న్యూఢిల్లీ: ఉచిత పథకాలకి, సంక్షేమ కార్యక్రమాలకి చాలా తేడా ఉందని బీజేపీ స్పష్టం చేసింది. ఓటర్లను ఆకర్షించడానికి వారిపై ఉచితాల వల విసిరి ఆధారపడి బతికే తత్వాన్ని పెంచొద్దని సూచించింది. ప్రజలు స్వశక్తితో వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాధికారత కల్పించడానికి పార్టీలు వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల నియమావళిని సవరణల ప్రతిపాదనలపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్న ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల ఎన్నికల హామీలకు సంబంధించిన ఆర్థిక సాధ్యాసాధ్యాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం కోరింది. దీనికి సమాధానమిచ్చిన బీజేపీ ఉచిత పథకాలు ఓటర్లను ఆకర్షించే వ్యూహాలైతే, సంక్షేమ పథకాలు సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఒక సాధనమని బీజేపీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఉచితంగా రేషన్ అందించడం వేరని, అదే ఉచిత కరెంట్‌ని వేర్వేరుగా చూడాలని పేర్కొంది.
చదవండి: ఇంటి పని చేయాలనడం క్రూరత్వం కాదు
Comments
Please login to add a commentAdd a comment