బెంగళూరు: ఎన్నికలొస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానారకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. అక్కడి అన్ని పార్టీలకు కీలకమే. జాతీయ పార్టీలైతే.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రచారం జోరందుకోగా.. అదే సమయంలో ఓటర్లపై విపరీతమైన ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కన్నడనాట ప్రస్తుతం క్యాష్, మద్యం, డ్రగ్స్ జోరు కనిపిస్తోంది.
కేంద్రం ఎన్నికల సంఘం మార్చి 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలుకాగా.. ఉచిత హామీలతో పాటు ప్రచారంలో ప్రలోభాల పర్వం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా నగదు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుండ్ ఏరియాల్లో మొత్తంగా రూ.4.45 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. 62వేల లీటర్ల మద్యం( రూ.కోటి 89 లక్షల విలువ) సైతం ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది.
ఇది స్టాటిక్ సర్వేలెన్స్ టీం.. ధార్వాడ్ నియోజకవర్గంలో 45 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే.. బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో 34 లక్షల విలువ చేసే ఉచిత కానుకలను ఓటర్లకు పంచుతుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
మరోవైపు.. బెలగావి ఖానాపూర్ తాలుకాలో ఏకంగా రూ.4.61 కోట్ల క్యాష్, 21 లక్షల విలువ చేసే బంగారం, మరోచోట 19 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 12 కోట్లు విలువ చేసే కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా రూ.27.38 కోట్ల నగదును రూ. 26.38 కోట్ల విలువైన మద్యాన్ని రూ.88 లక్షల డ్రగ్స్‌ను, రూ.9.87 కోట్లు విలువ చేసే బంగారం రూ.12.49 లక్షల ఇతర వస్తువులను అధికారులు గత 24 గంటల్లో స్వాధీనం చేసుకున్నారు.
న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. వాళ్ల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో ప్రశ్నించారు. తనిఖీలు చేస్తే.. నడుముకు దండలాగా ఏడున్నర లక్షల రూపాయల 500 నోట్ల కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఎన్నికలొచ్చినయ్.. ఎటు చూసినా లిక్కర్, నోట్ల కట్టలే!నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment