ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు | AI University, 100 Units Free Electricity In Naveen Patnaik Poll Manifesto, More Details Inside | Sakshi
Sakshi News home page

Naveen Patnaik Manifesto: ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు

Published Fri, May 10 2024 9:27 AM | Last Updated on Fri, May 10 2024 11:50 AM

AI University Free Electricity Naveen Patnaik Poll Manifesto In Odisha

భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది.  ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్‌సభకు ఏకకాలంలో  ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.

ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్‌ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మేనిఫెస్టోలో కీలక అంశాలు
వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్‌
⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ల పెంపు
⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
⇒ స్కిల్స్‌ అండ్‌ ఎంట్రాప్రీన్యూర్‌షిప్‌ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు
⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్
⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్
⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు
⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు
⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత
⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement