్లైన్లోనే దాఖలు చేసేందుకు వీలుగా సువిధ పేరిట మరో మొబైల్ యాప్ రూపొందించినట్టు సీఈసీ వెల్లడించారు. సమావేశాలు, ర్యాలీలకు కూడా దీని ద్వారానే అనుమతి కోరవచ్చన్నారు. అభ్యర్థి గురించి ఓటర్లకు అవగాహన కోసం నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ఉద్యమం కూడా చేపట్టినట్టు చెప్పారు. ‘‘నేరచరిత్ర ఉన్న వారిని అభ్యర్థిగా ఎంచుకునే పార్టీలు అందుకు కారణాలను తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇ–విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు’’ అన్నారు. కర్నాటకలో ఎన్నికల తేదీని త్వరలో నిర్ణయిస్తామన్నారు. -
కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. -
కర్ణాటక ఎన్నికలకు బీజేపీ సారథిగా ఉజ్వల్ మ్యాన్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. ఇక ఈ ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. తాజాగా ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(54)ను నియమించింది ఆ పార్టీ. అలాగే.. కో ఇన్ఛార్జిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పేరుతో ఒక ప్రకటనను శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర ప్రధాన్ చూసుకుంటున్నారు. ఒడిషాలో పుట్టిపెరిగిన ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ తనయుడు. దేవేంద్ర ప్రధాన్.. వాజ్‌పేయి హయంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్.. ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. పలు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగానూ పని చేశారు. 2004లో దియోగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై బీహార్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘ కాలం పెట్రోలియం, సహజ ఇంధనాల శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ధర్మేంద్ర ప్రధాన్ ఖాతాలో ఉంది.ఈయన హయాంలోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం అయ్యి.. విజయవంతమైంది. అందుకే ఈయన్ని ఉజ్వల మ్యాన్‌గా పిలుస్తుంటారు. ఆంత్రోపాలజీలో పీజీ చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. మంచి వక్త కూడా. ఈ ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా.. ప్రభుత్వ ఏర్పాటులో అద్భుతం సృష్టిస్తామంటూ జేడీఎస్ ప్రకటించుకుంటోంది. -
కర్నాటకలో ఖతర్నాక్ పోటీ.. ఆసక్తికరంగా ట్రాకర్ పోల్ సర్వే
కర్ణాటకలో వచ్చే ఏప్రిల్/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్ ఫస్ట్’ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్‌పల్స్ సంస్థ - ‘సిస్రో’తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా.. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తం మీద హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్ పోల్‌లో తెలిసింది. పీపుల్స్‌పల్స్ డైరెక్టర్ ఆర్.దిలీప్‌రెడ్డి గురువారం మొదటి ట్రాకర్‌పోల్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్ పోల్ 2022 డిసెంబర్ 22-31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్ ధనుంజయ్ జోషి ఆధ్వర్యంలో నివేదికను రూపొందించారు. ఎన్నికలలోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే జరుగనుంది. మరో రెండు మార్లు ట్రాక్ పోల్స్ సర్వేను 2023 మార్చిలో ఒకసారి, సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి చేపడుతారు. కర్నాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్నాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలై, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ధీమాతో ఉన్నాయి. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన మొదటి ట్రాకర్ పోల్ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్/మైనస్ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్/మైనస్ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడీ(ఎస్)29 (ప్లస్/మైనస్ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడీ(ఎస్) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు ట్రాకర్‌పోల్ సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్) కీలకం కానుంది. ట్రాకర్‌పోల్ సర్వే గణాంకాల ప్రకారం కాంగ్రెస్ 2018 ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. అదే సమయంలో