Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా | Lok Sabha Election 2024: Political tourists to have no impact on Odisha people says Naveen Patnaik | Sakshi
Sakshi News home page

Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా

Published Sat, May 18 2024 6:30 AM | Last Updated on Sat, May 18 2024 6:30 AM

Lok Sabha Election 2024: Political tourists to have no impact on Odisha people says Naveen Patnaik

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వ్యాఖ్య

భువనేశ్వర్‌: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. 

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్‌ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్‌ పటా్నయక్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement