Naveen Patnaik
-
బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్‌ను మాజీసీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్ నవీన్ పట్నాయక్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.దీంతో సుజీత్‌కుమార్ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్ కుమార్ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కఢ్ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది. ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు. BJD expels party leader Sujeet Kumar for "anti-party activities."He resigned from Rajya Sabha and his resignation has been accepted by Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar. pic.twitter.com/asjLLxpnOw— ANI (@ANI) September 6, 2024 -
‘2028లో పసిడి సాధించాలి’
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టు 2028 లాస్ ఏంజెలెస్ విశ్వక్రీడల్లో పసిడి పతకం నెగ్గాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకాంక్షించారు. పారిస్ క్రీడల్లో కాంస్యం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన హాకీ జట్టును బుధవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించగా.. గురువారం మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలువురు ప్లేయర్లను సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరు కొనసాగిస్తూ లాస్ ఏంజెలెస్‌లో స్వర్ణం సాధించాలి’ అని ఆకాంక్షించారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా... హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయడంలో నవీన్ పట్నాయక్ పాత్ర ఎంతో ఉందని ప్లేయర్లు కొనియాడారు.ఆటగాళ్ల అవసరాలను తీర్చుతూ అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని సుమిత్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలిప్ టిర్కీ, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుమిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
నవీన్ పట్నాయక్ పొలిటికల్ ప్లాన్.. ‘షాడో కేబినెట్’ సభ్యులు వీరే..
భువనేశ్వర్: దేశంలో ఒడిశా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒడిశాలో తొలిసారి ఏర్పాటైన బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలతో ‘షాడో కేబినెట్’ను ఏర్పాటు చేశారు. దీంతో ఒడిశా రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.కాగా, ఒడిశాలో సీఎం మోహన్ మాంఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు నవీన్ పట్నాయక్ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు తాజాగా పలు శాఖలను కేటాయించారు. షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును బీజేడీ జారీ చేసింది. దీంతో, మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్, మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. ବିରୋଧୀ ଦଳ ହେଉଛି ଜନସାଧାରଣଙ୍କ ସ୍ୱାର୍ଥର ଜାଗ୍ରତ ପ୍ରହରୀ। ବିଜୁ ଜନତା ଦଳ ବିରୋଧୀ ଦଳ ଭାବେ ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ବିଭିନ୍ନ ବିଭାଗର କାର୍ଯ୍ୟ କଳାପ ଉପରେ ତୀକ୍ଷ୍ଣ ନଜର ରଖିବ। ଏଥିପାଇଁ ବିରୋଧୀ ଦଳ ନେତା ଶ୍ରୀ @Naveen_Odisha ବିଜୁ ଜନତା ଦଳର ୫୦ ଜଣ ନିର୍ବାଚିତ ସଦସ୍ୟଙ୍କୁ ନିମ୍ନ ସୂଚୀ ଅନୁଯାୟୀ ଦାୟିତ୍ୱ ପ୍ରଦାନ କରିଛନ୍ତି।… pic.twitter.com/uCnpIuxMj7— Biju Janata Dal (@bjd_odisha) July 17, 2024 ఇక, ఒడిశాలో జూలై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. వారిని ప్రశ్నలు అడగడానికి, వారి అడిగే ప్రశ్నలకు సమాధానాలను కూడా షాడో కేబినెట్ ఇస్తుంది. అయితే, నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ఈ షాడో కేబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ. కేవలం బీజేడీకి చెందిన తాత్కాలిక వ్యవస్థ వంటిది.ఇదిలా ఉండగా.. మన దేశంలో ఇలా షాడో కేబినెట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అయితే.. బ్రిటన్, కెనడా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రతిపక్ష పార్టీలకు షాడో కేబినెట్ మాదిరిగానే కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక, కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ‘ప్రతిపక్ష విమర్శకుడు’గా వ్యవహరిస్తారు. మరోవైపు.. బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. -
ఇక బీజేపీకి మద్దతిచ్చేది లేదు.. ప్రతిపక్షపాత్రే: బీజేడీ
భువనేశ్వర్: తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ సోమవారం సమావేశం నిర్వహించారు. జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో.. శక్తివంతమైన, చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలని చెప్పారు.నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశం అనంతరం రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ .. ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాత్రమే మాట్లాడరని, ఒడిశా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తే, అప్పుడు బీజేపీ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తామని చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను లేవనెత్తనున్నట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ బలహీనంగా ఉందని, బ్యాంకులకు చెందిన బ్రాంచీలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. బొగ్గు రాయాల్టీని కూడా సవరించాలన్న ఒడిశా డిమాండ్‌ను గత పదేళ్ల నుంచి కేంద్రం విస్మరించిందని, దీని వల్ల రాష్ట్ర ప్రజలకు సరైన వాటా దక్కకుండా పోతుందని మండిపడ్డారు. రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని, పార్లమెంటులో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడాలని నవీన్ పట్నాయక్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.BJD President & Leader of Opposition @Naveen_Odisha today chaired a meeting of party's Rajya Sabha MPs at Naveen Nivas MPs have been directed to vociferously raise issues affecting the State's interests in the Upper HouseBJD now has 9 Rajya Sabha members pic.twitter.com/ssuoULUqnU— Soumyajit Pattnaik (@soumyajitt) June 24, 2024కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన బిజు జనతాదళ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. మొత్తం 147 స్థానాలకు గాను బీజేపీ 78 సీట్లతో అధికారం కైవసం చేసుకోగా.. బిజు జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, స్వతంత్రులు 1, సీపీఎం 1 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. దీంతో బీజేపీకి చెందిన ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అటు లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 21 స్థానాలకు గానూ బీజేపీ 20 చోట్ల విజయ కేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ ఒక చోట గెలుపొందింది. -
దటీజ్ నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్.. దేశంలో సుదీర్ఘకాలం(24 ఏళ్లపాటు) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. రాజకీయాల్లో మృదుస్వభావిగా ఆయనకంటూ ఓ ట్యాగ్‌లైన్ ఉంది. అలాగే.. మెచ్యూర్డ్ స్టేట్స్‌మన్‌గా వాజ్‌పేయి లాంటి రాజకీయ ఉద్ధండులతో ప్రశంసలు అందుకున్నారాయన. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పటికీ.. ఒడిశాలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం నెలకొల్పుతూ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారాయన.తాజాగా ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన రాకను గమనించి.. సీఎం మోహన్ మాఝి సహా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. వాళ్లందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లబోయారు. ఆ సమయంలో కంటాబంజి ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకున్నారు. అది చూసి.. ‘‘మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని నవీన్ అన్నారు. దీంతో అక్కడున్న వాళ్లంతా చిరునవ్వులు చిందించారు.Naveen Patnaik & CM Mohan Majhi greet each other in assembly. Beautiful Video pic.twitter.com/6BL21FAZP5— Times Algebra (@TimesAlgebraIND) June 18, 2024ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి)నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేశారు. అయితే కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. Naveen Patnaik’s dignity is a touchstone in political relationships. Here’s how he greeted the party that has all but wiped him out. Yes, they weren’t the kind of political enemies we’re accustomed too, but Naveen has been nothing but an image of grace. pic.twitter.com/VzYQKJ5WnS— Shiv Aroor (@ShivAroor) June 12, 2024 ఇదే కాదు.. సీఎంగా మోహన్ మాఝి ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ హాజరై ఆశీర్వదించిన తీరు రాజకీయ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక మాట. అలాగే.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండాలో నవీన్‌ను చూసి నేర్చుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల మాట. -
ఒడిశాకు కొత్త సీఎం.. ఎవరీ మోహన్ చరణ్ మాఝీ?
భువనేశ్వర్ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది.ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్ చరణ్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.డిప్యూటీ సీఎంలుగాకేవీ సింగ్ డియో బోలంగీర్ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.తీవ్ర కసరత్తుఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను పంపింది. భువనేశ్వర్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు. -
24 ఏళ్ల తర్వాత.. ‘కౌన్ బనేగా ఒడిశా సీఎం?’
ఒడిశా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆయన అధికార నివాసం ఎక్కడా అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్ ఓటమి పాలైంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుంది. ఈ తరుణంలో కాబోయే సీఎం ఎవరు? ఆయన అధికారిక నివాసం ఎక్కడా అనే చర్చ మొదలుగా కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతల్ని బీజేపీ అధిష్టానం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. సొంత ఇంటి నుంచే బాధ్యతలుమాజీ సీఎం నవీన్ పట్నాయక్ 24ఏళ్ల పదవీ పదవీకాలంలో తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుండి పనిచేశారు. పట్నాయక్ 2000లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో కాకుండా తన సొంత ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు పావు శతాబ్ద కాలం పాటు అన్ని అధికారిక, పరిపాలనా నిర్వహణ పనులను నవీన్ నివాస్ నుంచే నిర్వహించారు. ఆ భవనాన్ని నవీన్ పట్నాయక్ తండ్రి,మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించారు. 24 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వంతాజా ఎన్నికల ఫలితాలతో కొలువుతీరునున్న బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, అధికారిక నివాసం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌తో సహా అనేక ఖాళీ క్వార్టర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. 78 స్థానాల్లో బీజేపీ విజయంఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.సీఎం రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒడిశా కొత్త సీఎం ఎవరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారితో పాటు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది.రేపు సాయంత్రమే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
రాజకీయ వారసత్వంపై నవీన్ పట్నాయక్ క్లారిటీ
బీజూ జనతా దళ్‌లో నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు? ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు.. కొనసాగింపుగా వస్తున్న విమర్శలకు నవీన్ పట్నాయక్ పుల్‌స్టాప్ పెట్టారు. తన రాజకీయ వారసత్వంపై స్పష్టత ఇచ్చారు.బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ రెండు దశాబ్ధాలకు పైగా సీఎంగా కొనసాగారు. ఇప్పటికే ఐదు సార్లు సీఎం పదవిని చేపట్టారు. తాజాగా ఎన్నికల్లో బీజేడీ గెలిచినట్లైతే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఫలితం తారుమారు కావడంతో అధికార పీఠానికి దూరమయ్యారు.ఈ తరుణంలో తన ముఖ్యమంత్రి పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత ఇవాళ తొలిసారి మీడియా ముందుకు వచ్చారాయన. ఎన్నికల ఫలితాలపై పట్నాయక్ మాట్లాడుతూ, ఇంతకాలం పార్టీ సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. ఒడిషాలో చాలా అద్భుతంగా పనిచేశాం. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటముల్ని ప్రజలే నిర్ధేశిస్తారు. సుదీర్ఘ కాలం తర్వాత మేం ఓడిపోయాం. కాబట్టి, ఈ తీర్పును గౌరవిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.వీకే పాండ్యన్‌పై విమర్శలు.. దురదృష్టకరం‘వీకే పాండియన్‌పై పలు విమర్శలున్నాయి ఇది దురదృష్టకరం. పాండ్యన్ రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, క్రీడలు, ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. బ్యూరోక్రాట్ నుంచి బీజేడీ పార్టీలో చేరారు. కానీ ఎలాంటి పదవులు ఆశించలేదు. ఇక నా వారసుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చర్చను కొనసాగించడం ఇష్టం లేదు. పాండియన్ నా వారసుడు కాదు. ఒడిశా ప్రజలే నా వారసుడు ఎవరో నిర్ణయిస్తారని చెప్పారు. పాండియన్ సేవల్ని మరువలేంఈ సందర్భంగా వీకే ప్యాండన్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి చేసిన సేవల్ని మరోసారి గుర్తు చేశారు. అధికారిగా, అతను అద్భుతంగా పని చేశారు. రాష్ట్రంలో రెండు తుఫానులు,కోవిడ్-19 కష్టకాలంలో ఆయన చేసిన సేవల్ని మరువలేం. బ్యూరోక్రాట్‌గా పదవి విరమణ చేసి బీజేడీలో చేరారు. చిత్తశుద్ది, నిజాయితీ గల వ్యక్తి. ఆయన్ని మనం గౌరవించాలి అని నొక్కి చెప్పారు. 24ఏళ్ల తర్వాత ఓటమిఒడిశాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల తర్వాత ఓటమి పాలయ్యారు. 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78, బీజేడీ51, కాంగ్రెస్ 14, మూడు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో నవీన్ పట్నాయక్ తన పదవికి దూరం అయ్యారు.వీకే పాండ్యన్ మిస్సింగ్ఒడిశా ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి వీకే పాండ్యన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాధారణంగా పట్నాయక్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉంటారనే పేరుంది. కానీ పట్నాయక్ ఒంటరిగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించడంతో వీకే పాండ్యన్ ఇక ఒడిషా రాజకీయ చిత్రం నుంచి తప్పుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
24 ఏళ్లు.. 89 రోజులు
భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన పరాజయం తర్వాత ఒడిశాలో బుధవారం ఓ శకం ముగిసింది. 24 ఏళ్ల 89 రోజులు ముఖ్యమంత్రి పాలనకు తెరపడింది. ఈ ఓటమి భారత దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ కలలను తుడిచివేయడంతో బిజూ జనతా దళ్ భవిష్యత్తును అగమ్య గోచరం చేసింది. ఆయన నేతృత్వంలో ఐదు పర్యాయాలలో బీజేడీ ప్రభుత్వం ప్రజలను ముందంజలో ఉంచి ఉన్నత రాజకీయాల శకం ఆవిష్కరణకు నాంది పలికింది. పేదల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నవీన్ పాలనలో మైలురాళ్లుగా మిగిలిపోయాయి. సగటు మనిషిని సాధికార బాటలో నడిపించే మార్గదర్శిగా ఆయన మిగిలిపోయారు. రూ.1కే కిలో బియ్యం వంటి సాధారణ సంక్షేమ పథకంతో అన్ని వర్గాల రైతాంగం సంక్షేమానికి బహుదూర దృష్టితో రైతుల కోసం కాలియా (కృషక్ సహాయం జీవనోపాధి మరియు ఆదాయ వృద్ధి) పథకం, అందరికీ ఆరోగ్యం నినాదంతో బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన (బీఎస్‌కేవై), లక్మీ బస్ సరీ్వస్, రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత స్థాయి రహదారుల నిర్మాణం వంటి కార్యకలాపాలతో మిషన్ శక్తి సంకల్పంతో మహిళల ఆర్థిక, రాజకీయ సాధికారత, రాష్ట్రంలో ఏడు మిలియన్ల మంది మహిళలను ఒక తాటిపై నడిపించేందుకు ముందంజ వేసిన మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతమైన విజయ సోపానంగా నిలిచిపోతుంది. మిత భాషి.. కార్య సాధకుడు రాజకీయాల్లో అవగాహన అనేది కీలకమని ప్రబోధించిన తత్వవేత్త. అత్యంత మిత భాషి. నిశ్చలమైన దృక్పథంతో నిర్ధారిత కాల పరిమితిలో వాస్తవ కార్యాచరణ దక్షత చాటుకున్న అరుదైన నాయకుడు. దైనందిన పాలనలో వాస్తవాలు, రోజువారీ అనుభవం ఆధారంగా ప్రజల్లో ఒకడిగా కదిలాడే వ్యక్తిగా సమయోచిత కార్యాచరణతో సత్వర ప్రయోజనాలు అక్కరకు తీసుకువచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు సుదీర్ఘ ప్రజా పాలన అందజేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పదిలపరచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా విధానాలు ప్రజల సామర్థ్యాలను పెంపొందించడానికి, వారి చట్టబద్ధమైన హక్కులతో సాధికారిత కలి్పంచే రూపకల్పన నవీన్ పట్నాయక్ పాలనలో సుస్పష్టంగా తారసపడుతుంది. ఈ దిశలో మహిళా సాధికారతకు ఆయన చేపట్టిన సంస్కరణలు వెలకట్టలేనివి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళకు కనీసం మూడింట ఒక వంతు ప్రాతినిథ్యం కలి్పంచడం అనివార్యంగా శాసించారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో 50 శాతం, భారత పార్లమెంటుకు మూడింట ఒక వంతు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించిన ఉన్నత శ్రేణి నాయకుడు నవీన్. ఈ దృక్పథం జాతీయ స్థాయిలో పలు రాజకీయ పక్షాలు, ప్రముఖ నాయకుల్ని చలింపజేసింది. అహింస నినాదం.. అహింసావాదంతో జాతికి వన్నె తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ నినాదం భారత రాజ్యాంగంలో నిర్వచనంగా చోటు చేసుకోవాలని సంకల్పించిన ఏకైక నాయకుడుగా నిలిచారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికలో అహింసను చేర్చాలని, అలా చేయడం ద్వారా దేశం మహాత్మా గాం«దీకి నిజమైన నివాళులరి్పంచినట్లు అవుతుందని పేర్కొన్నారు. విపత్తుపై విజేత.. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే కాకుండా తుపాను, వరదలు, కరువు కాటకాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, రైలు దుర్ఘటనలు వంటి మానవ కృత్యాల వైఫల్యాలతో అకస్మాతుగా తలెత్తే ఆకస్మిక విపత్తుల్ని అవలీలగా నిర్వహించి కనురెప్ప పాటులో పునరుద్ధరణ, పునరి్నర్మాణ కార్యకలాపాలతో బతుకుపై ఆశ కోల్పోయిన బాధిత వర్గానికి ఆపద్బాంధవుడుగా నిలిచారు. విపత్తు నిర్వహణలో రాష్ట్రం యునెస్కో వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు గుర్తించి ప్రశంసించడం విశేషం. శూన్య ప్రాణ హాని నినాదం విపత్తు నిర్వహణ మూలమంత్రంగా అనుబంధ యంత్రాంగం అలవరచుకోగలిగింది. గెలుపు కష్టం కాదు.. ఎన్నికలలో గెలవడం కంటే ప్రజలకు సమర్ధవంతమైన పాలన అందజేయడం అత్యంత క్లిష్టం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని సమయ స్ఫూర్తితో స్పందింప జేయడం సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. కష్టాల కన్నీళ్లుతో తడిచిన ఒడిశా ఆధునిక భారతదేశం పురోగతికి మార్గదర్శి కావాలనే ఆయన దృఢ సంకల్పం అనిర్వచనీయం. 1999 నాటి పెను తుపాను (సూపర్ సైక్లోన్) పొరుగు రాష్ట్రం దయదాక్షిణ్యాలతో మేలుకుని దాదాపు నెల రోజుల తర్వాత రాష్ట్రం వెలుగు చూసింది. ఈ చేదు అనుభవంతో చలించిన ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ నేడు విపత్తు నిర్వహణలో ప్రపంచ దిక్సూచిగా రాష్ట్రం వెలుగొందుతుంది. ప్రజలకు చేరువ.. పాలన పగ్గాలు చేపట్టేందుకు కాదు ఎన్నికలలో విజయం.. మార్పు, పరివర్తన దృక్పథంతో పాలన చేపడితే ప్రజలకు చేరువై నిజమైన ప్రజాస్వామ్య పాలకులుగా చరిత్రలో మిగిలిపోయే నాయకులు అవుతారని ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు అందుకున్న సందర్భంగా జాతికి పిలుపునిచ్చారు. ఈ కోవకు చెందిన వారిలో జాతిపిత మహాత్మా గాం«దీ, దివంగత ముఖ్యమంత్రి బిజూ పటా్నయక్ వంటి మహా నాయకుల తరహాలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రజలను ముందంజలో ఉంచి కొనసాగించే పాలన రాజకీయ యాత్రగా కాకుండా ఆధ్యాతి్మక అనుభవంగా అద్భుత సంతృప్తిని మిగుల్చుతుందని వర్ధమాన నాయకుల్ని ఉద్దేశించి ప్రబోధించిన మహానేత నవీన్ పట్నాయక్ ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ని్రష్కమించారు. -
Lok Sabha Election Results 2024: నవీన్ పట్నాయక్ రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ పరిపాలనకు తెరపడింది. 24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పటా్నయక్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రఘువర్ దాస్‌కు సమరి్పంచారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైంది. 147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. -
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్‌లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
ఒడిషా తీర్పుపైనా దేశం నజర్
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ రికార్డు అధిగమిస్తారా? పవన్ చామ్లింగ్ మైలురాయి దాటుతారా?. లోక్‌సభ ఫలితాలతో పాటు యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా బీజూ జనతా దళ్(బీజేపీ) విజయం సాధిస్తే నవీన్ చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేటతెల్లమవుతుంది. ఒకవేళ బీజేడీకు అనుకూలంగా ఫలితాలు వస్తే జూన్ 9న నవీన్ ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇది వాస్తవమైతే మరో 70 రోజుల తర్వాత నవీన్ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు అధిగమించి చరిత్ర సృష్టిస్తారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ నేత ఆయన చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వహించారు. ఆయన 1994 నుంచి 2019 మే వరకు సేవలందించారు. దీర్ఘకాలం సీఎంలుగా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రులు అయిదుగురున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్ హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా 21 సంవత్సరాలు 13 రోజులు విధులు నిర్వహించారు. 1983 నుంచి 2017 వరకు (నాలుగుసార్లు) సేవలందించారు. మిజోరం కాంగ్రెస్ నేత లాల్ థధ్వాల్ 22 ఏళ్ల 60 రోజులు (1986 నుంచి 2018) ఆ రాష్ట్రాన్ని పాలించారు. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు గెగాంగ్ అపాంగ్ 22 ఏళ్ల 250 రోజులు (1980 నుంచి 2007) అధికారంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎంగా సీపీఎంకి చెందిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు (1977 నుంచి 2000) ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. నవీన్ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించి జ్యోతిబసు రికార్డును అధిగమించారు. ఈసారి (2024 జూన్ 9న) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే పవన్ చామ్లింగ్ రికార్డును అధిగమించి చరిత్రలో నిలిచిపోతారు.బీజేడీ నేతల్లో ఆశాభావం: నవీన్ విధేయులుగా ముద్రపడిన నేతలంతా బీజేడీ అధికారంలోకి వస్తుందని, సీఎంగా నవీన్ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. నవీన్‌కు ఆదరణ తగ్గలేదని ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవిష్యత్ మంగళవారం తేలనుంది. ఎన్నికలకు సంబంధించి వివిధ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 69 స్ట్రాంగ్ రూముల్లో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్లను కట్టుదిట్టంగా భద్రపరిచారు. మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూముల చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. వాటి రక్షణ కోసం 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్) మోహరించారు. పోలీసు బృందాలు రాత్రింబవళ్లు పహరా కాస్తున్నాయి. భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. సీఏపీఎఫ్ మరియు రాష్ట్ర సాయుధ పోలీసులు (ఓఎస్ఏపీ) ఇరువర్గాలు స్ట్రాంగ్‌రూమ్‌కు బాధ్యత వహిస్తారు. ఇదే తరహాలో బరిపద, బరంపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ఉమా చరణ్ పటా్నయక్ ఇంజినీరింగ్ స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. ఫలితాల తదనంతరంపై నిఘా రాష్ట్రంలో ఫలితాల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణపై భారత ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల తదనంతర పరిస్థితుల ప్రభావంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈసీఐ మందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈనెల 6 వరకు రాష్ట్రంలో 70కి పైగా సీఏపీఎఫ్ కంపెనీలు మోహరించబడతాయి. రాష్ట్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాలకు రక్షణగా 25 కంపెనీల సీఏపీఎఫ్ కొనసాగించాలని ఈసీఐ నిర్ణయించింది. రాష్ట్రం అంతటా శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడానికి అదనంగా 70 సీఏపీఎఫ్ కంపెనీలను నియమించాలని నిర్ణయించారు. లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి జయపురం: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయపురం సబ్ డివిజన్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడ తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ సభాగృహంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం, కోట్పాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు లెక్కించేందుకు 5 టేబుల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నవరంగపూర్, కొరాపుట్ లోక్‌సభ స్థానాల్లో అంతర్భాగమైన ఈ రెండు స్థానాల్లో లోక్‌సభ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 58 మంది సిబ్బందిని, రెండు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 37 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. లెక్కింపు వివరాలు ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పటా్నయిక్, జయపురం తహసీల్దార్ డా.మనోలిస ఆచార్య, బొరిగుమ్మ బీడీవో అమృత లాల్ బెహర, కోట్పాడ్ అదనపు తహసీల్దార్ నీలాంబర పూజారి, జయపురం సబ్ డివిజన్ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి, సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి, బీజేడీ ప్రతినిధి సుభాష్ పండ, కాంగ్రెస్ ప్రతినిధి తరణి ప్రసాద్ పాణిగ్రహిలు పాల్గొన్నారు. -
ఒడిశాలొ ‘పాండియన్’ పాలిటిక్స్.. నవీన్ పట్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
భువనేశ్వర్: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్ పట్నాయక్‌కు పాండియన్ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం స్పందించారు.ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా నవీన్ పట్నాయక్.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024 ఇక.. వీకే పాండియన్ నన్ను కంట్రోల్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్ మాత్రమే నవీన్ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్ మైక్ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎవరీ వీకే పాండియన్..?తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు. 2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్ తన బ్యూరోక్రాట్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్ 27న సీఎం నవీన్ పట్నయక్ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. -
Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) ఆదర్శంగా నిలిచింది. టికెట్ల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానమిచ్చి గౌరవించింది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుంటే ఏడు చోట్ల మహిళలకు అవకాశం ఇచి్చంది. అంటే వారికి 33 శాతం సీట్లు కేటాయించింది. లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), శర్మిష్ట సేథీ (జజ్పూర్), మంజులా మండల్ (భద్రక్), రాజశ్రీ మల్లిక్ (జగత్సింగ్పూర్), పరిణీతి మిశ్రా (బార్గఢ్), కౌసల్యా హికాక (కోరాపుట్), రంజితా సాహూ (ఆస్క)కు టికెట్లిచ్చింది. అదే సమయంలో టికెట్ల కేటాయింపులో ఫిరాయింపుదారులకు కూడా పెద్ద పీట వేసి విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏడుగురు మహిళలకు బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్ టికెట్లివ్వడం గమనార్హం. ఈసారి బీజేడీ నుంచి బరిలోకి దిగిన ఏడుగురు మహిళా అభ్యర్థుల్లో బీజేపీ నుంచి వచి్చన లేఖశ్రీ సమంత్ సింగార్ కూడా ఉన్నారు. ఆమె బాలాసోర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఏడుగురు బీజేడీ మహిళా అభ్యర్థుల్లో ఇద్దరు పార్టీ ఫిరాయింపుదారులున్నారు! ఈ విడత ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎంపీలు చంద్రాణి ముర్ము (కియోంజర్), ప్రమీలా బిసోయ్ (ఆస్క)లకు నవీన్ టికెట్లివ్వలేదు. ఫిరాయింపుదారులకూ 33 శాతం ఒకరిద్దరు కాదు.. బీజేడీ ఈ విడత ఏకంగా 38 శాతం మంది ఫిరాయింపుదారులను లోక్‌సభ బరిలో దింపడం ఆశ్చర్యకరం. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇతర పారీ్టల నుంచి వచి్చచేరిన వారే! లేఖశ్రీ సమంత్ సింగార్ (బాలాసోర్), భృగు బాక్సిపాత్ర (బెర్హాంపూర్), ప్రదీప్ మాంఝి (నబరంగ్‌పూర్), సురేంద్ర సింగ్ భోయ్ (బోలంగీర్), పరిణీత మిశ్రా (బార్గఢ్), ధనర్జయ్ సిధు (కియోంఝర్), అన్షుమన్ మహంతి (కేంద్రపర), మన్మోత్ రూట్రే (భువనేశ్వర్) ఇతర పారీ్టల నుంచి వచ్చి బీజేడీ టికెట్ సంపాదించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ కౌంటర్..
బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం నవీన్ పట్నాయక్, ప్రధాని నరేంద్ర మోదీ పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం చుట్టూ చేరాయి. సీఎం ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మోదీ స్పందిస్తూ.... రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఆరోగ్యం క్షీణించడం వెనక గల కారణాలపై ఓ కమిటీ వేసి విచారణ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.తాజాగా మోదీ వ్యాఖ్యలపై సీఎం నవీన్ పట్నాయక్ కౌంటరిచ్చారు. : తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తన ఆరోగ్యంపై ప్రధాని మోదీకి అంత ఆందోళన ఉంటే.. తనకు ఫోన్ చేసి ఉండాల్సిందని పట్నాయక్ అన్నారు. గత పదేళ్లుగా తన ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు పుట్టిస్తోందని విమర్శించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నానని, ఈ విషయంలో ప్రధానికి హామీ ఇస్తున్నానని ఎద్దేవా చేశారు. తన ఆరోగ్యం బాగా లేకపోతే ఈ ఎండ వేడిమి మధ్య నేను ప్రచారం చేయలేనని అన్నారు.కాగా ఒడిశాలో బారపదాలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుడూ..సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతోన్న వ్యక్తినే ముఖ్యమంత్రి ఆరోగ్యం క్షీణించడానికి కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్ నియంత్రిస్తున్నాడంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని ఈవిధంగా స్పందించారు. -
ఒడిశా సీఎం ఆరోగ్యంపై ప్రధాని సంచలన ప్రకటన
భువనేశ్వర్: ఒడిాశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిాశా అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచి అధికారంలోకి వస్తే నవీన్‌పట్నాయక్ ఆరోగ్యంపై ఒక కమిటీ వేసి విచారణ జరుపుతామని ప్రకటించారు. బుధవారం(మే29) ఒడిషా బరిపడలో జరిగిన ఎన్నిల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘కొన్ని సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ సన్నిహితులు నన్నెప్పుడు కలిసినా ఆయన ఆరోగ్యం గురించి తప్పకుండా చర్చించేవాళ్లు. నవీన్ తనకు తాను సొంతగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేవాళ్లు. నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. సీఎం అనారోగ్యం వెనుక ఎవరున్నారని తెలుసుకోవడం ఒడిషా ప్రజల హక్కు.మేం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నవీన్‌బాబు అనారోగ్యం వెనుక ఎవరున్నారనేదానిపై కమిటీ వేసి విచారణ జరుపుతాం’అని మోదీ హామీ ఇచ్చారు. కాగా, నవీన్ పట్నాయక్ అనుయాయుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా నవీన్ పట్నాయక్ వీకే పాండియన్ చేతిలో బంధీగా మారారని ఎక్స్‌లో ఒక వీడియో పోస్టు చేయడం గమనార్హం. -
నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
భువనేశ్వర్: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. దీన్ని బట్టి పాండియన్ చేతిలో నవీన్ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. ఇంతలో నవీన్‌కు మైక్ పట్టుకున్న పాండియన్ వెంటనే నవీన్ పట్నాయక్ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha! BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024 -
జూన్ 4 తర్వాత నవీన్‌బాబు ఇంటికే: అమిత్ షా
భద్రక్: ఒడిశాలో ఈసారి బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. మంగళవారం(మే28) భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చాంద్‌బలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొని మట్లాడారు. జూన్ 4 తర్వాత నవీన్‌బాబు సీఎంగా ఉండరన్నారు . 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన కొత్త వ్యక్తి సీఎంగా రాబోతున్నారన్నారు. ప్రస్తుతం తమిళ్‌బాబు(రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్) తెర వెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువత ఉపాధి కోసం ఇక్కడే పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. -
మోదీకేనా అమిత్ షా పరోక్ష సంకేతం: చిదంబరం
ఢిల్లీ: వయసు ఎక్కువైంది కాబట్టి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రిటైర్ కావాలని అంటున్న కేంద్ర హోం మంత్రి... ప్రధాని నరేంద్ర మోడీకి పరోక్షంగా అదే సూచన చేస్తున్నారా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ప్రధాని నరేంద్ర మోదీకి వయసు విషయంలో ఓ సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఒకవేళ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే.. మోదీ పీఎం కుర్చిని అమిత్ షా లాక్కునే ఆలోచనలో ఉన్నారని ‘ఎక్స్’వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘అధిక వయసు (77 ఏళ్లు) కారణంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను అమిత్ షా రిటైర్ కావాలంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. అధిక వయసుకు సంబంధించి ముందుగానే ప్రధాని మోదీ (73 ఏళ్ల ఏడు నెలలు)కి అమిత్ షా ఒక సంకేతం ఇచ్చారా?. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అత్యంత సంతోషించే వ్యక్తి అమిత్ షా. ఎందుకు కంటే వయసు రీత్యా మోదీ కాకుండా ప్రతిపక్ష నేతగా అమిత్ షా కూర్చుంటాని తెలుస్తోంది!’’ అని చిదంబరం మండిపడ్డారు.When Mr Amit Shah said that Mr Naveen Patnaik should retire because of "advanced age" (77 years) was he throwing a hint to Mr Narendra Modi (73 years, 7 months) -- in case the BJP formed the government? It seems that Mr Amit Shah will be the happiest person if the BJP did not…— P. Chidambaram (@PChidambaram_IN) May 22, 2024 ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా సీఎం నవీన్ పట్నాయక్‌పై ధ్వజమెత్తారు. ‘‘నవీన్ పట్నాయక్ 77 ఏళ్లు ఉంటారు. అధిక వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రిటైర్ కావాలి. ఇక.. ఒడియా భాష స్పష్టంగా మాట్లాడే భూమి పుత్రుడిని ఒడిశాకు సీఎం చేస్తామని బీజేపీ వాగ్ధానం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జరిగిన ఐదు విడుతల్లోబీజేపీ 310 స్థానాల్లో గెలస్తుంది. అన్ని విడతల్లో మొత్త 400 స్థానాలను కౌవసం చేసుకుంటుంది’’ అని అమిత్ షా అన్నారు. -
‘రత్న భాండార్’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది? పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు.దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు.అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ స్వామిపై పూరీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంబిత్ పాత్ర ఆదివారం పాల్గొన్న ప్రచార ర్యాలీ అనంతం మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తూ.. విమర్శలు గుప్పించారు.సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘శ్రీ జగన్నాథ్ మహాప్రభు విశ్వానికినే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనటం భగవంతున్ని కించపర్చడమే.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ్ స్వామి కోట్లాది మంది భక్తుల విశ్వాసలను కించిపర్చినట్లే’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.BJP नेता संबित पात्रा का कहना है कि महाप्रभु भगवान श्री जगन्नाथ नरेंद्र मोदी के भक्त हैं। यह महाप्रभु का घोर अपमान है। इस बयान से करोड़ों भक्तों की आस्था को चोट पहुंची है।मोदी भक्ति में लीन संबित पात्रा को यह पाप नहीं करना चाहिए था। इस घृणित बयान के लिए खुद नरेंद्र मोदी को… pic.twitter.com/di0So3FxCz— Congress (@INCIndia) May 20, 2024 సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘అధికార మత్తులో ఉన్న బీజేపీ.. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. జగన్నాథ్ స్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథ్ స్వామి భక్తులను కించిపర్చినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహకారం నాశనం అవుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర స్పందించారు. ‘నమస్కార్ నవీన్ జీ. ఈ రోజు నరేంద్ర మోదీ రోడ్డు షోకు సంబంధించిన పలు న్యూస్ చానెల్స్‌తో మాట్లాడాను. ఎక్కడ మాట్లడినా ప్రధాని మోదీ.. శ్రీ జగన్నాథ్ స్వామికి పెద్ద భక్తుడని చెబుతా వస్తున్నా. అదేవిధంగా మోదీ.. జనన్నాథ్ స్వామికి భక్తుడు అనబోయి పొరపాటున వ్యతిరేకార్థంలో మాట్లాడాను. దీనిని పెద్ద విషయం చేయకండి. మనమంతా కొన్ని నోరుజారీ మాట్లాడుతాం’ అని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.Naveen Ji Namaskar!I gave number of bytes today to multiple media channels after the massive success of Shri Narendra Modiji’s Road Show in Puri today, everywhere I mentioned that Modi ji is an ardent “Bhakt” of Shri Jagannath Mahaprabhu ..by mistake during one of the bytes I… https://t.co/6Q1Kuj5E6O— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024 -
రాయని డైరీ.. నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం)
‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అన్నారు పాండియన్!నవ్వాన్నేను.ఇద్దరం ఎప్పటిలా మొక్కలకు నీళ్లు పెడుతూ, ఒడిశా ప్రజల ఆశలను నెరవేర్చే ఆలోచనలకు పాదులు తీసుకుంటూ గార్డెన్లో మెల్లగా నడుస్తూ ఉన్నాం. అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అక్కడున్న మొక్కలు నాకెప్పుడూ మొక్కల్లా అనిపించవు! అర్జీలను పట్టుకుని నేరుగా తమ ముఖ్యమంత్రి ఇంటికే వచ్చేసి, ఇక్కడి గార్డెన్లో నీడపట్టున వేచి ఉన్న నిరుపేదల విన్నపాలకు ప్రతిరూపాల్లా ఉంటాయి అవి.‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అని పాండియన్ అన్నప్పుడు నేను నవ్వడానికి కారణం. పాండియన్ ఆ మాటను నాతో అనడానికి ముందే ప్రతిపక్షాలకు ప్రకటించేశారు. అదీ తొలివిడత పోలింగ్ మొదలు కావటానికి వారం ముందే!ఒకే విడతలో ముగిసిపోయే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లకు, 21 లోక్ సభ సీట్లకు నాలుగు విడతల పోలింగ్ని నిర్ణయించేసింది ఎలక్షన్ కమిషన్! మే 13న తొలివిడత అయింది. రేపు మే 20న రెండో విడత పోలింగ్. మే 25, జూన్ 1 మూడు, నాలుగు విడతలు. జూన్ 4న ఫలితాలు.‘‘ఒడిశా ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జూన్ 9న మధ్యాహ్నం 11.30– 1.30 మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తారు’’ అని పాండియన్ చెయ్యెత్తి జై కొట్టినట్లుగా ప్రకటించడానికి కారణం అసలు మోదీజీనే.‘‘ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్’’ అని మోదీజీ అనకుండా ఉండి ఉంటే పాండియన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం అనే మాట అనివుండే వారే కాదు. పాండియన్ నా ఆప్తుడు. నన్నెరిగిన వాడు. నా రెండో నేను!ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పోటాపోటీ పైచేయి మాటలు ఒడిశాకు అలవాటు లేదు. మోదీజీ వచ్చాకే మొదలయ్యాయి. ఎన్నికల ముందు వరకు స్నేహితుల్లా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎందుకు ఒకరికొకరం శత్రువులం అయిపోవాలి? గెలుపు కోసమే అయితే ఆ సంగతి ప్రజలు కదా చూసుకుంటారు!మోదీజీ ఢిల్లీ నుంచి వచ్చి, ‘‘నవీన్ పట్నాయక్ దేశంలోనే పాపులర్ సీఎం అని; వికసిత్ భారత్‌కి, ఆత్మనిర్భర్ భారత్‌కి శక్తినిచ్చే రాష్ట్రం ఒడిశా’’ అని ప్రశంసించారని బీజేడీకి ఓటు వేసి, ‘‘నవీన్ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్ అని; ఒడిశాలో బీజేపీ రాబోతున్నదనీ, బీజేడీ పోబోతున్నదనీ...’’ మోదీజీ జోస్యం చెప్పారని బీజేడీకి ఓటు వేయకుండా ఉంటారా ఒడిశా ప్రజలు?!‘‘ఒడిశా నవీన్ పట్నాయక్‌కి గుడ్ బై చెప్పబోతోంది’’ అని అమిత్ షా, ‘‘ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్‌కి రెస్ట్ ఇవ్వబోతున్నారు’’ అని నడ్డా, ‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం చేస్తున్నారు!మేము వారిని ఒక్క మాటా అనటం లేదు. పాండియన్ అనిన ఆ ఒక్క మాటా వారు అనిపించుకున్నదే!‘‘గాలికి ఎగిరొచ్చి పాదుల్లో పడి ఎరువుగా మారే పండుటాకులు, ఎండు పుల్లల లాంటివి వారి మాటలు పాండియన్! అవి మనకే మేలు చేస్తాయి’’ అన్నాను గార్డెన్లో మరోవైపునకు నడుస్తూ!అవును కదా అన్నట్లు పాండియన్ నవ్వారు. గెలుపోటములన్నవి నాయకులు ఒకర్నొకరు అనుకునే మాటల్ని బట్టి మారిపోవు. ‘నాయకుడు’ అని తాము అనుకున్న వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారు. ఎన్నేళ్ల వరకైనా గెలిపిస్తూనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
భువనేశ్వర్: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్ పటా్నయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. -
Odisha Assembly Elections 2024: బీజేపీకి సవాల్
ఒడిశాలో రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలుండగా నాలుగింటికి 13న పోలింగ్ ముగిసింది. ఈ నెల 20న రెండో విడతలో ఐదు లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఐదు లోక్‌సభ స్థానాల్లో మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లే కావడం విశేషం. ఆ పారీ్టకి గట్టి మద్దతున్న ఈ స్థానాల్లో అధికార బీజేడీ నుంచి సవాలు ఎదురవుతోంది... బోలంగీర్ రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొన్న స్థానమిది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, రాజ వంశీకురాలు సంగీతా సింగ్‌దేవ్ బరిలో ఉన్నారు. బీజేడీ గత అభ్యర్థి కల్కేశ్ నారాయణ్ సింగ్‌దేవ్ స్థానంలో సురేంద్ర సింగ్ భోయ్‌ని పోటీకి దింపింది. కాంగ్రెస్ నుంచి మనోజ్ మిశ్రా పోటీలో ఉన్నారు. ఇక్కడ సంగీత నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కనకవర్ధన్ సింగ్‌దేవ్ పాటా్నగఢ్–బోలంగీర్ మహరాజు రాజ్రాజ్ సింగ్‌దేవ్ కుమారుడు. ఒడిశా బీజేపీ చీఫ్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు. కరువు బాధిత జిల్లా అయిన బోలంగీర్ నుంచి ఏటా 30 వేల మందికి పైగా ఉపాధి కోసం వలస పోతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేడీ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండు చోట్ల, బీజేపీ ఒక్క స్థానంలో గెలిచాయి.సుందర్‌గఢ్ ఒడిశాలో కీలక లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ బీజేపీదే హవా. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ జుయల్ ఓరం మళ్లీ బరిలో ఉన్నారు. 1998 నుంచి ఇక్కడ ఆయన ఐదుసార్లు గెలవడం విశేషం. 2009 ఎన్నికల్లో మాత్రం ఓరంపై కాంగ్రెస్ నేత హేమానంద బిశ్వాస్ విజయం సాధించారు. అధికార బీజేడీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు! రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నెగ్గని ఏకైక స్థానమిది. గత మూడుసార్లుగా అభ్యర్థులను మారుస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈసారి భారత హాకీ జట్టు మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీని బీజేడీ మరోసారి బరిలో దింపింది. 2014లో ఆయన 18 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈ గిరిజన ప్రాబల్య నియోజకవర్గంలో బీజేపీని ఓడించడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు, టిర్కీ ఆదరణ కలిసొచ్చి ఈసారి గట్టెక్కుతామని బీజేడీ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ దెహూరీ పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి. రెండింట బీజేడీ, కాంగ్రెస్, సీపీఎం చెరో చోట గెలిచాయి.కందమాల్ ఈ స్థానం బీజేడీ కంచుకోట. కందమాల్, బౌద్ జిల్లాలు మొత్తం దీని పరిధిలోకే వస్తాయి. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త అచ్యుతానంద సామంత బరిలో ఉన్నారు. బీజేపీ ప్రతిసారీ కొత్త అభ్యరి్థని నిలుపుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈసారి సుకాంత కుమార్ పాణిగ్రాహికి టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి అమీర్‌చంద్ నాయక్ పోటీలో ఉన్నా పోటీ బీజేపీ, బీజేడీ మధ్యే ఉంది. సామంతకు విద్యా, దాతృత్వ కార్యక్రమాలు గట్టి దన్ను. కాగా తాగు, సాగునీటి సమస్య, రోడ్ల దుస్థితి తదితర అంశాలను పాణిగ్రాహి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేశారు.బార్గఢ్ 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన ఈ స్థానంలో విజయం పారీ్టల చేతులు మారుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నేత సంయజ్ భోయ్ గెలవగా, 2014లో బీజేడీకి చెందిన డాక్టర్ ప్రవాస్ కుమార్ సింగ్ విజయం సాధించారు. 2019లో బీజేపీని విజయం వరించింది. బీజేడీ సీనియర్ నేత ప్రసన్న ఆచార్యను బీజేపీ నేత సురేశ్ పూజారి ఓడించారు. ఈసారి ఆయనకు బదులు ప్రదీప్ పురోహిత్‌కు బీజేపీ టికెటిచి్చంది. పూజారిని అసెంబ్లీ ఎన్నికల్లో మోహరించింది. బీజేడీ కూడా పరిణీత మిశ్రాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సంజయ్ భోయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేడీ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గళం వినిపించే ప్రదీప్‌కు స్థానికంగా మంచి పేరుంది. మోదీ సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.అస్కా బీజేడీకి కంచుకోట. సీఎం నవీన్ పటా్నయక్‌కు ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం. ఆయన పోటీ చేస్తున్న హింజిలి అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉంది. తండ్రి బిజూ పటా్నయక్ మరణానంతరం 1997 లోక్‌సభ ఉప ఎన్నికల్లో అస్కా నుంచే నవీన్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1998, 1999 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేశారు. ఇక్కడ ఏ అభ్యర్థినీ రెండోసారి నవీన్ కొనసాగించకపోవడం గమనార్హం. బీజేడీ నుంచి 2019లో ప్రమీలా బిసోయ్ గెలిచారు. ఈసారి ఆమెను కాదని 33 ఏళ్ల రంజితా సాహుకు బీజేడీ టికెట్ దక్కింది. ఆమె వలస కారి్మకుల కోసం ‘కొడాల యూత్ ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. సామాన్యుల్లో ఆమెకున్న గుర్తింపు చూసే సీఎం టికెటిచ్చారు. బీజేపీ నుంచి మరోసారి అనితా శుభదర్శిని పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి రామకృష్ణ పటా్నయక్ మాజీ మంత్రి. బిజూ, నవీన్ పట్నాయక్‌లకు అత్యంత సన్నిహితుడు. గంజాం జిల్లాలో ఆయనకు మంచి పేరుంది.ముగ్గురిలో ఒకరిపై కేసు ఒడిశాలో రెండో విడతలో పోలింగ్ జరిగే ఐదు లోక్‌సభ స్థానాల్లో 40 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 13 మంది కోటీశ్వరులే. సంగీతా కుమారి రూ.67.3 కోట్లతో జాబితాలో టాప్‌లో ఉన్నారు. 12 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 8 మంది తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 21 మంది గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యావంతులని ఏడీఆర్ సంస్థ ప్రకటించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రధాని మోదీకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్
భువనేశ్వర్: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు? అని మోదీ చేసిన వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ స్పందించారు.‘‘ప్రధాని మోదీ గారు.. ఒడిశా గురించి మీకు ఎంతమేరకు గుర్తుంది. ఒడియా ఒక శాస్త్రీయ భాష. దానిని మీరు మర్చిపోయారు. సంస్కృతం కోసం బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయించారు.. కానీ, ఒడియాకు కేటాయింపులు శూన్యం. నేను శాస్త్రీయ ఒడిస్సీ సంగీత గుర్తింపు కోసం ప్రతిపాదలు పంపాను.కానీ, వాటిని మీరు రెండు సార్లు తిరస్కరించారు. ఒడిశాలో అధికంగా లభించే సహజ వనరు బొగ్గు. కేంద్రం బొగ్గును ఒడిశా నుంచి తీసుకుంటోంది. కానీ, గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ రాయల్టీ పెంచలేదు. మోదీకి ఎన్నికల సమయంలో మాత్రమే ఒడిశా గుర్తుకు వస్తుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు(మోదీ) ఇచ్చిన హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ధరలు తగ్గిస్తాం. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గిస్తాం వంటి హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా ఒడిశాలోని మహానీయులను మోదీ ఎందుకు మర్చిపోయారు. వారికి భారత రత్న వంటి అవార్డులను ఎందుకు ఇవ్వలేకపోయారు. మరో పదేళ్లపాటు బీజేపీ ఒడిశా ప్రజలను మనసులకు గెల్చుకోలేదు’అని సీఎం నవీన్ పట్నాయక్ విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు...ఒడిశాలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ సీఎం నవీన్ పట్నాయక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు‘‘ ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్లో చూడకూండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా? పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు?’’ అని మండిపడ్డారు. -
నవీన్‌పట్నాయక్‌కు ప్రధాని మోదీ ఆసక్తికర సవాల్
భువనేశ్వర్: ఎవరో రాసిచ్చిన కాగితం సాయం లేకుండా ఒడిషాలో ఉన్న జిల్లాల పేర్లు వరుసగా చెప్పాలని సీఎం నవీన్‌పట్నాయక్‌కు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. ‘నవీన్‌బాబుకు నేనొక సవాల్ విసురుతున్నాను. ఆయన అన్నేళ్లు సీఎంగా పనిచేశారు కదా ఒడిషాలో జిల్లాల పేర్లు అడగండి. చూడకుండా చెప్తాడేమో తెలుస్తుంది. పేర్లు చెప్పలేని సీఎంకు మీ బాధ ఎలా తెలుస్తుంది. ఈసారి బీజేపీకి ఛాన్సివ్వండి. ఐదేళ్లలో ఒడిషాను నెంబర్‌వన్‌గా చేయకపోతే అవగండి’అని మోదీ అన్నారు. ఒడిషాలో ఉన్న 147 ఎమ్మెల్యే సీట్లకు 21 ఎంపీ సీట్లకు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
భువనేశ్వర్: ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఒడిశా అసెంబ్లీ తోపాటు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సమానంగా కళింగశ్రీ, కళింగ భూషణ్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రకటించారు.ఏఐ (AI) యూనివర్సిటీ, 100 యూనిట్ల ఉచిత విద్యుత్, కలియా పథకం వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, విస్తరించాలని పార్టీ యోచిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త బీజేడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తన మొదటి సమావేశంలోనే ఈ మేనిఫెస్టోను ఆమోదిస్తుందని నవీన్ పట్నాయక్ చెప్పారు. 5టీ గవర్నెన్స్ మోడల్ ద్వారా ఈ మ్యానిఫెస్టోను అమలు చేస్తే ఒడిశా ఆధునికత, అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.మేనిఫెస్టోలో కీలక అంశాలు⇒ వచ్చే దశాబ్దంలో ఒడిశా యువత కోసం రూ. 1 లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్⇒ వచ్చే ఐదేళ్లలో బాలబాలికలకు స్కాలర్‌షిప్‌ల పెంపు⇒ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు⇒ స్కిల్స్ అండ్ ఎంట్రాప్రీన్యూర్షిప్ యూనివర్సిటీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఏఐ యూనివర్సిటీ కోసం ప్రణాళికలు⇒ 100 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్⇒ 100 నుంచి 150 యూనిట్లు వరకు సబ్సిడీపై విద్యుత్⇒ మధ్యతరగతి కుటుంబాల కోసం బిజూ స్వాస్త్య కళ్యాణ్ యోజన, గృహ రుణాలపై వడ్డీ రాయితీ, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు⇒ మహిళలు, గిరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు వడ్డీ లేని రుణాలు⇒ స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం, పెన్షన్ పథకాల ద్వారా సాధికారత⇒ రైతులకు పంట రుణాలు, కలియా పథకం కొనసాగింపు, రైతుల అమ్మాయిల వివాహాల కోసం ఆర్థిక సహాయం. -
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్‌గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్‌ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్‌కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్‌గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్‌గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్‌ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్‌ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్‌గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్‌ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్‌ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్‌ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
జూన్ 4 బీజేడీ సర్కార్‌కు ఆఖరిరోజు: ప్రధాని మోదీ
భువనేశ్వర్: ఒడిశాలోనూ రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, జూన్‌లో జరగబోయే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను వస్తానంటూ బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బెహ్రాంపూర్ గాంజాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన నేరుగానే నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విసుర్లు విసిరారు.ఒడిషాను కాంగ్రెస్.. ఆ తర్వాత బీజూ జనతా దళ్ డెబ్బై ఏళ్లపాటు దోచుకున్నాయి. ఒడిషాలో నీరు ఉంది. సారవంతమైన భూములు ఉన్నాయి. ఖనిజ లవణాలతో కూడిన నేలలు ఉన్నాయి. తీర ప్రాంతం ఉంది. భగవంతుడు ఈ నేలకు అపారమైన సంపద ఇచ్చాడు. అయినా కూడా రాష్ట్రం పేదరికంలోనే మగ్గుతోంది. అందుకు కారణం ఏంటి?..కాంగ్రెస్, బీజేడీ నేతలు కొనసాగించిన దొపిడీనే ఇందుకు కారణం. బీజేడీలో ఉన్న చోటా నేతలకు కూడా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయంటే అర్థం ఏంటి?... ఇక్కడి కూలీపనులు చేసుకునేవాళ్లు వలసలు వెళ్లడానికి కారణాలు ఏంటి?. ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఎందుకు ఉన్నాయి?. బడికి వెళ్లని చిన్నారుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?.. ఒడిషా ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకోవడం లేదు. గర్భవతులకు కేంద్రం నెలకు రూ.6వేలు ఆసరా ఇచ్చేది. దానిని ఒడిశా ప్రభుత్వం రద్దు చేసిందంటే మీరు ఆశ్చర్యపోతారు.యూపీఏ పదేళ్ల కాలంలో కేంద్రం ఒడిషాకు ఇచ్చింది లక్ష కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, మోదీ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల ఇచ్చింది. జల జీవన్ మిషన్ కింద పది వేల కోట్లు కేటాయించింది. కానీ, ఇక్కడి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. మోదీ ప్రభుత్వం మీ కోసం ఉచితంగా బియ్యం పంపిస్తుంటే.. బీజేడీ ప్రభుత్వం మాత్రం ఆ ప్యాకెట్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటోంది.ఒడిషా ప్రజలు ఆలోచనతో బీజేపీకి ఓటేయాలి. జూన్ 4వ తేదీ బీజేపీ ప్రభుత్వానికి ఆఖరి తేదీ. ఒడిషాలో కమలం వికసించడం ఖాయం. బీజేపీ సీఎం ప్రమాస్వీకారానికి నేనుస్తాను. అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఒడిషా యూనిట్‌పై, అది రూపొందించిన మేనిఫెస్టోపై మోదీ ప్రశంసలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమికి దూరంగా బీజేడీ.. పార్లమెంట్లో మాత్రం కీలక బిల్లుల విషయంలో మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఈ దఫా ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మే 13వ తేదీన నాలుగో దశ పోలింగ్‌లో ఒడిషాలోని 21 లోక్‌సభ సీట్లతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ 147 స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
ఒడిషా: బీజేడీకి ‘ఈసీ’ బిగ్ షాక్
భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్‌ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది. ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్‌కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్‌ను సూపర్‌సీఎంగా పిలుస్తాయి. -
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
భువనేశ్వర్: ఒడిశాను అన్ని రంగాల్లో అగ్రగామికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' పక్కా ప్రణాళికతో ఉన్నారని, రాష్ట్రం నుంచి వలసలు పూర్తిగా ఆగిపోవాల్సిన అవసరం ఉందని ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతాదళ్ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని గతంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ అన్నారు. పట్నాయక్ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తారు. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి నవీన్ పట్నాయక్.. ఆరో సారి ఏమైనా విశ్రాంతి తీసుకుంటారా? వారిలో ఏమైనా అలసట కనిపించిందా? అనే ప్రశ్నకు పాండియన్ సమాధానమిస్తూ.. మంచిపని చేస్తే అలసట ఎలా వస్తుంది, ప్రతి ఎన్నికల్లోనూ అయన గొప్ప విజయం సాధిస్తారని అన్నారు.ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు, 147 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి కలిసి ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే లభించింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ సంఖ్య 117 నుంచి 112కి పడిపోయింది. ఆ సమయంలో బీజేపీ 19 నుంచి 23 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్‌కు తొమ్మిది స్థానాలు మాత్రమే రాగా, ఇతరులు రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు.పంచాయితీ, మునిసిపాలిటీ, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల ఏవీ నవీన్ పట్నాయక్ విజయాన్ని అడ్డుకోలేవు. ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ కారణంగానే ఆయన ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోరని పాండియన్ అన్నారు. ఇప్పటికే క్రీడలు, విపత్తు నిర్వహణ, పేదరిక నిర్మూలన లేదా ఆహారోత్పత్తి వంటి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే ఒడిశా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండాలని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. -
ఎన్నికల బరిలో సినీ నటి.. ఎవరో తెలుసా (ఫోటోలు)
-
సీఎం నవీన్‌కు సవాల్..!
భువనేశ్వర్: గంజాం జిల్లా హింజిలికాటు నియోజకవర్గం ఎన్నిక ఈసారి రసవత్తరంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ముఖాముఖి తలపడేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త ముఖాన్ని రంగంలోకి దింపింది. వరుసగా 6వసారి తిరిగి ఎన్నికవ్వాలని ఉరకలేస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఓడించేందుకు బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కొత్త ముఖం శిశిర్ మిశ్రాని అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన దివంగత శరత్ మిశ్రా తమ్ముడు. గంజాంలో కాషాయ పార్టీ పునాదిని బలపరిచిన వ్యక్తిగా పేరొందాడు. శిశిర్ మిశ్రా 2019 ఎన్నికల్లో హింజిలీలో బీజేపీ అభ్యర్థి అయిన న్యాయవాది పీతాంబర్ ఆచార్యకు సమన్వయకర్తగా పని చేశాడు. ప్రదీప్ అనుభవంపై ఆశలు బరంపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గా ప్రదీప్ పాణిగ్రాహి పోటీ చేస్తున్నాడు. ఇతను అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తరుపున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి, హింజిలికాట్‌లో నవీన్ పట్నాయక్ విజయంలో భాగస్వామిగా నిలిచారు. ప్రస్తుతం ప్రదీప్ పాణిగ్రాహి బీజేడీ నుంచి వైదొలగి బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనుభవం హింజిలి నుంచి బీజేపీ టిక్కెట్టుతో పోటీ చేస్తున్న శిశిర్ మిశ్రాకు బలమైన గెలుపు వనరుగా దోహదపడుతుందని ఆశిస్తున్నాడు. వ్యూహాత్మకంగా శిశిర్‌ని హింజిలి నుంచి బీజేపీ బరిలోకి దింపి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ధీటైన పోటీనిచ్చేందుకు నడుం బిగించింది. వీరివురి పోరుతో గంజాం జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా పేరొందిన హింజిలి ఎన్నిక రసవత్తరంగా ఉంటుంది. బీజేపీ బలం పెరిగింది: శిశిర్ మిశ్రా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుందని శిశిర్ మిశ్రా అన్నారు. ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేడీకి గట్టిపోటీ ఇచ్చామని తెలిపారు. తాను స్థానికుడినని తెలియజేశారు. పాఠశాల నుంచి కళాశాల విద్యను ఇక్కడే పూర్తి చేసినట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు జగన్నాథ్ మిశ్రా మనవడినని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నాయకత్వంలో సురక్షితమైన, సుసంపన్నమైన భారతదేశం దార్శనికతను సాకారం చేసేందుకు మోదీ జీ హామీ ఆధారంగా ఓట్లు పొందేందుకు ప్రచారం చేయనున్నట్లు వివరించాడు. హింజిలి నియోజకవర్గంలో క్రమంగా నవీన్ పట్నాయక్ గ్లామర్ మసకబారుతుందని ఆరోపించారు. ఆయన తొలిసారిగా 2000 సంవత్సరంలో పోటీచేసి భారీ ఆధిక్యతతో గెలిపొందారు. ఈ ఆధిక్యత 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా దిగజారిందన్నారు. ఈసారి గెలిస్తే రికార్డు 2000లో హింజిలి నుంచి 29,826 ఓట్ల తేడాతో గెలిపొందిన నవీన్ పట్నాయక్‌కు, 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యత భారీగా 76,586కి పెరిగింది. 2019 ఎన్నికల నాటికి 5 ఏళ్ల తర్వాత 60,160కి పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ అధ్యక్షుడు పశ్చిమ ఒడిశా నియోజకవర్గమైన బీజేపూర్, గంజాం జిల్లా హింజిలి రెండింటి నుంచి పోటీ చేసి గెలిపొందారు. హింజిలీని నిలబెట్టుకుని పశ్చిమ ఒడిశా బీజేపూర్ స్థానం నుంచి వైదొలిగారు. ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేడీ తిరిగి అధికారంలోకి వస్తే నవీన్ పట్నాయక్ సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించి దేశంలోనే దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు ఆవిష్కరిస్తారు. -
Odisha : ఒడిషా రాజకీయం ఎటు తిరుగుతోంది?
ఒడిశాలో ఎన్నికల స్నేహానికి బీజేపీ, బీజేడీ సిద్ధమవుతున్నాయా? పొత్తు కుదరలేదని తాజా వార్త. కాదు... కుదరవచ్చని ఊహాగానం. ఇప్పటికింకా పూర్తి స్పష్టత లేదు. దోస్తీ మాట నిజమే అయితే, ఒక ప్రశ్న ఉదయిస్తుంది! ‘‘అసలు ఈ రెండు పార్టీలూ కలవాల్సిన అవసరం ఏముంది?’’ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటుకై బీజేడీకి బీజేపీ అవసరం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి బీజేడీ అవసరం లేదు. మరి ఏ ప్రయోజనాలు ఆశించి మోదీ, పట్నాయక్‌లు స్నేహహస్తాలు చాస్తున్నారు. 2008 నాటి క్రైస్తవుల హత్యోదంతాల అనంతరం 2009లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పట్నాయక్... పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ పార్టీతో నెయ్యానికి చర్చలు జరిపారు? అడగవలసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి! గతాన్ని గుర్తు చేయటం రాజకీయ నాయ కులకు ఇష్టం ఉండదు. అది వారికి ‘‘ఒక పరదేశం’’. ఎల్.పి.హార్ట్లీ చెప్పిన విధంగా, ‘‘వారు అక్కడ పనులను భిన్నంగా చేస్తారు’’. సరిగ్గా అలానే చేసే ఉద్దేశంతో నేనివాళ ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో నవీన్ పట్నాయక్ కొత్తగా పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు వినగానే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది. వాటిని మీకు గుర్తు చేసి, మీ సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. 2008లో కొంధమాల్లో జరిగిన క్రైస్తవుల దారుణ హత్యోదంతాల అనంతరం నేను నవీన్ పట్నాయక్‌ను ఇంటర్వ్యూ చేశాను. ఆ హత్యలు దేశాన్ని కుదిపి వేయటమే కాకుండా, పట్నాయక్ ప్రతిష్ఠను పదేపదే దెబ్బతీశాయి. తేరుకోవటానికి ఆయన తలకిందులుగా తపస్సు చేయవలసి వచ్చింది. ‘‘నా దేహంలోని ప్రతి అస్థికా మతంతో సంబంధం లేనిది. ఆ అస్థికల్లో ఏవైనా దెబ్బతిని ఉంటాయని నేను అనుకోను’’ – అని, లౌకికవాదిగా తనకై తను ఆయన ఒక ఉనికిని ఇచ్చుకున్నారు. ఆరు నెలల తర్వాత, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తనకున్న తొమ్మిదేళ్ల పొత్తును విచ్ఛిన్నం చేసుకున్నారు. అప్పుడు మళ్లీ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పట్నాయక్: ‘‘బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం తప్పనిసరి అయింది. ఎందుకంటే, నా రాష్ట్రానికి వారినిక ఏమాత్రంగానైనా ఆరోగ్యకరమని నేను పరిగణించటం లేదు. కొంధమాల్ తర్వాత అది ప్రతి ఒక్కరికీ స్పష్టమై ఉంటుందని అనుకుంటున్నాను.’’ థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీతో కొనసాగలేమని మీరు చెబుతున్నారా?’’ పట్నాయక్ : ‘‘కొనసాగటం చాలా చాలా కష్టంగా మారింది.’’ థాపర్: ‘‘అంటే కొంధమాల్ ఒక విధంగా మీ పొత్తు విచ్ఛిత్తికి కారణం అయిందనేనా?’’ పట్నాయక్ : ‘‘నిజానికి, అంతే.’’ (ఈ సంభాషణ మరింతగా ముందుకు సాగింది. చెప్పాలంటే, అలా జరగాలన్న ఆసక్తి ఆయనలో కనిపించింది.) థాపర్: కొంధమాల్ ఘటనలతో పట్టణ ప్రాంత మధ్య తరగతి ప్రజలు మిమ్మల్ని నరేంద్ర మోదీతో పోల్చడం ప్రారంభించారు. కొంతమంది మిమ్మల్ని రెండవ నరేంద్ర మోదీ అని కూడా అన్నారు. అది మిమ్మల్ని కలవరపరిచిందా? నొప్పించింది కూడానా?’’ పట్నాయక్: ‘‘నన్ను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా అలా చూసుకోలేదు. నేను ఎల్లవేళలా లౌకికవాద ధోరణిలోనే ఆలోచిస్తాను. నాది పూర్తిగా లౌకికవాద నేపథ్యం. కనుక నేను దానిని నాపై వచ్చిన సరైన ఆరోపణగా ఏనాడూ పరిగణించలేదు.’’ థాపర్: ‘‘దానర్థం... నరేంద్ర మోదీతో పోల్చడం మిమ్మల్ని బాగా గాయపరచేదిగా ఉండి ఉండాలి.’’ పట్నాయక్: ‘‘నా మీద అలాంటి ఆరోపణ వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోయాను.’’ (కొంధమాల్ తర్వాత పట్నాయక్ బీజేపీని ఎలా చూశారన్నది స్పష్టం అయింది. అయితే ఆయన చెప్పాలనుకున్నది ఇంకా ఉండింది. అక్కడితో ముగించలేదు.) థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ శరీరంలోని ప్రతి అస్థికా మత రహితమైనదేనని మీరు చెప్పారు. అది నిజమేనని... మీరిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోవటమన్నది రుజువు చేస్తోందని మీరు చెప్పగలరా?’’ పట్నాయక్: ‘‘మీరేమనుకుంటున్నారు కరణ్? నేనేమిటో మీకు ఎప్పటి నుండో తెలుసు.’’ థాపర్: ‘‘అది నిజమేనని రుజువు చేస్తోందని నేను చెప్పగలను.’’ పట్నాయక్: ‘‘థ్యాంక్యూ.’’ (మరొక ప్రశ్న అడగవలసిన అవసరం ఉందని నా ప్రవృత్తి చెప్పింది. అది ఆయనపై ముష్టిఘాతాన్ని విసిరింది.) థాపర్: ‘‘ఆ పని (బీజేపీతో తెగతెంపులు) మీరు మనస్ఫూర్తిగా చేసినదే కదా?’’ పట్నాయక్: ‘‘చివరికొచ్చేటప్పటికి ఎవరి నమ్మకాలపై వారు నిలబడతారు. కాదా చెప్పండి? ఎవరి నమ్మకాలపై వారు నిలబడి తీరాలి కూడా.’’ (అయిపోయింది – స్పష్టంగా, క్లుప్తంగా, నిశ్చయంగా పట్నా యక్ తనేమిటో చెప్పేశారు. ఆయన నమ్మకాలు తమను తాము పునరుద్ఘాటించుకున్నాయి. పాత పట్నాయక్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీతో జతపడి ఉండటం అన్నదిక చరిత్రే.) థాపర్: ‘‘తను నమ్మిన సిద్ధాంతాలపై నిలబడేందుకు నవీన్ పట్నాయక్‌కు తొమ్మిదేళ్లు పట్టిందని చాలామంది అంటారు. మిమ్మల్ని బాగా ఎరిగిన వారికి మీరు లౌకికవాదులు, ఉదారవాదులు, నవీ నులు. నిజంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే, ఆ పొత్తు దీర్ఘకాలం సాగిందంటే వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నమ్మికలు ఏమిటో మీరు కనుగొనడానికి ఎందుకు మీకంత ఎక్కువ సమయం పట్టింది?’’ పట్నాయక్: ‘‘గత పన్నెండేళ్లలో బీజేపీకి అనేక లౌకికవాద పక్షాల పొత్తు ఉండటం మీరు చూసే ఉంటారు. మమతా బెనర్జీ లేదా హెగ్డే లేదా ఫరూఖ్ అబ్దుల్లా, చివరికి జార్జిఫెర్నాండెజ్, నితిశ్‌కుమార్. అనేక మిత్ర పక్షాలూ ఉండేవి. అంతేకాదు, ఒడిశాలో మన అదృష్టవశాత్తూ మొదటి ఎనిమిదేళ్లలో ఎలాంటి మతపరమైన సంఘటనలూ జరగ లేదు. కొంధమాల్ జరగనంత వరకు మొత్తంగా పరిస్థితే మారలేదు.’’ ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న మిగిలింది. పరిస్థితి ఏం మారింది? బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆ తర్వాత బాగా పని చేసిన పట్నాయక్ తిరిగి ఇప్పుడు వారి ఆలింగనం కోసం ఎందుకు వెనక్కు నడవాలని తపిస్తున్నారు? వారి అవసరం లేకుండానే ఆయన మళ్లీ గెలుస్తారు కదా!అయితే విషయం అది కాదు. ఆయన తెగతెంపులు చేసుకున్న బీజేపీ ఎల్.కె. అద్వానీ నేతృత్వం లోనిది. ఆయనిప్పుడు తిరిగి వెళ్ళాలని చూస్తున్నది నరేంద్ర మోదీ సారథ్యం లోనిది. నేను మరింతగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా? పట్నాయక్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నారో నాకెప్పటికైనా తెలుస్తుందా అని నా సందేహం. కానీ తను యూ–టర్న్ తీసుకోవటాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది. ఈలోగా మీదైన అభిప్రాయా లకు మీరు వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. బహుశా మీలోకొందరు... మీరూ నాలాగే ఊహించారని భావించే అవకాశం ఉంది. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
ఒడిశాలో ఒంటరిగానే పోటీ: బీజేపీ
భువనేశ్వర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అధికార బిజూ జనతాదళ్‌తో పొత్తు లేకుండానే.. రాష్ట్రంలో స్వతహాగా పోటీ చేయనున్నట్లు బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు రాష్ట్ర పార్టీ చీఫ్ మన్మోహన్ సమాల్ వెల్లడించారు. ‘గత 10 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక విషయాలలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానే నేడు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు ఒడిశాలో సామాన్యులకు చేరడం లేదు. దీని కారణంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రయోజనాలను పొందడం లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ నిర్ణయించింది. ‘ఒడిశాలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోరాడబోతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో నాలుగున్నర కోట్ల ఓడిశా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమైంది’ అని సమాల్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా పట్నాయక్ పార్టీతో పొత్తు బీజేపీ ప్రయోజనాలకు విరుద్ధమని ఒడిశా రాష్ట్ర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా ఒడిశాలో లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాత మిత్రులు ఒక్కటయ్యారని, 11 సంవత్సరాల తర్వాత బీజేడీ, బీజేపీ మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీ 13, బీజేపీ 8 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. 11 ఏళ్ల కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికలలో బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీచేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ బయటకు వచ్చేసింది.. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి గత పదేళ్లుగా బీజేపీ మద్దతు తెలుపుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: అరెస్టు తర్వాత 'కేజ్రీవాల్' ఫస్ట్ రియాక్షన్ ఇదే.. -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్‌కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
నాడు తండ్రి బహిష్కరణ.. నేడు కొడుక్కి ఘన స్వాగతం!
