బనశంకరి(బెంగళూరు): శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడానికి ఐదు గ్యారంటీ పథకాలను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అయితే ఆ పార్టీ అప్పుడే స్వరం మార్చి ప్రజలకు షాకిచ్చింది. గ్యారెంటీ కార్డుకు షరతులు వర్తిస్తాయని మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర్ అన్నారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ... మొదటి మంత్రి వర్గ సమావేశంలో ప్రకటించిన ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు.
అయితే వీటికి షరతులు వర్తిస్తాయని, పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు చెల్లించేది లేదని ప్రజలు చెబుతుండటంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment