ఎన్నికల్లో ఓట్లే ప్రధానం. ఒక్క ఓటు విజయాన్ని నిర్ణయిస్తుంది. రెండు ఓట్ల మెజారిటీ వచ్చినా, రెండు లక్షలు వచ్చినా విజేతలందరూ వెళ్లేది అసెంబ్లీకే. కానీ మెజారిటీ అనేది నియోజకవర్గంలో ఆ నాయకునికి ఉన్న పట్టుకు పలుకుబడికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో కొందరు భారీ మెజారిటీతో గెలిస్తే, కొందరు మాత్రం ఏదో గెలిచామన్నట్లు ఎన్నికయ్యారు.
బనశంకరి: ఈ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో జెండా ఎగరేయగా, బీజేపీ ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో 10 మంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాగా, 8 మంది బొటాబొటీ ఆధిక్యంతో గెలిచినట్లయింది.
మెజారిటీ వీరులు వీరే
► కనకపుర నియోజకవర్గంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే అత్యధికం.
► చిక్కోడి సదలగా క్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 77,749 ఓట్ల మెజారిటీతో విజయం.
► అథణిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ సవది 75,673 ఓట్లతో గెలుపు.
► బెంగళూరు పులకేశినగరలో కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ శ్రీనివాస్‌కు 62,062 ఓట్ల మెజారిటీ
► కొళ్లేగాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తికి 59,519 ఓట్ల ఆధిక్యం. యమకనమరడిలో కాంగ్రేస్ అభ్యర్థి సతీశ్ జార్కిహొళికి 57,046 ఓట్లు, బెంగళూరు సర్వజ్ఞనగరలో కాంగ్రెస్ అభ్యర్థి కేజే.జార్జ్ 55,768 మెజారిటీ దక్కింది.
► బెళగావి రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కి 55,546 ఓట్ల మెజారిటీ. బెంగళూరులో పద్మనాభనగరలో బీజేపీ అభ్యర్థి ఆర్.అశోక్ 55175 ఓట్ల మెజారిటీ. బసవనగుడిలో బీజేపీ అభ్యర్థి రవి సుబ్రమణ్యకు 54978 ఓట్ల ఆధిక్యం.
అత్యల్ప ఆధిక్యంతో ఎన్నిక
≈ బెంగళూరు జయనగర నుంచి బీజేపీ అభ్యర్థి సీకే.రామ్మూర్తి 16 ఓట్ల అత్యంత స్వల్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. అలాగే గాంధీనగరలో కాంగ్రెస్ అభ్యర్థి దినేశ్ గుండూరావ్‌కు వచ్చిన మెజారిటీ 105 ఓట్లు
≈ శృంగేరిలో కాంగ్రెస్ అభ్యర్థి టీడీ రాజేగౌడ ఆధిక్యం 201 ఓట్లు
≈ మాలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేవై నంజేగౌడ ఆధిక్యం 218 ఓట్లు
≈ కుమటాలో బీజేపీ అభ్యర్థి దినకరశెట్టి ఆధిక్యం 673 ఓట్లు
≈ మూడిగెరెలో కాంగ్రెస్ అభ్యర్థిని నయన మోటమ్మ 772 ఓట్ల మెజారిటీతో గెలుపు
≈ చించోళిలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ జాదవ్ మెజారిటీ 858 ఓట్లు కాగా, జగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్రప్ప 874 ఓట్లతో గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment