
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు.
పిటిషనర్ వాదన వింతగా ఉందని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ వీకే విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. కాగా, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని పక్కన పెట్టాలని ఒక ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment