Manifesto
-
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ
సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ అనే మాట వినిపించేది. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అనే మాట వినిపిస్తోంది. బటన్ నొక్కడం ఏమైనా పెద్ద పనా? మూలనున్న ముసలావిడ కూడా బటన్ నొక్కుతుందంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ మేనిఫెస్టోలో 143 హామీలిచ్చారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి టీడీపీ హామీలకు గ్యారెంటీ అంటూ బాండ్లు పంచారు. హామీలు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారు. మరి ఆ బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టో ఏమైంది? పంచిన కరపత్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రజలు నిలదీసే పరిస్థితులు త్వరలోనే రానున్నాయన్నారు. జమిలి రూపంలో ఎన్నికలు ఎంత తొందరగా వస్తే ఆయన్ను అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మరి ఎవరి చొక్కా పట్టుకోవాలి?చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తోంది. ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి హామీలిచ్చారు. ఏ ఇంట్లో అయినా చిన్న పిల్లలు కనిపిస్తే తల్లికి వందనం కింద నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పారు. తల్లులు కనిపిస్తే ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు. రూ.18 వేలు.. అని నమ్మబలికారు. ఆ పిల్లల అమ్మమ్మలు, అత్తమ్మలు కనిపిస్తే మీకు 50 ఏళ్లు నిండాయి కదా పెన్షన్ కింద నీకు రూ.48 వేలు నీకు రూ.48 వేలు.. అని చెప్పారు. యువత కనిపిస్తే నిరుద్యోగ భృతి కింద నీకు రూ.36 వేలు.. రైతన్న కనిపిస్తే అన్నదాతా సుఖీభవ కింద నీకు రూ.20 వేలు ఇస్తామని ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. వీళ్లు ఇచ్చిన హామీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 బాకా ఊదాయి. ఇప్పుడు వారు ఇచ్చిన బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి? ప్రచార కరపత్రాలు ఏమయ్యాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఎవరిని నిలదీయాలి?ఐఆర్ ఏమైంది? పీఆర్సీ ఏది?తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నారు. పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. 1వ తేదీనే జీతాలంటూ తొమ్మిది నెలల్లో ఒకే ఒక్కసారి ఇచ్చారు. మూడు డీఏలు, ట్రావెల్ ఎలవెన్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ అన్నీ పెండింగ్.. పెండింగ్! జీఎల్ఐ, జీపీఎఫ్‌లను చంద్రబాబు వాడేసుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ.కొత్తవి దేవుడెరుగు.. ఉద్యోగాలు ఊడగొట్టారుతొమ్మిది నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవే ఊడగొట్టారు. ఎన్నికల ముందు వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాలను తీసేశారు. బెవరేజ్ కార్పొరేషన్లో 18 వేల మందిని తొలగించారు. ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. తద్వారా ఆయా విభాగాల్లో ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారు. చీటింగ్‌లో బాబు పీహెచ్డీ..ఎవరైనా ఎన్నికల హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నిస్తే.. వెటకారంగా మాట్లాడటాన్ని చూస్తున్నాం. మొన్న రాయచోటిలో ఇలాగే ప్రశ్నిస్తే.. సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అని వ్యాఖ్యానించటాన్ని చూశాం. అన్నీ తెలిసి కూడా ఆయన అడ్డగోలు హామీలిచ్చారు. చీటింగ్‌లో పీహెచ్డీ తీసుకున్న వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇక ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందంటే.. హామీలను ఎగ్గొట్టేసి చాలా బాధగా, ఆవేదనగా ఉంది. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. భయమేస్తోందని.. రాష్ట్రం ధ్వంసమై పోయిందని అంటారు! సినిమాల్లో దివంగత ఎన్టీఆర్‌ను మించిన హావ భావాలను ప్రదర్శిస్తారు. ఆ నటనకు కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే!!స్లో పాయిజన్..చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే.. పులి నోట్లో తలపెట్టడమేనని నేను ముందే హెచ్చరించా. చంద్రబాబు మాయ మాటలతో మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ప్రజలను వంచించడం, మోసం చేయటాన్ని ఓ పద్ధతి ప్రకారం స్లో పాయిజన్ రూపంలో ఎక్కిస్తారు. తన అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి ఒక్కొక్కటి బయటకు తీస్తారు. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తాయి. చంద్రబాబు తప్పేమీ లేనట్లుగా.. రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడన్న భావన ప్రజల్లో కల్పిస్తారు. పిల్లలకు మనం ఏం చెబుతాం..? అబద్ధాలు ఆడకూడదు.. మోసాలు చేయకూడదు.. ఎదుటివారికి మంచి చేయాలి.. మాట తప్పకూడదు.. విలువలు ఉండాలి. విశ్వసనీయత పెంచుకోవాలి... అలాగే బతకాలని మనం పిల్లలకు చెబుతాం. ఒక్క చంద్రబాబు మాత్రమే తన కుమారుడి దగ్గర నుంచి తన పార్టీలో ఉన్నవారికి చెప్పే సిద్ధాంతం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పు.. మోసం చెయ్.. మన స్వార్ధం కోసం ఏం చేసినా తప్పు లేదు.. మోసం చేసినా తప్పు లేదు.. అదీ ఓ ఘనకార్యమే అని చెబుతూ నేర్పించే నాయకుడు చంద్రబాబు మినహా మరొకరు లేరు. -
తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో విడుదల
తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television) కార్యవర్గం ఎన్నికల సందర్భంగా జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తాము గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీలు ఇచ్చారు. కాగా.. ఈనెల 31న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలిజవిన్ ఆర్టిస్టు అసోషియేషన్ అసోసియేషన్‌ను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమలు చేశామని ఘనంగా చెప్పగలుగుతున్నాం. మా అసోసియేషన్‌కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉంది. వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించాం. తెలుగు ఆర్టిస్టులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ల సహకారంతో ఆర్టిస్టులందరికి సహాయం చేశాం. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీర్చుతూ, సంక్షేమంపై దృష్టిపెడతాం.' అని అన్నారు.జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి మాట్లాడుతూ.. 'నటుడుగా ఒక దశలో నా జీవితం అయిపోయిందనుకున్న సమయంలో నన్ను ఆదుకుని నా నట జీవితాన్ని నిలబెట్టింది టీవీ రంగం. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి , తలసాని శ్రీనివాస్ సహకారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్యత తీసుకున్నది మన అసోషియేషన్. నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గర్వంగా చెప్పగలను. విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంతరం ప్రయత్రిస్తానని ఈ సందర్బంగా హామీ ఇస్తున్నా.' అని అన్నారు. కాగా.. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) అభ్యర్థి గుత్తికొండ భార్గవ తమ జీఎస్ హరి ప్యానెల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జీఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గొట్టికొండ, ట్రీజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాంజగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జీఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్‌పేయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్, దీప దుర్గంపూడి, మహిళ ఈసీ మెంబర్స్ అభ్యర్థులు రాగ మాధురి, లిరిష, మహతి రిజ్వాన, లక్ష్మిశ్రీ, ఈసీ మెంబర్స్ అభ్యర్థులు బాలాజీ, శివకుమార్ కముని, విజయ్ రెడ్డి, ద్వారకేష్, మురళికృష్ణ రెడ్డి, గోపికర్, మురళికృష్ణ, టీవీ నటీనటులు తదితరులు పాల్గొన్నారు.జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో హామీలు ఇవే :1. ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానెల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు4. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు5. నాగబాబు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి6. మహిళ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.7. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు8. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం9. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి, కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం.10. ఈఎస్ఐ స్కీం వర్తింప చేస్తాం11 ప్రావిడెంట్ ఫండ్ స్కీం అమలు చేస్తాం12. ప్రతి మెంబర్‌కి వర్క్ కల్పిస్తాం -
ఢిల్లీ బీజేపీ తుది మేనిఫెస్టోలో కీలక హామీలివే..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. శనివారం(జనవరి25) కేంద్రమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ‘బీజేపీ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు లేవు. ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉంది. ఢిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది.కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్‌పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందించింది. పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయం. చేసిన వాగ్దానాలను కచ్చితంగా మా పార్టీ అమలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తాం. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం, యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తాం’ అని అమిత్‌షా హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్లు లాంటి కీలక హామీలిచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యే ఉండనుంది. -
చెయ్యలేను చేతకాదు.. ఒప్పుకోలేక తప్పుకోలేక చంద్రబాబు సతమతం
-
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్‌లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్‌లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్‌సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్‌సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్‌కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్‌లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
Delhi Election: కేజ్రీవాల్ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరపున ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు.ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయని, వారిని ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ఏటీఎంగానే పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు. పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ తరపున ఆయన ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. VIDEO | AAP National Convenor Arvind Kejriwal (@ArvindKejriwal) criticises the Centre's tax policies, calling it 'tax terrorism.'"People have to pay taxes while they are alive, but now the government has created a situation where they have to pay even after death. Amid this tax… pic.twitter.com/6LreZj30co— Press Trust of India (@PTI_News) January 22, 2025ఆప్ ఏడు ప్రధాన డిమాండ్లు1. పన్ను రహిత ఆరోగ్య బీమా: ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను అందించాలని, తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.2. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స: సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.3. విద్యా హక్కులో మెరుగుదల: ఢిల్లీలో విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి సహాయం అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.4. ఉపాధి -ఉద్యోగ భద్రత: ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది.5. శరళమైన పన్ను విధానం: మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత శరళంగా మార్చాలని పార్టీ డిమాండ్ చేసింది.6. ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల: ఢిల్లీలో నీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుండి సహాయం కోరింది.7. గృహనిర్మాణ పథకాలలో సహాయం: ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలలో గృహనిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది.అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘మా పార్టీ ఢిల్లీ ప్రజలకు అండగా నిలిచింది. అయితే మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీనిని మార్చడానికి, ఢిల్లీలోని అన్ని తరగతుల గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
ఢిల్లీ ప్రజలపై బీజేపీ హామీల వర్షం
-
ఢిల్లీలో గెలుపే టార్గెట్.. బీజేపీ రెండో మేనిఫెస్టో విడుదల
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో ఓటర్లకు కీలక హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ హామీలు ఇవ్వగా తాజాగా బీజేపీ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు.. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు పార్టీలు పలు హామీలు ఇస్తున్నాయి. ఇక, తాజాగా బీజేపీ రెండో మేనిఫెస్టోలను విడుదల చేసింది. ఈ క్రమంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘సంకల్ప పత్రం’ విడుదల చేశారు ఎంపీ అనురాగ్ ఠాకూర్. అలాగే, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటనలో తెలిపారు. దీంతో, విద్యార్థులకు బీజేపీ భారీ ఆఫర్ ప్రకటించింది.#WATCH | Delhi | Launching BJP's 'Sankalp Patra' for Delhi Assembly polls, BJP MP Anurag Thakur says," We will provide to the youth of Delhi one-time financial assistance of Rs 15,000 for preparation of competitive examinations and reimburse two-time travel and application fees.… pic.twitter.com/muyCpF8SJ7— ANI (@ANI) January 21, 2025 ఇదిలా ఉండగా.. అంతకుముందు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మొదటి మేనిఫెస్టోను ప్రకటించింది. ‘సంకల్ప పత్రం’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లను రూ.500కే ఇస్తామని పేర్కొన్నారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.మేనిఫెస్టో ఇలా.. గర్భిణీలకు రూ.21వేల ఆర్థిక సాయం. ఆరు పౌష్టికాహార కిట్లు. ప్రస్తుతం ఇస్తున్న మొదటి సంతానం సమయంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6వేలకు ఇవి అదనం‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు. దీనికి అదనంగా రూ.5లక్షల ఆరోగ్య కవరేజీపేద కుటుంబీలకు రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, ప్రతి హోలీ, దీపావళి (ఒకటి చొప్పున) పండగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్60-70ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70ఏళ్ల పైబడిన వారికి రూ.3000జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు. రూ.5కే భోజనంసంక్షేమ పథకాల అమల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు -
రంగురంగుల మేనిఫెస్టోలతో చంద్రబాబు జనాన్ని మభ్యపెడతారు: కాకాణీ
-
ఉచితాల జల్లు కురిపిస్తున్న ఆప్- బీజేపీ పార్టీలు
-
బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ తమ నుంచి కాపీ కొట్టినవేనని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి బీజేపీకి విజన్ లేదని అర్థమవుతోందన్నారు. ఇక ప్రజలు ఇలాంటి విజన్ లేని పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు.‘గతంలో పీఎం మోదీ ఉచితాలు మంచివి కావన్నారు. ఇప్పుడేమో బీజేపీ మా ఉచిత పథకాలన్నీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెడుతోంది. ప్రధాని ఇప్పటికైనా ఉచితాలు మంచివేనని,కేజ్రీవాల్ పథకాలు సరైనవేనని ఒప్పుకోవాలి. ఉచితాలు దేవుడు పెట్టే ప్రసాదాలు.కేజ్రీవాల్ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయని నడ్డా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మీకెందుకు ఓట్లేయాలి’అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా, బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ఢిల్లీ ప్రజలకు కీలక హామీలిచ్చింది. మహిళా సమ్మాన్ యోజన పేరిట మహిళలకు నెలనెలా రూ.2500 నగదు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ మహిళలకు రూ.21వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ తమ పథకాలేనని కేజ్రీవాల్ అంటుండడం గమనార్హం.ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ, ఆమ్ఆద్మీపార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపబోదనే అంచనాలున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే.. -
బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే.. హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయంఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటుఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!కాగా, ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్), బీజేపీ మధ్యే ప్రధాన పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ముక్కోణపు పోరు ఉండబోదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆప్ ప్రధాన స్కీమ్‌లను ప్రకటించింది. నెలనెలా మహిళలకు నగదు ఇచ్చే స్కీమ్‌తో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పూర్తి ఉచితంగా వైద్యం లాంటి జనాకర్షక పథకాలను ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రమేష్బిదూరి సీఎం అతిషితో పాటు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రమేష్ బిదూరి కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘సుప్రీంలో ‘ఆప్’ సర్కారుకు ఊరట -
KSR Comment: బోల్తా కొట్టించిన బాబు..
-
రాష్ట్రంలో స్కామ్ ల మీద స్కాంలు నడుస్తున్నాయి
-
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసనలు
-
చెప్పాడంటే.. చేయడంతే మా బాబే..!
-
కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఛలోక్తులు
-
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
Rahul Gandhi: ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా
నందూర్బార్(మహారాష్ట్ర): తాను తరచూ ప్రదర్శించిన ఎరుపురంగు రాజ్యాంగప్రతి అంతా ఖాళీ అంటూ ప్రధాని మోదీసహా అధికార బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు లోక్‌సభలో విపక్ష నేత గట్టి సమాధానమిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నందూర్బాగ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ రాజ్యాంగ ప్రతి కవర్ ఎరుపు రంగులో ఉందా నీలం రంగులో ఉందా అనేది మనం ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధపడ్డాం. ఇంతటి ఘనత గల రాజ్యాంగంలో ఏమీ లేదని, ఏమీ ఉండదని ప్రధాని మోదీజీకి గట్టి నమ్మకం కల్గిందేమో. ఎందుకంటే జీవితంలో ఆయన ఎప్పుడూ ఈ రాజ్యాంగాన్ని చదివిఉండరు. ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా. అందుకే నేను ర్యాలీల్లో చూపించే ఎరుపురంగు రాజ్యాంగప్రతి లోపల అన్నీ తెల్లపేజీలే అని చెబుతున్నారు. మోదీజీ ఇది ఖాళీ పుస్తకం కాదు. భారతీయ ఆత్మ, జ్ఞానానికి ఆలవాలం ఈ పుస్తకం. బిర్సా ముండా, బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా పూలే, మహాత్మాగాంధీల ఆత్మతో భారత రాజ్యాంగం నిండి ఉంది. అయినాసరే మీరు ఈ పుస్తకం ఖాళీ అని అంటున్నారంటే మీరు వీళ్లందరినీ అవమాని స్తున్నట్లే’’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఆదివా సీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు నిర్ణయాధికారం దక్కాలి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లు గిరిజనులను ఆదివాసీలు అని సంభోదించకుండా వనవాసులు అని పిలుస్తు న్నారు. నీరు, భూమి, అడవిపై తొలి హక్కు దారులు ఆదివాసీలే. ఎలాంటి హక్కులు కల్పించకుండా బీజేపీ ఆదివాసీలను అడవికి పరిమితం చేసింది. బిర్సా ముండా ఇవే హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందారు’’ అని రాహుల్ అన్నారు. మేనిఫెస్టోను ప్రస్తావించిన రాహుల్‘‘మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) జనప్రయోజన వాగ్దానాలతో మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చింది. అధికారంలోకి వస్తే మా కూటమి సర్కార్ రైతులు, యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక తోడ్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.3,00,000 దాకా రుణమాఫీ, నిరుద్యోగయువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించనుంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల అసలైన జనసంఖ్య తెలిస్తే వారికి ఆ మేరకు వనరుల్లో న్యాయమైన వాట దక్కుతుంది. అందుకు జనగణన ఎంతగానో దోహదపడనుంది. ప్రస్తుతం 80 శాతం గిరిజనుల జనాభాలో నిర్ణాయాత్మక స్థాయి లో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు’’ అని అన్నారు. ఒక్కరే ఆదివాసీ ఆఫీసర్‘‘కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉన్న తాధికారులు 90 మంది ఉంటే వారిలో ఆదివాసీ వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఉదాహరణకు ఈ 90 మంది అధికారులు రూ.100 విలువైన ప్రజాపనులపై నిర్ణయాలు తీసుకుంటే ఆదివాసీ అధికారి నిర్ణయంపై ఆధారపడే పనుల విలువ కేవలం 10 పైసలు. మొత్తంగా చూస్తే పనిచేసే ఆ కొద్ది మంది ఆదివాసీ అధికారులను కీలకమైన శాఖల్లో ఉండనివ్వ రు. అప్రాధాన్యమైన విభాగాల్లో, పోస్టుల్లో నియమిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. మనం ఈ పద్ధతిని మారుద్దాం’’ అని రాహుల్ అన్నారు. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్‌కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
ఇంకేం హామీలిస్తున్నారో తెలియడంలేదు!
ఇంకేం హామీలిస్తున్నారో తెలియడంలేదు! -
అసెంబ్లీ సాక్షిగా.. సూపర్ 6 లేదు 7 లేదు
-
మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ హామీలు
-
మహారాష్ట్ర బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
-
Maharashtra Assembly elections 2024: మతమార్పిడి నిరోధ చట్టం
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే కఠినమైన నిబంధనలతో మత మార్పిడి నిరోధక చట్టం తెస్తామని బీజేపీ ప్రకటించింది. అల్పాదాయ కుటుంబాలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దుతామని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం–2024’ పేరిట బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో 25 హామీలను పొందుపర్చారు. → బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అడ్డుకోవడానికి కఠిన చట్టం → లడ్కీ బెహన్ యోజన కింద మహిళలకు ఆర్థిక సాయం నెలకు రూ.1,500 నుంచి రూ.2,100→ యువతకు 25 లక్షల ఉద్యోగాల సృష్టి. 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల స్టైపెండ్ → అక్షయ్ అన్న యోజన కింద అల్పాదాయ వర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు → అడ్వాన్స్డ్ రోబోటిక్ అండ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రైనింగ్ హబ్‌గా మహారాష్ట్ర అభివృద్ధి → ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష సెంటర్ల ద్వారా కొత్తగా 10 లక్షల మంది బిజినెస్ లీడర్ల తయారీ → 2027 నాటికి 50 లక్షల మంది లఖ్పతతీ దీదీల సృష్టి. 500 సంఘాలతో పారిశ్రామిక క్లస్టర్ → ఆధునిక ఏరోనాటికల్, స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లుగా నాగపూర్, పుణే, ఛత్రపతి శంభాజీనగర్, నాసిక్, అహిల్యానగర్అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలా: అమిత్ షాజల్గావ్/బుల్దానా: మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికైనా దిగజారడం ఆ కూటమికి అలవాటేనన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలంటూ ఉలేమా కౌన్సిల్ చేసిన డిమాండ్‌కు పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అంగీకరించారన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్, బుల్దానాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అమిత్ షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు కట్టబెట్టానికి ఎంవీఏ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందని గుర్తుచేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎంవీఏ నేతలు అధికార దాహంతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. -
‘యూసీసీ’ అమలు చేస్తాం.. జార్ఖండ్ బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆదివారం(నవంబర్ 3) రాంచీలో విడుదల చేశారు. మేనిఫెస్టోకు సంకల్ప్ పత్ర’ అని నామకరణం చేశారు. సంకల్ప పత్రలో బీజేపీ పలు కీలక హామీలిచ్చింది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని(గిరిజనులకు మినహాయింపు), ‘గోగో దీదీ’ స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2100 నగదు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయినందున రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మొత్తం 25 ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.జార్ఖండ్ ప్రజలకు బీజేపీ కీలక హామీలివే..జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం21 లక్షల కుటంబాలకు ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి మంచి నీటి కనెక్షన్కెరీర్లో నిలదొక్కుకునేందుకు రెండు సంవత్సరాల పాటు నిరుద్యోగ యువతకు రూ.2వేల భృతియువతకు 2,87వేల ప్రభుత్వ ఉద్యోగాలు,5లక్షల స్వయం ఉపాధి అవకాశాలులక్ష్మీ జోహార్ యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి రెండు ఉచిత సిలిండర్లుగిరిజన సంస్కృతి ప్రమోషన్‌కు పరిశోధన కేంద్రం ఏర్పాటు మేనిఫెస్టో విడుదల సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు..బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్‌లో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్‌షా అన్నారు. చొరబాటుదారులు ఇక్కడికి వచ్చి ఆడపడుచులను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకొని భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొరబాటుదారులను అరికట్టకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదని అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ప్రవేశపెడతామని, అయితే గిరిజనులను అందులో నుంచి మినహాయిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారు -
AP: ‘బండ’ మోసం.. అరకోటి కుటుంబాలకు ‘గ్యాస్’ ఎగ్గొట్టిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1.80 కోట్లకుపైనే! వీరిలో 1.54 కోట్ల మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు కోటిన్నరకుపైగా కుటుంబాలు! ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ ఇస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రూ.2,684.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు పది లక్షల వరకు ఉన్న ప్రధాని ఉజ్వల యోజన కనెక్షన్లకు పాక్షిక రాయితీతోపాటు మిగతా గ్యాస్ వినియోగదారులకు ఎన్నిల హామీ ప్రకారం పూర్తి ఉచితంగా సిలిండర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం లబ్ధిదారులకు ఒక్క ఉచిత సిలిండర్ పంపిణీ కోసం రూ.1,345 కోట్లు అవసరం. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిందెంతో తెలుసా? దీపావళికి తొలి సిలిండర్ పంపిణీ కోసం ఇచ్చింది కేవలం.. రూ.894.92 కోట్లు మాత్రమే!! అంటే పథకాన్ని కేవలం కోటి కుటుంబాలకు లోపే పరిమితం చేసి మిగతా 54 లక్షల కుటుంబాలకు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ బుకాయించిన కూటమి పార్టీల నేతలు ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేయడంతోపాటు అర కోటికిపైగా కుటుంబాలను పథకానికి దూరం చేయడం గమనార్హం.అంతా ఉత్త గ్యాసేనా!రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న కుటుంబాలు ప్రభుత్వం దృష్టిలో అనర్హులైపోతున్నాయా? కూటమి పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ వాగ్దానంలో మోసం బట్టబయలైందా? అంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీపం–2 కింద దీపావళి కానుకగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదనేది తేటతెల్లమవుతోంది. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికీ రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది భ్రమగా తేలిపోయింది.ఇంటింటికీ అని నమ్మించి..ఎన్నికల్లో ఓట్లే పరమావధిగా చంద్రబాబు బృందం ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బూటకపు హామీని గుప్పించింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసింది. ఓట్లు వేయించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు విధించని కూటమి నాయకత్వం ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలనే మెలిక పెట్టింది. నిజానికి కూటమి పార్టీల ఎన్నికల హామీ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున (ప్రభుత్వ జీవో ప్రకారం సిలిండర్‌కు రూ.894) ఇవ్వడానికి రూ.4,827.60 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ఉచిత గ్యాస్ పథకాన్ని కుదించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ వర్తిస్తుందంటూ షరతులు విధించారు.పొంతన లేని సర్కారు లెక్కలు..రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 1,48,43,671 మంది కార్డుదారులు తమకు పూర్తిగా గ్యాస్ రాయితీ వస్తుందని ఆశపడ్డారు. వీరంతా బీపీఎల్ కిందే నమోదైన వారే. అయితే పథకాన్ని ప్రారంభించిన తొలి రోజే లక్షల కుటుంబాలకు నిరాశ ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా పథకానికి అనర్హులుగా తేల్చడంతో నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.54 లక్షల కుటుంబాలకు అర్హత లేదా?రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను ఉచిత గ్యాస్ పథకం నుంచి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వీరిని వడపోసిన తర్వాతే పథకానికి బడ్జెట్ ప్రకటించినట్లు సమాచారం. ఏ ప్రమాణాల ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించారో చెప్పకుండా అర్హులందరికీ ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు మభ్యపెడుతోంది. అర్హుల కుదింపుతోపాటు మరోవైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేలా మూడు బ్లాక్ పీరియడ్స్‌ను తెచ్చింది. ఆయా సమయాల్లో గ్యాస్ సిలిండర్ఖాళీగా లేకుంటే లబ్ధిదారుడు నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు ఒక్క సిలిండర్‌తోనే సరిపెడుతూ రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టింది.ఇదీ గ్యాస్ ‘‘పథకం’’!రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.80 కోట్లుయాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లురేషన్ కార్డులు 1,48,43,671» ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు రూ.4 వేల కోట్లు(ఒక్కోటి రూ.894 చొప్పున 1.54 కోట్ల మందికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు)కానీ మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఎంత ఇస్తోంది?: రూ.2,684.75 కోట్లు(ఈ బడ్జెట్ కోటి కుటుంబాలకు కూడా సరిపోదు.. మరో అర కోటికిపైగా అర్హులైన కుటుంబాలకు మొండి చెయ్యే)» కార్డుదారులకు ఒక్క సిలిండర్ ఇవ్వటానికయ్యే ఖర్చు రూ.1,345 కోట్లు»తొలి సిలిండర్ కోసం విడుదల చేసిన మొత్తం రూ.894.92 కోట్లు » ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే లబ్ధి పొందే కుటుంబాలు సుమారు కోటి» అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన కుటుంబాలు సుమారు అర కోటినోట్: ఏపీలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 9.68 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం గ్యాస్ సిలిండర్‌కు రూ.300 రాయితీ ఇస్తోంది. అది పోనూ ఇటువంటి కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.594 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన మాత్రం పూర్తిగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. -
మనం చేసిన మంచి ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు
-
సూపర్ సిక్స్ గ్యారంటీలను అటకెక్కించిన చంద్రబాబు
-
రైతులు, మహిళలకు సంక్షేమ పథకాలు
శ్రీనగర్: త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే రైతులు, మ హిళలు, యువత కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వైపరీ త్యాలతో నష్టపోయే అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం, యాపిల్‌కు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ ) కిలోకు రూ.72 అమలు చేస్తామంది. శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్ర మంలో ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మేనిఫెస్టోను విడుదల చేశారు. కౌలు రైతులకు సాయంభూమిలేని, కౌలుదార్లకు ఏటా అదనంగా రూ.4 వేల ఆర్థిక సాయం. రైతులకు సాగు భూములను 99 ఏళ్లకు లీజుకివ్వడం. సాగు భూములను 100 శాతం సాగులోకి తెచ్చేందుకు జిల్లా స్థాయి సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2,500 కోట్లతో నిధి ఏర్పాటు.నిరుద్యోగ యువతకు..జమ్మూకశ్మీర్‌లోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,500 చొప్పున ఏడాదిపాటు అలయెన్స్. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల. ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ. పోలీసు, ఫైర్, ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్మెంట్ కార్యక్రమం. నిర్మాణ రంగ పనుల్లో నిరుద్యోగ ఇంజినీర్లకు 30 శాతం ఇచ్చే పథకం పునరుద్ధరణ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో, పాస్‌పోర్టులు, ఇతర అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాల పరిశీలన సులభతరం చేయడం.మహిళలకు నెలకు రూ.3 వేలుభారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ, ఇతర నేతలు ఇచ్చిన హామీల మేరకు మహిళా సమ్మాన్ కార్యక్రమం అమలు. ఇందులో భాగంగా కుటుంబ యజమాని అయిన మహిళకు నెలకు రూ.3 వేలు చొప్పున సాయం అందజేత. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మైనారిటీ కమిషన్ ఏర్పాటు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామంటూ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అమలు. -
‘ఈ పదేళ్ల పాలన సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే!’
జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి అధికరణ 370.. కనుమరుగైన చరిత్ర అని, అది ఎన్నటికీ మళ్లీ తెర మీదకు రాబోదని బీజేపీ సీనియర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుండబద్ధలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారాయన.భారత దేశ చరిత్ర.. అందులో జమ్ము కశ్మీర్‌కంటూ కొన్ని పేజీలుంటే 2014-2024 మధ్య పాలనను సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. కానీ, ఒక్క విషయం స్పష్టం చేయదల్చుకున్న. ఆర్టికల్ 370 ఎన్నటికీ తిరిగి రాదు. అది గతించిన అధ్యాయం అని అన్నారాయన.బీజేపీ పాలనకు ముందు జమ్ము కశ్మీర్ ఎలా ఉండేదో దేశం మొత్తానికి తెలుసు. 2014 దాకా ఉగ్రవాదంతో పాటు వేర్పాటువాదం ఇక్కడ రాజ్యమేలేవి. ఇక్కడి పరిస్థితులను కొందరు అవకాశవాద రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు. కానీ, బీజేపీ పదేళ్ల పాలనలో ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు పూర్తిగా కట్టడి అయ్యాయి అని పేర్కొన్నారు. 1947 నుంచే జమ్ము కశ్మీర్ మా హృదయాలకు దగ్గరగా ఉండేది. ఇది ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే. ఇక్కడ శాంతి స్థాపనే మా ముందున్న లక్ష్యం. వచ్చే ఐదేళ్ల కోసం ప్రభుత్వ ఏర్పాటునకు మాకు ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో జమ్మును చేరుస్తాం అని అని అమిత్ షా ప్రసంగించారుబీజేపీ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు..జమ్ము కశ్మీర్ రాజౌరిలో టూరిస్ట్ హబ్ ఏర్పాటు. తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పన.తికా లాల్ తప్లూ విస్తాపిత్ సమాజ్ పురన్వాస్ యోజన (TLTVPY) పేరిట కశ్మీర్ పండిట్లను సురక్షితంగా వెనక్కి రప్పించడం.. వాళ్లకు భద్రత కల్పించడంజమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం సమూల నిర్మూలన.. అందుకు సంబంధించి శ్వేత పత్రం విడుదలUnion HM #AmitShah unveils J&K BJP manifestoWe have taken a lot of resolutions in J&K Sankalp Patra. However, I would like to say that our biggest resolution is 'Surakshit, Viksit aur Samrudh J&K ka nirman karna...': Union HM @AmitShah#SankalpPatra #AmitShah #BJP pic.twitter.com/73x1RIXGlT— TIMES NOW (@TimesNow) September 6, 2024 BJP's promise for a new Jammu-Kashmir.Additional coverage of Rs 2 lakhs under Ayushman Bharat Yojana. #BJPJnKSankalpPatra pic.twitter.com/ENCMpQUkb8— BJP (@BJP4India) September 6, 2024 BJP's promise for a new Jammu-Kashmir.Threefold increase in old age, widow and disability pensions. #BJPJnKSankalpPatra pic.twitter.com/1KG4CWszpO— BJP (@BJP4India) September 6, 2024కూటమిపై విసుర్లుఅదే సమయంలో.. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌వి అవకాశవాద రాజకీయమని షా మండిపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోను ప్రస్తావించిన ఆయన.. ఒక రాజకీయ పార్టీ అలాంటి మేనిఫెస్టో ఎలా పెడుతుంది?. దానికి కాంగ్రెస్‌లాంటి జాతీయ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది?. ఈ విషయంలో రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలి.. అని కోరారాయన.ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
ఇది కెమిస్ట్రీ లేని కూటమి
దాదాపు ఏడాది క్రితం 38 పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమికి ఇప్పటికీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టోలు పార్టీ కన్నా కూటమికి మరింత అవసరం. ఎందుకంటే, వేర్వేరు ఆలోచనలు, లక్ష్యాలు ఉండే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, కలిసి ఎట్లా పని చేయగలవనే సందేహాలు ప్రజలకుంటాయి. కూటమి ఏర్పడింది కేవలం లోక్‌సభ ఎన్నికలు, వాటితోపాటు జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. అదొక దీర్ఘకాలిక వేదిక. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఈలోగా పలు అసెంబ్లీ ఎన్నికలు వారి అజెండాలో ఉండాలి. ఉమ్మడి మేనిఫెస్టో అవసరమనే ఆలోచన సీరియస్‌గా ఉన్నదా, లేక ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం కేవలం ఒక తతంగమా?‘ఇండియా’ కూటమి 38 పార్టీలతో ఏర్పడి సంవత్సరం కావస్తున్నది. భౌతికంగా చూసిన ట్లయితే అది బలమైన రాజకీయ వేదికే. కానీ, గత సెప్టెంబర్ 22న ఆ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు వారికి ఒక ఉమ్మడి మేని ఫెస్టో లేకపోవటం గమనించదగ్గది. ఏ విధంగా ఆలోచించినా అది ఒక పెద్ద లోటు. వాస్తవానికి అటువంటి మేనిఫెస్టో ఎన్నికలకు ముందే రావాలి. తమ కూటమి అధికారానికి వచ్చినట్లయితే వివిధ రంగాలకు, సమస్యలకు, ప్రజల కోరికలకు సంబంధించి ఏమి చేయగలరో, అధికార పక్షపు వైఫల్యాలను ఏ విధంగా సరిదిద్దగలరో దేశం ఎదుట ఎన్నికలకు ముందే ఉంచాలి. కానీ, వారు ఆ పని చేయలేదు. ఎన్నికలు మార్చి–మే 2024 కాలంలో జరిగాయి. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు అంతకు 10 నెలల క్రితం నుంచి మొదలయ్యాయి. తర్వాత 4 నెలలకు, అనగా ఎన్నికలకన్న 6 నెలల ముందు కూటమి ఏర్పడింది. అయినా ఇంత సుదీర్ఘ కాలంలో ఉమ్మడి మేనిఫెస్టో లేక పోయింది. ఎన్నికలు ముగిసి 3 నెలలు గడిచి 4వ నెల నడుస్తున్నది. అయినప్పటికీ అటువంటి డాక్యుమెంట్‌ను రూపొందించక పోవటం సరికదా, ఆ ప్రయత్నాల మాటైనా వినిపించక పోవటం ఆశ్చర్యం.ఈ మాటలు ఇంతగా చెప్పుకోవటానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. యథాతథంగా మేనిఫెస్టోలు ఒక పార్టీకి గానీ, కూట మికిగానీ ఎంత అవసరమో చెప్పనక్కర లేదు. పార్టీ కన్నా కూటమికి మరింత అవసరం. ఎందుకంటే, వేర్వేరు ఆలోచనలు, లక్ష్యాలు ఉండే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, కలిసి ఎట్లా పని చేయగల వనే సందేహాలు ప్రజలకుంటాయి. అది కిచిడీ కూటమిగా మారి పదవుల కోసం కీచులాడుకుంటారు తప్ప ప్రజల కోసం స్థిరంగా పని చేయరనీ, కొద్ది కాలానికే కుప్పగూలుతారనీ ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. లోగడ ఏర్పడిన ఫ్రంట్ల విషయంలో అట్లా జరిగింది కూడా! ఈ పరిస్థితుల దృష్ట్యా ‘ఇండియా’ కూటమికి ఒక ఉమ్మడి మేనిఫెస్టో అన్నది, కనీసం ప్రజలకు చూపేందుకైనా, ముందస్తుగా అవసరం. అధమ పక్షంలో, ఎన్నికలు ముగిసిన ఈ దశలోనైనా రాగల కాలం కోసం. కానీ వారికి ఇది ఆలోచనలో ఉన్నట్లయినా తోచటం లేదు.ఉమ్మడి మేనిఫెస్టో అవసరాన్ని వారు ఎన్నికలకు ముందు గుర్తించలేదని కాదు. అందుకోసం కొన్ని సంప్రదింపులు జరిగాయి కూడా! కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక పోవటంతో ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మేనిఫెస్టో లేకుండానే సీట్లు మాత్రం సర్దుబాటు చేసుకుని పోటీలు చేశారు. ఎవరి అజెండాలు వారు ప్రచారం చేసు కున్నారు. కొన్ని అంశాలపై ఏకీభావం వ్యక్తం కాగా, కొన్నింటిపై పర స్పర విరుద్ధ ప్రచారాలు సాగాయి. కొన్ని ముఖ్యాంశాలపై ఏమీ మాట్లాడక మౌనం వహించారు. ఆ పరిణామాలన్నింటిని గమనించిన వారికి ‘ఇండియా’ కూటమిలో భౌతికమైన ఐక్యత కాకుండా రసాయ నిక ఐక్యత ఏమైనా ఉందా, ఉండగలదా అనే సందేహాలు కలగటం మొద లైంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తన సొంత మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరిట గల అందులో ఎప్పటివలెనే అనేక అంశాలున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లా డుతూ తమ వైఖరి ప్రధానంగా అభివృద్ధి, సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ,సంక్షేమం వంటి అంశా లను కేంద్రంగా చేసుకుని ఉందన్నారు. ఆ పార్టీ ఇవన్నీ షరా మామూలుగా చెప్పేవే. అమలు విషయం వేరే. కానీ మౌలికంగా మేనిఫెస్టో అంటూ ఒకటుందన్నది ప్రధానం.‘ఇండియా’ కూటమికి అది లేకపోయింది. కూటమి పార్టీల మధ్య పైన పేర్కొన్నట్లు భిన్నాభిప్రాయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు. పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణ, పౌర సత్వ చట్ట సవరణ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (ఉపా) రద్దు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, గవర్నర్ పోస్ట్ రద్దు, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356 రద్దు, జమ్మూ–కశ్మీర్‌కు తిరిగి ప్రత్యేక హోదా వంటివి అందులో ఉన్నాయి. ఇవన్నీ కీలకమైనవి. వీటిపై ఏకాభిప్రాయం దాదాపు అసాధ్యం. ‘ఇండియా’ కూటమి అనే సంక్షిప్త నామానికి పూర్తి పేరు ఏమిటో తక్కువమందికి తెలిసి ఉంటుంది. అది– ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. పేరు బాగున్నది. కానీ ఇటువంటి కీలకమైన అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏదైనా ఎట్లా వీలవుతుందన్నది ప్రశ్న.కూటమి పార్టీలకు కొంత వెసులుబాటు ఇస్తూ, ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు ఒత్తిడి వల్ల ఉమ్మడి మేనిఫెస్టోకు తగినంత సమయం లేకపోయిందనుకుందాం. కూటమి ఏర్పడింది కేవలం లోక్‌సభ ఎన్నికలు, వాటితోపాటు జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. అదొక దీర్ఘకాలికమనుకునే వేదిక. ఇప్పటి నుంచి తిరిగి 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఈలోగా పలు అసెంబ్లీ ఎన్నికలు వారి అజెండాలో ఉండాలి. అటువంటప్పుడు, కనీసం మొన్నటి లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా ఉమ్మడి మేనిఫెస్టో ప్రయత్నాలు తిరిగి ఎందుకు చేయటం లేదు? కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు, పార్టమెంట్ సమావేశాల హడావిడి ముగిసిన వెనుకనైనా? అసలు ఆ శిబిరం నుంచి ఈ ప్రస్తావన నామమాత్రంగానైనా వినిపించటం లేదు. విచిత్రమేమంటే కూటమిలోని 38 పార్టీలలో ఎవరూ ఆ పని చేయటం లేదు. చివరకు తమది సైద్ధాంతికమైన, దీర్ఘకాలికమైన దృక్పథమని చెప్పే వామపక్షాలు సైతం కూటమిలోని 38 పార్టీలలో సగం పేర్లు మనం ఎన్నడూ విననివి. కూటమి గెలిచిన మొత్తం స్థానాలు 234 కాగా, వాటిలో ఇవి తెచ్చుకున్నవి ఒకటి కూడా లేదు. ఆ యా రాష్ట్రా లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు వాటికి కూటమి బలంతో ఒకటీ అరా వస్తాయేమో తెలియదు. ఏమైనా ఐక్యత అన్నది ఐక్యతే గనుక వారంతా అక్కడ ఉండటం మంచిదే. అంతిమంగా లెక్కకు వచ్చేది మాత్రం కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయనే దానితో పాటు, లేదా అంతకన్నా ముఖ్యంగా, వాటి మధ్య గల ఐక్యత ఏమిటి? కెమిస్ట్రీ ఏమిటి? ఆ కెమిస్ట్రీని సృష్టించే ఉమ్మడి మేనిఫెస్టో ఏమిటి? అన్నవి.ఇక్కడ చెప్పుకోవలసింది మరొకటి ఉంది. అటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి వివరమైనది ఉండి కూడా, ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ పేరిట కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని కూడా, 1989–91 కాలపు ‘నేషనల్ ఫ్రంట్’ కుప్పగూలింది. వాస్తవానికి వీపీ సింగ్ పార్టీ జనతాదళ్‌తో పాటు, సోషలిస్టు నేపథ్యం గల కొన్ని కుల పార్టీలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కలిసి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ సిద్ధాంతంతో స్థాపించిన బలమైన ఫ్రంట్ అది. ఆ మేనిఫెస్టో ప్రకారం మంచి పనులు అనేకం చేశారు కూడా! కానీ కేవలం దేవీలాల్, చంద్రశేఖర్‌ల అధికార దాహానికి అది బలైంది. లేనట్లయితే, రథయాత్ర కారణంగా అద్వానీని లాలూ యాదవ్ అరెస్ట్ చేసి వీపీ సింగ్ ప్రభుత్వానికి జనసంఘ్ మద్దతు ఉపసంహరించుకున్నా నేషనల్ ఫ్రంట్ కొనసాగి బలపడేది.ఇండియా కూటమికి అసలు ఉమ్మడి మేనిఫెస్టో అన్నది లేక పోయింది. అందుకోసం ప్రయత్నాలయినా జరగటం లేదు. ఉమ్మడి మేనిఫెస్టో అవసరమనే ఆలోచన కాంగ్రెస్‌కు సీరియస్‌గా ఉన్నదా లేక, ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం ఒక తతంగమా? ఈ అనుమానం ఎందుకంటే, కాంగ్రెస్‌కు కావలసింది ఏకచ్ఛత్రాధిపత్యం తప్ప ఇతరు లతో అధికారాన్ని పంచుకోవటం ఇష్టముండదు. కూటమి పేరిట చేయజూసేది తక్కిన పార్టీలను నిచ్చెన మెట్లవలె ఉపయోగించు కోవడం మాత్రమే. ఇది ఊహాగానం కాదు. 2004లో, 2009లో గెలిచి నపుడు వారు చేయజూసింది అదేననీ, అందువల్ల సమస్యలు తలెత్తి కొన్ని పార్టీలు దూరమైనాయనీ తెలిసిందే. ఇటువంటి స్వభావం కాంగ్రెస్‌కు ఇప్పటికీ మారలేదు. కనుక ఉమ్మడి మేనిఫెస్టో ఉండక పోవచ్చు కూడా!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రైతులకు చంద్రన్న గిఫ్ట్ ఆశ దోస అప్పడం వడ..
-
Big Question: ఉచిత వైద్యం వేస్ట్.. మాంచి కిక్కిచ్చే మద్యం బెస్ట్.. బాబు మనసులో మాట
-
ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు ప్రజలను యథేచ్ఛగా మోసం చేస్తున్నారన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
KSR Live Show: పేదల కంచంలో ముద్ద లాక్కుని బతికే బతుకు ఓ బతుకేనా బాబు
-
Big Question: సూపర్ షాక్ లు తప్ప.. సూపర్ సిక్స్ ఇక లేనట్టేనా ?
-
చెప్పేటప్పుడు లేని భయం చేయడానికి ఎందుకు ?
-
Gun Shot: ప్రజల ప్రతి రూపాయి కేంద్రానికి తాకట్టు.. నీ మాయ అమోఘం బాబు
-
అది ఇస్తాం..ఇది ఇస్తాం ఆ హామీలు ఇప్పుడేమయ్యాయి
-
చప్పుడు లేని సూపర్ సిక్స్ మంత్రులంతా నామం పెట్టేశారా..!
-
సంపద సృష్టిస్తానన్న బాబు అప్పులు సృష్టిస్తున్నాడు..!
-
రాష్ట్రంలో అరాచక పాలన
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వికృతానందంతోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ‘రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి’ అంటూ హితవు పలికారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ఓ రెడ్‌బుక్‌లో కొందరి పేర్లు రాసి, వారిపై కేసులు పెట్టి తాట తీస్తానని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంపైనే ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని అన్నారు. కీలకమైన పోస్టింగ్‌లు తెచ్చుకొన్న కొందరు పోలీసులు రెడ్ బుక్‌ను అమలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని, సమాజానికి మంచిది కాదని, అ«ధికారుల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తప్పులు చేసిన వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం చంద్రబాబు అడ్డు చెప్పకపోగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు, లోకేశ్, రఘురామ.. ముగ్గురూ కలిసి జగన్‌ని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా, గత నెల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచిత్రంగా జగన్‌పై కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను టార్చర్ చేయలేదని ఆనాడే వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. అప్పట్లో గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా రఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాయకుల ఒత్తిడితో ఫాల్స్ కేసులు పెడితే ఆ పాపం ఊరికే పోదని, కబళించేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మేధావులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనా రెండు తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. పిన్నెల్లి ఎవరిపైనా దాడి చేయకపోయినా, అసత్య ఆరోపణలతో ఎన్నికలు జరిగిన 10 రోజుల తరవాత కేసులు నమోదు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వెంటాడుతాంఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ, ఇప్పుడు మాట తప్పి, తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామంటున్నారని అన్నారు. కుటుంబంలో అందరు పిల్లలకు ఆర్థిక సాయం చేసేలా వెంటనే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనంపై విధివిధానాలు ఖరారు కాలేదని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి ఆ జీవో చదువుకోవాలని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్‌లో ఇప్పటికే ఒకటి ఫెయిల్ అయిందని, మిగతా వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వెంటాడుతామని ప్రకటించారు.జగన్ ప్రజల మనిషిమాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని స్పష్టంచేశారు. నాడైనా, నేడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా వైఎస్ జగన్ ప్రజల మనిషి అని చెప్పారు. ఈ నెల 15 నుంచి జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని ఆక్షేపించారు. నిత్యం జగన్‌పై విషం చిమ్ముతూ, చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని అన్నారు.ఏనాడూ దూరంగా లేరువాస్తవానికి జగన్ ఏనాడూ జనానికి దూరంగా లేరని రాంబాబు చెప్పారు. చంద్రబాబు ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎంత మందిని కలిశారో, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మందిని జగన్ కలిశారని తెలిపారు. రోజూ ప్రజల మధ్య ఉంటూ అందరితో మమేకమయ్యే మనిషి జగన్ అని చెప్పారు.కోకొల్లలుగా ఘటనలు..వైఎస్ జగన్ పర్యటనల్లో బస్సులో వెళ్తుంటే, రోడ్డుపై ఎవరైనా కాగితం పట్టుకుని చెయ్యి పైకెత్తితే చాలు, వెంటనే బస్సును ఆపేసి వారిని కలుసుకుంటారని గుర్తు చేశారు. అలా ఎందరో బాధలను ఆయన తీర్చారని, దీనికి సంబంధించి ఎన్నెన్నో ఘటనలు ఉన్నాయని తెలిపారు. జగన్‌ని కలుసుకునేందుకు తాము జనాలను తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రజలే జగన్‌ను కలుసుకొనేందుకు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.ఇప్పుడూ కలుస్తున్నారువైఎస్ జగన్ ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందరినీ కలుస్తున్నారని, ప్రతి ఒక్కరినీ ఓపికతో పలకరిస్తున్నారని, వారితో మాట్లాడుతున్నారని రాంబాబు వెల్లడించారు. నాయకులతో పాటు సామాన్యులను కూడా ఆయన కలుస్తున్నారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న వైఎస్ జగన్‌పై పిచ్చి రాతలు రాసి, ఏదో ఒక విధంగా ఆయన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం మానుకోవాలని ఎల్లోమీడియాకు, ముఖ్యంగా ఈనాడు పత్రికకు రాంబాబు హితవు చెప్పారు. -
తల్లికి వందనంపై సర్కారు దొంగాట!
సాక్షి, అమరావతి : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై దొంగాట ఆడుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 29లో ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని బొంకుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి బిడ్డకు, ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తామని గానీ, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఇస్తామని గానీ చెప్పడం లేదు. జీవోలో పేర్కొన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తినా తల్లికి వందనంపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గానీ నోరు విప్పక పోవడం గమనార్హం. ఇచ్చిన హామీ ప్రకారం ‘ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తాం’ అని చెప్పడానికి వీరు ఎందుకు వెనకాడుతున్నారు? పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ముందుకునెట్టి ఈ పథకంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెప్పించి.. చేయబోయే మోసంపై దాటవేత ధోరణి అవలంబించారు. అంటే జీవో నంబర్ 29లో పేర్కొన్నట్టుగానే ఒక ఇంట్లో ఒక్కరికే పథకాన్ని వర్తింప చేస్తామని మరోసారి చెప్పారు. జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ సైతం ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. కూటమి తరఫున ఇచ్చిన హామీలపై ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై స్పందించక పోవడం ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టమైన ప్రకటన చేయకుండా జంకుతున్న ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. ఇంట్లో ఇద్దరుంటే రూ.30 వేలు, నలుగురుంటే రూ.60 వేలు జమ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రతి బిడ్డకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు అంగన్వాడీల్లో ఆరేళ్లలోపు పిల్లలు సుమారు 25 లక్షల మంది ఉండగా, ఒకటి నుంచి ఇంటర్ వరకు 82,29,858 మంది విద్యార్థులు, మొత్తం కోటి మందికి పైగా పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలి.కానీ ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా ఈ పథకంపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. జీవోలో స్పష్టంగా పేర్కొన్న ‘ఈచ్ మదర్’ అంశంపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకే‹Ô ఎందుకు స్పందించడం లేదో అర్థంగాని పరిస్థితి. జీవో నం.29 కేంద్ర ప్రభుత్వ ఆధార్ చట్టం మేరకు డేటాను తీసుకునేందుకే ఇచ్చామని, ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమేనని శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులోనూ తల్లికి వందనంపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించలేదని చెప్పారేగాని, ‘ఈచ్ మదర్’ అన్నది తప్పు అని చెప్పకపోవడం చూస్తుంటే ఈ ఉత్తర్వుల్లోని అంశాన్నే అమలు చేసేట్టు కనిపిస్తోంది. జీవోలో ‘ఈచ్ మదర్’ అని ఎందుకు చెప్పినట్టు? ప్రభుత్వ పాలనలో తీసుకునే నిర్ణయాలకు, చర్యలకు, అమలు చేసే పథకాలకు గవర్నమెంట్ ఆర్డర్ (జీవో) జవాబుదారీగా ఉంటుంది. సంబంధిత శాఖ మంత్రి ఆదేశం మేరకు జారీ చేసే ఉత్తర్వులను ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలి. వాటిలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటారు. ఇంత ప్రాధాన్యం గల ఈ జీవోలో తల్లికి వందనం అమలుపై ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాముల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకం కింద పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని పిల్లలను పాఠశాలలకు పంపుతున్న ఒక్కో తల్లి లేదా సంరక్షకుడికి సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఒకటి నుంచి ప్లస్ 2 వరకు చదివే పిల్లల తల్లుకు ఇది వర్తిస్తుంది’’ అని పేర్కొంది. ‘‘ఈచ్ మదర్’’ అని ఇంత స్పష్టంగా ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు. ఇక్కడ ‘‘ఈచ్ చిల్డ్రన్’’ అని పేర్కొని ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్టయ్యేది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మే పరిస్థితి ఉండేది. దీనిపై స్పందించకుండా తల్లికి వందనం పథకంపై ఇంకా ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదని చెప్పడం గమనార్హం. పైగా జీవోలో పేర్కొన్నది తప్పు అని గానీ, పిల్లలు అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని గానీ ప్రకటించలేదు. -
ఏదీ మా ‘నిధి’?
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామన్న సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఆ హామీ అమలు ఊసే ఎత్తకపోవడం, తొలి సంతకాలలో ఆ ప్రస్తావనే లేకపోవడం, ఇప్పటికే జూన్‌లో సాయం అందక నష్టపోయిన నేపథ్యంలో కనీసం బకాయిలతో కలిపి అయినా చెల్లిస్తారా? అనే ఆందోళన కోట్లాది మంది అక్కచెల్లెమ్మల్లో వ్యక్తమవుతోంది. 19 – 59 ఏళ్ల వయసు మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళంలో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లు తీసుకుంటున్న దాదాపు 38 లక్షల మంది మహిళలను మినహాయించినా కూటమి మేనిఫెస్టో ప్రకారం 1.72 కోట్ల మందికిపైగా అక్క చెల్లెమ్మలు రూ.1,500 చొప్పున ప్రతి నెలా సాయం పొందేందుకు అర్హులని స్పష్టమవుతోంది. ఈ హామీ అమలులో జరుగుతున్న జాప్యంతో అక్కచెల్లెమ్మలు నెలకు రూ.2,588 కోట్ల చొప్పున ఏడాదికి రూ.31,065 కోట్లు దాకా నష్టపోతున్నారు. జూన్‌లో ఇప్పటికే రూ.2,588 కోట్లు నష్టపోయారు. పోనీ భవిష్యత్తులో ఇచ్చే డబ్బులు బకాయిలతో కలిపి ఇస్తారా? అనే అనుమానాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ‘ఆడబిడ్డ నిధి’ నుంచి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈమేరకు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు ష్యూరిటీ’ పేరుతో ఇంటింటికీ చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాలను పంచారు. అధికారం దక్కించుకునేందుకు ఎడాపెడా హామీలు గుప్పించిన కూటమి నేతలు హామీల అమలుపైనా అంతే ఉత్సాహం చూపాలని ప్రజానీకం కోరుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ – జనసేన– బీజేపీ కూటమిగా పోటీ చేసినా కమలనాథులతో సంబంధం లేకుండా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ, షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన రూపొందించుకున్న అంశాలతో ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది ముందే బాబు సంతకంతో గ్యారెంటీ కార్డులు..ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రతి ఇంటికీ తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున సాయంతోపాటు సూపర్ సిక్స్‌లోని అన్ని అంశాలను కచ్చితంగా అమలు చేస్తారని నమ్మబలుకుతూ ‘గ్యారెంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, తమను గెలిపించాలని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు అభ్యర్థించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తనది గ్యారంటీ అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచార సభల్లో, రాజకీయ వేదికలపై ప్రకటించారు. ఎన్నికలు ముగిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్‌కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో కొనసాగుతున్న నేపథ్యంలో జాప్యం చేయకుండా మేనిఫెస్టో హామీలను నెరవేర్చి తమకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని మహిళలు కోరుతున్నారు.1.72 కోట్ల మంది నిరీక్షణ..కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఓటర్లుగా నమోదైన వారిలో 19–59 ఏళ్ల వయసు మహిళలంతా చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి నెలా రూ.1,500 చొప్పున పొందేందుకు అర్హులేనని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పింఛన్లు పొందుతున్న మహిళలను మినహాయించినా 1.72 కోట్ల మందికిపైగా ఈ పథకానికి అర్హులేనని పేర్కొంటున్నారు. హామీ అమలులో ఆలస్యం కారణంగా వారంతా ప్రతి నెలా రూ.2,588 కోట్ల చొప్పున నష్టపోతున్నారని గుర్తు చేస్తున్నారు.నాడు మొహం చాటేసిన జనసేనానిఎన్నికల హామీలను చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ అమలు చేస్తారా? లేదంటే 2014 తరహాలో మరోసారి మోసం చేస్తారా? అనే చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. 2014లోనూ టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను నెత్తికెత్తుకున్నానని, అమలు చేయకుంటే నిలదీసే బాధ్యత తనదేనంటూ నమ్మకంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మొహం చాటేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబును నాడు జనసేనాని కనీసం ప్రశ్నించని వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీతోపాటు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాడు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నిలువునా వంచించిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేయడం గమనార్హం.డ్వాక్రాకు ద్రోహం..బేషరతుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఐదేళ్లలో 70 లక్షల మందికి పైసా కూడా మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్‌పీలు (నిరర్థక ఆస్తులు)గా మిగిలాయి. సంఘాలు రుణాలు కట్టకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలిచ్చేందుకు నిరాకరించాయి. నాడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తమ ప్రభుత్వం డ్వాక్రా రుణహామీని అమలు చేయలేదని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం గమనార్హం.అన్నదాతకు వెన్నుపోటు..2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో రైతుల పేరిట రూ.8,7612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉండగా కోటయ్య కమిటీ పేరుతో కాలయాపన చేసిన చంద్రబాబు కోతలు వేసి విడతలవారీగా అంటూ అరకొర మాఫీతో సరిపుచ్చారు. రైతు సాధికారికత పేరుతో టీడీపీ సర్కారు ఇచ్చిన రుణ బాండ్లు చెల్లుబాటు కాక చిత్తు కాగితాల్లా మిగిలిపోయాయి. -
ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలిరాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది. -
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నా: మేఘ్వాల్
కోల్‌కతా: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయని గుర్తుచేశారు. ఆదివారం కోల్‌కతాలో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోలో యూసీసీని ప్రస్తావించామని ఆయన గుర్తు చేశారు. -
KSR Live Show: చంద్రబాబు ముందున్న అసలు సవాళ్లు.. జగన్ క్రెడిబిలిటీతో పోటీ పడగలడా..?
-
Big Question: ప్రమాణ స్వీకారం పూర్తి.. మరి లెక్క సరిపోతుందా ?
-
అంతుచిక్కని ఫలితం..!
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 99% అమలు చేశారు. ఐదేళ్లుగా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపారు. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. పారదర్శకంగా అర్హులందరికీ నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేసి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతకు దన్నుగా నిలిచారు. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన అందించిన సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలలో నిర్వహించిన సిద్ధం సభలకు లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇందులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలకు ఊళ్లకు ఊళ్లు జనం కదలివచ్చి సంఘీభావం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో నిర్వహించిన రోడ్ షోలకు కిలో మీటర్ల పొడవున జనం బారులు తీరి.. మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండుటెండలో జగన్ సభలకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చినా.. సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచార సభల్లో.. ‘మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటు వేసి ఆశీర్వదించేందుకు మీరంతా సిద్ధమా’ అని జగన్ పిలుపునిస్తే.. మేమంతా సిద్ధం సిద్ధం.. అంటూ లక్షలాది మంది ప్రజలు పిడికిళ్లు బిగించి నినదించారు. కానీ.. వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ఎన్నికల ఫలితం టీడీపీ కూటమికి దక్కడంపై రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది. ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ రూ.800 కోట్లతో తాగునీటి పథకం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం, కిడ్నీ వ్యాధుల చికిత్సకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిరి్మంచినా.. పలాస నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రూ.8 వేల కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరంలలో పూర్తి చేశారు.గతేడాది నుంచే ఆ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కానీ.. ఆ ఐదు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. మూలపేట, కాకినాడ, రామాయపట్నం, మచిలీపట్నం నియోజకవర్గాల్లో రూ.25వేల కోట్లతో పోర్టులు నిరి్మస్తున్నారు. కానీ.. ఆ పోర్టులు ఉన్న నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ గెలవక పోవడంపై రాజకీయ పండితులు నివ్వెరపోతున్నారు.కంచుకోటల్లోనూ కూటమి పాగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలు వైఎస్సార్సీపీకి కంచుకోటలుగా నిలుస్తూ వస్తున్నాయి. కానీ.. ఈ ఎన్నికల్లో ఆ కంచుకోటల్లోనూ ఎన్నడూ లేని రీతిలో టీడీపీ గెలుపొందడటంపై రాజకీయ పరిశీలకులు నివ్వెరపోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ నిలవాల్సిన చోట్ల టీడీపీ కూటమి నిలవడంపై ఆశ్చర్యపోతున్నారు. వైఎస్సార్సీపీకి దక్కాల్సిన ఫలితం టీడీపీకి దక్కడానికి కారణాలు అంతుచిక్కడం లేదని రాజకీయ పండితులు వాపోతున్నారు. ఇటీవల యాక్సెస్ మై ఇండియా చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ మహిళలు, గ్రామీణులు భారీ ఎత్తున జగన్‌కు మద్దతుగా నిలిచారని చెప్పడం.. ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ కూడా పలు సందర్భాల్లో గ్రామీణులు, మహిళలు, మైనార్టీ లు జగన్‌కు అండగా ఉన్నారని స్పష్టం చేసిన నేపథ్యంలో ఫలితాలు ఇలా వెలువడటం సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది. -
రాజకీయ పార్టీల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. పిటిషనర్ వాదన వింతగా ఉందని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ వీకే విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. కాగా, రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలు అవినీతి కిందకే వస్తాయని, అందుకే ఆ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థిని పక్కన పెట్టాలని ఒక ఓటరు స్థానిక హైకోర్టును ఆశ్రయించాడు. -
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
-
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్‌కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్‌పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్‌ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు. -
బాబూ.. నీ హామీల అమలు ఎలా సాధ్యం?
