Freebies
-
ఉచితాలపై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది. ‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది. -
చంద్రబాబు, రేవంత్‌ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!. వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్‌పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు: కిషన్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉండాలన్న నిబంధనేది లేదని, వారం రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. శనివారం(జనవరి18) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారు.వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో తర్వాత ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయింది.బీఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరు చెప్పలేరు. కొత్త సభ్యత్వాలు,పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయి.జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది.600 మండల కమిటీలు పూర్తి చేస్తాం..అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం.పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తాం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదు..బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మూడు వాయిదాల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమే.రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా ? ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు.రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలు అమలు చేయాలి. కేంద్రానికి వచ్చే ఆర్థిక వనరులను బేరీజు వేసుకొని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.హైదరాబాద్‌లో ఏడు నెలలుగా వీధి దీపాలు కాలిపోతే నిధుల కొరత ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో మద్యంపై వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు.హైడ్రా కొత్తది కాదు..గతంలో ఉన్నదానిని పేరు మార్చారు.మూసీ సుందరీకరణకు నిబంధనల మేరకు కేంద్రం నిధులు ఖచ్చితంగా ఇస్తాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్‌గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి? -
రాజకీయ పార్టీల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. పిటిషనర్ వాదన వింతగా ఉందని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ వీకే విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. కాగా, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని పక్కన పెట్టాలని ఒక ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు. -
ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్దీప్ ధన్‌ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
జైపూర్: ఎన్నికల ముందు ఉచితాలను ఆక్షేపిస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును తప్పుడు దారిలో ఖర్చుచేస్తున్నారని పిటిషన్‌దారులు ఆరోపించారు. ఉచితాల పేరుతో ఎన్నికల ముందు ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేస్తున్నారని ఆరోపిస్తూ భట్టులాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన డబ్బును ఉచితాల రూపంలో వృథాగా ఖర్చుచేయడకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని జైన్ కోరారు. ప్రజా శ్రేయస్సు పేరుతో ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఉచితాల కారణంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయని పిటిషన్‌దారుడు పేర్కొన్నారు. ఆ అప్పు ప్రభావం చివరికి పన్ను చెల్లింపుదారులపై పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు డబ్బు పంచడం కన్నా నీచమైన నేరం ఉండదని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే రాజకీయ ప్రమాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాలుగు వారాల గడువును ఇచ్చారు. -
కర్ణాటకలో సక్సెస్, సేమ్ ఫార్ములా ఫాలో అవుతూ..!
జైపూర్: కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక విజయం నయా జోష్‌ను నింపింది. ఇదే ఊపుతో రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం దిశగా అడుగులు వేయాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. వర్గపోరుకు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సైతం అక్కడి ఫార్ములానే అన్వయింపజేస్తోంది. తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరాన్ని చెరిపేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మరో కీలకమైన ఎన్నికల హామీని ప్రకటించింది గెహ్లట్ సర్కార్. అదే ఉచిత విద్యుత్. రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్‌ను సిబ్సిడీ కింద అందిస్తామని సీఎం గెహ్లాట్ కిందటి ఏడాది డిసెంబర్లో ప్రకటించారు. ఇక ఇప్పుడు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. అంతేకాదు.. వంద యూనిట్ల తర్వాత స్లాబ్‌ల వారీగా ఫిక్స్డ్ రేటు ఉంటుందని బుధవారం సాయంత్రం గెహ్లట్ ప్రకటన చేశారు. ఈ హామీలకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులపై శాశ్వత ఛార్జీలు, ఇంధన సర్చార్జిని మాఫీ చేస్తుందని ఆయన ప్రకటించారు. महंगाई राहत शिविरों के अवलोकन व जनता से बात करने पर फीडबैक आया कि बिजली बिलों में मिलने वाली स्लैबवार छूट में थोड़ा बदलाव किया जाए. - मई महीने में बिजली बिलों में आए फ्यूल सरचार्ज को लेकर भी जनता से फीडबैक मिला जिसके आधार पर बड़ा फैसला किया है. - - 100 यूनिट प्रतिमाह तक बिजली… pic.twitter.com/z27tJRuyaf — Ashok Gehlot (@ashokgehlot51) May 31, 2023 కర్ణాటక విజయంలో ఉచిత విద్యుత్ హామీ కూడా కీలక పాత్ర పోషించింది. అందుకే దీనిని హైలైట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని గెహ్లట్ సర్కార్ భావిస్తోంది. అంతకు ముందు ఢిల్లీ, పంజాబ్‌లోనూ ఆప్ ఇలా ఫ్రీ ఎలక్ట్రిసిటీ హామీతోనే అధికారాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో బీజేపీ సైతం ఎన్నికల సమరానికి కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అజ్మీర్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. గెహ్లట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు సంధించారు. అవినీతి, గ్రూపు రాజకీయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదీ చదవండి: యావత్ దేశం మనోభావాల్ని కాంగ్రెస్ కించపరిచిందా? -
కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అయితే మే 20న ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ‘సూత్రప్రాయంగా అంగీకరించినా’ దీనిపై తుది ప్రకటనతో విధివిధానాలను తెలపాల్సి ఉంది. అయితే ఈ హామీలు బెస్కాంను ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. చర్యలు తప్పవ్ త్వరలో ఉచిత విద్యుత్ పథకం ప్రకటన వస్తుందని ఆశిస్తున్న ప్రజలు వారి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక మరో వైపు వినియోగదారులు బిల్లులు చెల్లించక మధ్యలో బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) నలిగిపోతోంది. దీంతో ఈ విషయంపై బెస్కామ్ సీరియస్‌గా తీసుకుంది. ప్రజలు తమ బిల్లులను వెంటనే చెల్లించాలని లేదా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా గత వారంలో, చాలా మంది వినియోగదారులు బెస్కామ్ను సంప్రదించి దీని గురించి ఆరా తీశారు. ఇప్పటికే బిల్లులు చెల్లించిన వారిలో చాలా మంది ఇప్పుడు మొదటి 200 యూనిట్లను క్యాష్‌బ్యాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్ణీత గడువులోగా వినియోగదారులు వారి బిల్లులు తప్పక చెల్లించాలని బెస్కామ్ అధికారులు వినియోగదారులకు సూచించారు. భారం ఎంతంటే.. రాష్ట్రంలో దాదాపు 2.1 కోట్ల మంది గృహ వినియోగదారులు ఉన్నారు, వీరిలో 1.26 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కుటుంబాలు ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకం ద్వారా రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.3,509 కోట్లు, ఏటా రూ.42,108 కోట్ల భారం పడనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా ఐదు వాగ్దానాలపై తొలి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘అవి అంగీకరించాం.. హామీలపై వెనక్కి వెళ్లబోమని చెప్పారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
హామీలను మరీ ఇంత సీరియస్‌గా తీసుకుంటారని అనుకోలేదు!
హామీలను మరీ ఇంత సీరియస్‌గా తీసుకుంటారని అనుకోలేదు! -
సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ పోస్టు.. నిమిషాలకే ప్రభుత్వ టీచర్‌కు షాక్!
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్ అయ్యారు.చిత్రదుర్గ జిల్లాలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు సీఎం సిద్ధరామయ్యను, ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత పథకాలను విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన తన ఫేస్బుక్ పోస్ట్‌లో వివిధ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులను శాతమూర్తి ప్రస్తావించాడు. ‘మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ హయాంలో రూ.3,590 కోట్లు.. ధరమ్‌సింగ్ రూ.15,635 కోట్లు, హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంలో రూ.3,545 కోట్లు, బీఎస్ యడ్యూరప్ప హయాంలో రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ రూ 13,464 కోట్లు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో రూ. 2,42,000 కోట్లు’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాక ఉచితాలు అధికంగా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోతుందంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా హయాం నుంచి శెట్టర్ వరకు రాష్ట్రం చేసిన రుణాలు రూ.71,331 కోట్లు కాగా.. కేవలం సిద్ధరామయ్య హయాంలోనే (2013-2018) అప్పులు రూ.2,42,000 కోట్లకు చేరాయని ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాధికారి ఎల్ జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించాడని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ -
కర్ణాటక: షాకిచ్చిన కాంగ్రెస్.. గ్యారంటీ కార్డుకు షరతులు వర్తిస్తాయ్!
బనశంకరి(బెంగళూరు): శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడానికి ఐదు గ్యారంటీ పథకాలను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అయితే ఆ పార్టీ అప్పుడే స్వరం మార్చి ప్రజలకు షాకిచ్చింది. గ్యారెంటీ కార్డుకు షరతులు వర్తిస్తాయని మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర్ అన్నారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ... మొదటి మంత్రి వర్గ సమావేశంలో ప్రకటించిన ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. అయితే వీటికి షరతులు వర్తిస్తాయని, పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు చెల్లించేది లేదని ప్రజలు చెబుతుండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత -
కర్ణాటక: కాంగ్రెస్ గెలుపు సరే.. వాటి అమలుకు ప్రతి ఏడాది రూ.62 వేల కోట్లు?
బెంగళూరు: కర్ణాటకలో అధికార బీజేపీని ఓడించిన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక అనేక విభిన్న అంశాలు ఉన్నప్పటికీ.. ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత పథకాలు మాత్రం సానుకూల ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఏడాదికి సుమారు రూ.62వేల కోట్ల వ్యయం అవుతోందని అంచనా. తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు నెరవేరుస్తామని హామి ఇచ్చిన హస్తం పార్టీ.. అందులో భాగంగా ప్రతి మహిళా కుటుంబ పెద్దకు నెలకు రూ.2వేలు, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌కు రూ.1500, పట్టభద్రులకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అలాగే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ ప్రయోజనాలు డీప్ సీ ఫిషింగ్ కోసం ప్రతి సంవత్సరం 500 లీటర్ల పన్ను రహిత డీజిల్, ఫిషింగ్ సెలవు సమయంలో లీన్ పీరియడ్ అలవెన్స్‌గా సముద్ర మత్స్యకారులందరికీ రూ. 6,000 వంటి ఇతర వాగ్దాన ప్రయోజనాలకు అదనంగా ఉంటాయని ప్రకటించింది. ఆవు పేడను కిలో రూ. 3 చొప్పున కొనుగోలు చేస్తామని, గ్రామీణ మహిళలు/యువకులతో కూడిన గ్రామాల్లో కంపోస్ట్/ఎరువు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62వేల కోట్ల ఖర్చు అవుతుందని.. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 20శాతంతో సమానమని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్ట్‌లతో పాటు ఉచిత పథకాలకు బడ్జెట్ కేటాయింపులుతో కాంగ్రెస్ ఏ మేరకు పరిపాలనను ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. -
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
-
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
బెంగళూరు: ఎన్నికలొస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానారకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. అక్కడి అన్ని పార్టీలకు కీలకమే. జాతీయ పార్టీలైతే.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రచారం జోరందుకోగా.. అదే సమయంలో ఓటర్లపై విపరీతమైన ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కన్నడనాట ప్రస్తుతం క్యాష్, మద్యం, డ్రగ్స్ జోరు కనిపిస్తోంది. కేంద్రం ఎన్నికల సంఘం మార్చి 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలుకాగా.. ఉచిత హామీలతో పాటు ప్రచారంలో ప్రలోభాల పర్వం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా నగదు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుండ్ ఏరియాల్లో మొత్తంగా రూ.4.45 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. 62వేల లీటర్ల మద్యం( రూ.కోటి 89 లక్షల విలువ) సైతం ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇది స్టాటిక్ సర్వేలెన్స్ టీం.. ధార్వాడ్ నియోజకవర్గంలో 45 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే.. బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో 34 లక్షల విలువ చేసే ఉచిత కానుకలను ఓటర్లకు పంచుతుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు.. బెలగావి ఖానాపూర్ తాలుకాలో ఏకంగా రూ.4.61 కోట్ల క్యాష్, 21 లక్షల విలువ చేసే బంగారం, మరోచోట 19 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 12 కోట్లు విలువ చేసే కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.27.38 కోట్ల నగదును రూ. 26.38 కోట్ల విలువైన మద్యాన్ని రూ.88 లక్షల డ్రగ్స్‌ను, రూ.9.87 కోట్లు విలువ చేసే బంగారం రూ.12.49 లక్షల ఇతర వస్తువులను అధికారులు గత 24 గంటల్లో స్వాధీనం చేసుకున్నారు. న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. వాళ్ల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో ప్రశ్నించారు. తనిఖీలు చేస్తే.. నడుముకు దండలాగా ఏడున్నర లక్షల రూపాయల 500 నోట్ల కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఎన్నికలొచ్చినయ్.. ఎటు చూసినా లిక్కర్, నోట్ల కట్టలే!నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో స్వాధీనం చేసుకున్నారు. -
హామీల పేరుతో ‘చుక్కలు’ చూపిస్తున్నారుగా అని అంటున్నాడ్సార్!
హామీల పేరుతో ‘చుక్కలు’ చూపిస్తున్నారుగా అని అంటున్నాడ్సార్! -
ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు
న్యూఢిల్లీ: ఉచిత పథకాలకి, సంక్షేమ కార్యక్రమాలకి చాలా తేడా ఉందని బీజేపీ స్పష్టం చేసింది. ఓటర్లను ఆకర్షించడానికి వారిపై ఉచితాల వల విసిరి ఆధారపడి బతికే తత్వాన్ని పెంచొద్దని సూచించింది. ప్రజలు స్వశక్తితో వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాధికారత కల్పించడానికి పార్టీలు వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల నియమావళిని సవరణల ప్రతిపాదనలపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్న ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల ఎన్నికల హామీలకు సంబంధించిన ఆర్థిక సాధ్యాసాధ్యాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం కోరింది. దీనికి సమాధానమిచ్చిన బీజేపీ ఉచిత పథకాలు ఓటర్లను ఆకర్షించే వ్యూహాలైతే, సంక్షేమ పథకాలు సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఒక సాధనమని బీజేపీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఉచితంగా రేషన్ అందించడం వేరని, అదే ఉచిత కరెంట్‌ని వేర్వేరుగా చూడాలని పేర్కొంది. చదవండి: ఇంటి పని చేయాలనడం క్రూరత్వం కాదు -
ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. డెన్మార్క్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఓ పాత నివేదికను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించినందువల్లే ఆ దేశం సుసంపన్నమైందని పేర్కొన్నారు. అలాంటిది మనదేశంలో మాత్రం ఉచిత విద్యను 'రేవడీ' సంస్కృతి అనడం తను బాధిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. భారత్‌ను సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలంటే దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను పైసా ఖర్చు లేకుండా అందించాలని సూచించారు. డెన్మార్క్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు నెలకు 1000 డాలర్ల వరకు సాయంగా అందిస్తున్నట్లు కేజ్రీవాల్ వీడియో రూపంలో షేర్ చేసిన నివేదికలో ఉంది. వాళ్లకు చదువుకుంటూనే పని చేసుకుని సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పలు ఇతర దేశాల్లో మాత్రం విద్య కోసమే రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ये वीडियो देखिए… अमीर देशों में शिक्षा फ्री है। मुझे बहुत दुःख होता है कि हमारे देश में फ्री शिक्षा को ये नेता फ्री की रेवड़ी कहते हैं ये देश अमीर इसलिए बने क्योंकि ये फ्री शिक्षा देते हैं। अगर हर भारतीय को अमीर बनाना है तो भारत के हर बच्चे को अच्छी शिक्षा फ्री देनी ही होगी। pic.twitter.com/iAincN3phy — Arvind Kejriwal (@ArvindKejriwal) October 25, 2022 ఇటీవల మధ్యప్రదేశ్‌లో గృహప్రవేశ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ.. దేశానికి రేవడీ సంస్కృతి(ఉచితాలు) నుంచి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు లేఖలు రాసి బాధపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేజ్రీవాల్ ఇప్పిటికే ప్రధానిపై విమర్శలు గుప్పించగా.. మంగళవారం మరోసారి డెన్మార్క్ ఉచిత విద్యా విధానాన్ని చూపి మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చదవండి: షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం? -
ఉచితాలని ప్రజలను అవమానించొద్దు.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై వివర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో ఉచితాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కోటీశ్వరుల బ్యాంకు రుణాల మాటేమిటని ప్రశ్నించారు. పదే పదే ఉచితాలు రద్దు చేయాలంటు సామాన్యులను అవమానించవద్దని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఔషధాలు ఇస్తే తప్పేంటని కేజ్రీవాల్ మోదీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గృహప్రవేశాలను శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి ఉచితాల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు ఈవిషయంపై చాలా లేఖలు పంపారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ.. మోదీపై విమర్శలకు ఎక్కుపెట్టారు కేజ్రీవాల్. लोग महंगाई से बहुत ज़्यादा परेशान हैं। जनता को मुफ़्त शिक्षा, मुफ़्त इलाज, मुफ़्त दवाइयाँ, बिजली क्यों नहीं मिलनी चाहिए? नेताओं को भी तो इतनी फ्री सुविधायें मिलती हैं। कितने अमीरों के बैंकों के क़र्ज़े माफ़ कर दिये। बार बार मुफ़्त रेवड़ी बोलकर जनता का अपमान मत कीजिए https://t.co/oWMa5p9KjF — Arvind Kejriwal (@ArvindKejriwal) October 23, 2022 చదవండి: ‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి -
ఎన్నికల సంఘం.. విచిత్ర కోరిక
భారత ఎన్నికల సంఘం ఒక పస లేని ప్రతిపాదన చేసి, అభిప్రాయాలు చెప్పండంటూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది. అదేమిటంటే.. పార్టీలు ఎన్నికలలో ఇవ్వబోయే హామీలు; ఆ హామీలను అమలుచెయ్యబోయే విధివిధానాలు, వాటికై ఎలా నిధులు సమీకరించబోయేదీ, ప్రణాళిక అమలయ్యాక ఏం లాభం కలిగేదీ వివరిస్తూ కమిషన్‌కి ముందస్తుగానే అఫిడవిట్ సమర్పించాలట. తద్వారా ప్రజానీకానికి అలవికాని హామీల బాధ తప్పడంతో బాటు, ప్రభుత్వ ఖజానా స్థితిగతుల పట్ల వాస్తవిక దృక్పథంతో ఎవరున్నారో తెలుస్తుందట. ఎన్నికల సంఘానిది విచిత్రమైన కోరిక. ఏ పార్టీ అయినా ఒక అభివృద్ధి కార్యక్రమం గురించో, సంక్షేమ విధానం గురించో చెప్పి, అది ఎందుకు తమ ప్రాధమ్యమో చెప్పగలదు. కానీ వాటికి నిధులెక్కడినుండి వస్తాయో, ఎలా మేనేజ్ చేస్తుందో చెప్పాలంటే సాధ్యమేనా? పోనీ తెలుసుకుని ఎన్నికల సంఘం ఏమి చేస్తుంది? ఏదైనా ప్రతిపాదన తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తే ఏ ప్రాతిపదికన ఆ నిర్ణయం తీసుకుంటుంది? అలా జడ్జ్ చేసే రాజ్యాంగపరమైన హక్కు ఆ సంఘానికి ఉందా? పనికిరాని పరిజ్ఞానం సేకరించడం ద్వారా ఎన్నికల సంస్కరణలు సాధ్యమౌతాయా? ఇప్పుడు కావాల్సింది లోపరహితంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ. ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకోగల చైతన్యం ప్రజలకు ఎటూ ఉంది. అట్టే బెంగ పెట్టుకోనక్కర లేదు. – డాక్టర్ డీవీజీ శంకర రావు; మాజీ ఎంపీ, పార్వతీపురం -
ఆప్ గుర్తింపు రద్దు చేయండి: ఈసీకి బ్యూరోక్రట్ల లేఖ
ఢిల్లీ: ఒకవైపు గుజరాత్‌లోనూ పాగా వేయాలని.. ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొంటున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈక్రమంలో ‘ఉచిత’ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే అధికార రాష్ట్రంలోనే కేజ్రీవాల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ 57 మంది బ్యూరోక్రట్స్, డిప్లోమాట్స్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాబోయే ఎన్నికల కోసం ఆప్ వాడుకోవాలని చూస్తోందని లేఖలో వాళ్లు ఆరోపించారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. పోలీస్ సిబ్బంది, హోం గార్డులు, అంగన్వాడీ వర్కర్స్, ప్రజారవాణ వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్ బూత్ ఆఫీసర్లను కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు. కానీ, ఇలా ప్రజా సేవకులను.. ఒక పార్టీ, అదీ అధికారంలో ఉన్న పార్టీ తమ ఎన్నికల స్వార్థం కోసం వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. 1968 ఎన్నికల సింబల్స్ ఆర్డర్‌లోని 16ఏ ఉల్లంఘిస్తుంది. కాబట్టి, లేఖను పరిగణనలోకి తీసుకుని ఆప్ గుర్తింపు రద్దు చేయాలని లేఖలో బ్యూరోక్రట్లు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ.. స్వలాభం కోసం ఆప్, వాళ్లను వాడుకోవాలని చూస్తోందని లేఖలో ఆరోపించారు వాళ్లు. అంతేకాదు.. ఆప్ కోసం పని చేస్తే ట్రాన్స్ఫర్లతో పాటు ఉచిత విద్యుత్, కొత్త స్కూల్స్.. ఉచిత విద్య హామీలను ఇచ్చి ప్రలోభపెట్టే యత్నం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లు. ఈ లేఖపై ఈసీ స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా? -
డోలో 650, రూ. వెయ్యికోట్ల ఫ్రీబీస్: ఐపీఏ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: డోలో-650 తయారీదారు మైక్రో ల్యాబ్ డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల లంచాలు అందించిందన్న వార్త నిజం కాదా? దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) రిపోర్టు ఇదే తేల్చింది. వెయ్యికోట్ల రూపాయల ఉచితాలను అందించిందనేది కరెక్ట్ కాదని నేషనల్ ఫార్మా స్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)కి ఐపీఏ సమర్పించిన పరిశోధనా నివేదిక వెల్లడించింది. కంపెనీ వివరణలో సింగిల్ బ్రాండ్ డోలో, ఫ్రీబీస్‌పై రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందనేది కరెక్టే. కానీ ఒక్క ఏడాదిలో అనేది సరైంది కాదని నివేదించింది. ఒక సంవత్సరంలో (మైక్రో ల్యాబ్స్) 1000 కోట్ల ఖర్చు చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేశారని ఐపీఏ పేర్కొంది. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 4500 కోట్లు, అందులో దాదాపు రూ. 2500 కోట్ల దేశీయ విక్రయాలు. గత నాలుగేళ్లలో దేశీయ విక్రయాలపై (ఏడాదికి ఏడాదికి అన్ని కార్యకలాపాలపై) సగటున రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో ఐపీఏ వెల్లడించింది. ఐపీఏ విచారణకు ప్రతిస్పందనగా మైక్రోల్యాబ్స్ అన్ని కార్యకలాపాలపై ఐదు సంవత్సరాల వ్యయాల రిపోర్టును అందించింది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు, మార్కెటింగ్‌పై మొత్తం రూ. 186 కోట్లు వెచ్చించిందని, అందులో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఖర్చులకు రూ. 65 కోట్లు, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సేవలకు రూ. 67 కోట్లు, దాదాపు రూ. 53 కోట్లు వెచ్చించామని వివరించింది. అలాగే 2019-20లో కంపెనీ సేల్స్ అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కోసం రూ.67 కోట్లు వెచ్చించింది. ఈ నివేదిక ప్రకారం, కంపెనీ గత ఐదేళ్లలో డోలో 650పై చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి, 2021లో మొత్తం 1152 లక్షలు వెచ్చించింది. 22 విజువల్ యాడ్స్, లిటరేచర్ అండ్ ప్రింట్ ప్రమోషనల్ ఇన్పుట్లు, బ్రాండ్ రిమైండర్స్, ఫిజిషియన్ శాంపిల్స్, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సర్వీసెస్ కలిపి 2020-21లో ఈ ఖర్చు రూ. 712 లక్షలుగా ఉంది. డోలో650 సరైన మోతాదు అవునా కాదా, ధరల నియంత్రణలో ఉందా లేదా అనేదికూడా ఐపీఏ పరిశీలించింది. డోలో-650 ఎంజీ 2018లో ఇండియన్ ఫార్మకోపోయి ఆమోదించిందని తెలిపింది. ఇది జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో ఉందని స్పష్టం చేసింది. కాగా వైద్య సంఘాల ఫిర్యాదులను స్వీకరించిన ఎన్పీపీఏ, యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యుసిపిఎంపి) కింద దర్యాప్తు చేయాలని ఐపీఎను కోరింది. ఇందుకు ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ టాబ్లెట్లను సిఫారసు చేసేందుకుగాను వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందన్న ఆరోపణలు, డోలో-650 మేకర్ మైక్రో ల్యాబ్స్ జూలైలో పన్ను ఎగవేత ఆరోపణలపై టాప్ మేనేజ్మెంట్ కార్యాలయాలు, నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా నిర్వహించింది. -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ఉచితాల’పై లోతైన అధ్యయనం జరగాలి
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బాధ్యతను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సుప్రీంకోర్టు అప్పగించింది. నాలుగు వారాల తర్వాత విచారణ ప్రారంభించాలని ధ్రర్మసనానికి సూచించింది. ఉచిత హామీలను అడ్డుకోవాలని సీనియన్ అడ్వొకేట్ అశ్వినీ కుమార్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఉచితాలపై లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఉచిత హామీలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విషయంలో కొన్ని ప్రాథమిక అంశాలపై చర్చ జరగాలని పేర్కొంది. ఎస్.సుబ్రమణియం బాలాజీ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం, ఇతరుల కేసులో 2013లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలన్న వాదనలు వినిపిస్తున్నాయని వెల్లడించింది. ఉచిత హామీల విషయంలో సంక్లిష్టతలను, ద్విసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో పెట్టుకొని వ్యాజ్యాలపై విచారణ బాధ్యతను త్రిసభ్య ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారుతున్నాయంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వీటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారని గుర్తుచేసింది. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లేఅంతిమ న్యాయ నిర్ణేతలు. ఏ పార్టీ లేదా ఏ అభ్యర్థి అధికారంలోకి రావాలో ఓటర్లే నిర్ణయిస్తారు. పదవీ కాలం ముగిసిన తర్వాత సదరు పార్టీ లేదా అభ్యర్థి పనితీరు ఎలా ఉందో ఓటర్లే నిర్ణయించుకొని, తదుపరి ఎన్నికల్లో తీర్పు చెప్తారు’’ అని ధర్మాసనం ఉద్ఘాటించింది. -
‘ఉచితాల’తో ఆర్థిక వ్యవస్థకు చేటు..అఖిలపక్షాన్ని పిలవలేదేం?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ పార్టీలు ప్రజలకు ‘ఉచిత’ హామీలు ఇస్తుండడం తీవ్రమైన అంశమేనని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలుపునివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఉచితాల వ్యవహారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉచితాలపై పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇవి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్æ రవికుమార్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున‡ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఉచితాలపై అధ్యయనం చేయడానికి నియమించే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లోధాను చైర్మన్‌గా నియమించాలని కోరారు. ‘‘పదవీ విరమణ చేసిన, చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదు’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిస్పందించారు. కమిటీకి ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వం వహించాలని భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్రమే కమిటీని ఎందుకు నియమించకూడదని సీజేఐ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంతో మేలు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉచితాలు ప్రకటించడమే ప్రధానమైన సమస్య అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఆయన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’ తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, పబ్లిక్ పాలసీని అపహాస్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులైన కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు చేయడం.. ఈ మూడూ అక్రమమేనని చెప్పారు. పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు నిధుల మూలాలను సైతం వెల్లడించాలనే ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని గుర్తుచేశారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తే పరిష్కారం లభిస్తుందని, ఆర్థిక లోటు మూడు శాతానికి మించితే తదుపరి సంవత్సరం నుంచి కేటాయింపులు తగ్గించే అధికారం ఆర్థిక కమిషన్‌కు ఉందని తెలిపారు. పార్టీలు ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాయి ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారంలో లేని పార్టీలు హామీలు ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఉండవని ఒకరు ప్రజల్ని మభ్యపెట్టొచ్చు. కానీ, అధికారంలోకి వస్తే చంద్రుడిని తీసుకొస్తానని హామీ ఇవ్వగలమా?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఉచితాల అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వలేదని అన్నారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంతో ఫలితం ఉండదని మెహతా బదులిచ్చారు. ఉచితాలు అందించడం తమ ప్రాథమిక హక్కుగా కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, కేవలం ఉచితాల హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలూ ఉన్నాయని ఉద్ఘాటించారు. నేను పోటీ చేస్తే.. ‘‘కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది పెద్ద సమస్య. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తాయి. వ్యక్తులు కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రావు. ఎందుకంటే వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇదే మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు తర్వాత అధికారంలోకి రావచ్చు’ అని జస్టిస్ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... తుషార్ మెహతా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కేవలం ఉచితాల ద్వారా ఓటర్లను ఆకర్శిస్తారనడం సరైంది కాదన్నారు. బంగారు చైన్లు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని సంక్షేమంగా ఎలా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ ప్రశ్నించారు. ఉచితాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన సమాచారం అందుబాటులో ఉందని వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఉచిత హామీల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై ఇకపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసును పునఃపరిశీలించడానికి ధర్మాసనం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. -
ఉచితాలు అంశంపై లోతైన చర్చ అవసరం: సీజేఐ
-
అది అసాధ్యం.. డోలో 650 మేకర్ల కీలక ప్రకటన
ఢిల్లీ/బెంగళూరు: డోలో-650 ప్రమోషన్లో భాగంగా.. వైద్యులకు రూ. వెయ్యి కోట్ల ఉచితాలు పంచిందని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు, ఈ విషయంపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రానికి పదిరోజుల గడువుతో నోటీసులు సైతం జారీ చేసింది. అయితే.. ఈ ఆరోపణలు నిరాధరమైనవంటూ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. కరోనా తారాస్థాయిలో ఉన్న సమయంలోనే డోలో అమ్మకాల ద్వారా రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని, అలాంటిది వాటి ప్రమోషన్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామనే ఆరోపణలు రావడం విడ్డూరంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డోలో-650 అనేది NLEM (ధరల నియంత్రణ) పరిధిలోకే వస్తుంది. పైగా కేవలం కొవిడ్ ఏడాదిలోనే రూ. 350 కోట్ల బిజినెస్ జరిగితే.. అలాంటి బ్రాండ్ కోసం వెయ్యి కోట్ల రూపాయలతో మార్కెటింగ్ చేయడం అసలు సాధ్యమయ్యే పనేనా? అంటూ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు ప్రశ్నిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కేవలం డోలో-650 ట్యాబ్లెట్స్ మాత్రమే కాదని.. విటమిన్ ట్యాబ్లెట్స్ సైతం భారీగానే బిజినెస్ చేశాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. ఇదిలా ఉంటే డోలో 650 ప్రమోషన్లో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయాల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎంజీ తయారీ కంపెనీ ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు విన్నవించింది. పారాసెటమాల్ నిర్దిష్ట సూత్రీకరణలు(certain formulations) 500 mgm నియంత్రణలో ఉన్నట్లుగా ధర నియంత్రణలో చూపిస్తుంది. కానీ, 650 mgm పారాసెటమాల్ కిందకు రాదు. కాబట్టి వారు ఎక్కువ ధరలకు మందులను అమ్మవచ్చు అనేది సదరు ఎన్జీవో ఆరోపణ. ఇక దీన్నొక తీవ్ర అంశంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ సందర్భంగా.. బెంచ్‌లో ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ సైతం తనకు కూడా కరోనా టైంలో వైద్యులు డోలో-650నే రిఫర్ చేయడాన్ని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Dolo-650ని సిఫార్సు చేస్తే.. చాలు!! -
ఫ్రీ బీస్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సీపీ
-
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా?
సాక్షి, అమరావతి: అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. గ్రామీణ – పట్టణాల మధ్య అంతరాలు లేకుండా చూడటం కూడా ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని... ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా తగినన్ని నిధుల్ని ఖర్చు చేసి తీరాల్సిందేనని పార్టీ స్పష్టంచేసింది. ఈ దిశగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అసలు ఉద్దేశాలను తెలుసుకోకుండా... వీటన్నిటినీ ఉచితాలంటూ విమర్శించటం తగదని స్పష్టంచేసింది. ఉచితాలను... సామాజిక–ఆర్థిక ప్రయోజనాలతో అమలు చేసే పథకాలను ఒకేగాటన కట్టి మాట్లాడటమంటే అది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించటమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పార్టీ బుధవారంనాడు ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉచిత పథకాల అమలుపై అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్లో జోక్యం చేసుకుంటూ... తన వాదనలు కూడా వినాలంటూ వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు వేశారు. పథకాల ఉద్దేశాలు తెలుసుకోకుండానే వాటిని ఉచితాలనటాన్ని తప్పుబడుతూ... ‘మనదేశం సంక్షేమ రాజ్యం కూడా. రాజ్యాంగ నిర్మాతలు నిర్ధేశించిన సమానత్వ లక్ష్యాలను సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఉంది’’ అని పేర్కొన్నారు. పిటిషన్‌లోని ముఖ్యాంశాలివీ... అలాంటి పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలి... ‘నిష్ప్రయోజనమైన, నిరర్థకమైన, ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిన పథకాలను ఉచితాలుగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పూలేదు. కానీ విస్తృత సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన, సమాజంలో నిస్పృహలను తొలగించేందుకు అమలు చేస్తున్న పథకాలకు ఉచితాలనే రంగు పులమడం రాజ్యాంగాన్ని అవమానించడమే. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్దిని పొందేందుకు పథకాలను అమలు చేస్తున్న మాట వాస్తవం. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటర్లు తమకు అనుకూలంగా ఓట్లు వేసేందుకు వీలుగా ఎన్నికల ముందు హడావుడిగా ఆయా పథకాలను అమలు చేసిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఓటర్లను ఏమార్చడమే ఆ రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అలాంటి రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తే పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరించకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాటిని కూడా ఉచితాలంటారా? ‘మరోవైపు అందరితోనూ చర్చించి, చాలా స్పష్టతతో, పథకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికలకు ముందే తమ చిత్తశుద్ధిని ఓటర్లకు తెలియచేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాలను పలు అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ అంతే చిత్తశుద్ధితో వాటిని ఆ పార్టీలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలను ఉచితాలుగా అభివర్ణించడం ఎంత మాత్రం సహేతుకం కాదు.’ ఆదాయాన్ని సమకూర్చని ఆస్తి కూడా ఆస్తేనా? ‘మూలధన వ్యయం కోసం అప్పు చేయడం సమర్థనీయమని, రెవిన్యూ వ్యయం కోసం అప్పు చేయడం వినాశనకరమనే విస్తృతమైన అభిప్రాయం ఒకటి అందరిలోనూ బలంగా ఉంది. ఇది అన్ని సందర్భాల్లోనూ కరెక్టేనా అనేది లోతుగా తరచి చూడాలి. నగదు ఆధారిత ప్రభుత్వ గణాంక వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన కంటికి కనిపించే ఆస్తిని కూడబెట్టడాన్ని మూలధన వ్యయం అంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఆస్తుల వినియోగం పెంచడాన్ని కూడా దీనికిందికే తీసుకొస్తున్నాం. ఈ మూలధన వ్యయం కోసం కంటికి కనిపించే ఆస్తులను సృష్టించడం తప్పనిసరి. అయితే విశ్వవ్యాప్త గణాంక సూత్రాల ప్రకారం, ఓ సంస్థకు ఆదాయాన్ని సమకూర్చని ఆస్తిని ఆ సంస్థ ఆస్తిగా ఎంత మాత్రం గుర్తించడానికి వీల్లేదు. భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం ఖర్చుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఇక్కడ ప్రధానం.’ విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది... ‘ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయానికొస్తే, 2014లో రాష్ట్ర విభజన జరిగింది. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 58 శాతం ఉన్నప్పటికీ, 45 శాతం రెవిన్యూ మాత్రమే కలిగి ఉంది. అంతే కాక 2014–19 కాలంలో అప్పటి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో పురోగతి కుంటుపడింది. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్ సర్వే 2016–17 ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాల రుణభారం అత్యధికంగా ఉంది. ఈ రుణభారం రాష్ట్రంలో 76 శాతం. అదే జాతీయ సగటు చూసుకుంటే కేవలం 47 శాతం. ఇక విద్య విషయానికొస్తే, రాష్ట్రంలో ప్రాథమిక విద్య గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) అతి తక్కువగా 84.48 శాతం ఉంది. జాతీయ సగటు 99 శాతం. స్మాల్ హెల్ప్ గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ) అప్పుల విషయానికొస్తే, 1,85,925 ఖాతాలు (23 శాతం ఎస్‌హెచ్‌జీ ఖాతాలు) గడువు దాటినవిగా మారితే, 84,056 ఖాతాలు (11శాతం ఎస్‌హెచ్‌జీ ఖాతాలు) నిరర్థకంగా మారాయి.’ ఆ బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది... ‘వీటన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత మా కొత్త ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వ పనితీరు వల్ల నిస్పృహలో కూరుకుపోయిన ప్రజలు మాపై ఎంతో నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపించి గెలిపించారు. ఉదాహరణకు, విద్యా రంగంలో సరఫరా వైపు, డిమాండ్ వైపు ఉన్న అడ్డంకులను, సమస్యలను తొలగించేందుకు సమగ్ర పరిష్కారం చూపాలన్న నిశ్చితాభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అన్నది ఇప్పుడు సరఫరా వైపు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అత్యవసరం.’ నాడు–నేడుతో సమూల మార్పులు... ‘దీన్ని ఇప్పుడు మనబడి–నాడు నేడు పథకం కింద అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో 56,555 పాఠశాలలను రూపాంతరీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మంచి మరుగుదొడ్లు, అందుబాటులో నీరు, నాణ్యమైన మంచి నీటి సదుపాయం, రంగులతో సహా పెద్ద, చిన్న రిపేర్లు చేయడం, ఫ్యాన్లు, లైట్లు, విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీగోడ, వంటగది, అదనపు తరగతి వంటి 11 రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. అవసరమైన చోట డిజిటల్ క్లాసు రూములు కూడా ఏర్పాటు చేశాం. ఈ పథకాన్ని ప్రస్తుతం మూడు దశల్లో అమలు చేస్తున్నాం. గోరుముద్ద పథకం కింద పిల్లల పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లను సైతం పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు సీబీఎస్ఈతో కలిసి పనిచేస్తున్నాం. అంతర్జాతీయ పోటీని తట్టుకునే దిశగా ప్రాథమిక దశలోనే గట్టి పట్టు సాధించేందుకు ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకతను గుర్తించాం. భవిష్యత్తు సవాళ్లకు పిల్లలను సిద్ధం చేసేందుకు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాం. ఇదే సమయంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడాన్ని ఎంత మాత్రం విస్మరించడం లేదు.’ పేదరికం అడ్డుపడకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి... ‘అలాగే విద్యార్థుల చదువులకు తల్లిదండ్రుల పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పేరుతో పేరుతో ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15వేలను జమ చేస్తున్నాం. ఇందుకు విద్యార్థుల కనీస హాజరు 75 శాతంగా నిర్ణయించాం. ఈ అమ్మ ఒడి పథకం విజయవంతం కావడమన్నది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది. పైన చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలన్నింటి వల్ల విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించాం. ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల్లో చేరే విద్యార్థుల సంఖ్య 37.20 లక్షల నుంచి 44.30 లక్షలకు పెరిగింది. పాఠశాల విద్య మాత్రమే కాక, ఉన్నత విద్యలో ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నాం. వీటన్నింటి అమలు వల్ల మొత్తం విద్యా రంగంలో గణనీయమైన మార్పు సాధించాం.’ రైతుల కోసం రైతు భరోసా... ‘వ్యవసాయ రంగం విషయానికొస్తే, రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో దుర్భర పేదరికం, రుణభారంతో రైతులు అల్లాడుతున్నారు. రైతుల బాధ తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. వ్యవసాయ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఇది. వ్యవసాయ పంట రుణాలపై వడ్డీని మాఫీ చేసేందుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకాన్ని తీసుకొచ్చాం. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం.’ స్వయం సహాయ బృందాల బలోపేతానికి చర్యలు... ‘స్వయం సహాయ బృందాలను బలోపేతం చేశాం. వీటిలో నెలకొని ఉన్న నిరాశా, నిస్పృహలను తొలగించేందుకు చర్యలు చేపట్టాం. ఇచ్చిన హామీని గత ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం వల్ల ఈ స్వయం సహాయ బృందాల రుణ క్రమశిక్షణ దారుణంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు వాయిదాల్లో నిధులను ఈ బృందాలకు అందిస్తున్నాం. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ బృందాలకు పలు పెట్టుబడి అవకాశాలను చూపుతున్నాం. ఈ చర్యల వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఈ స్వయం సహాయ బృందాలు తట్టుకుని సమర్థవంతంగా నిలబడ్డాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా తదితర పథకాలను ఉచితాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ పథకాల అవసరం, వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే వాటిని ఉచితాలుగా పేర్కొంటుండటం తీవ్ర అభ్యంతరకరం.’ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు భారీ ఖర్చు చేయాల్సి వచ్చింది... ‘పొరుగుదేశమైన శ్రీలంక, ఇతర దేశాలు ఆర్థికంగా కుప్పకూలిన పరిస్థితుల్లో, ఇప్పుడు ఆర్థిక స్థిరత్వానికి చైతన్యం పెరిగింది. రుణభార ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అప్పు అన్నది పెద్ద భారంగా మారింది. కోవిడ్ వల్ల ఎన్నడూ ఎదురుకాని భయానక పరిస్థితులల వల్ల అన్నీ రంగాలు మూతపడటంతో తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆదాయాలు గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజల కోసం ఖర్చు పెంచాల్సిన అవసరం వచ్చింది. ఈ ఖర్చు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యావశ్యకం. 2020–21లో కేంద్ర ప్రభుత్వ అప్పు ఆందోళనకర స్థాయిలో పెరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఖర్చు ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను కాపాడింది. ఆర్థికపరమైన క్రమశిక్షణ వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడిపీ)తో పోలిస్తే ఆ తదుపరి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ అప్పు గణనీయంగా తగ్గింది.’ కేంద్రం తీరు వల్ల రాష్ట్రాల పరిస్థితి అలా మారింది... ‘ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికొస్తే వాటి ఆర్థిక పరిస్థితి కూడా ఒత్తిడిలోనే ఉంది. ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ప్రజల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాక సెస్సుల్లో, స్థూల పన్ను ఆదాయాల్లో వాటాలు పెంచడటం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలు తగ్గించేయడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు కూడా రాష్ట్రాల పరిస్థితిని అధ్వాన్నంగా మార్చాయి.’ ఆర్థిక లోటు తక్కువగానే ఉంది... ‘పై టేబుల్‌ను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత ఉందో అర్థమవుతోంది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 41 శాతం సిఫారసు చేస్తే కేంద్రం కేవలం 29.35 శాతంగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్రంపై రుణభారాన్ని తగ్గించాలన్న స్పృహతోనే ఉన్నాం. 2022 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. 2021–22 కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్ర ఆదాయ లోటు రూ.8370.51 కోట్లు ఉండగా, ఆర్థిక లోటు రూ.25,194 కోట్లుగా ఉంది. దీన్ని జీఎస్డీపీ నిష్పత్తిలో పోలిస్తే ఆర్థిక లోటు 2.10 శాతం కన్నా తక్కువగా ఉంది. వాస్తవానికి 2021–22 సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం ఆర్థిక లోటును 4.5 శాతం గా సిఫారసు చేసింది. ’ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేయాలి... ‘సామాజిక–ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వాలు, అవి అమలు చేసే పథకాలన్నవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రజల పట్ల ఎన్నికైన ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రజల అంచెంచల విశ్వాసంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వారికే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది.’ అని సాయిరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
AP: ఫ్రీ బీస్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: ఫ్రీ బీస్ కేసులో సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ అఫిడవిట్ దాఖలు చేసింది. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టులో ఇంటెర్వీన్ పిటిషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఉచిత హామీలంటే ఏంటో తెలియాలి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు కాగా, ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితం అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా వర్ణించలేమనిపేర్కొన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేమన్నారు. ఉచిత వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతోందన్న జస్టిస్ ఎన్వీ రమణ అసలు ఉచిత హామీ, సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. చదవండి: బిహార్‌లో న్యాయశాఖ మంత్రి అరెస్టు కలకలం... తనకేం తెలియదన్న సీఎం -
విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: ఆరోగ్యం, విద్యారంగాలపై ప్రభుత్వాలు చేసే వ్యయం ఉచితాలు కిందికి రాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ రెండింటిపై చేసే పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవేనన్నారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. శనివారం కొలత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని అంటూ ఆయన..ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు. ‘విద్య, వైద్యంపై చేసే వ్యయం ఉచితాల కిందికి రాదు. ఎందుకంటే విద్య జ్ఞానసముపార్జనకు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినది. మా ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఉచితాలు కావు. సంక్షేమ పథకాలు. ఉచితాలు ఉండకూడదంటూ ఇటీవల కొందరు కొత్తగా సలహాలిస్తున్నారు. దాన్ని మేం పట్టించుకోం. కానీ, ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. కాబట్టి, దీనిపై మరింతగా మాట్లాడదలుచుకోలేదు’అంటూ ముగించారు. -
కాకులను కొట్టి గద్దలకు వేయడమేనా మీ పని: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో.. ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నామన్నది చేదు నిజమని పేర్కొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పత్రిక ప్రకటన ద్వారా తీవ్ర స్థాయిలోనే కేటీఆర్ స్పందించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి?.. బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా?. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా. రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా?. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్లకేమో పన్ను రాయితీలా?. మీకు దేశ సంపదను పెంచే తెలివి లేదు. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదు. నైజీరియా కన్నా అధ్వానం! ఇటీవల ప్రధాని మోదీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ!. ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించాం. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నాం. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మోదీకి ముందున్న రూ.14 మంది ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు.రూ. అసలు ఇన్నేసి లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారు?. ఇదీ చదవండి: మునుగోడు వైపు పోనే పోను-వెంకట్‌రెడ్డి అంత అప్పుతో ఏం జేసిన్రు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని ఈమధ్యనే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటింది. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించింది. మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలె. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రా, మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా?. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలె. లక్షల కోట్ల అప్పులు తెస్తారు, దానితో ప్రజోపయోగ పనులు చేయరు, ఉల్టా వాళ్లే పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే వాటి మీద ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతారు. ఆదేశిక సూత్రాలే పరమావధి, కానీ.. మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక "సంక్షేమ రాజ్యం" అని నేను ప్రధానమంత్రికి గుర్తుచేయదలిచాను. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు భరోసా ఇస్తాయి. ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలి. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలి. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు రాజ్యం పాటుపడాలి. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజం అని కేటీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మోదీకి ప్రత్యామ్నాయం ఆ ముఖ్యమంత్రేనా? -
బడా కార్పొరేట్ల రుణ మాఫీపై చర్చకు సిద్ధమా?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5.8 లక్షల కోట్లను ఎందుకు మాఫీ చేశారు? ఏటా రూ.1.45 లక్షల కోట్ల మేర కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల మాఫీ, కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపుపై చర్చకు ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రద్దు చేసిన రూ.9.92 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని మీడియాకు ఆయన వివరించారు. రద్దైన రుణాల నుంచి కేవలం రూ.1.03 లక్షల కోట్లను మాత్రమే రాబట్టగలిగామంటూ ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించిందన్నారు. రానున్న కాలంలో రుణ రికవరీ మరో 20% మేర పెరుగుతుందని భావించినా అప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ మాఫీ రూ.5.8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ధనికులకు వివిధ రూపాల్లో వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు. -
జన ప్రమేయంలేని చర్చ!
ఎప్పటిలాగే ఉచిత పథకాలపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగానే ప్రజల కోసం అమలయ్యే ఉచిత పథకాల చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు రద్దవుతున్న వైనం గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. బహుశా ఇలా రద్దు చేయడం ఉచితాలకిందకు రాదన్న అభిప్రాయం చర్చిస్తున్నవారికి ఉన్నట్టుంది. గత నెలలో ఒక సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత పథకాలు ప్రకటించడాన్ని ‘మిఠాయిల సంస్కృతి’గా అభివర్ణించారు. ఈ సంస్కృతికి అడ్డదారి రాజకీయంగా కూడా ఆయన పేరుపెట్టారు. ఉచితపథకాల వల్ల ఆర్థికాభివృద్ధి నాశనమవుతుందన్నారు. ఆయన దీన్ని ప్రత్యేకించి ఎందుకు లేవనెత్తారో తెలియంది కాదు. వచ్చే డిసెంబర్లో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మహిళలకు ప్రతి నెలా వేయి రూపాయలు ఇవ్వడంతోసహా బోలెడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. ఇక తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. మధ్య తరగతి, ఆ పై తరగతులవారికి అన్ని రకాల ఉచిత పథకాలపైనా ఎప్పటినుంచో అభ్యంతరం ఉంటోంది. వారి ఉద్దేశం ప్రకారం ఉచిత రేషన్ మొదలుకొని ఉపాధి హామీ పథకం వరకూ అన్నీ వ్యర్థమైనవే. తాము కట్టే పన్నుల ద్వారా సమకూడే రాబడిని ప్రభుత్వాలు ఉచిత పథకాలకింద ప్రజలకు ఇస్తూ వారిని సోమరులను చేస్తున్నాయన్న అభిప్రాయం వారిది. దేశంలో 90వ దశకం మొదట్లో ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక సమాజంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని అట్టడుగు కులాలకు మాత్రమే పరిమితమై ఉండే వృత్తుల్లోకి సైతం సంపన్నవర్గాలు భారీ పెట్టుబడులతో ప్రవేశించి లాభార్జన మొదలుపెట్టాయి. వారితో సరితూగలేక అట్టడుగు కులాలు మరింత పేదరికంలోకి జారుకున్నాయి. సంస్కరణల అనంతరం వచ్చిన సేవారంగం చూస్తుండగానే విస్తరిస్తూ పోతున్నా అందులో ఉద్యోగావకాశాలు బాగా నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే పరిమితమయ్యాయి. నైపుణ్యం అవసరంలేని ఉద్యోగాల్లో కుదురుకున్నవారు సైతం ఆ ఉద్యోగాల స్వభావరీత్యా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. పైగా అవి ఎప్పుడు ఉంటాయో, పోతాయో తెలియని కొలువులుగా మిగిలిపోయాయి. ఇవి చాలదన్నట్టు చంద్రబాబువంటి నేతలు అంతవరకూ నిరుపేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో దొరికే ఉచిత వైద్యానికి కూడా యూజర్ చార్జీలు విధించారు. రైతులు మొదలుకొని అట్టడుగు కులాల వరకూ అనేకులు బతకడానికి దోవలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగానికి చేయూతనివ్వడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకతను కూడా అధిగమించి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అంతవరకూ నామమాత్రంగా ఉండే వృద్ధాప్య పింఛన్‌ను పెంచారు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రాణావసర చికిత్సలు అవసరమయ్యే నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం దక్కేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినవారున్నారు. కానీ ఏ పథకాలు దారిద్య్ర నిర్మూలనకు తోడ్పడతాయో, భిన్న వర్గాల ఎదుగుదలకు ఉపయోగపడతాయో నిర్దిష్టంగా ఆలోచించి నిర్ణయించింది మాత్రం ఆయనే. అందుకే సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ అందరికీ ఆయన పేరే గుర్తుకొస్తుంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘అహేతుక ఉచిత పథకాలు’ అవినీతితో సమానమన్న పిటిషనర్ వాదనను సమర్థించారు. కానీ ఒక పథకం అహేతుకతమైనదో, సహేతుకతమైనదో నిర్ణయించేదెవరు? సుప్రీంకోర్టు ప్రతిపాదించిన నిపుణుల కమిటీ వంటివి ఆ అంశాన్ని నిర్ణయించగలవా? నిపుణులు తటస్థులనీ, అన్ని అంశాలపైనా వారికి సమగ్ర అవగాహన ఉంటుందని, వారి అభిప్రాయాలు శిరోధార్యమని భావించడం ఈ ప్రతిపాదన వెనకున్న భావన కావొచ్చు. కానీ నిపుణుల్లో ఉచితాలు సంపూర్ణంగా రద్దు చేయాలని వాదించేవారున్నట్టే, వాటిని కొనసాగించటం అవసరమని కుండబద్దలు కొట్టేవారున్నారు. అసలు ఉచిత పథకాలపై ఏ పార్టీకైనా నిర్దిష్టమైన అభిప్రాయం ఉందా? అనుమానమే. ఎందుకంటే ఉచిత పథకాలను మిఠాయి సంస్కృతిగా అభివర్ణించిన మోదీయే పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉచిత పథకాల గురించి ఏకరువుపెట్టిన ఉదంతాలున్నాయి. అంతెందుకు? విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి, ప్రతి ఒక్కరి జేబులో రూ. 15 లక్షలు వేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రకటన దేనికిందికొస్తుంది? అసలు ప్రజల ప్రమేయం లేకుండా ఉచిత పథకాల గురించి చర్చించడం దండగ. అన్ని పార్టీలూ ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఎవరో ఒకరినే జనం ఎందుకు విశ్వసిస్తున్నారు? వారినే ఎందుకు గెలిపిస్తున్నారు? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అలవిమాలిన హామీలిచ్చి అధికారం అందుకున్న చంద్రబాబును, వాగ్దానాల అమలులో చతికిలబడ్డాక 2019 ఎన్నికల్లో అదే జనం ఓడించలేదా? ప్రజాక్షేత్రాన్ని విస్మరించి, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలను పరిగణనలోకి తీసుకోకుండా ఉచితాల గురించి చర్చించడం వృథా ప్రయాస. -
ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
ఉచితహామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దుపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండు విభిన్న అంశాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్న డబ్బు, సంక్షేమ చర్యల మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అలా చేసే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసేలా ఆదేశాలనివ్వాలని కోరారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ క్రిష్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో నెరవేర్చలేని ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయటం అనేది అప్రజాస్వామికమని పేర్కొంది ధర్మాసనం. ‘రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అనే అంశంలోకి వెళ్లదలుచుకోలేదు. అది అప్రజాస్వామికమైన ఆలోచన. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయితే, ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వటం తీవ్రమైన అంశం. కానీ, చట్టపరమైన అడ్డుకట్ట పడేవరకు జోక్యం చేసుకోలేము.’ అని పేర్కొన్నారు సీజేఐ ఎన్వీ రమణ. ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయవాదులు పలు సూచనలు చేశారని, మిగిలిన వారు సైతం తన పదవీ విరమణలోపు సలహాలు ఇవ్వాలని కోరారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ‘ ఉచితాలు, సంక్షేమ పథకాలు అనేవి వేరు వేరు. ఆర్థిక వ్యవస్థ నష్టం, ప్రజల సంక్షేమం మధ్య సమతుల్యత అవసరం. అందుకే ఈ చర్చ. ఆ దిశగా ఆలోచనలు, సూచనలను నా రిటైర్మెంట్లోపు చెప్పండి.’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు. ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
ఇవి అనుచితం ఏమీ కాదు!
దేశంలో ఉచిత పంపిణీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. కేంద్రం కూడా వీటిని కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ కొంచెం ఎక్కువ, తక్కువగా ఈ ఉచిత హామీలు ఇస్తూనే ఉన్నాయి. కొన్ని సఫలం అవుతుంటాయి. కొన్ని విఫలం అవుతుంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రగతికి ఇవి ఉపయోగపడతాయా, లేదా అన్నది కూడా ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేస్తున్న పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఉచిత హామీలపై సుప్రీంకోర్టు విచారణ చేయడం, చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ సంద ర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గౌరవ న్యాయస్థానం వారు ఈ ఉచిత పంపిణీల హామీల గురించి ఆందోళన చెందినట్లుగా ఉన్నారు. తరచుగా కోర్టులలో పిల్స్ వేస్తుండే న్యాయ వాది ఒకరు ఈ పిల్ కూడా వేశారు. ఉచిత హామీలను నిలుపుదల చేస్తూ కోర్టువారు ఉత్తర్వులు ఇవ్వాలన్నది ఆ పిటీషన్ సారాంశం. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను కూడా న్యాయమూర్తి సలహా కోరారు. ఇందులో కోర్టుల నిర్ణయం కన్నా, ఆర్థిక సంఘం సలహా తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. కోర్టులలో అప్పుడప్పుడు ఇలాంటివి విచారణకు వస్తుంటాయి. కానీ అవి కూడా నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వగలవా అన్నది సందేహం. కేంద్రం కూడా ఈ ఉచితాలను కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దానికి తగ్గట్లుగానే ప్రధాని మోదీ హెచ్చరిక చేశారు. ఉచిత హామీలు అని కోర్టువారు అన్నా, వాటిని పేదల సంక్షేమ కార్యక్రమాలని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. బహుశా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ట్రెండుకు తెర తీశారని చెప్పాలి. ఆమె ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చారు. దానికి అనుగుణంగా పలు సబ్సిడీ పథకాలను అమలు చేశారు. దీన్ని పాత కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర పార్టీ నేతలు వ్యతిరేకించినా, జన బాహుళ్యం ఇందిరాగాంధీకే జేజేలు పలికింది. ఆ తర్వాత కాలంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి స్కీములను అమలు చేశారు. వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంకానివి కూడా ఉండవచ్చు. తమిళనాడులో ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత; వారికి పోటీగా కరుణానిధి ఇలాంటి హామీలు ఇవ్వడానికి వెనుకాడలేదు. మిక్సర్లు ,గ్రైండర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాగ్దానం చేశారు. రుణ మాఫీ హామీలను కూడా ఆయా జాతీయ పార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో బీజేపీ సైతం రుణమాఫీ హామీలను ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో 1983లో ఎన్.టి.రామారావు కిలో రెండు రూపాయల పథకానికి హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. అది ఆచరణ సాధ్యం కాదని అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ పరిస్థితిని గమనించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము 1.90 పైసలకే కిలో బియ్యం ఇస్తామని చెప్పి అమలు చేసింది. కానీ ఆ స్కీము పేటెంట్ ఎన్టీఆర్‌దే అన్న భావన వచ్చి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 2014లో టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీని ప్రకటించింది. ఆ తర్వాత అమలు చేయగలి గింది. ఆ సమయంలో కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల హామీ ఇచ్చినా, ప్రజలు ఆదరించలేదు. మళ్లీ 2023 ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని, అది కూడా ఒకేసారి అమలు చేస్తామని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఈ ప్రకటన చేసి వెళ్లారు. ఇది సాధ్యమా అంటే మామూలుగా అయితే కష్టమే. కానీ తాము వనరులు సమకూర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ మళ్లీ రుణమాఫీ వాగ్దానం చేసింది కానీ, పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. 2014లో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలు, చివరికి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలనూ మాఫీ చేస్తామని భారీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పరిమితులు పెట్టి లక్షన్నర రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది కూడా అరకొరగా చేసి చేతులు దులుపుకొన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చింది. వాటిలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్ల పెంపు, రైతు భరోసా వంటివి ఉన్నాయి. వాటిలో 95 శాతం అమలు చేసిన ఘనతను వైసీపీ సాధించింది. కరోనా సమయంలో జగన్ స్కీములు పేదలకు బాగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉంది. బీజేపీ రైతులకు ఆరువేల రూపాయల చొప్పున ఉచిత పంపిణీ స్కీమును తెచ్చింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఆనాటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత రోజులలో ఆయనే ఈ హామీని ఇవ్వడం విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీ మరో అడుగు ముందుకేసి పంజాబ్‌లో ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితం అని ప్రకటించి విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్లో కూడా అదే హామీ ఇస్తోంది. ఒడిషాలో బీజేడీ సంక్షేమ స్కీములపైనే రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగు తోందన్న అభిప్రాయం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని సుప్రీంకోర్టు కంట్రోల్ చేయగలుగుతుందా? ఏపీలో తెలుగుదేశం పార్టీ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు తెలుగుదేశం పార్టీని దీనిపై ప్రశ్నించారు. తాము చేయగలుగుతామని ఆ పార్టీ నేతలు వాదించారు. ఎన్నికల సంఘం టీడీపీని వారించలేకపోయింది. మరి కొన్నిచోట్ల కూడా ఈ హామీలు వచ్చాయి. అలాంటి హామీలు వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకోగలిగి, నిరోధించి ఉంటే గొప్ప పేరు వచ్చేదేమో! విశేషం ఏమిటంటే, కరోనా నేపథ్యంలో గౌరవ కోర్టువారే కరోనా వల్ల మరణించిన కుటుంబాల వారికి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. మరి అది ఉచితం కింద వస్తుందో, రాదో తెలియదు. కొందరు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్లు, ఇతర సదుపాయాలు పొందు తున్నారు. ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వీరు రిటైరయ్యాక తమకు వచ్చే వేల రూపాయల సదుపాయాన్ని మాత్రం వదులుకోరు. న్యాయ వ్యవస్థ తీరుపై ఈ మధ్య రిటైర్డ్ జిల్లా జడ్జీ మంగారి రాజేందర్ ఒక ఆసక్తికర వ్యాసం రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు రిటైరయ్యాక పలు సదుపాయాలు కల్పిస్తున్న తీరును సోదాహరణంగా వివరించారు. వారికి రిటైరయ్యాక ఈ సదుపాయాలు అవసరమా అంటే ఏమి చెబుతాం! నిజంగా వీరిలో ఎవరైనా పేదవారు ఉంటే ఆదుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ హామీలు ఇవ్వాలి? ఏవి ఇవ్వరాదన్నదానిపై నియంత్రణ కష్టసాధ్యం. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుని ఎగవేస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. దేశ న్యాయ వ్యవస్థ ఇలా రుణాలు ఎగవేసిన వారిని కూడా ఏమీ చేయలేకపోతోందన్న భావన ఉంది. రుణాలు ఎగవేసినవారు అధికార పార్టీలో చేరితే వారి జోలికి ఎవరూ వెళ్లడం లేదన్న భావన సామాన్యులలో కలుగుతోంది. ఈ నేప«థ్యంలో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టగలుగుతుందా? పార్లమెంటు ఎలా స్పందిస్తుంది? ఆయా వ్యవస్థలు ఎలా స్పందిస్తాయన్నదానిపైనే ఇవి ఏ రూపుదాల్చుతాయో చెప్పగలం. ప్రజలలో వీటిపై నిర్దిష్ట అవగాహన వచ్చేవరకూ, పేదరికం పోనంతవరకూ ఈ హామీలను ఎవరూ నిరోధించలేకపోవచ్చేమో! - కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిని ఆయా పార్టీలు నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనిపై స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. ఎన్నికల్లో ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తున్న రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, అలా చేసే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఎన్నికల గుర్తును సీజ్ చేయాలని ఓ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదా? అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఉచిత హామీలను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. ఉచిత పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుందని ఓటర్లే నిర్ణయించుకోవాలని న్యాయస్థానానికి తెలిపింది. మొత్తం 6.5 లక్షల కోట్ల అప్పు ఉందని, భారత్ కూడా మరో శ్రీలంక అవుతుందని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించవచ్చా? అనే అంశాన్ని ఫైనాన్స్ కమిషన్‌ను అడిగి తెలుసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఉచిత పథకాలను ప్రకటించి కొన్ని పార్టీలు రాష్ట్రాలను నాశనం చేస్తున్నాయని విమర్శించిన విషయం తెలిసిందే. చదవండి: ‘పోలీసు రాజ్యంగా మారిన దేశం.. దానికి మోదీనే కింగ్’ -
ప్రధాని మోదీ కామెంట్లపై కేజ్రీవాల్ స్పందన
ఢిల్లీ: ఉచిత హామీల పేరిట ఓట్లు గడించేవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలు, ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘నన్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్న వాళ్లు.. వేల కోట్లు వెచ్చించి విమానాలు, ప్రైవేట్ జెట్లు కొన్నారు. కేజ్రీవాల్ తన కోసం విమానాలేం కొనడం లేదు. ఢిల్లీలో ఇన్ని వస్తువులను ఉచితంగా చేసినప్పటికీ, మన బడ్జెట్ ఇంకా లాభాల్లోనే నడుస్తోంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. తాజా కాగ్ నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది’’ అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉచిత హామీలను రేవ్డితో(నార్త్‌లోని స్వీట్ వంటకంతో) పోల్చారు ప్రధాని మోదీ. అలాంటి హామీలు దేశానికి ఎంతో ప్రమాదకరమైనవి అని ప్రజలు, యువతను ఉద్దేశించి ఆయన శనివారం యూపీ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అయితే ఉచితంగా విద్య, వైద్య సదుపాయాలను విద్యార్థులకు, పౌరులకు అందించడం రేవ్డి కాదని పేర్కొన్నారు సీఎం కేజ్రీవాల్. ఆరోపణలు చేసేవాళ్లను ఒక్కటే అడుగుతున్నా. నేనే తప్పు చేశాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల్లో 18 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా నాణ్యమైన చదువు వాళ్లకు అందిస్తున్నాం. ఇదేమైనా నేరమా? అని ప్రశ్నించారు. अपने देश के बच्चों को मुफ़्त और अच्छी शिक्षा देना और लोगों का अच्छा और मुफ़्त इलाज करवाना - इसे मुफ़्त की रेवड़ी बाँटना नहीं कहते। हम एक विकसित और गौरवशाली भारत की नींव रख रहे हैं। ये काम 75 साल पहले हो जाना चाहिए था। https://t.co/sHfiBvltU0 — Arvind Kejriwal (@ArvindKejriwal) July 16, 2022 సంబంధిత వార్త: ఎన్నికల్లో ‘ఉచిత హామీలు’ దేశాభివృద్ధికి ప్రమాదకరం -