బీజేపీకి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది. పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థల సర్వే ప్రకారం, జేడీ(ఎస్) ఈ ఎన్నికల్లో కిందటి ఎన్నికల కన్నా తక్కువ ఓటు షేర్‌తో, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. ఈ పార్టీ 16 శాతం ఓట్లు సాధించనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం తక్కువ సాధించి 29 సీట్లు (కిందటిసారి వారి సంఖ్య 37) పొందుతుంది. జేడీ(ఎస్) దృష్ట్యా చూస్తే ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగినా దాదాపు తన ఓటు బ్యాంకును నిలుపుకోవడం ఎంతో కీలకం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తన ఓటు బ్యాంకును జెడీ(ఎస్) నిలుపుకోవడంతోపాటు అధిక సీట్లను సాధించాలి. కర్నాటక ఎన్నికల్లో కులాలతో పాటు మత అంశాలు కూడా కీలకంగా మారనున్నాయని సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. ఓబీసీలు, మాదిగలు, హోలియాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారు. మరోవైపు అగ్రకులాలు, వొక్కలింగాలు, లింగాయత్‌లు బీజేపీ వెంట ఉన్నట్లు ట్రాకర్‌పోల్ సర్వేలో తేలింది. జేడీ(ఎస్) ప్రధాన ఓటు బ్యాంకు అయిన వొక్కలింగాలలో 50 శాతం మంది ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అహిందా కూటమి, వొక్కలింగాయతేతరులైన ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ కొంతమేర ఆధిపత్యం పొందుతుందని ట్రాకర్‌పోల్‌లో తేలింది. 2013-2018 మధ్య కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కాలంలో, ఆయా వర్గాల సంక్షేమ పథకాల ప్యాకేజీలను అందజేయడం, సమర్థంగా అమలుపరచడంతో కాంగ్రెస్‌కు పార్టీకి వీరి నుండి ఎక్కువ మద్దతు లభిస్తోంది. పీపుల్స్ పల్స్- సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్ సర్వేలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు సిద్దరామయ్యకు 28 శాతం మద్దతిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకు 19 శాతం, కుమారస్వామికి 18 శాతం మంది నుంచి మద్దతు లభించింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఏయే పార్టీలు కూటమిగా ఏర్పడాలన్న నిర్దిష్ట ప్రశ్నకు కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 41 శాతం బీజేపీ, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అంశాలు బీజేపీకి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బీజేపీకి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తున్నది. కర్నాటక అభివృద్ధికి ఏ పార్టీ పాలన మెరుగైనదని ప్రశ్నించినపుడు.. 38 శాతం కాంగ్రెస్, 36 శాతం బీజేపీ, 18 శాతం జేడీ(ఎస్)కి అనుకూలంగా ఓటర్లు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కర్నాటకలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అడిగినపుడు.. 38 శాతం మంది కాంగ్రెస్ అని, 37 శాతం మంది బీజేపీ అని తెలిపారు. బీజేపీకి మరో మారు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా 51 శాతం మంది లేదని, 41 శాతం అనుకూలమని తెలిపారు. సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనబడుతోంది. కర్నాటకలో ఇప్పటికే పలు రాజకీయ పరిణామాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. సర్వే చేపట్టిన విధానం.. ‘సౌత్ ఫస్ట్’న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్-సిస్రో రీసెర్చ్ సంస్థలు ఈ సర్వేను 56 అసెంబ్లీ స్థానాల్లో 224 పోలింగ్ బూత్‌లను ఎంపిక చేసుకొని మొత్తం 4584 శాంపిల్స్ (ఓటర్ల) నుండి సమాచారం సేకరించాము. జనాభా దామాషాను పరిగణనలోకి తీసుకొని, సామాజిక వర్గాల ఆధారంగా ర్యాండమ్ పద్దతిలో ఎంపిక ద్వారా ఈ శాస్త్రీయ సర్వే జరిగింది. డిసెంబర్ 22 నుండి 31 వరకు ఈ ట్రాకర్‌పోల్ సర్వే ప్రక్రియ సాగింది. మార్చి 2023లో ఒకసారి, ఎన్నికల ముందు మరోమారు సర్వేను నిర్వహించనున్నాము. ప్రతీ పోలింగ్ స్టేషన్ నుండి 35 మంది ఓటర్ల నుండి సమాచారం సేకరించాము. ఈ సర్వేలో సీఏపీఐ (కంప్యూటర్ అసిస్టెడ్ ఇంటర్‌పర్సనల్ ఇంటర్వీయింగ్) పద్దతిన డేటా సేకరణ జరిపి, ఓటర్లను ముఖాముఖి కలుసుకుని, ఈ సర్వేలో అవసరమైన ప్రశ్నలు వేస్తూ డమ్మీ ఈవీఎమ్ ద్వారా రహస్య ఓటింగ్ నిర్వహించారు. ఈ సర్వే ఫలితాల్లో 1-2 (+/-) వ్యత్యాసాలకు ఆస్కారం ఉంది. (క్లిక్ చేయండి: రాజకీయాలకు ఎస్ఎం కృష్ణ గుడ్‌బై) -
కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్?
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది. మంత్రివర్గంలో సిద్ధూ అనుచరులు కర్ణాటక కేబినెట్లో ఇప్పటికే సుమారు 15 మంది మంత్రులు సిద్ధూ అనుచరులు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంలో అమాత్యగిరి దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరిన వారంతా సిద్ధూ అనుచరులుగానే చెబుతారు. వారందరిలో ఒకరిద్దరు మినహా అందరికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలవేళకి సిద్ధరామయ్య కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. 20 స్థానాలపై సిద్ధూ పట్టు బీజేపీ నేతల ఆహ్వానానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన వర్గానికి సుమారు 20 అసెంబ్లీ స్థానాల టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. వరుణ, చాముండేశ్వరి, హుణసూరు, హెబ్బాళ, చామరాజపేటె, కోలారు తదితర స్థానాలను సిద్ధూ ఆశించారు. మైసూరు జిల్లా హుణసూరు నుంచి సిద్ధూ పోటీ చేసినా తనకు ఇష్టమే అని మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ అన్నారు. సిద్ధరామయ్య కోసం తన సీటును వదులుకుంటానని స్పష్టం చేశారు. పాత మైసూరుపై పట్టు కోసమే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్‌బై: మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. గతంలో రామకృష్ణ హెగ్డేకు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు సిద్ధరామయ్యకు వస్తుందన్నారు. అదేవిధంగా మండ్య ఎంపీ సుమలతను బీజేపీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ స్థానాలు – 224+1 (నామినేటెడ్), బీజేపీ – 122 (స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో కలిపి) కాంగ్రెస్ – 69 జేడీఎస్ – 32 స్వతం్రత్రులు– 2 -
మా తర్వాతి టార్గెట్ ఆ రాష్ట్రమే.. కేజ్రీవాల్ కీలక ప్రకటన
సాక్షి, బెంగళూరు: ఇటీవల పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో ఆప్ సర్కార్ పాలన కొనసాగిస్తోంది. కాగా, పంజాబ్‌లో గెలుపుతో అదే జోరుతో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గుజరాత్లో పర్యటించి.. ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని గుజరాతీలను కోరారు. అవకాశం ఇస్తే ఢిల్లీ, పంజాబ్ పాలనను అందిస్తామని స్సషం చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం కేజ్రీవాల్ గురువారం బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉందన్నారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని నెలకోల్పుతామని ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రానికి కూడా రావణుడి లాగే అహంకారం ఉందన్నారు. సాగు చట్టాల విషయంలో తాము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. చివరికి సాగు చట్టాను వెనక్కి తీసుకుందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఈ సందర్బంలోనే కర్నాటకలో పాఠశాలలు, వైద్యశాలలు కావాలంటే ఆప్‌కు ఓటు వేయాలని కన్నడిలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, నేరస్థులే తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటే బీజేపీకి ఓటు వేయాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది చదవండి: జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత -
కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. సోనియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని జీ–23 గ్రూప్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో సోనియా గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీలో భారీ ప్రక్షాళన, పలు అంశాలపై వీరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో కాంగ్రెస్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ చర్చల్లో ఆజాద్ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కర్నాటక ఎన్నికల తర్వాత ఆజాద్‌కు అక్కడి నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మను కూడా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడుగా ఉన్న మనీష్ తివారీకి ఏఐసీసీలో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సుముఖత చూపించారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, హుడా.. ప్రస్తుత హర్యానా పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇక, గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్న సోనియా.. సిబల్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఇరువురు నేతలు.. కాంగ్రెస్ “అసమ్మతి నేతల” అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్‌కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
కర్ణాటక: తీర్పు తికమక
ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అని సామెత!. పొరుగున ఉన్న కర్ణాటక మరీ ఉలిపి కట్టె ఏమీ కాదు కానీ, కొంచెం తేడా అని మాత్రం చెప్పాల్సిందే. ఎలాగంటారా? ఇక్కడి ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక తీరుగా.. లోక్‌సభకు మాత్రం ఇంకో తీరుగా ఓటేస్తారు. అంతే!. 17వ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటక రెండు దశల్లో పోలింగ్ జరుపుకోనుంది. గత ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ఓటర్లు ఎలా ఓటేస్తారనేది ఆసక్తికరం. దక్షిణాదిలో అడుగుపెట్టేందుకు కర్ణాటకలో గెలుపు తోడ్పడుతుందన్న భారతీయ జనతా పార్టీ ఆశలు ఆశలుగానే ఉండిపోయేందుకు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్న ఓటర్ల ప్రాధాన్యాలు ఒక కారణమని విశ్లేషకుల అంచనా. గత లోక్‌సభ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుంటే ఉన్న మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 17 దక్కించుకుంది. కానీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాత్రం దక్కలేదు. మరి తాజా ఎన్నికల పరిస్థితి ఏమిటన్నది వేచి చూడాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ వచ్చిన ఓట్లు మాత్రం కాంగ్రెస్ కంటే తక్కువ. ఒక్కో లోక్‌సభ స్థానానికి పోలైన ఓట్లను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 స్థానా ల్లో బీజేపీకి ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 43.4 శాతం ఓట్లతో బీజేపీకి 17 స్థానాలు దక్కగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆధిక్యం లభిం చింది. వీటిల్లో ఓటు శాతం 36.34 మాత్రమే కావడం గమనార్హం. ఈసారి ఏమవుతుందో? గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొంటున్నాయి. ఈ లెక్కన గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌కు పడిన ఓట్లు.. అసెంబ్లీ ఎన్నికల లెక్కలను కలిపి చూస్తే.. కూటమికి దాదాపు 56 శాతం ఓట్లతో 21 స్థానాలు.. 36 శాతం ఓట్లతో బీజేపీకి ఏడు స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కేవలం లెక్కలు మాత్రమేనని.. రాజకీయాల్లో ఒకటికి ఒకటి కలిపినంత మాత్రాన ఫలితం రెండు అని కచ్చితంగా చెప్పలేమని, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీకే లాభం ఎందుకంటే? రాజకీయాల్లో పరిస్థితులు తారుమారయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదని అంటారు. కర్ణాటక లోక్‌సభ విషయంలోనూ ఇదే జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాది తరువాత ఎన్నికలు జరగనుండటం వల్ల ప్రజల ఆలోచనల్లో, అభిప్రాయాల్లో చాలా మార్పు వచ్చి ఉంటుందని అంచనా. పైగా స్థానిక సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో నిర్దిష్ట పార్టీలకు ఓటేసిన వారు.. లోక్‌సభలోనూ అదే తీరున ఓటేస్తారని అంచనా వేయడం కష్టం. అంతేకాక రెండు పార్టీలు కలిసి కూటమి కట్టినంత మాత్రాన ఆ రెండు పార్టీల కార్యకర్తలు అందరూ గంపగుత్తగా కూటమికి ఓట్లు వేస్తారని లెక్క వేయలేం. పైగా అటు కాంగ్రెస్‌లో.. ఇటు జేడీఎస్‌లోనూ అంతర్గత కుమ్ములాటలు బాగా ఉండటం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో జేడీఎస్‌కు బలమైన ఒక్కళిగలు, కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న కురబలు ఉప్పు నిప్పుగా ఉండటమే కాకుండా.. ఎదుటివారి ఓటమికి లోపాయికారీ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే వేర్వేరుగా పోటీ చేస్తే వచ్చే ఫలితాల కంటే ఉమ్మడి పోటీ వల్ల వచ్చేవి కొంత మెరుగ్గా ఉంటాయని అంచనా. అంచనాలన్నీ అనుకూలంగానే.. కర్ణాటక ఓటరు తీరును దృష్టిలో ఉంచుకుంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి కొంచెం లాభం కలిగే అవకాశం ఉంది. గత ఎన్నికలు అన్నింటినీ పరిశీలిస్తే.. కేంద్రంలోనూ, కర్ణాటకలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దాఖలాలు లేవు. ఓటర్లు కూడా లోక్‌సభకు ఒక పార్టీకి, అసెంబ్లీకి ఇంకోదానికి ఓటేయడం కద్దు. 