(సాక్షి, అమరావతి): మేనిఫెస్టో సహితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీలకు మొదటి సంవత్సరంలోనే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాలా లక్షా అరవై ఐదువేల కోట్లు. అంటే... రూ. 1.65 లక్షల కోట్లు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అసలు రాష్ట్ర ఆదాయం ఎంత? అన్ని లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందా అంటే? ఈ ప్రశ్నలకు ఆర్థిక నిపుణులనెవరిని సమాధానమడిగినా అలాంటి ఛాన్సే లేదని స్పష్టంగా చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అధికారమే లక్ష్యంగా నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చేశారు. ఎందుకంటే వాటిని అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి నోటిమాటగా యధేచ్చగా ప్రజలకు మాయ హామీలు ఇచ్చేశారు. ప్రజలను మోసం చేయడం, వంచించడం ఈ వృద్ధ నేతకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ ఎన్నికల్లోనూ అదే లైను ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయన ఇచ్చిన హామీలు, ఇతర ఖర్చులు, ఎంత వరకు అప్పు చేయవచ్చు వంటి విషయాలను పరిశీలించిన నిపుణులు చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. ఆ వివరాలు చూస్తే... చంద్రబాబు కాపీ కొట్టి ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, పింఛన్లు వంటి వివిధ పథకాలకు 2024–2025 సంవత్సరంలో రూ.1.65 లక్షల కోట్లు అవసరమనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇక 2029 సంవత్సరానికి అది రూ.1.76 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు, మూలధన వ్యయం ఎలాగూ ఉండనే ఉంటుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలు, ప్రభుత్వం అప్పులపై కట్టాల్సిన వడ్డీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు చేయాల్సిన ఖర్చు, ఇతర బిల్లులు, చెల్లింపులు వంటివన్నీ కలిపి ఏడాదికి రూ.2 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 2024–2025లో ఇందుకోసం రూ.2.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే, 2029 నాటికి అది రూ.2.85 లక్షలకు కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. మొత్తంగా ఐదేళ్లలో రూ.12.23 లక్షల కోట్లు ఇందుకోసం అవసరమవుతుంది. మొత్తంగా చంద్రబాబు ప్రకటించిన పథకాలు, ప్రభుత్వ ఖర్చు కలిపి 2024–2025లో రూ.3.75 లక్షల కోట్లు అవసరమని అంచనా. 2028–29 నాటికి అది రూ.4.61 లక్షల కోట్లకు ఎగబాగనుంది. ఇంత ఖర్చును భరించే సామర్థ్యం రాష్ట్రానికి సాధ్యమయ్యే అవకాశమే లేదని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఖర్చు 3.75 లక్షల కోట్లయితే... ఆదాయం రూ.2.03 లక్షల కోట్లేప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలన్నీ కలిపి 2025లో రూ.2.03 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉంది. 2029 నాటికి ఈ ఆదాయం రూ.2.82 లక్షల కోట్లు పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్థిక నిపుణులు చెప్పేదేమిటంటే ఆదాయ–వ్యయాల మధ్య తేడా గరిష్ఠంగా 10–12 శాతం వరకూ ఉన్నా పర్వాలేదు. పరిస్థితి గాడి తప్పకుండా ఉంటుంది. పన్నుల వసూళ్లలో సమర్థతను పెంచుకోవటం, వ్యయాన్ని పక్కాగా నియంత్రించుకోవటం వంటి చర్యలతో ఈ మాత్రం వ్యత్యాసాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఆదాయ – వ్యయాల మధ్య తేడా మరీ ఎక్కువగా ఉంటే చేతులెత్తేయటం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు హామీలను బట్టి చూసినపుడు ప్రభుత్వ ఆదాయానికి.. పథకాలు, ఇతర ఖర్చులకు మధ్య వ్యత్యాసం 2024–2025 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు ఉంటుంది. 2028–2029 నాటికి అది రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇంత డబ్బును సమకూర్చుకోవాలంటే అప్పులు దొరికే అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, లేదా ఉద్యోగుల జీతభత్యాలను పూర్తిగా నిలిపేయటం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చేయలేని పక్షంలో పథకాలను అమలు చేయటం మానేయాలి. అంటే... అయితే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి జనాన్ని మోసం చెయ్యాలి... లేదంటే ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల వంటి తప్పనిసరి వ్యయాలను ఎగ్గొట్టాలి. ఇది అరాచకానికి దారి తీస్తుందనేది నిపుణుల మాట. ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పులు తెస్తారా?తాజా లెక్కల ప్రకారం చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.72 లక్షల కోట్ల అప్పు తప్పనిసరిగా తేవాల్సి ఉంటుంది. ఈ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ)లో 10.5 శాతాన్ని దాటేస్తాయి. అది కూడా ఆయా సంవత్సరాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తారు అని ఊహిస్తేనే. అలాకాకుండా వృద్ధి రేటు తగ్గితే పరిస్థితి మరింత అధ్వాన్నం. అసలు ఇంత అప్పు తేవడం నిజంగా సాధ్యమా అంటే కానే కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయి అప్పు చేయలేదు. కాగ్ లెక్కలు, ఆర్బీఐ అంచనాలు, రాష్ట్ర బడ్జెట్ పత్రాలన్నింటినీ పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం 2019–2024 మధ్య సగటున రూ.44 వేల కోట్లకు మించి అప్పులు చేయలేదు. జీఎస్డీపీలో (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) 3 శాతానికి మించి అప్పు చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వమూ అనుమతించదు. ఆ పరిమితిని పూర్తిగా ఉపయోగించుకుని... కేంద్రం అనుమతించిన మేరకు గరిష్ఠంగా అప్పులు తెచ్చినా తొలి ఏడాదే ఇంకా రూ.1.13 లక్షల కోట్లు కావాలి. ఐదేళ్లలో రూ.5.40 లక్షల కోట్లు సమకూరిస్తేనే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం కుదురుతుంది. ఇవికాకుండా అమరావతి నిర్మాణం ఖర్చు మరో రూ.1.09 లక్షల కోట్లు. మొత్తం కలిపి రూ.6.50 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కడుతున్న పన్నుల్ని నాలుగు రెట్లు పెంచి, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ గతంలో ఎన్నడూ లేనివిధంగా అయిన కాడికి అమ్మేస్తే కొంత మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే ప్రజలపై నాలుగు రెట్ల పన్నుల్ని చంద్రబాబు పెంచుతారా? లేకపోతే చంద్రబాబు హామీల అమలు కోసం ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అమ్మేస్తారా? ఇవేమీ సాధ్యమయ్యే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. గతంలో రుణమాఫీ హామీని అమలు చేయకుండా ఎగ్గొట్టినట్టే ఈ హామీలను తుంగలో తొక్కడం తప్ప బాబుకు వేరే ఆప్షన్ లేదని, ఆయనను నమ్మి ఓటేస్తే జరిగేది అదేనని వారు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ సంగతులన్నీ జనానికి తెలుసు. ఎలాగంటే... బాబు ట్రాక్ రికార్డు అలాంటిది మరి. అందుకే అలవికాని హామీలిచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు. -
పచ్చ మేనిఫెస్టోలో పచ్చి మోసాలు
-
మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా?
వైఎస్సార్సీపీ 2019 మేనిఫెస్టో..హామీ: వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కలి్పంచి.. రైతులకు దన్నుగా నిలుస్తాం. అమలు: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్ అత్యుత్తమ పథకంగా ప్రశంసించింది. ఐదేళ్లలో పంటలు దెబ్బతిన్న 54.76 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి.. మార్కెట్లో ధరలేని పంటల ఉత్పత్తులు 21.73 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.7,796 కోట్లను వెచ్చించి, రైతులకు అండగా నిలిచారు. తుఫాన్లు, అధిక వర్షాల వల్ల తడిచిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.3,261.61 కోట్లు అందించారు.హామీ: వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా కింద ఆర్థిక సహాయం అందిస్తాం. అమలు: ఆరోగ్యశ్రీ కింద చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల కోసం రూ.13,421 కోట్లు ఖర్చు చేశారు. విశ్రాంతి సమయంలో రోగులకు ఆరోగ్య ఆసరా కింద 24.59 లక్షల మందికి రూ.1,465 కోట్లను అందించారు. ఈ రెండు పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ మరో అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. గతంలో ఇది రూ.5 లక్షల వరకే ఉండేది.హామీ: పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. అమలు:ఇచ్చిన మాట మేరకు జగనన్న విద్యా దీవెన పథకం 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లను ఫీజురీయింబర్స్‌మెంట్‌గా చెల్లించారు. 2017–19 మధ్య చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,778 కోట్లను సీఎం జగన్ చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది విద్యార్థులకు రూ.4,275.76 కోట్లను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో గరిష్టంగా 1.80 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువు పూర్తిచేసుకున్న వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.హామీ: వైఎస్సార్ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకూ అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. అమలు: 2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు 78.94 లక్షల మందికి ఉన్న రూ.25,570.90 కోట్లను నాలుగు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు రూ.4,969.04 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.హామీ: జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి కలను నిజం చేస్తాం. అమలు: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల లాక్‌డౌన్‌తో రెండేళ్లు పనులు చేయలేని పరిస్థితి. మిగతా మూడేళ్లలో రూ.35,268.05 కోట్లతో ఆరు ప్రాజెక్టులు (సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు సొరంగం, కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు–తొలి దశ) పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్.. డయాఫ్రమ్ వాల్‌తో మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేసి.. గోదావరి వరదను మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌పై కేంద్రం నిర్ణయం వెల్లడించడమే తరువాయి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాలకు నీళ్లందించి రైతుల సాగునీటి కలను నిజం చేశారు.హామీ: ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలాలను అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. అమలు: ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి.. వాటిపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరుతోనే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చారు. ఈ స్థలాల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకుపైగానే పలుకుతోంది. అంతే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి.. ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతోపాటు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించారు. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి.. ఒక్కో లబి్ధదారుకు రూ.55 వేల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ స్థిరాస్థితిని సమకూర్చారు.హామీ: బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వైఎస్సార్ చేయూత ద్వారా ఎంత అవసరమైతే అన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కలి్పస్తూ చట్టం తెస్తాం. బీసీ జనగణన చేసి.. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కలి్పంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. అమలు: బీసీల అభ్యున్నతికి చెప్పిన దాని కంటే అధికంగా నిధులు ఖర్చు చేశారు. డీబీటీ రూపంలో రూ.1.28 లక్షల కోట్లను బీసీ లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.52 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ కలిపి మొత్తం రూ.1.80 లక్షల కోట్లను బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేశారు. బీసీల్లోని ఉప కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారినే చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించారు. నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. బీసీ జనగణన చేయించి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతానంటూ ఆ వర్గాలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు.హామీ: షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేసి తోడుగా ఉంటాం. అమలు: చెప్పిన మాట మేరకు ఐదేళ్లలో 3.37 లక్షల మందికి జగనన్న చేదోడు పథకం కింద రూ.1,260.17 కోట్లను సహాయంగా అందించి, తోడుగా నిలిచారు.హామీ: మగ్గం ఉన్న చేనేత కారి్మకుల కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలను ప్రోత్సాహకంగా ఇస్తాం. అమలు: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 82,130 మంది మగ్గం ఉన్న చేనేత కారి్మకులకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.982.98 కోట్లను ప్రోత్సాహకంగా అందించారు.హామీ: కులవృత్తిదారులు, చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.పది వేలు ఇస్తాం. అమలు: జగనన్న తోడు పథకం కింద 15.87 లక్షల మందికి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. సున్నా వడ్డీ కింద వారికి రూ.88.33 కోట్లు ఇచ్చారు.హామీ: వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తాం. అమలు: చెప్పిన మాట మేరకు 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు 33.15 లక్షల మందికి రూ.19,189.59 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. ఆదాయం పొందుతూ ఆర్థిక సాధికారత సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నారు.హామీ: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీల (భూమి, పన్ను, విద్యుత్)తోపాటు ఏపీఐడీసీని పునరుద్ధరించి.. నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. అమలు: అధికారం చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా నిలుపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీఐడీసీని పునరుద్ధరించారు. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) 1.9 లక్షల నుంచి ఏడు లక్షలకు చేరుకున్నాయి. 22.07 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనతో గత 59 నెలల్లోనే కొత్తగా 28.92 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి ఏకంగా 6,48,087 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. హామీ ఇవ్వకున్నా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.హామీ: పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా ఒక జిల్లాను ఏర్పాటు చేసి.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తా. అమలు: 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిరి్మస్తున్నారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు.హామీ: ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి.. అదే ఊరిలోని పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అమలు: రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సగటున 50 నుంచి 75 ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి.. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించి.. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ శాఖల్లో 2.31 లక్షల ఉద్యోగులను నియమించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. ఈ 59 నెలల్లోనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్ఎంఈలు, స్వయం ఉపాధితో కలిపి 58.22 లక్షల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు.హామీ: ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తాం. విద్యా ప్రమాణాలు పెంచుతాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతాం. అమలు: నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసే పనులను రెండు దశల్లో చేపట్టారు. తొలి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకున్నా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు సాక్స్‌లు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతోపాటు చిక్కీ ఇస్తున్నారు. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), వైట్‌హౌస్ వేదికలపై రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం, సంస్కరణలపై అనర్గళంగా ప్రసంగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హామీ: వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 అందిస్తాం. అమలు: మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే అధికంగా.. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఐదేళ్లలో రూ.67,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 53,58,366 మంది రైతులకు రూ.34,378.16 కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.హామీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంక్‌ల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడు వారి చేతికి అందేటట్టు అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా చెల్లిస్తాం. అమలు: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.పది వేలకు పెంచారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఐదేళ్లలో 2.43 లక్షల మందికి రూ.538.06 కోట్లను అందించారు. డీజిల్ సబ్సిడీని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా అందిస్తున్నారు.హామీ: అవ్వాతాతలకు పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూపోతాం. అమలు: ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.2,250కు పెంచే ఫైలుపై 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ తొలి సంతకం చేశారు. దశలవారీగా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా 66.34 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత 59 నెలల్లో పెన్షన్ రూపంలో రూ.90,590.6 కోట్లను పంపిణీ చేశారు.