‘ఉచిత హామీల’పై మోదీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
లక్నో: ఉచిత హామీలతో ఓట్లు అడిగే విధానంపై ప్రజలను హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అది ఒక 'స్వీట్ కల్చర్' అంటూ అభివర్ణించారు. ఉచిత హామీలు దేశాభివృద్ధికో ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభించిన అనంతరం ఉత్తర్‌ప్రదేశ్, జలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ప్రభుత్వాలు, పాలకులపై విమర్శలు గుప్పించారు మోదీ.' వేగవంతమైన అనుసంధానతతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రధాన మార్పులు తీసుకొస్తోంది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా చిత్రకూట్ నుంచి దిల్లీ చేరుకునేందుకు 3-4 గంటల సమయం తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే వాహనాల స్పీడ్ పెంచటమే కాకుండా పరిశ్రమల అభివృద్ధిని సైతం పరిగెట్టేలా చేస్తుంది. రెవారి(ఒకరకమైన స్వీట్) సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం. దేశ ప్రజలు ముఖ్యంగా యువత దీనిని గుర్తుంచుకోవాలి. దేశాభివృద్ధి ముఖ్య ఉద్దేశం, గౌరవం అనే రెండు అంశాలపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ప్రస్తుత అవసరాల కోసమే సౌకర్యాలను ఏర్పాటు చేయటం లేదు, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాం' అని పేర్కొన్నారు మోదీ. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు.. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా దిల్లీకి చేరుకుంటుంది. దీనిని సుమారు రూ.14,850 కోట్లు వ్యయంతో నిర్మించారు. 2020, ఫిబ్రవరి 29న శంకుస్థాపన చేయగా.. 28 నెలల్లోనే దీనిని పూర్తి చేశారు. సుమారు 296 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి దిల్లీకి చేరుకునేందుకు గతంతో పోలిస్తే సుమారు 3-4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇదీ చూడండి: Gujarat Riots: గుజరాత్ అల్లర్ల వెనుక షాకింగ్ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ ప్లాన్! -
‘ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్ కురిపిస్తున్న ఉచిత వరాలపై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన చర్యలను సమర్ధించుకున్నారు. పరిమితంగా చేపట్టే ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఉపకరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని, ఇవి పేదల చేతిలో డబ్బు ఉండేలా చేయడంతో వ్యవస్థలో డిమాండ్ పెరుగుతాయని వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్లకు, అధిక పన్నులకు తావివ్వని రీతిలో పరిమితంగానే ఉచిత వరాలు ఉండాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రజలకు అభివృద్ధి, భద్రత అవసరమని ఉచిత నీరు, విద్యుత్ వంటి వరాలు కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఆరోపించారు. ఇక ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తప్పుడు హామీలు గుప్పిస్తున్నారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా సైతం విమర్శలు గుప్పించారు. దేశంలో తప్పుడు వాగ్ధానాలపై పోటీ జరిగితే కేజ్రీవాల్ ముందువరసలో ఉంటారని ఎద్దేవా చేశారు. చదవండి : ఐదేళ్లలో పెరిగిన కేజ్రీవాల్ ఆస్తులు.. -
'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లకు ఇక గుడ్ బై
పెద్ద పెద్ద మెగామార్ట్లు, షోరూంలలో అందించే పాపులర్ ప్రమోషనల్ స్కీమ్ 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్‌కు చరమగీతం పాడే సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానంతో జీఎస్టీ నేపథ్యంలో వీటిని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ప్యాకేజ్డ్ ప్రొడక్ట్‌లు, ఫుడ్ సర్వీసు కంపెనీలు ఇప్పటికే ఈ స్కీమ్స్‌ను పక్కనపెట్టేస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం జీఎస్టీ విధానంలో ఈ ఉచితాలకు కూడా అదనంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రావడమే. కస్టమర్లకు కంపెనీలు ఏదైనా ఉచితంగా అందిస్తే, దానికి కూడా అదనంగా పన్ను చెల్లించాలి. అంతేకాక ఉచితంగా ఉత్పత్తిని అమ్ముతున్నట్టు కంపెనీలు వర్గీకరిస్తే ఇన్పుట్ క్రెడిట్‌ను కూడా కోల్పోతున్నారు. దీంతో కంపెనీలు కస్టమర్ల ఆకట్టుకోవడానికి ఇక విభిన్నమైన మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. బై-వన్ గెట్-వన్ ఫ్రీ ఆఫర్లను పక్కన పెట్టేసి, డిస్కౌంట్‌ను ఎక్కువగా అందిస్తున్నట్టు పార్లె ప్రొడక్ట్‌ల మార్కెటింగ్ హెడ్ మయాంక్ షా తెలిపారు. ఇది తీవ్ర అంతరాయాన్ని సృష్టిస్తుందని కూడా చెప్పారు. గత ఎనిమిది క్వార్టర్లుగా కన్జ్యూమర్ గూడ్స్ మార్కెటింగ్ మంచి వృద్ధిని నమోదుచేయడం లేదు. దీంతో ఈ స్కీమ్స్‌ను ఆఫర్ చేసి వినియోగాన్ని పెంచాలని కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, కొత్త పన్ను విధానంలో వీటికి కూడా గండిపడుతోంది. డిస్కౌంట్లను ఇవ్వడానికి కంపెనీలు భిన్నమైన వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. డొమినోస్ పిజ్జా, పిజ్జా హట్లను నడుపుతున్న జుబిలియంట్ ఫుడ్‌వర్క్స్, యమ్ రెస్టారెంట్లు ఇప్పటికే వాటి మార్కెటింగ్ జాబితా నుంచి బై-వన్-గెట్-వన్ స్కీమ్స్‌ను తీసివేశాయి. ఏదైనా ఉచితంగా సరఫరా చేస్తే దానిపై కచ్చితంగా జీఎస్టీ చెల్లించాల్సిందేనని పన్ను నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ పాలసీ ఫార్మాస్యూటికల్ సెక్టార్ వరకు ఉందన్నారు. జీఎస్టీ యాక్ట్ ప్రకారం, ఏదైనా ఉచితంగా అమ్మితే, దాని లావాదేవీ విలువను గుర్తించబడుతుందని, దానిపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని క్లియర్ ట్యాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అర్చిత్ గుప్తా తెలిపారు. బై-వన్-గెట్-వన్ కింద ఆఫర్ చేసే ఉచితాలు ప్రతి కంపెనీ మార్కెటింగ్ విధానం. ఉచితంగా ఆఫర్ చేసే ఈ విధానంతో రివర్స్‌లో కంపెనీలకు వచ్చే ఇన్పుట్ క్రెడిట్‌కు అనర్హులవుతున్నారని పీడబ్ల్యూసీ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్ నేషనల్ లీడర్, పార్టనర్ ప్రతీక్ జైన్ కూడా తెలిపారు. -
నాటి ల్యాప్‌టాప్‌లే నేటి ఓట్లయ్యాయి!!
ఐదేళ్ల క్రితం కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని జయలలిత హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆమె సీఎం అయిన తర్వాత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. అలా తీసుకున్నవాళ్లలో చాలామంది ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి తొలిసారి ఓటుహక్కు పొందారు. సహజంగానే, అమ్మకు ఓట్లు వేసేశారు. అవును.. ఈసారి తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తోసిరాజని జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం వెనుక యువ ఓటర్ల ప్రభావం చాలానే ఉందని చెబుతున్నారు. దానికితోడు ఈసారి కూడా పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు, ప్రతి కుటుంబానికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పడం లాంటివి బాగానే పనిచేశాయి. మరోవైపు ఇప్పటికే అమలుచేస్తున్న అమ్మ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం.. ఇలాంటివి కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద బాగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను చాలా ఆలస్యంగా విడుదల చేసింది. అందులో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు ఇస్తామని, ఉద్యోగాలు చేసుకునే మహిళలు మోపెడ్లు కొనుక్కుంటే వారికి 50% సబ్సిడీ ఇస్తామని, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు 10, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అయితే, పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం ఈ ప్రలోభాలకు పెద్దగా లొంగలేదనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో డీఎంకే 10 స్థానాలు గెలుచుకుంది. ఇలాంటి చోట్ల ఉచిత హామీలు పనిచేయడం కష్టమేనని బ్రాండింగ్ నిపుణుడు డాన్ కవిరాజ్ చెప్పారు. అయితే.. దీర్ఘకాలిక లక్ష్యాల కంటే ఇలాంటి ఉచిత హామీల వల్లే ఓట్లు ఎక్కువగా పడతాయని, వీటివల్ల ఓటర్ల అభిప్రాయాలు మారే అవకాశం కచ్చితంగా ఉంటుందని జేఎన్‌యూలో సెంటర్ ఫర్ పొలిటికల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గొడవర్తి అభిప్రాయపడ్డారు. -
ఉచిత హామీలు సులభమే.. ఆచరణే కష్టం!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ప్రతిసారీ ఎన్నికల ప్రచారాల్లో ప్రజలకు ఇచ్చే ఉచిత హామీలు చెప్పడానికి బాగుంటాయి కానీ.. ఆచరణలో చాలా కష్టమని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇండియా టుడే సమావేశంలో పాల్గొన్న ఆయన ఢిల్లీలో అధికార పీఠం చేపట్టిన 'ఆప్' ను పరోక్షంగా విమర్శించారు. ఆప్ కు కొంత సమయం ఇవ్వాలంటూనే.. అన్ని ఉచితంగా ఇస్తామంటూ చేసే హామీల ప్రకటనలు ఆచరణలో కష్టమని చురక వేశారు. మార్చి 1న న్యూఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆమ్ అద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 20వేల లీటర్ల నీళ్లు ప్రతినెల ఉచితంగానూ, నెలకు 400 యూనిట్ల లోపు వినియోగించేవారికి 50 శాతం వరకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై గడ్కరీ మాట్లాడుతూ... ఉచిత హామీలు అమలు చేయాలంటే.. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్రప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తే.. రాష్ట్ర పరిస్థితి ఇబ్బందులో పడుతుందని అన్నారు.