2013 మేలో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని గద్దె దించేసి కాంగ్రెస్‌కు అధికారమివ్వగా.. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 17 స్థానాలను బీజేపీకి కట్టబెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ –జేడీఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే.. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించుకునే లక్ష్యంతో బీజేపీ మోదీని ఎక్కువసార్లు ప్రచారానికి తీసుకొస్తున్నదని అంచనా. -
జయనగరలో పోలింగ్ ప్రశాంతం
జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. జూన్ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. -
రేవణ్ణతో అగచాట్లు..!!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొత్త చిక్కుల్లో పడ్డారు. కేబినెట్ కేటాయింపుల్లో మిత్రపక్షం కాంగ్రెస్‌తో కన్నా సొంత అన్నయ్య రేవణ్ణ నుంచి ఆయనకు తలనొప్పి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ), విద్యుత్ శాఖలను తనకే కేటాయించాలని రేవణ్ణ పట్టుబట్టినట్లు సమాచారం. రేవణ్ణ అంటే మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రాణం. అందుకే ఆయన కోరిక మేరకు రాహుల్‌తో దేవెగౌడ చర్చలు జరిపి ఒప్పించారు కూడా. 2004-2006ల మధ్య కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి ప్రభుత్వంలో, 2006-2007ల మధ్య జేడీఎస్-బీజేపీ ప్రభుత్వంలో రేవణ్ణ ఈ పోర్ట్‌ఫోలియోలను చేపట్టారు. కాగా, రేవణ్ణకు రెండు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవణ్ణపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని అన్నారు. పార్టీ తనకు ‘వాచ్‌మన్’ ఉద్యోగం ఇచ్చిందని తాను దాన్ని సక్రమంగా నిర్వహిస్తానని మీడియాతో బహిరంగంగా శివకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో సిద్ధారామయ్య కేబినెట్లో శివకుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. కాగా, రెండు పోర్ట్‌ఫోలియోలతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ జిల్లా నుంచి మరే ఎమ్మెల్యేను మంత్రిగా చేయొద్దని రేవణ్ణ కుమారస్వామి, దేవెగౌడలను కోరినట్లు రిపోర్టులు వస్తున్నాయి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు కుమారస్వామి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో అతను కోపంతో ఊగిపోతున్నట్లు స్థానిక జేడీఎస్ నేతలు చెబుతున్నారు. ఈ మధ్య రేవణ్ణ ఇంటికి వెళ్లిన కుమారస్వామిని ప్రజ్వల్, రేవణ్ణ భార్య పలకరించలేదని కూడా సమాచారం. కాగా, ఎన్నికల వల్ల దేవెగౌడ కుటుంబంలో మనస్పర్దలు వచ్చినట్లు గౌడ సన్నిహితుడు ఒకరు తెలిపారు. కుటుంబం మొత్తాన్ని ఒకేతాటిపైకి తెచ్చేందుకు దేవెగౌడ తీవ్రంగా యత్నిస్తున్నట్లు వెల్లడించారు. కావాలనే ప్రజ్వల్‌ను కుమారస్వామి రాజకీయాలకు దూరంగా పెడుతున్నట్లు రేవణ్ణ భావిస్తున్నారని చెప్పారు. తన తనయుడు నిఖిల్ కుమార్‌ను ప్రమోట్ చేసుకునేందుకే కుమారస్వామి ఇలా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు దేవెగౌడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్‌ను తన స్థానంలో నిలబెడతానని చెప్పినట్లు తెలిసింది. కాగా, బుధవారం కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి కర్ణాటకలో కేబినేట్‌ను విస్తరించనుంది. -
కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న 41,162 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికలు ఆలస్యంగా జరిగిన ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి మునిరత్న పోటీచేయగా, జేడీఎస్ నుంచి జీహెచ్ రామచంద్ర, బీజేపీ నుంచి తులసి మునిరాజు గౌడ బరిలోకి దిగారు. ఇక్కడ మొత్తం 53శాతం పోలింగ్ నమోదవ్వగా..కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మొదటినుంచి ఆధిక్యం కనబరుస్తూ భారీ మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గాలతోపాటు ఇక్కడ కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, భారీగా నకిలీ ఓటరు ఐడీ కార్డులు దొరకడంతో ఇక్కడ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ సాధారణ మెజారిటీ సాధించని సంగతి తెలిసిందే. మొదట ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నించడం.. గవర్నర్ ఆహ్వానించడం.. సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప బలనిరూపణకు ముందే రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కర్ణాకటలో కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ నగర్లో కాంగ్రెస్ విజయం సాధించడం బీజేపీ శ్రేణులను మరింత నిరాశకు గురి చేసింది. -