టీడీపీ కూటమి 2014 మేనిఫెస్టో..హామీ: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తా. అమలు: రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేయకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2014, జూన్ 8న చంద్రబాబు మోసం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో కోతలు పెట్టి రూ.15,297 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.72,315 కోట్లు మాఫీ చేయకుండా రైతులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. అమలు: టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల మహిళలు బకాయిపడ్డారు. ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు వంచించారు.హామీ: ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా. అమలు: 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్రంలోని కోటికిపైగా ఇళ్ల(కుటుంబాలు)కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున 60 నెలలకు రూ.1.20 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తా. అమలు: ఐదేళ్లలో పుట్టిన ఒక్క ఆడబిడ్డ పేరుతో ఒక్క పైసా కూడా డిపాజిట్ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు.హామీ: అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి.. పక్కా ఇళ్లు కట్టిస్తాం. అమలు: మూడు సెంట్లు స్థలం మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఏటా రూ.పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తా. అమలు: ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కింద ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ.. ఐదేళ్లలో రూ.36 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసి, అందులోనూ అవినీతికి పాల్పడి బీసీలను మోసం చేశారు.హామీ: చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ చేస్తా. అమలు: ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయకుండా చేనేత, పవర్‌లూమ్స్ కారి్మకులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి నగరంలో, జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మిస్తా. అమలు: సింగపూర్‌ను మించి అభివృద్ధి మాటేమోగానీ అడ్డగోలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. జిల్లా కేంద్రాల మాట దేవుడెరుగు కనీసం ఏ ఒక్క నగరంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదిరాయి కూడా వేసిన పాపాన పోలేదు.హామీ: మహిళల భద్రతకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తా. ఆపదలో ఉన్న మహిళలకు సెలఫోన్ల ద్వారా 5 నిమిషాలలో సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటుచేస్తా. అమలు: ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగి, దాడిచేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.హామీ: పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెస్తా. అమలు: విద్యా విధానంలో మార్పుల మాట దేవుడెరుగు కనీసం ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు ఎంత ఉన్నారూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్ కింద ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లితండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.హామీ: ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తా. అమలు: ఆరోగ్యశ్రీ పేరును ఎనీ్టఆర్ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు.. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. దాంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు పెట్టిన రూ.600 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారు.హామీ: రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట నివారణకు రైతుల వారీగా బీమా సౌకర్యం కలి్పస్తా. అమలు: ధరల స్థిరీకరణ నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిట్టుబాటు ధరలు దక్కక ధాన్యం, అపరాలు, ఉల్లి, టమాటా, మామిడి, బత్తాయి తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.హామీ: ప్రతి జిల్లాకూ, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రం (విజన్ డాక్యుమెంట్)ను తయారుచేసి అభివృద్ధి చేస్తాం. అమలు: ప్రతి జిల్లా, పట్టణం, మండలం, గ్రామం అభివృద్ధి మాటేమోగానీ.. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు బ్యాచ్ అధోగతిపాలు చేశాయి.హామీ: అవినీతిరహిత సుపరిపాలన, పాలనలో పారదర్శకత తెస్తా. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. అమలు: అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిలోనూ చంద్రబాబు అగ్రగామిగా నిలిపారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు లంచాల కోసం ప్రజలను పీడించాయి.హామీ: కొత్తగా కళింగపట్నం, నరసాపురం ఓడరేవు, నిజాంపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను నిరి్మంచి, పాత పోర్టులతో అనుసంధానం చేస్తూ ఇండ్రస్టియల్ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తా. అమలు: ఐదేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పోర్టు నిర్మాణ పనలు కూడా చంద్రబాబు ప్రారంభించలేదు. ఇండ్రస్టియల్ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.హామీ: వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ (ర్యాపిడ్ రైల్వే ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ)ను ప్రవేశపెడతాం. అమలు: బుల్లెట్ ట్రైన్స్ పేరుతో ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ఆ మాట ఎత్తడానికి కూడా సాహసించలేదు.హామీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. అమలు: కమీషన్ల కక్కుర్తితో జాతీయ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019, ఏప్రిల్ 1న రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున నిధులు దోచేశారు. దాంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.హామీ: కేంద్రం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధానిగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తా. అమలు: ప్రపంచస్థాయి నగరం మాటేమోగానీ.. ఆ ముసుగులో ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి అంతర్జాతీయ స్థాయి భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారు. అమరావతిలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిరి్మంచలేకపోయారు. కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కలి్పంచలేకపోయారు. -
అటు మోసం – ఇటు నమ్మకం
అటు మాటపై నిలబడని చంద్రబాబు.. ఇటు మాటపై నిలబడే సీఎం జగన్ కూటమిది మాయఫెస్టో..👉 మాటలతో మభ్యపెట్టి లబ్ధి పొందడమే చంద్రబాబు అజెండా 👉 మేనిఫెస్టో అంటే బాబు దృష్టిలో చిత్తు కాగితం 👉 ఎన్నికలప్పుడు అలవికాని హామీలు..ఆ తర్వాత చెత్తబుట్టలో వేయడం బాబు నైజం 👉 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టుకట్టి 650 హామీలు ఇచి్చన బాబు 👉 అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచిన వైనం 👉 రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా రైతులకు టోపీ 👉 రూ.25,570.90 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలకు మోసం 👉 ఇంటికో ఉద్యోగం.. లేదా నెలకురూ.2 వేల నిరుద్యోగ భృతి అంటూ యువతకు వంచన2014 ఎన్నికల తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీలతో జట్టుకట్టి అలవికాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటక, తెలంగాణల్లోవిఫలమైన పథకాలకు సూపర్ సిక్స్ ముసుగు వైఎస్సార్సీపీది మేనిఫెస్టో👉 మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా చూస్తున్న సీఎం జగన్ 👉 అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇస్తున్న జననేత 👉 విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది జగన్ సిద్ధాంతం 👉 ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం జగన్ విధానం 👉 2019లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ 👉 అధికారంలోకి వచి్చన తొలి ఏడాదే 95 శాతం.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు 👉 సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ 👉 నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం 👉 ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత 👉 2024 ఎన్నికల మేనిఫెస్టోను రెండు పేజీలతో విడుదల చేసిన సీఎం జగన్ 👉 జగనన్న అమ్మ ఒడి కింద ఇస్తున్న సొమ్ము రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు 👉 వైఎస్సార్ రైతు భరోసా కింద చేస్తున్న సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు 👉 వృద్ధాప్య పెన్షన్ రూ.3 వేల నుంచి రెండు విడతల్లో రూ.3,500కు పెంచుతానని హామీచంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం ఇదే తొలిసారి కాదు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, 1995లో అధికారంలోకి వచి్చన బాబు.. 94 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం హామీలను తుంగలో తొక్కారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, రూ.2 కే కిలో బియ్యాన్ని రూ.5.50కి పెంచి ప్రజలను మోసం చేశారు. 1999 ఎన్నికల్లోనూ అదే కథ. కోటి మందికి ఉపాధి కల్పిస్తానని, 30 లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. సాక్షి, అమరావతి: మేనిఫెస్టో అంటే ప్రజలకు నాయకుడు ఇచ్చే మాట.. పారీ్టకి, ప్రజలకు మధ్య ఒప్పంద పత్రం.. నాయకుడికి, ప్రజలకు మధ్య బంధం. అందుకే మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా పవిత్రంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూస్తారు. విశ్వసనీయత లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదన్నది ఆయన సిద్ధాంతం. అందుకే అమలు చేయదగిన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు. 2014, 2019, 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలే అందుకు నిదర్శనం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తద్భిన్నం. ఎన్నికలప్పుడు అలవికాని హామీలతో.. అబద్ధాలకు రెక్కలు కడుతూ మేనిఫెస్టోను విడుదల చేయడం, అధికారంలోకి వచ్చాక దానిని తుంగలో తొక్కడం, ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో మేనిఫెస్టోను మాయం చేయడం చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల మేనిఫెస్టో అమలే అందుకు తార్కాణం. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన చంద్రబాబు.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ సహా అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సమయంలో రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ ప్రకటించాలని సీఎం జగన్‌కు సన్నిహితులు సూచించినా.. దాన్ని అమలు చేయలేమని, అలాంటప్పుడు ఆ హామీ ఇవ్వలేనని తేల్చిచెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో సీఎం జగన్ అధికారంలోకి రాలేకపోయారు. అప్పుడు అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు. వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన శాస్తి చేశారు. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరి కొత్త నిర్వచనం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆరి్థక ఇబ్బందులు ఉత్పన్నమైనా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు.2014 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కారు. 2019 ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచి్చన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక దానిపై విస్తృతంగా అధ్యయనం చేసి.. పదవీ విరమణ అయ్యే నాటికి చివరి నెల జీతంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా జీపీఎస్‌ను తెచ్చారు. హామీలన్నీ అమలు చేయడంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండే రెండు పేజీలతో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా ఇస్తున్న రూ.15 వేలను రూ.17 వేలకు పెంచుతానని.. రైతు భరోసా కింద ఏటా ఇస్తున్న రూ.13,500ను రూ.16 వేలకు పెంచుతానని.. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రెండు దశల్లో రూ.3,500కు పెంచుతానని కొత్తగా హామీలు ఇచ్చారు. కానీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 2014 తరహాలోనే మళ్లీ జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. తెలంగాణ, కర్ణాటకల్లో విఫలమైన పథకాలకే సూపర్ సిక్స్ ముసుగేసి అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని భావించే బీజేపీ దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇచ్చిన మాటపై నిలబడే సీఎం జగన్ ఓ వైపు.. చెప్పిన మాటపై నిలబడిన చరిత్ర ఎన్నడూ లేని చంద్రబాబు మరో వైపు.. ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలే. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
చరిత్ర పునరావృతం అవుతుంది...
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గెలుపుపై నమ్మకం సన్న గిల్లో, లేక చెప్పుకోడానికి మరేం లేకనో కొంతమంది రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలను ఆశ్రయించారు. విద్వేషాన్ని రగిలించే ఈ ప్రసంగాలు సత్యదూరమైన ఆరో పణలతో కూడినవి. ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ ఈ దేశంలోని ముస్లింలను చొర బాటుదారులుగా అభివర్ణించడం దారుణం. ముస్లిం ప్రజలందరికీ ఇది అవమానకరం. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోను ‘ముస్లిం లీగ్‘ మేనిఫెస్టోగా పెర్కొనడం ప్రధాని స్థాయికి తగినది కాదు.‘ఇండియా’ కూటమి వస్తే మీ ఇంటిలోని బంగారం, మంగళసూత్రాలతో సహా అంతా దోచి ముస్లింలకు కట్టబెడతారు అనడం అథమ స్థాయి వాదన.ఎన్నో సర్వేల్లో తేలిన వాస్తవాల ప్రకారం దేశం మొత్తం మీద ముస్లింల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. దేశంలో జైళ్లలో మగ్గుతున్న వారిలో దళితులు, ఆదివాసీల లాగానే ముస్లింలు కూడా వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు వైఎస్సార్ సారథ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం లోనే మొట్ట మొదటి సారి ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది. మోదీ తన ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్‌ను ప్రస్తావిస్తూ ఇతర బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వచూపు తున్నారు అని విమర్శించడం అవాస్తవమే గాక శోచనీయం.మోదీ బాటలో నడుస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషం వెదజల్లుతున్నారు. యాదృచ్ఛికంగానో, ఆకతాయి మూకల వల్లో జరిగిన ఆలయ రథ అగ్నిప్రమాదాన్నీ, ఒక విగ్రహానికి జరిగిన హానినీ ఆ యా ప్రాంతాల సభలలో ఒకటికి పది సార్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వమే అటువంటివి చేయించింది అనే అర్థాన్ని స్ఫురించేలా అపోహలకి తెరలేపు తున్నారు.ఎటువంటి ఆధారాలు లేకుండా వందల కొద్దీ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని బహిరంగ సభలలో అరవడం ఒక బాధ్యతా యుతమైన నేత పని అనిపించుకుంటుందా? మత విద్వేషాలు అనే ఊసు ఎప్పుడూ లేని ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి ప్రసంగాలు చేయడం ఒక అమానుష చర్య. మరి కొన్ని సభల్లో ప్రజలను ‘మీకు సిగ్గు లేదా’, ‘పౌరుషం లేదా’ ‘మీరు రోడ్లు ఎక్కి వీళ్లకి బుద్ధి చెప్పరా’ అని అనడం వారిని ప్రత్యక్ష హింస వైపు ప్రేరేపించడమే. ఒక వైపు 2016లో చంద్ర బాబు హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ ఆందో ళన, తుని రైలు విధ్వంసం సంఘటనలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేయించింది అనే నిందను వేశారు. అదే నోటితో జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టిన సందర్బంగా 2022లో జరిగిన మంత్రి ఇల్లు దగ్ధం సంఘటనకు కూడా జగనే కారకుడు అనడంలో ఔచిత్యం ఏంటి? ఈ రెండు సునిశితమైన అంశాలను ఎన్ని కల వేళ మళ్ళీ తెర మీదకి తెచ్చి విద్వేషాలను రగిలించే తత్వం చాలా తప్పు. అసలు కాపు రిజర్వేషన్ సమస్యపై తనది, తన కూటమి వైఖరి ఏంటో చెప్పకుండా వైసీపీ లోని కాపు నేతలను కించ పరుస్తూ వారి నియోజక వర్గాల్లోనే అవమా నించడం ఒక అక్కసుతో, ద్వేషంతో కూడిన అజెండాలో భాగమే.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ‘కరుడు కట్టిన ఉగ్రవాది’ అని వర్ణించటం అత్యంత గర్హనీయ చర్య. ఈ మాటల్లో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనిపి స్తుంది. ప్రజలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఉగ్రవాది ఎలా అవుతారు? విధాన పరంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇటు వంటి మాటలు వాడితే ఎదురుదెబ్బ తగలడం ఖాయం.ఈ విధంగా కూటమి నేతలు మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ముగ్గురూ విద్వేషాన్ని రగిలిస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల దయ్యింది. ఇంతగా విలువలకు తిలోద కాలు ఇచ్చిన వైనం చూస్తే ఓటమి భయం వారిని వేధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా పెద్ద హామీలు ఏమీ ఇవ్వక పోవడం. ‘ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మెరుగు చేస్తాం’ అంటూ ముందుకు వచ్చిన జగన్ తన ఓటు బ్యాంకుపై ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నా రని దీన్నిబట్టి అర్థమవుతోంది. ఇలాగే 2009లో అప్పటి వైఎస్ఆర్ కూడా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక ఎటువంటి కొత్త హామీలు ఇవ్వకపోయినా ప్రజలు తమ నమ్మకాన్ని మళ్ళీ ఆయనపై ఉంచి ప్రతిపక్ష మహాకూటమిని చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇప్పుడు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టిన ఆ చరిత్ర పునరావృతం అవుతుందనిపిస్తోంది.డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
మూడో దశకే అఖిలేష్ ఓటమి మ్యానిఫెస్టో!
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇంకా నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉంది. అయితే ఇంతలోనే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఇది వారి పార్టీకి సంబంధించినది కాదు.. బీజేపీ ఓటమికి సంబంధించినది.అఖిలేష్ ఈ మేనిఫెస్టోను కాలక్రమం ఆధారంగా వివరిస్తూ ట్వీట్ చేశారు. మీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అక్కడి మీ సహచరులపై ఎందుకు ఆరోపణలు వచ్చాయని అఖిలేష్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు జీఎస్టీ, ఆదాయపు పన్ను, ఇతర రకాల పన్నులను ఎగవేసి ఉంటారు. అందుకే నల్లధనం పుట్టుకొచ్చింది. ప్రభుత్వం దీనిని అనుమతించిందో లేక ఆపలేకపోయిందో గానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పక తప్పదు.గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్టీ తప్పని రుజువైంది. దేశంలో అవినీతి వల్ల తలెత్తుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బీజేపీ దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీ నుంచి మన దేశం వైదొలగడానికి కారణం బీజేపీ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం నల్లధనం ఆధారంగా భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటున్నదా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.బీజేపీ ప్రభుత్వం ‘ఎలక్టోరల్ బాండ్’ల విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో పేదల ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. దేశ ఆదాయానికి ఏర్పడిన వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎన్నికల విరాళాలతో భర్తీ చేస్తుందా? కరోనా వ్యాక్సిన్ కోసం విరాళాలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటించిన ఎన్నికల విరాళాలను నల్లధనంగా ప్రకటిస్తుందా? అని అఖిలేష్ ప్రశ్నించారు.పార్టీలో ఎవరిపైన అయినా ఆరోపణలు వస్తే, వారికి గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు, లీజులన్నింటినీ బీజేపీ రద్దు చేస్తుందా? ప్రజల సొమ్ముతో రూపొందించిన ‘పీఎం కేర్ ఫండ్’ ఖాతాలను ప్రజల ముందు బహిరంగపరుస్తుందా? బీజేపీ తదుపరి దశ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక మూడో దశనే చివరి దశగా భావించి ఓటమిని అంగీకరిస్తుందా? అని అఖిలేష్ తన ట్వీట్లో బీజేపీని ప్రశ్నించారు. -
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
-
జగన్‌ది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పేదవాడి ఆకలి తీర్చే మేనిఫెస్టో అని, చంద్రబాబుది అధికార దాహం తీర్చుకునే మోసపూరిత మేనిఫెస్టో అని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు అమలు కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ చెప్పింది చెప్పినట్టు చేసి చూపించి.. ప్రజల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పేదవాడి చేతి ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలని కోరుకుని ఆ దిశగా తన ఐదేళ్ల పాలన కొనసాగించిన నేత జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అలా మంచి చేసే ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి దిగజారాడు చంద్రబాబు అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టే స్థాయి నుంచి చివరకు కుటుంబాల మధ్య కూడా చిచ్చుపెట్టే స్థాయికి దిగజారిపోయారని ముద్రగడ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారని, ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నీచ రాజకీయాలపై చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలని తపిస్తున్న సినీ నటుడు పవన్‌కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలన్నారు. తుని ఘటన తరువాత చంద్రబాబు తనను వేధించిన తీరు, అవమానాలు మర్చిపోలేకపోతున్నానని ఆయన వాపోయారు. మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సభకు మాజీ జెడ్పీటీసీ, కాపు నేత చాగంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. నరసాపురం వైఎస్సార్సీపీ అ«భ్యరి్థ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్‌కు, నేడు సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్ లెస్ ట్రీట్మెంట్), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్‌లో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్ స్థానంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ట్రస్ట్ అయితే అందులో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్‌కు అయి నా నిర్ధే శించిన రేట్స్ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా ∗ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ∗ అన్ని మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ∗ బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు జనరిక్ మందులు 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్ సీట్లు సమకూర్చడం.∗ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్ సీట్లు. ∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్‌ల ఏర్పాటు. ∗ క్యాన్సర్ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్లను పెంచి చేతులు దులుపుకున్నారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచేవారు.దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! అంశం: కొత్త వైద్య కళాశాలలు జగన్ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం జగన్ పాలన: పీహెచ్సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు విలేజ్ క్లినిక్స్‌లో టెలీ మెడిసిన్ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్ డెలివరీ ప్రారంభించింది. బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్‌సీలకు వెళితే అక్కడ డాక్టర్లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు. అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే జగన్ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు. బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు. అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు జగన్ పాలన: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాష్), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్‌లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. ఎవరు కావాలో ఆలోచించండి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్‌లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్ జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి. -
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
-
మేనిఫెస్టో మోసగాడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి.. అందుకోసం వందల హామీలిచ్చి అందలమెక్కుతాడు.. తనను నమ్మి ఓటేసిన ప్రజలను నిలువునా వంచిస్తాడు. హామీలన్నీ చెత్తబుట్టలో పడేస్తాడు. హామీలిస్తే అమలు చేయాలా? అని సమాధానమిస్తాడు. మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు.. మాయమాటలతో ఎన్నికల ముందు తిమ్మిని బమ్మి చేసి కిచిడీ మేనిఫెస్టోతో ప్రజల నమ్మకంతో ఆడుకుంటాడు. ‘చంద్రబాబుకు ఒక శాపముంది.. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని ఆనాడు అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యం.. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడు.అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. చంద్రబాబు పాలనలో మహిళలు, వృద్ధుల కష్టాలు, రైతుల కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. కొడుక్కి మంత్రి పదవే కట్టబెట్టి నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మన భవిష్యత్‌ను గుర్తు చేసుకుని.. మన కోసం ఒక మంచి బాట వేసిన జననేతను మళ్లీ గెలిపించుకోవాలి. ఒక్క ఓటుతో చంద్రబాబు అబద్ధాల ప్రపంచాన్ని పటాపంచలు చేయాలి. హామీలతో వంచించే నేతను విశ్వసిస్తే భవిత నాశనమే.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడపోయి.. ఇప్పుడు ఆ పారీ్టతోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతకు మేనిఫెస్టో కేవలం ఒక కాగితం మాత్రమే.. జగన్ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చే మాట.. ఐదేళ్ల పాలనను చాటిచెప్పే పవిత్ర వాగ్దానం. ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తాను గెలిచిన ప్రతీసారి ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. 2014లో పదవి కోసం చంద్రబాబు 600కు పైగా హామీలు గుప్పించారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. హామీల మాటే మరిచిపోతారు.జనంలోకెళ్తే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోను తన వెబ్సైట్ నుంచి మాయం చేస్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు తొడుగుతూ అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేయడం.. అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ.. ఎప్పుడూ మేనిఫెస్టోను అమలుచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు మరోసారి.. సూపర్ సిక్స్‌తో కలిపి ఇతర హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారు. రుణమాఫీ పేరుతో టోపీ 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్‌లో కలిసి చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రధాన హామీలు 1. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం 2. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ 3. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి 4. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకంలో రూ.25 వేల డిపాజిట్ 5. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం.. పక్కా ఇళ్ల నిర్మాణం 6. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు 7. చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ 8. సింగపూర్‌ను మించి అభివృద్ధి 9. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మాణం ఇలా 650కిపైగా హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీల అమలును తుంగలో తొక్కారు. ఇదేంటని ప్రశి్నస్తే.. కేంద్రం సహకరించలేదంటూ బుకాయించి.. హామీలిస్తే అమలు చేయాలా? అని ఎదురు ప్రశి్నంచారు. ఎన్టీఆర్ హామీలకు బాబు వెన్నుపోటు ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పోడిచి.. అధికారంతోపాటు టీడీపీని కబ్జా చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2 కే కిలో బియ్యం హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేయడంతో పాటు రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. 1999లో అరచేతిలో స్వర్గం 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన విశ్వరూపం చూపించాడు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. 1. కోటి మందికి ఉపాధి 2. 35 లక్షల ఇళ్లు నిర్మాణం 3. దారిద్య్ర నిర్మూలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు 4. పట్టణాల్లో మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు 5. 25 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి సౌకర్యం ఇలా పదుల సంఖ్యలో హామీలిచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయిపై సానుభూతి కలిసొచ్చి ఆ ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. హామీల అమలును మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కేంద్రం సహకరించలేదని బుకాయించారు. ఉచిత విద్యుత్‌పై పరిహాసం అలిపిరి ఘటన నుంచి సానుభూతి పొందడం ద్వారా అధికారంలోకి రావాలన్న ఎత్తుగడతో 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. వ్యవసాయ విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని మహానేత వైఎస్సార్ హామీ ఇస్తే అపహాస్యం చేశారు. సేద్యానికి ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని చంద్రబాబు పరిహాసమాడారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించిన జనం అతని పాలనకు చరమగీతం పాడారు. 2009లో తారాస్థాయికి బాబు అబద్ధాలు 2009 ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో చంద్రబాబు మహాకూటమిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో హామీలు 1. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.2 వేల నగదు బదిలీ 2. 50 లక్షల ఉద్యోగాలు 3. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ 4. 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం.. అలా పదుల కొద్దీ హామీలతో ప్రచారంలో ఊదరగొట్టినా అతని నైజం తెలిసి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీని జనం గెలిపించారు. వ్యవసాయానికి ఏడు గంటలకు బదులు 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 4 కేజీలు కాకుండా 6 కేజీలకు పెంచి ఇస్తామని రెండే హామీలు ఇచ్చిన మహానేత వైఎస్‌ను విశ్వసనీయతకు జనం పట్టం కట్టారు. ప్రత్యేక హోదా అంటూ 2019లో మోసం 2018లో బీజేపీతో విడిపోయి 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. కమిషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకోవడం కోసం ప్రత్యేక హోదాను 2016లో కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటే సరఫరా చేస్తామని.. 2 కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని.. అన్నదాత సుఖీభవలో రైతులకు ఏటా రూ.15 వేలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతానని హామీలు ఇచ్చారు. చంద్రబాబు మోసానికి భయపడిన జనం ఆ ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. కర్ణాటక, తెలంగాణలో విఫలమైన హామీలతో ‘సూపర్ సిక్స్’ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్.. నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాక్షేత్రంలో ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. మళ్లీ బీజేపీ, జనసేనతో జట్టుకట్టారు. కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమల్లో నీరుగారిపోయినా వాటికే సూపర్ సిక్స్ ముసుగేసి ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో ఇంతవరకూ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ అమలు కాలేదు. మిగతా అమలవుతాయో లేదో తెలియదు. -
పక్కాగా కేటుగాడే!
‘‘వ్యవసాయం వల్ల ఉపయోగం లేదు.. వ్యవసాయం చేయడం ఇక దండగ.. భూమిని నమ్ముకోకుండా లాభదాయకమైన వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమం.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే.. రైతులకు ఎంత చేసినా కావాలంటారు.. వాళ్లకు ఇంకేం పనిలేదు.’’ – అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్నమాటలివి.అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడే ఊసరవెల్లి నారా చంద్రబాబు నాయుడు. అ«ధికారమే పరమావధిగా అమలుకు సా«ధ్యం కాని హామీలు గుప్పించడం.. అధికారం రాగానే వాటిని బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో ఆయన ఇచి్చన హామీలే ఇందుకు నిదర్శనం. ‘బ్యాంకులో తనఖా పెట్టిన మీ భార్య పుస్తెలతాడు ఇంటికి రావాలంటే బాబు రావాలి. మీ రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు రావాలి’ అంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ..వాడా ప్రచారం ఊదరగొట్టారు. తీరా గద్దెనెక్కాక నిండా ముంచిన వైనం ఇప్పటికీ అన్నదాతలు, డ్వాక్రా మహిళల కళ్లెదుట కదలాడుతోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2014 ఎన్నికల నాటికి రైతులకు ఉన్న రూ.87,612 కోట్ల వ్యవసాయ, బంగారు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానంటూ నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచారు. రుణ మాఫీ సాధ్యం కాదని, ఎగ్గొట్టడంలో భాగంగా ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం కుటుంబానికి రూ.1.50 లక్షలకు మించి మాఫీ చేయబోమని మాట మార్చేశారు.అంతేకాకుండా అనేక షరతులు పెట్టారు. ఎకరాకు నిర్దేశించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, సాగు కోసం తీసుకున్న బంగారు రుణాలు, మీడియం టర్మ్ రుణాలుగా మార్చిన పంట రుణాలు అయి ఉండాలంటూ మెలిక పెట్టారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున గరిష్టంగా రూ.50 వేలకే పరిమితం చేశారు. వ్యవసాయ రుణమాఫీ స్కీమ్ (ఏడీఆర్ఎస్) కోసం బడ్జెట్ అవసరమని 2014 ఆగస్టు 14న జీఓ 174 జారీ చేశారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారు.రూ.50 వేల లోపు ఉన్న రుణాలను వన్‌టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక వేళ అర్హత పొంది, అప్పటికే రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి ఉంటే, ఆ మేరకు మొత్తాన్ని వారి సేవింగ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని, ఒక వేళ రుణ బకాయిలు ఉండి ఉంటే వాటికి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా గుర్తించిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా రైతు ఉపశమన అర్హత పత్రాలు పేరిట హంగామా చేశారు. చివరకు మూడు విడతల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. 67.42 లక్షల మందికి అర్హత పత్రాలు ఉన్నప్పటికీ ఎగ్గొట్టారు.అర్హత ఉండి రుణాలు చెల్లించిన వారికి పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. రైతు రుణ అర్హత పత్రాలు పొందిన వారు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పైసా సాయం అందలేదు. దీంతో చేసిన అప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేక లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అన్నదాత సుఖీభవ అంటూ హంగామా 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే ఏటా రూ.12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లపాటు రూ.50 వేలు ఇస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టిన చంద్రబాబు ఆ ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ రైతన్నలను బుట్టలో వేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఈ పథకం కింద కౌలు రైతులతో పాటు 2 హెక్టార్లలోపు చిన్న, సన్నకారు రైతులకు రూ.15 వేలు, 2 హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ 2019 ఫిబ్రవరి 17న జీవో 28 జారీ చేశారు. ఆచరణలోకి వచ్చే సరికి పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత 46.76 లక్షల మందికి రూ.1,000 చొప్పున జమ చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వివిధ సాకులతో 3.50 లక్షల మందికి కోతపెట్టి 43.26 లక్షల మందికి రూ.3 వేలు చొప్పున వేశారు. ఇలా నాడు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు మాత్రమే ఇచ్చి రూ.1,765.29 కోట్లతో సరిపుచ్చారు. 2014లో వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 200కు పైగా ఇచి్చన హామీలు బుట్టదాఖలయ్యాయి.ఇప్పుడూ అదే రీతిలో మోసం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మరోసారి రైతులను ఏమార్చేందుకు చంద్రబాబు కొత్త హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు 53.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో కౌలు రైతులు, అటవీ, దేవదాయ సాగుదారులు 2.68 లక్షల మంది ఉన్నారు. ‘బాబు చెప్పినట్టు ఏటా రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఐదేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు అవసరం. గతంలో రూ.17 వేల కోట్లే సరిగా ఇవ్వలేకపోయిన ఈ పెద్దమనిషి రైతుల కోసం లక్ష కోట్లు ఇస్తానంటే నమ్మేవారెవరూ లేరు’ అని అన్నదాతలు మండిపడుతున్నారు. -
మోదీ మాస్టర్ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
-
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
-
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
-
గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో మీకు వ్యక్తిగతంగా ఇంత లబ్ధి చేకూరనుంది అంటూ గ్యారంటీలు, ష్యూరిటీల పేరిట ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ద్వారా వ్యక్తిగతంగా ఇంత లభిస్తుందంటూ గ్యారంటీ కార్డులు ఇవ్వడం, ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఈ విధంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలపై నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. పలు రాజకీయ పార్టీలు ఈ విధమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ పేరిట ప్రత్యేకంగా ఒక వెబ్‌లింక్, యాప్‌ను డెవలప్‌చేసి అందులో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బాబు ఆరు ష్యూరిటీల పేరిట మీ కుటుంబానికి ఇంతమొత్తం లబ్ధిచేకూరుతుందంటూ గ్యారంటీ కార్డులు, మెసేజ్‌లు పంపుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. 1. ఓటర్లు మిస్డ్ కాల్, మొబైల్ నంబర్, టెలిఫోన్ నంబర్లను ఇవ్వడం ద్వారా నమోదు అవ్వండి అంటూ పత్రికా ప్రకటనలివ్వరాదు. 2. కరపత్రాల రూపంలో గ్యారంటీ కార్డులను పంచుతూ ఓటర్ల నుంచి పేరు, వయసు, మొబైల్ నంబర్, ఎపిక్ నంబర్, నియోజకవర్గం పేరు సేకరించరాదు. 3. ప్రభుత్వ పథకాల లబ్ధి పేరుతో రేషన్‌కార్డు, బూత్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, నియోజకవర్గం పేరు వంటి వివరాలు తీసుకోరాదు. 4. రాజకీయ పారీ్టలు వెబ్ ప్లాట్‌ఫాం, యాప్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించరాదు. 5. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పథకాల వివరాలతో పత్రికా ప్రకటనలు, కరపత్రాలు ఇవ్వరాదు. -
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి... రెండు పగ్గాలను ఒకే చేత్తో పట్టుకొని ప్రభుత్వాన్ని జనరంజకంగా నడపడం సాధారణ విషయం కాదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడకను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాను పాలన చేపట్టేనాటికి ఉన్న అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెట్టడమే గాక ప్రతి పథకాన్నీ ఒక విజన్‌తో రూపొందించడం జగన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విద్య, వైద్యం, మౌలిక అవస్థా పనా సౌకర్యాల ఏర్పాటు, వ్యవసాయం, రైతు సంక్షేమం, బడుగు ప్రజలకు ఆవాసం... ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటి వెనుక సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కాన్సెప్టులూ పడుగు పేకల్లా కలిసే కనిపిస్తాయి.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనకు మిగిలితే, ఆ సంఖ్యను రెట్టింపు చేసి 26 జిల్లాల రాష్ట్రంగా మార్చడంలో జగన్ విజన్ ఏమిటో మనకు స్పష్టమ వుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే ప్రజల వద్దకు పాలన అనే విజన్ కార్యరూపంలోకి వస్తుంది గనుక జిల్లాలను విభజించి కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు మరింత దగ్గరయ్యేట్లు చేశారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలముంగిటకు చేర్చారు. ఏ శ్రేయో రాజ్యంలోనైనా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలకు ఎంత ఎక్కువగా ఉపాధి సమ కూరితే రాష్ట్రం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు లక్షలకు పైనే ఉద్యోగాలు ఇచ్చింది. దీనికి అధికారికమైన లెక్కలు ఉన్నాయి. వాటిలో పర్మి నెంట్ ఉద్యోగాలే 2.31 లక్షలు ఉన్నాయంటే యువతకు ఉద్యో గాల కల్పన అంశానికి జగన్ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యమిచ్చిందో అర్థమవుతుంది. సరైన విజన్ అంటే ఇదేకదా!!ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడమేకాదు, ముందు ముందు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాటికి ‘నైపుణ్య శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాలు రూపొందించడం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఇంజినీరింగ్, ఇతర విభాగాలలో విద్యార్థుల నైపుణ్యాలను మరింత మెరుగుపరచి వారిని వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి అర్హులుగా చేయడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతి, విశాఖ నగరాల్లో స్కిల్ డెవలప్మెంట్ వర్సి టీలు కూడా సంకల్పించారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనుకొనేవారు ఏ విధంగా ఆలోచిస్తారో దీనిని బట్టి తెలుసు కోవచ్చు. సమాజంలోని వివిధ ప్రాధాన్య వర్గాలను బేరీజు వేసుకొని వారికి సరిపోయే ప్రణాళిక రూపొందించాలనేది సరైన విజన్ ఉన్న నేతకే సాధ్యమవుతుందని కూడా దీనిని బట్టి అర్థమవుతుంది.బడుగు ప్రజలు కూడా సమాజంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనీ, అభివృద్ధి ఫలితాలు వారు కూడా అందు కోవాలనే లక్ష్యంతో జగన్ తమ మొదటి మేనిఫెస్టోలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ‘నవరత్నాల’ను ప్రజలందరికీ అందించారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో మేనిఫెస్టోలో... గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారో తెలియజేసి, కొత్తగా మరికొన్ని పథకాలను ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా పేద పిల్లల చదువులకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యమిచ్చారో చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలనీ, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య నుంచి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ‘కళ్యాణమస్తు’, వంటి పథకాలుఅందుకే ప్రజల ఆదరణను అంతగా చూరగొన్నాయి. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు... ఈ మూడు అంశా లలో రాష్ట్రం సాధించిన ప్రగతినే ‘వాస్తవ అభివృద్ధి’గా చెబుతారు. అందుకే ఈ అంశాలకు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తుంది. మానవాభివృద్ధి పథ కాలు ఎంత ఎక్కువగా అమలైతే, సంక్షేమం అంత అభివృద్ధిగా మారుతుంది. ఇది తెలియని చాలా మంది సంక్షేమాన్ని అభివృద్ధిని వేర్వేరుగా చూస్తుంటారు. సంక్షేమం ముందుకు వెళ్తే అభివృద్ధిగా మారుతుందనే సిద్ధాంతాన్ని జగన్ నమ్మారు కనుకనే జగన్ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నారు. ప్రజలు ఆరోగ్యవంతులైతేనే ఎన్ని పనులైనా చేయగలుగుతారు. దానిని దృష్టిలో ఉంచుకొనే ఆరోగ్యరంగాభివృద్ధికి ప్రభుత్వంపలు కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వైఎస్సార్ పేరిట, జగన్ పేరిట పలు పథకాలు అమలవు తున్నాయి. కొత్తగా పలువైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి జరుగుతోంది.‘ఆరోగ్య శ్రీ’ ద్వారా రూ. 25 లక్షల విలువైన వైద్య చికిత్స అందించడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో పేరుపొందింది. పేదలు చికిత్స కోసం ఎలాంటి అప్పులు చేయ రాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం, ఉచిత సేవలను ఎక్కువ ఆసు పత్రులకు విస్తరించడం, చివరకు కేన్సర్ చికిత్స కూడా ఉచితంగా అందించడం ఎంతో విశేషం. చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో ‘ఆరోగ్య ఆసరా’తో ఆదుకుంటున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వృద్ధాప్య పెన్షన్ పెంపు, ‘వైఎస్సార్ చేయూత’ వంటి పథకాల ద్వారా ఏ ఇంటిలోనూ ఎలాంటి సమస్యలు లేని వాతావరణం సృష్టించడంకంటే ‘శ్రేయోరాజ్య’నికి అసలైన అర్థం ఇంకేం ఉంటుంది?పాలనలో పిరమిడ్ నమూనాను పక్కన పెట్టి, చతురస్ర నమూనాను స్వీకరించడం జగన్ ప్రత్యేకత. ప్రభుత్వ పథకాలు అమలు అన్ని వైపులకు విస్తరించడానికి (అధికార యంత్రాంగం సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా పథకాల ప్రయోజనాలు అందరికీ అందేట్లు చేయడం) ఈ చతురస్ర నమూనాను అనుస రించడం ఒక చక్కని ప్రయోగం. ఇలా ఒకటి రెండు కాదు, ‘జగన్’ను తెర మీద పరచే కార్యక్రమాలు, పథకాలు అనేకానేకం. అన్నీ ప్రజాదరణ పొందడం ఒక విశేషం. వాటన్నిటితో పాటు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరింత కొత్త ‘విజన్’తో ముందుకు వస్తానని జగన్ ప్రకటించడం ముదావహం.- వ్యాసకర్త ఏపీ మాజీ శాసనసభ్యులు ‘ 98481 28844- అడుసుమిల్లి జయప్రకాష్ -
హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్ తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజం కోరుకునే మొత్తం 23 అంశాలతో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర మేనిఫెస్టోను రూపొందించామని టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడం సహా వివిధ హామీలు అమలు చేస్తామని తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పాంచ్‌న్యాయ్, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్, ఆల్దాసు జానయ్య, వినోద్‌కుమార్, కమలాకర్‌రావు, అనంతుల శ్యాంమోహన్, లింగం యాదవ్, కప్పర హరిప్రసాదరావు, పార్టీ నేతలు మెట్టు సాయికుమార్, చనగాని దయాకర్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేక మేనిఫెస్టో విడుదల సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నీతి ఆయోగ్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టాలని నిర్ణయించామన్నారు. అలాగే పలు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని, ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చా రు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శ్రీధర్‌బాబు విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తెలంగాణకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టామని చెప్పారు. అనంత రం దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలిచి రాజ్యాంగా న్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
చిలకలపూడి (మచిలీపట్నం): ఇటీవల చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవటం.. ఇప్పుడు టీడీపీ తరఫున పత్రికల్లో ఇచ్చిన అడ్వరై్టజ్మెంట్స్లో పవన్‌కళ్యాణ్ ఫొటో లేకపోవటం చంద్రబాబు దగాకోరు విధానానికి అద్దం పడుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురు వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అడ్వరై్టజ్మెంట్లో రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్న హామీ కూడా లేకపోవటం చంద్రబాబు మాయమాటలకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమి అధినేతల ఫొటోలు మాయమవడంతో పాటు హామీలను కూడా మాయం చేసే చంద్రబాబును ప్రజలు దగాకోరుగా అభివర్ణిస్తున్నారన్నారు. ఎన్నికలు రాకముందే మోసం మొదలైందని చెప్పుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ హామీలనూ తుంగలోకి తొక్కిన ఘనుడు బాబు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేదం హామీలను అమలు చేస్తే.. కుట్రలు పన్ని, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.50 చేయటంతో పాటు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని పేర్ని నాని గుర్తు చేశారు. 1999లో ఇచ్చిన మేనిఫెస్టోలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ప్రతి పాఠశాలకు పక్కా భవనం నిరి్మస్తామని, మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.. ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించినప్పుడు ఆశకు హద్దుండాలని వ్యాఖ్యానించటం ఆయనకే చెల్లిందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ, పవన్‌కళ్యాణ్‌తో కూటమి కట్టిన చంద్రబాబు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఆటలో అరటిపండులా వదిలేశాడన్నారు. ఎంతటి వారినైనా మోసం చేసే గుణం చంద్రబాబుకే ఉందన్నారు. ఇటువంటి చంద్రబాబు మాయమాటలను రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గ్రహించి నక్కజిత్తుల మాటలు నమ్మకుండా ఆలోచించాలన్నారు. వైఎస్ జగన్ అంటే నడిచే నమ్మకంగా చంద్రబాబు మాటలు అపనమ్మకంగా భావించి చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలని కోరారు. మే 13న చంద్రబాబుకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా తీర్పును ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయనీయ పరిస్థితిలో పింఛన్ లబ్దిదారులు చంద్రబాబు, ఆయన బంధువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుట్రల కారణంగా పింఛన్ లబ్దిదారులు దయనీయ స్థితిలో ఉన్నారని పేర్ని నాని అన్నారు. హైకోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి పింఛన్ లబ్దిదారులు గడప దాటేలా చేశారన్నారు. బ్యాంకులకు వెళ్లిన లబి్ధదారులకు మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను కట్‌చేసి పింఛన్లు ఇస్తుంటే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఇటువంటి పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబుకు 66 లక్షల మంది పింఛన్‌దారుల ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. -
మోసాల బాబు మరో అబద్ధం..
సాక్షి, అమరావతి: నిజం చెప్పకపోవడం.. మాటమీద నిలబడకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం. అందుకే ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీసారి అలవోకగా ఎడాపెడా హామీలిచ్చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటివి ఎన్నో ప్రకటించారు. అందులో మూడ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ‘స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు’ అన్న ఓ అబద్ధపు హామీ కూడా ఇలాంటిదే. నిజానికి.. ఇది ఏ విధంగా చూసినా ఆచరణ సాధ్యంకాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ స్థాయిలో రాష్ట్రంలోని 82.29 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో భారీ మొత్తాన్నే ఈ ఒక్క పథకానికే ఖర్చుచేయాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని వారు వట్టి మాటగా కొట్టిపడేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో చెబుతూ ఏటా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) కింద నివేదికను అందజేస్తుంటాయి. దీని ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో 1–10 తరగతుల్లో 71,77,637 మంది, ఇంటర్మీడియట్లో 10,52,221 మంది కలిపి మొత్తం 82,29,858 మంది విద్యార్థులున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి అక్షరాలా రూ.1,23,44,78,70,000లు అవసరమవుతుంది. సులభంగా చెప్పాలంటే రూ.1,234 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఏటా అమ్మఒడి కింద రూ.6,452 కోట్లు ఖర్చుచేస్తుండగా, దీనికి రెండింతలు ఇస్తానని చంద్రబాబు అలవోకగా ఓ అందమైన అబద్ధపు హామీని ఇచ్చిపడేశారు. ప్రభుత్వ విద్యపై చంద్రబాబు కక్ష.. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు చంద్రబాబునాయుడు కొమ్ముకాశారు. 2014–19 మధ్య సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని, వాటిని కల్పించే పరిస్థితి లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ప్రకటించారు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం ఒక ఎత్తయితే.. 117 జీఓను రద్దుచేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు విద్యకు దూరం కావడం ఖాయం. ఇక గతంలో ఒక స్కూలుకు మంజూరైన పోస్టులను పిల్లలున్నా లేకున్నా కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ, జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం బడిలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నేపథ్యంలో.. తక్కువ విద్యార్థులు, ఎక్కువమంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ఎక్కువ విద్యార్థులున్న స్కూలుకు వారిని బదిలీ చేసేందుకు వీలుగా 2022 జూన్‌లో జీఓ–117 తీసుకొచ్చింది. దీంతో పోస్టులను రద్దుచేయకుండా అదనపు ఉపాధ్యాయులను ఎక్కువమంది పిల్లలున్న స్కూలుకు బదిలీ చేయవచ్చు. పేద విద్యార్థులకు ఎంతో మేలుచేసిన ఈ జీఓను ఉపాధ్యాయ వర్గాలూ స్వాగతించాయి. ఫలితంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులోకి వచ్చారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 117 జీఓను రద్దుచేస్తే.. ప్రభుత్వ విద్య నాశనం కావడంతో పాటు, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసేందుకు ఆస్కారం ఉంది.జగన్ సర్కారులో విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం2019లో ప్రభుత్వం ఏర్పాటుచేశాక సీఎం జగన్ ప్రభుత్వ విద్యపై దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్వాడీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం కరిక్యులమ్‌లో మార్పులు చేశారు. ఉదా.. » ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తేవడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రభుత్వం ఉచితంగా అందించింది. » ప్రతి పేదింటి బిడ్డను బడికి పంపించాలని, ఇలా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసింది. » విద్యార్థి తప్పనిసరిగా బడిలో ఉండేలా చూసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. » కోవిడ్ రెండేళ్లు మినహా మిగిలిన సంవత్సరాల్లో హాజరును పరిగణనలోకి తీసుకుని నాలుగు పర్యాయాలు రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేసింది.సగటున ఏటా రూ.6,452 కోట్లు జమ ఈ పథకం కింద 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021–22లో 42,62,419 మందికి రూ.6,393.6 కోట్లు, 2022–23 విద్యా సంవత్సరంలో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.9 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.25,809.50 కోట్లు అందించింది. అంటే.. సగటున ఏడాదికి రూ.6,452.37 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే, 2024 మేని ఫెస్టోలో రూ.15వేల అమ్మఒడి మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలుచేయనుంది. కానీ, చంద్రబాబు మాత్రం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఇస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. -
‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
సాక్షి, అమరావతి: వ్యవసాయమే దండగన్న చంద్రబాబు పాలనలో కాలం చెల్లిన ట్రాన్స్ఫార్మర్ల వల్ల వ్యవసాయ మోటార్లు పదే పదే కాలిపోయేవి. సరిగ్గా విద్యుత్ సరఫరా లేక.. నీరు అందక పంటలు ఎండిపోయేవి. అదే చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్ల నాణ్యత పెంచుతానంటూ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా.. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కాపీ కొట్టేసి మరీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంపుసెట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వ్యవసాయంతో పాటు మున్సిపాలిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా విద్యుత్ ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చడం ద్వారా పంపుసెట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. కొత్త సాంకేతికతతో మోటారు తయారీ.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటీరియర్ పరి్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్(ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ‘ఎనర్జీ ఎఫీషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్’ను ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ తయారు చేసింది. దీని ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) నిధులతో తొలుత కొన్ని వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికత ప్రయోగాత్మక అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చేపట్టింది. ఐపీఎంఎస్ మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయం. పవర్ ఫ్యాక్టర్ మెరుగుదలకు, మోటారు మన్నికను పెంచడానికి దోహదపడతాయి. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లు కాగా.. ఐపీఎంఎస్ మోటారు సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుంది. ఇండక్షన్ మోటారుతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. టీటీడీ, మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ ఆదా పంపుసెట్లు ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ సామర్థ్య సాంకేతికతలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల.. విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీటీడీలోని పాత పంప్సెట్ల స్థానంలో ఈ ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చుతోంది.అలాగే ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వినియోగిస్తున్న మోటార్ల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లను అమర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూనుకుంది. దీనిపై మున్సిపల్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయ మోటార్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫీడర్లను ఆధునీకరించింది. వాటి ద్వారా మోటార్లకు వెళ్లే విద్యుత్‌లో ఇంకా ఏవైనా లోపాలుంటే స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకుని వెంటనే సరిచేయడం ద్వారా పంపుసెట్ల నాణ్యత పెరుగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తుంటే.. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు మోసపూరిత హామీలతో మరోసారి రైతులను, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. -
నేడు టీ కాంగ్రెస్ మేనిఫెస్టో!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి ఈ ‘తెలంగాణ మేనిఫెస్టో’ను విడుదల చేయనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.నిజానికి గత నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. 23కుపైగా హామీలతో దానిని సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం విడుదల చేయనున్నారు.టీపీసీసీ తెలంగాణ మేనిఫెస్టోలో హామీలివే!ఐటీఐఆర్ ఏర్పాటు; ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ; బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ; హైదరాబాద్‌లో ఐఐఎం; హైదరాబాద్, విజయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం; మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు; భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం; పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా; హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం; కొత్త ఎయిర్‌పోర్టులు; రామగుండం–మణుగూరు రైల్వే లైన్; కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్లు; కేంద్రీయ విశ్వ విద్యాలయాల పెంపు; నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు; నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్ఈఆర్ ) ఏర్పాటు; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్; నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ; ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు; అధునాతన వైద్య, ఆరోగ్య పరిశోధన కేంద్రం; 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు; ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ యూనిట్; ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్); ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్; మేడారం జాతరకు జాతీయ హోదా; న్యూ డ్రైపోర్టు; హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు. -
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!