ఒడిశా రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత, 24 సంవత్సరాల క్రితం బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన బిజోయ్ మహపాత్ర కుమారుడు అరబింద మహపాత్ర అదే బీజేడీలో చేరారు. ఆయన్ను బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీలోకి స్వాగతించారు. సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో అరబింద మహాపాత్ర పార్టీలో చేరారు. అరబిందను ఆత్మీయంగా పార్టీలోకిక ఆహ్వానించిన నవీన్ పట్నాయక్.. కేంద్రంపద జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. "మేము మిమ్మల్ని బీజేడీలోకి స్వాగతిస్తున్నాము. కేంద్రపద జిల్లా కోసం కష్టపడి పని చేయండి. మీకు నా ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మీ తండ్రికి కూడా ధన్యవాదాలు" అని పట్నాయక్ అన్నారు. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్, బీజేపీ ఇటీవల విడివిడిగా సమావేశాలు నిర్వహించిన రెండు పార్టీల సీనియర్ నేతలతో పొత్తు ఖరారు చేసుకునే దశలో ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 1980 నుంచి 2000 మధ్య కాలంలో పట్కురా నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్‌కు నమ్మకస్తుడిగా పేరుగాంచారు. 1997 ఏప్రిల్ 17న బిజూ పట్నాయక్ మరణించిన తర్వాత బీజేడీ ఏర్పాటులో, బిజూ చిన్న కుమారుడు నవీన్ పట్నాయక్ నాయకత్వం వహించడంలో బిజోయ్ కీలకపాత్ర పోషించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా ఆయన నాయకత్వం వహించారు. అయితే ఆ తర్వాత నవీన్ పట్నాయక్ చాలా నిర్ణయాలను బిజోయ్ వ్యతిరేకించారు. ఇదే బీజేడీ నుంచి నిష్క్రమించడానికి కారణమని చాలా మంది నమ్ముతారు. తరువాత 2001లో బిజోయ్ ఒడిషా గణ పరిషత్‌ను స్థాపించారు. అది తరువాత ఎన్సీపీలో విలీనమైంది. ఆ తర్వాత బిజోయ్ మహపాత్ర బీజేపీలో చేరారు. ఒడిశాలో 21 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీకి అత్యధిక సీట్లు వచ్చాయి. బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి. -
బీజేపీ-బీజేడీ: 15ఏళ్ల తర్వాత సరికొత్త పాలిటిక్స్!
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు పలు పార్టీలు ఆసక్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయేలోకి బీజేడీ(బిజూ జనతా దళ్ పార్టీ) చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ, బీజేడీ మధ్య సంప్రదింపులు కూడా జరగడం విశేషం. కాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ.. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందా?.. దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీయేతో చేతులు కలపబోతోందా? అంటే నిజమేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్డీయేలో చేరిక, బీజేపీతో పొత్తుపై తాజాగా సీఎం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం ‘నవీన్ నివాస్’ బీజేడీ నేతల విస్తృతమైన సమావేశం జరిగింది. ►ఇక, ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్‌తో పాటు కీలక నేతలు ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, బీజేడీతో పొత్తు అవకాశాలపై చర్చించారు. ►మరోవైపు.. బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా పొత్తుపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే, తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒడిషా ప్రజల ప్రయోజనం కోసమేనని చెప్పుకొచ్చారు. ►ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ జుయల్ ఓరం మాట్లాడుతూ.. బీజేడీతో పొత్తుపై ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. ఫైనల్ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని అన్నారు. అంతకుముందు ఇలా.. గతంలో 1998లో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా 1998, 1999, 2004లో లోక్‌సభ ఎన్నికలు, 2000, 2004 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీలు సత్తా చాటాయి. కాగా, అనూహ్యంగా 2009లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో బీజేడీకి తక్కువ స్థానాలు ఇవ్వడంతో కూటమి విడిపోయింది. ఇక, తాజాగా మరోసారి దాదాపు 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. -
బీజేడీకి షాక్.. రాజీనామా చేసిన సీనియర్ ఎమ్మెల్యే
భువనేశ్వర్: పార్లమెంట్ ఎన్నికలు, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజూ జనతా దళ్(బీజేడీ) నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి శనివారం అధికార బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. అయిన బీజేపీ చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అరబింద ధాలి కోరాధా జిల్లాలోని జయదేవ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ధాలి తన రాజీనామా పత్రాన్ని బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్‌కు ఇ-మెయిల్ ద్వారా పంపారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. ధాలి మొదటిసారి 1992లో బీజేపీ టికెట్‌పై మల్కాక్గిరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రెండు పర్యాయాలు ఆ స్థానంలోనే ధాలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ధాలి బీజేడీలో చేరారు. 2009లో ఆయన జయదేవ్ నియోజకవర్గంలో విజయం సాధించారు. గత 2019లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేడీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవీన్ పట్నాయక్ కేబినెట్లో ధాలి.. ట్రాన్స్‌పోర్టు మంత్రిగా పనిచేశారు. గత నెల.. బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్ ప్రతిపక్ష బీజేపీలో చేరారు. మాజీ రాష్ట్ర మంత్రి దేబాసిస్ నాయక్ సైతం ఇటీవల బీజేడీ నుంచి పార్టీ మారారు. ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు బీజేడీకి తలనొప్పిగా మారింది. -
అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎం ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదారణ(పాపులారిటీ) కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు ఓ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో పేర్కొంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రజాదరణలో ఐదో స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్: 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయన్ సర్వే నివేదికలో మొదటి స్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం 52.7 శాతం ప్రజాదరణతో టాప్‌లో ఉన్నారు. బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్ అయిన నవీన్ పట్నాయక్.. దేశంలో ఎక్కువ కాలం సీఎం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు. యోగి అదిత్యనాథ్: 2017 నుంచి అధికారంలో ఉన్న ఉత్తప్రదేశ్ 21వ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వేలో అత్యంత ప్రజాదారణ పొందిన సీఎంలలో రెండో స్థానంతో నిలిచారు. యోగి 51.3 శాతం పాపులారిటిని కలిగి ఉన్నారు. సుమారు ఆయన ఏడేళ్లగా సీఎం సేవలు అందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కవ కాలం సీఎంగా ఉన్న పేరు యోగికి ఉండటం విశేషం. హిమంత బిశ్వ శర్వ : అస్సాం(అసోం) సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజాదరణ పొందిన మూడో సీఎంగా నిలిచారు. 48. 6 శాతం ప్రజాదారణ కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత.. 2015తో బీజేపీలో చేరారు. 2021 నుంచి ఆయన అస్సాంకు 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భూపేంద్ర పటేల్: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రజాదారణలో నాలుగో స్థానంలో నిలిచారు. 42. 6 శాతం పజాదారణను భూపేంద్ర పటేల్ కలిగి ఉండటం గమనార్హం. సెప్టెంబర్, 2021 నుంచి భూపేంద్ర పటేల్ సీఎం కొనసాగుతున్నారు. గుజరాత్ 17 వ సీఎం భూపేంద్ర పటేల్. మాణిక్ సాహా: ఈశాన్య రాష్ట్రమైన మాణిక్ సాహా అత్యంత ప్రజాదాన విషయంలో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. 41.4 శాతం ప్రజాదారణను మాణిక్ షా కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మాణిక్ షా... 2016లో బీజేపీలో చేరారు. మే, 2022లో మాణిక్ షా.. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. -
నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం.. ప్రత్యేకతలివే!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాల నడుమ ఒడిశాలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. దీనిని శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ (ఎస్ఎస్పీ) లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును బుధవారం (జనవరి 17) ప్రారంభించనున్నారు. కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఒడిశాలోని పూరీ ప్రాంతాన్ని వివిధ రకాలపూలు, రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ‘మహాయాగం’ మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ నిర్వహించే ‘పూర్ణాహుతి’తో ముగుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని దర్శనం కోసం భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు. హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 80 ప్లటూన్ల పోలీసు బలగాలను (ఒక ప్లాటూన్‌లో 30 మంది పోలీసులు) మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. దాదాపు 100 మంది సూపర్వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద రూ. 800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి (బయటి గోడ) చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. ఇది 12వ శతాబ్దపు ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడుతుంది. పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. పూరీలో శ్రీ జగన్నాథ్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభం రోజున అంటే జనవరి 17న ప్రభుత్వ సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ ప్రాజెక్ట్‌లో పార్కింగ్ స్థలం, శ్రీ సేతు, పుణ్యక్షేత్రం, జగన్నాథ ఆలయ యాత్రికుల రాకపోకలకు కొత్త రహదారి, టాయిలెట్లు, క్లాక్ రూమ్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా గల 90 ప్రముఖ ఆలయాల ప్రతినిధులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం ఆహ్వానించింది. -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీకి.. కేబినెట్ హోదా
భువనేశ్వర్: ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేటు సెక్రటరీగా పనిచేస్తున్న వీకే పాండియాన్ ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. సీఎం పట్నాయక్‌కు సన్నిహితుడిగా పాండియన్ పేరు తెచ్చుకున్నారు. అయితే అధికార పార్టీ ప్రయోజనాల కోసం తన ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో ఇటీవల తరుచూ వివాదాల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన పాండియన్.. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి 190 సమావేశాలు నిర్వహించారు. దీంతో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేడీ పార్టీలో చేరి రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందని విమర్శలు గుప్పించాయి పాండియన్ రాజీనామా కాంగ్రెస్‌కే మేలు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా పాండియన్ స్వచ్ఛంద విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పని ఇంతకముందే చేయాల్సి ఉండేదని, ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేక తిరిగి సొంత రాష్ట్రానికి వస్తారో తెలియదని.. అయితే బీజేడీలో చేరితే మాత్రం ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఎంతో సహాయం చేసిన వారవుతారని అన్నారు. రాజకీయాల కోసమే రాజీనామా తన రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టేందుకే పాండియన్ రాజీనామా చేసినట్లు బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాఝీ మండిపడ్డారు. ఇప్పుడు తాను బ్యూరోక్రాట్ ముసుగుతో కాకుండా బహిరంగంగా రాజకీయాలు చేయగలడని, ఒడిశా ప్రజలు అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని తెలిపారు. కాగా తమిళనాడుకు చెందిన పాండియన్ ఒడిశా కేడర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ కొరుతూ పాండియన్ ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాయగా.. సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ర్యాంకు హోదా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒకరోజు తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌కు ఒడిశా ప్రభుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంఇ 5టీ(ట్రాన్స్ఫౄర్మేషనల్ ఇనిషియేటివ్), ‘నబిన్ ఒడిశా’ పథకానికి చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిష్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది పకల్పించినట్లుద సమాచారం. దీంతో పాండియన్ నేరుగా ముఖ్యమంత్రి కింద పని చేయనున్నారు. -
గత ఎన్నికల్లో పార్టీ ఓటమి.. అక్కడి నుంచే పోటీలోకి బిహార్ సీఎం
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూరీ నుంచి పోటీ చేస్తారని పలు వర్గాల నుంచి ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలపై పలు వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పూరీ శాసనసభ స్థానం బీజేడీ చేజార్చుకుంది. ఈ వ్యవధిలో ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని బలపరచుకుంది. ఈ పరిస్థితుల్లో బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి సత్తా చాటుకోవాలనే సవాళ్లు తలెత్తాయి. ఈ చర్చ రాజకీయ శిబిరాల్లో వాడివేడిగా సాగుతోంది. పూరీ నుంచి నవీన్ రంగంలోకి దిగితే బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ పోటీ శాసనసభ ఎన్నికల ఘట్టాన్ని రక్తి కట్టిస్తుంది. ఆయనదే తుది నిర్ణయం ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేడీ అధ్యక్షుడిగా నవీన్ పట్నాయక్‌దే తుది నిర్ణయం. అయితే చిట్ట చివరి క్షణం వరకు కీలక నిర్ణయాలను బయటకు పొక్కనీయకుండా ఆయన అత్యంత జాగ్రత్త ప్రదర్శిస్తారు. ఈసారి ముందస్తుగా ఆయన వార్తల్లోకి ఎక్కడం విశేషం. సాధారణంగా బహిరంగ చర్చలు, వ్యాఖ్యలు వగైరా వ్యవహారాల్లో నవీన్ ప్రస్తావన శూన్యం. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెసలుతున్న 5టీ కార్యదర్శి వి.కె.పాండియన్ విహంగ పర్యటనల దుమారంతో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యక్షంగా హాజరై సభలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటూ హుందాతనానికి మారుపేరుగా సుపరిచిత నవీన్ పట్నాయక్ ఇలా సభలో వివరణ ఇవ్వడం ప్రముఖుల దృష్టిని ఆకట్టుకుంది. వ్యూహాత్మక శైలి ముందస్తు ఎన్నికలపై చెలరేగిన దుమారం మీద పెదవి కదపని ముఖ్యమంత్రి పలు ప్రజాకర్షిత పథకాలను శరవేగంగా ప్రవేశపెట్టి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశలో పలు పథకాలను చకచకా ప్రవేశ పెడుతున్నారు. మిషన్ శక్తి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు–2024 మిషన్ విజయ బాటలో దూసుకుపోవడం తథ్యమనే సంకేతాలు బలపడుతున్నాయి. పూరీ ప్రాంతంలో ఇటీవల బీజేడీ వ్యతిరేక పవనాలు బలం పుంజుకుంటున్నాయి. ఈ పరిస్థితి విపత్తుగా పరిణమించక ముందే జాగ్రత్త వహించే దిశలో నవీన్ పట్నాయక్ అభ్యర్థిత్వాన్ని తెరపైకి తేవడం రాజకీయ వ్యూహంగా స్పష్టం అవుతుంది. పూరీ శ్రీజగన్నాథ మందిరం ప్రాకార ప్రాజెక్టు మొదలుకొని పలు పథకాలు, ప్రాజెక్టుల కార్యాచరణ తీవ్ర కలకలం రేపాయి. ఈ వివాదాలు నేటికీ చాప కింద నీరులా మరుగున పొంచి ఉన్నాయి. పూరీ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రికి పలు వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. ప్రజారణతో శ్రీజగన్నాథుని ఆశీస్సులు తమ నాయకునికి అండగా నిలిపి ప్రతిష్టాత్మకంగా గెలిపిస్తాయని బీజేడీ శిబిరాల్లో చర్చ నడుస్తోంది. పూరీ నుంచి పోటీ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చితే సొంత పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బలమైన మద్దతుతో భారీ ఆధిక్యతతో గెలిపిస్తారని శ్రీజగన్నాథుని సీనియర్ సేవాయత్ రామకృష్ణ దాస్ మహాపాత్రో ఇటీవల ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ ప్రకటన నవీన్ పట్నాయక్ పూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తథ్యం అనే సంకేతాలు పంపిస్తోంది. విజయం తథ్యం ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం తథ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశి భూషణ్ బెహరా శుక్రవారం అన్నారు. నవీన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజల్లో మక్కువ బలపడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేసినా ప్రజలు విజయ కిరీటంతో పట్టం గడతారని పేర్కొన్నారు. రాష్ట్ర బహుముఖ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు విశేష గుర్తింపు సాధించాయన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన విశేష ప్రజాదరణ చూరగొంది. నవీన్ సుదీర్ఘ సుస్థిర పాలన ప్రజల్లో చెక్కు చెదరని నమ్మకానికి పీఠం వేసింది. ఏటా ఆయన ప్రజాదరణ బలపడుతునే ఉందని బీజేడీ వర్గాలు ధీమా వ్యక్తం చేయడం విశేషం. -
ఒడిశా కులగణన రిపోర్టు..!
భువనేశ్వర్: కులగణన అంశంలో బిహార్ దారిలో ఒడిశా కూడా ముందడుగు వేస్తోంది. ఒడిశాలో ఇప్పటికే ఓబీసీ జాబితాను నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ జాబితాను ఎప్పుడు విడుదల చేయాలా..? అని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓబీసీ సెన్సెస్ రిపోర్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వెల్లడించారు. వెనకబడిన ఐదు ముస్లిం వర్గాలపై సర్వే చేయనున్నట్లు అసోం ఇప్పటికే ప్రకటించింది. సోషియో-ఎకానమిక్ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా వారి అభివృద్ధికి పాటుపడనున్నట్లు స్పష్టం చేసింది. బిహార్‌లో కులగణన రిపోర్టును సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. జనాభాలో దాదాపు 63 శాతం మంది ఓబీసీ, ఈబీసీ జాబితాకి చెందినవారేనని ఆ రిపోర్టు స్పష్టం చేసింది. బిహార్‌లో మొత్తం 13.07 కోట్ల మంది ఉంటే.. అందులో దాదాపు 36 శాతం ఈబీసీ(అతి ఎక్కువ వెనకబడిన తరగతి)కి చెందినవారేనని రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ వివేక్ సింగ్ తెలిపారు. మిగిలినవారిలో 27.13 అత్యధికంగా ఓబీసీలు ఉన్నారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్ -
నవీన్ సోదరి గీతా మెహతా కన్నుమూత
భువనేశ్వర్/కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా (80) శనివారం రాత్రి న్యూఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం విషయం బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ పూజలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎటువంటి సూచనలు లేకపోయినప్పటికీ పార్టీ నాయకులు పరోక్ష సంతాప సూచకంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి నవీన్ ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న దృశ్యాలు ప్రజలు టీవీల్లో వీక్షించారు. గాంధీ కుటుంబంతో స్నేహం.. దివంగత ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్‌కు ఇద్దరు కుమారులు ప్రేమ్ పట్నాయక్, నవీన్ పట్నాయక్, ఒక కుమార్తె గీతా ఉన్నారు. వీరందరి బాల్యం లండన్‌లో జరిగింది. ప్రేమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా, గతంలోనే మృతిచెందారు. గీతా అంతర్జాతీయ కవయిత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. బిజూ సంతానినికి బాల్యంలో గాంధీ కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉండేవి. చివరి చూపు కోసం.. నవీన్ న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతూ అక్క చివరి చూపు కోసం ఢిల్లీ వచ్చానని ప్రకటించారు. కాగా, నవీన్ ఉండగా ఏనాడూ అతని కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు నవీనే ఢిల్లీ వెళ్లి అక్కని చూసేవారు. గీత మృతిలో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గీతా మెహతా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా రచయిత్రిగా, లఘు చిత్ర నిర్మాతగా, జర్నలిస్ట్‌గా పేరొందారు. ప్రఖ్యాత అమెరికన్ పబ్లిషర్ దివంగత సోనీ మెహతాను 1965లో గీతా మెహతా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో బిజు, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు 1943లో జన్మించిన ఆమె తన విద్యను భారత్‌తో పాటు యూకే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 2019లో భర్త సోనీ మెహతా మరణించినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ► కర్మ కోలా, స్నేక్ అండ్ ల్యాడర్స్, ఎ రివర్ సూత్ర, రాజ్ అండ్ ది ఎటర్నల్ గణేషా అనే మూడు పుస్తకాలను రచించారు. ► తన రచనలలో భారత చరిత్ర, సంస్కృతి, మతాన్ని చిత్రీకరించారు. ఈమె రచనలు 13 భాషల్లోకి అనువాదమయ్యాయి. 27 దేశాలలో ప్రచురితమయ్యాయి. యూకే, యూరోపియన్ దేశాలు , యునైటెడ్ స్టేట్స్ కోసం 14 బుల్లి తెర లఘు చిత్రాలను మెహతా నిర్మించి దర్శకత్వం వహించారు. ► 1970లలో నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ టెలివిజన్ నెట్‌వర్క్‌కు గీత యుద్ధ ప్రతినిధిగా పని చేశారు. యూఎస్ టీవీ నెట్వర్క్ ఎన్బీసీ కోసం గీతా మెహతా బంగ్లాదేశ్ యుద్ధాన్ని కవర్ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంపై డేట్లైన్ బంగ్లాదేశ్ పేరుతో శక్తివంతమైన డాక్యుమెంటరీని రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ డాక్యుమెంటరీలో పాకిస్తాన్ సైనికులు చేసిన మారణహోమం, కొత్త దేశం ఆవిర్భావానికి దారితీసిన విముక్తి యుద్ధాన్ని చిత్రీకరించారు. ప్రముఖుల సంతాపం.. గీతా మెహతా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతా మెహతా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆమె మరణం అత్యంత బాధాకరమన్నారు. గీతా మెహతా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
జ్యోతి బసు రికార్డును తిరగరాసిన నవీన్
భువనేశ్వర్: దేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో, చామ్లింగ్ తర్వాతి స్థానంలోకి చేరారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా అయిదు పర్యాయాలు సీఎంగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మళ్లీ విజయం సాధించి, సీఎంగా పగ్గాలు చేపట్టిన పక్షంలో నవీన్ పటా్నయక్ దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నేతగా నిలుస్తారు. -
దీర్ఘకాలం సీఎంగా కొనసాగిన జాబితాలో నవీన్ పట్నాయక్ రికార్డు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రముఖుల జాబితాలో చేరనున్నారు. జాతీయ స్థాయిలో రెండో దీర్ఘకాలిక సీఎంగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. నవీన్ ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఇదో సుస్థిర మైలురాయిగా నిలుస్తుందని బిజూ జనతాదళ్ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతి బసు తరువాత దీర్ఘకాలం ఈ పదవిలో కొనసాగిన రికార్డు ఆక్రయించనున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఒడిశా పరివర్తన ప్రధాన కార్యాచరణ ఆయనకు ఈ రికార్డు సాధకులుగా చరిత్రలో నిలుపుతుంది. జ్యోతి బసు సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు నిరవధికంగా పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 166 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ స్థానం సాధించడం విశేషం. ఆయన వరుసగా 5సార్లు సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఈనెల 22తో ముఖ్యమంత్రి పాలన సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకుంటుంది. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఇదే కాల పరిమితిలో గతంలో దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొలిపారు. తాజా రికార్డుతో నవీన్ ఆయన సరసన చోటు దిక్కించుకుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ఎదిగేందుకు స్వల్ప దూరంలో ఉన్నారు. 2000, 2004, 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రాష్ట్ర శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. ఆయన అకుంఠిత కార్యదక్షత ముఖ్యమంత్రి హోదాని సొంతం చేసింది. ఎత్తుకు ప్రత్యర్థులు చిత్తు.. మహిళ, రైతు సాధికారిత ఇతరేతర రంగాల్లో సంస్కరణలు రాష్ట్రానికి సరికొత్త రూపురేఖలు అద్దాయి. సేవాభావం, సామాజిక శ్రేయస్సు పట్ల అంకితభావం ప్రజా ప్రాతినిధ్యానికి ప్రామాణికంగా రుజువు చేసిన దాఖలాలు కోకొల్లలు. గంజాం జిల్లా అసికా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మహిళా స్వయం సహాయక సంఘం సాధికార మహిళ ప్రమీల బిసొయిని ఎంపీగా గెలిపించుకున్న తీరు.. బిజూ జనతాదళ్ అధ్యక్షుడుగా నవీన్ పట్నాయక్ సాధించిన అపురూప విజయం. ప్రత్యర్థుల్లో ధీటైన సభ్యులను సమయోచితంగా ఆకట్టుకుని, పార్టీని బలోపేతం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఖంగు తినిపించడంలో ఆయన ధీరత్వానికి ప్రతీక. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కంచుకోటలుగా నిలిచిన పలు నియోజక వర్గాలను బీజేడీ ఖాతాలో చేర్చుకున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఒడిశా సమగ్రంగా కై వసం చేసుకునే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. గంజాం జిల్లా హింజిలికాట్ నవీనపట్నాయక్కు కలిసి వచ్చిన నియోజకవర్గంగా మిగిలింది. దీనితో పాటు పాలనలో విపత్కర పరిస్థితులను అవలీలగా అధిగమించి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల విశేష గుర్తింపుతో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచారు. రాష్ట్రంలో ఆకలి చావులకు తెరదించిన దిశలో ఆయన కృషి అనన్యమని చెప్పవచ్చు. ప్రజలకు పారదర్శక పాలన ఇంటి ముంగిటకు చేర్చడంలో సాధించిన విజయం అత్యద్భుతం. ప్రభుత్వ సేవలు ప్రజలకు నిర్థారిత కాల పరిమితిలో కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన 5టీ కార్యాచరణ రాష్ట్ర పరివర్తనలో సరికొత్త మలుపు తిప్పింది. అవినీతి రహిత పాలన కార్యాచరణ సులభతరం చేసిన సాటిలేని ముఖ్యమంత్రిగా పేరొందారు. సమాచారం, రవాణా, బాహ్య ప్రపంచంతో రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం.. జాతీయ, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక విస్తరణతో రాష్ట్ర పురోగతిలో వేగం పుంజుకుంది. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అక్కరకు వచ్చే రీతిలో ప్రవేశ పెట్టిన పథకాలు, కార్యక్రమాలు జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలిచాయి. -
బాలేశ్వర్ హాస్పిటల్ ను సందర్శించిన నవీన్ పట్నాయక్
-
సభాపతి ఎవరు.. అనుభవం కలిగిన నేత కోసం వెతుకులాట
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం శాసనసభ తదుపరి స్పీకర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రఫుల్ల సామల్, దేవీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి, బద్రి నారాయణ్ పాత్రొ స్పీకర్ ముందున్నారు. మహిళా అభ్యర్థి స్నేహాంగిని చురియా పేరు కూడా ప్రచారంలో ఉంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతి చోటా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అదృష్టం కలిసి రావచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో అస్కా లోక్‌సభ ఎన్నికలో మహిళా కార్డు బీజేడీకి దిగ్విజయం కల్పించింది. ఈ నియోజకవర్గం మహిళా స్వయం సహాయక బృందం అధినేత ప్రమీలా బిసోయ్తో చేసిన ప్రయోగం పార్టీకి విశేష గుర్తింపు సాధించింది. అయితే ధామ్‌నగర్ ఉప ఎన్నికలో ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మహిళా సాధికారత మంత్రం నిరంతరం ఫలప్రదం కావడం కష్టతరమని ఈ ఎన్నిక రుజువు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆచితూచి అడుగు వేయకుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం పుంజుకోవడం బలహీన పడుతుందని బీజేడీ శిబిరంలో జోరుగా చర్చ సాగుతోంది. నవీన్ నిర్ణయంపైనే.. మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో స్పీకర్ విక్రమ్‌కేశరి ఆరూఖ్తో రాజినామా చేయించారు. ఈ స్థానం భర్తీ తదుపరి ఎన్నికలకు లాభసాటిగా ఉండేలా అభ్యర్థి ఎంపిక పట్ల బీజేడీ అధిష్టానం పదునైన ప్రక్రియతో కసరత్తు చేస్తోంది. స్పీకర్ ఆశావహుల్లో ప్రఫుల్ల సామల్, దేబీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి తగిన అనుభవం అలాగే శాసన విధానాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రతినిధులుగా పేరొందారు. వీరిలో ఒకరికి ప్రతిష్టాత్మక సభాపతి పదవిని కట్టబెట్టే యోచన శిబిరంలో గింగుర్లు కొడుతోంది. అయితే మహిళా మంత్రంతో ఈ నిర్ణయం ఊగిసలాడుతోంది. అయితే ప్రయోగాలు చేయడానికి సమయం కాదని, అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థత కలిగిన అభ్యర్థిని మాత్రమే స్పీకర్‌గా నియమించాలని సీఎం నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం. -
స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కొలువులో కొద్దిపాటి మార్పులు చేపట్టారు. ముగ్గురు కొత్త మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించారు. ఖాళీ పదవుల్లో వారికి సర్దుబాటు చేయడం విశేషం. స్థానిక లోక్‌సేవా భవన్లో సోమవారం ఉదయం జరిగిన మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్తగా చేరిన సభ్యులు బిక్రమ్‌కేశరి అరుఖా, శారదాప్రసాద్ నాయక్, సుదామ్ మరండిలతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. విక్రమ్ అరూఖ్ 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్, గ్రామీణాభివృద్ధి, న్యాయ, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, శాసనసభ వ్యవహారాలు, సమాచారం–ప్రజా సంబంధాలు, సహకారం ప్రభుత్వరంగ సంస్థలు తదితర శాఖల్లో మంత్రిగా కీలకమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. నవీన్ కొలువులో మరో మాజీమంత్రి సుధామ్ మరాండీకి పాఠశాలలు, సామూహిక విద్యాశాఖను కేటాయించారు. గతవారం విద్యాశాఖ మాజీమంత్రి సమీర్‌రంజన్ దాస్ పదవికి రాజీనామా చేయడంతో ఈ మంత్రిత్వ శాఖ ఖాళీ అయ్యింది. నిరంజన పూజారికి ఆరోగ్యశాఖ.. మరాండి గతంలో క్రీడలు–యువజన వ్యవహారా లు, షెడ్యూల్డ్ తెగలు–కులాల అభివృద్ధి(గిరిజన సంక్షేమం), రెవెన్యూ, విపత్తు నిర్వహణ సహాయమంత్రిగా పని చేశారు. ఈదఫా మరాండీని కేబినెట్ హోదాకు ప్రమోషన్ కల్పించారు. అదే విధంగా శ్రీకాంత సాహు గతవారం రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కార్మిక శాఖను శారదాప్రసాద్ నాయక్‌కు కేటాయించారు. నాయక్ 2009 నుంచి 2012 వరకు రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గృహనిర్మాణం, నగర అభివృద్ధి, అబ్కారీ శా ఖ సహాయ మంత్రిగా పని చేశారు. నవీన్ కేబినెట్లో సీనియర్ మంత్రి, మాజీ స్పీకర్ విక్రమ్ కేశరీ అరూఖ్ కు ఆర్థికశాఖ కేటాయించారు. ఈ ఏడాది జనవరి 29న ఝార్సుగుడలో నవకిషోర్ దాస్ హత్యతో ఖాళీ అయిన ఆరోగ్యశాఖను ప్రస్తుత ఆర్థికమంత్రి నిరంజన్ పూజారికి ఇన్చార్జిగా స్థిరపరిచారు. స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా.. గంజాం ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆది నుంచి బీజేడీకి కంచుకోటగా ఈ ప్రాంతం చలామణి అవుతోంది. ఈ పరపతి ఏమాత్రం సడలి పోకుండా శంఖం దళం అధ్యక్షుడిగా సీఎం నవీన్ సకాలంలో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లా నుంచి విక్రమకేశరి అరూఖ్ బలమైన నాయకుడిగా అధ్యక్షుడి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కట్టబెట్టడంతో సొంత జిల్లా, నియోజకవర్గ పురోగతి అనుబంధ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సమయం అనుకూలించని పరిస్థితులు తలెత్తాయి. దీని దృష్ట్యా ఆయనకు స్పీకర్ పదవి బరువు బాధ్యతలను తొలగించి, మంత్రి పదవితో జిల్లాలో పట్టు సాధించేందుకు సువిశాల అవకాశం కల్పించడం పునర్వ్యవస్థీకరణ వ్యూహంగా స్పష్టం అవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో గంజాం జిల్లాలోని 13 స్థానాల్లో 12 స్థానాలను కై వసం చేసుకుంది. ఈ పట్టును రానున్న ఎన్నికల్లో ఏమాత్రం చేజార్చుకోకుండా జాగ్రత్త వహించడంలో విక్రమ అరూఖ్ తగిన అభ్యర్థిగా భావించి కొలువులో చోటు కల్పించారు. ఆయన రాజకీయ శైలితో జిల్లాలో బీజేడీ కంచుకోట పట్టు యథాతధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బలోపేతమే లక్ష్యంగా.. సుందరగడ్, మయూర్భంజ్ జిల్లాల్లో బిజూ జనతాదళ్ గత ఎన్నికల్లో నిరాశజనకమైన ఫలితాలతో సరిబెట్టుకుంది. మయూర్భంజ్ లోని 9 స్థానాల్లో బీజేడీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సుందరగడ్ 7 స్థానాల్లో నామమాత్రంగా 2 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ గిరిజన ప్రభావిత జిల్లాలు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేడీ నిరవధిక కృషికి ఫలితంగా 2022లో జరిగిన జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో రానున్న ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు ఇద్దరు అనుభవజ్ఞులకు మంత్రి పదవులతో పట్టం గట్టింది. ఈ జిల్లాల నుంచి మంత్రి పదవులు పొందిన సుధాం మరాండి, శారదాప్రసాద్ నాయక్‌కు రానున్న ఎన్నికలు కత్తిమీద సాములాంటి సవాల్‌గా మారాయి. ఈ సందర్భంలో పార్టీ బలం పటిష్ట పరచడం ఇరువురి లక్ష్యంగా కార్యాచరణ కొనసాగించాల్సి ఉంటుంది. నవీన్ చతురత.. భువనేశ్వర్: మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రానున్న ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ను బలోపేతం చేయడం సంకల్పంగా స్పష్టం అవుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలం పుంజుకునేలా చేయడంతో గట్టి ప్రభావం ఉన్న ప్రాంతంలో పట్టు సడలిపోకుండా అత్యంత జాగరూకత ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని గంజాం, సుందర్‌గడ్, మయూర్భంజ్ జిల్లాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులకు పదవులు కట్టబెట్టారు. గంజాం నుంచి విక్రమకేశరి అరూఖ్, మయూర్భంజ్ నుంచి సుధాం మరాండి, సుందరగడ్ నుంచి శారదాప్రసాద్ నాయక్‌కు మంత్రి పదవులు వరించాయి. గంజాం జిల్లాలో బీజేడీ కోటను మరింత బలోపేతం చేసేందుకు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సరైన రీతిలో రాణించని సుందర్‌గడ్, మయూర్భంజ్ జిల్లాలలో బీజేడీ బలాన్ని పెంచడానికి అనుభవజ్ఞులను ఎంపిక చేసి, మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవులతో సొంత జిల్లాల్లో పురోగతి దిశలో కృషి చేసేందుకు మార్గం సుగమం అవుతుందనే దృక్పథంతో కేబినెట్ విస్తరణ పురస్కరించుకుని నవీన్ పట్నాయక్ ఆచితూచి మార్పుచేర్పులు చేపట్టడం విశేషం. -
అప్పుల్లేని ముఖ్యమంత్రి.. టాప్ 1లో నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆయన మంత్రి మండలి సభ్యుల ఆస్తుల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్ అందరి కంటే అధిక ధనవంతుడిగా స్పష్టమవుతోంది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపాస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నవీన్ ఆస్తులు స్వల్పంగా వృద్ధి చెందగా, రుణ భారం లేకపోవడం విశేషం. మంత్రి మండలిలో అత్యంత అల్ప ఆస్తిపరుడిగా గనులు – ఉక్కు శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడ ఆయన అందరి కంటే తక్కువ ఆస్తిపరుడుగా నిలిచారు. నవీన్ మంత్రి మండలిలో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2022లో ముఖ్యమంత్రి ఆస్తుల వృద్ధి విలువ రూ.42,86,069 పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఆయన ఆస్తుల విలువ రూ.65,40,79,694 కాగా, అంతకుముందు సంవత్సరం ఆస్తుల విలువ రూ.64.97 కోట్లకు పరిమితమైంది. అధికారిక పోర్టల్‌లోని ప్రకటన ప్రకారం, వివిధ బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో డిపాజిట్లు మరియు వివిధ బాండ్ల పరంగా నవీన్ పొదుపు (నగదు) ఆస్తుల విలువ రూ.42,86,069లు పెరిగింది. ముఖ్యమంత్రి చరాస్తుల విలువ రూ.12.52 కోట్లు. వీటిలో న్యూఢిల్లీ, భువనేశ్వర్, హింజిలికట్, బర్గడ్ బ్యాంకు ఖాతాల్లో నగదు, నగలు, నాలుగు చక్రాల వాహనం ఇమిడి ఉన్నాయి. బంగారు ఆభరణాల విలువ రూ. 3.49 లక్షలు కాగా, 1980 మోడల్‌కు చెందిన పాత అంబాసిడర్ కారు విలువ రూ.6,434గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి న్యూఢిల్లీలోని జన్‌పథ్ శాఖ బ్యాంకులో రూ.70.11 లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భువనేశ్వర్ శాఖలో రూ.20.87 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రూ.52.88 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇవన్నీ అతని తల్లిదండ్రులు బిజు పట్నాయక్ మరియు జ్ఞాన్ పట్నాయక్ నుంచి సంక్రమించినవిగా పేర్కొన్నారు. ఈ స్థిరాస్తుల్లో భువనేశ్వర్‌లో నవీన్ నివాస్‌లో మూడింట రెండు వంతుల వాటా విలువ సుమారుగా రూ.9,52,46,190 కాగా, న్యూఢిల్లీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్–3లో ఉన్న ఆస్తిలో 50% వాటా విలువ దాదాపు రూ.43,36,18,000గా ప్రకటించారు. -
మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ..? దీపాలి దాస్‌కు బెర్తు పక్కా!
భువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ ఆదివారం భువనేశ్వర్‌కు తిరిగి రానున్నారు. దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్‌కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ విక్రమ కేశరి అరూఖ్ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్ రంజన్ దాస్, శ్రీకాంత్ సాహు ఉన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విక్రమ్ కేశరి అరుఖ్‌కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. బిక్కుబిక్కుమంటున్న మంత్రులు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ త్వర లో మంత్రిమండలి పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. కేబినెట్ సభ్యుల పనితీరు సమీక్ష పట్ల ఆయ న గురిపెట్టారు. సమీక్ష నివేదిక ఆధారంగా కొందరి తొలగింపు, మరికొందరికి పదవులు కట్టబెట్టే అవకాశాల పట్ల చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల స్పీక ర్ విక్రమ కేశరిఅరూఖ్, మంత్రులు సమీర్ రంజనదాస్, శ్రీకాంతసాహు తమ పదవులకు రాజినామా చేశారు. ఈ ఏడాది జనవరి 27న ఆరోగ్య–కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ హత్య తరువాత మరోస్థానం ఖాళీ అయ్యింది. ఈ లెక్కన నవీన్ కేబినెట్లో(స్పీకర్ పదవి మినహాయించుకుని) 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేయడంతో పనితీరు సమీక్ష ఆధారంగా తొలగింపులు, శాఖల మార్పు, చేర్పులతో కొత్త ముఖాలకు స్థానం కల్పించే దిశలో చర్చ రసవత్తరంగా సాగుతోంది. ఇద్దరు రాత్రులు రాజీనామా చేయడంతో ఆ పదవుల బాధ్య తలను రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగంమంత్రి ప్రమీల మల్లిక్‌కు అదనంగా కేటాయించా రు. స్పీకర్ అరూఖ్ కూడా రాజీనామా చేయగా.. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపారు. మరోవైపు శ్రీకాంత సాహు, సమీర్ రంజనదాస్ బీజేడీ సంస్థాగత వ్యవహారాల్లో నిమగ్నమయ్యేందుకు రాజీనా మా చేసినట్లు పేర్కొన్నారు. వీరివురూ వివాదాలలో చిక్కుకున్నందున లోపాయికారంగా నిష్క్రమించేలా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గవర్నర్ రాక కోసం.. మంత్రిమండలి మార్పు చేర్పుల పట్ల ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ రాష్ట్రంలో అందుబాటులో లేరు. ఆయన ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు. మరోవైపు ఈ నెల లో మంత్రుల పనితీరు సమీక్ష కొలిక్కి రానుంది. ఈ నెల 22న గవర్నర్ తిరిగి రానున్నట్లు సమాచారం. ఆ సమయానికి మంత్రుల పని తీరు సమీక్ష ప్రక్రియ ఖరారైన మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది. అంతా ఆయన నిర్ణయమే.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరుకున్నప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. శాఖల పంపిణీపై ఆయన నిర్ణయం తీసుకుంటారని రెవె న్యూ విపత్తు నిర్వహణ శాఖామంత్రి ప్రమీలా మల్లిక్ విలేకర్లకు సోమవారం తెలిపారు. దీపాలి దాస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మంత్రిమండలిలో మహిళా ప్రాతినిధ్యం బలపరిచే అవకాశం ఉందన్నారు. త్వరలో జరగనున్న పునర్వ్యవస్థీకరణలో సరికొత్త ముఖం ఝార్సుగుడ నియోజకవర్గ ఎమ్మెల్యే దీపాలీ దాస్, కవిసూర్యనగర్ ఎమ్మెల్యే లతిక ప్రధాన్‌కు పదవులు వరించే అవకాశాల పట్ల సంకేతాలు జారీ చేశారు. శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని పార్టీ అధిష్టానం దీర్ఘకాలంగా యోచిస్తోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వాగ్దానానికి పట్టంగట్టారు. పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో విముఖతపై కేంద్రప్రభుత్వం ఆది నుంచి వెనుకడుగు వేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళల ఆదరణ అపురూపం.. 2001లో మహిళల ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల్ని మిషన్శక్తి కార్యక్రమం కింద ఒక తాటిపైకి తీసుకుని వచ్చిన సీఎం నవీన్.. వరుసగా ఘన విజయాలు సాధిస్తున్నారు. మహిళల ఏకీకృతం సూత్రంతో బీజేడీ దేదీప్యంగా వెలుగొందుతుంది. నవీన్ పట్నాయక్ విజయంలో రాష్ట్ర మహిళల ఓట్లు వాటా అధికం కావడమేనని ఈ సందర్భంగా ప్రమీ లా మల్లిక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం విడుదలైన ఝార్సుగుడ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడై, పార్టీ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించడంతో మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ వైపు ముఖ్యమంత్రి దృష్టి మల్లించారు. స్పీకర్ రాజీనామాతో ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించడం పట్ల ఊహాగానాలకు ఆజ్యం పోసింది. బిక్కుబిక్కుమంటున్న మంత్రులు.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని సిట్టింగ్ మంత్రులు బిక్కుబిక్కుమంటున్నారు. గత ఏడాది జూన్‌లో చేపట్టిన మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ సందర్భంగా మొత్తం 20మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అనంతరం భారీ మార్పు చేర్పులతో పునర్వ్యవస్థీకరించారు. ఆ సమయంలో వివాదాల్లో చిక్కుకున్న వారిని మంత్రి మండలి నుంచి తొలగించారు. ఈ జాబితాలో కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా, డాక్టరు అరుణ్‌కుమార్ సాహు, ప్రతాప్ జెనాలను మంత్రివర్గం నుండి తొలగింపు వేటుకు గురయ్యారు. ఈసారి ఎవరి పట్ల ఎటువంటి చర్యలు ఉంటాయోననే భయంతో మంత్రి మండలిలో సర్వత్రా భయాందోళనలు విస్తరించి ఉన్నాయి. -
ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ ప్రమాణ స్వీకారం
భువనేశ్వర్: ఝార్సుగుడ ఎమ్మెల్యేగా దీపాలీ దాస్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ఆమె తల్లి, సోదరుడు, మంత్రులు ప్రమీలా మల్లిక్, రీతా సాహు తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఘన విజయంతో ఓటర్లు కట్టబెట్టిన గురుతర బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మార్గదర్శకంలో ఝార్సుగుడ నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో దీపాలీ దాస్ మీప ప్రత్యర్థి, బీజేపీ నాయకుడు టొంకొధొరొ త్రిపాఠిపై 48,721 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారానికి ముందు సోదరుడు విశాల్ దాస్ ఆదివారం నవీన్ నివాస్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ విజయం ఝార్సగుడ ఉప ఎన్నికలో చారిత్రాత్మక విజయమని సీఎం అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి నాయకత్వం వహించాలని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంకితభావంతో పని చేయాలని ఆమెకు సూచించారు. ఇదిలా ఉండగా.. దీపాలి దాస్ సుమారు ఏడాది కంటే తక్కువ కాలమే ఈ పదవిలో ఉంటారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉండటమే ప్రధాన కారణం. తిరుగులేని బీజేడీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 5వ విడత పాలనలో 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా 7 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బిజూ జనతాదళ్ విజయ శంఖారావం చేయగా.. మరో స్థానంలో భారతీయ జనతా పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పత్తా లేకుండా పతనమైంది. 2000 తర్వాత ఈ విడతలో రాష్ట్రంలో అత్యధిక ఉప ఎన్నికలు జరగడం విశేషం. -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోటీ: బీజేడీ
భువనేశ్వర్: ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని, ఏ కూటమిలోనూ తాము భాగస్వామి కాదని ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, దీనిపై తమ అధినేత నవీన్ పట్నాయక్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలియజేశారు. అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తున్నామని వివరించారు. ఒడిశా రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని వెల్లడించారు. నవీన్ పట్నాయక్ మిత్రుడైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదిస్తున్న థర్డ్ ఫ్రంట్‌కు దూరంగా ఉంటామని అన్నారు. నవీన్ పట్నాయక్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్‌లో తమ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. నవీన్ పట్నాయక్ అంతకుముందు నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. -
‘థర్డ్ ఫ్రంట్‌కి ఛాన్సే లేదు.. మాది ఒంటరి పోరు’
ఢిల్లీ: బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విపక్షాలకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికలకు విపక్షాలతో తన పార్టీ చేతులు కలపబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్.. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పూరిలో ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి తాను ప్రధానిని కలిశానని, అందుకు ప్రధాని కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారనే విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. అయితే.. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేడీ విపక్షాలతో కలవదు. మా పార్టీ ఎప్పుడూ ప్రణాళిక బద్దంగానే ముందుకు సాగుతుంది అని తెలిపారు. అలాగే.. తన ఢిల్లీ పర్యటనలో ఏ రాజకీయ పార్టీతోనూ భేటీ కాబోనని వెల్లడించారాయన. తనకు తెలిసినంత వరకు థర్డ్ ఫ్రంట్ అవకాశమే లేదని పేర్కొన్నారాయన. #WATCH | Delhi: There is no possibility of a Third front as far as I am concerned: Odisha CM Naveen Patnaik after his meeting with PM Narendra Modi pic.twitter.com/dRr1fxsiYm — ANI (@ANI) May 11, 2023 ఇదిలా ఉంటే.. రెండు రోజుల కిందట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పట్నాయక్‌తో భేటీ అయ్యారు. దీంతో పొత్తులపై భేటీ అనే ప్రచారం జరగ్గా.. పట్నాయక్ దానిని ఖండించారు. తదనంతరం ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ఒడిషా సీఎం.. పలు పార్టీల నేతలతో భేటీ అవుతారనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆ అంచనాలను పటాపంచల్ చేస్తూ అసలు విపక్షాలతో చేతులు కలపబోనని, థర్డ్ ఫ్రంట్‌కు ఆస్కారం ఉండబోదంటూ నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు మూడో కూటమి కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్ విపరీతమైన ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాల నేతలను కలుస్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ కావడం, మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. ఇలా వరుసగా నేతల భేటీ నేపథ్యంలో విపక్షాల ఆధ్వర్యంలో మూడో కూటమికి ఆస్కారం ఉందన్న చర్చ తెర మీదకు వచ్చింది. -
సీఎం నవీన్‌తో నితీష్ కుమార్ భేటీ
భువనేశ్వర్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝాతో కలిసి రాష్ట్రానికి విచ్చేశారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నితీష్‌కుమార్ నేరుగా నవీన్ నివాస్‌కు చేరుకున్నారు. ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా సుదీర్ఘ చర్చ సాగింది. భేటీ అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు. నితీష్ జీ భువనేశ్వర్ వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మేము పాత స్నేహితులం. అనేక విషయాలను చర్చించామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. బీహార్ నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు బస చేయడానికి పూరీలో ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణపు స్థలాన్ని బీహార్ ప్రభుత్వానికి గెస్ట్ హౌస్ కోసం ఉచితంగా మంజూరు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని నవీన పట్నాయక్ ఉద్ఘాటించారు. అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తన పాత స్నేహితుడిని కలవడానికి వచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందన్నారు. మహా ప్రతిపక్ష కూటమి లక్ష్యంగా..? బీజేపీకి వ్యతిరేకంగా మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు, ప్రతిపక్ష నేతలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంది. ఎన్డీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. అయితే బీజేపీ మరియు కాంగ్రెస్ వర్గాలతో బీజేడీ సమాన దూరాన్ని కొనసాగిస్తోంది. తృతీయ కూటమి ఏర్పాటు నేపథ్యంలో బీజేడీ ఆది నుంచి ఇదే వైఖరి ప్రదర్శించి, 2019 సంవత్సరం నుంచి వరుసగా ఏర్పాటైన అన్ని సమావేశాల్లో దాటవేత వైఖరితో తప్పించుకుని చలామణి అవుతోంది. తృతీయ కూటమి ఆవిర్భావంలో నవీన్ విభిన్నమైన నానుడితో దాటవేస్తున్నారు. లోగడ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెసు నుంచి సమాన దూరంలో ఉంటున్నందున తృతీయ కూటమిపై ఆసక్తి లేనట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల బీజేపీ, బీజేడీ మధ్య వైరిభావాలు దాదాపు తారాస్థాయికి చేరాయి. అయినప్పటికీ ఆయన వైఖరి ఆంతర్యం బయట పడనీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. స్థలం కేటాయింపునకే చర్చలా..! తృతీయ కూటమి వారధులుగా చలామణి అవుతున్న నితీష్ కుమార్, మమత బెనర్జీలు ఇటీవల సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసిన సందర్భంగా పూరీ శ్రీజగన్నాథుని క్షేత్రంలో పశ్చిమ బెంగాలు, బీహారు ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు బస చేసేందుకు ప్రత్యేక భవనాల కోసం స్థలం కేటాయింపు కోసం చర్చలు పరిమితం అయినట్లు ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నెలలో మమతా బెనర్జీ, తాజాగా నితీష్ కుమార్ పర్యటన పురస్కరించుకొని ఆయా రాష్ట్రాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ప్రకటించడంతో చర్చలు ముగిసినట్లు ప్రకటించడం విశేషం. ఈ వైఖరితో ఇరుగు, పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాలు, బీహారు రాష్ట్రాలతో మైత్రి బంధం బలపడుతుందని నవీన్ పట్నాయక్ అంటున్నారు. కానీ రానున్న ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. -
భారత హాకీకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
భువనేశ్వర్: భారత సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల హాకీ జట్లకు మరో పదేళ్లపాటు (2033 వరకు) స్పాన్సర్ షిప్ చేస్తామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి ఒడిశా జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2018, 2023లలో పురుషుల ప్రపంచకప్ టోర్నీలకు ఒడిశా ఆతిథ్యమిచ్చింది. -
మన్యం థెరిసా
‘ఆమె చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి’ అని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల ట్విటర్లో కామెంట్ చేశారు. 75 ఏళ్ల రూపాలి జకాకాను రాయగడ జిల్లాలోని మన్యంప్రాంతంలో మన్యం థెరిసాగా పిలుచుకుంటారు. దానికి కారణం గవర్నమెంట్‌తో ఏ పని జరగాలన్నా ఈమె సాయం చేయాల్సిందే. మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను. – జకాకా మన్యంలోని సాహి అనే గ్రామంలో చీకటి పడి భోజనాలు అయ్యాక ఒక్కొక్కరుగా రూపా లి జకాకా ఇంటికి చేరుకుంటారు. అక్కడ సభ తీరి తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఆమె అన్నీ వింటుంది. ఎవరికి ఏ సాయం కావాలో, ఏ పథకం ద్వారా సాయం అందించాలో జ్ఞాపకం పెట్టుకుంటుంది. తెల్లవారి లేచి ఇంట్లో పనులు ముగించుకుని ఊర్లో ఉన్న స్కూల్ దగ్గరకు వెళుతుంది. అక్కడి హెడ్మాస్టర్కు ఆమె ఏ పని మీద వచ్చిందో తెలుసు. ఒక్కొక్కరి పేరు ఆమె చెబుతుంటే వారి పేరుతో అప్లికేషన్లు రాసి సహాయం చేస్తాడు. ఆమె వాటిని అధికారులకు చేరవేయడానికి బయలుదేరుతుంది. దాదాపుగా ఇది ఆమె దినచర్య.ఒరిస్సా రాయగడ జిల్లాలోని హలువా పంచాయతీలో సాహితో సహా 18 గ్రామాలు ఉన్నాయి. అన్నీ ఆదివాసీ గ్రామాలే. పెద్ద వాళ్లంతా దాదాపుగా నిరక్షరాస్యులే. వారందరి సమస్యలు తీర్చే స్వచ్ఛంద కార్యకర్త రూపా లి జకాకా. భర్త మరణంతో రూపా లి జకాకాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె భర్త అంతర్ జకాకాకు జబ్బు చేసింది. హలువాలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చేతనైన వైద్యం చేశారుగాని అది సరిపోలేదు. ఇంతకు మించి వైద్యం చేయాలంటే రాయగడ వెళ్లాలి. ఉచిత వైద్యం పొందాలి. అది ఎలాగో చెప్పమని వారినీ వీరినీ బతిమాలింది. ఎవరూ సాయం చేయలేదు. భర్త మరణించాడు. కూతురితో జకాకా మిగిలింది. ‘మన బతుకులు ఇంతేనమ్మా. దిక్కులేని బతుకులు. వీరి కోసం ఏదైనా చేయి నువ్వు’ అని ముసలి తండ్రి అన్నాడు. ఆ మాటలు జకాకా మీద పని చేశాయి. అప్పటికి ఆమె వంట చెరకు సేకరించి అమ్మి బతుకుతోంది. ఇల్లు కూడా సరిగా లేదు. అయినా సరే తన బాగు చూసుకోక అందరి కోసం పని చేయడం మొదలుపెట్టింది. గత 40 ఏళ్లుగా చేస్తూనే ఉంది. ప్రభుత్వం ప్రజల కోసం, ఆదివాసీల కోసం ఏమేం పథకాలు నిర్వహిస్తోందో కనుక్కుని అవన్నీ అందేలా సాయం చేస్తోంది జకాకా. ‘మేము అడవిలో ఉంటాము గనుక అధికారులు వచ్చేవారు కాదు. నేనే రాయగడకు తిరిగి వారిని రప్పించేలా చేశాను’ అంటుంది జకాకా. పథకాలు అందాలంటే డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ చాలా ముఖ్యమని ఆమె తెలుసుకుంది. అందుకే తన పంచాయతీలో చావు, పుట్టుక జరిగితే సర్టిఫికెట్లు తీసుకోమని వెంట పడుతుంది. అవి వచ్చేలా చూసి వారి కుటుంబ సభ్యులకు వాటిని అందిస్తుంది. 5000 మందికి సాయం ఇంత వయసు వచ్చినా జకాకాలో చరుకుదనం పోలేదు. ఎంత దూరమైనా నడుస్తుంది. కంటి చూపుకు ఢోకా లేదు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊళ్లోనో చుట్టుపక్కల పల్లెల్లోనో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి ఆమె 5000 మందికి సాయం అందించినట్టు అధికారులే లెక్క తేల్చడం కాదు... ఇటీవల రాయగడకు పిలిచి సన్మానం కూడా చేశారు. ఒరిస్సా ముఖ్యమంత్రి ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్ చేసి ‘ప్రజల కోసం ఉద్దేశించిన పథకాలు అట్టడుగు స్థాయికి చేరాలంటే ఇటువంటి వారు చేసే కృషి స్ఫూర్తి కావాలి’ అన్నారు. జకాకా ఇప్పుడు తన కూతురు, మనవరాలు, మనవడితో కలిసి జీవిస్తోంది. పంట పొలాల్లో పని ఉంటే చేస్తోంది. అధికారులు ఆమెకు 20 కేజీల బియ్యం, 500 రూపా యల నగదు ప్రతి నెలా అందేలా శాంక్షన్ చేశారు. ఇప్పటికీ ఆమె ఇల్లు అంతంత మాత్రంగానే ఉంది. అయినా సరే తన కోసం కాకుండా ఊరి జనాల కోసం ఆమె తిరుగుతూనే ఉంటుంది. సాటి వారికి సాయం చేయడంలో సంతృప్తే ఆమెకు సంజీవనిలా పని చేస్తున్నట్టుంది. -
ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ సాగు.. రైతులకు ఊహించని లాభాలు
స్ట్రాబెర్రీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఎర్రని రంగుతో అత్యంత ఆకర్షవంతంగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒక్కసారి తింటే ఆ ఫల మాధుర్యం మనల్ని మరిచిపోనివ్వదు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన ఈ పంట ప్రస్తుతం మన రాష్ట్రంలో విస్తరిస్తోంది. కొరాపుట్ జిల్లాలోని కొటియా ప్రాంతంలో పంట సాగు కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారుల సాయంతో రైతులు అధిక దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భువనేశ్వర్: కొరాపుట్ జిల్లాలోని కొటియా ప్రాంతం స్ట్రాబెర్రీ సాగులో దూసుకుపోతోంది. ఇక్కడ పండించే స్ట్రాబెర్రీ రుచి అద్భుతంగా ఉందని సీఎం నవీన్ పట్నాయక్ కొనియాడడం విశేషం. వాస్తవానికి దక్షిణ, నైరుతి ఒడిశా జిల్లాల కొండ చరియ ప్రాంతాలు స్ట్రాబెర్రీ సాగుకు అనుకూల ప్రాంతాలు. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉన్న కొరాపుట్, నువాపడా జిల్లాల్లో స్ట్రాబెర్రీ పండించవచ్చు. దీంతో వాణిజ్యపరంగా ఇక్కడ పంటను అభివృద్ధి చేసేందుకు అధికారులు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. 5 ఎకరాల్లో ప్రారంభం కొరాపుట్ జిల్లాలోని ఐటీడీఏ, వ్యవసాయ శాఖ అధికారులు స్ట్రాబెర్రీ పండించడంలో రైతులకు శిక్షణ అందించి ప్రోత్సహించారు. తొలుత 5 ఎకరాల పొలంలో ఈ సాగు ప్రారంభించారు. పూణే నుంచి 55,000 స్ట్రాబెర్రీ మొక్కలు తెప్పించారు. 3 స్వయం సహాయక బృందాలు, 45 రైతు కుటుంబాలకు స్ట్రాబెర్రీ సాగు శిక్షణ కలి్పంచారు. 50 రోజుల స్వల్ప వ్యవధిలో సాగు ఫలితాలు కనిపించడంతో సాగుపై అసక్తి పెరిగింది. ఊహాతీత ఫలితాలు కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం కొటియాలో స్ట్రాబెర్రీ ప్రయోగాత్మక సాగు ఊహాతీత ఫలితాలు సాధించింది. వ్యవసాయం, రైతు సాధికారత విభాగం జిల్లా యంత్రాంగం క్రియాశీల సహకారంతో 20 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, రైతు సాధికారత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ అరబింద కుమార్ పాఢీ ఇటీవల కొటియా పర్యటన పురస్కరించుకొని స్టాబెర్రీ సాగు రైతులతో సమావేశమయ్యారు. స్ట్రాబెర్రీ సాగుకు పూర్తిస్థాయిలో సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. సాగు విస్తరణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైతులు నారు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్ట్రాబెర్రీ సాగు ఒకసారి విజయవంతమైతే ఇతర పండ్ల సాగు కంటే చాలా లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్యాకెట్ ధర రూ.100 ప్రస్తుతం ఇక్కడ స్ట్రాబెర్రీ పంట లాభసాటిగా మారింది. ఒక చిన్న ప్యాకెట్ అమ్మకంతో రూ.100 వరకు లాభం వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏడాదే టర్నోవర్ రూ.4.60 లక్షలకు తాకడం విశేషం. గత సీజన్లో కొరాపుట్ జిల్లా డోలియాంబ, జానిగూడ, గాలిగదూర్, ఫతుసినేరి గ్రామాల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగుకు సంకలి్పంచినా 20 ఎకరాల్లో మాత్రమే సాగుకు అనుకూలించింది. ఈ విస్తీర్ణంలో 6 లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా ప్రోగ్రామ్ కో–ఆర్డినేషన్ వర్గాలు తెలిపాయి. రుచి అద్భుతం: సీఎం నవీన్ పట్నాయక్ కొరాపుట్ జిల్లా కొటియా ప్రాంతంలో పండించిన స్ట్రాబెర్రీ పండ్లను సీఎం నవీన్ పటా్నయక్ రుచి చూశారు. రుచి అద్భుతంగా ఉందని కొనియాడారు. కొటియాలో స్ట్రాబెర్రీ పండించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్ట్రాబెర్రీ సాగుతో మన రైతులు తియ్యదనానికి కొత్త ఒరవడి దిద్దారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతాంగానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు ఇటువంటి వినూత్న మార్గాల్లో సాధికారత కలి్పంచిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని కొనియాడారు. -
వరల్డ్‌కప్ గెలిస్తే ఒక్కొక్కరికి రూ. 1 కోటి..!