కర్ణాటక కేబినెట్‌పై కీలక నిర్ణయం!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కేబినెట్ కూర్పుపై చర్చలు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మంత్రి పదవుల పంపకాలపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. కీలక పదవులైన హోంశాఖను కాంగ్రెస్‌కు అప్పగించాలని, జేడీఎస్‌కు ఆర్థిక శాఖ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్థికశాఖను ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్వహించనున్నారు. హోంమంత్రి రేసులో కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, రామలింగారెడ్డి ఉండగా, మరికొందరు సీనియర్లు తమకు పదవి ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో కీలకశాఖ విద్యుత్ శాఖను తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతోంది. నేటి (గురువారం) సాయంత్రం కర్ణాటక కేబినెట్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కర్ణాటక ప్రజలు పట్టం కట్టకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ వజుభాయ్ వాలా అవకాశం ఇవ్వగా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. ఆపై సంఖ్యాబలం లేని కారణంగా బలనిరూపణకు వెళ్లకుండానే యెడ్డీ రాజీనామా చేయగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బలాన్ని నిరూపించుకున్న సీఎం కుమారస్వామి ఐదేళ్లపాటు ప్రభుత్వం నడిపించడం, మంత్రి పదవుల కేటాయింపులపై కాంగ్రెస్ అధిష్టానంతో సమాలోచన చేశారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది. -
మాఫీ ఎలా?
సాక్షి, బెంగళూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతల రుణ మాఫీ చేయాలంటూ రైతుసంఘాలు, ప్రతిపక్ష బీజేపీ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో జేడీఎస్ గద్దెనెక్కితే రైతులకు రూ. 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని కుమారస్వామి హామీనిచ్చారు. అనూహ్య పరిస్థితుల్లో కుమార సీఎం కావడం, రుణాల రద్దు కోసం బీజేపీ సహా రైతుసంఘాలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. రుణమాఫీపై ఉన్న సాదకబాధకాలపై మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రుణమాఫీపై తీవ్రంగా చర్చించినట్లు తెలిపారు. నేడు (బుధవారం) రుణమాఫీపై ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తామని చెప్పారు. రూ.55 వేల కోట్లు అవసరం తొలుత రైతులకు రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందనే విషయంపై అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. సీఎం నివాసంకృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరించారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార సంస్థల్లోని మొత్తం రుణాలను మాఫీ చేయాలంటే రూ. 55 వేల కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ఆరోగ్య బీమా పథకం యశస్వీపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అమలు తీరుతెన్నుల గురించి ఆరా తీశారు. పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంపై సూచనలిచ్చారు. నేడు రైతు సంఘాలతో సీఎం భేటీ రైతు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేడు (బుధవారం) ఉదయం 11.15 గంటలకు విధానసౌధలో రైతు సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు. ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర్ ఈ భేటీలో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా బీజేపీ పక్ష నేత బీఎస్ యడ్యూరప్పనూ ఆహ్వానించారు. రుణమాఫీపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్‌కు కుమార షాక్ : బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల రద్దు బొమ్మనహళ్లి : రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మంత్రి మండలి ఏర్పాటుకాలేదు. మంత్రివర్గంలో చోటు కోసం రెండు పార్టీల నుంచి ఔత్సాహికులకు కొదవ లేదు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేను శాంతపరచడానికి సీఎం కుమారస్వామి గత ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్, బోర్డుల అధ్యక్షుల పదవీకాలం ముగియకముందే రద్దు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే బోర్డు, కార్పొరేషన్ల పదవుల్లో ఉండేవారందరూ కాంగ్రెస్ నాయకులే. పదవీకా లం ఉండగానే ఎలా రద్దు చేస్తారని అధ్యక్షలు రుసరుసలాడుతున్నారు. కుమారస్వామిది ఏకపక్ష నిర్ణయమని ఆక్షేపిస్తున్నారు. -
నేడు ఆర్ఆర్ నగర అసెంబ్లీ క్షేత్రం ఎన్నికలు
అసెంబ్లీలోను, అధికారంలోనూ మిత్రపక్షాలు, కానీ నేడు జరుగుతున్న రాజరాజేశ్వరి నగర నియోజకవర్గం ఎన్నికల్లో మాత్రం శత్రువులే. ఇక సత్తా చాటుకోవాలని బీజేపీ తహతహ. ఇలాంటి అనూహ్య పరిణామాల మధ్య జరిగే ఎన్నికల ఫలితం 31వ తేదీన తేలిపోతుంది. యశవంతపుర: ఓటర్ కార్డుల కుంభకోణంతో వాయిదా పడిన బెంగళూరులోని రాజరాజేశ్వరినగర నియోజకవర్గానికి సోమవారం పోలింగ్ జరగనుంది. 421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తును నియమించారు. శనివారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ నుంచి మునిరత్న, బీజేపీ నుండి తులసి మునిరాజుగౌడ, జేడీఎస్ నుంచి రామచంద్ర పోటీలో ఉన్నారు. వీరితో పాటు నటుడు హుచ్చ వెంకట్‌తో సహా పలువురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ కూడా పొత్తుతో పోటీ చేస్తాయని అందరూ భావించారు. కానీఅటువంటిదేమీ లేదని జేడీఎస్ తేల్చసింది. దీంతో త్రిముఖ పోటీ ఖాయమైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నకు మద్దతివ్వాలని కోరినా జేడీఎస్ నాయకులు పట్టించుకోలేదు. మాజీ ప్రధాని దేవేగౌడ రెండురోజుల పాటు ఆర్ఆర్ నగరలో జేడీఎస్ అభ్యర్థి రామచంద్ర తరఫున ప్రచారం చేసి గెలుపు తమ పార్టీదేనంటూ ప్రకటించారు. పొత్తు విధానసభా వరకేనని ప్రకటించడంతో ఇక్కడ పోటీ ఆసక్తిదాయకంగా మారింది. కుమారస్వామి కూటమి నుంచి ముఖ్యమంత్రి అయినా, జేడీఎస్‌ను గెలుపించుకొనే బాధ్యత తనదంటూ దేవేగౌడ స్పష్టంచేశారు. దీంతో మూడు పార్టీల మధ్య ఆర్ఆర్ నగరలో పోటీ తీవ్రంగా ఉంది. కాగా, 31వ తేదీన జ్ఞానాక్షి పాఠశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 421 పోలింగ్ కేంద్రాలు ♦ 421 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలు–4, అతి సమస్యాత్మకం–47, సాధారణం – 184 కేంద్రాలుగా గుర్తించారు. ♦ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ♦ 1261 మంది పోలింగ్ సిబ్బందితో సహా 2523 మంది పోలీసులు, ఇతర సిబ్బందిని నియమించారు. ♦ ముందుజాగ్రత్తగా ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియోతో చిత్రీకరిస్తారు. ♦ నియోజకవర్గం పరిధిలో సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ♦ ఉద్యోగులు, ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నదే సెలవు ఉద్దేశం. -
ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసింది
-
కుమారస్వామిని సీఎం చేసినందుకు..
సాక్షి, బెంగళూర్ : కాంగ్రెస్, జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని బీజేపీ నేత యడ్యూరప్ప అభివర్ణించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామి దిగజారారని, అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన రాజ్యాంగ ద్రోహి అని విమర్శించారు. కర్ణాటక శాసనసభలో శుక్రవారం కుమారస్వామి సర్కార్‌పై విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కుమారస్వామితో గతంలో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం రెండు పార్టీలూ దిగజారాయని ఆరోపించారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు డీకే శివకుమార్ చింతిస్తారని అన్నారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ప్రతిపక్షాలకూ అవకాశం ఇస్తారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. -
కర్ణాటక స్పీకర్‌గా రమేష్ కుమార్ ఏకగ్రీవం