భువనేశ్వర్: భారత హాకీ జట్టుకు ఇప్పటికే ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిషా ప్రభుత్వం ఆటగాళ్లను ఉత్సాహపరిచే మరో ప్రకటన చేసింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే ఒక్కో ఆటగాడికి రూ. 1 కోటి చొప్పున కానుకగా అందజేస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 13నుంచి 29 వరకు ఒడిషాలోని రెండు నగరాల్లో హాకీ ప్రపంచకప్ జరుగుతుంది. గురువారం రూర్కెలాలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లోనే అతి పెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాన్ని పట్నాయక్ ప్రారంభించారు. దీంతో పాటు భువనేశ్వర్ (కళింగ స్టేడియం) కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ‘ఒడిషా రే’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన అనంతరం భారత ఆటగాళ్లతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. తమ రాష్ట్రానికి హాకీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న పట్నాయక్...ఆటగాళ్లకు ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. -
వైజాగ్ టెక్ సమ్మిట్ 2023: పల్సస్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో రోడ్ షో
పల్సస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16,17 తేదీలలో జరగబోయే వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 విజయవంతం చేసేందుకు ఉద్దేశించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా భువనేశ్వర్‌లో పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అనంతరం జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇండస్ట్రీ ఆటోమేషన్ వైపు కంపెనీలను ఎలా మార్చుకోవచ్చో ప్రెజెంటేషన్ ద్వారా ఆయా రంగాలకు చెందిన నిపుణులు వివరించారు. ఐటీ, ఐటీ సేవలు, పారిశ్రామిక ప్రగతిలో మన గతాన్ని, వర్తమానాన్ని సూక్ష్మ పరిశీలన చేసిన ప్రముఖులు పారిశ్రామిక ప్రగతి భవిష్యత్తుకు సిద్ధం కావాలని డా. శ్రీనుబాబు గేదెల మార్గనిర్దేశనం చేశారు. ఇంటరాక్షన్ విత్ ఇంటిలిజెన్స్, నాలెడ్జ్ ట్రాన్స్ ఫార్మేషన్, కంప్యూటేషన్ అనుసరించడం ద్వారా ఇండస్ట్రీ ఆటోమేషన్ సాధ్యమవుతుందని, నూతన ఆవిష్కరణలు సరికొత్త దారి చూపుతాయని తెలియజేశారు. హెల్త్ టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫైనాన్స్, ఫార్మా, బయో, ఇతర పారిశ్రామిక రంగాలకు టెక్నాలజీని అనుసంధానించడంపై ప్రధానంగా దృష్టి సారించిన వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 భారతదేశంలో మొట్టమొదటిదని శ్రీనుబాబు తెలిపారు. 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో పల్సస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 పారిశ్రామిక ప్రగతికి సరికొత్త దారి చూపనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్ సమ్మిట్‌కి హాజరయ్యేందుకు ప్రధాన సంస్థల సీఈవోలు, ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. రోడ్ షో అనంతరం జరిగిన కార్యక్రమానికి ఒడిశా ఐటీ మంత్రి తుషార్ కాంతి బెహెరా, టాటా స్టీల్ మైనింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కుమార్ సతిజా, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ ఎం వేణుగోపాల్, కాన్సెంట్రిక్స్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ భర్ద్వాజ్, తత్వా టెక్నాలజీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయాస్కాంత మొహంతి, ఆస్ట్రల్ పైప్స్ కు చెందిన సుమన్ కుమార్ మొహపాత్ర, వేదాంతకు చెందిన యోగేష్ బొహ్రా తదితరులు పాల్గొన్నారు. ఇఫ్కోకు చెందిన జితేంద్ర కుమార్ పాండే టెక్ సమ్మిట్ రోడ్ షోకి తన మద్దతు ప్రకటించారు. -
మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: అపారమైన సహజ వనరులు, ప్రగతిశీల విధానాలు గల తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఒడిశాలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఒడిశా ప్రభుత్వం, ఫిక్కి సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భువనేశ్వర్‌లో నిర్వహించే ‘‘మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్ 22’’కార్యక్రమానికి సన్నాహకంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో సోమవారం పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఒడిశా నిలిచిందన్నారు. భువనేశ్వర్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు వేగంగా సాగుతోందని, ఒడిశా స్టార్టప్ హబ్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి ప్రతాప్ కేశరి దేబ్, ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్ శర్మ తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల యజమానులు సమావేశంలో పాల్గొన్నారు. -
సంచలన నిర్ణయం.. 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
భువనేశ్వర్: తన పుట్టిన రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ నియామకాల పద్ధతిని పూర్తిగా తొలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 57వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ‘కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాల వ్యవస్థను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడానికి ఈరోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఈరోజుకు కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ నియామకాలు జరగటం లేదు. వారు ఇప్పటికీ కాంట్రాక్ట్ నియామకాల వ్యవస్థపైనే కొనసాగుతున్నారు. కానీ, ఒడిశాలో ఈ కాంట్రాక్ట్ నియామక శకం ముగిసింది. నేను ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా. నోటిఫికేషన్ రేపు వస్తుంది. 57వేలకుపైగా ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రతిఏటా ప్రభుత్వంపై రూ.1300 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయం వారి కుటుంబాల్లో ముందుగానే దీపావళిని తీసుకొస్తుంది.’ అని తెలిపారు సీఎం నవీన్ పట్నాయక్. ఇదీ చదవండి: వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్ కుమార్ రాజీనామా -
Puri Jagannath Temple: ఆ మూడో గదిలో అంతులేని ధనరాశులున్నాయా?
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి? అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ నినదిస్తున్నారు. దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు. పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక. భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. -
75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.74,620 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. మేకిన్ ఒడిశా చొరవలో భాగంగా వీటికి ఒడిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 24వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన 10 పారిశ్రామిక ప్రాజెక్టులలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, మెటల్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. అలాగే టాటా గ్రూప్, అదానీ గ్రూప్ , ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పెద్ద పెట్టుబడిదారులుగా ఉన్నాయి. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ 7,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే రూ. 41,653 కోట్ల పెట్టుబడితో కాశీపూర్‌లో 4.0 MTPA అల్యూమినా రిఫైనరీ, 175 MW CPP ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. టాటా స్టీల్ పారాదీప్‌లో రూ.2,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ (20 కేటీపీఏ), గ్రీన్ అమ్మోనియా (100 కేటీపీఏ) ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ల వల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్లాంట్లు రాష్ట్రంలోని ఉక్కు, ఎరువుల రంగాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ఒడిశా సర్కార్ ప్రకటించింది. "విజన్ 2030’’ కి ఊతమిచ్చేలా మెటల్ సెక్టార్లో డౌన్‌స్ట్రీమ్ యూనిట్ల అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తున్నట్టు తెలిపింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో 60,000 MT పారిశ్రామిక నిర్మాణం, 6,000 MT స్టీల్ ప్లాంట్ పరికరాల సౌకర్యాల ఏర్పాటుకు టాటా స్టీల్ ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,451 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జగత్సింగ్పూర్, రాయగడ, జాజ్‌పూర్, భద్రక్, కెందుఝర్, కటక్ , మయూర్‌భంజ్‌లలో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. కళింగలో 2.5 MTPA స్టీల్ ప్లాంట్, 370 MW CPP ప్లాంట్‌ను కూడా ఒరిస్సా అల్లాయ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 8,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి 5,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది .డాల్కీలో 6 MTPA బెనిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రతిపాదనను ,1,490 కోట్ల రూపాయల పెట్టుబడితో డాల్కీలోని డబునా స్లరీ పంపింగ్ స్టేషన్ యూనిట్‌కు ప్రతిపాదిత ప్లాంట్ నుండి 12 MTPA స్లర్రీ పైప్‌లైన్‌ను కూడా కమిటీ ఆమోదించింది. దీని 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోంపురి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 MTPA పెల్లెట్ ప్లాంట్ మరియు 6 MTPA ఫిల్టర్ కేక్, ఆర్తి స్టీల్స్ ద్వారా స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడా ప్రభుత్వం ఆమోదించిన కొన్ని ఇతర ప్రాజెక్టులుగా ఉండనున్నాయి. అయితే అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆమోదం పొందిందని వార్తలు వెలువడ్డాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ వేగంగా విస్తరిస్తున్న తన సామ్రాజ్యానికి మరో ప్రాజెక్టును చేర్చనున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒడిశాలో అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేయడానికి 5.2 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని పలు ఊహాగానాలొచ్చాయి. The High-Level Clearance Authority under the chairmanship of CM @Naveen_Odisha approved 10 industrial projects worth ₹74,620 Cr with an employment potential of 24,047. The approved projects include Metal & Metal Downstream, Green Hydrogen, Green Ammonia & Industrial Structure. pic.twitter.com/WdAY3RguP9 — CMO Odisha (@CMO_Odisha) August 10, 2022 -
మోదీ ముందే చెప్పారు.. చాలా సంతోషించా
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ద్రౌపది ముర్ము ఎంపిక గురించి ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం తనకు తెలిపారని వెల్లడించారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అధికారికంగా బుధవారం ప్రకటించారు. గర్వకారణం: నవీన్ పట్నాయక్ ద్రౌపది ముర్ము ఎంపికను బిజూ జనతాదళ్(బీజేడీ), జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలు స్వాగతించాయి. ‘ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై నాతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఒడిశా ప్రజలకు ఇది నిజంగా గర్వకారణం’ అని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. జేఎంఎం జేజేలు తమ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం సంతోషం వ్యక్తం చేసింది. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్ పాండే తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన ఆకాంక్షించారు. (క్లిక్: ద్రౌపది ముర్ముకు జెడ్ ప్లస్ భద్రత.. 24న నామినేషన్) -
ఎవరీ ద్రౌపది ముర్ము? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆమెనే ఎందుకు?
న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్రపతి అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ముని ప్రతిపాదించడానికి ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ని సంప్రదించి మరీ ఆమె పేరును ఖరారు చేసింది. అంతేకాదు రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేడీ ఆమెకు మద్దతు ఇవ్వనుందని సమాచారం. ఈ మేరకు మోదీ ప్రభుత్వం ఆమె పేరునే ఎందుకు? ప్రస్తావించింది. ఆమెకే ఈ అత్యున్నత పదవిని ఎందుకు? పట్టం గట్టాలనుకుంటోంది వంటి రకరకాల ప్రశ్నలు అందరి మదిలోనే తలెత్తే ప్రశ్నలే... ఇంతకీ ఆమె ఎవరంటే... ఐతే గతంలో బీజేపి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితవ్యక్తిని రాష్ట్రపతిగా చేసి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. మళ్లీ ఇప్పుడూ అందరీ అంచనాలను తారుమారు చేస్తూ... మోదీ చెబుతూ ఉండే సబ్కా సాథ్ సబ్ కా బిస్వాస్ నినాదానికి అద్దం పట్టేలా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ము జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్ంత్ సిన్హా పై పోటీ చేయనున్నారు. ద్రౌపది ముర్ము ఒక సాధారణ గిరిజన మహిళ. ఆమె 1997లోఒడిశాలోని రాయరంగ్‌పూర్ నగర్ పంచాయితీలో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె 2000లో బీజేపీ-బీజేడీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015 లో జార్ఖంఖ్ గవర్నర్‌గా అత్యున్నత పదవిని అలంకరించారు. అంతేకాదు ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆమెకు విభిన్న పరిపాలనా అనుభవం ఉంది. ఈ మేరకు ద్రౌపరి ముర్ము మాట్లాడుతూ...ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి పదవికి నామినేట్ అయ్యానని తెలుసుకుని చాలా ఆనందించానన్నారు. తొలుత తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఒక గిరిజన మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదన్నారు. ఒడిశా శాసనసభ్యులు, ఎంపీలు తనకు మద్దతిస్తారని విశ్వాసిస్తున్నాని చెప్పారు. అంతేకాదు తాను ఒక గిరిజన పుత్రికగా, ఒడియాగా నాకు మద్దతు ఇవ్వండని సభ్యులందరిని అభ్యర్థించే హక్కు కూడా ఉందని నొక్కి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనుందన్న వార్త తెలియగానే ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె నివశించే మయుర్‌భంజ్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే గనుక గిరిజన మహిళగా ఎన్నికైన తొలి రాష్ట్రపతిగా ఖ్యాతీ గాంచుతుంది. (చదవండి: ‘మహా’ సంకటం: ఏక్నాథ్ షిండేకు ఊహించని షాక్!) -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. తొలి టికెట్ కొన్న ఒడిశా ముఖ్యమంత్రి..!
భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 జూన్ 12న కటక్‌లోని బరాబతి స్టేడియం వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కి తొలి టికెట్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు. ఇక బరాబతి స్టేడియం వేదికగా రెండో సారి దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. 2015లో జరగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ సమాచారం ప్రకారం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా సోమవారం ముఖ్యమంత్రికి టికెట్‌ను అందజేశారు. అదే విధంగా స్టేడియం వద్ద చేసిన భద్రతా ఏర్పాట్లను నవీన్ పట్నాయక్‌కు పంకజ్ లోచన్ వివరించినట్లు తెలుస్తోంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు నోట్: అన్ని మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభమవుతాయి. ప్రొటిస్‌తో సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్ చదవండి: SL Vs Aus 1st T20: ఆసీస్‌తో మొదటి టీ20.. శ్రీలంక తుది జట్టు ప్రకటన.. విజయం మాదే! -
ఒరిస్సా కొత్త క్యాబినెట్.. ఎన్నాళ్లో వేచిన ఉదయం..
రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నవీన్ కొలువులో 13మంది కేబినెట్ మంత్రులుగా 8మంది సహాయ మంత్రులుగా(ఇండిపెండెంట్) స్థానం దక్కించుకోగా.. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం. ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 2019లో ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ పట్నాయక్.. తాజాగా నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు మాజీలకు మరోదఫా అవకాశం ఇచ్చారు. అలాగే ఐదుగురు మహిళలకు మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురికి క్యాబినేట్, ఇద్దరు సహాయ మంత్రి పదవులు లభించాయి. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన ప్రమీల మల్లిక్‌కు క్యాబినేట్ ర్యాంకు కల్పించారు. కొత్త కొలువులో పాత ప్రముఖులకు పట్టం గట్టారు. వీరిలో నిరంజన పూజారి, రణేంద్రప్రతాప్ స్వొయి, ఉషాదేవి, ప్రఫుల్లకుమార్ మల్లిక్, ప్రతాప్కేశరి దేవ్, అతున్ సవ్యసాచి నాయక్, ప్రదీప్‌కుమార్ ఆమత్, నవకిషోర్ దాస్, అశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, సమీర్రంజన దాస్, ప్రీతిరంజన్ ఘొడై, తుషార్‌కాంతి బెహరా, రోహిత్ పూజారి ఉన్నారు. వీరిలో 10 మందికి క్యాబినేట్, 4 మందికి సహాయ మంత్రి పదవులు లభించాయి. అతివలకు వందనం.. నూతన మంత్రిమండలిలో నవీన్ పట్నాయక్ మహిళలకు పెద్దపీట వేశారు. శాసనసభలో 15 మంది మహిళా సభ్యులు ఉండగా.. వీరిలో ఐదుగురికి మంత్రి పదవులు కేటాయించారు. వీరిలో ముగ్గురు క్యాబినేట్, ఇద్దరికి సహాయ మంత్రి పదవులు వరించాచాయి. ఈ లెక్కన మూడో వంతు పదవులు అతివలకు పదవులు కట్టబెట్టారు. ఎస్పీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో ఇందులో ఉండటం గమనార్హం. బర్గడ్ జిల్లా బిజేపూర్ నియోజకవర్గం నుంచి రీతా సాహు, మయూర్భంజ్ జిల్లా కరంజియా నియోజకవర్గం బాసంతి హేంబ్రమ్కు తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఉషాదేవి, ప్రమీల మల్లిక్(ఎస్సీ), టుకుని సాహుకు క్యాబినేట్ పదవులు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో విద్యాధికులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రిమండలి విద్యాధికులతో రూపుదిద్దుకుంది. కొలువుదీరిన మంత్రుల సగటు వయసు 58 ఏళ్లు కాగా.. 9మంది మంత్రుల వయసు 50 ఏళ్లు లేదా అంత కంటే తక్కువ కావడం విశేషం. 19మంది డిగ్రీ, ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఆరుగు పోస్ట్రుగాడ్యుయేట్లు, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. పదవులు కోల్పోయిన మాజీలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో ముగ్గురు అగ్ర నాయకులకు స్థానం లేకుండా పోయింది. వీరిలో ప్రతాప్జెనా, కెప్టెన్ దివ్యశంకర మిశ్రా, డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ప్రభుత్వం తల దించుకోవాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించాయి. మహంగ జంటహత్యల కేసులో ప్రతాప్ జెనా, పూరీ హత్యాకాండలో డాక్టర్ అరుణ్‌కుమార్ సాహు, కలహండి జిల్లా ఉపధ్యా యిని మమిత మెహర్ హత్యాకాండలో కెప్టెన్ దివ్యశంకర మిశ్రా వివాదాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టి, వీరిని మంత్రిమండలి నుంచి బహిష్కరించాలని భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రభావం వారి స్థానాలపై పడిందని సమాచారం. దక్షత లోపం వంటి కారణాలతో మంత్రులు సుశాంతసింఘ్, ప్రేమానంద నాయక్, జ్యోతిప్రకాష్ పాణిగ్రాహి, పద్మినీదియాన్, ప్రతాప్ జెనా, ప ద్మనాభ బెహరా, సుదాం మరాండి, రఘునందన దాస్ కొత్త కొలువులో స్థానం కోల్పోయారు. గంజాం జిల్లాలో ఇద్దరికి.. బరంపురం: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో స్థానం దక్కింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా బంజనగర్ ఎమ్మెల్యే విక్రమ్‌కేశరి ఆరక్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చికిటి ఎమ్మెల్యే ఉషాదేవి, పులసరా ఎమ్మెల్యే శ్రీకాంత్ సాహు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇదలి ఉండగా గంజాం జిల్లా దిగపండి ఎమ్మెల్యే స్పీకర్‌గా విధులు నిర్వహించిన సూర్జొపాత్రొ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులకు బరంపురం నగర మేయర్ సంఘమిత్ర దొళాయి అభినందనలు తెలియజేశారు. సరక స్థానం.. పదిలం రాయగడ: రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ మంత్రిగా జగన్నాథ సరకకు రెండోసారి మంత్రిమండలిలో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండురోజుల క్రితం మంత్రి మండలిని రద్దు చేసి, కొత్త క్యాబినేట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సరక రెండోసారి మంత్రి మండలిలో స్థానం దక్కించుకోవడంతో జిల్లావాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1973 జూన్ 10న బిసంకటక్ సమితి జగిడిలో జన్మించిన ఆయన.. 1997లో జిగిడి సమితి సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం అదే పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేశారు. 2012లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అనంతరం 2014లో సార్వత్రిక ఎన్నికలోల బిసంకటక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మరోసారి విజయం సాధించి, సీఎం ఆశీర్వాదంతో రెండోసారి కూడా క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నారు. రణేంద్రప్రతాప్ స్వొయి జననం: 1953 జూలై 1 స్వస్థలం: రాధా గోవిందపూర్, కటక్ జిల్లా నియోజకవర్గం: అఠొగొడొ భార్య: మంజుల దాస్ విద్యార్హతలు: ఎం.ఎ, ఎల్ఎల్బీ అభిరుచులు: పర్యటన, పఠనం, క్రీడలు, ఆటలు నవీన్ పట్నాయక్ మంత్రిమండలిలో రణేంద్రప్రతాప్ స్వొయి హ్యాట్రిక్ మంత్రిగా రికార్డు నెలకొలిపారు. రాజా స్వొయిగా సుపరిచితులైన ఆయన.. నవీన్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రి మండలిలో స్థానం పొందారు. 2019లో ఏర్పాటైన మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్న రణేంద్రప్రతాప్, మంత్రిమండలి మార్పుచేర్పుల ప్రభావం నుంచి విజయవంతంగా బటయట పడగలిగారు. వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి క్యాబినేట్ మంత్రిగా నియమితులయ్యారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా, సౌమ్యశీలిగా పేరొందారు. 1990 నుంచి వరుసగా 7 పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావడం విశేషం. మూడు జిల్లాలకు మెండి చెయ్యి! కొరాపుట్: రాష్ట్ర మంతివర్గ విస్తరణలో మూడు జిల్లాలకు మెండి చెయ్యి మిగిలింది. నవీన్ కొలువులో కొరాపుట్, మల్కన్‌గిరి, నవరంగ్‌పూర్ జిల్లాకు అవకాశం లభించలేదు. ఈ 3 జిల్లాలో బీజేడీ తరఫున 9మంది ఎమ్మెల్యేలుగా గొలుపొందారు. ఇప్పటి వరకు ఈ జిల్లాల నుంచి ఏకైక మంత్రిగా ఉన్న పద్మినీదియాన్ తన పదవిని కోల్పోయారు. ఆమె స్థానంలో సోదరుడు మనోహర్ రంధారికి లభిస్తుందని ఊహాగానాలు వ్యాపించినా.. నిరాసే మిగిలింది. పార్టీ అధిష్టానం సమాచారంతో ఆయన కూడా భువనేశ్వర్ చేరుకొని, క్యాబినేట్ అవకాశం కోసం ఎదురు చూసినా, పిలుపు రాలేదు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగి ఫలితం లేకపోయింది. దీంతో అధికార పార్టీ శ్రేణులు డీలా పడిపోయారు. -
ముఖ్యమంత్రి సింప్లిసిటీ.. కాలి నడకన పోలింగ్ బూత్‌కు..
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన సింప్లిసిటీ వార్తల్లో నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ నంబర్ వార్డులోని ఏరోడ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్లకు ఓటు వేశారు. నవీన్ నివాస్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ పోలింగ్ కేంద్రం ఉండడంతో సీఎం సాధారణ రక్షణ దళం సహాయంతో కాలినడకన ఓటు వేసేందుకు వెళ్లడం విశేషం. (చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు) -
మహిళా ఎంపీకి చేదు అనుభవం.. కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయడంతో ఒడిశాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కాన్వాయ్‌పై దాడి జరగిన మరుసటి రోజే.. ఓ మహిళా ఎంపీకి ఇదే రీతిలో చేదు అనుభవం ఎదురయ్యింది. కాంగ్రెస్ మద్దతుదారులు బీజేడీ ఎంపీ అపరాజిత సారంగిని టార్గెట్ చేశారు. ఆమె వాహానంపై కోడిగుడ్లు విసిరారు. (చదవండి: ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి) ఈ సంఘటన శుక్రవారం భువనేశ్వర్ బనమలిపూర్లో చోటు చేసుకుంది. నిరుద్యోగం, నిత్యసరాల ధరలు, ఇంధన ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అపరాజిత సారంగి వాహానాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ మద్దతుదారులు.. దానిపై కోడిగుడ్లు విసిరారు. నల్ల జెండాలు చూపి నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు) ఈ క్రమంలో జరిగిన సంఘటన గురించి అపరాజిత సారంగి తన స్వస్థలం ధనేశ్వర్ బారిక్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకారుల రాళ్లు కోడిగుడ్లతో తన వాహనంపై దాడి చేశారని.. వారి వద్ద కత్తులు, ఇతర మారణాయుధాలు ఉన్నాయని ఎంపీ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చదవండి: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక -
ఒడిశా సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి. సీఎం కాన్యాయ్‌పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
ఈ ఒప్పందం ఆదర్శం, అనుసరణీయం
దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చిపుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ‘నిర్బంధ మధ్యవర్తిత్వం కన్నా పరస్పర సహకారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ, అవుతాయనీ ఆంధ్ర, ఒడిశా ముఖ్యమంత్రులు ఇటీవలే మార్గం చూపారు. రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలపై వీరిరువురు చరిత్రాత్మక సంధి కుదుర్చుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరిహద్దు విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవగాహనకు వచ్చారు. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. ఏపీ, ఒడిశాల మధ్య దశాబ్దాలుగా పరి ష్కారానికి నోచుకోకుండా కొన్ని కీలక సమ స్యలు వాయిదాపడి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి సంబం ధించి, ఉభయ రాష్ట్రాలు నిర్ణయాత్మకమైన చరిత్రాత్మక సంధి కుదుర్చు కోవడానికి తొలిసారిగా ఇటీవలే అంకురార్పణ జరిగింది. రెండు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరి హద్దు విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. మొదటిసారిగా ఫలవంతమైన చర్చలు జరిగినందుకు సంతోషం ప్రకటిస్తూ, ఇవి త్వరలోనే సత్ఫలితా లనివ్వ గలవని ఏపీ, ఒడిశా సీఎంలు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్‌లు ప్రకటించారు. – (పత్రికా వార్తలు 9–11–21) ఫెడరల్ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు బతికిబట్టకట్టాలంటే అంతర్ రాష్ట్ర ప్రజలకూ, విద్యుత్ పంపిణీకి సంబంధించిన వివాదాల పరి ష్కారం కీలకమవుతుంది. అలాగే రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ఒకే ప్రాంతంలోని పలు గ్రామాల మధ్య జల వివాదాల పరి ష్కారం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో, ఆంధ్ర– ఒడిశాల మధ్య 60 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక ఒడంబడిక కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ‘ఒజ్జబంతి’గా భావించాలి. వలస పాలనలోనూ, దేశ స్వాతంత్య్రానంతరమూ అనేక న్యాయస్థానాలు ప్రాంతాల మధ్య జలవిద్యుత్ పంపిణీ వ్యవస్థను ఎలా పరిష్కరించు కోవచ్చునో పెక్కు సందర్భాలలో సూచనలు చేస్తూ వచ్చాయి. దాదాపుగా 60 ఏళ్లపాటు నిద్రమత్తులో ఉన్న పాలకుల చండితనాన్ని వదిలించడానికి ఏ వ్యవస్థ కూడా ప్రయత్నించలేదు. ఈ పరిస్థితుల్లో దేశాలమధ్యనే కాకుండా, ఒకే దేశంలోని ప్రాంతాల మధ్య నెలకొన్న జల, విద్యుత్ పంపిణీ వ్యవస్థల తీరు తెన్నుల్ని, వాటిపై వివాదాలను కూడా సవరించడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. 1966లో హెల్సెంకీ అంతర్జాతీయ మహాసభ ఈ విషయ మైన కొన్ని శాశ్వత నిర్ణయాలు ప్రకటించి, యావత్ ప్రపంచానికీ ఆదేశించి ఉందని మరచిపోరాదు. అలాగే చరిత్రను మనం మరచిపోకపోతే... వలస పాలనలో బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ధిక్కరించి గోదావరి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకు చెందిన ప్రజాబాహుళ్యం మౌలిక సమస్యను గుర్తించి పరిష్కరించిన సర్ ఆర్థర్ కాటన్ మనకు గుర్తుకు రాక మానడు. ఈ రెండు ప్రాంతాల రైతాంగం కరువు భూములకు సేద్య ధారలు అందించిన వ్యక్తిని మనం ఎన్నటికీ మరచిపోలేం. మను షులు తోటి మనుషుల్ని కుక్కల్లా పీక్కుతినేలా చేసిన ‘ధాత’ కరువు నుంచి ప్రజా బాహుళ్యాన్ని రక్షించడానికి 19వ శతాబ్దంలోనే గోదావరి ఆనకట్ట నిర్మాణాన్ని తలపెట్టిన మహనీ యుడు కాటన్. ఈ కారణం చేతనే ఆనాటినుంచి ఈనాటిదాకా గోదావరి మండలంలో ప్రజలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా వల్లించే స్తోత్రాలలో ‘కాట నాయ నమః’ అని తలచుకుంటూనే ఉండటం మరో విశేషం! అలాగే కొండల్ని పిండిచేసి, మహానదుల గమనాల్నే ప్రజాసేవకు మళ్లించగల మహనీయులుగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య, శొంఠి రామమూర్తి, డాక్టర్ కె.ఎల్. రావు లాంటి వారు వెలుగొందారు. వీరు దేశంలోని జల, విద్యుత్ ప్రాజె క్టుల నిర్మాణ రంగంలో మహోద్దండ పిండాలు! బ్రహ్మపుత్రా నదీ జలాలను భారతదేశంలోకి పారించి ఏడాది పొడవునా అన్ని ప్రాంతా లకు, ఆరుగాలమూ అందేటట్టు భారతదేశం నడిబొడ్డులో మహా సాగర నిర్మాణానికి ఏతమెత్తినవాడు కాటన్. ఎందుకంటే, నీటికి రాజ కీయం తెలియదు. విద్యుత్ ప్రవాహం భౌతికశాస్త్ర సూత్రాలపై తప్ప కేవలం రాజకీయ ఆదేశాలపై సాగదని విశ్వసించినవాళ్లు మన ఇంజ నీర్లూ, ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులూ! 1966 నాటి హెల్సెంకీ అంత ర్జాతీయ సంధిపత్రం, నిర్ణయాలు, నిబంధనలు కూడా ఇదే సత్యాన్ని చాటి చెప్పాయి. దేశాల మధ్య, ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జలవిద్యుత్ పంపిణీ సమస్యలకు ‘సంప్రదింపుల’తో ఇచ్చి పుచ్చుకునే ప్రవృత్తి చాలా అవసరం. ఈ ఇచ్చి పుచ్చుకునేతత్వం వల్లే సమస్యలకు పరిష్కారం సాధ్యమనీ, ‘నిర్బంధ మధ్యవర్తిత్వంకన్నా పరస్పర సహ కారం, సౌభ్రాతృత్వం ద్వారానే’ తగాదాలు పరిష్కారం కావాలనీ హెల్సెంకీ ప్రపంచ మహాసభ అప్పట్లోనే సూత్రీకరించింది. అంతేకాదు, అంతర్జాతీయ జల, విద్యుత్ పంపిణీకి సంబంధిం చిన తగాదాలు న్యాయస్థానాల తీర్పులతోనే సంతృప్తికరంగా పరి ష్కారం కాజాలవు. ప్రపంచదేశాల జల తగాదాలను, సరిహద్దు వివా దాలను నిశితంగా అధ్యయనం చేసిన నిపుణుడు బార్బర్ (1959) ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. రివర్బోర్డులు ఉండి కూడా తగా దాలు తీరడం లేదు. కనుకనే ‘నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు’ అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ‘ఎత్తిపోతల పథకాల’ ద్వారా పల్లంలోని నీరుసైతం ఎత్తులకు ఎగబాకి పోగలుగుతోంది! కనుకనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తలపెట్టలేని విధంగా డజన్ల కొద్దీ ప్రాజెక్టులను ప్రాంతాల వారీగా ఆచరణసాధ్యం చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టులను తన హయాంలోనే నిర్మించి ఆచరణలో ప్రజల అనుభ వంలోకి రావడానికి ఉద్యమించిన మేటి నాయకుడు వైఎస్సార్. ప్రాజె క్టుల నిర్మాణంలో ఆయన రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా వ్యవహరించగలిగారు. కాబట్టే కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరిట వెలిగొండ ప్రాజెక్టును ఆయన ఆనాడు ఆవిష్కరించారు అదే స్ఫూర్తిని ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ‘నవరత్నాల సాక్ష్యంగా కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం, అనేక సంక్షేమ పథకా లను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ఉద్దండ పిండంగా గుర్తింపు పొంది, తన వ్యక్తిత్వ ప్రతిభతో ఆదర్శ జీవిగా వైఎస్ జగన్ నిలబడ గల్గుతున్నారు. ఆ స్ఫూర్తితోనే మన పొరుగునే ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన ఏపీ సీఎం... రెండు రాష్ట్రాల మధ్య ఆరు దశాబ్దాలుగా పేరుకుపోయిన ప్రతిష్టంభనను ఛేదించగలిగారు! ఈ విశాలదృష్టి లేనందునే బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునళ్ల చుట్టూ ఇన్నా ళ్లుగా కాళ్ళకు బలపం కట్టుకొని తిరగవలసి వచ్చింది. అమెరికాలో మసాచూసెట్స్ రాష్ట్రానికీ దాని దిగువన ఉన్న కనెక్టికట్ రాష్ట్రానికి మధ్య జల, విద్యుత్ కేటాయింపుల విషయంలో సంవత్సరాల తరబడీ తలెత్తిన తగాదాల సందర్భంగా ఆ రెండు రాష్ట్రాల పాలకులకు జస్టిస్ బట్లర్ తన చరిత్రాత్మక తీర్పుతో హితబోధ చేశాడు. ‘ఉభయత్రా స్థానిక పరిస్థితులను బట్టి స్వార్థాలు బలిసి ఉంటాయి. కాబట్టి పరీవాహక ప్రాంత రాష్ట్రాల హక్కులకు సంబం ధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు, హక్కుల సమా నతా సూత్రం ప్రాతిపదికపైన మాత్రమే నీటి తగాదాలు పరిష్కారం కావాలి. అంతేగాదు, నీ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జల వివాదాల పంపిణీపై తగాదా వస్తే నీవు ఏం చేస్తావో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే జల వివాదానికి కూడా వర్తింపచేసుకోమన్నారు, జస్టిస్ బట్లర్! ఆ ఇంగిత జ్ఞానంతోటే, ప్రజాప్రయోజనాల దృష్టితోటే వైఎస్ జగన్–నవీన్ పట్నాయక్‌లు... దశాబ్దాలుగా నానుతున్న ఆంధ్ర– ఒడిశాల తగాదాలకు భరతవాక్యం చెబుతూ చారిత్రక ఒడంబడికకు శ్రీకారం చుట్టగలిగారు! కాబట్టి, ఇకపై పరస్పరం నిందలు మోపుకొనే నీలి మాటలకు, గాలి మాటలకు విలువుండదు! చిత్రకారుడి సజీవ చిత్రానికి ఎంత విలువ ఉంటుందో, ఆంధ్ర–ఒడిశాల చారిత్రక ఒప్పం దానికి ఆచరణలో అంత విలువ రాగలదని, రావాలని ఆశిద్దాం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఒడిశాతో సమస్యల పరిష్కారానికి చారిత్మక అడుగు
-
Andhra Pradesh: 60 ఏళ్లకు కదలిక
సత్ఫలితాలపై విశ్వాసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. ఇవి త్వరలో సత్ఫలితాలనిస్తాయని విశ్వసిస్తున్నా. – సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఫలవంతమైన చర్చలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమవడం ఆనందంగా ఉంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా జలవనరులు, సరిహద్దు, విద్యుత్ తదితర అంశాలను పరిష్కరించుకోవడంపై చర్చించాం. ఫలవంతమైన చర్చలు జరిగాయి. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించాం. – ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకమైన ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా నలుగుతున్న వంశధార, జంఝావతి జల వివాదాలు, సరిహద్దు సమస్య.. బలిమెల, అప్పర్ సీలేరులో జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్వోసీలు తదితర అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఉభయ రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే లక్ష్యంగా సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు గంజాయి సాగు, అక్రమ రవాణాను నివారించేందుకు సమష్టిగా కృషి చేయాలని నిశ్చయించారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చర్చల అనంతరం ఇద్దరు సీఎంలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను ఆకాంక్షిస్తున్న సీఎం జగన్ ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా పర్యటన తలపెట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ వెళ్లి భువనేశ్వర్ చేరుకున్నారు. ఒడిశాలో ఘన స్వాగతం.. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు తెలుగు సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. ఒడిశాతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ అధికారులతో మరోదఫా సమావేశమై సమీక్షించారు. అక్కడి నుంచి ఒడిశా సచివాలయమైన లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ ఎదురేగి పుష్ఫగుచ్చం అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు. సీఎం జగన్‌కు శాలువ కప్పి సత్కరించి /ê్ఞపికను అందజేశారు. ఇందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు శాలువా కప్పి సత్కరించిన సీఎం వైఎస్ జగన్ ఆయనకు వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో రెండు రాష్ట్రాల సీఎంలు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రెవెన్యూ, జలవనరులు, ఇంధన తదితర శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా.. ► వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉన్న 115 టీఎంసీలను చెరి సగం పంపిణీ చేసి వినియోగించుకుంటే రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకు నేరడి బ్యారేజీ దోహదం చేస్తుందని, బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు. ► జంఝావతిలో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల్లో చెరి సగం వాడుకునేలా రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమి, ఇళ్లు కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఒడిశా ప్రభుత్వం వాటిని సేకరించి ఇస్తే రబ్బర్ డ్యామ్ స్థానంలో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి జంఝావతి ద్వారా పూర్తి స్థాయిలో 24,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి వీలవుతుందని వివరించారు. ► పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో అంటే 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ఒడిశాలో ముంపు సమస్య తలెత్తకుండా సీలేరు, శబరిపై రక్షణ గోడలు(కరకట్టలు) నిర్మిస్తామని, ఇందుకు సహకరించాలని ఒడిశాను సీఎం వైఎస్ జగన్ కోరారు. బాహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్చాపురానికి నీటి విడుదలపై నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ► బలిమెల, అప్పర్ సీలేరులో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిశాతో సీఎం జగన్ చర్చించారు. ► రెండు రాష్ట్రాల సరిహద్దులో కొఠియా గ్రామాల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. ► సరిహద్దు జిల్లాల్లోని విద్యా సంస్థల్లో ఒడిశాలో తెలుగు, ఏపీలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టాలని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావం పెంపొందించేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఒడిశాలోని బరంపురం విశ్వవిద్యాలయాల ద్వారా చర్యలు తీసుకోనున్నారు. సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమీక్ష అనంతరం ఇద్దరు సీఎంలు సంయుక్త ప్రకటన జారీ చేశారు. జాయింట్ కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని చెప్పారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, గంజాయి సాగు, రవాణా నివారణపై సహకారాన్ని కొనసాగిస్తూ కలసికట్టుగా ఎదుర్కొంటామని ఇద్దరు సీఎంలు తెలిపారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంశాల పరిష్కారంలో అడుగు ముందుకేసినట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే ధ్యేయంగా సమస్యలను కలిసికట్టుగా, సహకార ధోరణిలో పరిష్కరించుకుంటామన్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపడమే కాకుండా జాయింట్ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఒడిశాలో తెలుగు అసోసియేషన్ సభ్యులతో సీఎం జగన్ లోక్‌సేవా భవన్ వద్ద సాదరంగా వీడ్కోలు.. ఉన్నత స్థాయి సమీక్ష ముగిసిన తర్వాత ఒడిశా సచివాలయం లోక్‌సేవా భవన్ పై అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నుంచి లిఫ్ట్‌లో ఇద్దరు సీఎంలు నవీన్ పట్నాయక్, సీఎం వైఎస్ జగన్ కిందకు చేరుకున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లోక్‌సేవా భవన్ నుంచి వెలుపలికి వచ్చి అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌కు సాదరంగా వీడ్కోలు పలికారు. సీఎం జగన్ వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ, జలవనరులు శాఖ కార్యదర్శులు ఉషారాణి, జె.శ్యామలరావు తదితరులున్నారు. రెండు రాష్ట్రాల అధికారుల భేటీ.. సీఎం వైఎస్ జగన్ భువనేశ్వర్ పర్యటనకు ముందుగానే సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం అక్కడకు చేరుకుంది. ఒడిశా సీఎస్ సురేష్‌చంద్ర మహాపాత్ర నేతృత్వంలోని అధికారుల బృందంతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. చరిత్రాత్మక ఘట్టం: డిప్యూటీ సీఎం కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరడి బ్యారేజీ నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించడం చరిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న జలవివాదానికి సానుకూల పరిష్కారం కుదిరిందన్నారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణం, విజయనగరం జిల్లా జంఝావతి ప్రాజెక్టు, కొటియా గ్రామాల అంశాలపై చర్చించడం శుభ పరిణామన్నారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే శ్రీకాకుళం జిల్లా ఉభయ గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందన్నారు. 1962లో నదీ జలాల విషయంలో సమావేశం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం దివంగత వైఎస్సార్ హయాంలో వంశధార 2వ దశ పనులకు ముందడుగు పడిందని తెలిపారు. ఆరు దశాబ్దాల కల: స్పీకర్ తమ్మినేని సిక్కోలు ప్రజల ఆరు దశాబ్దాల కలను నిజం చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి అడుగులు వేయడం హర్షణీయమని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాపై సీఎంకు ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ భేటీ స్పష్టం చేసిందని తెలిపారు. సిక్కోలు ప్రజలు జీవిత కాలం ఆయనకు రుణపడి ఉంటారన్నారు. ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి కమిటీ ద్వారా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు రావడంపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్ పర్యటన ఫొటోలు
-
ఒడిశా ముఖ్యమంత్రితో భేటీ.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదవండి: AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ కాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ @Naveen_Odisha గారికి ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాను. pic.twitter.com/xb8ICX1LfT — YS Jagan Mohan Reddy (@ysjagan) November 9, 2021 -
ఒడిశా ముఖ్యమంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
-
Odisha Tour: శ్రీకాకుళం బయలుదేరిన సీఎం జగన్
-
AP-Odisha: సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ
Updates: సాయంత్రం... ► ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ ►పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు. ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒడిశా తెలుగు అసోసియేషన్ సభ్యులు కలిశారు. మధ్యాహ్నం.. ► ముందుగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ఉదయం... ►విశాఖపట్నం: భువనేశ్వర్ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం -
Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. సరిహద్దు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించుకుని కలిసి అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం జగన్ పలు దఫాలు పేర్కొనటం తెలిసిందే. ఈ క్రమంలో చర్చలకు సమయమిస్తే తానే వస్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాసి చొరవ చూపారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. ఇద్దరు సీఎంల సమావేశంతో సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ముందడుగు పడుతోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనిపై సలహాపూర్వక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఒడిశా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్.. జంఝావతిపై రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతంగా కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం అంశాన్ని కూడా సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా 24,640 ఎకరాలకుగానూ కేవలం ఐదు వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించడం వల్ల ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, 6 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయన్నారు. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురి కానుండగా ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సహకరించాలని ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్ కోరనున్నారు. ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికారులు తాజాగా సీఎం జగన్‌కు తెలియచేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు పాతపట్నం చేరుకుని పెళ్లి రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా సీఎం జగన్ వెంట ఒడిశా పర్యటనలో పాల్గొంటారు. నేరడి బ్యారేజీతో ఒడిశాకూ ప్రయోజనం నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఉభయ రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను సీఎం జగన్ చర్చల సందర్భంగా ప్రస్తావించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 103 ఎకరాలు అవసరం కాగా ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పారు. -
శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్ పర్యటన
-
శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, ఒడిశాలో రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. చదవండి: ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సమీక్ష శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు. చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని -
ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మంగళవారం చర్చల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా రేపు (09-11-2021) సీఎం జగన్ భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంగళవారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం జగన్ చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు. చదవండి: AP: విద్యార్థులకు ‘పద సంపద’ వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం ► నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్ వివరించనున్నారు. ► బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమేనని అధికారులు తెలిపారు. ► బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. చదవండి: బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని జంఝావతి ప్రాజెక్టు అంశం ► ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ► 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు ► ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు. ► ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు.ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్‌కు సహకరించాలని ఏపీ ఒడిశాను కోరనుంది. ► కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. ► కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలను వివరించారు. ► 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సీఎంకు వివరించారు. ► ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. ►కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సిక్కోలు చిరకాల కల.. ఈ నెల 9న ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అంటున్నారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్ అంచనా వేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ చొరవతోనే.. నేరడికి ఎప్పుడో శంకుస్థాపన పడినా పనుల్లో వేగం చూసింది మాత్రం వైఎస్సార్ హయాంలోనే. 1962 సెప్టెంబర్ 30న ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య 50ః50 ప్రాతిపదికన వంశధార బేసిన్లో 115 టీఎంసీల నీటిని పంచుకునేందుకు ఒప్పందం జరిగింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రూ. 944.90 కోట్లతో వంశధార ప్రాజెక్ట్ రెండో దశ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వంశధారపై నేరడి బ్యారే జీ నిర్మించి, అక్కడి నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు వరద జలాలను తరలించి, గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు కొత్త గా 45 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించా రు. ఒడిశా ప్రభుత్వం నేరడికి అభ్యంతరం చెప్పడంతో భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై సైడ్‌వ్యూయర్ నిర్మించి అక్కడి నుంచి వరద జలాల ను సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు తరలించేలా అలైన్మెంట్ మార్చి పనులు చేపట్టారు. వివాదం తేలిన తర్వాత నేరడి బ్యారేజీ నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. కన్నెత్తి చూడని బాబు.. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్–13న ట్రి బ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలయ్యేలా చూడడంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించారు. అప్పట్లోనే ఒడిశాతో చర్చలు జరిపి ఉంటే ఈ పాటికే ప్రాజెక్ట్ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ వైఎస్సార్‌కు పేరు వస్తుందని బాబు ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జిల్లా రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్ తర్వా త మళ్లీ వైఎస్ జగన్ హయాంలోనే ఈ పనులకు కదలిక వచ్చింది. చదవండి: (Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం) ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే..? ►వంశధార జల వివాదంపై ట్రిబ్యునల్ ఆంధ్రాకు అనుకూలమైన తీర్పునిచ్చింది. ►నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ►115 టీఎంసీల నీరు వంశధారలో లభ్యత కాగా, రెండు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని సూ చించింది. ►బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ►కాట్రగడ్డ సైడ్ వ్యూయర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్‌ను ఏటా జూన్ 1 నుంచి ఎనిమిది టీ ఎంసీలు మళ్లించే వరకూ లేదా నవంబర్ 30 వర కూ తెరిచి ఉంచాలని, డిసెంబర్ –1న మూసి వేయాలని షరతు పెట్టింది. ►నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాట్ర గడ్డ సైడ్ వ్యూయర్‌ను పూర్తిస్థాయిలో తొలగించాలని, వంశధార నదీ యాజమాన్యం బోర్డు ఏర్పా టు ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం చొరవ.. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించగలిగింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఏపీ అవసరాల కోసం బ్యారేజీకి కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. రూ. 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశా కోసం ఎడమవైపున కూడా స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఎంత మేర నీటి అవసరమో అన్న విషయాన్ని గెజిట్ విడుదల చేసిన ఆరు నెలలు లోగా ఏపీకి తెలియజేయాలని సూచించింది. ప్రయోజనాలెన్నో.. ►నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలకు, రబీలో 2 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. ►ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సమస్య తీరుతుంది. ►ఇప్పటికే రూ. 700 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. ►వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ►ఒడిశాలో 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ►హిరమండలం రిజర్వాయర్‌లోకి 19 టీఎంసీల నీరు చేరాలంటే 10 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం 40 రోజుల పాటు రెగ్యులర్‌గా ఉండాలి. అదే నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ సమస్య తప్పుతుంది. -
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో పదేళ్లు హాకీకి స్పాన్సర్షిప్
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. మంగళవారం ఇరు జట్లను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పారు. ‘రెండు జట్లు తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త చరిత్ర లిఖించాయి. దేశం యావత్తు గర్వపడేలా హాకీ జట్లు మైదానంలో పోరాడాయి. అసామాన పోరాట పటిమ చూసి భారత్ భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. జాతీయ క్రీడ హాకీతో మా అనుబంధం కొనసాగుతుంది’ అని అన్నారు. ఒక్కో ప్లేయర్‌కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షలు అందించింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ‘టీమ్ స్పాన్సర్’గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
41 ఏళ్ల ఎదురు చూపులు.. ఆ సీఎం వల్లే ఈ ఒలింపిక్ పతకం
సాక్షి, వెబ్‌డెస్క్: ‘హాకీ’.. చెప్పుకోవడానికే మన జాతీయ క్రీడ. కానీ ఈ కాలం వారికి దాని గురించి పెద్దగా తెలియదనేది నమ్మకతప్పాల్సిన వాస్తవం. మన దగ్గర ఆటలంటే చాలు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. గతమెంతో ఘనమన్నట్లు ఒకప్పుడు ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నప్పటికి మన జాతీయ క్రీడకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదనేది వాస్తవం. కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ గత 40 ఏళ్లుగా హాకీ తన ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఎంతలా అంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. దాంతో మన దేశంలో హాకీ కథ ముగిసిందనే చాలా మంది భావించారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని.. నిలబడి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఇక ఈ విజయంలో ఫీల్డ్‌లో పోరాడిన ఆటగాళ్ల కృషి ఎంత ఉందో.. అంతకంటే పెద్ద పాత్రే పోషించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు భారత హాకీ టీం సాధించిన పతకం ఆయన చలవే. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. భారత్ హాకీలో చివరిసారిగా 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో పతకం రావడానికి దాదాపు 41 ఏళ్ల సమయం పట్టింది. ఇందుకు కారణాలు అనేకం.. 1980 తర్వాత దేశంలో క్రీడలకు కమర్షియల్ రంగులు అద్దుకుంటున్న టైం అది. అప్పుడే ఆటల్లో ‘రాజకీయాలు’ ఎక్కువయ్యాయి. హాకీలో టాలెంట్‌కు సరైన గుర్తింపు దక్కకపోగా.. రిఫరెన్స్‌లు, రికమండేషన్లతో సత్తువలేని ఆటగాళ్ల ఎంట్రీ జట్టును నిర్వీర్యం చేస్తూ వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య గొడవలు ఒక సమస్యగా మారితే.. ‘కోచ్’ ఓ ప్రధాన సమస్యగా మారింది. తరచూ కోచ్‌లు మారుతుండడం, భారత హాకీ ఫెడరేషన్లో నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం, స్పానర్షిప్-ఎండోర్స్మెంట్ వివాదాలు వెంటాడాయి. వీటికితోడు క్రికెట్‌కు పెరిగిన ఆదరణతో హాకీ ఉత్త జాతీయ క్రీడగా మారిపోయింది. ప్రోత్సాహకాల్లో మిగిలిన ఆటలకు తగ్గిన ప్రాధాన్యం(హాకీ అందులో ఒకటి)తో ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. ఆదుకున్న నవీన్ పట్నాయక్.. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అన్నాళ్లు ఇండియన్ హాకీ టీమ్‌కు స్పాన్స్రగా కొనసాగుతున్న సహారా 2018లో టీమ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది. హాకీని స్పాన్సర్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్లకుగాను హాకీని స్పాన్సర్ చేయడానికి పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లతో హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. పట్నాయక్ నాడు చూపిన చొరవే.. నేడు టోక్యో ఒలిపిక్స్లో పతకానికి కారణమయ్యింది. హాకీపై మక్కువతో.. నవీన్ పట్నాయక్ భారత హాకీ టీమ్‌ను స్పాన్సర్ చేయడానికి కారణం.. గతంలో ఆయన కూడా హాకీ ప్లేయరే కావడం. ఆయన డూన్ స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్‌కీపర్‌గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్సర్‌గా ఉండటానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది ఒడిశా ప్రభుత్వం. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్‌కు అడుగు దూరంలో ఉంది. ఒడిశాలో 2014 నుంచి హాకీ హవా.. 2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా ఉన్న కళింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ టీం వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ, కృషి ఉన్నాయి. ఒడిశా గతంలో కొందరు గొప్ప హాకీ ఆటగాళ్లను తయారు చేసింది. పురుషులు, మహిళల జట్లలో ఒడిశాకు చెందిన పలువురు క్రీడాకారులున్నారు. వీరిలో వైస్ కెప్టెన్లు - బీరేంద్ర లక్రా, దీప్ గ్రేస్ ఎక్కా వంటి వారు ఒడిశాకు చెందినవారే. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 2023 వరకు హాకీ ఇండియాకు స్పాన్సర్‌గా ఉంది. అదే ఏడాది భారతదేశం ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ ఒలింపిక్స్‌లో ఇండియన్ హాకీ టీమ్ ఆడిన పలు మ్యాచ్‌లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు కాంస్య పతకం గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్‌తో వీడియో కాల్లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విజయం ప్రతి భారతీయుడికీ గర్వకారణమన్నారు నవీన్ పట్నాయక్. -
ఒలింపిక్ పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపిన నవీన్ పట్నాయక్
-
పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్: ప్రైవేటు ఫీజులు 15 శాతం రద్దు
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 15 శాతం రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించి విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గించింది. ఫీజుల వసూలు ఒప్పందం సంతకం చేసిన వారు ఆ ప్రకారం ఫీజులు వసూలు చేస్తారు. ఇతరులు 15 శాతం ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర పాఠశాలలు- సామూహిక విద్యా విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కోవిడ్–19 ఆంక్షలు ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేయడం పట్ల తల్లిదండ్రుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శాంతియుత సంప్రదింపులు విజయవంతం కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల సంఘం అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేని, నిస్సహాయ స్థితిని తల్లిదండ్రుల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విచారకర పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు మూడు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘం, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. కరోనా తాండవిస్తున్న పరిస్థితుల్లో పాఠశాలలు వసూలు చేస్తున్న వార్షిక ఫీజును పరిమితి మేరకు పలు అంచెలుగా ఖరారు చేసి అంచెల వారీగా ఫీజుల్లో మినహాయింపు కల్పించాలని హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలులో అసంతృప్తి తలెత్తితే తల్లిదండ్రుల సంఘం మరోసారి న్యాయం కోసం ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు కేసు విచారణకు తెరదించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలు ప్రైవేట్ పాఠశాలలు అంచెల వారీగా ఫీజులు మినహాయించే ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. ఈ వివాదం మరోసారి బిగుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఒప్పందం నిరాకరించిన యాజమాన్యాలు 15 శాతం ఫీజులు రద్దు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘యాస్’ నష్టం రూ.610 కోట్లు: జల దిగ్బంధంలో 500 గ్రామాలు
భువనేశ్వర్: యాస్ తుపానుతో రాష్ట్రంలో రూ.610 కోట్ల నష్టం సంభవించింది. రూ. 520 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నష్టపోగా ప్రభుత్వేతర ఆస్తులకు రూ.90కోట్ల నష్టం వాటిల్లిందని పలు విభాగాల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. యాస్ తుపాను నష్టం, పునరుద్ధరణ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆన్లైన్లో గురువారం సమీక్షించారు. అధికారులకు అభినందనలు ప్రభుత్వ అధికారులు, ప్రభావిత జిల్లా యంత్రాంగం అద్భుతమైన కార్యాచరణతో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులను పరిరక్షించారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యంత స్వల్ప వ్యవధిలో ముగించడం విశేషమని మెచ్చుకున్నారు. యాస్ తుపాను తీరం తాకే ముందు, తాకే సమయం, తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన సమగ్ర విపత్తు నిర్వహణ దస్తావేజులతో భద్రపరిస్తే భావి విపత్తు నిర్వహణ వ్యవహారాల్లో మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. జల దిగ్బంధంలో 500 గ్రామాలు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో మాట్లాడుతు యాస్ తుపాను ప్రభావంతో సమగ్రంగా 150 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమద్రపు నీరు పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం కలిగించింది. తుపాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీరు సరఫరా పునరుద్ధరణకు 1,000 డీజీ సెట్లతో ట్యాంకర్లు, పీవీసీ ట్యాంకులు వినియోగించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో ప్రాణ హాని నినాదంతో యాస్ తుపాను విపత్తు నిర్వహణ కోసం నిరంతరం కృషి చేసినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. పంటలపై తుపాను ప్రభావం యాస్ తుపాను తీవ్రతతో కోస్తా ప్రాంతంలోని పొలాల్లోకి సముద్రపు నీరు చొరబడింది. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులపై ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం, కేంద్రీయ వరి పరిశోధన సంస్థ పరిశోధన చేసి రైతాంగానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎస్సార్సీ ప్రతిపాదించారు. ముగిసిన విద్యుత్ పునరుద్ధరణ యాస్ తుపానుతో 30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రభావితమయ్యారని ఆ విభాగం కార్యదర్శి తెలిపారు. 99.8 శాతం వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యకలాపాలు ముగిశాయి. 230 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించారు. విద్యుత్ విభాగానికి రూ.150 కోట్ల నష్టం సంభవించిందని వివరించారు. రహదారులు ఛిన్నాభిన్నం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మే 31వ తేదీ నాటికి గొట్టపు బావులు, కుళాయి నీరు సరఫరా, పారిశుద్ధ్యం కార్యకలాపాలు ముగించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు విభాగం తెలిపింది. యాస్ తుపాను 8 నగర, పట్టణ ప్రాంతాల్లో 58 రహదారుల్ని ఛిన్నాభిన్నం చేసింది. తుపాను ఉద్ధృతితో సముద్ర తీరం, నదీ గట్లు కోతకు గురవడంతో జల వనరుల విభాగానికి రూ.108 కోట్లు, రోడ్లు–భవనాల శాఖకు రూ.246 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా విభాగాలు వివరించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్‌చంద్ర మహాపాత్రో, ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, యాస్ ప్రభావిత జిల్లాలు బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్, కేంద్రాపడా కలెక్టర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాల్గొన్నారు. -
‘కలిసి రండి’ తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖలు
భువనేశ్వర్: ‘దేశమంతా ఒక్కటై కరోనా మహమ్మారిని తరిమేద్దాం. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుందాం. ఏకీకృత టీకాల కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో రాష్ట్రాలు ముందుకు రావాలని’ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అందరూ ముఖ్యమంత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని హితవు పలికారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులకు బుధవారం ఆయన లేఖలు రాశారు. రాజకీయ, ఇతర భేదాభిప్రాయాలకు అతీతంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారి పోరులో పాలుపంచుకుందాం. ఇంతకుముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్లు లేఖలో పేర్కొన్నారు. రోడ్డున పడుతున్న జీవితాలు కరోనా మహమ్మారితో గత ఏడాది నుంచి ప్రపంచం తల్లడిల్లుతోంది. రెండు దశల్లో ప్రపంచ ప్రజల్ని కరోనా బెంబేలెత్తించింది. మూడో దశ ముంచుకొస్తోందనే ఆందోళన మరింతగా భయపెడుతోంది. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం, తల్లిదండ్రుల్ని కోల్పోయి పిల్లలు అనాథలవుతున్నారు. పరిశ్రమలు, వర్తక, వ్యాపారం, రవాణా రంగాలు కుదేలవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉపాధి వనరులు తగ్గిపోవడంతో పలువురి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. టీకాతో సాధ్యం కోవిడ్ టీకాతో కరోనా మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం. పలు దేశాలు కోవిడ్ టీకాలు ప్రయోగించి కరోనా విపత్తును అణిచివేశాయి. దేశ ప్రజల ప్రాణ రక్షణకు కోవిడ్ టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా పూర్తి చేయాలి. ప్రజల బాగు కోసం అన్ని రాష్ట్రాలు ఏకమై ఐక్య పోరాటానికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరికీ సత్వరమే కోవిడ్ టీకాలు అందడమే ఉద్యమ ధ్యేయం. కోవిడ్ టీకాల జాతీయ ఉత్పాదన అరకొరగా ఉంది. ప్రపంచ ఉత్పాదక సంస్థల నుంచి టీకాలు కొనుగోలు ఉద్యమానికి ఊపిరిపోస్తుంది. అంతర్జాతీయ కోవిడ్ టీకాల ఉత్పాదన సంస్థలు రాష్ట్రాలవారీ వ్యాపార ఒప్పందంపట్ల మొగ్గు కనబరచడం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి అంతర్జాతీయ ఉత్పాదన సంస్థల నుంచి కోవిడ్ టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానం ఉత్తమం. స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా టీకాల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసి అభ్యర్థించినట్లు ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నవీన్ పట్నాయక్ వివరించారు. ఈ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి తీర్మానాలు చేసి కరోనా తరిమివేతలో విజయం సాధించేందుకు ముందుకు రావాలని లేఖలో అభ్యర్థించారు. Wrote to all CMs for a consensus on centralised procurement of vaccines by GOI in view of the challenges faced by states. Spoke to some CMs who shared my views. No State is safe unless all States adopt vaccination as a top priority & execute it on war-footing. pic.twitter.com/lMkpjDeYRg — Naveen Patnaik (@Naveen_Odisha) June 2, 2021 -
మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ కన్నుమూత
భువనేశ్వర్: రాష్ట్ర మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ (68) బుధవారం కన్ను మూశారు. కరోనా చికిత్స నుంచి కోలుకుని ఇతర దీర్ఘకాల రోగాలతో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. మే నెల తొలి వారంలో ఆయన కోవిడ్ బారిన పడి చికిత్స పొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా ఆయన పేరొందారు. భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. అటవీ-పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువ్రత రౌత్రాయ్ ఈ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజల కోసం పోరాడిన నాయకుడు మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బిజయశ్రీ రౌత్రాయ్ నిస్వార్థంతో ప్రజల కోసం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సానుభూతి ప్రకటించారు. ఆయన సేవలు చిరస్మరణీయం మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ సేవలు చిరస్మరణీయమని గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ సంతాపం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఒడిశా స్పీకర్ సూర్యనారాయణ పాత్రో, పలువురు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తదితరులు బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. -
మూడో దశ కరోనాపై సర్కార్ హైఅలర్ట్
భువనేశ్వర్: కరోనా మూడో దశ కొత్త తరహాలో పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్వహణ యంత్రాంగం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. మూ డో దశ కరోనా సంక్రమణ నేపథ్యంలో శిశు సంరక్షణ, చికిత్స పట్ల నిర్వహణ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి పరిస్థితులు చేయి దాటకుండా జాగ్రత్త వహించాలని కోరారు. వచ్చే వారంలోగా రాష్ట్రంలో కరోనా సంక్రమణ పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ వితంతువులకు పింఛన్ రాష్ట్రంలో కోవిడ్–19 సంక్రమణతో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా మహమ్మారితో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన బాలలకు కూడా పింఛన్ మంజూరు చేస్తారు. మధుబాబు పింఛన్ పథకం కింద 15 రోజుల్లో ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
అలసిన ‘ఆట’: కరోనాతో ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మృతి
భువనేశ్వర్: రాష్ట్రంలో పేరొందిన ఫుట్‌బాల్ కోచ్ నంద కిషోర్ పట్నాయక్ కరోనా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాష్ట్రం నుంచి పలువురు అంతర్జాతీయ క్రీడాకారుల్ని ఆవిష్కరించిన విశిష్ట వ్యక్తి అని సంతాప సందేశంలో పేర్కొన్నారు. 1956 మార్చి 16వ తేదీన జన్మించిన నంద కిషోర్ పట్నాయక్ రెండుసార్లు జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ఒడిశా జట్టుకు సారథ్యం వహించారు. 1992-93లో ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. తర్వాత 1995లో మహిళా ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లో శ్రద్ధాంజలి సామంత్రాయ్, రంజిత మహంతి, ప్రశాంతి ప్రధాన్, సుదీప్త దాస్, సరిత జయంతి బెహరా, మమాలి దాస్, ప్రథమా ప్రియదర్శి వంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు రాష్ట్ర కీర్తి కిరీటాలుగా వన్నె తెచ్చారు. చదవండి: కరోనాతో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మృతి తన విద్యార్థులతో కోచ్ నందకిశోర్ పట్నాయక్ (ఫైల్) -
భళా! ఒడిశా ప్రజలకు ప్రధాని ప్రశంసలు
భువనేశ్వర్: యాస్ తుపాను విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషిచేస్తాయని, ఒడిశా సంక్షేమ కార్యకలాపాల్లో రాష్ట్రంతో కలిసి కేంద్రం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. యాస్ తుపానుతో సంభవించిన నష్టాన్ని నివారించడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. తుపాను సహాయం, పునరావాసం, పునరుద్ధరణ, జీవనోపాధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. యాస్ తుపాను రాష్ట్రంలో 10 కోస్తా జిల్లాల్ని ప్రభావితం చేసింది. పలు చోట్ల సముద్రపు కెరటాలు తీరం దాటాయి. నది గట్లు తెంచుకున్నాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావాన్ని పరిశీలించేందుకు ప్రధాని శుక్రవారం రాష్ట్రానికి విచ్చేసి గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో యాస్ తీవ్రత, నష్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యాస్ విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రజలు ప్రదర్శించిన సమయ స్ఫూర్తి కేంద్ర, రాష్ట్ర సహాయ బృందాలకు అదనపు బలం చేకూర్చాయని ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ వెన్నంటి స్థైర్యం పెంపొందిస్తున్నారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. కొత్త ఆలోచనలతో విపత్తు నిర్వహణ ముందస్తు విపత్తు నిర్వహణ కార్యాచరణతో యాస్ బీభత్సాన్ని రాష్ట్రప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కోగలిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాన మంత్రికి వివరించారు. ఆకస్మిక వాతావరణ మార్పులతో ఏటా ప్రకృతి విపత్తుల్ని ఒడిశా ఎదుర్కొంటోందని సీఎం తెలిపారు. విపత్తుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానమంత్రిని అభ్యర్థించారు. విపత్తు తాండవంతో కోతకు గురవుతున్న తీర ప్రాంతాలు, నది గట్ల సంరక్షణ, కుప్పకూలుతున్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు దీర్ఘకాల ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించాలని కోరారు. యాస్ ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరుద్ధరణ, పునర్నిర్మాణ, పనరావాసం కార్యకలాపాలు ప్రధానమంత్రికి వివరించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్ చంద్ర షడంగి ఈ సమావేశానికి హాజరయ్యారు. విహంగ వీక్షణం యాస్ నష్టంపై సమీక్ష ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకాశ మార్గంలో యాస్ ప్రభావిత ప్రాంతాల్ని సందర్శించి ఢిల్లీకి బయల్దేరారు. ఈ విహంగ వీక్షణం ఆధారంగా త్వరలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని సమావేశానికి హాజరైన కేంద్ర ప్రతాప్ చంద్ర షడంగి తెలిపారు. -
యాస్, కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటాం: సీఎం
భువనేశ్వర్: నాలుగున్నర కోట్ల రాష్ట్ర జనాభా ప్రాణరక్షణ ప్రభుత్వం బాధ్యత. కరోనా, యాస్ తుపాను రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. మొదటి నుంచి వేధిస్తున్న కరోనా నివారణ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా యాస్ తుపాను విపత్తు నుంచి గట్టెక్కాలి. తుపాను ప్రాణహాని నివారణ కోసం లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు కోసం ప్రజలంతా విధిగా రెండు మాస్క్‌లు ధరించాలి. కరోనా నిర్వహణలో తలమునకలై ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి యాస్ తుపాను నిర్వహణ మరింత భారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖానికి రెండు మాసు్కలు ధరించి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యకలాపాల్లో అధికారులకు సహకరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం యాస్ తుపాను నిర్వహణకు రాష్ట్ర ప్రజల నుద్దేశించి వీడియో సందేశం జారీ చేశారు. సమర్థంగా గత తుపానుల ఎదుర్కొన్నాం తుపాను విపత్తు నిర్వహణలో భాగంగా ప్రజలకు మాసు్కల పంపిణీలో పౌర సమాజం, పంచాయతీ రాజ్ వ్యవస్థ, మిషన్ శక్తి విభాగం సహకరిస్తాయి. సమష్టి భాగస్వామ్యంతో లోగడ అంఫన్ వంటి భయానక తుపానులను సమర్ధంగా ఎదుర్కొన్న సందర్భాల్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తుపాను తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు ముఖానికి రెండు మాసు్కలు ధరించడం అలవరుచుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా తాండవంతో అల్లాడుతున్న విపత్కర పరిస్థితుల్లో మరో భారీ విపత్తు యాస్ తుపాను దూసుకు వస్తోంది. ఈ జంట విపత్తుల నుంచి సురక్షితంగా బయట పడేందుకు ప్రభుత్వ కార్యాచరణకు ప్రజలంతా పూర్తిగా సహకరించాలి. తుపాను సందర్భంగా నిర్వహించే తరలింపు కార్యకలాపాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలి. తుపాను విపత్తు నిర్వహణ రాష్ట్రానికి కొత్తేమీ కాకున్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే భారీ నష్టం సంభవించే ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అంతా ఉమ్మడిగా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యే నిధులతో మాస్కులు
భువనేశ్వర్: కరోనా వ్యతిరేక పోరులో మాస్కు బలమైన ఆయుధం. సమాజంలో బలహీన వర్గాలకు అనుకూలమైన రీతిలో నాణ్యమైన మాసు్కలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టాలి. ఈ కార్యకలాపాల కోసం ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ శక్తి సిబ్బంది ఇస్తామన్న మాసు్కలను సేకరించి సేకరించి బీదలకు పంపిణీ చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితులను బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది స్పందించాలి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ రోగుల కుటుంబీకులు, బంధుమిత్రుల ఆవేదన పట్ల మానవీయ దృక్పథంతో మసలుకోవాలి. బాధితుల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్‌డెస్క్ సిబ్బంది బంధువులకు అందించి ఊరట కలిగించాలని హితవు పలికారు. కోవిడ్ ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న సేవలు, చికిత్స, సదుపాయాలు, రోగుల ఆరోగ్య స్థితిగతుల తాజా సమాచారం తెలియజేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్త కుమార్ మహాపాత్రో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్, ముఖ్యమంత్రి 5టీ కార్యదర్శి వి. కె. పాండ్యన్, కోవిడ్ పర్యవేక్షకులు నికుంజొ బిహారి ధొలొ, సత్యవ్రత సాహు, విష్ణుపద శెట్టి, కెంజొహార్, మయూర్భంజ్ జిల్లాల కలెక్టర్లు, కటక్, భువనేశ్వర్ నగర పాలక సంస్థల కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబీకులకు సమాచారం కోవిడ్ ఆస్పత్రుల్లో చేరిన బాధితుల ఆరోగ్య సమాచారం వారి కుటుంబీకులకు ఎప్పటికప్పుడు చేరాలి. ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది, యంత్రాంగం మానవతా దృక్పథంతో మసలుకోవాలి. కోవిడ్ నిర్వహణ రంగంలో టీకాల ప్రదానం కీలకమైన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీకాల ప్రదాన కేంద్రానికి ప్రజలు సునాయాశంగా చేరి ఇబ్బంది పడకుండా టీకాలు వేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంగణాల్లో రద్దీ నివారించి కోవిడ్ – 19 నిబంధన భౌతిక దూరానికి ప్రాధాన్యం కల్పించాలి. టీకాలు వేసే చోటు, వేళల సమాచారం సంబంధిత వ్యక్తులకు ముందస్తుగా తెలియజేయడంతో ఇది సాధ్యమతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయ పడ్డారు. ఇంటింటి సర్వే అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. ఇంటింటా కరోనా రోగ లక్షణాలు కలిగిన బాధితుల సర్వే చేపడతారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు ప్రధానంగా ఆక్సిజన్ సంబంధిత వ్యవహారాలతో హెల్ప్ డెస్కు కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. -
కరోనా మృతులపై ఒడిశా కీలక నిర్ణయం
భువనేశ్వర్: కరోనా విజృంభణను సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అఖిల పక్ష భేటీ సోమవారం జరిగింది. కోవిడ్–19 నియంత్రణ, టీకాల పంపిణీ, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలపై అఖిల పక్ష సభ్యుల అభిప్రాయాలు, సలహాలు, సంప్రదింపుల శీర్షికతో సాగిన ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని కరోనా స్థితిగతులను సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కరోనాపై పోరులో ఇప్పటివరకు అధికార యంత్రాంగాలు కనబరిచిన పనితీరు అభినందనీయమన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా కొత్త లక్షణాల కోసం ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించి, బాధితుల గుర్తింపు జరుగుతుందన్నారు. కోవిడ్ కార్యకలాపాల నిర్వహణకు త్వరలో ప్రతీ గ్రామంలోని కల్యాణ సమితికి రూ.10 వేలు, హోమ్ ఐసొలేషన్‌లోని రోగుల బాగోగులను పర్యవేక్షించే ఆశా కార్యకర్తలకు ద్విచక్ర వాహనం, చెప్పులు, గొడుగు, టార్చి, ఇతరాత్ర ఉపకరణాలతో రూ.10 వేల ఆర్థిసాయం మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వీటితో పాటు కరోనాతో భర్తలను కోల్పోయిన వితంతువులు, తల్లిదండ్రులకు మధుబాబు పెన్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌పై సర్పంచ్‌లే నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
రాజమాతకు అస్వస్థత: కోలుకోవాలని సీఎం నవీన్ ప్రార్థన
బరంపురం: కళ్లికోట్ రాజమాత, ఒడిశా రాజకీయల్లో సీనియర్ నాయకురాలు తెలుగు ప్రజల గాడ్ మదర్ సుజ్ఞాని దేవి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజధాని భువనేశ్వర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలు సుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజ మాత సుజ్ఞాని దేవి త్వరగా కోలుకుని నవ్వు తూ ఇంటికి తిరిగి చేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply concerned to know about the hospitalisation of senior party leader V. Sugnana Kumari Deo. Wishing her speedy recovery and praying for her good health. — Naveen Patnaik (@Naveen_Odisha) May 5, 2021 చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు -
Odisha: సర్కారుకు హైకోర్టు భారీ షాక్
భువనేశ్వర్: ప్రాథమిక పాఠశాలల విలీనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర హైకోర్టు మంగళవారం రద్దు చేసి షాకిచ్చింది. 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్ని చేరువలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 2020వ సంవత్సరం మార్చి 11వ తేదీన పాఠశాలల విలీనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి కార్యాచరణ చకచకా ముగించేందుకు పాఠశాలలు–సామూహిక విద్యా విభాగం సన్నాహాలు వేగవంతం చేసింది. ఈ ప్రక్రియను వ్యతిరేకించిన విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం (ఒడిశా అభిభాబొకొ మహాసొంఘొ) ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ప్రాథమిక విచారణ సందర్భంగా మార్చి 30వ తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 560 ప్రాథమిక పాఠశాలల విలీనం ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సన్నాహాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని హితవు పలికింది. ఏప్రిల్ 13వ తేదీ నాటికి ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపట్ల పిటిషనర్ అసంతృప్తి చెందితే మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించి ప్రభుత్వ నిర్ణయం హైకోర్టుకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఆదేశించింది. స్పందించని సర్కారు ఈ నేపథ్యంలో ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయలేదు. అయితే పాఠశాలల విలీనాన్ని పురస్కరించుకుని ప్రాథమిక విద్యాభ్యాసానికి గండిపడే ప్రమాదకర పరిస్థితుల్ని పిటిషనర్ మరోసారి తాజాగా హైకోర్టుకు వివరించడంతో పాటు ప్రభుత్వ ప్రతిపాదనలో సాధ్యాసాధ్యాల్ని విశ్లేషించారు. ఈ పూర్వాపరాల్ని పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వ వైఖరితో ఏకీభవించకుండా పాఠశాలల విలీనం ఉత్తర్వులను రద్దు చేస్తూ మంగవారం తుది ఆదేశాలు జారీ చేసింది. చదవండి: అది కోర్టు ధిక్కరణ ఎందుకు కాదు: హైకోర్టు ఆగ్రహం -
‘ఊపిరి’కి ఎందుకీ కష్టం?
అటు సుప్రీంకోర్టు కూడా ఆక్సిజన్ సరఫరాలో సమగ్ర వ్యూహాన్ని రచించాలని ఆదేశించింది. వాస్తవానికి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ డిమాండ్‌కి మించి ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది. అయినప్పటికీ ఎందుకీ కొరత? ప్రాణాలతో ఎందుకీ చెలగాటం? కరోనా రోగులు గుండెల నిండా గాలి పీల్చుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆస్పత్రులన్నీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో భారత్ మిగులు దేశమే. కానీ పరిస్థితులు అసాధారణంగా మారిపోయి కరోనా రోగుల్లో శ్వాసకోశ ఇబ్బందులు పెరిగిపోవడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు తాము ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్ రాష్ట్ర అవసరాల కోసం ఉంచుకొని... ఇతర రాష్ట్రాలకు పంపిణీని నిలిపివేశాయి. ఉక్కు పరిశ్రమలు అధికంగా ఉన్న ఒడిశా మాత్రం ఆపత్కాలంలో ఇతర రాష్ట్రాలకు అండగా నిలుస్తోంది. ఢిల్లీకి ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. అలాగే గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రం ఆక్సిజన్ సరఫరాకు సాధ్యమైనంతగా తోడ్పాటునందిస్తుందని హామీ ఇచ్చారు. సాధారణ రోజులతో పోల్చి చూస్తే, కరోనా ఫస్ట్ వేవ్‌లో ఆక్సిజన్‌కి డిమాండ్ నాలుగు రెట్లు పెరిగితే, సెకండ్ వేవ్ వచ్చేసరికి ఏడు రెట్లు పెరిగింది. అయినప్పటికీ డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకుంది. ఎందుకీ కొరత ? మన దేశంలో సమృద్ధిగా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. రోజుకి 7,287 టన్నుల ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్ సొంతం. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 9,301 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను మనం ఎగుమతి చేయగలిగాం. అయితే పంపిణీలో నెలకొన్న అసమానతల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి సరిపడా ట్యాంకర్లు, సిలిండర్లు మాత్రం లేవు. క్రయోజెనిక్ సిలండర్ల కొరతతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి 3–5 రోజుల్లో వెళ్లాల్సిన ఆక్సిజన్ 6 నుంచి 8 రోజులు పడుతోంది. ‘‘ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కాస్త సమయం కావాలి. ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఆ రాష్ట్రాలకు కాస్త దూరంగా ఉన్నాయి. ఆక్సిజన్ పంపిణీపై ఎలాంటి నియంత్రణలు లేకపోయినా కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా తమ అవసరాల కోసం సరఫరాని నిలిపివేశాయి. దీంతో ఆక్సిజన్‌కి కొరత ఏర్పడింది. ఇది తాత్కాలికమే.’’అని భారత్‌లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సంస్థ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ వెల్లడించారు. కరోనా కేసులు రోజుకి అయిదు లక్షలు నమోదైతే మాత్రం సమస్యలు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు మే చివరి నాటికి తగ్గు ముఖం పట్టకపోతే మాత్రం దేశంలో ప్రాణవాయువు దొరక్క మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిష్కారానికి కేంద్రం చర్యలివీ... ► రాష్ట్రాల అవసరాలను గుర్తించి వారికి ఇచ్చే వాటాను ఇప్పటికే పెంచింది. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోని ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల్లో 60 శాతం మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతోంది. అందుకే ఆ రాష్ట్రాలకు అధికంగా ఆక్సిజన్‌ను సరఫరా చేయనుంది. ► ఆక్సిజన్ రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను పట్టాలెక్కించింది. ఈ ఎక్స్‌ప్రెస్ 100 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకుని వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గురువారం బయల్దేరింది. ► నైట్రోజన్ ట్యాంకుల్ని కూడా ఆక్సిజన్ని తరలించడానికి ఇక వినియోగించనుంది. ► క్రయోజెనిక్ ట్యాంకుల్ని దేశీయంగా తయారు చేయాలంటే నాలుగు నెలలు పడుతుంది. అందుకే వాటిని దిగుమతి చేసుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. ► 50వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి సన్నాహాలు ► దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. కానీ వీటిలో ఇప్పటికి 4 మాత్రమే పూర్తయ్యాయి. ► అత్యవసరం కాని పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేత. – నేషనల్ డెస్క్, సాక్షి -
నేరడి నిర్మాణానికి సహకరించండి
సాక్షి, అమరావతి: వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు శనివారం లేఖ రాశారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో నెలకొన్న సమస్యలను సంప్రదింపుల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంప్రదింపులకోసం వచ్చి కలుస్తానని, సమయం కేటాయించాలని ఒడిశా సీఎంను కోరారు. అనేక సంవత్సరాలుగా వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నమ్మకమైన.. సుహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో కలసి పనిచేస్తున్నాయని, అంతేగాక పరస్పర సంప్రదింపుల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్నామని జగన్ తన లేఖలో గుర్తు చేశారు. నేరడితో ఏపీతోపాటు ఒడిశాకూ ఉపయోగం.. వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ 13–09–2017న ఇచ్చిన తుది తీర్పును సీఎం వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావిస్తూ.. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతించిందని తెలిపారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏపీతోపాటు ఒడిశా అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. నేరడి బ్యారేజ్ ఎడమ వైపున లెఫ్ట్ హెడ్ స్లూయిజ్ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్ అనుమతించిందని, ఇది ఒడిస్సా రాష్ట్రం అవసరాలను తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనివల్ల కరువు ప్రాంతాలైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశాలోని గజపతి జిల్లాలోని ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరతాయని తెలిపారు. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం కోసం రెండు రాష్ట్రాల రైతులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఏటా వరద జలాల్లో 75 శాతం అంటే.. సుమారు 80 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. మానవుని అవసరాలకు నీరు చాలా ప్రధానమైనదని, అలాగే పరిమితంగా ఉండే నీటి వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌లో నీటికొరతకు అవకాశముందని ఆయన తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకుందాం.. ఒడిశా రాష్ట్రం కొన్ని అంశాల్లో స్పష్టత కోసం వంశధార ట్రిబ్యునల్తోపాటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రధానంగా సూపర్వైజరీ కమిటీ పనితీరుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారని, అయితే ఆ విషయంపై నేరడి బ్యారేజ్ ఆపరేషన్లోకి వచ్చే ముందుగానే ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. సమస్యలను ఇరు రాష్ట్రాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ పునరుద్ఘాటిస్తూ.. ఈ నేపథ్యంలో చర్చల కోసం తగిన సమయం కేటాయించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కోరారు. -
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సీఎం వైఎస్ జగన్ లేఖ
-
ఒడిశా ముఖ్యమంత్రికి ఏపీ సీఎం జగన్ లేఖ
సాక్షి, తాడేపల్లి : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ ముఖ్యమంత్రి ఈ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణ విషయంలో ఒడిశాతో సంప్రదింపులకు తాము సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు. చదవండి: వ్యాక్సినే అస్త్రం.. ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: సీఎం జగన్ -
హెచ్ఐవీ బాధితులకు పెళ్లి చేసిన కలెక్టర్
సాక్షి, బరంపురం(ఒడిశా): ఇద్దరూ భయంకరమైన రోగంతో పీడించబడుతున్నారు. ఏ క్షణాన మృత్యువు కబలిస్తుందో తెలియని విషమ పరిస్థితి. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసేంతలా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎదిగినా.. సాటి మనుషులుగా వారిని ఆమోదించని సమాజం. వీటన్నిటినీ ఎదుర్కొని ఒక్కటయ్యింది ఓ కొత్త జంట. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైన ఇద్దరు యువతీ, యువకులు వివాహ బంధంతో తమ పవిత్ర బంధానికి శ్రీకారం చుట్టారు. గోపాల్‌పూర్‌లోని శ్రాద్ధ సంజీవని హెచ్ఐవీ సేవాశ్రమం దీనికి వేదికైంది. స్వయంగా బరంపురం కలెక్టర్ విజయ్ అమృత కులంగా పెళ్లి పెద్దగా వ్యవహరించి, వివాహ తంతు నిర్వహించడం విశేషం. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆశీర్వదించారు. ఇలాగే 5–టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి విభాగం ప్రాజెక్ట్ చైర్మన్ సింధ్ దత్తాత్రేయ బహుసాహిబ్, బరంపురం మున్సిపాల్ కమిషనర్ శిద్ధేశ్వర్ బలిరామ్ బందరా, సబ్ కలెక్టర్ కీర్తి హాసన్ పాల్గొన్నారు. చదవండి: మొతేరాకు మోదీ పేరు, పప్పులో కాలేసిన భారత నెటిజన్లు పీఎం,సీఎం సార్లు.. నెట్వర్క్ సదుపాయం కల్పించండి! -
బెస్ట్ సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు. ఈ ఏబీపీ న్యూస్ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్ సావంత్ 9వ స్థానంలో, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. ఏబీపీ–సీఓటర్ సంస్థ దేశ్ కా మూడ్ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది. ► కేంద్రం పనితీరుతో 66 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, 30 శాతం మంది సంతోషంగా లేమని సమాధానం ఇచ్చారు. అయితే నాలుగు శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ► ఈ రోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 58 శాతం మంది ప్రజలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వగా, 28 శాతం మంది మాత్రం యూపీఏ గెలుస్తుందని సమాధానం ఇచ్చారు. ► 55 శాతం మంది ప్రధాని పదవికి మోదీని ఎంచుకోగా, రాహుల్‌ను 11 శాతం మంది, మమతను 1శాతం, కేజ్రీవాల్‌ను 5, మాయావతి 1 శాతం, ప్రియాంకాను 1 శాతం మంది ఎంచుకున్నారు. వేరే నేతలను ఎంచుకుంటామని 12 శాతం మంది చెప్పారు. బెస్ట్ సీఎంలు వీరే 1) నవీన్ పట్నాయక్ – ఒడిశా 2) అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ 3) వైఎస్ జగన్మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ 4) పినరయి విజయన్ – కేరళ 5) ఉద్ధవ్ ఠాక్రే – మహారాష్ట్ర 6) భూపేశ్ బఘేల్ – ఛత్తీస్‌గఢ్ 7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్ 8) శివరాజ్ సింగ్ చౌహాన్ – మధ్య ప్రదేశ్ 9) ప్రమోద్ సావంత్ – గోవా 10) విజయ్ రూపానీ – గుజరాత్ -
ముఖ్యమంత్రికి బెదిరింపు లేఖ
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు హత్య బెదిరింపు లేఖ చేరింది. ఆయన నివాస కార్యాలయానికి(నవీన్ నివాస్) గురువారం వచ్చిన ఈ లేఖలో హత్యకు వ్యూహరచన పూర్తి అయినట్లు పేర్కొన్నారు. కిరాయి హంతకులు సిద్ధం అయ్యారని.. అత్యాధునిక అస్త్రాలతో హత్యల్లో ఆరితేరిన వర్గం నగరంలో నవీన్ ప్రతి అడుగులో అడుగు వేస్తుందని ప్రధానాంశం. ప్రధాన వ్యూహకర్త నాగ్‌పూర్‌లో ఉంటున్నాడని, మారణాస్త్రాలు రాష్ట్రానికి చేరాయని ఇంగ్లీషులో చేతిరాత లేఖ వచ్చింది. పలు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన వాహనాలతో హంతకులు నగరంలోకి చొరబడ్డారని, ముఖ్యమంత్రి ప్రతి అడుగుని అనుక్షణం పసిగుడుతున్నారని ఉంది. ఇటువంటివి 17 వాహనాల్లో నగరంలో నవీన్ పట్నాయక్‌ను అనుసరిస్తూ తిరుగాడుతున్నాయని, వీటిలో 2 ఒడిశా రిజిస్ట్రేషన్ వాహనాలు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అనుబంధ అధికార వర్గాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో నవీన్ నివాస్‌లో హల్చల్ పుంజుకుంది. అయితే లేఖరాసిన వ్యక్తి, వర్గం, స్థలం వగైరా సమాచారం ఏమీ లేకుండా అనామక లేఖ జారీ కావడం ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ లేఖాంశాల సత్యాసత్యాల నిర్థారణ జరగాల్సి ఉంది. కిరాయి హంతకులు సీఎం నవీన్‌ను హత్య చేస్తారని లేఖలో పేర్కొనగా.. వారి వద్ద ఏకే 47 వంటి తుపాకులు హత్యకు ప్రయోగించనున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వ్యవస్థ పటిష్టం సీఎం నవీన్ నివాస్‌కు చేరిన అనామక లేఖతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. హత్య బెదిరింపు నేపథ్యంలో భద్రతా వ్యవస్థను తక్షణమే పటిష్టపరిచింది. రాష్ట్ర హోంశాఖ నవీన్ నివాస్‌కు చేరిన లేఖను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)కి పంపింది. ఈ నేపథ్యంలో జంట నగరాల పోలీస్ కమిషనర్ వర్గాలను హోంశాఖ అప్రమత్తం చేసింది. తక్షణమే ముఖ్యమంత్రి భద్రత, రక్షణ ఏర్పాట్లని సమీక్షించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, ప్రయాణాల్లో భద్రతా ఏర్పాట్లని పటిష్ట పరిచాలని అందులో స్పష్టంచేసింది. -
మల్కాన్‌గిరి మలాలా
విద్య, ఆరోగ్యం, అభివృద్ధి కోసం చొరవ చూపుతూ ‘మల్కాన్‌గిరి మలాలా’ అని ప్రశంసలు పొందుతున్న కుసుమానీ.. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు! అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయడం లేదు. మావోయిస్టులు కూడా ఆమెకు ఏదైనా జరిగితే ప్రజా ఉద్యమం వస్తుందనే సందేహంతో ముందడుగు వేయడం లేదు. ఒడిశాలోని మల్కాన్‌జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ‘స్వాభిమాన్ ఆంచల్’కు రెండు నెలల క్రితమే తొలిసారి మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ల నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. నేటికీ ఆ ప్రాంతంలో పిల్లలు బడికి వెళ్లాలంటే ముళ్ల మీద నడకే. కొత్తగా వచ్చిన సమాచార సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని ఆ ముళ్లను ఇప్పుడు నల్లేరుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు కుసుమానీ ఖిల్లా. ఈ ప్రాంతంలోని పిల్లలకు, టీచర్లకు స్వేచ్ఛగా చదువుకోగలిగే, స్వేచ్ఛగా చదువు చెప్పగలిగే పరిస్థితులు కల్పించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను గత మంగళవారం అర్థించారు కుసుమాని. ఆ పరిణామంతో ఆమెలోని ధైర్యాన్ని, పట్టుదలను చూసిన ఆ ప్రాంతీయులు ఆమెను ‘మలాలా ఆఫ్ స్వాభిమాన్ ఆంచల్’ అంటూ అభినందిస్తున్నారు. పాకిస్తాన్లో బాలికలు, మహిళల విద్య కోసం గళమెత్తిన మలాలా తాలిబన్ తుపాకీ తూటాలకు గురై, పునర్జన్మ ఎత్తి, ఆడపిల్లల చదువు కోసం ఒక ఉద్యమకారిణిగా పని చేసింది. అందుకే కుసుమానీ ఖిల్లాను మలాలాతో పోల్చుతున్నారు. కుసుమానీ కరోనా వారియర్ కూడా. ‘‘కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కుసుమానీ ప్రజలలో తీసుకువచ్చిన చైతన్యం కారణంగా అక్కడ ఒక్కరు కూడా కోవిడ్ కారణంగా మరణించలేదు’’ అని నవీన్ పట్నాయక్ కూడా ఆమెను ప్రశంసించారు. అంతేకాదు, కాన్ఫరెన్సింగ్‌లో ఆమెను ఆంచల్ ప్రాంత విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. కుసుమానీ పట్టభద్రురాలు. మల్కాన్‌గిరిలోని ‘బలిమెల కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ చదువుకున్నారు. కమ్యూనికేషన్ కనెక్టివిటీ వచ్చాక గత రెండు నెలల్లోనూ స్వాభిమాన్ ఆంచల్‌లో బిఎస్ఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసుల నిరంతర పర్యవేక్షణలో నాలుగు సెల్ టవర్ల నిర్మాణం జరిగింది. ఆ సదుపాయం కారణంగానే సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగలిగారు కుసుమానీ. -
లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాం
భువనేశ్వర్: రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికీ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్ఫష్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి మహరాష్ట్రలో ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్లతో పాటు ఇతర సామాజిక, రాజకీయ కార్యాలయాలు ఇంకా తెరుచుకొలేదు. ఒడిశాలో ఇప్పటివరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా... అందులో 273,838 మంది డిశ్చార్స్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14, 905 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 1,320గా నమోదయ్యాయి. (చదవండి: సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్) ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులలో మరణాల రేటు 0.45 శాతంగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,470 కోవిడ్-19 కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. ఇక 1,800 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఖుర్దా జిల్లాలో ఒక్కరోజులోనే గరిష్టంగా 159 కేసులు, కటక్‌లో 98, అంగుల్‌లో 95 కేసులను నమోదు కాగా.. కరోనాతో గంజాం జిల్లాలో 229 మంది, ఖుర్దా -226, కటక్ -10 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, బార్లు, జిమ్‌లు తెరించేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అదే విధంగా జూన్ 15 నుంచి అత్యవసర సేవల కొరకు పరిమిత సంఖ్యలో ప్రత్యేక సబర్బన్ రైళ్లను రైల్వే అధికారులు తిరిగి ప్రారంభించారు. (చదవండి: యూరప్, అమెరికాకు కోవిడ్ దడ) -
‘నేరడి’పై వివాదాల పరిష్కారానికి సీఎం చొరవ
సాక్షి, అమరావతి : వంశధార, జంఝావతి నదీ జలాల్లో వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒడిశా సర్కార్‌తో సంప్రదింపులు జరిపి వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో కీలకమైన నేరడి బ్యారేజీ.. జంఝావతి రబ్బర్ డ్యామ్ స్థానంలో స్పిల్ వే నిర్మించడం ద్వారా వాటా జలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. నేరడి బ్యారేజీ, ఝంజావతి ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి.. వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చదవండి: రేపు రెండో విడత రైతు భరోసా ప్రారంభం నేరడిపై ఒడిశా అభ్యంతరం.. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి ఎనిమిది వేల క్యూసెక్కులను కొత్తగా నిర్మించే సింగిడి రిజర్వాయర్ (0.686 టీఎంసీలు), పారాపురం రిజర్వాయర్ (0.404 టీఎంసీలు), హిరమండలం రిజర్వాయర్ (19.05 టీఎంసీలు)లలో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: ‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’ ఒడిశా ప్రతిపాదన మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఆర్నెల్లలోగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 6, 2009న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు వంశధార ట్రిబ్యునల్‌ను ఫిబ్రవరి 24, 2010న కేంద్రం ఏర్పాటు చేసింది. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేసి.. బామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి.. గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీలు మళ్లించే పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. జంఝావతి వివాదం ఇదీ.. జంఝావతి నదిలో 8 టీఎంసీల నీటి లభ్యతలో చెరి సగం వాడుకునేలా డిసెంబర్ 25, 1978న ఒడిశా, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ వాటా నీటిని వినియోగించుకోవడం కోసం విజయనగరం జిల్లాలో జంఝావతిపై కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 3.40 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బ్యారేజీ ద్వారా 24,410 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. ఒడిశాలో ముంపునకు గురయ్యే 1,175 ఎకరాలను సేకరించి అప్పగించడానికి అప్పట్లోనే ఒడిశా సర్కార్ వద్ద ఏపీ ప్రభుత్వం నిధులను డిపాజిట్ చేసింది. కానీ ఒడిశా సర్కార్ భూసేకరణ చేయలేదు. పూర్తిస్థాయి బ్యారేజీ నిర్మాణానికి అడ్డుతగులుతూ వచ్చింది. దాంతో జంఝావతి ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారు. సంప్రదింపుల ద్వారా వివాదాలు పరిష్కారం.. వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ సెప్టెంబర్ 13, 2017న ట్రిబ్యునల్ తుది తీర్పును ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒడిశా సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు, వంశధార ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముంపు భూమిని గుర్తించేందుకు జాయింట్ సర్వేకు కూడా ఒడిశా సర్కార్ సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి... జంఝావతిపై 3.40 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయి బ్యారేజీని నిర్మించడానికి మార్గం సుగమం చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. -
ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనికి స్పందించిన నవీన్ తమ పార్టీ నేతలతో చర్చించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షం జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిపింది. (సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు) మొత్తం 245 సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 114 సభ్యల మద్దతుంది. మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకుని తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షాల మద్దతు కోరనుంది. మరోవైపు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై ఇతర పార్టీల నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపామని వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ల ప్రక్రియకు రేపు (శుక్రవారం) ఆఖరి రోజు కావడంతో నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ ఇదివరకే నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ తొలిరోజు సమావేశాలైన సెప్టెంబర్ 14న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఇదివరకే విప్‌ను సైతం జారీచేసింది. (అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్) -
అక్టోబర్–నవంబర్‌లో టీకా
భువనేశ్వర్: కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌కల్లా సిద్ధం కావచ్చని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బుధవారం తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా టీకా మూడవ దశ మానవ ప్రయోగాలు ఆగస్టులో మొదలవుతాయని, అన్నీ సవ్యంగా సాగితే ఆ తరువాత రెండు మూడు నెలల్లో టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆదార్ బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా వ్యాక్సీన్ మానవ ప్రయోగాలకు సంబంధించి ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ప్రస్తుతం టీకా ప్రయోగాల కోసం కార్యకర్తలను ఎంపిక చేస్తున్నామని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఇ.వెంకట్ రావు తెలిపారు. -
చిత్రపరిశ్రమలో మరో విషాదం, సీనియర్ నటుడు మృతి
భువనేశ్వర్: 2020 చిత్ర సీమకు అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది మొదలు నుంచి సినీ పరిశ్రమలో ఏదో మూల ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఒడియా సీనియర్ నటుడు బిజయ్ మొహంతి(70) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా మొహంతి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయన సోమవారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. మొహంతి మృతి పట్ల ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పలువురు ఒడియాకు చెందిన పలువురు సినీ కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో మొహంతి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. మొహంతి మరణంతో ఒడియా చిత్ర సీమలో ఒక శకం ముగిసిందన్నారు.ఆయన మరణం చిత్రసీమలో తరగని అంతరాన్ని కలిగించిందన్నారు. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. చదవండి: సీనియర్ నటుడిని పొట్టనపెట్టుకున్న కరోనా CM @Naveen_Odisha has expressed deep grief over the passing away of renowned film actor & director #BijayMohanty. CM said, his death marks the end of an era and has created a deep void in Odia film industry. CM announced that the veteran actor will be cremated with state honours. — CMO Odisha (@CMO_Odisha) July 20, 2020 ఇక ఒడిశాకే చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, బిజయ్ మొహంతిని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో శ్రీ జగన్నాథ స్వామి ఆయన కుటుంబానికి శాంతిని, సహనాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ధర్మేంద్రప్రధాన్ ఒడిస్సీలో ట్వీట్ చేశారు. మొహంతి ఆయన భార్య తాండ్రా రే, కుమార్తె జాస్మిన్‌తో కలిసి నివసిస్తున్నారు. మొహంతి భార్య తాండ్రా కూడా ఒడియాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన దండా బలూంగా, నగా ఫాసా, సమయ్ బడా బాలాబన్ వంటి పలు చిత్రాల నటించి చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ଖ୍ୟାତିସମ୍ପନ୍ନ ଅଭିନେତା ବିଜୟ ମହାନ୍ତିଙ୍କ ବିୟୋଗରେ ମୁଁ ଗଭୀର ଭାବରେ ମର୍ମାହତ । ତାଙ୍କ ମୃତ୍ୟୁରେ ଓଡ଼ିଶା ସିନେ ଜଗତରେ ଏକ ଯୁଗର ଅନ୍ତ ଘଟିଲା । ପିଢି ପରେ ପିଢି ତାଙ୍କର ପ୍ରଶଂସକଙ୍କୁ ସେ କଳାର ଯାଦୁରେ ବାନ୍ଧି ରଖି ପାରିଥିଲେ । — Dharmendra Pradhan (@dpradhanbjp) July 20, 2020 చదవండి: హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు -
మరో నలుగురు జవాన్ల పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: లడక్‌లో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సైనికుల మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "దేశాన్ని కాపాడే క్రమంలో గాల్వన్ లోయలో ప్రాణ త్యాగం దేసిన భారత సైనికులకు సెల్యూట్ చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) లడఖ్‌లో జరిగిన దాడుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైనిక వీరుడు రాజేశ్ ఒరంగ్ అమరుడయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని కుటుంబం బీర్భమ్లో నివసిస్తోంది. అతడు భారత ఆర్మీకి ఆరేళ్లుగా సేవలందిస్తున్నాడు. భారత్-చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గాల్వన్ లోయలో 26 ఏళ్ల రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. గత యాభై ఏళ్లలో తొలిసారిగా సరిహద్దులో తీవ్రస్థాయి ఘర్షణలు చెలరేగగా, ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కుటుంబానికి రాజేశే పెద్ద దిక్కని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. (లడక్ కాల్పుల్లో పళని వీరమరణం) -
మోదీపై విశ్వాసం: టాప్-5లో సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ : చాయ్‌వాలాగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనతికాలంలో దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన మోదీ.. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తొలి ఐదేళ్ల పాలనాకాలంలో తనదైన ముద్రవేసుకున్న ప్రధాని.. వందేళ్ల చరిత్రగల పార్టీని కోలుకోలేని దెబ్బతీసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. (మోదీ ఏడాది పాలనకు 62 శాతం మంది జై!) ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రుల ప్రజాదరణపై ఓ నివేదికను విడుదల చేసింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని తెలిపింది. మోదీ పనితీరుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని సర్వేలో వెల్లడించింది. (గ్లోబల్ లీడర్‌గా భారత్!) టాప్-5 లో సీఎం జగన్ ఇక ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా.. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్ సర్వే నివేదికలో తెలిపింది. ముఖ్యమంత్రిగా పాలనాబాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాది కాలంలోనే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఇక అత్యధిక ప్రజాదరణ లభించిన ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ ముఖ్యమంత్రులు భూపేశ్ వాఘేలా, పినరయి విజయన్ ఉన్నారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలిచారు. -
సోనూసూద్‌పై సీఎం ప్రశంసల జల్లు
భువనేశ్వర్: వలస కార్మికుల పట్ల ఆపద్భాంధవుడిగా నిలుస్తున్న నటుడు సోనూసూద్‌పై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసలు కురిపించారు. లాక్డౌన్ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను స్వస్థలానికి చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘ఒడిశా అమ్మాయిలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు ధన్యవాదాలు. కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు చొరవ చూపారు. ఆయన మానవతాదృక్పథాన్ని ప్రశంసించి తీరాల్సిందే’’అని ట్వీట్ చేశారు. ఇక ఇందుకు బదులిచ్చిన సోనూసూద్.. ‘‘వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయిన అక్కాచెల్లెళ్లను ఇంటికి చేర్చడం నా బాధ్యత అని భావించాను. మీ మాటలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. కృతజ్ఞతలు సర్’’ అంటూ గొప్ప మనసు చాటుకున్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రతీ ఒక్కరికి సహాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. (అలా జరిగితే నన్ను క్షమించండి: సోనూసూద్) కాగా ఒడిశాకు చెందిన దాదాపు 180 మంది అమ్మాయిలు.. కేరళలోని ఎర్నాకులంలో చిక్కుకుపోయారు. అక్కడే కుట్టుపనులు చేసుకుని ఉపాధి పొందుతున్న వీరు.. లాక్డౌన్ వల్ల పనిచేసే ఫ్యాక్టరీ మూత పడటంతో సంకట స్థితిలో పడిపోయారు. స్వస్థలాలకు వెళ్లడానికి సరైన మార్గం కనిపించకపోవడంతో కేరళలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ సూద్ వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేసి.. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. ఇక లాక్డౌన్ కాలంలో ఎంతో మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేరుస్తున్న సోనూసూద్.. హెల్త్‌వర్కర్ల కోసం పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడంతో పాటుగా తన హోటల్‌ను కూడా క్వారంటైన్ సెంటర్‌గా మార్చి రియల్ హీరో అంటూ నీరాజనాలు అందుకుంటున్నారు.(వలస కార్మికులను తరలిస్తున్న సోనూసూద్) Thank Bollywood actor @SonuSood for coming forward to help #Odisha girls, stranded in Kerala during nationwide #COVID19 lockdown, to reach home safe. His humanitarian gesture is indeed commendable. — CMO Odisha (@CMO_Odisha) May 29, 2020 -
మే 30న సాయంత్రం 5.30 గంటలకు
భువనేశ్వర్: కరోనాను నియంత్రించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, తదితరులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వీరి శ్రమను గౌరవిస్తూ మే 30న ఒడిశా గేయమైన "బందే ఉత్కళ జనని "గీతాన్ని ఆలపించుదాం అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒడిశా వాసులందరూ గీతాన్ని పాడి సమైక్యతను చాటాలని కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. "నాలుగున్నర కోట్ల ఒడిశా ప్రజలను ఒకటే కోరుతున్నాను. శనివారం సాయంత్రం 5.30 గంటలకు సామాజిక దూరం పాటిస్తూ అందరం బందే ఉత్కళ జనని గేయం ఆలపిద్దాం. కోవిడ్ వారియర్స్ అంకితభావాన్ని గౌరవిస్తూ, వారిని ప్రోత్సహిద్దాం. మన ముందున్న సమస్యలను ఎదుర్కొనేందుకు ఇది మనకు శక్తినిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఒడిశా భారత్‌కే కాకుండా ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రపంచంలోనే అతితక్కువ కోవిడ్ మరణాల రేటు ఒడిశాలో ఉంది. కరోనా సోకినవారిలో 50 శాతం మంది పేషెంట్లు కోలుకున్నారు" అని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. కాగా ఈ పాట ఒడిశా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయంలో పుట్టుకొచ్చింది. లక్ష్మీకంట మొహపత్ర ఈ పాట రచించారు. -
బెంగాల్‌కు తక్షణ సాయం వెయ్యి కోట్లు
బసీర్హాట్/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు. రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ ఉంపన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. బెంగాల్లో 77కి చేరిన మరణాలు బెంగాల్లో ఇప్పటిదాకా అంపన్ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్‌కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస సైక్లోన్ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మమత, నవీన్‌లకు మద్దతుగా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉంఫాన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్, ఒడిశాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న చొరవను కేజ్రీవాల్ అభినందించారు. ఈ సంక్షోభ సమయంలో మా వంతుగా మేము మీకు ఏవిధంగా సహాయపడగలమో తెలియజేయండి అంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఢిల్లీ సీఎం కోరారు. తీవ్ర తుఫాను కారణంగా పశ్చిమబెంగాల్లో ఇప్పటి వరకు దాదాపు 77 మంది మరణించినట్లు సమాచారం. చదవండి: ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, కోల్‌కతా, హౌరా, హూగ్లీ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, మౌళిక సదుపాయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బెంగాల్, ఒడిశాలకు తమకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయపడతామని కేజ్రీవాల్ భరోసా కల్పించారు. సంక్షోభంలో ఉన్న రెండు రాష్ట్రాలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఉంఫాన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు ప్రధాని నరేంద్రమోదీ తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: తక్షణ సహాయం ప్రకటించిన ప్రధానమంత్రి -
ఉంపన్.. కోల్‌కతా వణికెన్
కోల్‌కతా/భువనేశ్వర్/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్‌ను ఉంపన్ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. ఒక తుపాను ఈ స్థాయిలో కోల్‌కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్‌కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్ టవర్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్‌లు ధ్వంసమయ్యాయి. కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సుందర్బన్ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్‌కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ చెప్పారు. ఒడిశాలో భారీగా పంట నష్టం ఉంపన్ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్ బంగ్లాదేశ్‌లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. కరోనా కంటే భయంకరమైనది : మమత కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్‌ను వణికించిన ఉంపన్ తుపాను కోవిడ్–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు. అండగా ఉంటాం: మోదీ పశ్చిమ బెంగాల్ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్‌కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నేడు ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒడిశాకు చెందిన వలస కూలీలు, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన (ఇక్కడి వారు అక్కడ.. అక్కడి వారు ఇక్కడ) వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే విషయమై శనివారం వారి మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఒడిశా వలస కూలీలను బాగా చూసుకుంటుండటంపై వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సమర్థవంతంగా పని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నాం. కోవిడ్ వల్ల ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. – నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్న వారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడే ఉంటామన్న వారి కోసం వారు పని చేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్లేందుకు సిద్ధమైతే కూడా వారిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం. మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకులు. – వైఎస్ జగన్, ఏపీ సీఎం గట్టి చర్యలు తీసుకుంటున్నారు విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారు. ఇందుకు ధన్యవాదాలు. కోవిడ్19ను ఎదుర్కోవడానికి బాగా పని చేస్తున్నారు. వైరస్ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. – ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి -
ఒడిశా, ఏపీ సీఎంల వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరులను తరలించే విషయమై కూడా చర్చలు జరిగాయి. తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా సీఎం ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్ధితుల్ని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. ధన్యవాదాలు’అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మీ అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం నవీన్ జీ. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్ క్యాంపులలో ఉంటున్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన వారిని కూడా వారు పనిచేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్లేందుకు సిద్దమైతే వారిని కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం నవీన్ జీ. మీలాంటి నాయకులు చాలా స్ఫూర్తిదాయకులు’అని పేర్కొన్నారు. అటు తర్వాత ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాట్లాడారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ నివారణలో బాగా పనిచేస్తున్నారంటూ సీఎంను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులు సొంతూళ్లకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. (చదవండి: మనసున్న మా రాజు సీఎం) (చదవండి: స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు) -
జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా
భువనేశ్వర్ : కరోనా కారణంగా మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రాణంతక కరోనా మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత అనిర్వచనీయం అని పేర్కొన్నారు. విధినిర్వహణలో ఏ జర్నలిస్ట్ అయినా వైరస్ భారిన పడి చనిపోతే ఆయా కుటుంబాలకు 15 లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కష్టకాలంలో తమ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజలకు అవగామన కల్పిస్తున్నారని ట్వీట్ చేశారు. CM @Naveen_Odisha has announced ₹ 15 lakh compassionate assistance to families of working journalists who may lose life to #COVID19 infection. CM said journalists are dedicatedly working to raise awareness about the pandemic during this difficult times. #OdishaCares — CMO Odisha (@CMO_Odisha) April 27, 2020 కోవిడ్-19 మహమ్మరి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లు కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబానికి చేయూత అందించేందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ వైద్య సిబ్బందిని అమర వీరులుగా పరిగణించి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని పేర్కొంది. (కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు) -
ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు!
-
కరోనా: ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!
భువనేశ్వర్ : కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పోరులో ముందుండే వైద్య సిబ్బంది, వారి సహాయ సిబ్బంది మరణిస్తే ఆయా కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు మంగళవారం సీఎం ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కుంటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. (చదవండి: మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా) అదేవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అమరలవీరులుగా గౌరవిస్తామని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అవార్డులు అందించే కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యసిబ్బంది సేవలపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, వారి పట్ల అనుచితం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 24 మంది కోలుకున్నారు. ఒక్కరు మరణించారు. (చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు) -
మాస్క్ ధరించకుంటే రూ. 200 ఫైన్
భువనేశ్వర్ : కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఒడిశాలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. తాజాగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా విధించనున్నట్టు తెలిపింది. మాస్క్ ధరించే నిబంధనను ఉల్లంఘించినవారికి మొదటి మూడుసార్లు రూ. 200, ఆపైన ఎన్నిసార్లు నిబంధన ఉల్లంఘిస్తే అన్నిసార్లు రూ. 500 జరిమానా విధించనున్నారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఒడిశా ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడిలో ముందు వరుసలో ఉందనే చెప్పాలి. రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5865 కరోనా కేసులు నమోదుకాగా, 169 మంది మృతిచెందినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. చదవండి : లాక్డౌన్: ఒడిశా కీలక నిర్ణయం అష్ట దిగ్బంధంలోకి ఆ 15 ప్రాంతాలు.. -
లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం..
భువనేశ్వర్ : ఒడిశాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఏప్రిల్14 వరకు 21 రోజుల లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘కోవిడ్-19 సంక్షోభం కారణంగా అమలవుతున్న లాక్డౌన్ కాలంలో మీ క్రమశిక్షణ, త్యాగం కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి మాకు బలాన్ని ఇచ్చింది’ అని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రైళ్లు, విమానాల సేవలు ఈ నెల ఆఖరు వరకు నిలిపి వేస్తున్నట్లు, జూన్ 17 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే వ్యవసాయ ఆధారిత పనులకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవని, ప్రజలంతా అర్థం చేసుకోని.. సహకరించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు.(కరోనా: 5 వేలు దాటిన కేసులు.. అక్కడ తొలి మరణం ) కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడం తప్ప మరో దారి లేదంటూ పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. దేశంలో లాక్డౌన్ ఎత్తివేసినా తెలంగాణలో మాత్రం కొనసాగించాలనుకుంటున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. దీనిపై ఉత్తరప్రదేశ్ సర్కార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. కరోనా: ‘ఆ డ్రగ్ తనకు పనిచేయలేదు’ -
మగాళ్లూ.. ఇంటి పనులు చేయండి: సీఎం
భువనేశ్వర్ : రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలందరూ 24 గంటల పాటు ఇంటికే పరిమితమవుతున్న నేపథ్యంలో ఇంట్లో ఆడవాళ్లపై భారం మోపరాదని, మగాళ్లు ఇంటి పనుల్లో వారికి సహాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రధానంగా వంటావార్పు సన్నాహాలతో మహిళల్ని ఉక్కిరిబిక్కిరి చేయోద్దు. విందు వినోదాలకు ఇది సమయం కాదు. ఇంటిల్లి పాది కలిసిమెలిసి బతకాల్సిన సమయం. ఇంటి పనుల్లో ఆడవాళ్లకు మగాళ్లు చేదోడు వాదోడుగా ఉండాలి. గృహ నిర్బంధాన్ని పురష్కరించుకుని ఇంట్లో మగాళ్లు తీరిగ్గా కూర్చోవటం, మహిళలు రోజుకు 3-4సార్లు రుచికరమైన వంటకాలు చేస్తూ వంటింట్లో నలిగిపోవటం కాదు. వేసవి తాపం పెరుగుతోంది. మహిళలను వంటింటికి పరిమితం చేస్తే కుంగిపోతారు. వారితో పాటు దేశం కూడా కుంగిపోతుంది. మగాళ్లు ఓపికతో మసలుకోవాలి. ఆహారం వేళల్ని నియంత్రించుకోవాలి. ఇల్లాలి వెతల్ని పంచుకుని వంటావార్పు వ్యవహారాల్లో పాలుపంచుకుని మగాళ్లు మమకారం చాటుకోవాల’ని అన్నారు. -
ఆ రాష్ట్రం దాదాపు 40శాతం మూతపడినట్లే!
భువనేశ్వర్: ఒడిశాలోని ఐదు జిల్లాలను లాక్డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఖుర్దా, కటక్, గంజాం, కేంద్రపారా, అంగుల్ జిల్లాల్లో లాక్డౌన్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రేపటి నుంచి మార్చి 29వ తేదీ వరకు ఐదు జిల్లాలోని లాక్డౌన్ ఉంటుందన్నారు. చదవండి: జనతా కర్ఫ్యూ: పెట్రోల్ బంక్‌లు బంద్ ఇప్పటికే పూరీ, రూర్కేలా, సంబల్పూర్, జార్షూగూడ, బాలాసోర్, జాజ్‌పూర్ రోడ్, జాజ్‌పూర్ టౌన్, భద్రక్ పట్టణాల్లో ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ చేసింది. అత్యవరస సేవలకు లాక్డౌన్ నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. వారం క్రితమే రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, కటక్ వంటి పారిశ్రామిక పట్టణాలు మూతపడ్డాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో దాదాపు 40శాతం మూతపడినట్లయింది. చదవండి: ‘ఇంట్లోనే ఉన్నా.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు’ కరోనా: ప్రధానికి ఒడిశా సీఎం లేఖ -
కరోనా: ప్రధానికి ఒడిశా సీఎం లేఖ
భువనేశ్వర్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్- 19) వ్యాప్తి నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రాణాంతక వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జాతీయ జనగణన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేనషల్ పాపులేషన్ రిజిస్టర్ నవీకరణ ప్రక్రియను వాయిదా వేయాలని శుక్రవారం విజ్ఞప్తి చేశారు. కాగా 2021 ఏడాదికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఎన్పీఆర్ ప్రక్రియను చేపట్టాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.(కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) మరోవైపు దేశంలో కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటిదాకా 223 కేసులు నమోదు కాగా... నలుగురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లను మూసివేస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజా రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షలకు పైగా కరోనా అనుమానితులు ఉండగా... దాదాపు 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.(కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : మోదీ) -
కరోనా: సోదరి వివరాలు నమోదు చేసిన సీఎం
భువనేశ్వర్: కరోనా వైరస్ (కోవిడ్–19 ) ఆన్లైన్ పోర్టల్‌లో తన సోదరి గీతా మెహతా వివరాలను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం నమోదు చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి విచ్చేస్తున్న వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో పూర్తి వివరాలు నమోదు చేయడం అనివార్యం. స్వయంగా లేదా ఆత్మీయులు, బంధు వర్గాలైనా ఈ వివరాల్ని నమోదు చేసేందుకు వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరిన 24 గంటల వ్యవధిలో వివరాలు నమోదు చేయాలి. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే భారతీయ చట్టాలు, ఐపీసీ నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా రానుండటంతో ఆమె పూర్తి వివరాల్ని ఆయన స్వయంగా కోవిడ్–19 పోర్టల్‌లో నమోదు చేసి పారదర్శకత చాటుకున్నారు. -
ఇదీ! సీఎం నవీన్ పట్నాయక్ అంటే..
సాక్షి, భువనేశ్వర్ : మానవీయ దృక్పథం వాస్తవ కార్యాచరణను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యక్షంగా ప్రతిబింబింపజేశారు. అధికారిక కార్యక్రమాలు ముగించుకుని, ఆదివారం సాయంత్రం తన ఇంటికి వెళ్తున్న ముఖ్యమంత్రికి అదే దారిలో అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో అప్రమత్తమైన ఆయన కాన్వాయ్‌ను నిలపాలని, ఆ అంబులెన్స్ వెళ్లిన తర్వాత కాన్వాయ్ ముందుకు పోవాలని ఆదేశించారు. ఈ సంఘటనను చూసిన అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (ఎన్ఆర్సీపై నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు) (ఒడిశా సీఎం సంచలన నిర్ణయం) -
‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు వరుసలో నిలిచారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా ఖ్యాతి గడించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో వైఎస్ జగన్ ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఏఏపీ), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), మూడో స్థానంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నిలిచారు. అనతి కాలంలో అనేక పథకాలు జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిన వైఎస్ జగన్ పరిపాలనా తీరుకు పలువురు మద్దతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ఆరు నెలల్లోనే నెరవేర్చేలా అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్), జగనన్న వసతి దీవెన (హాస్టల్ ఖర్చులకు ఏటా రూ.20 వేలు), ఆరోగ్యశ్రీ, తదితర అనేక పథకాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇన్ని పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన సీఎం ఒక్క వైఎస్ జగన్ తప్ప దేశంలో మరొకరు కనిపించరు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తర్వాత బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎంల జాబితాలో అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆరో స్థానంలో గుజరాత్ సీఎం విజయ్‌రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌లు నిలిచారు. ఈ ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం’ సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్ఫార్మెన్స్ను చూపించారు. -
ఆ చట్టం విదేశీయులకే : నవీన్ పట్నాయక్
బువనేశ్వర్: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) బిల్లుకు బీజేడీ మద్దతివ్వదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఒడిశా ప్రజలు అపోహలు నమ్మవద్దని శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో భారతీయులకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఈ చట్టం విదేశీయులకు మాత్రమేనని పేర్కొన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) చట్టాన్నిలోక్సభ, రాజ్యసభలో బిజు జనతా దల్(బీజేడీ) ఎంపీలు వ్యతిరేకించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం విజయవంతంగా చట్ట సభల్లో ఆమోదం పొందాక ఎన్ఆర్సీపై ఆసక్తి నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రమవుతోంది. మొదట అస్సాం, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పలు ఇతర యూనివర్సిటీలు, ఐఐటీలు సంఘీభావం ప్రకటించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే. చదవండి : పౌరసత్వ వివాదం: సీఎం మిస్సింగ్..! -
మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్ హాకీ
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్‌కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్‌కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. -
ప్రమాదంలో చనిపోయిన గాంధీ..
సాక్షి, భువనేశ్వర్ : మహాత్మా గాంధీ ఎలా చనిపోయారన్నది దేశం మెత్తం తెలుసు. గుజరాత్‌లోని సబర్మతీ తీరంలో అక్టోబర్ 30, 1948న నాథూరాం గాడ్సే చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. హత్యానంతరం గాడ్సేని దోషిగా తేల్చి చట్టపరంగా ఉరి తీశారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్‌లెట్‌లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. కాగా ఒడిశా విద్యాశాఖ రూపొందించిన బ్రోచర్లో గాంధీజీ ప్రమాదవశాత్తు చనిపోయారంటూ, చనిపోయింది ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో అని రెండు పేజీల బ్రోచర్లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని నిలదీసింది. మీరు చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ నరసింహ్ మిశ్రా మాట్లాడుతూ.. గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేశాడని, అనంతరం అతనిని ఉరి తీశారని తెలీదా? అని ప్రశ్నించారు.ఈ తప్పుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని, ఒకవేళ ముఖ్యమంత్రికే ఇందులో భాగస్వామ్యం ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాడ్సేని బీజేపీలోని కొందరు నాయకులు దేవుడిలా భావిస్తున్నారని, ఈ ప్రభుత్వ తీరు చూస్తే బీజేడీ కూడా ఆ భావజాల ప్రభావానికి లొంగిపోయినట్టు భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని అధికార బీజేడీ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. చరిత్రను ఎవరూ మార్చలేరని అధికార పార్టీ సభ్యుడు సౌమ్య రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ ఘటనపై శనివారం (రేపు) వివరణనివ్వాలని స్పీకర్ సూర్యనారాయణ పాత్రో ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
లంచగొండులారా.. ఖబడ్ధార్
భువనేశ్వర్: ప్రభుత్వ సిబ్బందిలో అవినీతి ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవినీతికి పాల్పడిన 11 మంది ప్రభుత్వ సిబ్బందికి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టారు. వారిలో ఆరుగురిని విధుల నుంచి బహిష్కరించారు. మరో ఐదుగురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ నిలిపివేశారు. వీరందరికీ వ్యతిరేకంగా రాష్ట్ర విజిలెన్స్ విభాగం దాఖలు చేసిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకు విజిలెన్స్ విభాగం నివేదికను కార్యాచరణలో పెట్టారు. అవినీతి ఆరోపణల ఆధారంతో ముగ్గురు ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు (ఓఏఎస్), ఇద్దరు ఇంజినీర్ల పింఛన్ నిలిపివేశారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారుల్లో నవీన్ సేతు, సనాతన్ శెట్టి, పురంధర పూజారి ఉన్నారు. నిరంజన్ జెనా, పీతాంబర ప్రతిహారి ఇంజినీర్ల జాబితాలో ఉన్నారు. అవినీతి ఆరోపణలకు గురైన వారికి వ్యతిరేకంగా విచారణ, దర్యాప్తు 2 నెలల స్వల్ప వ్యవధిలో ముగించి ఇప్పటి వరకు 44 మంది ప్రభుత్వ సిబ్బందిని ఉద్యోగాల నుంచి బహిష్కరించారు. మరో 10 మందికి అనివార్య ఉద్యోగ విరామం మంజూరు చేశారు. 11 మంది విరామం పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పింఛన్ నిలిపివేశారు. -
నా తండ్రి సమాధిని తొలగించండి: సీఎం
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాని నిర్ణయించారు. సీఎం నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే ఆదేశాలను జారీ చేశారు. బిజూ పట్నాయక్ సమాధి సహా, ఆయన జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసిన స్మారక కేంద్రాన్ని కూడా తొలగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో బిజూ పట్నాయక్ సమాధి ఉంది. స్వర్గద్వార్ అనే పేరుతో బిజూ స్మారక కేంద్రం, శ్మశాన వాటికను అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలంటూ గత కొంత కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బిజూ పట్నాయక్ సమాధి ఉండటం వల్ల దాన్ని తొలగించడం అసాధ్యమని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం దాదాపు అసాధ్యమంటూ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశమైన సీఎం.. సమస్య పరిష్కారం కోసం ఏమైనా చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తన తండ్రి సమాధిని, స్మారక కేంద్రాన్ని తొలగించాలని ఆదేశించారు. పట్నాయక్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కోడి కూర..చిల్లు గారె..!
భువనేశ్వర్: అట్టడుగు స్థాయిలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, పాలన వ్యవహారాల్లో లోటుపాట్లను అకస్మాత్తుగా పసిగట్టడంలో ఆతిథ్యాలు, అతిథి సత్కారాలు, విందులు– వినోదాలకు అతీతంగా మంత్రులు క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పర్యటించి సందర్శించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ గుర్తు చేస్తున్నారు. అయితే ఆయన మార్గదర్శకాలు ఇలా బహిరంగంగా దారి తప్పుతున్నాయి. ఈ చిత్రంలో విలాసవంతమైన కోడి మాంసం కూరతో విందు ఆరగిస్తున్న ప్రముఖుల్లో ఒకరు రాష్ట్ర మంత్రి, మరొకరు మాజీ ఎంపీ కావడం విచారకరం. రాయగడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జ్యోతి ప్రకాశ్ పాణిగ్రాహి, పార్లమెంటు మాజీ సభ్యుడు జిహ్న హికాకా విద్యార్థుల నడుమ విలాసవంతమైన కంచాల్లో పిల్లలతో కలిసి భిన్నంగా విందు ఆరగించిన దృశ్యం సోషల్ మీడియా ప్రసారంలో దుమారం రేపుతోంది. -
బంజరు భూములను బంగారు చేద్దాం
-
నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి
నీళ్ల కోసం జిల్లాల మధ్య కొట్లాటలు ఉండకూడదు.. ఆప్యాయతలు పంచుకునే వాతావరణం ఉండాలి. మహేంద్రతనయ నుంచి హంద్రీ–నీవా వరకు పెండింగ్ ప్రాజెక్టులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయిస్తాం. ప్రతి రూపాయినీ సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వరద జలాలను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి, వంశధార వరద జలాలను ఒడిసిపట్టి బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లలోగా పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఏ ఏడాది పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టును పరిశీలించినా స్కామ్‌లే కనిపిస్తున్నాయని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని నిర్మూలించాలని ఆదేశించారు. ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలవారీగా అధ్యయనం చేసి నీటి లభ్యత ఉంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన కొత్త ప్రాజెక్టుల పనులు, 25 శాతం లోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపట్టాలని సీఎం సూచించారు. తొలిసారిగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలింపు.. దేవుడి దయ వల్ల ఈ ఏడాది కృష్ణా నదికి రెండోసారి వరద వచ్చిందని.. వరద జలాలు భారీగా సముద్రంలో కలుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం పడుతోందని, లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులకు సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు 120 రోజులపాటు వరద జలాలను మళ్లించేలా చేపట్టినవని తెలిపారు. కృష్ణా నదికి 120 రోజులు వరద వస్తుందన్న లెక్కలు సవరించాలని.. 30 నుంచి 40 రోజులు మాత్రమే వరద ఉంటుందని లెక్క వేసి ఆలోగా వెలిగొండతోపాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 6 నుంచి 8 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని, ఈసారి వచ్చిన వరదల వల్ల జలయ/æ్ఞం తొలి ఫలాలను అందుకున్నామని అధికారులు వివరించారు. తొలిసారిగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కులకుపైగా తరలించామన్నారు. వెలుగోడు నుంచి కడపకు వెళ్లే తెలుగుగంగ కాలువ లైనింగ్ పనులు పూర్తి కాలేదని, అందువల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ఆశించినంత మేర నీటిని తీసుకెళ్లలేకపోయామని అధికారులు తెలిపారు. సమస్యలపై ఒడిశా సీఎంతో చర్చిస్తాం.. వంశధార రెండో దశలో భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. జంఝావతిపై కూడా ఒడిశా అభ్యంతరాల వల్ల పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించలేకపోతున్నామన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ నివేదిక ఇస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వంశధార కెనాల్ లైనింగ్ పనులు, హీరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవల్ కెనాల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.తోటపల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు వీలుగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఉద్దానంలో కలుషితమైన భూగర్భ జలాలు తాగి ప్రజలు మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారని, నదీ జలాలను అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వెలిగొండ పనులు వేగంగా పూర్తి కావాలి వెలిగొండ మొదటి సొరంగంలో 1.56 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు వివరించగా వాటిని వెంటనే పూర్తి చేయాలని, రెండో సొరంగం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు జోలదరాసి, రాజోలి బ్యారేజీల నిర్మాణ పనులను చేపట్టాలని నిర్దేశించారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు వరికపూడిశెల ప్రాజెక్టులో అన్ని దశలను ఒకేసారి చేపట్టాలని సూచించారు. గుంటూరు చానల్‌ను పొడిగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ల తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నిర్వాసితులకు ఉదారంగా పునరావాసం.. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నీరు నిల్వ చేయాలంటే నిర్వాసితులకు ఆలోగా పునరావాసం కల్పించాలన్నారు. అందుకే సహాయ, పునరావాస(ఆర్అండ్ఆర్) ప్యాకేజీ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించామని గుర్తు చేశారు. వరదల్లో మునిగిన ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వచ్చే సీజన్‌లోగా ఆ ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలన్నారు. ఈ సీజన్లో ఉత్పన్నమైన పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, మానవతా దృక్పథంతో నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు. ‘‘ఆక్వా సాగు కారణంగా కాలువలు కలుషితంగా కాకుండా చూడాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయండి. నీటి కాలుష్యానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. కలుషిత నీటిని తాగడం వల్లే ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతిదీ కలుషితం అవుతోంది. దీనివల్లే ఇంతకుముందు అరుదుగా కనిపించే క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు విస్తృతమైంది’’ – సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
అడవి నుంచి ఆకాశానికి..అనుప్రియ రికార్డ్
భువనేశ్వర్ : గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. చదవుకోడానికి కనీస సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. ఏకంగా ఫైలెట్‌గా ఎదిగి ప్రశంసలు అందుకుంటోంది. ఒడిశాలోని మావోయిస్టు ప్రాభల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతానికి చెందిన అనుప్రియా లక్రా(23).. తొలి మహిళా ఫైలెట్‌గా సువర్ణావకాన్ని దక్కించుకున్నారు. కమర్షియల్ విమానాన్ని నడిపే ఆదివాసీ మహిళా పైలట్‌గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించారు. ఈ విధంగా నియమితులైన తొలి గిరిజన యువతి అనుప్రియానే కావడం విశేషం. చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కన్న అనుప్రియ...2012లో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్‌లోని పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది. మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం నుంచి వచ్చి కమర్షియల్ ఫ్లైట్ నడిపే తొలి ఆదివాసీ మహిళ పైలెట్ ఘనతను సాధించిన అనుప్రియ ఎందరో మహిళలకు ఆదర్శం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ పట్నాయక్ ప్రశంసించారు. అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా.. ఒడిశా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. -
పౌష్టికాహార చాంపియన్ ఒడిశా
భారత్‌లో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. అయినా చిన్నారుల పౌష్టికాహార సూచీలో ఆ రాష్ట్రమే చాంపియన్. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించడంలో ఆ రాష్ట్రం చాలా ముందుందని అంతర్జాతీయ ఆహార విధాన అధ్యయన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) వెల్లడించింది. వాషింగ్టన్కు చెందిన ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లల్లో 2005–06 సంవత్సరంలో 46.5 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతుంటే 2015–16 సంవత్సరం వచ్చేసరికి వారి సంఖ్య 35.3 శాతానికి తగ్గిపోయింది. ఇక తక్కువ బరువున్న పిల్లల శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2005–06లో 42.3 శాతం తక్కువ బరువున్న పిల్లల సంఖ్య 2015–16 వచ్చేసరికి 35.8 శాతానికి తగ్గిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం గర్భిణుల మీద అత్యధికంగా దృష్టి సారించింది. ఒడిశాలో ‘నవీన్ పట్నాయక్ సర్కార్ పౌష్టికాహార పథకం’లో భాగంగా గర్భిణులకు పప్పులు, గోధుమ, బార్లీ, బియ్యంతో పాటు చటువా అనే ఆహార పదార్థాన్ని తయారుచేసి ఇస్తారు. దాంతో పాటు బాదంతో తయారుచేసిన లడ్డూలు, నెలకు 8 గుడ్లు రేషన్ కింద ఇస్తారు. బిడ్డ పుట్టాక కూడా గోధుమ రవ్వ ఇస్తారు. బిడ్డకి 9 నెలలు వచ్చే వరకు వారిద్దరి ఆరోగ్యంపై శద్ధ చూపుతారు. దానికితోడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) పథకం, మధ్యాహ్నభోజన పథకం వంటివి అమలు చేయడంలో ఒడిశాలో పరిపాలనా యంత్రాంగం చేసిన కృషి ఒడిశాను నవంబర్ వన్ను చేసింది. కానీ ధనిక రాష్ట్రాల జాబితాలో ఉన్న కర్ణాటక.. చిన్నారుల పౌష్టికాహారం విషయంలో ఆఖరి స్థానంలో ఉంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు సంబంధించిన పథకాల్లో అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్లే ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు యూనిసెఫ్ సర్వేలో వెల్లడైంది. -
అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చోటు సాధించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల మనసును చూరగొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన సీఎంలపై ప్రఖ్యాత ‘వీడీపీ అసోసియేట్స్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మూడో స్థానం లభించింది. ‘దేశ్కా మూడ్’ పేరుతో ప్రస్తుతం దేశ ప్రజల నాడి – రాజకీయంగా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీడీపీ అసోసియేట్స్ ఈ సర్వేను నిర్వహించింది. 71 శాతం మంది ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రజా నాయకుడిగా ఎదిగి అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే వైఎస్ జగన్‌కు ఇలాంటి గౌరవం దక్కడం విశేషం. మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 11,252 మంది సర్వేలో పాల్గొనగా వారిలో 10,098 మంది ఓటర్లున్నారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు ఈ సర్వే నిర్వహించారు. సర్వే వివరాల ప్రకారం మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రభాగాన నిలిచారు. ఆయనకు 81 శాతం మంది మద్దతు లభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 72 శాతంతో రెండో స్థానంలో, వైఎస్ జగన్ 71 శాతం మంది ప్రజల మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు. నవరత్నాలకు జాతీయ స్థాయిలో స్పందన సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు’ కార్యక్రమంలోని సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పథకాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని, అధికారం చేపట్టిన 3 నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి వైఎస్ జగన్ చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఆయనకు ఖ్యాతి తెచి్చందని పేర్కొంటున్నారు. ప్రజలు నమ్మకంతో అప్పగించిన అధికారాన్ని సది్వనియోగం చేసుకుంటూ వారి సంక్షేమానికి జగన్ కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
మూడో స్థానంలో నిలిచిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ప్రజా నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరో గౌరవం దక్కింది. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ‘దేశ్ కా మూడ్’ పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్ వెల్లడించింది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా తేల్చింది. ఈ క్రమంలో అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేసేందుకు వైఎస్ జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలే ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన నాటి నుంచే వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికై ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిందని పేర్కొంటున్నారు. ఇక ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఐదో స్థానంలో నిలిచారు. కాగా ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు వైఎస్ జగన్ అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా, మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఏకంగా 151 శాసనసభ స్థానాలు, 23 లోక్‌సభ స్థానాలు సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. Overall Satisfaction with performance of Chief Ministers(Good+Average) #DeshKaMood pic.twitter.com/QLGCIQG8en — VDPAssociates (@VDPAssociates) August 15, 2019